బాలీవుడ్ భామ నోరా ఫతేహి ఓ పెళ్లిలో సందడి చేసింది. ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ అనూప్ సర్వే పెళ్లికి హాజరైంది. అయితే ఈ వివాహా వేడుకలో పాల్గొనేందుకు రైలులో ప్రయాణించింది ముద్దుగుమ్మ. దీనికి సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ముంబయిలోని దాదర్ రైల్వే స్టేషన్‌లో ఉన్న వీడియోను పంచుకుంది.
ట్రైన్‌లో రత్నగిరి చేరుకున్న నోరాకు ఘనస్వాగతం లభించింది. ఆ తర్వాత డైరెక్టర్ హల్దీ వేడుకలో నోరా ఫతేహీ డ్యాన్స్ కూడా చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. డైరెక్టర్ అనూప్ సర్వేతో తనకు ఎనిమిదేళ్లుగా పరిచయం ఉందని నోరా ఫతేహీ తెలిపింది. 2017 నుంచి తన సినీ ప్రయాణంలో ఉన్నాడని రాసుకొచ్చింది. ఇక సినిమాల విషయానికొస్తే నోరా ఫతేహి చివరిసారిగా మడ్గావ్ ఎక్స్‌ప్రెస్ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం ఆమె ధృవ సర్జా నటిస్తోన్న కేడీ - ది డెవిల్‌తో కన్నడలో అరంగేట్రం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment