'ఊ అంటావా మావా.. ఉఊ అంటావా మావా..' సాంగ్‌తో సమంత క్రేజ్ దేశమంతా పాకింది. 'పుష్ప' సినిమాలోని ఈ పాటకే కాదు సమంత అందచందాలకు కూడా అందరూ ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఆమె పాన్ ఇండియా మూవీ 'యశోద'లో నటిస్తోంది. హరి, హరీష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో 30 - 40 శాతం సన్నివేశాలు ఒకే ప్రాంతంలో జరుగుతాయి. ఇందుకోసం హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో మూడు కోట్లతో సెవెన్ స్టార్ హోటల్స్ సౌకర్యాలను తలపించేలా సెట్స్ వేసిన విషయం తెలిసిందే!
తాజాగా సమంత ఇల్లు వదిలేసి సెట్స్‌లోనే ఉండిపోయిందట! ఈ సెట్ బాగా నచ్చడంతోపాటు త్వరగా షూటింగ్‌కు రెడీ అవొచ్చన్న ఉద్దేశ్యంతో సామ్ కొన్నిరోజులపాటు అక్కడే ఉండనున్నట్లు ఓ వార్త ఫిల్మీదునియాలో చక్కర్లు కొడుతోంది. ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది. కాగా ఈ చిత్రంలో ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు సంగీతం: మణిశర్మ, లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక, కెమెరా: ఎం. సుకుమార్, సహనిర్మాత: చింతా గోపాలకృష్ణారెడ్డి.
చదవండి: ఇది నా జీవితంలో జరిగింది, అర్ధరాత్రి కశ్మీర్‌ను వీడాం: నటి ఎమోషనల్
Comments
Please login to add a commentAdd a comment