Samantha Yashoda Update: Movie Unit Making 3 Crores For Hotel Set In Hyderabad - Sakshi
Sakshi News home page

Samantha Yashoda Movie: ఆ ఒక్క సెట్‌ కోసం ముచ్చటగా మూడు కోట్లు

Published Mon, Feb 21 2022 5:16 AM | Last Updated on Mon, Feb 21 2022 9:27 AM

Samantha Yashoda movie unit making 3 crores worth rupees - Sakshi

సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘యశోద’. హరి, హరీష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మిస్తున్నారు. కాగా ఆర్ట్‌ డైరెక్టర్‌ అశోక్‌ నేతృత్వంలో రూపొందిన మూడుకోట్ల రూపాయల హోటల్‌ సెట్స్‌లో ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. ఈ సందర్భంగా శివలెంక కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘యశోద’లో 30 నుంచి 40 శాతం సన్నివేశాలు ఒకే ప్రాంతంలో జరుగుతాయి. ఈ సీన్స్‌ కోసం కొన్ని హోటల్‌ లొకేషన్స్‌ను పరిశీలించాం.

దాదాపు 30 నుంచి 40 రోజులు హోటల్స్‌లో చిత్రీకరణ సులభం కాదు. అందుకే హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో మూడు కోట్లతో సెవెన్‌స్టార్‌ హోటల్స్‌ సౌకర్యాలను తలపించేలా సెట్స్‌ వేశాం. సమంత, వరలక్ష్మీ శరత్‌కుమార్, ఉన్నిముకుందన్‌లపై సీన్స్‌ చిత్రీకరిస్తున్నాం’’ అన్నారు. ఈ సినిమాకు సంగీతం: మణిశర్మ, లైన్‌ ప్రొడ్యూసర్‌: విద్య శివలెంక. కాగా.. ఇటీవల కేరళలోని ఓ జలపాతం వద్ద వేకేషన్‌ టైమ్‌ను స్పెండ్‌ చేసిన సమంత ఆ ఫొటోలు, వీడియోలను షేర్‌ చేయగా వైరల్‌ అవుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement