ఓటీటీకి వచ్చేస్తోన్న మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | Huma Qureshi Maharani Season 3 Web Series Ready To Release On This OTT Platform- Sakshi
Sakshi News home page

Huma Qureshi: ఓటీటీకి వచ్చేస్తోన్న పొలిటికల్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Mar 5 2024 3:44 PM | Updated on Mar 5 2024 3:51 PM

Bollywood Actress Huma Qureshi Latest Web series Ready To Release On this Ott - Sakshi

సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడంతా ఓటీటీల హవా నడుస్తోంది. దీంతో వెబ్ సిరీస్‌ కంటెంట్‌పై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. భాషతో సంబంధం లేకుండా సినిమాలు, వెబ్ సిరీసులు తెగ చూసేస్తున్నారు. దీంతో సరికొత్త కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. 

తాజాగా మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌ ఓటీటీకి వచ్చేందుకు రెడీ అయిపోయింది. హుమా ఖురేషి ప్రధాన పాత్రలో తెరకెక్కించిన పొలిటికల్ సిరీస్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  కాకపోతే అది టాలీవుడ్‌కు సంబంధించినది మాత్రం కాదు.  మొదటి, రెండు సీజన్స్‌ సూపర్‌ హిట్‌గా మహారాణి సీజన్‌-3 స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఈనెల 7వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ట్రైలర్‌ రిలీజ్‌ చేయగా ఆడియన్స్‌ నుంచి విశేషమైన స్పందన లభించింది. 

ఈ సిరీస్‌లో బీహార్‌లో హానికరమైన మద్యం వ్యాపారం గురించి చూపించనున్నారు. ఈ సిరీస్‌ను సుభాష్ కపూర్ కథను అందించగా.. కరణ్ శర్మ దర్శకత్వం వహించారు. రాజకీయాలు నేపథ్యంగా కల్పిత కథ ఆధారంగా ఈ సిరీస్‌ను రూపొందించారు. కాంగ్రా టాకీస్ పతాకంపై డింపుల్ ఖర్బందా, నరేన్ కుమార్ ఈ వెబ్ సిరీస్‌ను నిర్మించారు. కాకపోతే ఈ సిరీస్‌ కేవలం హిందీ భాషలోనే స్ట్రీమింగ్ కానుంది. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement