
Paloma Dhillon Rajveer Deol Debut In Rajshri Productions: బాలీవుడ్ ఇండస్ట్రీలో సెలబ్రిటీల వారసులు వెండితెరపై ఎంట్రీ ఇవ్వడం సాధారణమే. ఇటీవలే బాలీవుడ్ బిగ్ ఫ్యామిలీస్ వారసులు అగస్త్యా నంద (అమితాబ్ బచ్చన్ మనవడు), ఖుషీ కపూర్ (బోనీ కపూర్-దివంగత నటి శ్రీదేవిల చిన్న కుమార్తె), సుహానా ఖాన్ (షారుక్ ఖాన్ కుమార్తె) నటిస్తున్న తొలి వెబ్ ఫిల్మ్ ‘ద ఆర్చీస్’ పోస్టర్ విడుదలైంది. తాజాగా మరో స్టార్ హీరో తనయుడు, నటి కుమార్తె వెండితెరపై ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ధర్మేంద్ర మనవడు, సన్నీ డియోల్ కుమారుడు రాజ్‌వీర్ డియోల్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ రాజశ్రీ ప్రొడక్షన్‌లో ఒక సినిమా తెరకెక్కనుంది.
ఇందులో హీరోయిన్‌గా ప్రముఖ నటి పూనమ్ దిల్లాన్, నిర్మాత అశోక్ థకేరియా కుమార్తె పలోమా దిల్లాన్ తెరంగేట్రం చేయనుంది. వీరిద్దరికి ఇదే డెబ్యూ మూవీ కానుంది. అంతేకాకుండా ఈ చిత్రంతో డైరెక్టర్ సూరజ్ బర్జాత్యా కుమారుడు అవినీష్ ఎస్ బర్జాత్యా దర్శకుడిగా పరిచయం కానున్నాడు. రాజశ్రీ ప్రొడక్షన్‌లో 59వ చిత్రంగా వస్తున్న ఈ సినిమా షూటింగ్ ముంబైలో జులైలో ప్రారంభం కానుంది. కాగా మోడ్రన్ సంబంధాలను చూపిస్తూ లావిష్ డెస్టినేషన్ వెడ్డింగ్ కథతో రానుంది ఈ మూవీ.
చదవండి: బాలీవుడ్ బిగ్ స్టార్స్ వారసులంతా ఒకే ఫ్రేమ్‌లో..
Comments
Please login to add a commentAdd a comment