
కొందరు సమయపాలన పాటిస్తే మరికొందరేమో సమయానికి రావడం అంటే అదేదో బ్రహ్మ విద్య అన్నట్లుగా ఫీలవుతారు. ఎప్పుడూ చెప్పిన సమయానికంటే ఆలస్యంగానే సెట్‌లో అడుగుపెడతారు. ఈ విషయంలో నటీనటులపై దర్శకనిర్మాతలు లోలోపలే విసుక్కునేవారు. అందరిలాగే కమల్ హాసన్ (Kamal Haasan) కూడా అదే బాపతు అనుకున్నాను.. కానీ తన అంచనా తప్పని నిరూపించాడంటోంది హీరోయిన్ పూనమ్ ధిల్లాన్.
ఎప్పుడంటే అప్పుడు..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పూనమ్ ధిల్లాన్ (Poonam Dhillon) మాట్లాడుతూ.. సెట్‌లో నాకు మొదటిసారి అక్షింతలు పడింది కమల్ హాసన్ చేతిలోనే! షూటింగ్‌కు ఆలస్యంగా వచ్చానని ఆయన నాపై కోప్పడ్డారు. ముంబైలో 30-45 నిమిషాలు ఆలస్యంగా వస్తే పెద్దగా పట్టించుకునేవారు కాదు. రాజేశ్ ఖన్నా, శతృఘ్న సిన్హా వంటి పెద్ద స్టార్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేవారు. వాళ్లను చూసి మేము కూడా ఓ అరగంటయినా ఆలస్యంగా సెట్‌కు వచ్చేవాళ్లం.
గంట ఆలస్యం తప్పు కాదనుకున్నా
ఓసారి చెన్నైలో ఉదయం ఏడు గంటలకు షూటింగ్‌కు రమ్మన్నారు. నేను ఎనిమిది గంటలకల్లా అక్కడున్నాను. ఆలస్యం చేశానన్న ఫీలింగ్ కూడా నాకు లేదు. అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తుంటే ప్రతి ఒక్కరూ నావంక కోపంగా చూస్తున్నారు. వెంటనే కమల్.. పూనమ్, నీకోసం ఇక్కడున్న అందరూ ఏడు గంటల నుంచి ఎదురుచూస్తున్నారు. లైట్‌మన్, కెమెరామెన్.. ఎప్పుడో ఇల్లు వదిలేసి బస్సులోనో, ఆటోలోనో ఇంత దూరం నుంచి వచ్చారు.
క్లాస్ పీకిన కమల్ హాసన్
ఏడు గంటలకల్లా ఇక్కడుండాలని ఐదింటికంటే ముందే నిద్ర లేచి రెడీ అయుంటారు. నువ్వేమో ఎనిమిదింటికి వస్తావా? అందరినీ ఇలా వెయిట్ చేయిస్తావా? ఇది కరెక్ట్ కాదు అని సున్నితంగా మందలించాడు. అప్పుడు నేను తప్పు తెలుసుకున్నాను. సౌత్‌లో టెక్నీషియన్లకు కూడా సముచిత స్థానం ఇస్తారు. సాయంత్రం టిఫిన్, స్నాక్స్ ఏవైనా సరే అందరూ తింటారు. దక్షిణాదిలో టెక్నీషియన్లను ఎంతగానో గౌరవిస్తారు అని చెప్పుకొచ్చింది. పూనమ్ ధిల్లాన్.. కమల్ హాసన్‌తో యే తో కమాల్ హో గయా, యాద్‌గర్, గెరాఫ్తార్ సినిమాలు చేసింది.
చదవండి: సౌత్‌లో నా సినిమాలు చూడరు.. మనమేమో వాళ్లవి ఎగబడి చూస్తారు: బాలీవుడ్ స్టార్