
సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా యశదో. సరోగసి నేపథ్యంలో థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం నేడు(శుక్రవారం)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విమెన్ సెంట్రిక్ మూవీ అయినప్పటికీ యాక్షన్ సన్నివేశాల్లో స్టార్ హీరోకు ఏమాత్రం తగ్గకుండా సమంత తన నటనతో మెస్మరైజ్ చేసిందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. ఇక చూసిన ప్రేక్షకులు సైతం సమంత డెడికేషన్ చూసి ఫిదా అవుతున్నారు.
ప్రతి ఫ్రేములో సమంత తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుందంటూ సామ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇదిలా ఉండగా యశోద సినిమా నుంచి ఓ మేకింగ్ వీడియోను వదిలారు. శత్రువుల బారి నుంచి యశోద తప్పించుకుని ఒక అడవిలో పరిగెడుతూ ఉండగా,ఆమెను ఒక వేట కుక్క వేటాడటం వంటివి థ్రిల్లింగ్‌గా కనిపిస్తుంది. ఈ సీన్‌ను ఎలా షూట్ చేసారన్నది వీడియోలో చూడొచ్చు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. చదవండి: సమంత చేతికి ఆ ఉంగరాలు? దోషం వల్లే ఇలా చేస్తుందా?
Comments
Please login to add a commentAdd a comment