List Of 26 Upcoming Movies Releases In OTT And Theatres In Nov 2nd Week 2022 - Sakshi
Sakshi News home page

OTT, Theatre Releases This Week: ఈ వారం థియేటర్‌, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే

Published Tue, Nov 8 2022 3:05 PM | Last Updated on Tue, Nov 8 2022 4:20 PM

List Of Theatre and OTT Release Movies of November 1st Week - Sakshi

ప్రతి వారం కొత్త సినిమాలు బాక్సాఫీసు వద్ద సందడి చేస్తుంటాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్ద హీరోల హడావుడి కనిపంచడం లేదు. గతవారం రిలీజ్‌ అయిన చిత్రాల్లో ఊర్వశివో రాక్షసివో మంచి విజయం సాధించింది. ఇక ఈ వారం స్టార్‌ హీరోయిన్‌ సమంత చిత్రంతో పాటు పలు చిన్న సినిమాలు థియేటర్లోకి రాబోతున్నాయి. అంతేకాదు పలు వెబ్‌ సరీస్‌లు, సినిమాలు కూడా ఓటీటీకి రాబోతున్నాయి. మరి ఈ వారం థియేటర్‌/ఓటీటీలోకి రాబోయే సినిమాలేంటో చూద్దాం!

సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్‌ మూవీ ‘యశోద’. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. ఇందులో ఉన్ని ముకుందన్‌, వరలక్ష్మి శరత్‌ కుమార్‌, రావూ రమేశ్‌తో పాటు తదితరులు కీలక పాత్రలో నటించారు. సరోగసి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది.

అమితాబ్‌బచ్చన్‌, అనుపమ్‌ ఖేర్‌, బొమన్‌ ఇరానీ, పరిణీతి చోప్రా, నీనా గుప్తా, సారిక తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఊంచాయి’. ప్రేమ కథ నిండిన కుటుంబ చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించిన దర్శక-నిర్మాత సూరజ్‌ బర్జాత్య దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఒక విభిన్న కథతో రూపొందిన ఈ చిత్రం నవంబరు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘ఆటగదరా శివ’ ఫేమ్‌ ఉదయ్‌ శంకర్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నచ్చింది గర్ల్‌ ఫ్రెండ్‌’. గురు పవన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జెన్నీఫర్‌ హీరోయిన్‌. డా. సౌజన్య ఆర్‌. అట్లూరి సమర్పణలో అట్లూరి నారాయణరావు నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఒక రోజులో జరిగే ప్రేమకథగా  ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర బృందం చెబుతోంది. సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో కూడిన ప్రేమకథ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచేందుకు సిద్ధమైంది.

శ్రీరామ్‌ నిమ్మల, రిచా జోషి జంటగా నటించిన చిత్రం ‘మది’. నాగధనుష్‌ దర్శకత్వం వహించారు. రామ్‌కిషన్‌ నిర్మాత. పీవీఆర్‌ రాజా స్వరకర్త. యువతరానికి నచ్చే మంచి కథతో పాటు, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ‘మది’లో ఉన్నాయని చిత్ర బృందం చెబుతోంది. నవంబరు 11న ఈ చిత్రం థియేటర్‌లలో విడుదల కానుంది.

                                                                                   ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు

అమెజాన్ ప్రైమ్‌:

  • బ్రీత్‌ : ఇన్‌ టు ది షాడోస్‌ (హిందీ సిరీస్‌2)  నవంబరు 9
  • ఇరావిన్‌ నిగళ్‌ (తమిళ చిత్రం) నవంబరు 11
  • సిక్సర్‌ (హిందీ సిరీస్‌) నవంబరు 11

డిస్నీ పస్ల్‌ హాట్‌స్టార్‌:

  • సేవ్‌ ఔర్‌ స్క్వాడ్‌ (ఒరిజినల్‌ సిరీస్‌) నవంబరు 09
  • మనీ మాఫియా (హిందీ సిరీస్‌3) నవంబరు 10
  • రోషాక్‌ (తెలుగు) నవంబరు 11

నెట్ ఫ్లిక్స్:

  • బిహైండ్ ఎవ్రీ స్టార్ (కొరియన్ సిరీస్)- నవంబర్‌ 8
  • ద క్లాజ్‌ ఫ్యామిలీ 2 (డచ్ సిరీస్)- నవంబర్‌ 8
  • ట్రివియా వర్స్ (ఇంగ్లీష్) -నవంబర్‌ 8
  • ది క్రౌన్ (సిరీస్ 5) ఇంగ్లీష్‌- నవంబర్‌ 9
  • ది సాకర్ ఫుట్ బాల్ (ఇంగ్లీష్)- నవంబర్ 9
  • ఫిఫా అన్ కవర్డ్(డాక్యుమెంటరీ)-నవంబర్ 9
  • ఫాలింగ్ ఫర్ క్రిస్మస్ (ఇంగ్లీష్‌)-నవంబర్ 10
  • లాస్ట్ బుల్లెట్ (ఫ్రెంచ్), నవంబర్ 10
  • వారియర్ నన్ (సిరీస్ 2)-నవంబర్ 10
  • లవ్ నెవర్ లైస్ (ఇంగ్లీష్)-నవంబర్ 10 
  • ఈజ్ దట్ బ్లాక్ ఎనఫ్ ఫర్ యూ (ఇంగ్లీష్)-నవంబర్ 11
  • మోనికా ఓ మై డార్లింగ్ (హిందీ)-నవంబర్ 11

సోనీలివ్:

  • తనవ్ – హిందీ సిరీస్- నవంబరు 11

జీ5:

  •  ముఖ్ బీర్ (సిరీస్ – హిందీ)-నవంబర్ 11

లయన్స్‌ గేట్‌ ప్లే

  • హాట్‌సీట్‌ (హాలీవుడ్‌) నవంబరు 11

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement