
హిందీలో ‘మైనే ప్యార్ కియా, హమ్ అప్ కే హై కౌన్, ఊంచాయీ’ వంటి సక్సెస్‌ఫుల్ ఫిల్మ్స్ తీసిన ప్రముఖ దర్శకుడు సూరజ్ బర్జాత్యా(Sooraj Barjatya) మరో కథను రెడీ చేశారు. ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా(Ayushmann Khurrana) హీరోగా నటించనున్నారు.
కాగా ఈ మూవీలో హీరోయిన్‌గా శార్వరీ(Sharvari)ని తీసుకోవాలనుకుంటున్నారట. సూరజ్ బర్జాత్యా వంటి సీనియర్ దర్శకుడి సినిమా కావడంతో శార్వరీ వెంటనే ఓకే చెప్పారని బాలీవుడ్ భోగట్టా. ఈ వేసవిలో ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించి, వచ్చే ఏడాది ప్రారంభంలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment