'నీకేమో అందమెక్కువ.. నాకేమో తొందరెక్కువ'.. వాల్తేరు వీరయ్య సాంగ్‌ లీక్‌ | Megastar Chiranjeevi Shares Waltair Veerayya video in Instagram Goes Viral | Sakshi
Sakshi News home page

Waltair Veerayya: మెగాస్టార్ న్యూ ఇయర్‌ సర్‌ప్రైజ్‌.. వాల్తేరు వీరయ్య మరో సాంగ్‌ లీక్..!

Published Sun, Jan 1 2023 6:46 PM | Last Updated on Sun, Jan 1 2023 7:15 PM

Megastar Chiranjeevi Shares Waltair Veerayya video in Instagram Goes Viral - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి, శృతిహాసన్ జంటగా నటిస్తోన్న చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు కానుంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ ప్రధానపాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే వీరిద్దరితో కలిసి స్టెప్పులేసిన ఓ మాస్ సాంగ్‌ను మేకర్స్‌ రిలీజ్ చేశారు. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. 

(ఇది చదవండి: వాల్తేరు వీరయ్య నుంచి మరో మాస్‌ సాంగ్‌, గొంతు కలిపిన చిరు, రవితేజ)

తాజాగా మెగాస్టార్‌ మరో ఇంట్రెస్టింగ్‌ వీడియోతో అభిమానులను పలకరించాడు. ఇంతకుముందు శ్రీదేవి సాంగ్‌ను లీక్‌ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. అదే తరహాలో మరో వీడియోను రిలీజ్‌ చేశారు మెగాస్టార్. 

చిరంజీవి మాట్లాడుతూ.. 'హాయ్ ఫ్రెండ్స్‌ వాల్తేరు వీరయ్యలోని రెండో సాంగ్‌ డిసెంబర్‌ 17న పూర్తి చేసుకున్నాం. ఫ్రాన్స్‌లోని తూలు అనే సిటీలో సాంగ్ తీశాం. వాతావరణం అంత చలిగానే ఉంది. ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్, శేఖర్‌ మాస్టర్‌, డైరెక్టర్‌ బాబీతో సహా మిగిలిన చిత్రబృందం ఎంతో చక్కగా సహకరించారు. షూటింగ్ చక్కగా జరిగింది. అందరూ చాలా కష్టపడ్డారు. ఈ సాంగ్‌లో నాకు నచ్చింది ఒకటుంది. 'నీకేమో అందమెక్కువ.. నాకేమో తొందరెక్కువ' అంటూ అలాగే 'నీక్కూడా అందమెక్కువ.. నాక్కూడా తొందరెక్కువ' అంటూ సాగే  అనే లిరికల్‌ నాకైతే బాగా నచ్చింది. త్వరలోనే లిరికల్ వీడియో రిలీజ్ చేస్తాం. ఈ లోకేషన్ నాకు చాలా బాగా నచ్చింది.'  అంటూ వీడియో రిలీజ్ చేశారు చిరు. దీంతో మరోసారి మెగాస్టార్‌ సాంగ్ లీక్ చేసి అభిమానులకు న్యూఇయర్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement