feminism
-
ఆయన్ని ఎప్పటికీ ఆ పని చేయనివ్వను..!
షబానా అజ్మీ జగద్విఖ్యాత ఫెమినిస్ట్. 74 ఏళ్ల ఈ వయసులోనూ ఆమె నవ్వులో హుషారు ఉంటుంది. ఆమె మంచి నటి, చురుకైన సోషల్ యాక్టివిస్ట్ కూడా అయినప్పటికీ.. పెద్ద పెద్ద ఇంటర్వ్యూ లలో ఆమెను ఫెమినిజం గురించే ఎక్కువగా ప్రశ్నలు అడుగుతుంటారు. బయట ఆమెకు తారసపడే యువతులు కూడా... ‘మేడమ్.. ఫెమినిజం అంటే మీ ఉద్దేశంలో ఏమిటి?‘ అని ప్రాథమిక స్థాయి ప్రశ్న వేస్తుంటారు. ఆ ప్రశ్నకు షబానా నవ్వేస్తుంటారు. ‘ఈ అమ్మాయిలున్నారే.. తాము ఫెమినిస్ట్లము కాదు అని గర్వంగా చెప్పుకుంటారు, మళ్లీ ‘బ్రా – బర్నింగ్‘ మూవ్ మెంట్ గురించి గొప్పగా మాట్లాడుతుంటారు’ అంటారు షబానా. (పితృస్వామ్య వ్యవస్థను నిరసిస్తూ, అందుకు సంకేతంగా 60 లలో ఆనాటి మహిళా యాక్టివిస్టులు బ్రా లను మంటల్లో వేసి తగలబెట్టిన మూవ్‌మెంటే ‘బ్రా బర్నింగ్‘ ఉద్యమం). ఫాయే డి సౌజా యూట్యూబ్ ఛానల్ కు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫెమినిజానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు షబానా. ఓసారి ఆమె అమెరికాలో ఉన్నప్పుడు జావేద్ (అఖ్తర్) కుర్తాను ఇస్త్రీ చేస్తూ ఉండగా చూసిన ఒక తెలిసినావిడ.. ‘మిమ్మల్ని ఫెమినిస్ట్ అంటారు. మీరేమో మీ భర్త దుస్తుల్ని ఇస్త్రీ చేస్తున్నారు?!‘ అని అన్నారు. షబానా నవ్వుతూ, ‘దీనికి దానికీ సంబంధం ఏమిటి?!‘ అని అడిగారు. అందుకు ఆవిడ... ‘మరైతే మీ వారు మీ శారీని ఇస్త్రీ చేస్తారా?!‘ అన్నారు.‘లేదు. నేను ఎప్పటికీ ఆయన్ని ఆ పని చేయనివ్వను‘ అన్నారు షబానా. డిసౌజాకు ఈ సంగతి చెప్పినప్పుడు... డిసౌజా కూడా షబానాను ఇదే ప్రశ్న అడిగారు. ‘మరి మీ ఉద్దేశంలో ఫెమినిజం అంటే ఏమిటి?! అని. ప్రపంచాన్ని మనం చూసే దృష్టిలో ఉండేదే ఫెమినిజం. స్త్రీ పురుషులు వేర్వేరు. అంతే తప్ప ఎక్కువా కాదు, తక్కువా కాదు. ‘ప్రపంచం అనాదిగా ప్రతి సమస్యకూ పురుషుడి దృష్టి కోణం నుంచే పరిష్కారం వెతుకుతూ వస్తోంది. పరిష్కారం కోసం స్త్రీ వైపు నుంచి కూడా ఆలోచించటమే ఫెమినిజం’ అని చెప్పారు షబానా. ఇంతకుమించిన నిర్వచనం ఉంటుందా స్త్రీవాదానికి? ఎంతైనా షబానా కదా! -
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన తాజా వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్. ఈ చిత్రంలో మొత్తం ఆరుగురు హీరోయిన్లు నటించారు. బాలీవుడ్ భామ రిచ్చా చద్దా ఈ సిరీస్‌లో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో విశేష ఆదరణ దక్కించుకుంటోంది. మే 1వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రిచా సహానటులపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ముఖ్యంగా నటీమణులు, మహిళా నిర్మాతలతో పనిచేయడం గురించి మాట్లాడింది. తనతో పోటీపడేందుకు ప్రయత్నిస్తున్న వారితో కలిసి పనిచేసినట్లు వెల్లడించింది. ఎలాంటి సూచనలు ఇవ్వకుండా తన ఎదుగుదలను అడ్డుకునే వారితో కలిసి నటించడం చాలా కష్టంగా అనిపించిందని తెలిపింది.రిచా చద్దా మాట్లాడుతూ.. 'ఇండస్ట్రీలో చాలామంది స్త్రీవాదులనే ఆలోచనను నేను అంగీకరించను. చెక్కులు బౌన్స్ అయిన మహిళా నిర్మాతలతో కూడా పనిచేశా. అంతే కాదు వారితో కొన్ని భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా. అలాంటి వారు కేవలం ట్విట్టర్లో మాత్రమే స్త్రీవాదులుగా చలామణి అవుతుంటారు. సినిమా సెట్లో నటీనటుల మధ్య సోదరి భావం ఎప్పుడూ ఉండదు. తనకు ఎలాంటి సరైన సూచనలు ఇవ్వకుండా.. సన్నివేశాలలో లైట్స్ ఆఫ్ చేసే సహనటులు ఇప్పటికీ నాతో నిరంతరం పోటీ పడుతున్నారు. స్త్రీవాదమనేది జెండర్‌కు సంబంధించినది కాదు. పురుషుల్లోనూ బలమైన స్త్రీవాదులు ఉన్నారని తెలుసు' అని అన్నారు. పురుషులు కూడా స్త్రీవాదులు కావచ్చు.. అలాగే స్త్రీలు కూడా పురుషవాదులు కావచ్చని పేర్కొంది. కాగా.. రిచా చద్దా ప్రస్తుతం సంజయ్ లీలా బన్సాలీ'హీరామండిలో తన నటనకు ప్రశంసలు అందుకుంది. -
స్త్రీవాదమే సమాజాన్ని నాశనం చేసింది: నటి కామెంట్స్ వైరల్
బాలీవుడ్ భామ నోరా ఫతేహీ ఇటీవల మడ్గావ్ ఎక్స్‌ప్రెస్ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. బాలీవుడ్ పలు చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్‌లో మెరిసిన ముద్దుగుమ్మ ఇటీవల బాలీవుడ్ జంటలపై సంచలన కామెంట్స్ చేసింది. వారంతా కేవలం డబ్బు, పేరు కోసమే పెళ్లిళ్లు చేసుకుంటున్నారని విమర్శించింది. తనకు అలాంటి ఉద్దేశం లేదని.. అందుకే ఎవరితోను డేటింగ్లో చేయడం లేదని చెప్పుకొచ్చింది. తాజాగా ఈ బాలీవుడ్ భామ మరోసారి సంచలన కామెంట్స్ చేసింది. ఓ పాడ్‌కాస్ట్‌లో నోరా మాట్లాడుతూ ఫెమినిజంపై విమర్శలు గుప్పించింది. స్త్రీవాదం అనేది సమాజాన్ని పూర్తిగా నాశనం చేసిందని ఆరోపించింది. అది కేవలం మహిళలనే కాకుండా పురుషులను కూడా బ్రెయిన్‌వాష్ చేసిందంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఫెమినిజంపై నోరా మాట్లాడుతూ..'ఇలాంటి ఆలోచన ఎవరికీ అవసరం లేదు. స్త్రీవాదమనే ఈ విషయాన్ని నేను అస్సలు నమ్మను. నిజంగా స్త్రీవాదమే మన సమాజాన్ని పూర్తిగా నాశనం చేసింది. మహిళలు పెళ్లి చేసుకోకూడదు. పిల్లలను కనకూడదనే ధోరణిని తాను విశ్వసించను. ఇది పూర్తిగా స్వతంత్రంగా ఉండాలి. ఇక్కడ పురుషులు డబ్బు, ఫుడ్ కోసం పనిచేస్తుంటే.. ఒక స్త్రీ పిల్లలు, ఇల్లు చూసుకోవడం, వంట చేయడం లాంటివి చేస్తున్నారు. మహిళలు బయటకు వెళ్లి పని చేయాలి.. వారు సొంతంగా జీవించాలని కోరుకుంటున్నారు.. కానీ అది కొంత వరకేనని' చెప్పుకొచ్చింది. ప్రస్తుత సమాజంలో చాలా మంది పురుషుల ధోరణి మారింది. ఇప్పుడు చాలా మంది ఫెమినిజం ద్వారా బ్రెయిన్‌వాష్‌కు గురయ్యారంటూ నోరా తెలిపింది. మనమందరం సెంటిమెంట్స్‌లో సమానమే కానీ.. సామాజికపరంగా సమానం కాదని నోరా పేర్కొంది. స్త్రీవాదం అంతర్లీనంగా, ప్రాథమిక స్థాయిలో గొప్పదే.. నేను కూడా మహిళల హక్కుల కోసం వాదిస్తానని.. బాలికలు పాఠశాలకు వెళ్లాలని కోరుకుంటానని తెలిపింది. అయితే, స్త్రీవాదం రాడికల్‌గా మారినప్పుడే సమాజానికి ప్రమాదకరంగా మారుతుందని వెల్లడించింది. అయితే ఫెమినిజం పునాదులు గట్టిగానే ఉన్నప్పటికీ .. గత 20 ఏళ్లలో పోలిస్తే చాలా ప్రమాదకరంగా మారిందని అన్నారు. అయితే నోరా ఫతేహీ చేసిన కామెంట్స్‌పై నెటిజన్స్ మండిపడుతున్నారు. మీ మాటలు చాలా కామెడీగా ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. స్త్రీవాదం లేకపోతే ఇండియాలో నీకు పని చేసే అవకాశం లభించేది కాదని అంటున్నారు. అలా అయితే మీరు వెంటనే పని మానేసి పెళ్లి చేసుకోండి.. అలాగే మీరు ఐటెం సాంగ్స్‌లో డ్యాన్స్ చేయకుండా భర్తపైనే ఆధారపడి జీవించండి అంటూ ఓ నెటిజన్ చురకలంటించారు. అసలు మహిళలు కేవలం సంరక్షకులుగా ఉండాలని.. పురుషులే పోషించాలని.. స్త్రీవాదం సమాజాన్ని నాశనం చేసిందని నోరా ఫతేహి ఎలా మాట్లాడాతారంటూ ఓ నెటిజన్ ప్రశ్నించింది. ప్రస్తుతం నోరా చేసిన కామెంట్స్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
సిస్టర్హుడ్ మీద అవగాహన కల్పించేందుకు..
అత్తాకోడళ్లకు పడదు. వదినామరదళ్లూ ఎడమొహం పెడమొహమే. తోడికోడళ్లదీ స్నేహమూ రంగేసుకున్న వైరమే. ఇరుగుపొరుగు ఆడవాళ్ల మధ్యా అసూయను పెంచే పోటీయే. ఆఫీసుల్లోనూ నటనా చెలిమిలే. అదేమంటే స్త్రీకి స్త్రీయే శత్రువు.. అనే నానుడి వినిపిస్తారు. టాక్సిక్ ఫెమినినిటీ అనే పేరూ ఖాయం చేసేస్తారు. ఎవరు? పురుషులు. ఎందుకు? మగవాళ్ల ఆలోచనల్లోని టాక్సిన్స్‌ను బయటపెట్టినందుకు.. టాక్సిక్ మాస్క్యులినిటి అంటూ వేదనచెందినందుకు. నిజానికి స్త్రీని స్త్రీకి శత్రువుగా చేసిందే మాస్క్యులినిటీలోని ఆ టాక్సిన్సే. కొత్తగా వచ్చిన కోడలిని చూపిస్తూ అత్తకు అభద్రత సృష్టించడం, వదినకు వచ్చిన అధికారంతో మరదలిలో అటెన్షన్ సీకింగ్ను ప్రేరేపించడం, భర్త సంపాదన, పుట్టింటి కట్నకానుకలతో తోడికోడళ్ల మధ్య విభేదాలను పుట్టించడం, పొరిగింటి పుల్లకూరకు చవులూరిస్తూ ఇల్లాలిని పోటీకి రెచ్చగొట్టడం, ఉద్యోగినుల మధ్య పక్షపాతాన్ని అవలంభిస్తూ విరోధాన్ని నాటడం.. ఇవన్నీ పురుషాధిపత్య ప్రణాళికలే. ఆ మెదడు స్థిరం చేసిన అభిప్రాయాలే. ఈ నిజం గ్రహింపులోకి వచ్చింది. స్త్రీ, పురుష సమానత్వాన్ని కాంక్షించే వారు ముందు స్త్రీలలో ఐక్యత రావాలని కోరుకున్నారు. అందుకే ‘సిస్టర్హుడ్’ కామనకు ఉనికి కల్పించారు. కార్యాచరణతో సుస్థిరం చేసే ప్రయత్నంలో పడ్డారు. దాన్నీ పురుషాధిపత్యం అడ్డుకోకుండా ఉండడానికి ఓ ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ కదలికలో సినిమా, సాహిత్యాలూ పాలుపంచుకుంటున్నాయి. కలం, కెమెరాలు సిస్టర్‌హుడ్‌ను ప్రమోట్ చేస్తున్నాయి. ఇది కథ కాదు... అంటూ జీవితంలో అత్తాకోడళ్లు ఇలా ఉంటే బాగుంటుంది అని చూపించాడు దర్శకుడు కె.బాలచందర్ 1970ల్లోనే. శాడిస్ట్ భర్తతో వేగుతున్న భార్యకు అండగా నిలుస్తుంది అత్త. మనిషితనం లేని ఆ కొడుకు నుంచి కోడలిని విముక్తి చేయాలనుకుంటుంది. ముళ్ల బంధనంగా ఉన్న ఆ పెళ్లి బంధనాన్ని తెంచుకోమని.. కొత్త జీవితం ప్రారంభించమని చెప్తుంది. స్త్రీ మనసు స్త్రీకి కాక ఇంకెవరికి తెలుస్తుంది అనిపిస్తుంది ‘ఇది కథ కాదు’ చూస్తే! న్యాయం కావాలి.. అంటూ కోర్టుకు వెళ్లిన వనితకు న్యాయ పోరాటంలో సహాయం చేసింది ఇంకో మహిళే. 1981లో వచ్చిన ఈ సినిమాలో పెళ్లి చేసుకుంటానని మోసం చేస్తాడు ఓ పురుషాంహకారి. పెళ్లి కాకుండానే గర్భవతి అయిన ఆ బిడ్డను పరువు కోసం బయటకు పంపిస్తారు తల్లిదండ్రులు. అప్పుడు అక్కున చేర్చుకుంటుంది ఓ లాయర్. ఆమె తరపున కోర్టులో వాదిస్తుంది. ఆడవాళ్లకున్న ఆడవాళ్ల మద్దతును గెలిపిస్తుంది. దృష్టి.. సారించింది హిందీ సినిమా కూడా 1990ల్లో. భర్త వివాహేతర సంబంధంతో ఇంకో మహిళ తమ సంసారాన్ని విచ్ఛిన్నం చేస్తే ఆ రెండో మహిళను శాపనార్థాలు పెట్టదు ఇంటి ఇల్లాలు. భర్త వ్యక్తిత్వాన్ని తప్పు పడుతుంది. తన జీవితంలోంచి ఆ బలహీనుడు తప్పుకున్నా తను బలంగానే నిలబడుతుంది. సాటి స్త్రీ పట్ల సానుభూతే ప్రదర్శిస్తుంది. సెక్షన్ 375.. 2019లో వచ్చిన హిందీ సినిమా. చలనచిత్ర పరిశ్రమలోని కాస్టింగ్ కౌచ్ మీద ఎక్కుపెట్టిన బాణం. ఇందులోనూ బాధితురాలికి చేయూతనిచ్చిన న్యాయవాది మహిళే. ఒకరకంగా ఇది పరస్పర అంగీకార ఇచ్ఛ, రేప్‌కి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని, ఏది రేప్ అన్న నిర్ధారణను చర్చకు పెట్టిన సినిమా. మహిళల గౌరవమర్యాదలకు భంగం వాటిల్లే పరిస్థితులను మహిళలంతా ఏకమై ఎదుర్కోవాలని సూచించిన సినిమా. ఈ నాలుగు నమూనాలు మాత్రమే. ఇలాంటి ఇంకెన్నో దృశ్యాలు థియేటర్లో విడుదలయ్యాయి.. సిస్టర్హుడ్ మీద అవగాహన కల్పించేందుకు. ఓల్గా నుంచి తోట అపర్ణ దాకా చైతన్యవంతులైన రచయిత్రులెందరో సిస్టర్హుడ్ ఇతివృత్తంగా కథలు, నవలలు రాశారు.. రాస్తున్నారు. ఇందులో సోషల్ మీడియా పాత్రా ప్రధానమైనదే. 1967, అమెరికాలో సివిల్‌రైట్స్ మూవ్మెంట్స్ సమయంలో వైట్ ఫెమినిస్ట్‌లు తమకున్న ప్రత్యేక హక్కులకు అతీతంగా బాధితుల పక్షాన నిలబడాలని బ్లాక్ ఫెమినిస్ట్‌లు డిమాండ్ చేసినప్పుడు ఈ ‘సిస్టర్ హుడ్’ అనే పదం ప్రచారంలోకి వచ్చింది. ఆ స్ఫూర్తి ఇప్పటి సామాజిక మాధ్యమాల్లోనూ కనపడుతోంది. పాశ్యాత్య దేశాల్లోని స్త్రీవాదంలో రంగు విభజనరేఖను గీస్తే మన దగ్గర కులం, మతం ఆ వ్యత్యాసానికి కాపలాకాస్తున్నాయి. ఆ కంచెను తొలగించడంలో సోషల్ మీడియా చాలా చురుగ్గా పనిచేస్తోంది. హథ్రాస్ సంఘటనే తాజా ఉదాహరణ. కుల,మతాలకతీతంగా మహిళలు బాధితురాలి కుటుంబానికి అండగా నిలబడ్డారు. అగ్రకుల, పురుషాహంకారాన్ని నిరసించారు. సిస్టర్‌హుడ్‌ను చాటారు. సిస్టర్హుడ్ అంటే మహిళలందరూ ఒకేరకమైన ఆలోచనలు, విశ్వాసాలతో ఉండడం కాదు, పురుషాధిపత్యభావజాలంతో సమస్యలెదుర్కొంటున్న స్త్రీలకు మద్దతుగా నిలబడ్డమే. వాళ్లు ఏ విశ్వాసాలను అవలంబిస్తున్నా.. ఏ సామాజిక వర్గంలో ఉన్నా సరే. ఏ లేబుల్ వేయకుండా ఆ భిన్నత్వాన్ని గౌరవిస్తూ ఆలంబనగా ఉండడమే. -శరాది -
వాళ్లందరి కోసం.. అద్భుతమైన ఆలోచన!
గట్టిగా మాట్లాడినా.. అభిప్రాయాలను కచ్చితంగా చెప్పినా.. ఫొటోలు అప్లోడ్ చేసినా... ఆఖరికి తమకు జరిగిన అన్యాయంపై నిర్భయంగా నోరు విప్పినా.. ఏదో నేరం చేసిన వాళ్లలాగా మహిళలను చిత్రీకరించడం ఇటీవలి కాలంలో పరిపాటిగా మారింది. ముఖ్యంగా సోషల్ మీడియా విస్త్రృతి పెరిగిన తర్వాత స్త్రీవాదులు మొదలు సామాన్య మహిళల వరకు ప్రతీ ఒక్కరూ ట్రోలింగ్ బారిన పడుతున్నారు. దక్షిణాదిన మీటూ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలిస్తే ఈ విషయం సుస్పష్టమవుతుంది. రాయడానికి కూడా వీల్లేని అసభ్య, పరుష పదజాలంతో ఆమెను దూషించిన ఎందరెందరో మగానుభావుల సంస్కారం సదరు కామెంట్లలో ప్రస్ఫుటిస్తుంది. గౌరవప్రదమైన హోదాలో ఉండి, పెద్దమనిషిగా చలామణీ అవుతున్న వైరముత్తు లాంటి ఎంతో మంది వ్యక్తులపై వచ్చిన ఆరోపణల గురించి కనీసం ఆలోచించకపోగా... పైగా వారు ఏం చేసినా సరైందే అన్న రీతిలో ఉండే ట్వీట్లు పితృస్వామ్య భావజాలానికి అద్దం పడతాయి. ఇటువంటి చేదు అనుభవాలు ఎదుర్కొన్న చిన్మయిలు ఎందరో. అటువంటి వారికోసం నుపుర్ తివారీ అనే జర్నలిస్టు తన బృందంతో కలిసి ప్రత్యేకంగా ఓ యాప్‌ను ప్రవేశపెట్టారు. పితృస్వామ్య వ్యవస్థలో మహిళలకు జరుగుతున్న అన్యాయాల గురించి చర్చించేందుకు, బాధితుల సమస్యల తీర్చేందుకు వీలుగా స్మాష్‌బోర్డు పేరిట యాప్‌ను తీసుకువచ్చారు. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్త్రీవాదులందరినీ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ యాప్‌ను ఢిల్లీలోని మిరాండా కాలేజీలో శనివారం ఆవిష్కరించారు. కేవలం హ్యాష్‌ట్యాగ్ మూమెంట్లకే పరిమితం కాకుండా.. డిజిటల్ వీధుల్లో చేదు అనుభవాల బారిన పడుతున్న వారికి మద్దతు లభించేలా చేయడం, వారి గోప్యతకు భంగం కలగకుండా చూసుకోవడమే ఈ సోషల్ నెట్వర్క్ ప్రధాన లక్ష్యం. అదే విధంగా బాధితుల గోడు వెళ్లబోసుకునేందుకు.. వారి సమస్యలను పరిష్కరించుకునేందుకు.. ఈ యాప్ తోడ్పాడునందిస్తుంది. లింగవివక్షకు వ్యతిరేకంగా పోరాడే మహిళలు, పురుషులు, థర్‌్డ జెండర్(ట్రాన్స్ మెన్ లేదా ట్రాన్స్ ఉమన్) ఇలా ప్రతీ ఒక్కరు ఇందులో భాగస్వామ్యులు కావొచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలలో ఈ యాప్ అందుబాటులో ఉంది. అందుకే స్మాష్‌బోర్డు.. స్మాష్‌బోర్డు యాప్ గురించి నుపుర్ తివారీ మాట్లాడుతూ... ‘ బాధితులు, వారి కుటుంబ సభ్యులు తమకు జరిగిన అన్యాయం గురించి ధైర్యంగా నోరు విప్పేలా చేయాలనే ఆలోచనే స్మాష్‌బోర్డు రూపకల్పనకు కారణం. న్యాయవాదులు, జర్నలిస్టులు, సైకాలజిస్టులు వంటి వివిధ రంగాల నిపుణులు దీనితో ఎంతో అనుసంధానమై ఉంటారు. కాబట్టి బాధితులు తమ సమస్యలు, మానసిక స్థితి గురించి వీరికి చెప్పుకోవచ్చు. కేవలం బాధితుల కోసమే కాకుండా పితృస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఎంతో మందిని ఏకతాటిపైకి తెచ్చే ఉద్దేశంతోనే ఈ యాప్ ప్రారంభించాం. తద్వారా వారి ఆలోచనలు సారూప్య భావజాలం కలిగిన వ్యక్తులతో పంచుకునే వీలు కలుగుతుంది’ అని పేర్కొన్నారు. త్వరలోనే ఈ యాప్‌ను ప్రాంతీయ భాషల్లో తీసుకువచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. అద్భుతమైన ఆలోచన ఇది.. ది వెజీనా మోనాలోగ్స్ ఫేం ఈవ్ ఎన్స్లర్(స్త్రీలపై లైంగిక దాడులకు వ్యతిరేకంగా గళమెత్తిన కార్యకర్త) ఈ యాప్ గురించి మాట్లాడుతూ.. అద్భుతమైన ఆలోచన అని కొనియాడారు. మహిళలు నిర్భయంగా తమ గాథలను, అనుభవాలను చెప్పుకొనేందుకు గొప్ప వేదిక స్మాష్‌బోర్డు అని పేర్కొన్నారు. ఈ సోషల్ నెట్‌వర్క్‌లో అందరూ స్త్రీవాదులే ఉన్న కారణంగా బాధితులు తమ సమస్యలను మరింత ధైర్యంగా ఇతరులతో పంచుకోగలుగుతారన్నారు. లింగవివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్న వర్గానికి ఇది ఒక ప్రత్యామ్నాయ వేదికగా ఉపయోగపడుతుందని హర్షం వ్యక్తం చేశారు. Watch this video to learn more about the Smashboard app #smashboardapplaunch pic.twitter.com/RrD4tZfie1 — Smashboard_ (@Smashboard_) November 12, 2019 -
వివాదాస్పద వీడియో.. విమర్శలు!
రియాద్ : సౌదీ అరేబియా భద్రతా సంస్థ(ప్రెసిడెన్సీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ) విడుదల చేసిన ఓ ప్రమోషనల్ వీడియో వివాదాస్పదంగా మారింది. ఫెమినిజం, స్వలింగసంపర్కం, ఎథిజం(నాస్తికత్వం) అనేవి తీవ్ర వాద భావాలంటూ భద్రతా సంస్థ పేర్కొనడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘ఇలాంటి తీవ్రవాద భావాలు, వంకర బుద్ధి ఇక్కడ ఆమోదయోగ్యం కాదు. మాతృదేశ విధానాలకు వ్యతిరేకంగా ఏం చేసినా అది తీవ్రవాదంగానే పరిగణింపబడుతుంది అనే వాయిస్ ఓవర్‌తో సాగిన వీడియోలో ఫెమినిజం, స్వలింగ సంపర్కం, ఎథిజాన్ని తీవ్రవాద భావనలుగా అభివర్ణించింది. కాగా ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ నవయుగ సౌదీ నిర్మాణానికి బాటలు వేస్తున్నారని చెబుతూనే ఇలాంటి వీడియోలు విడుదల చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సౌదీ రాచరికం ద్వంద్వ వైఖరికి ఇది నిదర్శనమంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా విజన్ 2030 కార్యక్రమంలో భాగంగా సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ సామాజిక ఆంక్షలను సడలిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం.. మహిళలకు డ్రైవింగ్ చేసే అవకాశం కల్పించడం, అదే విధంగా విదేశీ టూరిస్టులకు వీసా జారీ చేయడం వంటి చర్యలు తీసుకుంటోంది. తమ దేశ పర్యటనకు వచ్చే విదేశీ మహిళలు, పురుషులు సంయుక్తంగా హోటల్ గదుల్లో బస చేయవచ్చంటూ సరికొత్త నిబంధనలు తీసుకువచ్చింది. పరిచయం లేని అమ్మాయి, అబ్బాయి కలిసి బయటికి వస్తే బహిరంగంగానే కఠిన శిక్షలు అమలుచేసే ఎడారి దేశం.. పర్యాటకాన్ని అభివృద్ధి చేసుకునేందుకే ఇలాంటి చర్యలు తీసుకుంటోందనే వాదనలు వినిపించాయి. ఇక తాజా వీడియోతో మరోసారి మహిళలు, నాస్తికుల పట్ల సౌదీ నిజమైన వైఖరేంటో అర్థమైందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఐకమత్యం ముఖ్యం
‘‘నాకు తెలిసినంత వరకూ చాలామంది ఆడవాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలకు కారణం ఒక స్త్రీ మరో స్త్రీతో కలసి ఐకమత్యంగా ఉండకపోవడమే అనిపిస్తోంది. దీన్ని అధిగమించడానికి నా టీమ్‌లో అందరూ కలిసుండే వాతావరణాన్ని సృష్టిస్తున్నాం’’ అని శ్రుతీహాసన్ అన్నారు. ఇటీవల ఓ సందర్భంలో ఫెమినిజమ్, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి శ్రుతీహాసన్ మాట్లాడుతూ – ‘‘నా చిన్నప్పటి నుంచే మా అమ్మానాన్న నన్ను స్వాతంత్య్రంగా, స్ట్రాంగ్ ఉమెన్‌గా పెంచారు. నన్ను పెంచింది ఓ స్ట్రాంగ్ మ్యాన్ (తండ్రి కమల్‌హాసన్). అందుకే నేను మగాళ్లను ద్వేషించే కేటగిరీలో లేను. నాతో పాటు మా ఇంట్లో మరో ఇద్దరు శక్తిమంతమైన మహిళలు ఉన్నారు (తల్లి సారిక, చెల్లెలు అక్షరని ఉద్దేశించి). ప్రస్తుత కాలంలో స్త్రీవాదం అనేది వివిధ రూపాల్లో రూపాంతరం చెందింది. లండన్‌లో నా మ్యూజిక్ బ్యాండ్‌లో టీమ్‌లో అందరూ ఉమెనే ఉన్నారు. ఉమెన్ అని వాళ్లకు జాబ్ ఇవ్వలేదు. వాళ్ల ప్రతిభను చూసే ఇచ్చాను. ఒకరిని ఒకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం’’ అని శ్రుతీహాసన్. -
స్టేజ్ రెడీ
మహిళలు చేసే ఏ పనినైనా ఫెమినిజం కింద కొట్టిపారేసే పురుషాహంకారానికి సమాధానంగా ఒక కొత్త సంభాషణకు తెరతీశారుఐదుగురు మహిళా దర్శకులు. అయిదు నాటకాలు.. అయిదూ వాస్తవాలే!నేను మహిళను.. మహిళా ప్రపంచంలో పురుషుడికి కూడా సమానహక్కు ఇవ్వాలని అనుకుంటున్నాను.నేను మహిళను.. సమానత్వం నాకొకరు ఇవ్వక్కర్లేదు.. నేను అందరినీ సమానంగా చూస్తాను!నేను మహిళను.. సమానత్వాన్ని చూపిస్తున్నాను..అంటున్నారు వీళ్లు ఐదుగురూ.ద స్టేజ్ ఈజ్ రెడీ! మౌనంగా ఉన్నప్పుడే మాట విలువ తెలుస్తుంది.. గళమెత్తాల్సిన సమయాన్నీ ఆ మౌనమే తెలియజేస్తుంది. ఆ టైమ్ ఇప్పుడు వచ్చింది. ముఖ్యంగా మహిళలకు. ఏళ్లుగా తమ సమస్యలను.. ఇబ్బందులను నిశ్శబ్దంగా భరిస్తున్న ఆడవాళ్లు గొంతెత్తాల్సిన అవసరం వచ్చింది. సరళమైన స్వరంలోనే వస్తున్న మాటల తీవ్రతను సమాజమూ గ్రహిస్తోంది. అర్థం చేసుకోవడానికి తల వంచుతోంది. తనను వినిపించడానికి స్త్రీ.. కనపడ్తున్న చిన్న అవకాశాన్నీ పెద్ద వేదికగా మలచుకుంటోంది.. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కూడా! ఒక్క చోట కాదు.. ప్రపంచమంతా! మోస్తున్న బాధ్యతలు.. పొందాల్సిన హక్కులు, వేయాల్సిన ప్రశ్నలు.. చెప్పాల్సిన సమాధానాలు, లక్ష్యపెట్టాల్సిన ఆరోగ్యం.. నిర్లక్ష్యం చేయాల్సిన అవమానాలు, తీసుకోవాల్సిన సవాళ్లు.. సాగాల్సిన సమాలోచనలు.. నిర్దేశించుకోవాల్సిన గమ్యాలు లాంటివెన్నిటినో.. చర్చలు, డైలాగులు, డ్రామాలు, డ్రాఫ్ట్‌లు, ర్యాలీలు, ధర్నాలు, సెమినార్లు, సెలబ్రేషన్లుగా తెలుగు రాష్ట్రాలు మొదలు దేశమంతటా నిర్వహిస్తోంది. వాటి గురించి క్లుప్తంగా.. భూమిక ఇది మహిళా రంగస్థలం. మహిళలు దర్శకత్వం వహించి, నటించిన ఆధునిక నాటకోత్సవం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ భాషా సంస్కృతిక శాఖ సౌజన్యంతో తెలంగాణ థియేటర్ రీసెర్చ్ సెంటర్ (టీటీఆర్‌సీ) ‘భూమిక’ పేరుతో జరుపుతున్న మోడర్న్ థియేటర్ ఫెస్టివల్. ఓహ్.. అయితే ఇంకేమీ.. అంతా స్త్రీవాద నాటకాలే ఉంటాయన్నమాట... అంటూ అప్పుడే పెదవి విరువద్దు.. స్టీరియోటైప్ ఆలోచనలు చేయొద్దు. నాటకంలో మహిళల పాత్ర.. థియేటర్ ప్రయోగాల్లో పురుషులకు తీసిపోని వాళ్ల ప్రతిభ కనపడుతుంది. అన్వేషణ రచయిత నాహుషీ కావూరి. కాన్సెప్ట్, డైరెక్షన్ సౌమ్య రామ్ హోళగుండి. ‘‘దీన్ని గ్రీక్ కోరస్, మూవ్మెంట్ డ్రామా అండ్ రియలిస్టిక్ డ్రామా.. ఈ మూడు ప్రక్రియలను కలిపి చేస్తున్నాం. అంటే కథను, పాత్రల స్వభావాలను చెప్పడానికి నటులు భౌతిక పద్ధతులు, బృందాభినయం, స్థలం, మైమ్ వంటివి ఉపయోగిస్తారన్నమాట’’అంటూ అన్వేషణ లోని ఎక్స్‌పరిమెంట్‌ను,స్పెషాలిటీని చెప్తారు సౌమ్య. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా. ఒక హంతకుడి మర్డర్‌ను ఛేదించే డిటెక్టివ్ కథ. డైరెక్టర్ సౌమ్య గురించి చెప్పాలంటే.. కేరళ వాస్తవ్యురాలు. మలయాళంలోని థియేటర్ ఆమెలో నాటకాల పట్ల ఆసక్తిని పెంచింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో మాస్ కామ్, ట్రినిటీ కాలేజ్ ఆఫ్ లండన్‌లో స్పీచ్ అండ్ డ్రామా చదివారు. నిషుంబితా బాలే అండ్ థియేటర్ గ్రూప్‌లో చాలా చురుగ్గా పనిచేస్తున్నారు. డ్రామా ద్వారా బోధన అనే ప్రక్రియ మీద ప్రపంచ వ్యాప్తంగా వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నారు. నిషుంబితా సమర్పించిన చాలా నాటకాలకు దర్శకత్వ సహకారం అందించిన సౌమ్య ‘అన్వేషణ’తో డైరెక్టర్ అవుతున్నారు. మోరియా జాన్ మిల్లింగ్టన్ సింజె రాసిన ‘‘రైడర్స్ టు ద సీ’’ ఆధారంగా స్టేజ్ మీదకు వస్తున్న నాటకం ‘మోరియా’. ప్రముఖ రచయిత్రి శివలక్ష్మి ఈ ఇంగ్లిష్ ప్లేని ‘మోరియా’గా స్వేచ్ఛానువాదం చేశారు. దాన్ని నాటకానికి అనువుగా కొంత మార్చి దర్శకత్వం వహించారు ప్రముఖ థియేటర్ యాక్టర్, డైరెక్టర్, థియేటర్ ఫ్యాకల్టీ (పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీ) పద్మప్రియ. చేపల కోసం సముద్రంలో వేటకు వెళ్లే కుటుంబాల పరిస్థితిని కళ్లకు కట్టే డ్రామా ఇది. మోరియా ఒక స్త్రీ కథ. చేపల వేటకు వెళ్లిన ఆరుగురు కొడుకులను పోగొట్టుకుని.. మిగిలిన ఇద్దరు కూతుళ్ల కోసం ఒంటరిపోరుకు సిద్ధమైన ఓ ధీశాలి. ‘‘ఆత్మవిశ్వాసంతో వృద్ధాప్యాన్నీ జయించి నిలబడ్డ మోరియా.. నేటి యువతకు గొప్ప స్ఫూర్తి’’ అంటారు పద్మప్రియ. రంగస్థల అభిమానులందరికీ ఆమె సుపరిచితం. ‘కాకి ఎంగిలి’.. నటిగా ఆమె ఉనికిని చాటిన నాటకం. ఇప్పటివరకు 500 నాటకాలు, మూడు వేల ప్రదర్శనలతో నాలుగు నంది అవార్డులు, జాతీయ అవార్డ్ సహా ఇంకెన్నో పురస్కారాలు పొందారు. యాభై నాటకాలకు దర్శకత్వం వహించారు. దేశంలో కొన్ని ఈవెంట్స్ ►అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతిధ్వని విమెన్స్ ఫోరమ్ నాలుగో తేదీన అంటే ఈరోజే తిరువనంత పురం (కేరళ)లో పలు కార్యక్రమాలను చేపట్టింది. ఐటీలోని మహిళా ఉద్యోగుల కోసం ‘లేడీ కోడ్ నింజా’ పేరుతో హాకథాన్, ‘టెక్ టాక్’ పేరున టిక్‌టాక్ కాంపిటీషన్, ‘టెకీ క్లిక్స్’ అనే ఫొటోగ్రఫీ పోటీలను, ‘హర్ హెల్త్ ఫస్ట్’గా 295 రూపాయలకే ఆరోగ్య పరీక్షలను, బ్లడ్ డొనేషన్ క్యాంప్‌లను, జెండర్ ఈక్వాలిటీ ఇన్ ఐటీ సెక్టార్ అనే సెమినార్‌ను, ఐటీ ఎంప్లాయ్స్తో ‘‘రెయిజ్ ఎగైన్స్ట్ మోరల్ పోలీసింగ్’ అనే థియేటర్ ప్లేనూ నిర్వహిస్తోంది. ►గుజరాత్‌కు చెందిన ఆర్గ ఫౌండేషన్, శాంతినికేతన్ అనే రెండు స్వచ్చంద సంస్థలు కలిసి ‘‘బ్యాలెన్స్ ఫర్ బెటర్ (జెండర్ బ్యాలెన్స్డ్ ప్రపంచం ఎందుకు అవసరం), ‘‘రికగ్నిషన్ ఆఫ్ విమెన్’’ అన్న అంశాల మీద సదస్సు ఏర్పాటు చేస్తున్నాయి. స్థలం.. కాన్ఫరెన్స్ హాల్, శాంతినికేతన్, చాంద్‌ఖేడా, కలోల్ రోడ్, గాంధీనగర్, గుజరాత్. సమయం.. సాయంకాలం నాలుగు గంటల నుంచి ఆరు గంటల దాకా. ఆసక్తి, పోరాటపటిమ ఉన్న, స్ఫూర్తి పంచిన మహిళలు, అమ్మాయిలు పాల్గొనవచ్చు. ►ఇదే రోజు అంటే మార్చి ఎనిమిదో తేదీన్నే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో స్మార్ట్ మామాస్’ కమ్యూనిటీ ‘‘ఫెంటాస్టిక్ ఫీమేల్స్ –2019’’పేరుతో ఓ ఈవెంట్‌ను చేపట్టింది. ‘‘షేర్ యువర్ కెరీర్ స్టోరీస్ ’’ అంటూ భిన్న రంగాల్లో రాణించిన మహిళలను ఒక్కచోటకు తెచ్చి వారి విజయగాథలకు వేదిక కల్పిస్తోంది. ఆసక్తి ఉన్న వాళ్లు మరిన్ని వివరాల కోసం ఈ కాంటాక్ట్ నంబర్‌ను సంప్రదించవచ్చు.. 9879821496. పురుష సూక్తం ‘ఆడది’కి భిన్నమైన నాటకం.. ‘పురుష సూక్తం’’. స్త్రీ, పురుష పాత్రల సంవాదంతో మొదలయ్యే ఈ డ్రామా స్త్రీపాత్రతో మాస్క్యూలైన్ ఎనర్జీ, పురుషపాత్రతో ఫెమినైన్ ఎనర్జీ ఐడెంటిఫై కావడంతో ముగుస్తుంది. ఇప్పటిదాకా పురుషుడు తన బాధను బయటకు చెప్పకోలేదు. కన్నీళ్లు పెట్టకుండా.. కొండంత కష్టాన్నీ పంటిబిగువున భరించేవాడే మగాడు.. హీరో అనే ఒక ఫాల్స్ ఇమేజ్ను మోస్తూ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాడు. ‘‘పురుషుడి సమస్యలు తెలియకుండా ఈక్వాలిటీ ఎలా సాధ్యం? సమానత్వాన్ని, పోటీ తత్వాన్ని నేను క్వశ్చన్ చేస్తున్నాను. పురుష సూక్తంతో కొత్త సంభాషణకు నాంది పలుకుతున్నాను.. ఆర్ యూ విల్లింగ్ టు లిజన్ టు మి?’’ అంటున్నారు ‘పురుష సూక్తం’ రైటర్ అండ్ డైరెక్టర్ ఝాన్సీ. యస్.. టాక్ ఆఫ్ ది టౌన్.. మల్టీ టాలెంటెడ్ ఉమన్.. ఝాన్సీయే. బాలానందం నుంచి బుల్లితెర యాంకర్, సినిమా యాక్ట్రెస్‌గా తెలుగువాళ్లందరికీ ఆప్తురాలైన ఝాన్సీ.. మొన్నామధ్య ‘కన్యాశుల్కం’ మధురవాణితో అద్భుతమైన థియేటర్ ఆర్టిస్ట్‌గానూ మెప్పించారు. ఇప్పుడు.. పురుష సూక్తంతో డైరెక్టర్‌గానూ రాణించనున్నారు. ‘‘డైరెక్టర్‌గా కంటే రైటర్ రోలే చాలెంజింగ్‌గా ఉంది. ఇందులో హంగ్ డ్రమ్ అనే వాద్య పరికరాన్ని ప్రయోగిస్తున్నాం’’ అన్నారు ఝాన్సీ. చిత్ర నళీయం ఆంధ్రనాటక పితామహ ‘ధర్మవరం రామకృష్ణమాచార్యులు’ రచించిన పద్య నాటకానికి ఆధునిక రూపమే ‘‘చిత్ర నళీయం’’. ఒక్క మాటలో చెప్పాలంటే పెళ్లి పరమార్థాన్ని చెప్పే కథ. నలదమయంతుల కథనే నేటి పరిస్థితులకు అన్వయించి.. యువతకు స్ఫూర్తినిచ్చేందుకు తెస్తున్న తెర రూపం. దీనికి దర్శకురాలు జయశ్రీ సునయన. డైరెక్టర్‌గా ఇది ఆమెకు అయిదో ప్లే. 280 నాటకాల్లో నటించారు. నంది అవార్డు తీసుకున్నారు. పుట్టింది ఖమ్మంలో. పెరిగింది విజయవాడలో. చిన్నప్పటి నుంచీ థియేటర్ అంటే ఇష్టం. అందుకే ఎంకామ్, ఎమ్సీజే చేశాక కూడా పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌లో మాస్టర్స్ చేశారు జయశ్రీ సునయన. యాక్టింగ్ ఫ్యాకల్టీగా స్థిరపడాలన్నదే ఆమె ధ్యేయం. ‘‘నాటకాల్లోకి యూత్ రావట్లేదని అంటున్నారు. మా నాటకం చూస్తే అది కరెక్ట్ కాదనిపిస్తుంది. చిత్ర నళీయంలో నటించే వాళ్లందరూ డిగ్రీ స్టూడెంట్సే. పెద్దగా నాటకానుభవంలేకపోయినా థియేటర్ అంటే ప్యాషన్ ఉన్నవాళ్లు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ప్రొడక్షన్స్‌తో ఈక్వల్‌గా తెలుగు థియేటర్ కూడా ప్రయోగాలు చేయగలదు అని నిరూపిస్తాం’’ అంటున్నారు జయశ్రీ సునయన. ఆడది.. అయామ్ నాట్ ఎ ఫెమినిస్ట్ అవును.. ఆడవాళ్లకు జరిగిన అన్యాయాన్ని ఎత్తి చూపితే చాలు ‘ఆర్ యూ ఎ ఫెమినిస్ట్?’’ అంటూ ప్రశ్నిస్తారు. ముద్ర వేస్తారు. తప్పును తçప్పు అని ఒప్పుకోవడానికి భేషజాలు ఎందుకు? స్త్రీ వాద మిషలు ఎందుకు? ఫెమినిజం అంటే స్త్రీ వాదం కాదు.. స్త్రీపురుష సమానత్వం. స్వతంత్ర ఆలోచనలతో శక్తిమంతమైన మహిళగా నిలబడాలంటే ఫెమినిస్ట్ మార్క్ వేయించుకోవాల్సిందేనా? అది లేకుండా విభిన్నంగా.. విలక్షణంగా ఉండలేనా? అంటూ ప్రశ్నించే మోనోలాగ్.. ‘ఆడది.. అయామ్ నాట్ ఎ ఫెమినిస్ట్’. ఈ ప్లేకి డైరెక్టర్ స్వాతి రామన్. థియేటర్ ఆర్టిస్ట్‌గా ఇంటరెస్టింగ్ జర్నీ ఆమెది. స్వాతి రామన్ ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇన్ఫోసిస్‌లో టీమ్ లీడ్. సొంతూరు హైదరాబాద్. ‘‘ బెంగళూరులో జాబ్ చేస్తున్నప్పుడు రంగశంకర థియేటర్ గ్రూప్ వాళ్ల ఓ ప్లే చూసి చాలా ఇన్స్పైర్ అయ్యా. హైదరాబాద్ వచ్చాకా ఆ ఇంటరెస్ట్ పోలేదు. స్ట్రీట్ ప్లేస్‌లో పార్టిసిపేట్ చేశా. అప్పుడే నిషుంబితా థియేటర్ గ్రూప్ గురించి తెలిసింది. ఆ టీమ్‌లో చేరా. అట్లా ఈ ప్యాషన్ నా పార్ట్‌టైమ్ జాబ్ అయిపోయింది’’ అంటారు స్వాతి రామన్. ఈ నాటకానికి కాన్సెప్ట్, రచన రామ్మోహన్ హోళగుండి. దర్శకురాలిగా స్వాతికి ఇది డెబ్యూ ప్లే. ఈ నెల అయిదు, ఆరు, ఏడు తేదీల్లో మూడు రోజులు... అయిదు నాటకాలు. వెన్యూ అండ్ టైమ్..హైదరాబాద్ రవీంద్రభారతి, సాయంత్రం ఆరు గంటలు. ఈ అయిదు నాటకాలూ వేటికవే ప్రయోగాత్మకమైనవి. ప్రత్యేకమైనవీ. – సరస్వతి రమ -
ఫెమినిస్ట్‌ని కాను
‘‘జెండర్ ఈక్వాలిటీని నమ్ముతాను. అంతే కానీ ఫెమినిస్ట్ (స్త్రీవాది) అని చెప్పుకోను’’ అంటున్నారు బాలీవుడ్ నటి కరీనా కపూర్. ఫెమినిజం అంటే స్త్రీ, పురుషుల సమానత్వం కోరుకోవడం అని అర్థం. కానీ ఈ మధ్య ఫెమినిజం అంటే మెన్ని హేట్ చేయడం అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సోనమ్ కపూర్, కరీనా కపూర్, స్వరా భాస్కర్ ముఖ్య పాత్రల్లో రూపొందిన చిత్రం ‘వీరి దే వెడ్డింగ్’. ఈ సినిమా ప్రమోషన్లో ఫెమినిజం గురించి కరీనా మాట్లాడుతూ – ‘‘నేను ఫెమినిస్ట్ అని చెప్పకోను. జెండర్ ఈక్వాలిటీ నమ్ముతాను. నేను ఓ ఉమెన్. దీనికంటే ముందు ఒక హ్యూమన్ బీయింగ్‌ని. కరీనా కపూర్‌గా గుర్తించినా, సైఫ్ భార్య అని సంభోదించినా ప్రౌడ్‌గానే ఫీల్ అవుతాను. స్టైల్ కోసం ఫెమిసిస్ట్ అని చెప్పుకోవటం కంటే సగటు స్త్రీకి ఉపయోగపడే పనులు చేయడం ఇష్టం’’ అని పేర్కొన్నారు కరీనా. ‘వీరి దే వెడ్డింగ్’ జూన్ 1న విడుదల కానుంది. -
అతడిని గెంటేశాను, క్షమించండి: హీరోయిన్
‘నేను స్త్రీవాదిని కాదు. సమానత్వాన్ని నమ్ముతాను. నా దృష్టిలో స్త్రీ, పురుషులు ఇద్దరూ సమానమే’ అంటున్నారు బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్. మంగళవారం జరిగిన ‘వీరే ది వెడ్డింగ్’ సినిమా ఆడియో రిలీజ్ వేడుకకు హాజరయిన కరీనాను విలేకరులు ఫెమినిజం గురించి మీ అభిప్రాయమేంటని అడగ్గా ఈ విధంగా స్పందించారు. ‘నేను సమానత్వాన్ని నమ్ముతాను. నన్ను నేను స్త్రీవాదిగా గుర్తించడానికంటే ఓ మహిళగా, అన్నింటికంటే ముఖ్యంగా ఓ మనిషిగా గుర్తింపు పొందటాన్ని ఇష్టపడతాను. అంతేకాక సైఫ్ అలీ ఖాన్ భార్య కరీనా కపూర్‌గా గుర్తింపబడటం నాకు అన్నింటి కంటే గర్వ కారణమ’ని తెలిపారు. పాత్రల ఎంపికలో మీరు తీసుకునే జాగ్రత్తలేంటి అని ప్రశ్నించగా.. ‘కథలో తన పాత్ర నిడివి చిన్నదా, పెద్దదా అని కాకుండా తన పాత్రకు ప్రాధన్యం ఉందా, లేదా అనేదాన్ని బట్టి ఎంపిక చేసుకుంటానని తెలిపింది. ఇన్ని రోజులు ఎక్కువగా కమర్షియల్ సినిమాల్లో, షారుక్, సల్మాన్ ఖాన్‌లాంటి అందరూ పెద్ద హీరోలతో నటించాను. కానీ ‘వీరే ది వెడ్డింగ్’ చిత్రానికి వచ్చే సరికి ఈ సినిమాలో అన్ని ప్రధాన పాత్రల్లో నలుగురు అమ్మాయిలే నటిస్తుండటం వల్ల ఈ సినిమా పట్ల ఆసక్తి కలిగింది. అందుకే ఈ చిత్రంలో మనసు పెట్టి, పూర్తిగా లీనమై నటించాను. ఈ చిత్రంలో నా పాత్ర పేరు కాళింది. ‘కమిటిమెంట్ ఫోబియా’తో బాధపడే యువతిగా కనిపించనున్నాను. అయితే అందుకు గల కారణాన్ని సినిమా చూసి తెలుసుకోవాల్సిందేన’ని అన్నారు. బాలీవుడ్లో ఎందరో ప్రముఖులతో నటించిన కరీనా ఈ చిత్రంలో మాత్రం ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్న సమ్మిత్ వ్యాస్‌తో తొలిసారిగా జతకట్టింది. ఈ విషయం గురించి కరీనా చెబుతూ.. ‘ఈ చిత్రంలో నేను సమ్మిత్ వ్యాస్‌ను చంద్రుని మీద నుంచి తోసివేస్తాను. నేను ఇంతవరకూ నటించిన ఏ చిత్రంలో కూడా ఇలా చేయలేదు.. దాంతో ఈ సన్నివేశం చేసేటప్పుడు నాకు బాగా నవ్వొచ్చింది. నేను ఇలా చేసినందుకు ప్రేక్షకులు నన్ను క్షమిస్తారనే అనుకుంటున్నాను. కానీ ఈ విషయం మాత్రం చరిత్రలో నిలిచిపోతుంద’న్నారు. పట్టణంలో నివసించే ఓ నలుగురు అమ్మాయిలు, వారి జీవితాల్లో ఉండే బాధల ఇతివృత్తంగా తెరకెక్కుతున్న ‘వీరే ది వెడ్డింగ్’ చిత్రంలో కరీనాతో పాటు సోనమ్ కపూర్, స్వరా భాస్కర్, శిఖా తల్సానియా నటిస్తున్నారు. శషాంక్ ఘోష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా 2018, జూన్ 1న విడుదల కానుంది. -
మహిళలం కావడమే మన గుర్తింపు... మన గౌరవం
ఫెమినిజం లేదా స్త్రీవాదం అనే భావనకు దశాబ్దాలుగా ఎవరికి తోచిన భాష్యం వారు చెబుతూ వస్తున్నారు. చివరికి దానినొక గౌరవం లేని పదంగా మార్చేసింది పురుషాధిక్య సమాజం. ఇదే విషయమై బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ ఇటీవలి ఒక ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలు కొన్నింటిని వెల్లడించారు. గౌరవం కనీస హక్కు మహిళ ఎట్టి పరిస్థితుల్లోనూ తన గుర్తింపును తాను కోల్పోకుండా ఉండగలగడమే అసలైన ఫెమినిజం అంటున్నారు రాణీ ముఖర్జీ. ఫెమినిజం అంటే... స్త్రీ ఒక మగవాడితో కలిసి జీవించే క్రమంలో తన వ్యక్తిత్వాన్ని, గుర్తింపును కోల్పోకుండా నిలబెట్టుకుంటూ జీవించగలగడమేనంటోందామె. ‘‘భర్తకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూనే తనకు దక్కాల్సిన గౌరవం దక్కించుకోవాలి. భార్య స్థానం కోసం వ్యక్తిగా తను రాజీపడాల్సిన పరిస్థితి రాకూడదు’’ అంటున్నారామె. అలాగే... ‘‘సమానత్వం అని నినదిస్తూ దైనందిన జీవితంలో తనను తాను కోల్పోవడం కాదు ఫెమినిజం అంటే. మార్పు దిశగా అడుగు వేయాలి, సమాజాన్ని మార్చడానికి మరో అడుగు వేయాలి’’ అని కూడా రాణి అన్నారు. మాతృత్వపు మధురిమ ఓ బిడ్డకు తల్లి కావడంలో ఉండే మధురానుభూతి చాలా గొప్పది అంటారు రాణి. కూతురు ‘అధిర’ కు జన్మనివ్వడం ద్వారా తాను తల్లి పాత్రలోకి మారానంటూ ఓ బిడ్డకు తల్లిగా తన్మయత్వాన్ని పొందుతున్నారు ఆమె. ఈ కోణంలో సినీ పరిశ్రమ దృష్టిని, ప్రాచ్య, పశ్చిమ దేశాలలో స్త్రీ పరిస్థితిని ఆమె విశ్లేషించారు. ‘‘పాశ్చాత్య దేశాల్లో చాలా వరకు స్త్రీకి, పురుషునికి మధ్య ఎలాంటి భేదాలు చూపించరు. నటీనటులకు కూడా అదే సూత్రం వర్తిస్తుందక్కడ. నటిగా స్థిరపడడం, పెళ్లి చేసుకోవడం, బిడ్డకు జన్మనివ్వడం వంటివన్నీ ఒకదానికొకటి సమాంతరంగా జరిగిపోతుంటాయి. ఇండియాలో అలా ఉండదు ’’ అంటారు రాణీ ముఖర్జీ. అంటే పెళ్లి కాగానే నటిగా ఆమె కెరీర్ ఆగిపోతుందని. వ్యక్తిగా తొలి గుర్తింపు బాల్యంలో ఫలానా వారి అమ్మాయి, ఫలానా ఇంటి కోడలు లేదా ఫలానా వ్యక్తి భార్య, వార్ధక్యంలో ఫలానా వారి తల్లి.. ఇదీ మహిళకు భారతీయ సమాజం ఇచ్చిన గుర్తింపు. ‘మహిళ గుర్తింపు ఇలాగే ఉండాలి, ఇలా ఉండడమే ఆమెకి గౌరవం’ అనే తనదైన నిర్వచనం చెప్పిన సమాజం మనది. ఇప్పుడిప్పుడే వ్యక్తి.. వ్యక్తిగా గుర్తింపు పొందే సంస్కృతి వైపు అడుగులు పడుతున్నాయి. అవే అసలైన ఫెమినిజం ఉన్న సమాజ నిర్మాణం దిశగా పడుతున్న అడుగులు’’ అంటారు రాణీ ముఖర్జీ. ఇండియాలో ఒక నటుడు పెళ్లి చేసుకుని, బిడ్డకు తండ్రయి నటుడిగా తన కెరీర్‌ని యథాతథంగా కొనసాగించడానికి అంగీకరిస్తారు. కానీ ఒక నటి పెళ్లి చేసుకుని బిడ్డను కనడాన్ని ఔదార్యంతో స్వీకరించలేరు. -
ఇక్కడ ఆడపిల్ల పుడితే మొక్కలు నాటుతారు.!
జైపూర్: ఆడపిల్ల పుడితే చాలు అన్నీ బాధలే అనుకునే సమాజం ఇది. ఆడశిశువును చెత్తబుట్టల్లో పడేసే కర్కశులూ లేకపోలేరు. భ్రూణ హత్యలకు పాల్పడే మూర్ఖులు చాలా మంది నేటి సమాజంలో ఉన్నారు. కానీ ఓ గ్రామం మాత్రం వీటికి దూరంగా ఉంటూ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది. అక్కడ ఆడపిల్ల జన్మిస్తే అక్కున చేర్చుకుంటారు. ఊరంతా కలిసి పండుగ జరుపుతారు. ఆడపిల్ల పుట్టిన ప్రతిసారి ఆ గ్రామంలో 111 మొక్కలు నాటుతారు. ఇలా నాటిన ప్రతి మొక్కని కన్న బిడ్డలా చూసుకుంటారు. ఇంత గొప్ప పనికి శ్రీకారం చుట్టింది రాజస్థాన్‌లోని పిప్లాన్‌ట్రీ అనే గ్రామం. ఇటు స్త్రీ నిష్పత్తిని పెంచుతూ.. అటూ పర్యావరణాన్ని కూడా రక్షిస్తున్నారు సదరు గ్రామస్తులు. ఇంత గొప్ప ఆచారాన్ని గత 11 ఏళ్లుగా కొనసాగిస్తున్నారు. ఓ వైపు సమాజంలో ఆడపిల్లల శాతం గణనీయంగా తగ్గిపోతోంది. చాలా చోట్ల వెయ్యి మంది పురుషులకు 985 మంది స్త్రీలే ఉంటున్నారు. ఇలాంటి తరుణంలో పిప్లాన్‌ట్రీ గ్రామస్తులు చేస్తున్న కార్యక్రమం నిజంగా సమాజానికి మేల్కొలుపు లాంటిదే. ఇటీవల ఆ గ్రామంపై ఓ ఆంగ్ల వార్తా సంస్థ డ్యాక్యుమెంటరీ రూపొందించి ఆన్లైన్లో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఆ గ్రామ ప్రజలు నాటిన మొక్కలు, వారు మొక్కలపై తీసుకుంటున్న శ్రద్ధను తెలియజేశారు. ఆడశిశువు జన్మను ప్రొత్సహిస్తూ, పర్యావరణాన్ని సంరక్షిస్తూ పిప్లాన్‌ట్రీ గ్రామస్తులు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. -
ఆడపిల్ల పుడితే ఆ గ్రామంలో 111 మొక్కలు నాటుతారు
-
ఫెమినిజం మగాళ్ల విషయం
ఇరవై అంటే పెద్ద వయసేం కాదు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యుసాఫ్జాయ్ వయసు ఇరవైకి ఒక ఏడాది ఎక్కువ. అది కూడా ఎక్కువేం కాదు. అయితే ‘ఫెమినిజం’కి ఆమె చెప్పిన అర్థంలో.. వయసుకు మించిన పరిణతే కనిపిస్తోంది. టీనేజ్లోనే మలాలా నోబెల్‌ను సాధించడం కన్నా గొప్ప సంగతి ఈ పరిణతి. ‘ఫెమినిజం మగాళ్ల విషయం’ అన్నారు మలాలా. ఎగ్జాక్ట్లీ! ‘స్త్రీవాదం గురించీ, స్త్రీల హక్కుల గురించీ మాట్లాడ్డం అంటే.. నిజానికది స్త్రీవాదనను అంగీకరించాలని పురుషులకు నచ్చచెప్పడమే’ అని ఇటీవల మలాలా దావోస్‌లో ప్రసంగిస్తూ అన్నారు! ‘హౌ స్వీట్’ అంటూ హాలంతా చప్పట్లు. 2015లో హాలీవుడ్ నటి ఎమ్మా వాట్సన్‌తో సంభాషిస్తున్నప్పుడు ‘ఫెమినిజం అంటే ఏంటీ?’ అనే ప్రశ్నకు ‘ట్రికీ వర్డ్’ అని జవాబిచ్చారు మలాలా. తికమకపెట్టే పదం అని. అప్పటికి ‘జెండర్ ఈక్వాలిటీ’ అన్నదొక్కటే ఆమెకు తెలుసు. తర్వాత కొన్నాళ్లు ఫెమినిజం అంటే అదేదో సుపీరియరిజం అనుకున్నారట మలాలా. ఇప్పుడు ఫెమినిజాన్ని కూడా ఈక్వాలిటీ అనే అర్థంలోనే చూస్తున్నారు. ‘‘ఫెమినిజానికి ఇంకో అర్థం సమానత్వం. స్త్రీ.. సమానత్వాన్ని అడుగుతున్నప్పుడు ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన పని లేదు. అయితే మనం ఫెమినిజం అన్న ప్రతిసారీ అది పురుషుడిని ఉద్దేశించి మాట్లాడటమే’ అని దావోస్‌లో చెప్పారు మలాలా. అంతకంటే కూడా సభను మురిపించిన మరో సంగతి, ‘స్త్రీవాదాన్ని సమర్థిస్తున్నవారూ స్త్రీలు వాదించడాన్ని అంగీకరించలేకపోవచ్చు. ఇప్పుడైతే గట్టిగా చెప్పగలను. స్త్రీవాదాన్ని నేను స్వీకరించాను’ అని మలాలా చెప్పడం. ఎమ్మా వాట్సన్ ప్రస్తుతం ‘హి ఫర్ షీ’ అనే స్త్రీవాద ప్రచారోద్యమాన్ని నడుపుతున్నారు. ‘మీ టూ’, ‘టైమ్స్‌అప్’తో పాటు ‘హి ఫర్ షీ’ని.. మలాలా సమర్థిస్తున్నారు. ‘బయటపడిపోతాం అని భయపడుతూ ఉంటే, విషయం బయటపడేదెలా?’ అని మలాలా ఇంకో అర్థవంతమైన మాటను అన్నారు. స్త్రీవాదానికి నవతరం నాయిక దొరికినట్లే ఉంది మలాలా మెచ్యూరిటీని చూస్తుంటే. -
ప్ప్రశ్నించడం ఆపొద్దు
1950, 1960 సంవత్సరాల మధ్య ఎంతోమంది స్త్రీవాదుల ఉద్యమ ఫలితమే ఈ రోజున స్త్రీలందరూ బయటకొచ్చి మాట్లాడుతున్నారు. ఉదాహరణకు మా అమ్మమ్మ 4వ తరగతి వరకు చదివింది. మా అమ్మ డిగ్రీ వరకు, నేను పీ.జీ వరకు చదువుకున్నాం. ఆ రోజున స్త్రీల హక్కుల కోసం వాళ్లు చేసిన ఉద్యమాల ఫలితమే ఈ మార్పు. ఎంతోమంది రచయితలు, కళాకారులు కదం తొక్కి ఉద్యమం చేస్తే ఈ రోజున స్త్రీవాదం బలపడింది. ఆ ఉద్యమకారులందర్నీ నేను మనస్ఫూర్తిగా స్మరించుకుంటున్నాను. స్త్రీలందరూ ఉద్యమాలను అవహేళన చేయొద్దు. ప్రశ్నించటం ఆపకండి. -
ఫెమినిజం కాదు అస్తిత్వవాదం!
అభిప్రాయం అస్తిత్వవాదాల పరిధి పరిమితమైనది. అవి ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలకు, పరిమిత ప్రజా సమూహాలకు చెందినవి. ఫెమినిజం అలాంటిది కాదు. అది ప్రపంచంలోని స్త్రీలందరికీ సంబంధించినది. స్త్రీలకే కాదు పురుషులకు కూడా సంబంధించినది. ఫెమినిజం, దళితవాదం, ముస్లిం మైనారిటీవాదం మొదలైనవి తెలుగునాట అస్తిత్వవాదాలుగా చలామణి అవుతున్నాయి. వాస్తవానికి వీటిని అస్తిత్వ ఉద్యమాలు లేక గుర్తింపు రాజకీయాలు అని పిలవటం సరికాదని బాలగోపాల్ గారు తన ‘కొత్త ఉద్యమాలు పాత సిద్ధాంతాలు’ అనే వ్యాసంలో పేర్కొన్నారు. ఈ పేర్లు ఆ ఉద్యమాలు తమకుతాము పెట్టుకున్నవి కావనీ, విశ్లేషకులు పెట్టినవనీ చెప్పారు. ‘‘ఒక ప్రత్యేకమైన సాంఘిక సాంస్కృతిక స్వభావం గల ప్రజలు తమ ప్రత్యేకతను కాపాడుకోవటం కోసం చేసే ఉద్యమాలకు అ పేరు పెట్టవచ్చును. ఉదాహరణకు బ్రిటన్‌లోని ఐరిష్ ప్రజల పోరాటం, ఈశాన్య భారత ప్రాంతంలోని ‘నాగా’ తదితర జాతుల పోరాటాలకు, కశ్మీర్ పోరాటానికి కూడా ఈ పేరు చాలా వరకు సరిపోతుంది.’’ 1990, జనవరి-ఫిబ్రవరి ‘చూపు’ మాసపత్రికలో బాలగోపాల్ వ్యక్తపరచిన అభిప్రాయం ఇది. అయితే ఆ వ్యాసం పాఠకుల్ని గందరగోళానికి గురి చేస్తుంది. ఫెమినిజం, దళితవాదం, ముస్లిం మైనారిటీ వాదాల్ని అస్తిత్వ వాదాలని పిలవొచ్చా లేదా అనే స్పష్టత ఆ వ్యాసం కలిగించదు. దళితవాదం, ముస్లిం మైనారిటీవాదాల్ని పక్కన పెట్టి, ఫెమినిజాన్ని గురించి నేను చెప్పదలచుకొన్నాను. ఫెమినిజం అస్తిత్వవాదం కాదు. అస్తిత్వవాదాల పరిధి పరిమితమైనది. అవి ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలకు, పరిమిత ప్రజా సమూహాలకు చెందినవి. ఫెమినిజం అలాంటిది కాదు. అది ప్రపంచంలోని స్త్రీలందరికీ సంబంధించినది. స్త్రీలకే కాదు పురుషులకు కూడా సంబంధించినది. ఈ మాట ఎందుకంటున్నానంటే- స్త్రీ పురుషులు వేరు వేరు కాదు, వేరు వేరు జాతులకు (species) చెందినవారు కాదు. ఒకే జాతికి చెందిన పరస్పర పూరకాలు. ఒకరి కష్టాలు మరొకరు పంచుకొంటారు. ఒకరికి అన్యాయం జరుగుతుంటే అది తమకు సంబంధించినది కాదని రెండవవారు ఊరుకోరు. అలా ఊరుకొనే వారైతే రాజా రామమోహనరాయ్,కందుకూరి, గురజాడ, చలం పేర్లు చరిత్రలో నిలిచేవి కావు. ఫెమినిజంలో చాలా రకాలున్నాయి. వాటిలో Existentialist Feminism ఒకటి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఫెమినిజాన్ని అస్తిత్వవాదంగా పరిగణించకూడదు. ఎగ్జిస్టెన్షియల్ ఫెమినిజం సృష్టికర్త సిమోన్ డి బావర్ (Simon de beauvoir), ఝపాల్ సార్త్ర యొక్క అస్తిత్వవాదంతో ప్రభావితురాలై 1949లో ‘ద సెకండ్ సెక్స్’ రాసింది. రెండవ తరం ఫెమినిస్టులకు ఈ పుస్తకం మంచి స్ఫూర్తినిచ్చింది. స్త్రీలకు జండర్ అవగాహన కలిగించిన మొదటి రచనగా దీన్ని భావిస్తారు. కానీ దీంట్లో వివాహ వ్యవస్థనీ, మాతృత్వాన్నీ బావర్ తీవ్రంగా వ్యతిరేకించింది. దీని ప్రభావం వలన రాడికల్ ఫెమినిస్టులు కొందరు పురుష ద్వేషానికి లోనై ఫెమినిస్ట్ ఉద్యమానికి నష్టం కలిగించారు. పైగా 1972 వరకూ బావర్ తను ఫెమినిస్టునని చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. అందువలన ఎగ్జిస్టెన్షియల్ ఫెమినిజాన్ని సాధారణంగా ఫెమినిజం యొక్క ప్రధాన స్రవంతిలో భాగంగా ఫెమినిస్టులు గుర్తించరు. ఫెమినిజంలో అనేక రకాలున్నట్లే కొన్ని దశలు (W aves) కూడా ఉన్నాయి. ఇప్పుడు నడుస్తున్న దశ వరకు ఫెమినిస్టులు చేసిన కృషి, ప్రపంచానికి అందించిన నూతన జ్ఞానం చాలా విశిష్టమైనవి. ఉదాహరణకు ఆడవాళ్ళు ఓటు హక్కు కలిగి ఉండటం, చదువుకోవటం ఈ రోజు అతి సాధారణ విషయం. కానీ ఇంత సాధారణ విషయాలను సాధించుకోవటానికి పశ్చిమ దేశాల స్త్రీలు ఎన్ని ఆలోచనలు చెయ్యాల్సి వచ్చింది! ఎన్ని పోరాటాలు చెయ్యాల్సి వచ్చింది! మగవాళ్ళ నుండి ఎంత వ్యతిరేకత! అదే, మన దేశంలో స్త్రీలు ఓటు హక్కు కోసం ప్రత్యేకంగా పోరాడాల్సిన అవసరం లేక పోయింది. స్వతంత్రోద్యమంలోనూ, సంస్కరణోద్యమంలోనూ అవి భాగాలైనాయి. స్వాతంత్య్రం రావటంతో హక్కులుగా అవి రాజ్యాంగంలో పొందుపరచబడ్డాయి. అయినప్పటికీ ఆ రాజ్యాంగ హక్కులను స్త్రీలు అనుభవించేట్లు చెయ్యటానికి నానా తంటాలు పడ్డాం. ఇంకా పడుతున్నాం. ప్రపంచ వ్యాప్తంగా- ముఖ్యంగా పశ్చిమ దేశాలలో- స్త్రీలు విద్యావంతులవుతున్న కొద్దీ ఆర్థిక, రాజకీయ, సామాజిక విషయాలపట్ల వారి అవగాహన పెరిగింది. 1960ల నుంచి ఫెమినిజం ప్రపంచంలోని అన్ని దేశాలకూ వ్యాపించింది. స్త్రీలు తాము జండర్ వివక్షతకు గురవుతున్నామనీ, జండర్ అనేది పుట్టుకతో సహజంగా వచ్చేది కాదనీ గ్రహించటం మొదలుపెట్టారు. స్త్రీలు ఇప్పుడున్న విధంగా తయారు కావటానికి కారణం పితృస్వామ్య మతాలు, సంస్కృతి, రాజకీయ, ఆర్థిక, కుటుంబ వ్యవస్థలని గుర్తించారు. వీటి గురంచి విస్తృతంగా అధ్యయనం, పరిశోధన చేస్తున్నారు. ఇంత విస్తృత పునాది, స్థాయి కలిగిన ఫెమినిజాన్ని అస్తిత్వవాదంగా భావించడం సరికాదు. భారతదేశంలో, అందులోనూ మన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఫెమినిజాన్ని దృష్టిలో పెట్టుకుని దాని పని అయిపోయిందని సాధారణీకరించటం సరికాదు. 1990 నుండి ఫెమినిజం ప్రభావం తగ్గింది. కాని అంతరించిపోలేదు. ఆలోచనా విధానంలో ఆధునికాంతర వాదం, ఆర్థిక విధానాలలో సరళీకృత ఆర్థిక విధానాలు ఫెమినిస్ట్ ప్రభావాన్ని కాస్త మసకబార్చాయి. గతంలో అనేక కష్ట నష్టాల కోర్చి స్త్రీలు చేసిన పోరాటాల ఫలితంగా ఈ దశలో స్త్రీలు ఉన్నత విద్యనభ్యసించి ఉన్నత ఉద్యోగాలు చేపట్ట గలిగారు. కొత్తగా వచ్చిన ఆర్థిక, సామాజిక స్వేచ్ఛ, ఇంటర్నెట్ వల్ల కలిగిన భావ ప్రకటన సౌలభ్యం మూడవ తరానికి (Third w ave) చెందిన ఆడపిల్లల్ని తమ మూలాలు మర్చిపోయేట్లు చేశాయి. మొదటి తరం, రెండవ తరం ఫెమినిస్టులు ఏ విలువలనైతే విమర్శిస్తూ వచ్చారో (ఉదాహరణకు విశ్వసుందరి పోటీలు) వాటిని వీళ్ళు సమర్థించారు. ఆడవాళ్ళు ఎట్లా ఉండాలో, ఎట్లా ఆలోచించాలో ఫెమినిస్టులు చెప్పనక్కర్లేదనీ, జండర్ సమానత్వం సాధించబడింది కనుక స్త్రీల హక్కుల గురించి చర్చ అవసరం లేదనీ వాదించారు. ఇటువంటి వాదనలకు మీడియా అధిక ప్రాధాన్యతనిచ్చి దీన్ని పోస్టు ఫెమినిజంగా ప్రచారం చేసింది. కార్పొరేట్ శక్తులు, మీడియా ఎంత ప్రయత్నించినా ఫెమినిజాన్ని అణచివేయటం సాధ్యం కాలేదు. తాత్కాలికంగా ఉద్యమ బాట నుండి జండర్ లేక విమెన్స్ స్టడీస్ పేరుతో ఎకాడమీ బాట పట్టింది. అక్కడ అన్ని రకాల సామాజిక, జీవ, మనస్తత్వ శాస్త్రాల పరిధి నుండి మానవ జీవితాన్ని అధ్యయనం చేస్తున్నది. ఆర్థిక, సామాజిక అసమానతలన్నింటినీ గుర్తిస్తున్నది. వాటిని రూపు మాపే విధానాలను అన్వేషిస్తున్నది. పరిశోధనకు అంతగా ప్రాముఖ్యతనివ్వని మనదేశంలాంటి చోట్ల మాత్రం ఫెమినిజం సాహిత్యానికీ, సాహిత్య విమర్శకూ పరిమితమైంది. ఎకాడమీలో బలం పుంజుకొని నాలుగవ తరం (Fouth w ave) ఫెమినిజంగా ఉద్యమ బాట పట్టడానికి సిద్ధమవుతోంది ఫెమినిజం. ఫెమినిస్ట్ ఐక్యత(Fem inist solidarity) దిశగా అడుగులు వేస్తూ మరింత బలంగా ముందుకు వస్తోంది. ఉప్పెనలా ఈ ప్రపంచాన్ని ముంచి, పితృస్వామ్య మురికిని సమూలంగా వదలగొట్టి, కొత్త రూపుతో సుందరమైన నూతన ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుంది. అటువంటి ప్రపంచం కోసం స్త్రీ పురుషులందరూ కృషి చెయ్యాలి. రచయిత: ఫెమినిస్ట్ ప్రసాద్ 9849828797 -
మూవీలకు ఏడాది గ్యాప్ ఇచ్చింది!
లండన్: బహిరంగ ప్రదేశాల్లో చురుగ్గా కనిపించకుండా బోరింగ్ పర్సన్‌లా ఉండటానికే ఇష్టపడే హాలీవుడ్ తార ఎమ్మా వాట్సన్. ఓ ఏడాది పాటు ఈ ముద్దుగుమ్మ సినిమాల జోలికి వెళ్లనంటోంది. తనకు కొన్ని పనులున్నాయని వాటిని నిర్వహించిన తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇస్తానని చెపుతోంది ఎమ్మా వాట్సన్. 'హ్యారీపొటర్' సిరీస్ చిత్రాల్లో హెర్మియన్ గ్రాంజర్‌గా నటించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా పేరుప్రఖ్యాతలు తెచ్చుకుంది ఈ సుందరి. ఐక్యరాజ్యసమితి గుడ్ విల్ అంబాసిడర్ ఎమ్మా వాట్సన్ 'హీ ఫర్ షీ' లాంటి కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. స్త్రీవాదం గురించి తాను ఎంతో తెలుసుకోవాల్సి ఉందని, ఎన్నో పుస్తకాలు చదవాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. కేవలం రెండు విషయాలపై దృష్టిసారించడానికి ఈ గ్యాప్ తనకు అవసరమని మీడియాకు వివరించింది. మొదటిది స్త్రీవాదం, లింగ సమానత్వం కాగా, వ్యక్తిత్వ వికాసం రెండో అంశమని వెల్లడించింది. ఇప్పటినుంచి ప్రతివారం ఓ బుక్ చదవడం లక్ష్యంగా పెట్టుకోవడంతో పాటు తన వద్ద ఉన్న లైబ్రరీ నుంచి నెలకు మరో పుస్తకాన్ని చదవడాన్ని ఎంచుకున్నట్లు చెప్పింది. ప్రపంచంలో ఎన్ని రకాల మహిళలు ఉంటారో తెలుసుకుంటానంటోంది. ఎమ్మా తదుపరి చిత్రం 'బ్యూటీ అండ్ ద బీస్ట్' తో 2017లో వెండితెర మీద కనిపించనుందట. -
మగాడి హక్కులను అపార్థం చేసుకున్నారు !
శతాబ్దాలుగా రెండు విషయాలు చాలా తప్పుగా ప్రచారమవుతున్నాయట. అందులో ఒకటి ఫెమినిజమ్, రెండు మెన్స్ రైట్స్. వీటిని ఏ ఒక్కరూ సరిగ్గా అర్థం చేసుకోలేదని అంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోకపోతే కచ్చితంగా జ్యోతి తివారి, ఎమ్మా వాట్సన్ కలిసి ఒప్పిస్తారు. ఈ రెండు పేర్లకు పొంతన కుదుర్లేదు కదా... రండి విషయంలోకి వెళ్దాం. ఇటీవల ఢిల్లీలోని అమితీ లా స్కూల్లో మగాడి హక్కులపై ఒక సదస్సు జరిగింది. ఇది న్యాయ విద్యార్థుల సమక్షంలో జరిగిన సదస్సు అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వారిని మేల్కొలిపితే కొన్ని లక్షల మంది మగాళ్లకు వేధింపుల నుంచి రక్షణ కల్పించినట్లే. అందుకే లా స్కూల్లో సదస్సు పెట్టారు. ఈ సదస్సులో ఢిల్లీకి చెందిన జ్యోతి తివారి సంధించిన ప్రశ్నలకు అందరికీ తలతిరిగి పోయింది. ఆమె ప్రధానమైన ప్రశ్న ఏంటంటే అసలు ఈ సమాజానికి ‘పురుషులకు హక్కులు ఉన్నాయనే విషయం తెలుసా?’ అంటోంది. సర్పంచి నుంచి ప్రధాని వరకు అందరూ ఒకమాట చెబుతున్నారు. మన ఆడబిడ్డల పరువు కాపాడాలి. స్కూళ్లలో టాయిలెట్స్ నిర్మించాలి. వాళ్లే అన్ని ప్రభుత్వ ప్రకటనల్లో అమ్మాయిల పరువు గురించి మాత్రమే ఫోకస్ చేస్తారు. టాయిలెట్లు అబ్బాయిలకు అవసరం లేదా? మగాళ్ల హక్కులంటే... స్త్రీల సంరక్షణ కోసం రూపొందించిన చట్టాల దుర్వినియోగం మాత్రమే కాదు, ఇంకా అనేకం ఉన్నాయి. స్త్రీలతో సంబంధం లేని పురుషుల హక్కులు చాలా ఉన్నాయి. కేవలం అమ్మాయిల సమస్యలకు మాత్రమే ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు? ఒకబ్బాయి బాల్యం నుంచి టీన్‌గా మారే సందర్భంలో ఎంతో మానసిక సంఘర్షణ ఎదుర్కొంటున్నాడు. ఇద్దరు అమ్మాయిలు తమ సమస్యలు చెప్పుకున్నంత సులువుగా ఇద్దరబ్బాయిలు చెప్పుకోరు. మరి ఈ పరిస్థితి లేకుండా చేయడం వారి హక్కును హరించడమే. అసలు పురుషుల మానసిక సమస్యలను సమాజం అస్సలు గుర్తించనే గుర్తించదు. ప్రతి దశలో పురుషుడికి సమస్యలు, సంఘర్షణలు ఉంటాయి. తల్లి-భార్య సంఘర్షణ పురుషుడు ఎదుర్కొనే అతిపెద్ద జీవిత సమస్య. పెళ్లికి ముందు పట్టించుకోని తల్లి పెళ్లయ్యాక కొడుకు మాటల్లో అర్థాలను వెదుక్కుంటోంది. విడాకుల చట్టాల వలన పిల్లల ప్రేమను కోల్పోతున్న తండ్రులు అనుభవిస్తున్న బాధ గురించి చర్చ అవసరం లేదా? అత్యంత ఘోరమైన విషయం మరోటుంది. అదేంటంటే ఈ చట్టాలు, సమాజం ఒక పక్క స్త్రీ-పురుషులు సమానం అంటూనే ఒక వివాహ బంధంలో పురుషుడిని ప్రధాన ఆదాయ వనరుగా, సంపాదించేవాడిగా, ఇంటి యజమానిగా, రక్షకుడిగా చూస్తున్నాయి. అతనికి సామర్థ్యం లేకపోయినా సంపాదించాలి. స్త్రీలకు ఉన్నట్టు పనిచేయకుండా ఇంటిపట్టున ఉండే ఆప్షన్ పురుషులకు ఎందుకు లేదు? విడాకుల్లో భర్త నుంచి భరణం ఇప్పిస్తున్నాయి. ఉన్నత విద్య చదువుకున్న అమ్మాయికి భరణం ఇవ్వడం ఏవిధంగా సమర్థించాలి? అందుకే పురుషుల హక్కులంటే ఒక మనిషి హక్కులు గానే చూడాలి. అంతేగాని స్త్రీ-వేధింపులకు అనుసంధానం చేసి చూడొద్దు... ఇదంతా జ్యోతి తివారి ప్రసంగంలో కొంత. వండర్ఫుల్ డిస్కషన్ కదా ! ఇక ఎమ్మావాట్సన్ ఫెమినిజం గురించి కూడా ఒక విషయం వినండి.. ఇటీవల ఐక్యరాజ్యసమితి గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఆమె ఐరాసలో ఒక ప్రసంగం ఇచ్చింది. ఆమె అంటున్నదేంటంటే ఫెమినిస్టు అంటే శాడిస్టుగా చూస్తున్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా... తప్పొప్పులతో సంబంధం లేకుండా ఫెమినిజం అంటే స్త్రీల వైపు నిలబడటం అని ప్రచారం కావడం వల్ల. ఫెమినిజం అంటే తప్పొప్పులతో సంబంధం లేకుండా స్త్రీల వైపు నిలబడేది కాదు, హక్కులు కోల్పోతున్న స్త్రీలకు అండగా నిలవమని చెప్పేది. పురుషులను వేధిస్తున్న స్త్రీలను నియంత్రణలో పెట్టేది, లింగ బేధాలు లేకుండా ఇరువురికీ సమాన హక్కులు దక్కాలని చెప్పేది. కాని దురదృష్టవశాత్తూ దీనిని స్త్రీలకు వంతపాడే పదంగా మార్చేశారు. అందుకే ఫెనిమిజం అనే పదంపై పురుషులకు ఏహ్యభావం వచ్చింది. ‘సొసైటీ మేక్ ఫెమినిజం ఈజ్ యాన్ అన్‌కంఫర్టబుల్ వర్డ్’ అని ఎమ్మావాట్సన్ వ్యాఖ్యానించారు. ఈ హారీపోటర్ గర్ల్ ఎనిమిదేళ్ల నాటి తన అనుభవాల నుంచే ఫెనిమిజం గురించి ఆలోచిస్తోందట. సుదీర్ఘ అనుభవం వల్లేనేమో ఆమెకు ఫెమినిజం గురించి అపార్థాలు, అర్థ సత్యాలు అర్థమయ్యాయి. మొత్తానికైతే...ఢిల్లీలో మగవాడి హక్కుల గురించిన చర్చలో ఎన్నో కొత్త కోణాలు ఆవిష్కృతమయ్యాయి.