sonam Kapoor
-
తారలు తరలి వెళ్లారు...
దుబాయ్: దాయాదుల దమ్మెంతో ప్రత్యక్షంగా చూసేందుకు తారలంతా దుబాయ్‌కి తరలి వెళ్లారు. ఏదో ఒక రంగమని కాకుండా... సినీ, క్రీడా, వ్యాపార, రాజకీయ రంగాలకు చెందిన హేమాహేమీలతో దుబాయ్ స్టేడియం ఓ తారాతీరమైంది. మైదానంలో భారత ఆటగాళ్లు, గ్యాలరీలో భారత అతిరథులతో స్టేడియం కళకళలాడింది.టీమిండియా క్రికెటర్లు జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, టీమిండియా మాజీ సభ్యులు శిఖర్ ధావన్, వెంకటేశ్ ప్రసాద్... తెలుగు సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, ‘పుష్ప’ సీక్వెల్స్‌తో పాన్ ఇండియా డైరెక్టర్ అయిన సుకుమార్, బాలీవుడ్ నుంచి హీరోయిన్ సోనమ్ కపూర్ తన భర్త ఆనంద్ అహుజాతో కలిసి రాగా, వివేక్ ఒబెరాయ్, ఊర్వశీ రౌతేలా, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్‌కర్డ్ సంగ్మా, త్రిపుర వెస్ట్ నియోజకవర్గం లోక్‌సభ సభ్యుడు బిప్లాబ్ కుమార్ దేబ్, ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, బ్రిటన్ పాప్ సింగర్ జాస్మిన్ వాలియా, బాలీవుడ్ చిత్ర గీతాలతో పాపులర్ అయిన పాకిస్తాన్ సింగర్ అతీఫ్ అస్లామ్ తదితరులతో వీఐపీ గ్యాలరీలు కొత్త శోభను సంతరించుకున్నాయి. పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్ షాహిద్ అఫ్రిది, ఇమాద్ వసీమ్, పాక్ దివంగత ప్రధాని బెనజీర్ భుట్టో కుమార్తె భక్తావర్ భుట్టో జర్దారి, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కుమారుడు ఖాసీమ్ ఖాన్, హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్ రావు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ క్రీడా విభాగం, ఐటీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ తదితరులు మ్యాచ్‌ను తిలకించిన వారిలో ఉన్నారు. -
తల్లి అయ్యాక పూర్తిగా మారిపోయాను.. నచ్చితేనే చేస్తా : హీరోయిన్
నచ్చని వారితో పని చేయడం తనకు నచ్చదని అంటోంది హీరోయిన్ సోనమ్ కపూర్(Sonam Kapoor). కపూర్ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ బ్యూటీ..పెళ్లి తర్వాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. వెండితెరపై అరుదుగా కనిపించినా.. సోషల్ మీడియా ద్వారా మాత్రం ఎప్పుడూ అభిమానులతో టచ్‌లోనే ఉంటుంది. అప్పుడప్పుడు ఫోటోషూట్స్ చేస్తూ ఫాలోవర్స్‌ని పెంచుకుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనమ్.. తన వ్యక్తిగత, ప్రొఫిషినల్ కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.బిడ్డ పుట్టాక మారిపోయానుకెరీర్ పరంగా బిజీగా ఉన్న సమయంలోనే సోనమ్ ప్రేమ వివాహం చేసుకుంది. 2018లో తన ప్రియుడు, వ్యాపారవేత్త ఆనంద్ అహుజాని సోనమ్ పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఈ జంటకి ఓ బాబు ఉన్నాడు. పేరు వాయు. కొడుకు పుట్టిన తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయిందని అంటోది సోనమ్. ‘తల్లి అవ్వడం అనేది నన్ను పూర్తిగా మార్చేసింది. అది మహిళలకు శారీరికంగా, మానసికంగా.. అన్ని రకాలుగా మార్చేస్తుంది. అసలు ముందు ఉన్న మనిషి కాదేనే అనిపించేస్తుంది.ప్రతి తల్లికి పిల్లలే మీకు మొదటి ప్రాధాన్యత అవుతారు. నా కొడుకు బాగోగులు చూసుకోవడమే నాకు ముఖ్యం. ఆ తర్వాతే సమయం ఉంటేనే సినిమాలు చేస్తా’ అని సోనమ్ చెప్పుకొచ్చింది.నచ్చితేనే చేస్తానా పర్సనల్ లైఫ్ చాలా బాగుంది. భర్త, పిల్లలే నా ప్రపంచం. సినిమాల్లో కూడా నటిస్తాను. నన్ను నమ్మి, సరదాగా పని చేసే దర్శకులతో మాత్రమే సినిమా చేస్తాను. హీరోయిన్గా బిజీగా ఉన్న రోజుల్లో కూడా ఇదే ఫాలో అయ్యాను. చాలా జాగ్రత్తలు తీసుకొని సినిమాలను సెలెక్ట్ చేసుకునేదాన్ని. ఇప్పటికీ అదే ఫాలో అవుతున్నాను. మనిషిగా మనం ఎదిగేలా చేసేవారితోనే ఎక్కువగా పనిచేస్తాను. ఒకరు నాకు నచ్చకపోతే వారితో కలిసి పనిచేయడం చాలా కష్టం. నేను ఎలాంటి కథలు ఎంపిక చేసుకుంటున్న అనే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను’ అని సోనమ్ వివరించింది. -
వేదికపై కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్.. ఆయనను గుర్తు చేసుకుని!
బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ తీవ్ర భావోద్వేగానికి గురైంది. గురుగ్రామ్‌లో జరిగిన ఓ ఫ్యాషన్ ఈవెంట్లో పాల్గొన్న ఆమె స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకుంది. స్టేజీపై ర్యాంప్ వాక్ చేస్తున్న ఏడుస్తూ కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ ఫ్యాషన్ వేడుకను దివంగత ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్‌కు నివాళిగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రోహిత్ బల్‌ను గుర్తింపు తెచ్చుకున్న సోనమ్ కపూర్ ఎమోషనల్ అయ్యారు. సోనమ్ కన్నీళ్లతో ర్యాంప్ వాక్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.ఆమె మాట్లాడుతూ .. "రోహిత్ బల్ కోసం నేను ఇక్కడకు రావడం చాలా సంతోషంగా ఉంది. అతని దుస్తులను చాలాసార్లు ధరించడం సంతోషం కలిగించింది. నా కోసం అతను చాలాసార్లు దుస్తులు డిజైన్ చేయించారు. బహుశా అతని కోసం చివరి ప్రదర్శన చేయడం చాలా అద్భుతంగా అనిపించింది. వారసత్వ, హస్తకళ వేడుక ప్రతిదీ ఆనందంగా జరుపుకోవడమే. నేను అదే విధంగా దుస్తులు ధరించడం ఇష్టపడతాను.' అని తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగమైనందుకు సోనమ్ ఆనందాన్ని వ్యక్తం చేసింది.సోనమ్ తన ఇన్‌స్టాలో ఫోటోలు పోస్ట్ చేస్తూ.. " లెజెండరీ రోహిత్ బల్కు నివాళిగా నడవడం గౌరవంగా భావిస్తున్నా. అతని కళాత్మకత, దృష్టి, వారసత్వం భారతీయ ఫ్యాషన్‌ను అద్భుతంగా తీర్చిదిద్దాయి. అతని జ్ఞాపకార్థం ర్యాంప్ వాక్ చేయడం ఉద్వేగభరితంగా అనిపించింది. ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం. ఒక రూపకర్తగా ఆయన ఒక ఐకాన్' అంటూ పోస్ట్ చేసింది.కాగా.. సోనమ్‌తో పాటు చిత్రనిర్మాత మధుర్ భండార్కర్, ఫ్యాషన్ డిజైనర్ వాలయ, నటులు ఈషా గుప్తా, రాహుల్ దేవ్, ముగ్దా గాడ్సే కూడా రోహిత్ బల్కు నివాళులర్పించేందుకు ర్యాంప్ వాక్ చేశారు. View this post on Instagram A post shared by The Word. (@thewordmagazine) View this post on Instagram A post shared by Sonam A Kapoor (@sonamkapoor) -
తెల్ల గులాబీలా హీరోయిన్.. వాచ్ ధర అన్ని లక్షలా?!
బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ అహుజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్లో అత్యధిక పారితోషకం తీసుకునే హీరోయిన్లో ఆమె ఒకరు. నేషనల్ ఫీల్మ్ అవార్డుతో సహా పలు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్న నటి. అలాగే ఫోర్బ్స్ మ్యాగ్జైన్లో 2012, 2016లలో అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో చోటు దక్కించుకుంది. అంతేగాదు ఆమె ఇల్లు కూడా భారతీయ వారసత్వ కళకు అద్దం పట్టేలా అత్యంత అందంగా ఉంటుంది. ఫ్యాషన్ పరంగా కూడా సోనమ్‌కి సాటి లేరెవ్వరూ. అంతలా ఆమె ఫ్యాషన్ వార్డ్ రోబ్‌లో బ్రాండెడ్ ప్రొడక్ట్స్ కలెక్షన్ భారీగానే ఉంటుంది. సందర్భానుసారంగా డ్రెస్సింగ్ స్టైల్ అందుకు తగ్గ యాక్సెసరీలు ధరిస్తారామె. తాజాగా ఆమె ధరించి వాచ్ చూస్తే కళ్లు చెదిరిపోతాయి. దాని ధర కూడా అంతేస్థాయిలో అవాక్కయ్యేలా ఉంటుంది. మరీ ఆ వాచ్ విశేషాలేంటో సవివరంగా చూద్దామా..!.సోనమ్ కపూర్(Sonam Kapoor) ఇటీవల పారిస్ ఫ్యాషన్ వీక్(Paris Fashion Week)లో జరిగిన ఎలీ సాబ్ హాట్ కోచర్ షో(Elie Saab haute couture show)కు హాజరయ్యారు. ఈ ఈవెంట్ కోసం ఆమె ఉల్లాసభరితమైన ఆల్-వైట్ లుక్‌లో మైమరిపించింది. ఆమె పీస్ఫుల్ డ్రెస్సింగ్ వేర్ మనసుకు ఆహ్లాదంగా కనుచూపుని తిప్పుకోని విధంగా ఉంది. ముఖ్యంగా ఆమె చేతికి ధరించిన వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. నటి హై-ఎండ్ వాచ్ - పియాజెట్ లైమ్లైట్ గాలా ప్రెషియస్ రెయిన్‌బోని ధరించింది. దీన్ని పూర్తిగా విలువైన రంగు రాళ్లతో డిజైన్ చేశారు. అచ్చం రెయిన్ బో కలర్స్ మాదిరిగా ధగ ధగ మెరుస్తూ ఉంటుంది ఈ వాచ్. బ్రాస్లెట్ మాదిరిగా ఉన్న ఈ వాచ్ ధర దగ్గర దగ్గర రూ. 94 లక్షలు పైనే అంటే.. రూ. 1 కోటి పలుకుతుందట. 1973ల నాటి వింటేజ్ పీస్ అయినా ఈ వాచ్ మరోసారి ఫ్యాషన్ ప్రియుల మనుసుని దోచుకునేలా హైలెట్‌గా నిలిచింది. ఇక సోనమ్ తన సోదరి, స్టైలిస్ట్ చిత్ర నిర్మాత రియా కపూర్ డిజైన్ చేసిన డ్రెస్‌ని ధరించారు. ఆ డ్రస్‌కి తగ్గట్టు సన్‌గ్లాసెస్, గులాబీ ఆకారపు చెవిపోగులు, స్టేట్మెంట్ రింగులు, ఈ లగ్జరీ వాచ్‌తో రాయల్టీగా కనిపించారు సోనమ్. View this post on Instagram A post shared by Rhea Kapoor (@rheakapoor) (చదవండి: 61 ఏళ్ల వయసులో బరువు తగ్గిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. జస్ట్ ఐదు నెలల్లోనే..) -
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ పాతికేళ్ల పండగలో మెరిసిన తారలు
-
ముంబైలోని విలాసవంతమైన ఇంటిలో స్టైలిష్‌గా సోనమ్ (ఫోటోలు)
-
‘నేనే ఇలా ఎందుకమ్మా..’ అని అమ్మని పట్టుకుని ఏడ్చేదాన్ని: హీరోయిన్
ట్రోల్ చేసి మనల్ని వెనక్కు లాగేవాళ్లు ఉన్నట్లే, మోటివేట్ చేసి ముందుకు నడిపించే వాళ్ళూ ఉంటారు. సోనమ్ కపూర్‌ను అలా ముందుకు నడిపించిన వ్యక్తి కాజోల్. అయితే కాజోల్ కు సోనమ్ ఆ సంగతి నేరుగా ఎప్పుడూ చెప్పలేదు. మనసులోనే ఉన్న కాజోల్ నుంచి ప్రేరణను పొందారు సోనమ్. సినిమాల్లో కాజోల్ పీక్ దశను కూడా దాటేసి ఉన్నప్పుడు సోనమ్ వయసు 16. పదహారు అంటే పుస్తకాల్లో రాసినట్లు స్వీట్ సిక్స్ టీనే కానీ, అందరి విషయంలోనూ స్వీట్ కాక΄ోవచ్చు. ఆ వయసులో సోనమ్ అందమైన, లేత ముఖం మీద వెంట్రుకలు కనిపించేవి. పెద్ద పెద్ద మొటిమలు ఉండేవి. బరువు కూడా పెరిగింది. తనకు పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్) ఉందనీ, ముఖంపై వెంట్రుకలు రావటం, బరువు పెరగటం, మొటిమలు.. ఇవన్నీ పీసీఓఎస్వల్లనేనని ఫ్యామిలీ డాక్టర్ తొలిసారి చెప్పినప్పుడు సోనమ్ కుంగి పోయింది. తల్లిని చుట్టేసుకుని బావురుమంది. అయితే సోనమ్‌కు అంతకన్నా పెద్ద కష్టం వచ్చి పడింది! అందరూ ఆమెను చూసి, ‘అనిల్ కపూర్ కూతురు కదా..’ అనేవాళ్లట.. ‘ఇలా ఉందేమిటి!!’ అనే అర్థంలో! (యువతుల డ్రీమ్ బాయ్ అని అనిల్ కపూర్‌కు పేరు). పాపం నాన్న పేరు పోతోందే నా కారణంగా..’ అని సోనమ్ బాధపడుతుండేది. ‘నేనే ఇలా ఎందుకు ఉన్నానమ్మా..’ అని తల్లిని పట్టుకుని కంటతడి పెట్టుకునేది.ఓరోజు తల్లి ఆమెకు కాజోల్ ఫొటో చూపించి, ‘తను స్టార్ హీరోయిన్ కదా. అయితే ఆ కనుబొమలు చూడు. రెండూ కలిసిపోయి ఉన్నాయి. కొందరికి ఇలానే ‘యూనిబ్రో’ ఉంటుంది. అయినా సరే ఆమె ఎప్పుడూ తన కనుబొమలు షేప్ చేయించుకోలేదు. అలాగే ఉంచేసుకున్నారు. అందమంటే అది బంగారం, ఆమెలోని ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని చెప్పారు. తల్లి మాటలు సోనమ్‌లో బాగా నాటుకుపోయాయి. ఆమె ముఖం సంతోషంతో వెలిగిపోయింది. కాజోల్కు మనసులోనే థాంక్స్ చెప్పుకుంది. తనను ట్రోల్ చేసే వాళ్లను పట్టించుకోవటం మానేసింది. సోనమ్‌కు పదహారు దాటి 17 లోకి రాగానే దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ దగ్గర అవకాశం వచ్చింది. ఆయన ‘బ్లాక్’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశారు సోనమ్. తర్వాత 2007 లో నటిగా తన తొలి చిత్రం ‘సావరియా’ తో బాలీవుడ్ లోకి ప్రవేశించారు. ఆ తర్వాత తన తండ్రితో కలిసి ఒక చిత్రంలో కూడా కనిపించారు. తన పీసీఓఎస్ఎప్పుడు మాయమై΄ోయిందో కూడా సోనమ్‌కి గుర్తులేదు. ట్రోల్స్ కూడా అంతే. వస్తాయి. పోతాయి. ‘అంత పెద్ద స్టార్ అయిండీ కాజోల్ తన యూనిబ్రోని ఒక సమస్యగా తీసుకోకపోవటం అన్నది నాలో అంతర్లీనంగా పని చేసి, స్ఫూర్తిని నింపింది..’ అని తాజాగా బర్ఖాదత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు సోనమ్ కపూర్. ఇదీ చదవండి: ఐపీఎల్ వేలం 2025 : అదిరే డ్రెస్‌లో నీతా అంబానీ, ధర ఎంతో తెలుసా? -
సోనమ్ కపూర్ డ్రీమ్ హౌస్, అది మరో ప్రపంచం
బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ఇల్లుభారతీయ హస్తకళ, రాచరికపు వారసత్వ కళతో ఆకట్టుకుంటుంది. ముంబైలో ఉన్న ఆమె ఇల్లు తంజోర్ పెయింటింగ్స్, నాగా ప్యానెల్స్, రాజస్థానీ జాలీస్, జర్దోజీ ఎంబ్రాయిడరీలతో.. రాజ సౌధాలకు మించిన అద్భుతంతో అలరారుతుంటుంది. సోనమ్ ఆంటీ ఎడి 100 ఇంటీరియర్ డిజైనర్ కవితా సింగ్ సోనమ్ ఇంటి డిజైనింగ్‌లో పాలుపంచుకుంది.మనం అత్యంత ఇష్టపడే తారల్లో సోనమ్ కపూర్ ఒకరు. ఆమెకు ఇష్టమైనది మాత్రం భారతీయ వారసత్వ కళ అని ఆమె ఇంటిని చూసిన వారికి ఇట్టే అర్ధం అవుతుంది. ఇంటీరియర్ డిజైనర్ కవితా సింగ్ ఈ హంగులను ప్రస్తావిస్తూ –‘‘సోనమ్ ఆసక్తిని లోతుగా పరిశోధించడానికి ఆమెతో కలిసి కొంత కాలం ప్రయాణించాను. సెప్టెంబర్ 2021లో ఆమె నాటింగ్ హిల్ పైడ్ – ఎ – టెర్రే, కెన్సింగ్టన్ స్టూడియోలు రెండింటినీ చూశాను. వాటి పునరుద్ధరణలో ఆమె ప్రతిభ, కళల పట్ల ఉన్న అవగాహనను చూసి ఆశ్చర్యపోయాను. ఆమె నాతో మాట్లాడుతూ ‘నేను నా భర్త ఆనంద్, కొడుకు వాయుతో పంచుకునే ఈ ఇంటిని ఒక మహిళగా, నిర్వాహకురాలిగా, తల్లిగా నాకు ఓ కొత్త అనుభూతిని అందించాలి‘ అని తెలిపింది. ఈ సందర్భంగా సోనమ్ చెప్పిన విషయాలు కూడా ప్రస్తావించాలి. ప్రాచీన వస్తువుల సేకరణ‘సినిమా చిత్రీకరణలో భాగంగా చాలా చోట్లకు వెళుతుంటాం. ఆ విధంగా సంవత్సరాలుగా నేను సేకరించిన అన్ని వస్తువులను అలంకరించడానికి ఒక స్థావరం కోసం ఎంతో కాలంగా ఎదురుచూశాను. భారతదేశం అంతటా మురికి హవేలీలు, పురాతన వస్తువుల దుకాణాలు గుండా తిరిగాను. నేను దేనినైనా ప్రేమిస్తే, అది నా ఇంటికి చేరకుండా ఉండదు. లక్ష్మీ నివాస్ ప్యాలెస్‌లో చిత్రీకరణ సమయంలో దొరికిన విశాలమైన బికనీర్ డ్యూరీని మోసుకొచ్చేశాను’ అని ఆనందంతో వివరిస్తుంది. ఓ వైపు ప్రాచీన చైనీస్ గ్లాస్ పెయింటింగ్‌లు, మరో ప్రపంచంలా అనిపించే పియరీ ప్యారీ వాల్‌పేపర్‌తో రూపొందించిన గదులు, పాదాల క్రింద హృదయాన్ని మెత్తగా హత్తుకుపోయే ఎరుపు, నారింజల రంగుల తివాచీలు మనల్ని అబ్బురపరుస్తాయి.అమ్మమ్మ ప్రభావంకపూర్ సౌందర్య అభిరుచులను ్ర΄ోత్సహించింది ఆమె అమ్మమ్మ. ‘మా ఆమ్మమ్మ ఒక సామాన్యమైన మహిళ, కానీ చాలా చురుకుదనంతో ఉంటుంది’ అని గుర్తు చేస్తుకుంటుంది కపూర్. ‘అమ్మమ్మ తన మారుతి సుజుకీలో దాదర్ పూల మార్కెట్‌కు ఉదయం 5 గంటలకు తన ఇంటిని సువాసనలతో నింపడానికి స్పీడ్‌గా వెళ్లేది. శాస్త్రీయ సంగీతం, కళలు, తివాచీలను ఆరాధించేది. కరాచీలో విభజనకు ముందు సింధీ కుటుంబం నుండి వచ్చినందున, మా అమ్మమ్మకి తన అభిరుచులపై మంచి ఆసక్తి ఉంది. నాపై ఆమె ప్రభావాన్ని తగ్గించడం కష్టం’ అంటుంది. ఇలా సోనమ్ ఇష్టాయిష్టాలను కనుక్కుంటూ ఒక్కో వస్తువును అలంకరణలో భాగం చేసుకుంటూ ఆమె ఇంటిని సుందరంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నించాం. -
సోనమ్ కపూర్ లేటెస్ట్ లెహంగా ..కానీ బ్లౌజ్ మట్టితో..!
బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ విలక్షణమైన ఫ్యాషన్‌తో సరికొత్త ట్రెండ్‌ని సృష్టిస్తుంటుంది. ఫ్యాషన్ ఐకానిక్‌గా ఆమెకు సాటి లేరెవ్వరు. ఈ దీపావళి పండుగకి ఈ బ్యూటీ సరికొత్త అవుట్‌ఫిట్‌లో దర్శనమిచ్చింది. ముఖ్యంగా ఆమె ధరించిన బ్లౌజ్ హైలెట్‌గా నిలిచింది. చెప్పాలంటే ఎకో-ఫ్రెండ్లీ డిజైనర్వేర్తో ఫ్యాషన్‌కి సరికొత్త నిర్వచనం ఇచ్చింది. ఇంతకీ ఏంటా బ్లౌజ్ ప్రత్యేకత అంటే..సోనమ్ స్టైలిష్ డిజైనర్ వేర్లు చాలా వరకు ఆమె సోదరి రియా కపూరే డిజైన్ చేస్తుంది. ఈ ఇద్దరు సోదరిమణులు అధునాతన గ్రాండ్ లుక్కే ప్రాధాన్యత ఇస్తారు. అలాంటిది సోనమ్ ఈ సారి నారింజ ఆరెంజ్ లెహంగ్లో డిఫెరెంట్‌గా కనిపించింది. ముఖ్యంగా ఆ లెహంగాకు జత చేసిన బ్లౌజ్ అత్యంత విలక్షణమైనది. చెప్పాలంటే దీన్ని శరీర ఆభరణంగా పేర్కొనవచ్చు. దీన్ని ప్రత్యేకంగా కర్ణాటక ఎర్ర మట్టి, ముల్తానీ క్లేతో రూపొందించారు.ఈ క్లే బ్లౌజ్ ఆమె శరీరాకృతికి కరెక్ట్‌గా ఇమిడిపోయింది. ఇక్కడ సోనమ్ ధరించిన టెర్రకోట ఖాదీ లెహంగాను డిజైనర్లు అబూ జానీ-ఖోస్లా ద్వయం రూపొందించారు. ఇక ఈ వెరైటీ బ్లౌజ్‌ని బెంగళూరుకి చెందిన ది వెర్నాక్యులర్ మోడరన్ అనే సంస్థ డిజైన్ చేసింది. ఆ లెహంగాకు సరిపోయేలా ధరించిన పచ్చల హారం రాయల్ లుక్‌ని తెచ్చిపెట్టింది. మ్యాచింగ్ ఇయర్ స్టడ్స్, స్టేట్మెంట్ రింగ్స్, వదులైన హెయిర్ స్టైల్, తక్కువ మేకప్‌తో మహారాణిల మెరిసిపోయింది. ఆ లెహంగాకి చుట్టు ఉన్నా గోల్డెన్ గోటా బార్డర్ మంచి గ్రాడ్లుక్ ఇచ్చింది. ఇక్కడ క్లే బ్లౌజ్ ఫుల్ లెంగ్త్ ఉండి స్లీవ్‌లెస్‌లో డిజైన్ చేశారు. అయితే లెహంగాకి మ్యాచింగ్ దుప్పట భుజాలు చుట్టూ ధరించడంతో స్లీవ్స్ కవర్ అవ్వడం తోపాటు సంప్రదాయ లుక్‌లో హుందాగా కనిపించింది ఈ అందాల భామ. ఈ దీపావళి పండును పర్యావరణ హితంగా చేసుకోవాలని సందేశమిచ్చేందుకు తాను ఇలాంటి విలక్షణమైన డిజైనర్ వేర్ని ధరించానని ఇన్‌స్టాలో పేర్కొంది. నిజానికి మట్టి ఖాదీతో రూపొందించిన ఈ డిజైనర్‌వేర్‌లో సంప్రదాయం, దైవత్వం రెండూ దాగున్నాయి కదూ..!.(చదవండి: దీపావళి వేళ సంప్రదాయబద్ధంగా కనిపించేలా స్టైలింగ్ చిట్కాలు..) -
స్టార్ హీరోయిన్ ఒంటిపై మట్టితో చేసిన డ్రస్ (ఫొటోలు)
-
మోస్ట్ పాపులర్ హౌస్ కొన్న సోనమ్ కపూర్ జంట
ప్రముఖ నటి సోనమ్ కపూర్, ఆమె భర్త ఆనంద్ అహూజా ఇటీవల ముంబైలోని నీరవ్ మోదీకి చెందిన ఐకానిక్ మ్యూజిక్ స్టోర్ 'రిథమ్ హౌస్'ను కొనుగోలు చేశారు. నీరవ్ మోదీ బ్యాంక్ రుణాలను సకాలంలో చెల్లిచకపోవడంతో దీనిని 2018లో మూసివేశారు. కాగా ఇప్పుడు 478.4 మిలియన్లకు (రూ.47.84 కోట్లు) సోనమ్ కపూర్ దంపతులు సొంతం చేసుకున్నారు.సుమారు 3,600 చదరపు అడుగుల రిథమ్ హౌస్ ఒకప్పుడు ఫైర్‌స్టార్ డైమండ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని నీరవ్ మోదీ నిర్వహణలో ఉండేది. దీనిని కొనుగోలు చేసినట్లు భానే ప్రతినిధి కూడా ధృవీకరించారు. అయితే ఆ వ్యక్తి డీల్ విలువను వెల్లడించలేదు.భానే అనేది షాహీ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్‌కు చెందిన ఒక విభాగం. ఇది ఆనంద్ అహూజా తండ్రి హరీష్ అహుజాకు చెందినది. అంతే కాకుండా ఇది భారతదేశంలోని అతిపెద్ద దుస్తులు తయారీదారులలో ఒకటి. ఈ కంపెనీ అనేక అంతర్జాతీయ బ్రాండ్స్ విక్రయిస్తోంది.1940లో ప్రారంభమైన రిథమ్ హౌస్.. ఒకప్పుడు పండిట్ రవిశంకర్, ఇయాన్ ఆండర్సన్ వంటి సంగీత విద్వాంసులకు మాత్రమే కాకుండా ఎంతోమంది బాలీవుడ్ తారల బృందాలకు ఆతిథ్యం ఇచ్చింది.ఇదీ చదవండి: గూగుల్‌లో ఉచిత భోజనం ఎందుకంటే?: సుందర్ పిచాయ్కొన్ని వారాల క్రితం సోనమ్ కపూర్, హరీష్ అహూజా లండన్‌లోని నాటింగ్ హిల్ జిల్లాలో 231.47 కోట్ల రూపాయలకు ఆస్తిని కొనుగోలు చేశారు. ఈ జంటకు ఢిల్లీలో రూ.173 కోట్ల విలువైన విలాసవంతమైన బంగ్లా కూడా ఉంది. అంతే కాకుండా వీరి వద్ద ల్యాండ్ రోవర్ డిఫెండర్, పోర్స్చే టైకాన్, మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్580 వంటి విలాసవంతమైన కార్లు కూడా ఉన్నాయి. -
కార్వా చౌత్ వేడుకల్లో మెరిసిన బాలీవుడ్ సినీతారలు.. ఫోటోలు
-
పారిస్ ఫ్యాషన్ వీక్ : గ్లామ్ లుక్‌తో అదరగొట్టిన మరో బాలీవుడ్ దివా
-
ఘనమైన ఎరుపు, పారాణి మెరుపు : సోనమ్ కపూర్ సౌందర్యం (ఫొటోలు)
-
దుబాయిలో రెస్టారెంట్ ఓపెనింగ్‌లో సోనమ్ కపూర్ (ఫొటోలు)
-
Sonam Kapoor: కొత్త ఇంటిలో మోడ్రన్ డ్రెస్‌లతో సోనమ్ స్టన్నింగ్ లుక్స్..!
-
ఎప్పుడూ చావు గురించే ఆలోచిస్తున్నా..
చావు గురించి ఆలోచించడం మంచిదే అంటున్నాడు హాలీవుడ్ యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ కెను రీవ్స్. అవును, తను చెప్తోంది నిజమేనని, మరణం గురించి ఆలోచించడం ఒకరకంగా మంచి విషయమేనంటోంది బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్. 21వ శతాబ్దంలో నాలుగో గ్రేటెస్ట్ యాక్టర్‌గా కీర్తి గడించిన కెను రీవ్స్.. ద బుక్ ఆఫ్ ఎల్స్వేర్ అనే నవల రాశాడు. దీన్ని త్వరలోనే రిలీజ్ చేయనున్నాడు. మరణం గురించే ఆలోచనఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో మరణంపై తన అభిప్రాయాలను వెల్లడించాడు. నేను చావు గురించి ఎల్లప్పుడూ ఆలోచిస్తుంటాను. దానివల్ల మనం ఊపిరి తీసుకున్నంతకాలం బంధాలకు విలువనివ్వాలని, ఉన్న కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న పాజిటివ్ ఆలోచనలు వస్తాయి అని పేర్కొన్నాడు. అంటే మరణాన్ని తలుచుకుంటే బతికి ఉన్నంత కాలం ఈ జీవితాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని నటుడు చెప్తున్నాడు.సినిమాలు..ఇది కరెక్టే అనిపించడంతో సోనమ్ కపూర్ ఈ క్లిప్పింగ్‌ను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. కాగా సోనమ్.. సావరియా సినిమాతో హీరోయిన్గా మారింది. ఢిల్లీ 6, ఐ హేట్ లవ్ స్టోరీస్, ఐషా, థాంక్యూ, బేవకూఫియాన్, భాగ్ మిల్కా భాగ్, ఖుబ్సూరత్, నీర్జ, ప్యాడ్ మ్యాన్, వీరు ది వెడ్డింగ్, సంజు, ద జోయా అక్తర్ వంటి పలు చిత్రాల్లో నటించింది. గతేడాది వచ్చిన బ్లైండ్ సినిమాలో చివరగా కనిపించింది.చదవండి: మళ్లీ తల్లి కాబోతున్నాను -
బాలీవుడ్ భామ బర్త్ డే.. స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన భర్త!
అనిల్ కపూర్ కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన భామ సోనమ్ కపూర్. ఇవాళ తాజాగా 39వ వసంతంలోకి అడుగుపెట్టారు. బాలీవుడ్లో సావరియా చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ చివరిసారిగా బ్లైండ్ సినిమాలో కనిపించింది. సోనమ్ కపూర్ బర్త్ డే సందర్భంగా ఆమె భర్త ఆనంద్ అహుజా ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. తన భార్యకు రవీంద్రనాథ్ ఠాగూర్ 'గీతాంజలి' బుక్‌ను పుట్టినరోజు కానుకుగా అందించారు. ఈ విషయాన్ని సోనమ్ కపూర్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.సోనమ్ కపూర్ ఇన్‌స్టాలో రాస్తూ.. 'ఇది నాకు అద్భుతమైన పుట్టినరోజు కానుక. నాకేం కావాలో నా భర్తకు మాత్రమే తెలుసు. ఠాగూర్ రాసిన గీతాంజలి మొదటి ఎడిషన్ గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ అర్హత సాధించడానికి నీ కోసం ఏం చేశానో నాకు తెలియదు." అంటూ పోస్ట్ చేసింది. సోనమ్ బర్త్ డే సందర్భంగా ఆమె తండ్రి అనిల్ కపూర్ విషెస్ తెలిపారు. ఆమె తల్లి సునీతా కపూర్ సైతం సోషల్ మీడీయా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. View this post on Instagram A post shared by Sonam A Kapoor (@sonamkapoor) -
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
-
32 కిలోలు పెరిగా.. లైఫ్ ఒక్కసారిగా ఛేంజ్: హీరోయిన్
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని సందర్భాల్లో బరువు పెరగడం ఖాయం. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు ఉన్నట్లుండి బరువు పెరుగుతారు. కొందరు డెలివరీ తర్వాత మామూలైపోయినప్పటికీ మరికొందరు మాత్రం మరింత లావైపోతారు. తన విషయంలోనూ ఇదే జరిగిందంటోంది బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్. సోనమ్- అహుజా దంపతులు 2022 ఆగస్టులో వాయు అనే కుమారుడికి జన్మనిచ్చారు.32 కిలోలు పెరిగాఆ సమయంలో తాను ఉన్నట్లుండి లావైపోయానంటోంది సోనమ్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ప్రెగ్నెన్సీ తర్వాత నేను 32 కిలోలు పెరిగాను. నిజంగా చాలా బాధేసింది. కానీ ఆ టైంలో బిడ్డగురించే ఆలోచిస్తామే తప్ప సరైన ఫుడ్ తీసుకోవాలని, వర్కవుట్ చేయాలనే ఆలోచించం. మళ్లీ మామూలవడానికి ఏడాదిన్నర పట్టింది. సడన్‌గా అన్నీ ఛేంజ్కానీ అప్పటికే లైఫ్ మారిపోతుంది. భర్తతోనే కాదు మనతో మనకున్న అనుబంధం కూడా చేంజ్ అవుతుంది. సడన్‌గా అన్నీ మారిపోయి కొత్తగా అనిపిస్తాయి. మునుపటిలా మన శరీరం గురించి ఆలోచించలేము అని చెప్పుకొచ్చింది. కాగా ఈ ఏడాది ప్రారంభంలో సోనమ్ వర్కవుట్స్‌పై ఎక్కువ ఫోకస్ చేసింది. తన జిమ్ వీడియోలను షేర్ చేస్తూ వావ్.. 20 కిలోలు తగ్గాను.. ఇంకా ఆరు తగ్గాలి అని రాసుకొచ్చింది. ఆ ఆరు కూడా ఎప్పుడో తగ్గేసి స్లిమ్‌గా మారిపోయింది సోనమ్.చదవండి: ఇద్దరు స్టార్ హీరోయిన్లతో విజయ్ రొమాన్స్.. చివరి చిత్రమిదేనా? -
స్టయిల్ అండ్ సారీ...ఆహా ఎంత అందం, ఎవరే వీరు? (ఫోటోలు)
-
Sonam Kapoor Weight Loss Photos: ఫిట్నెస్ జర్నీతో ఫిదా చేసిన ముద్దుగుమ్మ (ఫోటోలు)
-
సో బ్యూటిఫుల్..సో ఎలిగెంట్: నటి ఫిట్నెస్ జర్నీ , ఫ్యాన్స్ ఫిదా
చాలామంది మహిళల్లో ప్రెగ్నెన్సీలో బాగా బరువు పెరుగుదల కనిపిస్తుంది. మరో విధంగా చెప్పాలంటే గర్భధారణకు ముందు ఆ తరువాత అన్నట్టు తయారవుతుంది మహిళల ఫిట్నెస్ పరిస్థితి. ప్రసవం తరువాత సహజంగా బరువు తగ్గడం అనేది చాలా కొద్దిమందికి మాత్రమే సాధ్యం. మళ్లీ మునుపటి స్థాయికి చేరాలంటే అంత సులభం కాదు. చేయాల్సిన కసరత్తు చాలానే ఉంటుంది ఒకవైపు బిడ్డకు తల్లిపాలు, ఆలన పాలనా చూసుకుంటూనే తమ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. దీనికి సాధారణంగా ఆరు నెలలనుంచి రెండేళ్ల వరకు పట్టవచ్చు. కానీ బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ మూడు నెలల్లో 20 కేజీలు బరువు అందర్నీ ఆశ్చర్యపరిచ్చింది. 2022లో మగబిడ్డకు జన్మనిచ్చిన సోనమ్ సోషల్ మీడియాలో తన పోస్ట్ ప్రెగ్నెన్సీ జర్నీ గురించి చెప్పుకొచ్చింది. ప్రసవానంతర బరువు తగ్గే క్రమంలోన్నానంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేసింది. ఇన్‌స్టాలో 35.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఈ నటి “వావ్.. 20 కిలోలు తగ్గాను ... ఇంకా 6 కిలోలు తగ్గాలి అంటూ చెప్పుకొచ్చింది.మళ్లీ తనలా మారడానికి 16 నెలలు పట్టిందనే విషయాన్ని చెబుతూ లెహంగాలో అమేజింగ్లుక్లో ఉన్న కొన్ని చిత్రాలను ఫ్యాన్స్‌కు షేర్ చేసింది.ఎటువంటి క్రాష్ డైట్లు , క్రేజీ వర్కౌట్లు లేకుండానే తనని తాను, కొడుకును చూసుకుంటూ నిదానంగా ఈ స్థాయికి వచ్చానంటూ తన జర్నీ గురంచి పోస్ట్ చేసింది.దీంతో ఫ్యాన్స్ వావ్.. అద్భుతం అంటూ కమెంట్ చేశారు. View this post on Instagram A post shared by Sonam A Kapoor (@sonamkapoor) View this post on Instagram A post shared by Sonam A Kapoor (@sonamkapoor) కాగా వ్యాపారవేత్త ఆనంద్ అహుజాను 2018లొ వివాహం చేసుకుందిసోనమ్.నటి చివరిగా 'బ్లైండ్ మూవీలో కనిపించిన ఈమె మంచి స్క్రిప్ట్‌తో ఉంటే OTT ప్లాట్‌ఫారమ్‌లో నటించడానికి సిద్ధంగా ఉన్నానంటూ ఇటీవల ప్రకటించింది.మంచి కంటెంట్ ,మంచి సినిమాలో భాగం కావడం తనకు ముఖ్యమని తెలిపింది. -
Sonam Kapoor Latest Photos: వరల్డ్ కప్ కోసం వచ్చిన డేవిడ్ బెక్‌హామ్‌కు విందుపార్టీ ఇచ్చిన హీరోయిన్ (ఫోటోలు)
-
పండుగరోజే గృహప్రవేశం చేసిన స్టార్ హీరోయిన్!
బాలీవుడ్ భామ సోనమ్ కపూర్ బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. అధిక పారితోషికం అందుకున్న హీరోయిన్లలో ఈమె ఒకరు. ప్రముఖ నటుడు అనిల్ కపూర్ కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. 2005లో బ్లాక్ సినిమాకు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి సహాయ దర్శకురాలిగా పనిచేశారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కించిన సావరియా సినిమాతో హీరోయిన్గా తెరంగేట్రం చేశారామె. ఈ సినిమాలోని ఆమె నటనకు ఫిలింఫేర్ ఉత్తమ డెబ్యూ నటిగా పురస్కారం లభించింది. (ఇది చదవండి: కావాలయ్యా సాంగ్.. తమన్నా స్టెప్పు చెండాలం అంటూ నటుడి విమర్శలు) అయితే తాజాగా ముంబయిలో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసింది. విజయదశమి సందర్భంగా గృహప్రవేశం చేసినట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టా ద్వారా పంచుకుంది. సోనమ్ కపూర్ అహూజా పండుగ రోజే ముంబయిలోని కొత్త ఇంటికి చేరింది. ఆనంద్ అహుజాను పెళ్లాడిన సోనమ్‌కు ఏడాది వయసున్న వాయు కపూర్ అహుజా అనే కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇది తెలుసుకున్న బాలీవుడ్ ప్రముఖులు సోనమ్‌కు అభినందనలు చెబుతున్నారు. సోనమ్ తన ఇన్‌స్టాలో రాస్తూ..'మేము ఈ వారంలో మా కొత్త ఇంటికి మారాం . ఇప్పుడు మాకు ఎంతో ఆనందంగా ఉంది. మా మనసులు ఆశతో నిండి ఉన్నాయి. ఇక్కడ కొత్త జ్ఞాపకాలను కోసం మేము వేచి ఉండలేము' అంటూ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌తో పాటు తాను ఇంట్లో కూర్చొని ఉన్న అందమైన ఫోటోలు పంచుకుంది. (ఇది చదవండి: ఒక్క వీడియోతో లక్షన్నర పొగొట్టుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్!) View this post on Instagram A post shared by Sonam A Kapoor (@sonamkapoor) -
Vayu's First Birthday: సోనమ్ కపూర్ తనయుడు వాయు ఫస్ట్ బర్త్‌డే (ఫోటోలు)
-
అలాంటి వారే వ్యక్తుల గురించి మాట్లాడతారు.. సోనమ్ పోస్ట్ వైరల్!
సీతారామంతో టాలీవుడ్‌లోనూ క్రేజ్ దక్కించుకున్న మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్. ఆయన తాజాగా నటించిన చిత్రం 'కింగ్ ఆఫ్ కోత'. అభిలాష్ జోషి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, వెఫేరర్ ఫిలింస్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇటీవలే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించింది చిత్రయూనిట్. ఈ సందర్భంగా ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా హాజరైన రానా.. తన స్నేహితుడు దుల్కర్‌పై ప్రశంసలు కురిపించాడు. (ఇది చదవండి: ఆ హీరోయిన్‌కి క్షమాపణలు చెప్పిన రానా) అయితే అదే సమయంలో ఓ స్టార్ హీరోయిన్ను ఉద్దేశించి రానా చేసిన కామెంట్స్ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే 2018లో దుల్కర్, సోనమ్ కపూర్ జంటగా 'ద జోయా ఫ్యాక్టర్' అనే చిత్రంలో నటించారు. ఆ సమయంలో షూటింగ్ స్పాట్‌కు వెళ్లిన రానాకు ఆమె వ్యవహరించిన తీరు కోపం తెప్పించిందట. దుల్కర్ సెట్లో వెయిట్ చేస్తుంటే.. తాను మాత్రం భర్తతో ఫోన్ మాట్లాడుతూ కాలక్షేపం చేసిందని అన్నారు. అయితే ఈ విషయంపై ఇప్పటికే రానా వివరణ ఇచ్చారు. తన మాటలను కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. తన కామెంట్స్ వల్ల ఇబ్బంది పడుతున్న సోనమ్, దుల్కర్‌లకు నా హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నానని రానా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. సోనమ్.. రానా భార్య మిహికా బజాజ్‌కు మంచి స్నేహితురాలు కూడా అని తెలుస్తోంది. అయితే తాజాగా ఈ అంశంపై బాలీవుడ్ భామ సోనమ్ కపూర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో మరోసారి చర్చకు దారితీసింది. రానా క్షమాపణల తర్వాత సోనమ్ తన ఇన్‌స్టాలో స్టోరీస్‌లో ఓ కొటేషన్ పోస్ట్ చేసింది. అది యూఎస్ ప్రథమ మహిళ ఎలియనోర్ రూజ్వెల్ట్ రాసిన కోటేషన్. మె తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేస్తూ.. 'నేను కొంతమంది వ్యక్తుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నా. ప్రత్యేకించి అలాంటి వ్యక్తుల గురించి. సంకుచితమైన మైండ్‌సెట్ గలవారే వ్యక్తుల గురించి చర్చిస్తారు. యావరేజ్ మైండ్ వాళ్లు సంఘటనలపై మాట్లాడతారు. అలాగే గొప్ప మేధావులు ఆలోచనల గురించి చర్చిస్తారు.' అంటూ ఆ కోటేషన్లో ఉంది. అయితే ఈ కోట్ టాలీవుడ్ హీరో రానాను ఉద్దేశించి చేసిందనే చర్చ మొదలైంది. రానా క్షమాపణలు కోరుతూ ట్వీట్ చేసిన వెంటనే ఈ పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. (ఇది చదవండి: ఖుషి ఈవెంట్లో మీడియా, మహిళలపై దౌర్జన్యం.. లోనికి రాన్వివకుండా..) -
ఆ హీరోయిన్‌కి క్షమాపణలు చెప్పిన రానా
బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్, నటుడు దుల్కర్ సల్మాన్‌లకు హీరో రానా క్షమాపణలు చెప్పాడు. తన మాటలను కొంతమంది తప్పుగా అర్థం చేసుకొని తప్పుదోవపట్టిస్తున్నందుకు చింతిస్తున్నానని, ఏది ఏమైనా తన కామెంట్స్ కారణంగా ఇబ్బందిపడుతున్న సోనమ్, దుల్కర్‌లకు నా హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నానని రానా ట్వీట్ చేశాడు. (చదవండి: 'వ్యూహం'టీజర్: కల్యాణ్‌కు బాబు వెన్నుపోటు.. వాడికంత సీన్లేదు!) వివరాల్లోకి వెళితే.. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన తాజా చిత్రం‘కింగ్ ఆఫ్ కోత’. రితికా సింగ్, ఐశ్వర్య లక్ష్మి, అనిఖా సురేంద్రన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ మూవీకి అభిలాష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆగస్ట్ 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లో ప్రిరీలీజ్ ఈవెంట్‌ని నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ కార్యక్రమానికి హీరో రానా ముఖ్య అతిథిగా వెళ్లారు. ఈ సందర్భంగా రానా.. దుల్కర్ మంచితనం గురించి మాట్లాడుతూ...‘ఓ రోజు దుల్కర్ నటిస్తున్న సినిమా షూటింగ్‌కి వెళ్లాను. ఆ సినిమాలో బాలీవుడ్‌కి చెందిన పెద్ద నటి హీరోయిన్. షూటింగ్ సమయంలో ఆమె నటనపై ఫోకస్ చేయకుండా.. లండన్‌లో ఉన్న భర్తతో ఫోన్లో షాపింగ్ గురించి మాట్లాడుతుంది. దుల్కర్ ఎండలో అలాగే నిలబడి పోయాడు. ఆమె ఎక్కువ టేకులు తీసుకున్నా.. దుల్కర్ మాత్రం ఓపికగా అలానే ఎదురు చూశాడు. నాకే కోపం వచ్చి చేతిలో ఉన్న నీళ్ల బాటిల్‌ని నేలకేసి కొట్టాను. కానీ దుల్కర్ మాత్రం చాలా సహనంగా ఉన్నాడు’ అని చెప్పుకొచ్చాడు. రానా వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి. రానా ఆగ్రహం వ్యక్తం చేసిన హీరోయిన్ సోనమ్ కపూర్‌నే అని నెట్టింట ప్రచారం జరిగింది. ఆమెను టార్గెట్ చేస్తూ నెగెటివ్ ప్రచారం చేయడంతో తాజాగా రానా ఆ హీరోయిన్‌కు సారి చెప్పాడు. I am genuinely troubled by the negativity that has been aimed at Sonam due to my comments, that are totally untrue and were meant entirely in a light-hearted manner. As friends, we often exchange playful banter, and I deeply regret that my words have been misinterpreted. I take… — Rana Daggubati (@RanaDaggubati) August 15, 2023 -
అతి చేసిన బాలీవుడ్ హీరోయిన్.. కోపంతో నేలకేసి కొట్టా..: రానా
దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సినిమా 'కింగ్ ఆఫ్ కోత'. అభిలాష్ జోషి దర్శకత్వం వహించిన ఈ సినిమాను జీ స్టూడియోస్, వెఫేరర్ ఫిలింస్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ మూవీ ఆగస్టు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో ఘనంగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భళ్లాల దేవ రానా దగ్గుబాటి దుల్కర్ సహనంపై పొగడ్తలు కురిపిస్తూ ఓ హీరోయిన్‌పై విమర్శలు గుప్పించారు. షాపింగ్ గురించి కబుర్లు రానా మాట్లాడుతూ.. 'దుల్కర్ చాలా పద్ధతైన మనిషి. ఆయన గతంలో ఒక హిందీ సినిమా చేశాడు. దాని నిర్మాతలు నా ఫ్రెండ్సే! ఒకరోజు మా ఇంటి దగ్గరే షూటింగ్ జరుగుతుంటే వెళ్లాను. బాలీవుడ్లో పెద్ద హీరోయిన్ ఆ సినిమాలో నటించింది. నేను సెట్‌కు వెళ్లేసరికి మూడో టేక్ తీసుకుంటున్నారు. దుల్కర్ ఎండలో నిలబడ్డాడు. ఆమె ఫోన్ మాట్లాడుతోంది. ఏమైనా అర్జంట్ విషయమా? అంటే ఆమె భర్త లండన్‌లో షాపింగ్ చేస్తున్నాడట! ఆ షాపింగ్ గురించి మాట్లాడుతోంది. తర్వాత ఫోన్ కట్ చేసి వచ్చాక నన్ను చూసి హాయ్ అంటూ పలకరించింది. డైలాగులు మర్చిపోతోంది కెమెరా ముందుకు వెళ్లాక డైలాగులు మర్చిపోతోంది.. అంతలోనే మళ్లీ ఫోన్ మాట్లాడుతోంది. ఇదంతా చూసి కోపమొచ్చి నా చేతిలోని బాటిల్ నేలకేసి కొట్టాను. దుల్కర్ మాత్రం ఓపికగా అలాగే నిల్చుంటూ ఎన్ని టేకులైతే అన్ని టేకులు చేస్తూనే పోయాడు. ప్యాకప్ అయిపోయాక ఆమె తన స్టాఫ్‌తో మూడు, నాలుగు కార్లలో వెళ్తే మనవాడు మాత్రం తన అసిస్టెంట్‌తో చిన్న ఇన్నోవా కారులో వెళ్లిపోయాడు. అప్పుడు నేను సెట్స్‌లో హీరోయిన్ ప్రవర్తన గురించి లైట్ తీసుకుంటున్న నిర్మాతలను అరగంటసేపు తిట్టిన తర్వాత బయటకు వెళ్లిపోయాను. అలాంటి దుల్కర్ ఈరోజు వైల్డ్ సినిమా చేస్తుంటే నాకన్నా ఎగ్జయిట్‌గా ఎవరూ ఉండరు' అని రానా చెప్పుకొచ్చాడు. ఆ హీరోయిన్ తనేనా? ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే చాలామంది ఆ హీరోయిన్ సోనమ్ కపూర్ అని అభిప్రాయపడుతున్నారు. గతంలో వీరిద్దరూ 'ద జోయా ఫ్యాక్టర్' అనే సినిమా చేశారు. కాగా సోనమ్ 2018లో ఆనంద్ అహుజాను పెళ్లాడింది. వీరికి ఇండియాలోనే కాకుండా విదేశాల్లోనూ ఆస్తులు ఉన్నాయి. లండన్‌లో వీరికి సొంతిల్లు కూడా ఉంది. సోనమ్ తరచూ అక్కడికి వెళ్లి వస్తూ ఉంటుంది. సోనమ్.. రానా భార్య మిహికా బజాజ్‌కు మంచి స్నేహితురాలు కూడా! చదవండి: జైలర్‌కు ఈ రేంజ్ కలెక్షన్సా? నాలుగోసారి రూ.300 కోట్ల క్లబ్బులో -
నిజాలను చూడటం కష్టం!
‘‘కొన్నిసార్లు నిజాలను చూడటం చాలా కష్టం.. మరి మీరు ఆమె చీకటి ప్రపంచాన్ని చూడ్డానికి రెడీ అవుతారా?’’ అంటూ సోనమ్ కపూర్ నటించిన తాజా చిత్రం ‘బ్లైండ్’ విడుదల తేదీని ప్రకటించారు. జూలై 7 నుంచి ఈ చిత్రం ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. కొరియన్ మూవీ ‘బ్లైండ్’కి రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రంలో సోనమ్ అంధురాలిగా నటించారు. ఓ సీరియల్ కిల్లర్‌ను పట్టుకోడానికి ఓ లేడీ పోలీసాఫీసర్ చేసే ప్రయత్నం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. బ్లైండ్ పోలీసాఫీసర్‌గా సోనమ్ అద్భుతంగా నటించారని చిత్ర యూనిట్ పేర్కొంది.. షోమ్ మఖీజా దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. కాగా ఓటీటీ ప్లాట్ఫామ్లో సోనమ్ కనిపించనున్న తొలి చిత్రం ఇదే కాగా, తల్లయ్యాక (గత ఏడాది ఆగస్ట్ 20న ఓ బాబుకి జన్మనిచ్చారు) కనిపించనున్న చిత్రం కూడా ఇదే అవుతుంది. -
థియేటర్లో లైంగిక వేధింపులు.. ఒక్కసారిగా మైండ్ బ్లాంక్: స్టార్ హీరోయిన్
బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. 2007లో వచ్చిన సల్మాన్ ఖాన్, రణ్‌బీర్ కపూర్ నటించిన సావరియా చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. అప్పట్లోనే ఎక్కువ పారితోషికం అందుకుంటున్న హీరోయిన్లలో ఈమె ఒకరు. నాలుగు ఫిలింఫేర్ పురస్కారాలు కూడా దక్కించుకుంది. ( ఇది చదవండి: కొత్తింట్లోకి అడుగు పెట్టిన హిమజ, ఫోటో వైరల్) జూన్ 9న 1985 ముంబయిలో జన్మించిన భామ కుటుంబసభ్యుల మధ్య 38వ పుట్టినరోజు కూడా సెలబ్రేట్ చేసుకుంది. అయితే ఇటీవలే ఓ ఇంటరాక్షన్‌కు హాజరైన సోనమ్ ఓ చేదు అనుభవాన్ని అభిమానులతో పంచుకుంది. యుక్త వయసులోనే తనపై లైంగిక వేధింపులకు గురైనట్లు వెల్లడించింది. ఈ చర్చలో అనుష్క శర్మ, అలియా భట్, విద్యాబాలన్ మరియు రాధికా ఆప్టే కూడా ఉన్నారు. ఇది విని వారంతా షాక్‌కు గురయ్యారు. సోనమ్ కపూర్ మాట్లాడుతూ..'13 ఏళ్ల వయస్సులో ఓ చేదు అనుభవం ఎదురైంది. నా స్నేహితులతో కలిసి సినిమా చూసేందుకు థియేటర్‌కు వెళ్లా. స్నాక్స్ తీసుకోవడానికి బయటకు వచ్చా. ఆ సమయంలో ఓ వ్యక్తి నా వెనక నుంచి వచ్చి బ్రెస్ట్‌ను టచ్ చేశాడు. ఊహించని సంఘటనతో ఒక్కసారిగా భయపడి వణికిపోయా. ఆ సమయంలో ఏం జరుగుతుందో నా కర్థం కాలేదు. ఆ షాక్‌తో అక్కడే కూర్చుని ఏడ్చేశా.' అంటూ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత మాట్లాడుతూ.. ఈ సంఘటన గురించి ఎక్కడా నోరు విప్పలేదని అన్నారు. ఇది విని ఆమె పక్కన ఉన్న నటీమణులు షాక్‌కు గురయ్యారు. ప్రతి ఒక్కరూ తమ చిన్నతనంలో ఏదో ఒక సందర్భంలో లైంగిక వేధింపులకు గురవుతున్నారని సోనమ్ కపూర్ ఆవేదన వ్యక్తం చేసింది. మహిళల జీవితంలో ఇలాంటి సంఘటనలు, మహిళల వేధింపుల గురించి నోరు విప్పాల్సిన అవసరముందని ఆమె సూచించింది. ( ఇది చదవండి: తనతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడు.. ఆదిపురుష్ హీరోయిన్) -
డబ్బు గురించి మాట్లాడిన సోనమ్, నెట్టింట ట్రోలింగ్
డబ్బు విలువ ఉన్నవాడికంటే లేనివాడికే బాగా తెలుస్తుందంటారు. చెమటోడ్చి సంపాదించే పది రూపాయలు కూడా ఎంతో విలువైనవిగానే భావిస్తుంటారు కష్టజీవులు. కానీ ధనవంతులు మాత్రం తమ దగ్గర ఉన్న కోట్ల రూపాయల ముందు లక్ష రూపాయలు కూడా తక్కువే అని చులకనగా చూస్తారు. తాజాగా బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ డబ్బు గురించి ఉపన్యసించింది. ఆమె చెప్పాలనుకున్నదేంటో కానీ తన దగ్గర మాత్రం బోలెడంత ఉందని డప్పు కొట్టుకుంది. ఇది చూసి నెటిజన్లు ఆమెను తిట్టిపోస్తున్నారు. డబ్బు ప్రాముఖ్యత గురించి ఆమె మాట్లాడుతూ.. 'మా అమ్మ ఎప్పుడూ ఒక మాట చెప్తుండేది. డబ్బుకు ఎక్కువ విలువ ఇవ్వకూడదు అని! ఎందుకంటే అది మాకు కావాల్సినంత ఉంది. కాబట్టి నేనెప్పుడూ డబ్బులకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వలేదు' అని చెప్పుకొచ్చింది. ఇంకా మాట్లాడుతూ.. నాకైతే రూ.65,000 పెద్ద విషయం కాదు. నా డ్రెస్ చూస్తే మీకర్థమవట్లేదా డార్లింగ్.. అంటూ నవ్వేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తనేం చెప్పాలనుకుంది, ఏం చెప్పింది? బోలెడంత డబ్బు మాత్రమే ఉన్న నువ్వు ఎంత పేదదానివో, నీ మాటలు అందరూ వింటారని తెలిసే ఇలా మాట్లాడుతున్నావా? అని విమర్శలు గుప్పిస్తున్నారు. View this post on Instagram A post shared by enough internet for tonight (@enoughinternetfortonite) -
భార్యతో ఎన్టీఆర్ వెకేషన్.. రష్మిక ఎమోషనల్ పోస్ట్
► భార్యతో న్యూయార్క్ పర్యటనలో ఉన్న ఎన్టీఆర్ ► కుటుంబంతో వెకేషన్‌కు వెళ్లిన మహేశ్ బాబు ► ధమాకా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న రవితేజ ► అభిమానులను కలిసిన రష్మిక మందన్నా.. ఎమోషనల్ పోస్ట్ ► గోల్డెన్ డ్రెస్‌లో మెరిసిపోతున్న పూజాహెగ్డే ► రామ్‌చరణ్, ఉపాసనల క్యూట్ ఫోటో View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) View this post on Instagram A post shared by Jr NTR (@jrntr) View this post on Instagram A post shared by RAVI TEJA (@raviteja_2628) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Sandeep Molugu (Sandy Artist) (@sandysartistry) View this post on Instagram A post shared by Sonam Kapoor Ahuja (@sonamkapoor) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) -
కొంటెగా చూస్తున్న రకుల్.. మెరిసిపోతున్న కీర్తి సురేష్
► షెహ్నాజ్ గిల్ స్టన్నింగ్ లుక్స్ ► వైట్ కాస్ట్యూమ్‌లో శిల్పాశెట్టి గ్లామరస్ లుక్ ► స్టైలిష్ లుక్‌లో మెరిసిపోతున్న పూజా హెగ్డే ► కొంటెగా చూస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ ► కళావతి గ్యాంగ్‌ను మిస్సవుతున్న కీర్తి సురేష్ ► శారీలో హీరోయిన్ మీనాక్షి అందాల కనువిందు View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Meenakshii Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Shehnaaz Gill (@shehnaazgill) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Sonam Kapoor Ahuja (@sonamkapoor) View this post on Instagram A post shared by Sanjjanaa Galrani / sanjana (@sanjjanaagalrani) -
సమంతతో సహా అరుదైన వ్యాధులతో బాధపడుతున్న హీరోయిన్స్..
స్టార్ హీరోయిన్ సమంత అనారోగ్య పరిస్థితిని తెలుసుకొని ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. కొంతకాలంగా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు స్వయంగా సమంత వెల్లడించిన సంగతి తెలిసిందే.ఎప్పుడూ యాక్టివ్‌గా కనిపించే సామ్ ఇలా అనారోగ్యం బారిన పడటం, కోలుకోవడానికి తాను అనుకున్న దానికంటే ఎక్కువ సమయమే పడుతుందంటూ ఆమె ఎమోషనల్ పోస్ట్ చేయడంతో సినీ తారలు సహా నెటిజన్లు షాక్‌కి గురయ్యారు. ఈ క్రమంలో గ్లామర్ ఇండస్ట్రీ వెనుక అందాలు మాత్రమే కాదు.. అరుదైన వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న హీరోయిన్స్ బోలెడంత మంది ఉన్నారు. మరి ఆ హీరోయిన్స్ గురించి ఓసారి తెలుసుకుందాం. ఇలియానా దేవదాస్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమై గోవా బ్యూటీ ఇలియానా. తొలి సినిమాతోనే గ్లామరస్ బ్యూటీగా క్రేజ్ సంపాదించుకున్న ఇల్లూ బేబీ టాలీవుడ్ టాప్ హీరోలతో నటించింది. ఒకానొక దశలో సౌత్ ఇండియాలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్గా కూడా నిలిచింది. అయితే బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ తర్వాత కొంతకాలం సినిమాలకు గుడ్‌బై చెప్పిన ఇలియానా తనకు డిస్మార్ఫిక్ బాడీ డిజార్డర్ ఉందని స్వయంగా పేర్కొంది. ఇదొక మానసిక వ్యాధి. దీనికి ప్రత్యేకంగా చికిత్స అంటూ లేదు కానీ డాక్టర్ల సూచనతో దీన్నుంచి కొంత వరకు ఉపశమనం పొందొచ్చట. అనుష్క శర్మ బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ తాను యాంగ్జైటీతో పోరాడుతున్నట్లు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చొంది.ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పలు సందర్భాల్లో అనుష్క శర్మ అభిమానులతో పంచుకుంది. సోనమ్ కపూర్ స్టార్ కిడ్‌గా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది సోనమ్ కపూర్. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కొంతకాలానికే సూపర్ క్రేజ్‌ను దక్కించుకున్న సోనమ్ డయాబెటీస్‌తో ఇబ్బంది పడుతుందట. అయితే ఈ విషయాన్ని ఓపెన్‌గా చెప్పడానికి ఆమె ఏమీ భయపడలేదు. నయనతార లేడీ సూపర్‌స్టార్‌గా పేరు సంపాదిచుకున్న తమిళ స్టార్ హీరోయిన్ నయనతార. ఆమెకి స్కిన్ ఎలర్జీ ఉందట. మూవీ షూటింగ్స్‌లో భాగంగా తరుచూ మేకప్‌లు వేసుకోవాల్సి రావడంతో స్కిన్ ఎలర్జీ వచ్చినట్లు నయన్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. దీంతో కొన్ని జాగ్రత్తలు వాడుతూ మేకప్‌ని వేసుకోవడానికి ప్రత్యేకమైన టీమ్‌ను ఆమె నియమించుకుంది. దీంతో పాటు ఫుడ్ విషయంలోనూ చాలా జాగ్రత్తలు పాటిస్తుందట నయన్. ఎప్పుడైనా సరే కూల్ ఐటమ్స్ ఏం తిన్నా వెంటనే ఆమె స్కిన్ టోన్ మారిపోవడం,, స్కిన్ పై రాషస్ రావడం వంటివి జరుగుతుంటాయట. ఇప్పటికీ దీన్ని అధిగమించేందుకు పలు జాగ్రత్తలు తీసుకుంటుందట. దీపికా పదుకొణె బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న దీపికా పదుకొణె కొన్నాళ్ల పాటు డిప్రెషన్‌తో పోరాడినట్లు స్వయంగా ఆమె వెల్లడించింది. దీన్నుంచి బయటపడలేక చాలాసార్లు సూసైడ్ చేసుకోవాలనుకున్నట్లు దీపికా బహిరంగంగానే చెప్పింది. ఎక్కువ డిప్రెషన్‌కు లోనైతే హార్ట్‌బీట్ ఒకసారిగా పెరిగి అస్వస్థతకు గురవుతుందట.ఇప్పటికీ రెగ్యులర్‌గా డాక్టర్స్‌తో టచ్‌లో ఉంటానని ఈ బ్యూటీ తెలిపింది. పరిణితీ చోప్రా ప్రియాంక చోప్రా సోదరిగా ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ పరిణితీ చోప్రా. అయితే అక్క సపోర్ట్ లేకుండానే తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్న పరిణితీ కొంతకాలంగా డిప్రెషన్‌తో బాధపడుతుందట. ఈ సమస్యను అధిగమించేందుకు తరుచూ డాక్టర్స్‌ని కలుస్తానని స్వయంగా ఆమె వెల్లడించింది. సమంత ఏమాయ చేశావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సమంత అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. తెలుగు, తమిళంలో ఎనలేని స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న సామ్ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ నిత్యం అభిమానులతో టచ్‌లో ఉండేది. అయితే కొంతకాలంగా సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చిన సామ్ తాను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. కోలుకోవడానికి తాను అనుకున్నదానికంటే ఎక్కువ సమయమే పడుతుందని ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు తెలిపింది. -
నా బిడ్డకు అలాంటి జీవితం ఇవ్వాలనుకుంటున్నా: సోనమ్ కపూర్
బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఇటీవల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె మాతృత్వ క్షణాలను ఆస్వాధిస్తున్నారు. ఇక సోనమ్ కపూర్ గర్భవతిగా ఉన్నప్పుడు ప్రముఖ సెలబ్రెటీ మ్యాగజైన్ వోగ్‌కు ఫొటోషూట్ ఇచ్చింది. ఈ సందర్భంగా తన బిడ్డను ఎలా పెంచాలనుకుంటుందో వివరించింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ తన బిడ్డ భవిష్యత్తుపై ప్రస్తావించింది. ‘మా నాన్న ఓ హీరో. మాది సెలబ్రెటీ కుటుంబ నేపథ్యం అయినప్పటికీ మమ్మల్ని చాలా సాధారణంగా పెంచారు. చదవండి: ఖర్చు లేకుండా నయన్ దంపతుల హనీమూన్ ట్రిప్? ఎలా అంటే.. మా అమ్మనాన్నలు(అనిల్ కపూర్, సునీత్ కపూర్) నన్ను, నా సోదరి రియా, సోదరుడు హర్షవర్థన్‌ను చాలా గోప్యంగా పెంచారు. సెలబ్రెటీల లైఫ్‌కు దూరంగా మీడియా దృష్టికి పడకుండ జాగ్రత్త పడ్డారు. వారు అలా ఎలా ఉంచగలిగారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఇక నా విద్యాభ్యాసం అయితే ఏ స్టార్ పిల్లలు లేని ఆర్య విద్యామందిర్‌లో జరిగింది. ఆ తర్వాత జూనీయర్ కాలేజ్ కోసం బోర్డింగ్ స్కూల్‌కి వెళ్లాను. అక్కడ నేను చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు నేను కూడా నా పిల్లలకు అలాంటి జీవితమే ఇవ్వాలనుకుంటున్నా. వారిని సెలబ్రిటీ లైఫ్‌కు దూరంగా ఉంచాలనుకుంటున్నా. చదవండి: ‘లైగర్’ మూవీకి రమ్యకృష్ణ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? చెప్పాలంటే.. నా బిడ్డను ఇండియాలో చదివించాలా? లండన్‌లో చదివించాలా? అని ఇప్పటికీ ఓ నిర్ణయానికి రాలేకపోతున్నా. భారత్‌లో ఉంటే నా సొంత ఇంట్లో ఉన్న అనుభూతి ఉంటుంది. కానీ ఇక్కడే ఉంటే నా బిడ్డ విషయంలో గోప్యత కష్టమవుతుంది. అదే సమయంలో చాలామంది స్టార్ కిడ్స్ ఇక్కడ సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. అది చూసిన తర్వాత కొన్ని అడ్డంకులను చాలా సులువుగా దాటగలమని అనిపిస్తుంది’ అని చెప్పుకొచ్చింది. కాగా స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న క్రమంలో వ్యాపారవేత్త ఆనంద్ ఆహుజాను వివాహం చేసుకుంది సోనమ్. ఈ క్రమంలో గతేడాది గర్భం దాల్చిన ఆమె ఆగస్ట్ 20న మగబిడ్డకు జన్మనిచ్చింది. -
ఇది ప్రారంభం మాత్రమే!
బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఇంట ఆనందం వెల్లి విరిసింది. ఆమె మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సంతోషకరమైన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారామె. ‘శనివారం ఉదయం కొడుకు పుట్టాడు.. 2022 ఆగస్టు 20న ముద్దులొలుకుతున్న బాబు మా ప్రపంచంలో అడుగుపెట్టాడు. ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన డాక్టర్లు, నర్సులు, కుటుంబ సభ్యులు, స్నేహితులకు పేరు పేరునా ధన్యవాదాలు. ఇది ప్రారంభం మాత్రమే. చిన్నారి రాకతో మా జీవితాలు మారిపోతాయనే విషయం మాకు తెలుసు’ అంటూ ఆమె పోస్ట్ చేశారు. కాగా సోనమ్ కపూర్, ఆనంద్ అహుజాలు 2018 మే నెలలో పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది మార్చిలో తాను గర్భవతి అనే విషయాన్ని వెల్లడించారు సోనమ్. ఆ తర్వాత బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలను కూడా షేర్ చేసుకున్నారు. సోనమ్–అహూజా తల్లితండ్రులయిన సందర్భంగా పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. -
కృష్ణాష్టమి తెల్లవారే బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్
బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. శనివారం ఉదయం కొడుకు పుట్టాడంటూ సోనమ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా తన అభిమానులతో గుడ్‌న్యూస్ పంచుకుంది. 'ఆగస్టు 20, 2022.. ముద్దులొలుకుతున్న బాబు మా ప్రపంచంలో అడుగుపెట్టాడు. వైద్యులు, నర్సులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు.. ఈ జర్నీలో నాకు తోడ్పడిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇది ప్రారంభం మాత్రమే, బాబు రాకతో మా జీవితాలే మారిపోతాయన్న విషయం మాకు తెలుసు- సోనమ్ - ఆనంద్' అని రాసుకొచ్చింది. కాగా సోనమ్, ఆనంద్ అహుజాలు 2018 మేలో పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది మార్చిలో తాను గర్భవతినన్న విషయాన్ని వెల్లడించిందీ హీరోయిన్. ఆ తర్వాత మెటర్నటీ షూట్ చేయించుకున్న ఫొటోలను సైతం వదిలింది. ఆ మధ్య లండన్‌లో సీమంతం జరుపుకోగా ఆ ఫొటోలు కూడా నెట్టింట తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే! View this post on Instagram A post shared by Sonam Kapoor Ahuja (@sonamkapoor) View this post on Instagram A post shared by Sonam Kapoor Ahuja (@sonamkapoor) చదవండి: హీరో వరుణ్‌తేజ్‌తో రిలేషన్.. నోరు విప్పిన అందాల రాక్షసి అన్ని వారాల తర్వాత ఓటీటీలోకి రానున్న లైగర్! -
ఆ హీరో ఎంతమంది అమ్మాయిలతో బెడ్ షేర్ చేసుకున్నాడు?
కాఫీ విత్ కరణ్.. సెలబ్రిటీలతో ఇంటర్వ్యూ అనడం కన్నా వారిని రోస్ట్ చేసే షో అనడం బెటరేమో! ఎందుకంటే ఇందులో సెలబ్రిటీలను పిలిచి వారిని చిత్రవిచిత్ర ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెడతాడు హోస్ట్ కరణ్ జోహార్. తాజాగా ఈ షోకు బాలీవుడ్ తారలు సోనమ్ కపూర్, అర్జున్ కపూర్ హాజరయ్యారు. ఇంకేముంది, వచ్చీరాగానే తన ప్రశ్నలకు పదును పెట్టాడు కరణ్. అర్జున్ను ఉద్దేశిస్తూ సోనమ్‌తో.. నీకున్న ఎంతమంది ఫ్రెండ్స్‌తో ఇతడు బెడ్ షేర్ చేసుకున్నాడు? అని అడిగాడు. దీనికామె అది నేనిప్పుడు మాట్లాడలేను. అయినా నాకలాంటి బ్రదర్స్ లేరు అని బదులిచ్చింది. అందుకు కరణ్ గట్టిగా నవ్వేస్తూ మరెలాంటి బ్రదర్స్ ఉన్నారని మరింత ఉడికించాడు. ఈ వ్యవహారంతో మధ్యలో కల్పించుకున్న అర్జున్.. నువ్వెలాంటి సిస్టర్‌వి అసలు.. మాకోసం ఏం చెప్తున్నావో తెలుస్తోందా? సోనమ్‌తో ట్రోల్ చేయించడానికే నన్ను ఈ షోకి పిలిచారా? ఏంటి? అని అడిగాడు. తర్వాత అర్జున్ను నీ ప్రేయసి మలైకా నెంబర్ ఏమని సేవ్ చేసుకున్నావని అడిగాడు హోస్ట్. దానికతడు నాకు మలైకా అనే పేరే ఇష్టం, కాబట్టి అలాగే సేవ్ చేసుకున్నానని చెప్తాడు. ఇక ఈ ప్రోమో హాట్‌స్టార్‌లో రిలీజవగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి వీరి సంభాషణ పూర్తిగా వినాలంటే గురువారం వరకు ఆగాల్సిందే! చదవండి: మీనాను పరామర్శించిన అలనాటి హీరోయిన్లు, ఫొటో వైరల్ మహేశ్ బాబు 'పోకిరి' స్పెషల్ షో.. ఫ్యాన్స్‌కు పండగే -
Sonam Kapoor: ప్రెగ్నెన్సీ కష్టాలు.. ఫొటో షేర్ చేసిన హీరోయిన్
బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ త్వరలో తల్లి కాబోతున్న విషయం తెలిసిందే! తాజాగా ఆమె తన కాళ్లు వాచిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అమ్మ కావడానికి చేసే ప్రయాణం అంత అందంగా ఏమీ ఉండదు అని రాసుకొచ్చింది. ఫొటో చూస్తుంటే కాళ్లు వాయడంతో తను ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. కాగా సోనమ్, ఆనంద్ అహుజాలు 2018 మేలో పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది మార్చిలో తాను గర్భవతినన్న విషయాన్ని అభిమానులకు వెల్లడించిందీ హీరోయిన్. అప్పటినుంచి తన ప్రతి కదలికను అభిమానులతో పంచుకుంటూనే వస్తోంది. మెటర్నటీ షూట్ చేయించుకున్న ఫొటోలను సైతం వదిలింది. ఆ మధ్య లండన్‌లో సీమంతం జరుపుకోగా ఆ ఫొటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. View this post on Instagram A post shared by Sonam Kapoor Ahuja (@sonamkapoor) View this post on Instagram A post shared by Sonam Kapoor Ahuja (@sonamkapoor) చదవండి: సింపుల్‌గా కనిపిస్తున్న ప్రభాస్ టీషర్ట్ అంత ఖరీదా? ‘సీతారామం’ టాక్ ఎలా ఉందంటే... -
ద్యేవుడా.. ఆ హీరోయిన్ కింద పడితే సినిమా హిట్!
ఒకరి నమ్మకం.. ఇంకొకరికి పిచ్చిగా అనిపించొచ్చు. నవ్వులాటగానూ తోచొచ్చు. అలాంటి నమ్మకాలు సిల్వర్ స్క్రీన్ మీద మ్యాజిక్స్.. గిమ్మిక్స్ చేసే వాళ్లకు ఎక్కువ. అవి సెల్యూలాయిడ్ సెంటిమెంట్స్గానే మిగిలిపోవట్లేదు.. ఆ సెలెబ్రిటీ రియల్ లైఫ్‌లోనూ భాగమవుతున్నాయి. ఎగ్జాంపుల్స్ వీళ్లే...! ఎవరి పిచ్చి వారికి ఆనందం.. ఈ ఊసుపోని కబుర్లను మేం పోగేసుకు రావట్లే మరి.. ఆ పిచ్చిలో పడి! ఎనిమిదే కావాలి.. బిహైండ్ ది స్క్రీన్ లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న హీరో రణ్‌బీర్ కపూర్! ఆ బాబుక్కూడా ఓ సెంట్మెంట్ ఉండండోయ్. అది వాళ్లమ్మ నీతూ సింగ్ జన్మదిన తేదీ. అది ఎనిమిది. తాను ఏ కొత్త పని మొదలుపెట్టాలన్నా.. ఎక్కడికి వెళ్లాలనుకున్నా.. ఎనిమిదో తేదీనే మొదలుపెడ్తాడు.. వెళ్తాడు. తన దగ్గరున్న కార్ల నంబర్ కూడా ఎనిమిది వచ్చేలానే చూసుకుంటాడు. అదీ ఆ అబ్బాయి సెంట్మెంట్! పడితేనే హిట్.. ..ఎక్కడండీ.. ఎవరండీ..? అని అంత ఆత్రం ఎందుకండీ..? ఎక్కడంటే మరి.. షూటింగుల్లోనే. ఎవరంటే మరి.. సోనమ్ కపూర్ అహూజా. షూటింగ్ అప్పుడు సెట్స్‌లో ఒక్కసారైనా ఆమె కిందపడితే ఆ సినిమా సూపర్ హిట్టే అట. అలా ఒకట్రెండు సినిమా సెట్స్‌లో ఆమె పడితే ఆ సినిమాలు హిట్ అయ్యాయని.. అప్పటి నుంచి ఆ నమ్మకాన్ని.. సెంట్మెంట్ను వానిటీ వ్యాన్‌లో పెట్టుకుని తిరుగుందని బాలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలు. ఓ నిమ్మకాయ.. నాలుగు మిరపకాయలు.... అది బెంగాలీ బ్యూటీ బిపాశా బసు సెంటిమెంట్. తన ఇంటి ప్రధాన గుమ్మాలు, కార్లు.. ఇలా పరుల దృష్టి పడుతుంది అని అనుమానమున్న ప్రతి చోటా అలా నిమ్మకాయలు, మిరపకాయలను ఓ ఇనుప వైరుకి గుచ్చి కడుతుందట బిపాశా. అవి దుష్టదృష్టి నుంచి తనను, తన ఇంటిని కాపాడుతాయనే గట్టి నమ్మకం ఆమెదని బిపాశా సన్నిహితుల చెప్పే మాట. దేవుడి దయ.... మీద కత్రీనా కైఫ్‌కు మహావిశ్వాసం. అందుకే ఆమె నటించిన ప్రతి సినిమా విడుదలకు ముందు విధిగా ముంబైలోని సిద్ధివినాయకుడి గుడి, మౌంట్ మేరీ చర్చ్, అజ్మీర్‌లోని షరీఫ్ దర్గా.. ఇలా మూడింటినీ దర్శించుకుని వస్తుందట. ఆ దర్శనాల వల్ల తన సినిమా హిట్ అవుతుందని ఆమె నమ్మకం. కూర్చుంటేనే వరిస్తుంది.. స్పోర్ట్స్ అంటే అభిషేక్ బచ్చన్ ప్రాణం పెడ్తాడని బాలీవుడ్‌కే కాదు.. భారతదేశంలోని అతని అభిమానులు అందరికీ తెలుసు. క్రికెట్ అంటే క్రేజ్ అతనికి. ఎంతంటే.. వెర్రి నమ్మకాలను క్రియేట్ చేసేంత! క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు అతను గ్యాలరీలోనైనా.. ఇంట్లో అయినా.. కూర్చున్న చోట నుంచి కదలడట.. మ్యాచ్ అయిపోయేంత వరకు. ఏమట పాపం? అని అడక్కండి! తాను కదిలితే తన ఫేవరెట్ టీమ్ ఓడిపోతుందని భయమట పాఫం! దీనికి లాజిక్ కూడా చెప్తాడు ఆ హీరో.. అస్తమానం అటూ ఇటూ కదులుతూ.. తిరుగుతూ ఉంటే నెగెటివ్ ఎనర్జీ అన్ని దిక్కులకు పాకి అది టీమ్ మీద ప్రభావం చూపుతుంది అంటూ! ‘ఓహో.. తమరు అలా ఆ నెగెటివ్ ఎనర్జీని కుర్చీకి కట్టేస్తారన్నమాట’ అని అభిమానులు గాట్ హిజ్ పాయింట్ అన్నమాట. నాట్ ఆన్ థర్స్‌డేస్.. బాలీవుడ్ డాన్స్ కింగ్.. గోవిందా తెలుసు కదా! సెంటిమెంట్లలో అతనిదొక విధము. గురువారాలు గోవిందాకు అచ్చిరావుట. అదొక్క నమ్మకమే కాదు.. జ్యోతిష్యుడి సలహా సంప్రదింపులు లేనిదే ఏ పనీ చేయడుట. ఆఖరుకు క్రాఫ్ చేయించుకోవాలన్నా.. హెయిర్ వీవింగ్ చేయించుకోవాలన్నా జ్యోతిష్యుడు వారం, వర్జ్యం చూసి ఘడియలు లెక్కబెట్టి ముహూర్తం నిర్ణయించాల్సిందే! అంతెందుకు షూటింగ్లో కెమెరా ముందు ఏ యాంగిల్లో నిలబడాలో గోవిందా సర్‌కు డైరెక్టర్ కాదు చెప్పాల్సింది.. సర్ ఫ్యామిలీ జ్యోతిష్యుడు చెప్పాలి. ఇదండీ ఇతని సంగతి! -
లండన్‌లో ఘనంగా హీరోయిన్ సీమంతం, ఫొటోలు వైరల్
బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ త్వరలో తల్లి కాబోతున సంగతి తెలిసిందే. ప్రస్తుతం 7నెలల గర్భవతిగా ఉన్న ఆమె ఆగష్టులో బిడ్డకు జన్మినివ్వబోతోంది. ఈ నేపథ్యంలో ఆమె సీమంతం వేడుకలు ఘనంగా జరిగాయి. కేవలం తన భర్త, సోదరి రియా కపూర్ అత్యంత సన్నిహితుల మధ్య సోనమ్ సీమంత వేడుక జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె సోదరి రియా కపూర్ షేర్ చేసింది. ఈ వేడుకలో సింగర్ లియో కల్యాణ్ పాట పాడుతూ అందరిని అలరించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. తన సీమంతం వేడుకలో సోనమ్ పింక్ కలర్ అవుట్ ఫిట్ ధరించి క్యూట్‌గా నవ్వుతు ఫొటోలకు ఫోజులిచ్చింది. కాగా సోనమ్ ప్రస్తుతం తన భర్త ఆనంద్ ఆహుజాతో కలిసి లండన్‌లో ఉంటుంది. 2018లో వ్యాపారవేత్త ఆనంద్ అహుజాను ప్రేమ వివాహం చేసుకున్న సోనమ్ గత కొంతకాలంగా సినిమాలకు దూరమైంది. కాగా సోనమ్.. బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కుమార్తె అన్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Leo Kalyan (@leokalyan) -
'బ్లైండ్'గా వచ్చేస్తున్న హీరోహీరోయిన్లు..
Upcoming Movies Of Bollywood Actors And Actresses Playing In Blind Role: చాలెంజింగ్ రోల్స్ ఒప్పుకోవాలంటే మెంటల్‌గా ప్రిపేర్ అవ్వాలి. నటనతో ప్రేక్షకుల మనసులను గెలుచుకోవాలి. ‘గెలుచుకుంటామనే నమ్మకం ఉంది’ అంటున్నారు కొందరు తారలు. ‘మైండ్‌లో ఫిక్సయితే.. బ్లైండ్‌గా చేస్తాం’ అంటూ అంధులుగా నటించడానికి రెడీ అయ్యారు. నటనతో తమ సత్తా చూపిస్తామంటున్నారు. ఈ స్టార్స్ చేస్తున్న చిత్రాలపై ఓ లుక్కేయండి. బిజినెస్ డీలింగ్స్‌తో బిజీ కానున్నారు బాలీవుడ్ హీరో రాజ్‌కుమార్ రావ్. ఆయన అన్ని విషయాలనూ శ్రద్ధగా వింటారు.. కానీ చూడరు. ఎందుకంటే.. బ్లైండ్. చూపు లేకపోయినా సూపర్ సక్సెస్ఫుల్ బిజినెస్‌మేన్. ఆంధ్ర ప్రదేశ్‌లోని మచిలీపట్నంలో పుట్టిన బొల్లా శ్రీకాంత్ జీవితం ఆధారంగా రూపొందనున్న చిత్రంలో శ్రీకాంత్‌గా రాజ్‌కుమార్ రావ్ నటించనున్నారు. అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బ్రెయిన్ కాగ్నిటివ్ సైన్స్‌లో చేరిన తొలి అంధుడిగా శ్రీకాంత్ బొల్లా రికార్డు సృష్టించిన విషయం చాలామందికి తెలుసు. అలాగే ఎంతో మంది దివ్యాంగులకు ఉపాధి కల్పించారు శ్రీకాంత్. ఈ సక్సెస్ఫుల్ మేన్ జీవితంతో దర్శకురాలు తుషార్ హిద్రానీ తెరకెక్కించనున్న ఈ చిత్రానికి టీ సిరీస్ భూషణ్ కుమార్ ఓ నిర్మాత. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఓ సీరియల్ కిల్లర్‌ను పట్టుకోవడానికి ఓ లేడీ పోలీసాఫీసర్ ప్రయత్నాలు చేస్తున్నారు. ట్విస్ట్ ఏంటంటే..n ఈ పోలీసాఫీసర్ బ్లైండ్. మరి.. ఆ సీరియల్ కిల్లర్‌ను ఈ బ్లైండ్ పోలీసాఫీసర్ ఎలా పట్టుకున్నారు? ఆమెకు హెల్ప్ చేసింది ఎవరు? అనే అంశాలు ఆసక్తికరం. పోలీసాఫీసర్‌గా సోనమ్‌కపూర్ నటించిన చిత్రం ‘బ్లైండ్’. షోమ్ మఖీజా ఈ చిత్రానికి దర్శకుడు. 2011లో వచ్చిన సౌత్ కొరియన్ ఫిల్మ్ ‘బ్లైండ్’కు రీమేక్ ఇది. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం సోనమ్ కపూర్ ప్రెగ్నెంట్‌గా ఉన్నారు. ఆమె డెలివరీ తర్వాత హిందీ ‘బ్లైండ్’ చిత్రం రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే కళ్లు కనబడకపోతే సాధారణ జీవితాన్ని ఎలా మేనేజ్ చేయవచ్చో తెలుసుకున్నారు తాప్సీ. హఠాత్తుగా తాప్సీ ఇలా ఎందుకు చేశారంటే.. ‘బ్లర్’ సినిమా కోసమే. 2010లో వచ్చిన స్పానిష్ థ్రిల్లర్ ‘జూలియాస్ ఐస్’ చిత్రం హిందీలో ‘బ్లర్’గా రీమేక్ అవుతోంది. ఈ చిత్రంలోనే తాప్సీ అంధురాలి పాత్ర చేస్తున్నారు. ఈ కథ నచ్చి తాప్సీ ఓ నిర్మాతగా కూడా వ్యవహరిస్తుండటం విశేషం. ఇక ఈ చిత్రకథ విషయానికి వస్తే... క్రమంగా చూపు మందగించే ఓ గృహిణి పాత్రలో తాప్సీ కనిపిస్తారు. సరిగ్గా చూపు కనిపించాలని ఓ సర్జరీ కూడా చేయించుకోవాలనుకుంటారు. కానీ ఇంతలో ఊహించని పరిణామాలు. ఆమె సోదరి హత్యకు గురవుతుంది. అయితే అప్పటికే ఆమె తన పూర్తి కంటి చూపును కోల్పోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నదే ‘బ్లర్’ చిత్రం. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇంకోవైపు అంధురాలిగా ఓ సమూహాన్నే లీడ్ చేయనున్నారు హీరోయిన్ హీనాఖాన్. హీనాతో ఉన్న సమూహంలోని అందరూ కూడా బ్లైండే. ‘ది కంట్రీ ఆఫ్ బ్లైండ్’ అనే నవల ఆధారంగా ఆమె చేస్తున్న సినిమా కథాంశం ఇది. ‘ది కంట్రీ ఆఫ్ బ్లైండ్’ టైటిల్‌తోనే తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను ఇటీవల కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో రిలీజ్ చేశారు. ఈ ఇండో ఇంగ్లిష్ సినిమాకు రహత్ కజ్మీ దర్శకుడు. రాజ్‌కుమార్, సోనమ్, తాప్సీ, హీనా.. ఈ నలుగురూ సవాల్‌లాంటి పాత్రలతో బాక్సాఫీస్‌పై గురి పెట్టారు. ఈ సినిమాల వైపు ప్రేక్షకులు చల్లని చూపు చూస్తే ఈ స్టార్స్ కళ్లనుంచి ఆనందభాష్పాలు రావడం ఖాయం. -
సోనమ్ కపూర్ ఇంట్లో రూ. 2.4 కోట్ల నగదు చోరీ.. నర్సు అరెస్ట్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసును న్యూఢిల్లీ పోలీసులు చేధించారు. ఈ కేసులో సోనమ్ ఇంట్లో పనిచేసే ఓ మహిళ, ఆమె భర్తను పోలీసులు అరెస్టు చేశారు. సోనమ్ కపూర్ అత్త కేర్ టేకర్‌గా పనిచేస్తున్న అపర్ణ రూతు విల్సన్ అనే నర్సు ఈ దొంగతానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల న్యూఢిల్లీలోని సోనమ్ కపూర్ అమృత షెర్గిల్ మార్గ్ నివాసంలో జరిగిన ఈ ఘటనలో నర్సు ఆమె భర్త సుమారు రూ. 2.41 కోట్ల విలువైన నగలు, డబ్బును దొంగలించినట్లు పోలీసులు వెల్లడించారు. చదవండి: అందుకే మీకు చరణ్ డామినేషన్ ఎక్కువ ఉందనిపిస్తుంది పోలీసుల వివరాల ప్రకారం.. అనారోగ్యంతో బాధపడుతున్న సోనమ్ కపూర్ భర్త ఆనంద్ ఆహుజా తల్లిని చూసుకునేందుకు కేర్ టేకర్‌గా అపర్ణ రూతు విల్సన్ అనే నర్సును నియమించారు. అపర్ణ భర్త నరేశ్ కుమార్ సాగర్ శంకర్పూర్ లోని ఓ ప్రైవేట్ సంస్థలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 11న సోనమ్ ఇంట్లో చోరీ జరిగింది. ఈ ఘటనపై అదే నెల 23న సోనమ్ మేనేజర్ తుగ్లక్ రోడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఆహుజా ఇంట్లో పనిచేస్తున్న వారందరినీ పోలీసులు విచారించారు. చదవండి: వివాదంలో జెర్సీ మూవీ, విడుదల ఆపాలంటూ రచయిత డిమాండ్ అలాగే మంగళవారం రాత్రి సరితా విహార్‌లోని అపర్ణ ఇంట్లో ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు దాడులు జరపగా అసలు విషయం బయటపడింది. దీంతో అపర్ణతో పాటు ఆమె భర్తను అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ జరపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే గత మార్చిలోనే సోనమ్ మామయ్య, ఆమె భర్త ఆనంద్ ఆహుజా తండ్రి హరీశ్ అహూజాకు చెందిన షాహీ ఎక్స్ పోర్ట్ ఫ్యాక్టరీకి సైబర్ నేరస్థులు రూ.27 కోట్లకు కుచ్చుటోపీ పెట్టిన సంగతి తెలిసిందే. -
స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఇంట్లో భారీ చోరీ
స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఇంట్లో దొంగతనం జరిగింది. న్యూఢిల్లీలోని ఆమె నివాసంలోకి చొరబడ్డ దుండగులు సుమారు రూ.1.41 కోట్ల విలువైన నగలు, డబ్బును ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఫిబ్రవి 23న జరగగా,హై ప్రొఫైల్ కేసు కావడంతో పోలీసులు దీన్ని గోప్యంగా ఉంచారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు దర్యాప్తు కోసం స్పెషల్ స్క్వాడ్స్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. సోనమ్ ఇంట్లో పనిచేస్తున్న 25మంది ఉద్యోగులతో పాటు 9మంది కేర్‌టేకర్స్, డ్రైవర్లు, తోటమాలి, ఇతర పనివాళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటికే సీసీటీవీ ఫుటేజీని సైతం పరిశీలించినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఈ ఇంట్లో సోనమ్ భర్త ఆనంద్ అహుజా పేరేంట్స్‌తో పాటు అతని నానామ్మ సరళ ప్రస్తుతం అక్కడే ఉంటున్నారు. దొంగతనం అనంతరం ఒక రోజు అల్మారాలోని నగలు, డబ్బు తనిఖీ చేసినప్పుడు చోరీ జరిగిందన్న విషయం తెలిసిందని ఆమె పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు. మరోవైపు గర్భవతిగా ఉన్న సోనమ్ ప్రస్తుతం తల్లి దగ్గర ఉంటున్నట్లు తెలుస్తుంది. మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్న సోనమ్ ఇటీవలె బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. -
తన బేబీబంప్ ఫొటోలు షేర్ చేసిన స్టార్ హీరోయిన్
Sonam Kapoor Shares Her Latest Baby Bump Photos: బాలీవుడ్ స్టార్ హీరోయిన్, నటుడు అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ త్వరలో తల్లి కాబోతోన్న సంగతి తెలిసిందే. ఇటీవల తన భర్త అనంద్ ఆహుజాతో కలిసి తన ప్రగ్నెన్సీని అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో తన తాజా బేబీబంప్ ఫొటోషూట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది సోనమ్. వైట్ సారీతో డిఫరెంట్ చీరకట్టుతో ఇచ్చిన ఈ ఫొటోషూట్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె షేర్ చేస్తూ.. అబుజానీ బర్త్‌డే పార్టీ సందర్భంగా దిగిన ఫొటోలని, ఈ చీరను తన సోదరి రియా కపూర్ డిజైన్ చేసినట్లు ఆమె పేర్కొంది. చదవండి: అందుకే ‘ఆదిపురుష్’గా ప్రభాస్ పర్ఫెక్ట్ యాప్ట్: ఓం రౌత్ కాగా సోనమ్ కపూర్‌ను బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ అని పిలుస్తుంటారనే విషయం తెలిసిందే. సినిమా ఈవెంట్స్‌కు, అవార్డు ఫంక్షన్స్ ఆమె స్టైలిష్, డిఫరెంట్ ఫ్యాషన్ వేర్ దుస్తులు ధరించి అందరిని అట్రాక్ట్ చేస్తుంది. ఈ నేపథ్యంలో తన బేబీబంప్ ఫొటోషూట్‌లో కూడా సోనమ్ తనదైన ఫ్యాషన్ దివాను చూపించింది. డిఫరెంట్ చీరకట్టుతో దిగిన ఆమె బేబీబంప్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే తల్లి కాబోతోన్న సోనమ్ కపూర్ ఇటీవల ఓ ఇంటర్య్వూలో తన ప్రెగ్నెన్సీ అనుభవాన్ని పంచుకుంది. చదవండి: హీరోయిన్ సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్, అప్రమత్తం చేసిన యామీ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ఇది చాలా కష్టంగా ఉంటుంది. ఇది ఎంత కఠినంగా ఉంటుందో ఎవరూ చెప్పలేరు. కానీ, ఎంతటి అద్భుతమైన అనుభూతిని ఇస్తుందనేది మాత్రమే చెబుతారు’ అని పేర్కొంది. అలాగే తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలని ఎదురు చూస్తున్నానంటూ సొనమ్ ఆనందం వ్యక్తం చేసింది. కాగా 2018లో వ్యాపారవేత్త ఆనంద్ అహుజాను ప్రేమ వివాహం చేసుకున్న సోనమ్ గత కొంతకాలంగా సినిమాలకు దూరమైంది. View this post on Instagram A post shared by Sonam Kapoor Ahuja (@sonamkapoor) -
ప్రెగ్నెన్సీని ప్రకటించిన స్టార్ హీరోయిన్.. బేబీ బంప్ ఫోటోలు వైరల్
Sonam Kapoor Announces Her Pregnancy, Shares Baby Bump Pics: ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ త్వరలోనే తల్లి కాబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా సోనమ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. భర్తలో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ.. 'నాలుగు చేతులు. మేము చేయగలిగినంత ఉత్తమంగా నిన్ను పెంచడానికి. రెండు హృదయాలు. అవి నీతో కలిసి అడుగడుగునా కొట్టుకుంటాయి. నీపై ఎల్లప్పుడూ ప్రేమాభిమానాలు కురిపించే ఒక కుటుంబం నీ రాక కోసం ఎదురుచూస్తుంది'. అంటూ తన ప్రెగ్నెన్సీ విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. దీంతో కరీనా కపూర్, జాన్వీ కపూర్, ఏక్తా కపూర్ సహా పలువురు సెలబ్రిటీలు,నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా 2018లో వ్యాపారవేత్త ఆనంద్ అహుజాను ప్రేమ వివాహం చేసుకున్న సోనమ్ గత కొంతకాలంగా సినిమాలకు దూరమైంది. కాగా సోనమ్.. బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కుమార్తె అన్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Sonam Kapoor Ahuja (@sonamkapoor) -
Sonam Kapoor: పింక్ లెహంగాలో సోనమ్ సోయగాలు.. ఫోటోలు వైరల్
బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సోనమ్ కపూర్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. తన అందం, అభినయంతో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకుంది. 'సావరియా' సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది సోనమ్. రామ్ మాధవనీ దర్శకత్వంలో వచ్చిన 'నీర్జా' చిత్రంతో మంచి నటిగా గుర్తింపు సంపాదించుకుంది. ఈ సినిమాకు ఎన్నో అవార్డులను సైతం సొంతం చేసుకుంది. బాలీవుడ్లో మోస్ట్ గ్లామరస్‌గా కనువిందు చేసే 'సోన'మ్ అందాలు ఓసారి చూసేద్దామా. సావరియా సినిమాతో బాలీవుడ్లో తెరంగ్రేటం చేసిన సోనమ్ అనిల్ కపూర్ వారసురాలైన తనకంటూ ఓ ఫ్యాన్ బేస్ సంపాదించుకుందీ ముద్దుగుమ్మ ప్రేమ్ రతన్ ధన్‌పాయో చిత్రంలో రాజకుమారి మైథిలీ దేవిగా అలరించిన సోనమ్ సన, సోంజ్, జిరాఫీ వంటి ముద్దుపేర్లతో ఈ బాలీవుడ్ భామను పిలుస్తారు తొలి చిత్రం సావరియా, రాంజనా, ఖుబ్సూరత్, చిత్రాలకు 4 అవార్డులను సొంతం చేసుకుంది సావరియా, ఢిల్లీ-6, ఐ హేట్ లవ్ స్టోరీస్, థ్యాంక్ యూ, నీర్జా సినిమాలకు స్టార్‌డస్ట్ అవార్డ్స్ అందుకుంది నీర్జా చిత్రంతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు 8 అవార్డులను సొంతం చేసుకుందీ బ్యూటీ యో యో హనీ సింగ్ కంపోజ్ చేసిన ధీరే ధీరే సాంగ్‌లో హృతిక్ రోషన్‌తో పాటు కలిసి నటించింది నాలుగు ఫిలీంఫేర్ అవార్డులను కొల్లగొట్టిందీ సోనమ్ 2018లో వ్యాపారవేత్త అయిన ఆనంద్ అహుజను పెళ్లి చేసుకుందీ కపూర్ వారసురాలు -
Anamika Khanna: నానమ్మ కుట్టే బట్టలను చూస్తూ పెరిగింది.. ఇప్పుడు టాప్ హీరోయిన్లకు
పెద్దపెద్ద ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులేవీ చేయలేదు, కానీ పాపులర్ సెలబ్రెటీలు.. సోనమ్ కపూర్, కరీనాకపూర్ ఖాన్, దీపికా పదుకొనే, కత్రినా కైఫ్, కియరా అద్వానీలను మరింత అందంగా కనిపించే డ్రెస్‌లను రూపొందించింది అనామిక ఖన్నా. జీవితంలో ఎదగాలన్న తపన, వినూత్నమైన ఆలోచనలు, కృషి, పట్టుదలతో శ్రమించే గుణం ఉండాలేగాని డిగ్రీలు చదవకపోయినప్పటికీ అత్యున్నత స్థాయికి ఎదగవచ్చని నిరూపించింది అనామిక. Anamika Khanna: Celebrity Designer Inspiring Story Facts In Telugu: ఇండియాలోనే పాపులర్ ఫ్యాషన్ డిజైనర్‌గా ఎదిగి, విభిన్న డిజైన్లతో జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకోవడమేగాక సరికొత్త డిజైన్లను ఎప్పటికప్పుడు తన ఇన్‌స్ట్రాగామ్ అకౌంట్లో పోస్టుచేస్తూ.. లక్షలమందికి ఆదర్శంగా నిలుస్తోంది అనామిక. అప్పటి కలకత్తాలోని ఓ గ్రామంలో పుట్టింది అనామిక. నానమ్మ కుట్టే బట్టలను చూస్తూ పెరిగిన అనామిక.. పెద్దయ్యాక క్లాసికల్ డ్యాన్స్ చేర్చుకుని మంచి డ్యాన్సర్ అయ్యింది. అలా మొదలైంది.. డ్యాన్స్‌తోపాటు అనామికకు పెయింటింగ్స్ వేయడం అంటే ఎంతో ఇష్టం. ఎప్పుడూ వివిధ రకాల స్కెచ్లను గీస్తుండేది. ఈ క్రమంలోనే ఆఫ్రికన్ టెక్స్టైల్స్ బుక్ చూసిన అనామికను..దానిలో ఫ్యాషన్ స్టైల్స్ ఎంతగానో ఆకర్షించాయి. దీంతో తను కూడా ఫ్యాషన్ డిజైనర్ కావాలనుకుంది. ఫ్యాషన్ డిగ్రీ చదవని అనామిక ఫ్యాషన్ డిజైనింగ్ గురించి తెలుసుకునేందుకు వర్క్‌షాపులు, ఫ్యాషన్ షోలకు క్రమం తప్పకుండా వెళ్లేది. అక్కడ చూసిన డిజైన్లకు తన సృజనాత్మకతతో సరికొత్త స్కెచ్‌లు గీసేది. ఇలా గీసిన స్కెచ్లను దమానియా ఫ్యాషన్ షోకు పంపింది. ఆ డిజైన్లు నచ్చడంతో దమానియా ఫ్యాషన్ వాళ్లు ఆరు డిజైనర్ పీస్‌లు పంపించమన్నారు. అప్పుడు మార్కెట్లో బట్టను కొని టైలర్ దగ్గరకు వెళ్లి కావాల్సిన విధంగా కుట్టించి వారికి పంపడంతో అనామిక డిజైన్స్ అవార్డుకు ఎంపికయ్యాయి. దీంతో అనామికకు డిజైనర్‌గా తొలిగుర్తింపు లభించింది. దమానియా కోసం డిజైన్ చేసిన వస్త్రాలను బెంగళూరుకు చెందిన ఫ్యాషన్ డిజైనర్ యశోధరా షరాఫ్ చూసింది. అవి ఆమెకు నచ్చడంతో తన ఫోలియో బ్రాండ్ వాటిని విక్రయించడమేగాక, 2003లో పాకిస్థాన్‌లో జరిగిన బ్రైడల్ ఏషియా ఎగ్జిబిషన్లో పాల్గొనడానికి ఆహ్వానించింది. ఇలా యశోధరా షరాఫ్, ప్రసాద్ బిడప, రీతు కుమార్, మోనపలి వంటి ఫ్యాషన్ డిజైనర్ల గైడెన్స్ తీసుకుని ఫ్యాషన్ డిజైనర్‌గా ఎదిగింది. అంతర్జాతీయంగా అనా–మిక.. ‘అనా–మిక’ పేరుతో 2004లో ప్రారంభించిన బ్రాండ్, అంతర్జాతీయంగా బాగా పేరొందిన ఇండియన్ బ్రాండ్స్‌లో ఒకటి. ల్యాక్మె ఇండియా ఫ్యాషన్ వీక్‌లో పాల్గొనేందుకు 33 మంది డిజైనర్లను పిలవగా అందులో అనామిక ఒకరు. 2007లో జరిగిన పారిస్ ఫ్యాషన్ వీక్‌కు హాజరైన తొలి ఇండియన్ ఉమెన్ డిజైనర్ అనామిక. ఆ తరువాత 2010లో లండన్ ఫ్యాషన్ వీక్‌లో పాల్గొన్నారు. ఇక్కడ అనా–మిక డిజైన్లు నచ్చడంతో అతిపెద్ద బ్రిటిష్ రీటైల్ దిగ్గజ కంపెనీ హరాడ్స్ కాంట్రాక్ట్‌ను ఆఫర్ చేసింది. అంతేగాక బిజినెస్ ఆఫ్ ఫ్యాషన్–500 జాబితాలో అనామిక ఒకరు. 2015లో ప్రముఖ నటి టాక్ షో అతిథి ఐమీ గరేవాల్ లేడీ గగాకు పదికేజీల వెల్వెట్ లెహంగాను బహుమతిగా ఇచ్చారు. ఈ లెహంగా డిజైనర్ అనామికే. 2017లో ఎలిజిబెత్ –2 యూకే ఇండియా ఇయర్ ఆఫ్ కల్చర్‌కు అనామిక ప్రత్యేక ఆహ్వానితురాలు. ఏకే– ఓకే వర్క్‌షాపులు, లండన్‌లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియం, పారిస్‌లోని ఫ్యాషన్ ఇన్‌స్టిట్యూట్స్‌కు వెళ్లినప్పుడు అక్కడ డిజైనింగ్స్ టిప్స్‌తోపాటు, సన్నగా కనిపించేలా బట్టను ఎలా కట్ చేయాలి? ప్యాట్రన్ ఎలా తీసుకురావాలి వంటి అనేక విషయాలను అనామిక జాగ్రత్తగా పరిశీలించి పూర్తిస్థాయి ఫ్యాషన్ డిజైనర్ అయ్యింది. దీంతో తన అనామిక డిజైన్స్ పేరుతో సొంత బ్రాండ్, కోల్‌కతాలో తన డిజైనర్ స్టోర్‌ను ఏర్పాటు చేసింది. తన పిల్లలు విరాజ్ ఖన్నా, విశేష్ ఖన్నాలతో కలిసి రెడీ టు వేర్ స్ప్రింగ్, సమ్మర్ థీమ్‌తో ‘ఏకే–ఓకే’ పేరుతో ఏర్పాటు చేసింది. కొన్ని బాలీవుడ్ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసింది. ఇవేగాక ‘టైమ్‌లెస్ ద వరల్డ్’ పేరిట ఈ ఏడాది మార్చిలో తన లేటెస్ట్ డిజైన్లను విడుదల చేశారు. కేవలం పదివేల రూపాయలతో ప్రారంభించిన అనామిక ఎథినిక్ బ్రైడల్ వేర్, కాంటెంపరరీ, వెస్ట్రన్ డిజైన్స్‌ను రూపొందిస్తూ, లక్షలమంది ఫాలోవర్స్‌ను ఆకట్టుకుంటున్నారు. చదవండి: Toy Bank: మీ పిల్లలు ఆడేసిన బొమ్మలను ఏం చేస్తున్నారు? View this post on Instagram A post shared by Anamika Khanna (@anamikakhanna.in) -
న్యూస్ రీడర్‌గా శ్రీకాంత్ కొడుకు.. అంత ఈజీ కాదంటున్న అషూ
►న్యూస్ రీడర్ అయిన శ్రీకాంత్ కొడుకు ►ఆ కండిషన్లో షూటింగ్ చేయడం అంత సులువు కాదంటున్న అషూ రెడ్డి ► బుంగమూతి పెట్టిన అనుష్క శర్మ ► బిగ్‌బాస్ లహరి శరి స్టన్నంగ్ ఫోటోలు View this post on Instagram A post shared by Aditya Music (@adityamusicindia) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Anita H Reddy (@anitahassanandani) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by AnushkaSharma1588 (@anushkasharma) View this post on Instagram A post shared by Lahari Shari (@lahari_shari) View this post on Instagram A post shared by Sonam K Ahuja (@sonamkapoor) -
లవ్ యూ మరిది గారూ.. భావోద్వేగానికి గురైన సోనం
Sonam Kapoor In Rhea Kapoor Wedding: ‘‘మీరు ఎల్లప్పుడూ మా కుటుంబ సభ్యులే. మరిది కంటే కూడా ఒక స్నేహితుడిగానే మీరంటే నాకు ఎక్కువ అభిమానం. ఇప్పుడు మీరెంత సంతోషంగా ఉన్నారో.. నేను అంతకంటే ఎక్కువ ఆనందంగా ఉన్నాను. లవ్ యూ’’ అంటూ బాలీవుడ్ హీరోయిన్ సోనం కపూర్ తన సోదరి రియా కపూర్ భర్త కరణ్ బులానీ పట్ల ఆప్యాయతను చాటుకున్నారు. అతడితో కలిసి ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేసిన ఆమె... తనకున్న గొప్ప స్నేహితుల్లో మరిదిగారు కూడా ఒకరంటూ ప్రేమను కురిపించారు. కాగా బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ చిన్న కుమార్తె, నిర్మాత రియా కపూర్- యాడ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కరణ్ బులానీ శనివారం వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. గత 12 ఏళ్లుగా ప్రేమలో మునిగితేలుతున్న ఈ జంట పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ముంబైలోని జుహులో గల అనిల్ కపూర్ నివాసంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఇక భర్త ఆనంద్ అహుజాతో కలిసి లండన్‌లో ఉంటున్న సోనం కపూర్ సోదరి రియా వివాహానికి హాజరయ్యేందుకు ముంబైకి వచ్చారు. వివాహ తంతు జరుగుతున్న సమయంలో సోనం తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇక చెల్లెలి పెళ్లి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఉన్న ఫొటోలను సోనం సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. చదవండి: Rhea Kapoor: నా బెస్ట్‌ఫ్రెండ్‌ని పెళ్లాడాను.. ఎంతగా ఏడ్చానో.. పూజా హెగ్డేపై డైరెక్టర్ ఆర్కే సెల్వమణి ఫైర్ -
హల్చల్ :గెస్ చేయమన్న కౌశల్..అవసరం లేదంటున్న సదా
► భర్తతో చిరునవ్వులు చిందిస్తున్న సోనమ్ కపూర్ ► గోవా డైరీస్ ఫోటో షేర్ చేసిన నమ్రతా శిరోద్కర్ ► ఊహల్లో మునిగిన దీప్తి సునయన ► ఫోటోలో ఉన్న హీరోయిన్ గెస్ చేయమంటున్న కౌశల్ ► గుర్తిండి పోయే రోజుంటున్న సింగర్ హేమచంద్ర ► అందరికీ ఇదే ఫిలింగ్ ఉంటుందా అని ప్రశ్నిప్తున్న అనిత ► దీనికి పదాలు అవసరం లేదంటున్న సదా ► ఫ్యామిలీతో బుల్లితెర నటి అష్మిత ► కేవలం ప్రేమ మాత్రమే అంటున్న యాంకర్ రవి View this post on Instagram A post shared by Sonam K Ahuja (@sonamkapoor) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Sonam K Ahuja (@sonamkapoor) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Vedala Hemachandra (@vedalahemachandra) View this post on Instagram A post shared by k a u s h a l M a n d a (@kaushalmanda) View this post on Instagram A post shared by Anita H Reddy (@anitahassanandani) View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by syamala Anchor (@syamalaofficial) View this post on Instagram A post shared by HK (@realhinakhan) View this post on Instagram A post shared by Ashmita karnani (@ashmita_9) View this post on Instagram A post shared by Anchor Ravi (@anchorravi_offl) View this post on Instagram A post shared by Krishna Mukherjee (@krishna_mukherjee786) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
12 ఏళ్ల తర్వాత.. నాకేమీ కొత్తగా అనిపించడం లేదు.. కానీ
Rhea Kapoor- Karan Boolani Pic After Mariage: ‘‘12 ఏళ్ల తర్వాత.. నాకు మరీ అంత సంతోషంగా ఏమీ లేదు. అలా అని నర్వస్‌గా కూడా ఫీలవడం లేదు.. ఎందుకంటే నువ్వు నా ప్రాణ స్నేహితుడివి. అత్యుత్తమైన వ్యక్తివి కూడా. కానీ ఈరోజు నేను ఎంతగా ఏడ్చానో.. భయంతో వణికిపోయానో నాకే తెలుసు. ఇలాంటి ఒక అద్భుతమైన క్షణాన్ని, ఆనందాన్ని నేను ఇంతవరకు అనుభవించలేదు కదా! ప్రతిరోజు రాత్రి 11 గంటల కంటే ముందే.. నా తల్లిదండ్రులు నిద్రపోకముందే.. ఇంటికి చేరుకునే అమ్మాయిని నేను. ఇప్పుడు మనదైన సరికొత్త కుటుంబంలో కూడా అమ్మానాన్నలు, నా తోబట్టువులతో కలిసి జీవించడం నిజంగా గొప్ప అనుభూతి’’ అంటూ బాలీవుడ్ నిర్మాత రియా కపూర్ భావోద్వేగానికి గురయ్యారు. సోదరి రియా వివాహానికి హాజరైన సోనం కపూర్ దంపతులు కాగా బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్- సునీత కపూర్ల చిన్న కుమార్తె రియా కపూర్ పెళ్లి శనివారం జరిగిన సంగతి తెలిసిందే. ముంబైలోని జుహులో గల అనిల్ కపూర్ ఇంట్లో అత్యంత సన్నిహితుల సమక్షంలో రియా- కరణ్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ సందర్భంగా భర్త కరణ్ బులానీతో కలిసి ఉన్న తమ పెళ్లి ఫొటోను షేర్ చేసిన సందర్భంగా అతడిపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. భర్త ఆనంద్ అహుజాతో సోనం కపూర్ ప్రాణ స్నేహితుడిని జీవిత భాగస్వామిగా పొందిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేమంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ఈ క్రమంలో నవ దంపతులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. కాగా కరణ్ బూలానీ పలు యాడ్స్ నిర్మించి గుర్తింపు పొందాడు. రియా సైతం పలు బాలీవుడ్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. అంతేగాక ఇద్దరూ కలిసి ఐషా, వేక్ అప్ సిద్ వంటి చిత్రాలకు కలిసి పనిచేశారు. ఇక వీరి వివాహానికి హాజరయ్యేందుకు రియా సోదరి, బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ సోనం కపూర్ లండన్ నుంచి ముంబైకి చేరుకున్నారు. ఈ వివాహ వేడకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. -
ఆ హీరోయిన్ పారితోషికం కేవలం 11 రూపాయలు!
ముంబై: ‘‘ఫ్లైయింగ్ సిఖ్’’గా ప్రసిద్ధి పొందిన భారత దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘భాగ్ మిల్కా భాగ్’ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటుగా బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించిన ఫరాన్ అక్తర్, సోనం కపూర్‌కు మంచి గుర్తింపు దక్కింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో నటించడమే అదృష్టంగా భావించిన నటీనటులు.. నామమాత్రపు పారితోషికం తీసుకున్నారు. సోనం సైతం కేవలం 11 రూపాయలు మాత్రమే రెమ్యునరేషన్ తీసుకుందట. భాగ్ మిల్కా భాగ్ డైరెక్టర్ రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా తన బయోగ్రఫీలో ఈ విషయాన్ని తాజాగా వెల్లడించాడు. త్వరలో విడుదల కానున్న ‘‘ది స్ట్రేంజర్ ఇన్ ది మిర్రర్’’లో సోనంపై ప్రశంసలు కురిపించిన రాకేశ్ ఓంప్రకాశ్.. ‘‘ఇది లవ్‌స్టోరీ కాదు అని సోనంకు ముందే తెలుసు. బాల్యంలో దుర్భర పరిస్థితులు ఎదుర్కొన్న వ్యక్తి కథ ఇది. ఈ మూవీలో అతిథి పాత్రలో నటించేందుకు సోనం వెంటనే ఒప్పుకొంది. సినిమాలో తను భాగం కావాలని నిర్ణయించుకుంది. అప్పటికే ఢిల్లీ-6 సినిమాలో మేం కలిసి పనిచేశాం. మా మధ్య అప్పటి నుంచి అనుబంధం ఉంది. భాగ్ మిల్కా భాగ్ గురించి చెప్పగానే తనకు 7 రోజుల సమయం కావాలని అడిగింది. కేవలం 11 రూపాయలు తీసుకుని బీరో పాత్ర పోషించింది. తన మనసు చాలా మంచిది’’ అని పేర్కొన్నాడు. కాగా 2013లో విడుదలైన భాగ్ మిల్కా భాగ్ సూపర్ హిట్‌గా నిలిచింది. ఇందులో మిల్కాసింగ్ ఇష్టసఖి పాత్రలో సోనం నటించింది. చదవండి: ఆచార్య షూటింగ్ పూర్తి.. వైజాగ్‌లో చికిత్స తీసుకుంటున్న మెగాస్టార్! -
ప్రెగ్నెన్సీ రూమర్లకు చెక్ పెట్టిన హీరోయిన్!
Sonam Kapoor On Pregnancy Rumours: బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఏడాది తర్వాత లండన్ నుంచి భారత్‌కు తిరిగొచ్చింది. ఇటీవలే ముంబై ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన ఆమె ఈ సందర్భంగా వదులైన జాకెట్‌ను ధరించింది. ఫ్యాషన్ ఐకాన్‌గా చెప్పుకునే సోనమ్ అలా లూజ్ డ్రెస్ వేయడంతో ఆమె గర్భవతంటూ నెటిజన్లు డౌటు పడ్డారు. కొంతమందైతే ఆమె ప్రెగ్నెన్సీని కన్ఫామ్ చేస్తూ విషెస్ కూడా తెలియజేశారు. దీంతో ఎట్టకేలకు సోనమ్ ఈ పుకార్లపై స్పందించింది. బుధవారం తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తనకు పీరియడ్స్ వచ్చినట్లు స్పష్టం చేసింది. 'పీరియడ్స్ మొదటి రోజున వేడి నీళ్లు, అల్లం టీ తాగుతున్నాను' అని క్లారిటీ ఇవ్వడంతో రూమర్లకు చెక్ పెట్టినట్లైంది. ఇటీవల ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనమ్ మాట్లాడుతూ.. 'లండన్‌లో లభించే స్వేచ్ఛ నాకు చాలా ఇష్టం. ఇక్కడ నేను ఉండే చోటును నేనే శుభ్రం చేసుకుంటాను, నాకవసరమైనవి నేనే కొని తెచ్చుకుంటాను, నాకేది కావాలో అది వండుకుని తింటాను. నాకిక్కడ ఉండటం చాలా ఇష్టం, కానీ ఫైనల్‌గా నాకు ఇండియా అంటేనే ప్రాణం' అని చెప్పుకొచ్చింది. -
నిజం చెప్పండి తారలూ.. మీరు ప్రెగ్నెంట్స్ కదూ!
Is Sonam Kapoor, Neha Kakkar pregnant?: బాలీవుడ్ భామలు కొంచెం లావెక్కితే చాలు గర్భం దాల్చారా? అంటూ అనుమానాలు, కాస్త బక్కచిక్కితే మరీ అంత డైటింగ్ అవసరం లేదంటూ వెటకారాలు సోషల్ మీడియాలో కామన్ అయిపోయాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే మీడియాకు చిక్కిన ఇద్దరు తారలు సోనమ్ కపూర్, నేహా కక్కర్లకు కూడా ప్రశ్నల బాణాలను సంధిస్తున్నారు నెటిజన్లు. కోవిడ్ వల్ల ఏడాది కాలంగా లండన్‌లోనే ఉండిపోయిన సోనమ్ ఇటీవలే ముంబైకు తిరిగొచ్చింది. తన భర్త ఆనంద్ అహుజాతో కలిసి ముంబై ఎయిర్‌పోర్టులో దిగింది. ఫ్యాషన్ ఐకాన్‌గా చెప్పుకునే ఆమె ఈ సమయంలో వదులైన జాకెట్‌ను ధరించింది. దీంతో అది చూసిన నెటిజన్లు ఆమె గర్భవతని అభిప్రాయపడుతున్నారు. అందుకే లూజ్ జాకెట్ వేసుకుందని కామెంట్లు చేస్తున్నారు. మరి ఇందులో ఎంతమేరకు నిజముందో సోనమ్ దంపతులకే తెలియాలి. కాగా సోనమ్ వ్యాపారవేత్త ఆనంద్ అహుజాను 2018లో పెళ్లాడింది. మరోవైపు బాలీవుడ్ టాప్ సింగర్ నేహా కక్కర్ కూడా గర్భం దాల్చిందంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఆమె అభిమానులు. గతేడాది రోహన్‌ప్రీత్‌ను పెళ్లి చేసుకున్న ఆమె తాజాగా భర్తతో కలిసి ఎయిర్‌పోర్టులో దర్శనమిచ్చింది. ఈ సమయంలో ఆమె వదులైన టీ షర్టు ధరించింది. పైగా ప్రయాణం చేసి కాస్త అలిసిపోయినట్లు కనిపిస్తోంది. దీంతో ఆమె భర్త రోహన్‌ప్రీత్ ముందుగా నేహాను కారులో కూర్చోబెట్టాకే తను కారెక్కాడు. అయితే నేహా వాలకం, ఆమె మీద రోహన్ కేరింగ్ చూస్తుంటే కన్ఫామ్గా ఆమె గర్భవతే అని డిసైడ్ అయిపోతున్నారు ఫ్యాన్స్. దీనికి తోడు 'ఇండియన్ ఐడల్ 12' షో నుంచి నేహా తప్పుకోవడం కూడా ఈ ఊహాగానాలకు మరింత ఊతమిస్తోంది. #sonamkapoor returns to India after more than a year. She had left with hubby #anandahuja and they have been in London due to to Covid-19. Father #anilkapoor comes to pick her up at the Mumbai airport. pic.twitter.com/qnMiJxPfHA — Viral Bhayani (@viralbhayani77) July 13, 2021 -
హల్చల్ : సోనమ్ సొగసులు..దీప్తి సునయన వయ్యారాలు
♦చీర కట్టులో దీప్తి సునయన ♦ తమ్ముడి షర్ట్‌ను దొంగతనం చేసిన అనుపమ ♦ క్యూట్ లుక్స్‌లో సనయా ఇరానీ ♦ పొలం దున్నుతున్న అభిజీత్ ♦ బ్రేక్ ఫాస్ట్‌తో తమన్నా.. ఆ షో కోసమేనా? ♦ వోగ్ ఫోటో షూట్లో సోనమ్ కపూర్ ♦ నిషా అగర్వాల్‌ను పొగిడేస్తున్న కాజల్ View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Sanaya Irani (@sanayairani) View this post on Instagram A post shared by Jhansi (@anchor_jhansi) View this post on Instagram A post shared by pradeep machiraju (@pradeep_machiraju) View this post on Instagram A post shared by Abijeet (@abijeet11) View this post on Instagram A post shared by Kangana Ranaut (@kanganaranaut) View this post on Instagram A post shared by Sonam K Ahuja (@sonamkapoor) View this post on Instagram A post shared by Punarnavi Bhupalam🧿 (@punarnavib) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Nisha Aggarwal (@nishaaggarwal) -
అదృష్టవశాత్తూ బాలీవుడ్ వ్యక్తిని పెళ్లాడలేదు: హీరోయిన్
లండన్/ముంబై: బాలీవుడ్ బంధాలపై హీరోయిన్ సోనం కపూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదృష్టవశాత్తూ తాను ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని, వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతుందని పేర్కొన్నారు. కాగా హృతిక్ రోషన్- సుజానే ఖాన్, ఆర్బాజ్‌ఖాన్- మలైకా అరోరా, సైఫ్ అలీఖాన్- అమృతా సింగ్ వంటి పలు బీ-టౌన్ జంటలు ఇప్పటికే వైవాహిక బంధానికి స్వస్తి పలకగా, తాము కూడా విడిపోతున్నట్లు ఆమిర్ ఖాన్- కిరణ్ రావు శనివారం ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వోగ్ మ్యాగజీన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనం మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘దేవుడి దయ వల్ల నేను ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని పెళ్లిచేసుకోలేదు. అందుకు నిజంగా కృతజ్ఞురాలిని. ఎందుకంటే, అక్కడ(బాలీవుడ్) పనిచేసే వాళ్ల ప్రపంచం సంకుచితంగా ఉంటుంది. బాలీవుడ్లో జరుగుతున్నది ఇదే. నాలాగా ఆలోచించే, ఫెమినిస్ట్‌ను పెళ్లాడటం నిజంగా నా అదృష్టమనే చెప్పాలి’’ అని సోనం పేర్కొన్నారు. ఇక వివాహం తర్వాత తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి మాట్లాడుతూ... ‘‘పెళ్లైన నాటి నుంచి ఈ ఏడాదే మేం ప్రతి రాత్రి కలిసి గడపగలుగుతున్నాం. ఎందుకంటే ముంబై- ఢిల్లీ- లండన్ల మధ్య ప్రయాణాలకే సమయం సరిపోయేది. మాకు ఒకరి పట్ల ఒకరికి అవిజ్యామైన ప్రేమ ఉంది. ఇద్దరం కలిస్తే సంతోషాలకు కొదవే ఉండదు. లండన్‌లో ఒంటరిగా ప్రయాణించడం వల్ల చాలా విషయాలు నేర్చుకోగలిగాను. ఇక్కడ భారతీయులు, పాకిస్తానీయులు, బంగ్లాదేశీయులు, మధ్య ప్రాచ్య దేశాలకు చెందిన ఎంతో మంది ప్రజలను చూశాను. వాళ్లకి బాలీవుడ్ అంటే ఒక రకమైన పిచ్చి ఉంటుందని నాకు అర్థమైంది’’ అని చెప్పుకొచ్చారు. కాగా 2018లో సోనం కపూర్, వ్యాపారవేత్త ఆనంద్ అహుజాను పెళ్లాడిన సంగతి తెలిసిందే. -
ఐశ్.. 75 లక్షల చీర కట్టింది.. మరి శిల్పా, కరీనా ఏమైనా తక్కువా!?
వెబ్‌డెస్క్: సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో మరుపురాని మధుర జ్ఞాపకం అంటే వివాహమే. ఒంటరిగా సాగుతున్న జీవన ప్రయాణంలో భాగస్వామి అడుగుపెట్టడంతో జీవితం పరిపూర్ణమైనట్లుగా భావిస్తారు చాలా మంది. అచ్చంగా మన సొంతమయ్యే తోడుతో బంధం ఏర్పడే ఆ అపురూప ఘట్టం ఎంతో ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు. ముఖ్యంగా అమ్మాయిలు పెళ్లిరోజున ఎలాంటి దుస్తులు, ఆభరణాలు ధరించాలి.. ఆపాదమస్తకం ఎలా తయారు కావాలి అన్న విషయాల గురించి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. తమ స్తోమతకు తగ్గట్లుగా బడ్జెట్లో అన్ని ప్లాన్ చేసుకుంటారు. ఇక సెలబ్రిటీలు కూడా ఇందుకు అతీతం కాదు. అయితే, మనలాగా ఆర్థిక లెక్కల గురించి ఎక్కువగా ఆలోచించకుండా పెళ్లిరోజు మరింత అందంగా కనబడేందుకు ఎంత ఖర్చు చేసేందుకైనా వెనుకాడరు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న తరుణంలో ఐశ్వర్యారాయ్ మొదలు ప్రియాంక చోప్రా వరకు పలువురు హీరోయిన్లు ధరించిన దుస్తులు, వాటి ఖరీదు తదితర వివరాలు తెలుసుకుందాం. డిజైన్లు నచ్చితే.. అచ్చంగా అవేకాకపోయినా అలాంటి వాటిని పోలిన దుస్తుల్లో మెరిసిపోయేందుకు రెడీ అవ్వొచ్చు కదా. ఏమంటారు?! రూ. 75 లక్షల ఖర్చు! మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్, బిగ్ బీ అమితాబ్ తనయుడు అభిషేక్ బచ్చన్ 2007, ఏప్రిల్ 20న వివాహబంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. తమ ప్రేమను పెళ్లిపీటల వరకు తీసుకువచ్చిన ఈ జంట.. పెళ్లిరోజున సంప్రదాయ దుస్తుల్లో తళుక్కుమన్నారు. మంగళూరు భామ అయిన ఐశ్వర్యారాయ్.. తమ సంస్కృతికి పెద్దపీట వేస్తూ.. నీతా లుల్లా డిజైన్ చేసిన కాంజీవరం చీర ధరించింది. బంగారు తీగలు, స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో నిండిన చీర ఖరీదు దాదాపు రూ. 75 లక్షలట. అప్పటి వరకు ఒక పెళ్లికూతురు ధరించిన అత్యంత ఖరీదైన అవుట్‌ఫిట్ ఇదేనని ఫ్యాషన్ నిపుణుల మాట. మరి ఐశ్వర్యారాయ్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా! ‘సాగరకన్య’ చీర ధర అరకోటి! ఫ్యాషన్ ప్రియుల మనసు దోచుకోవడంతో బాలీవుడ్ భామ శిల్పాశెట్టి ఎల్లప్పుడూ ముందు వరుసలోనే ఉంటారు. 2009లో రాజ్‌కుంద్రాను వివాహమాడిన ఈ ‘సాగరకన్య’.. పెళ్లినాడు తరుణ్ తహిలియాని రూపొందించిన అవుట్‌ఫిట్ ధరించారు. ఇందులో దాదాపు 8000 స్వరోవ్స్కీ క్రిస్టల్స్ ఇమిడిఉన్నాయట. దాని ధర రూ. 50 లక్షలు అని ఫ్యాషన్ వర్గాల భోగట్టా. ‘సవ్యసాచి’ డిజైన్‌తో ఆకట్టుకున్న అనుష్క బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ- టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న సంగతి తెలిసిందే. 2017లో వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంట.. పెళ్లిరోజున తమ వస్త్రధారణ మరింత స్పెషల్‌గా ఉండేలా చూసుకున్నారు. సవ్యసాచి ముఖర్జీ డిజైన్ చేసిన అవుట్ఫిట్లలో అభిమానులకు కన్నులవిందు చేశారు. ఆనాడు అనుష్క ధరించిన పేస్టల్ కలర్ లెహంగా ఖరీదు సుమారు 30 లక్షల రూపాయలట. అత్యంత ఖరీదైన, అందమైన దుస్తుల్లో సోనం! ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అనతికాలంలోనే బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్‌గా గుర్తింపు పొందింది స్టార్ కిడ్ సోనం కపూర్. సినిమాలతో పాటు తన వస్త్రధారణ పట్ల తన అభిరుచితో ఎంతో మంది అభిమానం చూరగొన్న ఈ భామ.. 2018లో ప్రియుడు, వ్యాపారవేత్త ఆనంద్ ఆహుజాను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా ఆమె ధరించిన దుస్తులు టాక్ ఆఫ్ ఇండస్ట్రీ అయ్యాయి. అనురాధా వకీల్ రూపొందించిన ఎరుపు రంగు అవుట్‌ఫిట్‌లో మెరిసిపోయిన సోనం.. దీనికోసం సుమారు 70- 90 లక్షల రూపాయలు ఖర్చు చేసిందట. పిగ్గీచాప్స్ సైతం తనదైన స్టైల్లో.. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా- అమెరికన్ సింగర్ నిక్ జోనస్ వివాహం 2018లో జరిగిన సంగతి తెలిసిందే. హిందూ, క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతుల్లో రెండేసి సార్లు పెళ్లిప్రమాణాలు చేసిన ఈ జంట.. తమదైన శైలి డిజైన్లతో ఆకట్టుకున్నారు. పెళ్లి సందర్భంగా పిగ్గీచాప్స్ ధరించిన ఎరుపు వర్ణం గల లెహంగా ఖరీదు సుమారు 18 లక్షల రూపాయలట. దీప్‌వీర్.. రెండు కళ్లుచాలవంటే నమ్మరు! బీ-టౌన్లో అత్యంత రొమాంటిక్ కపుల్‌గా పేరొందిన జంట దీపికా పదుకొనె- రణ్వీర్ సింగ్. సుమారు ఐదేళ్ల పాటు ప్రణయ బంధంలో మునిగితేలిన దీప్‌వీర్ 2018లో ఇటలీలో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. దక్షిణాది, ఉత్తరాది పద్ధతుల్లో వివాహం చేసుకున్న ఈ జంట పెళ్లినాడు సంప్రదాయ దుస్తుల్లో ఎంతో అందంగా ముస్తాబయ్యారు. సవ్యసాచి డిజైన్ చేసిన అవుట్ఫిట్లు ధరించి అభిమానుల మనసు దోచుకున్నారు. ‘‘సదా సౌభాగ్యవతి భవ’’ అని దేవనాగరి లిపితో దుపట్టాపై లిఖించుకున్న దీపికా.. తన లెహంగా కోసం దాదాపు 9 లక్షలు ఖర్చుపెట్టారట. ఇక వీరే కాదు.. కరీనా కపూర్(50 లక్షలు), ఊర్మిళా మటోంద్కర్(నాలుగున్నర లక్షలు), బిపాసా బసు(4 లక్షలు), దియా మీర్జా(3 లక్షలు), ఇషా డియోల్(3 లక్షలు) వంటి నటీమణులు సైతం స్పెషల్ డేను అందమైన దుస్తులు ధరించి మరింత స్పెషల్‌గా మార్చుకున్నారు. చదవండి: తాను అక్రమ సంతానాన్ని అని తెలుసుకున్న ‘లోకి’ ఏం చేయబోతున్నాడు? -
సోనమ్ వల్ల గొడవ, చివరికి తన్నులు తిన్నా: హీరో
గొడవలకు దూరంగా ఉండే బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ బాల్యంలో మాత్రం ఓ విద్యార్థిని చెడుగుడు ఆడేశాడట. తన కజిన్ సోనమ్ కపూర్‌ను ఏడిపించిన వ్యక్తిని నిందిస్తూ పట్టపగలే చుక్కలు చూపించబోయాడట! కానీ అతడు పెద్ద బాక్సర్ కావడంతో అర్జున్ వాచిపోయిన కన్నుతో ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. ఇంతకీ ఆ రోజు ఏం జరిగిందో వివరంగా తెలియాలంటే ఇది చదివేయండి.. అర్జున్ కపూర్, అతడి కజిన్ సోనమ్ కపూర్ ఆర్య విద్యా మందిర్ పాఠశాలలో చదివేవారు. ఇద్దరికీ బాస్కెట్‌బాల్ ఆడటం అంటే ఎంతో ఆసక్తి ఉండేది. ఓసారి సోనమ్ స్కూల్ గ్రౌండ్లో బాస్కెట్‌బాల్ ఆడుకుంటుండగా సీనియర్లు వచ్చి ఆమె దగ్గరున్న బాల్‌ను లాక్కున్నారు. ఆడింది చాలు, ఇప్పుడు మేం ఆడుకుంటామని దురుసుగా సమాధానమిచ్చారు. దీంతో సోనమ్ గుక్క పెట్టి ఏడ్చుకుంటూ అర్జున్ దగ్గరకు వెళ్లి ఓ అబ్బాయి నాతో చెడుగా ప్రవర్తించాడు అని ఫిర్యాదు చేసింది. నిజానికి అర్జున్ గొడవలకు దూరంగా ఉండే మనిషి. కానీ తన సోదరిని ఏడిపించారని తెలియగానే అతడి కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే అర్జున్ తన కజిన్‌ను ఏడిపించిన వ్యక్తి దగ్గరకు వెళ్లి ఇష్టమొచ్చినట్లు తిట్టాడు. అతడు అలానే కాసేపటి వరకు చూసీచూసీ చివరకు అర్జున్ ముఖం మీద గట్టిగా ఒక పంచ్ ఇచ్చాడట. దీంతో కమిలిపోయిన ముఖంతో అర్జున్ ఇంటికి వెళ్లగా.. అంతా తన వల్లే జరిగిందని బాధపడిన సోనమ్ క్షమాపణ కూడా చెప్పింది. అయితే అతడో బాక్సర్ అని తెలియక గొడవ పెట్టుకున్నానని, కానీ అతడిచ్చిన పంచ్‌కు ఆస్పత్రికి కూడా వెళ్లాల్సి వచ్చిందని అర్జున్ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. పైగా ఈ గొడవకు అంతటికీ తనే కారణమంటూ తనను సస్పెండ్ చేశారని తెలిపాడు. తనకు ఇంతటి ఘోర అవమానం జరిగినందుకు గానూ ఇకపై ఏం జరిగినా స్కూల్లో నీ గురించి నువ్వే చూసుకో అని సోనమ్‌కు గట్టిగా చెప్పానని పేర్కొన్నాడు. కాగా అర్జున్ చివరిసారిగా 'సర్దార్ కా గ్రాండ్సన్' చిత్రంలో కనిపించాడు. ఇందులో జాన్ అబ్రహాం, నీనా గుప్తా, అదితిరావు హైదరీ, రకుల్ ప్రీత్ సింగ్ నటించారు. అర్జున్ ప్రస్తుతం 'ఏక్ విలన్ 2', 'భూత్ పోలీస్' చిత్రాలు చేస్తున్నాడు. చదవండి: మలైకా ఇంటి దగ్గర్లో బాలీవుడ్ నటుడి కొత్త విల్లా! -
సోషల్ హల్చల్ : నిక్కీ అందాలు.. పార్వతి పరువాలు.. నేహా వయ్యారాలు
♦ రెడ్ డ్రెస్‌లో మతి పొడొగుతున్న నిక్కీ తంబోలి ♦ నచ్చింది చేసుకుంటూ పొమ్మంటున్న సొట్టబుగ్గల లావణ్య ♦ నా గతానికి, భవిష్యత్తుకు అక్షరాలు లేవంటున్న పున్ను ♦ అయితే ఓకే అంటున్న వైష్ణవి ♦ ఇబ్బంది పెట్టొద్దంటున్న మోడల్ కోమల్ పాండే ♦ అది మిస్సవుతున్నా అంటోన్న అదితి ♦ జిలేబి అంటున్న నేహా శర్మ ♦ వైట్ డ్రెస్‌లో మెరిసిపోతున్న సోనమ్ కపూర్ ♦ ఆ రెండూ ఎప్పుడు తనతోనే ఉంటాయన్న యాంకర్ రవి View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Nikki Tamboli (@nikki_tamboli) View this post on Instagram A post shared by disha patani (paatni) (@dishapatani) View this post on Instagram A post shared by Parvati Nair (@paro_nair) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Sonam K Ahuja (@sonamkapoor) View this post on Instagram A post shared by Punarnavi Bhupalam🧿 (@punarnavib) View this post on Instagram A post shared by Aditi Bhatia 🎭 (@aditi_bhatia4) View this post on Instagram A post shared by Vaishnavi chaitanya (@vaishnavi_chaitanya_) View this post on Instagram A post shared by SHILPA REDDY (@shilpareddy.official) View this post on Instagram A post shared by SHILPA REDDY (@shilpareddy.official) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Priya Mohan (@priyaatlee) View this post on Instagram A post shared by Anchor Ravi (@anchorravi_offl) View this post on Instagram A post shared by Komal Pandey (@komalpandeyofficial) View this post on Instagram A post shared by DP (@dishaparmar) -
మేకప్ లేకుండా ఈ స్టార్ హీరోయిన్లను ఎప్పుడైనా చూశారా?
సాధారణంగా సినీ తారలు.. ముఖ్యంగా హీరోయిన్లు అంటే అందానికి ప్రతిరూపాలని, వారికి అసలు మచ్చే ఉండదని కొందరు భావిస్తే, మరికొందరేమో వారు మేకప్‌తో అందాన్ని తెచ్చిపెట్టుకుంటారని చెప్తుంటారు. ఇక చాలా మందికి సినీ తారల అసలు రూపాన్ని చూడాలని ఆసక్తిగా ఉంటుంది. కానీ హీరోయిన్స్ మాత్రం ఎప్పుడు మేకప్‌తోనే దర్శనం ఇస్తుంటారు. మేకప్ లేకుండా వారు బయటకి వచ్చిన సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి. అలా బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ ఐశ్వర్యరాయ్, దీపికా పదుకొనే, అలియా భట్, ప్రియాంక చొప్రా తదితరులకు సంబంధించిన మేకప్ లేని కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. వారు మేకప్‌తో, మేకప్ లేకుండా ఎలా ఉన్నారో ఓ లుక్కేయండి. ఐశ్వర్యరాయ్ విత్ అవుట్ మేకప్-విత్ మేకప్ దీపికా పదుకొనే విత్ అవుట్ మేకప్-విత్ మేకప్ ప్రియాంక చొప్రా విత్ అవుట్ మేకప్- విత్ మేకప్ అలియా భట్ విత్ అవుట్ మేకప్-విత్ మేకప్ అనుష్క శర్మ విత్ అవుట్ మేకప్-విత్ మేకప్ జాక్వేలిన్ ఫెర్నాండేజ్ విత్ అవుట్ మేకప్-విత్ మేకప్ కరీనా కపూర్ విత్ అవుట్ మేకప్-విత్ మేకప్ సోనమ్ కపూర్ విత్ అవుట్ మేకప్-విత్ మేకప్ నర్గిస్ ఫఖ్రీ విత్ అవుట్ మేకప్-విత్ మేకప్ అమీషా పటేల్ విత్ అవుట్ మేకప్-విత్ మేకప్ సుష్మిత సేన్ విత్ అవుట్ మేకప్-విత్ మేకప్ -
రియా.. నిన్ను చాలా మిస్సవుతున్నా: సోనం
ముంబై: బాలీవుడ్ హీరోయిన్ సోనం కపూర్ సోదరి, నిర్మాత రియా కపూర్ పుట్టిన రోజు నేడు. నేటితో ఆమె 34 వ వసంతంలో అడుగుపెట్టనున్నారు. అయితే, లండన్ ఉన్న కారణంగా చెల్లెలు బర్త్‌డేకు తన దగ్గర ఉండలేకపోయానని సోనం భావోద్వేగానికి లోనయ్యారు. ఈ మేరకు, ఇన్స్టావేదికగా రియాకు శుభాకాంక్షలు చెప్పడంతోపాటు, తనతో ఉన్న జ్జాపకాలను షేర్ చేసుకున్నారు. ఇన్నేళ్ళతో నేను మిస్ అయిన తొలి పుట్టిన రోజని రియాతో ఉన్న ఫోటోలను ట్యాగ్ చేసింది. ‘హ్యపీ బర్త్ డే మై స్వీట్ సిస్టర్..నువ్వు నా మంచి నేస్తం...లవ్యూ సోమచ్ డియర్’ అని చెప్పింది. ‘‘ నిన్ను ఎంతో మిస్ అవుతున్నాను. చిన్నదానివైన నీ సలహలు నేను ఎప్పటికి మరచిపోలేను’’ అని తన మనస్సులోని భావాలను ఇన్‌స్టా వేదికగా పంచుకొంది. కాగా, సోనం కపూర్ తన భర్తతో ఆనంద్‌తో కలిసి లండన్‌లో ఉంటుంది. కాగా, వీరి తల్లి సునితా కపూర్ నా గారాల పట్టీ రియా.. నీకు జన్మదిన శుభాకాంక్షలు అని విష్ చేసింది. ‘నువ్వు ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలి’..జీవితంలో ఉన్నతంగా ఎదగాలని ఆశీర్వదించింది. ఇక రియా ప్రియుడు కరన్ బులానీ కూడా తన ఆమెకు ఇన్‌స్టా వేదికగా బర్త్‌డే విషెస్ చెప్పాడు. ఆమెతో ఉన్న కొన్ని ఫోటోలను జత చేశాడు. ఈ లవ్‌బర్డ్స్ ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను ఇన్‌స్టాగ్రా వేదికగా పంచుకున్నారు..కరన్ బులాని ‘నిన్ను సంతోషంగా ఉంచడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాను.. ప్రేమతో నిండిన జన్మదిన శుబాకాంక్షలు ’అని తన ప్రేమను ఎక్స్‌ప్రేస్ చేస్తూ లవ్ ఎమోజీను షేర్ చేశాడు అనిల్ కపూర్- సునీతా కపూర్లకు సోనమ్, రియా, హర్షవర్దన్ ముగ్గురు సంతానం. కాగా, సోనమ్ చివరిసారిగి ఎకె వర్సెస్ ఎకెలో నటించింది. తండ్రి అనిల్ కపూర్, అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలో లీడ్ రోల్లో నటించింది. తాజాగా బైండ్ సినిమాలో కనిపించనున్నారు. దీన్ని షోమ్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. చదవండి: 24 ఏళ్లు.. కానీ 23వ బర్త్‌డే చేసుకుంటా : హీరోయిన్ -
కళ్లకు గంతలు కట్టుకుని మరీ..
‘చూపు ఉన్నవాళ్లు చూడలేనివాళ్లలా నటించడం అనుకున్నంత సులువు కాదు. అందుకే నా కొత్త చిత్రం కోసం కళ్లకు గంతలు కట్టుకుని సాధన చేస్తున్నాను’ అన్నారు సోనమ్ కపూర్. హిందీ చిత్రం ‘బ్లైండ్’లో సోనమ్ లీడ్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమాలో చూపులేని పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నారామె. ఈ పాత్రను బాగా చేయడానికి చూపులేనివాళ్లను గమనిస్తున్నారట సోనమ్. అలానే ప్రతీ సన్నివేశాన్ని కళ్లకు గంతలు కట్టుకుని ఒకసారి, మామూలుగా ఓసారి నటించి చూసి అందులో వ్యత్యాసాలను గమనిస్తున్నారట. అలానే ఈ పాత్ర కోసం ఓ కోచ్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నారు సోనమ్. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ స్కాట్‌ల్యాండ్‌లోని గ్లాస్గో ప్రాంతంలో జరుగుతోంది. షోమే మక్జీ దర్శకత్వంలో ఈ సినిమాను సుజోయ్ ఘోష్ నిర్మిస్తున్నారు. -
లిప్‌లాక్‌తో కొత్త సంవత్సరానికి స్వాగతం
బాలీవుడ్ జంట సోనమ్ కపూర్, ఆనంద్ అహుజా కొత్త ఏడాదికి వినూత్నంగా స్వాగతం పలికారు. తన భర్త ఆనంద్‌ను గాఢంగా ముద్దాడుతున్న ఫొటోను షేర్ చేశారు. 2021కు స్వాగతం పలుకుతున్నా.. ఈ ఏడాదంతా స్నేహితులు, ప్రేమ, పని, ప్రయాణాలు, ఆధ్యాత్మిక, ఇలా అన్నింటి మేళవింపుతో నిండనుంది. మరిన్ని మంచి క్షణాలు ఎంజాయ్ చేసేందుకు ఎదురు చూస్తున్నాను. గడిచిన వాటి కోసం ఆలోచించడం మానేసి కలిసి పని చేద్దాం.. కలిసికట్టుగా ముందుకు సాగుదాం అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్‌గా మారగా ఆమె అభిమానులు సోనమ్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తున్నారు. ఈ జంట లండన్‌లోనే కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకున్నారు. (చదవండి: 'ఓసారి నీ భర్తను చూడు, ఎంత దరిద్రంగా ఉన్నాడో') ఇదిలా వుంటే సోనమ్ కపూర్ "ఏకే వర్సెస్ ఏకే" అనే నెట్‌ఫ్లిక్స్ చిత్రంలో నటించారు. విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆమె తండ్రి అనిల్ కపూర్, దర్శకుడు అనురాగ్ కశ్యప్ ప్రధాన పాత్రల్లో నటించారు. సినిమాలో అనిల్ కపూర్ నిజం అనిల్ కపూర్‌లా, దర్శకుడు అనురాగ్ కశ్యప్ నిజం అనురాగ్ కశ్యప్లా నటించారు. ఇరువురు వారి వారి ఒరిజినల్ కెరీర్ల మీద పంచ్‌లు విసురుకుంటారు. ఒకరినొకరు తిట్టుకుంటారు. కొట్టుకుంటారు. అదంతా నిజంగా జరుగుతున్నట్టుగా కెమెరాలో రికార్డు చేసి అనురాగ్ కశ్యప్ విడుదల చేసినట్టుగా ఉంటుంది ఈ సినిమా. ఆశ్చర్యం ఏమిటంటే ‘మీ అమ్మాయిని కిడ్నాప్ చేశాను’ అని దర్శకుడు అనురాగ్ కశ్యప్ చెప్పినప్పటి నుంచి అంత పెద్ద హీరో అనిల్ కపూర్ ఒక సగటు తండ్రిలా స్పందిస్తాడు. అరవై ఏళ్ల వయసులో నిజంగా పరిగెత్తి, కిందపడి, ఒక తండ్రి ఎలా ప్రాధేయపడతాడో అలాగే ప్రాధేయపడతాడు. చివరకు సోనమ్ కిడ్నాప్ ఏమైందనేది సినిమా చూస్తే తెలుస్తుంది. (చదవండి: అనిల్ కపూర్ కుమార్తె సొనమ్ కిడ్నాప్) View this post on Instagram A post shared by Sonam K Ahuja (@sonamkapoor) -
అనిల్ కపూర్ కుమార్తె సొనమ్ కిడ్నాప్
కుమార్తె కిడ్నాప్ అయితే ఏ తండ్రి అయినా చాలా ఆందోళన చెందుతాడు. అనిల్ కపూర్ మీద కక్షతో దర్శకుడు అనురాగ్ కశ్యప్ అతని కుమార్తె సోనమ్ కపూర్‌ను కిడ్నాప్ చేశాడు. అతని నుంచి అనిల్ కపూర్ తన కుమార్తె ను ఎలా రక్షించుకున్నాడు?ఇది నిజంగా జరగలేదు. కాని నిజంలా జరిగింది. దానినే ఇప్పుడు ‘మెటా మూవీ’, ‘ఫిల్మ్ వితిన్ ఏ ఫిల్మ్’, ‘మాక్యుమెంటరీ’ అంటున్నారు. నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్‌గా విడుదలైన ఈ సినిమా తండ్రి అనిల్ కపూర్ ఎలా ఉంటాడో అన్న ఆనవాలు ఇచ్చి ఆశ్చర్యపరుస్తుంది.‘ఏకె వెర్సెస్ ఏకె’ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో తాజాగా విడుదలైన సినిమా. ఇందులో ఒక ఏకె అనిల్ కపూర్. మరో ఏకె అనురాగ్ కశ్యప్. ఒక హీరో ఒక దర్శకుడి మధ్యలో వచ్చిన తగాదా ఆ హీరో కుమార్తెను ఆ దర్శకుడు కిడ్నాప్ చేసే వరకూ వెళుతుంది. ఇది సినిమాయే అయినా అందరూ ఇందులో తమలాంటి ఫిక్షనల్ పాత్రలనే పోషించారు. సినిమాలో అనిల్ కపూర్ నిజం అనిల్ కపూర్‌లా, దర్శకుడు అనురాగ్ కశ్యప్ నిజం అనురాగ్ కశ్యప్లా నటించారు. ఇరువురు వారి వారి ఒరిజినల్ కెరీర్ల మీద పంచ్‌లు విసురుకుంటారు. ఒకరినొకరు తిట్టుకుంటారు. కొట్టుకుంటారు. అదంతా నిజంగా జరుగుతున్నట్టుగా కెమెరాలో రికార్డు చేసి అనురాగ్ కశ్యప్ విడుదల చేసినట్టుగా ఉంటుంది ఈ సినిమా. ఇది పూర్తిగా కొత్త నేరేటివ్. డాక్యుమెంటరీలా అనిపించే సినిమా. లేదా సినిమాలా అనిపించే డాక్యుమెంటరీ. ఆశ్చర్యం ఏమిటంటే ‘మీ అమ్మాయిని కిడ్నాప్ చేశాను’ అని వచ్చి దర్శకుడు అనురాగ్ కశ్యప్ చెప్పినప్పటి నుంచి అంత పెద్ద హీరో అనిల్ కపూర్ ఒక సగటు తండ్రిలా స్పందిస్తాడు. పోలీస్ స్టేషన్‌కు వెళితే అతను చెప్పేది ఎవరూ నమ్మరు. ఇంటికి వచ్చి ఆ విషయం ఎలా చెప్పాలో తెలియదు. కిడ్నాపర్ అయిన అనురాగ్ కశ్యప్ ‘నువ్వొక్కడివే నీ కూతురుని కనుగొనాలి’ అని కండీషన్ పెట్టడంతో అనిల్ కపూర్ ఒక్కడే బయలుదేరుతాడు. అతన్ని నీడలా అనురాగ్ కశ్యప్ అనుసరిస్తాడు కెమెరాతో. కూతురి కోసం కలవరపడిపోయే తండ్రిలా అనిల్ కపూర్ ఆకట్టుకుంటాడు. అరవై ఏళ్ల వయసులో నిజంగా పరిగెత్తి, కిందపడి, ఒక తండ్రి ఎలా ప్రాధేయపడతాడో అలాగే ప్రాధేయపడతాడు. చివరకు ఏమైందనేది సినిమా చూస్తే తెలుస్తుంది. విక్రమాదిత్య మోత్వానే దీని దర్శకుడు. అనురాగ్ కశ్యప్ నటించి డైలాగులు కూడా రాశాడు. ‘వీడి హిట్ సినిమాలు తెచ్చిన కలెక్షన్లన్నీ కలిపి వీడి తమ్ముడి ఒక్క ఫ్లాప్ సినిమా తెచ్చింది’ అని అనిల్ కపూర్ అనురాగ్ కశ్యప్‌ను వెక్కిరిస్తాడు. మన మీద మనం జోక్ చేసుకోవడం ఎదగడానికి గుర్తు. అనురాగ్ కశ్యప్, అనిల్ కపూర్ ఎదిగి చేసిన సినిమా ఇది. ప్రయోగాలు నచ్చేవారు చూడాల్సిన సినిమా ఇది. -
పోలీసులకు సోనమ్ కపూర్ బంధువు ఫిర్యాదు
ముంబై: బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ బంధువు ప్రియా సింగ్ మూగ జీవాలను హింసించిన ఇద్దరూ జంతువుల కేర్ టేకర్స్‌పై ముంబైలోని మలబార్ హిల్ పోలీసు స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు. గాయపడిన కుక్కలపై సదరు కేర్ టేకర్స్ విచక్షణ రహితంగా కర్రతో కొడుతూ పైశాచిక ఆనందం పొందుతున్న దృశ్యాలను చూసి ఆమె, తన భర్త భయపడ్డామని పోలీసులకు తెలిపారు. సదరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు. ప్రియ ఫిర్యాదు మేరకు పోలీసులు కేర్ టేకర్స్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వివరాలు.. ప్రియా సింగ్ నెల రోజులుగా వికలాంగ జంతువులను సంరక్షించేందుకు సొంతంగా షెల్టర్ నిర్వహిస్తున్నారు. వాటిని చూసుకునేందుకు ఆమె ప్రకాష్ శామ్యూల్ బింగ్, రాంప్రాతాప్ పాస్వాన్ అనే ఇద్దరూ కేర్ టేకర్స్‌ను నియమించారు. ప్రస్తుతం వారి దగ్గర 4 కుక్కలు, 12 పిల్లులు ఉన్నాయి. ఈ క్రమంలో మంగళవారం ప్రియా సింగ్ సీసీ టీవీ పుటేజ్‌ను పరిశీలించగా కేర్ టేకర్స్ జంతువులను కొడుతూ ఆనందిస్తున్న దృశ్యాలు వెలుగు చుశాయి. దీనిపై మలబార్ హిల్స్ పోలీసు అధికారి మాట్లాడుతూ.. సదరు కేర్ టేకర్స్ రెండు వికలాంగ కుక్కలను కర్రతో కొడుతూ ఆనందం పొందుతూ ఉన్మాద చర్యకు పాల్పడ్డారని చెప్పారు. ఈ నెల 16 తేదీ సీసీ టీవీ ఫుటేజ్‌లో ఈ రోజు ఈ కుక్క కొడుతాను అంటూ గాయపడిన కుక్కను చూపిస్తూ.. ఆపై మరోక కుక్క వైపు వెళ్లి ఇప్పుడు ఈ కుక్కను కొడతాను అంటూ వారిద్దరూ మాట్లాడుకుంటున్న దృశ్యాలు రికార్డయినట్టు తెలిపారు. అంతేగాక ప్రకాష్ అనే కేర్ టేకర్ గాయపడిన కుక్కలలో ఒకదాని మొహంపై టవల్ పెట్టి కర్రతో దానిని తీవ్రంగా బాధించాడని ఆయన తెలిపారు. వీరిఇద్దరిపై జంతు క్రూరత్వ నిరోధక చట్టం ప్రకారం ఐపీసీ 34, 428లతో పాటు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి వెల్లడించారు. -
నీ భర్త దరిద్రంగా ఉన్నాడు: హీరోయిన్‌కు మెసేజ్
బాలీవుడ్ స్టార్ కిడ్ సోనమ్ కపూర్‌పై ట్రోలింగ్స్ కొత్తేమీ కాదు. తనపై వచ్చే విమర్శలకు ఆమె ధీటైన సమాధానాలిస్తారు కూడా! అయితే ఈ సారి సోనమ్‌ను కాకుండా ఆమె భర్తను టార్గెట్ చేయడంతో ఆమె తన సహనాన్ని కోల్పోయారు. ఓ అమెరికన్ ఇన్ఫ్లూయెన్సర్.. సోనమ్‌ను నెపోటిజం ఉత్పత్తిగా పిలుస్తూ ఘాటు విమర్శలు చేసింది. అక్కడితో ఆగకుండా "నీ భర్త ఏమైనా హాట్‌గా ఉన్నాడని ఫీలవుతున్నావా? అంత సీన్ లేదు, ఒకసారి కళ్లు తెరిచి చూడు, అతను ఎంత దరిద్రంగా ఉన్నాడో" అని రాసుకొచ్చింది. ఈ మెసేజ్ చూసిన సోనమ్‌కు కోపం నషాళానికంటింది. తన వరకు ఏమైనా అంటే ఊరుకునేదేమో కానీ, మధ్యలో తనను భర్తను లాక్కొచ్చినందుకు తగిన బుద్ధి చెప్పాలనుకున్నారు. ఆమె చేసిన మెసేజ్‌ను స్క్రీన్‌షాట్ తీసి ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో యాడ్ చేశారు. (చీరకట్టుకు లక్ష రూపాయలు) "ఈ పోస్ట్ వల్ల మీకు ఫాలోవర్లు పెరుగుతారు. ఇదే కదా, నువ్వు నా నుంచి ఆశించింది. మనసులో అంత ద్వేషం పెట్టుకోవడం మీకంత మంచిది కాదు. నాకు తెలుసు, కేవలం తారల దృష్టిని ఆకర్షించేందుకే ఇలాంటి పోస్టులు చేస్తుంటారు. ఏదైతేనేం, నీ కోరిక నెరవేర్చా" అని సోనమ్ చెప్పుకొచ్చారు. కాగా ఇలాంటి ప్రతికూల మెసేజ్‌లను అసలు పట్టించుకోకండని ఆమె అభిమానులు సూచిస్తున్నారు. కొంతకాలంగా సినీ పరిశ్రమకు దూరంగా ఉన్న ఈ భామ ప్రస్తుతం తన భర్త ఆనంద్‌తో కలిసి లండన్‌లో నివసిస్తున్నారు. ఆమె చివరిసారిగా 'జోయా ఫ్యాక్టర్' సినిమాలో నటించారు. (నెటిజన్ ట్రోల్.. సోనమ్ గట్టి కౌంటర్) -
డాలీతో చీర కట్టించుకోవాలంటే రూ.35 వేలు ఫీజు
వినడానికి వింతగా ఉన్నా... ఇది నిజం. డాలీ చేత చీర కట్టించుకోవాలంటే కనీసం 35 వేల రూపాయల నుంచి లక్ష రూపాయలకు పైగా చెల్లించుకోవాల్సిందే. 15 ఏళ్ల క్రితం చీర కట్టుకోవడాన్ని కష్టంగా మొదలుపెట్టి దానినే అభిరుచిగా మార్చుకొని ఇప్పుడు రికార్డులు కొట్టేస్తున్న బెంగళూరు మహిళ డాలీ జైన్ గురించి తెలుసుకోవాల్సిందే! నేటి తరం అమ్మాయిలకు చీర కట్టుకోవడం అంటే పెద్ద కష్టం. నిన్నటి తరం అమ్మలు సౌకర్యం కోసం ఎప్పుడో కుర్తాలోకి మారిపోయారు. బెంగళూరుకు చెందిన డాలీ అనే మహిళ మాత్రం 15 ఏళ్లుగా వందల రకాల సై్టల్స్లో చీర కట్టడం అనే కాన్సెప్ట్‌ను సాధన చేస్తూనే ఉంది. ఆ కాన్సెప్ట్‌తోనే సక్సెస్‌నూ సాధిస్తోంది. బాలీవుడ్ తారలకు డాలీ కట్టు సందర్భానికి తగ్గట్టు రకరకాల స్టైల్లో చీరలు ధరించడం కూడా ఒక నైపుణ్యం. ఈ నైపుణ్యమే ప్రత్యేకతగా కలిగిన డాలీ జైన్ బాలీవుడ్ నటిమణులతో పాటు ప్రముఖ వ్యాపారవేత్తల సతీమణులకూ ఇష్టమైన సై్టలిస్ట్‌గా మారిపోయింది. డాలీ జైన్ ఖాతాదారులలో నీతా అంబానీ వంటి ప్రముఖ వ్యాపారవేత్తలు, సోనమ్ కపూర్లు, ప్రియాంకాచోప్రా, కరిష్మా కపూర్ వంటి ప్రముఖ బాలీవుడ్ నటీమణులకు కూడా డాలీ చీర కట్టింది. సబ్యసాచి ముఖర్జీ, మనీష్ మల్హోత్రా వంటి ప్రసిద్ధ డిజైనర్ల ఖాతాదారులకు డాలీ చీరలు కడుతుంది. అత్తమామల ఒత్తిడి పెళ్లికి ముందు డాలీ జీన్స్, టాప్స్ ధరించేది. పెళ్లయిన తర్వాత అత్తారింట్లో చీరకట్టుకోవాల్సిందే అన్నారు. ఆ నిర్బంధంలో డాలీ చీర కట్టుకోవడం నేర్చుకుంది. ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ – ‘మొదట్లో మా ఇంట్లో వాళ్ల మీద చాలా కోపంగా ఉండేది. కానీ, చీర కట్టుకోవడం నేర్చుకున్నాక దానిని స్టైల్‌గా మార్చుకోవాలనుకున్నాను. అప్పుడు విభిన్న రకాల చీరకట్టు పద్ధతులు నేర్చుకోవడం మొదలుపెట్టాను. ఈ క్రెడిట్ అంతా మా అత్తమామలకే. పెళ్లి తర్వాత వాళ్లు జీన్స్, టాప్స్ వేసుకోవడం ఒప్పుకునుంటే ఎప్పటికీ చీరకట్టులో నైపుణ్యం సాధించేదాన్ని కాదు’ అని నవ్వుతూ చెబుతుంది డాలీ. రికార్డుల డ్రేపింగ్ ఒక చీరను 80 విధాలుగా కట్టిన నైపుణ్యంతో లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో డాలీ పేరు నమోదయ్యింది. రెండవసారి ఒక చీరను 325 విధాలుగా కట్టి తన రికార్డును తనే బద్దలు కొట్టింది. అంతేకాదు, ఒకటిన్నర సెకన్లలో చీరను కట్టి రికార్డు సృష్టించింది. 2015లో ‘స్ట్రాంగ్ వుమన్ ఆఫ్ ఆనర్‘ను కూడా అందుకుంది. మనలోని చిన్న ప్రతిభ కూడా విజయ తీరాలను చేరుస్తుంది. కష్టపడటం, అంకితభావంతో నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం అనే పెట్టుబడి మాత్రమే మనం పెట్టాల్సింది అని డాలీ నిరూపిస్తోంది. -
నెటిజన్ ట్రోల్.. సోనమ్ గట్టి కౌంటర్
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తోంది.ఈ నేపథ్యంలో చాలామంది ప్రముఖులు ముందస్తుగా హోం క్వారంటైన్‌కు పరిమితమవుతున్నారు. ఇక విదేశాల నుంచి వచ్చిన వారు 14 రోజుల పాటు తప్పనిసరిగా హోం క్వారంటైన్లో ఉండాలని పలు దేశాలు నిబంధనలు విధించాయి. అయితే సినీ సెలబ్రిటీలు కొన్నిసార్లు సోషల్ మీడియాలో నెటిజన్లు చేసే ట్రోలింగ్‌కు గురవుతారన్న విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ లండన్‌లో క్వారంటైన్ నింబంధనలు ఉల్లఘించారని, ప్రజల జీవితాలను ప్రమాదంలో పడేస్తున్నారని ఓ నెటిజన్ ట్రోల్ చేశాడు. ఇటీవల సోనమ్ కపూర్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఫొటోను ఫోస్ట్ చేశారు. ‘అవుట్ డోర్ వర్కవుట్’ అనే కాప్షన్ కూడా జతచేశారు. దీంతో ఆ ట్విటర్ యూజర్ సోనమ్ హోం క్వారంటైన్లో లేరని కామెంట్ చేశాడు. (లంబోర్గిని లగ్జరీ కారులో రజనీ) I’m in my own garden attached to my building dude.. fully quarantining.. people have too much time.. just ignore https://t.co/PiYvzDsWTn — Sonam K Ahuja (@sonamakapoor) July 19, 2020 సోషల్‌మీడియాలో తనపై వచ్చిన వ్యాఖ్యలపై సోనమ్ స్పందిస్తూ.. తాను పూర్తిగా ఇంటికే పరిమితమైనట్లు తెలిపారు. ‘నేను మా సొంత తోటలో ఉన్నాను. అది మా ఇంటి పక్కనే ఉంటుంది మిత్రమా.. నేను పూర్తిగా నిర్భందంలోనే ఉన్నాను. మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయటాన్ని విస్మరించాలి’ అని సోనమ్ ట్విటర్లో గట్టి కౌంటర్ ఇచ్చారు. గతవారం సోనమ్ కపూర్ తన భర్త ఆనంద్ అహుజాతో కలిసి లండన్ వెళ్లారు. సినిమాల విషయానికి వస్తే.. సోనమ్ కపూర్ చివరగా గతేడాది ‘ది జోయా ఫ్యాక్టర్’ సినిమాలో కనిపించిన విషయం తెలిసిందే. (అభిషేక్.. గట్టి హగ్ ఇవ్వాలనుంది) -
నేను భయపడే ఏకైక వ్యక్తి నువ్వు: అనిల్ కపూర్
‘నీకు తండ్రిగా ఉన్నందుకు గర్వపడుతున్నాను. నేను భయపడే ఏకైక వ్యక్తి నువ్వు’ అని బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ తన కూతురు సోనమ్ కపూర్‌ను ఉద్ధేశించి పేర్కొన్నారు. మంగళవారం సోనమ్ కపూర్ 35వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అనిల్ కపూర్ తన పెద్ద కుమార్తెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు కూతురుతో దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు. కాగా సోనమ్ ఈసారి తన బర్త్‌డేను తండ్రి అనిల్ కపూర్‌తో కలిసి జరుపుకోవడం విశేషం. లాక్డౌన్ కాలంలో భర్త ఆనంద్ అహుజాతో కలిసి న్యూఢిల్లీలో ఉన్న సోనమ్.. సోమవారం ముంబైకు చేరుకున్నారు. (‘తను నవ్వింది.. నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి’) ‘ఒక కూతురిగా నీకంటే ఎవరూ బాగా ఉండలేరు. ఆనంద్ అహుజాకు సరైన భాగస్వామి. సినిమా తెరపై ఒక స్టార్. నువ్వు నా నమ్మకం, ఆనందం, నీకు తండ్రిగా ఉండటం గర్వకారణం. నా అందమైన సోల్. అలాగే నన్ను భయపెట్టే ఏకైక వ్యక్తి. ఇప్పుడు మాస్టర్ చెఫ్ కూడా అయ్యావు. పుట్టినరోజు శుభాకాంక్షలు సోనమ్. ఈ రోజు నువ్వు మా అందరితో ఇక్కడ ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తునే ఉంటా.’ అంటూ అనిల్ కపూర్ తన కూతురు సోనమ్‌పై ఉన్న ప్రేమను చాటుకున్నారు. (విజయవాడ చేరుకున్న చిరు, నాగార్జున ) View this post on Instagram To a daughter like no other, the perfect partner to @anandahuja, a star on screen and an icon with an unimitable style. She's my confidant, my joy, my pride, the most generous hearted soul I know, (the only person I am shit scared of) & now a bona fide master chef! Happy Birthday, @sonamkapoor! I’m so happy that you’re here with all of us today! Love You, Always! A post shared by anilskapoor (@anilskapoor) on Jun 8, 2020 at 11:30am PDT కాగా అనిల్ కపూర్ పోస్ట్‌పై కూతురు సోనమ్ స్పందించారు. తండ్రికి ‘లవ్ యూ డాడీ’ అని కామెంట్ చేశారు. అలాగే అతని అల్లుడు ఆనంద్ అహుజా స్పందిస్తూ.. ‘సోనమ్ కేవలం మిమ్మల్ని మాట్రమే భయపెట్టడం లేదు. నన్ను కూడా భయపెడుతుంది’ అని సరదాగా కామెంట్ చేశాడు. View this post on Instagram The best best husband in the world , who gives me everything that I truly need. He is my blessing on my birthday. Love you @anandahuja from the first day I hugged you. A post shared by Sonam K Ahuja (@sonamkapoor) on Jun 8, 2020 at 12:33pm PDT -
‘తను నవ్వింది.. నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి’
‘‘అన్ని అడ్డంకులు అధిగమించి మే 19న మేం పెళ్లి చేసుకున్నాం. ఆ రోజు నాకింకా గుర్తు. నా వధువు నవ్వుతూ ఉంది. తనను చూడగానే నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి... అవి ఆనంద భాష్పాలు. మా పెళ్లి మాటలు, వివాహ తంతు ఒక్కరోజులోనే పూర్తై పోయింది. అట్టహాసాలు, ఆర్భాటాలు లేవు. హనీమూన్‌కి కూడా వెళ్లలేదు. ఆ విషయం గురించి తను నన్ను ఇప్పటికీ ఆటపట్టిస్తూనే ఉంటుంది. తను నా జీవితంలోకి రావడం అన్నింటి కంటే ఎంతో ముఖ్యమైన విషయం’’ అంటూ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ తన పెళ్లినాటి సంగతులు గుర్తుచేసుకున్నాడు. 36వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా తన భార్య సునీత కపూర్, తాను కలిసి ఉన్న ఫొటోలు షేర్ చేసి ఆమెపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. (మీరందరూ సూపర్ హీరోలే) కపూర్ ఖాన్‌దాన్‌కు చెందిన అనిల్, ఫ్యాషన్ డిజైనర్‌గా పేరొందిన సునీత 1984లో మేరీ జంగ్ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. అనంతరం ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి.. వారి అంగీకారంతో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. మంగళవారం తమ పెళ్లి రోజు సందర్భంగా సునీతకు తన ప్రేమను వెల్లడించిన నాటి జ్ఞాపకాలను అనిల్ కపూర్ గుర్తు చేసుకున్నారు.(మా కుటుంబంలోకి స్వాగతం రానా: సోనం కపూర్) ‘‘నా గర్ల్‌ఫ్రెండ్ సునీత దగ్గరకు వెళ్లి.. భార్యగా నా జీవితంలో అడుగుపెడతావా అని అడిగాను.. మా పెళ్లి ఆలస్యంగా జరిగింది. తను నాతో ఉంటే ఎంత సంతోషంగా ఉండగలదు. తన కోసం నేనేం చేయగలను. తన కన్న కలలను కొంతమేర అయినా నిజం చేయగలనా అని నిరూపించేందుకు ఆ సమయాన్ని వినియోగించుకున్నాను. కనీసం ఒక ఇల్లు కొని, పనిమనిషిని పెట్టకోగలననే నమ్మకం వచ్చిన తర్వాత తనను పెళ్లిచేసుకోవాలనుకున్నాను. ఆ మాత్రం పొందేందుకు తను అర్హురాలే కదా. ఇంకోవిషయం కెరీర్ తొలినాళ్లలోనే పెళ్లి ఎందుకు అని చాలా మంది నన్ను ప్రశ్నించారు. అయితే సునీత సాంగత్యం లేకుండా ఒక్కరోజు కూడా గడపలేనన్న విషయం నాకు మాత్రమే తెలుసు. ప్రేమా, కెరీరా అనే ప్రశ్నలు మాలో తలెత్తలేదు. మా దృష్టిలో ఆ రెండూ ముఖ్యమే. సమాంతరంగా సాగాల్సిన విషయాలే. ఎల్లప్పుడూ మా మధ్య అవగాహన, ప్రేమ ఇలాగే ఉంటుంది. నా ప్రేమ, జీవితం సునీతకు పెళ్లిరోజు శుభాకాంక్షలు’’ అని అనిల్ కపూర్ తన ఇన్‌స్టాలో భావోద్వేగ పోస్టు షేర్ చేశారు. కాగా అనిల్ కపూర్- సునీత జంటకు కూతుళ్ళు సోనం కపూర్, రియా కపూర్.. కుమారుడు హర్షవర్ధన్ కపూర్ ఉన్న సంగతి తెలిసిందే. వీరు ముగ్గురు సినిమా రంగానికే చెందిన వారు కావడం విశేషం. View this post on Instagram How 19th May became the best day of our lives! I proposed to my girlfriend Sunita and asked her to be my wife... our wedding had been delayed a lot because I wanted to be sure that I could take care of her in the way she deserved and give her everything she could ever dream of...in the very least, I needed to be able to afford to buy a house and hire a cook!! I just wanted to be worthy of her... We got married on 19th May, against all odds....I still remember when I entered her house on our wedding day and saw my bride, she was smiling and I had tears in my eyes... Tears of happiness, but also nervousness... I mean it was my wedding day! Our wedding was planned and executed within a day, and yes we may not have had a big wedding or even a honeymoon, which she still teases me about, but it was still the best thing that ever happened to me....it was now or never for us and I’m so glad we took the leap that day and started our lives together... many people prophesied that marrying so early would be disastrous for my career, but all I knew was that I did not want to waste another day without her and wanted her by my side through it all... for us it was never career or love.. it was always love AND career... I won’t say in the end we lived happily ever after...because it is not even close to the end of our love story... we still have a lot of love to share together, forever.... Happy Anniversary to the love of my life, my wife Sunita... @kapoor.sunita A post shared by anilskapoor (@anilskapoor) on May 19, 2020 at 1:53am PDT -
కుటుంబంలోకి స్వాగతం రానా: హీరోయిన్
‘‘డార్లింగ్ బేబీ మిహిక... నీకు శుభాకాంక్షలు. లవ్ యూ. అత్యుత్తమైనవి పొందేందుకు నువ్వు అర్హురాలివి. రానా.. నువ్వు సంతోషంగా ఉండేలా చూసుకుంటాడు. మా కుటుంబంలోకి నీకు స్వాగతం రానా’’ అంటూ బాలీవుడ్ ఫ్యాషన్ దివా సోనం కపూర్.. ప్రేమజంట రానా దగ్గుబాటి, మిహిక బజాజ్‌కు అభినందనలు తెలిపారు. తన స్నేహితురాలి చేయి అందుకోబోతున్న రానాను తమ స్నేహ బృందంలోకి ఆహ్వానించారు. కాగా తన ప్రేమకు మిహిక బజాజ్ ఓకే చెప్పిందంటూ హీరో రానా దగ్గుబాటి సోషల్ మీడియాలో ఆమెతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ రానా త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడంటూ సినీ సెలబ్రిటీలు సహా అభిమానులు అతడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.(రానా ప్రేయసి మిహీక వివరాలు ఇవే.. ) ఇక ఈ జాబితాలో బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ కూడా చేరిపోయారు. కాగా మిహిక, సోనం మంచి స్నేహితులు. ఒకరికి సంబంధించిన వేడుకలో మరొకరు సందడి చేస్తూ.. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటారు. ప్రస్తుతం రానా, మిహికల రిలేషన్షిప్ హాట్‌టాపిక్‌గా మారడంతో ఆమెకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. ఇక ఇప్పుడు సోనం.. మిహికను విష్ చేయడంతో.. గతంలో వారిద్దరు కలిసి దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. సోనం కపూర్ పుట్టినరోజు సందర్భంగా మిహిక షేర్ చేసిన ఓ ఫొటో అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. అదే విధంగా సోనం మెహందీ సమయంలో మిహిక సందడి చేసిన దృశ్యాలు కూడా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. కాగా హైదరాబాద్‌లో పుట్టిపెరిగిన మిహిక.. ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదిగి డ్యూ డ్రాప్ పేరిట ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీని నిర్వహిస్తున్నారు. (‘ఇంకా ఏమేమి చూడాల్సి వస్తుందో 2020లో’) -
‘సోనంను ఆయన బాగా చూసుకునేవారు’
ముంబై : విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణం పట్ల ప్రముఖ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ తీవ్ర విచారం వెలిబుచ్చారు. థ్యాంక్యూ మూవీలో కలిసి పనిచేసే సందర్భంలో తన కుమార్తె సోనం కపూర్‌ను ఆయన జాగ్రత్తగా చూసుకున్నారని కొనియాడారు. ఇర్ఫాన్ మరణ వార్త తనను కలించివేసిందని, ఆయన విలక్షణ నటుడని, గొప్పమానవతావాది అని ప్రస్తుతించారు. తన కుమార్తె సోనంను ఆయన చూసకున్న తీరు, మార్గదర్శకంగా వ్యవహరించిన వైనం మరిచిపోలేనిదని అన్నారు. ఇర్ఫాన్ ప్రతిఒక్కరికీ స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తారని అనిల్ కపూర్ వ్యాఖ్యానించారు. 2011లో సోనం కపూర్, ఇర్ఫాన్‌లు థ్యాంక్యూ మూవీ కోసం కలిసిపనిచేశారు. ఇక అనిల్ కపూర్ ఇర్ఫాన్ ఖాన్లు స్లమ్‌డాగ్ మిలియనీర్, డీ-డే, చాకొలెట్ : డీప్ డార్క్ సీక్రెట్స్ వంటి పలు సినిమాల్లో కలిసి నటించారు. కాగా, ఇర్ఫాన్ ఖాన్ తీవ్ర అనారోగ్యంతో ముంబై కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. చదవండి : పోరాడే శక్తినిచ్చిన ప్రయాణం ఇది -
నేను లేకుండా హనీమున్కి..
దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోంది. ఇక చిత్ర పరిశ్రమలో పలు సినిమాల చిత్రీకరణలు వాయిదా పడ్డాయి. బాలీవుడ్ నటీనటులు కరోనావైరస్పై అవగాహన కల్పిస్తూ సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఎప్పుడూ షూటింగ్‌లతో బిజీగా ఉండే సెలబ్రిటీలు తమ కుంటుంబంతో కాలక్షేపం చేస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ దిగ్గజ నటుడు అనిల్‌కపూర్ తన భార్య సునితా కపూర్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు.ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనిల్ కపూర్ మాట్లాడుతూ.. తన జీవిత భాగస్వామి ఫ్యాషన్ డిజైనర్ సునితా కపూర్ గురించి ఓ రహస్యాన్ని వెల్లడించారు. (కరోనా : మరోసారి ఉదారత చాటుకున్న షారుక్) ‘నన్ను పెళ్లి చేసుకోవాలని సునితకు ప్రపోజల్ పెట్టినప్పుడు, మేరీ జంగ్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అయితే సునితా పెళ్లికి ముందే నాకు ఇల్లు ఉండాలి, వంట మనిషి ఉండాలని కొన్ని నిబంధనలు పెట్టారు. అనంతరం ఇళ్లు, వంట గది, వంటకు సాయం చేసే మనిషి కూడా ఉంటుందని చెప్పాను. అనంతరం మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. పెళ్లి తర్వాత నేను మూడు రోజుల పాటు షూటింగ్‌కి వెళ్లాను. కానీ మా మేడం మాత్రం నేను లేకుండా ఒక్కతే హనీమూన్‌కు విదేశాలకు వెళ్లింది(నవ్వుతూ). ఇక నా కూతురు రియా కపూర్ మంచి కుక్, సోనమ్ కపూర్ కూడా వంట చేయటంలో ఆసక్తిని కనబరుస్తోంది’ అని అనిల్ కపూర్ సరదాగా చెపుకొచ్చారు. అనిల్ కపూర్, సునితా కపూర్ వివాహం జరిగి 35 ఏళ్లు అవుతోంది. వీరికి రియా, సోనమ్‌తోపాటు కుమారుడు హర్షవర్ధన్ కపూర్ ఉన్నారు. సోనమ్, హర్షవర్ధన్ నటనలో కొనసాగుతుండగా, రియా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో సోనమ్‌కపూర్ చాక్లెట్ వాల్నట్ కేకు తయారు చేసిన ఓ ఫోటోను తన ఇన్‌స్ట్రామ్‌లో షేర్ చేశారు. View this post on Instagram Made chocolate walnut cake today. I had run out of chocolate and @fortunegourmetindia sent me some amazing quality chocolate. Thanks so much @missdevi for organising. Love you A post shared by Sonam K Ahuja (@sonamkapoor) on Apr 10, 2020 at 5:43am PDT -
దియా జలావొ: ‘దీపావళి అనుకున్నారేంటి?’
కరోనా చీకట్లను తరిమికొట్టేందుకు, జాతి ఐక్యతను చాటేందుకు ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చిన ‘దియ జలావో’ దిగ్విజయంగా పూర్తయింది. ఆదివారం యావద్దేశం విశేషంగా స్పందించింది. సినీ, రాజకీయ ప్రముఖులు సైతం దీపాలు వెలిగించి తమ మద్దతు తెలిపారు. అయితే నిన్న రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు కొంతమంది దీపాలు వెలిగించడానికి బదులు టపాసులు పేల్చటంపై అన్ని వర్గాలనుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. టపాసులు కాల్చడంపై బాలీవుడ్ తారలు సోనమ్ కపూర్, తాప్సీ పన్ను, రిచా చద్దాలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్విటర్ వేదికగా వారు స్పందించారు. ‘‘ రాంగ్ మెమో’ అనే శీర్షికతో తాప్సీ ఓ వీడియోను షేర్ చేశారు. ‘’ కొంతమంది దీన్ని జాతర అనుకుంటున్నారు’’ అని ట్వీట్ చేశారు. ‘‘ కొంతమంది టపాసులు కాలుస్తున్నారు. కుక్కలు బయట అరుస్తున్నాయి. ఇదేమన్నా దీపావళి అనుకుంటున్నారా?.. నాకంతా తికమకగా ఉంది. అప్పటి వరకు ఎంతో ప్రశాంతంగా ఉండింది. కొంతమంది మూర్ఖులు టపాసులు కాల్చడం వల్ల దక్షిణ ఢిల్లీలో.. పక్షులు, కుక్కలు, సైరన్ల మోత మోగుతోంద’’ ని మండి పడ్డారు సోనమ్ కపూర్. People are bursting crackers. Just FYI . They dogs are freaking out. Do people think it’s Diwali? I’m so confused. — Sonam K Ahuja (@sonamakapoor) April 5, 2020 There was complete peace and quite, and now the birds ,dogs and sirens are freaking out in south Delhi because some morons decided to burst fire crackers tonight. — Sonam K Ahuja (@sonamakapoor) April 5, 2020 ‘‘ టపాసులు ఎందుకు కాలుస్తున్నార’’ని రిచా చద్దా ప్రశ్నించారు. Why crackers ? Why? — TheRichaChadha (@RichaChadha) April 5, 2020 -
అక్కడ మాకు స్క్రీనింగ్ చేయలేదు: హీరోయిన్
న్యూఢిల్లీ: మహమ్మారి కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తి కట్టడికి భారత ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఎంతో గొప్పగా ఉన్నాయని బాలీవుడ్ హీరోయిన్ సోనం కపూర్ ప్రశంసలు కురిపించారు. భారత ఎయిర్‌పోర్టు అధికారులు కరోనాను అరికట్టేందుకు నిబద్ధతతో పనిచేస్తున్నారని... అందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. సోనం కపూర్.. తన భర్త ఆనంద్ అహుజాతో కలిసి మంగళవారం లండన్ నుంచి ఢిల్లీకి ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విదేశీ ప్రయాణం ముగించుకుని స్వదేశంలో అడుగుపెట్టిన సోనం దంపతులకు ఢిల్లీ ఎయిర్‌పోర్టు అధికారులు స్క్రీనింగ్ నిర్వహించడంతో పాటుగా... గత 25 రోజులుగా వారు చేస్తున్న ప్రయాణాల వివరాలు అడిగి తెలుసుకున్నారు.(భారత్‌పై డబ్ల్యూహెచ్ఓ ప్రశంసలు!) ఈ క్రమంలో తన అనుభవాలను సోనం తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. ‘‘మేం లండన్ నుంచి బయల్దేరుతున్నప్పుడు స్క్రీనింగ్ చేయలేదు. ఈ విషయం తెలిసి షాకయ్యాం. అయితే భారత్‌కు చేరుకోగానే... మా ప్రయాణాలకు సంబంధించిన వివరాలను ఎయిర్‌పోర్టు అధికారులు ఫారమ్‌లో నింపమన్నారు. అయితే అంతటితో ఆగిపోకుండా మరోసారి మా పాసుపోర్టులు పరిశీలించి మేం చెప్పింది నిజమా కాదా అని చెక్ చేశారు. అక్కడ ప్రతీ ఒక్కరూ ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు. ఇది అభినందించదగ్గ విషయం. భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయం’’ అని పేర్కొన్నారు. (‘కరోనా’ పై కొత్త చాలెంజ్.. భారీ స్పందన ) అదే విధంగా కరోనాను ఎదుర్కొనేందుకు అంతా కలిసికట్టుగా పనిచేయాలని... స్వీయ నిర్బంధంలోకి వెళ్లడంద్వారా దీని వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు. తమలో వైరస్ లక్షణాలు లేకపోయినప్పటికీ తాము హోం క్వారంటైన్లో ఉంటున్నామని వెల్లడించారు. వైద్యులు, అధికారులు చెప్పిన మాటలు వినాలని.. వైద్య పరీక్షల నిమిత్తం వారికి సహకరించాలని సోనం విజ్ఞప్తి చేశారు. కాగా చైనాలోని వుహాన్ నగరంలో తొలిసారిగా వెలుగు చూసిన కరోనా వైరస్ ప్రపంచమంతా విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ రెండు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. దాదాపు 8000 మంది మరణించారు. ఇక భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 147కు చేరింది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట చర్యలు చేపట్టాయి. విద్యా సంస్థలు, సినిమా హాళ్లు, మాల్స్, జిమ్ సెంటర్లు, పార్కులు తదితర జన సమ్మర్ధం ఎక్కువగా ఉండే చోట్లను మూసివేస్తున్నారు. సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియాలో కరోనా బారిన పడకుండా ఉండేందుకు పలు జాగ్రత్తలు చెబుతున్నారు. ‘అందుకే పెళ్లి విషయం రహస్యంగా ఉంచాను’ -
'అది నీ సినిమా అని ఎలా చెప్పుకుంటావ్?'
మిస్టర్ ఇండియా సినిమాకు బాలీవుడ్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. 1987లో రిలీజైన 'మిస్టర్ ఇండియా' అప్పట్లో బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. అనిల్ కపూర్, శ్రీదేవి జంటగా శేఖర్ కపూర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి కథను సలీమ్-జావేద్ అక్తర్‌లు అందించారు. తాజాగా ఈ సినిమాను మిస్టర్ ఇండియా 2గా తీయాలని 'టైగర్ జిందా హై' ఫేమ్, దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ రీమేక్‌గా తెరకెక్కించాలని భావిస్తున్నాడు. ఇదే విషయాన్ని అబ్బాస్ తన ట్విటర్లో వెల్లడిస్తూ.. ' మిస్టర్ ఇండియా సినిమా కోసం పనిచేయడం నాకెంతో సంతోషంగా అనిపించింది. ప్రతి ఒక్కరి చేత ప్రశంసలందుకున్న ఐకానిక్ పాత్రలను మరోసారి మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నంలో ఉన్నాను. అయితే ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నా.. నటీనటులు ఎవరనేది ఇంకా ఏం నిర్ణయించలేదు' అని పేర్కొన్నారు. (‘అమృతగా తాప్సీ నన్ను ఆకట్టుకుంది’) అయితే మిస్టర్ ఇండియా సినిమాలో హీరోగా నటించిన అనిల్ కపూర్, చిత్ర దర్శకుడు శేఖర్ కపూర్‌ను సంప్రదించకుండా రీమేక్ ఎలా తీస్తారంటూ నటి, అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. వారి అనుమతి లేకుండా సినిమాను తీస్తే వారిని అగౌరవపరిచినట్టేనని పేర్కొన్నారు. దీనిపై దర్శకుడు శేఖర్ కపూర్ ట్విటర్లో స్పందించారు.' మిస్టర్ ఇండియా సినిమా గురించి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా... నన్ను అడగకుండా, నా అనుమతి లేకుండా సినిమాను రీమేక్ చేయాలనుకుంటున్నారు. మిస్టర్ ఇండియా సినిమా మంచి విజయం సాధించి దర్శకుడిగా నాకు గుర్తింపునిచ్చింది. ఈ సినిమాపై నాకు హక్కులు ఉండవా ?' అంటూ పేర్కొన్నారు. Shekhar saheb the story the situations the scenes the characters the dialogue the lyrics even the title none of these were yours .I gave it all to you . Yes you execute it very well but how can your claim on the film be more than mine . It wasn’t you idea . It wasn’t your dream — Javed Akhtar (@Javedakhtarjadu) February 28, 2020 దీనిపై జావేద్ అక్తర్ శేఖర్ కపూర్‌ను తప్పుబడుతూ రీట్వీట్ చేశారు.' మిస్టర్ ఇండియా కథ, పాటలు, డైలాగ్‌లు, సన్నివేశాలు, కనీసం చిత్రం టైటిల్ కూడా మీకు సొంతం కాదు. వాటిన్నంటిని నేను సలీమ్ కలిసి మీకు అందించాం అన్న విషయాన్ని మరిచిపోయారు. నిజమే.. మీరు సినిమాను చాలా బాగా తెరకెక్కించారు.. ఆ విషయం నేను ఒప్పుకుంటా.. కానీ సినిమా మీద మొత్తం హక్కులు నీకే ఉన్నాయనడం ఏం బాగాలేదు. అసలు ఈ సినిమా మీ ఆలోచన కాదు, అది మీ కల కూడా కాదు' అంటూ జావేద్ మండిపడ్డారు. -
వెస్ట్రన్ డ్రెస్‌కి ఇండియన్ హారం
స్కర్ట్, క్రాప్‌టాప్స్, ఫ్రాక్స్, లాంగ్ గౌన్స్ ఇలాంటి పాశ్చాత్య దుస్తులు ధరించినప్పుడు అలాంటి ఫ్యాషన్ జ్యువెలరీ ధరిస్తేనే బాగుంటుంది, సంప్రదాయ ఆభరణాలు అస్సలు నప్పవు అనుకుంటారు. కానీ, వెస్ట్రన్ దుస్తులకు మీదకు ఇప్పుడు మన వెడ్డింగ్ జ్యువెలరీనీ మ్యాచ్ చేయవచ్చు. బ్లాక్ థండర్ వెస్ట్రన్ కాక్టెయిల్ పార్టీలకు, ఈవెనింగ్ క్యాజువల్ డ్రెస్‌గా పేరొందింది నల్లటి మ్యాక్సీ డ్రెస్. దీనికి మన వివాహ వేడుకల సమయంలో ధరించే కుందన్ నెక్లెస్, చెవి లోలాకులు అద్భుతమైన కాంబినేషన్‌గా అదరగొట్టేస్తాయి. గౌన్ ‘వి’ నెక్లో ఉంటే దానికి రాణి హారం వేసి, పైన కుందన్ నెక్లెస్ ధరించవచ్చు. అంతేకాదు వివాహ వేడుకల సమయంలో ధరించే మీనకారి చెవి జూకాలు కూడా ఈ వెస్ట్రన్ డ్రెస్ మీదకు బాగా నప్పుతాయి. వైట్ వండర్ వెస్ట్రన్ పార్టీలలో నలుపు ఎలాగో తెలుపు డ్రెస్ కూడా అంత అద్భుతమైన అందంతో తళుక్కుమంటుంది. తెల్లటి డ్రెస్ వేసుకుంటే దానిమీదకు పోల్కి నెక్లెస్, పెద్ద పెద్ద బంగారు గాజులు వేసుకుంటే ఇండోవెస్ట్రన్ కలయికతో అద్భుతమైన లుక్‌ని తీసుకురావచ్చు. సంప్రదాయ లెహంగా చోలీ డ్రెస్సుల మీదకు ఉపయోగించే ఆక్సిడైజ్డ్ సిల్వర్ గాజులు, నెక్లెస్, జూకాలు, నెక్లెస్ వంటివి జీన్స్–వైట్ షర్ట్ మీదకు మాక్సీ డ్రెస్సుల మీదకు సరైన ఎంపిక అవుతుంది. హాత్‌ఫూల్ వివాహవేడుకల్లో వేళ్లను–మణికట్టును కలుపుతూ ఉండే హాత్‌ఫూల్ ఆభరణం పాశ్చాత్య దుస్తులకు భిన్నమైన లుక్ తీసుకువస్తుంది. డిన్నర్ పార్టీకి పొడవాటి చేతులున్న టాప్స్, స్ట్రాప్స్ బ్లౌజ్‌లు ధరించినప్పుడు హాత్ఫూల్ను అందంగా అలంకరించుకోవచ్చు. వరసల హారాలు వివాహ వేడుకల కోసం బంగారు హారాలు తీసుకుంటారు. ఇవి మళ్లీ సంప్రదాయ చీర, లెహంగాల మీదకే బాగుంటాయనుకుంటే పొరపాటు. టర్టిల్ నెక్, కాలర్ షర్ట్స్, డీప్ నెక్ టాప్స్ ధరించినప్పుడు ఒకటికి మూడు వరసలు ఉన్నవి, పచివర్క్ హారలు కూడా ధరించవచ్చు, -
ఆరెస్సెస్ చీఫ్‌పై హీరోయిన్ ఫైర్!
న్యూఢిల్లీ: విద్యావంతులే విడాకుల వైపు మొగ్గుచూపుతున్నారన్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలపై బాలీవుడ్ హీరోయిన్ సోనం కపూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి తెలివి తక్కువ మాటలు ఎలా మాట్లాడతారంటూ మండిపడ్డారు. ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన మోహన్ భగవత్.. ఉన్నత విద్యావంతుల కుటుంబాల్లోనే ఎక్కువగా విడాకుల కేసులు నమోదవుతున్నాయన్నారు. చిన్న చిన్న విషయాలకే కొట్లాడుకుంటూ విడిపోతున్నారని విమర్శించారు. ‘‘ఈరోజుల్లో విడాకుల కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. అర్థంపర్థంలేని విషయాల కోసం విడాకుల దాకా వెళ్తున్నారు. ముఖ్యంగా బాగా చదువుకున్న వాళ్లు.. ఐశ్వర్యవంతులైన వారే విడాకులు తీసుకుంటున్నారు. విద్య, డబ్బుతో పొగరుబట్టిన కారణంగా ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. దాంతో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. సమాజంలో కూడా అంతరాలు పెరిగిపోతున్నాయి’’అని మోహన్ భగవత్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మోహన్ భగవత్ వ్యాఖ్యలపై సోనం కపూర్ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘‘ఈ మనిషి.. అసలు ఇలా ఎలా మాట్లాడతారు? ఇవి పూర్తిగా తెలివితక్కువ, వెనుకబాటుతనాన్ని సూచించే మాటలు’’ అంటూ ఫైర్ అయ్యారు. -
క్యాబ్‌లో భయంకర అనుభవం: హీరోయిన్
లండన్: గమ్యస్థానాలకు చేరుకునేందుకు క్యాబ్‌లను ఆశ్రయిస్తున్న మహిళలకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. డ్రైవర్ అనుచిత, అసభ్య ప్రవర్తనతో ప్రతిరోజూ ఎంతో మంది మహిళలు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. ఇందుకు సెలబ్రిటీలు సైతం మినహాయింపు కాదంటున్నారు బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్. క్యాబ్ డ్రైవర్లతో జాగ్రత్తగా ఉండాలని మహిళలకు సూచించారు. ‘ లండన్‌లో ఉబెర్ క్యాబ్‌లో ప్రయాణిస్తున్నపుడు నాకు భయంకరమైన అనుభవం ఎదురైంది. దయచేసి... అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రజా రవాణా వ్యవస్థకు చెందిన వాహనాల్లో ప్రయాణం చేయడమే అత్యంత శ్రేయస్కరం. నేనైతే వణికిపోయాను’ అంటూ లండన్ క్యాబ్ ప్రయాణంలో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. డ్రైవర్ తనపై విపరీతంగా అరిచాడని... దాంతో తాను క్యాబ్ దిగిపోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు.(చదవండి : ఉబర్ యాప్‌లో ఇక ‘నిఘా ఫీచర్’) ఈ క్రమంలో కొందరు సోనమ్ ట్వీట్‌కు సానుకూలంగా స్పందించగా... మరికొందరు మాత్రం లండన్‌లో ఉబెర్ సేవలపై గతంలో నిషేధం విధించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇంకొందరు మాత్రం.. ఉబెర్ విషయాన్ని పక్కన పెడితే ప్రైవేటు ట్యాక్సీలు, క్యాబ్‌లలో ప్రయాణించడం అంత శ్రేయస్కరం కాదంటూ తమ అనుభవాలను పంచుకుంటున్నారు. ఇక ప్రస్తుతం లండన్‌లో ఉన్న సోనమ్.. అక్కడికి బయల్దేరిన క్రమంలో బ్రిటీష్ ఎయిర్వేస్ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ప్రయాణికుల బ్యాగేజీని వారికి అందజేయడంలో.. సదరు సంస్థ తీరు బాగోలేదని మండిపడ్డారు. బ్రిటీష్ ఎయిర్వేస్ రెండు సార్లు తన బ్యాగ్ పోగొట్టిందని.. మరోసారి అందులో ప్రయాణించబోనని ఆమె స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా... క్యాబ్ డ్రైవర్లు ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో.. ప్రపంచంలోనే అతిపెద్ద టాక్సీల నెట్వర్క్ కలిగిన ‘ఉబర్’ ముందు జాగ్రత్త చర్యగా తన యాప్‌లో సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ‘వాయిస్ ఆడియో రికార్డింగ్’ అనే ఫీచర్ ద్వారా డ్రైవర్, ప్రయాణికుల మధ్య జరిగే సంభాషణలను ఎప్పటికప్పుడు రికార్డు చేయనున్నామని పేర్కొంది. Hey guys I’ve had the scariest experience with @Uber london. Please please be careful. The best and safest is just to use the local public transportation or cabs. I’m super shaken. — Sonam K Ahuja (@sonamakapoor) January 15, 2020 -
బ్రిటీష్ ఎయిర్వేస్పై హీరోయిన్లు ఫైర్
బ్రిటీష్ ఎయిర్వేస్ నిర్లక్ష్యంపై హీరోయిన్లు సోనమ్ కపూర్, పూజా హెగ్డేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణికుల బ్యాగేజీని వారికి అందజేయడంలో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రస్తావించారు. సంస్థ తీరు ఏం బాగోలేదని మండిపడ్డారు. బ్రిటీష్ ఎయిర్వేస్ రెండు సార్లు తన బ్యాగ్ పోగొట్టిందని తెలిపిన సోనమ్.. మరోసారి అందులో ప్రయాణించబోనని స్పష్టం చేశారు. ‘ఈ నెలలో బ్రిటీష్ ఎయిర్వేస్లో ప్రయాణించడం ఇది మూడోసారి.. అందులో రెండుసార్లు వాళ్లు నా బ్యాగ్‌ను పోగొట్టారు. వారి చర్య నాకు గుణపాఠం నేర్పింది. ఇకపై బ్రిటీష్ ఎయిర్వేస్లో ప్రయాణించను’అని పేర్కొన్నారు. సోనమ్ ట్వీట్‌పై పూజా హెగ్డే కూడా స్పందించారు.‘అవును. గత నెలలో నా బ్యాగ్‌లను కూడా వాళ్లు పోగొట్టారు. ఆ తర్వాత కొద్ది రోజులకు వాటిని కొరియర్లో పంపించారు. చూస్తుంటే.. ఇదంతా వారికి అలవాటే అనిపిస్తోంది’ అని అన్నారు. కాగా, సోనమ్ ట్వీట్‌పై స్పందించిన బ్రిటీష్ ఎయిర్వేస్.. బ్యాగేజీ విషయంలో ఆలస్యం జరుగుతున్నందుకు క్షమించాల్సిందిగా కోరింది. బ్యాగేజీ గురించి ఎయిర్‌పోర్ట్‌లో సమాచారం ఇచ్చినప్పుడు.. ట్రాకింగ్ సూచన ఏమైనా చేశారా అని సోనమ్‌ను అడిగింది. ఎయిర్వేస్ ప్రశ్నలకు సోనమ్ బదులిస్తూ.. ‘అదంతా చేశాను.. కానీ ఆ ప్రక్రియ చాలా అసౌకర్యంగా ఉంది. ఇలాంటివి జరగకుండా.. మీరు స్పందించాల్సిన అవసరం ఉంది. ఇది చాలా భయంకరమైన సర్వీస్, నిర్వహణ కూడా చెత్తగా ఉంద’ని తెలిపారు. దీనిపై ఈ ఘటనపై తాము తాము క్షమాపణలు మాత్రమే చెప్పగలమని పేర్కొంది. వీలైనంతా తొందరలో బ్యాగేజ్‌ను సోనమ్ వద్దకు చేరుస్తామని హామీ ఇచ్చింది. -
ర్యాంప్ వాక్‌లో సోనమ్ షోయగం
-
అంధురాలి పాత్రలో...
హిట్ రన్ కేసులో నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆ సమయంలో తాను సాక్ష్యం చెబుతానని ఓ అమ్మాయి ముందుకొచ్చింది. కానీ, ఆ అమ్మాయికి చూపు లేదు. మరి.. ఈ కేసులో నిజమైన దోషులకు శిక్ష పడిందా? పోలీసులు ఈ కేసును ఎలా పరిష్కరించారు? అనే అంశాల నేపథ్యంలో తెరకెక్కిన సౌత్ కొరియన్ మూవీ ‘బ్లైండ్’ (2011). ఈ సినిమా హిందీలో రీమేక్ కానుంది. చూపులేని యువతి పాత్రలో సోనమ్ కపూర్ నటించనున్నారని బాలీవుడ్ సమాచారం. ‘కహానీ’ (2012), ‘బద్లా’ (2019) చిత్రాల దర్శకుడు సుజోయ్ ఘోష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. సుజోయ్ వద్ద అసిస్టెంట్‌గా వర్క్ చేసిన షోమీ మఖిజా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని తెలిసింది. -
వైరల్: భర్తతో సోనమ్ సందడి..!
ముంబై: దీపావళి సందర్భంగా బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ సందడి చేశారు. తన తండ్రి అనిల్ కపూర్ ఏర్పాటు చేసిన పార్టీలో సోనమ్ భర్త ఆనంద్ అహుజాతో కలిసి పాల్గొన్నారు. వీరితో పాటు విరాట్ కోహ్లి, అనుష్క శర్మ, సైఫ్ అలీ ఖాన్, షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్‌లతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. అయితే సోనమ్ కపూర్, ఆనంద్ అహుజా పార్టీలో సందడి చేస్తూ.. అటు ఇటు కలియదిరుగుతూ.. మీడియా ఛానెల్ పాపారాట్సీలకు, పార్టీలోని గెస్ట్‌లకు లడ్డూలు పంచుతూ.. ఒకింత రెట్టింపు ఉత్సాహంతో అందరికి హ్యపీ దీపావళి అని శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ అభిమానులను అలరిస్తోంది. ఇక మిగతా బాలీవుడ్ ప్రముఖులు దీపావళి సంబరాల్లో మునిగిపోతూ.. వేర్వేరు చోట్ల ఫోటోలకు పోజిచ్చారు. View this post on Instagram @anandahuja #with #wife @sonamkapoor at #anilkapoor Diwali Bash in #Mumbai . #happydiwali #diwali #celebrations #festival #lights #colourful #gogreen #nopollution #yogenshah @yogenshah_s @anilskapoor A post shared by yogen shah (@yogenshah_s) on Oct 27, 2019 at 7:47pm PDT -
ఉప్పు తగ్గింది
ఇకపై భోజన సమయాల్లో డైనింగ్ టేబుల్‌పై తప్పనిసరిగా ఉప్పు ఉండేలా చూసుకోవాలనుకుంటున్నారు సోనమ్ కపూర్. సాధారణంగా ఫ్రూట్స్, మంచి మంచి తినుబండారాల గురించి కాకుండా ప్రత్యేకంగా ఉప్పు గురించే సోనమ్ ప్రస్తావించడానికి కారణం లేకపోలేదు. సోనమ్ ‘ఐయోడిన్ లోపం’తో బాధపడుతున్నారు. అందుకే ఇక నుంచి ఉప్పు ఎక్కువగా తీసుకోవాలనుకుంటున్నారు. ‘‘వెజిటేరియన్ తినే వారందరికీ ఒక గమనిక. ఐయోడిన్ ఉన్న సాల్ట్‌ను భోజన సమయంలో తీసుకోవడం మర్చిపోకండి. నాకు ఐడియోన్ లోపం ఉన్నట్లు ఈ మధ్యే తెలిసింది’’ అని సోనమ్ పేర్కొన్నారు. సోనమ్ శాకాహారి. వెజిటేరియన్ ఫుడ్ తీనేవారు ఎక్కువగా ఫలాలు, కాయగూరలు వంటి వాటిని ఆహారంగా తీసుకుంటుంటారు. మాంసాహారంతో పోల్చుకుంటే వీటిలో ఉప్పు శాతం తక్కువ అంటారు. ఇక సినిమాల విషయానికి వస్తే... సోనమ్ కపూర్ నటించిన ‘జోయా ఫ్యాక్టర్’ చిత్రం వచ్చే నెలలో విడుదల కానుంది. ఇందులో దుల్కర్ సల్మాన్ హీరో. -
మీ ఉప్పులో అయోడిన్ ఉందా?!
‘వెజిటేరియన్లు, వీగన్లకు ఒక చిన్న విన్నపం! మీరు తీసుకునే ఉప్పులో అయోడిన్ పాళ్లు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. నాకు అయోడిన్ లోపం ఉన్నట్లుగా ఇప్పుడే తెలిసింది. టేబుల్ సాల్ట్ తీసుకోవడం ద్వారా దీనిని అధిగమించవచ్చు. థ్యాంక్యూ! లవ్ యూ ఆల్’ అంటూ బాలీవుడ్ ఫ్యాషన్ దివా సోనమ్ కపూర్ తాను అయోడిన్ లోపంతో బాధపడుతున్న విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. వీగన్లుగా ఉన్న వారు తప్పక తన సలహా పాటించాలని సూచించారు. జంతు ప్రేమికురాలైన సోనమ్ వీగన్ డైట్ ఫాలో అవుతారన్న సంగతి తెలిసిందే. కాగా జంతువుల నుంచి వచ్చే ఏ పదార్థాన్ని వాడకపోవడమే వీగనిజం. వీగన్లు పాల పదార్థాలు తీసుకోరు. అదే విధంగా ఉన్ని, లెదర్ దుస్తులు వాడరు. మొక్కల నుంచి వచ్చే ఆహారాన్ని మాత్రమే తీసుకుని జీవిస్తారు. ఇక ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాటి నుంచి నేటి దాకా సోనమ్ అందం ఏమాత్రం చెక్కుచెదరకపోవడానికి ఆమె పాటించే ఆహారపుటలవాట్లు కూడా ఒక కారణమని సోనమ్ సన్నిహితులు చెబుతున్నారు. కాగా సోనమ్ ప్రస్తుతం ‘ది జోయా ఫాక్టర్’ అనే సినిమాలో నటిస్తున్నారు. అనుజా చౌహాన్ రచించిన నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో జోయా సోలంకి అనే రాజ్‌పూత్ అమ్మాయిగా ఆమె కనిపించనున్నారు. అభిషేక్ శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా సెప్టెంబరు 20న ప్రేక్షకుల ముందకు రానుంది. ఇక ఈ సినిమాలో సౌత్ యువ హీరో దుల్కర్ సల్మాన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. -
గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!
బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. వృద్ధుడైన తర్వాత తన రూపం ఎలా ఉంటుందో ఓ యాప్ ద్వారా ఫొటో తీసుకున్న అర్జున్.. దానిని తన ఇన్‌స్టా అకౌంట్లో షేర్ చేశాడు. ‘వృద్ధాప్యంలో నేను ఇలా ఉంటానా... గుర్తుపట్టారా’ అంటూ అర్జున్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలో రాసుకొచ్చాడు. కొన్ని గంటల్లోనే వైరల్‌గా మారిన ఈ ఫొటోపై నెటిజన్లతో పాటు సెలబ్రిటీలు కూడా తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘ఓల్డ్‌మాన్ చాలా అందంగా ఉన్నావ్’ అంటూ అర్జున్ బాబాయ్ సంజయ్ కామెంట్ చేయగా...మరికొంత మంది మాత్రం ఈ గెటప్‌లో అచ్చం సంజయ్‌లా ఉన్నావు అంటూ బాలీవుడ్ నటుడు సంజయ్ సక్సేనాతో పోలుస్తున్నారు. ఇక అర్జున్ కజిన్ సోనమ్ కపూర్ కూడా సదరు యాప్ ద్వారా వృద్ధాప్యంలో తానెలా ఉంటారో తెలిపే ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘ 75- 80 ఏళ్ల వయస్సులో ఈమె ఎలా ఉన్నారో చూడండి. నిజంగా తను చాలా అందంగా ఉంది కదా. తను ఎల్లప్పటికీ అందాల రాణిగానే ఉంటుంది’ అంటూ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చారు. కాగా వరుణ్ ధావన్ కూడా తన ఓల్డేజ్ ఫొటోను షేర్ చేసి... అనిల్ కపూర్ నూరేళ్ల వయస్సులో ఎలా ఉంటారో నేను 70 ఏళ్లకే అలా ఉన్నాను కదా అంటూ చమత్కరించాడు. View this post on Instagram Old age hit me like .. 👀 A post shared by Arjun Kapoor (@arjunkapoor) on Jul 16, 2019 at 3:52am PDT View this post on Instagram 70 years of reebokXvarundhawan P.s I didn’t stop training. Alot of people feel this is the way @anilskapoor will look when he’s 100 A post shared by Varun Dhawan (@varundvn) on Jul 16, 2019 at 2:23am PDT -
రాత్రి నుంచి ఎయిర్‌పోర్ట్‌లోనే రకుల్
ముంబైలో కురుస్తున్న వర్షాలు సాధారణ జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. ఈప్రభావం సెలబ్రిటీ పై కూడా గట్టిగానే కనిపిస్తుంది. ముఖ్యంగా సినీ తారలు షూటింగ్‌లు, ప్రయాణాల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ముంబై ఎయిర్‌పోర్ట్‌లో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో రాకపోకలు సాగుతున్నాయా అంటూ ముంబై మున్సిపాలిటీ, ముంబై పోలీస్, ఎయిర్పోర్ట్ వర్గాలకు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్‌పై స్పదించిన రకుల్ ప్రీత్ సింగ్ ‘గత రాత్రి నుంచి ఒక్క ఫ్లైట్ కూడా కదల్లేదు. నేను ఎయిర్‌పోర్ట్‌లో ఇరుక్కుపోయాను’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం తెలుగు మన్మథుడు 2తో పాటు హిందీ, తమిళ భాషల్లో ఒక్కో సినిమాలో నటిస్తున్నారు. No flights have taken off since last night .. m stuck at the airport — Rakul Preet Singh (@Rakulpreet) 2 July 2019 -
ఐష్‌పై ఒబెరాయ్ ట్వీట్.. సోనమ్ ఫైర్
ముంబై : బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ సరదాగా చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల నేపథ్యంలో ఆయన షేర్ చేసిన మీమ్ పెడర్థాలకు దారితీసింది. బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యారాయ్‌ను కించపరిచే విధంగా ఉన్న ఆ మీమ్‌పై యావత్ భారతం మండిపడుతోంది. మహిళా అనే కనీస గౌరవం లేకుండా ఒబెరాయ్ ప్రవర్తించాడని దుమ్మెత్తిపోస్తుంది. ఇంతకీ ఒబెరాయ్ చేసిన తప్పు ఏంటంటే.. ఒకప్పటి గర్ల్‌ఫ్రెండ్ అయిన ఐశ్వర్య వ్యక్తిగత జీవితాన్ని కించపరుస్తూ.. ఎగతాళిగా రూపొందించిన మీమ్‌ను షేర్ చేయడం. ఆమె బాయ్‌ఫ్రెండ్స్‌ను ప్రస్తావిస్తూ.. చాలా జుగుప్సాకరంగా రూపొందించిన ఆ మీమ్‌ను ట్వీట్ చేయడం.. నెటిజన్లకు ఆగ్రహం తెప్పిస్తోంది. బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌తో ఐశ్వర్య ఉన్న ఫొటోను ఒపీనియన్ పోల్గా.. తనతో ఐశ్వర్య ఉన్న ఫొటోను ఎగ్జిట్ పోల్గా.. అభిషేక్ బచ్చన్, తన కూతురు ఆరాధ్యతో ఐశ్వర్య ఉన్న ఫొటోను రిజల్ట్‌గా పేర్కొంటూ ఏ మాత్రం సోయి లేకుండా ట్వీట్ చేశాడు. పైగా వెటకారంగా ‘హహహ.. క్రియేటివ్.. ఇక్కడ రాజకీయాలు లేవు. జీవితం మాత్రమే’ అనే క్యాప్షన్ ఇచ్చాడు. ఈ ట్వీట్ చూసిన ప్రతి ఒక్కరు ఆగ్రహానికి గురవుతున్నారు. ఒబెరాయ్ ఒళ్లు మరిచి ట్వీట్ చేశాడని మండిపడుతున్నారు. చాలా అమర్యాదకంగా ప్రవర్తించాడని, వెంటనే ఆ ట్వీట్‌ను తొలగించాలని కామెంట్ చేస్తున్నారు. నరేంద్రమోదీ సినిమాలో మోదీ పాత్ర చేసినంత మాత్రానా.. ప్రధానని ఫీలవుతున్నావా? అని ప్రశ్నిస్తున్నారు. మహిళలను గౌరవించడం నేర్చుకో అంటూ బుద్ది చెబుతున్నారు. బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ సైతం ఒబెరాయ్ చర్యను తప్పుబట్టారు. చాలా అసహ్యంగా ఉందని కామెంట్ చేశారు. ఈ ట్వీట్ నేపథ్యంలో మహారాష్ట్ర మహిళా కమిషన్ ఒబెరాయ్‌పై కేసు నమోదు చేసింది. ప్రధాని నరేంద్రమోదీ బయోపిక్ ‘పీఎం నరేంద్రమోదీ’ లో ఒబెరాయ్ మోదీ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఎన్నికల కోడ్ వల్ల ఆ సినిమా విడుదల కాలేదు. ఇక ఎగ్జిట్ పోల్స్ అన్ని బీజేపీకి పట్టం కట్టిన విషయం తెలిసిందే. Haha! 👍 creative! No politics here....just life 🙏😃 Credits : @pavansingh1985 pic.twitter.com/1rPbbXZU8T — Vivek Anand Oberoi (@vivekoberoi) 20 May 2019 -
ఎనిమిదో అడుగు
భర్త ముందు నడుస్తాడు. భార్య వెనుక నడుస్తుంది.ఇది లోకాచారం. భర్త ఒకడుగు వెనుక నడిచి, భార్యను ముందుకు నడిపిస్తాడు!ఇది అఫెక్షన్.ఏడడుగుల తర్వాత.. భార్యపై ప్రేమతో, అఫెక్షన్తోఆమెను ముందుకు నడిపించడానికిభర్త వేసే వెనకడుగే.. ఎనిమిదో అడుగు. ఈ ఎనిమిదో అడుగు ప్రతి భర్తకూ ఆదర్శం కావాలి. రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్ చూడచక్కని జంట. రణ్వీర్ దీపిక మీద ఎంత అఫెక్షన్ చూపిస్తాడో మాటల్లో చెప్పలేం. చూపించడం కాదు. చూపించకుండా ఉండలేకపోవడం అది! మనసులో అంత ప్రేమ ఉంటే బయటికి వచ్చేయకుండా ఉంటుందా? పక్కన వాళ్లున్నారు, వీళ్లున్నారు అని చూసుకుంటుందా! ఈమధ్య.. ఈ భార్యాభర్తలిద్దరూ కలిసి ఓ పెళ్లింటికి వెళ్లారు. సాధారణంగా కొత్తగా పెళ్లయిన కపుల్ ఎక్కడికి వెళ్లినా ఒకర్నొకరు అంటుకుని అడుగులు వేస్తుంటారు. వీళ్లూ అంతే కానీ.. దీపిక మనుషుల్లో పడిపోయారంటే రణ్‌వీర్‌ని అస్సలు పట్టించుకోరు. రణ్వీర్ కూడా ఫీల్ అవడు. ఆమె ఫ్రీడమ్‌ను తనూ ఎంజాయ్ చేస్తాడు. దీపిక ఫ్రీడమ్‌కు ఏవైనా అడ్డుపడితే వాటిని కూడా తొలగిస్తూ ఆమెను కంఫర్ట్‌గా ఉంచుతాడు. పెళ్లికి వెళ్లారు కదా..అక్కడ ఏమైందంటే.. వాళ్లను వీళ్లనూ గ్రీట్ చేస్తూ నట్టింట నడుస్తున్న దీపికకు హైహీల్స్ అడ్డుపడుతున్నాయి. ఆమె ఇబ్బందిని గమనించాడు రణ్వీర్. ‘‘నాకివ్వు.. పట్టుకుంటాను’’ అని తీయించి, వాటిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆమె ముందుకు నడుస్తుంటే.. హైహీల్స్ పట్టుకుని ఆమె వెనుక నడిచాడు! (పట్టుకుని నడవడం ఎందుకు? ఎక్కడైనా పెట్టొచ్చు కదా. పెట్టొచ్చు. కానీ దీపికకు మళ్లీ వాటి అవసరం వస్తేనో!) రణవీర్ దీపిక హైహీల్స్‌ని చేత్తో పట్టుకున్న దృశ్యం ఎవరి కెమెరాలోనో క్లిక్ అయింది. తర్వాత నెట్లో వైరల్ అయింది. రణ్వీర్ మెరూన్ కలర్ షేర్వాణీలో, దీపిక పూల వైట్ కలర్ శారీలో ఉన్నారు. కొప్పు, కొద్దిగా ఆభరణాలు దీపికను మెరిపించేస్తున్నాయి. అయితే ఫొటోల్లో ఇవేవీ నెటిజన్లకు కనిపించడం లేదు. రణవీర్ చేతుల్లోని దీపిక హైహీల్స్పైనే అందరి చూపు. ‘‘ఇలాంటి భర్త ఉంటేనా?’’ అని అమ్మాయిలు పరవశించిపోయారు. ఇది కాదు విశేషం. రణ్వీర్ ఫాన్స్ అస్సలు ఈగోలకు పోలేదు. భార్య చెప్పులు చేత్తో పట్టుకుని నడవడం ఏంటి అని ఒక్కరూ ఒక్క పోస్టయినా వెయ్యలేదు. పైగా లైకుల మీద లైకులు కొట్టారు. ప్రియాంకా చోప్రా, నిక్ జోనస్ విడిపోతున్నారని ఈ మధ్య ఒక దుర్మార్గమైన వార్త వచ్చింది. పాశ్చాత్య మీడియా సృష్టింపు అది. ‘అయ్యో’ అని ఎన్నో మనసులు కలత చెందాయి. అయితే ఆ వార్త నిజం కాదు. ఇద్దరూ హాయిగా ఉన్నారు. పెళ్లయ్యాక మొన్న వచ్చిన తొలి ఈస్టర్ను నిక్.. ప్రియాంక హృదయాన్ని హత్తుకునేలా సెలబ్రేట్ చేశాడు. రోజంతా ప్రియాంకను తన కుటుంబ సభ్యులతోనే ఉండనిచ్చాడు. అత్తగారు, భర్తతో కలిసి ఉన్న ఒక ఫొటోని ప్రియాంక సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘హ్యాపీ ఈస్టర్ ఫ్రమ్ అవర్స్ టు యువర్స్’ అని కామెంట్ కూడా రాశారు. ఇంటర్వ్యూలలో ప్రియాంక మర్చిపోకుండా ఒక మాట చెబుతుంటారు. ‘నిక్ ఎక్స్ట్రీమ్లీ ఫ్యామిలీ ఓరియెంటెడ్’ అని. ఆ ఫ్యామిలీని అతడు తననెంతో ప్రేమించే ప్రియాంకకు కొంత పంచి పెట్టాడు. ‘తననెంతో ప్రేమించే’ ఓకే. ‘తనెంతో ప్రేమించే’ కాదా! ఇదిగో ఇలాంటి విరుపుల కారణంగానే విడిపోతల వదంతులు బయటికి వస్తుంటాయి. ప్రియాంక నిక్ని ఎంతగా ప్రేమిస్తున్నారో.. నిక్ కూడా ప్రియాంకను అంతగా ప్రేమిస్తున్నాడు. బ్రేక్ వస్తే చాలు.. ప్రియాంకను తీసుకుని అమ్మావాళ్ల (నిక్వాళ్ల) ఇంటికి వెళ్లిపోతున్నాడు. భూమండలాన్నంతా ఆల్రెడీ తిరిగేసిన ప్రియాంకకు ఇప్పుడు భువిపైనున్న స్వర్గసీమ అత్తగారిల్లు మాత్రమే. అలా ఆమె మనసులో అనుబంధాల పూలు పూయించాడు నిక్. మేఘన్ మార్కల్తో పెళ్లయ్యాక ప్రిన్స్ హ్యారీ సర్‌ప్రైజ్‌ల మీద సర్ప్రైజులు ఇవ్వడం (ప్రపంచానికి) సర్వసాధారణం అయిపోయింది. మేఘన్ పరిచయం కాకముందు వరకు ప్రిన్స్ హ్యారీ మూడీగా ఉండేవారు. లైఫ్‌లోకి ఆమె వచ్చాకే అతడిలోకి కాస్త జీవం వచ్చింది. తల్లి డయానా తలపుల్లోంచి బయటికి రాలేకపోయిన పసిపిల్లవాడే అతడు అన్నేళ్ల పాటు! అలాంటి పిల్లాణ్ని ఇప్పుడు మేఘన్ ఒడిలోకి తీసుకున్నారు. ఇప్పుడు ఆమే అతడి లోకం. ఆమె పట్ల అతడికెంత ఆరాధననో ఆ మధ్య వాళ్లు మొరాకో టూర్ వెళ్లినప్పుడు మళ్లీ ఒకసారి బయటపడింది. పి.డి.ఎ. అనే మాట వినే ఉంటారు. ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉన్నవాళ్లు ‘పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ అఫెక్షన్’ (ఇదే పి.డి.ఎ)తో నలుగురి కంటా పడుతుంటారు. అంటే తమకు తెలియకుండానే ప్రేమను బహిరంగంగా వ్యక్తం చేస్తూ పోతుంటారు. మొరాకోలోని ఆండలూషియన్ గార్డెన్స్‌లో షాపింగ్‌కి వెళ్లినప్పుడు మేఘన్‌కు ఒక పెండెంట్ నచ్చింది. దానిని మెడలో ధరించడానికి పోనీ టెయిల్ అడ్డం వచ్చి మేఘన్ ఇబ్బంది పడుతుంటే ప్రిన్స్ హ్యారీ ఆమె పోనీని ఎత్తి పట్టుకుని పెండెంట్ వేసుకోడానికి హెల్ప్ చేశారు! రాజకుటుంబంలోని జంట.. అదీ పురుషుడు ఇలా చొరవచూపడం అపురూపం, అపూర్వం కూడా! విరాట్, అనుష్క మనకు పాతబడి పోయి ఉండొచ్చు. వాళ్లకు వాళ్లు ఇంకా కొత్తగానే ఉన్నారు. అయినా పాతబడాలని రూల్ ఏముంది? ప్రేమికులుగా అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు, భార్యాభర్తలుగా ఇప్పుడు ఆనందవాసంలో ఉన్నప్పుడు విరాట్ ప్రతి ట్రోలింగ్‌లోనూ అనుష్కకు సపోర్ట్‌గా ఉన్నాడు, ఉంటున్నాడు. ఆమె ఇష్టాలను గౌరవిస్తున్నాడు. ఆమె అయిష్టాలను అల్లంత దూరంలోనే ఉంచేస్తున్నాడు. స్టేడియంలో అనుష్క ఉండడం వల్లనే విరాట్ ఓడిపోతున్నాడని విమర్శలు వచ్చినప్పుడు అమెకు గట్టి అండగా ఉన్నాడు విరాట్. ‘ఇలాంటివి మాట్లాడొద్దు’ అని అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. ఇండియన్ టీమ్‌తో కలిసి అనుష్క గ్రూప్ ఫొటో దిగడం ఏమిటన్నప్పుడు కూడా అలాంటి విజ్ఞప్తే చేశాడు. ‘తను నా స్నేహితురాలు’ అని వివాహానికి పూర్వం, ‘తను నా భార్య’ అని వివాహానంతరం ఆమెను తను సాధించిన ట్రోఫీలా ఎత్తి చూపాడు. రోడ్డుమీద ఎవరో చెత్తపారబోస్తే అనుష్క తిడుతున్న వీడియోను ఎవరో నెట్లో పెట్టి ఆమెను ట్రోల్ చేస్తున్నప్పుడు కూడా ‘ఆమె తిట్టడంలో తప్పేమిటి?’ అని నెటిజన్లను ప్రశ్నించాడు తప్ప, ‘మనకెందుకొచ్చింది చెప్పు..’ అని భార్యను నిరుత్సాహపరచలేదు. ఈ ఏడాది జనవరిలో వన్డే ఇంటర్నేషనల్ సిరీస్‌కు భార్యతో పాటు ఆస్ట్రేలియాలో ఉన్న విరాట్.. అదే సమయంలో అక్కడ ఆస్ట్రేలియన్ ఓపెన్ జరుగుతుంటే అనుష్క ఫేవరేట్ టెన్నిస్ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్‌కు ఆమెను తీసుకెళ్లి పరిచయం చేశాడు. ఫెదరర్, విరాట్, అనుష్క.. ముగ్గురూ కలిసి ఫొటో దిగారు. ఆ ఫొటోలను ‘త్రీ లెజెండ్స్ : వన్ ఫొటో’ అనే కామెంట్‌తో అనుష్క పోస్ట్ చెయ్యడంతో ఆమెపై ట్రోలింగ్ మొదలైంది. ఇరవైసార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌కి, ఇండియా జట్టు కెప్టెన్ విరాట్‌కి.. ఒక సినిమా నటి సమానం ఎలా అవుతుంది? అసలు ఆమె లెజెండ్ ఎలా అవుతుంది అని నెటిజెన్స్ విమర్శించారు. విపరీతార్థాలు తీశారు. ‘రోజన్ని కలిస్తే నేనూ లెజెండ్‌ని’ అవుతానా అని ఒకరు వెటకరించారు. ‘అసలు అనుష్కే లెజెండ్. మిగతా ఇద్దరూ కాదు’ అని ఇంకొకరు వ్యంగ్యంగా గుడ్లు మిటకరించారు. ఆ సమయంలో విరాట్ అనుష్కకు ఇంటా బయట ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చాడు. చివరిగా సోనమ్, ఆనంద్. సోనమ్ కపూర్, ఆమె భర్త ఆనంద్ అహూజా గతవారం ఢిల్లీలో ఒక స్టోర్ ఓపెనింగ్‌కి వెళ్లారు. అప్పుడు తీసిన ఫొటోల్లో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది. సోనమ్ స్టోర్‌లోని షూజ్‌ని తొడుక్కుని చూస్తున్నప్పుడు ఆనంద్ కిందికి వంగి ఆమెకు లేస్‌లు కట్టడం కపూర్ అభిమానుల్ని ముగ్ధుల్ని చేసింది. ఆనంద్, విరాట్, హ్యారీ, నిక్, రణవీర్‌ల ఈ ‘పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ అఫెక్షన్’కు అబ్బాయిల్లో కన్నా అమ్మాయిల్లోనే ఎక్కువ ఫాలోయింగ్ ఉండడం విశేషం. సహజమే. అమ్మాయిలు.. పెళ్లయినవాళ్లయినా, పెళ్లి కావలసినవాళ్లయినా.. ‘ఎక్స్ప్రెషన్ ఆఫ్ అఫెక్షన్’ని ఇష్టపడతారు. నిజంగా ప్రేమ ఉంటే అది పైకి కనిపించకుండా పోతుందా అన్నది వారి పాయింట్. -
రూ 18 లక్షల బ్యాగ్‌తో సోనం జిగేల్..
ముంబై : నలుగురిలో ప్రత్యేకంగా కనిపించేందుకు బాలీవుడ్ సెలబ్రిటీలు ఎంత ఖర్చుకైనా వెనుకాడరు. ఇక తమ లుక్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకునే బాలీవుడ్ హీరోయిన్లు లగ్జరీ లైఫ్‌ను లీడ్ చేయడానికి ఎప్పుడూ ముందే ఉంటారు. స్టైలింగ్‌లో తనదైన శైలిలో అందరినీ ఆకట్టుకునే బాలీవుడ్ బ్యూటీ సోనం కపూర్ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ట్రెండీ లుక్‌తో అదరగొట్టారు. గ్రేకలర్ డ్రెస్, రెడ్ లెదర్ బెల్ట్, బ్లాక్ షూస్‌తో మెరిసిన సోనం లుక్‌లో ఆమె ధరించిన బ్యాగ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. హెర్మెస్ బిర్కిన్ బ్రాండ్‌కు చెందిన ఈ బ్యాగ్ ఖరీదు రూ 18 లక్షలు కావడం గమనార్హం. -
అందుకే భార్య షూ లేసులు కట్టాడేమో?!
బాలీవుడ్ ఫ్యాషన్ దివా సోనమ్ కపూర్ అహుజా మరోసారి వార్తల్లో నిలిచారు. గతేడాది ప్రియుడు ఆనంద్ అహుజాను పెళ్లాడిన ఆమె తల్లికాబోతున్నారంటూ బీ- టౌన్లో టాక్ వినిపిస్తోంది. గురువారం జరిగిన ఓ ప్రముఖ షూ కంపెనీ కొత్త బ్రాండ్ లాంచింగ్ కార్యక్రమానికి సోనమ్ భర్తతో కలిసి హాజరయ్యారు. ఇందులో భాగంగా భార్యాభర్తలిద్దరు ఒకే రంగు షూ వేసుకుని ఫొటోలకు ఫోజులిచ్చారు. అయితే షూ వేసుకునే క్రమంలో సోనమ్‌కు ఇబ్బంది కాకూడదని భావించిన ఆనంద్.. ఆమె షూ లేసులు కట్టిన దృశ్యం అక్కడున్న వారితో పాటు ఫొటోగ్రాఫర్లను ఆకర్షించింది. ఇంకేముంది.. వెంటనే తమ కెమెరా కన్నుకు పనిచెప్పి చకచకా క్లిక్‌మనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భార్యపై ఆనంద్‌కు ఎంత ప్రేమో అంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం.. ‘భర్తతో షూలేసులు కట్టించుకోవడమేంటి సోనమ్.. నీకిది తగునా’ అని ట్రోల్ చేస్తున్నారు. ఇంకొంతమంది మాత్రం ఓ అడుగు ముందుకేసి.. ‘సోనమ్ తల్లికాబోతోంది. ఆమె బేబీ బంప్ స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే తనకు కష్టం కాకూడదనే ఆనంద్ షూ లేసులు కడుతున్నాడు’ అంటూ కథనాలు అల్లేస్తున్నారు. కాగా బాలీవుడ్ స్టార్ భామ దీపికా పదుకునే గురించి కూడా ఇలాంటి రూమర్లు ప్రచారమైన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై స్పందించిన దీపికా.. ‘పెళ్లైన వెంటనే తల్లి కావాలా..? అంటూ ప్రశ్నించింది. ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది. పెళ్లైన వాళ్లను పిల్లల గురించి అడిగి విసిగించడం ఎందుకు’ అంటూ దీపిక ఫైర్ అయ్యారు. -
‘అలా చేస్తే మా నాన్న శ్రమను కించపర్చనట్లే’
బాలీవుడ్లో హీట్ రైజింగ్ టాపిక్ అంటే బంధుప్రీతి అనే చెప్పవచ్చు. ఇప్పటికే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కుదిరినప్పుడల్లా ఈ విషయం పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడానికి రెడీగా ఉంటారు. ఈ క్రమంలో బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్ బంధుప్రీతికి కొత్త భాష్యం చెప్పారు. ఆర్బాజ్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న పించ్ కార్యక్రమానికి హాజరయ్యారు సోనమ్ కపూర్. ఈ సందర్భంగా తనను విమర్శిస్తూ వచ్చిన ఓ ట్వీట్ గురించి మాట్లాడారు. ఎవరో ఓ వ్యక్తి ‘పదేళ్ల నుంచి పరిశ్రమలో ఉంటున్నావ్.. ఇప్పటికి నీకు నటించడం రాద’ని విమర్శిస్తూ నెపోటిజమ్ అని హ్యాష్‌టాగ్‌తో ఓ ట్వీట్ చేశాడు. ఈ విషయంపై సోనమ్ కపూర్ స్పందిస్తూ.. ‘పదేళ్ల నుంచి కాదు.. 11 ఏళ్ల నుంచి నేను పరిశ్రమలో ఉంటున్నాను. ఇంతకాలం నుంచి మీరంతా నన్ను ఆదరిస్తున్నందుకు.. అభిమానిస్తున్నందుకు ధన్యవాదాలు. బంధుప్రీతి అనే పదానికి ఈ రోజు అసలైన అర్థం చెప్పాలనుకుంటున్నాను. బంధుప్రీతి అనగానే అది ఓ వ్యక్తికి చెందినదిగా భావిస్తారు. కానీ అసలు అర్థం ఏంటంటే ఓ వ్యక్తితో ఉన్న సంబంధం వల్ల మీకు మంచి ఉపాధి దొరకడం. కానీ జనాలు తమ స్వలాభం కోసం దీన్ని తప్పుగా అర్థం చేసుకుని.. అవతలివారిని కించపరుస్తున్నారు’ అని పేర్కొన్నారు. అంతేకాక ‘మా నాన్న ఓ ప్రముఖ కుటుంబం నుంచి రాలేదు. 40 సంవత్సరాలుగా ఆయన ఇండస్ట్రీలో కష్టపడి పని చేస్తున్నారు. ఇదంతా ఆయన కుటుంబం కోసం.. పిల్లల కోసమే చేస్తున్నారు. మా కోసం ఆయన పడిన శ్రమను మేం సరిగా వినియోగించుకోకపోతే.. ఆయన కష్టానికి మేము మర్యాద ఇవ్వనట్లే. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు కష్టపడేది వారి పిల్లల కోసమే కదా’ అంటూ చెప్పుకొచ్చారు. సోనమ్ తొలిసారి తండ్రి అనీల్ కపూరతో కలిసి ఏక్ లడ్కీ కో దేఖా థో హైసా లగా చిత్రంలో నటించారు. -
‘18 ఏళ్లకే నాకు ఫ్రీడం దొరికింది’
ప్రతీ ఒక్కరు తమ కాళ్లపై తాము నిలబడి.. ఆర్థికంగా నిలదొక్కుకోవడమనేది జీవితంలో అత్యంత ముఖ్యమని బాలీవుడ్ ఫ్యాషన్ దివా సోనమ్ కపూర్ అన్నారు. తనకు పద్దెనిమిదేళ్లకే ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చిందని.. అయితే తానెప్పుడు దానిని దుర్వినియోగం చేయలేదని ఈ బ్యూటీ చెప్పుకొచ్చారు. విద్యాబాలన్ రేడియో షోలో సోనమ్ మాట్లాడుతూ.. ‘ అందరు భారతీయ పిల్లల్లాగే నాకు కూడా 18 ఏళ్లకే నా తల్లిదండ్రులు ఆర్థికంగా నాకు స్వేచ్ఛనిచ్చారు. అదేవిధంగా ప్రతీ విషయంలో నాకు నేనుగా సలహాలు తీసుకునేలా నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దారు. తప్పో ఒప్పో సొంత నిర్ణయాలు తీసుకున్నపుడే వ్యక్తిగా పరిణతి చెందుతారని మా నాన్న చెబుతూ ఉంటారు. అయితే నేనెప్పుడు ఆయన నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదు’ అని పేర్కొన్నారు. తన తండ్రిలాగే ప్రతీ తండ్రి తమ బిడ్డలకు సొంతంగా ఎదిగే స్వేచ్ఛనివ్వాలని, అదే విధంగా పిల్లలు కూడా తల్లిదండ్రుల నిర్ణయాలు గౌరవిస్తూనే తమదైన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవాలని సోనమ్ సూచించారు. కాగా 2007 లో ‘సావరియా’ సినిమాతో బాలీవుడ్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు సోనమ్. విభిన్నమైన క్యారెక్టర్లతో ఆకట్టుకుంటూ ఈ ఏడాది ‘ఏక్ లడ్కీ దేఖా తో ఐసా లగా’ సినిమాతో బోల్డ్ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తొలిసారి తండ్రి అనిల్ కపూర్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ సినిమాలో సోనమ్ లెస్బియన్ పాత్రలో నటించారు. ప్రస్తుతం జోయా ఫ్యాక్టర్ సినిమా షూటింగ్లో ఆమె బిజీగా ఉన్నారు. -
పేరు మార్చుకున్న స్టార్ హీరోయిన్..!
బాలీవుడ్ లో పెద్దగా సక్సెస్‌లు లేకపోయినా స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న భామ సోనమ్ కపూర్. కపూర్ ఫ్యామిలీ వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన సోనమ్ కెరీర్లో ఒక్క నీర్జా తప్ప ఘన విజయం సాధించిన సినిమా ఒక్కటి కూడా లేదు. సినిమా మాట ఎలా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం సోనమ్ ఫుల్ యాక్టివ్. తన సినిమాల అప్డేట్స్తో పాటు ఫొటోలను అప్డేట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటుంది. తాజాగా ఈ భామ తన సోషల్ మీడియా అకౌంట్లలో తన పేరును మార్చేసింది. గతంలో ఆనంద్ అహూజాతో వివాహం తరువాత సోనమ్ కపూర్‌గా ఉన్న తన పేరును సోనమ్ కె అహూజాగా మార్చిన సోనమ్, తాజాగా తన పేరును జోయా సింగ్ సోలంకీగా మార్చేసింది. ప్రస్తుతం తన హీరోయిన్గా నటిస్తున్న ది జోయా ఫ్యాక్టర్‌లో సోనమ్ క్యారెక్టర్ పేరు జోయా సింగ్ సోలంకీ అందుకే సినిమా ప్రమోషన్లో భాగంగానే సోనమ్ ఈ పని చేసిందట. అభిషేక్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సౌత్ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. -
ఆశలన్ని ఆ చిత్రంపైనే..!
ఇటీవల నటి రెజీనా జోరు తగ్గిందనే చెప్పాలి. ఇటు కోలీవుడ్‌లోనూ, అటు టాలీవుడ్‌లోనూ కథానాయకిగా మంచి పేరు ఉన్నప్పటికి అవకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. తాజాగా తమిళంలో నటిస్తున్న ‘కళ్లపార్ట్’ చిత్రం మీద చాలా ఆశ పెట్టుకుంది రెజీనా. ఈ చిత్రంలో అరవిందస్వామికి జంటగా నటిస్తోంది రెజీనా. మూవింగ్ ఫ్రేమ్స్ పతాకంపై ఎస్.పార్తీ,ఎస్.శీనా కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథనం, దర్శకత్వ బాధ్యతలను పీ.రాజపాండి నిర్వహిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు ‘ఎన్నమో నడక్కుదు’ లాంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. ఈ చిత్రంలో రెజీనా డ్యాన్స టీచర్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం తనకు మంచి పేరు తెచ్చిపెడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు రెజీనా. ఇకపోతే బాలీవుడ్లో అనిల్ కపూర్, సోనమ్ కపూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘ఏక్ లడఖీ కో దేఖాతో ఐసా లగా’ సినిమాలో రెజీనా లెస్బియన్ పాత్రలో నటించారు. ప్రధాన పాత్రలో నటించిన సోనమ్ కపూర్ ప్రియురాలిగా రెజీనా నటించారు. సినిమా టాక్ పరంగా నిరాశపరిచినా రెజీనా పాత్రకు, ఆమె నటనకు మంచి రెస్పాన్స్ వస్తోంది. -
సీక్వెల్ కుదిరిందా?
గతేడాది బాలీవుడ్లో వచ్చిన ‘వీరే ది వెడ్డింగ్’ సినిమా వందకోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. శశాంక్ ఘోష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కరీనాకపూర్, సోనమ్ కపూర్, స్వర భాస్కర్, శిఖా తల్సానియా ముఖ్య తారలుగా నటించారు. సోనమ్ కపూర్ సిస్టర్ రియా కపూర్ ఒక నిర్మాతగా ఉన్నారు. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ రూపొందనుందా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. మహిళా సాధికారిత, హక్కుల నేపథ్యంలో కరీనా కపూర్ ఓ రేడియో షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిం ఈ షోలో భాగంగా సోనమ్ కపూర్‌కు కాల్ చేశారు కరీనా. మహిళల హక్కుల గురించి సోనమ్ తన అభిప్రాయాలను పంచుకున్న తర్వాత కాల్ చివర్లో ‘మనం వీరే ది వెడ్డింగ్ 2’ సెట్లో కలుసుకుందాం అని కరీనాతో ఫోన్లో అన్నారు సోనమ్. దీంతో ‘వీరే ది వెడ్డింగ్ 2’ సెట్స్‌పైకి వెళ్లనుందనే ప్రచారం ఊపందుకుంది. అంతేకాదు.. ఈ సినిమాతో సోనమ్ కపూర్ డైరెక్టర్‌గా మారనున్నారని బాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. -
ఆస్కార్ లైబ్రరీకి సోనమ్ సినిమా
కపూర్ల ఖాన్దాన్ నుంచి వచ్చినప్పటికి.. నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సోనమ్ కపూర్. ‘నీర్జా’ సినిమాలో తన నటనకుగాను జ్యూరీ విభాగంలో ఉత్తమ నటి అవార్డు సైతం సొంతం చేసుకున్న సోనమ్‌కు.. ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కనుంది. సోనమ్, తండ్రి అనిల్ కపూర్‌తో కలిసి నటించిన ‘ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా’ చిత్రాన్ని ఆస్కార్ లైబ్రరీలో చేర్చనున్నారు. మూవీకి సంబంధించిన ఓ కాపీని అందించాలని.. దాన్ని లైబ్రరీ కోర్ కలెక్షన్స్‌లో ఉంచుతామని ‘అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’ సంస్థ సినిమా నిర్మాతలను కోరిందట. ఈ వార్త తెలిసిన సోనమ్ కపూర్ ఆనందం వ్యక్తం చేశారు. ‘మా నాన్నతో కలిసి నటించిన మొదటి సినిమాకు ఇలాంటి గౌరవం దక్కడం చాలా సంతోషంగా ఉంది. మంచి సందేశంతో వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు ఎంతో ఆదరించారు. ఇప్పుడు ఈ సినిమాను ఆస్కార్ లైబ్రరీలో కూడా ఉంచడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది’ అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు సోనమ్. స్వలింగ సంపర్కం అనే అంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో టాలీవుడ్ భామ రెజీనా, అనిల్ కపూర్, రాజ్‌కుమార్ రావు, జూహీ చావ్లా కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఇప్పటికే దాదాపు రూ. 20 కోట్లు వసూలు చేసింది. -
లెస్బియన్‌గా రెజీనా..!
సౌత్‌లో యంగ్ హీరోలతో వరుస సినిమాలు చేసినా ఆశించిన స్థాయిలో స్టార్ ఇమేజ్ అందుకోలేకపోయిన బ్యూటీ రెజీనా. సాయి ధరమ్ తేజ్ లాంటి మీడియం రేంజ్ హీరోలతో పాటు అ! లాంటి ప్రయోగాత్మక చిత్రాల్లోనూ నటించిన రెజీనా స్టార్ హీరోలతో మాత్రం జతకట్టలేకపోయారు. దీంతో బాలీవుడ్ మీద దృష్టి పెట్టిన ఈ భామ ఓ బోల్డ్ క్యారెక్టర్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ వారం బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రయోగాత్మక చిత్రం ‘ఏక్ లడఖీ కో దేఖాతో ఐసా లగా’. అనిల్ కపూర్, సోనమ్ కపూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాలో రెజీనా లెస్బియన్ పాత్రలో నటించారు. ప్రధాన పాత్రలో నటించిన సోనమ్ కపూర్ ప్రియురాలిగా రెజీనా నటించారు. సినిమా టాక్ పరంగా నిరాశపరిచినా రెజీనా పాత్రకు, ఆమె నటనకు మంచి రెస్పాన్స్ వస్తోంది. -
‘అవును.. వాళ్లిద్దరు ప్రేమలో ఉన్నారు’
అవును.. వాళ్లిద్దరూ పదేళ్లుగా ప్రేమలో ఉన్నారు అంటూ బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్.. తన సోదరి రియా కపూర్‌కు సంబంధించిన సీక్రెట్‌ను రివీల్ చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ నా సోదరి(రియా) పెళ్లి చేసుకుంటానంటే అంతకన్నా సంతోషించే విషయం ఏముంటుంది. తనకి పెళ్లి కుదిరితే ఆ వార్త మీతో పంచుకోవడం ఎంతో ఆనందాన్నిస్తుంది కదా. అవును వాళ్లిద్దరు(రియా కపూర్- కరణ్ బూలానీ) పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇంతవరకు పెళ్లైతే చేసుకోలేదు. అయితే ఈ ఏడాది మాత్రం నా చెల్లెలి వివాహం జరిగే అవకాశం లేదు’ అని సోనమ్ చెప్పుకొచ్చారు. కాగా బాలీవుడ్ ప్రొడ్యూసర్‌గా బిజీగా ఉన్న రియా కపూర్, టీవీ సిరీస్ డైరెక్టర్ కరణ్ బూలానీలో ప్రేమలో ఉన్నారంటూ గత కొన్నిరోజులగా రూమర్లు వినిపిస్తున్నాయి. కపూర్ కుటుంబానికి సంబంధించిన ప్రతీ వేడుకలోనూ కరణ్ భాగం కావడం వీటికి మరింత బలాన్ని ఇచ్చింది. ఇందుకుతోడు కొన్నిరోజుల క్రితం సోనమ్ తల్లి సునీత కపూర్.. భర్త, కూతుళ్లు, కొడుకు, పెద్దల్లుడు ఆనంద్ అహుజాలతో పాటు కరణ్ ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. ‘నాకు ఇష్టమైన వ్యక్తులతో మరో కొత్త ప్రేమకథను సెలబ్రేట్ చేసుకుంటున్నా’ అంటూ క్యాప్షన్ జతచేసి హింట్ ఇచ్చారు. అయితే సోనమ్ ఇంటర్వ్యూతో ఈ వార్త కన్ఫామ్ అయ్యింది. ఇక సోనమ్ కపూర్ తన తండ్రి అనిల్ కపూర్‌తో కలిసి తొలిసారిగా నటించిన ‘ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా’ సినిమా శుక్రవారం విడుదలయ్యింది. లెస్బియన్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. View this post on Instagram ❤️❤️❤️❤️ #Repost @anilskapoor with @get_repost ・・・ A happy Sunday with the only humans that make me feel all warm and fuzzy inside... Celebrating yet another beautiful love story! @kapoor.sunita @anandahuja @sonamkapoor @rheakapoor @karanboolani @harshvardhankapoor A post shared by Sunita Kapoor (@kapoor.sunita) on Jan 6, 2019 at 5:19am PST -
‘ఆ ఆరోపణలు అవాస్తవం అయితే..?!’
నటి తనుశ్రీ దత్తా ప్రారంభించిన మీటూ ఉద్యమం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేవలం సిని రంగంవారేకాక.. మీడియా రంగంలోని వారు ధైర్యంగా బయటకు వచ్చి తమకు ఎదురైన ఇబ్బందులను బయటపెట్టారు. బాలీవుడ్‌లోని చాలామంది ప్రముఖులు బాధితులకు మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకడు రాజ్‌కుమార్ హిరాణీ మీద లైంగిక ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో సోనమ్ కపూర్, అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా’ చిత్రం పోస్టర్ నుంచి రాజ్‌కుమార్ హిరాణీ పేరు తొలగించారు. అయితే మీటూ ఉద్యమం ప్రారంభం నుంచి బాధితులకు మద్దతు తెలిపిన సోనమ్ కపూర్ రాజ్‌కుమార్ హిరాణీ విషయంలో మాత్రం ఆయనకే మద్దతిస్తోంది. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ.. ‘మీటూ ఉద్యమంలో ప్రతి బాధితురాలిని నేను నమ్ముతాను. కానీ హిరాణీ విషయంలో నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేను. హిరాణీ దర్శకునిగానే కాక వ్యక్తిగతంగా కూడా ఎన్నో సంవత్సరాల నుంచి నాకు తెలుసు. నేను ఆయనను చాలా గౌరవిస్తాను. కానీ ఇప్పుడు నా సినిమా కూడా నాకు ముఖ్యమే. సినిమా విడుదలయ్యాక దీని గురించి మాట్లాడతాను. ఇక్కడ నేను ఒక్క విషయం అడగదల్చుకున్నాను.. హిరాణీ మీద వచ్చిన ఆరోపణలు నిజం కాదని తెలితే అప్పుడేంటి పరిస్థితి. ఒక వేళ అలాంటిదే జరిగితే ఈ ఉద్యమం పూర్తిగా దెబ్బతింటుంది’ అని తెలిపారు సోనమ్ కపూర్. హిరాణీ మీద వచ్చిన లైంగిక వేధింపలు ఆరోపణలను ఆయన కుటుంబ సభ్యులే కాక స్నేహితులు, పలువురు నటులు కూడా కొట్టిపారేస్తున్నారు. తనను లైంగికంగా వేధించారంటూ హిరాణీ వద్ద పనిచేసిన సహాయ దర్శకురాలు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నటి దియా మీర్జా, రచయిత జావేద్ అక్తర్, హర్షద్ వాసి, షర్మాన్ జోషి తదితర ప్రముఖులు రాజ్‌కుమార్‌కు మద్దతుగా నిలుస్తుండగా... మరికొంతమంది మాత్రం ఈ విషయం గురించి పూర్తి నిజాలు బయటపడిన తర్వాతే మాట్లాడాల్సి ఉంటుందంటూ అభిప్రాయపడుతున్నారు. -
నేను మీ ఫ్యాన్ మేడమ్
సినిమా హీరోల అవుట్‘స్టాండింగ్’ ఫొటోలు చూసి, చూసి మొహం మొత్తేసిన వాళ్లకు ఈ ఫొటోలో కొంత ఛేంజ్ కనిపించవచ్చు. అనిల్ కపూర్ తన కూతురి ముందు ఒక అభిమానిగా మోకాళ్లపై కూర్చున్న ఈ అపురూపమైన క్షణాలను సత్యజిత్ దేశాయ్ అనే ఫొటోగ్రాఫర్ క్యాచ్ పట్టేశారు. సోమవారం ముంబైలోని అంథేరిలో ఒక ఫిల్మ్ ప్రివ్యూలో ఆ తండ్రికి ఈ కూతురు తారసపడింది! అప్పుడే ఇదిగో ఇలా ఆయన.. ‘నేను మీ ఫ్యాన్ మేడమ్’ అన్నట్లుగా నవ్వుతూ నేలపై కూర్చున్నారు. కూతుర్ని ఆయన ఇంకా గారాం చేస్తున్నట్లే ఉంది. ఈ ఏడాది మే నెలలో సోనమ్ బాయ్‌ఫ్రెండ్ ఆనంద్ అహూజాను సోనమ్‌కి ఇచ్చి పెళ్లి జరిపించారు అనిల్ కపూర్. అక్షింతలు వేస్తూ మామూలు తండ్రి లాగే కన్నీళ్లు పెట్టుకున్నారు. అంత ఇష్టం కూతురంటే. ఆయనకు మహారాణే. సోనమ్‌కి కూడా తండ్రి అంటే చెప్పలేనంత ప్రేమ. డిసెంబర్ 24న అనిల్ కపూర్ బర్త్‌డే. 62 ఏళ్లు నిండాయి. బర్త్‌డేకి సోనమ్ కపూర్ తన తండ్రికి ఎలాంటి ట్రీట్.. (ట్వీట్) ఇచ్చారో చూడండి. ‘హ్యాపీ హ్యాపీ బర్త్‌డే డాడ్. మన ఇద్దరికీ ఇది గుర్తుండిపోయే సంవత్సరం. నేను ఇండస్ట్రీకి వచ్చిన ఈ పదేళ్లలోనూ తొలిసారిగా మీరున్న చిత్రంలో నేనూ నటిస్తున్నాను. ఈ ఏడాది జరిగిన మరో విశేషం మీరు నా పెళ్లి చెయ్యడం. జీవితంలోని ప్రతి అడుగులోనూ మీరు నాపై చూపించిన ప్రేమకు, మీరు నేర్పిన ఆదర్శాలకు, విలువలకూ అన్నిటికీ నేను కృతజ్ఞురాలినై ఉంటాను. ఐ లవ్యూ సో మచ్’’ అని ట్వీట్ చేశారు సోనమ్. ఈ తండ్రీకూతుళ్లు.. నటించిన ‘ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా’ (ఒక అమ్మాయిని చూసినప్పుడు నాకిలా ఉంటుంది) చిత్రం 2019 ఫిబ్రవరి 1న విడుదల అవుతోంది. ఆ సినిమా ప్రివ్యూలోనే అనిల్ కపూర్ ఇలా తన డాటర్ స్టార్‌ని విష్ చేశారు. -
‘లవ్ యూ నాన్నా... నీకు ఇవ్వగలిగే కానుక ఇదే’
బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఈరోజు(సోమవారం) 62వ వసంతంలో అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా తన తండ్రికి బర్త్‌డే విషెస్ చెబుతూ... అనిల్ కపూర్ గారాల పట్టి, బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్ చేసిన సోషల్ మీడియాలో చేసిన పోస్టు నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ‘హ్యాపీ బర్త్‌డే నాన్న... ఈ ఏడాది మనిద్దరికీ గుర్తుండిపోతుంది. నా పదేళ్ల సినీ జీవితంలో నీతో కలిసి మొదటిసారిగా నటిస్తున్నా.. అలాగే నా పెళ్లి చూడాలన్న నీ కోరిక నెరవేరింది. ఇది నిజంగా మనకు పరిపూర్ణ సంవత్సరం. కొంచెం కష్టంగా... అంతకంటే ఎక్కువగా సంతోషంగా ఉంది కదా.. ప్రేమించడం, విలువలు పాటించడం ఇవి నువ్వు నాకు ఇచ్చిన బహుమతులు. కాబట్టి ప్రస్తుతం నీకు నేను ఇవ్వగలిగే కానుక ఏదైనా ఉందంటే వాటిని పాటించడమే. లవ్ యూ నాన్నా’ అంటూ ఆమె అనిల్ కపూర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కాగా కెరీర్ పరంగా 2007 లో ‘సావరియా’ సినిమాతో బాలీవుడ్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సోనమ్.. మొదట్లో సరైన హిట్లు లేక సతమతమయ్యారు. అయితే ఆ తర్వాత నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంపిక చేసుకుంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం రాజ్ కుమార్‌కు జంటగా నటిస్తోన్న ‘ఏక్ లడ్కీ కో దేఖాతో ఐసా లగా’ సినిమాలో సోనమ్ కపూర్ తండ్రితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఇక ఈ ఏడాది మే 8న తన చిరకాల స్నేహితుడు ఆనంద్ అహుజాతో సోనమ్ ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే. View this post on Instagram Happy happy birthday Dad... this has been a momentous year for both of us. For the first time in 10 years of being in this industry I shared a frame with you and was your costar.. And you also had to see me get married.. all this was a complete roller coaster... hard and beautiful at the same time.. I’m thankful for the teachings of love, progressive ideals and morals that have been a part of my upbringing , and each year I realise more and more what a gift that is in this day and age.. love you so much... ❤️❤️❤️ @anilskapoor #ekladkikodekhatohaisalaga A post shared by SonamKAhuja (@sonamkapoor) on Dec 23, 2018 at 10:57am PST -
ఈ చిన్నారిని గుర్తు పట్టారా..?
ఈ ఫోటోలోని చిన్నారిని గుర్తు పట్టారా..? కాస్తా జాగ్రత్తగా పరిశీలించండి.. అయినా పోల్చుకోలేకపోతున్నారా... అయితే మేమే చెప్తాం.. తను బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్. చిన్ని పొని టెయిల్‌తో.. పింక్ డ్రెస్‌లో ఎంత క్యూట్‌గా ఉందో అనిపిస్తోంది కదా. అవును అంత క్యూట్‌గా ఉంది కాబట్టే పోస్ట్ చేసిన అర్థ గంటలోనే ఈ ఫోటోకు దాదాపు 53 వేల లైక్‌లు వచ్చాయి. ఫోటో చూసిన అభిమానులు ‘చిన్నప్పటి నుంచి మీరు ఇంతేనా’.. ‘ఎంత క్యూట్‌గా ఉన్నారో’.. ‘ఫ్యాషన్ ఐకాన్ అంటేనే సోనమ్’ అంటూ కామెంట్ చేస్తున్నారు. View this post on Instagram Throwback to when a fountain ponytail was super on trend.😉 #ThrowbackThursday A post shared by SonamKAhuja (@sonamkapoor) on Nov 1, 2018 at 5:01am PDT -
కంగనా రనౌత్‌ను నమ్మలేం : సోనమ్
బాలీవుడ్లో ప్రకంపణలు సృష్టిస్తోన్న మీటూ ఉద్యమం తాజాగా కంగనా రనౌత్, సోనమ్ కపూర్ల మధ్య వివాదానికి తెరతీసింది. ఇండస్ట్రీలో జరుగుతున్న లైంగిక వేధింపుల ఆరోపణలపై సోనమ్ కపూర్ స్పందిస్తూ.. ‘తనుశ్రీ ధైర్యానికి మెచ్చుకుంటున్నాను. ఇండస్ట్రీలో ఉన్న బలవంతులైన నటులకు వ్యతిరేకంగా ఆరోపణలు చేయడం అంత తేలికేం కాదు. కానీ ఈ విషయంలో తనుశ్రీ చూపిన తెగువ అభినందనీయం’ అన్నారు. అలానే వికాస్ బహ్ల్ గురించి కంగనా చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘ఈ విషయం గురించి కంగనా ఎంతో చెప్పింది. కానీ అన్ని సార్లు ఆమెని నమ్మలేం. కంగనా తాను నమ్మిన విషయానికి కట్టుబడి ఉంటుంది. నేను ఆ విషయాన్ని ఎంతో గౌరవిస్తాను. కానీ పూర్తిగా వాస్తవాలు తెలియకుండా కంగనా రాతలను మాత్రమే నమ్మి ఎటువంటి వ్యాఖ్యలు చేయలేను’ అన్నారు. అంతేకాక ‘నాకు అతను(వికాస్) ఎవరో తెలీదు.. నాకు అక్కడ ఉన్న పరిస్థితి కూడా తెలియదు. కానీ ఇప్పుడు వినిపిస్తున్నవన్ని వాస్తవాలే అయితే నిజంగా ఇది చాలా సిగ్గు పడవలసినదే కాక భయంకరమైన అంశం కూడా. ఇవన్ని నిజాలైలే వారికి తప్పకుండా శిక్షపడాలం’టూ పేర్కొన్నారు. అయితే సోనమ్ వ్యాఖ్యలపై కంగనా మండిపడుతున్నారు. నన్ను జడ్జ్ చేయడానికి సోనమ్ కపూర్ ఎవరంటూ ప్రశ్నిస్తున్నారు. ‘నా వ్యాఖ్యలు అవాస్తవాలు అన్పించడానికి సోనమ్ దగ్గర ఏమైనా ఆధారలు ఉన్నాయా.. నేను ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తిని.. నేను పలు అంతర్జాతీయ వేడుకల్లో నా దేశం తరపున పాల్గొన్నాను.. నేను యువతకు ప్రేరణగా ఉన్నాను. నేను ఓ దశాబ్దం పాటు పోరాడి ఇండస్ట్రీలో నాకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాను తప్ప సోనమ్ కపూర్‌లాగా నా తండ్రి వల్ల నాకు ఈ గుర్తింపు రాలేదు’ అంటూ మండిపడ్డారు. -
నీలాంటి మగాళ్ల వల్లే!
ట్వీటర్లో సోనమ్ కపూర్ ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆమెకు కోటి 20 లక్షల మంది ట్వీటర్ ఫాలోయర్స్ కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు సడన్‌గా ట్వీటర్ నుంచి తప్పుకుంటున్నా అనేశారు సోనమ్. ‘‘నా ట్వీటర్ అకౌంట్‌ను ఆపేస్తున్నాను. నెగిటివిటీ బాగా పెరిగిపోయింది’’ అని పేర్కొన్నారు సోనమ్. తనుశ్రీ దత్తా వివాదం విషయంలో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉన్నారు సోనమ్. ఓ నెటిజన్ చేసిన విమర్శలే సోనమ్ ట్వీటర్‌కి ఫుల్స్టాప్ పెట్టడానికి కారణమని బాలీవుడ్ సినీ జనాలు విశ్లేషిస్తున్నారు. ఇటీవల ముంబైలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బాగా పెరిగిపోవడం వల్లే గమ్యం చేరుకోవడానికి తనకు బాగా ఆలస్యం అవుతోందని అర్థం వచ్చేలా సోనమ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఓ నెటిజన్ స్పందిస్తూ– ‘‘సోనమ్... ఈ పరిస్థితి మీ లాంటి వారి వల్లే. మీరు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను ఉపయోగించరు. బాగా ఇందనం ఖర్చయ్యే వాహనాలనే వాడతారు. మీ ఇంట్లో దాదాపు 10 నుంచి 20 ఏసీలు వాడతారు. ఇలా గ్లోబల్ వార్మింగ్‌కి కారణం అవుతారు. ఫస్ట్ మీ పాపులేషన్‌ని కంట్రోల్ చేసుకో’’ అని బదులు చెప్పాడు. సోనమ్ కూడా ఏం తగ్గలేదు. ‘‘మీ లాంటి మగవారి వల్లే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ప్రయాణిస్తే లైంగిక వేధింపులకు గురి అవుతామేమోనని మహిళలు భయపడుతున్నారు’’ అని రెస్పాండ్ అయ్యారు సోనమ్. ఈ సంగతి ఇలా ఉంచితే.. ఆమె ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉన్నారు. దాదాపు కోటీ నలభై లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు. -
సోషల్ మీడియాకు బైబై చెప్పిన స్టార్ హీరోయిన్!!
‘కొన్నాళ్లు ట్విటర్‌కు విరామం ఇస్తున్నాను. ఇక్కడంతా నెగిటివిటీ ఉంది. లవ్ యూ ఆల్’ అంటూ ట్విటర్ నుంచి కొంత కాలం పాటు సైన్ ఆఫ్ అవుతున్నట్లు ప్రకటించారు బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా సోనమ్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం కాలుష్యం. అవునా అలా ఎలా అంటూ ఆశ్చర్యపోకండి. అసలు విషయమేమిటంటే..‘ నగరానికి చేరుకునేందుకు సుమారు రెండు గంటల సమయం పట్టింది. ఇంకా గమ్యాన్ని మాత్రం చేరుకోలేదు. రోడ్లు చాలా చెత్తగా ఉన్నాయి. ఇక కాలుష్యం గురించి చెప్పనవసరం లేదు. ఇంటి నుంచి బయటికి రావాలంటేనే తెలియని భయం వెంటాడుతుంది’ అంటూ దేశంలో నెలకొన్న పరిస్థితుల గురించి ప్రస్తావిస్తూ తన ట్రావెలింగ్ అనుభవం గురించి సోనమ్ కపూర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. సోనమ్ పోస్ట్‌కు స్పందించిన ఓ నెటిజన్... ‘ తక్కువ ఇంధనంతో ఎక్కువ మైలేజీ ఇచ్చే పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు ఉపయోగించని, విలాసాలకు అలవాటు పడిన మీలాంటి సెలబ్రిటీల వల్లనే ఈ సమస్యలు. మీరు ఉపయోగించే లగ్జరీ కార్లు 3, 4 కంటే ఎక్కువ కిలోమీటర్ల మైలేజీ ఇవ్వవు. అంతేకాదు మీ ఇళ్లలో మినిమమ్ ఓ 20 ఏసీలు ఉంటాయి. కాబట్టి గ్లోబల్ వార్మింగ్‌లో మీ పాత్ర కూడా ఉంది. ముందు మీ వల్ల కలిగే కాలుష్యాన్ని అరికట్టండి ఆ తర్వాతే.... అంటూ సోనమ్‌కు రిప్లై ఇచ్చాడు. ఇందుకు ప్రతిగా.. ‘నీలాంటి మగవాళ్లు ఉంటారు కాబట్టే మహిళలు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు ఉపయోగించాలంటే భయపడతారు. ఎందుకంటే అక్కడ కూడా వేధింపులు ఉంటాయి కదా’ అంటూ సోనమ్ అతడిని ఘాటుగా విమర్శించారు. ఈ క్రమంలో అతడికి మద్దతుగా నిలిచిన మరికొంత మంది నెటిజన్లు సోనమ్‌కు వ్యతిరేకంగా ద్వేషపూరిత ట్వీట్లు చేశారు. దీంతో చిన్నబుచ్చుకున్న సోనమ్ ట్విటర్‌కు బై బై చెప్పేశారు. @sonamakapoor its because of people like you,who don't use public transport or less fuel consumption vehicles. You Know that your luxury car gives 3 or 4 km per litre mileage and 10 /20 AC's in your house are equally responsible for global warming. First control your pollution. pic.twitter.com/CrlGmKxv0b — anant vasu(AV):&less (@anantvasu) October 4, 2018 I’m going off twitter for a while. It’s just too negative. Peace and love to all ! — Sonam K Ahuja (@sonamakapoor) October 6, 2018 -
బోల్డ్ విషయముంది
‘మాంగ్ మే సింధూర్’ అడిగే హీరోయిన్లు మాయమైపోయారు. ‘కర్వా చౌత్’ అంటూ వ్రతాలు చేసే హీరోయిన్లూ ఔట్ డేట్ అయిపోయారు. గతంలో ‘బికిని’ వేసుకుంటే బోల్డ్‌గా చేసింది అనేవారు. నేడు డార్క్ సైడ్ ఆఫ్ ది లైఫ్‌ను చూపించే పాత్ర చేస్తే బోల్డ్ అంటున్నారు. సరైన పాత్ర దొరికితే రొటీన్‌కు మారో గోలి అంటున్నారు. నాలుగు డైలాగులు చెప్పాలి అయిదు పాటల్లో గెంతాలి. బ్రెయిన్ ఉన్నా ఉపయోగించకూడదు. బుజ్జి బుజ్జి మాటలు.. ముద్దు ముద్దు చేష్టలతో కథానాయకుడి ప్రాపకం కోసం పాకులాడుతూ ఉండాలి. ప్రేమ పేరుతో వెంటబడాలి. హీరో చిరాకు పడుతూ చీదరించుకుంటుంటే వానపాటల్లో తడుస్తూ అతగాడిని అలరించడానికి తడవాలి! ఇంకెన్నాళ్లీ బోరింగ్ హీరోయిన్స్ రోల్స్‌ను మోయాలి? అందుకే నో ... చెప్పారు కొందరు కథానాయికలు. ప్రాధాన్యమున్న పాత్రలను ఆశిస్తున్నారు. స్క్రిప్ట్ డిమాండ్‌ను బట్టి బోల్డ్‌గా నటించేందుకూ డిసైడ్ అయ్యి బాక్సాఫీస్ కలెక్షన్స్ పెంచుతున్నారు. రెమ్యునరేషన్‌ను శాసించే స్థాయికి ఎదుగుతున్నారు. అలాంటి బోల్డ్ నిర్ణయాలు తీసుకుంటున్న హీరోయిన్స్ ఇప్పుడు బోలెడుమంది. అందరికీ తెలిసిన కొందరి గురించి బ్రీఫ్ నరేషన్... డర్టీ పిక్చర్.. గ్రేట్ ఐడెంటిటీ ‘పరిణీత’తో హిందీ సినిమా సఫర్ షురూ చేసినా విద్యాబాలన్‌కు గుర్తింపు వచ్చింది మాత్రం ‘డర్టీ పిక్చర్’తోనే. తెలుగు నటి సిల్క్ స్మిత బయోగ్రఫీ అంటూ వచ్చిన ఆ సినిమాలో సిల్క్ స్మితగా నటించి విద్యాబాలన్ న్యూస్ క్రియేట్ చేసింది. సౌత్ ఇండస్ట్రీలో బొద్దుగా ఉండే హీరోయిన్స్‌కే క్రేజ్ కనుక సిల్క్ స్మిత కూడా బొద్దుగా ఉండేది కనుక డర్టీ పిక్చర్ కోసం బరువు పెరిగింది విద్యా. ‘ఊలాలా... ఊలాలా’ అంటూ ప్రేక్షకులను వేడెక్కించే స్టెప్పులేసింది. ‘ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్’ అంటూ గారాలు పోతూ ఆమె చెప్పిన డైలాగులు విద్యను వ్యాంప్‌గా నిలబెట్టలేదు. ఆమెలోని నటినే పరిచయం చేశాయి. ఆమెది డర్టీ డెసిషనే కాదు అని నిరూపించాయి. ఆ తర్వాత ‘ఇష్కియా’, ‘కహానీ’, ‘బేగంజాన్’, ‘తుమ్హారీ సులూ’ వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ రోల్స్ ఆమె వెంటపడ్డాయి! అవార్డుల పంట పండించి.. ఆమెకు గ్రేట్ ఐడెంటిటీ ఇచ్చాయి! ‘క్వీన్’ ఆన్ సిల్వర్‌స్క్రీన్... ఇది ఎవరి గురించి ప్రస్తావనో హింట్ ఇచ్చేసినట్టే కదా! యెస్... కంగనా రనౌత్. ఆమె ఫిల్మోగ్రఫిలో మూడు నాలుగు మినహా అన్నీ ప్రత్యేకమైనవే. ‘లైఫ్ ఇన్ ఎ మెట్రో’, ‘ఫ్యాషన్’, ‘తనూ వెడ్స్ మనూ’, ‘క్వీన్’, ‘రంగూన్’.. లెక్క చేయాల్సిన సినిమాలు. ‘తనూ వెడ్స్ మనూ’లో మెట్రోపాలిటన్ సిటీ కల్చర్‌ను అడాప్ట్ చేసుకున్న కాన్పూర్ కన్సర్వేటివ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అమ్మాయిగా... దాని సీక్వెల్ అయిన ‘తనూ వెడ్స్ మనూ రిటర్న్స్’లో డీ గ్లామర్ స్పోర్ట్స్ ఉమన్‌గా ఈ గ్లామర్ క్వీన్ ఉనికి ఇండస్ట్రీలో హీరోయిన్ల ప్రిఫరెన్స్నే మార్చేసింది. ‘రంగూన్’లోనైతే కంగనా దేహం కూడా అభినయిస్తుందనే ప్రశంసలందుకుంది. ఆ బోల్డ్నెస్కే ఫిల్మ్‌ఫేర్ నుంచి నేషనల్ అవార్డ్స్ దాకా ఎన్నో పురస్కారాలు దాసోహమయ్యాయి. చమ్మక్ చల్లో ఛమేలీ... కన్ఫ్యూజ్ కావద్దు.. కరీనా కపూర్ గురించే! ఆమె మొదటి సినిమా ‘రెఫ్యూజీ’లో కరీనా పెర్ఫార్మెన్స్ చూసి ‘ప్చ్’ అన్నవాళ్లే ఓమ్కారాతో బెస్ట్ యాక్ట్రెస్ అంటూ కితాబిచ్చారు. ‘కుర్బాన్’ లో టాప్‌లెస్ అపియరెన్స్, ‘హీరోయిన్’లో లవ్ మేకింగ్ సీన్స్, అంతకుముందే ‘చమేలీ’, ఈ మధ్య ‘వీరే దీ వెడ్డింగ్’తో స్టీరియోటైప్‌ను బ్రేక్ చేసి యాక్టింగ్‌లో ఛాలెంజ్‌ను క్రియేట్ చేసింది కరీనా. బోల్డ్ అండ్ టాలెంటెడ్ అనే పేరుతెచ్చుకుంది. అవార్డ్స్ కన్నా ప్రేక్షకుల అప్లాజ్ మిన్న అనుకుంది. డాలీ కి డోలీ.. సోనమ్ కపూర్... అనిల్ కపూర్ కూతురిగా కాకుండా ‘కపూర్’ సర్నేమ్ నీడ పడకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎదురైన సవాళ్లనన్నిటినీ ఎదర్కొని నిలబడ్డ నటి. ఆమె సినిమాల జాబితా చూస్తే ఎంత భిన్నమైన పాత్రలను ఎంచుకుంటుందో తెలుస్తుంది. తొలి సినిమా ‘సావరియా’ నార్మల్ ల్యాండింగే అయినా మిగతావన్నీ వేటికవే విభిన్నం. ‘డాలీ కి డోలీ’లో నిత్య పెళ్లికూతురిగా, ‘ఖూబ్సూరత్’లో సొంత వ్యక్తిత్వం ఉన్న అమ్మాయిగా, ‘వీరే దీ వెడ్డింగ్’లో పెళ్లికి ముందే సెక్స్‌ను ఎక్స్‌పీరియెన్స్ చేసిన యువతిగా నటించి ఏ హీరోయిన్ చేయని సాహసం చేసింది సోనం కపూర్. అనార్కలీ ఆఫ్ ఆరా స్వరాభాస్కర్ అని తెలిసే ఉంటుంది. ఎరోటిక్ ఫోక్ డాన్సర్‌గా కనిపిస్తుంది ‘అనార్కలీ ఆఫ్ ఆరా’ లో స్వర. అది బోల్డ్ రోల్ కాదు.. గ్లామరస్ అపియరెన్స్ మాత్రమే అని అంటుంది ఆమె. నచ్చని విషయాన్ని ముక్కు పగలగొట్టినట్టే చెప్తుంది. కాంట్రవర్సీలకు భయపడదు. రియల్ లైఫ్‌లోని ఈ గుణమే స్క్రీన్ మీద పాత్రలను ఎంచుకునేటప్పుడూ చూపిస్తుంది స్వరా. కమర్షియల్ రోల్స్‌కి పెద్దగా తావివ్వకుండా ‘లిజన్ అమాయా’, ‘నీల్ బట్టే సన్నాట’, ‘వీరే ది వెడ్డింగ్’ లాంటి మల్టీప్లెక్స్‌కే స్కోప్ ఇస్తోంది. ఇవన్నీ గ్లామర్ గ్రామర్ లేనివే. అంత ధైర్యం లేకపోతే ‘వీరే దీ వెడ్డింగ్’లో స్వయంతృప్తి చెందే సీన్లో ఎలా నటించగలదు? లస్ట్ స్టోరీస్.. అనగానే ముందు గుర్తొచ్చే పేరు రాధికా ఆప్టే. ఆ సినిమాలోని ఫస్ట్ స్టోరీలో నటించింది ఆమె. స్టూడెంట్ పట్ల లస్ట్ ఉన్న టీచర్‌గా. దీనికి నిజంగానే గట్స్ ఉండాలి. ఉన్నాయని ప్రూవ్ చేసుకుంది రాధికా ఆప్టే. అంతేకాదు పాపులర్ బ్యానర్స్ నుంచి చాన్స్‌లు వస్తున్నప్పుడే ‘అహల్య’ అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించి యాక్టింగ్ నో బార్ అని చూపింది. తర్వాత ‘ఫోబియా’ లాంటి ఆఫ్‌బీట్ సినిమాలను, నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌నూ సీరియస్‌గా తీసుకుంది. ఎంతో బోల్డ్‌గా ఉంటే తప్ప ఇంత వెర్సటాలిటీ ప్రదర్శించలేరు. లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా అరవైఏళ్ల రత్నా పాఠక్ షా తీసుకున్న డేర్స్టెప్ ‘లిప్‌స్టిక్ అండర్ మై బురా’్ఖలోని ఆమె పాత్ర. ఏటికి ఎదురీదే గుణంతో పాటు నటననూ వారసత్వంగా తీసుకుంది రత్న.. ఆమె తల్లి దీనా పాఠక్ నుంచి. కెరీర్ తొలినాళ్లలో ప్యార్లల్ సినిమాల్లోనే ఎక్కువగా నటించింది. సెకండ్ ఇన్నింగ్స్‌ను కమర్షియల్ మూవీస్‌తో స్టార్ట్ చేసింది. ఈ మలిప్రారంభమే ఆమెలోని బోల్డ్నెస్కు ప్రతీక. ఇక లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా సినిమాలోనైతే ఫాంటసీల్లో బతుకుతున్న యాభై ఏళ్ల విడోగా జీవించి సినీ క్రిటిక్స్‌తో చప్పట్లు కొట్టించింది. వీళ్లేకాక ప్రియాంక చోప్రా, కొంకణ్ సేన్ శర్మ, హుమా ఖురేషి, రీచా చద్దా, నేహా ధుపియా లాంటి హీరోయిన్సూ మూసకు భిన్నంగా నటించినవారే. షబానా ఆజ్మీ లాంటి ఆ తరం హీరోయిన్స్ కూడా కథను అనుసరించి బోల్డ్ క్యారెక్టర్స్ చేశారు. దీపా మెహతా ‘ఫైర్’లో షబానా ఆజ్మీ, నందితా దాస్ లెస్బియన్స్‌గా నటించారు. ఇదీ బోల్డ్ స్టోరీ. బోల్డ్ అంటే ఈ నటీమణుల విషయంలో స్ట్రాంగ్ అనే. డాన్సింగ్ డాల్ కాన్సెప్ట్‌కు ఎండ్ పలికి ఫీమేల్ ప్రొటాగనిస్ట్ స్టోరీస్‌కు డిమాండ్ పెంచాలనే. కథకు అవసరమైతే బోల్డ్సీన్స్ ఓకే అంటున్నారు ఈ స్ట్రాంగ్, బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ లేడీస్. – శరాది -
ప్రియాంక.. నీ రిప్లై కోసమే వెయిటింగ్
బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్ ఓ కొత్త ఆట ప్రారంభించారు. దీనిలో భాగంగా సోనమ్ ‘బ్రేక్‌ఫాస్ట్ ఎట్ టిఫనీస్’, ‘గాన్ విత్ ద విండ్’, ‘గాడ్ ఫాదర్’ సినిమాలు తనకు నచ్చిన మూడు అంతర్జాతీయ సినిమాలుగా చెప్పారు. అనంతరం వాటి పేర్లను ప్రతిబింబించేలా ఆర్ట్ వర్క్ చేసిన సోనమ్.. ఆ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. అంతటితో ఆగక తన సోదరి రియా కపూర్, సోదరుడు అర్జున్ కపూర్, సహనటి ప్రియాంక చోప్రాను టాగ్ చేస్తూ వారిని కూడా తమకు నచ్చిన సినిమా పేర్లు చెప్పి వాటికి సంబంధించిన ఆర్ట్ వర్క్‌ని పోస్టు చేయాలంటూ కోరారు. ఇప్పటికే అర్జున్ కపూర్, రియా కపూర్... సోనమ్ చాలెంజ్‌ని పూర్తి చేయడమే కాక జాన్వీని, అన్షులాను ఈ గేమ్ కోసం టాగ్ చేశారు. Mario Puzo gave us Don Vito Corleone. Francis Ford Coppola gave us cinema we couldn’t refuse. I nominate @arjunkapoor to share his favorite film adapted from literature. #TheGodfather @mumbaifilmfest #WordtoScreen2018 #JioMAMIwithStar2018 A post shared by SonamKAhuja (@sonamkapoor) on Aug 29, 2018 at 11:59pm PDT మిగిలింది ప్రియాంక చోప్రా. ప్రియాంక సమాధానం కోసం ఆమె అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ప్రియాంక, బాయ్‌ఫ్రెండ్ నిక్‌తో మెక్సికోలో విహరిస్తున్నారు. ‘మామి’ (ముంబై అకాడమి ఆఫ్ మూవింగ్ ఇమెజ్) అనే ట్రస్ట్ అధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్నెషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా సోనమ్ ఈ గేమ్‌ని ప్రారంభించారు. ‘మామి ఫిల్మ్ ఫెస్టివల్’ అయిపోయినప్పటికి వీరంతా ఈ గేమ్‌ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. “There's a difference between really loving someone and loving the idea of her.” My favourite word to screen is Gone Girl! Thanks for tagging me @sonamkapoor. I tag @anshulakapoor to tell me her favourite word to screen! #mami A post shared by Arjun Kapoor (@arjunkapoor) on Aug 30, 2018 at 10:47pm PDT -
డాటర్ ఆఫ్ కపూర్స్
ఆఫ్ స్క్రీన్ ఫ్యామిలీ మెంబర్స్ ఆన్ స్క్రీన్ కలిసి యాక్ట్ చేస్తే ఆ యాక్టర్స్‌కే కాదు ప్రేక్షకులకు కూడా చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఇప్పుడదే థ్రిల్లింగ్ మూమొంట్ను ఎంజాయ్ చేస్తున్నారు సోనమ్. ఒకసారి కాదు వరుసగా రెండోసారి తన ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి యాక్ట్ చేస్తున్నారు సోనమ్. ప్రస్తుతం ఆమె నటిస్తున్న ‘ఏక్ లడ్కీకో దేఖాతో ఏశా లగా’ సినిమాలో తండ్రి అనిల్ కపూర్‌తో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఇందులో సోనమ్, అనిల్ తండ్రీ కూతుళ్లుగా కనిపించనున్నారు. ఈ సినిమా తర్వాత మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్‌తో కలిసి యాక్ట్ చేస్తున్న ‘జోయా ఫ్యాక్టర్’లో సోనమ్ బాబాయ్ సంజయ్ కపూర్ కూడా యాక్ట్ చేయబోతున్నారట. బాబాయ్ సంజయ్ కపూర్ ఈ సినిమాలో సోనమ్‌కి తండ్రిగా కనిపిస్తారట. ఆల్రెడీ ‘ముబారకన్’ సినిమాలో అన్నయ్య అనిల్ కపూర్, మరో అన్నయ్య బోనీ కపూర్ కుమారుడు అర్జున్ కపూర్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు సంజయ్. ‘‘సోనమ్ నా కళ్ల ముందే పెరిగింది. తను నా కూతురు లాంటిదే. తనతో వర్క్ చేయడం చాలా ఎగై్జటింగ్‌గా ఉంది. ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి వర్క్ చేయడం కంటే హ్యాపీ ఏం ఉంటుంది’’ అన్నారు సంజయ్‌కపూర్. -
‘ఆ విషయంలో కరీనానే బెస్ట్’
బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ అనగానే ప్రస్తుతం చాలా మందికి గుర్తొచ్చే పేరు సోనమ్ కపూర్. తాజాగా కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఫ్యాషన్ దివా అంటే సోనమే అనేంతగా లుక్స్‌తో ఆకట్టుకున్నారు కూడా. అయితే ఫ్యాషన్ విషయంలో సోనమ్ కంటే కూడా కరీనా కపూరే ది బెస్ట్ అనే స్టేట్మెంట్ సోనమ్ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. కానీ ఆ స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తిపై వారు తమ ఆగ్రహాన్ని బాహాటంగా వెళ్లగక్కలేకపోతున్నారు. ఎందుకంటే ఆ స్టేట్మెంట్ ఇచ్చింది మరెవరో కాదు... సోనమ్ కపూర్ భర్త ఆనంద్ అహుజా. ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..బాలీవుడ్ స్టైల్ ఐకాన్ అంటే తనకు కరీనా కపూరే గుర్తుకువస్తుందని ఆనంద్ పేర్కొన్నారు. ‘కరీనా కపూర్ మోస్ట్ స్టైలిస్ట్ వుమన్... ఇటీవల లండన్ వెకేషన్లో భాగంగా ఆమెను దగ్గరగా చూసే అవకాశం కలిగింది. మేకప్ లేకుండా కూడా ఆమె చాలా స్టైలిష్ లుక్స్‌తో ఆకట్టుకున్నారు. సో.. నేనైతే ఫ్యాషన్ విషయంలో కరీనానే బెస్ట్ అని చెబుతానని, అలా సోనమ్‌ని తక్కువ చేసి మాట్లాడటం తన ఉద్దేశం కాదని’ ఆనంద్ వ్యాఖ్యానించారు. కాగా ఫ్యాషన్ పట్ల ఇద్దరికి ఉన్న ఆసక్తే తమను ఒక్కటి చేసిందని, ఆనంద్‌ను వివాహం చేసుకోవడానికి అది కూడా ఒక కారణమని ఇటీవలే సోనమ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం భర్త ఇచ్చిన స్టేట్మెంట్కు ఆమె ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి. -
‘పాపం హనీమూన్‌కి తను ఒక్కతే వెళ్లింది’
‘నేను తనను ఒక ప్రాంక్ కాల్ ద్వారా కలిశాను.. రేపు పెళ్లి చేసుకుందాం అని చెప్పాను.. మరుసటి రోజే వివాహం చేసుకున్నాం.. పాపం హనీమూన్‌కి తనోక్కతే వెళ్లింది.. నా గురించి నా కన్నా ఎక్కువ తనకే తెలుసు, తనే నా బలం’ అంటూ భార్య సునీతను పొగడ్తలతో ముంచేత్తుతున్నారు ‘మిస్టర్ ఇండియా’ అనిల్ కపూర్. వివాహం కంటే ముందే ఒక దశాబ్ద కాలంగా అనిల్ కపూర్‌కు సునీతతో పరిచయం. అంటే వీరి ప్రేమకు, స్నేహానికి 45 ఏళ్లు నిండయాన్నమాట. ఇంత అద్భుతమైన సుదీర్ఘ ప్రయాణం గురించి, తన భార్య సునీత గొప్పతనం గురించి సోషల్ మీడియా సాక్షిగా ప్రశంసలు కురిపించారు అనిల్ కపూర్. ‘సినిమాల్లోకి రాకముందే సునీతతో పరిచయం ఏర్పడింది. అది కూడా చాలా విచిత్రంగా. ఇప్పడు ప్రాంక్ కాల్స్ గురించి మాట్లాడుతున్నారు కానీ 45 ఏళ్ల మునుపే మా పరిచయానికి కారణం ప్రాంక్ కాల్. ఆ రోజు సునీతకు ప్రాంక్ కాల్ చేసిన నేను ముందు తన గొంతుతో ప్రేమలో పడిపోయాను. అప్పటికింకా నేను సినిమాల్లోకి రాలేదు. ఇంకా జీవితంలో స్థిరపడలేదు. అయినా తను నన్ను ప్రేమిస్తూనే ఉంది. నన్ను వదిలేయాలని చాలా మంది, చాలా సార్లు ఆమె మీద ఒత్తిడి తెచ్చారు. కానీ తను అలా చేయలేదు. నా జీవితంలో తొలి విజయం ‘మేరి జంగ్’. ఈ చిత్రం విజయం సాధించడంతో పర్వాలేదు ఇప్పుడు పెళ్లి చేసుకోవచ్చు అనిపించింది. వెంటనే సునీతతో మనం రేపు వివాహం చేసుకుందాం అని చెప్పాను. మరుసటి రోజే మేము వివాహం చేసుకున్నాం. అలా విజయం, అదృష్టం(సునీత) రెండు ఒకే ఏడాదిలో నా జీవితంలోకి వచ్చాయి. కానీ వివాహం అయిన మూడు రోజుల్లోనే నేను షూటింగ్‌కు వెళ్లాల్సి వచ్చింది. పాపం తను ఒక్కతే హనిమూన్‌కి విదేశాలకు వెళ్లింది’ అంటూ తమ బంధం గురించి తెలిపారు. బాలీవుడ్లో పర్ఫేక్ట్ జంటల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్నారు సునీత - అనిల్ కపూర్. ఈ విషయం గురించి అనిల్ కపూర్ ‘45 ఏళ్లుగా మా మధ్య ప్రేమ, స్నేహ, గౌరవం కొనసాగుతునే ఉన్నాయి. ఇంత సుదీర్ఘమైన ప్రయాణంలో ఆమె లాంటి వ్యక్తిని మరోకరిని చూడలేదు. ఇంత చక్కని భార్య దొరికినందు వల్లే నా రోజు ఎంతో ఉత్సాహంగా ప్రారంభమవుతుంది. తను మంచి తల్లి, భార్య అన్నింటికి మించి మంచి మనిషి. నా గురించి నా కంటే బాగా తనకే తెలుసు. తనే నా బలం’ అంటూ పోస్టు చేశారు. దీన్ని చూసిన నెటిజన్లు ‘మీ ప్రేమ ఎందరికో ఆదర్శం కావాలి. మరిన్ని సంతోషాలు మీ సొంతం కావాలంటూ’ కామెంట్స్ చేస్తున్నారు.వీరికి ముగ్గురు సంతానం. సునీత - అనిల్ కపూర్లకు ముగ్గురు సంతానం. పెద్ద కూతురు సోనమ్ కపూర్, రియా కపూర్, హర్షవర్ధన్ కపూర్. వీరంతా చిత్ర పరిశ్రమలోనే కొనసాగుతున్నారు. ప్రస్తుతం అనిల్ కపూర్ ‘ఫనే ఖాన్’ చిత్రంలో నటిస్తున్నారు. కూతురు సోనమ్‌తో కలిసి తొలిసారి ‘ఏక్ లడకీ కో దేఖాతో ఏసా లగా’ అనే చిత్రంలోను నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న విడుదల కానున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. -
డేట్ గుర్తు పెట్టుకుంటారా?
నాటి తరం ప్రేమకథతో పాటు ఈ తరం ప్రేమకథను కూడా ఒకే షోలో చూడండి అంటున్నారు ‘ఏక్ లడకీ కో దేఖాతో ఏసా లగా’ టీమ్. అందుకోసం డేట్ కూడా ఫిక్స్ చేశారు. షెల్లీ చోప్రా దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో అనిల్ కపూర్, సోనమ్ కపూర్, రెజీనా, రాజ్‌కుమార్ రావ్, జూహీ చావ్లా ముఖ్య తారలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం రెజీనా, సోనమ్లపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాలో తండ్రి అనిల్ కపూర్‌తో కలిసి తొలిసారి నటిస్తున్నారు సోనమ్ కపూర్. అనిల్ కపూర్‌కు ప్రేయసిగా జూహ్లీ చావ్లా నటించారట. అలాగే రెజీనాకు బీటౌన్‌లో ఫస్ట్ మూవీ ఇది. ఇందులో రాజ్‌కుమార్ రావ్‌కు జోడీగా రెజీనా నటిస్తున్నారు. తొలుత ఈ సినిమాను ఈ ఏడాది అక్టోబర్‌లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ లేటెస్ట్గా ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ‘‘ఫిబ్రవరి 1, 2019 డేట్‌ను మర్చిపోవద్దు. మా సినిమాను అదే రోజున రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు సోనమ్. -
‘దేశవ్యాప్తంగా కౌగిలింతల దినోత్సవం’
కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం ఎంత వాడి వేడి చర్చ జరిగిందో అంత కంటే ఎక్కువ సరదా సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. అవి కూడా ఇంతవరకూ ఎన్నడూ ఏ లోక్‌సభ సమావేశంలో కనిపించని దృశ్యాలు. ఈ రోజు రాహుల్ గాంధీ చేసిన పని లోక్‌సభ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు చేయలేదనుకుంటున్నారు జనాలు. అవిశ్వాస తీర్మానంపై చాలా ఉద్రేకపూరితంగా మాట్లాడిన రాహుల్ గాంధీ చివరలో అనూహ్యంగా సరాసరి మోదీ వద్దకు వెళ్లి ఆయనను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం పక్కన ఉన్న వారిని చూస్తూ కన్నుగీటారు. దాంతో ఇప్పుడు దేశ వ్యాప్తంగా దీని గురించే చర్చ జరుగుతుంది. ఇప్పటికే నెటిజన్లు రాహుల్ చేసిన పనిని విమర్శిస్తుండగా తాజాగా వీరి కోవలోకి బాలీవుడ్ జనాలు కూడా వచ్చి చేరారు. రాహుల్ కౌగిలింత ఫలితంగా నేడు ‘దేశవ్యాప్తంగా కౌగిలింతల దినోత్సవం’ జరుపుకోవాలంటూ పిలుపునిచ్చారు బాలీవుడ్ నటీనటులు. ‘క్వీన్’ నటుడు రాజ్‌కుమార్ రావ్ తన ట్విటర్లో ఓపెనింగ్ షాట్ సన్నివేశాన్ని అనుకరిస్తూ ‘ఈ రోజు కౌగిలింతల దినోత్సవం’ అంటూ ప్రకటించారు. రాజ్ కుమార్ ట్వీట్‌కు స్పందిస్తూ సోనమ్ కపూర్ రెండు హగ్ ఎమోషన్స్‌ను రీ ట్వీట్ చేశారు. వీరిద్దరి ట్వీట్లను అభిమానులు తెగ లైక్ చేస్తున్నారు. Today is official,”Hug day.” 🤗🤗 — Rajkummar Rao (@RajkummarRao) July 20, 2018 🤗 🤗 https://t.co/KLaVs8P8ma — Sonam K Ahuja (@sonamakapoor) July 20, 2018 బీజేపీ రాహుల్ చేసిన పనిని చిన్న పిల్లల చేష్టలా ఉందని విమర్శిస్తున్న నేపధ్యంలో బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దడ్లాని మాత్రం రాహుల్‌కు మద్దతు తెలిపారు. విశాల్ దడ్లాని తన ట్విటర్లో ‘రాహుల్ చేసిన పనిని విమర్శించడం కాదు. ఆలింగనం కంటే ముందు అతని అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మేమంతా దాని కోసం ఎదురు చూస్తోన్నాం’ అంటూ బీజేపీపై మండి పడ్డారు. What's childish about a hug? It was sorta sweet, actually. BJP should accept it with grace & perhaps send some love back, instead of being negative and churlish. Also, it would be more becoming of the govt. to answer each point Rahul made pre-hug. That's what we want to hear. https://t.co/Bl2gM8osPI — VISHAL DADLANI (@VishalDadlani) July 20, 2018 -
‘అందుకే అతన్ని వివాహం చేసుకున్నాను’
సోనమ్ కపూర్ - ఆనంద్ అహుజ రెండు నెలల క్రితం వివాహ బంధంతో ఒక్కటయిన సంగతి తెలిసిందే. వివాహం అయిన దగ్గర నుంచి ఈ జంట ఎప్పటికప్పుడు తమకు సంబంధించిన అంశాలను అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు. సోనమ్ కపూర్ అంటేనే ఫ్యాషన్ ఐకాన్. అయితే మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఆనంద్ అహుజా కూడా ఫ్యాషన్ ప్రియుడే. ఫ్యాషన్ పట్ల ఇద్దరికి ఉన్న ఆసక్తే తమను ఒక్కటి చేసిందింటున్నారు సోనమ్. ఈ విషయం గురించి సోనమ్ తన ట్విటర్లో ఒక సందేశాన్ని పోస్టు చేశారు. దానిలో ‘ఫ్యాషన్ అంటే నాకు ఎంత ఇష్టమో అందరికి తెలిసిన విషయమే. నేను ఆనంద్‌ను వివాహం చేసుకుంది కూడా ఈ కారణం వల్లే. ఎందుకంటే ఆనంద్ ఫ్యాషన్ రంగంలో, రిటైల్ రంగంలో స్థిరపడిన వ్యక్తి కాబట్టి నాకు తొందరగా నచ్చాడు. ఫ్యాషన్ పట్ల ఉన్న ఆసక్తి వల్లే మేము ఇద్దరం వివాహం చేసుకున్నాం’ అంటూ ట్వీట్ చేశారు. ఆనంద్ అహుజా ఢిల్లీకి చెందిన రిటైల్ వ్యాపారి. అంతేకాక దేశంలో తొలి మల్టీ బ్రాండ్ ‘స్నీకర్’ బోటిక్‌ను ప్రారంభించింది కూడా ఆనంద్ అహుజానే. దీంతోపాటు ‘భనే’ అనే బ్రాండ్‌ను కూడా ప్రారంభించారు. ఈ ఏడాది మే 8న సోనమ్ కపూర్ - ఆనంద్ అహుజా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ వేడుకకు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. వివాహం జరిగిన కొద్ది రోజులకే సోనమ్ ‘క్యాన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2018’లో పాల్గొన్నారు. -
అందుకే వరుసగా 8 విజయాలు సొంతమయ్యాయి..!!
బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ తన గారాల కూతురు సోనమ్ కపూర్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. సినీ రంగంలో కూతురి విజయాలను ప్రస్తావిస్తూ ... ‘జీవితాన్ని తీర్చిదిద్దడంలో మన ఎంపిక చేసుకునే అంశాలే కీలక పాత్ర పోషిస్తాయి. సోనమ్.. స్క్రిప్టులు, డైరెక్టర్లు, కంటెంట్ విషయాల్లో నువ్వు చాలా గొప్ప నిర్ణయాలు తీసుకుంటున్నావ్. వృత్తి పట్ల నిబద్ధత, నీ కఠోర శ్రమల ఫలితంగానే వరుసగా 8 విజయాలు నీ సొంతమయ్యాయి...! చాలా సంతోషంగా ఉంది. నిన్ను చూసి నేనెంతో గర్వపడుతున్నాను’ అంటూ అనిల్ కపూర్ ట్వీట్ చేశారు. సోనమ్ హిట్ సినిమాలు... నీర్జా, రాంజానా, భాగ్ మిల్కా భాగ్, ప్యాడ్మాన్, ఖూబ్సూరత్, ప్రేమ్ రతన్ ధన్ పాయో, వీరే ది వెడ్డింగ్, సంజు సినిమాలకు సంబంధించిన పోస్టర్ల ఫొటోల సమాహారాన్ని అనిల్ కపూర్ తన ట్వీట్‌తో పాటుగా షేర్ చేశారు. 2007 లో ‘సావరియా’ సినిమాతో బాలీవుడ్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సోనమ్.. మొదట్లో సరైన హిట్లు లేక సతమతమైంది. కానీ తర్వాత నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంపిక చేసుకుంటూ ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఆమె నటించిన తాజా చిత్రాలు వీరే ది వెడ్డింగ్, సంజులు హిట్ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం రాజ్ కుమార్‌కు జంటగా నటిస్తోన్న ‘ఏక్ లడ్కీ కో దేఖాతో ఐసా లగా’ సినిమాలో సోనమ్ కపూర్ తండ్రితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది . The choices we make shape our lives. @sonamakapoor you have made some pretty damn good ones when it comes to scripts, directors & content...Your hard work, commitment & conviction has resulted in 8 hits in a row! So happy & proud of you! pic.twitter.com/R4LuMIh7oM — Anil Kapoor (@AnilKapoor) July 2, 2018 -
నిట్టూర్పుల తుఫాన్
ఇది షో కాదు. చూపించాలన్న ఆత్రమూ కాదు. సంచలనం కోసం తపనా కాదు. ఇదొక ప్రదర్శన. హక్కుల కోసం ప్రదర్శన. పదేళ్ల, వందేళ్ల, వెయ్యేళ్ల, లక్ష యేళ్ల.. కోటి యేళ్ల నిట్టూర్పుల తుఫాన్. నా కోరికను గుర్తించు.. నన్ను గౌరవించు.. అనే డిమాండ్! ‘వీరె ది వెడ్డింగ్’ అంటే చాలామందికి అర్థం కాలేదు. పంజాబీలో ఆ మాటలో ‘స్నేహితురాలి పెళ్లి’ అని అర్థం. అది ఇటీవల వార్తలలోకి ఎక్కిన బాలీవుడ్ సినిమా. అందులో ఒక స్నేహితురాలి పెళ్లికి ముగ్గురు స్నేహితురాళ్లు హాజరవుతారు. పెళ్లి చేసుకోవాల్సిన స్నేహితురాలికి పెళ్లి మీద పూర్తి సదభిప్రాయం లేదు. ‘కలిసి ఉండటంలోనే సఖ్యత ఉంది కదా’ అంటుంది బాయ్‌ఫ్రెండ్‌తో. కానీ అతడు వినడు. ఆమె ముగ్గురు స్నేహితురాళ్లలో ఒకామె పరమతం వాణ్ని చేసుకుని ఉంటుంది. ఆ పెళ్లికి ఇంట్లో అనుమతి లేదు. పిల్లాడు పుట్టినా ఆమె కుటుంబం ఆమెను స్వీకరించదు. అందుకని ఆమెకు స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. అతిగా తింటూ ఉంటుంది. లావెక్కిపోతూ ఉంటుంది. పైకి ఆనందమే. హుషారే. సడన్‌గా తన స్నేహితురాళ్లతో ‘నాకూ మావారికి మధ్య అది జరిగి సంవత్సరం అవుతోంది తెలుసా’ అంటుంది. ఆ స్నేహితురాళ్లలోనే ఇంకొక ఆమెకు తగిన సంబంధం దొరుకుతుండదు. కాని ఎదిగొచ్చిన వయసుకు అవసరాలు ఉంటాయి. తన బాస్‌తో సంబంధం పెట్టుకుంటుంది. దాని నుంచి బయట పడ్డాక అడపా దడపా వచ్చే అవకాశాలను తిరస్కరించకుండా తప్పా ఒప్పా చర్చ పెట్టకుండా వాటి ప్రమేయాన్ని ‘ఒన్ నైట్ స్టాండ్స్’గా చూస్తూ ఉంటుంది. మరో స్నేహితురాలు తన క్లాస్మేట్ కుర్రాణ్ణే పెళ్లి చేసుకుని ఉంటుంది. కాని అతడు లండన్‌లో. ఈమె ఢిల్లీలో. కలిసి చదువుకున్నారన్న మాటే కాని కలిసి జీవించదగ్గ గట్టి బంధం తమ మధ్య లేదని ఇరువురికీ అర్థమై ఉంటుంది. దాంతో ఆ అమ్మాయి ఫ్రస్ట్రేషన్లో ఉంటుంది. తాగడం, స్మోక్ చేయడం, నలుగురి పట్లా నిర్లక్ష్యంగా ఉండటం... అంత వరకే తెగువ. మరొకరితో సంబంధం పెట్టుకోదు. కాని భర్త ఆమెను నాకు నువ్వు వద్దు అంటాడు. ఎందుకంటే ఆమె తనను తాను తృప్తి పరుచుకుంటూ అతని కంట పడుతుంది. ‘మదర్ ఇండియా’, ‘హమ్ ఆప్ కే హై కౌన్’, ‘హమ్ సాత్ సాత్ హై’... వంటి సినిమాలు తీసే బాలీవుడ్ నుంచి ఇప్పుడు ఇలాంటి సినిమా వచ్చి దిగ్భ్రమ పరచే పరిస్థితి ఏర్పడింది. కథలు అయిపోయాయి. కాదు కాదు... కొత్త కథలు చెప్పే సందర్భాలు వచ్చాయి. పగ, ప్రతీకారాలు, యాక్షన్ డ్రామాలు... ఇవన్నీ కాదు... భూలోకంలో సగం ఉన్న స్త్రీల గురించి మాట్లాడాలి... వాళ్ల ఆలోచనలు ప్రేక్షకులకు చెప్పాలి... వాళ్ల భావావేశాలు జనానికి అర్థం చేయాలి... కొంచెం షాక్ ఎలిమెంట్ ఉన్నా ఇవన్నీ చర్చకు పెట్టాలి అని బాలీవుడ్ అనుకుంటూ ఉంది. ఈ ప్రయత్నాలు మహిళ, పురుష దర్శకులు చేస్తున్నారు. ప్రేక్షకులు కూడా తాము ఎదగక తప్పదు అని గ్రహించి వీటిని క్రమంగా ఆహ్వానించే వైపు కదులుతున్నారు. ‘ఫైర్’తో మొదలు... పురుషాధిక్య సమాజం అనేది పడికట్టు మాటే అయినా అది శక్తివంతమైనది. పురుషాధిక్య సమాజంలో పురుషుల వలన, పురుషుల చేత, పురుషుల కొరకు స్త్రీ వినియోగించబడుతుంటుంది. విలువలు పురుషులకు వేరు స్త్రీలకు వేరు. దీనిని సాహిత్యం చాలానే ప్రశ్నించింది. చలం వంటి తెలుగు రచయితలు పెద్ద భూకంపమే సృష్టించారు. కాని సనాతనమైన హిందీ సినిమా పరంపరను మాత్రం మొదటగా దీపా మెహతా ‘ఫైర్’ (1996) కుదిపి వదిలిపెట్టింది. అందులో పైకి అంతా బాగా కనిపిస్తున్న ఒక సంపన్న ఉత్తరాది కుటుంబంలో ఇద్దరు తోడి కోడళ్లు శారీరకంగా సన్నిహితం అవుతారు. ఈ సినిమా చూసిన వారు ‘అంత అవసరం ఏమొచ్చింది?’ అని కోపంతో ఎగిరి పడ్డారు. కాని దేహ అవసరాలు తీర్చుకోవడం తీర్చుకోకపోవడం పురుషుడి చేతుల్లో ఉంటుంది. ఈ విషయంలో స్త్రీ నిమిత్తమాత్రురాలు. కాని దేహ అవసరాలు అంటే కేవలం దేహ అవసరాలేనా? స్పర్శలో కూడా ఎంతో ప్రేమ, ఓదార్పు, దగ్గరితనం లభిస్తుంది. ఆ మాత్రం స్పర్శకు కూడా స్త్రీలు అలమటించేలా మగవాళ్లు ప్రవర్తిస్తున్నప్పుడు స్త్రీలకు మరో గత్యంతరం లేక దగ్గరైతే ఏమిటి మీరు చేయగలిగేది అని ఈ సినిమా ప్రశ్నించింది. సాంస్కృతికంగా ఈ సినిమా కొట్టిన దెబ్బ నుంచి ఇండస్ట్రీ కోలుకోవడానికి చాలాకాలం పట్టింది. ఆ తర్వాత వినోద్ ఖన్నా, నసిరుద్దీన్ షా నటించిన ‘రిహాయి’ (1988), టబూ నటించిన ‘అస్తిత్వ’ (2000) కూడా స్త్రీలకు సంబంధించిన ప్రశ్నలు ముందు పెట్టాయి. ఆకలి, నిద్ర స్త్రీ, పురుషులకు సమానమైనదైనప్పుడు ఆ మూడోది కూడా స్త్రీకు సమానమైనదే కదా అని ప్రశ్నించాయి. ‘రిహాయి’లో వ్యాపారం కోసం నెలల తరబడి టూర్లు చేసే రాజస్తాన్ వర్తకులు తాము ఎవరితోనైనా సంబంధాలు పెట్టుకోవడం తప్పు అనుకోరు. కాని స్త్రీలు మాత్రం ఇంటి పట్టున ‘పవిత్రం’గా ఉండాలనుకుంటారు. ఈ సినిమాలో వ్యాపారం నుంచి తిరిగి వచ్చిన భర్తకు భార్య తాను గర్భవతిని కాబోతున్నానని తండ్రి నువ్వు కాదని చెప్పి సంచలనం రేపుతుంది. ‘అస్తిత్వ’లో రాత్రయితే ముసుగుతన్ని పడుకునే భర్తను చూసి చూసి ఒక మధ్యతరగతి గృహిణి తన సంగీతం టీచర్‌కు సన్నిహితం అవుతుంది. దీనిని భర్త నిలదీసినప్పుడు అది ఎలా నేరమో చెప్పమని ఆ గృహిణి వాదనలు వినిపిస్తుంది. చాలామేరకు మగవారిని కూడా కన్విన్స్ చేసిన సినిమా ఇది. కోరిక పైకి చెప్పకూడదా? కోరిక వ్యక్తపరిచే హక్కు పురుషుడికే ఉంటుందా? ప్రియురాలుకాని, భార్య కాని తన పురుషుణ్ణి చేయి పట్టుకుని లాగితే ఆమెను బరితెగించిందనే అనుకోవాలా? అనురాగ్ కశ్యప్ ‘దేవ్ డి’ (2009) సినిమా ఈ విషయాన్నే చర్చిస్తుంది. ఆ సినిమాలో అభయ్ డియోల్ హీరో. అతడి చిన్ననాటి స్నేహితురాలికి అతనితో సన్నిహితంగా మెలగాలని చాలా కాలంగా ఉంటుంది. ఆ సంగతి అతడికి చెప్పడమే కాదు ఒక చాపను సైకిల్‌కు కట్టుకుని మరీ పొలాలకు చేరుకుంటుంది. ఇలా కోరికను ఒక స్త్రీ వ్యక్తపరచడం హీరో తట్టుకోలేకపోతాడు. ఆమెను నిర్దాక్షిణ్యంగా తిరస్కరిస్తారు. ‘హనీమూన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్’ (2007) సినిమాలో ఒక స్త్రీ పాత్ర కూడా అత్తామామలు ఉంటే నేను పడక గదిలో స్వేచ్ఛగా ఉండలేకపోతున్నాను... వాళ్లంటే నాకు గౌరవం లేకకాదు... కాని మన సంతోషం కోసం విడిగా ఉందాం అని చెప్పడం పెద్ద సమస్యై కూర్చుంటుంది. ‘మసాన్’ (2007)లో ఒక అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్‌తో ఇద్దరి అంగీకారం ప్రకారం హోటల్లో కలవడానికి నిశ్చయించుకుంటుంది. కాని సంఘం, చట్టం దీనికి అనుమతించవు. పోలీసులు పట్టుకుంటారు. కుర్రాడు భయపడి ఆత్మహత్య చేసుకుంటాడు. ఒక సహజాతం తీర్చుకుంటూ దొరికిపోయిన నేరానికి ఆ అమ్మాయి జీవితాంతం చరిత్రహీనురాలిగా మిగలాల్సి ఉంటుంది. ఆడవాళ్లకు ఇంతింత పెద్ద శిక్షలు వేసే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నిస్తుంది ఈ సినిమా. అన్నీ అతనికేనా? పురుషునికి లైంగిక ఉత్ప్రేరకాలు అనేకం ఉంటాయనీ పుస్తకాలు, వీడియోలు అన్నీ అతని కోసమేననీ స్త్రీలకు ఇవి ఎందుకు నిషిద్ధమో చెప్పాలని ‘లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా’ (2016) ప్రశ్నిస్తుంది. సంఘంలో వితంతువులు, యాభై ఏళ్లు దాటిన వాళ్లు అనంటే వాళ్లకు లైంగిక జీవితం అవసరంలేదన్న భావన ఎందుకు ఉందని కూడా ఈ సినిమా నిలదీస్తుంది. ‘లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా’లో యాభై ఏళ్ల ఒక వితంతువు కోరికతో సతమతమవుతూ అది సక్రమంగా తీరక పెడత్రోవలు తొక్కే విషాదం కనిపిస్తుంది. గత సంవత్సరం వచ్చిన ‘కరీబ్ కరీబ్ సింగిల్’లో హీరోయిన్ ‘నా భర్త మిలట్రీలో చనిపోయాడు. నాకు కోరికలు ఉన్నాయి. పెళ్లి కావాలి’ అని చాలా స్వేచ్ఛగా బాహాటంగా చెబుతుంది. బాలీవుడ్ వీరి గురించే కాదు... శారీరక ఇబ్బందులు ఉండేవారి లైంగిక కాంక్షలను కూడా గట్టిగా చర్చించే ప్రయత్నం చేస్తోంది. సెరిబ్రల్ పాల్సీతో చక్రాల కుర్చీకే పరిమితమైన అమ్మాయి ‘మార్గరిటా విత్ ఏ స్ట్రా’ (2015) సినిమాలో తన మనసుకూ శరీరానికీ కూడా ఒక తోడు కోసం పరితపించడం కనిపిస్తుంది. బాయ్‌ఫ్రెండ్ రిజెక్ట్ చేస్తే తన లాంటి మరో దివ్యాంగురాలికి ఆమె సన్నిహితం అవుతుంది. ఇలాంటి కథలన్నీ ఇంతకు ముందు వెండి తెర మీద చూశామా? ఇప్పుడు చూస్తున్నాం. స్వేచ్ఛా విప్లవం చూడబోతే ఇప్పుడు బాలీవుడ్లో స్వేచ్ఛా విప్లవం నడుస్తున్నట్టుగా ఉంది. స్వేచ్ఛగా తిరిగే తిరగాలనుకునే స్త్రీలు తన శరీరానికి తామే హక్కుదారులం అంటూ వెండి తెర మీద యధేచ్ఛగా కనిపిస్తున్నారు. అయితే వీరు స్వేచ్ఛను ప్రతిపాదిస్తున్నారు తప్ప పతనాన్ని కాదని మనం అర్థం చేసుకోవాలి. ‘పింక్’ సినిమాలో ముగ్గురు ఆడపిల్లలు తాము నచ్చిన అబ్బాయిలతో లైంగికంగా సన్నిహితం కావాలనుకుంటారు. కాని ఒక్క క్షణం వారికి ‘నో’ చెప్పాలనిపిస్తుంది. అక్కడి దాకా వచ్చాక ‘నో’ చెప్పడం ఏంటని అబ్బాయిలు బలవంత పెట్టబోయారు. అది రేప్ కేసుగా మారి పెద్ద చర్చను లేవదీస్తుంది. తమకు ‘నో’ చెప్పే హక్కు కూడా ఉందని ఆడవాళ్లు కెమెరా ద్వారా అరచి చెబుతున్నారని అర్థం చేసుకోవాలి. స్త్రీ, పురుషుడు లోకంలో ఉన్నంత కాలం ఒకరి అవసరం ఒకరికి ఉన్నంత కాలం ఒకరినొకరు మరింత అర్థం చేసుకునే క్రమం నిత్యం సాగుతూనే ఉంటుంది. పురుషుడు మాత్రమే నిజ జీవితంలో కాని స్క్రీన్ మీద కాని ఎక్కువ స్పేస్ ఎల్లకాలం తీసుకోలేడు. మూల్గులకు వేడి నిట్టూర్పులకు అతడు మాత్రమే హక్కుదారుడు కాదని ఎంత త్వరగా గ్రహిస్తే అంతమంచిదని బాలీవుడ్ ది ఎండ్ కార్డ్ వేసి మరీ హెచ్చరిస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో తాజాగా లస్ట్ స్టోరీస్! సినిమా ఎక్కడ విడుదలవుతుంది? అనడిగితే థియేటర్లలోనే కదా! అనే రోజులు పోయాయి. ఇప్పుడు థియేటర్లకు మించి సినిమాకు కొత్త మార్కెట్లు పుట్టుకొచ్చాయి. అమేజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ లాంటివి థియేటర్ స్థానాన్ని ఆక్రమించేస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్ హాలీవుడ్లో ఇప్పటికే పాపులర్ కాగా, తాజాగా ఇది ఇండియన్ మార్కెట్లోకీ వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈమధ్యే నేరుగా విడుదలైన ‘లస్ట్ స్టోరీస్’ సినిమా ఇండియాలో పెద్ద సంచలనం. థియేటర్లలో విడుదల చేయకుండా నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమాను విడుదల చేశారు. కొంచెం కొత్తదనమున్న, యూత్‌ను మాత్రమే టార్గెట్ చేసిన సినిమాలు నేరుగా ఆన్లైన్లో విడుదలవ్వడం కొత్త ట్రెండ్. లస్ట్ స్టోరీస్, బాలీవుడ్‌లోని నలుగురు టాప్ దర్శకులు తీసిన సినిమా. ఇందులో లైంగిక అంశాల మీద ఆడవాళ్ల దృక్పథం ఎలా ఉందీ అన్నది ప్రస్తావించారు. ఇలాంటి సినిమాలకు రానున్న రోజుల్లో నెట్‌ఫ్లిక్స్, అమేజాన్ ప్రైమ్ లాంటివే ఎగ్జిబిషన్ సెంటర్లని ‘లస్ట్ స్టోరీస్’ ప్రూవ్ చేస్తూ నెట్‌ఫ్లిక్స్‌లో జూన్ 15న విడుదలై, సూపర్‌హిట్ అయింది! -
కపూర్ ఫ్యామిలీ నుంచి మరో హీరోయిన్!
సాక్షి, ముంబై : బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్- శ్రీదేవి దంపతుల కూతురు జాన్వీ కపూర్ ‘దడక్’ సినిమాతో ఈ ఏడాది బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. తాజాగా కపూర్ల ఫ్యామిలీ నుంచి మరో అమ్మాయి కూడా ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారని వినికిడి. బోనీ కపూర్ సోదరుడు సంజయ్ కపూర్ కూతురు షనాయాను ఈ ఏడాది హీరోయిన్గా పరిచయం చేసేందుకు కపూర్ల ఫ్యామిలీ సన్నాహాకాలు చేస్తోందట. ఈ విషయం గురించి సంజయ్ కపూర్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ....‘ షనాయా ప్రస్తుతం ప్లస్ టూ పూర్తి చేసింది. అయితే ఏం జరుగుతుందో ముందే ఊహించలేం కదా. తన కెరీర్ గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కానీ కచ్చితంగా తను అనుకున్నది సాధిస్తుంది. ఇప్పటివరకైతే ఏ మూవీకి సైన్ చేయలేదు. అందుకోసం ప్రయత్నాలు జరుగుతున్నాయం’టూ పేర్కొన్నారు. అక్క సోనమ్ పెళ్లిలో, జాన్వీ కపూర్ ‘దడఖ్’ ట్రైలర్ విడుదల సమయంలో ఫొటోగ్రాఫర్ల దృష్టిని ఆకర్షించిన షనాయాకు ఇప్పటికే సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫ్యాలోయింగ్ పెరిగిపోయింది. -
సోనమ్ బర్త్‌డే.. ఆనంద్ ఫన్నీ విషెస్
పుట్టినరోజు పండుగే అందరికీ... మరి అలాంటి ప్రత్యేకమైన రోజున మనకెంతో ప్రియమైన వారితో కలిసి సమయం గడపడమనేది ఒక అందమైన అనుభూతి. ప్రస్తుతం బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్ కాదు కాదు శ్రీమతి సోనమ్ కపూర్ అహుజా ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈరోజు (శనివారం) 33వ వసంతంలోకి అడుగుపెడుతున్న సోనమ్.. తన భర్త ఆనంద్ అహుజాతో కలిసి లండన్‌లో బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సంద్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో సోనమ్ ఫొటో షేర్ చేసిన ఆనంద్.. ‘తన పుట్టినరోజున సోనమ్ కేక్‌ను ఇలా చూస్తూ ఉంటుంది. తనను ఇలా చూడటం నాకు సరదాగా ఉంటుంది’ అంటూ చేసిన కామెంట్ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ‘వీరే ది వెడ్డింగ్’ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేసేందుకు సోదరి రియా కపూర్, కరీనా కపూర్, అర్జున్ కపూర్లతో సోనమ్ లండన్ వెళ్లారు. భార్య బర్త్‌డే సెలబ్రేట్ చేయడం కోసం ఆనంద్ కూడా లండన్ చేరుకున్నారు. అంతేకాకుండా పెళ్లైన తర్వాత మొదటి పుట్టినరోజు కావడంతో జీవితాంతం గుర్తుండిపోయేలా సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేశాడట. -
మిథున్ చక్రవర్తి కొడుకుతో హీరోయిన్ పెళ్లి
సాక్షి, ముంబై : బాలీవుడ్లో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. సోనమ్ కపూర్, నేహా ధూపియాలు గత నెలలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అదే విధంగా కొత్త బంగారు లోకం సినిమా హీరోయిన్ శ్వేతాబసు ప్రసాద్ కూడా త్వరలోనే బాలీవుడ్ దర్శకుడిని వివాహం చేసుకోనున్నట్లు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం మరో హీరోయిన్ మదాలస శర్మ కూడా తన వివాహ తేదీని ప్రకటించేశారు. బాలీవుడ్ సీనియర్ నటుడు, మాజీ ఎంపీ మిథున్ చక్రవర్తి తనయుడు మహాక్షయ్ చక్రవర్తితో జూలై 7న తన వివాహం జరగనున్నట్లు మదాలస శర్మ తెలిపారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన మదాలస.. ‘మూడేళ్లుగా నేను, మహాక్షయ్ రిలేషన్షిప్లో ఉన్నాం. మా రెండు కుటుంబాలు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావడంతో ఈ విషయాన్ని చెప్పగానే వారేమీ ఆశ్చర్యపోలేదు. వారి అంగీకారంతోనే మార్చి నెలలో మహాక్షయ్ ఇంట్లో మా ఎంగేజ్మెంట్ జరిగింది. అందుకే ఇది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అనుకోవచ్చు. అయితే మా వివాహం ఎక్కడ జరుతుందనేది ఇంకా నిర్ణయించలేదు కానీ కచ్చితంగా ముంబైలో మాత్రం జరగదు. డెస్టినేషన్ వెడ్డింగ్‌ను ప్లాన్ చేస్తున్నాం’ అంటూ చిరునవ్వులు చిందించారు. కాగా 2008లో ‘జిమ్మీ’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మహాక్షయ్‌కు.. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ప్రస్తుతం పెద్దగా అవకాశాలేమీ రావడం లేదు. అదే విధంగా 2011లో ‘ఏంజెల్’ సినిమాతో బాలీవుడ్ తెరకు పరిచయమైన మదాలస.. తెలుగుతో పాటు పలు తమిళ చిత్రాల్లో కూడా నటించారు. -
ఆ హీరోయిన్ డ్రెస్‌కి 25 ఏళ్లంట!
ముంబై: ప్రముఖ డైరెక్టర్ శశాంక్ ఘోష్ దర్శకత్వంలో బాలీవుడ్ నటులు సోనమ్ కపూర్, కరీనా కపూర్, స్వరా భాస్కర్, శిఖ తల్సానియా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వీరే ది వెడ్డింగ్’. ఈ మూవీ గత శుక్రవారం విడుదలయి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రం చూసి ప్రతి ఒక్కరు హిరోయిన్ల డ్రెస్ గురించే మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా కరీనా కపూర్ వేసుకున్న డ్రస్‌కి మహిళలు అంతా ఫిదా అయ్యారు. తాజాగా కరినా వేసుకున్న డ్రస్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకి వచ్చింది. ఈ సినిమాలోని వివాహ సన్నివేశంలో కరీనా కపూర్ వేసుకున్న డ్రస్ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అబుజానీ సందీప్ ఖోస్లా డిజైన్ చేశారు. ఆ డ్రస్ చూడడానికి చాలా కొత్తగా, అందంగా ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ డ్రెస్ 25 ఏళ్ల క్రితం డిజైన్ చేసినదట. ఈ విషయాన్ని అబుజానీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘ ఆ డ్రెస్‌ను 25 ఏళ్ల క్రితం డిజైన్ చేశాం. మా ఫాక్టరీలోని ఓ పెట్టెలో దాన్ని ఉంచాం. ఓ రోజు ఫ్యాక్టరీలోని దాచిన దుస్తులన్ని బయటకు తీస్తుండగా నిర్మాత రియా మా ఫ్యాక్టరీకి వచ్చారు. ఆ సమయంలో రియాకు ఆ డ్రెస్ కన్పించింది. దాన్ని బయటికి తీయమని చెప్పారు. అది నచ్చడంతో దానిని లెహెంగాగా డిజైన్ చేయమన్నారు. స్కర్ట్, టాప్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. కేవలం చున్నీని వెరైటీగా డిజైన్ చేశాం. దాన్ని కరినాకు సరిపడేలా డిజైన్ చేశాం. పెళ్లి సీన్లో కరీనా ఆ డ్రెస్‌లో కన్పిస్తుంది’ అని అబుజానీ వెల్లడించారు. మరోవైపు ‘ వీరే ది వెడ్డింగ్’ సినిమా రెండు రోజులకే రూ.22.95 కోట్ల వసూళ్లతో దూసుకెళ్తోంది. వీకెండ్ లోపు 35 కోట్లు దాటేలా ఉందని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. -
వారంతా పని లేని వారే : సోనమ్
ఈ మధ్యకాలంలో సోషల్‌మీడియాలో వచ్చే కామెంట్స్, నెటిజన్లు చేసే ట్రోలింగ్లు సెలబ్రెటిలకు పెద్ద తలనొప్పిగా మారింది. అయితే ఇలాంటి ట్రోలింగ్‌లకు, కామెంట్స్‌ను నేను పట్టించుకోను అంటూ చెప్పుకొచ్చింది అనిల్ కపూర్ గారాలపట్టి సోనమ్‌కపూర్. ఇటివలే వ్యాపారవేత్త ఆనంద్ అహుజాను వివాహామాడిన ఈ సుందరి తాజాగా ‘వీరే దీ వెడ్డింగ్’ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ మొదటిరోజే పదికోట్ల కలెక్షన్స్ సాధించి విమర్శకులను సైతం ఆశ్చర్యపరిచింది. అజయ్ దేవ్‌గణ్ రెయిడ్, అక్షయ్‌కుమార్ ప్యాడ్మాన్ మూవీ తర్వాత ఐదో చిత్రంగా వీరే దీ వెడ్డింగ్ కలెక్షన్స్‌లో టాప్‌లో ఉంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా పాల్గొన్న సోనమ్ కపూర్‌ను.. మంగళసూత్రం చేతికి ధరించడం వల్ల సోషల్‌మీడియాలో తనపై వస్తున్న ట్రోల్స్‌పై ప్రశ్నించగా.. ట్రోలింగ్ చేసే వారంతా పనిలేని వారే. అలాంటి వారు చేసే కామెంట్స్‌కు నేను బాధపడను అని సమాధానమిచ్చింది. ఈ మూవీలో కరీనా కపూర్, సోనమ్ కపూర్, స్వరా భాస్కర్, శిఖాలు ప్రధాన పాత్రల్లో నటించారు. -
అట్టహాసపు పెళ్లిలో చెలిగింతలు
జీవితంలో ఎన్నో కష్టాలుండొచ్చు. బంధుత్వాల భారాలు మోయలేనంతవిగా ఉండొచ్చు. ఎడబాట్లు బాకుల్లా గుచ్చుకోవచ్చు. సంప్రదాయాలు కొరికినట్లు అనిపించొచ్చు. ఒక్కరిగా అనుభవించాలి అంటే నరకమే అనిపించొచ్చు. కానీ ముగ్గురు చెలియలు కష్టాల్ని మరపించే చక్కలిగింతలు పెడుతుంటే ప్రపంచం మళ్లీ అందంగా అనిపిస్తుంది. బంధాలు మరోసారి తియ్యగా అనిపిస్తాయి. ‘వీరె ది వెడ్డింగ్’ అలాంటి అనుభూతుల ‘చెలిగింతలు’... ఇవాళ రేపు రక్త సంబంధాలు నిర్వచించడానికి కష్టంగా ఉంటున్నాయి. దగ్గరి సంబంధాలు అర్థం చేసుకోవడంలో విఫలం అవుతున్నాయి. ఆధునిక జీవితంలో మనిషి ఒంటరి అవుతున్నాడు. అతణ్ణి అంతో ఇంతో కాపాడుతున్నది స్నేహ సంబంధాలే. నలుగురు స్నేహితురాళ్లు ఒకరికొకరు నిలబడి ఒకరి సమస్యలను మరొకరు అర్థం చేసుకోవడానికి, ఒకరికొకరు ధైర్యం చెప్పుకోవడానికి ప్రయత్నించిన కథే ‘వీరే ది వెడ్డింగ్’. హిందీ సినిమాలలో కొత్త ధోరణిలో కథలు చెప్పడానికి చేస్తున్న ప్రయత్నాలలో ఇది ఒక కొనసాగింపు. ‘లైంగిక నిస్పృహ’, ‘ఫ్రీ సెక్సువల్ ఎక్స్ప్రెషన్’ సినిమాల్లో చూపించడానికి బాలీవుడ్ ప్రయత్నిస్తోందనడానికి కూడా ఈ సినిమా ఒక ఉదాహరణ. కరీనా కపూర్, సోనమ్ కపూర్, స్వర భాస్కర్ వంటి మంచి ఆర్టిస్టులు ఉండటం వల్ల ఈ సినిమా ప్రేక్షకులను కూర్చోబెట్టడంలో సఫలమైందనే చెప్పాలి. శుక్రవారం ఈ సినిమా విడుదలైంది. దర్శకుడు ‘శశాంక్ ఘోష్’. కథ.. కాళింది పూరి (కరీనా కపూర్), అవ్ని మల్హోత్రా (సోనమ్ కపూర్), సాక్షి సోనీ (స్వర భాస్కర్) , మీరా (శిఖా తల్సానియా) ఈ నలుగురు చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్. అందరూ ఎవరికి వారు ఇండిపెండెంట్‌గా ఉండాలనుకొనే మనస్తత్వం ఉన్నవారు. నలుగురిలో ఒకరైన కాళింది చిన్న వయస్సులోనే తల్లిని పోగొట్టుకుంటుంది. మరో పెళ్లి చేసుకున్న తన తండ్రితో అంతంత మాత్రమే సంబంధ భాందవ్యాలుంటాయామెకు. తండ్రికి, బాబాయ్‌కు ఆస్తి గొడవలు జరిగి తను పెరిగిన ఇల్లు శాంతి నివాసానికి కోర్టు తాళం వేస్తుంది. ఢిల్లీ నుండి వెళ్లిపోయి ఆస్ట్రేలియాలో ఉంటుంది కాళింది. అక్కడ ఓ రోజు ఆమె బోయ్ ఫ్రెండ్ రిషబ్ మల్హోత్రా (సుమిత్ వ్యాస్) మ్యారేజ్ ప్రపోజల్ పెడతాడు (అప్పటికే వారిద్దరూ రిలేషన్ షిప్లో ఉంటారు). ప్రపోజల్‌కి కారణం ఇంట్లో పెద్ద వాళ్లు ఒత్తిడి చేస్తుంటారు. ‘ఇప్పుడు ఇలా బాగానే ఉంది కదా పెళ్లెందుకు. పెళ్లి చేసుకుంటే లేనిపోని చిక్కుల్లో పడతాం’ అంటుంది కాళింది. కానీ తన ఇంట్లో వాళ్లకోసం సంప్రదాయం పేరు చెప్పి ఆమెతో సరే అనిపిస్తాడు రిషబ్. ఆ విషయాన్ని తన స్నేహితురాళ్లకు చెప్పి అందర్నీ తన వివాహానికి ఆహ్వానిస్తుంది. అక్కడ నుండి కథ ఇండియాకు (ఢిల్లీ) వస్తుంది. అప్పటికే మిగతా ముగ్గురు ఫ్రెండ్స్‌లో ఒకరైన మీరాకి ఒక ఆంగ్లో ఇండియన్‌తో పెళ్లయి ఒక బాబు ఉంటాడు. మరో స్నేహితురాలు సాక్షికి లండన్‌లో ఉన్న బిజినెస్ మేన్‌తో పెళ్లయి వాళ్లిద్దరి మధ్య వచ్చిన మనస్పర్థల కారణంగా తన తల్లిదండ్రుల ఇంట్లో ఉంటుందామె. ఆ బాధలో ఆమె ఎప్పుడూ తాగుతూ పర్వర్టెడ్లా మారిపోతుంది. ఇక మిగిలిన స్నేహితురాలు అవ్ని ఢిల్లీ కోర్టులో లాయర్‌గా (విడాకులు ఇప్పించే లాయర్) పని చేస్తుంటుంది. ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ స్కైప్‌లో మాట్లాడుకోవలసిందే ఆ మిత్రబృందం. పెళ్లి హడావిడి.... మామూలుగా ‘పెళ్లి’ అంటే సింపుల్‌గా గుళ్లో అయినా చేసుకోవచ్చు. కానీ దాన్ని అట్టహాసంగా చేస్తే అదో పెద్ద తంతు. ఇక్కడే మన హీరోయిన్ కాళిందికి కాలింది. ప్రతి చిన్న విషయాన్ని ధూమ్ ధామ్ చేద్దాం అనుకునే వరుడి తరఫున తల్లిదండ్రులు, చుట్టాలు హడావిడి. ఉదాహరణకు కాళింది, రిషబ్ ఆస్ట్రేలియా నుండి ఇండియా చేరుకోగానే ఎయిర్‌పోర్ట్‌లోనే కార్యక్రమాల హడావిడి షురూ అవుతుంది. తన కాబోయే కోడలికి పూజారితో తిలకం దిద్దించడం నుంచి నగలు పెట్టడం దాకా అన్ని కార్యక్రమాలతోటి చాలా హడావిడి చేస్తుంటుంది రిషబ్ తల్లి. ఇదంతా తనకు చాలా ఇబ్బందిగా ఉందని, తనవల్ల కాదని రిషబ్‌కు చెప్తుంది కాళింది. ఓ నాలుగు రోజులు కళ్లు మూసుకుంటే అన్ని కార్యక్రమాలు శుభ్రంగా ముగిసిపోతాయి... మన దారిన మనం హ్యాపీగా ఆస్ట్రేలియా వెళ్లిపోవచ్చు... సర్దుకుపోవాలని చెప్తాడతను. రిషబ్ తన మీద చూపించే ప్రేమ కోసం అన్నిటికీ సరేనంటు ఒప్పుకొంటుంది కాళింది. సంగీత్ కార్యక్రమాన్ని రెండు కోట్ల రూపాయల ఖర్చుతో ఏర్పాటు చేస్తారు పెళ్లికొడుకు తరఫువారు. ఆ సందర్భంగా అందరూ పార్టీలో ఉంటే రిషబ్, కాళింది మాత్రం స్టేజీ మీద నుండే గొడవ పడుతుంటారు. ఆమె తొడుక్కునే రింగ్ విషయంలోనే వారిద్దరి మధ్య జరిగిన చిన్న గొడవ కారణంగా ఆ కార్యక్రమమంతా రభసగా మారుతుంది. అక్కడి నుండి ఒక్కొక్కరు ఓ రకంగా బయటì కెళతారు. ఈ గొడవలు, గందరగోళం అంతా పెళ్లి వల్లే అందుకే ఇవేవీ వద్దు నా దారిన నేను ఆస్ట్రేలియా వెళతాను అనుకుని తన స్నేహితులకు చెప్పి బయలుదేరుతుంది కాళింది. ఆమె పెళ్లి చేసుకోకుండానే ఆస్ట్రేలియా వెళ్లిపోయిందా? తన తండ్రితో తన రిలేషన్ ఎలా ఉంది? చివరకు తను పుట్టి పెరిగిన ఇల్లు తన చేతికి వస్తుందా? స్నేహితురాళ్లంతా ఆమె కోసం ఏం చేశారు? అనేది మనం సినిమా థియేటర్లోనే చూడాలి. సినిమా ప్లస్ పాయింట్స్... ∙యూత్‌ని ఎట్రాక్ట్ చేసే మ్యారేజ్ కాన్సెప్ట్ ∙బోల్డ్ డైలాగ్స్ ∙కెమెరా వర్క్ ∙కలర్‌ఫుల్ కాస్టూమ్స్ మైనస్ పాయింట్స్... స్లో న్యారేషన్. తారాగణం : కరీనా కపూర్, సోనమ్ కపూర్, స్వరా భాస్కర్, శికా తల్సానియా దర్శకుడు : శశాంక్ ఘోష్ నిర్మాణం : బాలాజీ మోషన్ పిక్చర్, అనిల్‌కపూర్ ఫిల్మ్స్ కెమెరా : సుధాకర్ రెడ్డి యాకంటి – శివ మల్లాల -
ఫ్రెండ్ కోసం పెళ్లి తేదీ మార్చుకున్న హీరోయిన్
సాక్షి, ముంబై : జీవితంలో అత్యంత ముఖ్యమైన వేడుకగా భావించే వివాహానికి ప్రాణ స్నేహితులు, సమీప బంధువులు రాలేరని తెలిస్తే మనసు చిన్న బుచ్చుకోవడం సహజం. వారి కోసం వివాహ తేదీలో మార్పు చేసుకోవడమంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే. అయితే సోనమ్ కపూర్ ఇందుకు మినహాయింపు. స్నేహితురాలి కోసం ఏకంగా పెళ్లి తేదీనే మార్చుకున్నారు. అసలు విషయమేమిటంటే.. ఈనెల (మే) 8న తేదీన సోనమ్ కపూర్ పెళ్లి వ్యాపారవేత్త ఆనంద్ అహుజాతో జరిగిన విషయం తెలిసిందే. అయితే వారి వివాహం మార్చి 12నే జరగాల్సిందట. కానీ ఆరోజే సోనమ్ స్నేహితురాలు స్వరా భాస్కర్ సోదరుడు ఇషాన్ వివాహం జరగనుండడంతో.. సోనమ్ తల్లిదండ్రులను ఒప్పించి మరీ వివాహ తేదీని మే 8కి మార్పించారట. తాజాగా ఈ విషయాన్ని స్వరా భాస్కర్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ‘వీరే ది వెడ్డింగ్’ సినిమా షూటింగ్ సమయంలో ఒకరోజు సోనమ్ చాలా డల్‌గా కన్పించింది. ఇషాన్ వివాహ తేదీని మార్చాల్సిందిగా నా తల్లిదండ్రులను ఒప్పించమని నన్ను అడిగింది. అలా కుదరకపోవడంతో తనే పెళ్లి తేదీని మార్చుకుని స్వీట్ షాక్ ఇచ్చిందంటూ’ స్వరా భాస్కర్ తమ మధ్య ఉన్న స్నేహబంధం గురించి చెబుతూ మురిసిపోయారు. -
మళ్లీ సిగరెట్ కాల్చను!
‘‘అవును.. ఇకపై సినిమాల్లో నా క్యారెక్టర్ కోసం సిగరెట్ కాల్చను. ఎవరైనా అలాంటి క్యారెక్టర్ నాకు ఆఫర్ చేస్తే సింపుల్‌గా నో అని చెప్తా’’ అంటున్నారు బాలీవుడ్ బ్యూటీ స్వరా భాస్కర్. ఇంతకీ ఈ బ్యూటీ సిగరెట్ ఎందుకు వెలిగించారంటే ‘వీరే ది వెడ్డింగ్’ సినిమా కోసం. శశాంక్ ఘోష్ దర్శకత్వంలో సోనమ్ కపూర్, కరీనా కపూర్, స్వరా భాస్కర్, శిఖా తల్సానీయా ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘వీరే ది వెడ్డింగ్’. శిఖా తల్సానియా వెడ్డింగ్ చుట్టూ సాగనున్న ఈ సినిమాలో చైన్ స్మోకర్గా కనిపించనున్నారట స్వరా భాస్కర్. ఈ సినిమాకు సంబంధించిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ– ‘‘ఇందులో ఓ సీన్ కోసం డైరెక్టర్ నన్ను స్మోక్ చేయమన్నారు. నా ఎంటైర్ లైఫ్‌లో మోస్ట్ వరస్ట్ టేస్ట్ అనిపించింది. కొన్నిసార్లు నువ్వు సరిగా స్మోక్ చేయడం లేదని డైరెక్టర్ అన్నారు. ఆ తర్వాత ఆయన్ని ఎలాగో కన్విన్స్ చేయగలిగాను. కానీ ఇప్పుడు ఎవరైనా స్మోక్ చేసే క్యారెక్టర్ ఇస్తే.. నాకు అవసరం లేదని తేల్చి చెప్పేస్తాను’’ అని చెప్పారు స్వరా భాస్కర్. ‘వీరే ది వెడ్డింగ్’ సినిమా జూన్ 1న విడుదల కానుంది. -
స్క్రీన్ టెస్ట్
1 ప్రముఖ నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి రాసిన రచనల్లో సినిమాగా వచ్చిన మొదటి నవల ఏది? ఎ) మీనా బి) రాధాకృష్ణ సి) సెక్రటరీ డి) అగ్నిపూలు 2 సులోచనారాణి నవలా చిత్రాల్లో ఎక్కువగా నటించిన తెలుగు హీరో ఎవరో కనుక్కోండి? ఎ) ఎన్టీఆర్ బి) కృష్ణ సి) చిరంజీవి డి) అక్కినేని నాగేశ్వరరావు 3 ‘ఇడియట్’ సినిమా హీరోగా రవితేజకు, దర్శకుడిగా పూరి జగన్నాథ్‌కు మైల్స్టోన్ లాంటిది. కానీ మొదట ఆ సినిమాను కన్నడ భాషలో తీశారు పూరి. ఆ సినిమా ద్వారా పరిచయమైన హీరో ఎవరో తెలుసా? ఎ) ఉపేంద్ర బి) శివ రాజ్‌కుమార్ సి) పునీత్ రాజ్‌కుమార్ డి) సుదీప్ 4 సులోచనారాణి రాసిన ‘గిరిజా కల్యాణం’ నవల ఆధారంగా రూపొందిన ‘గిరిజా కల్యాణం’ చిత్రంలో హీరోయిన్గా నటించిందెవరు? ఎ) జయసుధ బి) జయప్రద సి) వాణిశ్రీ డి) జయలలిత 5 బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సంజు’. ఈ చిత్రంలో టైటిల్ రోల్ చేస్తోన్న హీరో ఎవరు? ఎ) రణ్‌బీర్ కపూర్ బి) అర్జున్ కపూర్ సి) షాహిద్ కపూర్ డి) సంజయ్ కపూర్ 6 తేజ దర్శకత్వంలో వచ్చిన ‘జయం’ సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యారు నితిన్. కానీ ఆ సినిమాలో మొదట హీరోగా అనుకున్నది నితిన్‌ని కాదు. మరి ఆ హీరో ఎవరయ్యుంటారు? ఎ) ప్రభాస్ బి) అల్లు అర్జున్ సి) ఉదయ్ కిరణ్ డి) గోపీచంద్ 7 నాగులపాటి శ్రీనివాస చక్రవర్తి ఈ నటుని అసలు పేరు. ఎవరా నటుడు? ఎ) కల్యాణ్ చక్రవర్తి బి) శ్రీకాంత్ సి) జేడీ చక్రవర్తి డి) రామ్కీ 8 దర్శకురాలు నందినీ రెడ్డి తన కొత్త ప్రాజెక్టును వైజయంతి మూవీస్‌లో చేస్తున్నారు. ఆ చిత్రంలో హీరో ఎవరో తెలుసా? ఎ) నానీ బి) నాగశౌర్య సి) విజయ్ దేవరకొండ డి) దుల్కర్ సల్మాన్ 9 అల్లు అర్జున్ సరసన ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాలో ఓ హీరోయిన్గా కేథరిన్ థెరిస్సా నటించారు. మరో హీరోయిన్ ఎవరు? ఎ) దిశా పాట్ని బి) ఇలియానా సి) అమలా పాల్ డి) మన్నారా చోప్రా 10 65వ జాతీయ చలనచిత్ర అవార్డ్సులో ‘బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఇన్ తెలుగు’ అవార్డును సొంతం చేసుకున్న చిత్రమేదో చెప్పుకోండి చూద్దాం? ఎ) శతమానం భవతి బి) ఘాజీ సి) పెళ్లి చూపులు డి) బాహుబలి 11 యద్దనపూడి సులోచనారాణి అమెరికాలోని ఏ రాష్ట్రంలో స్వర్గస్తులైనారోతెలుసా? ఎ) టెక్సాస్ బి) డల్లాస్ సి) కాలిఫోర్నియా డి) వాషింగ్టన్ 12 ‘గంగోత్రి’ నుండి ‘నా పేరు సూర్య–నా ఇల్లు ఇండియా’ వరకు హీరోగా అల్లు అర్జున్ ఎన్ని చిత్రాల్లో నటించారో తెలుసా? (అతిథి పాత్రలు కాకుండా) ఎ) 18 బి) 24 సి) 26 డి) 21 13 కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘స్వాతిముత్యం’ సినిమాలో హీరోయిన్ రాధిక. ఆ సినిమా హిందీ రీమేక్ ‘ఈశ్వర్’లో నటించిన హీరోయిన్ ఎవరో కనుక్కోండి? ఎ) రాధిక బి) రాధ సి) గీత డి) విజయశాంతి 14 íహీరోలు సిక్స్ ప్యాక్ చేయడం కామన్. అలాంటిది కమెడియన్పాత్రలతో పైకొచ్చిన ఈ నటుడు సిక్స్ ప్యాక్ చేశారు. ఎవరతను? ఎ) ‘వెన్నెల’ కిశోర్ బి) శ్రీనివాసరెడ్డి సి) సునీల్ డి) అలీ 15 రీసెంట్గా ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ అహూజాను పెళ్లాడిన బాలీవుడ్ నటి ఎవరో తెలుసా? ఎ) ప్రియాంకా చోప్రా బి) సోనమ్ కపూర్ సి) అనుష్కా శర్మ డి) కత్రినా కైఫ్ 16 సులోచనా రాణి సెక్రటరీ నవలను అదే పేరుతో సినిమాగా తీశారు డి. రామానాయుడు. అక్కినేని, వాణిశ్రీల కాంబినేష లో ఆయన ఈ చిత్రాన్ని ఏ దర్శకునితో నిర్మించారో తెలుసా? ఎ) ఎ.కోదండ రామిరెడ్డి బి) కె.యస్.ప్రకాశ్‌రావు సి) కె.రాఘవేంద్రరావు డి) ప్రత్యగాత్మ 17 ‘బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోని హీరో కాకముందు ఓ శాఖలో మంచి టెక్నీషియన్. ఏ శాఖలో ఆయన పని చేశారో తెలుసా? ఎ) ఫైట్ మాస్టర్ బి) సింగర్ సి) సంగీత దర్శకుడు డి) ఎడిటర్ 18 ‘మీనా’ చిత్రదర్శకురాలెవరో కనుక్కోండి? చిన్న క్లూ: దర్శకురాలిగా ఆమెకది మొదటి సినిమా ఎ) సావిత్రి బి) జమున సి) అంజలీ దేవి డి) విజయ నిర్మల 19 ఈ ఫొటోలోని చిన్నారి ఎవరు? ఎ) అనుష్క బి) త్రిష సి) ఆలియాభట్ డి) సమంత 20 పై స్టిల్‌లో ఉన్న ప్రముఖ నటుడెవరో తెలుసా? ఎ) రేలంగి బి) రాజనాల సి) పధ్మనాభం డి) రమణా రెడ్డి మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) ఎ 2) డి 3) సి 4) బి5) ఎ 6) బి 7) సి 8) సి 9) సి 10) బి 11) సి 12) డి 13) డి 14) సి 15) బి 16) బి 17) సి 18) డి 19) ఎ 20) ఎ నిర్వహణ: శివ మల్లాల -
మల్టీ టాస్కింగ్ సోనమ్...!!
ముంబై : ప్రతీ ఒక్కరి జీవితంలో వివాహమనేది మధుర ఙ్ఞాపకం. వివాహం కొత్త బంధాలతో పాటు బాధ్యతలు కూడా తీసుకువస్తుంది. ఈ విషయంలో సెలబ్రిటీలైనా, సామాన్యులైనా సమానమే. అందుకు బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్... కాదు కాదు శ్రీమతి సోనమ్ కపూర్ అహుజా తాను కూడా మినహాయింపు కాదంటున్నారు. సోనమ్ కపూర్ ఈ నెల 8న వ్యాపారవేత్త ఆనంద్ అహుజాను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లైన వెంటనే కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు వెళ్లిన సోనమ్ అక్కడి నుంచి తిరిగి రాగానే.. ‘వీరే ది వెడ్డింగ్’ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటూ బిజీబిజీగా గడుపుతున్నారు. అంత బిజీ షెడ్యూల్లోనూ భార్యగా తన వంతు బాధ్యత నిర్వహిస్తున్నారు. వ్యాపారంతో నిత్యం బిజీగా ఉండే తన భర్త ఆనంద్‌ను రిసీవ్ చేసుకోవడానికి ఆమె ముంబై ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లారు. భర్తను చూడగానే సంతోషంతో సోనమ్ ముఖం వెలిగిపోయింది. అంతే ఇక ఈ కొత్త జంటను కెమెరాల్లో బంధించడానికి ఫొటోగ్రాఫర్లు పోటీ పడ్డారు. ప్రస్తుతం వీరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులను అలరిస్తున్నాయి. పెళ్లి, కెరీర్ ఈ రెండింటినీ సమన్వయం చేసుకోవడం కాస్త కష్టమైన విషయమే. కానీ అర్థం చేసుకునే జీవిత భాగస్వామి దొరికితే అదేమంత పెద్ద విషయం కాకపోవచ్చు. ఈ విషయంలో సోనమ్ అదృష్టవంతురాలే అనుకోవచ్చంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
డాడీ టెన్షన్
జూన్ 1 దగ్గర పడుతున్న కొద్దీ అనిల్ కపూర్‌కి ఎగై్జట్‌మెంట్, టెన్షన్ రెండూ పెరిగిపోతున్నాయట. కారణం ఏంటంటే.. అనిల్ కపూర్ పిల్లలు సోనమ్ కపూర్, హర్షవర్ధన్ కపూర్ నటించిన సినిమాలు ఒకే రోజు రిలీజ్ కావడమే. మొదట సోనమ్ నటించిన ‘వీరే దీ వెడ్డింగ్’ రిలీజ్‌ను జూన్ 1న, హర్షవర్ధన్ సూపర్ హీరో మూవీ ‘బావేష్ జోషీ’ సినిమాను మే 25న రిలీజ్ చేయాలనుకున్నారు. బట్ సడన్‌గా ‘బావేష్ జోషీ’ సినిమాను జూన్ 1కి రిలీజ్ డేట్ చేంజ్ చేశారు. పిల్లల సినిమా రిలీజ్ అంటే సాధారణంగా ఆత్రుతగా ఉంటుంది. కానీ ఇద్దరి సినిమాలూ ఒకే రోజు రిలీజ్ కానుండటంతో కొంచెం టెన్షన్‌గా కూడా ఉంది అంటున్నారు అనిల్. ఈ విషయం గురించి అనిల్ కపూర్ మాట్లాడుతూ – ‘‘రిలీజ్ డేట్స్ ఎప్పుడూ యాక్టర్స్ చేతిలో ఉండవు. సినిమా నిర్మించిన స్టూడియోస్, డిస్ట్రిబ్యూషన్ కంపెనీల మీద ఆధారపడి ఉంటాయి. యాక్టర్‌గా నేనా విషయాన్ని గౌరవిస్తాను. పిల్లలిద్దరికీ ఆల్ ది బెస్ట్. అంతా మంచే జరుగుతుందని కోరుకుందాం’’ అని పేర్కొన్నారు. ‘వీరే దీ వెడ్డింగ్’కి అనిల్ కపూర్ మరో కూతురు రియా కపూర్ నిర్మాతల్లో ఒకరు కావడం విశేషం. ‘‘వీరే దీ వెడ్డింగ్’ రిలీజ్ డేట్‌ను రియా, ఏక్తా కపూర్ కలసి నిర్ణయించారు. నేను ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు’’ అని పేర్కొన్నారు అనిల్ కపూర్. -
‘ఆనంద్ అహుజా, ఇది మనకోసం’
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో కొత్త పెళ్లి కూతురు సోనమ్ జిల్జిగేల్మనించారు. వ్యాపారవేత్త ఆనంద్ ఆహుజాను పెళ్లాడిన వెంటనే కేన్స్ ఫెస్టివల్లో వాలిపోయిన ఈ అమ్మడు, కలర్‌ఫుల్ గౌన్లలో దర్శనమిస్తూ తొలి రోజు నుంచి చూపర్లకు మతి పోగొట్టారు. ఇక చివరి రోజు కేన్స్ ఫెస్టివల్లో ఈ అమ్మడుకు స్పెషల్ సర్ప్రైజే అందింది. సోనమ్ ఎండోర్సస్ చేసుకున్న కాస్మోటిక్ బ్రాండ్ స్పెషల్ కేక్ కటింగ్ వేడుకతో ఈ నటికి సర్ప్రైజ్ ఇచ్చింది. ఎల్ ఓరియల్ అనే కాస్పొటిక్ బ్రాండ్ తరుపున ప్రస్తుతం సోనమ్ కేన్స్ ఫెస్టివల్లో పాల్గొన్నారు. పెళ్లి అయిన తర్వాత వెంటనే తమ సంస్థ తరుఫున ఫెస్టివల్లో పాల్గొనడంతో, సోనమ్ కపూర్ చేత పెళ్లి కానుకగా అతిపెద్ద కేక్‌ను కటింగ్ చేయించారు. ఈ కేక్‌ను లిప్‌స్టిక్‌లతో అలకరించారు. ఎల్ ఓరియల్ ఇచ్చిన ఈ సర్ప్రైజ్ను సోనమ్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తన భర్త ఆనంద్ ఆహుజాకు ట్యాగ్ చేస్తూ...‘ఇది మనకోసం’ అని పోస్టు చేశారు. కేన్స్ ఫెస్టివల్ అనంతరం సోనమ్ త్వరలో థియేటర్లలోకి రాబోతున్న ‘వీరే ది వెడ్డింగ్’ సినిమా ప్రమోషన్లో పాల్గొననున్నారు. సోనమ్‌తో పాటు ఈ సినిమాలో కరీనా కపూర్, స్వరా భాస్కర్, శిఖాలు ప్రధాన పాత్రల్లో నటించారు. భిన్న మనస్తత్వాలు కలిగిన నలుగురు యువతుల జీవితాల్లో చోటు చేసుకున్న సంఘటనలు, వారు ఎదుర్కొన్న పరిణామాల సమాహారమే ఈ సినిమా. జూన్ 1న ఈ సినిమా విడుదల కాబోతుంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సోనమ్ పాల్గొనడం ఇది ఎనిమిదో సారి. -
అది నా వ్యక్తిగత నిర్ణయం : సోనమ్
అనిల్ కపూర్ గారాల పట్టి సోనమ్ కపూర్ వివాహం ఈనెల(మే) 8న వ్యాపారవేత్త ఆనంద్ అహుజాతో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. పెళ్లి తంతు ముగిసిన వెంటనే సోనమ్.. ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో తన పేరును సోనమ్ కె అహుజాగా మార్చుకున్నారు. అయితే సోనమ్ ఈ నిర్ణయంపై ఆమె అభిమానులు, ఫెమినిస్టులు మండిపడుతున్నారు. ఫెమినిస్ట్‌గా గుర్తింపు పొందిన మీరు ఇలా ఎలా చేస్తారంటూ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై సోనమ్ స్పందించారు. ప్రస్తుతం కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో పాల్గొనేందుకు వెళ్లిన సోనమ్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను చాలా రోజుల క్రితమే ఓ స్పష్టమైన నిర్ణయానికి వచ్చాను. దీర్ఘకాలం నుంచి రిలేషన్ షిప్లో ఉన్న నేను.. ప్రస్తుతం పెళ్లి చేసుకున్నాను. ఇక ఇంటి పేరు మార్చుకోవడం అనేది వ్యక్తిగతమైన అంశ’మంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ‘ఫెమినిజం అనే కాన్సెప్ట్‌ను సరిగా అర్థం చేసుకోలేని వాళ్లు ఆన్‌లైన్‌కు వెళ్లి ఓసారి చెక్ చేయాలి. అయినా ఆనందే నా పేరు మార్చాడని మీకెలా తెలుసంటూ’ ఘాటుగా స్పందించారు. -
సోనమ్ సందడి
‘ఫ్యాషన్ ఐకాన్’ సోనమ్ కపూర్ ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా కాన్స్ చలన చిత్రోత్సవాల్లో సందడి చేస్తున్నారు. ఓ సౌందర్య సాధనానికి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న సోనమ్ ఆ బ్రాండ్‌ని ప్రమోట్ చేయడానికి ప్రతి ఏడాది కాన్స్ చలన చిత్రోత్సవాల్లో పాల్గొంటారు. ఈసారి కూడా అలానే వెళ్లారు. దాంతో పాటు ఫ్రెంచ్ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన ‘చారిటీ డిన్నర్’లో కూడా పాల్గొన్నారామె. రెడ్ కార్పెట్‌పై అందంగా క్యాట్ వాక్ చేసి, అందర్నీ ఆకట్టుకున్నారు. అందరితో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు. కాన్స్ ఉత్సవాల్లో పాల్గొన్న పాకిస్తానీ యాక్ట్రెస్ మహీరా ఖాన్‌కు ఆత్మీయంగా ముద్దు పెట్టారు. 2011 నుంచి ప్రతి ఏడాదీ సోనమ్ కాన్స్ చిత్రోత్సవాల్లో పాల్గొంటున్నారు. మహీరా ఖాన్‌కి ఇదే ఫస్ట్ టైమ్. అయినప్పటికీ ఎంతో ఆత్మవిశ్వాసంతో మహీరా రెడ్ కార్పెట్‌పై అడుగులు వేసి, భేష్ అనిపించుకున్నారు. అన్నట్లు.. రేపు సోనమ్ ఇండియా వచ్చేస్తారు. -
ఇక నో సీక్రెట్
తన చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ నటాషా దలాల్‌తో వరుణ్ ధావన్ లవ్‌లో ఉన్నారని ఎప్పట్నుంచో బీటౌన్ మీడియా కోడై కూస్తోంది. వరుణ్, నటాషా కెమెరా కంట పడకుండా అప్పుడప్పుడు రెస్టారెంట్స్, థియేటర్స్‌కు సీక్రెట్‌గా వెళుతున్నారని కూడా వార్తలు షికారు చేస్తున్నాయి. ఇప్పుడు సీక్రెట్ మీటింగ్స్‌కి ఫుల్స్టాప్ పెట్టిందీ జంట. సోనమ్ కపూర్, ఆనంద్ అహూజా రిసెప్షన్ వేడుకకు వీరిద్దరూ జోడీగా హాజరయ్యారు. దీంతో ఇక నో సీక్రెట్స్ అని చెప్పకనే చెప్పారు వరుణ్ అండ్ నటాషా. ఇలా జంటగా నలుగురికీ కనిపించడంతో వరుణ్, నటాషా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబో తున్నారన్న కొత్త రాగం బాలీవుడ్లో మొద లైంది. రీసెంట్గా తాను హీరోగా నటించిన ‘అక్టోబర్’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ ఏడాదిలో వివాహం చేసుకుంటానేమోనని వరుణ్ చెప్పడం విశేషం. ఈ సంగతి ఇలా ఉంచితే.. ప్రస్తుతం అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో ‘కళంక్’ సినిమాలో నటిస్తున్నారు వరుణ్«. ఈ సినిమాలో న్యూ లుక్ కోసం ఆయన స్పెషల్ వర్కౌట్స్ చేస్తున్నారు. -
సోనమ్ పెళ్లిలో ‘ఖాన్’ల హవా!
బాలీవుడ్లో సోనమ్ కపూర్ ఆనంద్ అహుజాల పెళ్లి ఘనంగా జరిగింది. బాలీవుడ్లో ఎక్కడ చూసినా... మొత్తం ఈ పెళ్లికి సంబంధించిన ముచ్చట్లే వినబడుతున్నాయి. అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లికి స్టార్స్ అందరూ హాజరయ్యారు. మెహెందీ, సంగీత్ కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పటికే నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం పెళ్లి వేడుకలో ఖాన్ ద్వయం వేసిన స్టెప్స్‌లు వైరల్‌గా మారాయి. షారుఖ్, సల్మాన్, రణవీర్, అనిల్‌కపూర్ వేసిన డ్యాన్సులు ప్రోగ్రామ్‌కే హైలెట్‌గా నిలిచాయి. వీరి స్టెప్పులతో, డీజేలతో ఆ ప్రాంగణం అంతా దద్దరిల్లిపోయింది. రణవీర్‌సింగ్, పెళ్లి కొడుకు ఆనంద్‌ను ఎత్తుకుని డ్యాన్స్ చేయడం, షారుఖ్ సోనమ్‌ను డ్యాన్స్ చేయడానికి ఆహ్వానించడం, తను కూడా నృత్యం చేయడం ఇవన్నీ హైలెట్‌గా నిలిచాయి. -
సోనమ్ పెళ్లి వేడుకలో సల్మాన్,షారుఖ్ స్టెప్పులు
-
వైరల్ వీడియో : సంగీత్‌లో కరణ్, శిల్పా, అనిల్ డ్యాన్స్
బాలీవుడ్ ప్రస్తుతం పెళ్లి వేడుకల్లో బిజీగా ఉంది. ఎన్నో రూమర్ల అనంతరం సోనమ్ కపూర్, ఆనంద్ అహుజాల పెళ్లి నిశ్చయమైంది. రూమర్లకు చెక్‌పెడుతూ... ఇరువర్గాల కుటుంబాలు మే 8న పెళ్లి జరుగుతుందని ప్రకటించిన విషయం తెలిసిందే. పెళ్లి బంధంతో ఒకటవ్వబోతున్న బాలీవుడ్ నటి సోనమ్, ఆనంద్ జంటకు ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. వారం రోజుల నుంచే ఇరుకుటుంబాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఆదివారం రాత్రి మెహెంది వేడుకను, సోమవారం సంగీత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సోనమ్ ఇంట్లో జరిగిన ఈ కార్యక్రమాలకు అర్జున్ కపూర్, జాన్వీ, ఖుషి, అన్షులా, రాణి ముఖర్జీ, కరణ్ జోహర్‌తో పాటు సన్నిహితులు, బాలీవుడ్ తారలు హాజరయ్యారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు సంగీత్ వేడుకలో పలువురు బాలీవుడ్ నటులతో పాటు, ఇరు కుటుంబాలకు చెందిన సన్నిహితులు పాల్గొన్నారు. సంగీత్ కార్యక్రమంలో కరణ్ జోహార్, అర్జున్ కపూర్, శిల్పా శెట్టి చేసిన డ్యాన్స్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కరణ్ జోహర్ డ్యాన్స్ చేస్తుండగా... మధ్యలో అనిల్ కపూర్ రావడం... అనిల్ కపూర్, శిల్పా శెట్టిని డ్యాన్స్ చేయడానికి ఆహ్వానించడం... శిల్పా డ్యాన్స్‌తో అదరగొట్టిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. -
సోనమ్ మెహంది వేడుకలో జాహ్నవి, ఖుషి కపూర్
-
సంగీత్‌లో కరణ్, శిల్పా, అనిల్ డ్యాన్స్
-
పెళ్లి పీటలెక్కబోతున్న జాన్వీ..?
అనిల్ కపూర్ గారాల పట్టి సోనమ్ కపూర్ వివాహం నేడు ఆనంద్ అహుజాతో జరుగుతున్న విషయం తెలిసిందే. ఆదివారం మెహంది వేడుకను ఎంత ఘనంగా నిర్వహించారో అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు చూస్తే అర్థం అవుతుంది. ఈ వేడుకల్లో శ్రీదేవి కూతుళ్లు జాన్వీ, ఖుషి కపూర్ కూడా పాల్గొన్నారు. అయితే సోనమ్ మెహంది వేడుకలకు సంబంధించిన వీడియోల్లో ఒక వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తుంది. మెహంది వేడుక సందర్భంగా సోనమ్ కపూర్ పెళ్లి కూతురు ధరించే ఎర్రని గాజులను ధరించింది. వీటిని ‘ఛుధా’ అంటారు. అలానే గాజులతో పాటు ధరించే ‘కలేరి’ని కూడా ధరించింది. సిక్కుల విశ్వాసం ప్రకారం పెళ్లి కుమార్తె చేతికి ఉన్న ‘కలేరి’ ఏ అవివాహిత అమ్మాయి తలను తాకుతుందో ఆ అమ్మాయి వివాహమే వారి కుటుంబంలో జరగబోయే తదుపరి వివాహమని నమ్మకం. దీన్ని దృష్టిలో పెట్టుకుని సోనమ్ తాను ధరించిన కలేరిని జాన్వీ తలకు తాకించాలని ప్రయత్నించింది. అంటే కపూర్ల ఇంట తర్వాత పెళ్లి పీటలెక్కబోయేది జాన్వీ అనే కదా.. కానీ కలేరి జాన్వీ తలను తాకలేదు. కలేరిని జాన్వీ తలకు తాకించడానికి ప్రయత్నిస్తూ సోనమ్ కపూర్ ‘సారీ జాను’ అన్నది ఆ వెంటనే జాన్వీ కుర్చిలో నుంచి లేచి హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంది. -
పెళ్లిలో సీరియస్నెస్సా.. హాహాహా!
ముంబై : పెళ్లి బంధంతో ఒకటవ్వబోతున్న బాలీవుడ్ నటి సోనం కపూర్, వ్యాపారవేత్త ఆనంద్ అహుజా జంటకు ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తున్నాయి. వీరి వివాహం మంగళవారం జరగనుండగా.. వారం రోజుల నుంచే ఇరుకుటుంబాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఆదివారం రాత్రి మెహెంది వేడుకను ఘనంగా నిర్వహించారు. సోనం ఇంట్లో జరిగిన ఈ కార్యక్రమానికి అర్జున్ కపూర్, జాన్వీ, ఖుషి, అన్షులా, రాణి ముఖర్జీ, కరణ్ జోహర్‌తో పాటు సన్నిహితులు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు నేడు సంగీత్‌ను భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ వేడుకలో పలువురు బాలీవుడ్ నటులతోపాటు, ఇరు కుటుంబాలకు చెందిన సన్నిహితులు పాల్గొననున్నారు. మరోవైపు సోనం పెళ్లిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కరీనా కపూర్‌తో కలిసి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘వివాహమనేది సంతోషంగా చేసుకునే వేడుక. అందులో సీరియస్‌గా ఉండాల్సిన అవసరం లేదు. ఇద్దరు వ్యక్తులు ఒకటవుతున్న వేళ.. అందరు ఒక దగ్గర చేరి చేసుకునే పార్టీ లాంటిది. పెళ్లి అనేది సీరియస్ అంశమే. కానీ పెళ్లితో ఏదో జరిగిపోతోంది.. కొత్తగా మొదలవుతుంది అంటూ ఉండదు. కాబట్టి ఆ తర్వాత ఏమిటన్నది సీరియస్‌గా తీసుకోకూడదు. ఇప్పటివరకు నటించాను.. పెళ్లి తర్వాత కూడా నటిస్తాను’ అని సోనమ్ పేర్కొన్నారు. -
ఆ జంటకు బహుమతుల వెల్లువ
సాక్షి, న్యూఢిల్లీ : మే 8న వివాహ బంధంతో ఒక్కటవుతున్న సోనం కపూర్, ఆనంద్ అహుజాలకు సెలెబ్రిటీ స్నేహితులు, సన్నిహితుల నుంచి పుష్పగుచ్ఛాలు, విలువైన బహుమతులు వెల్లువెత్తుతున్నాయి. పెళ్లి పత్రికపై బహుమతులు వద్దని వినతిని జోడించినా కపూర్ మాన్షన్‌కు గిఫ్ట్‌లు తరలివస్తున్నాయి. సోనంకు సన్నిహితంగా మెరిగే చిత్ర నిర్మాత కరణ్ జోహార్ ఆమెకు కాంచీపురం చీర, అమ్రపాలి జుంకాలు, చెవిరింగులను బహుమతిగా ఇవ్వనున్నారు. మే 8న వివాహ వేడుకతో పాటు అదే రోజు సాయంత్రం సోనం, ఆనంద్ అహుజాల వివాహ రిసెప్షన్ జరగనుంది. ఇక సోనంకు సన్నిహితంగా మెలిగే సహనటీనటులు సంగీత్‌లో సందడి చేసేందుకు డ్యాన్స్ రిహార్సల్స్‌తో హోరెత్తిస్తున్నారు. గత కొన్నేళ్లుగా డేటింగ్లో ఉన్న సోనం, ఆనంద్‌లు ఎన్నడూ తమ అనుబంధంపై ఎక్కడా నోరుమెదపలేదు. పార్టీలు, ఈవెంట్లకు సైతం ఇద్దరూ కలిసే హాజరైనా వదంతులపై మాత్రం అధికారికంగా స్పందించలేదు. ఇక మే 8న వీరి వివాహం జరుగుతుందని ఇరు కుటుంబాలు అధికారికంగా నిర్ధారించడంతో వివాహ వేడులకపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. మరోవైపు సోనం నటించిన వీరే ది వెడ్డింగ్ జూన్ 1న విడుదలకు ముస్తాబవుతోంది. -
సోనం పెళ్లిలో డ్యాన్స్‌తో దుమ్మురేపుతా..
సాక్షి, న్యూఢిల్లీ : అనిల్‌కపూర్ గారాలపట్టి సోనం కపూర్ పెళ్లి రోజు దగ్గరపడుతున్న కొద్దీ బాలీవుడ్లో సందడి పెరుగుతోంది. ఆమె పెళ్లిలో హంగామా కోసం డ్యాన్స్ స్టెప్లను ప్రాక్టీస్ చేస్తుండటం నుంచి దుస్తుల ఎంపికతో వివాహ ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఇక సోనం పెళ్లిలో డ్యాన్స్ చేసేందుకు తాను ఎంతో ఉద్వేగంగా ఎదురుచూస్తున్నానని ఆమె బాబాయి సంజయ్ కపూర్ చెబుతున్నారు. ‘20 ఏళ్ల కిందట నా పెళ్లిలో మనం డ్యాన్స్ చేశాం..ఇప్పుడు నీ పెళ్లిలో నేను డ్యాన్స్ చేయబోతున్నా’నంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోను పోస్ట్ చేస్తూ సంజయ్ వ్యాఖ్యానించారు. మే 8న సోనం, ఢిల్లీ వ్యాపారి ఆనంద్ అహుజాల వివాహ వేడుకకు కపూర్ మ్యాన్షన్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. బంధువులు, అత్యంత సన్నిహితుల మధ్య వివాహ వేడుకను జరిపించేందుకు కపూర్, అహుజా కుటుంబాలు నిర్ణయించాయి. ఇక సినిమాల పరంగా సోనం కపూర్ నటించిన వీరే ది వెడ్డింగ్ మూవీ జూన్ 1న థియేటర్ల ముందుకు రానుంది. ఈ మూవీలో సోనంతో పాటు కరీనా కపూర్, స్వర భాస్కర్, శిఖా తల్సానియా స్క్రీన్‌ను పంచుకోనున్నారు. -
అందుకే హీరోలతో డేటింగ్‌కు దూరం : సోనం
సాక్షి, ముంబయి : పదేళ్లకు పైగా బాలీవుడ్లో పలువురు హీరోలతో ఆడిపాడినా ఎవరితో డేటింగ్ చేయని అనిల్‌కపూర్ గారాలపట్టి సోనం కపూర్ దీనిపై నోరువిప్పారు. తెరపై కెమిస్ర్టీని పండించినా తెరవెనుక హీరోలతో తనకు సాన్నిహిత్యం లేదని ఏ హీరోతోనూ తనను ముడిపెట్టి వదంతులు రాకపోవడాన్ని ప్రస్తావించారు. తాను సినిమాల్లో కలిసి నటించిన హీరోలు అప్పట్లో రిలేషన్షిప్లో ఉన్నారని, దాంతో వారితో చనువుగా మెలిగే స్పేస్ తనకు లభించలేదని చెప్పారు. గత రెండేళ్లుగా డేటింగ్లో ఉన్న ఢిల్లీ బిజినెస్మెన్ ఆనంద్ అహుజాతో సోనం వివాహ వేడుక మే 8న జరగనున్న విషయం తెలిసిందే. వీరి వివాహాన్ని ఇరు కుటుంబాలు అధికారికంగా నిర్ధారించాయి. వివాహం అనంతరం సోనం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో రెడ్ కార్పెట్‌పై నడిచేందుకు వెళతారు. అనంతరం భారత్‌కు తిరిగివచ్చి తాను నటించిన వీరే ది వెడ్డింగ్ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటారు. -
ఎవరీ ఆనంద్ అహుజా?
బాలీవుడ్ స్టార్ సోనమ్ కపూర్, వ్యాపారవేత్త ఆనంద్ అహుజాల వివాహం ఖాయమైనట్లు ఇరు కుటుంబాలు అధికారికంగా ప్రకటించేశాయి. దీంతో ఇన్నాళ్లు వచ్చిన రూమర్లకు తెరపడింది. మే 8న ముంబైలో అంగరంగ వైభవంగా వివాహ వేడుకలు జరుగనున్నాయి. మరీ సోనం పెళ్లిచేసుకోబోతున్న.. ఆనంద్ అహుజా ఎవరు అంటే ఆయన ఒక యువ వ్యాపారవేత్త.. భానే బ్రాండెడ్ దుస్తుల కంపెనీకి యజమాని. వ్యాపార రంగంలో దిట్ట అయిన హరిష్ అహుజాకు ఆనంద్ మనుమడు. వీరి పెళ్లికి సంబంధించి ముంబైలో ఒక వేడుకను కపూర్ ఫ్యామిలీ నిర్వహించగా... ఢిల్లీలో అహుజా ఫ్యామిలీ మరో వేడుకను నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు కపూర్ సపరివారమంతా కలిసి వస్తోంది. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలను షెడ్యుల్ కూడా చేశారని సమాచారం. బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఫర్హా ఖాన్ సంగీత్ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. సంగీత్‌లో జాన్వీ కపూర్, కరణ్ జోహర్, రణబీర్ కపూర్, అర్జున్ కపూర్లు పాల్గొంటారు. ఆట పాటలతో సంగీత్ కార్యక్రమాన్ని అలరించబోతున్నారు. బాలీవుడ్ తారాగణం అంతా ఈ పెళ్లికి తరలిరాబోతున్నారు. పెళ్లి శుభలేఖలను ముద్రించకుండా... పేపర్ వేస్టేజ్‌ను తగ్గించే పనిలో భాగంగా... ఈ-వెడ్డింగ్ కార్డును ఉపయోగిస్తున్నారని బీ టౌన్ అంటోంది. సోనమ్ తాజా సినిమా ‘వీరే దీ వెడ్డింగ్’.. ఈ సినమా ప్రమోషన్లో భాగంగా త్వరలోనే జరగబోయే కేన్స్ చిత్రోత్సవంలో రెడ్‌కార్పెట్‌పై సోనమ్ నడవనున్నారు. -
సోనమ్-ఆనంద్‌ల పెళ్లి ఫిక్స్
బాలీవుడ్ స్టార్ సోనమ్ కపూర్, వ్యాపారవేత్త ఆనంద్ అహుజాల వివాహం ఖాయమైనట్లు ఇరు కుటుంబాలు అధికారికంగా ప్రకటించేశాయి. దీంతో ఇన్నాళ్లు వచ్చిన రూమర్లకు తెరపడింది. మే 8న ముంబైలో అంగరంగ వైభవంగా వివాహ వేడుకలు జరుగనున్నాయి. ఈ వేడుకలకు కపూర్ సపరివారమంతా హాజరుకానుంది. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలను షెడ్యుల్ కూడా చేశారని సమాచారం. బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఫర్హా ఖాన్ సంగీత్ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. సంగీత్‌లో జాన్వీ కపూర్, కరణ్ జోహర్, రణబీర్ కపూర్, అర్జున్ కపూర్లు పాల్గొంటారు. ఆట పాటలతో సంగీత్ కార్యక్రమాన్ని అలరించబోతున్నారు. బాలీవుడ్ తారాగణం అంతా ఈ పెళ్లికి తరలిరాబోతున్నారు. పెళ్లి శుభలేఖలను ముద్రించకుండా... పేపర్ వేస్టేజ్‌ను తగ్గించే పనిలో భాగంగా... ఈ-వెడ్డింగ్ కార్డును ఉపయోగిస్తున్నారని బీ టౌన్ అంటోంది. ప్రస్తుతం సోనమ్ ‘వీరే దీ వెడ్డింగ్’ సినిమాతో బిజీగా ఉన్నారు. త్వరలోనే జరగబోయే కేన్స్ చిత్రోత్సవంలో రెడ్‌కార్పెట్‌పై సోనమ్ నడవనున్నారు. -
హంగామా స్టార్ట్
అనిల్ కపూర్ ఇంట్లో పెళ్లి హడావిడి మొదలైంది. రంగు రంగు దీపాలతో, పుష్పాలంకరణతో ఇంటికి పెళ్లి కళ వచ్చేసింది. సో.. సోనమ్ కపూర్, ఆనంద్ అహూజాల పెళ్లి మాట నిజమేనన్న మాట. బిజినెస్‌మేన్ ఆనంద్, సోనమ్ కొన్నాళ్లుగా లవ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సమాచారం ప్రకారం ఈ నెల 7, 8 తేదీల్లో వీరి వివాహ వేడుకలు జరుగుతాయట. కూతురి పెళ్లి వేడుక తీప్తి గుర్తుగా మిగిలిపోవడానికి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో అనిల్ కపూర్ అన్నీ తీసుకుంటున్నారట. పెళ్లవగానే ఆనంద్, సోనమ్ హనీమూన్ చెక్కేస్తారని సమాచారం. అయితే అది లాంగ్ హనీమూన్ కాదు. జస్ట్ అలా వెళ్లి ఇలా వచ్చేస్తారట. పెళ్లైన వారానికే సోనమ్ ప్రొఫెషనల్ లైఫ్‌తో బిజీ అయ్యేంతగా ఆమె డైరీ నిండిపోయిందని భోగట్టా. ఆల్రెడీ 14, 15 తేదీల్లో జరగనున్న ఈవెంట్స్‌కు కమిట్మెంట్ ఇచ్చారని టాక్. ఆ వెంటనే త్వరలో విడుదల కానున్న ‘వీరే ది వెడ్డింగ్’ ప్రమోషనల్ కార్యక్రమాలతో బిజీ అవుతారట. మరోవైపు ఫ్రాన్స్‌లో జరగనున్న కాన్స్ చిత్రోత్సవాల్లో పాల్గొనాలనుకుంటున్నారట. దీన్నిబట్టి చూస్తుంటే సోనమ్ వెరీ ప్రొఫెషనల్ అనిపిస్తోంది కదూ. -
కూతురి పెళ్లిపై స్పందించిన హీరో..!
సాక్షి, ముంబయి : అనిల్ కపూర్ గారాలపట్టి సోనం కపూర్, ఢిల్లీ కుబేరుడు ఆనంద్ అహుజాల వివాహం మే 8న ముంబయిలో అట్టహాసంగా జరుగుతుందన్న వదంతులపై అనిల్ కపూర్ స్పందించారు. సోనం వివాహానికి సంబంధించి త్వరలోనే మీడియాకు వివరాలు వెల్లడిస్తామని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు సంగీత్, మెహందీ ఎప్పుడు జరుగుతుంది..పెళ్లి వేడుకలు ఎలా ప్లాన్ చేశారనే దానిపైనా సస్పెన్స్ కొనసాగుతున్నాయి. ఈ విషయమై సోనం, ఆనంద్ అహుజాలు నోరుమెదపడం లేదు. అనిల్ కపూర్ ఇల్లును ముస్తాబు చేస్తుండటంతో వివాహ తంతుపై మరింతగా వార్తలు గుప్పుమన్నాయి. కాగా, తమ కెరీర్ ప్రారంభం నుంచి మీడియా తమకు అండగా నిలుస్తోందని..సరైన సమయంలో అన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పుకొచ్చారు. తన పెళ్లి వేడుకలపై ఇటీవల సోనం మీడియాతో మాట్లాడుతూ వివాహ వేడుకలకు రూ లక్షలు దుబారా చేయడం తనకిష్టం లేదని ఇంట్లోనే వైభవంగా పెళ్లి చేసుకోవాలనుందని చెప్పిన విషయం తెలిసిందే. -
కథువా ఘటన; ఆ సినిమాను చూడకండి
సాక్షి, ముంబై: బాలీవుడ్ చిత్రం వీరె ది వెడ్డింగ్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న ఉద్యమం మొదలైంది. కథువా ఘటనపై స్పందిస్తూ ఈ చిత్రంలోని హీరోయిన్లు ఫ్లకార్డ్లతో నిరసన తెలిపిన విషయం తెలిసిందే. అయితే వారి చేష్టలు సమంజసంగా లేవంటూ ఆ సమయంలో విమర్శలు.. ట్రోలింగ్ ఎదురుకాగా... ఇప్పుడు ఆ ప్రభావం వాళ్లు నటించిన చిత్రంపై పడింది. ‘హిందువుల అత్మగౌరవం నిలవాలంటే ఈ చిత్రాన్ని(వీరె ది వెడ్డింగ్) బహిష్కరించండి. కరీనా, సోనమ్, స్వరభాస్కర్లు బీగ్రేడ్ హీరోయిన్లు. హిందువులపై అపవాదులు వేసే అలాంటి వాళ్ల చిత్రాలను ఆదరించాల్సిన అవసరం హిందువులకు లేదు. దెబ్బకు దెబ్బ కొట్టాల్సిందే’ అంటూ ప్రముఖ కాలమిస్ట్ షెఫాలీ వైద్యా పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ట్వీటర్లో బాయ్కాట్వీర్దేవెడ్డింగ్ పేరిట యాష్ ట్యాగ్‌ను వైరల్ చేస్తున్నారు. ఇక హిందువులపై అత్యాచారాలు జరిగినప్పుడు ఈ హీరోయిన్లంతా ఎక్కడికి పోయారని కొందరు ప్రశ్నిస్తున్నారు. కథువా చిన్నారిపై ఘటనను తామూ ఖండిస్తున్నామని.. కానీ, సరిగ్గా సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న సమయంలోనే వీళ్లు ఇలా డ్రామాలు ఎంతవరకు సరైందని మరికొందరు రీట్వీట్లు చేస్తూ షెఫాలీ నినాదానికి మద్ధతు ఇస్తున్నారు. హిందుస్థాన్‌లో పుట్టినందుకు సిగ్గు పడుతున్నామని.. ఆలయంలో హత్యాచారానికి గురైన 8 ఏళ్ల చిన్నారికి న్యాయం జరగాలంటూ ఈ ముగ్గురు ఫ్లకార్డ్లతో తమ ఫోటోలను ట్వీటర్లో పోస్ట్ చేసి ట్రోలింగ్‌ను ఎదుర్కున్నారు. -
వీరే ది వెడ్డింగ్ ట్రైలర్.. వెరీ బోల్డ్
ముంబై : తైమూర్‌కు జన్మనిచ్చిన తర్వాత కరీనా కపూర్ ఖాన్ నటిస్తున్న తొలి సినిమా కావడంతో ‘వీరే ది వెడ్డింగ్’ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. నలుగురు స్నేహితురాళ్ల మధ్య ఉన్న అనుబంధం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ను బుధవారం విడుదల చేశారు. 2 నిమిషాల 49 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ నెటిజన్లను ఆకర్షిస్తోంది. శశాంఖ్ ఘోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బెబోతో పాటు సోనమ్ కపూర్, స్వరా భాస్కర్, శిఖాలు ప్రధాన పాత్రల్లో నటించారు. భిన్న మనస్తత్వాలు కలిగిన నలుగురు యువతుల జీవితాల్లో చోటు చేసుకున్న సంఘటనలు, వారు ఎదుర్కొన్న పరిణామాల సమాహారమే ఈ సినిమా. సోనమ్ కపూర్‌కు ఎదురైన సమస్య గురించి మిగిలిన ముగ్గురు స్నేహితురాల్ల మధ్య జరిగిన సంభాషణతో మొదలైన ట్రైలర్ బోల్డ్‌గా ఉందంటున్నారు ఫ్యాన్స్. కరీనా కపూర్‌కు ఓ యువకుడు ప్రపోజ్ చేయడంతో పెళ్లి కోసం సిద్ధమైన ఆమె ఇచ్చే బ్యాచిలరేట్ పార్టీ, సంగీత్, ఇతర పెళ్లి వేడుకలతో సరదాగా సాగుతుంది. అదే సమయంలో నలుగురు స్నేహితురాళ్లు ఒకరికొకరు ఎలా అండగా నిలిచారనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. బాలాజీ టెలిఫిల్మ్స్, అనిల్ కపూర్ ఫిల్మ్ అండ్ కమ్యూనికేషన్ నెట్వర్క్ సంయుక్తంగా నిర్మించాయి. బెబో అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న వీర్ ది వెడ్డింగ్ మే 1న విడుదల కానుంది. -
పెళ్లింట... బ్యాండ్ బాజా
పెళ్లింట ధూమ్ ధామ్‌గా దుమ్ము రేపే డ్యాన్స్‌తో హంగామా చేయడానికి సోనమ్ కపూర్ అండ్ గ్యాంగ్ రెడీ అయ్యారు. అదేంటీ ఆనంద్ అహూజాతో సోనమ్ పెళ్లి మేలో కదా? ఇప్పుడే గానా భజానాకి ఎందుకు రెడీ అయ్యారు అనుకుంటున్నారా? నిజమే. పెళ్లికి టైమ్ ఉంది. కానీ ఆమె నటిస్తున్న ‘వీరే ది వెడ్డింగ్’ సినిమా రిలీజ్‌కు టైమ్ దగ్గరపడుతోంది. ట్రైలర్ రిలీజ్‌కు జస్ట్ ఐదారు రోజులే ఉంది. ఆ ట్రైలర్ కోసమే ఈ హంగామా. పైగా రియల్ వెడ్డింగ్కన్నా ముందే షూటింగ్ పూర్తి చేసేయాలని సోనమ్ హడావిడి పడుతున్నారట. ప్రస్తుతం తీస్తున్న పాట తాలూకు చిన్న బిట్‌ను ట్రైలర్లో చూపించాలనుకుంటున్నారట. శశాంక్ ఘోష్ దర్శకత్వంలో సోనమ్ కపూర్, కరీనా కపూర్, స్వర భాస్కర్, తన్సానీయా ముఖ్య పాత్రలుగా రూపొందిన సినిమా ‘వీరే ది వెడ్డింగ్’. నలుగురు అమ్మాయిల మ్యారేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా కథనం సాగనుంది. ఆఫ్టర్ మ్యారేజ్ కరీనా కపూర్ నటిస్తున్న తొలి చిత్రమిదే. ప్రస్తుతం ఆ సినిమాలో ‘తరీఫన్...’ అనే స్పెషల్ సాంగ్‌ను షూట్ చేస్తున్నారు. తరీఫన్ అంటే పంజాబీలో కాంప్లిమెంట్స్ అని అర్థం అట. ఈ సాంగ్‌కు ఫరాఖాన్ కుందర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సాంగ్‌కి డ్యాన్స్ చేయడానికే సోనమ్ అండ్ గ్యాంగ్ రెడీ అయింది. ‘‘ఫైనల్‌గా సోనమ్ కపూర్‌తో లవ్లీ సాంగ్ చేస్తున్నాను’’ అని పేర్కొన్నారు ఫరాఖాన్. ‘‘ఫరా.. మీతో కలిసి వర్క్ చేయడం నా లక్. ఈ సాంగ్ చేస్తున్నందుకు థ్యాంక్స్’’ అన్నారు సోనమ్. మరి... ఈ పెళ్లింట బ్యాండ్ బాజా ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఈ సినిమాను జూన్‌లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు.