ఈ రోజుల్లో ఎవర్నీ నమ్మేలా లేదు. ఇంటి మనిషైనా, ఇంట్లో పని చేయడానికి వచ్చిన మనుషుల్నైనా నమ్మే రోజులు కావివి! ఇప్పుడిదంతా ఎందుకంటే.. నటి పూనమ్ ధిల్లాన్ ఎప్పటిలాగే ఆదివారం కూడా పనిపై బయటకు వెళ్లింది. ఆరోజు ఆమె ఇంట్లో దొంగతనం జరిగింది. రూ.35 వేల నగదుతో పాటు 500 డాలర్లు, వజ్రాల కమ్మలు పోయాయి. దొంగతనం జరిగిందని అర్థమవగానే వెంటనే పోలీసులకు సమాచారమిచ్చింది.
అది అదునుగా చూసుకుని..
పూనమ్ ధిల్లాన్ (Poonam Dhillon) ఇంటికి రంగులు వేయడానికి వచ్చిన అన్సారీ అనే వ్యక్తి జనవరి 6న ఈ చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కప్‌బోర్డుకు తాళం వేసి లేకపోవడంతో దాన్ని గమనించి డబ్బు దొంగిలించాడని పేర్కొన్నారు. అప్పటికే అతడు 9 వేల రూపాయలతో ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకున్నాడు. తన దగ్గరున్న రూ.25 వేల నగదు, 500 డాలర్లను, వజ్రపు ఇయర్ రింగ్స్‌ను పోలీసులు నటికి తిరిగి అప్పగించారు.
దొంగతనాన్ని పసిగట్టి
ఈ ఘటన గురించి పూనమ్ మాట్లాడుతూ.. ఇంటికి పెయిటింగ్ వంటి చిన్న పనులు చేయిస్తున్నాను. అందుకోసం ముగ్గుర్ని మాట్లాడుకున్నాం. ఆ పనులన్నీ మా సిబ్బంది దగ్గరుండి చూసుకుంటున్నారు. చోరీ జరిగే సమయంలో మేమెవరం ఇంట్లో లేము. కానీ మా అబ్బాయి ఇంటికి వచ్చి చూసేసరికి దొంగతనం జరిగిందని పసిగట్టాడు.
(చదవండి: ఆ రోజు ఏది తినాలపిస్తే అది తింటా.. తాగుతా...: నాగార్జున)
షాకయ్యా: పూనమ్
వెంటనే అలర్ట్ అయి ఆలస్యం చేయకుండా పోలీసులకు సమాచారమిచ్చాము. అందువల్లే నా డబ్బు, జ్యువెలరీ మళ్లీ నా చేతికి అందింది. ఈ సంఘటన వల్ల నేను షాక్‌లోకి వెళ్లిపోయాను. ఒకరు మనింట్లో దర్జాగా ప్రవేశించి వస్తువులు దొంగిలిస్తారా? ఇంత ఘోరంగా ఉంటారా? ఇలా చాలామంది ఇళ్లలో జరుగుతందని తెలుసుకుని మరింత షాకయ్యాను అని చెప్పుకొచ్చింది.
ఎవరీ పూనమ్ ధిల్లాన్
పూనమ్ ధిల్లాన్.. 1978లో మిస్ యంగ్ ఇండియా కిరీటం అందుకుని సెన్సేషన్ అయింది. అప్పుడామెను చూసిన యశ్ చోప్రా మొదటగా త్రిశూల్‌లో గపూచి గపూచి గమ్ గమ్ అనే పాటకు సెలక్ట్ చేశాడు. తన స్కిల్స్ మెచ్చిన అతడు నూరీ సినిమాలో హీరోయిన్‌గా తీసుకున్నాడు. అటు పాట, ఇటు సినిమా రెండూ బ్లాక్‌బస్టర్ కావడంతో పూనమ్‌కు వరుస అవకాశాలు వచ్చిపడ్డాయి.
సినిమా
ఏ వాదా రహా, రొమాన్స్, కసమ్, తేరీ కసమ్, రెడ్ రోజ్, దర్ద్, నిషాన్, జమానా, 13B వంటి పలు చిత్రాల్లో నటించింది. బెంగాలీ భాషలో న్యాయ్ దందా, కన్నడలో యుద్ధ కాండ, తమిళంలో యావరుమ్ నాళం మూవీతో మెప్పించింది. తెలుగులో ఇష్టం అనే సినిమాతో ఆకట్టుకుంది. హిందీ బిగ్‌బాస్ మూడో సీజన్‌లో పాల్గొన్న పూనమ్ సెకండ్ రన్నరప్‌గా నిలిచింది.
ఈ హీరోయిన్ బిగ్‌బాస్ కంటెస్టెంట్ కూడా!
మొదట్లో హీరోయిన్‌గా మెప్పించిన పూనమ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో బుల్లితెర నటిగా అలరించింది. డాక్టర్ కాబోయి హీరోయిన్ అయినవారిలో పూనమ్ ఒకరు. ఈమె వ్యక్తిగత విషయానికి వస్తే నిర్మాత అశోక్ టకేరియాను 1988లో పెళ్లాడింది. వీరికి కూతురు పలోమా, కుమారుడు అన్మోల్ సంతానం. 1997లో పూనమ్ దంపతులు విడాకులు తీసుకున్నారు. పిల్లల బాధ్యతల్ని పూనమ్ తీసుకుంది.
చదవండి: స్నేహితుడు పోయిన దుఃఖంలో నటుడు.. 'ఆ వెధవ ఆత్మకు శాంతి లభించొద్దంటూ నటి శాపనార్థాలు
Comments
Please login to add a commentAdd a comment