![Sooraj Barjatya Says He Makes Actors Cry, Calls Himself Selfish Director](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/Director.jpg.webp?itok=UMJduujl)
కొంతమంది దర్శకులు సెట్‌లో నటీనటులపై నోరుపారేసుకుంటారు. తాను కూడా అదే జాబితాలోకి వస్తానంటున్నాడు ప్రముఖ డైరెక్టర్ సూరజ్ బర్జాత్య (Sooraj Barjatya). ఆవేశంలో కొంతమంది హీరోయిన్లపై అరిచానని చెప్తున్నాడు. బడా నామ్ కరేంగే వెబ్ సిరీస్‌తో ఈయన ఓటీటీ (OTT)లో అడుగుపెడుతున్నాడు. ఈ సిరీస్ ప్రమోషన్స్‌లో సూరజ్ మాట్లాడుతూ.. కెరీర్ ప్రారంభంలో చాలామంది హీరోయిన్లను ఏడిపించాను. ఎక్కువగా చిరాకు పడుతూ అందరిమీదకు అరిచేవాడిని.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/bhagyasree1.jpg)
ఆమెను అడిగినా చెప్తుంది
అలా భాగ్యశ్రీ (Bhagyashree) మీద ఒకసారి గట్టిగా అరవడంతో ఆమె సెట్‌లోనే ఏడ్చింది. ఈ విషయం తనను అడిగినా చెప్తుంది. కానీ రానురానూ నా ప్రవర్తనను మార్చుకున్నాను. ప్రశాంతంగా ప్రేమగా చెప్తేనే మంచి ఫలితాలు వస్తాయని గ్రహించాను. సెట్‌లోకి వెళ్లేముందు అన్నీ సిద్ధం చేసుకునేవాడిని. ఆ రోజు ఏది షూట్ చేయాలనేది ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకునేవాడిని. కాస్ట్యూమ్ నుంచి మొదలుకుని ప్రతీది క్షుణ్ణంగా పరిశీలించేవాడిని.
అందుకే ఐదేళ్లు పట్టింది
అన్నీ కుదిరాకే సెట్‌లో అడుగుపెట్టేవాడిని. అందుకే నాకు ఈ సిరీస్ చేయడానికి ఐదేళ్లు పట్టింది. షూటింగ్ సెట్‌లో సన్నివేశాల్ని డైరెక్ట్ చేయాలే తప్ప వాటిని సరిదిద్దుతూ కూర్చోకూడదన్నది నా నియమం. దర్శకుడిగా నేను చాలా స్వార్థపరుడిని. సినిమాకు ఏమేం అవసరమో అవన్నీ సెట్టయ్యాకే షూటింగ్ మొదలుపెడతాను. నా మూవీ మీకు నచ్చాలని ఆశిస్తాను. కలెక్షన్స్ గురించి ఆలోచించను.
నా మొదటి ప్రాధాన్యత దానికే
డైరెక్టర్‌గా నేను ఎవరి మాటా వినను. ప్రతి డైలాగ్‌లో కూడా దూరి కరెక్ట్‌గానే సరిపోయిందా? లేదా? అనేది చెక్ చేస్తాను. విజువల్స్ కన్నా కథకే ఎక్కువ ప్రాధాన్యమిస్తాను అని చెప్పుకొచ్చాడు. కాగా సూరజ్ బర్జాత్య.. మైనే ప్యార్ కియా చిత్రంతో వెండితెరపై దర్శకుడిగా ప్రయాణం ఆరంభించాడు. ఈ మూవీలో సల్మాన్ ఖాన్, భాగ్యశ్రీ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది.
సినిమా
సూరజ్.. హమ్ ఆప్కే హై కౌన్, హమ్ సాత్ సాత్ హై, వివాహ్, ప్రేమ్ రతన్ ధన్ పాయో వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు తెరకెక్కించాడు. బడా నామ్ కరేంగే వెబ్ సిరీస్ విషయానికి వస్తే.. రితిక్ ఘన్షన్, ఆయేషా కడుస్కర్, రాజేశ్ తైలంగ్, అంజన సుఖని, ప్రియంవదకాంత్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సిరీస్ సోనీలివ్‌లో స్ట్రీమింగ్ కానుంది.
చదవండి: ఐశ్వర్య రాజేశ్ హిట్ సిరీస్ సీక్వెల్ వచ్చేస్తోంది.. ఎప్పుడంటే?
Comments
Please login to add a commentAdd a comment