![Sonam Kapoor Says I Dont Like Someone,Then It Very Hard For Me To Work With Them](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/sonam.jpg.webp?itok=U0vTe2P3)
నచ్చని వారితో పని చేయడం తనకు నచ్చదని అంటోంది హీరోయిన్ సోనమ్ కపూర్(Sonam Kapoor). కపూర్ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ బ్యూటీ..పెళ్లి తర్వాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. వెండితెరపై అరుదుగా కనిపించినా.. సోషల్ మీడియా ద్వారా మాత్రం ఎప్పుడూ అభిమానులతో టచ్‌లోనే ఉంటుంది. అప్పుడప్పుడు ఫోటోషూట్స్ చేస్తూ ఫాలోవర్స్‌ని పెంచుకుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనమ్.. తన వ్యక్తిగత, ప్రొఫిషినల్ కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.
బిడ్డ పుట్టాక మారిపోయాను
కెరీర్ పరంగా బిజీగా ఉన్న సమయంలోనే సోనమ్ ప్రేమ వివాహం చేసుకుంది. 2018లో తన ప్రియుడు, వ్యాపారవేత్త ఆనంద్ అహుజాని సోనమ్ పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఈ జంటకి ఓ బాబు ఉన్నాడు. పేరు వాయు. కొడుకు పుట్టిన తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయిందని అంటోది సోనమ్. ‘తల్లి అవ్వడం అనేది నన్ను పూర్తిగా మార్చేసింది. అది మహిళలకు శారీరికంగా, మానసికంగా.. అన్ని రకాలుగా మార్చేస్తుంది. అసలు ముందు ఉన్న మనిషి కాదేనే అనిపించేస్తుంది.ప్రతి తల్లికి పిల్లలే మీకు మొదటి ప్రాధాన్యత అవుతారు. నా కొడుకు బాగోగులు చూసుకోవడమే నాకు ముఖ్యం. ఆ తర్వాతే సమయం ఉంటేనే సినిమాలు చేస్తా’ అని సోనమ్ చెప్పుకొచ్చింది.
నచ్చితేనే చేస్తా
నా పర్సనల్ లైఫ్ చాలా బాగుంది. భర్త, పిల్లలే నా ప్రపంచం. సినిమాల్లో కూడా నటిస్తాను. నన్ను నమ్మి, సరదాగా పని చేసే దర్శకులతో మాత్రమే సినిమా చేస్తాను. హీరోయిన్‌గా బిజీగా ఉన్న రోజుల్లో కూడా ఇదే ఫాలో అయ్యాను. చాలా జాగ్రత్తలు తీసుకొని సినిమాలను సెలెక్ట్ చేసుకునేదాన్ని. ఇప్పటికీ అదే ఫాలో అవుతున్నాను. మనిషిగా మనం ఎదిగేలా చేసేవారితోనే ఎక్కువగా పనిచేస్తాను. ఒకరు నాకు నచ్చకపోతే వారితో కలిసి పనిచేయడం చాలా కష్టం. నేను ఎలాంటి కథలు ఎంపిక చేసుకుంటున్న అనే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను’ అని సోనమ్ వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment