Huma Qureshi
-
తారలు అక్షరాలు తళుక్కుమన్నాయి
సాహిత్యాభిమానులు క్యూ కట్టారు. వేదికల మీద రచయితలు, రచయిత్రులు, నటీనటులు తమ మాటల మూటలు విప్పారు. పుస్తకాలు మేమున్నామంటూ ఆకర్షణీయమైన అట్టలతో పాఠకుల్ని కేకేశాయి. హైదరాబాద్‌లో శుక్రవారం మొదలైన హైదరాబాద్ లిటరేచర్ ఫెస్టివల్ నగరానికి కొత్త శోభను తెచ్చింది. ఈ సందర్భంగా తారలేమన్నారో అక్షరాలు ఎలా మెరిశాయో ఇక్కడ చదవండి.ప్రపంచమే ఒక రంగస్థలంభారతదేశం గొప్ప లౌకికదేశమని కొనియాడారు అమల్ అల్లానా. దేశవిభజన సమయంలో అమల్ తల్లి రోషన్ నిండు గర్భిణి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నెల రోజులకు పుట్టింది అమల్. ఆమె తండ్రి ఇబ్రహీమ్ అల్కాజీ గుర్తింపు పొందిన డైరెక్టర్. సౌదీ అరేబియా, కువైట్ మూలాలున్న కుటుంబం ఆయనది. విభజన సమయంలో ఇబ్రహీం సోదరులంతా పాకిస్థాన్‌కు వెళ్లిపోయారు. ఇబ్రహీమ్ మాత్రం ఇండియాలో కొనసాగారు. ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు అమల్. తల్లి కుటుంబం గుజరాత్‌కు చెందినది కావడం కూడా తాము ఇండియాలో ఉండిపోవడానికి అదో కారణమంటూ తాను చూసిన ఇండియా గమనాన్ని విశ్లేషించారు. ‘అరవైల నాటి ఇండియాని చూశాను, 90ల నాటికి వచ్చిన మార్పులకు ప్రత్యక్ష సాక్షిని. అలాగే 2025కి సాధించిన పురోగతిని ఆస్వాదిస్తున్నాను. కొత్త బాధ్యతలను భుజానికెత్తుకుంటూ పాత బ్యాగేజ్‌ని తగ్గించుకుంటూ ముందుకుపోవడమే అభివృద్ధి’ అన్నారు అమల్. అవి గోల్డెన్ డేస్! రంగస్థల దర్శకత్వం, కాస్ట్యూమ్ డిజైనింగ్, సీన్ డిజైనింగ్‌లో నైపుణ్యం సాధించిన అమల్ అల్లానా ఢిల్లీలోని ‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా’కు చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఆమె తల్లి రోషన్ అల్కాజీ రచనలు ‘ఏన్షియెంట్ ఇండియన్ కాస్ట్యూమ్, మిడివల్ ఇండియన్ కాస్ట్యూమ్’ లను పరిష్కరించారు. ఇటీవల తండ్రి జీవితాన్ని ‘ఇబ్రహీం అల్కాజీ: హోల్డింగ్ టైమ్ క్యాప్టివ్’ పేరుతో అక్షరబద్ధం చేశారు. ఈ రచనలోని విషయాలను ప్రస్తావించడం అంటే నా తండ్రిని గుర్తు చేసుకోవడమే అంటూ ‘మేము ముంబయిలోని ఒక ఆరు అంతస్థుల భవనంలో నివసించేవాళ్లం. ఆ టెర్రస్‌ని చూసిన మా తండ్రి అక్కడ 80 మంది వీక్షించే రంగస్థల వేదికను ఏర్పాటు చేశారు. అప్పుడు నాటకాన్ని చూడడానికి ప్రేక్షకులు ఐదంతస్థులు మెట్లెక్కి వచ్చేవారు. అవి రంగస్థలానికి గోల్డెన్ డేస్. ఇప్పుడు రంగస్థలానికి వన్నె తగ్గిన మాట నిజమే కానీ, రంగస్థలం అంతరించిపోవడం అనేది జరగదు. ఎందుకంటే ప్రపంచ దేశాల సంస్కృతి అంతా రంగస్థలం చుట్టూనే పరిభ్రమించింది’ అన్నారు అమల్ అల్లానా.భాగమతి ప్రేమకథ స్ఫూర్తినిస్తూనే ఉంటుందిబెంగాల్కు చెందిన మౌపియా బసు జర్నలిస్టు, రచయిత. చారిత్రక పరిశోధనల ఆధారంగా కథనాలను వెలువరించే మౌపియా నాలుగేళ్ల కిందట హైదరాబాద్‌కు వచ్చారు.‘అనార్కలి అండ్ సలీం: ఏ రీటెల్లింగ్ ఆఫ్ ముఘల్ ఈ ఆజమ్, ‘ద క్వీన్స్ లాస్ట్ సెల్యూట్: ద స్టోరీ ఆఫ్ ద రాణీ ఆఫ్ ఝాన్సీ అండ్ ద 1857 మ్యూటినీ, ఖోక, కమల్సుందరి’ రచనలు చేసిన మౌపియాకు హైదరాబాద్ నగరం కొత్త సందేహాలను రేకెత్తించింది. నగరంలో ఎక్కడికెళ్లినా ఆమెకు వినిపించిన భాగ్యనగర్ అనే పేరు మీద పరిశోధన మొదలుపెట్టారు. తాను తెలుసుకున్న విషయాలను ‘భాగమతి : వై హైదరాబాదీస్ లాస్ట్ క్వీన్ ఈజ్ ద సోల్ ఆఫ్ ద సిటీ’ పేరుతో ప్రచురించారు. హైదరాబాద్వాసుల్లో పరిపూర్ణమైన మతసామరస్యాన్ని, బ్రదర్‌హుడ్‌ను చూశానన్నారు మౌపియ. ‘ఈ నగరంలో నివసించే వాళ్లు తమను తాము మతం, కులం,ప్రాంతం, భాషల ఆధారంగా పరిచయం చేసుకోరు. ‘హైదరాబాదీని’ అని గర్వంగా చెప్పుకుంటారు. హైదరాబాద్‌లో మాత్రమే వినిపించే డయలక్ట్ కూడా వీనులవిందుగా ఉంటుంది. హైదరాబాద్ మీద సామాన్యుల్లో ఉన్న అనేక అపోహలను నా పర్యటన తుడిచేసింది. ఓల్డ్‌సిటీకి వెళ్లవద్దనే హెచ్చరికలను పట్టించుకోకుండా రంజాన్ మాసంలో వెళ్లాను. ఆత్మీయతకు అర్థాన్ని తెలుసుకున్నాను. అక్కడి వాళ్లను పలకరించినప్పుడు వారి నోటివెంట కూడా భాగమతి మాట వినిపించింది. ఒక ప్రేమ కథ రెండు మతాలను కలిపి ఉంచుతోంది. ఆ ప్రేమకథ నాలుగు వందల ఏళ్లుగా జనం నాలుకల మీద సజీవంగా ఉంది. అయితే నాకు సమాధానం దొరకని ప్రశ్న ఏమిటంటే... గోల్కొండను పాలించిన కుటుంబాల సమాధులున్నాయి, మహళ్లు, ప్యాలెస్‌లున్నాయి. కానీ భాగమతి ఊహాచిత్రం తప్ప అధికారిక డాక్యుమెంట్ కానీ, శిల్పం వంటి ఆధారం కానీ లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. హైదరాబాద్ అధికారిక రికార్డుల్లో ఎక్కడా ఆమె పేరు కనిపించదు. కానీ ఇక్కడ పర్యటించిన యాత్రికుల రచనల్లో ఉంది. డచ్, బ్రిటిష్ వ్యాపారుల రికార్డుల్లో భాగ్నగర్ పేరు ఉంది. సినిమా, రంగస్థలం, కవిత్వం, పెయింటింగ్లుల్లో భాగమతి కనిపిస్తోంది. ఆమెకు సంబంధించిన భౌతిక ఆధారం ఒక్కటీ లభించకపోవడానికి కారణం ఉద్దేశపూర్వకంగా తుడిచేయడం జరిగిందా అనేది సమాధానం లేని ప్రశ్నగానే ఉంది’ ఈ చారిత్రకాంశం తరతరాలుగా ఒకరి నుంచి ఒకరికి మౌఖికంగా కొనసాగుతోంది’ అని వివరించారు మౌపియా బసు. ఆమె శిల్పం లేదు. ఆమె రూపాన్ని చిత్రపటంగా అయినా ఎవరూ చూడలేదు. ఆమె సమాధి ఎక్కడో తెలీదు. కానీ ఇన్ని వందల ఏళ్లుగా ఆమె పేరును తలవడం మానలేదు హైదరాబాదీలు.ఫెమినిస్ట్ అయితే తప్పేంటి?షబానా ఆజ్మీ తెలుగింటి ఆడపడచు. ఆమె పుట్టిల్లు హైదరాబాద్. తొలిసారి కెమెరా ముందుకు వచ్చిందీ ఇక్కడే! ఆ జ్ఞాపకాలతోపాటు నేటి సినిమా.. ఆ రంగంలో పెరుగుతున్న అమ్మాయిల పాత్ర గురించీ ముచ్చటించారు. అవి ఆమె మాటల్లోనే.. ‘నేను హైదరాబాద్‌లోనే పుట్టినా ఇక్కడ గడిపింది తక్కువే! నాన్న (కైఫీ ఆజ్మీ)పోయెట్ మాత్రమే కాదు కమ్యూనిస్ట్ పార్టీ మెంబర్ కూడా. ఆయన అండర్ గ్రౌండ్ జీవితం వల్లే నా తొమ్మిదో ఏట అమ్మ నన్ను తీసుకుని ముంబైకి వెళ్లింది. సమ్మర్‌కి మాత్రం వచ్చేవాళ్లం. అమ్మ (షౌకత్ ఆజ్మీ) రంగస్థల నటి. దాంతో హైదరాబాద్‌లోని మా ఇంట్లో సాహిత్యం, నాటకం, సామాజిక స్పృహ కలగలసిన ఒక ప్రోగ్రెసివ్ వాతావరణం ఉండేది. ఆ నేపథ్యంలో పెరిగాన్నేను. దాంతో యాక్టివిజం కూడా నాకు వారసత్వంగా అబ్బింది. ఆ గుణం వల్లే ముంబైలోని మురికివాడల నిర్వాసితుల కోసంపోరాడాను. పొట్ట చేతపట్టుకుని సిటీకి వచ్చేవాళ్లకు పని దొరుకుతుందేమో కానీ సొంత జాగా దొరకదు. దానికోసం వాళ్ల తరఫున నిలబడ్డాను. మహిళల హక్కుల కోసమూ ముందుంటాను. కొంతమంది ఫెమినిస్ట్ అని చెప్పుకోవడం పట్ల నామోషీ ఫీలవుతున్నట్లనిపిస్తోంది ‘నేనేం ఫెమినిస్ట్‌ను కాను’ అని చెప్పుకుంటున్న వాళ్ల తీరును చూస్తే! ‘అంకురం’తో సొంతూరు పర్యటననా మొదటి సినిమా శ్యామ్ బెనెగల్ తీసిన ‘అంకురం’ షూటింగ్ హైదరాబాద్ (ఎల్లారెడ్డి గూడ) లోనే జరిగింది. బాల్యం తర్వాత మళ్లీ హైదరాబాద్‌కు రావడం అప్పుడే! అంతా కొత్తగా అనిపించింది. అంకురంలో నాది పనమ్మాయి పాత్ర. దానికి తగ్గట్టు నన్ను మలచడానికి శ్యామ్ బెనెగల్ నన్ను.. చీర కట్టుకుని మేమున్న ఇంటి పరిసరాల చుట్టూ తిరిగి రమ్మన్నాడు. మనుషులను, కల్చర్‌ను అబ్జర్వ్ చేయడానికి. ఓ మూడు రోజులు అదేప్రాక్టీస్! మాకు భోజనాలు ఏర్పాటు చేసిన చోట కూడా వాళ్లంతా టేబుల్ మీద తింటుంటే.. నన్నో మూలన, కింద కూర్చొని తినమనేవాడు. ఒకరోజు నేనలా తింటుంటే.. కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ నా దగ్గరకు వచ్చి ‘ఇక్కడేదో సినిమా షూటింగ్ అవుతోందట కదా! హీరోయిన్ ఏది’ అనడిగారు. ‘బయటకు వెళ్లింద’ని చెప్పాను. ‘నువ్వెవరు?’ అనడిగారు. ‘ఆయాను’ అన్నాను. దీన్నంతా దూరం నుంచి గమనించిన శ్యామ్ బెనెగల్.. ఆ స్టూడెంట్స్ వెళ్లిపోగానే నన్ను పిలిచి, ‘నువ్విక ఈప్రాక్టీస్ ఆపేయొచ్చ’ని చెప్పారు. అలా ఉండేది ప్యార్లల్ మూవీస్‌లో పాత్రల ప్రిపరేషన్! హాలీవుడ్లో కూడా నటించాను (Madame Sousatzka, City of joy) కదా! వాళ్ల తీరు వేరు. పేపర్ మీద రాసుకున్నది రాసుకున్నట్టుగా జరగాలి. అది ఏ కాస్త కింద మీదైనా కంగారుపడిపోతారు. మళ్లీ అంకుర్ జ్ఞాపకాలకొస్తే.. నాకు కాస్ట్యూమ్స్‌ను కుట్టించడానికి ఓ దర్జీని పిలిపించారు. అతను టేప్ లేకుండా జస్ట్ అలా వచ్చి నన్నోసారి పై నుంచి కిందకు.. కింద నుంచి పైకి చూసి వెళ్లిపోయాడంతే! తర్వాత రెండు రోజులకు పర్ఫెక్ట్ సైజ్‌తో కాస్ట్యూమ్స్‌ను రెడీ చేసిచ్చాడు.పారలల్ మూవీస్‌కి... ఫార్ములా మూవీస్‌కి మధ్య వ్యత్యాసంపారలల్ మూవీస్‌లో స్త్రీ పాత్రలకు ఔచిత్యం, వ్యక్తిత్వం ఉండేవి. అదంతా సీరియస్ వ్యవహారం. ఫార్ములా మూవీస్‌కి వినోదమే ప్రధానం. ఆర్ట్ మూవీస్ నుంచి కమర్షియల్ మూవీస్‌కి వెళ్తున్న కొత్తలో భలే ఇబ్బంది పడ్డాను. ముఖ్యంగా డాన్స్ విషయంలో! ప్యార్లల్ మూవీ మూవ్‌మెంట్‌ను ఇప్పుడు ఓటీటీ రీప్లేస్ చేస్తోంది. అన్నిరకాల సినిమాలతో ప్రేక్షకులకు చాయిస్ ఉండాలి. ఈ మధ్య కొన్నివర్గాల వాళ్లు తమ ఐడియాలజీస్ను ప్రమోట్ చేసుకోవడానికి సినిమాను ఉపయోగించుకుంటున్నారనే ఆందోళనలు వినిపిస్తున్నాయి. ప్రేక్షకుల విచక్షణ చాలా గొప్పది. కాబట్టి ఆందోళన పడాల్సిన అవసరం లేదు.పురుషులను ఎడ్యుకేట్ చేయాలిఅన్ని రంగాల్లో అమ్మాయిలు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినా వివక్ష వీడట్లేదు. దానికి సినిమా రంగమూ అతీతం కాదు. ప్రతిచోట స్త్రీలకు భద్రత ఉండాలి! వివక్షను రూపుమాపడానికి పురుషులను ఎడ్యుకేట్ చేయాలి. అది ఇంటి నుంచే మొదలవ్వాలి. తల్లిదండ్రులే ఆ ప్రయత్నానికి నాంది పలకాలి. ఈ విషయం మీద మా అబ్బాయి (యాక్టర్, స్క్రిప్ట్ రైటర్, డైరెక్టర్ ఫర్హాన్ అఖ్తర్) ‘మర్ద్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి మగ పిల్లల్లో అవేర్నెస్ కల్పిస్తున్నాడు!’ అంటూ చెప్పుకొచ్చింది నటి షబానా ఆజ్మీ. సినిమా ఇండస్ట్రీలో మహిళా టెక్నీషియన్స్ పెరిగారు. వాళ్లలో స్క్రిప్ట్ రచయితలు, దర్శకులు కూడా ఉండటంతో సున్నితమైన అంశాలు తెరమీదకు వస్తున్నాయి. నటనలో కూడా నేటి అమ్మాయిలు చాలా తెలివైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాకపోతే ఐటమ్ సాంగ్స్‌తోనే పేచీ. అవి పెట్టినా కాస్త అర్థవంతంగా ప్రెజెంట్ చేయొచ్చు కదా!గర్ల్‌ఫ్రెండ్సే కారణం.. ‘స్త్రీకి స్త్రీ శత్రువు కాదు. ఇలాంటి తప్పుడు భావజాలాన్ని ప్రచారం చేసి పబ్బం గడుపుకుంటోంది పురుషాధిపత్య సమాజం. దాని మాయలో పడకూడదు. స్త్రీకి స్త్రీయే నేస్తం. నేనీ రోజు ఈ స్థాయికి చేరానంటే కారణం నా చుట్టూ ఉన్న స్త్రీమూర్తులు.. గర్ల్‌ఫ్రెండ్సే! అందుకే సిస్టర్‌హుడ్‌ను పెంపొందించుకోవాలి. అలాగే తిండి, కట్టు, బొట్టు లాంటివన్నీ వ్యక్తిగత విషయాలు. మన సౌకర్యం, అభిరుచిని బట్టి నిర్ణయించుకునేవి తప్ప సమాజమో, ప్రభుత్వాలో నిర్ణయించేవి కావు!’– హుమా ఖురేషీచిత్చోర్ ఏమన్నాడు‘గోరి తేరా గావ్ బడా ప్యారా’ అంటూ అమోల్ పాలేకర్ హైదరాబాద్ వచ్చేశాడు మరాఠీ న్యూవేవ్ సినిమా పయనీర్, నటుడు, దర్శకుడు, థియేటర్ పర్సనాలిటీ, చిత్రకారుడు అమోల్ పాలేకర్... మారిన సినిమా తీరు, మరాఠీ రంగస్థలం గురించి మాట్లాడుతూ.. ‘సినిమా థియేటర్ ఉనికి కోల్పోయింది. ఓటీటీ వచ్చింది. సెల్ఫోన్లో ప్రపంచం కనబడుతోంది. ఈ మార్పంతా ఓ పద్ధతి ప్రకారం జరిగింది. అది ప్యార్లల్ మూవీ మూవ్‌మెంట్‌నూ కంట్రోల్ చేసింది. సొంత ప్రయోజనాల కోసం పాలక వర్గాలకు కొమ్ముకాసే వాళ్లు సినిమా రంగంలోనూ ఉంటారు. ఏటికి ఎదురీదే వాళ్లు కొద్దిమందే! వాళ్లు మైనారిటీ వర్గంగా మిగిలిపోయి ప్రభావం చూపించలేకపోతారు. వీటన్నిటి క్రమంలో ఊరటను.. సంతోషాన్నిస్తున్నది రంగస్థలమే! అది తన శోభను కోల్పోలేదు. ముఖ్యంగా మరాఠీ రంగస్థలం. యంగ్ జనరేషన్‌తో కళకళలాడుతోంది. అది ఒక్క ముంబై, పుణెలోనే కాదు మహారాష్ట్ర అంతటా ఎక్స్‌పెరిమెంట్స్‌తో వైబ్రెంట్‌గా ఉంది’ అని చెప్పారు. – వాకా మంజులారెడ్డి -
కైపెక్కించే చూపులతో కవ్విస్తోన్న ‘హుమా ఖురేషి’ (ఫొటోలు)
-
ఓటీటీకి వచ్చేస్తోన్న మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడంతా ఓటీటీల హవా నడుస్తోంది. దీంతో వెబ్ సిరీస్ కంటెంట్‌పై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. భాషతో సంబంధం లేకుండా సినిమాలు, వెబ్ సిరీసులు తెగ చూసేస్తున్నారు. దీంతో సరికొత్త కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ఓటీటీకి వచ్చేందుకు రెడీ అయిపోయింది. హుమా ఖురేషి ప్రధాన పాత్రలో తెరకెక్కించిన పొలిటికల్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాకపోతే అది టాలీవుడ్‌కు సంబంధించినది మాత్రం కాదు. మొదటి, రెండు సీజన్స్ సూపర్ హిట్‌గా మహారాణి సీజన్-3 స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఈనెల 7వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి విశేషమైన స్పందన లభించింది. ఈ సిరీస్‌లో బీహార్‌లో హానికరమైన మద్యం వ్యాపారం గురించి చూపించనున్నారు. ఈ సిరీస్‌ను సుభాష్ కపూర్ కథను అందించగా.. కరణ్ శర్మ దర్శకత్వం వహించారు. రాజకీయాలు నేపథ్యంగా కల్పిత కథ ఆధారంగా ఈ సిరీస్‌ను రూపొందించారు. కాంగ్రా టాకీస్ పతాకంపై డింపుల్ ఖర్బందా, నరేన్ కుమార్ ఈ వెబ్ సిరీస్‌ను నిర్మించారు. కాకపోతే ఈ సిరీస్ కేవలం హిందీ భాషలోనే స్ట్రీమింగ్ కానుంది. -
Huma Qureshi: అయిదు పడవల ప్రయాణం
రెండు పడవల మీద ప్రయాణం చాలామందికి కష్టమేమోగానీ కొద్దిమందికి మాత్రం చాలా ఇష్టం. థియేటర్ ఆర్టిస్ట్, మోడల్, హీరోయిన్, ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్న హుమా ఖురేషి ‘జేబా: యాన్ యాక్సిడెంటల్ సూపర్‌హీరో’ పుస్తకంతో రైటర్‌గా మారింది. రైటర్‌గా తన అనుభవాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ‘ప్రపంచాన్ని కాపాడిన మహిళ కథ ఇది. సామాజిక కట్టుబాట్లకు అతీతంగా అన్ని వర్గాల వారికోసం రాసిన పుస్తకం’ అంటుంది ఖురేషి. నవరసాలలో హాస్యరసం తనకు కష్టం అంటుంది ఖురేషి. ‘నేను రాసిన హ్యూమర్ నాకు విపరీతంగా నవ్వు తెప్పించవచ్చు. ఇతరులు అసలే నవ్వకపోవచ్చు. అందుకే హ్యూమర్ రాయడం చాలా కష్టం’ అంటుంది ఖురేషి. ఈ పుస్తకంలో కథానాయిక ‘జేబా’తో పాటు ఎన్నో క్యారెక్టర్లు ఉన్నాయి. అన్ని క్యారెక్టర్లు తనకు ఇష్టమే అని చెబుతున్న హుమా ఖురేషి రైటర్‌గా కూడా మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిద్దాం. -
నైతిక సందిగ్ధతల అంతస్సంఘర్షణ
సరైన ఫలితాన్ని సాధించడానికి సరైనవి కాని మార్గాలను అనుసరించడం ఆమోదయోగ్యమేనా? ‘‘అర్థవంతమైన దానిని సాధించడం కోసం మనం నమ్మిన సిద్ధాంతాలు, మనం పాటించే విలువలు, మనం అనుసరించే ప్రమాణాలలో కొన్నింటిని త్యాగం చెయ్యడం కూడా గౌరవనీయమే’’ అనే వాదన రాజకీయాలలో ఉంది. ఒక శక్తిమంతమైన నిర్ణయం తీసుకోడానికి ప్రధాని తన కార్యాలయానికి ఉన్న అపారమైన అధికారాలను ఎలాంటి నైతికపరమైన సంకోచాలూ లేకుండా ఉపయోగించడం ఆత్మ సమ్మతం అవుతుందా? కాలమిస్ట్ ఆకార్ పటేల్ తొలి నవల ‘ఆఫ్టర్ మెస్సయ’... గొప్ప ఉద్విగ్నతకు లోను చేసే సాంప్రదాయిక రాజకీయ రచనల మాదిరిగా కాకుండా... రాజకీయాల సహజ స్వభావాన్ని, గొప్ప విజయాలు తరచు సిగ్గుచేటు సర్దుబాట్ల నుంచి సంప్రాప్తించడంలోని వైరుద్ధ్యాన్ని ప్రతిబింబిస్తోంది. నిజం చెప్పొద్దూ... తనొక నవల రాశానని ఆకార్ పటేల్ నాతో అన్నప్పుడు నేను ఆశ్చర్యచకితుణ్ణే అయ్యాను. పటేల్‌ను ఒక దృష్టికోణం గల పత్రికా రచయితగా, మోదీ ప్రభుత్వాన్ని తూర్పార పట్టే ఒక గట్టి రాజకీయ వ్యాసకర్తగా, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌కు ధీశాలి అయిన ఛైర్మన్‌గానే నేను ఎరుగుదును. అంతే తప్ప, కాల్పనికత అయన అజ్ఞాత బలం అయి ఉంటుందని నేను ఏ కోశానా అనుకోలేదు. ఇంతేనా నాకు పటేల్ గురించి తెలిసింది! కథనానికి లోతైన నైతిక కోణాన్ని అందించే అంతస్సంఘర్షణతో పాత్రలను సృష్టించగల సామర్థ్యంతో పాటుగా ఆయన ఊహాశక్తిలోని ప్రతిభను, కదలనివ్వని కథన పటిమను ఆయన తాజా రచన ‘ఆఫ్టర్ మెస్సయ’ బహిర్గతం చేస్తోంది. గొప్ప ఉద్విగ్నతకు లోను చేసే సాంప్రదాయిక రాజకీయ రచనల మాదిరిగా కాకుండా ఈ పుస్తకం రాజకీయాల సహజ స్వభావాన్ని, గొప్ప విజయాలు తరచు సిగ్గుచేటు సర్దుబాట్ల నుంచి సంప్రా ప్తించడంలోని వైరుధ్యాన్ని ప్రతిబింబిస్తోంది. ఈ నవలొక వాస్తవ ఘటనల అల్లికగా ప్రారంభం అవుతుంది. నిజమైన వ్యక్తులు ఉంటారు. అయితే వారికి పెట్టుడు పేర్లు ఉంటాయి. ప్రధాన మంత్రిని ‘ది బిగ్ మ్యాన్’ అంటారు పటేల్. పుస్తకంలో ఎక్కడా ప్రధాని పేరు కనిపించదు. కానీ ఆ బిగ్ మ్యాన్ మాట్లాడే టప్పుడు ‘‘ప్రజాస్వామ్యం యొక్క భాష, చిహ్నాలు... పాలకుడు తన గురించి తను మూడో వ్యక్తిగా వ్యక్తం చేసుకుంటున్న ప్రస్తావనలతో కలిసి ఉంటాయి.’’ అది మొదటి గుర్తు. ఆ బిగ్ మ్యాన్ ప్రారంభోత్సవాలను కూడా ఇష్టపడతారు కనుక, ‘‘బిగ్ మ్యాన్ అధ్యక్షత వహించేందుకు వీలైనంతగా అత్యుత్తమమైన ఒక కార్యక్రమాన్ని లేదా వేడుకను అందించడంపై మంత్రిత్వశాఖలు దృష్టి పెడతాయి.’’ అది రెండవ గుర్తు. ఇక మూడోది... ‘‘రాజకీయ వ్యతిరేకత. అదేదో అంతర్గత శత్రువైనట్లుగా దానిపై హింసాత్మక దాడులు జరుగుతుంటాయి. ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలు ఆ శత్రువును చావనివ్వని, బతకనివ్వని వాస్తవ రాజకీయా లకు అతీతమైన ఒక నిరంతర స్థితిలో ఉంచడంలో పూర్తిగా నిమగ్నం అయి ఉంటాయి’’. ఇప్పుడీ పుస్తకంలోని అబ్బుర పరుస్తూ చదివించే సంతోష దాయకమైన సృజనాత్మక ముగింపు గురించి తప్ప మరింకేదీ బహిర్గతం చేయడం నాకు ఇష్టం లేదు. బదులుగా ఇందులో పటేల్ కథనానికి పునాదిగా జరిగిన శక్తిమంతమైన రాజకీయ... నిజానికి నైతికపరమైన చర్చ గురించి మీకు చెబుతాను. పటేల్ పుస్తకంలో బిగ్ మ్యాన్ చాలా త్వరగా చనిపోతాడు. ఆయన తర్వాత మీరా అనే మహిళ అధికారంలోకి వస్తారు. ‘లాయర్స్ కలెక్టివ్’ అనే ఎన్జీవోకు పని చేస్తుంటారు మీరా. ఆమె అవివాహిత.ఒంటరి తల్లి. ఆమె కుమార్తె జైల్లో ఉంటుంది. బిగ్ మ్యాన్, ఆయన పార్టీ అనుసరించిన రాజకీయ విధానాలపై మీరాకు తృణీకారభావం ఉంటుంది. అనిష్టంగానే ప్రధాని అవుతారు. అయ్యాక మాత్రం గతంలోని క్రూరమైన చట్టాలను రద్దు చేయడం కోసం అపారమైన తన కార్యాలయ అధికారాలను ఉపయోగించు కోవాలనుకుంటారు. పేదల ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించే ప్రయత్నంగా ప్రభుత్వాన్ని బాధ్యతాయుతంగా, జవాబుదారీగా మార్చేయబోతారు. అయితే సమస్య ఎక్కడొస్తుందంటే ఆమె తన కార్యాలయ అపరిమిత అధికారాలను అభ్యంతరం, అనైతికం అయిన మార్గాలలో ఉపయోగించవలసి రావడం. ఇక్కడ జనించే ప్రశ్న: సరైన ఫలితాన్ని సాధించడానికి సరైనవి కాని మార్గాలను అనుసరించడం ఆమోదయోగ్యమేనా? అన్నది. ఆమె ముఖ్య సలహాదారు... ఆ సలహాదారుకు పేరేం ఉండదు... ‘హౌస్ మేనేజర్’ అంతే. ఆ మేనేజర్‌కు ఇది ఆమోదయోగ్యమే అనిపి స్తుంది. ‘‘అర్థవంతమైన దానిని సాధించడం కోసం మీరు నమ్మిన సిద్ధాంతాలు, మీరు పాటించే విలువలు, మీరు అనుసరించే ప్రమాణాలలో కొన్నింటిని త్యాగం చెయ్యడం గౌరవనీయం,ప్రశంసనీయం అయిన సంగతే’’ అంటారు హౌస్ మేనేజర్. కానీ అందువల్ల ప్రయోజనం పొందగలిగిన సగటు ప్రజలు దానిని అంగీకరించరు. మీరా వారిని సంప్రదించినప్పుడు ఒక వృద్ధురాలు... తరచు నిరాకరణకు గురవుతుండే, అదే సమయంలో సర్వకాలాలకు అమోదయోగ్యమైనదిగా ఉండే యుగాల వివేకాన్ని వ్యక్తపరుస్తుంది. ‘‘చేయవలసిన సరైనది ఒకే ఒకటి ఉంటుంది. అదే సరైనది’’ అని అంటుంది. ఈ విధంగా పటేల్ పుస్తకం ముగింపునకు చేరుకుంటున్న కొద్దీ భారత రాజకీయాల స్వభావం గురించి; ఒకవైపు ఎత్తుగడలూ వ్యూహాలకూ, మరోవైపు సిద్ధాంతాలూ నైతికతలకూ మధ్య జరుగు తుండే ఘర్షణలతో ఒక శక్తిమంతమైన కథగా అభివృద్ధి చెందుతుంది. ప్రధాని కార్యాలయానికి ఉండే అపారమైన అధికారాలను నైతిక పరమైన సంకోచాలు లేకుండా, అనుకున్న దానిని సాధించేందుకు మీరా ఏకచిత్తంతో దృష్టి సారించినందున పుస్తకంలోని ఈ భాగం కేవలం చదివించేలా మాత్రమే కాదు, ఒక వెల్లడింపుగానూ ఉంటుంది. మీరా తనలోని సందేహాలను అణిచివేస్తారు. అయితే ఆశించిన ఫలితాన్ని సాధించడానికి ఇదే ఏకైకమార్గం అని హౌస్ మేనేజర్ తనకు నచ్చజెప్పేందుకు ఆమె అనుమతిస్తారు. అందువల్లనే ముగింపులో ఫలితం అనేది ఫలితం కోసం అనుసరించిన మార్గాలపై విజయం సాధించడం కనిపిస్తుంది. అయితే చర్చ మాత్రం ముగింపు దశకు చేరకనే ఉండిపోతుంది. అది ఆమె మనస్సాక్షిని కృంగదీస్తూ ఉంటుంది. నిజంగా రాజకీయాల్లో తరచు ఇలా జరుగుతుంటుందన్నది వాస్తవం. పటేల్ ‘బిగ్ మ్యాన్’పై ఇదేమీ ప్రభావం చూపకపోవచ్చు కానీ ఇతర రాజకీయ నాయకులు తరచుగా ఇబ్బంది పడుతుంటారు. కొన్నిసార్లయితే దానివల్ల నలిగిపోతుంటారు కూడా. భారతదేశంలోనే కాదు, చాలా ప్రజాస్వామ్య దేశాలలో ఇలాగే జరుగుతుంటుంది. అందుకే రాజకీయాల సారాంశం అన్నది రాజకీయపరమైన దాని కన్నా చాలా ఎక్కువైనది. ఎందుకంటే అది నిర్ణయాలకు, ఎంపికలకు, అంతిమంగా సైద్ధాంతికతల్ని మించిన అంశాలకు సైతం సంబంధించినది. అలాగే నైతికపరమైన వాటికి కూడా. పటేల్ ఆ సంగతిని స్పష్టంగా అర్థం చేసుకున్నారు. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
బాలీవుడ్లో బెట్టింగ్ యాప్ ప్రకంపనలు.. ప్రముఖులకు ఈడీ సమన్లు..!
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో బాలీవుడ్ నటులైన హుమా ఖురేషి, కపిల్ శర్మ, హీనా ఖాన్లకు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో సాక్షుల హోదాలో ముగ్గురు నటులను విచారించనున్నట్లు సమాచారం. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల సమాచారం ప్రకారం వీరు ముగ్గురూ బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేస్తున్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం వీరు డబ్బును కూడా స్వీకరించినట్లు సమాచారం. అంతేకాకుండా యాప్ ప్రమోటర్ సౌరభ్ చంద్రకర్ వివాహానికి కూడా కపిల్ శర్మ హాజరైనట్లు టాక్ వినిపిస్తోంది. (ఇది చదవండి: సినిమానే తన జీవితంగా మలచుకున్న నిత్యవిద్యార్థి: ఆయనపై మెగాస్టార్ ప్రశంలు) గడువు కోరిన రణ్‌బీర్ కపూర్! అయితే ఇప్పటికే అక్టోబర్ 6న అధికారుల ముందు హాజరు కావాలని నటుడు రణబీర్ కపూర్‌కు ఈడీ సమన్లు పంపిన సంగతి తెలిసిందే. అయితే హాజరయ్యేందుకు రెండు వారాల మినహాయింపు కోరినట్లు తెలుస్తోంది. అతని అభ్యర్థనపై ఈడీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మహదేవ్ యాప్‌కి సంబంధించిన ప్రమోషన్ల కోసం అతను అందుకున్న మొత్తం... అతనితో కాంటాక్ట్‌లో ఉన్న వ్యక్తుల గురించి వివరణ కోరాలని ఈడీ భావిస్తోంది. మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ ఏంటి? మహాదేవ్ బుక్ యాప్ అనేది ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్. దీని ద్వారా అక్రమంగా మనీలాండరింగ్ కార్యకలాపాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. కాగా.. ఈ యాప్ ప్రమోటర్ సౌరభ్ చంద్రకర్ ఫిబ్రవరి 2023లో దుబాయ్‌లో తన వివాహ వేడుక కోసం ఏకంగా రూ. 200 కోట్లు ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది. అత్యంత విలాసవంతంగా ఈ వేడుక జరిగింది. ఈ పెళ్లికి బాలీవుడ్ ప్రముఖులు టైగర్ ష్రాఫ్, సన్నీలియోన్, నేహా కక్కర్, విశాల్ దద్లానీ, ఎల్లి అవ్రామ్, భారతీ సింగ్, భాగ్యశ్రీ, కృతి కర్బందా, నుష్రత్ భరుచ్చా, అతీఫ్ అస్లాం, రహత్ ఫతే అలీ ఖాన్, అలీ అస్గర్, కృష్ణ, అభిషేక్ సుఖ్విందర్ సింగ్ హాజరయ్యారు. కాగా.. చంద్రాకర్.. మరో ప్రమోటర్ రవి ఉప్పల్‌తో కలిసి ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్‌ల ముసుగులో బినామీ ఖాతాల ద్వారా మనీలాండరింగ్ చేసినట్లు ఆరోపణలొచ్చాయి. (ఇది చదవండి: రవితేజకు సారీ చెప్పిన అనుపమ్ ఖేర్.. ఎందుకంటే?) ED has summoned comedian Kapil Sharma and actor Huma Qureshi in connection with the Mahadev betting app case: ED Sources (file pics) pic.twitter.com/rKXxUgtucl — ANI (@ANI) October 5, 2023 -
ఆ ఇద్దరు కాదు.. స్టార్ హీరో సినిమాలో బాలీవుడ్ భామ..!
సినిమా రంగంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. దీనికి తమిళ స్టార్ హీరో అజిత్ కొత్త చిత్రమే ఉదాహరణ. వరుస విజయాలతో దూసుకుపోతున్న నటుడు అజిత్ ఇటీవల నటించిన తుణివు(తెగింపు) చిత్రం విడుదలై దాదాపు ఏడాది కావస్తోంది. ఆ తర్వాత చిత్రం గురించి ప్రకటించి కూడా చాలా నెలలు అవుతోంది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విడాముయిర్చి అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. ఇప్పటికీ ఆ చిత్రం సెట్స్ పైకి వెళ్లలేదు. ఈ లోగా దర్శకుడు విఘ్నేశ్ శివన్ చిత్రం నుంచి వైదొలిగారు. ఆ తరువాత దర్శకుడు మగిళ్ తిరుమేణి పేరు తెరపైకి వచ్చింది. (ఇది చదవండి: ఆ విషయంలో మమ్మల్ని క్షమించండి.. నవీన్ పోలిశెట్టి ఆసక్తికర కామెంట్స్! ) దీంతో ఇక మిగిలింది షూటింగ్ ప్రారంభించడమే అనుకున్నారు. అతే విడాముయిర్చి చిత్రానికి ఇంకా ముహూర్తం కుదరలేదు. అజిత్ బైక్ విదేశీ ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. దీంతో విడాముయిర్చి చిత్రం ఆగిపోయిందనే ప్రచారం పెద్దఎత్తున వైరలైంది. ఇలాంటి పరిస్థితుల్లో అజిత్ చిత్రం ఆగిపోలేదని.. త్వరలోనే ప్రారంభం అవుతుందని నిర్మాత సుభాస్కరన్ ఇటీవల స్పష్టం చేశారు. హీరోయిన్ ఎవరు? ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో మొదట నటి త్రిష నాయకిగా నటించనున్నారనే ప్రచారం జరిగింది. ఆ తరువాత ఆమె వైదొలిగారనే ప్రచారం జోరందుకుంది. అలాగే మలయాళ నటి మంజు వారియర్ పేరు కూడా వినిపించింది. తాజాగా బాలీవుడ్ భామ హ్యుమా ఖురేషీని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది. ఈమె ఇంతకుముందే అజిత్‌తో వలిమై చిత్రంలో నటించారు. చివరికీ హ్యుమా ఖురేషీ పేరన్న ఫైనల్ అవుతుందో.. లేదో వేచి చూడాల్సిందే. (ఇది చదవండి: ‘తగ్గేదేలే’ అంటున్న నవీన్ పోలిశెట్టి, ఇప్పుడు అమెరికాలో కూడా..) -
స్టార్ హీరోయిన్‌పై బాడీ షేమింగ్.. ఆయన వల్ల!
హీరోయిన్ల జీవితం పైకి కనిపించినంత అందంగా ఉండదు. బయటకు నవ్వుతూ, గ్లామర్‌తో ఎంటర్టైన్ చేస్తున్నట్లు కనిపిస్తారు కానీ కొందరికి మాత్రం చేదు అనుభవాలు ఎప్పటికప్పుడు ఎదురవుతుంటాయి. పనిగట్టుకుని మరీ కొందరు నెటిజన్స్, సదరు ముద్దుగుమ్మల్ని వేధిస్తుంటారు. సోషల్ మీడియా కల్చర్ పెరిగిన తర్వాత ఈ సమస్య మరీ ఎక్కువైపోయింది. ఇప్పుడు అలానే ఓ స్టార్ హీరోయిన్ తనకెదురైన బాడీ షేమింగ్ గురించి బయటపెట్టింది. (ఇదీ చదవండి: 'రంగబలి' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఆ రోజే) హిందీ సినిమాలు చూసేవాళ్లకు నటి-హీరోయిన్ హ్యుమా ఖురేషి తెలిసే ఉంటుంది. 'గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్' మూవీతో నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈమె.. ఆ తర్వాత బోల్డ్ రోల్స్‌తో ఫేమస్ అయిపోయింది. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ నటిస్తూ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. గతంలో ఈమె చేసిన ఓ సినిమా రిలీజ్ తర్వాత, యాక్టింగ్ గురించి పక్కనబెట్టి ఈమె బరువు గురించి ఓ రివ్యూయర్ కామెంట్ చేశారట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పి హ్యుమా తెగ బాధపడింది. 'మీకు సినిమా నచ్చకపోతే నో ప్రాబ్లమ్. ఎందుకంటే అది మీ ఛాయిస్. కానీ కొందరు ఎందుకు వ్యక్తిగతంగా ట్రోల్స్ చేస్తారు? నాకైతే ఇలా చాలాసార్లు జరిగింది. ఓసారి నా మూవీ రిలీజైన తర్వాత ఓ రివ్యూయర్.. నా బరువు గురించి రాశారు. హీరోయిన్లకు ఉండాల్సిన దానికంటే ఐదు కిలోలు ఎక్కువగా ఉన్నారని అన్నారు. దీంతో నాలోనే ఏమైనా లోపం ఉందా అనే డౌట్ వచ్చింది. ఇంకా చెప్పాలంటే సినిమాలకు రివ్యూల రాయట్లేదు. వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మరీ మమ్మల్ని కిందకు లాగుతున్నారు' అని హ్యుమా ఆవేదన బయటపెట్టింది. (ఇదీ చదవండి: BRO Movie Review: ‘బ్రో’మూవీ రివ్యూ) -
అడిగి మరీ స్టార్ హీరోయిన్‌కి ముద్దుపెట్టాడు!
సెలబ్రిటీలకు ప్రస్తుతం ప్రైవసీ అనేది లేకుండా పోయింది. ఎక్కడున్నా, ఏం చేస్తున్నా వాళ్ల అనుమతి లేకుండానే నిమిషాల్లో ఫొటోలు, వీడియోలు వైరల్ అయిపోతున్నాయి. సదరు నటీనటులు పబ్లిక్ ప్లేసుల్లో ఉన్నప్పుడైతే అభిమానులం అని చెప్పి కొందరు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఎక్కడపడితే అక్కడ తాకుతూ అసభ్యంగా ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఓ వ్యక్తి మాత్రం స్టార్ హీరోయిన్ని అడిగి మరీ ముద్దుపెట్టాడు. బాలీవుడ్ నటి హ్యుమా ఖురేషి ప్రస్తుతం 'తర్లా' సినిమా చేసింది. ఇది జీ5 ఓటీటీలో జూలై 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ప్రమోషన్స్ చేస్తున్నారు. తాజాగా ముంబయిలో ఓ ఈవెంట్ నిర్వహించగా, దీనికి మాస్టర్ చెఫ్ ఆస్ట్రేలియా షో మాజీ జడ్జి గ్యారీ మైగెన్ హాజరయ్యారు. హ్యుమాతో ఫొటోలకు పోజిలిచ్చారు. అలానే ముద్దుపెట్టుకోవచ్చా అని అడిగారు. ఆమె ఓకే చెప్పడంతో హ్యుమా బుగ్గపై ముద్దుపెట్టారు. ఇలా అనుమతి తీసుకుని కిస్ చేయడంపై ఇతడిని మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది. 'తర్లా' కథేంటి? తర్లా దలాల్.. మనదేశంలోనే చాలా గుర్తింపు తెచ్చుకున్న ఓ మహిళ చెఫ్. తన సింపుల్ చిట్కాలతో ఎన్నో అద్భుతమైన వెజిటేరియన్ వంటకాలు చేశారు. వాటిని పుస్తకాల్లో పొందుపరిచి, జనాలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆమె కథతోనే 'తర్లా' సినిమా తీశారు. ఇందులో హ్యుమా ఖురేషీ టైటిల్ రోల్ లో నటించింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్.. మూవీపై ఆసక్తిని పెంచుతోంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) (ఇదీ చదవండి: జ్యువెల్లరీ యాడ్‌లో సితార.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?) -
బాలీవుడ్ బ్యూటీ 'హ్యుమా ఖురేషి' కొత్త లగ్జరీ కారు: ధర ఎంతంటే?
ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ 'హ్యుమా ఖురేషి' ఇటీవల ఖరీదైన జర్మన్ బ్రాండ్ కారు మెర్సిడెజ్ బెంజ్ జీఎల్ఎస్ 400డీ (Mercedes Benz GLS 400d) మోడల్ కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హ్యుమా ఖురేషి కొన్న ఈ కారు ధర రూ. 1.19 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఇది 3.0 లీటర్ సిక్స్ సిలీండర్ డీజిల్ ఇంజిన్ కలిగి 325 బీహెచ్పీ పవర్, 700 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ లగ్జరు కారు కేవలం 6.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది, అదే సమయంలో దీని టాప్ స్పీడ్ గంటకు 238 కిలోమీటర్లు. మెర్సిడెజ్ బెంజ్ జీఎల్ఎస్ 400డీ మోడల్ మల్టీ బీమ్ ఎల్ఈడీ హెడ్ లైట్స్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, 360 డిగ్రీల కెమెరా, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, ఎలక్ట్రల్లీ అడ్జస్టబుల్ వెంటిలేటెర్డ్ ఫ్రంట్ సీట్లు, ఫైవ్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి వాటితో పాటు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, యాంబియంట్ లైటింగ్, 12 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం వంటి వాటిని పొందుతుంది. (ఇదీ చదవండి: ట్విటర్ నుంచి నన్ను ఎందుకు తొలగించారన్న ఉద్యోగి.. ఎలాన్ మస్క్ రీప్లే ఇలా) వరుస సినిమాలతో ముందుకు దూసుకెళ్తున్న హ్యుమా ఖురేషి ఎప్పటికప్పుడు తన గ్యారేజిని ఆధునిక కార్లతో అప్డేట్ చేసుకుంటూనే ఉంటుంది. ఈమె మొదటి కారు మారుతీ సుజుకీ స్విఫ్ట్ కావడం గమనార్హం. ఆ తరువాత ల్యాండ్ రోవర్ ఫ్రీ ల్యాండర్, మెర్సిడెజ్ బెంజ్ జీఎల్ఈ 250డీ వంటి వాటిని కొనుగోలు చేసింది. తాజాగా ఇప్పుడు మరో లగ్జరీ కారుని తన గ్యారేజిలో చేర్చింది. -
బరువు పెరగడం ఓ సవాల్‌గా అనిపించింది: హీరోయిన్
వెండితెరపై మెరుపుతీగలా కనిపించే హీరోయిన్లు పాత్ర డిమాండ్ చేస్తే బొద్దుగా కనిపించడానికి కూడా వెనకాడరు. అందుకు తాజా ఉదాహరణ సోనాక్షీ సిన్హా, హ్యుమా ఖురేషీ. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందిన ‘డబుల్ ఎక్స్ఎల్’ చిత్రం ఈరోజు రిలీజవుతోంది. అధిక బరువుతో హేళనకు గురయ్యే ఇద్దరి అమ్మాయిల కథతో ఈ సినిమా ఉంటుంది. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా, ఈ విషయాన్ని వినోదాత్మకంగా చెబుతూ చాలా జాగ్రత్తగా డీల్ చేశారట చిత్రదర్శకుడు సత్రమ్ రమణి. ‘బాడీ షేమింగ్’ తప్పనే సందేశం కూడా ఈ చిత్రంలో ఉంది. ఈ చిత్రం కోసం సోనాక్షి, హ్యూమా పదిహేనేసి కిలోల బరువు పెరిగారు. నిజానికి కెరీర్ ఆరంభంలో సోనాక్షి బొద్దుగానే ఉండేవారు. ‘దబాంగ్’ చిత్రంతో పరిచయం కాకమునుపు ఆమె దాదాపు 90 కిలోలు ఉంటే.. 30 కిలోలు తగ్గి ఆ సినిమా ద్వారా పరిచయం అయ్యారు. అప్పటినుంచి దాదాపు అదే బరువుతో కొనసాగుతున్నారామె. ఇప్పుడు ‘డబుల్ ఎక్స్ఎల్’కి బరువు పెరిగిన విషయం గురించి సోనాక్షి మాట్లాడుతూ.. ‘‘బరువు పెరగాలన్నా.. తగ్గాలన్నా ఆరోగ్యకరమైన పద్ధతిలో అయితేనే సేఫ్. కానీ ‘డబుల్ ఎక్స్ఎల్’ నాకు అలా తగ్గేంత సమయం ఇవ్వలేదు. రెండే నెలల్లో పెరగాల్సి వచ్చంది. దాంతో ఏది పడితే అది తిన్నాను. ఎన్నో ఏళ్లుగా చేస్తూ వచ్చిన వర్కవుట్లు మానేశాను. ఫలితంగా 15 కిలోలు పెరిగాను. కానీ ఇలా పెరిగితే కష్టాలు తప్పవు. వర్కవుట్లు చేయకపోవడం అనేది శారీరకంగా, మానసికంగా నా ఒత్తిడిని పెంచింది. అంతకు ముందులా యాక్టివ్‌గా ఉండలేకపోయేదాన్ని. అదే కొంచెం సమయం తీసుకుని, ఆరోగ్యకరమైన పద్ధతిలో పెరిగి ఉంటే.. ఇలా ఉండేది కాదు. అందుకే తగ్గాలన్నా, పెరగాలన్నా పద్ధతి ప్రకారమే చేయండని సలహా ఇస్తున్నాను. ఇక, ఈ సినిమా పూర్తి కాగానే.. ఎక్కువ టైమ్ తీసుకుని, చక్కగా తగ్గడం మొదలుపెట్టాను. అది బాగా అనిపించింది’’ అన్నారు. హ్యూమా ఖురేషీ మాట్లాడుతూ.. ‘‘అధిక బరువు అనేది అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసం పోగొడుతుంది. అయితే మనం ఎలా కనిపిస్తున్నాం అనేదాని కన్నా ఎంత హుందాగా ప్రవర్తిస్తున్నామన్నదే ముఖ్యం. మన ప్రవర్తన బాగుంటే అదే అందం. అయితే ఆరోగ్యం కోసం తగ్గాలనుకుంటే తగ్గొచ్చు. ఎవరో ఏదో అంటారని కాదు. అమ్మాయిల బాడీ షేప్‌ని హేళన చేయడం సరికాదు. ఇక ఒక సినిమా కోసం బరువు పెరగడం అనేది ఓ సవాల్. ఆరోగ్యకరమైన పద్ధతిలో పెరగకపోతే కష్టాలు మాత్రం తప్పవు’’ అన్నారు. -
హ్యూమా ఖురేషీతో కలిసి చిందేసిన శిఖర్ ధవన్
దక్షిణాఫ్రికాతో జరగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న శిఖర్ ధవన్ బాలీవుడ్ ఎంట్రీ కన్ఫర్మ్ అయ్యింది. టీ-సిరీస్ సంస్థ నిర్మిస్తున్న డబుల్ ఎక్సెల్ సినిమాతో గబ్బర్ సినిమాల్లోకి అరంగేట్రం చేయనున్నాడు. కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ సోషల్‌మీడియాలో వైరలవుతుంది. View this post on Instagram A post shared by Huma Qureshi (@iamhumaq) చిత్ర కధానాయికల్లో ఒకరైన హ్యూమా ఖురేషీ.. గబ్బర్‌తో కలిసి రొమాంటిక్ డ్యాన్స్ చేస్తున్న సీన్‌ను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. క్యాట్ ఈజ్ ఔట్ ఆఫ్ ది బ్యాగ్... ఫైనల్లీ అంటూ శిఖర్ ధవన్‌ను ట్యాగ్ చేస్తూ క్యాప్షన్ జోడించింది. ఈ పోస్ట్ క్రికెట్ అభిమానులతో పాటు బాలీవుడ్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటుంది. When Rajshri from Meerut and Saira from Delhi found each other, it was time for double trouble. Be prepared for double the fun. Double the excitement. Double the entertainment. 😍#Double XL in cinemas near you on 4th November 2022. #baatmeinWAZANhai pic.twitter.com/8SRbfxo6wI — Huma Qureshi (@humasqureshi) October 10, 2022 సినిమా విషయానికొస్తే.. సత్రమ్ రమణి దర్శకత్వంలో తుది మెరుగులు దిద్దుకుంటున్న డబుల్ ఎక్సెల్ చిత్రం అధిక బరువు అమ్మాయిలు ఎదుర్కొనే సమస్యల ఆధారంగా తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో హ్యూమా ఖురేషి, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రధారులు కాగా.. గబ్బర్ అతిథి పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలోని పాత్రల కోసం హ్యూమా, సోనాక్షి భారీగా బరువు పెరిగారు. డబుల్ ఎక్సెల్ తెలుగులో ఆనుష్క నటించిన సైజ్ జీరోకు దగ్గరగా ఉంటుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. -
వెండితెర మీద వంటల రాణి
తర్లా దలాల్ 2013లో మరణించింది. కాని వంట అనేసరికి టీవీ చెఫ్‌గా ఇప్పటికీ ఆమె పేరే గుర్తుకు వస్తుంది. వంటల మీద తర్లా దలాల్ రాసిన 100 పుస్తకాలు దాదాపుకోటి కాపీలు అమ్ముడుపోయాయి. భారతదేశంలో కోటి ఇళ్లల్లో ఆమె రెసిపీలు ఉపయోగించారని అంచనా. వీరుల, ధీరుల బయోపిక్‌లు తయారవుతున్న రోజుల్లో ఒక గొప్ప వంటగత్తె కథ బయోపిక్‌గా రావడం చాలా పెద్ద విషయం. తర్లాగా తెర మీద హ్యూమా ఖురేషి కనిపించనుంది. ఈ సందర్భంగా తర్లా దలాల్ ఘన గతం గురించి కథనం. జీవితంలో ‘రుచి’ కనిపెట్టడం ఒక అదృష్టమే. డబ్బున్నా లేకపోయినా ‘ఆ... ఏదో ఒకటి వండుకుంటే సరిపోదా’ అనుకునేవారికి ఈ కథనం పనికి రాదు. ‘ఏదైనా ఒకటి వండి చూద్దాం’ అనుకునేవారు తర్లా దలాల్‌తో ఇన్‌స్పయిర్ అవుతారు. మన దేశంలో స్త్రీలు కట్టెల పొయ్యిలతో, ఊదుడు గొట్టాలతో ఆ పూట వంటతో సతమతమవుతూ ఉన్న రోజుల్లో అమెరికాలో కొత్త కొత్త వంటలు నేర్చుకుంది తర్లా దలాల్. ఆ తర్వాత ఇండియాకు వచ్చి ఏకంగా వంట పాఠాలే చెప్పింది. అందరూ వంట చేస్తారు. కాని ‘సరిగ్గా’ చేయడం ఎలాగో చెప్పడం ద్వారా ఆమె దేశాన్నే జయించగలిగింది. అందుకే ఆమె కథ ఇప్పుడు సినిమాగా వస్తోంది. చిన్నారి వంట మాస్టర్ తర్లా దలాల్‌కు చిన్నప్పటి నుంచి వంటంటే ఇష్టం. పూణెలో చదువుకునేటప్పుడు 12 ఏళ్ల వయసు నుంచి తల్లికి రోజూ వంటలో సాయం చేసేది. 1956లో ఆమె బిఏ పూర్తి చేసి నళిన్ దలాల్‌ను పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లే ఆమె భవిష్యత్తును నిర్దేశించింది. నళిన్ అమెరికాలో ఎం.ఎస్. చేస్తుండటం వల్ల కాపురం అక్కడే పెట్టాల్సి వచ్చింది. కొత్త దేశం. కావలసినంత సమయం. నళిన్ భోజనప్రియుడు కనుక ఏవైనా కొత్త వంటకాలు ట్రై చేయరాదా అని ఆమెను ఎంకరేజ్ చేశాడు. దాంతో తర్లా రోజుకు రెండు మూడు కొత్త వంటకాలు చేసి భర్తకు పెట్టేది. అతడు పర్ఫెక్షనిస్ట్. అంత సరిగా రాలేదు అని చెప్తే తర్లా మళ్లీ అదే వంటను చేసేది. అనుకున్నది అనుకున్నట్టుగా వండటమే వంట ప్రావీణ్యం అని ఆమె గ్రహించింది. కాని నళిన్ ఆమెను పూర్తిగా మెచ్చుకోవడానికి 9 ఏళ్లు పట్టింది. 9 ఏళ్ల తర్వాత ‘మాస్టర్ ఆఫ్ ఆల్ కూజిన్స్’ అని బిరుదు ఇచ్చాడు. ముంబైలో వంట క్లాసులు ఇండియాకు తిరిగి వచ్చాక 1966లో ముంబైలో వంట క్లాసులు మొదలెట్టింది తర్లా. ఆ రోజుల్లో ఆడపిల్లలకు పెళ్లి కావాలంటే వంట వచ్చి ఉండటం ఒక అవసరంగా భావించేవారు. అందుకని తర్లా క్లాసులకు డిమాండ్ పెరిగింది. ఒక దశలో ‘తర్లా దగ్గర వంట నేర్చుకున్న అమ్మాయికి వెంటనే పెళ్లి జరిగిపోతుంది’ అన్నంత పేరు ఆమెకు వచ్చింది. అదే సమయంలో వంటల పుస్తకాల మీద భర్త దృష్టి మళ్లించాడు. 1974లో ‘ప్లెజెర్స్ వెజిటేరియన్ కుకింగ్’ పేరుతో తర్లా తెచ్చిన పుస్తకం పెద్ద హిట్ అయ్యింది. 1987 నాటికి దేశంలో తర్లా అతి పెద్ద వంటల రచయితగా ఎదిగింది. ఆమె తన పుస్తకాల రాబడి మీద పెద్ద ఆఫీస్ కొనుక్కుంది. ఆ పుస్తకాలు అనేక భాషల్లో ట్రాన్స్‌లేట్ చేసి పబ్లిష్ చేయడానికి సిబ్బందిని పెట్టుకుంది. తర్లా వంటల పుస్తకాలు డచ్, రష్యన్ వంటి విదేశీ భాషల్లోకి కూడా అనువాదమయ్యాయి. 100 పుస్తకాలు రాసి చరిత్ర సృష్టించింది తర్లా. టీవీ చెఫ్‌గా దేశానికి ఎక్కువగా తెలిసిన పేరు కూడా ఆమెదే. శాకాహారానికి ప్రచారకర్త తర్లా రాసిన పుస్తకాలన్నీ శాకాహారానికి సంబంధించినవే. ఒక రకంగా ఆమె శాకాహారాన్ని ప్రచారం చేసిందని చెప్పాలి. దేశంలో ఎన్నో కుటుంబాలు తర్లా చేసిన శాకాహార వంటకాలను ట్రై చేసి రుచిని పొందాయి. 1988లోనే ఆమె ‘తర్లాదలాల్డాట్కామ్’ వెబ్‌సైట్‌ను తెరిస్తే నెలకు మూడు లక్షల మంది ఆ సైట్‌ను చూడటం రికార్డ్. ప్రపంచంలోని నలుమూలల్లో ఉన్న భారతీయులు ఆ వెబ్సైట్ ద్వారా తర్లా రెసిపీలు చూసి వంటలు చేసుకునేవారు. ఈ మొత్తం కృషికి తర్లాకు 2007లో ‘పద్మశ్రీ’ పురస్కారం దక్కింది. మన దేశీయులకు స్వాదిష్టకరమైన భోజనాన్ని ప్రచారం చేస్తూ 2013లో మరణించింది తర్లా. సినిమా రిలీజప్పుడు మరోసారి తర్లాను తలుచుకుందాం. బాలీవుడ్ సినిమా ఇంటింటికీ తెలిసిన ఈ వంటగత్తెను ఇప్పుడు సినిమాగా ఇంటింటికీ తేనున్నారు బాలీవుడ్లో. హుమా ఖురేషీ తర్లా దలాల్‌గా ‘తర్లా’ అనే సినిమా తర్లా దలాల్ బయోపిక్‌గా మొదలైంది. రోనీ స్క్రూవాలా నిర్మాత. దంగల్, చిచోరే సినిమాలకు రచయితగా పని చేసిన పీయుష్ గుప్తా దర్శకుడు. ‘చిన్నప్పుడు మా ఇంట్లో వంట గదిలో తర్లా దలాల్ పుస్తకం ఉండేది. ఆమె పుస్తకంలో ఉండే మాంగో ఐస్‌క్రీమ్ రెసెపీని చూసి అమ్మ మాకు తయారు చేసి ఇచ్చేది. ఈ సినిమా చేయమని నాకు ఆఫర్ వచ్చినప్పుడు అది గుర్తుకు వచ్చింది. తర్లా పాత్ర చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది’ అంది నటి హుమా ఖురేషీ. -
‘వలిమై’మూవీ రివ్యూ
టైటిల్ :వలిమై నటీనటులు :అజిత్, కార్తికేయ, హ్యూమా ఖురేషీ తదితరులు నిర్మాణ సంస్థలు : బే వ్యూ ప్రాజెక్ట్స్, జి.స్టూడియోస్ నిర్మాత: బోనీ కపూర్ దర్శకత్వం :హెచ్.వినోద్ సంగీతం : యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం: జిబ్రాన్ సినిమాటోగ్రఫీ :నీరవ్ షా విడుదల తేది : ఫిబ్రవరి 24, 2022 దేశంలో కరోనా కేసుల తగ్గుముఖం పట్టడంతో పెద్ద సినిమాలు విడుదలకు సిద్దమయ్యాయి. ఇప్పటికే పలుమార్లు విడుదలను వాయిదా వేసుకున్న చిత్రాలు.. వరుసగా ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమయ్యాయి.తాజాగా తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన ‘వలిమై’చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు సినిమాపై అంచనాలను పెంచేసింది. దానికి తోడు ఇటీవల కాలంలో పెద్ద సినిమాలేవి థియేటర్స్‌లో విడుదల కాకపోవడంతో ‘వలిమై’పై భారీ హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య ఈ గురువారం(ఫిబ్రవరి 24)ప్రేక్షకుల ముందుకు వచ్చిన అజిత్ పాన్ ఇండియా మూవీ ‘వలిమై’ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. ‘వలిమై’కథేటంటే వైజాగ్ కేంద్రంగా ‘సైతాన్ స్లేవ్స్’పైరుతో నేర సామ్రాజ్యాన్ని నడుపుతుంటాడు నరేన్(కార్తికేయ). ఆన్లైన్ వేదికగా జరిగే ఈ చట్ట విరుద్ద కార్యక్రమానికి నిరుద్యోగ యువతనే టార్గెట్‌గా చేసుకుంటాడు. వారిని డ్రగ్స్ బానిసలుగా మార్చేసి, చైన్ స్నాచింగ్, హత్యలు వంటి చట్ట వ్యతిరేక పనులు చేయిస్తుంటాడు. టెక్నాలజీని ఉపయోగించి పోలీసుల చేతికి చిక్కకుండా జాగ్రత్త పడతాడు. వైజాగ్‌లో రోజు రోజుకి బైక్ రేసర్ల దొంగతనాలు, హత్యలు పెరిగిపోవడంతో.. వాటిని అరికట్టడానికి రంగంలోకి దిగుతాడు అసిస్టెంట్ కమిషనర్ అర్జున్(అజిత్). ఈ ఇద్దరు హేమాహేమీల మధ్య జరిగిన పోరులో ఎవరు విజయం సాధించారు? నేరస్తులను పట్టుకునే క్రమంలో అర్జున్‌కు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అతని ఫ్యామిలీని టార్గెట్ చేసిన నరేన్‌కు అర్జున్ ఎలా బుద్ది చెప్పాడు? చివరకు ఆన్లైన్ వేదిక ‘సైతాన్ స్లేవ్స్’ని ఎలా మట్టుపెట్టాడు?అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే ఏసీపీ అర్జున్ పాత్రలో అజిత్ ఒదిగిపోయాడు.స్వతగా అజిత్ మంచి బైక్ రేసర్ కావడంతో యాక్షన్స్ సీన్స్‌లో అద్భుతంగా నటించగలిగాడు.ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ సీన్స్‌లో అజిత్ అదరగొట్టేశాడు. ఇక ఈ చిత్రంతో కోలివుడ్ ఎంట్రీ ఇచ్చిన కార్తికేయ.. విలన్‌గా మెప్పించాడు. యాక్షన్స్ సీన్స్‌లో అజిత్‌కు గట్టి పోటీ ఇచ్చాడు. నార్కొటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ హెడ్ సోఫియా పాత్రలో హ్యుమా ఖురేషి జీవించేసింది. సినిమాలో తనది కీలక పాత్ర అనే చెప్పాలి. ఇక ఏసీపీ అర్జున్ తమ్ముడు బుజ్జిగా రాజ్ అయ్యప్ప తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. వీరితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే... వలిమై పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రం. డ్రగ్స్ సరఫరా, చైన్ స్నాచింగ్, హత్యలు, పోలీసుల ఇన్వెస్టిగేషన్ చుట్టూ కథ సాగుతోంది. ఆన్లైన్ వేదికగా నేరాలకు పాల్పడుతున్న ఓ గ్యాంగ్‌ని, ఆ గ్యాంగ్ లీడర్ని పోలీసులు ఎలా అంతం చేశారనేదే ఈ సినిమా కథ. రోటీన్ కథనే ఎంచుకున్న దర్శకుడు వినోద్.. అజిత్‌కి తగ్గట్లుగా భారీ యాక్షన్ సీన్స్‌ని, బైక్ రేసింగ్ నేపథ్యాన్ని తీసుకొని సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాకు ప్రధాన బలం అజిత్, కార్తికేయ మధ్య వచ్చే బైక్ ఛేజ్ సీన్స్, యాక్షన్ సన్నివేశాలే. యాక్షన్ స్టంట్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తాయి. అయితే సినిమాలో కొత్తదనం లేకపోవడం, నిడివి ఎక్కువ ఉండడం మైనస్. సినిమా మొత్తం చేసింగ్ సీన్లే ఉంటాయి. మధ్య మధ్యలో మదర్ సెంటిమెంట్ చొప్పించే ప్రయత్నం చేసినా.. అది వర్కౌట్ కాలేదు. అంతేకాదు ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్స్ బోరింగ్‌గా అనిపిస్తాయి. ఉన్నంతలో ఫస్టాఫ్ అంతో ఇంతో మెప్పిస్తుంది. ఇక సెకండాఫ్ బోరింగ్‌గా సాగుతుంది. క్లైమాక్స్ కూడా పాత సినిమాల మాదిరి ఉంటుంది. ఓ ఫ్యాక్టరీలో హీరో ఫ్యామిలీని విలన్ బంధించి ఉంచడం.. హీరో వచ్చి ఫైట్ చేసి వారిని విడిపించడం.. ఇలాంటి క్లైమాక్స్ సీన్స్ గతంలో చాలా సినిమాల్లో వచ్చాయి. ఎడిటింగ్ బాలేదు. పాటలు, నేపథ్య సంగీతం కూడా అంతంత మాత్రమే. సినిమాటోగ్రఫి బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
Valimai Pre Release Event: వలిమై ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
బొద్దుగుమ్మ హుమా ఖురేషీ ఫొటోలు
-
నేను సచిన్ పోస్టర్లు చించితే.. అతను అఫ్రిది ఫోటోలను చించాడు
ముంబై: ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్, హీరో రితేశ్ దేశ్‌ముఖ్ హోస్ట్‌లుగా వ్యవహరిస్తున్న "యారోంకి బారాత్" అనే చాట్ షోలో బాలీవుడ్ ముద్దుగుమ్మ హ్యూమా ఖురేషి.. తన చిన్నతనంలో జరిగిన ఆసక్తికర సంఘటనను వెల్లడించింది. తన సోదరుడు, బాలీవుడ్ నటుడు సకీబ్ సలీంకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అంటే ప్రాణమని, ఓ సందర్భంలో అతనితో గొడవ పడ్డప్పుడు కోపంలో అతని ఆరాధ్య దైవమైన సచిన్ పోస్టర్లను చించేశానని పేర్కొంది. దీనికి బదులుగా అతను తన ఫేవరెట్ క్రికెటర్ అయిన షాహిద్ అఫ్రిది ఫోటోలను చించేశాడని వివరించింది. అయితే షో హోస్ట్‌లు.. నువ్వు సచిన్ పోస్టర్లను చించావా అని ప్రశ్నించడంతో ఆమె చాలా ఇబ్బంది పడింది. తను కూడా సచిన్ వీరాభిమానినేనని.. చిన్నతనంలో అన్న చెల్లెల్ల మధ్య ఇటువంటి సంఘటనలు తరుచూ జరుగుతుంటాయని కవర్ చేసుకుంది. తను క్రికెట్‌ను ఫాలో అవుతున్న రోజుల్లో పాక్ ఆటగాడు అఫ్రిది అరంగేట్రం చేశాడని, అతని దూకుడైన ఆటతీరు, అతని హెయిర్ స్టైల్ తనను బాగా ఇంప్రెస్ చేశాయని చెప్పుకొచ్చింది. 90వ దశకంలో ఆఖర్లో అఫ్రిదికి అమ్మాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉండేదని, కాబట్టి తాను కూడా అతనికి అకర్షితురాలినయ్యానని తెలిపింది. కాగా, హ్యూమా ఖురేషి 2012లో విడుదలైన "గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్" సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. చదవండి: ఆర్సీబీ అభిమానినే కానీ, కోహ్లి నా ఫేవరెట్ క్రికెటర్ కాదు: రష్మిక -
కోవిడ్ పేషెంట్స్ కోసం 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తున్న నటి
ఢిల్లీ : భారత్‌లో కరోనా కరాళ నృత్యం చేస్తుంది. బెడ్లు దొరక్క, ఆక్సిజన్ అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కోవిడ్ రోగులకు చికిత్స అందించడానికి బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషి ముందుకు వచ్చారు. ఢిల్లీలో ఆక్సిజన్ ప్లాంటుతో పాటు 100 పడకల హాస్పిటల్‌ను కట్టిస్తామని ప్రకటించింది. హాలీవుడ్ దర్శకుడు జాక్ స్నైడర్‌తో కలిసి తాత్కలిక ఆసుపత్రి సదుపాయాన్ని కల్పిస్తానని పేర్కొంది. ఇందుకోసం సేవ్ ది చిల్ర్డన్ సంస్థతో కలిసి పనిచేయనున్నట్లు తెలిపింది. అదే విధంగా కరోనా రోగులకు ఇంట్లోనే చికిత్స అందించడానికి వీలుగా స్పెషల్ కిట్స్ అందిస్తామని, రోగి కోలుకునేవరకు వారితో డాక్టర్లు నిత్యం అందుబాటులో ఉండేలా చేస్తామని వెల్లడించారు. ఇందుకు మీ అందరూ మద్దతు ఇవ్వాల్సిందిగా పిలుపునిచ్చారు. భారత్‌లో కోవిడ్ కేసులు, వైద్యం అందక ప్రజలు పడుతున్న వేధనను చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని తెలిపింది. తన వంతుగా వారికి సహాయం చేసేందుకు అండగా నిలబడతానని వివరించింది. ఇక హాలీవుడ్లో జాక్ స్నైడర్ డైరెక్షన్లో తాను నటించిన 'ఆర్మీ ఆఫ్ ది డెడ్' చిత్రం మే 14న థియేటర్స్‌లో, 21న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుందని తెలిపింది. I’ve joined hands with @stc_india help Delhi fight the pandemic. We are working to build a temporary hospital facility in Delhi, that will have a 100 beds along with an oxygen plant. Please support us ❤️🙏🏻 #BreathofLife https://t.co/5RuMP0u0NG pic.twitter.com/bgRuOgfGKq — Huma S Qureshi (@humasqureshi) May 10, 2021 I’ve joined hands with Save The Children to help Delhi fight the pandemic. They are working to build a temporary hospital facility in Delhi with 100 beds along with an oxygen plant. Please support❤️🙏🏻 #BreathofLife @humasqureshi International donors: https://t.co/9ZbOQuzwQ0 — Zack Snyder (@ZackSnyder) May 10, 2021 చదవండి : కోవిడ్‌తో కాదు..సరైన వైద్యం అందక చనిపోయారు : మీరా చోప్రా వారిని క్షమాపణలు కోరిన సల్మాన్ ఖాన్ -
దీపావళికి గంగూభాయ్
దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ కొత్త చిత్రం కోసం గ్యాంగ్‌స్టర్‌గా మారారు ఆలియా భట్. ‘గంగూభాయ్ కతియావాడి’ చిత్రంలో టైటిల్ రోల్లో నటిస్తున్నారు ఆలియా. 80లలో గంగూభాయ్ మాఫియాను ఎలా నడిపారు? అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. కోవిడ్ వల్ల ఎక్కువమందితో చిత్రీకరించాల్సిన సన్నివేశాలను చిత్రీకరించడం కుదర్లేదు. తాజాగా ఆ సన్నివేశాలను ఇప్పుడు షూట్ చేస్తున్నారు. గంగూభాయ్ పవర్ఫుల్ ప్రసంగాలు ఇస్తున్న సన్నివేశాలను ముంబైలో వేసిన ప్రత్యేక సెట్లో చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవుతుందని సమాచారం. హ్యూమా ఖురేషీ ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేస్తారని టాక్. ఈ సినిమాను దీపావళికి థియేటర్స్‌లోకి తీసుకురావాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. -
అజిత్‌తో అతిథిగా!
తమిళ స్టార్ అజిత్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ చిత్రం ‘వలిమై’. బైక్ రేసింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు హెచ్. వినోద్ దర్శకుడు. బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. ‘ఆర్ఎక్స్100’ ఫేమ్ కార్తికేయ విలన్ పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషీ కథానాయిక. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం అతిథి పాత్రలో కనిపిస్తారని టాక్. ఈ సినిమాలో రేసర్ పాత్రలో జాన్ కనిపిస్తారట. బైక్స్, బేక్ రేసింగ్ అంటే జాన్ అబ్రహాంకి ఆసక్తి అనే విషయం గుర్తుండే ఉంటుంది. ఇది జాన్ అబ్రహాంకి తొలి తమిళ సినిమా అవుతుంది. -
స్పెషల్ సాంగ్
సంజయ్ లీలా భన్సాలీ సినిమాలన్నీ భారీగా ఉంటాయి. స్క్రీన్ నిండుగా సెట్టింగులు ఉంటాయి. పాటల్ని చాలా కలర్ఫుల్గా తెరకెక్కిస్తుంటారాయన. అందుకే ఆయన సినిమాల్లో పాటలకు ప్రత్యేక క్రేజ్. తాజాగా భన్సాలీ కొత్త సినిమాలో స్పెషల్ సాంగ్ చేసే ఛాన్స్ వచ్చిందట బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషీకి. ఆలియా భట్ ప్రధాన పాత్రలో సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామా చిత్రం ‘గంగూభాయ్ కతియావాడి’. ఈ సినిమాలో ఆలియా భట్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపిస్తారు. ఇందులో ఓ స్పెషల్ సాంగ్ కోసం హ్యూమా ఖురేషీ డ్యాన్స్ చేయనున్నారట. త్వరలోనే ఈ పాటను చిత్రీకరించనున్నారని తెలిసింది. -
మిషన్ ముగిసింది
లాక్డౌన్ తర్వాత పెద్ద హీరోల్లో ఫస్ట్ షూటింగ్లో పాల్గొన్న స్టార్ అక్షయ్ కుమార్. ఆయన హీరోగా ‘బెల్‌బాటమ్’ అనే పీరియాడికల్ చిత్రాన్ని ఇటీవలే ప్రారంభించారు. ఈ సినిమా చిత్రీకరణ కోసం చిత్రబృందంతో కలసి స్కాట్‌ల్యాండ్ వెళ్లారు. విదేశాల్లో చిక్కుకుపోయిన వారిని ఓ డిటెక్టివ్ సురక్షితంగా ఎలా రక్షించాడన్నది చిత్రకథాంశం. రంజిత్ యం. తివారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హ్యుమా ఖురేషీ, లారా దత్తా, వాణీ కపూర్ కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. 40 రోజుల్లో మిషన్‌ని పూర్తి చేశారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 2న విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అలాగే ఓ కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. -
లైంగిక ఆరోపణలు.. విచారణకు హాజరైన దర్శకుడు
ముంబై: తనపై వచ్చిన అత్యాచార ఆరోపణలు నిరాధారమైనవని బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ పేర్కొన్నారు. 2013లో డైరెక్టర్ తనను లైంగికంగా వేధించారని నటి పాయల్ ఘోష్ ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై పోలీసుల నుంచి బుధవారం సమన్లు అందుకున్న కశ్యప్, తన లాయర్ ప్రియాంక ఖిమానీతో కలిసి గురువారం ఉదయం వెర్సోవా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. తనపై లేనిపోని ఆరోపణలు చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. పాయల్ ఫిర్యాదు మేరకు అనురాగ్ కశ్యప్‌కు పోలీసులు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు నటి పాయల్... కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలేతో కలిసి మహారాష్ట్ర్ర గవర్నర్ బీఎస్ కోస్యారీని కలిశారు. కశ్యప్‌ను త్వరితగతిన అరెస్టు చేయాలని గవర్నర్‌ను కోరారు. అనురాగ్ కశ్యప్‌ను అరెస్టు చేయడంలో తాత్సారం చేయడంపై పోలీసులను ఆమె ప్రశ్నించారు. కశ్యప్‌ను అరెస్టు చేయకుంటే తాను నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు పాయల్ వెల్లడించారు. (చదవండి: బయటపెట్టండి.. బయటపడండి!) ఇక రామ్‌దాస్ అథవాలే మీడియాతో మాట్లాడుతూ బాధిత నటికి ప్రాణహాని ఉన్నందున ఆమెకు కేంద్రం వై ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పాయల్ కు న్యాయం జరిగేలా, సినీ నిర్మాత కశ్యప్‌ను అరెస్టు చేసేంత వరకు ఆమెకు ఆర్పీఐ రక్షణగా ఉంటుందని చెప్పారు. 2013లో ప్రముఖ సినీ నిర్మాత అనురాగ్ కశ్యప్ తనపై అత్యాచార యత్నం చేసినట్లుగా పాయల్ ఆరోపణలు చేశారు. ‘తాను ఫోన్ చేస్తే చాలు ముగ్గురు హీరోయిన్లు రిచా చద్దా, మహీ గిల్, హ్యుమా ఖురేషీలు తన వద్దకు వస్తారంటూ కశ్యప్ ఆ సమయంలో చెప్పినట్లు’ పాయల్ పేర్కొన్నారు. సినిమాల్లో అవకాశాలు కావాలంటే డైరెక్టర్లు చెప్పినట్లు చేయాల్సిందేనని, అయితే తాను ఎటువంటి ప్రలోభాలకూ లొంగలేదని ఆమె వెల్లడించారు. (నా పేరెందుకు వాడారు?: నటి) ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ నిర్మాత, దర్శకుడు అనురాగ్ కశ్యప్ తన లాయర్ ద్వారా ఓ ప్రకటన విడుదల చేశారు. తనపై పాయల్ చేసిన లైంగిక ఆరోపణలు తనను తీవ్రంగా బాధించాయని అందులో పేర్కొన్నారు. సదరు అరోపణలన్నీ పూర్తిగా నిరాధారమని, తప్పుడువని కొట్టి పారేశారు. తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఆ ఆరోపణలున్నాయని, మీటూ వంటి ఉద్యమాన్ని ఇవి పక్కదోవ పట్టిస్తాయని తెలిపారు. ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్న కారణంగా నిజమైన అత్యాచార బాధితులకు అన్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. తన క్లయింటు దీనిపై న్యాయపరంగా ముందుకెళ్తారని అనురాగ్ లాయర్ వెల్లడించారు. (ఈ చెత్తలోకి నన్ను లాగొద్దు: నటి ఫైర్ ) ఇక బాధిత నటి తమపై చేసిన ఆరోపణలపై రిచా చద్దా, హ్యుమా ఖురేషీ స్పందించారు. ఆరోపణలు చేసిన నటికి రిచా చద్దా లీగల్ నోటీసులు పంపించారు. ఇక బాధిత నటిపై హ్యూమా ఖురేషీ ఘాటుగా స్పందించారు. అనురాగ్ కశ్యప్ తనతోనే కాదనీ, ఎవరితోనూ తప్పుగా ప్రవర్తించే వ్యక్తి కాదని ఆమె తెలిపింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న అనురాగ్ కశ్యప్‌కు బాలీవుడ్ ప్రముఖుల నుంచి మద్దతు లభిస్తోంది. ఆయన మాజీ భార్యలు కల్కి కొచ్లిన్, ఆర్తి బజాజ్‌లు సైతం కశ్యప్‌కు బాసటగా నిలిచారు. -
ఈ చెత్తలోకి నన్ను లాగొద్దు: నటి ఫైర్
ముంబై: నటి పాయల్ ఘోష్ ఆరోపణలతో బాలీవుడ్లో మీటూ ఉద్యమం మరోసారి చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో కంగనా రనౌత్ వంటి నటీమణులు పాయల్‌కు మద్దతు ప్రకటించగా, తాప్సీ, అనురాగ్ మాజీ భార్యలు నటి కల్కి కొచ్లిన్, ఎడిటర్ ఆర్తీ బజాజ్ సహా పలువరు సెలబ్రిటీలు అతడి అండగా నిలబడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా నటి హూమా ఖురేషి సైతం ఈ జాబితాలో చేరారు. అనురాగ్ తనతో ఎన్నడూ తప్పుగా ప్రవర్తించలేదని, అనవసరంగా తన పేరును వివాదంలోకి లాగవద్దంటూ పాయల్‌పై మండిపడ్డారు. మీటూ ఉద్యమానికి ఉన్న పవిత్రతను నాశనం చేయవద్దని హితవు పలికారు. ఈ మేరకు ట్విటర్లో ఓ లేఖ షేర్ చేశారు.(చదవండి: అంతా అబద్ధం: అనురాగ్ కశ్యప్) ‘‘అనురాగ్ నేను 2012-13 సంవత్సరంలో కలిసి పనిచేశాం. తను నాకు ప్రియమైన స్నేహితుడు. ఎంతో ప్రతిభావంతుడైన దర్శకుడు. నాకు తెలిసినంత వరకు తను నాతో గానీ, ఇతరులతో గానీ ఇంతవరకు ఎప్పుడూ చెడుగా ప్రవర్తించలేదు. అయితే ఆయనపై ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్లు అధికారులకు, పోలీసులకు, న్యాయ వ్యవస్థకు ఫిర్యాదు చేయాలి. ఈ విషయంపై నేను స్పందించకూడదు అనుకున్నా. ఎందుకంటే సోషల్ మీడియా యుద్ధాలు, మీడియా విచారణలపై నాకు నమ్మకం లేదు. అయితే నా పేరును ఇందులోకి లాగడం ఆగ్రహాన్ని తెప్పించింది. ఎన్నో ఏళ్లుగా కఠిన శ్రమకోర్చి తనకంటూ ప్రత్యేక గుర్తిం పు తెచ్చుకున్న మహిళలు ఎవరికైనా ఇలాగే అనిపిస్తుంది. నా ఫైనల్ రెస్పాన్స్ ఇది. ఈ విషయంలో ఇకపై నన్ను ఎవరూ సంప్రదించవద్దు’’ అని హూమా ఖురేషి మీడియాకు విజ్ఞప్తి చేశారు.(చదవండి:మేము బెస్ట్‌ఫ్రెండ్స్; నాకు చెప్పాల్సిన అవసరం లేదు! కాగా అనురాగ్ తెరకెక్కించిన గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్ సినిమాతో హూమా బాలీవుడ్ తెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల షేర్ చేసిన వీడియోలో పాయల్ సంచలన ఆరోపణలు చేశారు. అనురాగ్ తనను లైంగికంగా వేధించాడని, రిచా చద్దా, హూమా ఖురేషి వంటి వాళ్లు అతడు ఫోన్ చేసినప్పుడల్లా వెళ్లి సంబంధం కొనసాగిస్తారంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఈ విషయంపై ఫైర్ అయిన రిచా చద్దా పాయల్‌పై చట్టపరమైన చర్యలకు ఉపక్రమించగా, హూమా ఖురేషి ఈ మేరకు స్పందించారు. pic.twitter.com/g0FGKyFxGi — Huma S Qureshi (@humasqureshi) September 22, 2020 -
గూఢచారి అక్షయ్
యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ తన తదుపరి చిత్రం ‘బెల్ బాటమ్’ కోసం గూఢచారిగా మారారు. 80ల బ్యాక్‌డ్రాప్‌తో నడిచే ‘బెల్ బాటమ్’ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు అక్షయ్. రంజిత్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో లారా దత్తా, హ్యూమా ఖురేషీ, వాణీ కపూర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. బుధవారం అక్షయ్ కుమార్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమాలో ఆయన లుక్‌ను విడుదల చేశారు. లాక్డౌన్ తర్వాత చిత్రీకరణ ప్రారంభించిన తొలి హిందీ చిత్రమిదే. ప్రస్తుతం స్కాట్‌ల్యాండ్‌లో చిత్రీకరణ జరుగుతోంది. హైజాక్ వల్ల విమానంలో ఇరుక్కుపోయిన 200 మంది ప్రయాణికులను అక్షయ్ ఎలా కాపాడాడన్నది చిత్రకథ అని సమాచారం. వచ్చే ఏడాదిలో ఈ సినిమా విడుదల కానుంది. -
చలో స్కాట్‌ల్యాండ్
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో స్వదేశంలో షూటింగ్ అంటేనే రిస్క్.. ఇక విదేశాల్లో షూటింగ్ ఎలా? అని సినిమా ఇండస్ట్రీ ఆలోచిస్తోంది. కానీ విదేశాల్లో షూటింగ్ కి సంబంధించిన ప్లానింగ్ మాత్రమే కాదు.. ప్రయాణం కూడా మొదలెట్టారు అక్షయ్ అండ్ టీమ్. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కనున్న పీరియాడిక్ థ్రిల్లర్ చిత్రం ‘బెల్ బాటమ్’. రంజిత్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వాణీకపూర్ కథానాయిక. లారా దత్, హ్యూమా ఖురేషీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. డిటెక్టివ్ పాత్రలో అక్షయ్ కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం 120 మంది స్కాట్ ల్యాండ్ ప్రయాణమయ్యారు. లాక్ డౌన్ తర్వాత విదేశాల్లో షూట్ చేయనున్న చిత్రమిదే. ప్రభుత్వ గైడ్ లైన్స్ అనుసరిస్తూ చిత్రీకరణ ప్లాన్ చేశారు. చిత్ర యూనిట్ అందరికీ స్పెషల్ రిస్ట్ బ్యాండ్లు అందించారట. దీంతో ఎప్పటికప్పుడు ఆ వ్యక్తి బ్లడ్ ప్రెషర్, ఉష్ణోగ్రత, ఆక్సిజన్ లెవెల్.. అన్నీ తెలుసుకోవచ్చు. స్కాట్ ల్యాండ్ వెళ్లిన తర్వాత కొన్ని రోజులు క్వారంటైన్ లో ఉన్న తర్వాతే చిత్రీకరణకు సంబంధించిన పనులు మొదలు పెడతారట. ‘‘మళ్ళీ షూటింగ్ తో బిజీ అయ్యే టైమ్ రావడం చాలా బావుంది’’ అన్నారు అక్షయ్ కుమార్. -
లాక్డౌన్ ఎత్తివేత; నా ఆనందం ఇలాగే ఉంటుంది
కరోనా కారణంగా దాదాపు ఇళ్లకే పరిమితమైన ప్రజలు బయట ప్రపంచానికి దూరంగా ఉంటున్నారు. వీరిలో ముఖ్యంగా సెలబ్రిటీలు రెండు నెలలుగా ఇంటి నుంచి అడుగు బయట పెట్టడం లేదు. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా విధించిన లాక్డౌన్ ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. లాక్డౌన్ ముగిసిన వెంటనే ఏం చేయాలో ఇప్పుడే ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో లాక్డౌన్ ముగిసిందన్న విషయం తెలిసినప్పుడు తన ఆనందం ఎలా ఉంటుందో చెప్పేందుకు బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషీ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. గతంలో డ్యాన్స్ చేస్తూ దిగిన వీడియోను తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.‘ లాక్డౌన్ ఎత్తివేత’ వార్త విన్నప్పుడు తన ఆనందం ఇలాగే ఉంటుంది. ఇలా డ్యాన్స్ చేస్తా. ఆ వార్త ఎప్పుడు వింటానో.’ అంటూ ఈ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. (ఈ రోజే రానా-మిహీక నిశ్చితార్థం) ఖురేషీ పోస్టుపై అభిమానులు సానుకూలంగా స్పందిస్తున్నారు. అనేక మంది స్మైలీ ఎమోజీలను జతచేస్తున్నారు. ఇక సినిమా పరిశ్రమకు చెందిన హ్యుమా స్నేహితులు చాలా మంది ఆమె పోస్టుపై సరాదాగా కామెంట్ చేస్తున్నారు. కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ దొరికినప్పుడు ఇలాగే డ్యాన్స్ చేయాలని కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ కామెంట్ చేశారు. కాగా ఇంతకముందు పోస్టులో హ్యూమా కరోనాకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి ధన్యవాదాలు తెలుపుతూ, తాను ఉదయం నుంచి రాత్రి వరకు పాటించే దినచర్యను షేర్ చేశారు. (హ్యాపీ బర్త్‌డే జూ. ఎన్టీఆర్: వార్నర్) -
హ్యూమాకి భయమా?
ముంబై వీధుల్లో బైక్‌పై షికారు చేస్తున్నారు హ్యూమా ఖురేషీ. కానీ ఇది సరదా కోసం చేస్తున్న షికారు కాదు. తన కొత్త సినిమా కోసం హ్యూమా నేర్చుకుంటున్న బైక్ పాఠాలు. అజిత్ హీరోగా హెచ్. వినోద్ దర్శకత్వంలో బోనీ కపూర్ నిర్మాతగా తమిళంలో ‘వలిమై’ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో కథానాయికగా నటిస్తున్నారు హ్యూమా ఖురేషీ. రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రంలోని తన క్యారెక్టర్ కోసం హ్యూమా ఖురేషీ బైక్ పాఠాలు నేర్చుకుంటున్నారు. ఇందులో హ్యూమా అదిరిపోయే బైక్ స్టంట్స్ కూడా చేస్తారట. బైక్ స్టంట్స్ అంటే చిన్న విషయం కాదు. చాలా ధైర్యం ఉండాలి. ‘హ్యూమాకి భమయా’ అంటూ సరదాగా నవ్వుతూ హ్యూమా బైక్ స్టంట్స్ నేర్చుకుంటున్నారు. ఇందులో అజిత్ పోలీసాఫీసర్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ వైజాగ్‌లో జరగాల్సింది. కానీ కరోనా వైరస్ ప్రభావంతో షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. -
అజిత్‌కు జంటగా తలైవా ప్రేయసి
సినిమా: తలైవా ప్రేయసితో ‘తల’కు జత కుదిరింది. తల అజిత్ వరుస విజయాలతో జోరు మీదున్న విషయం తెలిసిందే. విశ్వాసం, నేర్కొండ పార్వై వంటి సక్సెస్ఫుల్ చిత్రాల తరువాత అజిత్ తాజాగా నటిస్తున్న చిత్రం వలిమై. నేర్కొండ పార్వై చిత్ర దర్శకుడు హెచ్.వినోద్‌నే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక ఆ చిత్ర దర్శకుడు బోనీకపూర్‌నే ఈ వలిమై చిత్రాన్ని జీ.స్టూడియోస్‌తో కలసి నిర్మిస్తున్నారు. ఇందులో అజిత్ పవర్ఫుల్ పోలీస్ అధికారిగా నటిస్తున్నారు. ఇది అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఓరియెంటెడ్ కథా చిత్రంగా ఉంటుందని యూనిట్ వర్గాలు ఇప్పుటికే తెలిపారు. కాగా చిత్రం ప్రారంభమై చాలా రోజులే అయ్యింది. హైదరాబాద్‌లో తొలి షెడ్యూల్ షూటింగ్‌ను పూర్తి చేసుకున్న వలిమై చిత్రం ప్రస్తుతం చెన్నైలో చిత్రీకరణను జరుపుకుంటోంది. అయితే ఇప్పటి వరకూ ఇందులో అజిత్‌కు జంటగా నటించే నాయకి ఎవరన్నది చిత్ర వర్గాలు వెల్లడించలేదు. అయితే ఆ మధ్య న్యూయార్క్‌లో నటి నయనతారను బోనీకపూర్ కలవడంతో వలిమైలో ఆమె నటించనుందనే ప్రచారం జరిగింది. అయితే అది వదంతి అని తెలిసింది. ఆ తరువాత బాలీవుడ్ బ్యూటీ యామిని గౌతమ్‌ను ఎంపిక చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే తాజాగా మరో నటి పేరు వినిపిస్తోంది. ఆమెనే నటి హ్యూమా ఖురోషి. ఈ అమ్మడు తమిళంలో రజనీకాంత్ నటించిన కాలా చిత్రంలో ఆయనకు మాజీ ప్రేయసిగా నటించిందన్నది గమనార్హం. ఆ తరువాత కొలీవుడ్లో కనిపించిన హూమా ఖురోషి పేరు ఇప్పుడు మళ్లీ వినిపిస్తోంది. వలిమై చిత్రంలో అజిత్‌కు జంటగా నటించనుందనేది తాజా ప్రచారం. అయితే ఆమె వలిమై చిత్రంలో నటించడం ఖాయం అయ్యిందని, అంతే కాదు ప్రస్తుతం చెన్నైలో జరుగుతున్న షూటింగ్లో పాల్గొంటోందని తెలిసింది. ఇక్కడ ఈ అమ్మడి సెకెండ్ చిత్రం వలిమై అవుతుంది. కాగా నటుడు రజనీకాంత్ బాణీలోనే అజిత్ కూడా యువ హీరోయిన్లతో జత కట్టడానికి ఇష్టపడడం లేదు. అంతే కాదు తన చిత్రాల్లో కథా పాత్రలను తన వయసుకు తగ్గట్టుగా ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. కాగా వలిమై చిత్రంలో నటి హూమా ఖురేషి పాత్ర ఎలా ఉంటుందోనన్న ఆసక్తి నెలకొంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంగీతాన్ని యువన్ శంకర్‌రాజా, ఛాయాగ్రహణం నీరవ్షాఅందిస్తున్నారు. వలిమై చిత్రాన్ని దీపావళి విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. -
చలో లాస్ ఏంజిల్స్
పాస్‌పోర్ట్, నిత్యం అవసరమయే వస్తువులను జాగ్రత్తగా సూట్‌కేస్‌లో ప్యాక్ చేసుకుంటున్నారు హీరోయిన్ హ్యూమా ఖురేషి. త్వరలో ఆమె లాస్ ఏంజిల్స్‌కు పయనం కానున్నారు. దాదాపు రెండు నెలలు అక్కడే ఉంటారట.. ‘డ్వాన్ ఆఫ్ ది డెడ్, 300, జస్టిస్ లీగ్’ వంటి ఇంగ్లీష్ చిత్రాలను తెరకెక్కించిన జాక్ స్నైడర్ దర్శకత్వంలో ‘ఆర్మీ ఆఫ్ ది డెడ్’ అనే హాలీవుడ్ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో డావే బౌటిస్టా, థియో రోసి, హ్యూమా ఖురేషి కీలక పాత్రలు చేయనున్నారు. కిరాయి సైనికుల నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. ఈ సినిమా చిత్రీకరణ త్వరలో లాస్ ఏంజిల్స్ను ప్రారంభం కానుంది. ఇందుకోసం అక్కడికి వెళ్లనున్నారు హ్యూమా. -
రావమ్మా హ్యూమా
బాలీవుడ్ హీరోయిన్ హ్యూమా ఖురేషీకి ఇంటర్నేషనల్ కాల్స్ వస్తున్నాయి. ‘హ్యూమా.. రామ్మా’ అంటూ ఇంటర్నేషనల్ డైరెక్టర్స్ ఆమెను ఆహ్వానిస్తున్నారు. రెండేళ్ల క్రితం ‘వైస్రాయ్ హౌస్’ అనే ఇంగ్లీష్ చిత్రంలో నటించిన హ్యూమా తాజాగా ‘ఆర్మీ ఆఫ్ డెడ్’ అనే మరో ఇంగ్లీష్ ప్రాజెక్ట్‌లో ముఖ్య తారగా చేసే చాన్స్ కొట్టేశారు. డ్వాన్ ఆఫ్ ద డెడ్ (2004), 300 (2006), 300: రైజ్ ఆన్ఎంపైర్ (2014) వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన జాక్ స్నైడర్ ఈ చిత్రానికి దర్శకుడు. 2007లో తెరకెక్కించిన ‘జస్టిస్ లీగ్’ తర్వాత జాక్ మళ్లీ మెగాఫోన్ పట్టడం ఇదే. ఇంగ్లీష్ నటులు ఎలా పర్నెల్, అనా దే లా రెగెరా, థియో రోసి ఈ సినిమాలో ఇతర ముఖ్య తారాగణం. ‘‘దర్శకుడు జాక్గారికి నేను పెద్ద అభిమానిని. ఈ అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారా? అని ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు హ్యూమా ఖురేషి. ఇక డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో హ్యూమా నటించిన ‘లీలా’ అనే వెబ్‌సీరిస్ ఈ నెలలో విడుదల కానుంది. -
3ఎస్
హుమా ఖురేషీ అంటే? మూడు ముక్కల్లో చెప్పాలంటే... స్పాంటేనిటీ, స్టైల్, స్టేట్మెంట్స్. గుంపులో ఒకరిగా కాకుండా తనదైన ప్రత్యేకతను బాలీవుడ్లో నిలుపుకుంటూ వస్తున్న ఖురేషీ ‘కాలా’ సినిమాతో ‘జరీనా’గా దక్షిణాది సినిమాకు పరిచయమైంది. ‘ఉన్నదున్నట్లే మాట్లాడితే సినిమా ఇండస్ట్రీలో కష్టం’ అంటూనే నిర్మొహమాటంగా మాట్లాడే హుమా ఖురేషీ అంతరంగ తరంగాలు... అభిమానం వరకే... చిన్నప్పుడు సినిమాలు తెగ చూసేదాన్ని. అద్దం ముందు నిల్చొని డ్యాన్స్‌లు చేయడం, డైలాగులు చెప్పడం సరేసరి. మధుబాల, మాధురి దీక్షిత్, శ్రీదేవి...నా అభిమాన తారలు. అంతమాత్రాన...నేను ఎప్పుడూ వారిని అనుకరించే ప్రయత్నం చేయలేదు. నాదైన ముద్ర కోసం ప్రయత్నం చేశాను. నా అదృష్టం! సవాలు విసరని ఇండస్ట్రీ అంటూ ఏదీ ఉండదు. కాబట్టి సవాళ్లను ఎదుర్కోవడానికి సదా సిద్ధంగా ఉంటాను. ఇండస్ట్రీలో నేను ప్రముఖుడి కూతురు, బంధువై ఉంటే ‘ఎక్స్పెక్టేషన్స్’ ఎక్కడో ఉండేవి. అవేమీ లేకపోవడం, ఇతరులతో పోలిక తేకపోవడం నా అదృష్టంగానే భావిస్తున్నాను. శిక్షణ మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉండాలంటే థియేటర్ ట్రైనింగ్ తప్పనిసరి. ఇది సినిమాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మలయాళ సినిమా ‘వైట్’ కోసం డైలాగ్ చెప్పాల్సి వచ్చినప్పుడు నేను థియేటర్లో నేర్చుకున్న ‘జిబ్బరీష్ టెక్నిక్’ను వాడుకున్నాను. ఒక్కటైనా చాలు... సంవత్సరానికి పది సినిమాలు చేయాలనే ఆరాటం నాలో లేదు.నంబర్లతో నటనను అంచనా వేయలేం. సంవత్సరానికి ఒక్క సినిమా చేసినా ఫరవాలేదుగానీ... నలుగురు మెచ్చే పాత్ర చేయాలనేది నా కోరిక.‘బాగా డబ్బులు సంపాదించాలి’ అనే కోరిక మనల్ని ఎప్పుడూ సృజనాత్మకత అనే గమ్యానికి చేర్చదు. అలాగే ‘భారీ తారగణం’ ‘భారీ బడ్జెట్’....ఈ రెండు ‘భారీ’లు మాత్రమే ఒక సినిమాను విజయవంతం చేయలేవు. అద్భుతం! ఒకప్పుడు మన సినిమాలు అంటే ఇతర దేశాల్లో ‘సింగింగ్ అండ్ డ్యాన్సింగ్’ సినిమా అనే పేరు ఉండేది. ఇప్పుడు దృశ్యం మారిపోయింది. మన సినిమాలపై ఆసక్తి పెరిగిపోయింది. మన దగ్గర అద్భుతమైన దర్శకులు, రచయితలు ఉన్నారు. అందరూ కలిసి నిర్మాణాత్మకంగా కృషి చేస్తే మరిన్ని సృజనాత్మక అద్భుతాలు సృష్టించడం కష్టమేమీ కాదు. -
అమ్మ ఆశీర్వాదం
రజనీకాంత్ ‘కాలా’ సినిమాలో జరీనా పాత్రలో కనిపించారు హ్యూమా ఖురేషీ. ఈ సినిమాలో హ్యూమాని రజనీకాంత్ చిట్టెమ్మా అని పిలిచిన సీన్స్ గుర్తుండే ఉంటాయి. ఇప్పుడీ చిట్టెమ్మ లీలాగా మారారు. కానీ సినిమా కోసం కాదు. ఓ వెబ్ సిరీస్ కోసం. దీపా మెహ్తా దర్శకత్వం వహిస్తున్నారు. ‘‘నా ఫస్ట్ వెబ్ సిరీస్ ‘లీలా’లో నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది. నన్ను ఈ సెట్‌కి స్వయంగా మా అమ్మ (అమీనా ఖురేషీ) డ్రాప్ చేశారు. ఈ సిరీస్ సక్సెస్ కావాలని ప్రార్థనలు చేసి, నన్ను ఆశీర్వదించారు’’ అని పేర్కొన్నారు హ్యూమా ఖురేషి. ఈ సిరీస్ కోసం శంకర్ రామన్, పవన్ కుమార్‌లు కూడా వర్క్ చేస్తారని ఆమె పేర్కొన్నారు. అలాగే ఈ సిరీస్‌లో నటుడు సిద్ధార్థ్ ఓ లీడ్ రోల్లో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. వెబ్ సిరీస్‌లతో పాటు వెండితెరపై రాణించేందుకు కూడా కథలు వింటున్నారట హ్యూమా ఖురేషి. -
‘వెంకీమామ’పై పుకార్లకు ఫుల్స్టాప్!
వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘వెంకీమామ’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు. ఇందులో నాగచైతన్య సరసన రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయికగా నటించనున్నారు. వెంకటేశ్‌కు జోడీగా శ్రియ, హ్యూమా ఖురేషి పేర్లను పరిశీలిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. సురేశ్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్స్ కార్పొరేషన్ సంస్థలు నిర్మించనున్నాయి. ఇటీవల ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగిన విషయం కూడా గుర్తుండే ఉంటుంది. అయితే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లదనే పుకార్లు పుట్టుకొచ్చాయి. ఈ విషయంపై చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. ‘‘వెంకీమామ’ చిత్రం సెట్స్‌పైకి వెళ్లదనే వార్తల్లో నిజం లేదు. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి’’ అని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రస్తుతం నాగచైతన్య ‘సవ్యసాచి’ సినిమా ప్రమోషన్స్, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాతో బిజీగా ఉన్నారు. అలాగే వెంకటేశ్ ‘ఎఫ్ 2’ సినిమాతో బిజీగా ఉన్నారు. తాజా సమాచారం ఏంటంటే.. ‘వెంకీమామ’ సినిమా చిత్రీకరణ వచ్చే నెల సెకండ్ వీక్‌లో స్టార్ట్ కానుందట. ‘‘ఈ సినిమా పనులతో బాబీ బిజీగా ఉన్నాడు. వచ్చే నెల షూటింగ్ స్టార్ట్ చేస్తాం. వచ్చే ఏడాది ఓ మంచి ఎంటర్టైనర్ని ఇవ్వబోతున్నామనే నమ్మకంతో అందరం పని చేస్తున్నాం’’ అన్నారు కోన వెంకట్. -
వెబ్‌సిరీస్ కోసం..
బాలీవుడ్ బ్యూటీ హ్యూమాఖురేషీ, సిద్ధార్థ్ (బొమ్మరిల్లు ఫేమ్)లకు జోడీ కుదిరిందా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. రజనీకాంత్ హీరోగా పా.రంజిత్ దర్శకత్వంలో వచ్చిన ‘కాలా’ సినిమాతో హ్యూమా తెలుగువారికీ సుపరిచితమే. ఈ ఢిల్లీ భామ తాజాగా సిద్ధార్థ్‌తో నటించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట. అయితే.. ఇది సినిమా కాదు. ఓ వెబ్ సిరీస్. బాలీవుడ్ దర్శకురాలు దీపా మెహతా హిందీలో రూపొందిస్తున్న ఈ సిరీస్‌లో వీరు నటించనున్నారని టాక్. దీపా మెహతా దర్శకత్వంలో 2012లో వచ్చిన ‘మిడ్నైట్స్ చిల్డ్రన్’ అనే చిత్రంలో సిద్ధార్థ్ నటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె తెరకెక్కించనున్న వెబ్ సిరీస్‌లో నటించేందుకు ఇటు సిద్ధార్థ్, అటు హ్యూమా పచ్చజెండా ఊపారట. సిద్ధార్థ్ ప్రస్తుతం తమిళంలో ‘సైతాన్ కా బచ్చా’ సినిమాలో నటిస్తున్నారు. వీటితో పాటు మరికొన్ని తమిళ సినిమాలకూ కమిట్ అయ్యారాయన. హ్యూమా కూడా కథలు వింటున్నారట. -
సిద్ధార్థ్‌కు జతగా హ్యూమా ఖురేషి
సినిమా: రజనీకాంత్ హీరోయిన్ ఇప్పుడు సిద్ధార్థ్‌తో జత కట్టడానికి సిద్ధం అవుతోంది. రజనీకాంత్‌కు జంటగా కాలా చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అయిన బాలీవుడ్ నటి హ్యూమాఖురేషీ. ఆ చిత్రంతో కోలీవుడ్‌లో మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశించిన ఈ అమ్మడికి నిరాశే ఎదురైంది. కాలా చిత్రం తరువాత తమిళంలో హ్యూమా ఖురేషీని పట్టించుకున్నవారే లేరు. ఇక ఆ మధ్య విజయాల పరంగా కాస్త వెనుక పడ్డ నటుడు సిద్ధార్థ్ అవళ్ చిత్రంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. ప్రస్తుతం మలయాళంలో కమ్మర శపథం చిత్రంలో నటిస్తున్న ఈయన తమిళంలో కార్తీక్ జీ.క్రిస్ దర్శకత్వంలో సైతాన్ కే బచ్చా చిత్రంతో పాటు సాయిశేఖర్ దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నారు. దర్శకుడు శశి నూతన చిత్రంలో కూడా సిద్ధార్థ్ హీరోగా నటించడానికి కమిట్ అయ్యారు. మొత్తం మీద తమిళం, మలయాళం భాషా చిత్రాలతో బిజీగా ఉన్న సిద్ధార్థ్ తాజాగా బాలీవుడ్ భామ హ్యూమా ఖురేషీతో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే ఇది సినిమా కాదు. ఒక వెబ్ సీరియల్. బాలీవుడ్ దర్శకుడు దీపా మెహతా హిందీలో రూపొందిస్తున్న ఇందులో సిద్ధార్థ్, హ్యూమాఖరేషీ జంటగా నటించనున్నారని సమాచారం. సిద్ధార్థ్ ఇంతకు ముందే దీపా మెహతా దర్శకత్వంలో మిడ్నైట్స్ సిల్రన్ అనే హిందీ చిత్రంలో నటించారన్నది గమనార్హం. దీంతో సిద్ధార్థ్, హ్యూమాఖురేషీలతో తెరకెక్కించనున్న వెబ్ సీరియల్‌పై అంచనాలు పెరుగుతున్నాయట. -
వెంకీ మామా ఎప్పుడొస్తావ్?
మామా అల్లుళ్లు కలిస్తే వాతావరణం అంతా సందడి సందడిగా మారిపోతుంది. అలా నవ్వులు పూయించడానికి అక్టోబర్ నుంచి అల్లుడు నాగచైతన్యతో కలిసి రెడీ అవనున్నారు మామ వెంకటేశ్. కేయస్ రవీందర్ (బాబీ) దర్శకత్వంలో వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా ఓ మల్టీస్టారర్ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. సురేశ్ ప్రొడక్షన్, బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో స్టార్ట్ కానుందని సమాచారం. ఈ చిత్రానికి ‘వెంకీ మామ’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు. సినిమాలోనూ మామా అల్లుడిగా కనిపిస్తారు వెంకీ, చైతన్య. ఈ సినిమాలో వెంకటేశ్‌కి జోడీగా హ్యూమా ఖురేషి, నాగచైతన్యకు జోడీగా రకుల్‌ప్రీత్‌సింగ్ నటించనున్నారని సమాచారం. వచ్చే ఏడాది సమ్మర్‌కి ఈ సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు చిత్రబృందం. -
మామా అల్లుళ్ల అల్లరి
అల్లుడుకి తోడుగా మామ ఎంట్రీ కూడా ఉంటుందా? లేక మామ, అల్లుడు వేరు వేరుగా ఎంట్రీ ఇస్తారా? అసలు సెట్స్‌లోకి ముందు ఎవరు కాలుపెడతారు? ఈ డౌట్ ఆగస్టు సెకండ్ వీక్‌లో క్లియర్ అవుతుంది. వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘వెంకీ మామ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన కార్పొరేషన్ సంస్థలు నిర్మించనున్నాయి. ఇటీవల ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. రియల్ లైఫ్ మాదిరిగానే రీల్ లైఫ్‌లోనూ వెంకటేశ్, నాగచైతన్య మామా అల్లుళ్లుగా నటించనున్నారు. రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు 8న మొదలవుతుందని సమాచారం. మామా అల్లుళ్లు కలిసి వెండితెరపై చేయబోయే అల్లరి ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి. ఈ సినిమాలో నాగచైతన్యకు జోడీగా రకుల్‌ప్రీత్ సింగ్ నటిస్తారు. ఇక వెంకీ సరసన కథానాయికలుగా హ్యూమా ఖురేషీ, శ్రియ పేర్లను పరిశీలిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు సంగీతం అందించేందుకు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లను సంప్రదిస్తున్నారట. -
మామా మేనల్లుడి కథ
వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో రూపొందుతోన్న మల్టీస్టారర్ మూవీ ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. సురేశ్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఇందులో ఒక కథానాయికగా రకుల్ ప్రీత్‌సింగ్ నటిస్తున్నారు. మరొక కథానాయికగా హ్యూమా ఖురేషీ పేరును పరిశీలిస్తున్నారు. ‘‘నేను దర్శకత్వం వహించనున్న నెక్ట్స్ చిత్రంలో వెంకటేశ్‌గారు, నాగచైతన్య నటిస్తున్నారు. అవును.. మామా, మేనల్లుడి బ్యాక్‌డ్రాప్‌లోనే ఈ సినిమా కథ సాగుతుంది. అన్ని వర్గాల వారినీ ఆకట్టుకునేలా ఉంటుంది’’ అని పేర్కొన్నారు బాబీ. ‘‘మా బ్యానర్లో నెక్ట్స్ వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా ఓ మల్టీస్టారర్ మూవీ మొదలైందని చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది’’ అని సురేశ్ ప్రొడక్షన్స్ ప్రతినిధులు సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. ‘‘ఈ సినిమా జర్నీలో భాగమైనందుకు హ్యాపీ’’ అని రకుల్ పేర్కొన్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని సమాచారం. ఈ కార్యక్రమంలో నటుడు రానా, నిర్మాతలు డి. సురేశ్‌బాబు, కోన వెంకట్, టీజీ. విశ్వప్రసాద్, కెమెరామేన్ ప్రసాద్ మూరెళ్ల తదితరులు పాల్గొన్నారు. -
కాలా నష్టం కాలా!
‘కాలా’ సినిమా కలెక్షన్స్‌కి సంబంధించిన పుకార్లకు చిత్రబృందం ఫుల్స్టాప్ పెట్టింది. ‘కాలా’ చిత్రం వల్ల తమకు నష్టాలు రాలేదని సదరు నిర్మాణ సంస్థ సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేసింది. రజనీకాంత్ హీరోగా ‘కబాలి’ ఫేమ్ పా. రంజిత్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘కాలా’. ఈశ్వరీ రావు, హ్యూమా ఖురేషి కథానాయికలుగా నటించారు. వండర్‌బార్ ఫిల్మ్స్ పతాకంపై రజనీకాంత్ అల్లుడు, దర్శక–నిర్మాత, నటుడు ధనుష్ నిర్మించిన ఈ సినిమా జూన్ 7న తమిళం, హిందీ, తెలుగు భాషల్లో రిలీజైంది. అయితే ఈ సినిమాకి ఎక్కువ బడ్జెట్ అవ్వడంవల్ల నిర్మాణ సంస్థకు ఆశించిన ఫలితాలు రాలేదని తమిళ మీడియాలో ఆర్టికల్స్ వచ్చాయట. ఈ విషయంపై యూనిట్ స్పందించింది. ‘‘కాలా’ సినిమాకు సరైన కలెక్షన్స్ రాలేదని మీడియాలో వస్తున్న కొన్ని కథనాలు అవాస్తవం. మాకు ‘కాలా’ సక్సెస్ఫుల్ అండ్ ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్. మా బ్యానర్లో సినిమా చేసిన సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు, అలాగే సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు «థ్యాంక్స్’’ అని వండర్‌బార్ ఫిల్మ్స్ ప్రతినిధులు సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. -
ఆన్ ట్రాక్
జస్ట్ మూడు రోజులు.. అంతే. మామా అల్లుళ్లు రంగంలోకి దిగుతారు. ఎందుకు అంటే? సినిమా కోసం. వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ మూవీ రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రారంభోత్సవం ఈ నెల 11న జరుగుతుందని సమాచారం. అంటే ఆ రోజు నుంచీ మామా అల్లుళ్లు ఆన్ ట్రాక్ అన్నమాట. సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు ‘వెంకీ మామా’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని టాక్. రియల్ లైఫ్ మాదిరిగానే ఈ సినిమాలో మామా అల్లుళ్ల పాత్రల్లో నటించనున్నారట వెంకీ అండ్ చైతూ. ఆల్రెడీ నాగచైతన్య నటించిన ‘ప్రేమమ్’ సినిమాలో వెంకీ గెస్ట్ రోల్ చేశారు. ఇప్పుడు ఫుల్ లెంగ్త్ రోల్ చేయడానికి రెడీ అవుతున్నారు. మామా అల్లుళ్లు సినిమాలో ఎలాంటి సందడి చేస్తారో చూడాలి. ఈ సినిమాలో వెంకటేశ్ సరసన హ్యూమా ఖురేషి, నాగచైతన్యకు జోడీగా రకుల్‌ప్రీత్ సింగ్ నటించనున్నారన్న ప్రచారం జరుగుతోంది. -
స్లో అండ్ స్టడీ
ఉదయాన్నే ఖాళీ ప్లేస్‌లో రౌండ్స్ కొడుతున్నారు హీరోయిన్ హ్యూమా ఖురేషీ. రన్నింగ్ రౌండ్సా? డ్రైవింగ్ రౌండ్సా? అంటే.. రెండూ కాదు.. గుర్రంపై రౌండ్స్ వేస్తున్నారు. తాజాగా ఆమె గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నారు. ‘‘ఉదయాన్నే గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నాను. స్లో అండ్ స్టడీగా నేర్చుకుని ఆ నెక్ట్స్ స్పీడ్ పెంచుతా’’ అని పేర్కొన్నారు హ్యూమా. సడన్‌గా ఆమె గుర్రపు స్వారీ ఎందుకు నేర్చుకుంటున్నారు? అంటే ‘సైరా’ చిత్రం కోసమనే వార్తలు వినిపిస్తున్నాయి. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా చిరంజీవి హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్ నిర్మిస్తోన్న సినిమా ‘సైరా’. నయనతార కథానాయిక. అమితాబ్, తమన్నా, విజయ్‌సేతుపతి, సుదీప్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం హ్యూమాను సంప్రదించారట. అందుకే క్యారెక్టర్ కోసం ఆమె గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నారని టాక్. -
‘సైరా’లో ‘కాలా’ గర్ల్‌ఫ్రెండ్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి.ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో దక్షిణాది నటులతో పాటు ఉత్తరాది స్టార్లు కూడా కనిపించనున్నారు. ఇప్పటికే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌కు సంబంధించిన సీన్స్‌ను చిత్రీకరించారు. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వేసిన భారీ సెట్స్‌లో యాక్షన్ ఎపిసోడ్స్‌ను చిత్రీకరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా తారల జాబితాలో మరో బాలీవుడ్ నటి వచ్చి చేరారు. ఇటీవల కాలా సినిమాతో సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన బ్యూటీ హుమా ఖురేషీ. ఈ సినిమాలో రజనీ ప్రియురాలిగా నటించిన హుమా, సైరాలో నటించేందుకు అంగీకరించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని చిత్రయూనిట్ ధృవీకరించాల్సి ఉంది. చిరు సరసన నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. -
అందుకే మీటు సక్సెస్ కాదు
‘మీటు’ ఉద్యమం వెలుగులోకొచ్చాక ఇండస్ట్రీలో చాలా మంది తమకు జరిగిన లైంగిక వేధింపుల గురించి మాట్లాడి, ఈ సంస్కృతిని నివారించే ప్రయత్నం చేస్తున్నారు. హాలీవుడ్లో మొదలైన ఈ ఉద్యమం ఇండియన్ ఇండస్ట్రీ వరకూ విస్తరించింది. కానీ మీటు ఉద్యమం బాలీవుడ్లో అంతగా విజయవంతం కాకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు బాలీవుడ్ భామ ‘హ్యూమా ఖురేషి’. ఈ విషయం గురించి హ్యూమా మాట్లాడుతూ – ‘‘హాలీవుడ్లో ఈ ఉద్యమం అంత గొప్పగా విజయవంతం కావడానికి కారణం ఈ వేధింపుల మీద మాట్లాడిన హీరోయిన్లంతా సీనియర్లు, చాలా రెస్పెక్ట్ ఉన్నవారు. బాలీవుడ్లో కూడా ఇలా టాప్ హీరోయిన్స్ మాట్లాడగలిగినప్పుడే ఈ ఉద్యమం ఇంకా సక్సెస్ అవుతుంది. ఇలాంటి ఉద్యమాలకు పెద్ద గొంతులే కీలకం. చిన్న చిన్నవాళ్లు నోరు విప్పితే దాని ప్రభావం కూడా చాలా చిన్నదిగా ఉంటుంది. అలాగే మీటు అనేది కేవలం సినిమా ఇండస్ట్రీలోనే జరగాలని కాదు. ప్రతి వర్కింగ్ ప్లేస్‌లో ఇది జరగాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారామె. -
స్త్రీలోక సంచారం
::: అక్రమ చొరబాటుదారులను నిరోధించడం కోసం ‘జీరో టాలరెన్స్’ (ఏమాత్రం సహించేది లేదు) వలస విధానాన్ని అమలు చేస్తున్న అమెరికా, సరిహద్దుల్లోని మెక్సికన్ వలస తల్లిదండ్రుల నుంచి వారి పిల్లల్ని వేరు చేసి వేర్వేరు వసతికేంద్రాల్లో ఉంచడాన్ని అమెరికా దేశపు ప్రస్తుత, పూర్వ ప్రథమ మహిళలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ వైఖరిని తాను ద్వేషిస్తున్నానని డొనాన్డ్ ట్రంప్ భార్య మెలనియా ప్రకటించగా, ఇంత అమానుషమైన చర్యల్ని ప్రపంచయుద్ధకాలంలో కూడా మనం చూడలేదని లారా బుష్ వ్యాఖ్యానించారు ::: బ్రిటన్ రాణివంశపు కొత్త పెళ్లికూతురు మేఘన్ మార్కల్ తండ్రి థామస్ మార్కల్.. ‘ట్రంప్‌కి ఒక అవకాశం ఇవ్వండి’ అని తన అల్లుడు ప్రిన్స్హారీతో చెబుతూ, యు.ఎస్. అధ్యక్షుడి విషయంలో విశాల హృదయంతో ఆలోచించాలని సూచించడం మేఘన్‌ను ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. చుట్టరికాలతో చొరవ చూపి పాలనా వ్యవహారాలపై సలహాలను ఇవ్వడాన్ని బ్రిటన్ రాజప్రాసాదం ఒక చికాకు వ్యవహారంగా పరిగణిస్తున్నట్లు బ్రిటన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి ::: ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో సోమవారం మధ్యాహ్నం.. రైల్లో ప్రయాణిస్తున్న ఒక గర్భిణికి ఆకస్మికంగా పురిటి నొప్పులు రావడంతో రైల్వే అధికారులు 45 నిమిషాల పాటు రైలును ఆపి, రైల్వే వైద్య సిబ్బంది చేత సురక్షితంగా కాన్పు జరిపించారు. రైల్లో జన్మించిన ఆ శిశువుకు 25 ఏళ్ల వయసు వచ్చేవరకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించిన పారిస్ రైల్వేశాఖ.. ఆ తల్లికి శుభాభినందనలు కూడా పంపింది ::: కస్టమర్ కోరికపై ఎయిర్టెల్ డిష్‌టీవీ నెట్వర్క్ కనెక్షన్ ఇచ్చేందుకు షోయబ్ అనే ఆపరేటింగ్ ఎగ్జిక్యూటివ్‌ను ఇంటికి పంపిస్తున్నట్లు సమాచారం అందుకున్న లక్నో మహిళ పూజాసింగ్.. ట్విట్టర్లో ‘డియర్ షోయబ్, నువ్వు ముస్లిం మతస్తుడివి. నీ పని తీరుపై నాకు నమ్మకం ఉండదు కనుక, వేరెవరైనా హిందూ మతస్తుడిని నీ బదులుకు మా ఇంటికి పంపించే ఏర్పాటు చేయగలవు’ అంటూ పోస్ట్ పెట్టారు. దీనిపై ఎయిర్టెల్ ఆమె కోరిన విధంగానే హిందూ మతస్తుడైన ఆపరేటర్‌ను పంపుతూ, ‘ఎయిర్టెల్ మత విశ్వాసాలకు అతీతమైన సంస్థ. మీరు కూడా మాలాగే ఉండాలని ఆశిస్తున్నాం’ అని ప్రతిస్పందించింది ::: వరల్డ్ నెంబర్12 చెస్ గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారికకు బిజినెస్‌మేన్ కార్తీక్ చంద్రతో సోమవారం హైదరాబాద్‌లో నిశ్చితార్థం అయింది. గుంటూరు జిల్లా గోరంట్లలో జన్మించి, 2011లో గ్రాండ్‌మాస్టర్ టైటిల్ గెలుపొంది, 2012, 2015, 2017 ‘ఉమెన్స్ వరల్డ్ చెస్ చాంపియన్’లలో కాంస్య పతకాలు పొంది, 2007లో అర్జున అవార్డు సాధించిన 27 ఏళ్ల హారికకు చెస్‌లో వ్లాదిమర్ క్రామ్నిక్, జూడిత్ పోల్గార్, విశ్వనాథన్ ఆనంద్.. అభిమాన చెస్ ప్లేయర్లు ::: హాలీవుడ్లో సీనియర్ నటీమణులు బయటికి వచ్చి తమపై జరిగిన లైంగిక వేధింపులను, లైంగిక దాడులను, లైంగిక అకృత్యాలను బయటì పెట్టిన విధంగానే బాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు కూడా ధైర్యంగా బయటికొచ్చి, ‘క్యాస్టింగ్ కౌచ్’కు తాము ఏ విధంగా బలయిందీ చెబితే తప్ప మన దగ్గర ఏనాటికీ ‘మీటూ’ ఉద్యమం మొదలు కాదని బాలీవుడ్ నటి హ్యుమా ఖురేషీ సంచలనాత్మకమైన వ్యాఖ్య చేశారు. ఇలాంటి విషయాలలో ఒక మహిళ చేసిన ధైర్యం ఎందరో మహిళలను ముందుకు నడిపిస్తుందని ఆమె అన్నారు ::: తెలంగాణలోని మొత్తం 21 జిల్లాల్లో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లను (డి.సి.పి.యు) నెలకొల్పేందుకు రాష్ట్ర స్త్రీ,శిశు అభివృద్ధి శాఖ ఏర్పాట్లను పూర్తి చేసింది. బాలల హక్కులను పరిరక్షించడంతో పాటు, బాలలపై హింసను నిరోధించడానికి ఈ యూనిట్లు పనిచేస్తాయి ::: పశ్చిమబెంగాల్లో సంచలనం సృష్టించిన ‘శారదా’ చిట్‌ఫండ్ కుంభకోణంలో కీలక నిందితుని తరఫున వాదిస్తున్న నళినీ చిదంబరం ఈ నెల 20న (నేడు) కోల్‌కతాలోని ప్రత్యేక విచారణ కార్యాలయానికి హాజరు కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు పంపింది. నళిని ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు పి.చిదంబరం సతీమణి ::: -
కాలాకు ముందే టచ్‌లో ఉన్నాం
తమిళసినిమా: కాలా చిత్ర ప్రారంభానికి ముందే తామిద్దరం టచ్‌లో ఉన్నాం అని చెప్పింది నటి హ్యూమఖురేషీ. ఈ సుందరి కోలీవుడ్ ఎంట్రీనే సంచలన చిత్రంతో కావడం అదృష్టమే. రజనీకాంత్‌తో ఒక్క సన్నివేశంలో నటించినా చాలని ఎందరో కోలీవుడ్ ప్రముఖ నటీమణులు ఆశ పడుతుంటే అలాంటి అవకాశాన్ని హ్యూమఖురేషీని చాలా సులభంగా వరించిందనే చెప్పాలి. కాలా చిత్రంలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ప్రేయసిగా నటించే లక్కీచాన్స్‌ను దక్కించుకుని ఆ పాత్రతో మంచి గుర్తింపు పొందిన బాలీవుడ్ బ్యూటీ హ్యూమఖురేషీ. ఇంతకీ కాలా చిత్రానికి ముందు మేము టచ్‌లో ఉన్నాం అని ఈ అమ్మడు ఎవరి గురించి అంటుందనేగా మీ ఉత్సుకత. ఆ కథేంటో ఈ జాణ మాటల్లోనే చూద్దాం. నేను నటించిన హిందీ చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ వాసీపూర్ చిత్రాన్ని దర్శకుడు పా.రంజిత్ చూశారట. అందులో నా నటన ఆయనకు బాగా నచ్చేసింది. ఆయన నా గురించి చాలా మందికి చెప్పారట. అయితే నాకు నటుడు ధనుష్ నుంచే ఫోన్‌కాల్ వచ్చింది. నేను ధనుష్ చాలా కాలంగానే టచ్‌లో ఉన్నాం. ఆయన ప్రతిభావంతుడైన నటుడు. ఇద్దరం కలిసి చిత్రం చేయాలనుకున్నాం. ఒక చిత్రంలో నటించాలనుకున్నా, పలు కారణాల వల్ల అది జరగలేదు. అలాంటిది ఒక సారి ధనుష్ నుంచి ఫోన్ వచ్చింది. అది చిత్రం గురించి మాట్లాడడానికేనని భావించాను. అయితే నేను నిర్మించనున్న చిత్రంలో నటించాలి. హీరో రజనీకాంత్ అని ఆయన చెప్పగానే నేను వింటోంది నిజమేనా అన్న సందేహం కూడా కలిగింది. ధనుష్ నిజమేనని నిర్ధారణ చేయడంతో ఆనందంతో ఎగిరి గంతేశాను. ఆ తరువాత దర్శకుడు పా.రంజిత్‌ను కలిశాను. ఆయన చెప్పిన కథ బాగా నచ్చేసింది. కాలా చిత్రంలో నటించాలని వెంటనే నిర్ణయించుకున్నాను. ఈ చిత్రంలో కష్టమైన విషయం ఏమిటంటే నేను రజనీకాంత్‌ను తిట్టడమే. ఆ సన్నివేశంలో నటించడానికి చాలా కష్టపడ్డాను. అయితే ఆ సన్నివేశానికి మంచి పేరు వచ్చింది. రజనీకాంత్‌తో నటించడం మధురమైన అనుభవం. -
ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో వెంకీ-చైతూ
వరుసగా రెండు మల్టీస్టారర్ చిత్రాలకు సిద్ధమై టాలీవుడ్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాడు అగ్ర హీరో వెంకటేశ్ దగ్గుబాటి. అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఎఫ్ 2 చిత్రంలో వరుణ్‌తేజ్‌తో, మరోవైపు పవర్ ఫేమ్ బాబీ(కె.యస్. రవీంద్ర) డైరెక్షన్లో మేనల్లుడు నాగచైతన్యతో కలిసి మరో ప్రాజెక్టులో నటించబోతున్నాడు. చైతూ చేయబోతున్న చిత్రానికి ఆసక్తికరమైన టైటిల్‌ను మేకర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో వెంకీ, చైతూలు మామ అల్లుళ్లుగా నటిస్తుండటంతో ‘వెంకీ మామ’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారంట. పూర్తిగా విలేజ్ బ్యాక్ డ్రాప్లో ఈ చిత్రం ఉండబోతుందని, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా బాబీ రూపొందించబోతున్నాడంట. అందుకే టైటిల్ అదే అయితే బాగుంటుందన్న ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాలో వెంకీకి జోడిగా బాలీవుడ్బ్యూటీ హుమా ఖురేషీ, చైతూకు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే నెలలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. మరోవైపు వెంకీ-వరుణ్ తేజ్‌ల ఎఫ్ 2 ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. -
రామ్మా.. హ్యూమా
‘కాలా’ చిత్రాన్ని ఏ ముహూర్తాన ఒప్పుకున్నారో కానీ తమిళంలో కాలు పెట్టాక తెలుగులో కాలు పెట్టే అవకాశం వచ్చింది హ్యూమా ఖురేషీకి. మరి... రజనీకాంత్ ‘కాలా’ విడుదలయ్యాక ఈ బ్యూటీ సౌత్‌లో ఫుల్ బిజీ అవుతారేమో కాలమే చెప్పాలి. ఈ 7న విడుదల కానున్న ‘కాలా’ కోసం హ్యూమా వెయిటింగ్ అట. ప్రస్తుతం తెలుగులో ఆమెను వరించిన ఆçఫర్ విషయానికొస్తే... విక్టరీ వెంకటేశ్‌తో హ్యూమా జోడీ కట్టనున్నారని ఫిల్మ్‌నగర్‌లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. వెంకీ ‘గురు’ సినిమా విడుదలై ఏడాది దాటిపోయింది. ఏడాది గ్యాప్ తీసుకోవడం వల్లనో ఏమో ఆయన స్పీడ్ పెంచారు. ప్రస్తుతం వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వాటిలోబాబీ దర్శక త్వంలో చేయనున్న సినిమా ఒకటి. ఇందులో వెంకీ– నాగచైతన్య మామా అల్లుళ్లగా కనిపించ నున్నారు. వెంకీ సరసన బాలీవుడ్ భామ హ్యూమా ఖురేషీని నాయికగా తీసుకోవా లనుకున్నా రట. హ్యూమాతో చర్చించా రని సమాచారం. ఇది కాకుండా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఎఫ్ 2’ (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) చిత్రం చేయనున్నారు వెంకటేశ్. మల్టీస్టారర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ మరో హీరో. వెంకీకి జోడీగా తమన్నా కనిపించనున్నారు. -
వెంకీకి జోడీగా బాలీవుడ్ బ్యూటీ
గురు సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న విక్టరీ వెంకటేష్, వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 2 (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నారు వెంకీ. ఈ సినిమాలో యంగ్ హీరో వరుణ్ తేజ్‌తో కలిసి నటించనున్నారు. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమా ఈ సినిమాతో మరో క్రేజీ మల్టీస్టారర్‌కు ఓకె చెప్పారు వెంకీ. జై లవ కుశ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన బాబీ(కె.యస్. రవీంద్ర) దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. మల్టీ స్టారర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో తన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి నటిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో వెంకీ, చైతూలు మామ అల్లుళ్లుగానే నటిస్తుండటం విశేషం. ఈ సినిమాలో వెంకీకి జోడిగా బాలీవుడ్బ్యూటీ నటించనుందన్న ప్రచారం జరుగుతోంది. కాలా సినిమాలో రజనీకాంత్ ప్రేయసిగా నటించిన హుమా ఖురేషీ, వెంకీకి జోడిగా నటించనున్నారన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. -
పది కాలాల పాటు చెప్పుకునేలా..
తమిళసినిమా: దక్షిణాది ప్రేక్షకులు ఏ పాటి అభిమానం కురిపిస్తారోనన్న ఆసక్తితో ఎదురుచూస్తున్న ఉత్తరాది బ్యూటీ హ్యూమాఖురేషి. ఐశ్వర్యారాయ్, దీపికాపదుకొనే, సోనాక్షిసిన్హా వంటి బాలీవుడ్ బ్యూటీల తరువాత సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో జతకట్టే అవకాశాన్ని అందుకున్న నటి హ్యూమాఖురేషీ. రజనీకాంత్ నటించిన కాలా చిత్రంలో నటి ఈశ్వరిరావు ఆయన భార్యగా నటించగా, నటి హ్యూమాఖురేషి ఆయన ప్రియురాలిగా నటించిందని సమాచారం. హిందీ నటుడు నానాపటేకర్ ప్రతినాయకుడిగా నటించిన ఈ చిత్రానికి సంతోష్నారాయణన్ సంగీతాన్ని అందించారు. నటుడు ధనుష్ తన వండర్‌బార్ ఫిలింస్ పతాకంపై భారీ ఎత్తున నిర్మించిన కాలా చిత్రానికి పా.రంజిత్ దర్శకుడన్నది తెలిసిందే. కబాలి తరువాత వెంటనే రజనీకాంత్‌ను డైరెక్ట్ చేసిన అరుదైన దర్శకుల్లో ఆయన చేరతారు. కాలా చిత్ర విడుదలపై పలు ఊహాగానాలు ప్రచారం అయిన నేపథ్యంలో ఎట్టకేలకు అలాంటి ఊహాగానాలకు ఫుల్స్టాప్ పెట్టే విధంగా నిర్మాత ధనుష్ జూన్ 7న కాలా చిత్రం విడుదలను ఖరారు చేశారు. ఆ విధంగా తెరపైకి ఆదివారం ఒక ప్రకటనను విడుదల చేశారు. ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇందులో నటించిన హ్యూమాఖురేషీ కాలా చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు, కథానాయకుడు రజనీకాంత్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంది. ఇందులో తన 1980 కాలం నాటి రజనీకాంత్ ప్రియురాలిగా 45 ఏళ్ల ప్రౌడగా నటించినట్లు సమాచారం. హ్యూమాఖరేషి తన ట్విట్టర్లో పేర్కొంటూ కాలా చిత్రంలో నటించే అవకాశం కల్పించినందుకు, పది కాలాల పాటు గుర్తుండిపోయే మంచి పాత్రలో నటింపజేసినందుకు దర్శక నిర్మాతలకు, కథానాయకుడు రజనీకాంత్‌కు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని పేర్కొంది. ముంబయిలోని ధారవి నేపథ్యంలో సాగే కాలా చిత్రంలో రజనీకాంత్ మరోసారి దాదాగా నటించారన్నది తెలిసిన విషయమే. ఇందులో 8 పాటలు చోటుచేసుకుంటాయట. కొన్ని సన్నివేశాలను ముంబయిలోని ధారవి ప్రాంతంలో చిత్రీకరించినా, అధిక భాగాన్ని చెన్నైలోనే ధారవిసెట్ను వేసి చిత్రీకరించారు. రజనీకాంత్ తన తాజా చిత్రాన్ని యువ దర్శకుడు కార్తీక్‌సుబ్బరాజ్ దర్శకత్వంలో నటించనున్నారు. ఈ చిత్రం జూన్ రెండవ వారంలో సెట్‌పైకి వెళ్లనున్నట్లు తాజా సమాచారం. -
జరీనా ఆగయా
ప్రశాంతంగా కనిపిస్తోన్న జరీనా కళ్లలో మాత్రం ఏదో కథ ఉంది. మరి ఆమె గురించి పూర్తీగా తెలియాలంటే మాత్రం ‘కాలా’ సినిమా చూడాల్సిందే. రజనీకాంత్ హీరోగా ‘కబాలి’ ఫేమ్ పా.రంజిత్ దర్శకత్వంలో దర్శక–నటుడు, నిర్మాత ధనుష్ నిర్మించిన సినిమా ‘కాలా’. హ్యూమా ఖురేషి, అంజలిపాటిల్ కథానాయికలు. నానా పటేకర్, ఈశ్వరీ రావ్, సముద్రఖని కీలక పాత్రలు చేశారు. ఈ సినిమాలో 45ఏళ్ల జరీనా పాత్ర చేశారు హ్యూమా ఖురేషి. ఆమె లుక్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది.‘‘రజనీకాంత్‌గారి ‘కాలా’ సినిమాలో జరీనా క్యారెక్టర్ చేయడం చాలా ఆనందంగా ఉంది’’అన్నారు హ్యూమా. ‘‘జరీనా పాత్రకోసం చాలా మంది కథానాయికలను పరిశీలించాం. కానీ ‘గ్యాంగ్ ఆఫ్ వస్పేయపూర్’లో హ్యూమాను చూసినప్పుడు జరీనా క్యారెక్టర్‌కు ఆమె కరెక్ట్ అనిపించింది. రజనీ, ధనుష్‌లు కూడా హ్యూమాను ఓకే చేశారు’’ అన్నారు రంజిత్. ‘కాలా’ చిత్రం జూన్ 7న రిలీజ్ కానుంది. -
అందుకే సూపర్ స్టార్ అయ్యారు
రజనీకాంత్ హీరోగా ‘కబాలి’ ఫేమ్ పా. రంజిత్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కాలా’ వండర్‌బార్ ఫిల్మ్స్ పతాకంపై నటుడు, రజనీకాంత్ అల్లుడు ధనుష్ ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాను నిర్మించారు. హ్యూమా ఖురేషీ, అంజలీ పాటిల్ కథానాయికలు. ఈ చిత్రం టీజర్లో చూపించిన రైన్ ఫైట్ షాట్స్ గుర్తుండే ఉంటాయి. ఆ రైన్ ఫైట్ సీక్వెన్స్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలువనుందట. ఈ ఫైట్ సీన్స్ చిత్రీకరణ గురించి, రజనీకాంత్ డెడికేషన్ గురించి చిత్రబృందం చెబుతూ – ‘‘ఐదు రోజుల పాటు ఈ రైన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించాం. రజనీకాంత్ ఒక షాట్ చేసి వచ్చి అలా తడిబట్టలతోనే కూర్చుని ఏదైనా బుక్ చదువుతూ ఉండేవారు. నెక్ట్స్ షాట్ రెడీ అయ్యేవరకూ కొంచెం డ్రై అవ్వండి అని చెబితే మళ్లీ ఎలాగూ తడవాలి కదా.. ఏం ఫర్లేదు అని నవ్వేసేవారు. రజనీకాంత్‌లో ఉండే బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ప్రతీ సినిమాను తన ఫస్ట్ సినిమాలాగా ట్రీట్ చేయడమే. తన కంఫర్ట్ జోన్లో నుంచి బయటకు రావడానికి ట్రై చేస్తూ ఉంటారు. సూపర్ స్టార్ తలుచుకుంటే సీన్ తనకు తగ్గట్టుగా మార్చుకోవచ్చు. కానీ అలా ఒప్పుకోరు. సీన్ డిమాండ్‌కు తగ్గట్టుగానే రజనీకాంత్ తనని అడాప్ట్ చేసుకుంటారు. రజనీసార్ అలా ఉండటం వల్ల టీమ్‌లో ఉన్న అందరికీ బూస్ట్‌లా అనిపించింది’’ అని పేర్కొంది చిత్రబృందం. రజనీకాంత్ సూపర్‌స్టార్‌గా ఇంత స్టార్‌డమ్‌ను సంపాదించగలిగారంటే అది కేవలం నటుడిగా ఆయనకున్న డెడికేషన్ వల్లే అని అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా జూన్ 7న రిలీజ్ కానుంది. -
యమ గ్రేటు.. కాలా సేఠు
‘కాలా’ ముంబై మాఫియా డాన్. కలర్ బ్లాక్ అవ్వొచు కానీ క్యారెక్టర్ మాత్రం ఫుల్ వైట్. మరి అలాంటి డాన్ ఇంట్రో సాంగ్ అంటే ఎలా ఉండాలి? తన గొప్పతనాన్ని పొగుడుతూనే, తన గుణాన్ని వివరించాలి. ఈ స్టైలిష్ డాన్‌కు అలాంటి పాటనే కంపోజ్ చేశారు సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్. రజనీకాంత్ హీరోగా ‘కబాలి’ ఫేమ్ పా. రంజిత్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కాలా’. వండర్‌బార్ ఫిల్మ్స్ పతాకంపై ధనుష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. హ్యూమా ఖురేషీ, అంజలీ పాటిల్ కథానాయికలు. ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్‌ని మే డే సందర్భంగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ‘‘కాలా ఫస్ట్ సాంగ్ మీ అందరి కోసం. మాస్ డార్లింగ్‌తో అందరం కలిసి ర్యాప్ పాడదాం రండి’’ అని ధనుష్ పేర్కొన్నారు. ఈ పాటలోని కాలా గురించి వర్ణిస్తూ.. ‘‘యమ గ్రేటు.. కాలా సేఠు. భయము ఎరుగని వన్నె తరగని.. ఎంత ఎదిగినా ఒదిగినవాడు. మనము తలవగా మనసు పిలవగా కలత తీర్చడానికి ఇటు వచ్చినాడు చూడు. నలుపే మన శ్రమ జీవుల వర్ణం, గెలుపే కరికాలుడి సొంతం’’ అంటూ ర్యాప్‌తో సాగే ఈ పాటలోని లైన్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఈ చిత్రం జూన్ 7న రిలీజ్ కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో హీరోగా నటించనున్న నెక్ట్స్ సినిమాకు రెమ్యునరేషన్‌గా రజనీకాంత్ 65 కోట్లు తీసుకోనున్నారని సమాచారం. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తోంది. -
మేక్ వే ఫర్ ది కింగ్
ఈసారి రంజాన్‌కు వారం ముందే పండగ స్టార్ట్ కానుంది. ఎందుకంటే రజనీకాంత్ వారం ముందే థియేటర్స్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. అవును.. జూన్ 7న ‘కాలా’ రిలీజ్ కానుంది. రజనీకాంత్ హీరోగా ‘కబాలి’ ఫేమ్ పా.రంజిత్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘కాలా’. లైకా ప్రొడక్షన్స్ సమర్పణలో వండర్‌బార్ ఫిల్మ్స్ పతాకంపై రజనీకాంత్ అల్లుడు ధనుష్ నిర్మించారు. అంజలీ పాటిల్, హ్యూమా ఖురేషీ కథానాయికలు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాను తొలుత ఈ నెల 27న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ, కోలీవుడ్ ఇండస్ట్రీ స్ట్రైక్ వల్ల ‘కాలా’ రిలీజ్ పోస్ట్‌పోన్ అయ్యిందని ఊహించవచ్చు. ‘‘ప్రపంచ వ్యాప్తంగా ‘కాలా’ సినిమాను జూన్7న రీలీజ్ చేయబోతున్నామని చెప్పడానికి ఆనందంగా ఉంది. మేక్ వే ఫర్ ది కింగ్(రాజుకి దారి ఇవ్వండి)’’ అని పేర్కొన్నారు ధనుష్. నానా పటేకర్, సముద్రఖని తదితరులు నటించిన ‘కాలా’ చిత్రానికి సంతోష్ నారాయణ్ స్వరకర్త. -
సొంత కూతురిలా చూసుకున్నారు
తమిళసినిమా: నటుడు రజనీకాంత్ కూతురిలా తనను చూసుకున్నారని చెప్పింది బాలీవుడ్ భామ హూమా ఖురేషీ. దక్షిణాది చిత్రసీమలోకి అడుగు పెట్టిన ఉత్తరాది భామలు ఇక్కడ మళ్లీ మళ్లీ నటించాలని ఆశపడుతుంటారు. నటి హుమా ఖురేషీ అలాంటి కోరికనే వ్యక్తం చేస్తోంది. డిల్లీకి చెందిన ఈ బ్యూటీ ధియేటర్ ఆర్టిస్ట్‌గా పలు స్టేజీలో నటించి, ఆనక మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది. ఆ తరువాత ముంబాయికి చేరిన హుమా ఖురేషీ బుల్లితెర కార్యక్రమాలతో దర్శకుడు అనురాగ్ కశ్యప్ దృష్టిలో పడటంతో తన దశ మారిపోయింది. ఆయన దర్శకత్వంలో నటించిన గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ హింది చిత్రం మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. అలా కొన్ని హింది చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ దర్శకుడు పా. రంజిత్ కంట్లో పడింది. అంతే తంతే బూరెల బుట్టలో పడ్డట్టుగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కాలా చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. అంతే కోలీవుడ్‌లో పాపులర్ అయిపోయ్యింది. కాలా చిత్రం నిర్మాణ కార్మక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా హూమా ఖురేషీ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కాలా చిత్రంలో నటిస్తున్న సమయంలో రజనీకాంత్ నిరాడంబరతను చూసి విస్మయం చెందానంది. ఆయన ఒక కూతురిలా తనపై అభిమానం చూపించారని చెప్పింది. రజనీకాంత్ ఇంటి నుంచి ఆహారపదార్థాలను తెప్పించి తనకు విందు ఇవ్వడం ఎప్పటికీ మరచిపోననీ అంది. అలాగే తమిళ సంస్కృతి, సంప్రదాయాలు తనకు బాగా నచ్చాయని పేర్కొంది. కాలా చిత్రం తనకు కోలీవుడ్‌లో మంచి ఎంట్రీ అవుతుందనీ, ఆ చిత్రం విడుదలనంతరం మరిన్ని అవకాశాలు వస్తాయనే నమ్మకం ఉందనీ చెప్పింది. ఇప్పటికే కొన్ని చిత్రాలలో నటించే విషయమై కొందరు దర్శకులతో చర్చలు జరుగుతున్నాయనీ తెలిపింది. అదే విధంగా కాలా చిత్రం విడుదల తరువాత తాను ముంబాయి నుంచి దక్షిణాదికి మకాం మార్చనున్నాననీ హూమా ఖురేషీ చెప్పింది. -
డాన్ ఆఫ్ ది డాన్స్!
డాన్స్ చాలామంది ఉండొచ్చు. కానీ డాన్స్‌నే డామినేట్ చేసే డాన్ ‘కాలా’. రజనీకాంత్ హీరోగా ‘కబాలి’ ఫేమ్ రంజిత్. పా దర్శకత్వంలో వండర్‌బార్ పతాకంపై దర్శక–నిర్మాత–నటుడు ధనుష్ నిర్మించిన చిత్రం ‘కాలా’. ఇందులో హ్యూమా ఖురేషి, అంజలి పాటిల్, సముద్రఖని, నానా పటేకర్ కీలక పాత్రలు చేశారు. ఈ సినిమాను ఏప్రిల్ 27న రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా చిత్రబృందం ఎనౌన్స్ చేసింది. ‘బాషా’, ‘కబాలి’ సినిమాల్లో డాన్ రోల్ చేసిన రజనీ ‘కాలా’ చిత్రంలోనూ డాన్ పాత్ర చేయడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. పైగా లుక్ ఇప్పటికే బాగా ఆకట్టుకుంది. ‘కాలా’ రిలీజ్ డేట్ ప్రకటించారు కాబట్టి రజనీ ‘2.0’ ఈ సమ్మర్లో రిలీజ్ అవ్వడం లేదన్నది ఫిక్స్ అన్నమాట. ఈ ‘2.0’ చిత్రాన్ని ఆగస్ట్ 15న విడుదల చేయాలనుకున్నారు. ఈ వార్త వచ్చి రెండు రోజులైందో లేదో ఇప్పుడు వేరే డేట్ వినిపిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారట. -
డబ్బింగ్ షురూ
కాలా స్టార్ట్ చేశాడు. డబ్బింగ్ షురూ చేశాడు. ‘కబాలి’ ఫేమ్ రంజిత్. పా దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా రూపొందిన చిత్రం ‘కాలా’. హ్యూమా ఖురేషి, అంజలి పాటిల్ కథానాయికలు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ రీసెంట్గా స్టారై్టన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని తన క్యారెక్టర్‌కు డబ్బింగ్ చెప్పడానికి చెన్నైలోని ఓ ప్రముఖ స్టూడియోలోకి ఎంట్రీ ఇచ్చారు రజనీ. ‘కాలా’ చిత్రాన్ని శంకర్ దర్శకత్వంలో రజనీ హీరోగా రూపొందిన ‘2.0’ రిలీజైన రెండు నెలల తర్వాత రిలీజ్ చేయాలనుకుంటున్నారని కోలీవుడ్ టాక్. ‘2.0’ చిత్రం ఏప్రిల్‌లో రిలీజ్ కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. పొలిటికల్ ఎంట్రీపై రజనీ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సో.. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమా చేసిన తర్వాత రజనీ సినిమాలకు గుడ్‌బై చెబుతారన్న వార్తలు కోలీవుడ్‌లో ఊపందుకున్నాయి. మరోవైపు రజనీ సినిమాలను తగ్గిస్తారేమో కానీ పూర్తిగా ఫుల్స్టాప్ పెట్టరన్న వాదనలూ వినిపిస్తున్నాయి. రజనీ అధికారికంగా ప్రకటన ఇస్తే గానీ ఇలాంటి వార్తలకు ఫుల్స్టాప్ పడదని అభిమానులు అనుకుంటున్నారట. -
కాలా.. ముందుకు రాలా!
ఒక్క పక్క ఫ్యాన్స్ మీట్లో సూపర్‌స్టార్ రజనీకాంత్ బిజీగా ఉన్నారు. మరోపక్క ‘కాలా’ టీమ్ కూడా బిజీగానే ఉంది. ‘కబాలి’ ఫేమ్ రంజిత్. పా దర్వకత్వంలో రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న సినిమా ‘కాలా’. హ్యూమా ఖురేషి కథానాయిక. దర్శక–నిర్మాత, హీరో, రజనీ అల్లుడు ధనుష్ ఈ సినిమాను వండర్‌బార్ ఫిల్మ్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంతో శంకర్ దర్శకత్వంలో రజనీ హీరోగా రూపొందిన ‘2.0’ చిత్రం కంటే ముందుగా ‘కాలా’నే తెరపైకి వస్తుందనే వార్త షికారు చేస్తోంది. ఈ వార్తలను యూనిట్ సన్నిహిత వర్గాలు ఖండించాయి. ‘కాలా’ని వచ్చే ఏడాది ఆగస్ట్‌లో రిలీజ్ చేయాలనుకుంటున్నారట. లైకా ప్రొడక్షన్స్ ముందు ప్రకటించిన ప్రకారమే ‘2.0’ ఏప్రిల్‌లోనే విడుదలవుతుందట. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే... ‘2.0’ సినిమాను సౌదీ అరేబియాలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నారని కోలీవుడ్ ఖబర్. రీసెంట్గా సౌదీ ప్రభుత్వం సినిమాలపై నిషేధం ఎత్తివేసిన సంగతి తెలిసిందే. -
సూర్యుడొచ్చాడా... అయితే గుడ్‌నైట్!
సూర్యుడు ఉదయించగానే ఎవరైనా ‘గుడ్ మార్నింగ్’ చెబుతారు. కానీ, హ్యూమా ఖురేషీ మాత్రం ‘గుడ్ నైట్’ అంటున్నారు. పదీ పదిహేను రోజులుగా ఇదే వరస. మేడమ్ తేడానేమో? కొంచెం తిక్క ఉందేమో అనుకుంటున్నారా? ఆ తిక్కకో లెక్కుంది. ఇంతకీ ఆ లెక్క ఏంటంటే, దాదాపు రెండు వారాలుగా ఆమె నైట్ షూట్స్ చేస్తున్నారు. రజనీకాంత్ హీరోగా రంజిత్.పా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కాలా’. ఇందులో హ్యూమా కథానాయిక నటిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ జరుగుతోంది. నైట్ సీన్స్ తీస్తున్నారు. రాత్రంతా షూటింగ్ చేసి, ఉదయం ప్యాకప్ చెబుతున్నారు. అందుకే, నైట్ మేల్కొని, డేలో ‘గుడ్ నైట్’ చెప్పి నిద్రపోతున్నారు. ‘‘మా కెప్టెన్ భీమ్జీ (పా. రంజీత్)తో పాటు అందరం నైట్ షెడ్యూల్స్‌లో చాలా కష్టపడుతున్నాం. మిడ్నైట్ షూట్స్. ప్రతి రోజూ సూర్యోదయం తర్వాతే షూటింగ్‌కి ప్యాకప్ చెబుతున్నారు. సో.. నా స్లీప్ టైమ్ అంటే డే టైమే’’ అని హ్యూమా ఖురేషీ పేర్కొన్నారు. -
‘సినిమాలో ఆ సన్నివేశాలు చాలా స్పెషల్’
చెన్నై : సూపర్‌స్టార్ రజనీకాంత్ నుంచి నేర్చుకోవలసినవి ఎన్నో ఉన్నాయంటోంది నటి హుమా ఖురేషీ. మోడలింగ్ రంగం నుంచి బుల్లి తెరకు ఆపై వెండితెరకు పరిచయం అయిన ఈ ఢిల్లీ బ్యూటీ 2012లో ‘గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్’ చిత్రంతో కథానాయకిగా రంగప్రవేశం చేసింది. తొలి చిత్రంతోనే బాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన హుమాఖురేషీ పలు హిందీ, ఆంగ్ల పత్రికల ముఖ చిత్రాలకు గ్లామరస్‌గా ఫొటోలు దిగి మరింత పాపులర్ అయింది. గత ఐదేళ్లలోనే 20 చిత్రాల వరకూ నటించేసిన హుమా.. ఇప్పటికే దక్షిణాదిలో కూడా రౌండ్ కొట్టేస్తోంది. గత ఏడాది మలయాళంలో మమ్ముట్టితో జత కట్టిన ఈ భామ తాజాగా మన సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం కాలాలో నటించే అవకాశాన్ని కొట్టేసిన సంగతి తలిసిందే. కబాలి చిత్రం తరువాత రజనీకాంత్ మరోసారి గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఆయన అల్లుడు, నటుడు ధనుష్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. పా.రంజిత్ దర్శకత్వం వహిస్తున్న కాలా చిత్రంలో సముద్రకని, అంజిలి పాటిల్, శాయాజీ షిండే తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్న కాలా చిత్ర షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది. ఈ సందర్భంగా కాలా చిత్రంలో నటించడం గురించి హ్యూమఖరేషీ పేర్కొంటూ రజనీకాంత్ అంతటి సూపర్‌స్టార్‌తో కలిసి నటించడం సంతోషంగా ఉందని అంది. అసలు ఆయనతో నటించే అవకాశం రావడమే ఘనంగా భావిస్తున్నానీ, కాలా చిత్రంలో తాను రజనీకాంత్‌తో నటించే సన్నివేశాలు చాలా స్పెషల్‌గా ఉంటాయనీ చెప్పింది. రజనీకాంత్ నుంచి నేర్చుకోవలసినవి ఎన్నో ఉన్నాయనీ, ఈ చిత్రంలో నటించడం ద్వారా తానూ చాలా పాఠాలు నేర్చుకుంటున్నాననీ హుమా ఖురేషీ చెప్పుకొచ్చింది. -
హుమ ఖురేషీకి సూపర్ చాన్స్
నటి హుమ ఖురేషీ సూపర్ చాన్స్ కొట్టేసిందా? అవుననే అంటున్నారు కోలీవుడ్ వర్గాలు. ఢిల్లీలో పుట్టి పెరిగి చదివిన ఈ అమ్మడు ముంబైలో మోడలింగ్ చేసింది. అలా బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ దృష్టిలో పడడంతో ఈ బ్యూటీ ఫ్యూచర్ రొట్టే విరిగి నేతిలో పడ్డ చందంగా మారిపోయింది.ఆయన దర్శకత్వంలో గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ చిత్రంలో నాయకిగా మారిపోయింది. ఆ తరువాత త్రిష్ణ, బదలాపూర్, జాలీ ఎల్ఎల్బీ 2 చిత్రాలతో పాపులర్ నాయకి అయ్యింది. ఆ మధ్య మమ్ముట్టికి జంటగా వైట్ అనే చిత్రం ద్వారా మాలీవుడ్‌కు పరిచయమైన హుమ ఖురేషీ అదృష్టం తేనెతుట్టెలా పట్టిందని చెప్పవచ్చు.కారణం త్వరలో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనుంది.అదీ అలాంటి ఇలాంటి హీరోతో కాదు.స్టార్‌స్టార్ సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో రొమాన్స్ చేసే లక్కీచాన్స్‌ను దక్కించుకున్నట్లు తాజా సమాచారం. 2.ఓ చిత్రాన్ని పూర్తి చేసిన రజనీకాంత్ తాజాగా కబాలి 2కు రెడీ అవుతున్నారన్న విషయం తెలిసిందే. కబాలి చిత్రం ఫేమ్ రంజిత్‌నే ఈ చిత్రానికి దర్శకుడు.కాగా రజనీకాంత్ అల్లుడు, స్టార్ నటుడు ధనుష్ తన వండర్‌బార్ ఫిలింస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్నారాయణన్ ఇప్పటికే సంగీత బాణీలు కడుతున్నారు. చిత్రం ఈ నెల 28న ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇందులో రజనీకాంత్ సరసన నటించే హీరోయిన్ విషయంలో ఇప్పటికే నయనతార, దీపికాపదుకోనే, విద్యాబాలన్ వంటి టాప్ నటీమణుల పేర్లు ప్రచారంలో హల్చల్ చేశాయి. చివరికి ఆ అదృష్టం నటి హుమ ఖురేషీకి దక్కినట్లు తాజా సమాచారం. ఇందులో బాహుబలి 2 చిత్రానికి పని చేసిన హాలీవుడ్ సాంకేతిక వర్గంలో పీటర్ డ్రపర్ బృందం వీఎఫ్ఎక్స్ను అందించనున్నట్ల తెలిసింది.ఇప్పటికే హాజీ మస్తాన్ ఇతివృత్తంతో తెరకెక్కనున్న చిత్రంగా కలకలం పుట్టిస్తున్న ఈ చిత్రం కోసం ముంబైలోని ధారవి ప్రాంతం సెట్‌ను చెన్నైలో రూపొందించారు. అందులో చిత్ర ప్రధాన సన్నివేశాలను చిత్రీకరించడానికి కబాలి 2 చిత్ర యూనిట్ సిద్ధం అవుతునట్లు తాజా సమాచారం. -
మళ్లీ అదరగొట్టిన అక్కీ.. దుమ్మురేపుతున్న ట్రైలర్!
-
మళ్లీ అదరగొట్టిన అక్కీ.. దుమ్మురేపుతున్న ట్రైలర్!
బాలీవుడ్ సూపర్ స్టార్లలో అక్షయ్ కుమార్ స్టైలే వేరు. వీరోచితమైన యాక్షన్‌తోనే కాదు.. మంచి టైమింగ్‌తో కూడిన కామెడీతోనూ అతను ప్రేక్షకులను మెస్మరైజ్ చేయగలడు. 2016లో హ్యాట్రిక్ విజయాలతో సత్తా చాటిన ఈ సూపర్‌స్టార్ 2017లో లాయర్‌గా ప్రేక్షకులను పలుకరించబోతున్నాడు. 'జాలీ ఎల్ఎల్బీ-2'గా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా ట్రైలర్ తాజాగా ఆన్లైన్లో విడుదలైంది. ఇటు ఫర్ఫెక్ట్ కామెడీనే కాదు.. అటు ఉత్కంఠరేపే కోర్టురూమ్ సీన్లు, యాక్షన్ కలయికగా ఈ సినిమా ఉండనుందని ట్రైలర్‌ను చూస్తే తెలుస్తోంది. సూపర్‌హిట్ అయిన 'జాలీ ఎల్ఎల్బీ' సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమాలో అక్షయ్‌కుమార్‌కు జోడీగా హ్యుమా ఖురేషీ నటించింది. సుభాష్ కపూర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో లాయర్‌గా అక్షయ్ తనదైన మార్క్‌తో ట్రైలర్లో దుమ్మురేపాడు. రెండు నిమిషాల 37 సెకన్ల నిడివితో ఉన్న ఈ ట్రైలర్ అక్షయ్ అభిమానుల్ని ఉపేస్తోంది. పోస్టుచేసిన కొన్ని గంటల్లోనే ఈ ట్రైలర్‌ను మిలియన్‌కుపైగా వీక్షించారు. మీరూ ఓ లుక్ వేయండి. -
షకీలా పాత్రలో!
సిల్క్ స్మిత జీవిత చరిత్ర ఆధారంగా దాదాపు నాలుగేళ్ల క్రితం వచ్చిన ‘డర్టీ పిక్చర్’ ఓ సంచలనం. జీవిత చరిత్రలకు వెండితెర మీద మంచి మార్కెట్ ఉంటుందని నిరూపించిన చిత్రాల్లో ఇదొకటి. ఇప్పుడు మరో శృంగార తార జీవితం వెండితెర మీద సందడి చేయడానికి సిద్ధం కానుంది. ఆమె ఎవరో కాదు.. షకీలా. ఒకప్పుడు మలయాళ పరిశ్రమలో ఆమె ఓ పెను సంచలనం. షకీలా సినిమా విడుదలవుతోందంటే అప్పట్లో మమ్ముట్టి, మోహన్‌లాంటి లాంటి సూపర్‌స్టార్లే వెనక్కుతగ్గేవారట. 80, 90 దశకాల్లో శృంగార తారగా బాక్సాఫీస్‌ను ఆ స్థాయిలో శాసించారామె. షకీలా వృత్తి జీవితం మాత్రమే కాదు.. వ్యక్తిగత జీవితం కూడా సంచనలమే. ఆమె జీవితం ఆధారంగా సినిమా తీయడానికి కొంతమంది సన్నాహాలు చేసినా, కుదరలేదు. చివరకు ఇప్పుడు రంగం సిద్ధమైంది. కన్నడ దర్శకుడు ఇంద్రజిత్ ఈ చిత్రాన్ని రూపొందించనున్నారట. షకీలా పాత్రలో బాలీవుడ్ కథానాయిక హ్యూమా ఖురేషీ నటించే అవకాశం ఉందని సమాచారం. అప్పట్లో సంచ లనాలకు కేంద్రబిందువుగా ఉన్న షకీలా రియల్ లైఫ్.. రీల్‌పైకి వస్తే.. కచ్చితంగా ఆ సినిమాకి చాలా క్రేజ్ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. -
మరో హీరోయిన్‌కు బంపర్ ఆఫర్!
బాలీవుడ్ అందాల రాశులు ఇప్పుడు హాలీవుడ్లో అడుగుపెట్టేందుకు తహతహలాడుతున్నారు. ఇప్పటికే దీపికా పదుకోనే, ప్రియాంక చోప్రా హాలీవుడ్ ఆఫర్లతో తమ సత్తా చాటారు. 'ట్రిపుల్ ఎక్స్: జాండర్ కేగ్ రిటర్న్స్ ' షూటింగ్ దీపిక బిజీగా ఉండగా.. 'బేవాచ్' సెట్స్‌లో ప్రియాంక హల్చల్ చేస్తోంది. ఈ ఇద్దరు భామలు ఇలా హాలీవుడ్ కలల వెంట సాగుతుండగానే మరో బాలీవుడ్ సుందరీని బంపర్ ఆఫర్ వరించింది. హాలీవుడ్ టాప్ హీరో టామ్ క్రూయిజ్ నటిస్తున్న 'ద మమ్మీ' సినిమాకుగాను హ్యుమా ఖురేషి ఎంపికైంది. ద గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్ చిత్రంతో వెలుగులోకి వచ్చిన ఖురేషి 'మమ్మీ' సినిమా మూడోపార్టులో నటించనుంది. ఇందుకు సంబంధించిన ఆడిషన్లో ఆమె సక్సెస్ అయిందని ఆమె అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే 'ద మమ్మీ', 'ద మమ్మీ-2' చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లతో సంచలన విజయాలు సాధించాయి. ఈ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న మూడోపార్టులో టామ్ క్రూయిజ్ సరసన ఖురేషి నటించనుందని విశ్వసనీయవర్గాలు చెప్తున్నాయి. ఈ సినిమాలో హాలీవుడ్ హీరోయిన్ సోఫియా బౌటెల్లా కూడా నటించనుంది. ఖురేషి ప్రస్తుతం ఓ హిందీ సినిమాలో నటిస్తుండగా.. టామ్ 'మిషన్ ఇంపాజిబుల్' సిరీస్‌లో తదుపరి చిత్రం కోసం సిద్ధమవుతున్నాడు. -
బొద్దుగా ఉన్నా... ముద్దుగా ఉంటా!
ఇంటర్వ్యూ నాటక రంగం నుంచి సినీ రంగానికి దూసుకొచ్చింది హ్యూమా ఖురేషీ. గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్, ఏక్ థీ డాయన్, దేడ్ ఇష్కియా వంటి చిత్రాల్లో నటించి మంచి మార్కులతో పాటు అవార్డులూ కొట్టేసింది. ప్రస్తుతం అజహర్, మేడమ్ ఎక్స్, విక్టరీస్ హవుస్ తదితర చిత్రాల్లో నటిస్తోన్న ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ... తన ఇష్టాలను, అభిప్రాయాలను ఇలా పంచుకుంది! * హీరోయిన్లంతా స్లిమ్‌గా ఉండాలనుకుంటారు. కానీ మీరలా అనుకోరనిపిస్తోంది చూస్తుంటే..? బొద్దుగా ఉన్నా చూస్తున్నారుగా ప్రేక్షకులు! దాన్నిబట్టి అర్థమవుతోంది కదా, హీరోయిన్ స్లిమ్‌గానే ఉండాలన్న రూలేం లేదని! అయినా నేను బొద్దుగా ఉన్నా ముద్దుగానే ఉంటాలెండి. * మీకు నచ్చే ఫుడ్? మా అమ్మ చేసే అచారీ చికెన్ అంటే పడి చచ్చిపోతాను. కాస్త ఆయిలీగా, స్పైసీగా ఉంటుందనుకోండి... అయినా లాగించేస్తా. * మరి వండటం వచ్చా? బాగా తినేవాళ్లంతా బాగా వండేవాళ్లు అయ్యుండక్కర్లేదుగా! తినడం వచ్చినంత బాగా వండడం రాదు నాకు. * మీరు ముక్కుసూటిగా మాట్లాడతారని అందరూ అంటుంటారు..? నిజమే. అన్ని విషయాల్లోనూ క్లారిటీ ఉన్నప్పుడు మాటలు సూటిగానే వస్తాయి. తప్పు చేసినవాళ్లు, నిజాన్ని దాచిపెట్టేవాళ్లే తడబడతారు. * మీ ప్లస్సులు, మైనస్సులు? కెమెరా ముందు ఉన్నంతసేపూ నటననే శ్వాసిస్తాను. అదే నా బలం. బలహీనతల గురించి ఎక్కువ ఆలోచించను. ఆలోచించకూడదు కూడా. నేను ఇందులో వీక్ అనుకుంటే అందులో ఎప్పటికీ వీక్‌గానే ఉంటాం. అన్నీ వచ్చు, అన్నీ చేయగలను అనుకోవాలి. * ఇండస్ట్రీలో మీకు నచ్చేది, నచ్చనిది? డిఫరెంట్ పాత్రలు చేయడం ద్వారా ఒక్క జీవితాన్ని వంద రకాలుగా చూస్తాం. ఎన్నో రకాల వ్యక్తుల్ని కలుస్తాం. ఎన్నెన్నో నేర్చుకుంటాం. అది నాకు నచ్చే విషయం. కానీ ప్రైవసీ అన్నది పూర్తిగా పోతుంది. అందరి కళ్లూ మననే వెంటాడు తుంటాయి. అది కాస్త ఇబ్బందిగా ఉంటుంది. * విమర్శలను ఎలా ఎదుర్కొంటారు? విమర్శ మంచిదైతే ఆలోచిస్తాను. అర్థం లేనిదైతే లైట్ తీసుకుంటాను. * మీరు చాలా బోల్డ్‌గా నటిస్తారనే విమర్శ ఉంది. దాని గురించి...? మంచి చెప్పాలంటే కొన్నిసార్లు చెడును చూపించాల్సి ఉంటుంది. చెడు ఎలా ఉంటుందో చూపించి, ఇలా చేస్తే ఫలితాలు ఇలా ఉంటాయని తెలియజెప్పే ప్రయత్నం చేస్తుంటారు దర్శకులు. అలా చేయడం తప్పు కాదు. ఆ క్రమంలో కొన్ని సన్నివేశాల్లో బోల్డ్‌గా నటించాలి అని డెరైక్టర్ చెప్తే సరే అంటాను. చెప్పే మంచిని వదిలేసి, చెప్పిన విధానం గురించే మాట్లాడటం సద్విమర్శ కాదు. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరమూ లేదు. * ఎలాంటి విషయాలకు బాధపడతారు? మనుషులు దూరమైతే బాధగా ఉంటుంది. మొన్నామధ్య నా స్నేహితుడు యాక్సిడెంట్లో చనిపోయాడు. షూటింగ్లో బిజీగా ఉండి తన అంత్యక్రియలకు కూడా హాజరు కాలేకపోయాను. అది ఇప్పటికీ నన్ను బాధిస్తోంది. మనుషులు, బంధాల విషయంలో చాలా సెన్సిటివ్ నేను. * ఎలాంటి వాటికి కోపం వస్తుంది? అర్థం లేని కామెంట్లకి. మా నాన్న వ్యాపారి. దాంతో ఆయనే నా సినిమాలన్నిటికీ ఫైనాన్స్ చేస్తున్నారని కొందరు రాశారు. మానాన్న ఎందుకు ఫైనాన్స్ చేస్తారు? నేను ఎంతో కష్టపడి బాలీవుడ్లో ఎంటరయ్యాను. ఇంకెంతో కష్టపడి నిలదొక్కుకున్నాను. నన్ను నమ్మి దర్శకులు అవకాశాలు ఇస్తున్నారు. ఇవేమీ తెలుసుకోకుండా ఇలా రాయడం ఏమైనా బాగుందా! ఇలాంటి పిచ్చి కామెంట్లు వింటే ఒళ్లు మండుకొస్తుంది. * దేనికి భయపడతారు? బల్లి అంటే చచ్చేంత భయం. అది ఎక్కడో గోడమీద కనిపిస్తే నా గుండె ఇక్కడే ఆగిపోతుంది. ఇంక దేనికీ అంత భయపడను. * మీ గురించి ఎవరికీ తెలియని ఓ సీక్రెట్? నేను ఒంటరిగా ఉండలేను. ఒంటరిగా ఉన్నానన్న ఆలోచన నన్ను చాలా డిస్టర్బ చేస్తుంది. కానీ ఎప్పుడూ ఎవరో ఒకరు వెంట ఉండరు కదా! అందుకే లైట్లు వేసుకుని, టీవీ ఆన్ చేసి పెట్టి పడుకుంటాను. లేదంటే నిద్ర పట్టదు. -
ఆ వ్యామోహం తగ్గించుకున్నా..!
‘‘నాకు లిప్‌స్టిక్ అంటే చాలా ఇష్టం. నేను ఏ ఫంక్షన్‌కు వెళ్లినా నా పెదాలకు లిప్‌స్టిక్ మాత్రం తప్పనిసరి’’ అని బాలీవుడ్ అందాల నటి హ్యూమా ఖురేషీ తన అందం గురించి తీసుకుంటున్న జాగ్రత్తలు చెప్పారు. ఫిట్నెస్ గురించి తీసుకునే జాగ్రత్తలు గురించీ మాట్లాడారు. ‘‘వృత్తిరీత్యా మాకు మేకప్ తప్పనిసరి. ముఖం అందంగా ఉంటే సరిపోదు కదా... దానికి తగ్గట్టే శరీరాకృతి కూడా ఉండాలి. అందుకే ‘బద్లాపూర్’ సినిమాలో అంత అందంగా కనిపించానంటే నా ట్రైనర్ విలాయత్ గొప్పదనమే. నేను ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి వాటిని దూరం పెట్టాలి అనే విషయాలపై అవగాహన కల్పించారు. నాకు జంక్ ఫుడ్ అంటే ఇష్టం. కానీ ఇప్పుడిప్పుడే ఆ వ్యామోహాన్ని తగ్గించుకొని, డైట్ విషయంలో జాగ్రత్త వహిస్తున్నా’’ అని హ్యూమా చెప్పారు. -
కన్నీళ్లే దారి చూపుతాయి!
హుమా ఖురేషి, బాలీవుడ్ హీరోయిన్ 8 పాయింట్స్ భారం తల్లిదండ్రులు కనే కలలు మంచివేగానీ, వాటిని మోసే శక్తి పిల్లలకు ఉందా లేదా అనేది ముఖ్యం. నన్ను మెడిసిన్ చదివించాలనేది అమ్మ కోరిక. ఆమె కోరిక ప్రకారం కోచింగ్ కూడా తీసుకున్నాను. అలా కోచింగ్ తీసుకునే క్రమంలో శారీరకంగా, మానసికంగా అలసిపోయాను. ‘ఇక నా వల్ల కాదు’ అని చేతులెత్తేశాను. ఫలితం ప్రయత్నించడం మంచిదేగానీ, ఎంతకీ ఒక పట్టాన ఫలితం దొరకనప్పుడు ఆ ప్రయత్నాల నుంచి తప్పుకోవడం మంచిది. లేకుంటే సమయం వృథా అవుతుంది. మనసు పాడై పోతుంది. చురుకుదనం చురుకుదనం అనేది ఖాళీగా కూర్చోవడం వల్ల రాదు. ఎంత బిజీగా ఉంటే అంత చురుకుదనం వస్తుంది. కాలేజీ రోజుల్లో రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలలో, డాక్యుమెంటరీ, కాలేజీ మ్యాగజైన్ పనులలో పాల్గొనడం ద్వారా ఎప్పుడూ బిజీగా ఉండేదాన్ని. అలా చురుగ్గా ఉండేదాన్ని. గతం ఎప్పుడూ ముందు చూపే కాదు, వెనక చూపు కూడా ఉండాలి. ముందు కనిపించే విజయం మాత్రమే కాదు..మన కష్టాలు కూడా మనల్ని మరింత ముందుకు నడిపిస్తాయి. మా నాన్న ఇప్పుడు ఢిల్లీలో తొమ్మిది రెస్ట్టారెంట్లకు యజమాని. అయితే ఆయన తాను ఆర్థికంగా బలహీనంగా ఉన్న రోజుల్ని గుర్తు చేసుకోవడానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తారు. ఒకప్పుడు ఆయన చిన్న రేకుల షెడ్డులో కబాబులు అమ్మేవారు. మార్గం మనం కనే కల గట్టిదయితే, కన్నీళ్లేదారి చూపుతాయి. నేను పుట్టి పెరిగిన ఢిల్లీ నుంచి ముంబాయికి వచ్చిన కొత్తలో నా జీవితంలో ఎప్పుడూ లేని ఒంటరితనాన్ని చవి చూశాను. కొన్ని విషయాల్లో ఇబ్బందిపడ్డాను. అయితే అవేమీ శాశ్వతంగా నిలిచిపోలేదు. బాధ్యత బాధ్యతను మనుషులే కాదు పరిస్థితులు కూడా నేర్పిస్తాయి. ఢిల్లీలో ఉన్నప్పుడు డబ్బు విపరీతంగా ఖర్చు చేసే దాన్ని. ముంబాయిలో మాత్రం పరిస్థితులే పొదుపు నేర్పించాయి. డబ్బులు మిగుల్చుకోవడం కోసం బస్సులో వెళ్లకుండా నడిచి వెళ్లిన రోజులు కూడా ఉన్నాయి. పరిపూర్ణం నేను పరిపూర్ణమైన వ్యక్తిని అని చెబుతుంటారు. నేను అలా ఎప్పుడూ చెప్పను. తెలిసో తెలియకో తప్పులు చేస్తుంటాం. వాటిని దిద్దుకుంటూ పోవడమే జీవితం. ‘నాలో తప్పులు లేవు’ అనుకోవడం పెద్ద తప్పు. అతి ఆత్మవిశ్వాసం ప్రశంసల ప్రభావం కావచ్చు, అతి ఆత్మవిశ్వాసపు మోతాదు కావచ్చు ‘నేనేమీ నేర్చుకోవాల్సి అవసరం లేదు. నాకు తిరుగే లేదు’ అనే పరిస్థితి ఒకటి వస్తుంది. అలాంటి పరిస్థితికి దరి చేరకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను. ‘నేను నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది’ అనుకుంటున్నాను. -
హుమా ఖురేషీ ఔదార్యం
సినీ ప్రముఖులంతా ‘స్వచ్ఛభారత్’హోరులో చీపురుకట్టలు చేతపట్టి చెత్తే కనిపించని వీధులను తుడుస్తూ ఫొటోలకు పోజులిస్తుంటే, హుమా ఖురేషీ మాత్రం ఎలాంటి ప్రచారం లేకుండా ఢిల్లీలోని నిరుపేదల పట్ల తన ఔదార్యాన్ని చాటుకుంటోంది. ఢిల్లీలో నిలువ నీడలేని నిరుపేదలు చాలామంది అక్కడి చలి తీవ్రతకు ఏటా ప్రాణాలు కోల్పోతుంటారు. ఈ పరిస్థితిని నివారించేందుకు హుమా ఖురేషీ, ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఢిల్లీలోని పేదలకు దుప్పట్లు పంపిణీ చేస్తోందట. -
హుమా ఖురేషి క్వీన్ అవుతుందా?
బాలీవుడ్ నటి హుమా ఖురేషి క్వీన్ చిత్ర నాయకి అవుతుందా?. కోలీవుడ్‌లో తాజాగా చర్చల్లో నలుగుతున్న పేరు ఈ బ్యూటీదే. బాలీవుడ్లో సంచలన విజయం సాధించిన క్వీన్ చిత్ర దక్షిణాది రీమేక్ హక్కులను సీనియర్ నటుడు, దర్శకుడు త్యాగరాజన్ పొందిన విషయం తెలిసిందే. ఈ చిత్ర ఒరిజినల్లో నటించిన కంగణా రనౌత్ పాత్రను దక్షిణాదిలో నటించిన నటి ఎవరన్నది ఇప్పటికీ సస్పెన్స్‌గానే మారింది. ప్రముఖ నటీమణులు నయనతార, త్రిష, సమంత, కాజల్ వంటి వారి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. తాజాగా హుమా ఖురేషి పేరు వెలుగులో కొచ్చింది. ఈ బ్యూటీ ఇంతకుముందు గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ చిత్రంలో నటించింది. ఇప్పుడీ భామ దక్షిణాది క్వీన్ కాబోతోందన్న ప్రచారం జోరందుకుంది. ఈ విషయం గురించి దర్శక, నిర్మాత త్యాగరాజన్ మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. అయితే హుమా ఖురేషి క్వీన్ చిత్ర రీమేక్‌లో నటించే విషయమై తనను సంప్రదించిందని చెప్పారు. అయితే ఈ విషయం గురించి తామింకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ప్రస్తుతం తన దృష్టి అంతా ప్రశాంత్ హీరోగా నటిస్తున్న సాహసం చిత్రం పైనే ఉన్నట్లు చెప్పారు. క్వీన్ చిత్రం వచ్చే ఏడాది మార్చిలోనే సెట్‌పై వెళుతుందని త్యాగరాజన్ స్పష్టం చేశారు. -
ఫరెవర్‌మార్క్ నుంచి రెడ్ కార్పెట్ కలెక్షన్
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : డి బీర్స్‌కు చెందిన డైమండ్ బ్రాండ్ ‘ఫరెవర్‌మార్క్’ ఇక్కడి ఎంజీ రోడ్డులోని న్యూ ఆభరణ్ స్టోర్‌లో ఇంటర్నేషనల్ రెడ్ కార్పెట్ కలెక్షన్‌ను ఆవిష్కరించింది. బాలీవుడ్ నటి హుమా ఖురేషీ ఈ ఆభరణాలను ధరించి అందరి దృష్టిని ఆకర్షించింది. రానున్న పండుగ సీజన్‌ను పురస్కరించుకుని ఈ కలెక్షన్‌ను ఆవిష్కరించినట్లు ఫరెవర్‌మార్క్ ప్రకటించింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఖురేషీ...ఈ కాలం మహిళలు సంప్రదాయిక, ఆధునిక హంగుల మిశ్రమంతో కూడిన ఆభరణాలను కోరుకుంటున్నారని తెలిపారు. ఈ దిశగా ఫరెవర్‌మార్క్ స్పందిస్తోం దని తన విశ్వాసమని పేర్కొంది. వజ్రాలంటే తనకెంతో ప్రేమ అని, ఈద్ సందర్భంగా వాటిని ధరించడానికి ఇష్టపడతానని వివరించింది. -
'సన్నబడాలంటే కడుపు మాడ్చుకోను'
బాలీవుడ్ హీరోయిన్ హుమా ఖురేషీ ఈ మధ్య కాస్త సన్నబడింది. ఫెమినా కవర్ పేజీ మీద ఫొటో కోసం బాగా నాజూగ్గా తయారవుతోంది. అయితే.. దీనికోసం తాను కడుపు మాత్రం మాడ్చుకోవట్లేదని ఆమె స్పష్టంగా చెబుతోంది. ఆరోగ్యకరమైన అలవాట్ల ద్వారానే ఇవన్నీ సాధిస్తున్నట్లు తెలిపింది. గ్యాంగ్స్ ఆఫ్ వాసీపూర్ సినిమాలో ఆమె వంపుసొంపులు చాలా కొత్తగా కనిపించాయి. ఇందుకోసం తాను తిండిని మాత్రం మానుకోలేదని హుమా స్పష్టంగా చెప్పింది. తనకు ఆహారం అంటే చాలా చాలా ఇష్టమని, ప్రతి పదినిమిషాలకోసారి తన ట్రైనర్ తనకు బ్రేక్ ఇచ్చి, తనకు ఏం కావాలంటే అది తినమంటారని తెలిపింది. అయితే, ఇప్పుడు తాను జంక్ ఫుడ్ తినడం మాత్రం మానేశానని, దాదాపు ప్రతిరోజూ యోగా చేయడం, వ్యాయామాలు, కొంత వరకు పరుగు తీయడం అలవాటు చేసుకున్నానని వివరించింది. సన్నబడటం కోసం ఒకేసారి తిండి మానేయడం సరికాదని, అది చాలా అనారోగ్యకరం అవుతుందని హుమా అంటోంది. ఫెమినా కవర్ పేజీమీద కనిపించడం అంటే అమ్మాయిలందరికీ ఎంతో ఇష్టమని, అలాంటి అవకాశం తనకు ఇప్పుడు వచ్చిందని సంబరపడుతూ చెప్పింది. -
మా ఇల్లు ఒక మినీ అసెంబ్లీ!
మై ఫిలాసఫీ ‘స్ట్రగుల్ పీరియడ్’ను దాటి వచ్చాను అని చెబుతుంటారు. నిజానికి స్ట్రగుల్ అనేది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఒకటి దాటిన తరువాత ఇంకొకటి సిద్ధంగా ఉంటుంది. ఒక సవాలును అధిగమించగానే దాని గురించి మరచిపోయి కొత్త సవాలు గురించి ఆలోచిస్తుంటాను. నా వరకు, ఒక రోజు అంటే... ఒక పాఠం. అలా సంవత్సరం పొడవునా ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. చర్చ ఎప్పుడూ మంచిదే. ఒకరి నుంచి ఒకరు ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. మార్చుకోవల్సిన అభిప్రాయాలు ఉంటే మార్చుకోవచ్చు. సినిమాలకు సంబంధించి మా ఇల్లు మినీ అసెంబ్లీ. ఎన్నో సార్లు ఎన్నో సినిమాల మీద చర్చలు జరిగేవి. అలా చర్చించే క్రమంలో అభిప్రాయ వ్యక్తీకరణ బలపడేది. కొత్త విషయాలు తెలిసేవి. వాస్తవాలతో సంబంధం లేకుండా కొన్ని అభిప్రాయాలు స్థిరపడిపోతాయి. ఉదా: సన్నగా, మెరుపు తీగలా ఉన్న హీరోయిన్లే రాణిస్తారు అని. దీన్ని నేను నమ్మను. అందుకే బరువు తగ్గి బాగా సన్నబడాలి అనే ఆలోచన చేయలేదు. లావు, సన్నం అనేవి నటనకు ప్రమాణాలవుతాయని నేను అనుకోను. ఒక సినిమా బాగా ఆడుతుందా లేదా అనేది నటుల చేతిలో లేదు. కానీ, ఒక పాత్రకు న్యాయం చేయడం అనేది పూర్తిగా వారి చేతుల్లోనే ఉంటుంది. ఈ స్పృహతోనే నా పాత్రకు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాను. రేపు నాకు అంతా మంచే జరుగుతుంది...అని ఎప్పటికప్పుడు అనుకోవాలి. అప్పుడు ఎలాంటి సమస్యలూ లేకుండా సుఖంగా ఉండొచ్చు. ‘ఏదో ఒక రోజు ఊపిరిసలపనంత బిజీగా ఉంటాను’ అనుకునేదాన్ని. అది ఇవాళ నిజమైంది. మనస్ఫూర్తిగా కోరుకున్నవి ఫలిస్తాయని నా నమ్మకం. - హుమా ఖురేషి, హీరోయిన్ -
ప్లీజ్... ఆ ఒక్కటీ అడక్కండి!
దర్శక నిర్మాత అనురాగ్ కశ్యప్, కల్కి కొచ్లిన్లు విడిపోవడానికి తానే కారణమంటూ వచ్చిన వదంతులపై నటి హుమా ఖురేషి పెదవి విప్పడం లేదు. అనురాగ్ కశ్యప్, హ్యుమా ఖురేషిల మధ్య సాన్నిహిత్యం కారణంగానే కల్కి కొచ్లిన్ భర్త నుంచి విడిపోయిందంటూ బాలీవుడ్లో వదంతులు షికార్లు చేస్తున్నాయి. ‘గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్’ సినిమాలో తన నటనా కౌశలంతో విమర్శకులతోపాటు ప్రేక్షకుల ప్రశంసలందుకున్న హుమా ఖురేషి...ఈ వదంతులను కొట్టిపారేసింది. ఈ విషయమై మీడియా ప్రశ్నించగా ‘అనురాగ్‌తో నేను డేటింగ్ చేయడం లేదు. నేనేమి చెప్పదలుచుకున్నానో అది ఇప్పటికే చెప్పా. ఇంకా కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు’ అని కుండ బద్దలుకొట్టింది. ఇదిలాఉంచితే బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, సుజానే దంపతులు విడిపోయారు. వీరి వివాహబంధం తెగిపోవడానికి అర్జున్ రాంపాల్ కారణంగా కనిపిస్తోంది. అయితే సుజానేతో తనకు సంబంధం లేదని అర్జున్ ప్రకటించినప్పటికీ అనురాగ్ విషయంలో హుమా ఖురేషి తేల్చిచెప్పడం లేదు. ‘ఇతరుల జీవితాల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. అది సమంజసం కూడా కాదు. ఒకవేళ నేను మాట్లాడాలనుకుంటే ఎప్పుడో మాట్లాడేదాన్ని. నా వైఖరేమిటనేది ఎప్పుడో వెల్లడించా. ఇప్పుడిక కొత్తగా చెప్పేందుకు ఏమీ లేదు’ అని హుమా తెలిపింది. ‘నాకు వ్యతిరేకంగా మీడియాలో వస్తున్న వార్తల గురించి బాధపడను. అయితే మా కుటుంబం ప్రతిస్పందన విషయమే ఆందోళనకు గురిచేస్తోంది. నా కుటుంబీకులకుగానీ లేదా నా తమ్ముడు కుటుంబీకులపైగానీ ప్రభావం చూపుతుందేమోననేదే నా బాధంతా’ అని అంది. కాగా దేడ్ ఇష్కియా సినిమాలో సీనియర్ నటి మాధురీ దీక్షిత్‌తో పాటు హుమా ఖురేషి కనిపించనుంది. -
ఇండియా బ్రైడల్ ఫ్యాషన్ వీక్
డిజైనర్లు అషిమా, లీనా దుస్తులకు బాలీవుడ్ తార హ్యూమా ఖురేషి ఇండియా బ్రైడల్ ఫ్యాషన్ వీక్ ర్యాంప్ పై కనిపించారు. ఇదే కార్యక్రమంలో శంతను, నిఖిల్ డిజైన్ చేసిన దుస్తులతో టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆకట్టుకున్నారు. ఈ ర్యాంప్ పై ఇతర బాలీవుడ్ నటులు రితేష్, జెనిలీయా దేశ్ ముఖ్ లు మెరుపులు మెరిపించారు. ఈ కార్యక్రమం ముంబైలో డిసెంబర్ 2 తేదిన జరిగింది. Courtesy: HOTURE IMAGES -
నేనో పుస్తకాల పురుగును : హుమా ఖురేషీ
న్యూఢిల్లీ: చలువ కళ్లద్దాలు పెట్టుకొని మోడ్రన్ మోడల్‌గా కనిపిస్తున్న ఈ అమ్మడు ఒకప్పుడు పుస్తకాల పురుగట. ఈమెకు అందంపై అసలు ఆసక్తే ఉండేది కాదట. పాఠశాల రోజుల్లోనేకాదు కళాశాలకు వెళ్లిన రోజుల్లో కూడా ఈమె సాదాసీదాగానే వెళ్లేదట. మరి ఇంతలో అంత మార్పు ఎలా వచ్చిందబ్బా... అనే ప్రశ్నను హుమా ఖురేషీని అడిగితే ఇలా చెప్పింది.... ‘మీరు విన్నది నిజమే. చిన్నప్పటి నుంచి నేనో పుస్తకాల పురుగును. పుస్తకాలంటే నాకెంతో ఇష్టం. ఆ ఇష్టమే నన్ను క్లాస్ ఫస్ట్‌గా నిలబెట్టేది. అయితే మారుతున్న రోజులకు అనుగుణంగా డ్రెస్‌లు వేసుకోవడం, అందంగా ముస్తాబు కావడంపై నాకు పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. ఇప్పుడిలా కనిపిస్తున్నా కళాశాలకు వెళ్లేదాకా మా నాన్న దుస్తులనే వేసుకునేదానిని. ఇప్పటికీ నా దగ్గర డ్రెస్సుల కంటే పుస్తకాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రముఖులు రాసే స్వీయచరిత్రలు చదివేందుకు ఎక్కువగా ఇష్టపడేదానిని. జీవిత కథలన్నా ఇష్టమే. అవే నాలో చాలా మార్పు తీసుకొచ్చాయి. కీడాకారులైనా, కళాకారులైనా, వ్యాపారవేత్తలైనా కొనసాగుతున్న రంగంలో రాణించాలంటే ఆ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించినవారి జీవిత చరిత్రలను తప్పక చదవాలి. అందులో ఏదో ఓ పుస్తకంలో మనల్ని ఉత్తేజితుల్ని చేసే, మనలో స్ఫూర్తి నింపే అంశాలు తప్పకుండా ఉంటాయి. ఉన్నత శిఖరాలను అధిరోహించినవారి జీవిత చరిత్రలు చదివితే దాదాపు అందరి జీవితాల్లో చోటుచేసుకున్న సంఘటనలు ఒకేలా ఉంటాయి. చిన్నప్పుడు పడిన కష్టాలే వారిని రాటుదేలుస్తాయి. అయితే నాలో ఈ మార్పు రావడానికి కారణం పుస్తకాలే. ఇక గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్ చిత్రం తర్వాత నాలో మరింత మార్పొచ్చింది. ప్రస్తుతం విశాల్ భరద్వాజ్ చిత్రం ‘దేఢ్ ఇష్కియా’ చిత్రంలో నటిస్తున్నాన’ని చెప్పింది.