ఐశ్వర్య రాజేశ్‌ హిట్‌ సిరీస్‌ సీక్వెల్‌ వచ్చేస్తోంది.. ఎప్పుడంటే? | Aishwarya Rajesh Starrer Suzhal 2 OTT Release Date Out | Sakshi
Sakshi News home page

OTT: సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్‌ కొత్త సిరీస్‌.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

Published Tue, Feb 11 2025 2:27 PM | Last Updated on Tue, Feb 11 2025 3:04 PM

Aishwarya Rajesh Starrer Suzhal 2 OTT Release Date Out

ఈ మధ్య సీక్వెల్స్‌ అనేవి సర్వసాధారణమైపోయాయి. సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు హిట్టయ్యాయంటే చాలు దానికి కొనసాగింపుగా రెండో భాగం, మూడో భాగం తీస్తూనే ఉన్నారు. తాజాగా తమిళ క్రైమ్‌ థ్రిల్లర్‌ 'సుడల్‌: ది వోర్టెక్స్‌' (Suzhal The Vortex) వెబ్‌ సిరీస్‌కు సీక్వెల్‌ రిలీజ్‌ డేట్‌ ప్రకటించారు. ఐశ్వర్య రాజేశ్‌ (Aishwarya Rajesh), కదీర్‌ (Kathir) ప్రధాన పాత్రలో నటించిన ఈ థ్రిల్లర్‌ సిరీస్‌ ఫిబ్రవరి 28 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లోకి రానుంది. ఈ విషయాన్ని ప్రైమ్‌ వీడియో అధికారికంగా వెల్లడించింది. ఇది చూసిన అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

తమిళంలో వచ్చిన బెస్ట్‌ సిరీస్‌లో సుడల్‌ ఒకటి అని.. ఇన్నాళ్లకు రెండో పార్ట్‌ రిలీజ్‌ చేస్తుండటం సంతోషంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. సుడల్‌ మొదటి భాగం 2022లో అమెజాన్‌ ప్రైమ్‌లో రిలీజైంది. పార్తీబన్‌, కదీర్‌, ఐశ్వర్య రాజేశ్‌, శ్రేయారెడ్డి ముఖ్యపాత్రలు పోషించారు. పుష్కర్‌-గాయత్రి జంట కథ అందించగా బ్రహ్మ అనుచరణ్‌ దర్శకత్వం వహించారు. రెండో భాగానికి కూడా వీళ్లే పని చేస్తున్నారు.

సుడల్‌ కథేంటి?
తమిళనాడులోని సాంబలూరు అనే చిన్న గ్రామంలో ప్రజలు సిమెంట్‌ ఫ్యాక్టరీపై ఆధారపడి జీవనం సాగిస్తారు. ఆ ఫ్యాక్టరీ ప్రారంభించిన సమయంలో ఓ అమ్మాయి కనిపించకుండా పోతుంది. దాదాపు పాతికేళ్ల తర్వాత ఫ్యాక్టరీ తగలబడుతుంది. అప్పుడు ఫ్యాక్టరీ యూనియన్‌ లీడర్‌ షణ్ముఖం (పార్తిబన్‌) కూతురు నీల కనిపించకుండా పోతుంది. 

మరి ఆ అమ్మాయిలు ఏమయ్యారు? నీల సోదరి నందిని (ఐశ్వర్య రాజేశ్‌) సొంతూరిని వదిలేసి కోయంబత్తూరులో ఎందుకుంటోంది? ఈ మిస్సింగ్‌ల వెనక నీల హస్తం ఉందా? అనే ఆసక్తికర అంశాలతో సిరీస్‌ ఉత్కంఠగా సాగుతుంది. ఈ సిరీస్‌ మొత్తం ఎనిమిది ఎపిసోడ్‌లతో ఉంటుంది.

 

 

చదవండి: తల్లి అయ్యాక పూర్తిగా మారిపోయాను.. నచ్చితేనే చేస్తా : హీరోయిన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement