ప్రముఖ నిర్మాత ప్రతీశ్ నంది (73) బుధవారం కన్నుమూశారు. ముంబైలోని తన నివాసంలో గుండెపోటుతో మరణించారు. సినీ ఇండస్ట్రీలో అనేక సినిమాలు నిర్మించిన ఈయన ఒకప్పుడు ప్రముఖ జర్నలిస్టు కూడా! ప్రతీశ్ మరణం పట్ల ఆయన స్నేహితుడు, ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ తీవ్ర విచారం వ్యక్తం చేశాడు.
స్నేహితుడి మరణం బాధాకరం
నా ప్రియమైన మిత్రుడు ప్రితీశ్ (Pritish Nandy) మరణవార్త నన్నెంతగానో కలిచివేసింది. అద్భుతమైన కవి, రచయిత, నిర్మాత.. అలాగే ధైర్యవంతుడైన జర్నలిస్ట్ కూడా! ముంబైలో అడుగుపెట్టిన కొత్తలో నాకెంతో సపోర్ట్‌గా నిలబడ్డాడు. మేము ఎన్నో విషయాలను పంచుకునేవాళ్లం. దేనికీ జంకకుండా ఎంతో ధైర్యంగా ఉండేవాడు. తన దగ్గరి నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను.
మిస్ అవుతున్నా..
ఒకప్పుడు తను, నేను వేరు కాదు అన్నట్లుగా ఉండేవాళ్లం. కానీ రానురానూ కలుసుకోవడమే తగ్గిపోయింది. మనం కలిసున్న రోజుల్ని మిస్ అవుతున్నా.. నిన్ను కూడా ఎంతో మిస్ అవుతున్నా ఫ్రెండ్.. ఎక్కడున్నా నీ ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ గుండె ముక్కలైన ఎమోజీతో ఈ పోస్ట్‌ను షేర్ చేశాడు. అనుపమ్ ఖేర్ (Anupam Kher).. ప్రతీశ్‌ను అంతలా పొగడం నటి నీనా గుప్తాకు ఏమాత్రం నచ్చినట్లు లేదు.
(చదవండి: నేను చేసిన పెద్ద తప్పు అదే!: కంగనా రనౌత్)
బుద్ధి తక్కువ వెధవ
నా విషయంలో అతడేం చేశాడో తెలుసా? తను చేసిన పనికి ఆగ్రహం పట్టలేక అందరిముందే అతడిని బుద్ధి తక్కువ వెధవ అని తిట్టాను. నా బిడ్డ బర్త్ సర్టిఫికెట్ దొంగిలించి దాన్ని మీడియాలో పబ్లిష్ చేశాడు. ఇందుకు సంబంధించిన సాక్ష్యం ఇప్పటికీ నా దగ్గరుంది. అందుకే అతడి ఆత్మకు శాంతి దొరకాలని నేను కోరుకోను అని కామెంట్ చేసింది. అయితే తర్వాత ఆ కామెంట్‌ను నీనా (Neena Gupta) డిలీట్ చేసినట్లు తెలుస్తోంది.
ఆమె అనుమతి లేకుండా దొంగిలించి మరీ..
ఇకపోతే ప్రితీశ్ నంది జర్నలిస్టుగా ఉన్న సమయంలో నీనా గుప్తా కూతురు మసాబా బర్త్ సర్టిఫికెట్ దొంగిలించి సమాచారం లీక్ చేశాడు. దీని ఆధారంగా నీనా- క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ సంతానమే మసాబా అని జనాలకు తెలిసిపోయింది. పెళ్లితో సంబంధం లేకుండా వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నప్పుడే మసాబాకు పేరెంట్స్ అయ్యారని విస్తృతమైన చర్చ జరిగింది.
ప్రితీశ్ నంది విషయానికి వస్తే..
కుచ్ కట్టి కుచ్ మీఠి, బాలీవుడ్ కాలింగ్, ముంబై మ్యాట్నీ, చమేలి, జస్ట్ మ్యారీడ్, ధీమె ధీమె, ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్, అగ్లీ ఔర్ పాగ్లీ, షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్ వంటి చిత్రాలను ప్రితీశ్ నిర్మించారు. జర్నలిస్టుగానూ పలు సంస్థల్లో పని చేశారు. 1977లో పద్మశ్రీ, 2008లో కర్మవీర్ పురస్కార్, 2012లో ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ అవార్డులు అందుకున్నారు.
చదవండి: Game Changer: ‘గేమ్ ఛేంజర్’ని వదలని సినిమా కష్టాలు!
Comments
Please login to add a commentAdd a comment