బాలీవుడ్ భామ నోరా ఫతేహీ ఇటీవల మడ్గావ్ ఎక్స్‌ప్రెస్ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. బాలీవుడ్ పలు చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్‌లో మెరిసిన ముద్దుగుమ్మ ఇటీవల బాలీవుడ్ జంటలపై సంచలన కామెంట్స్ చేసింది. వారంతా కేవలం డబ్బు, పేరు కోసమే పెళ్లిళ్లు చేసుకుంటున్నారని విమర్శించింది. తనకు అలాంటి ఉద్దేశం లేదని.. అందుకే ఎవరితోను డేటింగ్‌లో చేయడం లేదని చెప్పుకొచ్చింది.
తాజాగా ఈ బాలీవుడ్ భామ మరోసారి సంచలన కామెంట్స్ చేసింది. ఓ పాడ్‌కాస్ట్‌లో నోరా మాట్లాడుతూ ఫెమినిజంపై విమర్శలు గుప్పించింది. స్త్రీవాదం అనేది సమాజాన్ని పూర్తిగా నాశనం చేసిందని ఆరోపించింది. అది కేవలం మహిళలనే కాకుండా పురుషులను కూడా బ్రెయిన్‌వాష్ చేసిందంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఫెమినిజంపై నోరా మాట్లాడుతూ..'ఇలాంటి ఆలోచన ఎవరికీ అవసరం లేదు. స్త్రీవాదమనే ఈ విషయాన్ని నేను అస్సలు నమ్మను. నిజంగా స్త్రీవాదమే మన సమాజాన్ని పూర్తిగా నాశనం చేసింది. మహిళలు పెళ్లి చేసుకోకూడదు. పిల్లలను కనకూడదనే ధోరణిని తాను విశ్వసించను. ఇది పూర్తిగా స్వతంత్రంగా ఉండాలి. ఇక్కడ పురుషులు డబ్బు, ఫుడ్ కోసం పనిచేస్తుంటే.. ఒక స్త్రీ పిల్లలు, ఇల్లు చూసుకోవడం, వంట చేయడం లాంటివి చేస్తున్నారు. మహిళలు బయటకు వెళ్లి పని చేయాలి.. వారు సొంతంగా జీవించాలని కోరుకుంటున్నారు.. కానీ అది కొంత వరకేనని' చెప్పుకొచ్చింది. ప్రస్తుత సమాజంలో చాలా మంది పురుషుల ధోరణి మారింది. ఇప్పుడు చాలా మంది ఫెమినిజం ద్వారా బ్రెయిన్‌వాష్‌కు గురయ్యారంటూ నోరా తెలిపింది.
మనమందరం సెంటిమెంట్స్‌లో సమానమే కానీ.. సామాజికపరంగా సమానం కాదని నోరా పేర్కొంది. స్త్రీవాదం అంతర్లీనంగా, ప్రాథమిక స్థాయిలో గొప్పదే.. నేను కూడా మహిళల హక్కుల కోసం వాదిస్తానని.. బాలికలు పాఠశాలకు వెళ్లాలని కోరుకుంటానని తెలిపింది. అయితే, స్త్రీవాదం రాడికల్‌గా మారినప్పుడే సమాజానికి ప్రమాదకరంగా మారుతుందని వెల్లడించింది. అయితే ఫెమినిజం పునాదులు గట్టిగానే ఉన్నప్పటికీ .. గత 20 ఏళ్లలో పోలిస్తే చాలా ప్రమాదకరంగా మారిందని అన్నారు.
అయితే నోరా ఫతేహీ చేసిన కామెంట్స్‌పై నెటిజన్స్ మండిపడుతున్నారు. మీ మాటలు చాలా కామెడీగా ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. స్త్రీవాదం లేకపోతే ఇండియాలో నీకు పని చేసే అవకాశం లభించేది కాదని అంటున్నారు. అలా అయితే మీరు వెంటనే పని మానేసి పెళ్లి చేసుకోండి.. అలాగే మీరు ఐటెం సాంగ్స్‌లో డ్యాన్స్ చేయకుండా భర్తపైనే ఆధారపడి జీవించండి అంటూ ఓ నెటిజన్ చురకలంటించారు. అసలు మహిళలు కేవలం సంరక్షకులుగా ఉండాలని.. పురుషులే పోషించాలని.. స్త్రీవాదం సమాజాన్ని నాశనం చేసిందని నోరా ఫతేహి ఎలా మాట్లాడాతారంటూ ఓ నెటిజన్ ప్రశ్నించింది. ప్రస్తుతం నోరా చేసిన కామెంట్స్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment