
మరో యూట్యూబ్ రికార్డ్... కబాలి మేకింగ్ వీడియో
ప్రస్తుతం ప్రపంచం అంతా కబాలి వైపే చూస్తుంది. గతంలో ఏ భారతీయ సినిమాకు రానంత భారీ హైప్ కబాలి విషయంలో క్రియేట్ అవుతోంది. సినిమాకు సంబందించిన ప్రతీ అప్డేట్ను ఫ్యాన్స్ చాలా పక్కాగా ఫాలో అవుతున్నారు. ఒక్క పోస్టర్ రిలీజ్ అయినా అది సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే కబాలి టీజర్ అంతర్జాతీయ స్థాయిలో రికార్డ్ వ్యూస్ సాధించి రజనీ స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది.
సినిమా రిలీజ్‌కు రెండు రోజులు మాత్రమే సమయం ఉండటంతో చిత్రయూనిట్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. యాక్షన్ సీన్స్‌తో పాటు రజనీ స్టైల్స్ కలిపి రూపొందించిన ఈ వీడియోకు బ్యాక్ గ్రౌండ్లో వినిపిస్తున్న నెర్పుడా.. సాంగ్ రింగ్ టోన్స్గా, కాలర్ ట్యూన్స్‌గా మోత మొగిపోతుంది. ఈ వీడియో పోస్ట్ చేసిన నిమిషాల్లోనే లక్షకు పైగా వ్యూస్‌తో సత్తా చాటింది. ప్రస్తుతం కబాలి మేకింగ్ వీడియో ఆన్లైన్లో సృష్టించబోయే సరికొత్త రికార్డ్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.