Poonam Dhillon
-
సీనియర్ హీరోయిన్ ఇంట్లో డైమండ్ జ్యువెలరీ, డబ్బు దొంగతనం
ఈ రోజుల్లో ఎవర్నీ నమ్మేలా లేదు. ఇంటి మనిషైనా, ఇంట్లో పని చేయడానికి వచ్చిన మనుషుల్నైనా నమ్మే రోజులు కావివి! ఇప్పుడిదంతా ఎందుకంటే.. నటి పూనమ్ ధిల్లాన్ ఎప్పటిలాగే ఆదివారం కూడా పనిపై బయటకు వెళ్లింది. ఆరోజు ఆమె ఇంట్లో దొంగతనం జరిగింది. రూ.35 వేల నగదుతో పాటు 500 డాలర్లు, వజ్రాల కమ్మలు పోయాయి. దొంగతనం జరిగిందని అర్థమవగానే వెంటనే పోలీసులకు సమాచారమిచ్చింది.అది అదునుగా చూసుకుని..పూనమ్ ధిల్లాన్ (Poonam Dhillon) ఇంటికి రంగులు వేయడానికి వచ్చిన అన్సారీ అనే వ్యక్తి జనవరి 6న ఈ చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కప్‌బోర్డుకు తాళం వేసి లేకపోవడంతో దాన్ని గమనించి డబ్బు దొంగిలించాడని పేర్కొన్నారు. అప్పటికే అతడు 9 వేల రూపాయలతో ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకున్నాడు. తన దగ్గరున్న రూ.25 వేల నగదు, 500 డాలర్లను, వజ్రపు ఇయర్ రింగ్స్‌ను పోలీసులు నటికి తిరిగి అప్పగించారు.దొంగతనాన్ని పసిగట్టిఈ ఘటన గురించి పూనమ్ మాట్లాడుతూ.. ఇంటికి పెయిటింగ్ వంటి చిన్న పనులు చేయిస్తున్నాను. అందుకోసం ముగ్గుర్ని మాట్లాడుకున్నాం. ఆ పనులన్నీ మా సిబ్బంది దగ్గరుండి చూసుకుంటున్నారు. చోరీ జరిగే సమయంలో మేమెవరం ఇంట్లో లేము. కానీ మా అబ్బాయి ఇంటికి వచ్చి చూసేసరికి దొంగతనం జరిగిందని పసిగట్టాడు. (చదవండి: ఆ రోజు ఏది తినాలపిస్తే అది తింటా.. తాగుతా...: నాగార్జున)షాకయ్యా: పూనమ్వెంటనే అలర్ట్ అయి ఆలస్యం చేయకుండా పోలీసులకు సమాచారమిచ్చాము. అందువల్లే నా డబ్బు, జ్యువెలరీ మళ్లీ నా చేతికి అందింది. ఈ సంఘటన వల్ల నేను షాక్‌లోకి వెళ్లిపోయాను. ఒకరు మనింట్లో దర్జాగా ప్రవేశించి వస్తువులు దొంగిలిస్తారా? ఇంత ఘోరంగా ఉంటారా? ఇలా చాలామంది ఇళ్లలో జరుగుతందని తెలుసుకుని మరింత షాకయ్యాను అని చెప్పుకొచ్చింది.ఎవరీ పూనమ్ ధిల్లాన్పూనమ్ ధిల్లాన్.. 1978లో మిస్ యంగ్ ఇండియా కిరీటం అందుకుని సెన్సేషన్ అయింది. అప్పుడామెను చూసిన యశ్ చోప్రా మొదటగా త్రిశూల్‌లో గపూచి గపూచి గమ్ గమ్ అనే పాటకు సెలక్ట్ చేశాడు. తన స్కిల్స్ మెచ్చిన అతడు నూరీ సినిమాలో హీరోయిన్గా తీసుకున్నాడు. అటు పాట, ఇటు సినిమా రెండూ బ్లాక్‌బస్టర్ కావడంతో పూనమ్‌కు వరుస అవకాశాలు వచ్చిపడ్డాయి.సినిమాఏ వాదా రహా, రొమాన్స్, కసమ్, తేరీ కసమ్, రెడ్ రోజ్, దర్ద్, నిషాన్, జమానా, 13B వంటి పలు చిత్రాల్లో నటించింది. బెంగాలీ భాషలో న్యాయ్ దందా, కన్నడలో యుద్ధ కాండ, తమిళంలో యావరుమ్ నాళం మూవీతో మెప్పించింది. తెలుగులో ఇష్టం అనే సినిమాతో ఆకట్టుకుంది. హిందీ బిగ్‌బాస్ మూడో సీజన్లో పాల్గొన్న పూనమ్ సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. ఈ హీరోయిన్ బిగ్‌బాస్ కంటెస్టెంట్ కూడా!మొదట్లో హీరోయిన్గా మెప్పించిన పూనమ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో బుల్లితెర నటిగా అలరించింది. డాక్టర్ కాబోయి హీరోయిన్ అయినవారిలో పూనమ్ ఒకరు. ఈమె వ్యక్తిగత విషయానికి వస్తే నిర్మాత అశోక్ టకేరియాను 1988లో పెళ్లాడింది. వీరికి కూతురు పలోమా, కుమారుడు అన్మోల్ సంతానం. 1997లో పూనమ్ దంపతులు విడాకులు తీసుకున్నారు. పిల్లల బాధ్యతల్ని పూనమ్ తీసుకుంది.చదవండి: స్నేహితుడు పోయిన దుఃఖంలో నటుడు.. 'ఆ వెధవ ఆత్మకు శాంతి లభించొద్దంటూ నటి శాపనార్థాలు -
ప్రభాస్‌పై అర్షద్ వార్సీ కామెంట్స్..
-
వెండితెరపైకి స్టార్ కిడ్స్.. హీరో, హీరోయిన్, డైరెక్టర్‌గా
Paloma Dhillon Rajveer Deol Debut In Rajshri Productions: బాలీవుడ్ ఇండస్ట్రీలో సెలబ్రిటీల వారసులు వెండితెరపై ఎంట్రీ ఇవ్వడం సాధారణమే. ఇటీవలే బాలీవుడ్ బిగ్ ఫ్యామిలీస్ వారసులు అగస్త్యా నంద (అమితాబ్ బచ్చన్ మనవడు), ఖుషీ కపూర్ (బోనీ కపూర్-దివంగత నటి శ్రీదేవిల చిన్న కుమార్తె), సుహానా ఖాన్ (షారుక్ ఖాన్ కుమార్తె) నటిస్తున్న తొలి వెబ్ ఫిల్మ్ ‘ద ఆర్చీస్’ పోస్టర్ విడుదలైంది. తాజాగా మరో స్టార్ హీరో తనయుడు, నటి కుమార్తె వెండితెరపై ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ధర్మేంద్ర మనవడు, సన్నీ డియోల్ కుమారుడు రాజ్వీర్ డియోల్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ రాజశ్రీ ప్రొడక్షన్లో ఒక సినిమా తెరకెక్కనుంది. ఇందులో హీరోయిన్గా ప్రముఖ నటి పూనమ్ దిల్లాన్, నిర్మాత అశోక్ థకేరియా కుమార్తె పలోమా దిల్లాన్ తెరంగేట్రం చేయనుంది. వీరిద్దరికి ఇదే డెబ్యూ మూవీ కానుంది. అంతేకాకుండా ఈ చిత్రంతో డైరెక్టర్ సూరజ్ బర్జాత్యా కుమారుడు అవినీష్ ఎస్ బర్జాత్యా దర్శకుడిగా పరిచయం కానున్నాడు. రాజశ్రీ ప్రొడక్షన్లో 59వ చిత్రంగా వస్తున్న ఈ సినిమా షూటింగ్ ముంబైలో జులైలో ప్రారంభం కానుంది. కాగా మోడ్రన్ సంబంధాలను చూపిస్తూ లావిష్ డెస్టినేషన్ వెడ్డింగ్ కథతో రానుంది ఈ మూవీ. చదవండి: బాలీవుడ్ బిగ్ స్టార్స్ వారసులంతా ఒకే ఫ్రేమ్‌లో.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఏదీ నాటి గ్లామర్?!
టీవీక్షణం: వెండితెర మీద వెలిగిన గ్లామర్ డాల్స్ అంతా ఇప్పుడు సీరియళ్ల ద్వారా సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతోన్న సంగతి తెలిసిందే కదా! పూనమ్ థిల్లాన్, పద్మినీ కొల్హాపురి, భాగ్యశ్రీ తదితరులంతా బిజీ క్యారెక్టర్ ఆర్టిస్టులు అయిపోయారు. వారి తోవలోనే అడుగులు వేస్తోంది అనితారాజ్. ‘ప్రేమ్‌గీత్’ చిత్రంతో వెండితెర మీద తొలిసారి కనిపించిన ఈ నటీమణి... ఎనభైల్లో యువతకు నిద్రపట్టకుండా చేసింది తన అందంతో. కెరీర్ కొనసాగిస్తూనే 1986లో దర్శకుడు సునీల్ హింగోరానీని పెళ్లాడింది. 2012 వరకూ నటించినా ఆ తర్వాత కొన్నాళ్ల పాటు కనిపించలేదు. కొంత గ్యాప్ తర్వాత అనిల్‌కపూర్ నిర్మించి, నటించిన ‘24’ టెలివిజన్ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ‘తుమ్హారీ పాఖీ’ సీరియల్లో హీరోకి తల్లిగా నటిస్తోంది. అయితే సినిమాల్లో క్లిక్ అయినట్టుగా సీరియల్స్‌లో అనిత క్లిక్ కాలేదని కచ్చితంగా చెప్పవచ్చు. దానికి కారణం... ఆమె గ్లామర్ బాగా తగ్గడమే. పూనమ్ థిల్లాన్నే తీసుకోండి. లావుగా అయినా కూడా ఇప్పటికీ గ్లామర్ చెక్కు చెదరలేదు. కానీ అనిత అలా లేదు. వయసు మీద పడినదానిలా కనిపిస్తోంది. దానికి తోడు ఆమె ఎంచుకుంటోన్న పాత్రలకు మరీ ఎక్కువ ప్రాధాన్యత కానీ, నటనకు ఆస్కారంగానీ ఉండటం లేదు. దానివల్ల మిగతా వారికంటే ఆమె కాస్త వెనుకబడుతోందనే చెప్పాలి!