
గతేడాది బాలీవుడ్‌లో వచ్చిన ‘వీరే ది వెడ్డింగ్’ సినిమా వందకోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. శశాంక్ ఘోష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కరీనాకపూర్, సోనమ్ కపూర్, స్వర భాస్కర్, శిఖా తల్సానియా ముఖ్య తారలుగా నటించారు. సోనమ్ కపూర్ సిస్టర్ రియా కపూర్ ఒక నిర్మాతగా ఉన్నారు. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ రూపొందనుందా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. మహిళా సాధికారిత, హక్కుల నేపథ్యంలో కరీనా కపూర్ ఓ రేడియో షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిం
ఈ షోలో భాగంగా సోనమ్ కపూర్‌కు కాల్ చేశారు కరీనా. మహిళల హక్కుల గురించి సోనమ్ తన అభిప్రాయాలను పంచుకున్న తర్వాత కాల్ చివర్లో ‘మనం వీరే ది వెడ్డింగ్ 2’ సెట్‌లో కలుసుకుందాం అని కరీనాతో ఫోన్‌లో అన్నారు సోనమ్. దీంతో ‘వీరే ది వెడ్డింగ్ 2’ సెట్స్‌పైకి వెళ్లనుందనే ప్రచారం ఊపందుకుంది. అంతేకాదు.. ఈ సినిమాతో సోనమ్ కపూర్ డైరెక్టర్‌గా మారనున్నారని బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment