Sooraj Barjatya
-
ఆయుష్మాన్ కు జోడీగా...
హిందీలో ‘మైనే ప్యార్ కియా, హమ్ అప్ కే హై కౌన్, ఊంచాయీ’ వంటి సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ తీసిన ప్రముఖ దర్శకుడు సూరజ్ బర్జాత్యా(Sooraj Barjatya) మరో కథను రెడీ చేశారు. ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా(Ayushmann Khurrana) హీరోగా నటించనున్నారు.కాగా ఈ మూవీలో హీరోయిన్గా శార్వరీ(Sharvari)ని తీసుకోవాలనుకుంటున్నారట. సూరజ్ బర్జాత్యా వంటి సీనియర్ దర్శకుడి సినిమా కావడంతో శార్వరీ వెంటనే ఓకే చెప్పారని బాలీవుడ్ భోగట్టా. ఈ వేసవిలో ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించి, వచ్చే ఏడాది ప్రారంభంలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
హీరోయిన్లను ఏడిపించా.. ఓసారి భాగ్యశ్రీని అడగండి: డైరెక్టర్
కొంతమంది దర్శకులు సెట్లో నటీనటులపై నోరుపారేసుకుంటారు. తాను కూడా అదే జాబితాలోకి వస్తానంటున్నాడు ప్రముఖ డైరెక్టర్ సూరజ్ బర్జాత్య (Sooraj Barjatya). ఆవేశంలో కొంతమంది హీరోయిన్లపై అరిచానని చెప్తున్నాడు. బడా నామ్ కరేంగే వెబ్ సిరీస్‌తో ఈయన ఓటీటీ (OTT)లో అడుగుపెడుతున్నాడు. ఈ సిరీస్ ప్రమోషన్స్‌లో సూరజ్ మాట్లాడుతూ.. కెరీర్ ప్రారంభంలో చాలామంది హీరోయిన్లను ఏడిపించాను. ఎక్కువగా చిరాకు పడుతూ అందరిమీదకు అరిచేవాడిని. ఆమెను అడిగినా చెప్తుందిఅలా భాగ్యశ్రీ (Bhagyashree) మీద ఒకసారి గట్టిగా అరవడంతో ఆమె సెట్లోనే ఏడ్చింది. ఈ విషయం తనను అడిగినా చెప్తుంది. కానీ రానురానూ నా ప్రవర్తనను మార్చుకున్నాను. ప్రశాంతంగా ప్రేమగా చెప్తేనే మంచి ఫలితాలు వస్తాయని గ్రహించాను. సెట్లోకి వెళ్లేముందు అన్నీ సిద్ధం చేసుకునేవాడిని. ఆ రోజు ఏది షూట్ చేయాలనేది ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకునేవాడిని. కాస్ట్యూమ్ నుంచి మొదలుకుని ప్రతీది క్షుణ్ణంగా పరిశీలించేవాడిని. అందుకే ఐదేళ్లు పట్టిందిఅన్నీ కుదిరాకే సెట్లో అడుగుపెట్టేవాడిని. అందుకే నాకు ఈ సిరీస్ చేయడానికి ఐదేళ్లు పట్టింది. షూటింగ్ సెట్లో సన్నివేశాల్ని డైరెక్ట్ చేయాలే తప్ప వాటిని సరిదిద్దుతూ కూర్చోకూడదన్నది నా నియమం. దర్శకుడిగా నేను చాలా స్వార్థపరుడిని. సినిమాకు ఏమేం అవసరమో అవన్నీ సెట్టయ్యాకే షూటింగ్ మొదలుపెడతాను. నా మూవీ మీకు నచ్చాలని ఆశిస్తాను. కలెక్షన్స్ గురించి ఆలోచించను. నా మొదటి ప్రాధాన్యత దానికేడైరెక్టర్గా నేను ఎవరి మాటా వినను. ప్రతి డైలాగ్‌లో కూడా దూరి కరెక్ట్‌గానే సరిపోయిందా? లేదా? అనేది చెక్ చేస్తాను. విజువల్స్ కన్నా కథకే ఎక్కువ ప్రాధాన్యమిస్తాను అని చెప్పుకొచ్చాడు. కాగా సూరజ్ బర్జాత్య.. మైనే ప్యార్ కియా చిత్రంతో వెండితెరపై దర్శకుడిగా ప్రయాణం ఆరంభించాడు. ఈ మూవీలో సల్మాన్ ఖాన్, భాగ్యశ్రీ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. సినిమాసూరజ్.. హమ్ ఆప్కే హై కౌన్, హమ్ సాత్ సాత్ హై, వివాహ్, ప్రేమ్ రతన్ ధన్ పాయో వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు తెరకెక్కించాడు. బడా నామ్ కరేంగే వెబ్ సిరీస్ విషయానికి వస్తే.. రితిక్ ఘన్షన్, ఆయేషా కడుస్కర్, రాజేశ్ తైలంగ్, అంజన సుఖని, ప్రియంవదకాంత్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సిరీస్ సోనీలివ్‌లో స్ట్రీమింగ్ కానుంది.చదవండి: ఐశ్వర్య రాజేశ్ హిట్ సిరీస్ సీక్వెల్ వచ్చేస్తోంది.. ఎప్పుడంటే? -
సల్మాన్ ‘వివాహ్’కి పనికిరాడన్న దర్శకనిర్మాత
ఇంతింతై అన్నట్టుగా ఎదిగిన సల్మాన్(Salman Khan) తొలి సినిమా ఏది? అని అడిగితే వెంటనే ఠక్కున మైనే ప్యార్ కియా అని చెప్పేస్తారు. కానీ చాలా మందికి తెలీని విషయం బీవీ హోతో ఐసీ (భార్య అంటే ఇలా ఉండాలి) అనే సినిమా సల్మాన్ తొలిసినిమా. 1988లో విడుదలైన ఈ సినిమాలో సల్మాన్ సహాయనటుడి పాత్ర పోషించారు. అయితే ఆ తర్వాత చేసిన మైనే ప్యార్ కియా సూపర్ డూపర్ హిట్ అవడంతో తొలి సినిమా తెరమరుగైపోయింది.. సల్లూభాయ్‌కి లవర్ బాయ్ ఇమేజ్ కూడా వచ్చేసింది.భార్య అంటే ఇలా ఉండాలి అనే అర్ధం వచ్చేలా టైటిల్‌తో తొలిసినిమా ఎలాగైతే సల్మాన్ కెరీర్లో అస్పష్టం ఉండిపోయిందో...సల్మాన్ వివాహం కూడా అలాగే ఉండిపోయింది. అదలా ఉంచితే... బాలీవుడ్లో అత్యంత ఎలిజబుల్ బ్యాచిలర్ అయిన సల్మాన్‌ఖాన్‌కి దేశవ్యాప్తంగా అసంఖ్యాక అభిమానుల్ని అందించిన తొలి సినిమా మైనే ప్యార్ కియా కాగా దానికి దర్శకుడు సూరజ్ బర్జాత్యా(Sooraj Barjatya). హమ్ ఆప్ కే హై కౌన్, హమ్ సాథ్ సాథ్ హై వంటి సూపర్ డూపర్ హిట్స్ తో టాప్ డైరెక్టర్‌గా మారారు. పై చిత్రాలతో పాటు ప్రేమ్ రతన్ ధన్‌పాయో కూడా సల్మాన్‌ఖాన్‌తోనే రూపొందించారీ కుటుంబ చిత్రాలకు పేరొందిన ఈ దర్శకుడు. సల్మాన్‌తో అత్యధిక హిట్స్ తీశాడు. అలాగే ఆయన త్వరలో తన అభిమాన హీరో సల్మాన్ ఖాన్‌తో మరో చిత్రంలో మళ్లీ చేయబోతున్నాడు, అయితే కెరీర్ ప్రారంభం నుంచీ వరుసగా సల్మాన్‌తో చిత్రాలు తీస్తూ వచ్చిన ఆయన ప్రేమ్ రతన్ ధన్పాయోకి ముందు వివాహ్(Vivah) పేరిట ఒక సినిమాని రూపొందించినప్పుడు ఆ సినిమాలో షాహిద్ కపూర్‌ని హీరోగా ఎంచుకున్నారు.సల్మాన్ ఖాన్ తో త్వరలో మరో చిత్రంలో మళ్లీ జతకట్టబోతున్న సూరజ్ బర్జాత్యా... వివాహ్ సినిమా కు హీరో ఎంపిక విషయంలో సల్మాన్‌ని దూరంగా పెట్టడానికి కారణం ఏమిటి? అనే విషయంపై బాలీవుడ్లో అప్పట్లో చర్చోపచర్చలు జరిగాయి. ఈ నేపధ్యంలో సూరజ్ బర్జాత్యా ఇటీవల ఆ విషయం గురించి మాట్లాడాడు.‘‘ అప్పట్లో మీరట్‌కు చెందిన ఒక టైలర్, కాలిన గాయాలతో ఉన్న ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లు వచ్చిన వార్త గురించి చెప్పి, మా నాన్న నాకు ఆ వార్తాపత్రిక కటింగ్‌ను చూపించారు. ప్రేమ మానవత్వం ఆధారంగా సినిమాను రూపొందించాలని అనుకున్నాం. ఆ సినిమా కథ కొత్తగా కనపడే ఒక అమాయకుడికి నప్పుతుంది. కాబట్టి సల్మాన్ ఖాన్ ఆ సినిమాకి నప్పే సరైన హీరో కాదు. అందుకే షాహిద్ ను ఎంచుకున్నా’’ అంటూ చెప్పారు సూరజ్ బర్జాత్యా. మొత్తానికి ఇంత కాలమైనా ప్రేమలు, అనుబంధాలకు దగ్గరగా అదే సమయంలో వివాహానికి దూరంగా ఉంంటూ వివాహ వ్యవస్థలో ఒదగలేకపోతున్న సల్మాన్... వివాహ్ అనే సినిమా లో పాత్రలో సైతం నప్పకపోవడం... విచిత్రం. -
నిద్రమాత్రలు వేసుకున్న హీరో.. భార్యే ఇచ్చింది.. ఎందుకంటే?
బాలీవుడ్‌లోని క్లాసిక్ చిత్రాల్లో 'హమ్ సాత్ సాత్ హై' ఒకటి. ఇప్పుడు చూసినా ఎంతో ఫ్రెష్‌గా అనిపిస్తుంది. ఈ మూవీలో సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, కరిష్మా కపూర్, టబు, సోనాలి బింద్రె, మోనిశ్ బాల్ తదితరులు పటించారు. దర్శకుడు సూరజ్ బార్జాత్యాతో కలిసి పని చేసి ఈ మాస్టర్‌పీస్‌ను అందించారు. అయితే ఈ సినిమాలోని 'సునోజి దుల్హాన్..' పాట షూటింగ్ సమయంలో సైఫ్ అలీ ఖాన్ సరిగా యాక్ట్చేయలేదట.నిద్రమాత్రలు వేసుకుని..తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు సూరజ్ ఆనాటి విషయాలను పంచుకున్నారు. 'సైఫ్ అలీ ఖాన్ సహజ నటుడు. అలాంటి వ్యక్తి ఒకానొక సమయంలో రీటేకులు తీసుకుంటూనే ఉన్నాడు. అసలేమైంది? అని అతడి భార్య అమృత సింగ్‌ను(ప్రస్తుతం విడాకులు తీసుకున్నారు) అడిగాను. పగలూరాత్రీ తేడా లేకుండా మెళకువతో ఉంటే తను ఎలా పర్ఫెక్ట్గా నటించగలడు? అని చెప్పింది. తనకేదైనా మెడిసిన్ ఇవ్వమన్నాను. అలా అతడికి నిద్ర మాత్రలు ఇవ్వడంతో ఆ రోజు హాయిగా పడుకున్నాడు.నేచురల్ యాక్టర్తెల్లారి సెట్లో సింగిల్ టేక్‌లో తన షాట్ పూర్తి చేశాడు. ఒక్క టేక్‌లో ఎలా పూర్తయింది? అని ఆశ్చర్యంగా నన్నే తిరిగి అడిగాడు. నువ్వు కంటి నిండా నిద్రపోతేనే నేచురల్‌గా నటించగలవని బదులిచ్చాను. పెద్ద స్టార్స్‌తో కలిసి నటించడం సైఫ్‌కు అదే తొలిసారి కావడంతో కొంత బెరుకుగా కూడా ఉండేవాడు. తన డైలాగులను ఎప్పటికప్పుడు రిహార్సల్స్ చేసేవాడు' అని డైరెక్టర్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ దేవర సినిమాలో నటిస్తున్నాడు.చదవండి: ‘సత్యభామ’ మూవీ రివ్యూ -
వెండితెరపైకి స్టార్ కిడ్స్.. హీరో, హీరోయిన్, డైరెక్టర్‌గా
Paloma Dhillon Rajveer Deol Debut In Rajshri Productions: బాలీవుడ్ ఇండస్ట్రీలో సెలబ్రిటీల వారసులు వెండితెరపై ఎంట్రీ ఇవ్వడం సాధారణమే. ఇటీవలే బాలీవుడ్ బిగ్ ఫ్యామిలీస్ వారసులు అగస్త్యా నంద (అమితాబ్ బచ్చన్ మనవడు), ఖుషీ కపూర్ (బోనీ కపూర్-దివంగత నటి శ్రీదేవిల చిన్న కుమార్తె), సుహానా ఖాన్ (షారుక్ ఖాన్ కుమార్తె) నటిస్తున్న తొలి వెబ్ ఫిల్మ్ ‘ద ఆర్చీస్’ పోస్టర్ విడుదలైంది. తాజాగా మరో స్టార్ హీరో తనయుడు, నటి కుమార్తె వెండితెరపై ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ధర్మేంద్ర మనవడు, సన్నీ డియోల్ కుమారుడు రాజ్వీర్ డియోల్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ రాజశ్రీ ప్రొడక్షన్లో ఒక సినిమా తెరకెక్కనుంది. ఇందులో హీరోయిన్గా ప్రముఖ నటి పూనమ్ దిల్లాన్, నిర్మాత అశోక్ థకేరియా కుమార్తె పలోమా దిల్లాన్ తెరంగేట్రం చేయనుంది. వీరిద్దరికి ఇదే డెబ్యూ మూవీ కానుంది. అంతేకాకుండా ఈ చిత్రంతో డైరెక్టర్ సూరజ్ బర్జాత్యా కుమారుడు అవినీష్ ఎస్ బర్జాత్యా దర్శకుడిగా పరిచయం కానున్నాడు. రాజశ్రీ ప్రొడక్షన్లో 59వ చిత్రంగా వస్తున్న ఈ సినిమా షూటింగ్ ముంబైలో జులైలో ప్రారంభం కానుంది. కాగా మోడ్రన్ సంబంధాలను చూపిస్తూ లావిష్ డెస్టినేషన్ వెడ్డింగ్ కథతో రానుంది ఈ మూవీ. చదవండి: బాలీవుడ్ బిగ్ స్టార్స్ వారసులంతా ఒకే ఫ్రేమ్‌లో.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ముగ్గురు మిత్రుల కథ
బాలీవుడ్ సీనియర్ నటులు అమితాబ్ బచ్చన్, అనుపమ్ ఖేర్, బొమన్ ఇరానీ కలిసి ఓ సినిమాలో నటించనున్నారు. ‘మైనే ప్యార్ కియా’, ‘హమ్ ఆప్కే ౖహె∙కౌన్’, ‘ప్రేమ రతన్ ధన్ పాయో’ వంటి చిత్రాలను తెరకెక్కించిన సూరజ్ బర్జాత్యా ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాకు ‘ఊంచాయీ’ అనే టైటిల్ అనుకుంటున్నారని బాలీవుడ్ టాక్. ముగ్గురి వ్యక్తుల జీవితాల్లోని స్నేహం ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకోనుందని సమాచారం. ‘‘మే డే’ (అజయ్ దేవగన్ దర్శకత్వం వహిస్తూ, నటిస్తున్న చిత్రం) షూటింగ్లో అమితాబ్ బచ్చన్‌ను కలిశాను. సూరజ్ డైరెక్షన్‌లోని సినిమా గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఓ రోజు అనుపమ్ ఖేర్ ఫోన్ చేసి.. ‘ఇంకా ఏంటి ఆలస్యం.. టీమ్‌లోకి వచ్చెయ్’ అన్నారు. అంతే.. నేను కూడా ఈ సినిమా చేయడానికి సిద్ధమైపోయాను’’ అని పేర్కొన్నారు బొమన్ ఇరానీ. ఈ సినిమా షూటింగ్‌ను ఈ ఏడాది సెప్టెంబరులో ప్రారంభించాలనుకుంటున్నారు. -
‘ఫ్రెండ్షిప్’ మీద సూరజ్ బర్జాత్యా కన్ను
సూరజ్ బర్జాత్యా భారతీయ సినిమాను తిరిగి ఇళ్ల డ్రాయింగ్ రూమ్‌లలోకి తీసుకొచ్చిన దర్శకుడు. తల్లి దండ్రీ కొడుకు కోడలు బంధువులు అందరూ కలిసి ఉండే భారతీయ సెంటిమెంట్‌ను విపరీతంగా ఉపయోగించి సూపర్‌హిట్ లు కొట్టాడు. ‘హమ్ ఆప్కే హై కౌన్’, ‘హమ్ సాత్ సాత్ హై’ సినిమాలు ఇందుకు నిదర్శనం. ఇక ప్రేమికులను ఉర్రూతలూగించిన ‘మైనే ప్యార్ కియా’ ఎంత ట్రెండ్ క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. వివాహ బంధం మీద ‘వివాహ్’ తీసి బ్లాక్‌బస్టర్ చేశాడాయన. ఇక అతని చివరి చిత్రం ‘ప్రేమ్ రతన్ ధన్‌పాయో’ కూడా పెద్ద హిట్టే. ఇప్పుడు సూరజ్ బర్జాత్యా కన్ను ‘స్నేహం’ మీద పడింది. అతని అన్ని సినిమాల్లో స్నేహితుల పాత్రలు కనిపించినా ఈసారి స్నేహితులే లీడ్ రోల్స్‌లో కనిపించనున్నారు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అమితాబ్ బచ్చన్, బొమన్ ఇరానీ ఈ సినిమాలో ఇతని స్నేహితులుగా నటించనున్నారు. వీరిద్దరి ప్రతిభ ప్రేక్షకులకు తెలుసు. పైగా గతంలో ‘వక్త్’ సినిమాలో నటించి నవ్వులు పండించారు. ఇప్పుడు సూరజ్ బర్జాత్యా సినిమాలో ఏం సందడి చేస్తారో తెలియదు.తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు తీసుకుని సూరజ్ ఈ సినిమాలు తీయనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరిలో షూటింగ్ మొదలు కానుంది. -
ఆ సూపర్‌స్టార్ షో నాకు అస్సలు నచ్చదు!
ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, ప్రముఖ దర్శకుడు సూరజ్ బర్జాత్యా మధ్య మంచి అనుబంధం ఉంది. ఈ ఇద్దరూ కలిసి ‘మైనే ప్యార్ కియా’, ‘హమ్ ఆప్కే హై కౌన్’ నుంచి గత సంవతర్సం వచ్చిన ‘ప్రేమరతన్ ధన్‌పాయో’ సినిమా వరకు సూపర్హిట్లు అందించారు. నిజానికి బర్జాత్యా తీసిన ఎక్కువ సినిమాల్లో సల్మానే హీరో. అయిన ఈ కండలవీరుడు హోస్ట్‌గా ఉన్న ‘బిగ్ బాస్’ రియాలిటీ షో తనకు అస్సలు నచ్చదని దర్శకుడు బర్జాత్యా కుండబద్దలు కొట్టారు. ‘నాకు ‘బిగ్‌బాస్’ షో నచ్చదు. నేను దానిని (సల్మాన్ వ్యాఖ్యాతగా కనిపించే వీకెండ్ వార్ ఎపిసోడ్‌ను) అసలే చూడను. నిజానికి టీవీని నేను పెద్దగా చూడను. న్యూస్ షోలు అప్పుడప్పుడు చూస్తుంటాను. శక్తి, శనీ వంటి టీవీ సీరియళ్లు చూస్తుంటాను’ అని బర్జాత్యా విలేకరులతో అన్నారు. తన తాజా టీవీ షో ’ఎక్ స్వాభిమాన్’ లాంచ్ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సల్మాన్ బిగ్‌బాస్ షో గురించి ప్రశ్నించగా బర్జాత్యా ఈవిధంగా స్పందించారు. -
'విలువలు నిండిన ఫ్యామిలీ చిత్రాలు రావాలి'
ముంబయి: ఈ రోజుల్లో యువత కుటుంబ విలువలకు సంబంధించిన చిత్రాలపై దృష్టిసారించి రూపొందిస్తే బాగుంటుందని ప్రముఖ దర్శకుడు సూరజ్ బరజాత్య అన్నారు. ' 1990లో మైనే ప్యార్ కియా చిత్రంతో మాకు ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు వంటి విభాగాల్లో అవార్డులు వచ్చాయి. అప్పుడు నేను యువకుడిని. పైగా ఇండస్ట్రీకి కొత్త' అని ఆయన గుర్తు చేసుకున్నారు. బిగ్ స్టార్ ఎంటర్టైన్మెంట్ అవార్డులు 2015 కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు అనుభవాలు పంచుకున్నారు. 'ఈరోజుల్లో యువదర్శకులకు ఎంతో టాలెంట్ ఉంది. అందుకే వారు మరిన్ని మంచి చిత్రాలు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. వచ్చే తరంవారికి మంచి కుటుంబ విలువలతో కూడిన చిత్రాలను అందించే బాధ్యత వారిదే' అని ఆయన అన్నారు. ఆయన తాజాగ రూపొందించిన చిత్రం ప్రేమ్ రతన్ దన్ పాయో ఈ ఏడాది బిగ్ స్టార్ ఎంటర్టైన్మెంట్ నుంచి నాలుగు అవార్డు లను అందుకుంది. -
అమూల్యమైన ప్రేమ నాకు దక్కింది!
సూరజ్ బర్జాత్యా చిత్రంలో కథానాయికగా అవకాశం రావడమంటే సదరు హీరోయిన్‌కు సుడి తిరిగినట్టే. భాగ్యశ్రీ, మాధురీదీక్షిత్, కరిష్మాకపూర్, కరీనా కపూర్... వీరందరూ సూరజ్ సినిమాల్లో నటించి పేరు సంపాదించుకున్నవారే. త్వరలో ఆ జాబితాలోకి అనిల్‌కపూర్ కుమార్తె సోనమ్‌కపూర్ కూడా చేరబోతున్నారు. సూరజ్ బర్జాత్యా చిత్రంలో ఛాన్స్ కొట్టేశారామె. పైగా ఈ సినిమాలో కథానాయకుడు ఎవరనుకున్నారు? బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్. ఇందులో సల్మాన్ ద్విపాత్రాభినయం చేస్తుండటం మరో విశేషం. ఇందులో ఓ పాత్ర పేరు ‘ప్రేమ్’. సూరజ్ దర్శకత్వంలో సల్మాన్ ఇప్పటికి మూడు సినిమాల్లో నటించారు. ఆ మూడింటిలో ఆయన పేరు ప్రేమ్. ఈ నాలుగో సినిమాలో కూడా సల్మాన్ పాత్ర పేరు ‘ప్రేమ్’ కావడం విశేషం. మరో పాత్ర ‘విజయ్’. ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ అనే టైటిల్‌ని కూడా సూరజ్ ఖరారు చేశారు. ‘అమూల్యమైన ప్రేమ్ ప్రేమ నాకు దక్కింది’ అని ఈ టైటిల్‌కి అర్థం. ‘పాయోజీ రామ్ రతన్ ధన్ పాయో’ అని సాగే మీరాబాయి కీర్తన నుంచి స్ఫూర్తి పొంది ఈ టైటిల్‌ని ఖరారు చేశారాయన. ఈ సినిమాలో నాయికగా నటిస్తుండటంతో సోనమ్ ఆనందానికి పట్టపగ్గాల్లేవు. ‘‘‘హమ్ ఆప్కే హై కౌన్’లోని ‘దీదీ తేరా దేవర్ దీవానా’ పాట, ఆ పాటలో ఆకుపచ్చ డ్రస్‌లో మాధురీ దీక్షిత్.. నేను జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకం అది. నేనే గనుక నటినైతే... ఎప్పటికైనా ఇలాంటి దుస్తుల్ని ధరించి, అంత మంచి పాటలో నర్తించి, మాధురిలా మన్ననలను పొందాలని కలలు కనేదాన్ని. ఆ కోరిక ఇంత తేలిగ్గా నెరవేరుతుందనుకోలేదు’’ అని ఆనందం వ్యక్తం చేశారు సోనమ్.