
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమా సాహో. బాహుబలి ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. హాలీవుడ్ స్థాయి టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన మరో మేకింగ్ వీడియో రిలీజ్ అయ్యింది. శ్రద్ధ పుట్టిన రోజు సందర్భంగా షేడ్స్ ఆఫ్ సాహో 2 పేరుతో ఈ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు.
రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే, మందిరా బేడిలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ భారీ ఎండ్వంచరస్ యాక్షన్ థ్రిల్లర్‌ను అంతర్జాతీయ స్థాయిలో ఆగస్టు 15న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.
Comments
Please login to add a commentAdd a comment