Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ని వదలని సినిమా కష్టాలు! | Game Changer Premiere Shows In North America To Be Impacted By Content Delays | Sakshi
Sakshi News home page

Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ని వదలని సినిమా కష్టాలు!

Published Thu, Jan 9 2025 3:56 PM | Last Updated on Thu, Jan 9 2025 5:46 PM

Game Changer Premiere Shows In North America To Be Impacted By Content Delays

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్(Ram Charan), సెన్సేషనల్‌ డైరెక్టర్‌ శంకర్‌ ల కాంబోలో వస్తున్న గేమ్‌ ఛేంజర్‌(Game Changer) ని వరుసపెట్టి సినిమా కష్టాలు వెన్నాడుతున్నాయి. కొన్ని చోట్ల బెనిఫిట్‌ షోలకు అనుమతి ఇవ్వకపోవడం లాంటి దేశీయ కష్టాల నుంచి అంతర్జాతీయ కష్టాలు కూడా ఈ సినిమాకి తప్పడం లేదు. ఈ సంవత్సరంలో తొలి భారీ–టికెట్‌ చిత్రంగా విడుదల అవుతున్న గేమ్‌ ఛేంజర్‌ రూ.500 కోట్ల కనీస టార్గెట్‌తో వస్తోంది. ఈ సినిమా రాబోయే చిత్రాల విడుదలకు టార్గెట్‌ సెట్‌ చేస్తుందని భావిస్తున్న నేపధ్యంలో చుట్టుముడుతున్న కష్టాలు కలెక్షన్స్‌పై సందేహాలు కలిగిస్తున్నాయి. 

(చదవండి: తెలంగాణలో 'గేమ్‌ ఛేంజర్‌' టికెట్ల పెంపుపై విమర్శలు)

మన దేశంలో, ఈ చిత్రం దాదాపు రూ. 25 కోట్లతో తొలి రోజు ప్రారంభమవుతుందని ఇది రామ్‌ చరణ్‌ సోలో చిత్రానికి అతిపెద్ద ఓపెనింగ్‌గా నిలుస్తుందని అంచనా. మరోవైపు భారతదేశం వెలుపల తెలుగు చిత్రాలకు అతిపెద్ద మార్కెట్‌లలో ఒకటిగా మారిన నార్త్‌ అమెరికా లో కూడా ఈ సినిమా భారీ కలెక్షన్లపై ఆశపెట్టుకుంది. 

(చదవండి: 'ఆ సాంగ్‌ చేసినందుకు సిగ్గుపడాలి'.. ఊర్వశి రౌతేలాపై విమర్శలు!)

అయితే కంటెంట్‌ కన్వర్షన్‌లో జాప్యం కారణంగా, నార్త్‌ అమెరికాకి సమయానికి కంటెంట్‌ అప్‌లోడ్‌ వైఫల్యానికి దారితీసే పరిస్థితి ఏర్పడిందట. హిందీ తమిళ వెర్షన్‌లు ఆ భాషల్లో షోలను నిర్ధారిస్తూ, సమయానుకూలంగా అప్‌లోడ్‌ చేశారు. అయితే, ఆలస్యం కారణంగా యునైటెడ్‌ స్టేట్స్‌లోని అతిపెద్ద థియేటర్‌ చైన్‌లలో ఒకటైన ఎఎమ్‌సి సినిమా కోసం బుకింగ్‌లను నిలిపివేసిందని తెలుస్తోంది. 

ప్రారంభ ట్రెండ్‌ల ప్రకారం, ఉత్తర అమెరికాలో ఈ చిత్రం ప్రీమియర్‌ షోల టిక్కెట్‌ల విక్రయాలు 8,5లక్షల్ని దాటాయి పదిలక్షల చేరుకోవడానికి దగ్గరలో ఉన్నాయి. అయితే, ప్రస్తుత పరిస్థితుల కారణంగా, మొత్తం అమ్మకాలు 7.5లోపునకు పడిపోయాయని సమాచారం. అయితే ఇప్పటికీ మించిపోయింది లేదనీ కంటెంట్‌ సమయానికి సినిమా థియేటర్‌లకు చేరుకుంటే, సినిమా ఇప్పటికీ 10లక్షల మార్కును దాటగలదని ట్రేడ్‌ వర్గాలు అంటున్నాయి. 

పులి మీద పుట్రలా మరోవైపు కొనసాగుతున్న దావానలం గేమ్‌ ఛేంజర్‌ ఓవర్సీస్‌ రికార్డ్‌ కలెక్షన్స్‌ ఆశల్ని దహించే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటికే కార్చిచ్చు కారణంగా అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌ ప్రాంతంలో ఈ సినిమా కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి. రేపు(జనవరి 10) ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement