making video
-
సమాజానికి ప్రతిబింబం
ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘యుఫోరియా’. ఈ మూవీతో విఘ్నేశ్ గవిరెడ్డి టాలీవుడ్‌కి హీరోగా ఎంట్రీ ఇస్తుండగా, నటి ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. సారా అర్జున్, నాజర్, రోహిత్, లిఖిత యలమంచలి, పృథ్వీరాజ్ అడ్డాల, కల్పలత, సాయి శ్రీనికా రెడ్డి ఇతర పాత్రలు పోషించారు. గుణ హ్యాండ్ మేడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మాణంలో గుణశేఖర్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని ప్రకటించి, మహా శివరాత్రి సందర్భంగా ‘యుఫోరియా’ మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ‘‘నేటి సమాజాన్ని ప్రతిబింబించేలా ట్రెండీ టాపిక్ నేపథ్యంలో సాగే చిత్రం ‘యుఫోరియా’. ఇప్పటికే విడుదల చేసిన మూవీ టైటిల్ గ్లింప్స్, కాన్సెప్ట్ వీడియో అందర్నీ ఆకట్టుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలనుప్రారంభించాం. త్వరలోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సమర్పణ: రాగిణి గుణ, సంగీతం: కాల భైరవ, కెమేరా: ప్రవీణ్ కె. పోతన్. -
'పుష్ప2' మేకింగ్ వీడియో.. బెంగాల్లో బన్నీ ఆల్ టైమ్ రికార్డ్
పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ (Allu Arjun) నటనకు సినీ అభిమానులు ఫిదా అవుతున్నారు. దీంతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్‌తో బన్నీ అస్సలు తగ్గడం లేదు. వసూళ్ల విషయంలో కనపడిన ప్రతి రికార్డ్‌ను రప్పా రప్పా అంటూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇంతలోనే పుష్ప రీలోడ్ వర్షన్ పేరుతో జనవరి 17న మళ్లీ థియేటర్స్‌లోకి రానున్నాడు. దీంతో తాజాగా ఈ చిత్రం నుంచి మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది.కేవలం 32 రోజుల్లోనే ‘పుష్ప 2 : ది రూల్’ (Pushpa 2: The Rule ) ప్రపంచ వ్యాప్తంగా రూ.1831 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి, సరికొత్త రికార్డు సృష్టించినట్లు మేకర్స్ ప్రకటించారు. అల్లు అర్జున్ , రష్మికా మందన్నా(Rashmika Mandanna) జోడీగా నటించిన చిత్రం ‘పుష్ప 2: ది రూల్’. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల ప్రత్యేకపాటలో ప్రేక్షకులను మెప్పించారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా డిసెంబరు 5న విడుదలైంది. (ఇదీ చదవండి: నయనతార, ధనుష్ కేసు విచారణలో ఏం జరిగిందంటే..?)అయితే, 22నిమిషాల నిడివిని అదనంగా ఈ చిత్రానికి కలపనున్నారు. వాస్తవంగా పుష్ప2 రీలోడ్ వర్షన్ జనవరి 10వ తేదీనే విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే, సంక్రాంతి రేసులో మూడు సినిమాలు వస్తుండటంతో కలెక్షన్స్ పరంగా వాటిపై ప్రభావం చూపించవచ్చని విడుదలను వాయిదా వేసుకున్నారు. దీంతో జనవరి 17న రీలోడ్ వర్షన్ రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటించడం విశేషం.బెంగాల్లో పుష్పరాజ్ ఆల్ టైమ్ రికార్డ్బెంగాల్లో పుష్ప ఓ రికార్డ్ సాధించింది. మామూలుగా బెంగాలీ సినిమా మార్కెట్ చాలా చిన్నదని తెలిసిందే. అక్కడ ఎక్కువగా తక్కువ బడ్జెట్ చిత్రాలు మాత్రమే తెరకెక్కుతుంటాయి. ఈ నేపథ్యంలో ‘పుష్ప 2’ బెంగాల్లో రూ. 50 కోట్లు వసూలు చేసి, సంచలనం సృష్టించింది. కాగా ‘అమేజాన్ ఓబిజాన్’ (2017) అనే చిత్రం రూ. 48 కోట్ల వసూళ్లతో అప్పట్లో రికార్డ్ నెలకొల్పింది. ఇది స్ట్రయిట్ చిత్రం. ఆ రికార్డును తాజాగా ‘పుష్ప 2’ బ్రేక్ చేసింది. ఒక డబ్బింగ్ సినిమా ఇలా ఆల్ టైమ్ రికార్డ్ నెలకొల్పడం అంటే మామూలు విషయం కాదని చెప్పవచ్చు. -
గురునానక్ జయంతి: ప్రత్యేక ప్రార్థనలు, ప్రసాదం రెసిపీ షేర్ చేసిన బాలీవుడ్ నటి
కార్తీక పౌర్ణమి గురునానక్ జయంతి పర్వదినాన్ని బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్ జరుపుకుంది. ఈ శుభ సందర్భంగా స్వయంగా ఇంట్లోనే కడ ప్రసాదం(హల్వా) తయారు చేసి గురుద్వారాలో ప్రార్థనలు, నివేదన అనంతరం పంచిపెట్టింది. కుటుంబంలో తరతరాలుగా కడ ప్రసాదం తయారు చేస్తున్న వైనాన్ని వివరించి, ఈ రెసిపీ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. గురుద్వారాలో పూజల తరువాత మీడియాకు ప్రసాదాన్ని పంచిపెట్టడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.గురునానక్ జయంతి సందర్భంగా ప్రసాదం హల్వాను ఎలా తయారు చేయాలో దశలవారీగా నిమ్రత్ కౌర్ వెల్లడించింది. ఈ ప్రసాదం తయారు చేయడం తన తల్లి దగ్గరనుంచి నేర్చుకున్నట్టు తెలిపింది. అలాగే తన తాతగారు చాలా ఏళ్లు గురుద్వారాలో హల్వా తయారు చేసేవారనీ, ఆయన్నుంచి అమ్మ , అమ్మనుంచి తాను నేర్చుకున్నానని చెప్పింది.కాగా బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్ అభిషేక్ బచ్చన్‌తో ఎఫైర్ ఉందనే పుకార్ల మధ్య గత కొన్ని వారాలుగా వార్తల్లో నిలుస్తోంది. ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ మధ్య సమస్యలకు నిమ్రత్ కౌర్‌తో ఎఫైర్ ఒక కారణమని ఊహాగానాలు జోరుగు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఊహిస్తున్నాయి. ఈ వివాదాలను, ఆరోపణల ప్రభావం తనమీద ఏమాత్రం పడకుండా నిమ్రత్ కౌర్ తన పని తాను చేసుకుపోతోంది. View this post on Instagram A post shared by BollywoodShaadis.com (@bollywoodshaadis); View this post on Instagram A post shared by Nimrat Kaur (@nimratofficial) -
ధనుశ్ బర్త్ డే స్పెషల్.. ఈ వీడియో చూశారా?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ ఇటీవల రాయన్ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చారు. తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం జూలై 26న థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజు నుంచే రాయన్ మూవీ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.తాజాగా ఇవాళ ధనుశ్ బర్త్ డే కావడంతో చిత్రబృందం, అభిమానులు ఆయనకు విషెస్ చెబుతున్నారు. అంతే కాకుండా సన్ పిక్చర్స్ సంస్థ ప్రత్యేక వీడియోను షేర్ చేసింది. ధనుశ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ రాయన్ మూవీకి సంబంధించిన మేకింగ్ వీడియోను ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. కాగా.. ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ కీలక పాత్రలో కనిపించారు. -
సలార్ మూవీ మేకింగ్ వీడియో
-
'సలార్' మేకింగ్ వీడియో.. ఆ సీన్స్ ఇలా తీశారా?
డార్లింగ్ ప్రభాస్ 'సలార్' మూవీ ఆల్రెడీ బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపుతోంది. రెండు రోజుల్లోనే రూ.295 కోట్ల వసూళ్లు సాధించింది. మరోవైపు ఓవర్సీస్లో 5 మిలియన్ డాలర్ మార్క్ దాటేసింది. ఇలా ప్రేక్షకుల్ని అలరిస్తూ కలెక్షన్స్‌లో దూసుకెళ్తున్న టైంలో మూవీ టీమ్ సర్ప్రైజ్ వీడియో రిలీజ్ చేసింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్) ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా 'సలార్' సినిమా తీశారు. అందరికీ తెగ నచ్చేసిన ఈ సినిమాలోని కొన్ని సీన్స్ ఎలా తీశారనేది చాలామందికి తెలుసుకోవాలని ఉంటుంది. ఇప్పుడు వాళ్లకోసమా అన్నట్లు నిర్మాణ సంస్థ.. 'సలార్' మేకింగ్ వీడియో రిలీజ్ చేసింది. ఇందులో ఫైట్ సీన్స్‌కి సంబంధించిన ఎలా తీశారనేది చూపించారు. అదే టైంలో మేకింగ్ వీడియో అయినప్పటికీ గూస్ బంప్స్ ఇవ్వడం విశేషం. (ఇదీ చదవండి: ఊరమాస్‌కి కేరాఫ్.. ఆ విషయంలో ఎక్స్పర్ట్.. ప్రశాంత్ నీల్ సక్సెస్ సీక్రెట్ ఇదే!) -
అండర్ వాటర్‌లో నాగచైతన్య.. 'కస్టడీ' మేకింగ్ వీడియో రిలీజ్
నాగచైతన్య నటించిన తాజా చిత్రం కస్టడీ. ఇందులో కృతిశెట్టి హీరోయిన్గా నటించింది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చై తొలిసారిగా పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా వస్తున్న ఈ సినిమా మే 12న విడుదల కానుంది. చదవండి: 14ఏళ్లుగా భోజనం చేయడం లేదు : బాలీవుడ్ నటుడు ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై అంచనాలను పెంచేశాయి.తాజాగా ఈసినిమా నుంచి మరో క్రేజీ వీడియోను వదిలారు. అండర్ వాటర్‌లో చేసే యాక్షన్ సీన్స్ మేకింగ్ వీడియోను తాజాగా రిలీజ్ చేశారు.కాగా ఈ సినిమాలో ప్రియమణి, అరవింద స్వామి, శరత్‌కుమార్‌లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. -
సాయి ధరమ్ తేజ్, సంయుక్తల 'విరూపాక్ష' షూటింగ్ ఎలా చేశారో చూడండి..
సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటిస్తున్న చిత్రం విరూపాక్ష. కార్తీక్ దండు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్‌తో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింఇ. ఈనెల 21న తెలుగు, తమిళ భాషల్లో విరూపాక్ష గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ జోరు పెంచిన మేకర్స్ వరుస ఇంటర్వ్యూలతో బిజీ అయ్యారు. తాజాగా ఆడియెన్స్‌లో మరింత క్యూరియాసిటీని పెంచేలా ఈ సినిమా మేకింగ్ వీడియోను వదిలారు. ఇంటెన్స్ యాక్షన్‌తో మంచి బజ్ క్రియేట్ చేస్తున్న ఈ మూవీ మరి థియేటర్లలో ప్రేక్షకులను ఎంత వరకు మెప్పిస్తుందన్నది చూడాల్సి ఉంది. -
'దసరా' మూవీ షూటింగ్ ఎలా జరిగిందో తెలుసా? వీడియో రిలీజ్
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా 'దసరా' మాస్ మేనియా కనిపిస్తుంది. నేచురల్ స్టార్ నాని, కీర్తిసురేష్ జంటగా నటించిన ఈ సినిమా ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో దుమ్మురేపుతుంది. విడుదలైన తొలిరోజు నుంచే హిట్ టాక్‌ను తెచ్చుకొని బాక్సాఫీస్ సునామీ సృష్టిస్తోంది. విడుదలైన వారం రోజుల్లోనే దసరా 100 కోట్ల గ్రాస్ మార్క్ దాటేసి అదరగొడుతుంది. నాని కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా వీకెండ్ కలెక్షన్స్ మరింత పెరగనున్నాయి. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ రీల్స్‌లోనూ దసరా పాటలు, డైలాగ్స్ మోత మోగుతోంది. సినిమా సూపర్ హిట్ కావడంతో రీసెంట్గా కరీంనగర్లో సక్సెస్ మీట్‌ను గ్రాండ్‌గా నిర్వహించింది చిత్ర బృందం. ఇదిలా ఉంటే దసరా మేకింగ్ వీడియోను తాజాగా విడుదల చేశారు. పవ్వ తాగడం, సిల్క్ బార్ దగ్గర్నుంచి క్లైమాక్స్ షాట్స్ వరకు మేకింగ్ వీడియోను వదిలారు. మీరూ చూసేయండి మరి. -
డూప్ లేకుండా రిస్కీ ఫైట్స్.. సుధీర్ బాబు యాక్షన్ స్టంట్స్ మేకింగ్ వీడియో రిలీజ్
సుధీర్ బాబు హీరోగా మహేష్ దర్శకత్వంలో వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘హంట్’. ఈ నెల 26న ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఈ చిత్రంలోని యాక్షన్ సీక్వెన్సెస్‌ని ఫ్రాన్స్‌కి చెందిన క్యాంపస్ యూనివర్స్ కాస్కేడ్స్ టీమ్ డిజైన్ చేసింది. సుధీర్‌బాబు మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రంలోని రిస్కీ ఫైట్స్‌కి డూప్ వాడలేదు. రోప్, బెడ్లాంటివి ఏవీ లేకుండానే ఫైట్స్ చేశాం. ఈ సినిమాలో అన్నీ మరపోయే రెండు షేడ్స్ ఉన్న అర్జున్ పాత్ర చేశాను. జ్ఞాపకశక్తి కోల్పోక ముందు కోల్పోయాక.. ఇలా నా పాత్ర ఉంటుంది’’ అన్నారు. ‘‘హై వోల్టేజ్యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ త్రాన్ని రూపొందించాం. హాలీవుడ్ వర్వెల్ స్టూడియోస్ నిర్మించిన పలు చిత్రాలకు వర్క్ చేసిన రేనాడ్ ఫవెరో, బ్రయాన్ విజియర్ ‘హంట్’కి స్టంట్స్ కంపోజ్ చేశారు. ‘జాన్ విక్ 4’కి చిత్రానికి కూడా వాళ్లే స్టంట్ కొరియోగ్రాఫర్స్. ఈ ముగ్గురికీ తొలి భారతీయ చిత్రం ఇది’’ అన్నారు ఆనందప్రసాద్. ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, కెమెరా: అరుల్ విన్సెంట్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అన్నే రవి. -
వంద కోట్లకు చేరువలో ధమాకా, మేకింగ్ వీడియో రిలీజ్!
మాస్ మహారాజ రవితేజ నటించిన మాస్ ఎంటర్టైనర్ ధమాకా థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. కేవలం 9 రోజుల్లోనే రూ.77 కోట్లు రాబట్టిన ఈ సినిమా కొత్త ఏడాది మొదటి రోజును బాగా క్యాష్ చేసుకుంది. పదవ రోజు ఏకంగా రూ.12 కోట్లపై చిలుకు వసూళ్లు సాధించింది. దీంతో ధమాకా కలెక్షన్లు రూ.89 కోట్లకు చేరాయి. ఈ స్పీడు ఇలాగే కొనసాగితే త్వరలోనే ఈ మూవీ వంద కోట్ల క్లబ్బులో చేరడం ఖాయం. ఇకపోతే తాజాగా చిత్రయూనిట్ ధమాకా మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో షూటింగ్ అంతా ఎంత సరదాగా సాగిపోయిందో చూపించారు. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ సినిమా అదిరిపోయిందని, ధమాకా రూ.100 కోట్ల క్లబ్బులో ఎప్పుడు చేరుతుందా? అని వెయిట్ చేస్తున్నామంటున్నారు. కాగా నక్కిన త్రినాథరావు డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. రవితేజకు జోడీగా నటించిన హీరోయిన్ శ్రీలీల తన అందంతో, డ్యాన్స్ స్టెప్పులతో అదరగొట్టింది. చదవండి: ఫ్యాన్స్ అత్యుత్సాహం.. ఈవెంట్లో నటుడికి గాయం చిరు వాల్తేరు వీరయ్య, బాలయ్య వీరసింహారెడ్డి స్పెషల్ పోస్టర్లు చూశారా? -
'నీకేమో అందమెక్కువ.. నాకేమో తొందరెక్కువ'.. వాల్తేరు వీరయ్య సాంగ్ లీక్
మెగాస్టార్ చిరంజీవి, శృతిహాసన్ జంటగా నటిస్తోన్న చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు కానుంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ ప్రధానపాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే వీరిద్దరితో కలిసి స్టెప్పులేసిన ఓ మాస్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. (ఇది చదవండి: వాల్తేరు వీరయ్య నుంచి మరో మాస్ సాంగ్, గొంతు కలిపిన చిరు, రవితేజ) తాజాగా మెగాస్టార్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో అభిమానులను పలకరించాడు. ఇంతకుముందు శ్రీదేవి సాంగ్‌ను లీక్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అదే తరహాలో మరో వీడియోను రిలీజ్ చేశారు మెగాస్టార్. చిరంజీవి మాట్లాడుతూ.. 'హాయ్ ఫ్రెండ్స్ వాల్తేరు వీరయ్యలోని రెండో సాంగ్ డిసెంబర్ 17న పూర్తి చేసుకున్నాం. ఫ్రాన్స్‌లోని తూలు అనే సిటీలో సాంగ్ తీశాం. వాతావరణం అంత చలిగానే ఉంది. ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్, శేఖర్ మాస్టర్, డైరెక్టర్ బాబీతో సహా మిగిలిన చిత్రబృందం ఎంతో చక్కగా సహకరించారు. షూటింగ్ చక్కగా జరిగింది. అందరూ చాలా కష్టపడ్డారు. ఈ సాంగ్‌లో నాకు నచ్చింది ఒకటుంది. 'నీకేమో అందమెక్కువ.. నాకేమో తొందరెక్కువ' అంటూ అలాగే 'నీక్కూడా అందమెక్కువ.. నాక్కూడా తొందరెక్కువ' అంటూ సాగే అనే లిరికల్ నాకైతే బాగా నచ్చింది. త్వరలోనే లిరికల్ వీడియో రిలీజ్ చేస్తాం. ఈ లోకేషన్ నాకు చాలా బాగా నచ్చింది.' అంటూ వీడియో రిలీజ్ చేశారు చిరు. దీంతో మరోసారి మెగాస్టార్ సాంగ్ లీక్ చేసి అభిమానులకు న్యూఇయర్ సర్ప్రైజ్ ఇచ్చారు. -
ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’ నుంచి తొలి అప్డేట్... మేకింగ్ వీడియో చూశారా?
పాన్ ఇండియ స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో మోస్ట్ అవేయిటెడ్ మూవీ ప్రాజెక్ట్ కె(Prokect K). మహనటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ వరల్డ్ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టే ఈ సినిమాలో భారీ తారాగాణం భాగం కానుంది. బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దీపికా పదుకొనె హీరోయిన్గా నటిస్తుండగా.. బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అంతేకాదు మరో హీరోయిన్ దిశా పటానీ ప్రధాన పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్‌ను జరపుకుంటోంది. చదవండి: తారక్ పెద్ద స్టార్.. తను అలా చేయాల్సిన అవసరం లేదు, కానీ..!: సీనియర్ నటి సుధ ఈ నేపథ్యంలో మూవీపై మరింత హైప్ క్రియేట్ చేస్తూ చిత్రం తాజాగా మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది. స్క్రాచ్ ఎపిసోడ్ 1: రీఇన్వెంటింగ్ ది వీల్ అంటూ ఈ వీడియోని వదిలారు. ఇందులో నాగ్ అశ్విన్ అండ్ టీం టైరు తయారు చేస్తూ కనిపిచింది. ఈ టైరు తయారికి టీం అంతా ఎంత కష్టపడిందో ఇందులో ఆసక్తిగా చూపించారు. అంతేకాదు మరో ఒక్క టైరు కోసం ఇంత ఓవరాక్షన్? అంటూ తమకు తామే సైటర్లు వేసుకోవడం ఆకట్టుకుంది. ఇంతకీ ఈ టైరు కథేంటి? సినిమాలో దాని ప్రాముఖ్యత ఏంటి? అనేది ఆసక్తిని సంతరించుకుంది. ప్రస్తుతం ఈ వీడియో ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటోంది. చదవండి: రష్మికకు రిషబ్ శెట్టి గట్టి కౌంటర్, ట్వీట్ వైరల్ -
‘వీరసింహారెడ్డి’ న్యూ ఇయర్ సర్ప్రైజ్ .. ఆ వీడియో చూశారా?
నందమూరి బాలకృష్ణ, శృతిహాసన్ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం 'వీరసింహారెడ్డి'. ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఒక పాట మినహా దాదాపు షూటింగ్ పూర్తయింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. న్యూ ఇయర్ కానుకగా బాలయ్య ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చారు. మేకింగ్ వీడియో చూస్తే బాలయ్య యాక్షన్ సీన్స్ అభిమానులను ఆకట్టుకునేలా ఉన్నాయి. సీన్స్ చూస్తే రాయలసీమలో ఎక్కువగా తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. బాలయ్య మాస్ యాక్షన్ సరిపోయేలా ఫైట్స్ తెరకెక్కించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో సందడి చేయనుంది. -
సమంత నటించిన 'యశోద' మేకింగ్ వీడియో చూశారా?
సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా యశదో. సరోగసి నేపథ్యంలో థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం నేడు(శుక్రవారం)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విమెన్ సెంట్రిక్ మూవీ అయినప్పటికీ యాక్షన్ సన్నివేశాల్లో స్టార్ హీరోకు ఏమాత్రం తగ్గకుండా సమంత తన నటనతో మెస్మరైజ్ చేసిందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. ఇక చూసిన ప్రేక్షకులు సైతం సమంత డెడికేషన్ చూసి ఫిదా అవుతున్నారు. ప్రతి ఫ్రేములో సమంత తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుందంటూ సామ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇదిలా ఉండగా యశోద సినిమా నుంచి ఓ మేకింగ్ వీడియోను వదిలారు. శత్రువుల బారి నుంచి యశోద తప్పించుకుని ఒక అడవిలో పరిగెడుతూ ఉండగా,ఆమెను ఒక వేట కుక్క వేటాడటం వంటివి థ్రిల్లింగ్‌గా కనిపిస్తుంది. ఈ సీన్‌ను ఎలా షూట్ చేసారన్నది వీడియోలో చూడొచ్చు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. చదవండి: సమంత చేతికి ఆ ఉంగరాలు? దోషం వల్లే ఇలా చేస్తుందా? -
వీడియో: ఇదేందయ్యా ఇది.. జస్ట్ మిస్ భయ్యో అసలుకే ఎసరు వచ్చేదిగా..!
సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు కొందరు వ్యక్తులు విభిన్న మార్గాలను ఎంచుకుంటారు. ఈ క్రమంలో కొందరు సోషల్ మీడియాలో క్లిక్ అయి మంచి ఆఫర్ సైతం కిట్టేసిన వారున్నారు. ఇదే క్రమంలో అడ్రస్ లేకుండా గల్లంతైనా వారు కూడా లేకపోలేదు. కాగా, తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సదరు వ్యక్తి చేసిన పని.. నెటిజన్లను తెగ నవ్విస్తోంది. వైరల్ అయిన వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందే.. ఓ యువకుడి తన ఇంట్లో చపాతి(రోటీ చేసేందుకు) రెడీ అయ్యాడు. చపాతీ చేసి గ్యాస్ పొయ్యి మీద పెట్టి కాలుస్తున్నాడు. ఇంతలో ఏదో చేద్దామని ప్రయత్నిస్తే.. మొదటికే మోసమైంది. పెనం మీద ఉన్న చపాతీని ఎగరేసే క్రమంలో కర్రకు ఉన్న పెనం ఊడిపోయి అతడి మీదే పడిపోయింది. దీంతో గాయమైనట్టు తెలుస్తోంది. దీంతో, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఈ వీడియో మరింత ఫన్నీగా ఉండేందుకు యోగా గురువు రామ్దేబ్ బాబా నవ్విన ఓ ఫన్నీ సీన్‌ను యాడ్ చేశాడు. వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వీడియోపై ఓ లుక్కేయండి. -
క్రేజీ.. విజయ్ 'లైగర్' మేకింగ్ స్టిల్స్ వచ్చేశాయి
రౌడీ హీరో విజయ్ దేవరకొండ బాక్సర్‌గా నటిస్తున్న చిత్రం 'లైగర్'. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తుంది. పాన్ ఇండియా చిత్రంగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 25న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్‌లో దూకుడు పెంచిన లైగర్ టీం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ అయిపోయింది. చదవండి: అందుకే ప్రమోషన్స్‌కి చెప్పులేసుకొని వెళ్తున్నా: విజయ్ దేవరకొండ ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్, సాంగ్స్, పోస్టర్స్‌కు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాపై బజ్ క్రియేట్ అయ్యింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకింగ్ స్టిల్స్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. The frames that captured all the madness in making 📸💥 Here are some Exclusive Making Stills of #LIGER 🔥 15 Days to Go for the Mass Action Entertainer 😎#LigerOnAug25th 💥@TheDeverakonda @ananyapandayy #PuriJagannadh @karanjohar @Charmmeofficial @DharmaMovies pic.twitter.com/J60A6E46Ni — Puri Connects (@PuriConnects) August 10, 2022 -
‘విక్రమ్’ మేకింగ్ వీడియో చూశారా?.. డైరెక్టర్ ఫోకస్‌కు నెటిజన్లు ఫిదా!
ఉలగ నాయగన్ (లోక నాయకుడు) కమల్ హాసన్ సుమారు నాలుగేళ్ల తర్వాత విక్రమ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, సూర్య విభిన్న పాత్రల్లో అలరించారు. జూన్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం రూ. 350 కోట్లకు పైగా వసూళు సాధించి కమల్ హాసన్ కెరీర్లోనే సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇక ఇందులో కమల్ హాసన్ చేసిన యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. చదవండి: కానిస్టెబుల్‌గా విశాల్.. ఏడేళ్ల పిల్లాడికి తండ్రిగా హీరో రోల్ ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ సంబంధించిన మేకింగ్ వీడియోను తాజాగా డిస్నీప్లస్ హాట్‌స్టార్ విడుదల చేసింది. 6 నిమిషాల నిడివిగల ఈ వీడియోలో దాదాపు యాక్షన్ సీన్స్‌కు సంబంధించిన మేకింగ్ సన్నివేశాలను చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో దూసుకెళుతోంది. ఫహద్ ఫాజిల్ సీన్‌తో మొదలైన ఈ మేకింగ్ వీడియోలో విజయ్ సేతుపతి, కమల్‌కు సంబంధిచిన పలు భారీ యాక్షన్ సీన్స్‌తో పాటు మూవీలో హైలేట్‌గా నిలిచి ఫైట్ సన్నివేశాలను చిత్రీకరించిన తీరును చూపించారు. చదవండి: ‘ధాకడ్’ మూవీ ఫ్లాప్.. షాకింగ్ కామెంట్స్ చేసిన కంగనా ఇందులో దర్శకుడు లోకేశ్ కనకరాజ్‌ను చూస్తుంటే ప్రతి సీన్లో కోసం ఆయన ఎంతటి జాగ్రత్త తీసుకున్నారో అర్థమవుతుంది. మేకింగ్‌తో పాటు హీరో, విలన్ లుక్స్‌లోనూ స్పెషల్ కేర్ తీసుకున్నాడు. కొన్ని చోట్ల ఫైట్ సీన్స్ కోసం లోకేశ్.. కమల్ లుక్కు స్వయంగా మెరుగులు దిద్దుతూ కనిపించాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు దర్శకుడి మేకింగ్‌కు ఫిదా అవుతున్నారు. దీంతో ఆయనపై నెట్టింట ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘విక్రమ్ మేకింగ్, ప్రతి ఫ్రేమ్‌లో విషయంలో మీరు పెట్టిన ఫోకస్ కనిపిస్తుంది’,‘ఈ సినిమా కోసం మీరు పెట్టిన ఎఫర్టే విక్రమ్ సక్సెస్’ అంటూ లోకేశ్ కనకరాజ్‌ను కొనియాడుతున్నారు. -
'విక్రమ్' రిలీజ్ డేట్ అదే.. అదరగొడుతున్న మేకింగ్ వీడియో
Kamal Haasan Vikram Movie Release Date With Making Video: సౌత్ ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్న సినిమాల్లో 'విక్రమ్' ఒకటి. లోకనాయకుడు కమల్ హాసన్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ చిత్రం బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. ఈ మూవీకి 'ఖైదీ' ఫేమ్ లోకేష్ కనగరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఇదివరకు ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ తెగ ఆకట్టుకుంది. ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను సోమవారం (మార్చి 14) ప్రకటిస్తామని కమల్ హాసన్‌తో ఉన్న పోస్టర్ విడుదల చేశారు. అందుకు తగినట్లుగానే ఈ సినిమా విడుదల తేదిని సోమవారం ఉదయం చిత్రృందం అధికారికంగా ప్రకటించింది. సమ్మర్ కానుకగా జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఈ రిలీజ్ డేట్‌తోపాటు విక్రమ్ మేకింగ్ వీడియోను ప్రేక్షకులు, అభిమానులతో పంచుకుంది మూవీ యూనిట్. ఇందులో యాక్షన్ సీన్స్‌కు సంబంధించిన గ్లింప్స్‌ను చూపించారు. పొలిటికల్ యాక్షన్ థ్లిల్లర్‌గా సాగే ఈ మూవీలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, మలయాళీ పాపులర్ యాక్టర్ ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో అలరించనున్నారు. ఈ వీడియోలో వీరిద్దరిని చూపించిన తీరు ఆకట్టుకుంది. చూస్తుంటే చాలా రోజుల తర్వాత కమల్‌హాసన్ పవర్ఫుల్లో రోల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. -
వీడియో: సెట్స్‌లో రష్మిక అల్లరి మామూలుగా లేదుగా!
కుటుంబ కథాచిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు హీరో శర్వానంద్. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కించిన ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. మార్చి 4న ఈ మూవీ రిలీజ్ అవుతున్న సందర్భంగా గురువారం ఆడవాళ్లు మీకు జోహార్లు మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఇందులో రష్మిక ఫస్ట్ క్లాప్ కొట్టినట్లు చూపించారు. సెట్స్‌లో ఉన్నవాళ్లను ఆటాడిస్తూ తెగ అల్లరి చేసిందీ హీరోయిన్. సీనియర్ నటీమణులు ఖష్బూ, రాధిక, ఊర్వశిలు కూడా కెమెరా ఆఫ్‌లో ఉన్నప్పుడు సరదాగా నవ్వుతూ షూటింగ్‌ను తెగ ఎంజాయ్ చేసినట్లు కనిపిస్తోంది. వీళ్ల అల్లరిని, సెట్స్‌లో సరదాగా గడిపిన క్షణాలను మీరూ చూసేయండి.. -
కళావతి సాంగ్ మేకింగ్ వీడియో, ఈ పాట కోసం ఎంత ఖర్చు పెట్టారంటే?
సూపర్ స్టార్ మహేశ్‌బాబు, మహానటి కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం సర్కారువారి పాట. వాలంటైన్స్ డేకు ఒకరోజు ముందే అంటే ఫిబ్రవరి 13న ఈ సినిమా నుంచి కళావతి సాంగ్ రిలీజైంది. వందో, ఒక వెయ్యో, ఒక లక్షో మెరుపులు దూకినాయా.. ఏందే నీ మాయ.. అంటూ సాగే లిరిక్స్ సంగీతప్రియులను కట్టిపడేస్తున్నాయి. ఇప్పటివరు ఈ సాంగ్‌కు యూట్యూబ్‌లో 29 మిలియన్ల వ్యూస్ రాగా ఆ సంఖ్య పెరుగుతూనే ఉంది. సెన్సేషనల్‌గా మారిన ఈ హిట్ పాటకు తమన్ సంగీతం అందించగా సింగర్ సిద్ శ్రీరామ్ ఆలపించాడు. తాజాగా ఈ సాంగ్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో చిత్రయూనిట్ మహేశ్, కీర్తి సురేశ్ ఫన్నీ మూమెంట్స్‌ను చూపించారు. ఇక ఈ లిరికల్ సాంగ్ కోసం నిర్మాతలు ఏమాత్రం వెనకడుగు వేయకుండా రూ.40- రూ.60 లక్షల మేర ఖర్చు చేసినట్లు ఫిల్మీదునియాలో వార్తలు వినిపిస్తున్నాయి. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జిఎంబి ప్రొడక్షన్స్, మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా మే 12న విడుదలవుతోంది. View this post on Instagram A post shared by Mythri Movie Makers (@mythriofficial) -
అఖండ మేకింగ్ వీడియో, సినిమా కోసం ఇంతలా కష్టపడ్డారా?
నటసింహ నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన చిత్రం అఖండ. డిసెంబర్ 2న ఒంటరిగా బాక్సాఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమా రికార్డులను తిరగరాస్తూ చరిత్ర సృష్టించింది. కరోనా వల్ల పెద్దగా కలెక్షన్లు రావేమో అనుకున్న విశ్లేషకులను ఆశ్చర్యంలో ముంచివేస్తూ ఏకంగా రూ.200 కోట్ల(నాన్ థియేట్రికల్ బిజినెస్‌తో కలిపి) వసూళ్లు సాధించింది. జనవరి 21న అఖండ హాట్‌స్టార్‌లో ల్యాండ్ అవగా ఓటీటీలో కూడా తిరుగులేదనిపించుకుంటోందీ చిత్రం. ఓటీటీలో అందుబాటులోకి వచ్చిన తొలి 24 గంటల్లోనే ఈ సినిమాను 10 లక్షల మంది వీక్షించారట. ఇది ఓటీటీ చరిత్రలోనే ఒక రికార్డని తెలుస్తోంది. ఈ సందర్భంగా హాట్ స్టార్ అఖండ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో బాలయ్య కష్టాన్ని, టెక్నీషియన్ల శ్రమను, బోయపాటి డెడికేషన్‌ను చూడొచ్చు. అలాగే కెమెరాలు ఆఫ్‌లో ఉన్నప్పుడు బోయపాటి, బాలయ్యల సరదాగా కబుర్లాడినట్లు కనిపిస్తోంది. బాలయ్య త్రిశూలంతో చేసిన కొన్ని ఫైట్ సీన్లను డైరెక్టర్ ఎలా దగ్గరుండి చేయించారో కళ్లకు కట్టినట్లు చూపించారు. మరి ఈ మేకింగ్ వీడియోను మీరూ ఓ సారి చూసేయండి.. -
అలరిస్తున్న అల్లూరి, గర్జిస్తున్న భీం.. ఆకట్టుకుంటున్న మేకింగ్ వీడియోలు
RRR Movie Making Videos: దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముగ్గురి కాంబినేషన్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్ (రౌద్రం.. రణం.. రుధిరం). భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో కొమురమ్ భీమ్‌గా తారక్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ పాత్రలు పోషిస్తున్నారు. చెర్రీకి జోడిగా బాలీవుడ్ క్యూటీ ఆలియాభట్, తారక్ సరసన హాలీవుడ్ నటి ఒలీవియా మోరీస్ నటించారు. పాన్ ఇండియా చిత్రంగా నిర్మితమైన ఈ చిత్రం (RRR Movie) సంక్రాంతి కానుకగా 2022 జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై బడ్జెట్‌కు మించి హైప్‌ను క్రియేట్ చేశాయి. ఎంతగానో ఎదురుచూస్తున్న 'ఆర్ఆర్ఆర్' (RRR) చిత్రం విడుదలకు ఇంకా కొన్ని రోజులే మిగిలాయి. సినిమా రిలీజ్‌కు ముందు చిత్ర ప్రమోషన్స్‌ను కూడా భారీగా చెస్తున్నారు. ఇటీవల ముంబైలో గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు దర్శకనిర్మాతలు. అంతకుముందు అలియా భట్ సీతగా మారిన మేకింగ్ వీడియోను షేర్ చేసిన చిత్ర బృందం తాజాగా కొమురమ్ భీం, అల్లూరి సీతారామరాజు పాత్రల చిత్రీకరణను సోషల్‌మీడియా వేదికగా పంచుకుంది. కొమురం భీం, అల్లూరి సీతరామరాజులు చేసిన యాక్షన్ సీన్స్ మేకింగ్ వీడియోలను తారక్, చెర్రీ తమ ఇన్‌స్టా గ్రామ్ ఖాతాల్లో అభిమానులతో పంచుకున్నారు. అల్లూరి సీతరామరాజు మేకింగ్ వీడియోలో చెర్రీ ఓ వైపు నవ్వుతూ మరోవైపు పాత్రలోకి పరాకయ ప్రవేశం చేశాడు. క్యాజువల్ జీన్స్, షర్ట్‌తో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ వెంటనే పోలీసు యూనిఫామ్ వేసుకొని నిలుచున్న విజువల్స్‌తో ప్రారంభమవుతుంది వీడియో. అందులో చరణ్ రిహాసల్స్, సీన్లో ఎమోషన్స్, బాక్సింగ్ ప్రాక్టీస్ అబ్బురపరిచాయి. అలియా భట్‌తో సీన్ గురించి నవ్వకుంటూ చర్చించుకోవడం కూడా వీడియోలో మనం చూడవచ్చు. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) ఇక కొమురం భీం పాత్రకు సంబంధించిన వీడియోలో ఎన్టీఆర్‌ను భీంగా తయారు చేయడం చూపించారు. యాక్షన్ సన్నివేశాలు, బైక్ రైడింగ్ ప్రాక్టీస్ చేయడం కనులవిందుగా ఉంది వీడియో. అక్కడక్కడ తారక్ నవ్వడం, మైక్‌లో ఏవో సూచనలు ఇవ్వడం, డైలాగ్‌లు ప్రాక్టీస్ చేయడం ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఉంది. వీడియో చివర్లో ఎన్టీఆర్ గర్జిస్తూ అడవిలో పరిగెత్తడం చూపించారు. ఈ వీడియోలను 'వీ ఆర్ ఇన్ ది మేకింగ్' అంటూ ఎండ్ చేశారు. View this post on Instagram A post shared by Jr NTR (@jrntr) -
'పుష్ప' మేకింగ్ వీడియో వైరల్.. బన్నీ మెసేజ్ సూపర్
Pushpa Movie Making Video Released And Goes Viral: ఫేవరెట్ హీరో సినిమాను ఫస్ట్ డే, ఫస్ట్ షో చూస్తే ఎంత కిక్కు వస్తుంది. అది చూసి హీరో ఎలివేషన్, యాక్టింగ్, యాక్షన్ సీన్స్, రొమాన్స్ అందరికంటే ముందు చెప్తే ఆ హాయి మాములుగా ఉండదు. అలాగే సినీ ప్రియులకు సినిమా మేకింగ్ చూసినా అంతకు డబుల్ కిక్ వస్తుంది. అందుకే సినిమా అయిపోయాక టైటిల్ క్రెడిట్స్ పడేటప్పుడు సినిమా మేకింగ్ వీడియో చూపిస్తే 'అబ్బా సాయిరాం' అనిపిస్తుంటుంది. అలాగే సినిమా మేకింగ్ వీడియోస్ లీకైనా, మేకర్సే రిలీజ్ చేసిన చూసి తరిస్తాం. ఇది అర్థం చేసుకున్నారో ఏమో గానీ 'పుష్ప' చిత్ర బృందం ఆ సినిమా చిత్రీకరణ వీడియో ఒకటి సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ వీడియోలో 'మనం ఈ లొకేషన్ నుంచి ఖాళీ చేసి వెళ్లేలోపు ఇక్కడున్న ప్లాస్టిక్ సామాను, చెత్త చెదారం అంతా క్లీన్ చేసి నీట్‌గా ఉంచాలి' అని అల్లు అర్జున్ చిత్ర బృందానికి చెప్పడం కనిపిస్తుంది. తర్వాత సినిమాను చిత్రీకరించే వివిధ లొకేషన్స్‌లో టీమ్ పడిన కష్టాన్ని వీడియోలో చూపించారు. మొబైల్‌తో చిత్రీకరించిన ఈ మేకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. The team's blood and sweat to give you the best 🤘 You will witness it tomorrow 🔥 PUSHPA TRAILER ON DEC6TH 🔥 ▶️ https://t.co/UsKxyjTsWT#PushpaTheRise #ThaggedheLe 🤙#PushpaTheRiseOnDec17@alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP @adityamusic @MythriOfficial pic.twitter.com/zZmIjYTRXx — Pushpa (@PushpaMovie) December 5, 2021 టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం 'పుష్ప: ది రైజ్'. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 17న థియేటర్లలో సందడి చేయనుంది. కాగా సోమవారం (డిసెంబర్ 6)న ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇదీ చదవండి: ఇక్కడ ప్రభాస్..అక్కడ సల్మాన్.. బన్నీకి సపోర్ట్‌గా ఆ ఇద్దరు! -
ప్రభాస్ బర్త్‌డే హంగామా.. లీకైన ‘సలార్’ యాక్షన్ సీన్ వీడియో
Video leaked From Prabhas Salaar movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు దగ్గరకు వస్తోంది. ఈ నేపథ్యంలో డార్లింగ్ బర్త్‌డే హంగామా మొదలైంది. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు. దీంతో రెండు వారాల ముందునుంచే ప్రభాస్ బర్త్‌డే పేరుతో హ్యాష్ ట్యాగ్‌ను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అంతేగాక ఆయన నటిస్తున్న పాన్ చిత్రాలకు సంబంధించిన మూవీ అప్డేట్స్ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ అందించే వీడియో ఒకటి బయటకు వచ్చింది. చదవండి: లైవ్‌చాట్‌లో పూజ హెగ్డే కు షాకింగ్ ప్రశ్న, నెటిజన్‌కు హీరోయిన్ చురక కాగా ప్రభాస్ ప్రుస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సలార్ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. అయితే మొదటి నుంచి ‘సలార్’ మూవీకి లీక్‌ల బెడద తప్పడం లేదు. ఈ మూవీ సెట్స్‌లోని ప్రభాస్ ఫొటోలు, వీడియోలు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో సలార్ మూవీ సెట్ ప్రభాస్‌పై చిత్రీకరిస్తున్న యాక్షన్ సీన్ మేకింగ్ వీడియో ఒకటి లీక్ అయ్యింది. ఈ వీడియోలో ప్రభాస్‌తో చేతిలో గన్, చూట్టు సంచలను చూస్తుంటే ఇది హోరాహోరిగా సాగే ఫైట్ సీన్ అని అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. చదవండి: ఆ పాన్ ఇండియా చిత్రంలో పవర్ ఫుల్ పోలీసు ఆఫీసర్‌గా ప్రభాస్ ప్రభాస్ బర్త్‌డే నేపథ్యంలో ఈ వీడియో బయటకు రావడంతో ఫ్యాన్స్ అంత పండగ చేసుకుంటున్నారు. కాగా సలార్‌తో పాటు ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్లో రూపొందుతోన్న ‘ఆదిపురుష్’ షూటింగ్లో కూడా పాల్గొంటున్నాడు. అంతేగాక రాధ కృష్ణ తెరకెక్కించిన రాధేశ్యామ్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమవుతోంది. దీని తర్వాత నాగ్ అశ్విన్‌తో మూవీ నెక్ట్ ఈయర్ సెట్స్‌పై రానుంది. ఇందులో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నాడనే వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. Here is the leaked bit for out fans 💥#PrabhasBirthdayCDP #Prabhas #Salaar Kutha ramp antey edhey nemo 💥💥 pic.twitter.com/AIJ0YzD0o5 — PRABHAS UPDATES OFFICIAL (@PRABHASUPDATESS) October 19, 2021 -
గ్రాఫిక్స్ కాదంటూ యాడ్ మేకింగ్ వీడియో రిలీజ్ చేసిన ఫ్లై ఎమిరేట్స్
-
నెట్టింట రచ్చ చేస్తున్న పవన్ ‘హరిహర వీరమల్లు’ మేకింగ్ వీడియో
స్టార్ హీరోల సినిమాలకు సంబంధించి ఏ చిన్న వార్త అయినా అది వైరల్ అయిపోతుంది. ఈ మధ్య మేకింగ్ సమయంలో ఏదో ఓ సన్నివేశం, ఫోటోలాంటివి లీక్ కావడం మామూలుగా మారింది. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న కొత్త చిత్రం ‘హరిహర వీరమల్లు’ నుంచి కూడా ఓ వీడియో బయటికి వచ్చి సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. గతంలోనూ ‘వకీల్ సాబ్’ చిత్రం మేకింగ్ సమయంలో ఓ ఫోటో ఇలానే బయటకు రాగా, అప్పట్లో అది వైరల్‌గా మారడమే గాక చిత్ర బృందం దాన్నే టైటిల్ లోగోలో పెట్టేయడం విశేషం. చాలా కాలం తర్వాత పవన్ ‘వకీల్ సాబ్’ లాంటి బ్లాక్‌బస్టర్‌తో అభిమానులకు ముందుకు వచ్చి ట్రీట్ ఇచ్చాడనే చెప్పాలి. కాగా ఇప్పుడు పవర్ స్టార్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ నుంచి కూడా ఒక వీడియో బయటికి వచ్చి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కాగా పవర్ స్టార్ ఇలాంటి పాత్రల్లో నటించడం ఇదే మొదటి సారి కావడంతో ఈ సినిమాపై అంచానాలు ఇప్పటికే ఓ రేంజ్లో ఉన్నాయి. ఇక అభిమానులైతే వాళ్ల హీరోని సరికొత్తగా చూడబోతున్నామని సినిమా విడుదల తేది కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఈ వీడియో లీక్ పవన్ ఫ్యాన్స్‌కి జోష్నిచ్చిందనే చెప్పాలి. ఈ వీడియోలో.. మల్ల యోధులు సై అంటుంటే.. ఎదురుగా పవన్ నిలబడి ఉంటాడు. ఇక వారి చుట్టూ ఉన్న మనుషులు కిందికి వంగి కాళ్ల మీద కూర్చన్నారు. చూస్తుంటే ఈ వీడియో సినిమాలో కీలకమైన పోరాట దృశ్యానికి సంబంధించిందిగా అనిపిస్తోంది. HariHaraVeeraMallu leaked video of Power star @PawanKalyan #HariHaraVeeraMallu #PSPK27 #PSPK28 #VakeelSaab #PSPKRanaMovie pic.twitter.com/fmKbQB6pDd— Niteesh Royal (@niteesh_royal) June 27, 2021 చదవండి: ఎక్కడా తగ్గేదే లే.. ‘రాధేశ్యామ్’ను వెనక్కి నెట్టి టాప్‌లో ‘పుష్ప’ -
‘జలజల పాతం’ మేకింగ్ కష్టాలు, వీడియో వైరల్
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, కృతి శెట్టీ జంటగా నటించిన చిత్రం ‘ఉప్పెన’. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ చిత్రం వంద కోట్లపైగా గ్రాస్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇటీవల సినిమా విడుదలైన నెలరోజుల తర్వాత నుంచి ఉప్పెన టీం సినిమాలోని డిలీటెడ్ సీన్స్, పాటల మేకింగ్ వీడియోలను విడుదల చేస్తూ ప్రేక్షకులలో అసక్తిని పెంచుతోంది. తాజాగా ఈ మూవీ రోమాంటిక్ సాంగ్ ‘జల జల పాతం నువ్వు..’ మేకింగ్ వీడియోను షేర్ చేసింది చిత్ర యూనిట్. సిల్వర్ స్క్రీన్‌పై సముద్రం మధ్యలో హీరోహీరోయిన్లు పండించిన రోమాన్స్ అంతా ఇంతా కాదు. ఈ పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుందని చెప్పడానికి ఇటీవల యూట్యూబ్‌లో విడుదలైన ఫుల్ సాంగ్‌కు వచ్చిన వ్యూస్ యే నిదర్శనం. దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు అందించగా.. శ్రేయాఘోషల్, జాస్ ప్రీత్ జాజ్ ఆలపించిన ఈ పాట ఫుల్ వీడియోను ఇటీవల చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. విడుదలై గంటల వ్వవధిలోనే లక్షల్లో వ్యూస్ సంపాదించింది. అంతగా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ఈ పాట మేకింగ్ కోసం మూవీ టీం బాగానే చేమటోడిచ్చినట్లు తెలుస్తోంది ఈ తాజా మేకింగ్ వీడియో చూస్తుంటే. ఇక సహజమైన సముద్రాన్ని చూపించేందుకు మన దర్శకుడు బుచ్చి ఎంతగా కృషి చేశారో మీరే చూడండి. చదవండి: ఖమ్మంలో ‘బేబమ్మ’ సందడి.. ఉప్పెనలా ఎగసిపడ్డ జనం ‘ఉప్పెన’ డిలీటెడ్ సీన్.. ఆ అమ్మాయి కాళ్లు పట్టుకున్న వైష్ణవ్ -
హల్చల్ చేస్తోన్న ‘రంగ్‌దే’ మేకింగ్ వీడియో..
టాలీవుడ్ హీరో నితిన్, కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం 'రంగ్ దే'. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ప్రస్తుతం మూవీ ప్రమోషనల్లో చిత్రయూనిట్ బిజీగా ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మితమైన ఈ సినిమాలో సీనియర్ నరేష్, కౌసల్య, రోహిణి, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్, సత్యం రాజేష్, సుహాస్ తదితరులు నటిస్తున్నారు. సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీత స్వరాలు సమకూర్చగా పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. నవీన్ నూలి ఎడిటర్. తాజాగా ఈ సినిమా నుంచి ఓ మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ‘చూసి నేర్చుకోకు’ అనే బ్యాక్‌గ్రౌండ్ పాటతో కొన్ని మేకింగ్ సన్నివేశాలను కలిపి ఒక వీడియోగా రూపొందించారు. ఇందులో నితిన్, కీర్తిల మధ్య కనిపించిన దృశ్యాలు చాలా ఫన్నీగా ఉన్నాయి. ఇదిలా ఉండగా మూవీ ప్రమోషన్లలో భాగంగా ఆదివారం సాయంత్రం(మార్చి 21)శిల్పకళావేదికలో జరిగే ప్రీ రిలీజ్ వేడుకకుముఖ్య అతిథిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రానున్న విషయం తెలిసిందే. గతేడాది నితిన్ హీరోగా నటించిన ‘భీష్మ’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కి త్రివిక్రమ్ ముఖ్య అతిథిగా వచ్చాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. దీంతో ఆ సెంటిమెంట్‌తోనే రంగ్‌దే సినిమాకి త్రివిక్రమ్‌ని ముఖ్య అతిథిగా పిలిచిననట్లు తెలుస్తోంది. చదవండి: తలైవి ట్రైలర్ చూస్తే గూస్‌బంప్సే.. తూటాల్లా డైలాగులు రంగ్‌దే ప్రీ రిలీజ్: చీఫ్ గెస్ట్‌గా అతనే! -
నీలి రంగు తెరపై రాధేశ్యామ్ మేకింగ్ వీడియో
సాక్షి, హైదరాబాద్: బాహుబలి ప్రభాస్ తాజా చిత్రం ‘రాధేశ్యామ్’ మేకింగ్ వీడియోను దర్శకుడు రాధాకృష్ణ కుమార్ గురువారం షేర్ చేశారు. అక్టోబర్‌లో ఇటలీ షెడ్యూల్ షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం రామోజీ ఫీల్మ్ సిటీలో చివరి షెడ్యూల్‌ను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దర్శకుడు రాధాకృష్ణ కుమార్ గురువారం మేకింగ్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. నీలిరంగు స్ర్కీన్‌లో ఉన్న ఈ వీడియోకు ‘మా చిత్ర బృందంతో నీలి రంగు తెరపై’ అనే క్యాప్షన్‌ను జత చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ‘బాహుబలి’, ‘సాహో’ వంటి సినిమాలతో పాన్ ఇండియా నటుడిగా మారిన ప్రభాస్ ‘రాధేశ్యామ్’పై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుస్తున్నా వారందరిని ‘రాధేశ్యామ్’ మేకింగ్ వీడియో తెగ ఆకట్టుకుంటోంది. ఉన్నది కొద్ది సెకండ్లే అయినా బ్లూ స్ర్కీన్‌పై సరికొత్తగా తీసిన ఈ మేకింగ్ వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. దీంతో ఈ సినిమాపై ‘డార్లింగ్’ ప్రభాస్ అభిమానుల అంచనాలు మరింత పెరిగాయనిపిస్తోంది. (చదవండి: ముప్పై కోట్లతో సెట్) View this post on Instagram A post shared by Radha Krishna Kumar (@director_radhaa) అయితే గత నెల ఇటలీలో షూటింగ్ జరుపుకున్న ‘రాధేశ్యామ్’ చిత్ర బృందం ఇటీవల ఇండియాకు తిరిగి వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా రామోజీ ఫీలిం సిటీలో క్లైమాక్స్ సీన్లన రూపొందిస్తున్నారు. అయితే క్లైమాక్స్ సీన్ల కోసం దాదాపుగా 30 కోట్ల ఖర్చుతో ప్రత్యేకంగా సెట్స్ వేస్తున్నట్లు వార్లు వచ్చిన విషయం తెలిసిందే. ఆస్కార్ విన్నింగ్ హాలీవుడ్ మూవీ ‘గ్లాడియేటర్’కి యాక్షన్ కొరియోగ్రఫీ అందించిన నిక్ పోవెల్ ‘రాధేశ్యామ్’కు వర్క్ చేస్తుండటం విశేషం. యూరప్ నేపథ్యంలో పీరియాడికల్ లవ్‌స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రంలో కొన్ని భారీ యాక్షన్ సీన్లు ఉన్నట్లు ఇటీవల ఓ సందర్భంలో ప్రభాస్ పేర్కొన్నారు. కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తుంది. అంతేగాక సచిన్ ఖేడేకర్, ప్రియదర్శి, భాగ్యశ్రీ, మురళీ శర్మ, సత్యన్ శివకూమార్‌లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఈ షూటింగ్ పూర్తిగానే ప్రభాస్ తర్వాతి చిత్రం ‘అదిపురుష్’ షూటింగ్ పాల్గొననున్నట్లు సినీ వర్గాల సమాచారం. (చదవండి: ‘రాధేశ్యామ్’ విషాదమా.. అమర ప్రేమ కావ్యమా?) -
మేకింగ్ ఆఫ్ మూవీ దబాంగ్ 3
-
మేకింగ్ ఆఫ్ మూవీ - వెంకీ మామ
-
సైరా మేకింగ్ వీడియో చూశారా..
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘సైరా’ మూవీ కోసం గతేడాదిగా మెగా ఫ్యాన్స్ వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్‌పై మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మెగా అభిమానుల కోసం స్వాతంత్ర దినోత్సవ కానుకగా ‘సైరా నరసింహారెడ్డి’ మేకింగ్ వీడియోను చిత్ర బృందం బుధవారం విడుదల చేసింది. షూటింగ్ సందర్భంగా చోటుచేసుకున్న పలు ఆసక్తికర సన్నివేశాలతో ఈ వీడియో అభిమానులను అలరిస్తుంది. ఈ వీడియోలో సినిమాలోని ప్రధాన పాత్రలన్నింటిని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, నయన తార, సుదీప్, జగపతి బాబు, విజయ్ సేతుపతి, నిహారిక, తమన్నా పాత్రలతో పాటు సెట్లో జరిగిన వివిధ సంఘటనల్ని వీడియోలో చూపించారు. ఇక ఈ నెల 20న టీజర్‌ను రిలీజ్ చేస్తుండగా.. సినిమాను అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
మెగా అభిమానులకి ఇండిపెండెన్స్ డే గిఫ్ట్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘సైరా’ మూవీ కోసం గతేడాదిగా మెగా ఫ్యాన్స్ వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. చిరు గత పుట్టిన రోజున విడుదల చేసిన టీజర్‌తో అంచనాలు రెట్టింపయ్యాయి. ఈ సినిమాతో మళ్లీ రికార్డులు బ్రేక్ చేస్తారని మెగా అభిమానులు ఆశిస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్‌పై మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ ‘సైరా’పై అంచనాలు రెట్టింపు చేస్తున్నారు. తాజాగా మెగా అభిమానులకు స్వాతంత్ర దినోత్సవ కానుకగా సర్ ప్రైజ్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ సిద్దమైంది. ఈ సందర్భంగా సైరా నరసింహారెడ్డి చిత్ర మేకింగ్ వీడియోను విడుదల చేయనున్నారు. బుధవారం(ఆగస్టు 14) సాయంత్రం 3:45 నిమిషాలకు సైరా మేకింగ్ వీడియో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. పోస్టర్లో చిరు లుక్ కూడా అదిరిపోయింది. దీంతో మెగా అభిమానులు సైరా మేకింగ్ వీడియో కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఓ వైపు షూటింగ్ జరుగుతూ ఉండగానే డబ్బింగ్ పనులు మొదలుపెట్టారని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు చిరు రికార్డు టైమ్‌లో తన డబ్బింగ్‌ను పూర్తి చేశారని టాక్. అసలే చారిత్రాత్మక చిత్రం కావడంతో.. భారీ డైలాగ్‌లు కూడా ఉంటాయని తెలిసిందే. అయినా చిరు తన డబ్బింగ్‌ను ఫుల్ స్పీడ్‌గా కంప్లీట్ చేశారని తెలుస్తోంది. అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి వంటి స్టార్లు నటించారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న విడుదల చేసేందుకు ప్లాన్చేస్తున్నారు. -
స్టన్నింగ్ మేకింగ్ వీడియో.. సాహో
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమా సాహో. బాహుబలి ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. హాలీవుడ్ స్థాయి టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన మరో మేకింగ్ వీడియో రిలీజ్ అయ్యింది. శ్రద్ధ పుట్టిన రోజు సందర్భంగా షేడ్స్ ఆఫ్ సాహో 2 పేరుతో ఈ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే, మందిరా బేడిలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ భారీ ఎండ్వంచరస్ యాక్షన్ థ్రిల్లర్‌ను అంతర్జాతీయ స్థాయిలో ఆగస్టు 15న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. -
థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ దివాలీ గిఫ్ట్
సాక్షి, ముంబై: మోస్ట్ ఎవైటింగ్ బాలీవుడ్ మూవీ ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ మరో మేకింగ్ వీడియో అభిమానులను కట్టి పడేస్తోంది. అమితాబ్- ఆమీర్‌ఖాన్- కత్రినా- ఫాతిమా కీలకపాత్ర పోషించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లను పలకరించనున్న తరుణంలో విడుదలైన ఈ వీడియో ప్రాధాన్యతను సంతరించుకుంది. దీపావళి సందర్భంగా నవంబర్ 8న భారీ ఎత్తున రిలీజ్ కానుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి నాలుగు నిమిషాల నిడివిగల మరో మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది యూనిట్. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో వస్తున్న ఈ ఫిల్మ్‌కి సంబంధించి ఇప్పటివరకు వచ్చిన రకరకాల వీడియోలు సినీలవర్స్‌ని విపరీతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ కోవలోనే తాజా వీడియో కూడా హల్ చల్ చేస్తోంది. మరోవైపు ఈ సినిమాకున్న క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు నిర్మాతలు. ఈ సినిమా టికెట్ల ధరలను దాదాపు 10శాతం పెంచేశారట. ఇది రణబీర్ కపూర్ నటించిన బయోపిక్ ‘సంజూ’ సినిమా టికెట్ల కంటే 10శాతం ఎక్కువట. అంటే సుమారు 300కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం రాబడిని కేవలం 15రోజుల్లోనే రాబట్టాలని చూస్తున్నారని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. -
మరో విభిన్న పాత్రలో
నటుడు విజయ్‌సేతుపతి ఎదుగుదల ఆశ్చర్య పరుస్తోంది. ఆయన కథలను ఎంచుకునే విధానం, ఆయా పాత్రల్లో వైవిధ్యం చూపడానికి పడే తపన, శ్రమ చూస్తుంటే, ఈ ఎదుగుదలకు విజయ్‌సేతుపతి అర్హుడే అని ఎవరైనా చెబుతారు. ఇటీవల ఆయన నటించిన 96 చిత్రం విమర్శకులను సైతం మెప్పించింది. తాజాగా విజయ్‌సేతుపతి నటిస్తున్న చిత్రాల్లో సీతకత్తి ఒకటి. ఈ చిత్రంలో ఆయన పలు గెటప్‌లలో కనిపంచనున్నారు. ముఖ్యంగా నటుడు కమలహాసన్ ఇండియన్ చిత్రంలో కనిపించిన తరహాలో 80 ఏళ్ల వృద్ధుడిగా నటించారు. ఆయనకు భార్యగా, జాతీయ అవార్డు గ్రహీత, సీనియర్ నటి అర్చన నటించడం మరో విశేషం. నటి అర్చన చాలా కాలం తరువాత నటించిన చిత్రం సీతకత్తి. నటి రమ్యనంభీశన్, పార్వతినాయర్, భాగవతి పెరుమాళ్, మౌళి తదితరులు ఇత ప్రధాన పాత్రల్లో నటించారు. ఫ్యాషన్ స్డూడియోస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను ముగించుకుని, తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. చిత్రం క్లీన్ యూ సర్టిఫికెట్ పొందినట్లు చిత్ర వర్గాలు ఆనందం వ్యక్తం చేశాయి. బాలాజీ ధరణీధరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నుంచి అయ్య అనే సింగిల్ సాంగ్ ఇటీవలే విడుదలై సంగీత ప్రియులను అలరిస్తోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న విజయ్‌సేతుపతి తాజా చిత్రం సీతకత్తిపైనా అంచనాలు భారీ స్థాయిలోనే నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని నవంబరులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. -
స్పీడు పెంచిన ‘చిట్టీ’
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్, గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ విజువల్ వండర్ 2.ఓ. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను నవంబర్ నెలాఖరున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు రిలీజ్ వాయిదా పడటంతో ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యం చేయకూడదని భావిస్తున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే నిర్మాణానంతర కార్యక్రమాలు చివరిదశకు చేరుకోవటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచారు. ఇటీవల రిలీజ్ అయిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ రావటంతో తాజాగా నాలుగవ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. గ్రాఫిక్స్, షూటింగ్ కు సంబంధించి చిత్రయూనిట్ ఎంత శ్రమకు ఓర్చి సినిమాను తెరకెక్కించారో ఈ మేకింగ్ వీడియోలో చూపించారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ప్రతినాయక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో అమీజాక్సన్ రజనీకి జోడిగా కనిపించనున్నారు. &rel=0 -
రజనీ ‘2.O’కు మరో షాక్
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం 2.ఓకు మరో షాక్ తగిలింది. ఈ సినిమాకు సంబంధించిన బీబీసీ సంస్థ చేస్తున్న డాక్యుమెంటరీలోని 2 నిమిషాల మేకింగ్ వీడియో లీకైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. రజనీ, అమీ జాక్సన్‌లపై ఓ పాట చిత్రీకరణకు సంబంధించిన వీడియో క్లిప్ నెట్లో వైరల్ అయ్యింది. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది నవంబర్‌లో రిలీజ్ కానుంది. చాలా రోజుల క్రితమే రిలీజ్ కావాల్సి ఉన్నా విజువల్ ఎఫెక్ట్స్ ఆలస్యం కావటంతో సినిమా వాయిదా పడుతూ వస్తోంది. దీనికి తోడు లీకులు కూడా సినిమాకు ఇబ్బంది కరంగా మారాయి. గతంలో టీజర్ రిలీజ్ చేయాలని భావించినా అది కూడా ముందే లీకైపోవటంతో చిత్రయూనిట్ టీజర్ లాంచ్ ఆలోచనను వాయిదా వేశారు. -
భరత్ అనే నేను మేకింగ్ వీడియో విడుదల
-
అభిమానులకు ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్
బాహుబలి సినిమాతో ప్రభాస్ ఒక్కసారిగా జాతీయ స్థాయి నటుడిగా మారిపోయాడు. అందుకే తన తదుపరి చిత్రం కూడా అదే స్థాయిలో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఎంతో కాలంగా తనతో సినిమా చేయటం కోసం ఎదురుచూస్తున్న సుజిత్ దర్శకత్వంలో.. సాహో సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు ప్రభాస్. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటిస్తోంది. ప్రస్తుతం సాహో షూటింగ్ లో బిజీగా ఉన్న ప్రభాస్, ఈ నెల 23న తన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాడట. సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందే టీజర్ ను రిలీజ్ చేసిన సాహో యూనిట్, ప్రభాస్ పుట్టిన రోజున మేకింగ్ వీడియోను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోందట. ప్రభాస్ సొంతం నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను 2018లో వేసవికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. -
మేకింగ్ వీడియోతో మళ్లీ మ్యాజిక్
చెన్నై: భారీ చిత్రాల దర్శకుడు శంకర్ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలిసి మరోసారి మ్యాజిక్ చేసేందుకు సిద్ధమైపోయాడు. వీరిద్దరి కాంబోలో మూడో చిత్రంగా 2.0 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వినాయక చవితి సందర్భంగా ఈ చిత్ర మేకింగ్ వీడియోను శంకర్ కాసేపటి క్రితం రిలీజ్ చేశాడు. రోబోగా రజనీ మళ్లీ కనిపించటం, విలన్ అక్షయ్ కుమార్ తో తలబడటం, అమీ జాక్సన్‌తో స్టంట్లు, కాస్టింగ్ మేకోవర్లు, భారీ యాక్షన్ సన్నివేశాలు... టోటల్‌గా హాలీవుడ్ నిపుణుల పర్యవేక్షణలో చిత్రం రూపొందించినట్లు అర్థమైపోతుంది. శంకర్ మేకింగ్ వీడియో చివర్లో విక్టరీ సింబల్ చూపించిన స్టైలిష్ సూపర్ స్టార్‌ను చూడొచ్చు. 2018 రిపబ్లిక్ డే సందర్భంగా 2.0 రిలీజ్ కానుంది. -
మరో యూట్యూబ్ రికార్డ్... కబాలి మేకింగ్ వీడియో
ప్రస్తుతం ప్రపంచం అంతా కబాలి వైపే చూస్తుంది. గతంలో ఏ భారతీయ సినిమాకు రానంత భారీ హైప్ కబాలి విషయంలో క్రియేట్ అవుతోంది. సినిమాకు సంబందించిన ప్రతీ అప్డేట్ను ఫ్యాన్స్ చాలా పక్కాగా ఫాలో అవుతున్నారు. ఒక్క పోస్టర్ రిలీజ్ అయినా అది సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే కబాలి టీజర్ అంతర్జాతీయ స్థాయిలో రికార్డ్ వ్యూస్ సాధించి రజనీ స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది. సినిమా రిలీజ్‌కు రెండు రోజులు మాత్రమే సమయం ఉండటంతో చిత్రయూనిట్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. యాక్షన్ సీన్స్‌తో పాటు రజనీ స్టైల్స్ కలిపి రూపొందించిన ఈ వీడియోకు బ్యాక్ గ్రౌండ్లో వినిపిస్తున్న నెర్పుడా.. సాంగ్ రింగ్ టోన్స్గా, కాలర్ ట్యూన్స్‌గా మోత మొగిపోతుంది. ఈ వీడియో పోస్ట్ చేసిన నిమిషాల్లోనే లక్షకు పైగా వ్యూస్‌తో సత్తా చాటింది. ప్రస్తుతం కబాలి మేకింగ్ వీడియో ఆన్లైన్లో సృష్టించబోయే సరికొత్త రికార్డ్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. -
మోస్ట్ అవైటెడ్ మూవీగా కబాలి
-
రాక్‌స్టార్‌లా దుమ్మురేపిన ఎన్టీఆర్
హైదరాబాద్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెండితెరపైనే కాదు నిజ జీవితంలో కూడా చాలా ఎనర్జిటిక్‌గా ఉంటారని అందరూ చెప్తుంటే ఏమోగానీ ఈ వీడియో చూస్తే మాత్రం నిజమేనని ఫిక్స్ అవ్వాల్సిందే. ఈ సంక్రాంతి సందర్భంగా ఈ నెల 13న నాన్నకు ప్రేమతో చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. టైటిల్ తోనే అందరినీ ఆకర్షించిన ఈ చిత్రం ప్రతి రోజూ ఏదో ఒకరూపంలో పబ్లిసిటీలో దూసుకెళ్లుతోంది. ఆ చిత్ర యూనిట్ నాన్నకు ప్రేమతో చిత్రానికి సంబంధించిన సన్నివేశాలను, మేకింగ్ వీడియోలను విడుదల చేస్తూ చిత్ర హైప్‌ను మరింత పెంచేస్తుంది. తాజాగా ఇప్పటికే అందరి నోళ్లలో నానుతున్న 'ఫాలో ఫాలో యూ' అనే పాట మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఈ పాటను ఎన్టీఆరే ఆలపించారు. ఈ సమయంలో యంగ్ టైగర్ ఉత్సాహం చూస్తుంటే.. ఈయన యాక్టరా లేక పాప్ సింగరా అని అనిపించేట్లుగా కనిపించారు. ఏ మాత్రం బెరుకు లేకుండా రికార్డింగ్ థియేటర్లో పక్కనే దేవీ శ్రీ ప్రసాద్ సూచనలు చేస్తుండగా అదిరిపోయే స్టైల్ తో 'ఫాలో ఫాలో యూ' అనే గీతాన్ని ఎన్టీఆర్ ఆలపించారు. పాడే సమయంలో ఎన్టీఆర్ ఉత్సాహాన్ని చూసి కుర్చీలో కూర్చోబుద్ధిగానీ దేవీ శ్రీ కూడా లేచి నిల్చోని ఎన్టీఆర్ తో జతకట్టారు. ఆ వెంటనే ఈ చిత్ర నిర్మాత బీవీఎస్ఎల్ ప్రసాద్‌తో కలిసి ఇద్దరూ ఫాలో ఫాలో యూ అంటూ ఎన్టీఆర్ చుట్టూ తిరుగుతూ రికార్డింగ్ థియేటర్లో సందడి చేశారు. -
నాగ చైతన్యకు నా థ్యాంక్స్...
హైదరాబాద్: నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటిస్తున్న శంకరాభరణం చిత్రంలోని ఒక సాంగ్ మేకింగ్ వీడియోను టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య లాంచ్ చేశాడట. ఈ విషయాన్ని కోన వెంకట్ , హీరో నిఖిల్ స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. 'శంకరాభరణం సినిమాలోని సాంగ్ మేకింగ్ వీడియో నాగ చైతన్య లాంచ్ చేశారు, చైతన్య కు నా థ్యాంక్స్' అంటూ ఈ చిత్ర సమర్పకుడు కోన వెంకట్ ట్వీట్ చేశారు. నిఖిల్, నందిత, అంజలి ప్రధాన పాత్రలుగా ఉదయ్ నందనవనం దర్శకత్వంలో రూపొందించిన చిత్రం 'శంకరాభరణం'. ఇప్పటికే ఈ చిత్ర ఆడియో రీసెంట్ గా విడుదలైన సంగతి తెలిసిందే. కథలోని హీరో ఎన్ఆర్ఐ. తనకు సంబంధించిన భూమిని విడిపించుకోవాలనే ఉద్దేశంతో అతడు సొంత ఊరికి వస్తాడు. అక్కడ హీరోకు అనేక ఆటంకాలు , కుట్రలు ఎదురౌతాయి. అయితే వాటినన్నింటినీ ఛేదించి తన భూమిని ఎలా విడిపించుకున్నడన్నదే కథ. క్రైమ్, కామెడీ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ మూవీ షూటింగ్ ఎక్కువగా భాగం బిహర్ లో జరిగింది. 2010లో విడుదలైన 'ఫస్ గయ రే ఒబామా' అనే హిందీ సినిమాకు మూలమనీ, దీనికి సంబంధించిన సౌత్ రైట్స్ మొత్తం తాము తీసుకున్నట్టు కో న వెంకట్ తెలిపారు. నోబెల్ ఆండ్రే ప్రొడక్షన్స్ సహకారంతో కేరళలో మొత్తం 30 సెంటర్లలో శంకరాభరణం విడుదల చేయనున్నట్లు కోన వెంకట్ తెలిపారు. కాగా ఈ చిత్రానికి ఎం.వి.వి. సత్యనారాయణ నిర్మాత. సుమన్, సితార, రావు రమేష్, సప్తగిరి, సత్యం రాజేష్ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. కోన వెంకట్.. కథ-స్క్రీన్‌ప్లే-మాటలు కూడా అందించిన ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించారు. Thank u @chay_akkineni for launching the theme song of SHANKARABHARANAM https://t.co/WW08mIi2rX pic.twitter.com/LsVDSxCvHI — kona venkat (@konavenkat99) November 19, 2015 Thank you so much @chay_akkineni for releasing the Theme of ShankaraBharanam.. Here it is, hope you like it :-) - https://t.co/TdY7nr4X4K — Nikhil Siddhartha (@actor_Nikhil) November 19, 2015 -
'టెంపర్' మూవీ మేకింగ్ వీడియో!
-
రుద్రమదేవి మేకింగ్ వీడియో విదుదల