పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ (Allu Arjun) నటనకు సినీ అభిమానులు ఫిదా అవుతున్నారు. దీంతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్‌తో బన్నీ అస్సలు తగ్గడం లేదు. వసూళ్ల విషయంలో కనపడిన ప్రతి రికార్డ్‌ను రప్పా రప్పా అంటూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇంతలోనే పుష్ప రీలోడ్ వర్షన్ పేరుతో జనవరి 17న మళ్లీ థియేటర్స్‌లోకి రానున్నాడు. దీంతో తాజాగా ఈ చిత్రం నుంచి మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
కేవలం 32 రోజుల్లోనే ‘పుష్ప 2 : ది రూల్’ (Pushpa 2: The Rule ) ప్రపంచ వ్యాప్తంగా రూ.1831 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి, సరికొత్త రికార్డు సృష్టించినట్లు మేకర్స్ ప్రకటించారు. అల్లు అర్జున్ , రష్మికా మందన్నా(Rashmika Mandanna) జోడీగా నటించిన చిత్రం ‘పుష్ప 2: ది రూల్’. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల ప్రత్యేకపాటలో ప్రేక్షకులను మెప్పించారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా డిసెంబరు 5న విడుదలైంది.
(ఇదీ చదవండి: నయనతార, ధనుష్ కేసు విచారణలో ఏం జరిగిందంటే..?)
అయితే, 22నిమిషాల నిడివిని అదనంగా ఈ చిత్రానికి కలపనున్నారు. వాస్తవంగా పుష్ప2 రీలోడ్ వర్షన్ జనవరి 10వ తేదీనే విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే, సంక్రాంతి రేసులో మూడు సినిమాలు వస్తుండటంతో కలెక్షన్స్ పరంగా వాటిపై ప్రభావం చూపించవచ్చని విడుదలను వాయిదా వేసుకున్నారు. దీంతో జనవరి 17న రీలోడ్ వర్షన్ రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటించడం విశేషం.
బెంగాల్‌లో పుష్పరాజ్ ఆల్ టైమ్ రికార్డ్
బెంగాల్‌లో పుష్ప ఓ రికార్డ్ సాధించింది. మామూలుగా బెంగాలీ సినిమా మార్కెట్ చాలా చిన్నదని తెలిసిందే. అక్కడ ఎక్కువగా తక్కువ బడ్జెట్ చిత్రాలు మాత్రమే తెరకెక్కుతుంటాయి. ఈ నేపథ్యంలో ‘పుష్ప 2’ బెంగాల్‌లో రూ. 50 కోట్లు వసూలు చేసి, సంచలనం సృష్టించింది. కాగా ‘అమేజాన్ ఓబిజాన్’ (2017) అనే చిత్రం రూ. 48 కోట్ల వసూళ్లతో అప్పట్లో రికార్డ్ నెలకొల్పింది. ఇది స్ట్రయిట్ చిత్రం. ఆ రికార్డును తాజాగా ‘పుష్ప 2’ బ్రేక్ చేసింది. ఒక డబ్బింగ్ సినిమా ఇలా ఆల్ టైమ్ రికార్డ్ నెలకొల్పడం అంటే మామూలు విషయం కాదని చెప్పవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment