సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన తాజా వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్. ఈ చిత్రంలో మొత్తం ఆరుగురు హీరోయిన్లు నటించారు. బాలీవుడ్ భామ రిచ్చా చద్దా ఈ సిరీస్‌లో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో విశేష ఆదరణ దక్కించుకుంటోంది. మే 1వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రిచా సహానటులపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ముఖ్యంగా నటీమణులు, మహిళా నిర్మాతలతో పనిచేయడం గురించి మాట్లాడింది. తనతో పోటీపడేందుకు ప్రయత్నిస్తున్న వారితో కలిసి పనిచేసినట్లు వెల్లడించింది. ఎలాంటి సూచనలు ఇవ్వకుండా తన ఎదుగుదలను అడ్డుకునే వారితో కలిసి నటించడం చాలా కష్టంగా అనిపించిందని తెలిపింది.
రిచా చద్దా మాట్లాడుతూ.. 'ఇండస్ట్రీలో చాలామంది స్త్రీవాదులనే ఆలోచనను నేను అంగీకరించను. చెక్కులు బౌన్స్ అయిన మహిళా నిర్మాతలతో కూడా పనిచేశా. అంతే కాదు వారితో కొన్ని భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా. అలాంటి వారు కేవలం ట్విట్టర్‌లో మాత్రమే స్త్రీవాదులుగా చలామణి అవుతుంటారు. సినిమా సెట్‌లో నటీనటుల మధ్య సోదరి భావం ఎప్పుడూ ఉండదు. తనకు ఎలాంటి సరైన సూచనలు ఇవ్వకుండా.. సన్నివేశాలలో లైట్స్ ఆఫ్ చేసే సహనటులు ఇప్పటికీ నాతో నిరంతరం పోటీ పడుతున్నారు. స్త్రీవాదమనేది జెండర్‌కు సంబంధించినది కాదు. పురుషుల్లోనూ బలమైన స్త్రీవాదులు ఉన్నారని తెలుసు' అని అన్నారు. పురుషులు కూడా స్త్రీవాదులు కావచ్చు.. అలాగే స్త్రీలు కూడా పురుషవాదులు కావచ్చని పేర్కొంది. కాగా.. రిచా చద్దా ప్రస్తుతం సంజయ్ లీలా బన్సాలీ'హీరామండిలో తన నటనకు ప్రశంసలు అందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment