రజనీకాంత్ హీరోగా ‘కబాలి’ ఫేమ్ పా. రంజిత్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కాలా’ వండర్‌బార్ ఫిల్మ్స్ పతాకంపై నటుడు, రజనీకాంత్ అల్లుడు ధనుష్ ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాను నిర్మించారు. హ్యూమా ఖురేషీ, అంజలీ పాటిల్ కథానాయికలు. ఈ చిత్రం టీజర్‌లో చూపించిన రైన్ ఫైట్ షాట్స్ గుర్తుండే ఉంటాయి. ఆ రైన్ ఫైట్ సీక్వెన్స్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలువనుందట. ఈ ఫైట్ సీన్స్ చిత్రీకరణ గురించి, రజనీకాంత్ డెడికేషన్ గురించి చిత్రబృందం చెబుతూ – ‘‘ఐదు రోజుల పాటు ఈ రైన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించాం. రజనీకాంత్ ఒక షాట్ చేసి వచ్చి అలా తడిబట్టలతోనే కూర్చుని ఏదైనా బుక్ చదువుతూ ఉండేవారు.
నెక్ట్స్ షాట్ రెడీ అయ్యేవరకూ కొంచెం డ్రై అవ్వండి అని చెబితే మళ్లీ ఎలాగూ తడవాలి కదా.. ఏం ఫర్లేదు అని నవ్వేసేవారు. రజనీకాంత్‌లో ఉండే బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ప్రతీ సినిమాను తన ఫస్ట్ సినిమాలాగా ట్రీట్ చేయడమే. తన కంఫర్ట్ జోన్‌లో నుంచి బయటకు రావడానికి ట్రై చేస్తూ ఉంటారు. సూపర్ స్టార్ తలుచుకుంటే సీన్ తనకు తగ్గట్టుగా మార్చుకోవచ్చు. కానీ అలా ఒప్పుకోరు. సీన్ డిమాండ్‌కు తగ్గట్టుగానే రజనీకాంత్ తనని అడాప్ట్ చేసుకుంటారు. రజనీసార్ అలా ఉండటం వల్ల టీమ్‌లో ఉన్న అందరికీ బూస్ట్‌లా అనిపించింది’’ అని పేర్కొంది చిత్రబృందం. రజనీకాంత్ సూపర్‌స్టార్‌గా ఇంత స్టార్‌డమ్‌ను సంపాదించగలిగారంటే అది కేవలం నటుడిగా ఆయనకున్న డెడికేషన్ వల్లే అని అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా జూన్ 7న రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment