yashoda
-
డబ్బు కోసం కాదు, మోక్షం కోసం : నృత్యం బాధ నుంచి పుడుతుంది!
‘నృత్యశాస్త్రం నుంచి నృత్యం పుట్టదు. హృదయంలో కలిగే భాధ నుండి ఉద్భవిస్తుంది’ అంటారు కూచిపూడి నృత్యకారిణి, దేవదాసి నృత్యంలో ప్రావీణ్యత గల యశోదా ఠాకోర్. ఇటీవల ఆమె విదేశాల్లో దేవదాసీ నృత్యాన్ని ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కళావంతుల సంఘంచే స్వరపరిచి రూపొందించిన దానిని యశోద మరింత అందంగా ఆవిష్కరిస్తారు. ఒక ప్రేమికురాలు కృష్ణుడిని కోల్పోవడంపై కలిగిన ఆందోళనను అద్భుతంగా వర్ణిస్తుంది. కథానాయిక తనవాడైన వ్యక్తిని పొడవాటి వస్త్రాలతో కట్టివేయాలనే కోరికను అణుచు కుంటూ ఎటూ వెళ్లొద్దని వేడుకోవడాన్ని కళ్లకు కడుతుంది. యు.కెలోని గ్లెన్బర్గ్లో జరిగిన వేడుకలో ప్రదర్శన అనంతరం....ఈ నృత్యం వేరొకరి జీవితంపై రూపొందించిందిదేవదాసీ నృత్యం భారతదేశ చరిత్ర, రాజకీయాలలో ఎలా ప్రధానంగా ఉంటూ వచ్చిందో ఠాకోర్ వివరించారు. ‘భారత శాస్త్రీయ కళలు క్లిష్టమైన పరిస్థితులలో కొన్నిసార్లు అట్టడుగుకు చేరుకున్నాయి. కొన్ని హింసాత్మక చరిత్రలనూ పరిచయం చేశాయి. దక్షిణాదిన వ్యాపించి ఉన్న దేవదాసి సంఘాలు తమ కళతో తరతరాలుగా దేవాలయాలు, జమీందార్లను ఆశ్రయించాయి. దేవదాసీ కళాకారులు తమ కుటుంబ సభ్యులతో వాయిద్యాలతో ప్రదర్శనలను నిర్వహించారు. వారు భూమి, ఆస్తి, ఆభరణాలకు యజమానులు కాకపోయినా సంరక్షకులుగా ఉండేవారు. ఒక కళారూపానికి బాధ్యత వహించే శక్తిమంతమైన ప్రదర్శనకారులు ఇప్పటికీ ఉన్నారు. కానీ సామ్రాజ్యపాలన, కొత్త జాతీయవాద ఎజెండా ఈ ప్రదర్శనకారులకు కఠినమైన రోజులను తెచ్చిపెట్టింది. జాతీయవాద – వలసవాద పితృస్వామ్యాల మధ్య ప్రదర్శన కళలు సంప్రదాయాలలోని లైంగికశక్తితో అణగదొక్కడానికి వ్యవస్థ మొగ్గు చూపింది. మధ్యతరగతి డ్రాయింగ్ రూమ్‌లలో ’సంస్కృతి’ని కొత్తగా చూపడానికి దేశీయ రూపాలను ప్రభావవంతంగా శుద్ధి చేసింది. కోల్‌కతాలోని ఝుమూర్ నృత్య కథలో, కథక్ వంటి నృత్య రూపాల ప్రసిద్ధ చరిత్రలలో కూడా ఇది గమనించవచ్చు. దీంతో దేవదాసీ అవమానకరమైన, బలహీనమైన వ్యక్తిగా ఎదిగింది.హృదయాన్ని కదిలించేలా!లోతుగా చీలి΄ోయిన కుల సమాజంలో బ్రిటీషర్ల కాలంలో ఈ కళలు అక్షర రూపంలోకి వచ్చాయి. 1947లో దేవదాసీ నిర్మూలన చట్టం రావడంతో ఈ కళాకారులు ప్రదర్శన చేసే హక్కును కోల్పోయారు. ప్రదర్శకులుగా వారి శ్రమ, నైపుణ్యం పూర్తిగా కనిపించకుండా పోవడంతో దేవదాసీలు వ్యభిచారంలోకి నెట్టబడ్డారు. పెత్తందార్లు, ΄ోలీసుల నుండి వేధింపులకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది. ఒంటరి మహిళలు కావడంతో వారి కుటుంబాలు అనిశ్చిత పరిస్థితుల్లోకి నెట్టబడ్డాయి. ఒకప్పుడు గౌరవనీయమైన మాతృకగా, అన్నదాతగా ఉన్న దేవదాసీలు ఇప్పుడు లేమితో జీవన ΄ోరాటం చేస్తున్నారు. కడుపులోని కేన్సర్ మెలిపెడుతుంటే ఆకలిని చంపుకోవడానికి బీడీలు కాల్చే మహిళలు నాకు తెలుసు. డబ్బు కోసం కాదు, మోక్షం కోసం నృత్యం చేయాలి... దేవదాసీ నిర్మూలన చట్టం వల్ల కొంతమంది మహిళలు తమ కళను కోల్పోతే, మరికొందరు సిగ్గుతో కుటుంబాలను, సంబంధాలను విచ్ఛిన్నం చేసే మార్గాల్లో తమను తాము దూరం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఒక చట్టాన్ని ఆమోదించినప్పుడు ఆ కళ పై ఆధారపడి జీవించే వారికి ఏం జరుగుతుందో ఎవరికీ పట్టదు. దేవదాసీలు ప్రజా జీవితం నుండి తొలగించిన తర్వాత వారి కళ మాత్రం ‘గౌరవనీయమైన’ శరీరాలపై నాటబడింది. మీరు వెళ్లిపొండి, మీ కళను మాత్రం తీసుకుంటాము అన్నట్టుగా చేశారు. ఉన్నత–కులాల పురుషులు ఈ నృత్య రూపాలను స్వీకరించి, ఆధిపత్యం చెలాయించారు. వాటి మూలాలను మాత్రం చెరిపివేశారు. దేవదాసీల ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టి, నృత్యాన్ని మాత్రం ’క్లాసికల్’ నిబంధనలలో ఉంచారు. కళ‘డబ్బు కోసం కాదు, మోక్షం కోసం జీవిస్తుంది. నాట్యం నాట్యశాస్త్రం నుండి రాదు, హృదయం లోని భాధ నుండి ఉత్పన్నం అవుతుంది’ అంటారు యశోదా ఠాకూర్. ఇదీ చదవండి: రంభా ప్యాలెస్ గురించి తెలిస్తే.. ఇప్పుడే టికెట్ బుక్ చేసుకుంటారు! -
పుష్ప సిస్టర్స్ తగ్గేదేలే...
పూలు రోడ్డు మీద దొరుకుతాయి. కాని వాటిని స్విగ్గీలో తెప్పించుకునే కస్టమర్లు కూడా ఉంటారు అని గ్రహించారు యశోద, రియా కారుటూరి.ఈ ఇద్దరూ కలిసి ‘వూహూ ఫ్రెష్’ పేరుతోమొదలెట్టిన బ్రాండ్ ఇంతింతై ఇంతి ఇంతై అన్నట్టు సాగుతోంది. తాజాగా వీరు అగరు బత్తీల రంగంలో అడుగు పెట్టారు. బంతి, నిమ్మ, మందారం... వీరి అగర్బత్తీల పేర్లు.పూలతో 50 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించిన వీరి ఆలోచనలు...ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. ఐడియా రావడమే సగం విజయం. మిగిలింది ఆచరణ మాత్రమే. ఐడియాలు అందరికీ ఎందుకు రావు? ఎవరో అన్నట్టు బుర్ర పారాచూట్ లాంటిది. తెరిచి పెడితే పని చేస్తుంది. లేదంటే ఏం ఉపయోగం. బెంగళూరులో నివాసం ఉండే ఇద్దరు అక్కచెల్లెళ్లు 2019లో తల్లి తరచూ చేసే ఫిర్యాదును వినేవారు. ‘బెంగళూరులో ఉన్నామన్న మాటేగాని పూజ చేద్దామంటే తాజా పూలే దొరకవు’ అని. ఆ అక్కచెల్లెళ్ల పేర్లు యశోద కారుటూరి, రియా కారుటూరి. యశోద వాషింగ్టన్లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదివితే రియా స్టాన్‌ఫోర్డ్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ చదివింది. అంటే వీళ్లకు టెక్నాలజీ తెలుసు. బిజినెస్ తెలుసు. ఐడియా వెలగకుండా ఉంటుందా?పూలు తెలుసురియ, యశోదల తండ్రి వాళ్ల బాల్యంలో కెన్యా వెళ్లి గులాబీ పంట వేసి పండించేవాడు. ఒకప్పుడు కెన్యా గులాబీలకు పెద్ద మార్కెట్ ఉండేది. ఆ తర్వాత ΄ోయింది. చిన్నప్పడు ఆ తోటల్లో తిరిగిన రియ, యశోదలు అందరూ ఏవేవో వ్యాపారాలు చేస్తారు... మనం పూలతో ఎందుకు చేయకూడదు అనుకున్నారు. ఆలోచన వస్తే వెంటనే పని మొదలెట్టాలి. 2019 పూలకు ప్రాధాన్యం ఉండే ప్రేమికుల దినోత్సవం నాడు ‘వూహూ ఫ్రెష్’ అనే ఆన్లైన్ రిటైల్ బ్రాండ్ మొదలెట్టారు. ‘వూహూ’ అంటే కన్నడలో పువ్వు. తాజాపూలను కస్టమర్లకు అందించడమే లక్ష్యం.ఇంటికి చేరాలిభారతీయలకు భక్తి జాస్తి. పూలతోనే దైవారాధన చేస్తారు. కాని గుడికి పూలు తీసుకెళ్లాలంటే గుడి చుట్టూ ఉన్న అంగళ్లలో కొనాలి. లేదా రోడ్డు మీద కొనాలి. అవి ఫ్రెష్‌గా ఉండొచ్చు... లేక΄ోవచ్చు. అప్పుడు మాత్రమే కాదు శుభకార్యాలకు, అలంకరణలకు, స్త్రీలు జడల్లో ముడుచుకోవడానికి, సన్మానాలకు.. సంస్మరణలకు... ఇళ్లల్లో పెద్దల పటాలకు పూలే కావాలి. కాని ఆ పూలుపాల ΄్యాకెట్టు అందినట్టు న్యూస్‌పేపర్ అందినట్టు ఇంటికి ఎందుకు అందవు అనుకున్నారు అక్కచెల్లెళ్లు. అందేలా చేశారు. విజయం సాధించారు.చందాదారులుగా...న్యూస్‌పేపర్ చందాదారుల్లానే ‘వూహూ ఫ్రెష్’కు కూడా చందాదారులుగా చేరితే రోజంతా పూలు ఇంటికే వస్తాయి. మరి ఇవి ఫ్రెష్‌గా ఎలా ఉంటాయి. దీనికోసం ప్రత్యేకమైన ΄్యాకింగ్ తయారు చేశారు. 3 రోజుల నుంచి 15 రోజుల వరకూ వాడకుండా ఉంటాయి. చేయి తగిలితే పూలు నలిగి΄ోతాయి కదా. అందుకే ‘జీరో టచ్’ ΄్యాకింగ్ కూడా ఉంది. డబ్బాల్లో పెట్టి పంపుతారు. స్విగ్గి, జొమాటో, అమేజాన్ ద్వారా కూడా అందే ఏర్పాటు చేశారు. పండగల్లో పబ్బాల్లో ఆ పండగలకు తగ్గ పూలు, హారాలు, పత్రి, దళాలు కలిపిన ప్రత్యేక బాక్సులు అమ్ముతారు. అవి హాట్‌కేకుల్లా అమ్ముడు΄ోతున్నాయి.రైతులతో కలిసిబెంగళూరులో కేంద్రస్థానంగా ఉంటూ ఇతర ముఖ్య నగరాల్లో విస్తరించుకుంటూ పూల సరఫరా చైన్లను రియా, యశోదలు స్థాపించారు. 500 మంది పూల రైతులతో ఒడంబడిక చేసుకుని కోసిన పూలను వీలైనంత త్వరగా ΄్యాకింగ్ కేంద్రానికి పంపే ఏర్పాటు చేశారు. ఆర్డర్లకు తగ్గ ΄్యాకింగ్ కోసం మహిళా ఉద్యోగులను నియమించారు. ప్రస్తుతం 300 ఆలయాలలో దేవుళ్లు రోజూ వీరు పంపే పూలతోనే పూజలు, హారతులు అందుకుంటున్నారు.2023 షార్క్ ట్యాంక్ షోలో రియా, యశోదాల బిజినెస్ గురించి విని అందరూ ఆశ్చర్య΄ోయారు. సంవత్సరానికి దాదాపు 8 నుంచి 10 కోట్ల వ్యాపారం జరుగుతోంది. వీరి బ్రాండ్ విలువ 50 కోట్లకు చేరింది. వాడి΄ోయిన పూలతో అగర్ బత్తీలు తయారు చేస్తూ ఆ రంగంలోనూ విజయం సాధించారు ఈ బెంగళూరు స్టిస్టర్స్. ఐడియా వీరిని గెలిపిస్తూనే ఉంది. -
అందువల్లే ఆ మ్యాటర్ బయపెట్టాల్సి వచ్చింది: సమంత కామెంట్స్
సమంత ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. తన సినీ కెరీర్లో ఎన్నో గెలుపోటములు రుచి చూశారు. గతంలో యాక్టింగ్‌కు కాస్తా విరామం తీసుకున్న భామ ఇప్పుడిప్పుడే మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. తాజాగా ఢిల్లీ వేదికగా జరిగిన ఇండియాటుడే కాన్క్లేవ్- 2024లో సామ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తన కెరీర్, మయోసైటిస్‌పై క్రేజీ కామెంట్స్ చేశారు. పరిస్థితుల వల్లే మయోసైటిస్ ఉందని బయటకు చెప్పాల్సి వచ్చిందన్నారు. సమంత మాట్లాడుతూ..'నటిగా దాదాపు 14 ఏళ్లు పూర్తి చేసుకున్నా. ప్రతిరోజూ 10 రకాల పనులు చేస్తా. ఐదు గంటలు మాత్రమే నిద్రపోయేదాన్ని. నా కెరీర్లో కొన్ని బాధపడిన సంవత్సరాలు కూడా ఉన్నాయి. ఇంపోస్టర్ సిండ్రోమ్‌తో ఇబ్బందిపడిన క్షణాలున్నాయి. దాని వల్ల కెరీర్ అగ్రస్థానంలో ఉన్న క్షణాలను ఆస్వాదించలేకపోయా. సక్సెస్ సాధించినప్పటికీ నా వల్ల వచ్చింది కాదని భావించేదాన్ని' అని అన్నారు. అంతే కాకుండా మయోసైటిస్‌తో గతంలో తాను నటించిన హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ యశోద ప్రమోషన్స్‌కు దూరంగా ఉండాల్సి వచ్చిందని తెలిపింది. అప్పట్లో ఎన్నో రూమర్స్ వచ్చాయని.. ప్రచారం చేయకపోతే సినిమా చనిపోయేలా ఉందని నిర్మాత చెప్పడంతో ఒకే ఒక్క ఇంటర్వ్యూ ఇచ్చానన్నారు. అలాంటి పరిస్థితుల్లోనే తనకు వ్యాధి ఉందని బయటకు చెప్పాల్సి వచ్చిందన్నారు. -
Yashoda Lodhi: పల్లెటూరోళ్లు ఇంగ్లిష్ మాట్లాడొద్దా?
యూ ట్యూబ్ తెరుస్తున్న కొత్త ద్వారాలు చూస్తూనే ఉన్నాం. మన దగ్గర ఒక బర్రెలక్క ఉన్నట్టుగానే ఉత్తర ప్రదేశ్‌లో ఒక టీచరక్క ఉంది. ఇంటర్ మాత్రమే చదివిన వ్యవసాయ కూలీ యశోదా లోధి ఇంగ్లిష్ మీద ఆసక్తితో నేర్చుకుంది. ‘నాలాగే పల్లెటూరి ఆడవాళ్లు ఇంగ్లిష్ మాట్లాడాలి’ అనుకుని ఒకరోజు పొలం పని చేస్తూ, ఇంగ్లిష్ పాఠం వీడియో విడుదల చేసింది. ఇవాళ దాదాపు మూడు లక్షల మంది సబ్స్క్రయిబర్లు ఆమె ఇంగ్లిష్ పాఠాలను నేర్చుకుంటున్నారు. యశోదా లోధి సక్సెస్ స్టోరీ. ‘కట్ టు ద చేజ్’ అంటే ఏమిటి? ‘బై ఆల్ మీన్స్’ అని ఎప్పుడు ఉపయోగించాలి? ‘అకేషనల్లీకి సమ్టైమ్స్కి తేడా ఏమిటి?’... ఇలాంటి చిన్న చిన్న విషయాల నుంచి మంచినీళ్లు తాగినంత సులభంగా ఇంగ్లిష్ మాట్లాడటం ఎలాగో నేర్పుతోంది ఒక పల్లెటూరి పంతులమ్మ. ఆశ్చర్యం ఏమిటంటే తాను ఒకవైపు నేర్చుకుంటూ మరో వైపు నేర్పుతూ. చదివింది ఇంటర్మీడియట్ మాత్రమే. అది కూడా హిందీ మీడియమ్‌లో. కాని యశోదా లోధి వీడియోలు చూస్తే ఆమె అంత చక్కగా ఇంగ్లిష్ మాట్లాడుతున్నప్పుడు మనమెందుకు మాట్లాడకూడదు అనిపిస్తుంది. అలా అనిపించేలా చేయడమే ఆమె సక్సెస్. ఆమె యూట్యూబ్ చానల్ సక్సెస్. ఇంగ్లిష్ విత్ దేహాతీ మేడమ్ ‘దెహాత్’ అంటే పల్లెటూరు అని అర్థం. యశోదా లోధి ఉత్తర ప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో సిరాతు నగర్ అనే చిన్న పల్లెటూళ్లో ఉంటోంది. అందుకే తన యూట్యూబ్ చానల్‌కు ‘ఇంగ్లిష్ విత్ దెహాతి మేడమ్’ అనే పేరు పెట్టుకుంది. ఆమె ఇంగ్లిష్ పాఠాలకు ఇప్పటికి రెండున్నర కోట్ల వ్యూస్ వచ్చాయి. మూడు లక్షల మంది సబ్స్క్రయిబర్లు ఉన్నారు. అంతే కాదు... ఆమెను చూసిన ధైర్యంతో చాలామంది గృహిణులు ఇంగ్లిష్ ఎంతో కొంత నేర్చుకుని ఆమెతో లైవ్‌లో ఇంగ్లిష్‌లో మాట్లాడుతూ మురిసిపోతుంటారు. ఇంగ్లిష్ మన భాష కాదు, మనం మాట్లాడలేము అనుకునే పల్లెటూరి స్త్రీలకు, గృహిణులకు యశోద గొప్ప ఇన్స్పిరేషన్గా ఉంది. 300 రూపాయల రోజు కూలి యశోద కుటుంబం నిరుపేదది. చిన్నప్పటి నుంచి యశోదకు బాగా చదువుకోవాలని ఉండేది. కాని డబ్బులేక అతి కష్టమ్మీద ఇంటర్ వరకు చదివింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుంది. భర్త ఎనిమిది వరకు చదివారు. ఆడపడుచులు స్కూలు ముఖం చూడలేదు. అలాంటి ఇంటికి కోడలైంది యశోద. పల్లెలో భర్తతో పాటు బంగాళదుంప చేలలో కూలి పనికి వెళితే రోజుకు రూ. 300 కూలి ఇచ్చేవారు. మరోవైపు భర్తకు ప్రమాదం జరిగి కూలి పని చేయలేని స్థితికి వచ్చాడు. అలాంటి స్థితిలో ఏం చేయాలా... కుటుంబాన్ని ఎలా ఆదుకోవాలా... అని తీవ్రంగా ఆలోచించేది యశోద. ఒంటి గంట నుంచి మూడు వరకు పల్లెలో ఇంటి పని, పొలం పని చేసుకుంటూ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు వరకు దొరికే ఖాళీలో మాత్రమే యశోద వీడియోలు చేస్తుంది. ‘మా ప్రాంతంలో నెలంతా సంపాదిస్తే 9 వేలు వస్తాయి. చాలామంది పిల్లలకు మంచి చదువు లేదు. నేను యూట్యూబ్‌లో బాగా సంపాదించి అందరికీ సాయం చేయాలని, మంచి స్కూల్ నడపాలని కోరిక’ అంటుంది యశోద. పల్లెటూరి వనితగా ఎప్పుడూ తల మీద చీర కొంగును కప్పుకుని వీడియోలు చేసే యశోదకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు ఆమె ఆదాయం కూడా చాలా బాగా ఉంది. ఇది నేటి పల్లెటూరి విజయగాథ. గతి మార్చిన స్మార్ట్‌ఫోన్ ‘2021లో స్మార్ట్‌ఫోన్ కొనడంతో నా జీవితమే మారిపోయింది. అప్పటి వరకూ నాకు ఈమెయిల్ క్రియేట్ చేయడం తెలియదు, యూట్యూబ్ చూడటం తెలియదు. కాని ఫోన్ నుంచి అన్నీ తెలుసుకున్నాను. యూట్యూబ్‌లో మోటివేషనల్ స్పీచ్‌లు వినేదాన్ని. నాకు అలా మోటివేషనల్ స్పీకర్ కావాలని ఉండేది. కాని నా మాతృభాషలో చెప్తే ఎవరు వింటారు? అదీగాక నా మాతృభాష కొద్దిమందికే. అదే ఇంగ్లిష్ నేర్చుకుంటే ప్రపంచంలో ఎవరినైనా చేరవచ్చు అనుకున్నాను. అలా ఇంగ్లిష్ నేర్చుకోవాలని ఇంగ్లిష్ నేర్పించే చానల్స్ చూడసాగాను. నేర్చుకుంటూ వెళ్లాను. అలా నేర్చుకుంటున్నప్పుడే నాకు ఆలోచన వచ్చింది. నాలాగా ఇంగ్లిష్ నేర్చుకోవాలనుకునే పేద మహిళలు, పెద్దగా చదువుకోని మహిళలు ఉంటారు... వారి కోసం ఇంగ్లిష్ పాఠాలు చెప్పాలి అని. నేను ఆశించేదీ, అందరు మహిళలు చేయాలని కోరుకునేదీ ఒక్కటే... భయం లేకుండా ఇంగ్లిష్ మాట్లాడటం. అది కష్టం కాదు. నేను నేర్చుకున్నాను అంటే అందరికీ వస్తుందనే అర్థం’ అంటుంది యశోద. -
కథలకు ప్రాణం పోసిన టాప్ హీరోయిన్స్.. ఓటీటీలో ఈ చిత్రాలు ఎవర్గ్రీన్
సౌత్ సినిమా పరిశ్రమలో హీరోలుకు ఏ మాత్రం తగ్గకుండా ఇప్పుడు హీరోయిన్లు సైతం సోలోగా కథలను నడిపించేస్తున్నారు. సింగిల్‌గానే వచ్చి బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లగొడుతున్నారు. తమ స్టార్డమ్తో సినీప్రియుల్ని థియేటర్లకు రప్పించి.. వారి సత్తా ఎంటో బాక్సాఫీస్ ముందు చూపిస్తున్నారు. అందుకే ఇటీవల కాలంలో హీరోయిన్ ప్రాధాన్యం ఉన్న చిత్రాల జోరు కొనసాగుతుంది. అయితే ఇదీ నిన్నమొన్న మొదలైన ప్రస్థానం కాదు. సుమారు కొన్నేళ్ల క్రితమే ఈ ట్రెండ్ మొదలైంది. సమంత, అనుష్క, నయనతార, కీర్తి సురేష్ వంటి స్టార్లు ముందు వరుసలో ఉన్నారు. అనుష్క సినీ కెరియర్లో అరుంధితి సినిమా చాలా ప్రత్యేకం అని చెప్పవచ్చు. ఈ సినిమాకు ముందు ఆమె సుమారు 15 చిత్రాల్లో నటించింది. అప్పటి వరకూ గ్లామర్ పాత్రలే పోషించిన అనుష్కను లేడీ సూపర్ స్టార్ చేసింది కూడా 'అరుంధతి' సినిమానే. దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అనుష్క కెరీర్లో మైలు రాయిగా నిలిచింది. 2009 జనవరి 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన అరుంధతి వచ్చి ఇప్పటికి 15ఏళ్లు కావస్తోంది. ఈ సినిమాతో సౌత్ ఇండియాలో మోస్ట్ పాపులర్ హీరోయిన్గా అనుష్క చేరిపోయింది. అలా అరుంధతి చిత్రం సినీ ప్రేమికుల మస్ట్ వాచబుల్ లిస్ట్‌లో చేరిపోయింది. డిస్నీప్లస్ హాట్ స్టార్‌లో అరుంధతి స్ట్రీమింగ్ అవుతుంది. కిర్తీ సురేష్.. ప్రస్తుతం సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్ల లిస్ట్‌లో సత్తా చాటుతుంది. ఓ వైపు కమర్షియల్ చిత్రాలతో అలరిస్తూనే మరోవైపు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను కట్టి పడేయగలదు. ఈతరం 'మహానటి'గా కీర్తి సురేష్ గుర్తింపు పొందింది. అలనాటి తార సావిత్రిని వెండితెరపై మరోనటి ఆవిష్కరించడం సాధ్యమయ్యే పనేనా..? అని అందరూ అనుకుంటున్న సమయంలో ఆ పాత్రకు జీవం పోసి ప్రశంసలు పొందింది. 2018లో మహానటి చిత్రంతో ఆమె కెరియర్ ఒక్కసారిగా మారిపోయింది. అంతర్జాతీయంగా విజయం అందుకున్న ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా కిర్తీ సురేష్‌కు జాతీయ అవార్డును కూడా తెచ్చిపెట్టింది. ఈ సినిమా సౌత్ ఇండియా సినీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రగా మిగిలిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అమెజాన్ ప్రైమ్‌లో మహానటి చిత్రాన్ని చూడవచ్చు. మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్గా ఇండస్ట్రీలో సమంత ఒక ట్రెండ్‌ను సెట్ చేసింది. ఆమె ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా నటించి సూపర్ హిట్స్‌ను అందుకుంది. కానీ లేడీ ఓరియేంటేడ్ చిత్రం అయిన 'యశోద' చిత్రం ఒక అద్భుతమైన ప్రయోగం అని చెప్పవచ్చు. ఈ సినిమాలో ఎన్నో ట్విస్ట్‌లు ఉంటాయి. అన్నీ కూడా అంతే అద్భుతంగా ఉంటాయి. తన చెల్లిని కనిపెట్టడం కోసం హీరోయిన్ కృత్రిమ గర్భాన్ని ధరించి వెళ్లడం అనే సాహసవంతమైన పాయింట్‌తో దీనిని తెరకెక్కించారు.ఇందులో సమంత నటనకు 100 మార్కులకు మించి వేయవచ్చు. అంతలా తన రోల్లో ఆమె మెప్పిస్తుంది. హరి-హరీష్ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్.. దాదాపు రూ.50కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి వెండితెరపై సంచలనం సృష్టించింది. ఈ చిత్రం కోసం సమంత తొలిసారిగా గర్భవతిగా కనిపించడమే కాక.. డూప్ లేకుండా ఫైట్స్ సీన్స్ చేసింది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. సినిమాలో అసలైన లేడీ సూపర్ స్టార్ అంటే నయనతారనే అని చెప్పవచ్చు. సినిమా కెరియర్ నుంచే ఆమె పాత్రకు ప్రాముఖ్యత ఉంటేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.. అలా కాకుండా నాలుగు పాటలు, రెండు రొమాన్స్ సీన్స్‌కు మాత్రమే పరిమితం చేస్తే వెంటనే నో చెబుతుంది. సీనియర్ నటి విజయశాంతి తర్వాత ఎక్కువగా లేడీ ఓరియేంటెడ్ చిత్రాల్లో నటించింది కూడా నయనతారనే అని చెప్పవచ్చు. ఆమె సినిమాలో మాత్రమే నటిస్తుంది నో ప్రమోషన్స్, నో ప్రెస్మీట్స్, నో స్పెషల్ ఇంటర్వ్యూస్… సినిమా చేశామా, చేతులు దులిపేసుకున్నామా అంతే అనేలా ఉంటుంది. ఒక్కో సినిమాకు రూ.10కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటూ టాప్‌లో ఉంది. నయనతార ప్రధాన పాత్రలో గోపి నైనర్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన చిత్రం 'ఆరమ్'. ఈ చిత్రం 'కర్తవ్యం' పేరుతో తెలుగులోకి అనువాదమైంది. ఈ సినిమాలో కలెక్టర్‌గా నయన్ మెప్పిస్తుంది. బోరుబావిలో పడిపోయిన ఒక చిన్నారిని కాపాడే క్రమంలో ఒక కలెక్టర్‌గా ఆమె వ్యవహరించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. సుమారు ముప్పయ్యేళ్ల క్రితమే పాన్ ఇండియా హీరోయిన్గా మధుబాల సత్తా చాటింది. మణిరత్నం దృశ్యకావ్యం అయిన 'రోజా'లో ఆమె నటన యావద్దేశాన్నీ కట్టిపడేసింది. మనసును దోచుకునే చిరునవ్వుతో అందానికి చిరునామా అనిపించుకున్న మధుబాల... కొన్నేళ్లకే వెండితెరకు దూరమైంది. 'రోజా' విడుదలయ్యాక దేశవ్యాప్తంగా ఆమె పేరు మార్మోగింది. ఎక్కడికెళ్లినా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ రోజా అంటూ ఆప్యాయంగా పలకరించేవారు. ఇప్పటికీ ఆమెను రోజా మధుబాల అనే పిలుస్తుంటారు. 30 ఏళ్లు అయినా ఆ సినిమాకు ఉన్న క్రేజ్ అలాంటింది. సినిమా అవకాశాలు వస్తున్నా పెళ్లి తర్వాత సినిమా కెరియర్‌కు ఫుల్స్టాప్ పెట్టేసింది. సెకండ్ ఇన్నింగ్స్‌తో మళ్లీ తెరమీదకొచ్చిన ఆమె ‘శాకుంతలం’లో మేనకగా కనిపించింది. రోజా సినిమా అమెజాన్ ప్రైమ్,జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. -
ఒకప్పటిలా కాదు.. హీరోయిన్స్ అంటే వాటికే పరిమితం కాదు
మనది పురుషాధిక్య సమాజం. అన్నింటిలోనూ వాళ్లే ముందుంటారు, వాళ్లదే పైచేయి. రాజకీయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, కార్యనిర్వాహణ కావచ్చు, చివరికి ఎంటర్టైన్మెంట్ రంగం కావచ్చు, మహిళ అందులో పావుగానే ఉండేది. కానీ కాలం మారుతుంది. గ్లోబలైజేషన్ ప్రభావం, చదువుతో వచ్చిన చైతన్యం కావచ్చు, రిజర్వేషన్లు కావచ్చు, మార్పుకి దోహదపడుతున్నాయి. అన్ని రంగాల్లో ఇప్పుడు మహిళలు దూసుకుపోతున్నారు. అన్ని రంగాల్లో తాము కూడా ఏదైనా చేయగలమని నిరూపిస్తున్నారు. సినిమా రంగంలోనూ కూడా హీరోయిన్ అంటే గ్లామర్ పాత్రలు, హీరో లవర్ పాత్రలకే పరిమితం అనే భావన క్రియేట్ అయ్యింది. కానీ నెమ్మదిగా దానిలోనుంచి బయటపడుతున్నారు. మహిళ పాత్రకు ప్రాధాన్యత పెంచుతున్నారు. అంతేకాదు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ఆదరణ పెరగడంతో ఆ దిశగా మేకర్స్ అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే మహిళా సాధికారత నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చి ఆదరణ పొందాయి. ఎంతో కొంత సమాజంపై ఆ ఇంపాక్ట్ ని చూపించాయి. ఇటీవల కాలంలో ఉమెన్ ఎంపావర్‌మెంట్ ప్రధానంగా వచ్చిన సినిమాలు, వాటి ప్రత్యేకతలేంటో ఓ లుక్కేద్దాం. తెలుగులో.. `అరుంధతి` నుంచి `యశోద` వరకు.. టాలీవుడ్లో అనుష్క, సమంత వంటి కథానాయికలు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ మెప్పిస్తున్నారు. అంతకు ముందే విజయశాంతి(కర్తవ్యం, ఒసేయ్ రాములమ్మ), జయసుధ(శివరంజని), సౌందర్య(అమ్మోరు)మహిళా ప్రాధాన్యతతో కూడిన సినిమాలు చేశారు మెప్పించారు. మహిళా శక్తిని చాటారు. హీరోయిజంలో పడి ఇండస్ట్రీ కొట్టుకుపోతున్న క్రమంలో ఈ హీరోయిన్లు లేడీ ఓరియెంటెడ్ బ్యాక్ డ్రాప్లో మహిళా సాధికారతని చెప్పే చిత్రాలు చేసి మెప్పించారు. ఇటీవల కాలంలో అనుష్క శెట్టి ఇందులో ముందు వరుసలో ఉంది. ఆమె ఇప్పటికే `అరుంధతి`, `రుద్రమదేవి`, `భాగమతి`, `సైలెంట్` వంటి చిత్రాలు చేసింది. `అరుంధతి`తో అనుష్క సంచలనం.. దుష్ట శక్తిని ఎదుర్కొని ప్రజలను, తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు ఓ మహిళ(జేజమ్మ) చేసిన పోరాటం నేపథ్యంలో `అరుంధతి` సాగుతుంది. ఇందులో అనుష్క పాత్రనే నిర్ణయాత్మక పాత్రగా ఉంటుంది. తనే స్వతహాగా పోరాడుతుంది. ఆ పోరాటంలో తన ప్రాణాలను అడ్డుపెట్టి మరీ విజయం సాధిస్తుంది. అయితే ఈ సినిమాలో చాలా వరకు మూఢ విశ్వాసం ఉన్నప్పటికీ ఓ మహిళా తిరుగుబాటు, పోరాట పటిమ అనే అంశం ఎంతో మంది ఆడవాళ్లని ఇన్స్పైర్ చేస్తుందని చెప్పొచ్చు. కోడి రామకృష్ణ రూపొందించిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత అనుష్క నుంచి `రుద్రమదేవి`, `భాగమతి`, `సైలెంట్` చిత్రాలొచ్చాయి. చరిత్ర నేపథ్యంలో దర్శకుడు గుణశేఖర్ `రుద్రమదేవి`సినిమాని రూపొందించారు. ఓ అమ్మాయి కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించే ఇతివృత్తంతో ఈ సినిమా తెరకెక్కింది. అయితే అబ్బాయిగా పెరిగిన ఓ అమ్మాయి.. చివరికి కష్ట కాలంలో రాజ్యం ప్రమాదంలో ఉన్నప్పుడు ఓ వీరుడిలా, ఓ యోధుడిలా పోరాడే ఇతివృత్తం ఇందులో ప్రధాన అంశం. మహిళల్లోని వీరత్వాన్ని చాటి చెప్పిందీ సినిమా. కమర్షియల్ ఇది పెద్దగా మెప్పించలేకపోయింది. అలాగే రాజకీయ క్రీడలో బలిపశువుగా మారిన భాగమతి దాన్నుంచి ఎలా బయటపడింది, రాజకీయ నాయకుల కుట్రలను ఎంత తెలివిగా దెబ్బకొట్టిందనే కాన్సెప్ట్ తో వచ్చిన `భాగమతి` సైతం ఆకట్టుకుంది. చాలా మందిని ఇన్స్పైర్ చేసింది. కానీ అనుష్క నటించిన మరో సినిమా `సైలెంట్` మాత్రం మెప్పించలేకపోయింది. ఈ సినిమాల్లోనూ అంతర్లీనంగా ఉమెన్ ఎంపావర్‌మెంట్ అంశాన్ని మనం చూడొచ్చు. `యశోద`తో సమంత జోరు కమర్షియల్ హీరోయిన్గా కెరీర్‌ని స్టార్ట్ చేసిన సమంత ఇటీవల `యశోద` సినిమాతో మెప్పించింది. మెడికల్ మాఫియా నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం మహిళా సాధికారత అనే అంశానికి సరైన అర్థాన్ని చెప్పింది. అద్దెగర్భం(సరోగసి) అనే అంశాన్ని తీసుకుని దర్శకుడు హరి-హరీష్ రూపొందించిన చిత్రమిది. ఇందులో అద్దెగర్భాన్ని అడ్డుపెట్టుకుని కొన్ని కార్పొరేట్ మెడికల్ సంస్థలు నిర్వహిస్తున్న మాఫియాని, చీకటి కోణాలను వెలికితీసింది. సినిమా పరంగా ఇది ఫిక్షనల్‌గానే తీసినప్పటికీ, ప్రస్తుత సమాజంలోనూ ఇలాంటి అగడాలు జరుగుతున్నాయనేది ఈ సినిమా ద్వారా చెప్పారు. ఇందులో ఓ సాధారణ అమ్మాయిగా సమంత అద్దెగర్భం పొంది అందులో చీకటి కోణాలను బయటకు తీసిన తీరు, ఈ క్రమంలో వారితో పోరాడిన తీరు ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఆ పాత్ర పొటెన్షియాలిటీని బయటపెడుతుంది. అంతిమంగా మహిళ శక్తిని చాటి చెబుతుంది. ఇది సమాజాన్ని ప్రభావితం చేసింది. దీంతోపాటు `ఓబేబీ` చిత్రంతోనూ సమంత పర్ఫెక్ట్ ఉమెన్ ఎంపావర్‌మెంట్‌ని ఆవిష్కరించింది. ఓ వృద్ధ మహిళ యంగ్ ఏజ్‌లో సాధించలేనివి.. యంగ్‌గా మారినప్పుడు వాటిని ఫుల్‌ఫిల్ చేసుకోవడం అనే కాన్సెప్ట్ మహిళా సాధికారతకు నిదర్శనంగా చెప్పొచ్చు. ఇందులో సమంతతోపాటు లక్ష్మి నటన వాహ్ అనిపిస్తుంది. `మహానటి`, `మిస్ ఇండియా`తో కీర్తిసురేష్ సత్తా.. కీర్తిసురేష్ పాన్ ఇండియా ఇమేజ్‌ని, జాతీయ అవార్డుని తీసుకొచ్చిన చిత్రం `మహానటి`. అలనాటి మేటి నటి సావిత్రి జీవితం ఆధారణంగా రూపొందిన బయోపిక్. ఇందులో ఆమె జర్నీ ఇన్స్పైరింగ్గా ఉంటుంది. సావిత్రి స్టార్ హీరోలను మించిన స్థాయికి ఎదగడం, ఆ తర్వాత ప్రేమ పేరులో మోసానికి గురికావడం, తర్వాత తన జీవితాన్నే నాశనం చేసుకోవడం ఇందులో కన్‌క్లూజన్. కానీ విశేష అభిమానుల ఆరాధ్య నటిగా కీర్తించబడింది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సక్సెస్ కంటే ఫెయిల్యూర్ని, ఆమె చేసిన తప్పులను ఆవిష్కరించిన చిత్రంగా నిలుస్తుందని చెప్పొచ్చు. మరోవైపు `మిస్` ఇండియా`తో మహిళాసాధికారతకు అసలైన అర్థం చెప్పింది కీర్తిసురేష్. విదేశాల్లో మన ఇండియన్ టీని పరిచయం చేసి, అనేక స్ట్రగుల్స్ ఫేస్ చేసి సక్సెస్‌గా నిలవడమనేది ఉమెన్ ఎంపావర్‌మెంట్‌కి నిదర్శనం. కానీ నరేంద్ర నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సక్సెస్ కాలేకపోయింది. మిస్టరీ థ్రిల్లర్ `పెంగ్విన్` సైతం మహిళలను ఇన్స్పైర్ చేస్తుంది. అలాగే `గుడ్ లక్ సఖి`చిత్రంలోనూ ఓ పేద గిరిజన అమ్మాయి షూటర్‌గా రాణించేందుకు పడే కష్టం నేపథ్యం ఉమెన్ ఎంపావర్‌మెంట్‌కి నిదర్శనంగా చెప్పొచ్చు. ఈ సినిమాలు ఆడకపోవడంతో అంతగా ఇంపాక్ట్ ని చూపించలేకపోయాయి. కోలీవుడ్‌లో.. నయనతార ఉమెన్ ఎంపావర్‌మెంట్ కి ప్రతిబింబం.. స్టార్ హీరోయిన్ నయనతార మహిళ సాధికారతకు ప్రతిరూపంగా నిలుస్తుంది. ఆమె గ్లామర్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ ఇమేజ్‌తో రాణిస్తుంది. ఆమె మాత్రమే కాదు, ఆమె సినిమాలు సైతం ఇటీవల అలానే ఉంటున్నాయి. నయనతార `డోరా`, `కో కో కోకిల`, `వసంతకాలం`, `అమ్మోరు తల్లి`, `ఓ2`, `మయూరి` వంటి సినిమాలతో విజయాలు అందుకుంది. ఇందులో `డోరా`లో ఓ ఆత్మతో పోరాటం చేస్తుంది నయన్. అలాగే `కోలమావు కోకిల` చిత్రం.. నిజమైన ఉమెన్ఎంపావర్మెంట్ని చాటి చెబుతుంది. ఇందులో కుటుంబ బాధ్యతని తను మోయాల్సి రావడంతో జాబ్ చేయాల్సి వస్తుంది నయనతారకి. ఆమె కొకైన్ స్మగ్లింగ్ చేసే సంస్థలో పనిచేయాల్సి వస్తుంది. అయితే అందుకో చాలా సవాళ్లు ఎదుర్కోవల్సి వస్తుంది. ఆ సవాళ్లని, అడ్డంకులను ఎదుర్కొని దాన్నుంచి బయటపడేందుకు నయనతార చేసిన పోరాటమే ఈ చిత్రం. ఆద్యంతం ఇన్ స్పైరింగ్‌గా ఉంటుంది. నేటి సమాజంలోని సవాళ్లని ప్రతిబింబిస్తుంది. నయనతార రెండేళ్ల క్రితం నటించిన `నెట్రికన్` సైతం ఉమెన్ ఎంపావర్‌మెంట్ అంశంగానే రూపొందింది. ఓ కళ్లులేని లేడీ పోలీస్ ఆఫీసర్ ఓ సీరియల్ కిల్లర్‌ని పట్టుకునేందుకు చేసే పోరాటమే ఈ చిత్ర కథ. ఇందులో కళ్లు లేకుండా కూడా హంతకులను నయనతార పట్టుకోవడం అనే అంశం మహిళ ఎంత పవర్ఫుల్ అనేది చాటి చెబుతుంది. మగవారిని మించి మహిళ చేయగలదని నిరూపించింది. అలాగే తన కూతురిని కాపాడుకోవడం కోసం తల్లి పడే స్ట్రగుల్స్ నేపథ్యంలో రూపొందిన `కనెక్ట్`, కొడుక్కి ఆక్సిజన్ అందేలా చేయడంకోసం తల్లి పడే ఆరాటం నేపథ్యంలో వచ్చిన `ఓ2`, అలాగే హర్రర్ మూవీ `ఐరా`, తోపాటు `మాయా` చిత్రాలతోనూ నయనతార ఆకట్టుకుంది. ఆయా చిత్రాల్లో మహిళా శక్తి సామర్థ్యాలను చాటి చెప్పింది. నయనతార నటించిన చాలా సినిమాలు విశేష ఆదరణ పొందడంతోపాటు మంచి కలెక్షన్లని రాబట్టడం విశేషం. ఇందులో చాలా వరకు సమాజాన్ని ప్రభావితం చేసే సినిమాలుండటం విశేషం. `గార్గి`తో సాయిపల్లవి.. సాయిపల్లవి నటించే సినిమాల్లో కచ్చితంగా మహిళా సాధికారత అనే అంశం ఉండి తీరాల్సిందే. లేదంటే ఆమె నటించదు. హీరో సరసన చేసినా ఆమె పాత్ర బలంగా ఉండాల్సిందే. ఇక తనే మెయిన్ లీడ్‌గా చేసి మెప్పించిన చిత్రం `గార్గి` ఉమెన్ ఎంపావర్‌మెంట్‌కి, మహిళా శక్తికి నిదర్శనంగా నిలుస్తుంది. కేసులో ఇరుక్కున్న తండ్రిని కాపాడుకోవడం కోసం ఓ టీచర్ ఒంటరిగా చేసే పోరాటం నేపథ్యంలో సాగే ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలందుకుంది. మరోవైపు తెలుగులో వచ్చిన `విరాటపర్వం`లోనూ ప్రేమ కోసం ఆమె చేసే పోరాటం సైతం మహిళా శక్తిని చాటుతుందని చెప్పొచ్చు. కోలీవుడ్‌లో ఐశ్వర్య రాజేష్ సైతం మహిళా శక్తిని చాటే చిత్రాలు చేస్తూ రాణిస్తుంది. ఆమె స్పోర్ట్స్ డ్రామా `కౌసల్య కృష్ణమూర్తి`(కనా) ఉమెన్ ఎంపావర్‌మెంట్‌ని చాటింది. దీంతోపాటు ఇటీవల `డ్రైవర్ జమున`, `ది గ్రేట్ ఇండియన్ కిచెన్`, `రన్ బేబీ రన్`, `సొప్పన సుందరి` వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో ఆకట్టుకుంది. ఐశ్వర్య రాజేష్ సినిమాల్లోనే మహిళ పాత్ర బలంగా ఉండేలా చూసుకుంటుంది. ఆయా సినిమాలు సమాజాన్ని ప్రభావితం చేసేలా ఉండటం విశేషం. అలాగే అమలాపాల్ నటించిన `ఆడై`(ఆమె) చిత్రం సైతం మహిళా శక్తిని చాటింది. మలయాళంలో.. `జయ జయ జయ జయ హే`.. మలయాళంలో ఇటీవల కాలంలో మహిళా శక్తిని చాటిన చిత్రంగా `జయ జయ జయ జయ హే`నిలుస్తుంది. విపిన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దర్శణ రాజేంద్రన్, బసిల్ జోసెఫ్ నటించారు. ఇది అత్తారింట్లో అవమానాలు, గృహహింసకు గురైన మహిళ తిరుగుబాటు నేపథ్యంలో రూపొందిన చిత్రం. జయ అనే అమ్మాయికి బాగా చదువుకుని గొప్పగా ఎదగాలని ఉంటుంది, కానీ పేరెంట్స్ చదువు మధ్యలోనే ఆపేసి పెళ్లి చేస్తారు. చదివిస్తానన్న మాటతో పెళ్లి చేసుకున్న భర్త ఆ తర్వాత దాని ఊసేత్తడు.పైగా రోజూ ఇంట్లో వేదింపులు. ఇక లాభం లేదని భావించిన జయ తిరగబడుతుంది. ఫోన్లో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని ఇంట్లో ఎవరికి తెలియకుండా భర్తని కొడుతుంది. భర్త మొదట ఈ విషయాన్ని దాచినా తర్వాత బయటపడుతుంది. పెద్దల సమక్షంలో ఇద్దరు క్షమాపణలు చెప్పుకుని మారిపోతారు. అంతలోనే జయ గర్భం దాల్చేలా చేస్తాడు భర్త. అలా అయితే ఇంట్లో పడి ఉంటుందని వారి ప్లాన్. కానీ ఈ కుట్ర గురించి తెలిసిన జయకి రక్తపోటు పెరిగి అబార్షన్ అవుతుంది. ఆమెపై నిందలేయడంతో ఇంటికి దూరంగా సోదరుడితో కలిసి ఉంటుంది. విడాకుల కోసం కోర్ట్ కి వెళ్లగా జడ్జ్ క్లాస్ పీకడంతో భర్త లో మార్పు వస్తుంది, ఆ తర్వాత జయని ప్రేమగా చూసుకుంటాడు. తన వ్యాపారంలో భాగస్వామిని చేస్తాడు. దీంతో అతని వ్యాపారం మూడు పూవులు ఆరు కాయలుగా మారుతుంది. కుటుంబం, విలువులు అంటూ అన్నీ భరించిన భార్య.. అత్తింటి ఆగడాలు తట్టుకోలేక ఎదురుతిరిగి తనేంటో నిరూపించింది. తన శక్తిని చాటి చెప్పింది. మహిళలకు స్ఫూర్తిగా నిలిచింది. ఈ సినిమా ఇటీవల కాలంలో మలయాళంలో ఎంతో ప్రభావితం చేసిన చిత్రంగా నిలవడం విశేషం. వీటితోపాటు మాలీవుడ్‌లో మరికొన్ని లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు వచ్చి మెప్పించాయి. అందులో ఒకటి `ఉయరే`. అనేక స్ట్రగుల్స్ ని ఫేస్ చేసి ఓ సాధారణ అమ్మాయి పైలట్ కావడమనే కథతో ఈ చిత్రం రూపొంది ఆదరణ పొందింది. ఇందులో పార్వతి ప్రధాన పాత్రలో నటించింది. దీంతోపాటు కిడ్నాప్‌కి గురైన ఓ అమ్మాయి పడే వేదన, దాన్నుంచి ఆమె బయటపడేందుకు చేసే పోరాటం నేపథ్యంలో వచ్చిన థ్రిల్లర్ `హెలెన్` మంచి ఆదరణ పొందింది. అలాగే ఇద్దరు అమ్మాయిల జర్నీ నేపథ్యంలో వచ్చిన `రాణి పద్మిని`, అమల అక్కినేని, మంజు వారియర్ నటించిన `కేరాఫ్ సైరా బాను` చిత్రాలు మహిళా శక్తిని చాటే కథాంశాలతో రూపొంది మెప్పించాయి. సమాజంపై ఎంతో కొంత ఇంపాక్ట్ ని చూపించాయి. బాలీవుడ్లో.. `డర్టీ పిక్చర్` టూ `మేరీకోమ్` టూ `గంగూబాయ్`.. బాలీవుడ్లో లేడీ ఓరియెంటెడ్ చిత్రాల జోరు చాలా కాలంగా కొనసాగుతూనే ఉంది. సిల్క్ స్మిత జీవితం ఆధారంగా వచ్చిన `డర్టీ పిక్చర్స్` నుంచి మొన్న అలియాభట్ నటించిన `గంగూభాయ్` వరకు చాలా సినిమాలు వచ్చి విశేష ఆదరణ పొందాయి. కమర్షియల్ గానూ సత్తా చాటాయి. బాలీవుడ్లోనే కాదు, ఇండియన్ సినిమాపై ఎంతో ఇంపాక్ట్ ని చూపించాయి. బాలీవుడ్లో అంతకు ముందు కూడా అనేక మహిళశక్తిని చాటే సినిమాలు వచ్చినా, `డర్టీ పిక్చర్స్` మాత్రం ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. అసలైన ఉమెన్ ఎంపావర్‌మెంట్‌ని చాటి చెప్పింది. ఇందులో విద్యాబాలన్ తన నటనతో ఇరగదీసి జాతీయ అవార్డుని అందుకుంది. మరోవైపు రియల్ లైఫ్ బాక్సర్ మేరీకోమ్ జీవితం ఆధారంగా వచ్చిన `మేరీకోమ్`తో ప్రియాంక చోప్రా.. మహిళా శక్తిని నిరూపించింది. నిజమైన ఉమెన్ ఎంపావర్‌మెంట్ ని చాటి చెప్పింది. ఇండియన్ సినిమాపైనే బలమైన ప్రభావాన్ని చూపించడంతోపాటు ఎంతో మందిని ప్రభావితం చేసిన సినిమాగా నిలిచింది. మరోవైపు మిడిల్ ఏజ్ మహిళ విదేశాల్లో ఇంగ్లీష్ నేర్చుకుని తను కూడా స్వతంత్రంగా నిలబడటమనే కాన్సెప్ట్ తో వచ్చిన శ్రీదేవి `ఇంగ్లీష్ వింగ్లీష్` మహిళా శక్తికి, ఉమెన్ ఎంపావర్‌మెంట్‌కి నిదర్శనం. ఈ సినిమా చాలా మందిని ప్రభావితం చేసింది. తొలి ఇండియన్ ఎయిర్ పైలట్‌గా.. తప్పిపోయిన భర్తని వెతికే క్రమంలో ఓ గర్భిణి పడే బాధల నేపథ్యంలో వచ్చిన విద్యా బాలన్ `కహాని`, ఓ లేడీ పోలీస్ అధికారి క్రైమ్‌ని అంతం చేసే ఇతివృత్తంతో వచ్చిన రాణి ముఖర్జీ `మార్దాని`, కార్గిల్ వార్(ఇండియా పాక్ వార్) సమయంలో ఆ వార్ ప్రాంతంలో ప్రయాణించిన తొలి ఇండియన్ ఎయిర్ ఫైలట్ గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా జాన్వీ కపూర్ నటించిన `గుంజన్ సక్సేనా` లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్. మహిళా శక్తిని చాటే చిత్రాలుగా నిలిచాయి. వీటితోపాటు తాప్సీ నటించిన `పింక్` చిత్రం ఇటీవల కాలంలో ఎంతో ప్రభావితం చేసిన సినిమాగా నిలిచింది. అత్యంత చర్చనీయాంశంగానూ మారింది. అలాగే శ్రీదేవి `మామ్`, ఐశ్వర్య రాయ్ `సర్బ్జిత్`, తాప్సీ `తాప్పడ్` వంటి సినిమాలు కూడా మహిళా శక్తి సామర్థ్యాలను ఆవిష్కరించిన చిత్రాలే. దీపికా పదుకొనె ప్రధాన పాత్రతో సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన హిస్టారికల్ మూవీ `పద్మావత్`, అలియాభట్ నటించిన `గంగూభాయ్` ఉమెన్ ఎంపావర్‌మెంట్‌కి ప్రతిరూపాలు. కథియవాడి ఏరియాలో వేశ్య వృత్తి చేసుకునే గంగూభాయ్.. లేడీ డాన్‌గా, రాజకీయాలను శాషించే స్థాయికి ఎదగడమనే కథాంశంతో వచ్చిన `గంగూభాయ్` సినిమా విశేషం ఆదరణ పొందింది. ఇలా ఇప్పటికే బాలీవుడ్లో మంచి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు వస్తూ ఎంతో ఆదరణ పొందుతున్నాయి. ఇన్స్పైర్ చేస్తున్నాయి. మరిన్ని రూపుదిద్దుకుంటున్నాయి. -
ఆ సమయంలో ఆరోగ్యం క్షీణించినా లెక్కచేయలేదు: సమంత
సమంత ప్రస్తుతం శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. గతేడాది యశోద చిత్రంతో అభిమానులను పలకరించింది. ఆ సమయంలో సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శాకుంతలం మూవీ ప్రమోషన్లలో బిజీ పాల్గొంటున్నారు. అందులో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సమంత తన ఆరోగ్య పరిస్థితిపై కీలక విషయాలను పంచుకున్నారు. సమంత మాట్లాడుతూ.. 'మయోసైటిస్ నిర్ధారణ కాగానే మొదట్లో చాలా బలహీనంగా అనిపించేది. యశోద చిత్ర సమయంలో ఆరోగ్యం బాగా క్షీణించింది. అయినా కూడా ప్రమోషన్స్‌లో పాల్గొన్నా. ఇంటర్వ్యూ ఇచ్చేందుకు ఓపిక ఉండేది కాదు. చాలా మందులు వాడాల్సి వచ్చేది. సినిమాను బాధ్యతగా భావించి కష్టమైన సరే ఇంటర్వ్యూ చేయాలనుకున్నా. అయితే ప్రస్తుతం ఆరోగ్యం పూర్తిగా సహకరిస్తోంది. మయోసైటిస్ నుంచి కోలుకుని ధైర్యంగా ఉన్నా.' అని చెప్పుకొచ్చింది. శాకుంతలం చిత్రానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. గుణశేఖర్ కథ చెప్పగానే మొదట తిరస్కరించినట్లు తెలిపింది. అందుకు కారణం మూడేళ్లుగా తనలో ఉన్న భయమేనని అన్నారు. కానీ గుణశేఖర్ ఒప్పించి మరీ నటించేలా చేశారని వెల్లడించారు. ఈ సినిమాలోని పాత్ర కోసం ప్రత్యేక వ్యాయామాలు, వర్కవుట్లు, డైట్ కూడా మార్చుకున్నట్లు వివరించారు. ఈ చిత్రాన్ని వదులుకుంటే తన కల సాకారమయ్యేది కాదన్నారు. కాగా.. శాకుంతలం ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో దేవ్ మోహన్, సచిన్ ఖేడ్కర్, మోహన్‌బాబు, అదితి బాలన్, అనన్య ప్రధాన పాత్రల్లో నటించారు. -
ఆ హీరోయిన్ చేస్తే 'యశోద' ఇంకా బాగుండేది: పరుచూరి
ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇటీవల రిలీజైన సమంత మూవీ యశోదపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. సినిమా చాలా బాగుందని ఆయన ప్రశంసించారు. ఈ మూవీ ఓ సందేశాత్మక చిత్రమని కొనియాడారు. హీరోయిన్ పాత్రకు అధిక ప్రాధాన్యతనిస్తూ సినిమా తెరకెక్కించారని తెలిపారు. ఈ చిత్రంలో సమంత చాలా బాగా చేసిందని.. ఆమె అద్భుతమైన నటి అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. దర్శకులు హరి, హరీశ్ సమంత పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారని పరుచూరి గోపాలకృష్ణ ప్రశంసించారు. అయితే విజయశాంతి నటించిన కర్తవ్యం సినిమాలాగా.. యశోద మూవీని ఆమె చేస్తే మరింత బాగుండేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విజయశాంతి ఇలాంటి పాత్రలను అవలీలగా చేయగలదన్నారు. అందం కోసం చిన్నపిల్లల ప్లాస్మాను ఉపయోగించడం.. దీని వెనుక కోట్ల రూపాయల వ్యాపారం.. దీన్ని కనిపెట్టడం కోసం సమంత చేసిన ప్రయత్నం చాలా బాగుందని పరుచూరి కొనియాడారు. సినిమాలోని చివరి 40 నిమిషాలు చూస్తే భయం వేస్తుందన్నారు. యశోద ఓ అద్భుతమైన ప్రయోగమని తెలిపారు. యశోద చిత్రాన్ని చూసినప్పుడు ఒక స్త్రీని హీరోగా ఎలా చూపించాలో ఇందులో నేర్చుకోవచ్చని ఆయన సలహా ఇచ్చారు. చివరిగా నా కోసమైనా ఈ సినిమాను ఒక్కసారి చూడండని ఆయన కోరారు. -
ఆ ప్రాజెక్టుల నుంచి తప్పుకున్న సమంత.. క్లారిటీ ఇదే..!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇటీవల అరుదైన వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా సామ్ వెల్లడించింది. ఇటీవలే ఆమె నటించిన యశోద మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను అలరించింది. సినిమా విడుదలకు ముందే సమంత తన వ్యాధిపై ప్రకటన చేసింది. అదే సమయంలో బెడ్‌పై నుంచే సినిమా ప్రమోషన్లలోనూ పాల్గొంది. ఇదిలా ఉంటే ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌తో సామ్ బాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. అంతేకాదు తెలుగులోనూ ఆమె ఖుషి చిత్రంతో పాటు తమిళంలోనూ మరో సినిమాకు సంతకం చేసింది. తాజాగా ఆమె కొద్ది రోజుల పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వనుందని వార్త హల్చల్ చేస్తోంది. అయితే ఈ వార్తలను సమంత మేనేజర్ ఖండించారు. ఈ విషయంపై సమంత మేనేజర్ మహేంద్ర ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ..'సమంత ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటోంది. జనవరిలో సంక్రాంతి తర్వాత ఖుషి షూటింగ్లో పాల్గొనబోతోంది. ఆ తర్వాత తన బాలీవుడ్ ప్రాజెక్ట్‌లో నటించనుంది. జనవరి నుంచి హిందీ సినిమాకు డేట్స్ ఇచ్చాం. కానీ అనుకోని కారణాల వల్ల సినిమాల షూటింగ్‌లు దాదాపు ఆరు నెలలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఆమె హిందీ సినిమా షూటింగ్ ఏప్రిల్ లేదా మే మాత్రమే పాల్గొనగలదు.' అని అన్నారు. ఓ హాలీవుడ్ మూవీతో పాటు ఆమె చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. పాన్ ఇండియా మూవీ శాకుంతలం అనంతరం సామ్ వరుసగా పలు చిత్రాల్లో నటించాల్సి ఉంది. అయితే తాను మయోసైటిస్ బారిన పడటంతో ప్రస్తుతం స్వల్ప కాలం పాటు షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సామ్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ సినిమాల విషయంలో సామ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు బి-టౌన్లో గుసగుసలు వినిపించాయి. ఏ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోలేదు: 'సినిమా నిర్మాణం చాలా శ్రమతో కూడుకున్నది. కాబట్టి ఎవరినైనా వేచి ఉండేలా చేయడం మంచిది కాదు. అనుకున్న షెడ్యూల్స్ ప్రకారం ముందుకు సాగాలని మొదటి నుంచి మేకర్స్‌కు క్లారిటీ ఇస్తున్నాం. అధికారికంగా అంగీకరించిన ఏ ప్రాజెక్ట్ నుండి సమంత బయటకు రాలేదు. ఆమె తన రాబోయే ప్రాజెక్ట్‌ల నుండి తప్పుకున్నట్లు వచ్చిన వార్తలలో ఇప్పటివరకు నిజం లేదు.' అన్నారాయన. ప్రస్తుతం సమంత పూర్తిగా క్షేమంగా ఉన్నారని.. హైదరాబాద్‌లోని తన ఇంట్లోనే ఉన్నారని సమంత మేనేజర్ మహేంద్ర వెల్లడించారు. -
OTT release : 'యశోద', 'ఊర్వశివో రాక్షసివో' మూవీస్ థియేటర్స్‌లో మిస్ అయ్యారా?
సినీ అభిమానులకు శుక్రవారం వచ్చిందంటే పండగే. ఎందుకంటే సినిమాలు చాలావరకు ఆరోజే రిలీజ్ అవుతుంటాయి. ఇక ఈ మధ్యకాలంలో ఓటీటీల ప్రభావం కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. థియేటర్లో సినిమా మిస్ అయిన వాళ్లు ఆ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తుంటారు. మరి ఒకేరోజు ఓటీటీలో మూడు సినిమాలు విడుదలైతే? ఈ శుక్రవారం ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేస్తున్న సినిమాలపై ఓ లుక్కేద్దాం. సమంత ప్రధాన పాత్రలో నటించి యశోద సినిమా రీసెంట్గా హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. హరి-హరీష్ ద్వయం దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 11న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం ఇప్పటివరకు సుమారు రూ. 30కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది. అయితే ఈ మూవీని థియేటర్స్‌లో మిస్ అయినవాళ్లు ఓటీటీలో చూసేందుకు ఎదురు చూస్తున్నారు. రేపు( శుక్రవారం) యశోద సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. హీరో నితిన్, కృతిశెట్టి హీరో,హీరోయిన్లుగా నటించిన చిత్రం 'మాచర్ల నియోజకవర్గం'. ఆగస్ట్ 12న థియేటర్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించినస్థాయిలో రాణించలేకపోయింది. ఎలాగైన ఈసారి హిట్ కొట్టాలని ఎదురు చూసిన నితిన్‌కు నిరాశే మిగిలింది. థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ 'జీ 5'లో డిసెంబరు 9 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. హీరో అల్లు శిరీష్, అను ఇమ్మానుయేట్ జంటగా నటించిన చిత్రం ఊర్వశివో రాక్షసివో. రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఈ సినిమా శిరీష్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. లవ్, రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం యూత్‌ను బాగా ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వడానికి రెడీ అయింది.డిసెంబర్ 9 నుంచి ‘ఆహా’లో ప్రీమియర్ కానుంది. పెళ్లి మంచిదా.. లివ్ ఇన్ రిలేషన్ షిప్ మంచిదా అనే దానిపై ఎవరికీ స్పష్టమైన అభిప్రాయాన్ని చెప్పలేరు. అలాంటి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రమే ఊర్వశివో రాక్షసివో. థియేటర్లో మిస్ అయిన వాళ్లు ఓటీటీలో చూసేయండి మరి. -
ఓటీటీలోకి సమంత యశోద.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే..
సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం యశోద. లేడీ ఓరియెంటెడ్ కథాంశంగా తెరకెక్కిన ఈ చిత్రానికి హరి-హరీష్ దర్శకత్వం వహించారు. నవంబర్11న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. రూ. 30కోట్లకు పైగా వసూళ్ల రాబట్టి సత్తా చాటింది. ముఖ్యంగా సమంత నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతూనే సమంత ఈ చిత్రానికి డబ్బింగ్ కంప్లీట్ చేయడం మరో విశేషం. ఇదిలా ఉంటే, ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే యశోద ఓటీటీలోకి రావాల్సి ఉండగా ఈవా వివాదంతో ఓటీటీ రిలీజ్‌కు బ్రేక్ పడింది. దీంతో ఆ ఆస్పత్రి వర్గాలతో యశోద మేకర్స్ చర్చించి సమస్యను పరిష్కారించారు. ఇక ఇప్పుడు లైన్ క్లియర్ అవడంతో యశోదను స్ట్రీమింగ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈనెల 9న యశోద చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు టాక్ వినిపిస్తుంది. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. -
సమసిన ‘ఇవ–యశోద’ చిత్ర వివాదం
సాక్షి,సిటీబ్యూరో: సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘యశోద’ చిత్ర విషయంలో నిర్మాత, దర్శకులు, ‘ఇవ–ఐవీఎఫ్’ సంస్థ మధ్య తలెత్తిన వివాదం శుక్రవారం సిటీ సివిల్ కోర్టు లోక్ అదాలత్ సమక్షంలో సుఖాంతంగా ముగిసింది. రెండో అదనపు చీఫ్ జడ్జ్ కె.ప్రభాకర్ రావు చొరవతో ఇరు వైపుల నుంచి సానుకూల స్పందన రావడంతో న్యాయస్థానంలో ఈ సమస్య రాజీ మార్గంలో సమసిపోయింది. ‘ఇవ–ఐవీఎఫ్’ సంస్థను కించపరచాలనే ఉద్దేశం తమకు లేదని, చిత్రం షూటింగ్ సమయంలో ట్రేడ్ మార్క్ విషయంలో తెలియక జరిగిన పొరపాటు వల్లనే ఈ వివాదం తలెత్తిందని నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ఇకపై సంస్థకు ఎలాంటి నష్టం జరగకుండా ఆ సంస్థ పేరును ఉచ్చరించే డైలాగులను, సంస్థ లోగో దృశ్యాలను చిత్రం నుంచి తొలగిస్తున్నట్లు ‘ఇవ–ఐవీఎఫ్’ యాజమాన్యానికి తెలియజేయడంతో పాటు రాత పూర్వక హామీ ఇచ్చారు. దీంతో సిటీ సివిల్ కోర్టులో ‘ఇవ–ఐవీఎఫ్’ దాఖలు చేసిన పిటిషన్‌ను మేనేజింగ్ డైరెక్టర్ మోహన్‌రావు చిత్ర బృందంతో ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా రాజీ పడి ఉపసంహరించుకున్నారు. ‘ఇవ–ఐవీఎఫ్’ ప్రతిష్టను దిగజార్చేలా చిత్రంలో సన్నివేశాలున్నాయంటూ మోహన్‌రావు నవంబరు మూడో వారంలో సిటీ సివిల్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. దీన్ని విచారించిన రెండవ అదనపు చీఫ్ జడ్జి కె.ప్రభాకర రావు డిసెంబరు 30 వరకు ఓటీటీ ప్లాట్ఫారంలో యశోద చిత్రాన్ని విడుదల చేయవద్దంటూ ఆదేశాలు జారీచేశారు. -
‘యశోద’లో ఇకపై ఆ పదం కనబడదు: శివలెంక కృష్ణ ప్రసాద్
యశోద మూవీ వివాదంపై తాజాగా నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ స్పందించారు. ఈ సినిమాతో తమ సంస్థ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిందని ఈవా హాస్పిటల్ ఎండీ మోహన్‌రావు యశోద మూవీ నిర్మాత, హీరోయిన్ సమంత, డైరెక్టర్స్ హరీశ్ నారాయణ్, హరి శంకర్‌లపై రూ. 5 కోట్ల పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వివాదంపై నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మీడియా సమావేశంలో మాట్లాడారు. మా సినిమాలో ఈవా అనే పేరు నీ కాన్సెప్ట్ ప్రకారం పెట్టింది. వేరొకరి మనో భావాలను దెబ్బతీయడానికి కాదు. ఈవా హాస్పిటల్ వారిని నేను కలిసి జరిగినది చెప్పాను. ఇక భవిష్యత్లులో ఈవా అనే పదం యశోద సినిమాలో కనపడదు. మా నిర్ణయాన్ని ఈవా వారు కూడా అంగీకరించారు. ఈ సమస్య ఇంతటితో పరిష్కారం అయ్యింది. ఇది తెలియక జరిగిన పొరపాటు’ అంటూ చెప్పుకొచ్చారు. అనంతరం హాస్పిటల్ ఎండీ మోహన్ రావు మాట్లాడుతూ.. ‘యశోద లో మా హాస్పిటల్ పేరు వాడటంతో మేము హర్ట్ అయ్యాము. నిర్మాత చాలా తొందరగా సమస్యను క్లియర్ చేశారు. దీంతో సమస్య పరిష్కారం అయ్యింది. డాక్టర్స్ అందరూ కూడా ప్రాణాలు కాపాడాలని కోరుకుంటారు. సినిమా వాళ్లు కూడా మా ప్రొఫెషన్‌ను గౌరవించాలి. ఇప్పటికీ ఎవరికైనా ఏదైనా జరిగితే ఠాకూర్ సినిమా లాగా జరిగింది అంటారు. సినిమా చాలా బలమైన మాధ్యమం’ అని ఆయన పేర్కొన్నారు. చదవండి: ‘కశ్మీర్ ఫైల్స్’పై ఇఫి జ్యూరీ హెడ్ సంచలన వ్యాఖ్యలు, స్పందించిన డైరెక్టర్ పెళ్లికూతురైన అదితి ప్రభుదేవ.. ప్రముఖ పారిశ్రామికవేత్తతో ఘనంగా వివాహం -
‘యశోద’ సినిమాపై పరువు నష్టం దావా
బంజారాహిల్స్: యశోద సినిమాతో తమ సంస్థ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిందని.. చిత్ర నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్, దర్శకులు హరీష్ నారాయణ్, హరిశంకర్, నటి సమంతపై రూ.5 కోట్ల పరువు నష్టందావా వేసినట్లు ఇవ–ఐవీఎఫ్ ఎండీ మోహన్‌రావు వెల్లడించారు. గురువారం బంజారాహిల్స్‌లోని ఓ హోటల్లో ఇవ ఐవీఎఫ్ డైరెక్టర్ డాక్టర్ ఐశ్వర్యతో కలిసి మీడియాతో మాట్లాడారు. సినిమాలో సరోగసీ స్కాంను వెలికి తీసే దృశ్యాల్లో తమ సంస్థ పేరును వాడుకుని తప్పుచేశారన్నారు. ఎటువంటి అనుమతి లేకుండా సినిమాలో ఇవ ఐవీఎఫ్ పేరు ను పలుచోట్ల ప్రస్తావించడంతోపాటు దృశ్యాల్లోనూ తమ ఆస్పత్రిని చూపించారని ఆరోపించారు. ఇదీ చదవండి: సమంత ‘యశోద’కు భారీ షాక్.. ఓటీటీ విడుదల ఆపాలంటూ కోర్టు ఆదేశం! -
సమంత ‘యశోద’కు భారీ షాక్.. ఓటీటీ విడుదల ఆపాలంటూ కోర్టు ఆదేశం!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన లెటెస్ట్ మూవీ ‘యశోద’. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి హరి, హరీష్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య నవంబర్ 11 థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో డీసెంట్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీని థియేటర్స్‌లో మిస్ అయినవాళ్లు ఓటీటీలో చూసేందుకు ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ రెండో వారంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ ఈ లోపే యశోద మేకర్స్‌కి ఊహించని దెబ్బ తగిలింది. ఈ సినిమా ఓటీటీ విడుదలను నిలిపివేయాలంటూ సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 19 వరకు ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడానికి వీల్లేదని సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కారణామేంటి? యశోద సినిమాలో సరోగసీ ఫెర్టిలిటీ సెంటర్‌కు ‘ఈవా’అని పేరు పెట్టారు. అందులో అన్ని అక్రమాలు జరిగినట్లు చూపించారు. అయితే సినిమాలో తమ ఆస్పత్రి పేరు చూపించడం వల్ల తమ ప్రతిష్ట దెబ్బతిన్నదంటూ ‘ఈవా హాస్పిటల్’ యాజమాన్యం సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేసింది. ఈ సినిమా ఓటీటీ విడుదలను అడ్డుకోవాలని కోరింది. దీంతో సిటీ కోర్టు యశోద నిర్మాణ సంస్థకు నోటీసులు జారీ చేసి.. డిసెంబర్ 19 వరకు ఓటీటీలో చిత్ర ప్రదర్శన చేయకూడదని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 19కి వాయిదా వేసింది. -
ఓటీటీలోకి ‘యశోద’ వచ్చేది అప్పుడేనా?
స్టార్ హీరోయిన్ సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా 'యశోద'. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి హరి, హరీష్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య నవంబర్ 11 థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో డీసెంట్ హిట్‌గా నిలిచింది. సమంత నటనపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్స్‌ని రాబట్టలేకపోయిందని టాలీవుడ్ టాక్. (చదవండి: ఓటీటీకి 'కాంతార'.. ఆ వివాదం వల్లే ఆలస్యమవుతోందా ?) ఇదిలా ఉంటే.. ఈ చిత్రం ఓటీటీ అప్డేట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ‘యశోద’ సినిమా స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ రెండో వారంలో ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.అయితే దీనిపై ఇంకా అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది. సరోగసీ నేపథ్యంలో థ్రిల్లర్ కథాంశంగా తెరకెక్కిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించగా, ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. -
యశోద : యాక్షన్ సీన్స్ ఇరగదీసిన సమంత.. మేకింగ్ వీడియో రిలీజ్
సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా యశోద. ఈనెల 11న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. హరి–హరీష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు. సరోగసి నేపథ్యంలో థ్రిల్లర్ కథాంశంగా తెరకెక్కిన ఈ సినిమా సమంత నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. యాక్షన్ సన్నివేశాల్లో స్టార్ హీరోకు ఏమాత్రం తగ్గకుండా సమంత తన నటనతో అభిమానులను మెప్పించింది. డూప్‌లు లేకుండా యాక్షన్ సీన్స్‌లోనూ చెలరేగిపోయింది. ఇప్పటికీ సక్సెస్‌ఫుల్‌గా థియేటర్స్‌లో రన్ అవుతుందీ చిత్రం. తాజాగా మూవీ టీం ది యాక్షన్ జర్నీ ఆఫ్ యశోద పేరుతో ఓ వీడియోను విడుదల చేశారు. యశోద రిలీజ్‌కు ముందు సుమతో సమంత ఇంటర్వ్యూ, మేకింగ్ షాట్స్‌ను కలిపి ఓ వీడియోను వదిలారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. -
ఇది నాకు లభించిన గొప్ప బహుమతి.. సమంత ఎమోషనల్ పోస్ట్
సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'యశోద'. సరోగసి నేపథ్యంలో థ్రిల్లర్ కథాంశంగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాల్లో స్టార్ హీరోకు ఏమాత్రం తగ్గకుండా సమంత తన నటనతో అభిమానులను మెప్పించింది. ప్రతి సీన్లో సమంత అద్భుతమైన నటనతో ఆకట్టుకుందంటూ సామ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ఫ్యాన్స్‌కు సమంత కృతజ్ఞతలు తెలిపారు. యశోద సక్సెస్‌పై తాజాగా ఎమోషనల్ ట్వీట్ చేసింది. అది కాస్తా సోషల్ మీడియాలో వైరలవుతోంది. (చదవండి: సమంత నటించిన 'యశోద' మేకింగ్ వీడియో చూశారా?) ప్రియమైన ప్రేక్షకులకు.. 'యశోద' మూవీపై మీరు చూపిస్తున్న ప్రేమ, ఆదరణకు ధన్యవాదాలు. మీ ప్రశంసలు, మద్దతు నాకు లభించిన గొప్ప బహుమతి. సినిమాకు వస్తున్న స్పందన నాకెంతో సంతోషాన్ని ఇస్తోంది. చిత్రాన్ని ప్రదరిస్తున్న థియేటర్లలో మీ సంబురాలు చూశా. సినిమా ఎలా ఉందో మీరు చెప్పిన మాటలు విన్నా. దీని వెనుక మా చిత్ర బృందం నిర్విరామంగా పడిన కష్టం కనిపిస్తోంది. ఇప్పుడు నా మనసు గాల్లో తేలుతున్నట్టుగా ఉంది. 'యశోద' ప్రాజెక్టులో భాగస్వామ్యం అయిన వాళ్లందరికీ థాంక్స్. నా పైన నమ్మకముంచిన నిర్మాత, శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్, దర్శకులు హరి, హరీష్, వరలక్ష్మీ శరత్ కుమార్,ఉన్ని ముకుందన్, చిత్రబృందానికి నా కృతజ్ఞతలు' అంటూ ట్వీట్ చేసింది. 🙇♀️🙇♀️🙇♀️#Yashoda pic.twitter.com/O6xdboY0AT — Samantha (@Samanthaprabhu2) November 18, 2022 -
సమంత ఒప్పుకుంటే.. ‘యశోద’ సీక్వెల్ తీస్తాం: హరి, హరీష్
‘‘యశోద’ చిత్రాన్ని ఫిమేల్ ఓరియంటెడ్‌గా చేయాలనుకోలేదు. కొత్త పాయింట్‌ని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో చేశాం. మంచి సినిమా తీస్తే విజయం అందిస్తామంటూ మా నమ్మకాన్ని నిజం చేసిన ఆడియన్స్‌కి థ్యాంక్స్’’ అన్నారు శివలెంక కృష్ణప్రసాద్. సమంత టైటిల్ రోల్లో హరి, హరీష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘యశోద’. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ– ‘‘సమంతగారి వన్ విమన్ షో ‘యశోద’. ఈ చిత్రం సీక్వెల్ గురించి చాలామంది అడుగుతున్నారు.. ఆ ప్రయత్నం హరి, హరీష్ నుంచి రావాలి. మా మూవీ ఫస్ట్ డే ఆరున్నర కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మూడు రోజుల్లోనే 20 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.. అమెరికాలో హాఫ్ మిలియన్ మార్క్ చేరుకుంది’’ అన్నారు. ‘‘మాకు ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు వరలక్ష్మీ శరత్‌కుమార్. హరి, హరీష్ మాట్లాడుతూ– ‘‘యశోద’ మా తొలి తెలుగు చిత్రం. ‘యశోద 2’ విషయంలో మాకు ఒక ఐడియా ఉంది. సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్‌కు లీడ్ కూడా ఉంది. అయితే సీక్వెల్ సమంతగారిపై ఆధారపడి ఉంది’’ అన్నారు. మాటల రచయితలు పులగం చిన్నారాయణ, చల్లా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ– ‘‘మీరు రాయగలరు.. రాయండి. మీ సక్సెస్ చూడాలని ఉంది’’ అని మమ్మల్ని ప్రోత్సహించిన కృష్ణప్రసాద్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు. ‘యశోద’ని హిందీలో రిలీజ్ చేసిన యూఎఫ్ఓ లక్ష్మణ్, క్రియేటివ్ డైరెక్టర్ హేమాంబర్ జాస్తి, ఆర్టిస్టులు కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంక శర్మ, మధురిమ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత రాజా సెంథిల్, ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా.. యశోద నటి ఎమోషనల్ పోస్ట్
క్రాక్, నాంది వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది నటి వరలక్ష్మి శరత్ కుమార్. వైవిధ్య కథలను ఎంచుకుంటూ తనదైన శైలిలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. లేడీ ఓరియంటెడ్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న ఆమె నటిస్తున్న తాజాగా యశోద మూవీలో నటించింది. ఆమె సినీ ప్రయాణం మొదలై 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోషల్‌మీడియాలో ఏమోషనల్ పోస్ట్ చేసింది. ఈ మేరకు ఓ లేఖ విడుదల చేసింది. (చదవండి: యంగ్ హీరో నాగశౌర్యకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు) వరలక్ష్మీ శరత్ కుమార్ లేఖలో ప్రస్తావిస్తూ.. 'సరిగ్గా పదేళ్ల క్రితం ఇదే రోజు నా మొదటి సినిమా విడుదలైంది. ఇప్పుడు యశోద చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ దశాబ్ద కాలంలో నా సినీ ప్రయాణం సులభంగా, అనుకున్న విధంగా సాగలేదనే చెప్పాలి. పదేళ్లలో ఎన్నోసార్లు అవమానాలు ఎదుర్కొన్నా. అయినా ఎక్కడా వెనకడుగు వేయలేదు. వాటినుంచి ఎన్నో విలువైన విషయాలు నేర్చుకున్నా. దశాబ్ద కాలంగా ఎంతో కృషి చేశా. వెనక్కి తిరిగి చూసుకుంటే 45 సినిమాల్లో నటించి నేనెంటో నిరూపించుకున్నా. అలాగే నన్ను తిరస్కరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు' అంటూ ఎమోషనల్ లేఖ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నా కెరీర్ కష్టకాలంలో అండగా నిలిచిన దర్శక నిర్మాతలకు, కుటుంబసభ్యులకు వరలక్ష్మీ శరత్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. Thank you ❤️#10years #blessed #grateful pic.twitter.com/AJ6x57MLRg — 𝑽𝒂𝒓𝒂𝒍𝒂𝒙𝒎𝒊 𝑺𝒂𝒓𝒂𝒕𝒉𝒌𝒖𝒎𝒂𝒓 (@varusarath5) November 13, 2022 -
యశోద మూవీ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ తో " స్పెషల్ చిట్ చాట్ "
-
అందుకే ప్రెగ్నెంట్‌గా నటించడానికి ఒప్పుకున్నా : కల్పికా గణేష్
సమంత టైటిల్ రోల్ చేసిన చిత్రం ‘యశోద’. హరి–హరీష్ తెరకెక్కింన ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలు పోషించగా, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ కీలక పాత్రలు చేశారు. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన విలేకర్ల సవవేశంలో కల్పికా గణేష్ మాట్లాడుతూ– ‘‘కొన్ని సినిమాల్లో నేను లీడ్ రోల్స్ చేస్తున్నప్పటికీ ‘యశోద’ వంటి కథ అందరికీ తెలియాలని ఈ సినివలో గర్భవతిగా ముఖ్య పాత్ర చేసేందుకు ఒప్పుకున్నాను’’ అన్నారు.‘‘యశోద’లాంటి కథలు అరుదుగా వస్తాయి’’ అన్నారు ప్రియాంకా శర్మ. ‘‘లీల క్యారెక్టర్ బాగా చేశావని సమంతగారు చెప్పడాన్ని నేను బెస్ట్ కాంప్లిమెంట్‌గా భావిస్తున్నాను’’ అన్నారు దివ్య శ్రీపాద. -
యశోద మూవీపై గుణశేఖర్ ట్వీట్.. సామ్ రిప్లై ఇదే..!
హీరోయిన్ సమంత నటనపై ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈనెల 11న విడుదలైన 'యశోద' మూవీలో ఆమె నటన అద్భుతంగా ఉందన్నారు. ఈ మేరకు సామ్‌ను అభినంందిస్తూ ట్వీట్ చేశారు. సినిమాలో యాక్షన్ సన్నివేశాల్లో ఆమె నటన ఆసక్తికరంగా సాగిందని కొనియాడారు. యశోద మూవీ ప్రారంభంలో అమాయకపు అమ్మాయిలా చూపించి.. కథలో రాబోయే ట్విస్ట్‌లకు తగినట్లుగా ఆమె తీర్చిదిద్దారు. ఈ సినిమా విజయం సమంత కెరీర్లో మరో కిరీటంగా నిలిచిందంటూ అభినందించారు. (చదవండి: Yashoda Movie Review: ‘యశోద’ మూవీ రివ్యూ) గుణశేఖర్ అభినందించడంతో కథానాయిక సమంత సైతం రిప్లై ఇచ్చింది. సమంత స్పందిస్తూ..' థ్యాంక్యూ గుణశేఖర్ సార్. నేను శాకుంతలం కోసం ఎదురుచూస్తున్నా. నేను ఏదైతే మ్యాజిక్ చూశానో అదే ప్రేక్షకులకు చూపించేందుకు ఇకపై వేచి ఉండలేను' అంటూ రాసుకొచ్చింది. దీంతో సమంత అభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు. మేమంతా శాకుంతలం కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. మూవీ అప్డేట్స్ త్వరగా ఇవ్వాలని కోరుతున్నారు. యశోద చిత్రంలో సామ్ నటనను మెచ్చుకుంటూ నెటిజన్లు సైతం పోస్టులు పెడుతున్నారు. కాగా.. ‘శాకుంతలం’ విషయానికి వస్తే కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శకుంతల, దుష్యంత మహారాజుల ప్రణయ గాథ నేపథ్యంలో సినిమా సాగనుంది. ఈ సినిమాలో దేవ్ మోహన్, అల్లు అర్హ కీలకపాత్రల్లో నటించారు. Thankyou @Gunasekhar1 sir 🙏 Can’t wait for #Shaakuntalam especially after what I have seen 🙇♀️ https://t.co/5JxqPNdLWE — Samantha (@Samanthaprabhu2) November 12, 2022 #Yashoda is gripping ,keeps us intrigued. @Samanthaprabhu2 performance stands out with intensity, her efforts in d action sequences tailored to suit her physique & her innocent persona in d beginning sets d stage for the twists that follow. Another feather to your cap #Samantha pic.twitter.com/qFgPWA0RHw — Gunasekhar (@Gunasekhar1) November 12, 2022 -
‘యశోద’ ఫస్ట్‌డే కలెక్షన్స్ .. సమంత క్రేజ్ మాములుగా లేదుగా!
స్టార్ హీరోయిన్ సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా 'యశోద'. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి హరి, హరీష్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య శుక్రవారం(నవంబర్ 11) విడుదలైన ఈ చిత్రానికి తొలి రోజు మంచి స్పందన లభించింది. సరోగసీ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో సమంత పోరాట ఘట్టాలు ప్రేక్షలను మెప్పించాయి. టీజర్, ట్రైలర్‌కు భారీ స్పందన లభించడంతో తొలిరోజు భారీ అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకున్నారు. ఫలితంగా ఫస్ట్‌డే ఈ చిత్రానికి మంచి వసూళ్లే వచ్చాయి. (చదవండి: ‘యశోద’ మూవీ రివ్యూ) ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం యశోద చిత్రం మొదటి రోజు దేశవ్యాప్తంగారూ. 3.25 కోట్లు కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల విషయానికొసే.. నైజాంలో రూ.84 లక్షలు, సీడెడ్‌లో రూ.18 లక్షలు, ఆంధ్రాలో రూ.63 లక్షలు వసూలు చేసింది. ఇక ఇతర ప్రాంతాల విషయానికొస్తే.. తమిళనాడులో రూ.14 లక్షలు, మలయాళంలో రూ.10 లక్షలు, కర్ణాటక, రెస్టాఫ్ ఇండియాలో కలిసి రూ.20 లక్షల వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్లో రూ.84 లక్షలు కలుపుకుంటే ఈ చిత్రం మొత్తంగా రూ.3.25 కోట్లు వసూళ్లు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఇది సమంత క్రేజ్‌కి ఎక్కువనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలకు సైతం తొలి రోజు ఈ స్థాయి కలెక్షన్స్ రావడంలేదు. ఆ విషయంలో సమంత సక్సెస్ సాధించనట్లే. కానీ యశోదకు అయిన బిజినెస్ దృష్ట్యా ఈ వసూళ్లు తక్కువని ఈ సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. యశోద చిత్రానికి రూ.21 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం రూ.22.5కోట్లు రాబట్టాల్సి ఉంటుంది. తొలి రోజు రూ.3.25 కోట్లు రాబట్టడంతో ఈ సినిమా ఇంకా రూ.19.25ట్లు వసూళ్లు చేయాల్సి ఉంటుంది. -
సమంత యశోద మూవీ.. ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్..!
సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'యశోద'. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో సందడి చేస్తోంది. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి హరి, హరీష్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఉన్ని ముకుందన్ కీలక పాత్ర పోషించారు. అయితే తాజాగా ఈ చిత్రం తన డిజిటల్ పార్ట్నర్ను ఫిక్స్ చేసుకుంది. (చదవండి: Yashoda Twitter Review: యశోద ట్విటర్ రివ్యూ) సమంత 'యశోద' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఈ సినిమా దాదాపుగా మొదటి రోజే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇందులో సమంత గర్భవతిగా నటించడంతో ఫస్ట్‌లుక్ రిలీజ్ అయినప్పటి నుంచే సినిమాపై అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. ఈ మూవీలో రావు రమేష్, సంపత్, మురళీ శర్మ, కల్పిక, వరలక్ష్మి శరత్‌కుమార్, దివ్య శ్రీపాద ముఖ్య పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. -
సమంత నటించిన 'యశోద' మేకింగ్ వీడియో చూశారా?
సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా యశదో. సరోగసి నేపథ్యంలో థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం నేడు(శుక్రవారం)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విమెన్ సెంట్రిక్ మూవీ అయినప్పటికీ యాక్షన్ సన్నివేశాల్లో స్టార్ హీరోకు ఏమాత్రం తగ్గకుండా సమంత తన నటనతో మెస్మరైజ్ చేసిందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. ఇక చూసిన ప్రేక్షకులు సైతం సమంత డెడికేషన్ చూసి ఫిదా అవుతున్నారు. ప్రతి ఫ్రేములో సమంత తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుందంటూ సామ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇదిలా ఉండగా యశోద సినిమా నుంచి ఓ మేకింగ్ వీడియోను వదిలారు. శత్రువుల బారి నుంచి యశోద తప్పించుకుని ఒక అడవిలో పరిగెడుతూ ఉండగా,ఆమెను ఒక వేట కుక్క వేటాడటం వంటివి థ్రిల్లింగ్‌గా కనిపిస్తుంది. ఈ సీన్‌ను ఎలా షూట్ చేసారన్నది వీడియోలో చూడొచ్చు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. చదవండి: సమంత చేతికి ఆ ఉంగరాలు? దోషం వల్లే ఇలా చేస్తుందా? -
‘యశోద’ మూవీ పబ్లిక్ టాక్
-
సమంత చేతికి ఆ ఉంగరాలు? దోషం వల్లే ఇలా చేస్తుందా?
స్టార్ హీరోయిన్ సమంత నటించిన ఉమెన్ సెంట్రిక్ మూవీ యశోద. ఈ సినిమా నేడు(శుక్రవారం)ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఆరోగ్యం బాలేకపోయినా ఆమెయశోద ప్రమోషన్స్‌లో పాల్గొంది. ఈ క్రమంలో సమంత చేతికి ధరించిన ఉంగరాళ్లపై ప్రత్యేకంగా దృష్టి పడింది. ఎప్పుడూ డిజైనర్ వేర్ జ్యువెలరీలో కనిపించే సామ్ తొలిసారిగా ఇలా జాతకాల ప్రకారం రంగురాళ్లను ధరించడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం శారీరకంగా, మానసికంగా భాదపడుతున్న సమంత 'మయోసైటిస్' అనే వ్యాధితో పోరాడుతున్న సంగతి తెలిసిందే. గత కొన్నాళ్లుగా తన జీవితంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా సమంత ఈమధ్యకాలంలో జాతకాలను కూడా నమ్ముతున్నట్లు తెలుస్తుంది. అందుకే ఆమె చేతికి రంగురాళ్లను ధరించనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమె ధరించిన ఉంగరాల్లో ఒకటి కనకపుష్యరాగం ఒకటి. ఇది సంపద, ఆరోగ్యానికి శుభసూచికంగా భావిస్తారట. దీంతో పాటు ఆమె గోమేధకం అనే మరో ఉంగరాన్ని కూడా ధరించింది. ఇది చెడు దృష్టి నుంచి కాపాడుతుందట. దీన్ని ధరించిన వారికి శారీరకంగా, మానసికంగా సత్పలితాలు ఉంటాయట. ఇక సమంత ధరించిన మరో ఉంగరం ముత్యం.. ఇది చంద్రుడు ఒక్కో క్షణంలో బలహీనంగా మారినపుడు ఆ ప్రభావం మన ఆరోగ్యం పై పడకుండా ఉండేలా ఈ ఉంగరాన్ని ధరిస్తారట. మొత్తానికి దీన్ని బట్టి సమంత సెంటిమెంట్లను బాగానే ఫాలో అవుతుందనే టాక్ వినిపిస్తుంది. -
Yashoda Movie Review: ‘యశోద’ మూవీ రివ్యూ
టైటిల్: యశోద నటీనటులు: సమంత,వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ తదితరులు నిర్మాణ సంస్థలు: శ్రీదేవి మూవీస్ నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్ దర్శకత్వం: హరి-హరీష్ సంగీతం:మణిశర్మ సినిమాటోగ్రఫర్:ఎం. సుకుమార్ ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్ విడుదల తేది: నవంబర్ 11, 2022 ‘యశోద’ కథేంటంటే.. ఈ సినిమాలో రెండు కథలు సమాంతరంగా నడుస్తుంటాయి. ఒకవైపు ఇండియాకు వచ్చిన హాలీవుడ్ నటి ఒలివియా అనుమానస్పదంగా చనిపోతుంది. అలాగే టాప్ మోడల్ ఆరూషి, ప్రముఖ వ్యాపారవేత్త శివరెడ్డి కారుప్రమాదంలో మరణిస్తారు. ఈ కేసు దర్యాప్తు కోసం మిలటరీ ఆఫీసర్ వాసుదేవ్(సంపత్) టీమ్ రంగంలోకి దిగుతుంది. మరోవైపు పేదింటికి చెందిన యశోద(సమంత) తన చెల్లి ఆపరేషన్ కోసం సరోగసీ(అద్దెగర్భం)ని ఎంచుకుంటుంది. ఆమె కడుపున పుట్టబోయే బిడ్డ కోటీశ్వరుల ఇంటికి వెళ్తుందని..ఆమెను ఆరోగ్యంగా ఉంచేందుకు సరోగసీ ఫెర్టిలిటీ సెంటర్ ‘ఈవా’కి తరలిస్తారు. అక్కడ అందరూ అద్దెగర్భం దాల్చిన వాళ్లే ఉంటారు. వీరి బాగోగులను చూసుకునేందుకు మధు(వరలక్ష్మీ శరత్‌కుమార్), డాక్టర్ గౌతమ్(ఉన్ని ముకుందన్) ఉంటారు. యశోద ‘ఈవా’కి వెళ్లిన తర్వాత అక్కడ ఏం జరిగింది? అనుమానస్పదంగా మరణించిన హాలీవుడ్ నటి ఓలివియాకి, ఈ సరోగసీ ఫెర్టిలిటీ సెంటర్‌కు ఏదైన సంబంధం ఉందా? మోడల్ ఆరూషి నిజంగానే కారుప్రమాదంలో మరణించిందా?లేదా ఎవరైనా హత్య చేశారా? ప్రపంచంలో ధనవంతులైన మహిళలు రహస్యంగా ఇండియా ఎందుకు వస్తున్నారు? ఈ కథలో కేంద్రమంత్రి గిరిధర్ పాత్ర ఏంటి? అసలు యశోద నేపథ్యం ఏంటి అనేది థియేటర్స్‌లో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఎలా ఉందంటే.. 'యశోద' ఎమోషనల్ థ్రిల్లర్ మూవీ. వాస్తవ సంఘటనల ఆధారంగా దర్శకద్వయం హరి, హరీష్ ఈ కథను రాసుకున్నారు. కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది. ట్విస్టులు ఉంటాయి. ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు, యాక్షన్..అన్ని ఉంటాయి. కానీ ఎక్కడో ఏదో మిస్ అయిందనే ఫీలింగ్ కలుగుతుంది. థ్రిల్లింగ్ సీన్స్‌ని ప్రేక్షకుడు ఆస్వాదించలోపే.. లాజిక్ లేని సన్నివేశాలు చిరాకు కలిగిస్తాయి. ఈవాలో యశోద చేసే పనులు విలన్ గ్యాంగ్‌కు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ.. చూసి చూడనట్లు వదిలేయడం. సీసీ కెమెరాలు, సెక్యూరిటీ ఉన్నప్పటికీ ఆమె ఈజీగా బయటకు వెళ్లడం.. ఇలా చాలా సీన్లలో లాజిక్ ఉండదు. ఒక థ్రిల్లింగ్ సీన్ తర్వాత మరో ఎమోషనల్ సీన్ అన్నట్లుగా ఫస్టాఫ్ సాగదీతగా సాగుతుంది. ప్రీఇంటర్వెల్ నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. ఇక సెకండాఫ్ నుంచి వచ్చే ప్రతి సీన్ కొత్తగా ఉంటూ ఉత్కంఠ కలిగిస్తాయి. యశోద నేపథ్యం గురించి చెప్పే సీన్స్ ‘పోకిరి’తరహాలో ఉంటాయి. వరలక్ష్మీ శరత్ కుమార్ బ్యాక్‌స్టోరీ కూడా అంతగా ఆకట్టుకోదు. దానిని మరింత డెప్త్‌గా డిజైన్ చేస్తే బాగుండేదేమో. క్లైమాక్స్ కూడా రొటీన్‌గా ఉంటుంది. సమంత ఫ్యాన్స్‌కు నచ్చే అంశాలు ఈ చిత్రంలో చాలా ఉన్నాయి. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాకు ప్రధాన బలం సమంతనే. యశోద పాత్రలో నటించడం కంటే జీవించేసిందని చెప్పొచ్చు. యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టేసింది. ఈ సినిమా కోసం సమంత పడిన కష్టమంతా తెరపై కనిపిస్తుంది. ఇక సమంత తర్వాత బాగా పండిన పాత్రలు వరలక్ష్మీ శరత్‌కుమార్, ఉన్నికృష్ణలది. నెగెటివ్ షేడ్స్ ఉన్న మధు, డాక్టర్ గౌతమ్ పాత్రల్లో ఇద్దరూ పరకాయ ప్రవేశం చేశారు. పోలీసు అధికారిగా శత్రు, మిలటరీ ఆఫీసర్ వాసుదేవ్‌గా సంపత్ చక్కటి నటనను కనబరిచారు. కేంద్రమంత్రి గిరిధర్ పాత్రకి రావురమేశ న్యాయం చేశాడు. కలికా గణేశ్, దివ్యలతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. ఈ సినిమాకు మరో ప్రధాన బలం మణిశర్మ సంగీతం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. ఆర్ట్ వర్క్, సినిమాటోగ్రఫీ బాగుంది. పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి మాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. పంచ్ కోసం కాకుండా కథలో భావాన్ని తెలియజేసేలా డైలాగ్స్ ఉంటాయి. యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగున్నాయి. ఎడిటర్ పనితీరు పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజిశెట్టి, సాక్షి వెబ్‌డెస్క్ -
Yashoda Twitter Review: యశోద ట్విటర్ రివ్యూ
సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా 'యశోద'. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి హరి, హరీష్ దర్శకత్వం వహించారు. ఇందులో సమంత గర్భవతిగా నటించడంతో ఫస్ట్‌లుక్ రిలీజ్ అయినప్పటి నుంచే సినిమాపై ఆసక్తి పెరిగింది. దానికి తోడు ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు నేడు(నవంబర్ 11) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘యశోద’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. అయితే ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’బాధ్యత వహించదు. డీసెంట్ ఎంగేజింగ్ ఎమోషనల్ థ్రిల్లర్ అంటూ యశోద మీద ప్రశంసలు కురిపిస్తున్నారు.సమంత తనదైన నటనతో సినిమా స్థాయిని పెంచేసిందటున్నారు. కాన్సెప్ట్ చాలా బాగుందని, విజువల్స్, యాక్షన్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయని చెబుతున్నారు. మణిశర్మ నేపథ్య సంగీతం సినిమాను నిలబెట్టిందని కామెంట్ చేస్తున్నారు. #Yashoda Review: Decent Engaging Emotional Thriller 👌#SamanthaRuthPrabhu is the lifeline of the film 👍 Other Cast were apt & good 👌 BGM is Superb 💯 Visuals & Action Scenes are good 👍 Concept 👏 Rating: ⭐⭐⭐/5#YashodaTheMovie #YashodaReview #Samantha pic.twitter.com/YZfACi5gua — Kumar Swayam (@KumarSwayam3) November 11, 2022 ఫస్టాఫ్ డీసెంట్‌గా ఉందని, ప్రీఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు వచ్చే సీన్స్, ట్వీస్ట్‌లు బాగుంటాయని కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి సమంత కష్టానికి తగిన ఫలితం లభించిందని నెటిజన్స్ అంటున్నారు. ఇంటర్వెల్‌కి ముందు వచ్చే 20 నిమిషాల సన్నివేశాలు మూవీకి హైలైట్ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. #Yashoda Decent 1st Half! Interesting storyline and setup with a good pre-interval to interval sequence. Good setup for the 2nd half. — Venky Reviews (@venkyreviews) November 11, 2022 #Yashoda - Engaging for the most part. Kottha concept, twists Chala baaga raasukunnaru, but aa twists reveal Inka manchiga construct/Present chesunte Inka bavundedhi. @Samanthaprabhu2 is awesome and all the technical crew did a solid Job. #Mani sir’s BGM 💥. — Thyview (@Thyview) November 11, 2022 #Yashoda Review POSITIVES: 1. #SamanthaRuthPrabhu 2. Casting 3. Concept 4. Action Scenes 5. Duration 6. Interval NEGATIVES: 1. Starting 20 mins 2. Lags Overall, #YashodaTheMovie works due to #SamanthaRuthPrabhu despite some flaws.#yashodareview #Samantha pic.twitter.com/L71zl31Did — Kumar Swayam (@KumarSwayam3) November 11, 2022 Got to know that @Samanthaprabhu2 was continuing her work for #Yashoda even after her health issues. Take a bow #SamanthaRuthPrabhu 👏 She holds the film together & provides us an edge of the swat experience 👌 Your efforts deserve respect 💯#yashodareview #YashodaTheMovie pic.twitter.com/UzIhlqJGbm — OTTRelease (@ott_release) November 11, 2022 #Yashoda 1st half: Good first half 👍 Director took his time to build the story in first 45 minutes slow some times and after 45 minutes story gets engaging. #Samantha is brilliant in her role. Perfect setup to start a thriller second half hope it will get even more engaging. pic.twitter.com/zlYOiaDxjB — MoviesOnReel (@MoviesOnReel1) November 11, 2022 #Yashoda Movie starts out routine but develops into a mystery thriller that keeps you on the edge @Samanthaprabhu2 action & BGM good overall good @Radhakrishnaen9 @varusarath5 @hareeshnarayan @krishnasivalenk @SrideviMovieOff @PulagamOfficial #SamanthaRuthPrabhu — శేఖర్/sekhar/ सेखर (@sekhar_pydijsp) November 11, 2022 -
చాలా నెర్వస్‌గా ఉంది..ఇక మీ చేతుల్లోనే.. సమంత పోస్ట్ వైరల్
సమంత ప్రస్తుతం మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. అనారోగ్యంతో ఉన్నప్పటికీ.. తాను నటించిన ‘యశోద’ మూవీ కోసం ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. ఏదో రకంగా సినిమాకి మాత్రం హైప్ వచ్చేలా చేసింది. రేపు(నవంబర్ 11) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా తాజాగా సామ్ తన ఇన్‌స్టా ఖాతాలో పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ అయింది. (చదవండి: సమంతకు మరో టెన్షన్.. ఇదే సరైన సమయం) ‘చాలా నెర్వస్‌గా ఉంది కానీ ఎక్సయిట్ అవుతున్నా! ఇంకా ఒక్కరోజే ఉంది. మీ అందరికి యశోద నచ్చాలని గట్టిగా కోరుకుంటున్నా. మీ తీర్పు కోసం నాలాగే నా దర్శకులు, నిర్మాతలు, సినిమా యూనిట్ మొత్తం వెయిట్ చేస్తోంది' అంటూ తన లేటెస్ట్ ఫోటోని షేర్ చేసింది. ప్రస్తుతం సామ్ పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పిక్‌లో ఆమె సమంతలా కనిపించటం లేదు.. పూర్తిగా మారిపోయింది. ఆమె చేతులు, వేళ్ళకు ఉన్న ముడతలు చూసి పాపం సమంత ఏంటి ఇలా అయిపోయిందని అభిమానులు బాధ పడుతున్నారు. త్వరగా కోలుకుని ఎప్పటిలానే ఆమె సినిమాలు చేయాలని.. ప్రార్థనలు చేస్తున్నారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ‘యశోద’ చిత్రానికి హరి, హరీష్ దర్శకత్వం వహించారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల అవుతోంది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
సమంత గ్లిజరిన్ కూడా వాడదు..'వన్ మోర్ కావాలా?' అని అడిగేవారు: 'యశోద' దర్శకులు
సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా 'యశోద'. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల అవుతోంది. ఈ సందర్భంగా దర్శక ద్వయం హరి, హరీష్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► తమిళంలో 'ఒరు ఇరవు', 'అంబులి', 'ఆ', 'జంబులింగం' సినిమాలు చేశాం. మా తొలి సినిమా 'ఒరు ఇరవు'లో హీరో హీరోయిన్లు ఉండరు. చూసే ప్రేక్షకులే హీరో. అది పాయింట్ ఆఫ్ మూవీ కావడంతో డిఫరెంట్ ఛాలెంజ్ ఫేస్ చేశాం. కానీ ‘యశోద’సినిమాని భారీ స్కేల్లో చేశాం. కంటెంట్ పరంగా ఛాలెంజెస్ ఈ సినిమాకూ ఉన్నాయి. కథ పరంగా ఎప్పుడూ కొత్త పాయింట్ చెప్పాలనేది మా ఉద్దేశం. కంటెంట్ ఎలా చెబుతున్నామనేది ముఖ్యం. ఇటువంటి కథకు అంత బడ్జెట్ అవసరం కూడా! సమంత, ఇతర తారాగణం, సాంకేతిక నిపుణులు వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా బడ్జెట్ పెరుగుతుంది. ►మొదట ‘యశోద’సినిమాని తక్కువ బడ్జెట్లో తీసేలా స్క్రిప్ట్ రాసుకున్నాం. కథని శివలెంక కృష్ణప్రసాద్ గారికి చెప్పినప్పుడు 'భారీ స్థాయిలో ఎందుకు చేయకూడదు?' అని అడిగారు. 'కంటెంట్ బాగుంది. గ్లోబల్ రీచ్ ఉంటుంది. ఐదు భాషల్లో పాన్ ఇండియా సినిమాగా చేద్దాం' అన్నారు. స్టార్ కాస్ట్ ఉన్నప్పుడు అలా చేయడం సాధ్యం అవుతుంది. సమంత గారిని కలిసిన తర్వాత భారీ స్కేల్లో చేయాలనుకున్నాం. మేం ఇద్దరం కలిసి డిస్కస్ చేసుకుని కథ రాశాం. కంటెంట్ విషయానికి వస్తే ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుంది. పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్‌లో ప్రేక్షకులకు కూడా కొత్తగా ఉంటుంది. టెక్నికల్ పరంగా కమర్షియల్ సినిమాలా ఉంటుంది. ► ఈ సినిమాలో సరోగసీ మెయిన్ స్టోరీ కాదు. కథలో అదొక భాగమంతే! అందుకే, ఓపెన్‌గా చెప్పేశాం. సరోగసీ కంటే కథలో ఇంకా ఉంది. వార్తల్లో చూసిన, చదివిన విషయాల ఆధారంగా స్క్రిప్ట్ రాశాం. సినిమా చూసినప్పుడు మీరు షాక్ అవుతారు. ► సమంతతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. ఎంత పెద్ద ఎమోషనల్ సీన్ అయినా సరే రెండు నిమిషాల సమయం అడుగుతారు. సెట్ అంతా సైలెన్స్ అయ్యాక ఈజీగా చేసేస్తారు. గ్లిజరిన్ కూడా వాడరు. మేం ఏం కోరుకొన్నామో... అది ఈజీగా ఇచ్చేసేవారు. ప్రతి 20 నిమిషాలకు సినిమాలో ఒక మూవ్ ఉంటుంది. సినిమా నెక్స్ట్ లెవల్ కు వెళుతుంది. సర్ప్రైజ్లు షాక్ ఇస్తాయి. మేం చేసిన సినిమాల్లో ఎమోషనల్ సీన్ ఇది. మహిళలు, మాతృత్వం గురించి చెప్పాం. సినిమాలో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. ఆవిడ చాలా బాగా చేశారు. 'మీకు ఓకేనా? వన్ మోర్ కావాలా?' అని అడిగేవారు. ► సమంత హెల్త్ కండిషన్ గురించి షూటింగ్ సమయంలో మాకు తెలియదు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరిగేటప్పుడు మాకు ఆ విషయం తెలిసింది. ఆవిడ వల్ల ఎప్పుడూ షూటింగ్ డిస్టర్బ్ కాలేదు. ఒక స్టంట్ సీన్ అద్భుతంగా చేశారు. ఆ రోజు సాయంత్రం ప్యాకప్ చెప్పేటప్పుడు ఆవిడకు జ్వరం ఉందని తెలిసింది. ఆవిడకు వర్క్ అంటే అంత డెడికేషన్. తన వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదని కోరుకుంటారు. యానిక్ బెన్ రెండు, వెంకట్ మాస్టర్ మూడు స్టంట్ సీన్స్ చేశారు. ► యశోద.. మెడికల్ మాఫియా తరహా సినిమా అనుకోవచ్చు. సరోగసీ మీద చాలా సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ టాపిక్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. మాకు అది సర్ప్రైజింగ్గా ఉంది. లాక్డౌన్లో చాలా మంది పేద మహిళలు డబ్బుల కోసం తమ గర్భాన్ని సరొగసీకి ఇచ్చారు. ట్విన్స్ పుడితే వాళ్ళకు ఎక్కువ డబ్బులు వస్తాయి. దానికి కూడా వాళ్ళు ఓకే అనేవారు. ► ఈ సినిమాలో సరోగసీ ఫెర్టిలిటీ సెంటర్‌కు'ఈవా' అని పేరు పెట్టాం. ఆ పేరు ఎందుకు పెట్టామో సినిమా చూస్తే తెలుస్తుంది. ఆ సెంటర్ గ్రాండ్ గా ఉండాలని ఊహించుకున్నాం. దాని కోసం హైదరాబాద్ సిటీలో స్టార్ హోటల్స్ అన్నీ చూశాం. మాకు షూటింగ్ చేయడానికి కొంచెం ఫ్రీడమ్ కావాలి. స్టార్ హోటల్స్ అంటే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అప్పుడు నిర్మాతను అడిగితే సెట్ వేద్దామన్నారు. ఆర్ట్ డైరెక్టర్ అశోక్ గారితో 'జురాసిక్ పార్క్'లా ఉండాలని చెప్పాం. ఆయన అద్భుతమైన స్కెచ్ ఇచ్చారు. కృష్ణప్రసాద్ గారు ఖర్చు విషయంలో రాజీ పడలేదు. పాన్ ఇండియా కాబట్టి అన్ని రాష్ట్రాల ప్రజలు కనెక్ట్ అయ్యేలా ఉండాలనుకున్నాం. మెజారిటీ షూటింగ్ నానక్‌రామ్ గూడాలో వేసిన సెట్స్‌లోనే చేశాం. సినిమాలో మొత్తం 30, 40 సెట్స్ ఉంటాయి. ► నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. మణిశర్మ, మార్తాండ్ కె. వెంకటేష్, సుకుమార్... ప్రతి ఒక్కరూ వంద, రెండొందల సినిమాలు చేశారు. మణిశర్మ గారు మాకు ఎంతో ఫ్రీడమ్ ఇచ్చారు. మార్తాండ్ కె వెంకటేష్ గారు క్రిస్పీగా ఎడిట్ చేశారు. క్రియేటివ్ డైరెక్టర్ హేమాంబర్ జాస్తి గారు (బుల్లి గారు) మాకు ఎంతో సపోర్ట్ చేశారు. ఆయనకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. కాస్టింగ్ డైరెక్టర్ పుష్ప గారు కూడా మంచి నటీనటులను ఎంపిక చేశారు. ► ఈ సినిమాకు పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి గార్లు తెలుగులో మాటలు రాశారు. తెలుగులో మా ఫీలింగ్ బాగా కన్వే చేశారు. మేం బౌండ్ స్క్రిప్ట్‌తో వాళ్ళను కలిశాం. ఆ తర్వాత వాళ్ళు చెప్పిన విషయాలు కొన్ని యాడ్ చేశాం. మా మధ్య పాజిటివ్ కన్వర్జేషన్స్ జరిగాయి. ఇద్దరూ జర్నలిస్ట్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చారు. వాళ్ళకు చాలా కమాండ్ ఉంది. బాగా చేశారు. మాకు కొంచెం తెలుగు వచ్చు. భాగ్యలక్ష్మి గారికి తెలుగు, తమిళం వచ్చు. పులగం గారు రాసింది ఆవిడ మాకు తమిళంలో వివరించేవారు. మా వర్క్ ఈజీ అయ్యింది. మహిళల కోణంలో ఆవిడ కొన్ని విషయాలు చెప్పారు. ► ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర చేశారు. కథను ఆవిడకు జూమ్ కాల్లో నేరేట్ చేశాం. 20 మినిట్స్ చెప్పాం. ఆవిడ మౌనంగా ఉంటే మాకు ఏమీ అర్థం కాలేదు. కథ అంతా విన్నాక 'మీకు ఇటువంటి ఐడియాస్ ఎక్కడ నుంచి వస్తాయి?' అని అడిగారు. 'మీకు కథ ఓకేనా?' అని అడిగితే చెప్పిన కథ స్క్రీన్ మీదకు తీసుకురమ్మని అన్నారు. ఆవిడను కొత్తగా చూస్తారు. ► ఎమోషన్‌తో కూడిన థ్రిల్లర్ 'యశోద' అని చెప్పవచ్చు. సినిమా మొత్తం చూశాక మాకు అదే అనిపించింది. ఈ విషయంలో రాజమౌళి గారు మాకు ఇన్స్పిరేషన్. ఆయన ప్రతి సన్నివేశంలో ఎమోషన్ ఉండాలని చెబుతారు. -
సమంతకు మరో టెన్షన్.. ఇదే సరైన సమయం!
సమంత ఎంతో ఇష్టపడి, కష్టపడి చేసిన సినిమా ‘యశోద’.నవంబర్ 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇందులో సమంత డూప్ లేకుండా యాక్షన్ సీన్స్ చేసింది. అనారోగ్యంతో ఉన్నప్పటికీ సెలైన్ బాటిల్ తో డబ్బింగ్ చెప్పింది. ఓ పక్క తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్నా రిస్క్ తీసుకొని మరీ ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేసింది. ఇదంతా ఎందుకు అని సమంతని అడిగితే.. ‘నన్ను నమ్మి సినిమా చేశారు కదా.. నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నా’అంటూ సింపుల్గాచెబుతోంది. (చదవండి: అడుగు కూడా ముందుకు వేయలేనోమో అనిపిస్తోంది.. సమంత కన్నీళ్లు) అది నిజమే మరి. సమంతని నమ్ముకొనే సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ అనుకున్న దానికంటే ఎక్కువే బడ్జెట్ పెట్టాడట. ఆమెకు ఉన్న ఇమేజ్ దృష్టా ఓవరాల్‌గా ఈ చిత్రానికి దాదాపు రూ. 24 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగిందట. ఓ ఫీమేల్ సెంట్రిక్ సినిమాకు ఇది పెద్ద టార్గెట్ అనే చెప్పొచ్చు. ఆ టార్గెట్‌ని సామ్ రీచ్ అవ్వాలంటే.. పాతిక కోట్ల షేర్ని రాబట్టాలి. సినిమాకు పాజిటివ్ టాక్ లభిస్తే ఆ టార్గెట్ ఈజీగా పూర్తవుతుందని సినీ వర్గాలు తెలుపుతున్నాయి. అయితే సమంత మాత్రం కాస్త టెన్షన్ పడుతుందట. తన సినిమా కచ్చితంగా అందరికి నచ్చుతుందనే నమ్మకం ఉన్నప్పటికీ.. భారీ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుందో లేదో అని ఎక్కడో చిన్న భయం ఆమెను వెంటాడుతుందట. ‘కథ విన్నప్పుడు నాకు గూస్ బంప్స్ వచ్చాయి. థ్రిల్ అయ్యాను. ప్రేక్షకులు కూడా అదే విధంగా థ్రిల్ అవుతారని, వాళ్ళకూ గూస్ బంప్స్ వస్తాయని ఆశిస్తున్నాను. సినిమాలో అంత పవర్ ఉంది. దర్శకులు హరి, హరీష్ కొత్త కాన్సెప్ట్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు’అని సామ్ గట్టి నమ్మకంతో చెబుతోంది. అయితే ఎవరు ఏం చెప్పినా.. అల్టిమేట్‌గా ప్రేక్షకులకు నచ్చితేనే సినిమా సూపర్ హిట్ అవుతుంది. మరి సామ్ చెప్పినట్లుగా ఈ సినిమా ఆడియన్స్‌ని సర్ప్రైజ్ చేస్తుందా లేదా అనేది మరో రెండు రోజుల్లో తేలిపోతుంది. ఒకవేళ సినిమా హిట్ అయితే మాత్రం సమంత పాన్ ఇండియా హీరోయిన్గా రాణించడమే కాకుండా.. ఇలాంటి ప్రయోగాలు మరిన్ని చేయడానికి ఆస్కారం ఉంది. -
ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే
ప్రతి వారం కొత్త సినిమాలు బాక్సాఫీసు వద్ద సందడి చేస్తుంటాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్ద హీరోల హడావుడి కనిపంచడం లేదు. గతవారం రిలీజ్ అయిన చిత్రాల్లో ఊర్వశివో రాక్షసివో మంచి విజయం సాధించింది. ఇక ఈ వారం స్టార్ హీరోయిన్ సమంత చిత్రంతో పాటు పలు చిన్న సినిమాలు థియేటర్లోకి రాబోతున్నాయి. అంతేకాదు పలు వెబ్ సరీస్‌లు, సినిమాలు కూడా ఓటీటీకి రాబోతున్నాయి. మరి ఈ వారం థియేటర్/ఓటీటీలోకి రాబోయే సినిమాలేంటో చూద్దాం! సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘యశోద’. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. ఇందులో ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్, రావూ రమేశ్‌తో పాటు తదితరులు కీలక పాత్రలో నటించారు. సరోగసి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది. అమితాబ్‌బచ్చన్, అనుపమ్ ఖేర్, బొమన్ ఇరానీ, పరిణీతి చోప్రా, నీనా గుప్తా, సారిక తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఊంచాయి’. ప్రేమ కథ నిండిన కుటుంబ చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించిన దర్శక-నిర్మాత సూరజ్ బర్జాత్య దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఒక విభిన్న కథతో రూపొందిన ఈ చిత్రం నవంబరు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఆటగదరా శివ’ ఫేమ్ ఉదయ్ శంకర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నచ్చింది గర్ల్ ఫ్రెండ్’. గురు పవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జెన్నీఫర్ హీరోయిన్. డా. సౌజన్య ఆర్. అట్లూరి సమర్పణలో అట్లూరి నారాయణరావు నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఒక రోజులో జరిగే ప్రేమకథగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర బృందం చెబుతోంది. సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో కూడిన ప్రేమకథ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచేందుకు సిద్ధమైంది. శ్రీరామ్ నిమ్మల, రిచా జోషి జంటగా నటించిన చిత్రం ‘మది’. నాగధనుష్ దర్శకత్వం వహించారు. రామ్‌కిషన్ నిర్మాత. పీవీఆర్ రాజా స్వరకర్త. యువతరానికి నచ్చే మంచి కథతో పాటు, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ‘మది’లో ఉన్నాయని చిత్ర బృందం చెబుతోంది. నవంబరు 11న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు అమెజాన్ ప్రైమ్: బ్రీత్ : ఇన్ టు ది షాడోస్ (హిందీ సిరీస్2) నవంబరు 9 ఇరావిన్ నిగళ్ (తమిళ చిత్రం) నవంబరు 11 సిక్సర్ (హిందీ సిరీస్) నవంబరు 11 డిస్నీ పస్ల్ హాట్‌స్టార్: సేవ్ ఔర్ స్క్వాడ్ (ఒరిజినల్ సిరీస్) నవంబరు 09 మనీ మాఫియా (హిందీ సిరీస్3) నవంబరు 10 రోషాక్ (తెలుగు) నవంబరు 11 నెట్ ఫ్లిక్స్: బిహైండ్ ఎవ్రీ స్టార్ (కొరియన్ సిరీస్)- నవంబర్ 8 ద క్లాజ్ ఫ్యామిలీ 2 (డచ్ సిరీస్)- నవంబర్ 8 ట్రివియా వర్స్ (ఇంగ్లీష్) -నవంబర్ 8 ది క్రౌన్ (సిరీస్ 5) ఇంగ్లీష్- నవంబర్ 9 ది సాకర్ ఫుట్ బాల్ (ఇంగ్లీష్)- నవంబర్ 9 ఫిఫా అన్ కవర్డ్(డాక్యుమెంటరీ)-నవంబర్ 9 ఫాలింగ్ ఫర్ క్రిస్మస్ (ఇంగ్లీష్)-నవంబర్ 10 లాస్ట్ బుల్లెట్ (ఫ్రెంచ్), నవంబర్ 10 వారియర్ నన్ (సిరీస్ 2)-నవంబర్ 10 లవ్ నెవర్ లైస్ (ఇంగ్లీష్)-నవంబర్ 10 ఈజ్ దట్ బ్లాక్ ఎనఫ్ ఫర్ యూ (ఇంగ్లీష్)-నవంబర్ 11 మోనికా ఓ మై డార్లింగ్ (హిందీ)-నవంబర్ 11 సోనీలివ్: తనవ్ – హిందీ సిరీస్- నవంబరు 11 జీ5: ముఖ్ బీర్ (సిరీస్ – హిందీ)-నవంబర్ 11 లయన్స్ గేట్ ప్లే హాట్‌సీట్ (హాలీవుడ్) నవంబరు 11 -
అడుగు కూడా ముందు వేయలేనేమో అనిపిస్తోంది.. సమంత కన్నీళ్లు
'యశోద'లో సమంత భావోద్వేగభరిత పాత్ర చేశారు. తనకు ఎదురైన పరిస్థితుల నుంచి బయట పడటం కోసం పోరాటం చేసే మహిళగా కనిపించనున్నారు. రియల్ లైఫ్‌లో కూడా సమంత ఫైటర్. మయోసైటిస్‌తో పోరాటం చేస్తూ, చికిత్స (సెలైన్) తీసుకుంటూ 'యశోద' డబ్బింగ్ పూర్తి చేశారు. హరి, హరీష్ దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల అవుతోంది. ఈ సందర్భంగా సినిమాతో పాటు తన ఆరోగ్య పరిస్థితి గురించి సమంత మాట్లాడారు. ఆ విశేషాలు.. హాయ్ సమంత గారు... ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? థాంక్యూ... ఈ మాట అడిగినందుకు! ఇప్పుడు నేను రికవరీ అవుతున్నాను. త్వరలో పరిస్థితులు మెరుగు అవుతాయని ఆశిస్తున్నాను. ఈ క్షణం, నేను ఈ రోజు గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. 'యశోద' విడుదల గురించి ఎగ్జైట్ అవుతున్నాను. మీ ఆరోగ్యం గురించి చాలా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు? అవును... నేనూ చాలా ఆర్టికల్స్ చూశాను. అయితే... ప్రస్తుతానికి నేను చావలేదు (నవ్వులు). ఆ హెడ్డింగ్స్ అప్రస్తుతం. నేను ఇంకా ఇక్కడే ఉన్నాను. ఫైట్ చేస్తున్నాను. నేను ఉన్న పరిస్థితిలో అది అంత ప్రాణాంతకం ఏమీ కాదు. ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం మీకు ఎక్కడ నుంచి వస్తోంది? సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టు... కొన్ని మంచి రోజులు ఉంటాయి. కొన్ని చెడ్డ రోజులు ఉంటాయి. ఒక్కోరోజు ఇంకొక్క అడుగు కూడా ముందు వేయలేనేమో అనిపిస్తోంది. కొన్ని రోజులు వెనక్కి తిరిగి వస్తుంటే ఇంత దూరం వచ్చానా? అనిపిస్తోంది. (సమాధానం చెబుతూ సమంత భావోద్వేగానికి లోనయ్యారు) చాలా మంది ఎన్నో సవాళ్లతో యుద్ధం చేస్తున్నారు. అంతిమంగా మనమే విజయం సాధిస్తాం. యశోద... టీజర్, ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్ లభిస్తోంది. ఆడియన్స్ రియాక్షన్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది? చాలా సంతోషంగా ఉంది. ఎగ్జైట్ అయ్యాను. అదే సమయంలో కొంచెం నెర్వస్ కూడా ఉంది. టీజర్, ట్రైలర్లో మేము చూపించినది నిజమే. సినిమాలో ఏం ఉందో అదే చూపించాం. ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్లకు టీజర్, ట్రైలర్ నచ్చాయి. సినిమా కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. 'యశోద' అంటే ముందుగా గుర్తు వచ్చేది ఏంటి? కథ చెప్పినప్పుడు వెంటనే ఓకే చేశారా? లేదంటే ఆలోచించారా? సాధారణంగా నేను ఏదైనా స్క్రిప్ట్ ఓకే చేయడానికి ఒక రోజు సమయం తీసుకుంటా. కానీ, 'యశోద' వెంటనే ఓకే చేశా. నేను విన్న వెంటనే ఓకే చేసేసిన కథల్లో 'యశోద' ఒకటి. 'యశోద' క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. పవర్ ఫుల్ స్టోరీ ఇది. అందుకని, ఎక్కువగా ఆలోచించడానికి ఏమీ లేదు. కథ విన్నప్పుడు గూస్ బంప్స్ వచ్చాయి. థ్రిల్ అయ్యాను. ప్రేక్షకులు కూడా అదే విధంగా థ్రిల్ అవుతారని, వాళ్ళకూ గూస్ బంప్స్ వస్తాయని ఆశిస్తున్నాను. సినిమాలో అంత పవర్ ఉంది. దర్శకులు హరి, హరీష్ కొత్త కాన్సెప్ట్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. పురాణాల్లో 'యశోద' గురించి విన్నాం. మోడ్రన్ 'యశోద' ఎలా ఉంటుంది? ఇద్దరూ మహిళలే. ఇద్దరూ అమ్మలే. చాలా మందిని రక్షించారు. ప్రేక్షకులకు శ్రీ కృష్ణుడిని పెంచిన 'యశోద' గురించి తెలుసు. పురాణాలపై అందరికీ అవగాహన ఉంది. మా సినిమా చూసిన తర్వాత 'యశోద' క్యారెక్టర్ గురించి అర్థం అవుతుంది. నేను చెప్పే విషయాన్ని అందరూ అంగీకరిస్తారని నమ్మకం ఉంది. ఇప్పుడు సరోగసీ అనేది కామన్ అయ్యింది. సరోగసీ మీద మీ అభిప్రాయం? సరోగసీ మీద నాకు బలమైన అభిప్రాయం లేదు. తల్లిదండ్రులు కావాలని అనుకునే వాళ్ళకు అదొక పరిష్కారం మాత్రమే. వాళ్ళ ఆశలకు ఆయువు పోస్తుంది. సినిమాలో సరోగసీ మాత్రమే కాదని, ఇంకా పాలిటిక్స్, వరల్డ్ రిచ్ విమెన్ ఇష్యూస్ ఉన్నాయని తెలుస్తోంది. కథ గురించి ఇంకొంచెం చెబుతారా? కథ గురించి నేను ఇంకేమైనా చెప్పానంటే... సినిమా చూసేటప్పుడు థ్రిల్ మిస్ అవుతారు. 'యశోద' ఒక మంచి థ్రిల్లర్. థియేటర్లో చూసేటప్పుడు తర్వాత ఏం జరుగుతుందోనని కుర్చీ అంచుకు వచ్చేస్తారు. దర్శకులు కథ, స్క్రీన్ ప్లే రాసిన విధానం... స్క్రీన్ మీదకు తీసుకు వచ్చిన తీరు... ఫైట్స్, సెట్స్, ఆర్ట్ వర్క్, మ్యూజిక్... ప్రతిదీ సూపర్. తప్పకుండా థియేటర్లలో చూడాల్సిన చిత్రమిది. వెండితెరపై ఎంజాయ్ చేయాలి. మీరు డిఫరెంట్ జానర్ సినిమాలు చేశారు. యాక్షన్ థ్రిల్లర్ సినిమా చేయడంలో ఉండే థ్రిల్ ఏమిటి? కథలు వినేటప్పుడు గానీ... తర్వాత సినిమాలో క్యారెక్టర్ విషయంలో గానీ... ఇంతకు ముందు చేసిన దానికి డిఫరెంట్‌గా, కొత్తగా ఉండాలని ప్రతిసారీ ఆలోచిస్తాను. అలా ఉండేలా చూస్తాను. 'యశోద' కంటే ముందు 'యు - టర్న్' చేశా. అది కూడా థ్రిల్లర్. కానీ, 'యశోద' చాలా కొత్తగా ఉంటుంది. యాక్షన్ పరంగా కూడా కొత్తగా ఉంటుంది. యాక్షన్ చేయడం ఎంజాయ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం 'ఫ్యామిలీ మ్యాన్ 2'లో రాజీ రోల్ కోసం యాక్షన్ చేశా. నిజం చెప్పాలంటే... యాక్షన్ చేసేటప్పుడు చాలా ఉల్లాసంగా ఉంటుంది. ఎంజాయ్ చేస్తూ చేస్తున్నాను. యాక్షన్ సీన్స్ కోసం మీరు ఎలాంటి ట్రైనింగ్ తీసుకున్నారు? యాక్షన్ చేయడం ఎలా అనిపించింది? యానిక్ బెన్ తో 'ఫ్యామిలీ మ్యాన్ 2'కి పని చేశా. ఆ క్యారెక్టర్ కోసం కిక్ బాక్సింగ్, బాక్సింగ్ లో ట్రైనింగ్ తీసుకున్నాను. 'యశోద'లో నేను సింపుల్ ప్రెగ్నెంట్ లేడీగా చేశా. ఆ పాత్రకు తగ్గట్టు యాక్షన్ డిజైన్ చేశారు యానిక్ బెన్, వెంకట్ మాస్టర్... ఇద్దరూ ఫైట్స్ అన్నీ రా అండ్ రియల్ గా ఉండేలా చూసుకున్నారు. అదే సమయంలో పాత్రకు తగ్గట్టు ఉండేలా చూశారు. చాలా ప్రిపేర్ అయ్యాను. ట్రైలర్ విజువల్స్ చూస్తే ప్రొడక్షన్ వేల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి. నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ గారితో మీ అనుబంధం... సరోగసీ ఫెర్టిలిటీ సెంటర్ కోసం లోకల్ హోటల్స్, హాస్పిటల్స్ చాలా చూశారు. కానీ, ఏవీ సెట్ కాలేదు. దాంతో భారీ సెట్ వేశారు. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ గారు సినిమా గొప్పగా ఉండాలని ఎప్పుడూ తపిస్తారు. అవుట్‌పుట్ గ్రాండ్‌గా ఉండాలని ఖర్చుకు వెనుకాడకుండా తీశారు. పాన్ ఇండియా రిలీజ్ ఆలోచనతో కథ మీ దగ్గరకు వచ్చిందా? కథ చూస్తే... కథలో, సినిమాలో గొప్ప ఎమోషన్ ఉంది. ప్రేక్షకులను ఎంగేజ్ చేసే విధంగా సినిమా ఉంటుందని అర్థమైంది. బిగినింగ్ నుంచి కథలో పొటెన్షియల్ ఉందని మాకు అర్థమైంది. షూటింగ్ చేసేటప్పుడు మా కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది. ఎమోషనల్ పాయింట్ కావడంతో అన్ని భాషల ప్రేక్షకులు కనెక్ట్ అవుతారని, అందరికీ నచ్చుతుందని అనుకున్నాం. ఇప్పుడు ఐదు భాషల్లో విడుదల చేస్తున్నాం. ప్రేక్షకులు, మీడియా 'పాన్ ఇండియా' అంటున్నారు. పాన్ ఇండియా హిట్ అవుతుందని ఆశిస్తున్నా. తమిళ, హిందీ, మలయాళం, కన్నడ భాషల నుంచి సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది? తెలుసుకుంటున్నారా? నిజం చెప్పాలంటే... అన్ని భాషల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. డిఫరెన్స్ ఏంటంటే... మైక్రో ట్రెండ్స్. ఒక్కో భాషలో ప్రేక్షకులకు ఒక్కో అంశం నచ్చుతుంది. వాళ్ళ అభిరుచులు కొంచెం వేరుగా ఉంటాయి. అందుకని, ఎవరికి ఏం నచ్చిందో తెలుసుకోవాలని ఆతృతగా ఉంది. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రక్షిత్ శెట్టి, సూర్య, వరుణ్ ధావన్... ట్రైలర్ విడుదల చేసిన హీరోలు అందరికీ థాంక్స్. వాళ్ళ సపోర్ట్ వల్ల అన్ని భాషల్లో ప్రేక్షకులకు ట్రైలర్ మరింత చేరువ అయ్యింది. సెలైన్ బాటిల్ తో డబ్బింగ్ చెప్పారు. వేరొకరితో డబ్బింగ్ చెప్పించే అవకాశం ఉన్నప్పటికీ... మీరే డబ్బింగ్ చెప్పడానికి కారణం? 'యశోద'కు డబ్బింగ్ చెప్పాలని ముందు నుంచి డిసైడ్ అయ్యాను. ఒక్కసారి నేను కమిట్ అయ్యానంటే... చేయాల్సిందే. ఓ క్యారెక్టర్ చేసేటప్పుడు ఆర్టిస్ట్ ప్రాణం పెట్టారంటే... వాళ్ళే డబ్బింగ్ చెప్పాలని కోరుకుంటారు. తమ వాయిస్ వినిపించాలని అనుకుంటారు. నేను ఇంతే... నాలో ఆ పట్టుదల ఉంది. నాకు మొండితనం ఎక్కువ. సవాళ్లు ఎదురైనప్పటికీ డబ్బింగ్ చెప్పగలిగినందుకు సంతోషంగా ఉంది. 'యశోద'లో మీ క్యారెక్టర్ కాకుండా మీకు బాగా నచ్చింది రోల్? వరలక్ష్మీ శరత్ కుమార్ క్యారెక్టర్. సినిమా చూస్తే నేను ఈ మాట ఎందుకు చెబుతున్నానో అర్థం అవుతుంది. ఇంతకు మించి ఏమైనా చెబితే స్పాయిలర్ అవుతుంది. ప్రజెంట్ మీ హెల్త్ గురించి ఎక్కువ డిస్కషన్ జరుగుతోంది. అభిమానులకు ఏం చెబుతారు? వాళ్ళు చూపిస్తున్న ప్రేమ, అభిమానం, మద్దతుకు థాంక్స్. నేను త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. ప్రస్తుతం నేను కోలుకుంటున్నాను. ఇదొక యుద్ధం. ఆ యుద్ధంలో పోరాటం చేయడానికి మీరందరూ చూపిస్తున్న ప్రేమ, మద్దతే కారణం. -
మయోసైటిస్‌తో ఆ స్టేజ్‌లో ఉన్నాను.. భావోద్వేగానికి లోనైన సమంత
సమంత నటించిన యశోద సినిమా ఈనెల 11న విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో పాల్గొన్న సమంత ఈ సినిమా తన రియల్ లైఫ్‌కు దగ్గరగా ఉంటుందని చెప్పింది. 'యశోదకు చాలా సవాళ్లు ఎదురవుతుంటాయి. దాన్ని ఎదుర్కొని నిలబడింది. ఇప్పుడు నేను కూడా అలాంటి డిఫికల్ట్ పొజిషన్లోనే ఉన్నాను. దీన్నుంచి విజయం సాధిస్తానని అనుకుంటున్నా. నా అనారోగ్యం గురించి కొన్ని ఆర్టికల్స్ చేశాను. ప్రాణాపాయస్థితిలో ఉన్నట్లు వార్తలు రాశారు. కానీ అది నిజం కాదు. ప్రస్తుతం నేను ఉన్న స్టేజిలో ప్రాణాపాయం కాదు. ప్రస్తుతానికైతే చావలేదు. అలంటి హెడ్‌లైన్స్ అనవసరం. అయినా ఈ వ్యాధి తీవ్రత మాత్రం డిఫికల్ట్‌గా ఉంది. అయినా సరే బయటపడేందుకు ప్రయత్నిస్తున్నా' అంటూ సమంత ఎమోషనల్ అయ్యింది. ఇక యశోద మూవీక డబ్బింగ్ గురించి మాట్లాడుతూ.. 'కష్టసమయంలోనే ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పాల్సి వచ్చింది. కానీ నాకు మొండితనం ఎక్కువ నేనే డబ్బింగ్ చెప్పాలని డిసైడ్ అయ్యాను కాబట్టి కష్టమైనా సరే డబ్బింగ్ పూర్తి చేశానని చెప్పింది. చివరగా మన నియంత్రణలో ఏదీ ఉండదని, అంతా మన లైఫ్ డిసైడ్ చేస్తుంది' అంటూ చెప్పుకొచ్చొంది. -
అలాంటి వారే సెలబ్రెటీల లైఫ్ గురించి మాట్లాడుకుంటారు: నటి అసహనం
నటి వరలక్ష్మి శరత్ కుమార్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విలక్షణ నటుడు శరత్ కుమార్ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. సినిమాల్లో విలనిజంతో మెప్పిస్తోంది. తెనాలి రామకృష్ణ బీఏ, బీఎల్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె రవితేజ క్రాక్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత నాంది, చేజింగ్ వంటి చిత్రాల్లో నటించి లేడీ విలన్‌గా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా పాన్ ఇండియా చిత్రం యశోదలో నటించింది. సమంత లీడ్ రోల్‌తో తెరకెక్కిన ఈచిత్రంలో ఆమె ఓ కీ రోల్ పోషించింది. ఈ చిత్రం నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చదవండి: విశ్వక్ సేన్, అర్జున్ వివాదంపై తమ్మారెడ్డి భరద్వాజ షాకింగ్ కామెంట్స్ ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ చానల్‌తో ముచ్చటించిన ఆమె సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సరోగసి నేపథ్యంలో యశోద సినిమాను రూపొందించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం దేశంలో సరోగసి అంశం హాట్‌టాపిక్ మారింది, దీనిపై మీ స్పందన ఏంటని అడగ్గా.. ‘సరోగసీ అనేది కాంప్లికేటెడ్ అంశం కాదు. కొంతమంది యాక్టర్స్ సరోగసీని ఆశ్రయించడం వల్ల దీనిపై చర్చ నడుస్తోంది. పిల్లలు లేని చాలా మందికి సరోగసీ ద్వారా పిల్లలు పొందే అవకాశం కలుగుతోంది. ఈ కథలో సరోగసీ ఒక టాపిక్ అంతే! అందులో మంచి చెడుల గురించి చెప్పడం లేదు. ఇది ఫిక్షనల్ స్టోరీ’ అని పేర్కొంది. చదవండి: కోలుకుంటున్న ‘బుట్టబొమ్మ’ పూజా హెగ్డే ఇటీవల లేడీ సూపర్ నయనతార సరోగసిని ఆశ్రయించడంపై పలువురి నుంచి అభ్యంతరాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెలబ్రెటీలు వ్యక్తిగత జీవితాన్ని చర్చనీయాంశం చేయడంపై మీ అభిప్రాయం చెప్పాలని యాంకర్ వరలక్ష్మిని కోరారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. పని పాట లేని వాళ్లే పక్కవారి లైఫ్ గురించి మాట్లాడుకుంటారు. ప్రస్తుతం సెలబ్రెటీల జీవితంలో సరోగసి గురించి మాట్లాడుకుంటున్నారు. అందరు తమ జీవితాలకు సంబంధించిన విషయాలను పక్కన పెట్టి పక్కవారి జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. పని పాట లేనివాళ్లే ఇలా చేస్తారు. వాళ్లకు ఏం పని ఉండదమో అందుకే పక్కవాళ్ల గురించి ఆలోచిస్తుంటారు’ అంటూ ఆమె అసహనం వ్యక్తం చేసింది. -
మయోసైటిస్ వల్ల నరకం.. కన్నీళ్లు పెట్టుకున్న సమంత
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మయోసైటిస్‌తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. చికిత్స తీసుకుంటూనే చేతికి సెలైన్ పెట్టుకొని యశోద డబ్బింగ్ కంప్లీట్ చేసిన సమంత తాజాగా ప్రమోషన్స్‌లోనూ స్వయంగా పాల్గొంది. ఈనెల 11న ఆమె నటించిన యశోద సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం సమంత ఉన్న పరిస్థితుల్లో ఆమె బయటకు రావడం దాదాపు కష్టమే అని నిర్మాతలు సహా అభిమానులు కూడా అనుకున్నారు. కానీ అందరిని ఆశ్వర్యపరుస్తూ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా తన కష్టకాలాన్ని తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుంది. 'ఒకానొక సమయంలో తాను ఒక్క అడుగుకూడా ముందుకు వేయలేనని అనిపించింది. ఇప్పుడు ఆలోచిస్తే ఇక్కడివరకు ఎలా వచ్చానోనని అనిపిస్తుంది' అంటూ ఆమె భావోద్వేగానికి లోనైంది. తన అనారోగ్యం కూడా కొందరు తప్పుగా ప్రచారం చేస్తూ తాను ప్రాణపాయ స్థితిలో ఉన్నట్లు వార్తలు రాశారని, కానీ తాను ఇప్పటికి ఇంకా చావలేదు అంటూ ఎమోషనల్ అయ్యింది. అంతేకాకుండా తనలాగే ఎంతోమంది కష్టాలతో పోరాడుతున్నారని, తనది పెద్ద సమస్య కాదని, ఈ పోరాటంలో తప్పకుండా విజయం సాధిస్తున్నానంటూ చెప్పుకొచ్చింది. కష్టకాలంలోనూ సమంత చూపిస్తున్న ధైర్యానికి ఎవరైనా మెచ్చుకోకుండా ఉండలేరంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. -
చికిత్స పొందుతూనే యశోద ప్రమోషన్లలో సమంత...ఫోటోలు వైరల్
-
ఆరోగ్యం బాలేకపోయినా.. యశోద ప్రమోషన్స్‌లో పాల్గొన్న సమంత
స్టార్ హీరోయిన్ సమంత నటించిన యశోద సినిమా ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే మూవీ టీం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. అయితే సమంత అనారోగ్యం కారణంగా ప్రమోషన్స్‌కు దూరంగా ఉంటుందని టాక్ వినిపించింది. ప్రస్తుతం మయోసైటిస్‌తో బాధపడుతున్న సామ్ అందుకు తగిన చికిత్స తీసుకుంటుంది. డాక్లర్ల పర్యవేక్షణలో సెలైన్ పెట్టుకొని మరీ డబ్బింగ్ కంప్లీట్ చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె బయటకు రావడం దాదాపు కష్టమే అని నిర్మాతలు సహా అభిమానులు కూడా అనుకున్నారు. కానీ అందరిని ఆశ్వర్యపరుస్తూ సమంత యశోద ప్రమోషన్స్‌లో పాల్గొంది. దీనికి సంబంధించిన ఫోటోలను స్వయంగా సామ్ షేర్ చేస్తూ.. 'నా స్నేహితుడు రాజ్ అండ్ డీకే చెప్పినట్లుగా.. మన రోజులు ఎంత చెత్తగా ఉన్నా సరే ముందుకు సాగాలి. ఈనెల 11న యశోద ప్రమోషన్స్ కోసం మీ ముందుకు రాబోతున్నాను' అంటూ ఓ పోస్ట్‌ను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో సామ్ వీక్ అయినట్లు కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఆరోగ్యం సరిగా లేకపోయినా సినిమా కోసం సామ్ డెడికేషన్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. Like my good friend @rajndk Raj says , no matter what the day is like, and how shitty things are, his motto is to Shower Shave Show up !! I borrowed it for a day ♥️ For #yashodathemovie promotions .. see you on the 11th pic.twitter.com/9u6bZK3cd2 — Samantha (@Samanthaprabhu2) November 7, 2022 -
సమంత వ్యాధి గురించి అప్పుడే తెలిసింది, అయినా తానే స్వయంగా..: యశోద నిర్మాత
స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘యశోద’. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. ఇందులో ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్, రావూ రమేశ్‌తో పాటు తదితరులు కీలక పాత్రలో నటించారు. సరోగసి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా సమంత మయోసైటిస్ వ్యాధిపై ఆయన స్పందించారు. సినిమా షూటింగ్లో సమంతకు ఈ వ్యాధి ఉన్నట్లు తమకు తెలియదన్నారు. చదవండి: ఆదిపురుష్ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన ఓం రౌత్ ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత డబ్బింగ్ టైమ్‌లో మాకు సమంత హెల్త్ గురించి తెలిసింది. సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి మూడు నాలుగు రోజుల ముందే మాకు తెలిసింది. అప్పటికే ఆమె తెలుగులో డబ్బింగ్ చెప్పారు. తమిళంలో చెప్పే టైమ్‌కు ఎనర్జీ లెవల్స్ తగ్గాయి. వేరే వాళ్ళతో చెప్పిద్దామని అన్నాను. కానీ తమిళం ప్రేక్షకులందరికి తన వాయిస్ తెలుసు కాబట్టి తానే చెబుతానంది. ఇందుకోసం మూడు, నాలుగు రోజులు డాక్టర్ల సమక్షంలో ఉండి ఆవిడే డబ్బింగ్ చెప్పారు. ఆవిడ డిడికేషన్‌కు హ్యాట్సాఫ్. ఇక హిందీలో చిన్మయి చెప్పారు” అంటూ ఆయన చెప్పుకొచ్చారు. చదవండి: ఉత్తరాది, దక్షిణాది చిత్రాల ఆదరణపై రకుల్ ఆసక్తికర వ్యాఖ్యలు -
యశోద షూటింగ్లో సమంత అలా ఉండేది: నటుడు
హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'యశోద'. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. ఇందులో ఉన్ని ముకుందన్ కీలక పాత్రలో నటించారు. 'జనతా గ్యారేజ్', 'భాగమతి', 'ఖిలాడీ' తర్వాత ఆయన నటించిన తెలుగు చిత్రమిది. నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో యశోద విడుదల అవుతోంది. ఈ సందర్భంగా ఉన్ని ముకుందన్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ముకుందన్ మాట్లాడుతూ.. 'తెలుగులో ఇప్పటివరకు మూడు సినిమాలు చేశాను. ఇప్పుడు 'యశోద'లో సమంతతో కలిసి నటించా. ఆమె చాలా టాలెంటెడ్ యాక్టర్. నటుడిగా నా విషయానికి వస్తే... కథ ఎలా ఉంది? అందులో నా పాత్ర ఏమిటి? అని చూస్తాను. ఆ పాత్రలో నేను ఎంత చేయగలను? అనేది ఆలోచిస్తా. నటుడిగా కొత్తదనం చూపించడం కూడా ముఖ్యమే కదా! సమంత చాలా డెడికేటెడ్, హార్డ్ వర్కింగ్ యాక్ట్రెస్. తన పాత్ర కోసం ఆవిడ చాలా ప్రిపేర్ అయ్యారు. ఫైట్స్, యాక్షన్, ఎమోషనల్ సీన్స్ బాగా చేశారు. సెట్లో ఇతర ఆర్టిస్టులతో సరదాగా మాట్లాడతారు. అయితే సమంతకు మయోసైటిస్ ఉందన్న విషయం షూటింగ్ చేసేటప్పుడు నాకు తెలియదు. షూటింగ్లో ఆమె చాలా ప్రొఫెషనల్‌గా ఉన్నారు. ఎప్పుడూ తాను అటువంటి వ్యాధితో పోరాటం చేస్తున్నాని చెప్పలేదు. సమంత పోస్ట్ చూసి బాధగా ఫీలయ్యాను. సమంతను దగ్గర నుంచి చూసి వ్యక్తిగా ఆవిడ కచ్చితగా మయోసైటిస్‌తో పోరాటం చేసి పూర్తి ఆరోగ్యంతో మన ముందుకు వస్తారు. ప్రస్తుతం మలయాళంలో రెండు మూడు సినిమాలు చేస్తున్నాను. 'మాలికాపురం' సినిమా పాన్ ఇండియా కాన్సెప్ట్‌తో చేస్తున్నాం. తెలుగులో కూడా దానిని విడుదల చేస్తున్నాం' అని చెప్పుకొచ్చారు. చదవండి: గీతక్కా, నిన్ను ఏడిపించే రోజు దగ్గర్లోనే ఉంది: ఉడాల్ మామ మాస్ వార్నింగ్ ఆ హీరోతో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా చేయని టబు -
చిన్న సినిమాలతో పోటీ పడుతున్న సమంత
-
'అది పెద్ద సమస్యేమీ కాదు.. వాటిని ఛాలెంజింగ్‌గా తీసుకుంటా'
ఇమేజ్ అనే చట్రంలో ఇరుక్కోకుండా అన్ని భాషల్లోనూ అన్ని రకాల పాత్రలను ఛాలెంజ్‌గా తీసుకుని నటించే నటీమణులు కొందరే ఉంటారు. అలాంటి వారిలో వరలక్ష్మీ శరత్‌కుమార్ ఒకరు. ఈమె వారికి, వీరికి అన్న భేదం చూపకుండా పాత్ర నచ్చితే నటించడానికి సిద్ధం అంటున్నారు. అలా తాజాగా నటి సమంత ప్రధాన పాత్ర ధరించిన యశోద చిత్రంలో నటి వరలక్ష్మీశరత్‌కుమార్ కీలకపాత్ర పోషించారు. ఇది ఈ నెల 11వ తేదీన పాన్ ఇండియా చిత్రంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నటి వరలక్ష్మీశరత్‌కుమార్ ఒక భేటీలో పేర్కొంటూ యశోద చిత్రంలో తాను అద్దె తల్లిని సమకూర్చిన వైద్యురాలిగా నటించానని చెప్పారు. ఇలాంటి ఇతివృత్తంతో కథలను ఎలా రాస్తారో? అని తానే ఆశ్చర్యపోయనని చెప్పా రు. అద్దె తల్లి విధానం గురించి ఇటీవల పెద్ద చర్చే జరిగిందని, నిజానికి అంత క్లిష్టమైన సమస్య కాదని పేర్కొన్నారు. అయితే ఈ చర్చకు నటి నయనతార, విఘ్నేష్ శివన్ వంటి సెలబ్రిటీస్ కావడంతో పెద్ద వివాదం జరిగిందన్నారు. ఇక యశోద చిత్రం విషయానికొస్తే కథానుగుణంగా తనలో ప్రతినాయకి ఛాయలు కనిపిస్తాయని, చిత్రంలో సమంత మాదిరిగా తాను ఫైట్స్ చేయలేదని, అయితే ఆమె పాత్రకు సమాంతరంగా తన పాత్ర ఉంటుందని చెప్పారు. సమంతకు ఎప్పుడైతే ఇతరుల సాయం అవసరం అవుతుందో అప్పుడు తన పాత్ర కథలోకి వస్తుందని చెప్పారు. అయితే ఆమెతో తనకు ఉన్న సంబంధం ఏంటి? అన్నది చిత్రం చూసే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుందని చెప్పారు. అయితే చిత్రంలో అద్దె తల్లి విధానం రైటా తప్పా అన్నది చర్చించలేదని, సమాజంలో ఇలాంటి వారు కూడా ఉన్నారని చెప్పడమే ఈ చిత్ర ప్రధాన ఉద్దేశం అని పేర్కొన్నారు. మంచి కథా పాత్రల్లో నటించే అవకాశం వచ్చినప్పుడు తాను వాటిని ఛాలెంజ్‌గా తీసుకుంటానని వరలక్ష్మీశరత్‌కుమార్ చెప్పారు. -
Yashoda: డూప్ లేకుండా సమంత యాక్షన్ సీన్స్.. మేకింగ్ వీడియో వైరల్
సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా 'యశోద'. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర చేశారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన 'యశోద' థియేట్రికల్ ట్రైలర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ లభిస్తోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ... అన్ని భాషల్లో, దేశంలోని అన్ని ప్రాంతాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ సినిమాపై ట్రైలర్ అంచనాలు పెంచింది. నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో డూప్ లేకుండా సమంత యాక్షన్ సీన్స్ చేశారు. ఈ రోజు యాక్షన్ సీన్స్ మేకింగ్ వీడియో విడుదల చేశారు. సమంత డెడికేషన్, సినిమాలో యాక్షన్ సీన్స్ గురించి ఆ వీడియోలో యానిక్ బెన్ మాట్లాడారు. 'యశోద' యాక్షన్ కొరియోగ్రాఫర్లలో ఒకరైన యానిక్ బెన్ మాట్లాడుతూ ''నేనెప్పుడూ యాక్టర్ సేఫ్‌గా ఉండేలా చూసుకుంటాను. వాళ్ళకు యాక్షన్ కొరియోగ్రఫీ పర్ఫెక్ట్గా తెలియాలి. అందుకని, ముందుగా స్టంట్ పెర్ఫార్మర్లతో ఫైట్ కంపొజిషన్ చూపిస్తాం. నటీనటులకు ట్రైనింగ్ ఇస్తాం. అందువల్ల, వాళ్ళకు టైమింగ్ తెలుస్తుంది. ఆ తర్వాత ఫైట్ తీస్తాం. సమంత చాలా డెడికేటెడ్‌గా షూటింగ్ చేస్తారు. ప్రతిసారి తన బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. ఆమెతో షూటింగ్ చేయడం బాగుంటుంది. యాక్షన్ ఎప్పుడూ రియల్‌గా ఉండటం నాకు ఇష్టం. 'యశోద'లో స్టంట్స్ కూడా రియల్‌గా ఉంటాయి. రియల్ లైఫ్‌లో ఎలా జరుగుతుందో... 'యశోదలో యాక్షన్ కూడా అలాగే రియలిస్టిక్‌గా ఉంటుంది. కిక్ బాక్సింగ్, జూడో , మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్... 'యశోద' యాక్షన్ సీన్స్‌లో ఉంటాయి' అని అన్నారు. సమంత నటించిన తొలి వెబ్ సిరీస్ 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' కు యానిక్ బెన్ వర్క్ చేశారు. తెలుగులో తెలుగులో పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది', మహేష్ బాబు 'వన్ నేనొక్కడినే' చిత్రాలకు కూడా యానిక్ బెన్ పని చేశారు. -
ఆ తర్వాతే సమంత ఆరోగ్యం క్షీణించి ఉండొచ్చు : నటి
సమంత అనారోగ్య పరిస్థితిపై చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. కొంతకాలంగా మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నాను అని సమంత పోస్ట్ చేయడంతో ఇండస్ట్రీ సహా ఆమె అభిమానులు షాక్‌కి గురయ్యారు. ఆమె త్వరగా కోలుకోవాలంటూ కోరుకుంటున్నారు. తాజాగా సమంత అనారోగ్యంపై నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ స్పందించారు. '12 ఏళ్లుగా సామ్‌తో పరిచయం ఉంది. యశోద సినిమాలో కలిసి నటించడం ఆనందంగా అనిపించింది. సెట్స్‌లో ఇద్దరం చాలా సరదాగా ఉండేవాళ్లం. షూటింగ్ టైంలో సామ్ అనారోగ్యంతో బాధపడుతుందని మాకు తెలీదు, ఎందుకంటే ఆమె ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండేది. యశోద షూటింగ్ పూర్తయిన తర్వాతే సామ్ ఆరోగ్యం క్షీణిందని అనుకుంటున్నా. కానీ ఆమె ఒక ఫైటర్. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తుందని ఆశిస్తున్నాను' అంటూ చెప్పుకొచ్చింది. కాగా సమంత ప్రధాన పాత్రలో నటించిన యశోద సినిమా నవంబర్ 11న విడుదల కానుంది. -
తమిళ్లో నటించే సమయమే దొరకట్లేదు: వరలక్ష్మీ శరత్ కుమార్
‘‘క్రాక్’లో నేను చేసిన జయమ్మ పాత్ర తర్వాత తెలుగులో నాకు మంచి అవకాశాలు వస్తున్నాయి. తమిళంలో సినిమాలు చేసే టైమ్ లేనంతంగా తెలుగు చిత్రాలు చేస్తున్నాను. దర్శకులు నా కోసం ప్రత్యేక పాత్రలు రాస్తుండటం సంతోషంగా ఉంది’’ అన్నారు నటి వరలక్ష్మీ శరత్‌కుమార్. సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా ‘యశోద’. హరి–హరీష్ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమా నవంబర్ 11న విడుదలవుతోంది. ఇందులో కీలక పాత్ర చేసిన వరలక్ష్మీ శరత్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘సమంత పన్నెండేళ్లుగా నాకు తెలుసు.. తను స్ట్రాంగ్ ఉమెన్. ‘యశోద’లో కథే హీరో. మేమంతా ఆ కథలో పాత్రధారులు మాత్రమే. ఈ చిత్రంలో సరోగసీ అనేది ఒక టాపిక్ అంతే. ఈ సినిమాలో నేను డాక్టర్ పాత్ర చేయలేదు.. సరోగసీ ఫెసిలిటీ సెంటర్ హెడ్ పాత్రలో నటించాను. నా నిజ జీవితానికి విరుద్ధమైన పాత్ర ఇది. మహిళలు ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతారు. ప్రతి పాత్ర కోసం దర్శకులు బాగా రీసెర్చ్ చేశారు. ఈ మూవీ కోసం సమంత చాలా కష్టపడ్డారు. మణిశర్మగారు మంచి సంగీతం ఇచ్చారు. శివలెంకగారు గ్రాండ్‌గా ఈ మూవీ తీశారు. ప్రస్తుతం నేను తెలుగులో ‘శబరి’ సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నాను. బాలకృష్ణగారి ‘వీరసింహారెడ్డి’ చిత్రంలో కీ రోల్ చేస్తున్నాను’’ అన్నారు. -
మీరు పెట్టే టికెట్ రేటుకు వాల్యూ ఉంటుంది: వరలక్ష్మి
సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'యశోద'. ఇందులో వరలక్షి శరత్ కుమార్ కీలక పాత్ర చేశారు. హరి, హరీష్ దర్శకత్వం వహించగా శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. నవంబర్ 11న సినిమా రిలీజవుతున్న సందర్భంగా వరలక్ష్మీ శరత్ కుమార్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు మీ కోసం... ► 'యశోద' కథ విన్నప్పుడు ఇటువంటి క్యారెక్టర్లను ఎలా రాశారు? ఈ కథను ఎలా ఆలోచించారా? అని ఆశ్చర్యపోతూ అడిగాను. ఇందులో గ్రే షేడ్స్ ఉన్న రోల్ చేశా. సమంత క్యారెక్టర్, నా క్యారెక్టర్ మధ్య ఉన్న రిలేషన్... మా కథలు ఆసక్తిగా ఉంటాయి. ► సినిమాలో లీడ్ రోల్ సమంత చేశారు. ఆమెకు ఒకరు అవసరం అవుతారు. అప్పుడు నా క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. రెండు కథలు జరుగుతాయి. ఆ రెండూ ఎలా కలిశాయి? అనేది సినిమా. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా ఇది. నాది సెకండ్ లీడ్ అని చెప్పవచ్చు. ఇంత కంటే ఎక్కువ చెబితే స్టోరీ రివీల్ అవుతుంది. ► నాది డాక్టర్ రోల్ కాదు అండి. ట్రైలర్లో చూపించిన సరోగసీ ఫెసిలిటీ సెంటర్ హెడ్. ఆమె చాలా రిచ్. డబ్బులు అంటే ఇష్టం. నిజ జీవితంలో నా డ్రసింగ్ స్టైల్, ఇతర అంశాలకు పూర్తి విరుద్ధంగా ఆ పాత్ర ఉంటుంది. తనను తాను బాగా ప్రేమించే పాత్ర. ► దర్శకులు ఇద్దరూ చాలా కామ్. నేను పని చేసిన దర్శకుల్లో అంత కామ్ గా ఎవరినీ చూడలేదు. వాళ్ళిద్దరూ అరవడం ఎప్పుడూ చూడలేదు. వాళ్ళకు ఏం కావాలో బాగా తెలుసు. ఒక్కో క్యారెక్టర్ కోసం చాలా రీసెర్చ్ చేశారు. ► సినిమాటోగ్రాఫర్ సుకుమార్ గారు అద్భుతంగా షూట్ చేశారు. సినిమాలో సంగీతానిది కీలక పాత్ర. మణిశర్మ గారు మంచి సంగీతం అందిస్తున్నారు. మీరు పెట్టే టికెట్ రేటుకు వేల్యూ ఉంటుంది. సినిమాలో అంత మంచి కంటెంట్ ఉంది. క్వాలిటీ విజువల్స్ ఉంటాయి. మా నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ గారు ఎంతో ఖర్చుపెట్టి సెట్స్ వేశారు. ఆర్ట్ డైరెక్టర్ వర్క్ కనబడుతోంది. ► సరోగసీ కాంప్లికేటెడ్ ఏమీ కాదు. కొంతమంది యాక్టర్స్ సరోగసీని ఆశ్రయించడం వల్ల డిస్కషన్స్ జరుగుతున్నాయి. పిల్లలు లేని చాలా మందికి సరోగసీ ద్వారా పొందే అవకాశం కలుగుతోంది. ఈ కథలో సరోగసీ ఒక టాపిక్ అంతే! అందులో మంచి చెడుల గురించి చెప్పడం లేదు. ఇది ఫిక్షనల్ స్టోరీ. కానీ, సమాజంలో అటువంటి మనుషులు ఉన్నారనిపిస్తుంది. ► నాకు సమంత పది పన్నెండు ఏళ్ల క్రితమే తెలుసు. మాకు చెన్నైలో పరిచయం అయ్యింది. సినిమాలో తనకు సీరియస్ సీన్స్ ఉన్నాయి. నేను ఏమో షూటింగ్ గ్యాప్ వస్తే జోక్స్ వేసేదాన్ని. తను నవ్వేది. 'షాట్ ముందే ఎందుకు ఇటువంటి జోక్స్ వేస్తావ్?' అనేది. తనతో నటించడం సరదాగా ఉంటుంది. తను స్ట్రాంగ్ విమెన్. పాత్రలో జీవించింది. పవర్ ఫుల్ రోల్ బాగా చేసింది. ► 'క్రాక్'లో జయమ్మ తర్వాత నాకు మంచి రోల్స్ వస్తున్నాయి. రచయితలు నా కోసం ప్రత్యేకంగా క్యారెక్టర్లు రాస్తున్నారు. ఇప్పుడు నేను తెలుగులో ఎక్కువ సినిమాలు చేస్తున్నాను. బయటకు వెళ్ళడానికి ఖాళీ లేదు. తమిళ సినిమాలు చేయడానికి డేట్స్ లేవు. నాకు స్టీరియో టైప్ రోల్స్ రావడం లేదు. అది సంతోషంగా ఉంది. ► తెలుగులో 'శబరి' చేస్తున్నా. అందులో నాది లీడ్ రోల్. 'వీర సింహా రెడ్డి'లో నాది క్రేజీ క్యారెక్టర్. ఇంకొన్ని సినిమాలు ఉన్నాయి. చదవండి: సమంత ఆరోగ్యంపై జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ నన్ను చితక్కొట్టి ఇంట్లో నుంచి గెంటేశారు: అనుపమ్ ఖేర్ -
అరుదైన వ్యాధితో చికిత్స తీసుకుంటున్న సమంత.. ఎమోషనల్ పోస్ట్
స్టార్ హీరోయిన్ సమంత కొంతకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో ఆమె ఆరోగ్యంపై రకరకాల రూమర్స్ తెరపైకి వచ్చాయి. కానీ ఇంతవరకు సామ్ ఆ వార్తలపై స్పందించలేదు. కానీ తొలిసారిగా సమంత తన ఆరోగ్యంపై మాట్లాడింది. తాను అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు పేర్కొన్న సామ్ చికిత్స తీసుకుంటున్న ఓ ఫోటోను షేర్ చేసింది. ''యశోద ట్రైలర్‌కి మీ రెస్పాన్స్ చూసి చాలా సంతోషమనిపించింది. మీ అందరి ప్రేమ, అనుబంధమే లైఫ్ నాకు ఇస్తున్న సవాళ్లను ఎదుర్కొనేలా చేస్తుంది. కొన్ని నెలల నుంచి ‘మయోసిటిస్’ Myositis( కండరాల బలహీనత) అనే వ్యాధితో బాధపడుతున్నాను. ఈ విషయాన్ని పూర్తిగా రికవర్ అయ్యాక మీతో చెబుదాం అనుకున్నాను. కానీ నేను అనుకున్నదానికంటే ఎక్కువ సమయం పడుతుంది. మనం ఎప్పుడూ స్ట్రాంగ్‌గా ముందుకు వెళ్లలేమని రియలైజ్ అయ్యాను. నేను త్వరలోనే కోలుకుంటానని డాక్టర్స్ కాన్ఫిడెన్స్‌గా చెబుతున్నారు. ఫిజికల్‌గా, ఎమోషనల్‌గా నాకు మంచి రోజులు, అలాగే చెడు రోజులు ఉన్నాయి. నేను ఇదంతా హ్యాండిల్ చేయలేనేమో అని అనుకున్నసందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఎలాగో ఆ క్షణాలు గడిచిపోయాయి. నేను పూర్తిగా కోలుకునే రోజు దగ్గరలోనే ఉందని ఆశిస్తున్నాను లవ్ యూ'' అంటూ ఎమోషనల్ పోస్టును షేర్ చేసింది సామ్. ఈ పోస్ట్ చూసిన వారు 'గెట్ వెల్ సూన్ సామ్' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
‘యశోద’ మూవీ స్టిల్స్ (ఫొటోలు)
-
అప్పుడే సమంతతో ప్రేమలో పడిపోయా: విజయ్ దేవరకొండ
సమంత ప్రధాన పాత్రలో నటించిన థ్రిల్లర్ మూవీ యశోద. హరి, హరీశ్ సంయుక్తంగా డైరెక్ట్ చేసిన ఈ మూవీ నవంబర్ 11న విడుదల కానుంది. తాజాగా యశోద ట్రైలర్‌ను తమిళంలో సూర్య, హిందీలో వరుణ్ ధావన్, కన్నడలో రక్షిత్ శెట్టి, మలయాళంలో దుల్కర్ సల్మాన్, తెలుగులో విజయ్ దేవరకొండ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా రౌడీ హీరో సామ్ మీద ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. 'కాలేజీలో చదువుకునే రోజుల్లో సమంతను మొట్టమొదటిసారిగా వెండితెర మీద చూసి అభిమానిగా మారిపోయాను. అప్పుడే ఆమెతో ప్రేమలో పడిపోయాను. ఇప్పటికీ నేను ఆమెను ఆరాధిస్తున్నాను' అని ట్విటర్లో రాసుకొచ్చాడు. అలాగే యశోద చిత్రయూనిట్‌కు ఆల్ ద బెస్ట్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాలో సమంత అద్దె గర్భానికి సిద్ధపడిన మహిళగా చూపించారు. కథ అంతా సరోసగీ చుట్టూనే తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఆ ట్రైలర్‌ను మీరు చూసేయండి.. Was in love with her, when as a college kid I saw her on the big screen for the first time. Today I admire and adore her for everything she is ❤️ So very happy to share with you all @Samanthaprabhu2's new film #YashodaTrailer ▶️ https://t.co/uT9gyBAj62 In theatres 11-11-2022 pic.twitter.com/KcYMnvj8sf — Vijay Deverakonda (@TheDeverakonda) October 27, 2022 చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజయ్యే సినిమాలివే! -
ఆసక్తి రేపుతున్న ‘యశోద’ ట్రైలర్.. యాక్షన్ సీన్లో అదరగొట్టిన సమంత
సమంత ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'యశోద'. ఇటీవల విడుదలైన టీజర్ కి అనూహ్య స్పందన లభించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్. ‘నీకు ఎప్పుడైనా రెండు గుండె చప్పుళ్లు వినిపించాయా’ అని సమంత చెప్పే డైలాగ్‌తో ఈ ట్రైలర్ ప్రారంభం అవుతుంది. టీజర్లో సమంత గర్భవతి అని చూపించారు. ట్రైలర్లో డబ్బు కోసం గర్భాన్ని అద్దెకు ఇచ్చిన మహిళ అని స్పష్టం చేశారు. అంటే 'యశోద'ది సరోగసీ ప్రెగ్నెన్సీ అన్నమాట! అక్కడితో కథ అయిపోలేదు. సరోగసీ కోసం తమ గర్భాన్ని అద్దెకు ఇచ్చిన మహిళలను ఒక్కచోట చేర్చడం... ఆ తర్వాత అక్కడ ఏదో జరుగుతుందనే క్యూరియాసిటీని కలిగించారు. సరోగసీ కోసం తీసుకొచ్చిన మహిళలకు ఏం జరుగుతోంది? ప్రపంచం నలుమూలల నుంచి వస్తున్న 122 మంది సంపన్న మహిళలు పేర్లు బయటకు రావడానికి, సరోగసీ ప్రెగ్నెన్సీ ధరించిన మహిళలకు సంబంధం ఏమిటి? ప్లాన్ ప్రకారం ఎవరి హత్య జరిగింది? అని ప్రేక్షకులు ఆలోచించేలా ట్రైలర్ కట్ చేశారు. ఈ ట్రైలర్‌ని ట్రైలర్‌ను తెలుగులో విజయ్ దేవరకొండ, తమిళంలో సూర్య, హిందీలో వరుణ్ ధావన్, కన్నడలో రక్షిత్ శెట్టి, మలయాళంలో దుల్కర్ సల్మాన్ విడుదల చేశారు. హరి- హరీశ్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 11న విడుదల కానుంది. -
అన్ని కోట్లా? రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన సమంత..
స్టార్ హీరోయిన్ సమంత తెలుగుతో పాటు హిందీలో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. పుష్ప చిత్రంలో ఐటెం సాంగ్‌తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ దక్కించుకున్న సమంత అదే స్థాయిలో రెమ్యునరేషన్ కూడా పెంచేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం సామ్ సైన్ చేయబోయే సినిమాలకు దాదాపు రూ. 3-8కోట్ల వరకు వసూలు చేస్తుందని సమాచారం. అంతేకాకుండా త్వరలోనే ముంబైలో రూ. 30కోట్లతో ఓ విలాసవంతమైన ఇంటిని కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. కాగా సమంత నటించిన యశోద సినిమా నవంబర్11న విడుదలకు సిద్ధమవుతుంది. మరోవైపు ఇప్పటికే శాకుంతలం షూటంగ్ కంప్లీట్ చేసిన సామ్ విజయ్ దేవరకొండతో ఖుషీ చిత్రంలో నటిస్తుంది. -
వైరల్: ఇన్‌స్టాలో మరో ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసిన సమంత..
సమంత ప్రధాన పాత్రలో ప్రేక్షకుల ముందుకొస్తున్న చిత్రం 'యశోద'. హరి, హరీష్ ద్వయం దర్శకత్వం వహించగా.. శ్రీదేవి మూవీస్ సంస్థ బ్యానర్‌పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు.యదార్థ సంఘటనల ఆధారంగా క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. నటి వరలక్ష్మి శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్ కీలక పాత్రలు పోషించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలోనూ నవంబర్ 11న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అయితే దీపావళి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ ను వదిలారు. ట్రైలర్‌ను ఈనెల 27న రిలీజ్ చేస్తున్నట్లు మరో పోస్టర్లో వెల్లడించారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
సమంత క్రైమ్ థిల్లర్ 'యశోద'.. రిలీజ్ ఎప్పుడంటే?
సమంత ప్రధాన పాత్రలో ప్రేక్షకుల ముందుకొస్తున్న చిత్రం 'యశోద'. నటి వరలక్ష్మి శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్ ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. హరి, హరీష్ ద్వయం దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీదేవి మూవీస్ సంస్థ బ్యానర్‌పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు.. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలోనూ విడుదల చేయనున్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని సోషల్ మీడియాలో వేదికగా వెల్లడించారు మేకర్స్. నవంబర్ 11న థియేటర్లలో అభిమానులను అలరించనున్నట్లు ప్రకటించారు. చిత్రబృందం కొత్తగా రిలీజ్ సమంత పోస్టర్ మరింత ఆసక్తి పెంచుతోంది. కొత్త పోస్టర్లో వరలక్ష్మి శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, సమంత ముఖంపై గాయాలతో చూపించారు. ఈ సినిమాలో సమంత గర్భిణీ పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ( చదవండి: సమంత యశోద మూవీ మరింత ఆలస్యం) ఈ సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. 'యశోద కొత్త కాలం నాటి యాక్షన్ థ్రిల్లర్. ఈ సినిమా మిస్టరీ, ఎమోషన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే ఎలిమెంట్స్‌తో ఉంటుంది. టైటిల్ రోల్ ప్లే చేస్తూ సమంత యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకుంటుంది. కొత్త తరం సినిమాని ఇష్టపడే ప్రేక్షకులు తప్పకుండా ఉంటారు.' అని అన్నారు. సమంత తదుపరి ప్రాజెక్ట్ పౌరాణిక చిత్రం శాకుంతలం. ఇందులో ఆమె యువరాణి పాత్రలో కనిపించనుంది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని మేకర్స్ ప్రకటించారు. Make way for #Yashoda in theatres on Nov 11th 2022🔥 Releasing Worldwide in Telugu, Tamil, Malayalam, Kannada & Hindi#YashodaTheMovie @Samanthaprabhu2 @varusarath5 @Iamunnimukundan @harishankaroffi @hareeshnarayan #Manisharma @krishnasivalenk @SrideviMovieOff pic.twitter.com/YgXeFh9i6i — Sridevi Movies (@SrideviMovieOff) October 17, 2022 -
ఫ్రెండ్‌కి బ్రేకప్ చెప్పిన సమంత.. ఇకపై తనే స్వయంగా..
నాగ చైతన్యతో విడాకుల తర్వాత నెట్టింట సమంత పేరు వినిపించని రోజంటూ లేదు. ఆమె సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టిన అది క్షణాల్లో వైరల్ అవుతుంది. గత కొంతకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న సామ్.. ఇటీవల మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. మళ్లీ తన పంథాను కొనసాగిస్తూ..అభిమానులతో టచ్‌లో ఉంటుంది. ఇదిలా ఉంటే సామ్‌కి సంబంధించిన ఓవార్త ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. (చదవండి: బాహుబలి ఆఫర్‌ని వదులుకున్నందుకు గర్వపడుతున్న: మంచు లక్ష్మీ) సామ్ తాజాగా తన ఫ్రెండ్‌కి బ్రేకప్ చెప్పిందట. ఆ ఫ్రెండ్ ఎవరో కాదు సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి. సామ్‌కు చిన్మయి చాలా క్లోజ్ ఫ్రెండ్. కెరీర్ స్టార్టింగ్ నుంచి సమంత పాత్రకు చిన్మయియే డబ్బింగ్ చెబుతూ వచ్చింది. దీంతో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ తాజాగా వీరిద్దరి మధ్య స్నేహం చెడిందట. మనస్పర్థలు రావడంతో చిన్మయిని సామ్ పక్కకు పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సామ్ పాన్ ఇండియా మూవీ యశోదకు చిన్మయి డబ్బింగ్ కూడా చెప్పలేదు. చిన్మయిని దూరం పెట్టి స్వయంగా సమంతనే డబ్బింగ్ చెప్పుకుందట. ఇకపై ప్రతి సినిమాకు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవాలని నిర్ణయించుకుందట. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది.. సామ్ కానీ చిన్మయి కానీ స్పందిస్తేనే తెలుస్తుంది. -
యశోద టీజర్: ప్రెగ్నెంట్ లేడీగా సమంత నటనకు వావ్ అనాల్సిందే!
స్టార్ హీరోయిన్ సమంత నటించిన తాజా చిత్రం యశోద. హరి-హరీష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ బ్యానర్‌ఫై శివలెంక కృష్ణ ప్రసాద్ పిక్చర్స్ నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అయితే ఇప్పటివరకు సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మాత్రమే రిలీజ్ చేసిన మూవీ టీం తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలో సమంత ప్రెగ్నెంట్ లేడీగా నటించింది. మొదటి మూడు నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఏ పని చేసినా దెబ్బ తగలకుండా చూసుకోవాలని అంటూ డాక్టర్ సలహాలు చెబుతుండగా అందుకు పూర్తి భిన్నంగా సమంతకు పరిస్థితులు ఎదురవుతాయి. యాక్షన్, ఎమోషన్స్, థ్రిల్ అంశాలతో ఎంతో ఉత్కంఠభరితంగా టీజర్‌ను కట్ చేశారు. లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడతో పాటు హిందీలో రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. Strength, willpower & adrenaline!https://t.co/Dv8OQkBntW#YashodaTheMovie @Samanthaprabhu2 @Iamunnimukundan @varusarath5 @harishankaroffi @hareeshnarayan #Manisharma @krishnasivalenk @SrideviMovieOff @PulagamOfficial @DoneChannel1 @SanchitaTrivedi @PRO_SVenkatesh @DiljithAthira — Samantha (@Samanthaprabhu2) September 9, 2022 -
సమంత యశోద మూవీ మరింత ఆలస్యం
ది ఫ్యామిలీ మ్యాన్–2 వెబ్‌సిరీస్, కాత్తు వాక్కుల రెండు కాదల్ తర్వాత సమంతా తమిళ ప్రేక్షకుల ముందుకొస్తున్న చిత్రం యశోద, నటి వరలక్ష్మి శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. హరి, హరీష్ ద్వయం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ సంస్థ తెలుగు, తమిళం భాషల్లో నిర్మిస్తున్నారు. కన్నడం, మలయాళం భాషల్లోనూ అనువదించి విడుదల చేయనున్నారు. యదార్థ సంఘటన ఆధారంగా క్రైమ్, థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 12వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇంతకుముందు చిత్ర యూనిట్ వెల్లడించారు. అయితే ఇప్పుడు చిత్రం విడుదల వాయిదా పడింది. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి కాకపోవడమే చిత్ర విడుదలకు కారణమని సమాధానం. యశోద చిత్రం సెప్టెంబర్ రెండవ వారంలో తెరపైకి వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశాలున్నాయి. -
మరో మాస్ సాంగ్‌కి సమంత సై.. ‘ఊ అంటావా’ మించేలా !
సమంత కెరీర్ లో మిగితా సినిమాలన్ని ఒక ఎత్తు. పుష్ప సినిమాలోని స్పెషల్ సాంగ్ ఊ అంటావా మరో ఎత్తు. ఎందుకంటే ఈ ఒక్క సాంగ్ ఆమెకు పాన్ ఇండియా ఫేవరేట్ హీరోయిన్ గా మార్చింది. సల్మాన్ ఖాన్ కు కూడా ఈ పాటంటేనే బాగా ఇష్టం.బాలీవుడ్ ఎందరో ప్రముఖులు సమంత పాటకు స్టెప్పులేశారు.ఇప్పుడు ఇదంతా ఎందుకంటరా.. త్వరలో సామ్ మరోసారి ఇలాంటి సాంగ్‌లో కనిపించబోతుదంట. (చదవండి: సోషల్ మీడియాకు దూరంగా సమంత.. అసలేమైంది?) ప్రస్తుతం సమంత యశోద అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తోంది. ఓ పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తైందని ఇటీవలే యూనిట్ తెలిపింది. ప్రస్తుతం ఆ పాటను సమంతపై చిత్రీకరిస్తోంది యూనిట్. హైదారబాద్ లో వేసిన ప్రత్యేమైన సెట్ లో సాంగ్ షూటింగ్ జరుగుతోంది. మణిశర్మ అందించిన మాస్ సాంగ్ కు మాస్ స్టెప్స్ వేస్తోందట సమంత. ఈ పాట ఊ అంటావా ను మంచి ఉండేలా యూనిట్ ప్లాన్ చేస్తోందని సమాచారం. సమంత కెరీర్ లో యశోద తొలి పాన్ ఇండియా ఫిల్మ్. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. -
సమంత గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన ‘యశోద’ డైరెక్టర్స్
సమంత తొలి పాన్ ఇండియా మూవీ యశోద షూటింగ్ పూర్తయిందని, ఒక్క పాట మాత్రమే మిగిలుందని తాజాగా చిత్ర బృందం వెల్లడించింది. శ్రీదేవీ మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి హరి-హరీశ్‌లో ద్వయం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ దర్శకులు ఇటీవల ఓ అంగ్ల మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా వారు చిత్ర విశేషాలతో పాటు సమంత గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. చదవండి: స్కూల్లో ఓ అబ్బాయికి లవ్ లేటర్ రాశా, అది ఇంట్లో తెలిసింది..: సాయి పల్లవి రోటిన్‌గా కాకుండా ప్రేక్షకులకు వినోదపరిచేందుకు విభిన్న కథ రావాలనుకున్నాం. అందుకే చాలా గ్యాప్ తీసుకున్నాం. యశోద మూవీకి విభిన్న కథానాలను అర్థం చేసుకునే హీరోయిన్ కావాలనుకున్నాం. అందుకేఈ సినిమా కోసం సమంతను సంప్రదించాం. కథ విన్న వెంటనే ఆమె ఓకే చెప్పారు’ అని చెప్పారు. కాగా ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌కు ముందే సమంతకు ఈ కథ వివరించామన్నారు. ఇక కథ వింటుంటే తనకు గూస్ బంప్స్ వస్తున్నాయని, తప్పకుండా తాను ఈ సినిమా చేస్తానని సమంత మాట ఇచ్చినట్లు తెలిపారు. చదవండి: కోల్‌కతా థియేటర్లో ‘రాకెట్రీ’ ప్రదర్శన నిలిపివేత.. ఫ్యాన్స్‌కి మాధవన్ విజ్ఞప్తి అంతేకాకుండా యాక్షన్ సీన్స్ తెరకెక్కించేందుకు ఎలాంటి సహాయం తీసుకోవడానికి కూడా సమంత ఇష్టపడేలేదన్నారు. ‘సినిమాలోనే మెయిన్ యాక్షన్ సీన్స్‌ను సెట్లోనే చిత్రీకరించాం. అయితే కొన్ని ఫైట్ సీన్స్ రిహార్సల్స్ కోసం సమంత 2, 3 రోజులు సెట్లోనే ఉన్నారు. ఎందుకంటే ఫైట్ సన్నివేశాలను తానే స్వయంగా చేయాలనుకుంది. ఎవరి సహాయం లేకుండానే సమంత యాక్షన్ సీన్స్ చేశారు’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ యాన్నిక్ బెన్, వెంకట్ మాస్టర్లు ఈ మూవీకి పని చేసిన సంగతి తెలిసిందే. -
సమంత యశోద మూవీ షూటింగ్ పూర్తి, రిలీజ్ డేట్ ఖరారు
స్టార్ హీరోయిన్ సమంత వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. అందులో యశోద ఒకటి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఓ అప్డేట్ వదిలారు మేకర్స్. శ్రీదేవీ మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి హరి-హరీశ్‌లో ద్వయం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ గురించిన అప్డేట్ ఇస్తూ మేకర్స్ ప్రకటన రిలీజ్ చేశారు. 100 రోజులకు పైగా షూటింగ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తయిందని చెప్పారు. ప్రస్తుతం ఆ పాటకు సంబంధించిన సీజీ వర్క్ జరుగుతుందని తెలిపారు. చదవండి: ‘అచలుడు’గా వస్తున్న సూర్య, ఫస్ట్‌లుక్ రిలీజ్ ఇక ఈ నెల 15 నుంచి అన్ని భాషల్లో డబ్బింగ్ మొదలు పెట్టనున్నామన్నారు. త్వరలోనే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఆగస్ట్ 12న ప్రపంచవ్యాప్తంగా సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించారు. యాక్షన్, థ్రిల్లర్‌గా హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రంగా తెరకెక్కుతున్న చిత్రమిది. ఇక ఇందులో సమంత చాలా అద్భుతంగా నటించిందని, ముఖ్యంగా యాక్షన్ సీన్స్ ఎంతో అంకితభావంతో నటించిందంటూ ఈ సందర్భంగా దర్శక-నిర్మాతలు ఆమెను కొనియాడారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ల మంచి స్పందని వచ్చింది. దీంతో ఈ సినిమా హైప్ క్రియేట్ అయ్యింది. కాగా ఈ సినిమాలో నటి వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్ ముఖ్య పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. చదవండి: నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవడం బాధగా ఉంది: సాయి పల్లవి -
Hoovu Fresh: పువ్వుల వ్యాపారం.. 10 లక్షల పెట్టుబడితో ఆరంభం.. కోట్లలో లాభాలు!
మన అవసరమే మనకో దారి చూపుతుంది. ఎరుకతో ముందడుగు వేస్తే విజయం సుగమమం అవుతుంది. అందుకు ఉదాహరణే ఈ బెంగళూరు సిస్టర్స్. అమ్మకు పూజ చేసుకోవడానికి సరైన పూలు దొరకడం లేదని గ్రహించిన ఈ తోబుట్టువులు ఇదే సమస్య అన్ని చోట్లా ఉందని తెలుసుకున్నారు. పది లక్షల రూపాయలతో పూల వ్యాపారాన్ని ప్రారంభించారు. కోట్లలో లాభాలను ఆర్జిస్తున్నారు. యశోద కరుటూరి, రియా కరుటూరి ఈ ఇద్దరు తోబుట్టువులు పువ్వుల లోకంలో విహరిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. కేవలం ప్రారంభించిన మూడేళ్లలోనే పూల పరిశ్రమలో పెద్ద బ్రాండ్‌గా తమ కంపెనీని నిలబెట్టారు. యశోద, రియా 14 ఫిబ్రవరి 2019న బెంగళూరులో ‘హువు’ ఫ్రెష్ని ప్రారంభించారు. 28 ఏళ్ల రియా మాట్లాడుతూ ‘హువు’ అంటే కన్నడ భాషలో పువ్వు అని చెప్పింది. కంపెనీ ప్రారంభించిన కొన్ని నెలల్లోనే కోవిడ్ కారణంగా వ్యాపారం నిలిచిపోయిందంటూ తాము ఎదుర్కొన్న సమస్యనూ వివరించింది. తల్లి ప్రేరణ కంపెనీ తొలినాళ్ల గురించి ఈ తోబుట్టువులు ప్రస్తావిస్తూ –‘దేశ పుష్పాల రాజధాని బెంగళూరు లో నివాసముంటున్నా సరైన పూలు దొరకడం లేదని, ఆ పువ్వులు కూడా తాజాగా లేవని మా అమ్మ ఆవేదన చెందేది. అప్పుడే పువ్వుల వ్యాపారం ఎందుకు చేయకూడదనే ఆలోచన వచ్చింది..’ అంటూండగానే రియా అక్క యశోద అందుకుని మాట్లాడుతూ ‘మా చిన్నతనంలో మా నాన్న ఇథియోపియా, కెన్యాలో గులాబీ తోట సాగు చేసేవారు. విదేశాలకు కూడా ఎగుమతి చేసేవారు. కొన్ని కారణాల వల్ల ఆ వ్యాపారం తగ్గిపోయింది. మేం స్వదేశానికి వచ్చేశాం. మహిళలకు ఉపాధి ‘భారతదేశంలో సాధారణంగా పూజా పుష్పాలను దేవాలయాల చుట్టూ మాత్రమే విక్రయిస్తుంటారు. అలాగే, బండిపైనో, రోడ్డు పక్కనో కూర్చొని మహిళలు పూజాపుష్పాలను అమ్ముతుంటారు. ఈ విధానం అస్తవ్యస్తంగా ఉందని గ్రహించాం. మేము ఈ పూలవ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు, పరిశ్రమలో చేరడానికి మహిళలు చాలా ఆసక్తి చూపారు. కంపెనీ మొదలైనప్పుడు పాతిక మంది మహిళలు ఉండగా నేడు వారి సంఖ్య వందల్లో పెరిగింది. ఉపాధి వల్ల వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. వారి పిల్లలు మంచి పాఠశాలల్లో చదువుతున్నారు. నెలకు లక్షన్నర ఆర్డర్లు ప్రతి నెలా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, మైసూర్, పూణె, ముంబై, గురుగ్రామ్, నోయిడా తదితర ప్రాంతాల నుంచి... ఒకటిన్నర లక్ష ఆర్డర్లు అందుతున్నాయి. వీరిలో ఎక్కువ మంది నెలవారీ సబ్స్క్రిప్షన్ ఉన్న కస్టమర్లే కావడం విశేషం. ఇది కనిష్టంగా రూపాయి నుండి ప్రారంభమవుతుంది. 25 రూపాయల పూల ప్యాక్‌లో వివిధ రకాల పూలు ఉంటాయి. పువ్వులు రెండు వారాల పాటు తాజాగా ఉండే విధంగా ప్యాక్ చేస్తాం. దీన్ని తాజాగా ఉంచడానికి ఇథిలీన్ బ్లాకర్స్, ఇతర టెక్నాలజీని ఉపయోగిస్తాం. ప్యాకేజింగ్‌లో జీరో టచ్ ఫ్లవర్ టెక్నిక్ కూడా ఉంది. ఈ ప్యాకెట్లు పర్యావరణ అనుకూలమైనవి, ఇవి సులభంగా మట్టిలో కలిసిపోతాయి. మా కంపెనీ వాడినపూలతో అగరుబత్తులను కూడా తయారు చేస్తుంది. ఇవి పూర్తిగా సేంద్రీయమైనవి. బొగ్గు, రసాయనాలు ఏ మాత్రమూ ఉండవు. రైతులతో అనుసంధానం గతంలో రైతులు మండీలో పూలు విక్రయించేవారు, అక్కడ తరచుగా నష్టపోయేవారు. అక్కడ పూలకు సరైన ధర లభించేది కాదు. సకాలంలో పూలు అమ్మకపోతే సగానికిపైగా వృథా అయ్యేవి. పూలకు సరైన ధర రైతులకు అందేలా వందలాది మంది రైతులను కంపెనీతో అనుసంధానం చేశాం. ఈ విధానంలో పూలు కూడా వృథా కావు. మా కంపెనీకి వివిధ రాష్ట్రాల్లోని వందలాది మంది రైతులతో టై అప్లు ఉన్నాయి. దీనితోపాటు, డెలివరీ చైన్ సిస్టమ్‌ను కూడా అభివృద్ధి చేశాం. ఆర్డర్లు వచ్చిన కస్టమర్లకు సకాలంలో డెలివరీ ఇస్తున్నాం. కొన్ని ఇ–కామర్స్ కంపెనీల ప్లాట్‌ఫారమ్‌లోనూ మా ఉత్పత్తులు లభిస్తున్నాయి’ అని వివరించారు ఈ తోబుట్టువులు. -
సమంత వర్సెస్ నాగచైతన్య, ఫలితం ఎలా ఉండనుందో?
Samantha Vs Naga Chaitanya: బాక్సాఫీసు వద్ద టాలీవుడ్ మాజీ కపుల్స్ పోటీ పడబోతున్నారు. హీరో నాగచైతన్య తొలిసారి హిందీలో నటించిన ఈ చిత్రం లాల్ సింగ్ చద్దా, సమంత తాజా చిత్రం యశోదలు ఒక్కరోజు తేడాతో బిగ్‌స్క్రీన్ వద్ద పోటీపడనున్నాయి. దీంతో వీరి ఫాలోవర్సతో పాటు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఒక్కసారే రిలీజ్ కాబోతున్న వీరి సినిమాలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయోనంటూ నెటిజన్లు చర్చికుంటున్నారు. సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘యశోద’ చిత్రం ఆగస్ట్ 12న విడుదల కాబోతోంది. చదవండి: రూ. 400 కోట్ల క్లబ్‌లోకి కేజీయఫ్ 2, హిందీలో ఈ 2 దక్షిణాది సినిమాలే టాప్ దర్శక ద్వయం హరి-హరీశ్‌లు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో కనిపించబోతోంది. మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. నాగచైతన్య హిందీ డెబ్యూ చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’ ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ ప్రధాన పాత్రలను పోషించగా... నాగచైతన్య కీ రోల్ పోషించాడు. మరి ఈ సినిమాల అదే డేట్‌కు వస్తాయా? లేక విడుదల తేదీలో మార్పులు చేసుకుంటాయా? చూడాలి. మరోవైపు చై సోదరుడు అఖిల్ నటించిన ఏజెంట్ చిత్రం యశోద మూవీ రోజునే విడుదల కాదనుంది. యశోద, ఏజెంట్లు రెండు అగష్టు 12న థియేటర్లో విడుదల కానున్నాయి. చదవండి: ఉపాసన.. నా మైండ్లోనూ అదే ఉంది, కానీ మనం కొద్ది రోజులు ఆగాల్సిందే! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1571342813.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఉత్కంఠగా సమంత ‘యశోద’ మూవీ ఫస్ట్‌గ్లింప్స్
Samantha Yashoda movie First Glimpse Out: స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం యశోద. హరీష్ శంకర్, హరీష్ నారాయణ్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ బ్యానర్ నిర్మించింది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్ అప్డేట్ను షేర్ చేశారు. ‘యశోద’ చిత్రానికి సంబంధించిన స్పెషల్ వీడియోను ఫస్ట్ గ్లింప్స్ పేరుతో ఈ రోజు(మే 5న) విడుదల చేశారు మేకర్స్. ఈ వీడియోలో సామ్.. ఓ హస్పిటల్ బెడ్‌పై నుంచి సడ్డెన్‌గా లేచి చేతికి ఉన్న బాండ్‌ను ఆశ్చర్యంగా చూసుకుంటుంది. ఆ తరువాత మెల్లిగా నడుచుకుంటూ కిటీకి వైపు వెళుతుంది. బయట ఉన్న పావురాన్ని తాకబోతుండగా వెంటనే యశోదా టైటిల్ వస్తుంది. ఇక ఎలాంటి డైలాగ్స్ లేకుండా విడుదల చేసిన ఈ వీడియో ఉత్కంఠభరితంగా సాగింది. ఈ గ్లింప్స్‌లో చూస్తుంటే సమంత ఇమాజినరి ప్రపంచంలో ఉన్నట్లు తెలుస్తుంది. కాగా ఈ చిత్రంలోవరలక్ష్మీ శరత్‌కుమార్, ఉన్నీ ముకుందన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఒకేసారి ఆగస్టు12న ఈ సినిమా విడుదల కానుంది. -
సమంత 'యశోద' నుంచి బిగ్ అప్డేట్.. గెట్ రెడీ
స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం యశోద. హరీష్ శంకర్, హరీష్ నారాయణ్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ బ్యానర్ నిర్మించింది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్ అప్డేట్ను షేర్ చేశారు. ‘యశోద’ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను మే5 ఉదయం 11.07 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. కాగా ఈ చిత్రంలోవరలక్ష్మీ శరత్‌కుమార్, ఉన్నీ ముకుందన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఒకేసారి ఆగస్టు12న ఈ సినిమా విడుదల కానుంది. Team #Yashoda wishes #EidMubarak 😇 Stay tuned for First glimpse on May 5th, 11:07AM🔥#YashodaTheMovie @Samanthaprabhu2 @Iamunnimukundan @varusarath5 @dirharishankar @hareeshnarayan #ManiSharma @mynnasukumar @krishnasivalenk @SrideviMovieOff @PulagamOfficial pic.twitter.com/kSFlwdBKsB — Sridevi Movies (@SrideviMovieOff) May 3, 2022 -
యశోద సినిమా నుంచి అప్డేట్.. గ్లింప్స్‌కి ముహూర్తం రెడీ
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇటీవలె ఆమె నటించిన యశోద సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఆగస్టు12న ఈ సినిమా విడుదల కానుంది. గురువారం(ఏప్రిల్28)న సమంత బర్త్‌డే సందర్భంగా యశోద సినిమాకు సంబంధించిన అప్డేట్ను విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్‌ను మే5న ఉదయం 11:07 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు హరి, హరీష్‌లు దర్శకత్వం వహించగా, శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. వరలక్ష్మి శరత్‌కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. చదవండి: సమంతపై ప్రాంక్.. విజయ్ సర్ప్రైజ్ మామూలుగా లేదుగా Wishing our dearest @Samanthaprabhu2 a very Happy Birthday 💐 The thrilling first glimpse of our #Yashoda will be out on May 5th, 11:07AM 🔥💥#HappyBirthdaySamantha #YashodaTheMovie @Iamunnimukundan @varusarath5 @dirharishankar @hareeshnarayan @mynnasukumar @krishnasivalenk pic.twitter.com/xRSIQhpZQr — Sridevi Movies (@SrideviMovieOff) April 28, 2022 -
బర్త్‌డే స్పెషల్ పోస్టర్: ఎదురుచూపుల్లో సమంత!
సమంత కథానాయికగా నటిస్తున్న తొలి పీరియాడికల్ చిత్రం ‘శాకుంతలం’. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. దుష్యంతుడు–శాకుంతల ప్రేమకథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. గురువారం (ఏప్రిల్ 28) సమంత బర్త్‌డేను పురస్కరించుకుని శాకుంతలం చిత్రయూనిట్ స్పెషల్ పోస్టర్‌ను వదిలింది. ఇందులో శకుంతలగా కనిపించిన సామ్ ఎవరి కోసమో నిరీక్షిస్తున్నట్లుగా ఉంది. ఇదిలా ఉంటే శాకుంతలం మైథలాజికల్ ఫిల్మ్ కావడంతో శకుంతల పాత్ర డైలాగ్స్ గ్రాంథికంలో ఉంటాయి. అందుకని దాదాపు మూడు నెలలపాటు శిక్షణ తీసుకున్న అనంతరం డబ్బింగ్ పూర్తి చేసిందట సామ్. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీత దర్శకుడు. మరోవైపు సమంత నటించిన మరో లేడీ ఓరియంటెడ్ మూవీ యశోద. సామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. మే 5న ఉదయం 11.07 గంటలకు యశోద ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించింది. Wishing the ethereal “Shakuntala” from #Shaakuntalam @Samanthaprabhu2 a very Happy Birthday! #HBDSamantha #MythologyforMilennials #EpicLoveStory pic.twitter.com/NZPvGdCVLY — Gunasekhar (@Gunasekhar1) April 28, 2022 Wishing their lead lady @Samanthaprabhu2 a very Happy Birthday, Team #Yashoda to unveil the first glimpse on May 5th, 11:07AM🔥#HappyBirthdaySamantha #YashodaTheMovie @Iamunnimukundan @varusarath5 @dirharishankar @hareeshnarayan @mynnasukumar @krishnasivalenk @SrideviMovieOff pic.twitter.com/h99WGkvHHL — BA Raju's Team (@baraju_SuperHit) April 28, 2022 చదవండి: నువ్వు యాక్టరేంటి? నిన్ను తీసుకుంటే సమయం, డబ్బులు వృథా' -
సమంత 'యశోద'గా వచ్చేది అప్పుడే.. నాగ చైతన్య, అఖిల్‌తో పోటీ !
Samantha Yashoda Movie Release Date Announced: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు విడాకుల తర్వాత మరింత క్రేజ్ పెరిగిందనండంలో ఎలాంటి సందేహం లేదు. సాధారణంగా పెళ్లి, విడాకుల వంటి సంఘటనల తర్వాత హీరోయిన్లకు అంతగా ఆఫర్స్ రావు. కానీ సమంత విషయంలో అది తప్పని రుజువైంది. పెళ్లికి ముందు పెళ్లి తర్వాత కూడా అదే క్రేజీ ఆఫర్లతో దూసుకుపోతోంది సామ్. వరుస సినిమా అవకాశాలతో బిజీగా మారింది. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనకు పైగా చిత్రాలు ఉన్నాయి. వీటిలో ఓ ఇంటర్నేషనల్ మూవీ కూడా ఉండటం విశేషం. ఇటీవల తన చిత్రాల్లో ఒకటైన 'కాతువాకుల రెండు కాదల్' మూవీ విడుదల తేదిని ప్రకిటంచింది సామ్. ఈ సినిమా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపిన విషయం తెలిసిందే. చదవండి: ఆ హీరోను నామినేట్ చేసిన సమంత.. ఎందుకో తెలుసా ? తాజాగా తన పాన్ ఇండియా మూవీ యశోద సినిమా రిలీజ్ డేట్‌ను మంగళవారం (ఏప్రిల్ 5) ప్రకటించింది సమంత. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆగస్ట్ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు తెలిపింది. ఈ చిత్రాన్ని హరి-హరీశ్ దర్శకత్వంలో శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి ఒక రోజు ముందు అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా' ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాతోనే అక్కినేని నాగచైతన్య బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను తెలుగుతోపాటు ఇతర దక్షిణాది భాషల్లోనూ డబ్ చేయనున్నారట. అంటే నాగచైతన్య 'లాల్ సింగ్ చద్దా'తో ఆగస్టు 11న సమంత 'యశోద'తో ఆగస్టు 12న బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నట్లు తెలుస్తోంది. అలాగే అక్కినేని అఖిల్ 'ఏజెంట్' చిత్రం కూడా ఆగస్టు 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో పోషిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే అక్కినేని వారసులు నాగ చైతన్య, అఖిల్ చిత్రాలతో సమంత మూవీ పోటీ పడనున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఆ స్టార్ డైరెక్టర్‌తో నాగ చైతన్య మూవీ ! -
సమంత 'యశోద'కు హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్
Hollywood Action Director Yannick Ben For Samantha Yashoda Movie: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఫుల్ బిజీగా ఫుల్ జోష్‌లో ఉంది. వరుస సినిమా ఆఫర్లు, స్పెషల్ సాంగ్స్, కమర్షియల్ యాడ్స్‌తోపాటు వ్యాపార వ్యవహారాలు సైతం చూసుకుంటూ రెండు చేతులా సంపాదిస్తోంది. అంతేకాకుండా హాట్‌హాట్ ఫోజులు, దుస్తులతో అభిమానులను అలరించే సామ్ కమర్షియల్ విలువలతోపాటు కంటెంట్ ఉన్న సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఇటు కమర్షియల్ హంగులు, కంటెంట్ ఉన్న కథతో ఉన్న శ్రీదేవి మూవీస్ ప్రొడక్షన్ హౌస్ ఆమెను సంప్రదించగా సామ్ ఓకే చెప్పింది. ఆ మూవీనే 'యశోద'. కాగా సమంత ఇంతకు మందు చేసిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు భిన్నంగా ఉండే డిఫరెంట్ మూవీ ఇది. ఈ మూవీలో యాక్షన్ పార్ట్ కూడా ఉండనుంది. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ యానిక్ బెనిత్ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించారు. 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌లోని యాక్షన్ సన్నివేశాలకు యానిక్ బెన్ డైరెక్ట్ చేశారు. సమంతతో యానిక్ బెన్‌కు 'యశోద' సినిమా సెకండ్ ప్రాజెక్ట్. హాలీవుడ్లో క్రిస్టోఫర్ నోలన్ సినిమాలకు స్టంట్ పర్ఫార్మర్గా కూడా బెనిక్ వర్క్ చేశారు. ఇటీవల హైదరాబాద్‌లో పది రోజులపాటు యశోద యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించారు. రూ. 3 కోట్ల భారీ వ్యయంతో ఆర్ట్ డైరెక్టర్ అశోక్ వేసిన సెట్స్‌లో ప్రస్తుతం షూటింగ్ చేస్తున్నారు. మరొ యాక్షన్ సీక్వెన్స్ కొడైకెనాల్లో ప్లాన్ చేసినట్లు సమాచారం. సమంత తదితరులపై పది రోజులపాటు 3 సెట్స్‌లో షూటింగ్ చేశామని, సమంత కష్టపడి అద్భుతంగా యాక్షన్ సీన్స్ చేసిందని శ్రీదేవీ మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ తెలిపారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే థ్లిల్లర్ చిత్రమిదని పేర్కొన్నారు. హరి శంకర్, హరీష్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ తదితరులు నటిస్తున్నారు. -
ఇల్లు వదిలేసి సెట్స్‌లోనే ఉండిపోయిన సామ్!
'ఊ అంటావా మావా.. ఉఊ అంటావా మావా..' సాంగ్‌తో సమంత క్రేజ్ దేశమంతా పాకింది. 'పుష్ప' సినిమాలోని ఈ పాటకే కాదు సమంత అందచందాలకు కూడా అందరూ ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఆమె పాన్ ఇండియా మూవీ 'యశోద'లో నటిస్తోంది. హరి, హరీష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో 30 - 40 శాతం సన్నివేశాలు ఒకే ప్రాంతంలో జరుగుతాయి. ఇందుకోసం హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో మూడు కోట్లతో సెవెన్ స్టార్ హోటల్స్ సౌకర్యాలను తలపించేలా సెట్స్ వేసిన విషయం తెలిసిందే! తాజాగా సమంత ఇల్లు వదిలేసి సెట్స్‌లోనే ఉండిపోయిందట! ఈ సెట్ బాగా నచ్చడంతోపాటు త్వరగా షూటింగ్‌కు రెడీ అవొచ్చన్న ఉద్దేశ్యంతో సామ్ కొన్నిరోజులపాటు అక్కడే ఉండనున్నట్లు ఓ వార్త ఫిల్మీదునియాలో చక్కర్లు కొడుతోంది. ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది. కాగా ఈ చిత్రంలో ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు సంగీతం: మణిశర్మ, లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక, కెమెరా: ఎం. సుకుమార్, సహనిర్మాత: చింతా గోపాలకృష్ణారెడ్డి. చదవండి: ఇది నా జీవితంలో జరిగింది, అర్ధరాత్రి కశ్మీర్‌ను వీడాం: నటి ఎమోషనల్ -
'మధుబాల'గా వరలక్ష్మీ శరత్‌కుమార్.. స్పెషల్ పోస్టర్ రిలీజ్
వరలక్ష్మీ శరత్‌కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళంతో పాటు తెలుగులోనూ అదరగొడుతుంది. ఇటీవలె క్రాక్, నాంది సినిమాలతో హిట్ అందుకున్న ఆమెకు తెలుగులో మరింత క్రేజ్ పెరిగింది. తాజాగా సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న యశోద సినిమాలో వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. శనివారం ఆమె పుట్టినరోజు కావడంతో యశోద టీం ఆమెకు బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఆ చిత్రం నుంచి స్పెషల్ పోస్టర్ వదిలారు. ఈ చిత్రంలో ఆమె 'మధుబాల' అనే పాత్రలో కనిపించనున్నట్లు పోస్టర్లో స్పష్టమవుతుంది. ఈ సినిమాకు హరీశ్ శంకర్, హరీశ్ నారాయన్ దర్శకత్వం వహిస్తుండగా శ్రీదేవీ మూవీ బ్యానర్‌పై శివలంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఉన్ని ముకుందన్ మరో ముఖ్యపాత్రలో కనిపించనున్నాడు. -
'యశోద' సినిమాకు సమంత పారితోషికం ఎన్ని కోట్లంటే?
టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా వెలుగొందుతోంది సమంత. ఫ్యామిలీ మ్యాన్ వెబ్‌సిరీస్‌లో రాజీగా అదరగొట్టినా, పుష్పలో ఊ అంటావా మావా అంటూ ఐటం సాంగ్‌తో కవ్వించినా అది ఒక్క సామ్‌కే చెల్లుతుంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత కెరీర్ మీద మరింత ఫోకస్ పెట్టిన ఈ హీరోయిన్ ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఆమె పాన్ ఇండియా చిత్రం యశోదలో నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా నుంచి సామ్ ఫస్ట్ లుక్ రిలీజవగా అది అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే సామ్ యశోదకుగానూ ఎంత పారితోషికం తీసుకుంటుందన్న వార్త ఆసక్తికరంగా మారింది. ఫిల్మీ దునియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం సామ్ యశోద సినిమాకు రూ.3 కోట్ల పారితోషికం తీసుకుంటుందట! సుమారు రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు హరీశ్ శంకర్, హరీశ్ నారాయన్ దర్శకత్వం వహిస్తుండగా శ్రీదేవీ మూవీ బ్యానర్‌పై శివలంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఉన్ని ముకుందన్ ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. చదవండి: నా ఫోన్ ముట్టుకోనిచ్చేవాడు కాదు, తాగి కొట్టేవాడు -
సమంత సినిమాలో హోటల్ సెట్ కోసం రూ.3 కోట్లు!
సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘యశోద’. హరి, హరీష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. కాగా ఆర్ట్ డైరెక్టర్ అశోక్ నేతృత్వంలో రూపొందిన మూడుకోట్ల రూపాయల హోటల్ సెట్స్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ– ‘‘యశోద’లో 30 నుంచి 40 శాతం సన్నివేశాలు ఒకే ప్రాంతంలో జరుగుతాయి. ఈ సీన్స్ కోసం కొన్ని హోటల్ లొకేషన్స్‌ను పరిశీలించాం. దాదాపు 30 నుంచి 40 రోజులు హోటల్స్‌లో చిత్రీకరణ సులభం కాదు. అందుకే హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో మూడు కోట్లతో సెవెన్‌స్టార్ హోటల్స్ సౌకర్యాలను తలపించేలా సెట్స్ వేశాం. సమంత, వరలక్ష్మీ శరత్‌కుమార్, ఉన్నిముకుందన్లపై సీన్స్ చిత్రీకరిస్తున్నాం’’ అన్నారు. ఈ సినిమాకు సంగీతం: మణిశర్మ, లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక. కాగా.. ఇటీవల కేరళలోని ఓ జలపాతం వద్ద వేకేషన్ టైమ్‌ను స్పెండ్ చేసిన సమంత ఆ ఫొటోలు, వీడియోలను షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. -
సమంత మరో డేరింగ్ స్టెప్.. తొలిసారి అలాంటి పాత్రలో..
నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత కెరీర్ పరంగా దూసుకెళ్తోంది. టాలీవుడ్, బాలీవుడ్,హాలీవుడ్ అనే తేడా లేకుండా వరుస సినిమాలను ప్రకటిస్తూ.. బిజియెస్ట్ హీరోయిన్గా మారిపోయింది. ఇటీవల ఈ బ్యూటీ అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ లో స్పెషల్ సాంగ్ చేసి ఔరా అనిపించింది. స్పెషల్ సాంగ్ చేయడానికి తొలుత సంకోచించినప్పటికీ.. దర్శకుడు సుకుమార్ బలవంతంగా ఒప్పించి, నటింపంచేశారు. ఇప్పుడు ఆ సాంగ్ యూట్యూబ్‌లో రికార్డు సృష్టించింది. అంతేకాదు సమంతకు బోలెడంత డబ్బుతో పాటు.. ఫేమ్‌ని కూడా తీసుకొచ్చిపెట్టింది. అదే ఉత్సాహంతో సమయంలో మరో డేరింగ్ స్టెప్ వేయబోతుంది. తొలిసారి గర్భవతి పాత్రలో నటించబోతుదంట సామ్. వివరాల్లోకి వెళితే.. సమంత ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ ‘యశోద’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. హరి మరియు హరీశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సమంత ప్రెగ్నెంట్‌గా కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నర్సు అయిన ఓ ప్రెగ్నెంట్ మహిళలకు అనుకోని సమస్యలు ఎదురైనే.. ఆమె ఒక్కతే వాటిని ఎలా అధిగమించింది అనే నేపథ్యంలో ‘యశోద’చిత్రం తెరకెక్కుతుదంట. విడాకుల తర్వాత ఇలా డిఫరెంట్ పాత్రల్లో నటించడంతో సామ్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
సమంత యశోద సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్..
సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న 'యశోద' సినిమా సెకండ్ షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ మేరకు చిత్ర బృందం అధికారికంగా అనౌన్స్ చేసింది. ఈనెల 12వరకు ప్రధాన పాత్రలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ తెలిపారు. సంక్రాంతి తర్వాత మూడో షెడ్యూల్ మొదలు పెడతామని, మార్చి నెలాఖరుకు చిత్రీకరణ పూర్తవుతుందని పేర్కొన్నారు. హరి - హరీశ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళ స్టార్ ఉన్ని ముకుందన్ ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తుండగా, వరలక్ష్మి శరత్ కుమార్ సైతం కీలక పాత్రలో కనిపంచనున్నారు. మణివర్మ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ ఏడాది ఈ సినిమా విడుదల కానుంది. చదవండి: స్పెషల్ సాంగ్ కోసం సమంత ఎంత కష్టపడిందో చూడండి.. -
మధుబాల ఆన్ సెట్
సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘యశోద’. ఈ సినిమా ద్వారా హరి–హరీష్ దర్శకులుగా పరిచయమవుతున్నారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ– ‘‘థ్రిల్లర్ జానర్లో ఆకట్టుకునేలా తీస్తున్న చిత్రం ‘యశోద’. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 6న ప్రారంభమైంది. ఇందులో కీలకమైన మధుబాల పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపిస్తారు. బుధవారం నుంచి ఆమె చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ నెల 23 వరకూ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తొలి షెడ్యూల్ చేస్తాం. జనవరి 3న రెండో షెడ్యూల్ మొదలవుతుంది. మార్చికి సినిమాను పూర్తి చేస్తాం. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక, కెమెరా: ఎం. సుకుమార్, సంగీతం: మణిశర్మ, సహనిర్మాత: చింతా గోపాలకృష్ణారెడ్డి. -
పెళ్లంటే పిల్లలాట కాదు
అవును. పెళ్లంటే ఆట కాదు. అల్లరి కాదు. చదువు కాదు. స్వేచ్ఛ కాదు, స్వతంత్రం కాదు. మోయవలసిన బాధ్యత. ఇంటిని, పిల్లల్ని, ఇంట్లో పెద్దల్ని మోయడానికి భుజ బలం కావాలి. మనోబలం ఉండాలి. చిన్నప్పుడే పెళ్లి చేయడం అంటే.. కాళ్లకు తాళ్లేసి కట్టేయడమే! పెళ్లంటే పిల్లలాట కాదని.. యశోద చెబుతోంది ఇందుకే. ఆమె ఓ గ్రామీణ యువతి. ఇప్పుడామె.. ఐక్యరాజ్య సమితి వాలంటీర్! ఇల్లిల్లూ కాదు, ఊరూరూ తిరిగి చెబుతోంది యశోద.. చిన్నప్పుడే పిల్లకు పెళ్లిళ్లు చేసేయొద్దని. చెప్పడం ఎవరైనా చెబుతారు. ప్రధాని చెప్పడం లేదా? రాష్ట్రపతి చెప్పడం లేదా. కానీ యశోద.. చెప్పడంతో పాటు ఎక్కడైనా బాల్యవివాహం జరుగుతుంటే వెళ్లి ఆ పెళ్లిని ఆపేస్తోంది! పీలగా, ఎముకల్లో బలం లేనట్లుగా ఉంటుంది ఈ 21 ఏళ్ల అమ్మాయి. ఈమె వెళ్లి ‘ఆపండి’ అని గర్జిస్తే ఎవరు వింటారు? ‘పో పోవమ్మా..’ అంటారు. ‘భజంత్రీలూ మీరు కానివ్వండయ్యా’ అంటారు. అసలు సొంత ఇంట్లోని వాళ్లే యశోదకు సపోర్టుగా రాలేదు. ‘నిన్న మొన్న పుట్టినదానివి, ఊళ్లో ఆచారాలను మార్చేస్తానని బయల్దేరుతున్నావా? కాళ్లిరగ్గొడతాం. ఇంట్లో కూర్చో’ అని చెప్పేశారు. ఇది జరిగింది ఆమెకు 18 ఏళ్ల వయసప్పుడు. యశోద వాళ్ల ఊరు దుమెర్పానీ. ఊరూ అదే, గ్రామ పంచాయితీ అదే. ఒడిశాలోని నౌపడ జిల్లాలో ఉంటుంది. దుమెర్పానీకి దగ్గరలో హల్దీ అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఎవరో చిన్న పిల్లకు, చిన్న పిల్లాడికీ పెళ్లి చేస్తున్నారని తెలిసి రయ్యిన అక్కడికి వెళ్లింది. ఒక్కటే వెళ్లలేదు. అప్పటికే తను రెండు ఎన్జీవోలతో కలిసి పనిచేస్తోంది. ‘సేవ్ ద చిల్డ్రన్’ అనేదొకటి. ‘ఆశా’అనే సంస్థ మరొకటి. వాళ్లు వెనకుంటే, యశోద ముందుకు వెళ్లి.. ‘పిల్లలకు పెళ్లి చేయకండి’ అంది! కోపంగా చూశారు పెళ్లి చేస్తున్నవారు. బాల్యవివాహాలకు వ్యతిరేకంగా గ్రామస్థులను చైతన్యపరుస్తున్న యశోద వింతగా చూశారు పెళ్లికొచ్చినవాళ్లు. ‘ఈ అమ్మాయి ఎవరో కనుక్కోండి’ అని పెద్దవాళ్లు అన్నారు. ‘తెలిసినమ్మాయే. పక్క గ్రామం’ అన్నారు.. యశోద ఎన్జీవోలతో కలిసి పనిచేస్తుండటం తెలిసినవాళ్లు. అప్పటికి పెళ్లి ఆగిపోయింది. అంతా వెళ్లిపోయాక చుట్టుపక్కల ఊళ్లలో నిరసన మొదలైంది. ‘‘ఊరి పిల్ల అయుండీ, ఊరి ఆచారాలు తెలియవా! ఎవర్నో వెంటేసుకుని వచ్చి మరీ పెళ్లిని ఆపేయిస్తుందా?’’ అని ఊళ్లో అరుగుల మీద ‘చుట్ట ముక్క’ చర్చలు మొదలయ్యాయి. ఊళ్లో చెరువుల దగ్గర నీళ్ల బిందెలు బుగ్గలు నొక్కుకున్నాయి. విషయం యశోద ఇంట్లో తెలిసింది. ‘నిన్న మొన్న పుట్టిన దానివి, ఊళ్లో ఆచారాలను మార్చేస్తానని బయల్దేరుతున్నావా? కాళ్లిరగ్గొడతాం. ఇంట్లో కూర్చో’’ అని అప్పుడే వాళ్లు అన్నది. ∙∙ కూర్చోలేదు యశోద. సామాజిక కార్యకర్తలతో కలిసి తిరిగింది. ఈ మూడేళ్లలో చుట్టుపక్కల ఊళ్లల్లో జరగబోయిన బాల్యవివాహాలను ఓ ఎనభై వరకు ఆపగలిగింది! ఊరికే లీడర్ అయింది. యువలీడర్. ఆడపిల్లలకు యశోదక్కను చూస్తే యమా క్రేజ్. ఇంట్లో వాళ్లు తమను బడి మాన్పించబోతున్నా, పెళ్లి సంబంధాలు వెతుకుతున్నా, తమను బయటికి వెళ్లి ఆడుకోనివ్వకపోయినా.. ‘యశోదక్కకు చెబుతాం’ అని పైపైకి లేస్తున్నారు. వాళ్లను చెయ్యిపట్టి ఆపడం తల్లిదండ్రుల పనౌతోంది. యశోదక్కకు చెబితే యశోదక్క టీమ్ ఏమీ కర్రలు పట్టుకుని వచ్చేయదు. కూడలి లో గ్రామస్తులకు ఒక మీటింగ్ పెట్టి, చిన్నప్పుడే పెళ్లి చేస్తే ఆడపిల్లల జీవితం ఎలా అయిపోతోందో కళ్లకు కట్టేలా చెప్పి వెళ్తుంది. యశోద మీటింగ్‌లలో ఆడవాళ్లే కాదు, మగవాళ్లూ కూర్చొని ఆమె చెప్పేది ఆసక్తిగా వింటున్నారిప్పుడు. ఆ మాటలు వారిలో ఆలోచన కలిగించేలా ఉంటాయి. ఆ ఊళ్లన్నీ దుర్భిక్ష ప్రాంతాలు. అందుకే ఆడపిల్లలకు త్వరగా పెళ్లిళ్లు చేసి, మెట్టినూళ్లలో వారికి మంచి పరిస్థితుల్ని కల్పించాలని తల్లిదండ్రులు త్వరపడుతుంటారు. పని వెతుక్కుంటూ వేరే ప్రాంతాలకు వలస వెళ్లే వాళ్లే వారిలో ఎక్కువమంది. దక్షణాది రాష్ట్రాలకొచ్చి ఇటుక బట్టీల్లో, ఫ్యాక్టరీలలో కూలీలుగా చేరి పిల్ల పెళ్లి కోసం నాలుగు రాళ్లు కూడబెట్టుకుని తిరిగి ఊరు చేరుతుంటారు. ఏడాదికి మూడు సీజన్ల వలసలు వాళ్లవి. యశోదకు ఇదంతా తెలియంది కాదు. పిల్ల పెళ్లి కోసం కష్టపడుతున్నవాళ్లు, పిల్లకు తగిన వయసు రాకుండానే పెళ్లి అనే కష్టాన్ని తెచ్చి పెట్టడం ఎందుకు అని ఊళ్లోవాళ్లకు నచ్చ చెబుతుంది. ‘సేవ్ ది చిల్డ్రన్’, ‘ఆశా’ సంస్థలు కలిసి ‘మ్యారేజ్: నో చైల్డ్స్ ప్లే’ అనే కార్యక్రమానికి రూపకల్పన చేశాయి. అందులో వాలంటీర్ యశోద. బాల్య వివాహాలను నివారించడంతో పాటు యశోద ఇప్పుడు బాలబాలికల సమానత్వం, రుతుక్రమ పరిశుభ్రత, గృహ హింస, బాలికల విద్య, నచ్చిన రంగాన్ని ఎంచుకునే విధంగా బాలికల్ని, యువతుల్ని ప్రోత్సహించేలా తల్లిదండ్రులను ఒప్పించడం వంటి బాధ్యతలను స్వచ్ఛందంగా స్వీకరించింది. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఈ వాలంటీర్‌ను ప్రత్యేకంగా అభినందించడంతో ఇప్పుడు యశోద ఎంత చెబితే అంత అయింది. ఏమైనా మంచే కదా తను చెబుతోంది అనే దగ్గరికి ఊరూ వాడా వచ్చేశారు. ఐక్యరాజ్య సమితి ఏటా ‘వి–అవార్డు’ ఇస్తుంటుంది. ఈ అవార్డును ఈ ఏడాది యశోదకు ఇస్తున్నట్లుగా శనివారం ప్రకటించింది. వి అంటే వాలంటీర్. ది బెస్ట్ వాలంటీర్‌గా యశోద ఐరాస గుర్తింపు పొందింది. ∙∙ 2017లో మొదటి బాల్యవివాహాన్ని ఆపేశాక, యశోద ఆ చుట్టుపక్కల గ్రామాలలో నెలకు రెండుసార్లు కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్‌లు నిర్వహించింది. ఆ పని మొదట తన ఊరితో ప్రారంభించింది. రెండో ఏడాదికల్లా మిగతా ఊళ్లలోనూ అవేర్నెస్ కార్యక్రమాల్ని మొదలుపెట్టింది. ఆమె లక్ష్యం 10–19 ఏళ్ల వయసులోని పిల్లలు. వాళ్లను సమీకరించి మంచి చెడులు వివరించేది. సొంత ఊరు దుమెర్పానీలోనే 15 బాల్య వివాహాలను నివారించగలిగింది యశోద. అప్పటికే ఆ అమ్మాయి పేరు జిల్లా మొత్తం వ్యాపించింది. నౌపడలోని నేషనల్ కాలేజ్‌లో డిగ్రీ చదువుకుంది యశోద. నౌపడలో ఇప్పుడున్న చైల్డ్ హెల్ప్‌లైన్ సదుపాయం ఆమె తీసుకున్న చొరవ ఫలితమే. ‘ఆడపిల్లల్తో నేనొక సామాజిక చైతన్య సైన్యాన్ని తయారు చేస్తాను’ అంటోంది యశోద ఇప్పుడు. చేస్తోంది కూడా తను. అంత పట్టుదల గల అమ్మాయి. ఐక్యరాజ్యసమితి ‘వి–అవార్డు’ విజేత యశోదా పాండే -
దేవ నాట్యానికి యశో వైభవం
జమీందారుల ఆస్థానంలో నాట్యగత్తెలు ఉండేవారు. తమ నాట్యరీతులతో అతిథులకు ఆహ్లాదం కలిగించేవారు. వారే దేవాలయాలలో భగవంతుని ప్రస్తుతిస్తూ నాట్యం చేస్తూ ‘దేవదాసీ’ అనే పేరుకు సార్థకతలా ఉండేవారు. రాన్రానూ దేవదాసీ నాట్యం పూర్వ వైభవాన్ని కోల్పోయింది. ఆ వైభవాన్ని తిరిగి తీసుకురావడం కోసం కృషి చేస్తున్నారు ప్రముఖ కూచిపూడి నాట్య కళాకారిణి శ్రీమతి యశోదా ఠాకూర్. ఆమెది హైదరాబాద్. కళావంతుల కుటుంబానికి చెందినవారు. కళావంతులు, దేవదాసీల గురించి యశోదను ప్రశ్నించినప్పుడు ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. అదొక ప్రతిష్ట: దేవదాసీలను రాజులు, జమీందారులు పోషించేవారు. ఈ కుటుంబాలకు చెందినవారికి ఒక నియమం ఉండేది. వారు నివసిస్తున్న గ్రామంలోని ఎవరో ఒకరికి మాత్రమే అంకితమై ఉండేవారు. ప్రముఖ నాట్యాచార్యులు బాలసరస్వతిగారి వరకు ఇదే సంప్రదాయం కొనసాగింది. జమీందారుల ఇళ్లకు వచ్చిన అతిథులకు కళావంతుల కుటుంబానికి చెందిన కళాకారిణితో నాట్యం చేయించడం వారి ప్రతిష్ఠకు సంబంధించిన విషయం. దివాణంలో ఎంత అందంగా నర్తించే దేవదాసీలు ఉన్నార న్నదే ప్రధానం. మేజువాణి: మేజువాణి అనేది మేజ్బన్ పారశీ పదం నుంచి వచ్చింది. ఈ పదానికి విందు, వేడుక అనే అర్థాలను నిఘంటువు చెబుతోంది. మేజ్ అంటే బల్ల, బన్ అంటే ఆతిథ్యం ఇచ్చేవారు అని అర్థం. ఇంటికి వచ్చిన అతిథికి బల్ల మీద భోజనం వడ్డించి, నాట్యంతో కనువిందు చేయడం వలన దేవదాసీలు చేసే నాట్యానికి మేజువాణి అనే పేరు వచ్చింది. జమీందారులను ప్రస్తుతిస్తూ, ఎటువంటి అలంకారాలు లేకుండా, చీర కట్టుతో, ముఖకవళికలతో భావాన్ని ప్రదర్శిస్తూ, విలాసిని నాట్యం అభినయిస్తారు. గోదావరి జిల్లా ముమ్మిడివరం వాస్తవ్యులు అన్నాబత్తుల లక్ష్మీమంగతాయారు నేటికీ ఈ నాట్యాన్ని ప్రత్యేక శ్రద్ధతో అందరికీ నేర్పుతున్నారు. భామాకలాపం, జావళి, వర్ణం, శబ్దం, పదం నేర్చుకోవడం మొదలుపెట్టాక, విలాసిని నాట్యం ఎందుకు చేస్తున్నారో తెలిశాక, ఆ నాట్యం మానేశాను. కళావంతులు: కర్ణాటక సంగీత విద్వాంసులురాలు భారతరత్న శ్రీమతి ఎం.ఎస్. సుబ్బులక్ష్మి, ఎం.ఎల్ వసంతకుమారి, సినీ నటులు ఎస్. వరలక్ష్మి, జి. వరలక్ష్మి, అంజలీదేవి, వహీదా రెహమాన్, జరీనా వహాబ్, జయప్రద, శ్రీవిద్య, జ్యోతిలక్ష్మి, జయమాలిని, శ్రీప్రియ వీరంతా కళావంతుల కుటుంబాలకు చెందినవారే. దాసరి నారాయణరావుగారు కూడా కళావంతుల కుటుంబానికి చెందినవారు కావడం వల్ల, ఆయన తీసిన చాలా చిత్రాలు కళావంతుల కుటుంబ నేపథ్యంలో వచ్చినవే. జయమాలిని, జ్యోతిలక్ష్మి గార్ల అమ్మమ్మ తంజావూరు రాజసభలో నాట్యం చేసేవారు. సింహనందిని: వేదాంతం లక్ష్మీనారాయణశాస్త్రి, సిఆర్ ఆచార్యులు... దేవదాసీలతో స్నేహంగా ఉంటూ, వారి దగ్గర నుంచి నాట్యానికి సంబంధించిన విషయాలు తెలుసుకునేవారు. ఈ ఇరు వర్గాల మధ్య ఎంతో అందమైన అనుబంధం ఉండేది. ఒకరినొకరిని గౌరవించుకునేవారు. లక్ష్మీనారాయణగారు కళావంతులను తన ఇంట్లోకి ఆహ్వానించేవారు. సిఆర్ ఆచార్యులు గారు కళావంతుల ఇళ్లలోకి వెళ్లారని తెలుసుకుని, ఆయనను వారి కుటుంబం వెలివేసింది. అయినా ఆయన తన జిజ్ఞాసను విడిచిపెట్టలేదు. స్వామివారి పల్లకీ సేవలో సంప్రదాయంగా కళావంతులు వీధిలో చేస్తున్న సింహనందిని నాట్యం వారి దగ్గరే నేర్చుకున్నారు. వేయిపడగలు: వేయిపడగలు నవలలో దేవదాసి పాత్ర గిరిక నాకు బాగా నచ్చింది. ఆ నవల చదివిన రోజుల్లో నాకు ఆ పాత్ర గురించి పూర్తిగా అర్థం కాలేదు. అప్పటికి నాలో ఇంకా అంత మెచ్యూరిటీ లేదు. రత్నగిరి, గిరిక పాత్రలు ఒక వైపు తక్కువగా అనిపించినా, ఎంతో లోతు ఉన్న పాత్రలు అవి. అందం, నాట్యం, తెలివితేటలు, చదువు అన్నీ పాత్రలు. చాణక్యుడు కళావంతులను రాజకీయంగా వాడేవాడు. దుష్ప్రచారం: ‘యోగా ఇన్ ఇండియన్ డ్యాన్స్ స్పెషల్లీ ఇన్ కూచిపూడి’ అనే అంశం మీద పిహెచ్డి చేశాను. నేను ఈ స్థాయికి రావడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అమ్మనాన్నల అండలో ఉండటం వల్ల నిలదొక్కుకోగలిగాను. కాలేజీ రోజుల్లో ఎంఏ డ్యాన్స్ చేస్తున్నప్పుడు, మా వారు (అప్పటికి ఇంకా వివాహం కాలేదు) ఎంఏ థియేటర్ ఆర్ట్స్ చేస్తుండేవారు. మా ఇద్దరివీ ఒకే అభిప్రాయాలు కావడంతో ఇద్దరం వివాహం చేసుకుందామని నిశ్చయించుకున్నాం. మేము కళావంతుల కుటుంబానికి చెందినవారమని నేను ఆయనకు ముందుగానే చెప్పాను. ఆయన అంగీకరించారు. నేను ఆయనను పెళ్లి చేసుకుంటున్నానని తెలిసి కూడా చాలామంది ఆయన దగ్గరకు వెళ్లి, మా సంబంధం చెడగొట్టడానికి చూశారు. మేం ముగ్గురం అమ్మాయిలమని, ఇంకా ఆ వృత్తిలోనే ఉన్నామని మా గురించి ప్రచారం చేశారు. మేం నాలుగు తరాల క్రితమే ఆ వృత్తి నుంచి బయటకు వచ్చేశాం. పూర్వ వైభవం జమీందారీ వ్యవస్థ ఉన్నంత వరకు వారి ఆస్థానంలో దేవదాసీలు ఉండేవారు. అందమైన దేవదాసీలు తమ ఆస్థానంలో ఉండటం జమీందారీకే గర్వకారణంగా భావించేవారు. మొగలుల పాలనలో జమీందారీ సంప్రదాయానికి కాలం చెల్లడంతో దేవదాసీ నిషేధ చట్టం వచ్చింది. అంతకాలం సిరిసంపదలతో తులతూగుతూ, భోగభాగ్యాలు అనుభవించిన దేవదాసీల పరిస్థితి ఒక్కసారిగా క్షీణించింది. తినడానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక పొట్ట చేత పట్టుకుని కొందరు హరికథలు చెబుతూ, మరికొందరు ఇతర వృత్తులలోకి ప్రవేశించారు. డిగ్రీలో ఆసక్తి పద్మ విభూషణ్ వెంపటి చినసత్యం గారి దగ్గర నా ఆరో ఏటనే నాట్యాభ్యాసం ప్రారంభించాను. 14 సంవత్సరాల పాటు అక్కడే పూర్తిగా నాట్యం నేర్చుకున్నాక, 1992లో మాస్టర్ డిగ్రీ కోసం సెంట్రల్ యూనివర్సిటీలో చేరి, అక్కడ నటరాజ రామకృష్ణ గారి దగ్గర ఆంధ్రనాట్యం నేర్చుకున్నాను. కోర్సులో భాగంగా దేవదాసీల గురించి, వారి నాట్యం గురించి ఆయన పరిచయం చేశారు. అప్పుడే నాకు దేవదాసీ నాట్యం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కలిగింది. అమ్మ చెప్పింది వెంపటి చినసత్యం మాస్టారి దగ్గర ‘కల్యాణ శ్రీనివాసం’ నాట్యం చేస్తున్న రోజుల్లోనే, నా గురించి నలుగురూ నాలుగు రకాలుగా మాట్లాడుకోవడం విన్నాను. మా అమ్మ దగ్గరకు వెళ్లి, ‘అమ్మా! నన్ను అందరూ కళావంతుల కుటుంబానికి చెందిన అమ్మాయి అంటున్నారు. కళావంతులు అంటే ఏమిటని ప్రశ్నించాను. కళావంతుల గురించి అమ్మ ఎంతో ఉన్నతంగా వివరించింది. అవగాహన లేకపోవడం వల్ల అందరూ వీరిని తక్కువ చేసి మాట్లాడుతున్నారని, ప్రస్తుతం వీరంతా కులవృత్తిని విడిచి, బాగా చదువుకుని, పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారని అమ్మ చెప్పింది. విద్యావంతులు మా నాన్నగారి తరం నాటికే ఈ నాట్యం విలువ తెలియదు. మా అమ్మమ్మకి నానమ్మ, నానమ్మ చెల్లెలు అయిన మధురవాణి, పిచ్చాయమ్మ గార్లు అన్నవరం జమీందారు దగ్గర నాట్యం చేసేవారు. రాజుల కాలం నుంచి దేవదాసీలే అందరికంటె ఎక్కువగా చదువుకున్నారు. చదువుకోవటాన్ని గర్వంగా భావించేవారు. వీరు బయటకు వస్తే ఇబ్బందులు పడవలసి వస్తుంది కనుక గురువులు స్వయంగా ఇంటికి వచ్చి చదువు నేర్పేవారు. మా అమ్మమ్మగారి నానమ్మ మధురవాణి గారి నాట్యం కోసం ఇతర దేశాల నుంచి ఎందరో సంపన్న కళాభిమానులు వచ్చేవారట. స్వామికి అంకితం వీధివీధికి ఉన్న గుడులలో దేవదాసీలు ఉండేవారు. ఆ ఆలయస్వామికి అంకితంగా బ్రాహ్మణులు కథ రాసేవారు. ఆలయానికి చెందిన దేవదాసి మాత్రమే నాట్యం చేయాలి అన్నంత ప్రత్యేకంగా రాసేవారు. ‘ఫలానా వ్యక్తి రచించగా, ఫలానా దేవదాసి చేస్తున్న నాట్యం’ అని ముందుమాట ఉండేది. ఆ రోజుల్లో దేవదాసీలకు, బ్రాహ్మణులకు మధ్య పవిత్ర అనుబంధం ఉండేది. రానురానూ దేవదాసీ వృత్తి దిగజారుతుండటంతో మా ముందు తరానికి చెందిన మధురవాణిగారు, ఇక నుంచి ఈ వృత్తికి దూరంగా ఉండేలా చూడాలని భావించి, మా అమ్మమ్మగారి తండ్రిగారైన చదలవాడ గోపీనాథం (బృందావన శ్రీకృష్ణం రచించారు) గారి నుంచి మాట తీసుకున్నారుట. ఇచ్చిన మాట ప్రకారం మా అమ్మమ్మ గారి తరం నుంచి మా వంశీకులు దేవదాసీ వృత్తిని విడిచి, కోటిపల్లి నుంచి కొవ్వూరు చేరుకుని గౌడీ సంప్రదాయాన్ని పాటిస్తూ జీవనం సాగించారుట. విలాసినీనాట్యం మా నాన్నగారు ఆర్టీసీలో అడిషనల్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. నాకు సంఘంలో రక్షణ ఉండటంతో, ‘అబద్ధంలో ఎందుకు బతకాలి, మన కళను మనం ఎందుకు వదులుకోవాలి’ అనుకున్నాను. విలాసిని నాట్యం, దేవదాసి నాట్యం నేర్చుకోవాలనుకున్నాను. రంగ్బాద్ గుడిలో ప్రముఖ నాట్యకారిణి స్వప్న సుందరి గొల్లకలాపం చూశాక, నేను వెతుకుతున్న నాట్యం నాకు దొరికిందనిపించిది. ఆవిడను సంప్రదించాను. సరిగ్గా ఆ సమయంలోనే ఆవిడ, ఆరుద్రగారితో కలిసి విలాసిని నాట్యం మీద పరిశోధన చేస్తున్నారని తెలిసింది. ఆవిడ నాతో కలిసి మొత్తం ఐదుగురికి ఈ నాట్యం నేర్పారు. ఐదేళ్ల పాటు విలాసిని నాట్యం నేర్చుకున్నాక, అందులోనూ నేను వెతుకుతున్న మూలనాట్యం కనిపించలేదని బాధపడ్డాను. ఆ సమయంలోనే ప్రొ. దేవేశ్ సోనీ విలాసిని నాట్యం మీద రచించిన పుస్తకం చదివాను. ఆయన దగ్గర నేను వెతుకుతున్న నాట్యం పుట్టుపూర్వోత్తరాలు దొరికాయి. సిగ్గుపడకూడదు మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. మన ప్రత్యేకత ఏంటో ప్రపంచానికి మనమే చూపాలి. నేను ఈ కమ్యూనిటీ వారిని ఒకటే కోరుతున్నాను. మీ ప్రతిభను మీరు దాచుకోకండి. నాట్యాన్ని భక్తిశ్రద్ధలతో అభ్యసించి, ‘వీరు లేనిదే ఈ నాట్యం నిలబడదు అనుకునేలా’ కళను నిలబెట్టాలి. అందుకోసం ఈ నాట్యాన్ని కొనసాగించాలి. అప్పుడు మనల్ని అందరూ గౌరవిస్తారు. ఒకవేళ వారు గౌరవించకపోతే, మనల్ని వారు ఎందుకు గౌరవించాలో చెప్పాలి. నాకు సోషల్ సెక్యూరిటీ ఉండటం వల్ల నేను ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను. మా కళావంతుల కుటుంబం నుంచి కనీసం నలుగురు వచ్చి అబద్ధాలు చెప్పకుండా, మేము కళావంతులం అని గర్వంగా చెప్పుకునేలా చూడాలని నా కోరిక. ఇంకా నేటికీ ఆ వృత్తిలోనే ఉండిపోయిన వాళ్లు చాలామంది ఉన్నారు. ఆ కుటుంబాలకు చెందిన వారికి చదువు చెప్పించి డాన్స్ నేర్పించే ప్రయత్నంలో ఉన్నాను. వారు తప్పనిసరిగా కళావంతుల కుటుంబీకులై ఉండాలి. – డాక్టర్ పురాణపండ వైజయంతి -
కాటికాపరి...యశోద...
బొమ్మనహళ్లి : స్మశానంలో అంత్య సంస్కారాలను కాటికాపరి నిర్వహిస్తారనేది జగద్వితమే. అయితే తుమకూరులోని గార్డెన్ రోడ్డులో ఉన్న స్మశానంలో ఓ మహిళ ఈ విధులను నిర్వర్తిస్తూ అందరూ ఆశ్చర్యపోయేలా చేస్తోంది. ఆర్య వైశ్య బ్యాంకు ఆధ్వర్యంలోని ఈ రుద్ర భూమిలో యశోద రాత్రి 11 గంటల వరకు ఈ విధుల్లో ఉంటారు. నెలకు సుమారు 20 శవాలకు సంస్కారాలను నిర్వహిస్తున్న ఈ ధీశాలి గురించి.... యశోద భర్త గూళయ్య తొలుత ఇక్కడ కాటికాపరిగా ఉండేవారు. అనారోగ్యం కారణంగా ఆయన మృత్యువాత పడడంతో భర్త విధులను తాను స్వీకరించింది. భర్త చనిపోయే నాటికి ఆమె చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. బతుకు బండిని లాగడానికి తానే కాటికాపరిగా పని చేస్తానంటే సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమైంది. ఓ మహిళ ఈ పని చేస్తుందా...అసలు మన ఆచారం ప్రకారం మహిళలు స్మశానంలో అడుగే పెట్టకూడదు. అలాంటిది కాటికాపరిగా పని చేస్తుందా...అనే ప్రశ్నలు ఆమెను చుట్టుముట్టాయి. అందరూ ఆచారాల గురించి మాట్లాడే వారే కానీ...ఆమె ఇద్దరు పిల్లల పోషణ గురించి ఎవరూ ఆలోచించిన పాపాన పోలేదు. ఆ పిల్లల కోసమే తాను రెండేళ్ల కిందట కాటికాపరి విధులను చేపట్టాల్సి వచ్చిందని యశోద వివరించారు. అన్నీ తానై...... అంత్యక్రియలకు కావాల్సిన ఏర్పాట్లన్నిటినీ యశోద పూర్తి చేస్తారు. ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు....అంతిమ సంస్కారానికి అవసరమైన సామాగ్రినంతటినీ సిద్ధం చేసుకుంటారు. బంధువులు శవానికి తలకొరివి పెట్టి వెళ్లిపోతారు. అయితే చితి మంటలు చల్లారే దాకా శవం పూర్తిగా కాలేదాకా...యశోద దగ్గరుండి చూసుకుంటారు. మగాడి లాగా యశోద భయంగొలిపే ఈ కార్యాన్ని పూర్తి చేస్తున్నా నెలకు ఆమెకు దక్కేది కేవలం రూ.2 వేలే. అంత్య సంస్కారాలకు హాజరయ్యే మృతుని తాలూకా వారు ఏమైనా ఇస్తే ఇవ్వవచ్చు లేదా వెళ్లిపోవచ్చు..గ్యారంటీ లేదు అని యశోద చెబుతారు. అయితే తన ఇద్దరి పిల్లల చదువు సంధ్యలకు తనకీ పని తప్పదని అంటారు. భర్త నుంచి సంక్రమించిన ఈ ఉద్యోగం తనకు పూర్తి సంతృప్తినిస్తోందని తెలిపారు. అంత్య సంస్కారాల్లో తానూ పాలు పంచుకున్నాననే తృప్తీ మిగులుతోందన్నారు. త్వరలోనే ఇక్కడ విద్యుత్ స్మశాన వాటికను ఏర్పాటు చేయబోతున్నారని, ఆ తర్వాత ఈ ఉద్యోగం ఉంటుందో...ఊడుతుందో తెలియడం లేదని యశోద ఆందోళన వ్యక్తం చేశారు. దానిని ఏర్పాటు చేసినా తనకిక్కడ ఓ చిరుద్యోగమైనా ఇవ్వాలని ఆమె నగర పాలికె అధికారులకు విజ్ఞప్తి చేశారు. -
తల్లి యశోద
కృష్ణుడిని యశోద పెంచింది. యశోదా నందనుడిగానే జీవించాడు. అయితే... కన్నతల్లి దేవకి అనే వాస్తవాన్ని కృష్ణుడి దగ్గర దాచలేదెవ్వరూ. దేవకి కడుపులో పుట్టిన తనను యశోద పెంచిందనే ఎరుకతోనే పెరిగాడు కృష్ణుడు. ఒక తల్లి కడుపున పుట్టి, మరో తల్లి ఒడిలో పెరిగే ప్రతి బిడ్డకీ ఆ వాస్తవం తెలియాలి. ‘ఊహ తెలియని వయసులో దత్తత తల్లి ఒడిని చేరినప్పటికీ, ఊహ తెలిసిన తరువాత లేదా లోకం తెలిసేవయసు వచ్చాక పిల్లలకు ఆ నిజాన్ని చెప్పి తీరాలి’ అంటున్నారు స్మృతి. స్మృతి పుణెలో ఉంటా రు. వయసు 37 ఏళ్లు. ఎలక్ట్రికల్ ఇంజనీర్. కొంతకాలం యూరప్‌లో వికీమీడియా ఫౌండేషన్‌లో పని చేసి 2014లో ఇండియాకి వచ్చేశారు. ఇద్దరు పాపాయిలను దత్తత తీసుకున్నారు. ఆమె దత్తత తీసుకునే నాటికి ఒక పాపకు ఆరేళ్లు, మరొక పాపాయికి ఐదేళ్లు. ఇప్పుడామె దత్తత గురించి సమాజంలో నెలకొని ఉన్న అపోహలు తొలగించడానికి, పిల్లలు లేని భార్యాభర్తలను చైతన్య వంతం చేయడానికే పూర్తి సమయాన్ని కేటాయించారు. దత్తతకు ఆవైపు ఈవైపు దత్తత అనే మాటకు... మనందరిలో ఒక అభిప్రాయం స్థిరపడిపోయి ఉంది. పిల్లలు లేని భార్యాభర్తలకు పిల్లలు లేని లోటును భర్తీ చేయడానికే దత్తత అనుకుంటాం. వాళ్లకు అమ్మానాన్నా అనే పిలుపు కోసమే అనీ అనుకుంటాం. కానీ దత్తత అంటే.. తనకంటూ ఇల్లు, కుటుంబం లేని బిడ్డకు ఓ కుటుంబాన్ని ఇవ్వడం కూడా. పిల్లలు లేని వారికి ఓ బిడ్డను ఇచ్చి వారిలో సంతోషాన్ని పెంచడం ఒక కోణం అయితే, తల్లిదండ్రులు లేని ఓ బిడ్డకు... అమ్మా, నాన్నలతో ఓ కుటుంబాన్నివ్వడమే మహోన్నతమైన పని. రెండు వేర్వేరు ప్రపంచాల మధ్య వారధి కట్టి ఆ ప్రపంచాలను దగ్గర చేయడం.చూడనట్లు వెళ్లిపోకండి‘‘మనదేశంలో ఈ వారధి పటిష్టం కావాల్సిన అవసరం చాలా ఉంది. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను షెల్టర్లకు చేర్చడానికి తెలిసిన ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. కన్న తల్లిదండ్రులు లేని కారణంగా ఏ బిడ్డ జీవితమూ అగమ్యంగా, అలక్ష్యంగా మారకూడదు. పుట్టిన ప్రతి బిడ్డకు జీవించే హక్కు ఉంది. చక్కగా పెరిగి, చదువుకుని ఇష్టమైన వృత్తిలో స్థిరపడి ఫలవంతమైన జీవితాన్ని జీవించే హక్కు కూడా ఉంది. పిల్లలను పోషిస్తూ, దత్తతకు పిల్లలు కావాలని వచ్చే వారితో అనుసంధానం చేయడానికి అనేక సంస్థలున్నాయి’’ అని చెబుతారు స్మృతి. మరో విషయాన్ని ఆమె తరచూ గుర్తు చేస్తుంటారు. అదేంటంటే.. ఆ తండ్రి జాడలేదు పుణెలో జాయ్ ఫౌండేషన్‌తో కలిసి పని చేస్తున్నారు స్మృతి. అక్కడికి ఓ వ్యక్తి కొన్ని ఏళ్ల కిందట మూడు నెలల పాపాయితో వచ్చాడు. తన భార్య చనిపోయిందని చెప్పి, మళ్లీ పెళ్లి చేసుకున్న తర్వాత బిడ్డను తీసుకెళ్తానని, అప్పటి వరకు సంరక్షించమని కోరాడు. ఏళ్లు గడిచినా అతడు రాలేదు. పెళ్లి చేసుకున్నాడో లేదో తెలియదు. ఆ పాపాయి చక్కగా పెరుగుతోంది. అయితే ఆమెను ఎవరికైనా దత్తత ఇవ్వాలంటే నిబంధనలు ఒప్పుకోవు. తండ్రి వచ్చి తన బిడ్డను ఇవ్వమన్నప్పుడు ఇవ్వగలగాలంటే... ఆ బిడ్డను దత్తత ఇవ్వకూడదు. ఆ తండ్రి వస్తాడో రాడో తెలియదు. ఎలా మరి? ఆచరణలో ఎదురయ్యే ఇలాంటి కొన్ని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు స్మృతి. ఆ బిడ్డకు మంచి జీవితాన్నివ్వగలిగిన అవకాశం ఉండి కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి అది. ఇలాంటి పిల్లల విషయంలో తల్లి, తండ్రి లేదా సంరక్షకులు (ఎవరైతే షెల్టర్‌లో చేరుస్తారో వారు) సంవత్సరాల పాటు బిడ్డ కోసం రాకపోతే, షెల్టర్ హోమ్స్ ఆ పిల్లలను దత్తత ఇవ్వవచ్చు అని సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ అథారిటీ నియమావళిలో మార్పులు చేయవచ్చని స్మృతి సూచించారు. ఆ సూచన పరిశీలనలో ఉంది. మనసు విశాలం అవ్వాలి దత్తత కోసం వచ్చే తల్లిదండ్రులకు స్మృతి వేడికోలు ఒక్కటే. ‘‘స్వల్ప అనారోగ్యాలు, మెల్లకన్ను వంటి చిన్న లోపాలు ఉన్న పిల్లలను కూడా దత్తత తీసుకోండి. వారికి వైద్యం చేయించగలిగిన ఆర్థిక స్థోమత మీకున్నప్పుడు అలాంటి పిల్లలను మెరుగ్గా మార్చగలిగిన అవకాశం మీ చేతులో ఉన్నప్పుడు ఆ మేరకు కొంత మీ మనసును విశాలం చేసుకోండి’’ అని అభ్యర్థిస్తున్నారు స్మృతి. ఆమె కౌన్సెలింగ్‌తో కన్విన్స్ అయిన ఒక జంట కాలు లేని పిల్లవాడిని దత్తత తీసుకుని ఆపరేషన్ చేయించి కృత్రిమ కాలు పెట్టించిన సంగతిని కూడా ఆమె గుర్తు చేస్తారు. అలాగే పెద్ద పిల్లలను కూడా దత్తత తీసుకోవలసిందిగా మరీ మరీ చెబుతుంటారు. పెద్ద పిల్లలను దత్తత తీసుకుంటే వాళ్లు తమను అసలైన తల్లిదండ్రులుగా స్వీకరించలేరేమోననే భయం దత్తత తీసుకునే వాళ్లను వేధిస్తుంటుంది. నిజానికి అలాంటిదేమీ ఉండదని, అందుకు తానే నిదర్శనం అంటారు.. తనే పిల్లలకు దత్తతగా వెళ్లిపోయానని ఎప్పుడూ చెబుతుండే.. ఈ మాతృమూర్తి చిరునవ్వులు చిందిస్తూ. అమ్మా.. మా అమ్మ ఎవరు? ‘నేను దత్తత తీసుకున్న చిన్న పాపాయి ఏమీ అడగదు, కానీ పెద్ద పాపాయి అడిగింది... అమ్మా! నాకు నువ్వు అమ్మవు అయ్యే వరకు నాకు అమ్మ ఎవరు? అని. తనకు వివరంగా చెప్పాను. ఆ ప్రశ్నకు ముందు ఎలా ప్రేమగా ఉండేదో ఆ తర్వాతా అలాగే ఉంది నాతో. కాబట్టి పిల్లలు పేరెంట్స్‌గా రిసీవ్ చేసుకోరనే భయం వద్దు. ఊహ తెలిసిన పిల్లలను కూడా దత్తత తీసుకోండి’ అని కోరుతున్నారామె. అలాగే దత్తత తీసుకున్న తల్లులు అంతటితో ఆగిపోకుండా సమాజంలో దత్తత మీద ఉన్న అపోహలను తొలగించే బాధ్యతను కూడా తీసుకోమని అభ్యర్థిస్తుంటారు స్మృతి. – మంజీర