
సమంత టైటిల్ రోల్ చేసిన చిత్రం ‘యశోద’. హరి–హరీష్ తెరకెక్కింన ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలు పోషించగా, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ కీలక పాత్రలు చేశారు. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదలైంది.
ఈ సందర్భంగా శనివారం జరిగిన విలేకర్ల సవవేశంలో కల్పికా గణేష్ మాట్లాడుతూ– ‘‘కొన్ని సినిమాల్లో నేను లీడ్ రోల్స్ చేస్తున్నప్పటికీ ‘యశోద’ వంటి కథ అందరికీ తెలియాలని ఈ సినివలో గర్భవతిగా ముఖ్య పాత్ర చేసేందుకు ఒప్పుకున్నాను’’ అన్నారు.‘‘యశోద’లాంటి కథలు అరుదుగా వస్తాయి’’ అన్నారు ప్రియాంకా శర్మ. ‘‘లీల క్యారెక్టర్ బాగా చేశావని సమంతగారు చెప్పడాన్ని నేను బెస్ట్ కాంప్లిమెంట్‌గా భావిస్తున్నాను’’ అన్నారు దివ్య శ్రీపాద.
Comments
Please login to add a commentAdd a comment