Shivalenka Krishnaprasad
-
యశోద మూవీ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ తో " స్పెషల్ చిట్ చాట్ "
-
సమంత 'యశోద'కు హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్
Hollywood Action Director Yannick Ben For Samantha Yashoda Movie: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఫుల్ బిజీగా ఫుల్ జోష్‌లో ఉంది. వరుస సినిమా ఆఫర్లు, స్పెషల్ సాంగ్స్, కమర్షియల్ యాడ్స్‌తోపాటు వ్యాపార వ్యవహారాలు సైతం చూసుకుంటూ రెండు చేతులా సంపాదిస్తోంది. అంతేకాకుండా హాట్‌హాట్ ఫోజులు, దుస్తులతో అభిమానులను అలరించే సామ్ కమర్షియల్ విలువలతోపాటు కంటెంట్ ఉన్న సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఇటు కమర్షియల్ హంగులు, కంటెంట్ ఉన్న కథతో ఉన్న శ్రీదేవి మూవీస్ ప్రొడక్షన్ హౌస్ ఆమెను సంప్రదించగా సామ్ ఓకే చెప్పింది. ఆ మూవీనే 'యశోద'. కాగా సమంత ఇంతకు మందు చేసిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు భిన్నంగా ఉండే డిఫరెంట్ మూవీ ఇది. ఈ మూవీలో యాక్షన్ పార్ట్ కూడా ఉండనుంది. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ యానిక్ బెనిత్ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించారు. 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌లోని యాక్షన్ సన్నివేశాలకు యానిక్ బెన్ డైరెక్ట్ చేశారు. సమంతతో యానిక్ బెన్‌కు 'యశోద' సినిమా సెకండ్ ప్రాజెక్ట్. హాలీవుడ్లో క్రిస్టోఫర్ నోలన్ సినిమాలకు స్టంట్ పర్ఫార్మర్గా కూడా బెనిక్ వర్క్ చేశారు. ఇటీవల హైదరాబాద్‌లో పది రోజులపాటు యశోద యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించారు. రూ. 3 కోట్ల భారీ వ్యయంతో ఆర్ట్ డైరెక్టర్ అశోక్ వేసిన సెట్స్‌లో ప్రస్తుతం షూటింగ్ చేస్తున్నారు. మరొ యాక్షన్ సీక్వెన్స్ కొడైకెనాల్లో ప్లాన్ చేసినట్లు సమాచారం. సమంత తదితరులపై పది రోజులపాటు 3 సెట్స్‌లో షూటింగ్ చేశామని, సమంత కష్టపడి అద్భుతంగా యాక్షన్ సీన్స్ చేసిందని శ్రీదేవీ మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ తెలిపారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే థ్లిల్లర్ చిత్రమిదని పేర్కొన్నారు. హరి శంకర్, హరీష్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ తదితరులు నటిస్తున్నారు. -
సమంత సినిమాలో హోటల్ సెట్ కోసం రూ.3 కోట్లు!
సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘యశోద’. హరి, హరీష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. కాగా ఆర్ట్ డైరెక్టర్ అశోక్ నేతృత్వంలో రూపొందిన మూడుకోట్ల రూపాయల హోటల్ సెట్స్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ– ‘‘యశోద’లో 30 నుంచి 40 శాతం సన్నివేశాలు ఒకే ప్రాంతంలో జరుగుతాయి. ఈ సీన్స్ కోసం కొన్ని హోటల్ లొకేషన్స్‌ను పరిశీలించాం. దాదాపు 30 నుంచి 40 రోజులు హోటల్స్‌లో చిత్రీకరణ సులభం కాదు. అందుకే హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో మూడు కోట్లతో సెవెన్‌స్టార్ హోటల్స్ సౌకర్యాలను తలపించేలా సెట్స్ వేశాం. సమంత, వరలక్ష్మీ శరత్‌కుమార్, ఉన్నిముకుందన్లపై సీన్స్ చిత్రీకరిస్తున్నాం’’ అన్నారు. ఈ సినిమాకు సంగీతం: మణిశర్మ, లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక. కాగా.. ఇటీవల కేరళలోని ఓ జలపాతం వద్ద వేకేషన్ టైమ్‌ను స్పెండ్ చేసిన సమంత ఆ ఫొటోలు, వీడియోలను షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. -
మధుబాల ఆన్ సెట్
సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘యశోద’. ఈ సినిమా ద్వారా హరి–హరీష్ దర్శకులుగా పరిచయమవుతున్నారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ– ‘‘థ్రిల్లర్ జానర్లో ఆకట్టుకునేలా తీస్తున్న చిత్రం ‘యశోద’. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 6న ప్రారంభమైంది. ఇందులో కీలకమైన మధుబాల పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపిస్తారు. బుధవారం నుంచి ఆమె చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ నెల 23 వరకూ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తొలి షెడ్యూల్ చేస్తాం. జనవరి 3న రెండో షెడ్యూల్ మొదలవుతుంది. మార్చికి సినిమాను పూర్తి చేస్తాం. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక, కెమెరా: ఎం. సుకుమార్, సంగీతం: మణిశర్మ, సహనిర్మాత: చింతా గోపాలకృష్ణారెడ్డి. -
సమాజానికి దగ్గరగా బ్లఫ్‌మాస్టర్
‘‘సమాజంలో బ్లఫ్ మాస్టర్లు చాలా మంది ఉన్నారు. వారి వల్ల పలువురు మోసపోతున్నారు. ఆ విషయాలను ప్రస్తావిస్తూ గోపీ గణేష్ ఈ సినిమా బాగా తీశారు. ప్రస్తుత సమాజానికి దగ్గరగా ఉన్న సినిమా ‘బ్లఫ్‌మాస్టర్’. ప్రజల్లో చైతన్యం ఉంటుంది’’ అని నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ అన్నారు. సత్యదేవ్, నందితా శ్వేత, ఆదిత్య మీనన్, బ్రహ్మాజీ, పృథ్వీ ముఖ్య తారలుగా గోపీ గణేశ్ పట్టాభి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్లఫ్‌మాస్టర్’. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో రమేష్ పి.పిళ్లై నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ట్రైలర్‌ను విడుదల చేశారు. గోపీ గణేశ్ పట్టాభి మాట్లాడుతూ– ‘‘సినిమా చాలా బాగా వచ్చింది. ఈ చిత్రం కోసం పృథ్వీ చాలా కష్టపడ్డారు. సునీల్ కశ్యప్ సంగీతం వింటే రెహమాన్ సంగీతం చేశారా? అనిపించింది’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో మోసపోయే వాళ్లల్లో నేనూ ఒకడిని. దో నంబర్ అనే బిజినెస్‌లో మిడిల్ క్లాస్ వాళ్లను టార్గెట్ చేసి ట్రాప్ చేస్తుంటారు’’ అన్నారు సత్యదేవ్. సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కథ: హెచ్. వినోద్, అడిషనల్ డైలాగ్స్: పులగం చిన్నారాయణ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎం.కృష్ణకుమార్ (కిట్టు), కెమెరా: దాశరథి శివేంద్ర. -
సుధీర్ సొంతంగా నిలబడటం హ్యాపీ
‘‘సుధీర్ నా ఫంక్షన్స్‌కి వచ్చి స్పీచ్‌లు ఇరగదీస్తుంటాడు. తన ఫంక్షన్లో మాత్రం సైలెంట్ అయిపోతున్నాడు. ‘సమ్మోహనం’ ఫంక్షన్ చూస్తుంటే ఒక సూపర్ హిట్ వైబ్ కనిపిస్తోంది. ఆల్ ది వెరీ బెస్ట్ టు యూనిట్’’ అని హీరో మహేశ్‌బాబు అన్నారు. సుధీర్‌బాబు, అదితీరావు హైదరీ జంటగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సమ్మోహనం’. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ–రిలీజ్ వేడుకలో మహేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘నరేశ్‌గారు ఎప్పుడూ అంత ఎగై్జటెడ్‌గా లేరు. ‘సమ్మోహనం’ ఈ ఇయర్ వన్నాఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్ అవుతుందని చెప్పడంతో నిజంగా చాలా ఆనందంగా ఉంది. పొద్దున్నే ‘దిల్’ రాజుగారు కూడా చెప్పారు. సినిమాపై చాలా మంచి రిపోర్ట్స్ క్యారీ అవుతున్నాయని. సుధీర్ గురించి నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. మా అందరి పనుల్లో మేం బిజీగా ఉంటాం. సుధీర్‌ని ఎప్పుడూ ఏ విధంగా సపోర్ట్ చేయలేదు. ఇలా ఆడియో ఫంక్షన్స్‌కి రావడం తప్ప. తను సొంతంగా నిలబడుతున్నందుకు చాలా హ్యాపీ. ఆల్ ది వెరీ బెస్ట్ సుధీర్. మోహనకృష్ణగారి ‘అష్టా చమ్మా, జెంటిల్మన్’ సినిమాలు చూశా. చాలా బాగా నచ్చాయి. ‘అష్టా చమ్మా’ నా ఫేవరెట్ ఫిల్మ్. అంటే.. నా పేరు వాడారని కాదు. నిజంగా ఆ సినిమా నాకు బాగా నచ్చింది. తెలుగు ఇండస్ట్రీకి అదితీకి స్వాగతం పలుకుతున్నా. ‘భరత్ అనే నేను’ తర్వాత మిమ్మల్నందర్నీ (అభిమానులు) ఇప్పుడే కలవటం. నిజంగా చాలా ఆనందంగా ఉంది. మీ ఆశీస్సులు, అభిమానం ఇలాగే ఉండాలి. సుధీర్ సినిమాని పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు. మోహనకృష్ణ ఇంద్రగంటి మాట్లాడుతూ– ‘‘2008లో ఒక రోజు నేను రైలులో వెళ్తుంటే ఓ చిన్నపాప ‘పోకిరి’ సినిమా డైలాగ్‌లు చెబుతోంది. అప్పుడు నాకు ‘అష్టా చమ్మా’ మూవీ ఐడియా వచ్చింది. కథ రాస్తున్నప్పుడు సినిమాలో మహేశ్‌బాబుగారి ఫుటేజ్ ఏమైనా వాడదామా? అన్నారు. నేను పేరు చాలు అన్నాను. ఆ పేరులో మత్తు, మ్యాజిక్, వైబ్రేషన్స్ ఉన్నాయి. విజయవాడలో ‘అష్టా చమ్మా’ ప్రీమియర్‌లో ‘మహేశ్‌గారితో ఎప్పుడు సినిమా చేస్తారు’ అని మహేశ్ అభిమాని అడిగారు. ఆల్రెడీ చేసేశాను. ‘అష్టా చమ్మా’ అంతా మహేశ్గారిదే అని చెప్పాను. నేను చాలా ఇష్టపడి, నా హృదయానికి దగ్గరగా రాసుకుని తీసిన చిత్రం ‘సమ్మోహనం’. ఈ చిత్రం కేవలం సుధీర్‌బాబు మాత్రమే చేయగలడని సినిమా చూసిన తర్వాత అందరూ అంటారు’’ అన్నారు. ‘‘ఈ పండుగకి మహేశ్‌బాబుగారు రావడం చాలా ఆనందంగా ఉంది. యూనిట్ అంతా కలసి ఒక మంచి సినిమా చేశాం. చాలా మంచి పేరొస్తుంది. పేరుతో పాటు డబ్బు కూడా వస్తుంది. ఎందుకంటే ఇది నెక్ట్స్ లెవల్ ఫిల్మ్ అనిపించింది. ఈ సినిమాని ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది’’ అన్నారు శివలెంక కృష్ణప్రసాద్. ‘‘ఈ ఫంక్షన్‌కి రాకముందు వరకూ ఓ చిన్న భయం ఉండేది. ‘సమ్మోహనం’ మంచి సినిమా, ప్రేక్షకులకు రీచ్ అవుతుందా? లేదా? అని. ఎప్పుడైతే మహేశ్ ఓ కొత్త గెటప్‌తో ఈ ఫంక్షన్‌కి వస్తున్నాడని తెలిసిందో అప్పుడు చాలామంది ఇక్కడికి రావడానికి ట్రై చేస్తారు. ఎంతోమంది టీవీల్లో చూస్తారు. ఇప్పుడు చూడకపోయినా యూట్యూబ్‌లో చూస్తారు. చూసేటప్పుడు ‘సమ్మోహనం’ గురించి వింటారు. టీజర్, ట్రైలర్ చూస్తారు. వాళ్లకి నచ్చుతుంది. తర్వాత సినిమా కూడా చూస్తారనే నమ్మకం వచ్చింది. ఇక్కడికి వచ్చినందుకు మహేశ్‌కి థ్యాంక్స్. ఇంద్రగంటిగారి నుంచి చాలా నేర్చుకున్నా. కానీ, నాకు ఇప్పుడు ఎలా చెప్పాలో మాటలు రావడం లేదు. ‘సమ్మోహనం’ నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్’’ అన్నారు సుధీర్‌బాబు. ‘‘సమ్మోహనం’ నా తొలి తెలుగు సినిమా. సుధీర్ అమేజింగ్ కో–స్టార్. టీమ్ అందరికీ థ్యాంక్స్’’ అన్నారు అదితీరావ్ హైదరీ. తనికెళ్ల భరణి మాట్లాడుతూ – ‘‘గ్రహణం’ సినిమా నుంచి ‘సమ్మోహనం’ వరకూ మా మోహనకృష్ణ ఎదుగుదల కంగారు లేకుండా స్థిమితంగా హాయిగా ఉంది. ఇవాళ తెలుగు సినిమా రూట్ మారుతోంది. కొత్త చిత్రాలను విపరీతంగా ఎంకరేజ్ చేసి, చిన్న సినిమాలకు కొత్త ఊపిరి పోస్తున్నారు నూతన దర్శకులు. శివలెంకగారు ‘ఆదిత్య 369’ నుంచి నాకు పరిచయం. కమిటెడ్ ప్రొడ్యూసర్ ఆయన. ఇంద్రగంటి షూటింగ్‌కి ఎప్పుడెళ్లినా మన ఇంటికి మళ్లీ మనం వెళ్లినట్లుంటుంది. ఈసారి పెద్ద సినిమా, ఎక్కువ రోజులు ఉండే సినిమా తీయాలని కోరుతున్నా’’ అన్నారు. నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘మరో వారంలో మన 25వ సినిమా (మహేశ్‌బాబు) మొదలవుతుంది. ‘అష్టాచమ్మా, జెంటిల్మన్’ వంటి ఎన్నో మంచి సినిమాలను మోహనకృష్ణగారు మనకు అందించారు. హీరోయిన్ని ఓ కుర్రాడు ప్రేమిస్తే ఏంటన్న కథాంశంతో ‘సమ్మోహనం’ తీశారు. ఈ కథకి ప్రతి ఒక్కరూ రిలేట్ అవుతారు. సినిమా చాలా బాగుందని పోస్ట్ ప్రొడక్షన్లోనే రిపోర్ట్స్ వస్తున్నాయి. దర్శక–నిర్మాతలకు ఆల్ ది బెస్ట్. సుధీర్‌కి ఇంకో హిట్ రాబోతోంది’’ అన్నారు. దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ – ‘‘ఈ మధ్య కాలంలో నాకు బాగా నచ్చిన టైటిల్స్‌లో ‘సమ్మోహనం’ ఒకటి. ఒక లవ్‌స్టోరీకి ఇంతకంటే మంచి టైటిల్ పెట్టలేమేమో? ఇంద్రగంటిగారు తీసిన చిత్రాల్లో ఈ సినిమా పెద్ద స్థాయిలో హిట్ అవుతుందనుకుంటున్నా. ట్రైలర్ చూశా. లుకింగ్ వెరీ ఫ్రెష్. సుధీర్ కెరీర్లో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ – ‘‘మనకున్న మంచి రచయిత–దర్శకుల్లో వన్నాఫ్ ది ఫైనెస్ట్ ఇంద్రగంటిగారు. సార్.. నేను మీ పనికి ఫ్యాన్‌ని. ఈ ఫంక్షన్ నాకు చాలా స్పెషల్. ఎందుకంటే ఈ సినిమాలో నేనూ పార్ట్ అయ్యాను. సుధీర్ ఇటీవల నిర్మాతగా మారారు. ఇప్పుడు ప్రొడక్షన్ ఎందుకు? అన్నాను. ‘ఇక్కడ సంపాదించింది ఇక్కడే పెట్టాలి కదా భయ్యా’ అన్నాడు. ఆ మాటకి హ్యాట్సాఫ్ సుధీర్. డైరెక్టర్స్ బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టు నటించే వ్యక్తి మహేశ్‌గారు. ఏ పాత్రలో అయినా ఒదిగిపోతారు’’ అన్నారు. కెమెరామేన్ పి.జి.విందా, సంగీత దర్శకుడు వివేక్ సాగర్, దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి, వంశీ పైడిపల్లి, తరుణ్ భాస్కర్, నిర్మాత అచ్చిరెడ్డి, నటులు నరేశ్, కాదంబరి కిరణ్, రాహుల్ రామకృష్ణ, నటి పవిత్రా లోకేశ్, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. -
నాన్‌వెజ్ మీల్స్ మాతోనే మొదలైంది
మావయ్యా... మీరు యాక్ట్ చేసిన సినిమాల్లో మీకేది ఇష్టం?... అల్లుడు సుధీర్‌బాబు మామగారు కృష్ణ ముందుంచిన ప్రశ్న ఇది. ఇంతకీ అల్లుడు ఎందుకు జర్నలిస్ట్‌గా మారారు? అంటే.. ఆయన నటించిన ‘సమ్మోహనం’ చిత్రం ట్రైలర్‌ను కృష్ణ విడుదల చేశారు. గురువారం సూపర్ స్టార్ కృష్ణ బర్త్‌డే. ఈ సందర్భంగా ‘సమ్మోహనం’ ట్రైలర్‌ను దర్శక– నిర్మాతలు మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణప్రసాద్‌లు కృష్ణతో రిలీజ్ చేయించి, కొన్ని ప్రశ్నలడిగారు. ఆ చిన్న చిట్ చాట్ ఈ విధంగా.... ఇంద్రగంటి: ‘సమ్మోహనం’ అనగానే మీకు ఏవైనా జ్ఞాపకాలు గుర్తొచ్చాయా? కృష్ణ: ‘సమ్మోహనం’ టైటిల్ ఇప్పటివరకూ ఎవరూ పెట్టలేదు. అచ్చ తెలుగు టైటిల్స్ బాగుంటాయి. మేం తీసిన సినిమాలన్నిటికీ తెలుగు టైటిల్స్ పెట్టామే కానీ, వేరే భాషవి పెట్టలేదు. ‘మోసగాళ్లకు మోసగాడు, పండంటి కాపురం, అల్లూరి సీతారామరాజు, పాడిపంటలు, ప్రజారాజ్యం, ఈనాడు... ఇలా అన్నీ తెలుగు మాటలతోనే పెట్టాం. సుధీర్: మీరు చేసిన సినిమాల్లో మీకు నచ్చిన లవ్ స్టోరీ? కృష్ణ: ‘పండంటి కాపురం’లో రొమాంటిక్ అంశాలు చాలా ఉంటాయి. ప్రజలకు బాగా నచ్చింది. విడుదల చేసిన 37 సెంటర్లలోనూ వంద రోజులాడింది. 14 సెంటర్లలో 25 వారాలు ఆడింది. సుధీర్: మహేశ్ పుట్టినరోజుని చిన్నప్పుడు ఎలా చేసేవారు? కృష్ణ: మద్రాసులో చాలా బాగా చేసేవాళ్లం. ఇప్పుడు స్టార్ అయిన తర్వాత పుట్టినరోజు చేసుకోవడం మానేశాడు. అభిమానులు చేస్తున్నారు. శివలెంక: మీ సంస్థ ఎంతోమందికి భోజనం పెట్టింది.. అప్పట్లో పద్మాలయాలో భోజనం చేయని వాళ్లు ఉండేవారు కాదు. కృష్ణ: మేం ప్రొడక్షన్ స్టార్ట్ చేసినప్పుడు మద్రాసులో లంచ్ అంటే సాంబార్ సాదమ్, తయిర్ సాదమ్ (పెరుగు అన్నం) అని పెట్టేవారు. కానీ, మా కంపెనీ పెట్టినప్పుడు ‘అగ్నిపరీక్ష’ నుంచే నాన్ వెజిటేరియన్‌తో ఫుల్లుగా భోజనం పెట్టడం అలవాటు చేశాం. ఆ తర్వాత మిగిలినవాళ్లు కూడా పెట్టారు. సుధీర్: ఇటీవల ‘మహానటి’ వచ్చింది కదా.. మీ బయోపిక్ వస్తే హీరో ఎవరో తెలుసు. ఎవరు దర్శకత్వం చేస్తే బావుంటుంది? కృష్ణ: పరిశ్రమలో ఎప్పటికప్పుడు కొత్త రక్తం వస్తూనే ఉంది. ఎప్పుడో తీయబోయే సినిమాకు ఇప్పుడే ఎలా చెప్పగలం.. -
20 ఏళ్ల తర్వాత తీయాల్సిన సినిమా అన్నారు
‘‘ఈ తరం ప్రేక్షకులు కూడా మీరు ‘ఆదిత్య 369’ చిత్రనిర్మాత కదా అని గుర్తుపడుతున్నారు. పాతికేళ్ల క్రితం విడుదలైన ఆ చిత్రం గురించి ఇప్పటికీ మాట్లాడుతుంటే.. గర్వంగానూ, సంతోషంగానూ ఉంది. ఈ ఏడాది ‘జెంటిల్మన్’తో సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్‌ఫుల్‌గా స్టార్ట్ కావడం నాకు డబుల్ ధమాకా’’ అని శివలెంక కృష్ణప్రసాద్ అన్నారు. బాలకృష్ణ హీరోగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘ఆదిత్య 369’ విడుదలై నేటికి పాతికేళ్లు. ఈ సందర్భంగా శివలెంక కృష్ణప్రసాద్ పలు విశేషాలను పంచుకున్నారు.... ఓ రోజు బాలు అంకుల్ (ఎస్పీ బాలసుబ్రమణ్యం) ఫోన్ చేసి ‘సింగీతం ఓ కథ చెప్పారు, బాగుంది. ఆ సినిమా చేస్తే, ఇండస్ట్రీలో నీకో మంచి స్థానం ఖాయం’ అని గొప్పగా చెప్పారు. వెంటనే సింగీతంగారిని కలిశాను. ‘‘హాలీవుడ్ మూవీ ‘బ్యాక్ టు ఫ్యూచర్’ ఆధారంగా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో కథ రాశానండీ’’ అని 45 నిమిషాల పాటు నేరేషన్ ఇచ్చారు. కథ చాలా కొత్తగా ఉంది. విపరీతంగా నచ్చేసింది అప్పటి వరకూ ఎన్టీఆర్, ఏయన్నార్‌లు మాత్రమే శ్రీకృష్ణ దేవరాయులు పాత్ర పోషించారు. ఈ కథకు బాలకృష్ణ మాత్రమే న్యాయం చేయగలరని సింగీతమే సలహా ఇచ్చారు. దేవి ఫిలింస్ అధినేత దేవీ వరప్రసాద్ సహాయంతో బాలయ్యను కలసి కథ వినిపించాం. కొత్త నిర్మాత, ప్రయోగాత్మక సినిమా అని ఆలోచించకుండా.. కథ నమ్మి అంగీకరించారు. ఇళయరాజా సంగీతం, జంధ్యాల రచన, తెనాలి రామకృష్ణుడిగా చంద్రమోహన్.. ఇలా మంచి టీమ్ సెట్ అయ్యింది మొదట ‘యుగపురుషుడు’ టైటిల్ అనుకున్నాం. అప్పటికి పదేళ్ల క్రితమే ఎన్టీఆర్‌గారు ఆ టైటిల్‌తో ఓ సినిమా చేశారు. నాన్నగారి టైటిల్ కంటే మరొకటి ఆలోచిస్తే బాగుంటుందని బాలయ్య కోరడంతో ‘ఆదిత్య 369’ పెట్టడం జరిగింది. ఈ చిత్రానికి పీసీ శ్రీరామ్, వియస్సార్ స్వామీ, కబీర్‌లాల్.. సినిమాటోగ్రాఫర్లు గా చేశారు. అప్పట్లో గ్రాఫిక్స్ లేవు కదా. ఆప్టికల్ పద్ధతిలోనే చిత్రీకరించాం. టైమ్ మెషీన్ తయారీకి ఐదు లక్షలు, శ్రీకృష్ణదేవరాయులిగా బాలయ్య కాస్ట్యూమ్స్, నగలకు 10 లక్షలు ఖర్చయింది. అప్పట్లో రూ. 1.20 కోట్లతో సినిమా తీస్తే సేఫ్. ఈ సినిమా బడ్జెట్ కోటిన్నర దాటింది. అన్నపూర్ణ స్టూడియోలో నాలుగు ఫ్లోర్లలో వేసిన సెట్స్ చూసి భారీ చిత్రమని అందరికీ అర్థమైంది. డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఎక్కువ రేటుకి కొన్నారు. నిర్మాతగా నాకూ, వాళ్లకీ లాభాలు వచ్చాయి. 1991 జూలై 18న సినిమా విడుదైలైంది. ‘శ్రీకృష్ణదేవరాయులిగా బాలయ్యను బాగా చూపించారు’ అని ఎన్టీఆర్‌గారు మెచ్చుకున్నారు. ఇరవై ఏళ్ల తర్వాత తీయాల్సిన సినిమా. చాలా అడ్వాన్డ్స్‌గా తీశారని ప్రేక్షకులు, సినీ ప్రముఖులు ప్రశంసించారు ‘మంచి చిత్రం తీశారండీ’ అని చిరంజీవిగారు ప్రశంసించి, ‘పిల్లలూ మీరు మిస్ కావొద్దు’ అని ప్రత్యేకంగా ఓ ట్రైలర్లో నటించారు. విజయశాంతిగారు కూడా ట్రైలర్లో నటించారు తెలుగులో దిగ్విజయంగా వంద రోజులు ప్రదర్శింపబడిన ఈ చిత్రాన్ని తమిళంలో ‘అపూర్వశక్తి 369’ పేరుతో, హిందీలో ‘మిషన్ 369’ పేరుతో అనువదించగా.. రెండు భాషల్లోనూ విజయం సాధించింది.