ఖరీదైన కారు కొన్న జాన్వీ కపూర్‌ సిస్టర్.. ఎన్ని కోట్లంటే? | Khushi Kapoor Buys Herself RS 3 Crore Swanky New Mercedes Car | Sakshi
Sakshi News home page

Khushi Kapoor: ఖరీదైన కారు కొన్న ఖుషీ కపూర్.. ఎన్ని కోట్లో తెలుసా?

Published Sun, Aug 11 2024 5:26 PM | Last Updated on Sun, Aug 11 2024 5:26 PM

Khushi Kapoor  Buys Herself RS 3 Crore Swanky New Mercedes Car

బాలీవుడ్ భామ జాన్వీకపూర్‌ చెల్లెలు, శ్రీదేవి ముద్దుల కూతురు ఖుషీ కపూర్‌ ఖరీదైన కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొత్త రెడ్ కలర్ మెర్సిడెజ్‌ కారులో తిరుగుతూ ముంబయి వీధుల్లో కనిపించింది. ఈ కారు విలువ దాదాపు రూ.3 కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు నటికి కంగ్రాట్స్ చెబుతున్నారు.

కాగా.. ఖుషీ కపూర్ ది ఆర్చీస్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో బెట్టి కూపర్ పాత్రలో మెప్పించింది. 2023లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆడియన్స్‌ను మెప్పించలేకపోయింది. ఈ చిత్రంలో సుహానా ఖాన్, అగస్త్యానందా కీలక పాత్రల్లో కనిపించారు. ఖుషీ ప్రస్తుతం రొమాంటిక్ కామెడీగా వస్తోన్న నాడనియాన్ చిత్రంలో నటించనుంది. ఇందులో ఇబ్రహీం అలీఖాన్ హీరోగా చేస్తున్నారు. ఆ తర్వాత హిందీలో రీమేక్‌ చేస్తోన్న లవ్ టుడే చిత్రంలో కనిపించనుంది. మరోవైపు జాన్వీ కపూర్‌ దేవర మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement