సమంత 'యశోద'కు హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ | Hollywood Action Director Yannick Ben For Samantha Yashoda Movie | Sakshi
Sakshi News home page

Samantha Yashoda Movie: సమంత 'యశోద'కు హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్

Published Sat, Mar 19 2022 8:26 PM | Last Updated on Sat, Mar 19 2022 8:52 PM

Hollywood Action Director Yannick Ben For Samantha Yashoda Movie - Sakshi

Hollywood Action Director Yannick Ben For Samantha Yashoda Movie: టాలీవుడ్‌ స్టార్  హీరోయిన్‌ సమంత ఫుల్‌ బిజీగా ఫుల్ జోష్‌లో ఉంది. వరుస సినిమా ఆఫర్లు, స్పెషల్‌ సాంగ్స్‌, కమర్షియల్‌ యాడ్స్‌తోపాటు వ్యాపార వ్యవహారాలు సైతం చూసుకుంటూ రెండు చేతులా సంపాదిస్తోంది. అంతేకాకుండా హాట్‌హాట్‌ ఫోజులు, దుస్తులతో అభిమానులను అలరించే సామ్‌ కమర్షియల్‌ విలువలతోపాటు కంటెంట్‌ ఉన్న సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తుంది. ఇటు కమర్షియల్‌ హంగులు, కంటెంట్‌ ఉన్న కథతో ఉన్న శ్రీదేవి మూవీస్‌ ప్రొడక్షన్ హౌస్‌ ఆమెను సంప్రదించగా సామ్‌ ఓకే చెప్పింది. ఆ మూవీనే 'యశోద'. కాగా సమంత ఇంతకు మందు చేసిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు భిన్నంగా ఉండే డిఫరెంట్‌ మూవీ ఇది. 

ఈ మూవీలో యాక్షన్‌ పార్ట్‌ కూడా ఉండనుంది. హాలీవుడ్‌ యాక్షన్‌ డైరెక్టర్‌ యానిక్‌ బెనిత్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ తెరకెక్కించారు. 'ది ఫ్యామిలీ మ్యాన్‌ 2' వెబ్ సిరీస్‌లోని యాక్షన్‌ సన్నివేశాలకు యానిక్‌ బెన్ డైరెక్ట్‌ చేశారు. సమంతతో యానిక్‌ బెన్‌కు 'యశోద' సినిమా సెకండ్ ప్రాజెక్ట్‌. హాలీవుడ్‌లో క్రిస్టోఫర్‌ నోలన్‌ సినిమాలకు స్టంట్‌ పర్ఫార్మర్‌గా కూడా బెనిక్‌ వర్క్ చేశారు. ఇటీవల హైదరాబాద్‌లో పది రోజులపాటు యశోద యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించారు. రూ. 3 కోట్ల భారీ వ్యయంతో ఆర్ట్‌ డైరెక్టర్‌ అశోక్‌ వేసిన సెట్స్‌లో ప్రస్తుతం షూటింగ్‌ చేస్తున్నారు. మరొ యాక్షన్‌ సీక్వెన్స్‌ కొడైకెనాల్‌లో ప్లాన్‌ చేసినట్లు సమాచారం. 

సమంత తదితరులపై పది రోజులపాటు 3 సెట్స్‌లో షూటింగ్‌ చేశామని, సమంత కష్టపడి అద్భుతంగా యాక్షన్‌ సీన్స్‌ చేసిందని శ్రీదేవీ మూవీస్‌ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్‌ తెలిపారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే థ్లిల్లర్‌ చిత్రమిదని పేర్కొన్నారు. హరి శంకర్‌, హరీష్‌ నారాయణ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్‌ కుమార్, ఉ‍న్ని ముకుందన్‌, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్‌ రాజ్ తదితరులు నటిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement