Sequel
-
'సంక్రాంతికి వస్తున్నాం' సీక్వెల్‌పై అనిల్ రావిపూడి.. రిలీజ్ ఎప్పుడంటే?
వెంకటేశ్ హీరోగా నటించిన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం' (Sankranthiki Vasthunnam Movie). ఈ మూవీతో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు వెంకీమామ. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం రూ.200 కోట్లక దిశగా దూసుకెళ్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ మూవీని తెగ చూసేస్తున్నారు. ఈ మూవీకి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ రావడంతో ఇటీవల హైదరాబాద్‌లో సక్సెస్ మీట్‌ను కూడా సెలబ్రేట్ చేసుకున్నారు.(ఇది చదవండి: సంక్రాంతికి వస్తున్నాం: ఐశ్వర్య కాకపోతే ఆ హీరోయిన్.. మీనాక్షికి బదులుగా!)అయితే ఈ మూవీకి వస్తున్న ఆదరణ చూసి డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆసక్తికర విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. యాంకర్ సుమతో ఇంటర్వ్యూకు హాజరైన అనిల్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి సీక్వెల్ ఉంటుందని చెప్పారు. సంక్రాంతికి వస్తున్నాం -2 కథ అక్కడి నుంచే మొదలవుతుందని క్లారిటీ ఇచ్చారు. మళ్లీ సంక్రాంతికే వస్తామని అనిల్ రావిపూడి అన్నారు. ఈ సినిమా చేసేందుకు స్పేస్ ఉందని.. రాజమండ్రిలో ఎండ్ చేశాం కాబట్టి.. అక్కడి నుంచే ఈ కథ మొదలవుతుందని అన్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి మరో మిరాకిల్‌తో మీ ముందుకు వస్తామని అనిల్ రావిపూడి స్పష్టం చేశారు. దీంతో వెంకీ మామ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరో, హీరోయిన్లుగా నటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మొదటి రోజు నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా అద్భుతంగా ఉందంటూ ఫ్యామిలీ ఆడియన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.ఈనెల 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం ఐదు రోజుల్లోనే రూ.161 కోట్లు వసూలు చేసింది. కేవలం మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ.106 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.45 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా వెంకటేశ్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది.ఓవర్సీస్లో రికార్డ్ వసూళ్లు..సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఓవర్సీస్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఓవర్సీస్ ఆడియన్స్ కోసం అదనపు షోలు కూడా ప్రదర్శిస్తున్నారు. ఈ సంక్రాంతికి మూడు చిత్రాలు రిలీజ్ కాగా.. ఈ సినిమా ఆడియన్స్ ఆదరణ దక్కించుకుంది. బాలయ్య డాకు మహారాజ్, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సైతం పొంగల్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.ఈ మూవీ కథేంటంటే..డీసీపీ యాదగిరి దామోదర రాజు అలియాస్ వైడీ రాజు(వెంకటేశ్) ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. మంచి కోసం తాను చేసే ఎన్కౌంటర్లను రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం వాడుకొని..ఆయనను సస్పెండ్ చేస్తుంటారు. ఇది నచ్చక ఉద్యోగాన్ని వదిలేసి రాజమండ్రీ వెళ్లిపోతాడు రాజు. అక్కడ భార్య భాగ్యం(ఐశ్వర్య రాజేశ్), నలుగురు పిల్లలతో కలిసి హాయిగా జీవితాన్ని గడుపుతుంటాడు.కట్ చేస్తే.. కేంద్రంతో గొడవపడి మరీ అమెరికాలోని ఓ బడా కంపెనీ సీఈఓ ఆకెళ్ల సత్యం(అవసరాల శ్రీనివాస్)ను తెలంగాణకు రప్పిస్తాడు ఇక్కడి ముఖ్యమంత్రి కేశవ్(నరేశ్). పార్టీ ప్రెసిడెంట్(వీటీ గణేశ్) కోరికమేరకు ఆకెళ్లను ఫామ్ హౌజ్ పార్టీకి పంపించగా.. బీజూ గ్యాంగ్ అతన్ని కిడ్నాప్ చేస్తుంది. ఈ విషయం బయటకు తెలిసే పరువుతో పాటు పదవి కూడా పోతుందని భయపడిన సీఎం కేశవ్.. ఎలాగైనా బీజూ గ్యాంగ్ నుంచి ఆకేళ్లను రక్షించాాలకుంటాడు.ఐపీఎస్ మీనాక్షి సలహా మేరకు వైడీ రాజుకు ఈ ఆపరేషన్ని అప్పగించాలకుంటాడు. ట్రైనింగ్ టైంలో మీనాక్షి, రాజు ప్రేమలో ఉంటారు. ఓ కారణంగా విడిపోయి..ఆరేళ్ల తర్వాత మళ్లీ ఈ ఆపరేషన్ కోసం రాజు దగ్గరకు వెళ్తుంది మీనాక్షి. అయితే మీనాక్షి..రాజు మాజీ ప్రియురాలు అనే విషయం భాగ్యానికి తెలుస్తుంది. భర్తతో పాటు ఆమె కూడా ఆపరేషన్‌లో పాల్గొంటానని చెబుతుంది. ఒకవైపు మాజీ ప్రియురాలు..మరోవైపు భార్య మధ్య రాజు ఈ ఆపరేషన్ ఎలా సక్సెస్ చేశాడనేదే ఈ సినిమా కథ. సంక్రాంతికి వస్తున్నాం 2 కథ అక్కడ మొదలవుతుంది - #AnilRavipudi#SankranthikiVasthunam#Venkatesh #AishwaryaRajesh #MeenakshiChaudhary #TeluguFilmNagar pic.twitter.com/ekTYLB9cpQ— Telugu FilmNagar (@telugufilmnagar) January 19, 2025 -
ఊహించని అద్భుతాలు జరిగాయి: శ్రీను వైట్ల
‘‘డైరెక్టర్ కావాలని నా చిన్నప్పటి నుంచే కోరుకున్నాను. ఇందు కోసం చిన్న వయసులోనే చెన్నై వెళ్లాను. ఇండస్ట్రీలో నిలబడాలనే తపన, సినిమా క్రాఫ్ట్స్‌పై ఆసక్తి ఉండేవి. కానీ, ఓ దర్శకుడిగా ఇండస్ట్రీలో పాతిక సంవత్సరాలు ఉంటానని నిజంగా ఆ రోజు ఊహించలేదు. నా కెరీర్లో ఇలా ఊహించని ఎన్నో అద్భుతాలు జరిగాయి. నా ప్రయాణం పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. ఈ ప్రయాణంలో భాగమైన హీరోలు, నిర్మాతలు, టెక్నీషియన్స్, నా కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు’’ అని దర్శకుడు శ్రీనువైట్ల అన్నారు. రవితేజ, మహేశ్వరి జంటగా శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన చిత్రం ‘నీ కోసం (1999)’. గంటా శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రంతో శ్రీనువైట్ల దర్శకుడిగా పరిచయమయ్యారు.ఈ సినిమా విడుదలై నేటితో 25 ఏళ్లు పూర్తవుతాయి. అలాగే ఇండస్ట్రీలో పాతిక సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు శ్రీనువైట్ల. ఈ సందర్భంగా సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ–‘‘నీ కోసం’ కి ముందు మరో సినిమా చేయాల్సింది. కానీ, ఆ సినిమా ఆగిపోవడంతో నిరుత్సాహంగా అనిపించింది. ఆ తర్వాత తక్కువ బడ్జెట్లో ఓ సినిమా చేయాలనుకుని ‘నీ కోసం’ కథ రాసుకుని, సినిమా స్టార్ట్ చేశాం. కానీ, ఈ సినిమా కూడా మధ్యలోనే ఆగిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే రవితేజగారి సహాయంతో పూర్తి చేశాం. ఫస్ట్ కాపీ చూసి నాగార్జునగారు నన్ను మెచ్చుకుని, డైరెక్షన్ చాన్స్ ఇవ్వడం ఎప్పటికీ మర్చిపోలేను.అలాగే ‘నీ కోసం’ రిలీజ్‌కు రామోజీరావుగారు అండగా నిలబడ్డారు. అలాగే ఆయన బ్యానర్లోనే ‘ఆనందం’ సినిమా అవకాశం ఇచ్చారు. ‘నీ కోసం’ సినిమాకి ఏడు నంది అవార్డు వచ్చాయి. ఇక ‘ఆనందం, వెంకీ, రెడీ, దూకుడు, ఢీ’ సినిమాలు నా కెరీర్‌లోని టాఫ్ ఫైవ్ మూవీస్‌గా చెప్పుకుంటాను. ‘దూకుడు’ సినిమాను తమిళంలో అజిత్‌గారితో రీమేక్ చేసే అవకాశం వచ్చింది. కానీ, అప్పటికే నేను ‘బాద్షా’కు కమిటై ఉండటంతో కుదర్లేదు. ‘బాద్షా’ హిట్ అయింది.సో.. అజిత్‌గారితో నేను ఆ సినిమా చేయలేదనే బాధ లేదు. మహేశ్‌బాబుగారితో నేను చేసిన ‘ఆగడు’ సినిమా ఎన్నో అంచనాల మధ్య విడుదలై, ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ విషయంలో కాస్త బాధగా అనిపించింది. అయితే ఆ సినిమా తర్వాత మహేశ్‌గారు నాకు మంచి మోరల్ సపోర్ట్ ఇచ్చారు.. ఆ విషయాన్ని మర్చిపోలేను. ‘వెంకీ’ సినిమాకు సీక్వెల్ తీయాలనే ఆలోచన ఉంది. ఇటీవల నా దర్శకత్వంలో వచ్చిన ‘విశ్వం’ సినిమా హిట్‌గా నిలిచినందుకు సంతోషంగా ఉంది. నా తర్వాతి సినిమాని త్వరలోనే చెబుతాను’’ అని చెప్పారు. -
పదేళ్ల తర్వాత సూపర్‌హిట్ మూవీకి సీక్వెల్.. ప్రకటించిన డైరెక్టర్!
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రస్తుతం సికందర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ యాక్షన్ ఓరియటండ్ చిత్రంలో రష్మిక మందన్న, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వచ్చే ఏడాది ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది.అయితే అంతలోనే మరో మూవీకి సిద్ధమయ్యారు సల్మాన్ ఖాన్. గతంలో ఆయన నటించిన సూపర్ హిట్ చిత్రం కిక్. 2014లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. ఆ సినిమాకు సీక్వెల్‌గా కిక్ 2 తెరకెక్కిస్తున్నారు. ఈ విషయాన్ని డైరెక్టర్ సాజిద్ నదియావాలా తాజాగా ప్రకటించారు. దాదాపు పదేళ్ల తర్వాత సీక్వెల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.(ఇది చదవండి: నేను తప్పు చేయలేదు, బిగ్‌బాస్ నన్ను రోడ్డున పడేశాడు)కాగా.. 2009లో టాలీవుడ్ హీరో రవితేజ హీరోగా నటించిన ‘కిక్. ఈ మూవీ ఆధారంగానే బాలీవుడ్లో కిక్ తెరకెక్కించారు. సల్మాన్‌ఖాన్, జాక్వెలిన్ ఫెర్నాడెంజ్ నటించిన ఈ సినిమాకు సాజిద్ నదియావాలా దర్శకత్వం వహించారు. యాక్షన్ కామెడీ ఫిల్మ్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా అందుకుంది. తాజాగా ఈ మూవీకి సీక్వెల్ అనౌన్స్ చేశారు మేకర్స్. View this post on Instagram A post shared by Nadiadwala Grandson (@nadiadwalagrandson) -
'కల్కి' పార్ట్ 2.. టైటిల్ ఫిక్స్ అయిందా?
ప్రభాస్ లైనప్ ప్రస్తుతం ఫుల్ ప్యాక్డ్ ఉంది. ఈ ఏడాది 'కల్కి 2898'తో రూ.1000 కోట్ల మార్క్ దాటేశాడు. ప్రస్తుతం 'రాజాసాబ్'తో ఫుల్ బిజీ. దీని తర్వాత సలార్ 2, కల్కి 2 రెడీగా ఉన్నాయి. ఓవైపు 'సలార్' షూటింగ్ గురించి సెట్స్ సిద్ధమవుతుండగా.. మరోవైపు 'కల్కి' పార్ట్ 2 గురించి కొన్ని గాసిప్స్ వైరల్ అయిపోతున్నాయి. టైటిల్‌ని ఫిక్స్ చేయడంతో పాటు స్టోరీ ఎలా ఉండబోతుందో మాట్లాడేసుకుంటున్నారు.(ఇదీ చదవండి: పిల్ల దెయ్యం సినిమా.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులో స్ట్రీమింగ్)ఇప్పటికే వచ్చిన 'కల్కి' తొలి భాగంలో భవిష్యత్తులో భూమి ఎలా ఉండబోతుంది అనేది చూపించారు. చివర్లో మహాభారతం ఎపిసోడ్, అందులో కర్ణుడు-అర్జునుడు సీన్స్ సూపర్ హైలైట్ అయ్యాయి. వీటిని చూసి చాలామంది మరికాసేపు ఇవి ఉంటే బాగుండు అని ఆశపడ్డారు. ఇప్పుడు వాళ్ల కోరిక నెరవేరిందని చెప్పొచ్చు.ఎందుకంటే సీక్వెల్‌కి 'కర్ణ 3102 BC' అనే టైటిల్ నిర్ణయించారట. పేరు బట్టే అర్థమైపోతుందిగా.. మొత్తం కర్ణుడు, అశ్వద్ధామ హీరోలు కాగా.. విలన్‌గా సుప్రీం యాష్కిన్ కనిపిస్తాడట. ఉన్న కొద్దిపాటి నిమిషాలకే మహా భారతం సీన్లతో నాగ్ అశ్విన్ తన మార్క్ చూపించాడు. మరి ఇప్పుడు రెండో పార్ట్ ఇంకేం మ్యాజిక్ చేస్తాడోనని ఫ్యాన్స్ తెగ ఆరాటపడుతున్నారు. రాబోయే జనవరి నుంచి షూటింగ్ మొదలవ్వొచ్చని తెలుస్తోంది.(ఇదీ చదవండి: అమెరికాలో పెళ్లి.. సమంతనే స్పెషల్ ఎట్రాక్షన్) -
ఇండియన్ ఇండస్ట్రీకి పాఠాలు నేర్పుతున్న టాలీవుడ్...
-
ఆ సినిమా కోసం క్యూరియాసిటీతో ఉన్నా: కల్కి డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం కల్కి 2898 ఏడీ. జూన్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు బద్దలు కొట్టింది. రిలీజైన రెండు వారాల్లోనే రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా దూసుకెళ్తోంది.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన డైరెక్టర్ నాగ్ అశ్విన్‌కు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ప్రస్తుతం చాలా సినీ యూనివర్స్‌లు వస్తున్నాయని.. ముఖ్యంగా పుష్ప-2, యానిమల్, సలార్ లాంటి సినిమాల సీక్వెల్స్ వస్తున్నాయి.. ఒక అభిమానిగా మీరు ఏ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు? అని ప్రశ్నించారు. దీనికి స్పందిస్తూ తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సినిమా పేరును నాగ్ రివీల్ చేశారు. తాను ప్రభాస్ మూవీ సలార్ పార్ట్-2 కోసం క్యూరియాసిటీతో ఉన్నానని నాగ్ అశ్విన్ అన్నారు. సలార్ స్టోరీ చాలా బాగా నచ్చిందని తెలిపారు. ముందుగా నేను గేమ్ ఆఫ్ త్రోన్స్కు వీరాభిమానిని.. అదోక విభిన్నమైన ప్రపంచం.. విభిన్నమైన హౌస్‌లు ఉంటాయి.. సలార్ కూడా అలాగే అనిపిస్తోందని అన్నారు. డిఫరెంట్ వరల్డ్, హిస్టరీ ఆధారంగా వస్తోన్న సలార్-2 కోసమే తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు వెల్లడించారు.కాగా.. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ పార్ట్-1 సీజ్ఫైర్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషించారు. ఈ మూవీ క్లైమాక్స్‌లో దేవ (ప్రభాస్) శౌర్యంగ అని రివీల్ అవుతుంది. దీంతో ఆ తర్వాత ఖాన్సార్‌లో ఏం జరిగిందనే దానిపై విపరీతమైన ఆసక్తి నెలకొంది. సలార్ పార్ట్-2 శౌర్యాంగ పర్వం పేరుతో రానుంది."I'm definitely curious about #Salaar because the story just started there. I'm a huge Game of Thrones fan, so seeing different houses and stories makes me excited."My hero Prabhas - #NagAshwin 😍#Prabhas #Kalki2898AD pic.twitter.com/88NKadDsHT— Prabhas' Realm (@PrabhasRealm) July 16, 2024 -
హిట్ సినిమాకు సీక్వెల్.. ఈసారి ఏకంగా ఫాంటసీ కథతో!
విష్ణు విశాల్, దర్శకుడు రామ్ కుమార్ కాంబోలో వచ్చిన హిట్ సినిమా 'రాక్షసన్'. 2018లో ప్రేక్షకుల ముందుకొచ్చి సంచలన విజయాన్ని సాధించింది. తెలుగులోనూ 'రాక్షసుడు' పేరుతో రీమేక్ అయి, హిట్ సొంతం చేసుకున్నారు. ఇప్పుడు దీనికి సీక్వెల్ రెడీ చేస్తున్నారట.(ఇదీ చదవండి: Society Of The Snow Review: కన్నీళ్లు ఆపుకునే శక్తి ఉంటే ఈ సినిమా చూడండి)'రాక్షసన్' సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీతో తీయగా.. ఇప్పుడు దీని సీక్వెల్‌ని ఫాంటసీ జానర్లో తీస్తారట. ఇప్పటికే షూటింగ్ మొదలైంది. ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. విష్ణు విశాల్ రీసెంట్గా ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన 'లాల్ సలామ్'తో వచ్చాడు. కానీ ఇది ఘోరమైన డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో ఇతడికి 'రాక్షసన్ 2' హిట్ కావడం చాలా కీలకం. మరి ఏం చేస్తారో చూడాలి?(ఇదీ చదవండి: నా భర్తతో హోటల్ రూమ్‌లో ఆ హీరోయిన్.. అందుకే విడాకులు: శ్రీదేవి) -
Border 2: ఇరవయ్యేడేళ్ల తర్వాత...
ఇరవయ్యేడేళ్ల తర్వాత హిందీ హిట్ ఫిల్మ్ ‘బోర్డర్’కు సీక్వెల్‌గా ‘బోర్డర్ 2’ను అధికారికంగా ప్రకటించారు సన్నీ డియోల్. ఆయన హీరోగా జేపీ దత్తా దర్శకత్వంలో 1997లో వచ్చిన చిత్రం ‘బోర్డర్’. 1997 జూన్ 13న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్‌గా నిలిచింది. కాగా ‘బోర్డర్’ చిత్రం విడుదలై గురువారం (జూన్ 13) నాటికి సరిగ్గా 27 సంవత్సరాలు. ఈ సందర్భంగా ‘బోర్డర్ 2’ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. కానీ ‘బోర్డర్’కు దర్శకత్వం వహించిన జేపీ దత్తాకు బదులుగా దర్శకుడు అనురాగ్ సింగ్ సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. ‘‘ఒక సైనికుడు తన వాగ్దానాన్ని నెరవేర్చడానికి 27 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తున్నాడు. ఇండియాస్ బిగ్గెస్ట్ వార్ ఫిల్మ్’’ అంటూ ఓ వీడియోను షేర్ చేశారు సన్నీ డియోల్. భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్, జేపీ దత్తా, నిధి దత్తా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ‘బోర్డర్’ చిత్రం 1971లో జరిగిన ఇండియా–΄ాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ఉంటుంది. ఈ చిత్రం సీక్వెల్ కథపై స్పష్టత రావాల్సి ఉంది. -
అఫీషియల్: 'ప్రేమలు' సీక్వెల్.. రిలీజ్ కూడా చెప్పేశారు
సంక్రాంతి తర్వాత అన్ని సినీ ఇండస్ట్రీల్లో డల్ ఫేజ్ నడుస్తోంది. స్టార్ హీరోల సినిమాలు లేకపోవడం, జనాల్ని మెప్పించే చిత్రాలు సరిగా రావట్లేదు. కానీ మలయాళంలో మాత్రం బ్లాక్ బస్టర్ చిత్రాలు వస్తున్నాయి. అన్ సీజన్ ఫిబ్రవరిలోనే ఏకంగా నాలుగు హిట్ సినిమాలు వచ్చాయి. వాటిలో ఒకటే 'ప్రేమలు'. మలయాళంతో పాటు తెలుగులోనూ యువతని ఆకట్టుకున్న ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ రెడీ చేశారు. (ఇదీ చదవండి: మలయాళ హిట్ మూవీ తెలుగులో రీమేక్.. హీరోగా స్టార్ డైరెక్టర్!) అవును మీరు విన్నది నిజమే. పెద్దగా కథ కాకరకాయ లాంటిది ఏం లేకపోయినా స్క్రీన్ ప్లేలో ఫన్ ఎలిమెంట్స్ జోడించడంతో 'ప్రేమలు'.. మలయాళంలో పెద్ద హిట్టయిపోయింది. తెలుగులోనూ రిలీజ్ చేస్తే రూ.17 కోట్ల వరకు కలెక్షన్స్ సాధించింది. సినిమాలో కథంతా హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ కావడం ప్లస్ ట్రెండ్‌కి తగ్గ డైలాగ్స్ అన్నీ ఉండటం మనోళ్లకు నచ్చేసింది. అయితే కొందరు తెలుగు ఆడియెన్స్‌కి మాత్రం ఇది పెద్దగా నచ్చలేదు. మంచి వసూళ్లు రాబట్టిన ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. 2025లో రిలీజ్ ఉంటుందని కూడా చెప్పేసింది. తొలి భాగంలా కాకుండా ఈసారి తెలుగు, తమిళ, మలయాళంలో ఒకేసారి రిలీజ్ చేయబోతున్నారు. పోస్టర్స్ తో ఈ విషయాన్ని ప్రకటించారు. ఇకపోతే తొలి భాగం.. హీరో పాత్రధారి యూకే వెళ్లడంతో ముగుస్తుంది. మరి సీక్వెల్ స్టోరీ యూకేలో ఉంటుందా? మళ్లీ హైదరాబాద్ లోనే ఉంటుందా అనేది చూాడాలి. అలానే ఫస్ట్ పార్ట్ హిట్ అయింది కదా అని త్వరగా సీక్వెల్ తీసేస్తే వర్కౌట్ అవుతుందా లేదా అనేది కూడా చూడాలి? (ఇదీ చదవండి: టాలీవుడ్ యంగ్ హీరో షాకింగ్ నిర్ణయం.. ఇకపై వాటికి నో!) View this post on Instagram A post shared by Dileesh Pothan (@dileeshpothan) -
జ్యోతిక సూపర్ హిట్ చిత్రం.. సీక్వెల్‌కు ప్లాన్!
ప్రస్తుతం ఎవర్గ్రీన్ నటిగా రాణిస్తున్న నటి జ్యోతిక. చంద్రముఖి చిత్రం తర్వాత ఆమె నటుడు సూర్యను ప్రేమించి పెళ్లాడారు. ఆ తర్వాత నటనకు కాస్త విరామం ఇచ్చారు. అది కూడా కుటుంబం కోసమే. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తరువాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. అయితే ఈసారి ఉమెన్ సెంట్రిక్ కథా పాత్రల్లో నటించడానికి ప్రాధాన్యత ఇచ్చారు. అలా జ్యోతిక నటించిన 36 వయదినిలే చిత్రం చేసి సూపర్‌హిట్ కొట్టారు. ఆ తరువాత వరుసగా నటనను కొనసాగిస్తున్నారు. ఇటీవల బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చి సైతాన్ చిత్రంతో అక్కడా సక్సెస్ సాధించారు. దీంతో హిందీలో మరిన్ని అవకాశాలు ఈమె తలుపు తడుతున్నాయని సమాచారం. జ్యోతిక ప్రధాన పాత్రను పోషించిన చిత్రం ఉడన్ పిరప్పే. నటుడు శశికుమార్, సముద్రఖని ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని సూర్య, జ్యోతిక తమ 2డీ ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై నిర్మించారు. అన్నాచెల్లెళ్ల అనుబంధం ఇతి వృత్తంతో ఆర్.శరవణన్ దర్శకత్వంలో వహించిన ఈ చిత్రం 2021లో ఓటీటీలో విడుదలై మంచి ఆదరణను పొందింది. ఇది జ్యోతికకు చాలా నచ్చిన చిత్రం కావడం గమనార్హం. కాగా తాజాగా ఉడన్పిరప్పే చిత్రానికి సీక్వెల్‌ను చేయాలని జ్యోతిక ఆశిస్తున్నట్లు సమాచారం. అందుకు దర్శకుడు శరవణన్ కథను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. జ్యోతిక మార్కెట్ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి చేరుకోవడంతో ఈ చిత్రాన్ని ఆ స్థాయిలో చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఉడన్పిరప్పే సీక్వెల్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
కాశీలో క్లాప్
ఓదెల మల్లన్న స్వామి తన గ్రామాన్ని దుష్టశక్తుల నుంచి ఏ విధంగా రక్షిస్తాడు? అనే ప్రధాన ఇతివృత్తంతో తెరకెక్కుతున్న క్రైమ్ థ్రిల్లర్ ‘ఓదెల 2’. 2022లో డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలైన ‘ఓదెల రైల్వేస్టేషన్’ సినిమాకు సీక్వెల్‌గా ‘ఓదెల 2’ తెరకెక్కుతోంది. ఇందులో తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వశిష్ట ఎన్. సింహా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అశోక్ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ పై డి. మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు సంపత్ నంది క్రియేటర్‌గా ఉన్న ఈ సినిమా ప్రారంభోత్సవం కాశీలో జరిగింది. రెగ్యులర్ షూటింగ్‌ని కూడా కాశీలోనే ఆరంభించారు. తొలి సీన్‌కి సంపత్ నంది క్లాప్ కొట్టారు. ‘‘ఓదెల 2’ గ్రామం చుట్టూ కేంద్రీకృతమై, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు ఓదెల మల్లన్న స్వామి తన గ్రామాన్ని దుష్ట శక్తుల నుండి ఎలా రక్షిస్తాడనే అంశాలతో ఈ చిత్రకథ ఉంటుంది. క్యాస్టింగ్, కథ, వీఎఫ్ఎక్స్.. టోటల్‌గా మేకింగ్ పరంగా ఈ చిత్రం పెద్దగా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్, కెమెరా: సౌందర్ రాజన్. ఎస్. -
రాణి రావడం ఖాయం
బాలీవుడ్ హిట్ ఫిల్మ్ ‘క్వీన్’కు సీక్వెల్‌గా ‘క్వీన్ 2’ని రూపొందించే చాన్స్ ఉందని ఈ చిత్రదర్శకుడు వికాస్ బాల్ చెబుతున్నారు. కంగనా రనౌత్ లీడ్ రోల్లో రాజ్‌కుమార్ రావు కీలక పాత్రలో నటించిన చిత్రం ‘క్వీన్’. 2014 మార్చి 7న విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తాజాగా ‘క్వీన్’ సీక్వెల్ గురించి ఓ ఇంటర్వ్యూలో స్పందించారు వికాస్. ‘‘క్వీన్’ సినిమా విడుదలై దాదాపు పదేళ్లు కావస్తోంది. కానీ ఇప్పటికీ చాలామంది నన్ను ‘క్వీన్ 2’ సినిమా గురించే అడుగుతున్నారు. ‘క్వీన్ 2’కి కథ రెడీగానే ఉంది. ఎప్పుడన్నది ఇప్పుడే చెప్పలేను కానీ క్వీన్ రావడం ఖాయం’’ అన్నారు వికాస్. ఇక ఈ సీక్వెల్లోనూ కంగనా రనౌత్‌నే కథాకానాయికగా తీసుకుంటారా? అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ఇదిలా ఉంటే.. వికాస్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘సైతాన్’ మార్చి 8న విడుదల కానుంది. ఈ సినిమాలో అజయ్ దేవగన్, మాధవన్, జ్యోతిక లీడ్ రోల్స్ చేశారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగానే వికాస్ ‘క్వీన్ 2’ గురించి వెల్లడించినట్లుగా తెలుస్తోంది. -
అసలు కథ ఇప్పుడే మొదలైంది!
ఓ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అయితే ఆ కథకు సీక్వెల్ తీసే పనిలో ఉంటారు. అయితే కొనసాగించాలంటే కథలో స్కోప్ ఉండాలి. పైగా ‘అసలు కథ ఇప్పుడే మొదలైంది’ అన్నట్లుగా ఉండాలి. అలా కొన్ని చిత్రాలకు స్కోప్ దొరికింది. ‘అసలు కథ ఇప్పుడే మొదలైంది’ అన్నట్లు తొలి భాగం చివర్లో ట్విస్ట్ ఇచ్చి, మలి భాగం రూపొందించే పనిలో ఉన్నారు. ఈ ఏడాది అరడజనుకు పైగా సీక్వెల్ చిత్రాలు రానున్నాయి. ఈ రెండు భాగాల చిత్రాల గురించి తెలుసుకుందాం... స్వాతంత్య్రం రాక ముందు... సేనాపతి వీరశేఖరన్, అతని కొడుకు చంద్రబోస్ సేనాపతిల కథలను ‘ఇండియన్’ (1996) సినిమాలో చూశాం. ఈ రెండు పాత్రల్లోనూ కమల్‌హాసన్ నటించారు. శంకర్ దర్శకత్వం వహించారు. పాతికేళ్ల తర్వాత ‘ఇండియన్’కు సీక్వెల్‌గా కమల్‌హాసన్, శంకర్ కాంబినేషన్లోనే ‘ఇండియన్ 2’ రూపొందుతోంది. ఇందులోనూ కమల్‌ది ద్విపాత్రాభినయం. ఈ చిత్రంలో సేనాపతికి, అతని తండ్రికి మధ్య జరిగే కథను చూపిస్తారట శంకర్. అంటే.. కథ దేశ స్వాతంత్య్రానికి పూర్వం ఉంటుందని తెలుస్తోంది. అలాగే ప్రస్తుత కాలాన్ని కూడా కనెక్ట్ చేశారట. ‘ఇండియన్ 2’ ఏప్రిల్‌లో విడుదల కానుందని తెలిసింది. మిత్రులే శత్రువులు ఎంతోమంది జీవితాలను మార్చిన ఖాన్సార్ (‘సలార్’ చిత్రం కోసం క్రియేట్ చేసిన ప్రాంతం) ఇద్దరు మిత్రులు దేవరథ, వరదరాజ మన్నార్లను మాత్రం శత్రువులుగా చేసింది. మరి... ఈ మిత్రులు ఎందుకు శత్రువులు కావాల్సి వచ్చిందనే కథను ‘సలార్’ మలి భాగం ‘సలార్: శౌర్యాంగ పర్వం’లో చూడాలంటున్నారు ఈ చిత్రదర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ హీరోగా దేవరథ పాత్రలో నటిస్తుండగా, దేవ మిత్రుడు వరదరాజ మన్నార్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ‘సలార్: శౌర్యాంగపర్వం’ చిత్రం ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ్రపారంభంలో రిలీజయ్యే చాన్స్ ఉంది. ఇక హీరో ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లోని ‘సలార్’లోని తొలి భాగం ‘సలార్: సీజ్ఫైర్’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘సలార్: శౌర్యాంగ పర్వం’ రానుంది. పుష్పగాడి రూల్ ‘పుష్ప’ సినిమాలో సిండికేట్ రూల్స్‌ను దాటి హెడ్ అయ్యాడు పుష్పరాజ్. మరి.. సిండికేట్ మెంబర్స్‌కు పుష్పరాజ్ ఎలాంటి రూల్స్ పాస్ చేశాడు? ఈ రూల్స్‌ను ఎవరైనా బ్రేక్ చేయాలనుకుంటే పుష్పరాజ్ ఏం చేసాడనేది ‘పుష్ప: ది రూల్’ చిత్రంలో చూడొచ్చు. పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్‌లు నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న రిలీజ్ కానుంది. ‘పుష్ప: ది రైజ్’కు సీక్వెల్‌గా ‘పుష్ప: ది రూల్’ రూపొందుతోంది. డబుల్ ఇస్మార్ట్ కిరాయి రౌడీ ఇస్మార్ట్ శంకర్‌కు సీబీఐ ఆఫీసర్ అరుణ్ మెమొరీని సైంటిఫిక్‌గా ఇంజెక్ట్ చేసి, చిప్ పెడితే ఏం జరుగుతుంది? అనేది ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా కథ. ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకుడు. రామ్ టైటిల్ రోల్ చేయగా, సీబీఐ ఆఫీసర్ అరుణ్గా సత్యదేవ్ నటించారు. 2019లో విడుదలైన ‘ఇస్మార్ట్ శంకర్’కి సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ చేస్తున్నారు రామ్, పూరి. కాగా అరుణ్ జ్ఞాపకశక్తి పూర్తిగా శంకర్‌కు వచ్చేస్తే ఏం జరుగుతుంది? ఓ కిరాయి రౌడీ సీబీఐ ఆఫీసర్ అయితే ఏం చేస్తాడు? శంకర్ నిజంగానే గతం మర్చిపోతాడా? ఈ ప్రశ్నలకు సమాధానం మార్చి 18న రిలీజయ్యే ‘డబుల్ ఇస్మార్ట్’ చూస్తే తెలుస్తుంది. యాత్ర 2 ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితంలోని కొన్ని ఘటనలు, ఆయన పాద యాత్ర నేపథ్యంలో రూపొందిన హిట్ ఫిల్మ్ ‘యాత్ర’. మహి వి. రాఘవ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తాజాగా ‘యాత్ర’ సినిమాకు సీక్వెల్‌గా ‘యాత్ర 2’ తెరకెక్కించారు మహి వి. రాఘవ్. వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా నేతగా ఎదిగిన తీరు, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాజకీయ ఘటనల ఆధారంగా ‘యాత్ర 2’ రూపొందింది. ఈ చిత్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి పాత్రలో మమ్ముట్టి నటించగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాత్రలో తమిళ నటుడు జీవా నటించారు. శివ మేక నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 9న విడుదల కానుంది. రెట్టింపు వినోదం డీజే టిల్లుగానితో ఎట్లుంటదో ‘డీజే టిల్లు’ సినిమాలో చూశారు ఆడియన్స్. 2022లో విడుదలైన ఈ సినిమా బంపర్ హిట్ సాధించింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘డీజే టిల్లు స్క్వేర్’ రానుంది. ‘డీజే టిల్లు’లో టైటిల్ రోల్‌ని సిద్ధు జొన్నలగడ్డ చేయగా, విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. సీక్వెల్లో సిద్ధూనే హీరో. అయితే మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 9న విడుదల కావాల్సింది. కానీ వాయిదా పడిందని తెలుస్తోంది. గూఢచారి 2 ఏజెంట్ గోపీ 116 అనగానే తెలుగు ప్రేక్షకులకు అడివి శేష్ స్పై థ్రిల్లర్ ‘గూఢచారి’ సినిమా గుర్తుకు వస్తుంది. 2018లో విడుదలైన ఈ సినిమా బంపర్ హిట్. శశికిరణ్ తిక్క దర్శకుడు. ప్రస్తుతం ‘గూఢచారి 2’తో బిజీగా ఉన్నారు అడివి శేష్. వినయ్ కుమార్ ఈ సినిమాకు దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ‘గూఢచారి 2’ ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ► గృహిణి, యూ ట్యూబర్ అనుపమా మోహన్‌గా ‘భామా కలాపం’లో మెప్పించారు ప్రియమణి. డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకు వ్యూయర్స్ నుంచి మంచి స్పందన లభించింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘భామాకలాపం 2’ను రెడీ చేస్తున్నారు. బాపినీడు, సుధీర్ ఈదర నిర్మిస్తున్న ఈ సినిమాకు అభిమన్యు దర్శకుడు. అలాగే అంజలి నటించిన తొలి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘గీతాంజలి’. రాజ్‌కిరణ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2014లో విడుదలై, మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ తెరకెక్కుతోంది. రచయిత, నిర్మాత కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సత్యనారాయణ, జీవీ నిర్మిస్తున్న ఈ సీక్వెల్‌కు శివ తుర్లపాటి దర్శకుడు. అలాగే అనుష్కా శెట్టి హిట్ ఫిల్మ్ ‘భాగమతి’కు సీక్వెల్‌గా ‘భాగమతి 2’ తెరకెక్కనుంది. ► ‘బింబిసార 2’, ‘డెవిల్ 2’ ఉంటాయన్నట్లగా కల్యాణ్ రామ్ పేర్కొన్నారు. ‘మ్యాడ్ 2’ ‘మత్తు వదలరా 2’ చిత్రాల స్క్రిప్ట్ వర్క్ జరగుతోంది. ‘హను–మాన్’కు సీక్వెల్‌గా ‘జై హను–మాన్’ను ప్రశాంత్ వర్మ ప్రకటించారు. ‘రాక్షసుడు 2’ని దర్శకుడు రమేశ్ వర్మ ఆల్రెడీ ప్రకటించారు . ఇంకొన్ని సీక్వెల్ చిత్రాలున్నాయి. -
ముంబైలో డబుల్ ఇస్మార్ట్
హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సూపర్ హిట్టయిన విషయం తెలిసిందే. తాజాగా రామ్, పూరి కాంబినేషన్లోనే ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ తెరకెక్కుతోంది. ఇందులో సంజయ్ దత్ కీలక ΄ాత్రధారి. ఈ సినిమా కోసం ముంబైలో రామ్ ΄ాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ‘‘స్కంద’ కోసం బరువు పెరిగిన రామ్ ‘డబుల్ ఇస్మార్ట్’ కోసం బరువు తగ్గి, సిక్స్ ΄్యాక్తో మేకోవర్ అయ్యారు’’ అని యూనిట్ పేర్కొంది. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 8న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. -
RRR సీక్వెల్ ఉందా లేదా..?
-
సూపర్ హిట్ హారర్ మూవీ.. సీక్వెల్ వచ్చేస్తోంది!
దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు ఇంతకుముందు తెరకెక్కించిన చిత్రం 'డిమాంటీ కాలనీ'. అరుళ్ నిధి కథానాయకుడిగా నటించిన ఈ హార్రర్ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది. తాజాగా అదే దర్శకుడు దానికి సీక్వెల్‌గా డిమాంటీ కాలనీ– 2 చిత్రాన్ని స్వీయ నిర్మాణంలో రూపొందిస్తున్నారు. ఇందులోనూ అరుళ్ నిధి కథానాయకుడిగా నటిస్తున్నారు. నటి ప్రియా భవానీ శంకర్ నాయక్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ సంగీతాన్ని, హరీష్ కన్నన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. (ఇది చదవండి: ఓ ఇంటివాడు కాబోతున్న యంగ్ హీరో, పెళ్లికి ముహూర్తం ఫిక్స్!) కాగా ఇప్పుడు ఈ చిత్ర నిర్మాణంలో సాఫ్ట్ వేర్ సంస్థ అధినేత బాబీ బాలచందర్ భాగస్వామిగా చేరారు. ఈయన తాజాగా చిత్రం నిర్మాణ రంగంలోకి ప్రవేశించి ప్రపంచస్థాయిలో చిత్రాలను నిర్మించడానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగా డిమాంటీ కాలనీ –2 చిత్ర నిర్మాతలు నైట్ నైట్ ఎంటర్టైన్మెంట్ అధినేత విజయ్ సుబ్రహ్మణిన్, జ్ఞానముత్తు పట్టరై సంస్థ అధినేత ఆర్సీ రాజ్ కుమార్‌తో భాగస్వామి అయ్యారు. దీనిపై మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో చిత్ర దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు మాట్లాడుతూ.. బాబి బాలచంద్రన్ తమ చిత్రానికి భాగస్వామి కావడం గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. సాఫ్ట్ వేర్ రంగంలో టైకూన్ బిజినెస్ మెన్ అయినా ఆయన చిత్ర నిర్మాణ రంగంపై గౌరవంతో దీన్ని అదనపు వ్యాపారంగా భావించడం స్వాగతించదగ్గ విషయమన్నారు. ఎందుకు స్ఫూర్తిదాయకమైన ఆయన తమ చిత్రానికి భాగస్వామి కావడం సంతోషంగా ఉందని, దీంతో డిమాంటీ కాలనీ– 2 చిత్రం గ్లోబస్ స్థాయికి చేరుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. (ఇది చదవండి: ఇకపై నరేశ్ ఇంట్లోకి రమ్య రఘుపతికి నో ఎంట్రీ.. కోర్టు తీర్పు) -
ఆవారాకు సీక్వెల్ రెడీ...! ఫాన్స్ కు గుడ్ న్యూస్
-
'మా ఊరి పొలిమేర'-2 పోస్టర్ రిలీజ్
‘‘మా ఊరి పొలిమేర’ పోస్టర్ బాగుంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. గౌరు గణబాబు సమర్పణలో డా. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో గౌరీకృష్ణ నిర్మించిన చిత్రం ‘మా ఊరి పొలిమేర 2’. సత్యం రాజేష్, డా. కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రాకేందు మౌళి, అక్షత, బాలాదిత్య, సాహితి దాసరి, రవి వర్మ, చిత్రం శ్రీను ముఖ్య తారలు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రిలీజ్ చేశారు. ‘‘మా ఊరి పొలిమేర’ చూసి ఎగ్జయిట్ అయ్యాను. ఆ సినివ సీక్వెల్‌ను మా బ్యానర్లో చేసినందుకు డా. అనిల్ విశ్వనాథ్ గారికి ధన్యవాదాలు’’ అన్నారు గౌరీకృష్ణ. -
అంచనాలు పెంచుతున్న పొన్నియన్ సెల్వన్ 2 ట్రైలర్
మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ 1 ఎంతటి సంచనాలు సృష్టించిందో మనందరికీ తెలిసిందే! గతేడాది సెప్టెంబర్ 30న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజైన ఈ చిత్రానికి ఊహించని స్పందన లభించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్ల కలెక్షన్లు సాధించింది. దీంతో సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు ముస్తాబవుతోంది. ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా పొన్నియిన్ సెల్వన్ 2 రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా చిత్ర బృందం ట్రైలర్ రిలీజ్ చేసింది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే ..సముద్రంలో జరిగే ఫైట్ సీన్‌తో మొదలైంది. వారసుడు అయిన ‘అరుల్మొళి వర్మన్ (జయం రవి)’ చనిపోయాడనుకుని చోళ రాజ్యాన్ని ముక్కలు చేయాలనే ఆలోచనలో ఉంటారు. చోళ రాజు ‘అరుల్మొళి వర్మన్’ చనిపోయాడని వార్త అందుకున్న పాండ్యులు ‘ఆదిత్య కరికాలుడు (విక్రమ్)’ని కూడా చంపాలని ప్రణాళిక వేస్తారు. ఆ తర్వాత జరిగే ఊహించని మలుపుల నేపథ్యంలో ట్రైలర్ ఆసక్తిగా సాగింది. ఈ ట్రైలర్ మూవీ మరింత హైప్ క్రియేట్ చేస్తుంది. -
ఆ హీరోయిన్ను తప్పించి పూజా హెగ్డేకు ఛాన్సిచ్చిన సల్మాన్ ఖాన్!
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ హీరోయిన్ పూజా హెగ్డేతో ప్రేమాయణం సాగిస్తున్నాడంటూ బీటౌన్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ‘కిసీకా భాయ్ కిసీకి జాన్’ సినిమాలో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్న పూజా-సల్మాన్‌లు డేటింగ్ చేస్తున్నారంటూ ఫిల్మ్‌నగర్ వర్గాల్లో జోరుగా వినిపిస్తుంది. అంతేకాకుండా సల్మాన్ తాను చేయనున్న తర్వాత సినిమాల్లో పూజానే హీరోయిన్గా రిఫర్ చేస్తున్నాడంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. తాజాగా వాటినే నిజం చేశాడు సల్లూభాయ్. ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటైన ‘భజరంగీ భాయ్ జాన్’ సినిమా సీక్వెల్ రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే గతంలో ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన కరీనా కపూర్‌ని కాకుండా పూజా హెగ్డేను తీసుకోవడానికి సల్మాన్ డిసిషన్ తీసుకున్నాడు అంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. దీంతో మరోసారి వీరిద్దరి డేటింగ్ రూమర్స్ తెరపైకి వచ్చాయి. -
అతడి అడుగులో ప్రతి అంగుళం ఆయుధమే!
రోల్–ప్లేయింగ్ వీడియో గేమ్ ‘ఆక్టోపా త్ ట్రావెలర్–2’ నేడు విడుదల అవుతోంది. 2018లో వచ్చిన ‘ఆక్టోపాత్ ట్రావెలర్’కు సీక్వెల్‌గా వచ్చిన గేమ్ ఇది. ఈ ఆటలో ఎనిమిది క్యారెక్టర్లు ఉంటాయి. ప్రతి క్యారెక్టర్‌కు తనదైన ప్రత్యేకత ఉంటుంది. ‘హికారి’ ఒక యోధుడు...ఏ జర్నీ ఫర్ హోమ్ ‘అగ్నేయ’ ఒక డాన్సర్...ఏ జర్నీ ఫర్ స్టార్డమ్ ‘పా ర్టిటియో’ ఒక వ్యాపా రి...ఏ జర్నీ ఫర్ప్రా స్పెరిటీ ‘బస్వాల్ట్’ ఒక విద్యావేత్త....ఏ జర్నీ ఫర్ రివెంజ్ ‘థ్రోన్’ ఒక దొంగ...ఏ జర్నీ ఫర్ ఫ్రీడమ్ ‘టెమోనస్’ ఒక మతగురువు...ఏ జర్నీ ఫర్ ట్రూత్ ‘వొచెట్’ ఒక హంటర్...ఏ జర్నీ ఫర్ లెజెండ్స్ ‘కస్టీ’ ఒక మందుల వ్యాపా రి...ఏ జర్నీ ఫర్ మెమోరీస్. ఈ టర్న్–బేస్డ్ బ్యాటిల్ గేమ్‌లో ప్రతి ఎనిమీకి కొన్ని బలహీనతలు ఉంటాయి. అయితే సులభంగా కనుక్కునేలా ఉండవు. అవి ఏమిటో తెలుసుకుంటే ఆటలో అడుగులు ముందుకుపడతాయి. ఈ గేమ్‌లో డే టైమ్, నైట్ టైమ్ అనే రెండు సెగ్మెంట్లు ఉంటాయి. డే టైమ్‌లో ఆడే విధానానికి, నైట్ టైమ్‌లో ఆడే విధానానికి తేడా ఉంటుంది. డే టైమ్‌లో ఆడాల్సి వస్తే కొత్త స్కిల్స్లోప్రా వీణ్యం సంపా దించాల్సి ఉంటుంది. జానర్: రోల్ ప్లేయింగ్ మోడ్స్: సింగిల్ ప్లేయర్ ప్లాట్‌ఫామ్: నిన్టెండో స్విచ్, ప్లే స్టేషన్ 4, ప్లే స్టేషన్ 5, విండోస్ -
వినూత్నంగా బిచ్చగాడు 2 ప్రమోషన్స్, హీరో లేకుండా ట్రైలర్..!
తమిళ హీరో విజయ్ ఆంటోని హీరో తెరకెక్కితోన్న లేటెస్ట్ చిత్రం ‘బిచ్చగాడు 2’. గతంలో సాధారణ సినిమాగా విడుదలై సెన్షేషన్ క్రియేట్ ‘బిచ్చగాడు’కు ఇది సీక్వెల్. ప్రస్తుతం మూవీ షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఇదిలా రీసెంట్గా మలేషియలో జరిగిన షూటింగ్లో జరిగిన ప్రమాదంలో విజయ్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విజయ్ ఆంటోని 90 శాతం కోలుకున్నాడు. దీంతో అతడు షూటింగ్‌ను ప్రారంభించాడు. ఇక ఈ చిత్ర సమ్మర్ కానుకగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్‌ను వినూత్నంగా ప్రారంభించింది. చదవండి: ఆటో రామ్ ప్రసాద్‌కు క్యాన్సర్? స్పందించిన నటుడు తాజాగా బిచ్చగాడు 2కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వదిలారు మేకర్స్. టీజర్, ట్రైలర్లకు భిన్నంగా ‘స్నీక్ పీక్ ట్రైలర్’ అంటూ సినిమా ఓపెనింగ్ సన్నివేశాన్ని విడుదల చేసి, అంచనాలు పెంచుతోంది. నాలుగు నిమిషాల నిడివిగల ఈ ట్రైలర్లో ఎక్కడ హీరో గనిపించకపోవడం విశేషం. డబ్బు ప్రపంచానికి హానికరం అనే క్యాప్షన్‌తో రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తోంది. బ్రెయిన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనే భిన్న కాన్సెప్ట్‌తో బిచ్చగాడు 2 రానున్నట్లు తెలుస్తోంది. ఈ ఆధునాతనమైన టెక్నాలజీని డబ్బు కోసం ఎలా దుర్వినియోగం చేశాడు, దీని ఎదురయ్యే పరిణామాల చూట్టు బిచ్చగాడు 2 కథ ఉండోబోతుందని తెలుస్తోంది. చదవండి: ప్రకాశ్ రాజ్ కామెంట్స్‌పై ఘాటుగా స్పందించిన కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ -
అంజలి సూపర్ హిట్ వెబ్‌సిరీస్ 'ఝాన్సీ'కి సీక్వెల్
తమిళ సినిమా: నటి అంజలి ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్ సిరీస్ ఝాన్సీ. ట్రైబల్ హార్స్ ఎంటర్టైన్మెంట్పై నటుడు కృష్ణ నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్‌కు తిరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ మొదటి భాగం డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయ్యి విశేష ఆదరణను పొందింది. తాజాగా ఝాన్సీ రెండో భాగం గణతంత్ర దినోత్సవం సందర్భంగా అదే ఓటీటీలో స్ట్రిమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా వెబ్ సిరీస్ నిర్మిస్తున్న కృష్ణ మాట్లాడుతూ.. నిజానికి ఈ వెబ్ సిరీస్‌ను తెలుగులో రూపొందిస్తున్నామని.. తమిళం, హిందీ భాషల్లో అనువాదంగా స్ట్రీమింగ్ చేస్తున్నట్లు చెప్పారు. యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్న ఈ వెబ్‌సిరీస్ తొలి భాగం కంటే రెండో భాగానికి మరింత ఆదరణ లభిస్తోందని అన్నారు. ఝాన్సీ వెబ్ సిరీస్ మూడో భాగాన్ని రూపొందిస్తామని చెప్పారు. నిర్మాతగా కొనసాగుతున్న తాను కథానాయకుడిగా నటించిన మూడు చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయని తెలిపారు. త్వరలోనే తాను నటించే నూతన చిత్రం వివరాలను వెల్లడిస్తానని కృష్ణ చెప్పారు. దర్శకుడు తిరు మాట్లాడుతూ.. దీన్ని తెలుగులో రపొందించినా తమిళ ప్రేక్షకులకు నచ్చే విధంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. ఇప్పుడు హిందీలోన మంచి ఆదరణ లభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ వెబ్ సిరీస్ కోసం ఎంతగానో శ్రమించిన నటి అంజలి, చాందిని, యూనిట్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. -
గురిపెట్టిన అడివి శేష్.. గూఢచారి-2 ప్రీ వెర్షన్ లుక్ వీడియో వచ్చేసింది
ఓ మిషన్ మీద ఒక గూఢచారి ఇండియా నుంచి ఆల్ఫ్స్ పర్వతాలకు వెళతాడు. ఆ మిషన్ ఏంటి? ఎలా విజయం సాధించాడు? అనేవి తెలియడానికి ఇంకా సమయం ఉంది. గూఢచారి పాత్రలో అడివి శేష్ హీరోగా రపొందనున్న చిత్రం ‘గఢచారి 2’. ఈ చిత్రం ఫస్ట్ లుక్, ప్రీ విజన్ వీడియోను రిలీజ్ చేశారు. ‘గూఢచారి’కి సీక్వెల్‌గా ‘గూఢచారి 2’ రూపొందనుంది. కాగా తొలి భాగం భారతదేశంలో జరిగితే రెండో భాగం కథ ఇండియా నుంచి ఆల్ఫ్స్ పర్వతాలకు ప్రయాణిస్తుంది. అడివి శేష్ కథ అందించిన ఈ చిత్రం ద్వారా ఎడిటర్ వినయ్ కువర్ సిరిగినీడి దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించనున్నారు. -
'7జీ బృందావన కాలనీ' సీక్వెల్‌కు రెడీ
తమిళసినిమా: నిర్మాత ఎంఎం.రత్నం నిర్మించిన చిత్రం 7జీ రెయిన్బో కాలనీలో ఆయన కుమారుడు రవికృష్ణను కథానాయకుడిగా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో సోనియా అగర్వాల్ నాయకిగా నటించారు. సెల్వరాఘవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2004లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులోన 7జీ బృందావన్ కాలనీ పేరుతో అనువాదమై సక్సెస్ అయ్యింది. యువన్‌శంకర్ రాజా సంగీతం అందింన ఇందులోని పాటలు సూపర్‌హిట్ అయ్యాయి. ఆ తర్వాత రవికృష్ణ కొన్ని చిత్రాలు నటించినా అవేవీ ఆశించిన విజయాలను సాధించలేదు. దీంతో ఆయన చాలాకాలం నటనకు దూరంగా ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో 7జీ రెయిన్బో కాలనీ చిత్రానికి సీక్వెల్‌ను నిర్మించాలని ఆలోచన ఉన్నట్లు నిర్మాత ఎంఎం.రత్నం ఇటీవల ఒక వేదికపై పేర్కొన్నారు. అయితే ఇందులో నటించే హీరో హీరోయిన్లు ఎవరు, దర్శకుడు ఎవరు అనేది ఆయన ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుతం ఆయన తెలుగులో పవన్ కల్యాణ్ కథానాయకుడిగా హరిహర వీరమల్లు అనే భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బహుశా ఆ చిత్రం పూర్తయిన తర్వాత 7జీ రెయిన్బో కాలనీ సీక్వెల్‌పై దృష్టి పెడతారేమో చూడాలి. -
'గూఢచారి' మళ్లీ వస్తున్నాడు.. సీక్వెల్ అనౌన్స్ చేసిన అడివి శేష్
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ ప్రస్తుతం వరుస హిట్స్‌తో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది 'మేజర్', 'హిట్'-2లతో బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్న శేష్ తాజాగా తన నెక్ట్స్ మూవీని అనౌన్స్ చేశాడు. శేష్ కెరీర్లో టర్నింగ్ పాయింట్‌గా నిలిచిన గూఢచారి చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్‌తో రాబోతున్నట్లు ప్రకటించాడు. వినయ్ కుమార్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి శేష్ స్వయంగా కథ, స్క్రీన్ ప్లే అందించనున్నారు. జీ2 టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌మీదకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో జనవరి 9న ముంబై అండ్ ఢిల్లీలో మూవీ గ్రాండ్ లాంఛ్ ఉండనున్నట్లు శేష్ తెలిపాడు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేయనుంది. #G2 it is! Just a little taste for the New Year ❤️ An Epic Action Film visualized by our Brilliant Director @vinaykumar7121 You will know what I mean when you see our “Pre Vision” Video. We will Launch MASSIVE on Jan 9 in Mumbai & Delhi. #HappyNewYear guys 🔥#Goodachari2 pic.twitter.com/WkZ46elqJ2 — Adivi Sesh (@AdiviSesh) December 29, 2022 -
Jai Bhim 2: సూర్య జై భీమ్ సీక్వెల్ ఉంటుందా? నిర్మాత ఏమన్నారంటే..
తమిళసినిమా: నటుడు సూర్యకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిన చిత్రం జై భీమ్. ఆయన తన 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మించి కథానాయకుడిగా నటించిన చిత్రమిది. 1993 ప్రాంతంలో విల్లుపురం సమీపంలోని గిరిజనుల జీవన విధానాన్ని, వారి కష్టాలను ఈ చిత్రంలో చూపించారు. జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. జ్ఞానవేల్ దర్శకత్వం వహింన ఇందులో గిరిజనుల రక్షణ కోసం పోరాడిన న్యాయమూర్తి చంద్రు పాత్రలో సూర్య నటించారు. గిరిజనుల కోసం సర్య చేసిన న్యాయపోరాటమే జై భీమ్ చిత్రం. ఈ చిత్రం గత ఏడాది దీపావళి సందర్భంగా ఓటీటీలో విడుదలై విశేష ఆదరణ పొందడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. అంతేకాదు జై భీమ్ చిత్రం అకాడమీ అవార్డును గెలుచుకోవడంతో పాటు పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడి సూర్యను ప్రపంచానికి పరిచయం చేసింది. ఇటీవల గోవాలో జరిగిన అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ఈ చిత్రం ప్రదర్శింపబడింది. ఈ చిత్రోత్సవంలో పాల్గొన్న దర్శకుడు జ్ఞానవేల్ జై భీమ్ చిత్రానికి సీక్వెల్ ఉంటుందా? అన్న మీడియా ప్రశ్నకు న్యాయమూర్తి చంద్రు వాదించిన అనేక కేసులు ఉన్నాయన్నారు. వాటిలో ఏదో ఒక అంశంతో జై భీమ్‌కు సీక్వెల్‌ను కచ్చితంగా చేస్తామని అందులోనూ సూర్య నటిస్తారని బదులిచ్చారు. ఇదే విషయాన్ని నిర్మాత రాజశేఖర్ సైతం ద్రువీకరించారు. దీంతో కాస్త ఆలస్యంగానైనా జై భీమ్‌కు సీక్వెల్‌ను ఎదురు చూడవచ్చన్నమాట. -
కార్తికేయ-3పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన నిఖిల్
కార్తికేయ-2 సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న హీరో నిఖిల్. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. పాన్ ఇండియా స్థాయిలో సత్తాచాటిన ఈ సినిమా కంగా రూ.100 కోట్ల గ్రాస్ మార్కును దాటేసి.. మొత్తం 125 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. నిఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిందీ చిత్రం. నార్త్ ఆడియెన్స్‌కు కూడా ఈ సినిమా తెగ నచ్చేసింది. ఇక ఈ సినిమా సీక్వెల్ కార్తికేయ-3 కోసం అప్పుడే అందరిలోనూ ఆసక్తి మొదలయ్యింది. తాజాఆగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిఖిల్ కార్తికేయ-3పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు. త్వరలోనే దీనికి సంబంధించిన షూటింగ్ మొదలుపడతామని, అంతేకాకుండా కార్తికేయ-3ని 3Dలో రిలీజ్ చేయనున్నట్లు తెలిపాడు. మరి ఈ సినిమా ఇంకెన్ని సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది. -
డీజే టిల్లు 'రాధికా'కు షాక్.. ఆమె స్థానంలో మరో హీరోయిన్
యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డకు ఈ ఏడాది బ్రేక్ ఇచ్చిన సినిమా డీజే టిల్లు. విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది ఈ చిత్రం. సిద్దూ నటన, డైలాగ్ డెలివరీ యూత్‌ను ఫిదా చేసింది. ఈ సినిమా సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో సిద్దూ జొన్నలగడ్డకు జోడీగా నేహా శెట్టికి బదులుగా మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరణ్ నటించనున్నట్లు తెలుస్తుంది. రౌడీ బాయ్స్ చిత్రంతో రొమాన్స్ డోస్ పెంచిన అనుపమ ఈ చిత్రానికి ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ప్రస్తతం అనుపమ టాలీవుడ్ బిజీ హీరోయిన్గా కొనసాగుతుంది. ఇప్పటికే ఆమె నిఖిల్‌తో ’18పేజీస్’, ‘బటర్‌ఫ్లై’ అనే చిత్రల్లో నటిస్తుంది. -
'ది గ్రే మాన్' సీక్వెల్‌కి రెడీ అవుతున్న హీరో ధనుష్
వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ ధనుష్. కోలీవుడ్‌లో స్టార్ కథానాయకుడిగా ఎదిగిన ఈయనకు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు వరించింది. కోలీవుడ్ దాటి బాలీవుడ్, హాలీవుడ్ స్థాయికి ఎదిగిన ధనుష్ తాజాగా టాలీవుడ్‌ను టార్గెట్ చేశారు. ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించే ఈయన ఏ భాషలో నటించినా విజయాలను కైవసం చేసుకుంటున్నారు. బాలీవుడ్లో మంచి పేరు తెచ్చుకున్న ధనుష్ హాలీవుడ్లో ది జర్నీ ఆఫ్ ఫక్రి చిత్రంతో రంగ ప్రవేశం చేసి తాజాగా ది గ్రే మాన్ చిత్రంలో నటించారు. ప్రముఖ హాలీవుడ్ దర్శకులు రుస్సో బ్రదర్స్ తెరకెక్కింన ఈ చిత్రం గత నెల 22వ తేదీన నెట్ఫిక్స్ ఓటీటీలో విడుదలై మంచి ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ చిత్రం విజయోత్సవంతో ది గ్రే మాన్కు సీక్వెల్ రపొందించడానికి ఆ చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. souదీని గురించి నటుడు ధనుష్ తన ట్విట్టర్లో పేర్కొంటూ ది గ్రేమ్యాన్కు మంచి ఆదరణ లభించడం సంతోషంగా ఉందన్నారు. దీనికి సీక్వెల్ తయారవుతోంది.. మీరు రెడీనా? అంట పోస్ట్ చేశారు. ఆయన పోస్ట్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. కాగా ఈయన నటింన తిరుట్రంబలం చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. The Gray Man universe is expanding and the sequel is coming… Lone Wolf is ready, are you? #TheGrayMan @agbofilms @netflix @Russo_Brothers pic.twitter.com/b8FuJk9koJ — Dhanush (@dhanushkraja) August 6, 2022 -
సల్మాన్ కోసం స్టోరీ రాయలేదు: విజయేంద్ర ప్రసాద్
సల్మాన్ ఖాన్ కెరీర్లో భారీ హిట్‌గా నిలిచిన చిత్రం ‘బజరంగీ భాయిజాన్’. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. ఈ సినిమా విడుదలై నేటికి ఏడేళ్లు(2015, జూలై 17న విడుదలైంది). ఈ సందర్భంగా సీక్వెల్‌కు సంబంధించిన ఆసక్తికర విశేషాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు విజయేంద్ర ప్రసాద్. ‘‘చిరంజీవి ‘పసివాడి ప్రాణం’ స్ఫూర్తితో ‘బజరంగీ భాయి జాన్’ కథ రాశాను. అయితే కథ రాస్తున్నప్పుడు ఎవరినీ మనసులో ఊహించుకోలేదు.ఆ తర్వాత సల్మాన్‌కి నచ్చడంతో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు. తొలి భాగానికి ఏమాత్రం తగ్గకుండా సీక్వెల్ ఉంటుంది. తొలి భాగం ముగిసిన 8 ఏళ్ల నుంచి 10 ఏళ్ల తర్వాత రెండో భాగం కథ ఉంటుంది. ఇండియా, పాకిస్తాన్ మధ్య విద్వేషాలు తగ్గేలా స్టోరీ రాశాను’’ అన్నారు. ఈ చిత్రానికి ‘పవనపుత్ర భాయిజాన్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. -
గుడ్ న్యూస్.. త్వరలో 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' 9వ సీజన్ !
గేమ్ ఆఫ్ థ్రోన్స్.. వరల్డ్‌వైడ్‌గా అత్యధిక పాపులారిటీ పొందిన టీవీ షో. ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న ఈ షోకు అభిమానులు అనేకం. ఇందులోని నటినటుల యాక్టింగ్, పోరాట ఘట్టాలు, ఎమోషన్స్, రిలేషన్స్, విజువల్స్, డ్రాగెన్స్, వైట్ వాకర్స్ చెప్పుకుంటూ పోతే ప్రతిదీ అద్భుతమే. హెచ్‌బీవో నిర్మించిన ఈ టీవీ షో 8 సీజన్లతో ముగించడంతో అభిమానులందరూ తీవ్ర నిరాశకు గురయ్యారు. అందులోను సూపర్బ్‌గా అలరించిన 7 సీజన్లతో పోల్చుకుంటే 8వ సీజన్ ఫ్యాన్స్‌ను అసంతృప్తికి గురిచేసింది. దీంతో చాలా మంది హర్ట్ అయి.. తమకు సీక్వెల్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫ్యాన్స్‌కు హెచ్‌బీవో గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. డేనెరియస్ టార్గారియస్ (ఎమిలీ క్లార్క్)ను హీరో జాన్ స్నో (కిట్ హరింగ్టన్) హత్య చేసిన తర్వాత వెస్టెరోస్ను వదిలి నార్త్ ఆఫ్ ది వాల్‌కు ప్రయాణంచడంతో 8వ సీజన్ ముగుస్తుంది. ఈ ముగింపు ప్రేక్షకులకు ఎవరికీ అంతగా రుచించలేదు. దీంతో తన అసలు పేరు ఏగాన్ చటార్గారియస్ అని తెలుసుకున్న జాన్ స్నో పాత్రతో సీక్వెల్‌ను ప్లాన్ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ సిరీస్‌కు కొనసాగింపుగా కిట్ హరింగ్టన్ను హెచ్‌బీవో సంస్థ సంపద్రించినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై హెచ్‌బీవో నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. చదవండి: సైలెంట్‌గా తమిళ హీరోను పెళ్లాడిన తెలుగు హీరోయిన్.. కాలేజ్‌లో డ్యాన్స్ చేసిన సాయి పల్లవి.. వీడియో వైరల్.. డేటింగ్ సైట్లో తల్లి పేరు ఉంచిన కూతురు.. అసభ్యకరంగా మెసేజ్‌లు ఇదంతా నిజమై వచ్చే 9వ సీజన్లో డేనెరియస్ టార్గారియస్/మదర్ ఆఫ్ డ్రాగెన్ ప్రాణాలతో తిరిగి వస్తుందా? లేదా చూడాలి. ఇదిలా ఉంటే ఈ సిరీస్‌కు ప్రీక్వెల్ హౌస్ ఆఫ్ డ్రాగెన్ తెరకెక్కిస్తున్నట్లు ఇదివరకే ప్రకటించారు. ప్రస్తుతం ఈ ప్రీక్వెల్ చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో టార్గారియన్లోని అంతర్యుద్ధం చుట్టూ కథ ఉంటుందట. సుమారు 200 ఏళ్ల కిందట సింహాసనం కోసం జరిగిన యుద్ధాలను, వైట్ వాకర్స్ ఆవిర్భావం తదితర అంశాలకను చూపించే అవకాశం ఉందని సమాచారం. -
‘హిట్ 2’ రిలీజ్ డేట్ వచ్చేసింది, ఆ రోజే థియేటర్లో సందడి
Adivi Sesh Hit 2 Movie Release Date Locked: నాని నిర్మాతగా విశ్వక్ సేన్ హీరోగా 2020లో వచ్చిన 'హిట్ .. ది ఫస్టు కేస్' మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమాకు స్వీక్వెల్‌గా హిట్ 2ను నిర్మించారు. ఈ సీక్వెల్లో అడవి శేష్ హీరోగా నటించాడు. ' హిట్ ది సెకండ్ కేస్' అనే టైటిట్‌తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ఖరారు చేశారు మేకర్స్. జూలై 29వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు తాజాగా చిత్ర బృందం అధికారిక ప్రకటన ఇస్తూ పోస్టర్‌ను వదిలిలారు. చదవండి: రాజీవ్‌తో విడాకులపై స్పందించిన యాంకర్ సుమ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుంది. జాన్ స్టీవర్టు సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి - కోమలి ప్రసాద్ కథానాయికలుగా అందాల సందడి చేయనున్నారు. భానుచందర్, రావు రామేశ్, పోసాని కృష్ణ మురళి కీలక పాత్రలు పోషించారు. ఇదిలా ఉంటే అడివి శేష్ మరో చిత్రం మేజర్ 'మేజర్' మే 27వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ మూవీని సూపర్ స్టార్ మహేశ్ బాబు నిర్మించిన సంగతి తెలిసిందే. Something DANGEROUS about to unfold in the HIT universe! Get ready for spine chilling suspense on the 29th of July. #HIT2OnJuly29 #Hit2@NameisNani @KolanuSailesh @PrashantiTipirn #MeenakshiChaudhary @maniDop @Garrybh88 #JohnStewartEduri @ManishaADutt @SVR4446 pic.twitter.com/GfcAdjTj5K — Adivi Sesh (@AdiviSesh) May 2, 2022 -
రానాను పక్కన పెట్టిన శేఖర్ కమ్ముల? ఆ హీరోతో లీడర్-2
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్లలో శేఖర్ కమ్ముల కూడా ఒకరు. తనదైన స్టైల్‌తో క్లాసిక్ సినిమాలు తీసే శేఖర్ కమ్ముల రీసెంట్గా లవ్‌స్టోరీతో హిట్టు కొట్టిన సంగతి తెలిసిందే. ఇక ఆయన కెరీర్లో తీసిన బెస్ట్ మూవీస్‌లో లీడర్ ఒకటి. రానా దగ్గుబాటిని హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా సీక్వెల్ కోసం ఆడియెన్స్ ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చదవండి: కూతురి కోసం చిరంజీవి ఊహించని బహుమతి శేఖర్ కమ్ముల కోసం ఈ సినిమా సీక్వెల్ తప్పకుండా ఉంటుందని గతంలోనే వెల్లడించారు. తాజాగా ఈ సీనిమా సీక్వెల్‌పై ఓ వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. తమిళ స్టార్ హీరో సూర్య లీడర్-2లో నటించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కెనున్న ఈ చిత్రానికి సూర్య పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందన్నది త్వరలోనే తెలియనుంది. చదవండి: అనాథ పాపను దత్తత తీసుకోవాలనుకున్నా : స్టార్ హీరోయిన్ -
‘అందులో ఉన్న ఆత్మ సామాన్యమైనది కాదు'.. ఆసక్తిగా ట్రైలర్
కార్తీక్ఆర్యన్, కియారా అద్వానీ నటిస్తున్న సినిమా ‘భూల్ భులయ్యా-2’. ప్రియదర్శన్ దర్శకత్వంలో 2007లో వచ్చిన సూపర్ హిట్ ‘భూల్ భులయ్యా’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతోందీ చిత్రం. అక్షయ్‌కుమార్ హీరోగా నటించిన ఈ చిత్రం ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమిళం, తెలుగులోనూ చంద్రముఖి పేరుతో ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. భూల్ భూలైయా చిత్రం వచ్చి దాదాపు 15 ఏళ్ళు అయ్యింది. మళ్లీ ఇన్నాళ్లకు ఈ చిత్రం సీక్వెల్ రాబోతుంది. తాజాగా మేకర్స్ ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.‘పదిహేను సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎవరో ఆ తలుపును తట్టారు. అందులో ఉన్నది సామాన్యమైన ఆత్మ కాదు. అందులో ఉంది మంజులిక’ అంటూ టబు చెప్తుండటంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. రాజ్‌పాల్ యాదవ్, పరేశ్ రావల్ కీలకపాత్రల్లో నటించిన ఈ సినిమా మే 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
'సలార్' వచ్చేది అప్పుడేనా !.. ఆదిపురుష్‌కు సీక్వెల్ ఉండనుందా ?
Prabhas Salar Releasing In Summer Sequel To Adipurush: ‘సలార్’ సినిమా వచ్చే ఏడాది వేసవిలో థియేటర్స్‌కు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభాస్ హీరోగా ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 30 శాతం పూర్తయింది. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో లేదా జూన్ ఆరంభంలో రిలీజ్ చేయనున్నట్లుగా ఈ చిత్రనిర్మాత విజయ్ కిరగందూర్ పేర్కొన్నారు. విజయ్ కిరగందూర్ మాట్లాడుతూ.. ‘‘సలార్’ షూటింగ్ 30 శాతం పూర్తయింది. నెక్ట్స్ షెడ్యూల్ మే ప్రారంభంలో ఉండొచ్చు. సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. అయితే ‘సలార్’ రెండు భాగాలుగా రాబోతుందా? అనే విషయంపై మాత్రం ఆయన సరైన స్పష్టత ఇవ్వలేదు. శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ‘సలార్’ చిత్రంలో జగపతిబాబు ఓ కీ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మరో చిత్రం ‘ఆదిపురుష్’. ఈ మైథలాజికల్ ఫిల్మ్‌ను బీటౌన్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించారు. ఇందులో రాముడి పాత్రలో ప్రభాస్, సీతగా కృతీసనన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటించారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని, ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్‌పై ఓం రౌత్ వర్క్ చేస్తున్నారని బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. -
ఆ చీకటి ఙ్ఞాపకాల్లోకి మమ్మల్ని మళ్లీ లాగొద్దు : వెంకటేశ్
Venkatesh Drushyam 2 Movie Release Date Confirmed: వెంకటేశ్, మీనా ప్రధాన పాత్రలో నటించిన 'దృశ్యం-2' రిలీజ్ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాను ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అనుకోని ఆపదల నుంచి తన కుటుంబాన్ని, ముఖ్యంగా తన కుమార్తెను ఓ తండ్రి ఎలా రక్షించుకున్నాడు? అనే కథాంశంతో రూపొందిన సినిమా ఇది. మలయాళం సూపర్ హిట్ మూవీ ‘దృశ్యం 2’కు రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మాతృకను డైరెక్ట్ చేసిన జీతూ జోసఫే తెలుగు రీమేక్‌కు కూడా దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో ఈనెల 25న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. The truth has begun to unveil itself. But the question is - has it left a permanent scar on Rambabu? Watch #Drushyam2OnPrime, Nov. 25 on @PrimeVideoIN ▶️https://t.co/mL68iUtwzC#MeenaSagar #JeetuJoseph @SureshProdns @aashirvadcinema @antonypbvr @anuprubens #SatheeshKurup pic.twitter.com/YTkirX6oBH — Venkatesh Daggubati (@VenkyMama) November 12, 2021 -
కార్తికేయ-2 : హీరోయిన్ను రివీల్ చేశారు..
Karthikeya- 2 Heroine Revealed : నిఖిల్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో 2014లో వచ్చిన ‘కార్తికేయ’ చిత్రం మంచి హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘కార్తికేయ 2’ చేస్తున్నారు హీరో నిఖిల్, దర్శకుడు చందు. ఇందులో హీరోయిన్గా అనుపమా పరమేశ్వరన్‌ను తీసుకున్నారు. సోమవారం ‘అనుపమ ఆన్ బోర్డ్’ అనే విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో ‘కార్తికేయ 2’ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రం షూటింగ్ వేగంగా జరుగుతోంది. View this post on Instagram A post shared by Nikhil Siddhartha (@actor_nikhil) చదవండి : పెళ్లి రూమర్లపై స్పందించిన శ్రుతి హాసన్ పరిశ్రమకు చంద్రబాబు ఏం చేశారో? -
తలైవి సీక్వెల్..రెండో భాగంలో అంతిమయాత్ర వరకు..
చెన్నై: దివంగత ముఖ్యమంత్రి, నటి జయలలిత జీవిత చరిత్రతో తమిళం, తెలుగు, హిందీ భాషలో పాన్ ఇండియా చిత్రంగా తలైవి సినిమా నిర్మిస్తున్నారు. విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జయలలిత పాత్రలో బాలీవుడ్ సంచలన నటి కంగనా రనౌత్, ఎంజీఆర్ పాత్రలో అరవింద స్వామి నటిస్తున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలో థియేటర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా తలైవి చిత్రానికి సీక్వెల్ రూపొందించాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్టు తెలిసింది. మొదటి భాగంలో జయలలిత నట జీవితం, రాజకీయ రంగ ప్రవేశం, ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టే వరకు ఉంటుందని, రెండో భాగంలో సీఎంగా చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, ఆమె ఎదుర్కొన్న ఒడిదుడుకులు, అంతిమయాత్ర వరకు సాగుతుందని సమాచారం. దీని గురించి తలైవి చిత్రానికి మాటలు అందిస్తున్న మదన్ కార్గీ ట్విట్టర్లో పేర్కొంటూ జయలలిత గురించి రజనీకాంత్ కొన్ని విషయాలను చెప్పారని, తలైవి చిత్రానికి రెండో భాగం రూపొందిస్తే అందులో ఆయన చెప్పిన విషయాలను పొందుపరిచే అవకాశం ఉందని తెలిపారు. -
గజినీ సీక్వెల్లో అల్లు అర్జున్!
అఅ్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బన్నీకి కొద్ది రోజుల క్రితం కరోనా సోకడంతో ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది. ఇక పుష్ప తర్వాత అల్లు అర్జున్ కొరటాల శ్రీనివాస్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే కొరటాల మాత్రం ఎన్టీఆర్‌తో సినిమా పూర్తయిన తర్వాతే బన్నీ ప్రాజెక్టును పట్టాలెక్కించాలని అనుకుంటున్నాడట. సో ఈ గ్యాప్‌లో బన్నీ కూడా ఓ మూవీకి సైన్ చేయాలని భావిస్తున్నాడు. ఇందులో భాగంగా పలువురు దర్శకుల పేర్లు తెరపైకి వచ్చినా మురగదాస్‌తో సినిమా చేసేందుకు బన్నీఆసక్తి చూపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గజిని-2 సీక్వెల్ వీరి మధ్య చర్చకు వచ్చింది. ఎప్పటినుంచో గజినీ మూవీ సీక్వెల్ తీయాలని భావిస్తున్న మురగదాస్‌కు ఇప్పుడు హీరో దొరికేశాడని, ఇందుకు బన్నీ కూడా పచ్చజెండా ఊపినట్లు వార్తలు షికార్లు చేస్తున్నాయి. సూర్య, అసిన్ హీరో, హీరోయిన్లుగా 2005లో వచ్చిన ఈ సినిమా హిందీలోనూ రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు గజిని సీక్వెల్‌గా మురగదాస్ మరో కొత్త కథను రూపొందించనున్నారు. మరి ఈ సీక్వెల్ వర్షన్లో బన్నీ సరసన హీరోయిన్ ఎవరన్నది ఇంకా ఫైనల్ కాలేదు. త్వరలోనే మురగదాస్-బన్నీ కాంబినేషన్‌కు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చ అవకాశం ఉందని సినీ వర్గాలు అంటున్నాయి. చదవండి : అల్లు అర్జున్ను దారుణంగా అవమానించిన దిల్ రాజు! ‘వల్లంకి పిట్ట’ చిన్నారి ఇప్పుడెలా ఉంది, ఏం చేస్తుందో తెలుసా! -
పిక్చర్ అభీ బాకీ హై!.. సెట్స్‌పై సీక్వెల్స్ హంగామా
కాన్సెప్ట్ కొత్తగా ఉండి, సినిమాను ఆడియన్స్ వసూళ్ల రూపంలో మెచ్చుకుంటే ఆ కాన్సెప్ట్‌ను ముందుకు తీసుకువెళ్లే ఆలోచన చేస్తుంటారు దర్శక–నిర్మాతలు. కథను కొనసాగించడానికి అవకాశం ఉంటే, అది ఓ సిరీస్‌లా కూడా మారుతుంది. ప్రస్తుతం హిందీలో కొన్ని హిట్ చిత్రాలకు ‘పిక్చర్ అభీ బాకీ హై’ (సినిమా ఇంకా ఉంది) అంటూ సీక్వెల్స్ రానున్నాయి. ఆ చిత్రాలపై ఓ లుక్కేద్దాం. పిక్చర్ అభీ బాకీ హై! బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కెరీర్లో 2012లో వచ్చిన ‘ఏక్తా టైగర్’ సూపర్‌హిట్. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కత్రినా కైఫ్ హీరోయిన్గా నటించారు. ఆ తర్వాత ఐదేళ్లకు ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘టైగర్ జిందా హై’ సినిమా చేశారు సల్మాన్. కాన్సెప్ట్పరంగా ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ కలెక్షన్స్ పరంగా ఈ సినిమా హిట్టే. ఇప్పుడు టైగర్ ఫ్రాంచైజీలో ‘టైగర్ 3’ సెట్స్ మీద ఉంది. మనీష్ శర్మ డైరెక్ట్ చేస్తున్నారు. ఏక్తా టైగర్, టైగర్ జిందా హై సినిమాల్లో జంటగా నటించిన సల్మాన్, కత్రినా కైఫ్ ఈ సినిమాలో కూడా జోడీగా నటిస్తున్నారు. ఇక మరో బాలీవుడ్ యాక్షన్ హీరో జాన్ అబ్రహాం ఒకేసారి రెండు సీక్వెల్స్ చేస్తున్నారు. ‘సత్యమేవ జయతే 2’, ‘ఏక్ విలన్ రిటర్న్స్’ చిత్రాల్లో నటిస్తున్నారు జాన్. 2018లో ఆయన నటించిన ‘సత్యమేవ జయతే’ చిత్రం బంపర్‌హిట్ సాధించింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన ‘సత్యమేవ జయతే 2’ ఈ ఏడాది మే 13న విడుదల కానుంది. ఇందులో జాన్ ద్విపాత్రాభినయం చేయడం విశేషం. తొలి భాగానికి దర్శకత్వం వహించిన మిలప్ జవేరియే రెండో భాగాన్ని కూడా తెరకెక్కించారు. మోహిత్ సూరి డైరెక్షన్లో జాన్ అబ్రహాం, అర్జున్ కపూర్, దిశా పటానీ, తారా సుతారియా మెయిన్ లీడ్ రోల్స్‌గా రానున్న ‘ఏక్ విలన్’ (2014) సీక్వెల్ ‘ఏక్ విలన్ రిటర్న్స్’ వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న విడుదల కానుంది. 2018లో జాతీయ అవార్డు సాధించిన హిందీ చిత్రం ‘బదాయీ హో’కు స్వీకెల్‌గా ‘బదాయీ దో’ రూపొందుతోంది. ఫస్ట్ పార్ట్‌లో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించగా... ‘బదాయీ దో’లో రాజ్‌కుమార్ రావ్ హీరో. భూమీ ఫడ్నేకర్ హీరోయిన్. పోలీసాఫీసర్‌గా రాజ్‌కుమార్ రావ్, పీఈటీ టీచర్‌గా భూమీ ఫడ్నేకర్ కనిపిస్తారు. దాదాపు పన్నెండేళ్ల క్రితం ప్రియాంకా చోప్రా, జాన్ అబ్రహాం, అభిషేక్ బచ్చన్ల ‘దోస్తానా’ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఇప్పుడు నవ్వించే బాధ్యతను కార్తీక్ ఆర్యన్, జాన్వీ కపూర్, లక్ష్య తీసుకుని, కోలిన్ డైరెక్షన్లో ‘దోస్తానా 2’ను రెడీ చేస్తున్నారు. అలాగే కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న మరో సీక్వెల్ ‘భూల్ భులయ్యా2’... అదేనండీ... మన రజనీకాంత్ ‘చంద్రముఖి’ సినిమాను హిందీలో అక్షయ్‌కుమార్ హీరోగా ‘భూల్ భులయ్యా’గా తీశారు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘భూల్ భులయ్యా 2’ వస్తోంది. ఇందులో కార్తీక్ ఆర్యన్, టబు, కియారా అద్వానీ మెయిన్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. రెట్టింపు ‘హంగామా’ (2003)తో ‘హంగామా 2’ను రెడీ చేస్తున్నారు దర్శకుడు ప్రియదర్శన్. ఈ ‘హంగామా 2’ సినిమాతో ప్రణీత బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. పరేష్ రావల్, శిల్పాశెట్టి, జెఫ్రీ ‘హంగామా 2’లో నటించిన ఇతర ముఖ్యతారాగణం. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి మరోసారి రెడీ అయిపోయారు ‘బంటీ ఔర్ బబ్లీ’. అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, రాణీ ముఖర్జీ నటించిన తాజా ‘బంటీ ఔర్ బబ్లీ 2’లో సైఫ్ అలీఖాన్, రాణీ ముఖర్జీ, సిద్ధార్థ్ చతుర్వేది నటించారు. తెలుగు హిట్ మూవీ ‘పరుగు’ హిందీ రీమేక్ ‘హీరో పంతి’తో హీరోగా కెరీర్‌ను స్టార్ట్ చేసిన టైగర్ ష్రాఫ్ రీసెంట్గా ‘హీరో పంతి 2’ను అనౌన్స్ చేశారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్న ఈ సినిమా ఈ ఏడాది డిసెంబరు 3న రిలీజ్ కానుంది. ‘లవ్ సెక్స్ ఔర్ ధోకా’ సినిమా విడుదలై 11 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా ఈ మూవీ సీక్వెల్‌ను ప్రకటించారు నిర్మాత ఏక్తా కపూర్. హృతిక్ రోషన్ స్టార్‌డమ్‌ను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లిన సినిమా ‘క్రిష్’. ఈ సిరీస్‌లో ‘క్రిష్ 4’ను 2018లో అనౌన్స్ చేశారు హృతిక్. కానీ ఆయన తండ్రి, దర్శకుడు రాకేష్ రోషన్ ఆరోగ్య పరిస్థితుల కారణంగా ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి హోల్డ్‌లో ఉంది. ఈ సీక్వెల్స్‌తో పాటుగా ‘ఫుక్రే’ ఫ్రాంచైజీలో ‘ఫుక్రే 3’, ధర్మేంద్ర ‘అప్నే’ సినిమాకు సీక్వెల్‌గా ‘అప్నే 2’, ‘ఆంఖేన్ 2’ వంటి సీక్వెల్స్ వెండితెరపైకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి -
‘జాతి రత్నాలు’ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
నవీన్ పొలిశెట్టి ప్రధాన పాత్రలో అనుదీప్ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘జాతి రత్నాలు’. ఉప్పెన తర్వాత ఆ స్థాయిలో బాక్స్‌ఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన సినిమాగా నిలిచింది. చిన్న సినిమాగా విడుదలై ఊహించని స్థాయాలో వసూళ్లను రాబడుతోంది. వినోదమే ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు రాష్ల్రాలతో పాటు ఓవర్సీస్లోనూ సత్తా చాటుతోంది. మొదటి వారం పూర్తి కాక ముందే అర మిలియన్ డాలర్ల మార్క్‌ను సాధించి, మిలియన్ రేసులోకి అడుగుపెట్టి నిర్మాతలకు కాసుల పంట కురిపిస్తోంది. మార్చి 11న శివరాత్రి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం హైదరాబాద్‌లో విజయోత్సవ వేడుక నిర్వహించింది. ఈ సందర్భంగా డైరెక్టర్ అనుదీప్..జాతిరత్నాలు సీక్వెల్‌పై వస్తోన్న వార్తలపై స్పందించారు. తప్పకుండా జాతిరత్నాలు సీక్వెల్ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులకు ప్రత్యేకంగా కృతఙ్ఞతలు తెలిపారు. ఈ సినిమాతో అనుదీప్ దర్శకుడిగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. అయితే సినిమా విడుదలకు ముందే అనుదీప్‌కు సోషల్ మీడియాలోనూ విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. ఈ మధ్య కాలంలో హీరోకు సమానంగా డైరెక్టర్‌కు సైతం ఇంత పాపులారీటి రావడం అనుదీప్‌కే సొంతమైందని సినీ ప్రేక్షకులు అంటున్నారు. తనదైన కామెడీ పంచులతో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. స్వప్న సినిమాస్ బ్యానర్‌పై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ సినిమాకు రథన్ సంగీతం అందించారు. నవీన్‌కు జోడీగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటించగా, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. చదవండి : ఈ చిన్నసినిమా ఏకంగా బాహుబలి రికార్డునే బీట్ చేసింది (అలా హిట్టు పడగానే ఇలా రేటు పెంచిన 'జాతిరత్నం'!) -
సారీ.. ఇతడు మన కట్టప్ప కాదు!
నోర్సు పురాణం ఆధారంగా రూపుదిద్దుకున్న యాక్షన్ అడ్వెంచర్ గేమ్ గాడ్ ఆఫ్ వార్ (2018) పాప్లర్ అయింది. దీని సీక్వెల్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. విడుదల తేదీతో పాటు, టైటిల్ గురించి కూడా ఆసక్తి పెరిగింది. ఆమధ్య రిలీజ్ అయిన టీజర్లో ‘రాగ్నరాక్ ఈజ్ కమింగ్’ అనే సౌండ్ వినిపించింది. అధికారికంగా ప్రకటించక పోయినప్పటికీ ‘గాడ్ ఆఫ్ వార్: రాగ్నరాక్’ అనేదే టైటిల్ అంటున్నారు. ఈ సింగిల్ ప్లేయర్ వీడియో గేమ్ సరికొత్త సాంకేతిక సొబగులతో ముందుకు రానుంది. చదవండి: ‘ఒక అబ్బాయికి పాడిన ఏకైక గాయనిని నేనే’ ‘చెడు అలవాట్లు మానుకోవడం మంచి అలవాటు’ -
ఫ్యాన్స్‌కు మోహన్‌లాల్ న్యూ ఇయర్ గిఫ్ట్
సూపర్ స్టార్ మోహన్ లాల్, మీనా నటించిన సూపర్ హిట్ థ్రిల్లర్ 'దృశ్యం2' న్యూ ఇయర్ కానుకగా అమెజాన్ ప్రైమ్‌లో విడుదల అయ్యింది. దీనికి సంబంధించి ఇప్పటికే అర్థరాత్రి టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మోహన్‌లాల్ మాట్లాడుతూ..జార్జ్ కుట్టి, అతని కుటుంబం కథతో ముందుకు వస్తున్నామని, ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఎంతో ఆసక్తితో ఉన్నట్లు పేర్కొన్నారు. జీతు జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనా, సిద్దిక్, ఆశా శరత్, మురళి గోపీ, అన్సిబా, ఎస్తేర్, సైకుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. 2013లో విడుదలైన దృశ్యం మొదటి పార్ట్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం మలయాళంలో బాక్సాఫీస్ వద్ద రూ .50 కోట్లు వసూలు చేసిన మొదటి చిత్రంగా రికార్డుకెక్కింది. మొదటి పార్ట్‌లో ఎక్కడైతే కథ ఆగిందో సెకండ్ పార్ట్‌లో అక్కడినుంచి కంటిన్యూ కానుంది. థ్రిల్లర్ కథాంశం, సస్పెన్స్ ఈ సినిమాను పెద్ద హిట్ చేశాయి. ఇప్పటికే తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, సింహళీ (శ్రీలంక) భాషల్లో ఈ చిత్రం రీమేక్ అయిన సంగతి తెలిసిందే. అది కాకుండా గత దశాబ్దంలో ఎక్కవ భాషల్లో రీమేక్ అయిన సినిమాల్లో ‘దృశ్యం’ ఒకటి. చైనీస్ భాషలో రీమేక్ అయిన తొలి భారతీయ సినిమా కూడే ఇదే కావడం విశేషం. మోహన్ లాల్ మే 21న తన 60 వ పుట్టినరోజు సందర్భంగా దృశ్యం సీక్వెల్ ప్రకటించినా కరోనా కారణంగా షూటింగ్ ప్రక్రియ ఆలస్యమయ్యింది. కాగా మోహన్‌లాల్ తదనంతరం జీతు జోసెఫ్ దర్శకత్వంలోనే ‘రామ్’ అనే మరో చిత్రానికి సైన్ చేశారు. Georgekutty and his family are coming soon on @PrimeVideoIN#Drishyam2OnPrime #HappyNewYear2021 #MeenaSagar #JeethuJoseph @antonypbvr @aashirvadcine @drishyam2movie #SatheeshKurup pic.twitter.com/5l7cfCdCS3 — Mohanlal (@Mohanlal) December 31, 2020 -
ఉత్తమ థ్రిల్లర్ సీక్వెల్‌కు రెడీ!
తిరువనంతపురం: 2013 లో విడుదలైన మోహన్ లాల్ ‘దృశ్యం’ చిత్రం భారతీయ సినిమాల్లో ఇప్పటివరకు చేసిన ఉత్తమ థ్రిల్లర్లలో ఒకటి. ఈ సినిమా మలయాళంలో బాక్సాఫీస్ వద్ద రూ .50 కోట్లు వసూలు చేసిన మొదటి చిత్రంగా రికార్డుకెక్కింది. మోహన్ లాల్ మే 21న తన 60 వ పుట్టినరోజు సందర్భంగా దృశ్యం సీక్వెల్ ఉండబోతుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి జీతు జోసెఫ్ దర్శకత్వం వహిస్తారని ప్రకటించారు. ఆగస్టు 17 నుంచి ఈ చిత్రం షూటింగ్‌కు మోహన్‌లాల్ అంగీకరించారని, దీనికి సంబంధించి ఈ వారాంతంలో పరిశ్రమలోని నిపుణులు, నిర్మాతలతో సమావేశం నిర్వహించే ఆలోచనల్లో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. (ఆ వార్తల్లో నిజం లేదు : కత్తి మహేష్) ఈ సమావేశంలో కరోనా సంక్షోభ పరిస్థితిని అధిగమించడానికి తీసుకోవలసిన భద్రతా చర్యలు, ఇతర ఆర్థిక విషయాలపై చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుతం దృశ్యం 2 ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో నటించబోయే మిగిలిన తారాగణాన్ని త్వరలో ప్రకటించనున్నారు. గత నెలలో కేరళ ప్రభుత్వం లాక్డౌన్ ఆంక్షలను సడలించిన క్రమంలో సినిమా షూటింగ్‌ల కోసం అనుమతించింది. సునామి అనే మలయాళ చిత్రం జూన్ మధ్యలోనే కొంతమంది సిబ్బందితో తిరిగి షూట్ ప్రారంభించింది. ఇదిలావుండగా, మోహన్ లాల్ ‘మరక్కర్: అరబికడాలింటే సింహాం’ సినిమా ఏప్రిల్‌లో తెరపైకి రావాల్సి ఉండగా కరోనా కారణంగా ఈ చిత్రం వాయిదా పడింది. దీని తరువాత జీతు జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్న ‘రామ్’ అనే మరో చిత్రానికి సంతకం చేశారు. ఈ చిత్రంలోని ప్రధాన భాగాలను విదేశాలలో చిత్రీకరించాల్సిన అవసరం ఉన్నందున వచ్చే ఏడాది షూటింగ్ చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. (బై ముంబై.. వెళ్లిపోతున్నా: హీరోయిన్) -
త్రిపాత్రాభినయం చేయబోతున్నా
హీరో విశాల్– దర్శకుడు మిస్కిన్ కాంబినేషన్లో ‘తుప్పారివాలన్’ (తెలుగులో డిటెక్టివ్) అనే చిత్రం వచ్చింది. మంచి సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ తెరకెక్కుతుంది. మిస్కి దర్శకత్వంలోనే విశాల్ హీరోగా నటిస్తూ, ఈ సీక్వెల్‌ను నిర్మిస్తున్నారు. బడ్జెట్ సమస్యల కారణంగా సినిమా నుంచి తప్పుకున్నారు దర్శకుడు మిస్కిన్. దాంతో దర్శకత్వ బాధ్యతలను చేపట్టారు విశాల్. ‘‘దర్శకత్వం చేయాలనే ఆలోచన నాకు ఎప్పుట్నుంచో ఉంది. కానీ ఇలా వస్తుందని ఊహించలేదు. ఇది మారువేషంలో వచ్చిన అదృష్టంలా భావిస్తున్నాను. సినిమా మేకింగ్‌లో అన్ని బాధ్యతలు దర్శకుడి మీదే ఉంటాయి. డైరెక్షన్ చేయడానికి ఎగ్జయిటింగ్‌గా ఉన్నాను. ఈ సినిమాకు త్రిపాత్రాభినయం (నటన–నిర్మాణం– దర్శకత్వం) చేయబోతున్నాను’’ అన్నారు విశాల్. -
మార్చి 21న ‘ప్రేమ కథా చిత్రమ్ 2’
సుధీర్ బాబు, నందితలు హీరో హీరోయిన్లుగా తెరకెక్కి ఘనవిజయం సాధించిన సినిమా ప్రేమ కథా చిత్రమ్. మారుతి కథ అందించిన ఈ సినిమాకు జె ప్రభాకర్ రెడ్డి దర్శకుడు. కామెడీ హర్రర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ కావటంతో సుమంత్ అశ్విన్ హీరోగా సీక్వెల్ ను తెరకెక్కించారు. ప్రేమ కథా చిత్రం 2 పేరుతో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. హరి కిషన్ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కించిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో ఒక హీరోయిన్గా జంబ లకిడి పంబ ఫేం సిద్ధి ఇద్నాని నటిస్తుండగా మరో హీరోయిన్ గా ఎక్కడికి పోతావు చిన్నావాడా ఫేం నందిత శ్వేత నటించారు. ప్రేమ కథా చిత్రానికి నిర్మాతగా వ్యహరించిన సుదర్శన్ రెడ్డి సీక్వెల్‌ను కూడా నిర్మిస్తున్నారు. -
సీక్వెల్ కుదిరిందా?
గతేడాది బాలీవుడ్లో వచ్చిన ‘వీరే ది వెడ్డింగ్’ సినిమా వందకోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. శశాంక్ ఘోష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కరీనాకపూర్, సోనమ్ కపూర్, స్వర భాస్కర్, శిఖా తల్సానియా ముఖ్య తారలుగా నటించారు. సోనమ్ కపూర్ సిస్టర్ రియా కపూర్ ఒక నిర్మాతగా ఉన్నారు. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ రూపొందనుందా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. మహిళా సాధికారిత, హక్కుల నేపథ్యంలో కరీనా కపూర్ ఓ రేడియో షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిం ఈ షోలో భాగంగా సోనమ్ కపూర్‌కు కాల్ చేశారు కరీనా. మహిళల హక్కుల గురించి సోనమ్ తన అభిప్రాయాలను పంచుకున్న తర్వాత కాల్ చివర్లో ‘మనం వీరే ది వెడ్డింగ్ 2’ సెట్లో కలుసుకుందాం అని కరీనాతో ఫోన్లో అన్నారు సోనమ్. దీంతో ‘వీరే ది వెడ్డింగ్ 2’ సెట్స్‌పైకి వెళ్లనుందనే ప్రచారం ఊపందుకుంది. అంతేకాదు.. ఈ సినిమాతో సోనమ్ కపూర్ డైరెక్టర్‌గా మారనున్నారని బాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. -
‘కేజీయఫ్ చాప్టర్ 2’కు ముహూర్తం ఫిక్స్
కన్నడనాట సంచలనం సృష్టించిన సూపర్ హిట్ సినిమా కేజీయఫ్. యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కన్నడలోనే కాదు తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ రిలీజ అయి మంచి టాక్ సొంతం చేసుకుంది. కేజీయఫ్ ప్రారంభించినప్పుడే రెండు భాగాలుగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. తొలి భాగం ఘన విజయం సాధించటంతో ఇప్పుడు సెకండ్ పార్ట్‌పై దృష్టి పెట్టారు. కేజీయఫ్ చాప్టర్ 1కు కొనసాగింపుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మార్చి నెలలో సెట్స్ మీదకు వెళ్లనుంది. తొలి భాగంలో గరుడను అంతం చేసిన రాఖీ, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌ను ఎలా సొంతం చేసుకున్నాడు.. తన నేర సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించాడు. చివరకు ఏమయ్యాడు? అన్న విషయాలను రెండో భాగంలో చూపించనున్నారు. తొలి భాగం అన్ని భాషల్లో కలిపి 225 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అత్యధిక కలెక్షన్లు సాదించిన కన్నడ సినిమాగా ఆల్‌టైం రికార్డ్ సాధించటం విశేషం. -
నయన్ చిత్ర సీక్వెల్లో కాజల్
నయనతార చిత్ర సీక్వెల్లో నటించే అవకాశం కాజల్‌అగర్వాల్‌ను వరించిందనే వార్త వైరల్ అవుతోంది. కోలీవుడ్‌లో లేడీ సూపర్‌స్టార్‌గా వెలిగిపోతున్న హీరోయిన్ నయనతార. ఈ అమ్మడికి వద్దంటే అవకాశాలు అన్న పరిస్థితి. పారితోషికం భారీగానే ఉన్న నయన చుట్టూనే అవకాశాలు తిరుగుతున్నాయి. ఇక కాజల్ అగర్వాల్ అగ్ర కథానాయికల పట్టికలో ఉన్నా, ప్రస్తుతం అవకాశాలు మాత్రం అంతంత మాత్రమే. ఎందుకో గానీ టాలీవుడ్లో ఉన్నంత క్రేజ్ ఈ అమ్మడికి కోలీవుడ్‌లో రాలేదు. విజయ్, అజిత్, కార్తీ, విశాల్ లాంటి స్టార్ హీరోలతో రొమాన్స్ చేసినా అంతగా స్టార్‌డమ్‌ను పొందలేకపోయింది. ప్రస్తుతం తమిళంలో ప్యారీస్ ప్యారీస్ అనే ఒక్క చిత్రమే చేతిలో ఉంది. తెలుగులోనూ ఒకటి రెండు చిత్రాల్లో నటిస్తోంది. మూడు పదులు దాటిన పెళ్లి కాని కథానాయకిల లిస్ట్‌లో ఈ అమ్మడు ఒకరు. అయినా పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపించని కాజల్‌కు కోలీవుడ్‌లో తాజాగా మరో క్రేజీ ఆఫర్ తలుపుతట్టినట్లు సమాచారం. ఇంతకు ముందు జయంరవి హీరోగా తెరపైకి వచ్చి సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న చిత్రం తనీఒరువన్. మోహన్‌రాజా దర్శకత్వం వహించిన ఇందులో నయనతార కథానాయకి. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించనున్నట్లు దర్శకుడు ఇటీవల అధికారిక పూర్వకంగా వెల్లడించిన విషయం తెలిసిందే. ఇందులో జయంరవికి జంటగా ఇద్దరు భామలు నటించనున్నారని, అందులో మొదటి భాగంలో నటించిన నయనతారనే నటించనున్నట్లు ప్రచారం జరిగింది. మరో నాయకిగా నటి సాయోషాసైగల్ నటించే అవకాశం ఉన్నట్లు, ఇక అరవిందస్వామి పాత్రలో మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టిని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఇందులో నయనతారకు బదులు నటి కాజల్ అగర్వాల్‌ను నటింపజేసే పనిలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలిసింది. ఇక సాయేషాసైగల్ విషయంలో ఎలాంటి మార్పు లేకపోయినా, తనీఒరువన్ పార్టు 1లో విలన్‌గా విజృంభించిన అరవిందస్వామినే పార్టు 2లోనూ నటింపజేయాలని చిత్ర దర్శక నిర్మాతలు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగక తప్పదు. -
స్త్రీక్వెల్
హర్రర్ కామెడీ చిత్రాలకు బాక్సాఫీస్ వద్ద మంచి గిరాకీ ఉందని ‘స్త్రీ’ సినిమా రూపంలో మరోసారి ప్రూవ్ అయ్యింది. అమర్ కౌశిక్ దర్శకత్వంలో రాజ్‌కుమార్ రావ్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం ‘స్త్రీ’. దినేష్ విజన్‌తో పాటు రాజ్ అండ్ డీకే నిర్మించారు. ఆగస్టు 31న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అలాగే మంచి బాక్సాఫీస్ నంబర్స్‌తో టీమ్ కూడా బహుత్ ఖుషీ అవుతున్నారు. అందుకే ‘స్త్ర్రీ’ సినిమాకు సీక్వెల్‌ను ప్లాన్ చేస్తున్నారట చిత్రబృందం. ‘‘ఈ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు థ్యాంక్స్. సీక్వెల్ గురించి మా సినిమా రైటర్స్ రాజ్ అండ్ డీకేకు ఐడియాస్ ఉన్నట్లు ఉన్నాయి. అన్నీ కుదిరితే సీక్వెల్ గురించి త్వరలోనే అనౌన్స్మెంట్ ఉండొచ్చు’’ అని పేర్కొన్నారు హీరో రాజ్‌కుమార్ రావ్. -
స్క్రీన్ ప్లే 20th August 2018
-
ఫస్ట్‌లుక్ 20th August 2018
-
మెట్రోలో ఎవరుంటారు?
‘బర్ఫీ, జగ్గా జాసుస్’ సినిమాల తర్వాత దర్శకుడు అనురాగ్ బసు రూపొందించబోయే నెక్ట్స్ సినిమా బాలీవుడ్లో ఓ హాట్ టాపిక్. దానికి కారణం అందులో నటించబోయే నటీనటులే. 2007లో అనురాగ్ రూపొందించిన ‘లైఫ్ ఇన్ ఏ మెట్రో’కి సీక్వెల్‌గా ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారాయన. ఇందులో కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్, అర్జున్ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా ముఖ్య పాత్రల్లో కనిపిస్తారట. అలాగే రాజ్ కుమార్ రావ్, నవాజుద్ధిన్ సిద్ధిఖీ కూడా ముఖ్య పాత్రల్లో కనిపిస్తారట. ‘‘భారీ తారాగణం ఉన్నప్పుడు అందరి డేట్స్ సెట్ చేయడం శ్రమతో కూడుకున్న పని. సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశాం. అందరి క్యాలెండర్ సంవత్సరం పాటు ఖాళీ లేదు. ఫైనలైజ్ అయిన తర్వాత అనౌన్స్ చేస్తాను’’ అన్నారు దర్శకుడు అనురాగ్ బసు. మరి సెకండ్ మెట్రోలో ఎవరెవరు భాగం అవుతారో వేచి చూడాలి. -
‘భారతీయుడు 2’కి లైన్ క్లియర్
లోక నాయకుడు కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ల కాంబినేషన్లో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా భారతీయుడు. తమిళ్లో రూపొందిచన ఈసినిమా తెలుగు, హిందీ భాషల్లోనూ ఘనవిజయం సాధించింది. చాలా కాలంగా ఈ సినిమాకు సీక్వల్‌ను రూపొందించేందుకు దర్శకుడు శంకర్, హీరో కమల్ హాసన్‌ను ప్రయత్నిస్తున్నారు. అయితే ఇద్దరు బిజీగా ఉండటంతో ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. శంకర్ 2.ఓ సినిమా షూటింగ్లో ఉండగానే భారతీయుడు సీక్వెల్‌ను తెరకెక్కించనున్నట్టుగా ప్రకటించారు. అంతేకాదు శంకర్, కమల్‌లు ఒకే వేధిక నుంచి అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు. ఈ లోగా కమల్ రాజకీయాల్లో బిజీ కావటం, శంకర్ తెరకెక్కిస్తున్న 2.ఓ వాయిదా పడటంతో భారతీయుడు 2 పట్టాలెక్కలేదు. తాజాగా కమల్ తన సినీ భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చారు. తప్పకుండా సినిమాల్లో కొనసాగుతానని చెప్పటం, శంకర్ కూడా 2.ఓ రిలీజ్ డేట్ ప్రకటించటంతో త్వరలోనే భారతీయుడు 2 పట్టాలెక్కనుందని తెలుస్తోంది. ముందుగా ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించేందుకు సిద్దమయ్యారు. అయితే ప్రాజెక్ట్ డిలే కావటం, బడ్జెట్ కూడా భారీగా పెరిగిపోవటంతో దిల్ రాజు తప్పుకున్నారు. దీంతో 2.ఓ సినిమాను నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో భారతీయుడు 2ను రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
ఫస్ట్‌లుక్ 5th July 2018
-
ధోని బయోపిక్ సీక్వెల్..!
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అభిమానులకు ఉత్సాహం కలిగించే వార్త ఒకటి బాలీవుడ్లో చక్కర్లు కొడుతుంది. ధోనీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'ఎంఎస్ ధోని - ద అన్‌టోల్డ్ స్టోరీ' చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలో ఎంఎస్ ధోని చిత్రానికి సీక్వెల్ రూపొందించనున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. ధోని పాత్రలో అద్భుతమైన నటన కనబరిచి.. ఫ్యాన్స్‌తో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, ఈ చిత్ర సీక్వెల్ కోసం చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. 2011లో ప్రపంచకప్ విజయం తర్వాత ధోని జీవితంలోని ముఖ్య ఘట్టాలను సీక్వెల్లో చూపెట్టనున్నట్టు సమాచారం. ధోని వ్యక్తిగత జీవితాన్ని కూడా తెరపై అవిష్కరించే విధంగా సీక్వెల్‌ను రూపొందించాలని సుశాంత్ భావిస్తున్నారని ఆయన సన్నిహితులు తెలిపారు. మొదటి పార్ట్ మాదిరిగానే ఇందులో కూడా ధోని జీవితంలోని వాస్తవాలను చూపించేలా స్రిప్ట్ వర్క్ జరుగుతుందని వారు వెల్లడించారు. సీక్వెల్‌కు ఎవరు దర్శకత్వం వహిస్తారనేది ఇంకా ఖారారు కాలేదని పేర్కొన్నారు. ఈ చిత్ర షూటింగ్ వచ్చేడాది ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. కాగా, 2016లో విడుదలైన ఎంఎస్ ధోని చిత్రానికి నీరజ్ పాండే దర్శకత్వం వహించగా, దిశా పటాని, కైరా అద్వానీ ఇతర ముఖ్య పాత్రలో నటించారు. -
ఇద్దరు భామలతో ‘ప్రేమ కథా చిత్రం 2’
సుధీర్ బాబు, నందితలు హీరో హీరోయిన్లుగా తెరకెక్కి ఘనవిజయం సాధించిన సినిమా ప్రేమకథా చిత్రం. మారుతి కథ అందించిన ఈ సినిమాకు జె ప్రభాకర్ రెడ్డి దర్శకుడు. కామెడీ హర్రర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ కావటంతో సుమంత్ అశ్విన్ హీరోగా సీక్వెల్ ను ప్రారంభించారు. ప్రేమ కథా చిత్రం 2 పేరుతో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్ త్వరలోనే పట్టాలెక్కనుందని తెలుస్తోంది. హరి కిషన్ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. ఒక హీరోయిన్గా జంబ లకిడి పంబ ఫేం సిద్ధి ఇద్నాని నటిస్తుండగా మరో హీరోయిన్ గా ఎక్కడికి పోతావు చిన్నావాడా ఫేం నందిత శ్వేత నటించనుంది. ప్రేమ కథా చిత్రానికి నిర్మాతగా వ్యహరించిన సుదర్శన్ రెడ్డి సీక్వెల్‌ను కూడా నిర్మిస్తున్నారు. -
త్రీ ఇడియట్స్ మళ్లీ వస్తారా
ఆల్మోస్ట్ తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి ‘త్రీ ఇడియట్స్’ సినిమా రిలీజై. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో ఆమిర్‌ఖాన్, మాధవన్, శర్మాన్ జోషి ముఖ్య తారలుగా రూపొందిన ఈ సినిమా ఓన్లీ బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాదు ఆడియన్స్‌లోనూ సూపర్‌హిట్ సాధించింది. ఈ సినిమా ఇతర భాషల్లో రీమేక్ అవ్వడమే కాదు, పరాయి దేశాల సినీ అభిమానులను మెప్పించింది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ తెరకెక్కనుందని బాలీవుడ్ టాక్. ప్రస్తుతం స్క్రిప్ట్ ఇనిషియల్ స్టేజ్‌లో ఉందట. ‘త్రీ ఇడియట్స్’ సినిమాకు సీక్వెల్‌ను తీయాలన్న ఆలోచన ఉంది. కొన్ని రోజుల క్రితం ఈ వర్క్ మొదలైంది. ఇంకా డెవలప్ చేయాల్సి ఉంది’’ అని తన సన్నిహితులతో అన్నారట హిరానీ. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో రూపొందిన సంజయ్‌దత్ బయోపిక్ ‘సంజు’ ఈ నెల 29న విడుదల కానుంది. ఇందులో రణబీర్ కపూర్ లీడ్ రోల్ చేశారు. ఇదిలా ఉంటే ‘త్రీ ఇడియట్స్’ సీక్వెల్‌కి ముందు ‘లగే రహో మున్నా భాయ్’ సినిమా సీక్వెల్‌ను హిరానీ రూపొందిస్తారని టాక్. అంటే ‘త్రీ ఇడియట్స్’ రావడం కాస్త లేట్ అయినా రావడం పక్కా అన్నమాట. -
పేరుకే సీక్వెల్..
తమిళసినిమా: కోలీవుడ్‌లో సీక్వెల్ ట్రెండ్ అధికంగా సాగుతోందని చెప్పవచ్చు. ఎందిరన్‌కు సీక్వెల్‌గా 2.ఓ చిత్రం పూర్తి కావస్తున్న విషయం తెలిసిందే. గతంలో ప్రభు, ప్రభుదేవా కలిసి నటించిన చార్లీచాప్లిన్‌కు కొనసాగింపు నిర్మాణంలో ఉంది. త్వరలో కమలహాసన్ ఇండియన్ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కడానికి రెడీ అవుతోంది. తాజాగా అరమ్–2 చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అరమ్ నటి నయనతారను లేడీ సూపర్‌స్టార్ చేసిన చిత్రం ఇది. ప్రజాక్షేమం కోసం తపించే ఒక జిల్లా అధికారిణిగా నయనతార నటనకు సినీ విమర్శకులు సైతం ప్రశంసల వర్షం కురిపించారు. ఈ చిత్రం ప్రేక్షకుల మధ్య విశేష ఆదరణను చూరగొంది. దీంతో ఈ చిత్ర సీక్వెల్‌కు నయనతార గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఆ చిత్ర దర్శకుడు గోపీనయినర్ ఇప్పుడు కథను వండే పనిలో ఉన్నారు. దీని గురించి ఆయన చెబుతూ ఈ చిత్రం పేరును ప్రస్తుతానికి అరమ్–2 అని అనుకుంటున్నామని, అయితే కథ వేరేలా ఉంటుంద న్నారు. చిత్ర కథకు అరమ్ చిత్ర కథకు సంబంధం ఉండదని చెప్పారు. అయితే అరమ్ చిత కథలానే ఈ చిత్రం కథ సామాజక అంశంతో కూడి ఉంటుందని తెలిపారు. ఇందులో నయనతార పాత్ర పూర్తిగా విభిన్నంగా ఉంటుందని చెప్పారు. షూటింగ్‌ను సెప్టెంబర్‌లో ప్రారంభించనున్నట్లు దర్శకుడు గోపీనయినర్ వెల్లడించారు. చిత్ర కథ డాక్టర్ అంబేడ్కర్ రాజ్యాంగ అంశాలను ఆవిష్కరించే విధంగా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. అయితే అరమ్–2 పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్దిరోజులు ఆగాల్సిందే. -
తిడతారని తెలుసు.. అయినా ఆ పాటను చేశాం!
సాక్షి, సినిమా : ఆణిముత్యాల్లాంటి సినిమాలనుగానీ, పాటలను గానీ రీమేక్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే వాటిని చెడగొట్టారన్న విమర్శలు పెద్ద ఎత్తున్న వినిపిస్తుంటాయి. ఈ మధ్య బాలీవుడ్లో అలాంటిదే ఒకటి జరిగింది. 1988లో తేజబ్ సినిమాలోని ఏక్ దో తీన్ సాంగ్‌ను తాజాగా బాఘీ-2 చిత్రం కోసం రీమిక్స్ చేసిన విషయం తెలిసిందే. క్లాసిక్ సాంగ్‌లో మాధురి దీక్షిత్ స్టెప్పులు ఇరగదీస్తే... ఇప్పుడీ కొత్త పాటలో శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ చిందులేసింది. అయితే పాట క్వాలిటీ పరంగానే కాదు.. విజువల్‌గా, డాన్సుల పరంగా కూడా అంత బాగోలేదని విమర్శకులు పెదవి విరిచేశారు. పైగా సోషల్ మీడియాలో ఈ ప్రయత్నంపై చిత్ర దర్శకుడు అహ్మద్ ఖాన్‌పై ప్రేక్షకులు కొందరు దుమ్మెత్తిపోశారు. దర్శకుడి వివరణ... ఈ నేపథ్యంలో దర్శకుడు అహ్మద్ ఖాన్ స్పందించాడు. పాటను సినిమాలో పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడే విమర్శలకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. ఇక పాటకు డాన్సులు సమకూర్చుంది అహ్మదేనంటూ ఓ వార్త చక్కర్లు కొట్టింది. దీనిపై కూడా ఆయన స్పందించారు. ‘ఆ పాటను ప్రముఖ డాన్స్ మాస్టర్ గణేశ్ ఆచార్య కంపోజ్ చేశారు. ఆ విషయంలో నేను ఎలాంటి జోక్యం చేసుకోలేదు. పైగా పాట చిత్రీకరణ జరుపుకున్న సమయంలో ఆ దరిదాపులకు కూడా నేను వెళ్లలేదు’ అని అహ్మద్ చెప్పుకొచ్చాడు. ‘పాటను నాశనం చేయాలన్న ఉద్దేశం మాకు లేదు. కేవలం క్లాసిక్ పాటకు ప్రేక్షకులకు మళ్లీ గుర్తు చేద్దామన్న ప్రయత్నం మాత్రమే మాది. అయినా ఈ పాటపై విమర్శించే వారిని మేం పట్టించుకోలేదల్చుకోలేదు. కాకపోతే ఈ పాటపై మాధురి దీక్షిత్ అభిప్రాయం కోసం ఎదురు చూస్తున్నాం’ అని ఆయన వెల్లడించారు. మరోవైపు సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్‌తోపాటు ఈ పాట ఒరిజినల్ కంపోజర్(తేజబ్ చిత్రం) సరోజ్ ఖాన్ కూడా ఈ ప్రయత్నంపై అభినందనలు గుప్పిస్తూ.. చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. టైగర్ ష్రాఫ్, దిశా పఠానీ జంటగా నటించిన భాఘీ తెలుగు క్షణం సినిమాకు రీమేక్. మార్చి 30న ఈ చిత్రం విడుదల కానుంది. -
'కార్తికేయ 2' వచ్చే ఏడాది మొదలవుతోంది..!
నిఖిల్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కార్తికేయ. సుబ్రమణ్యం స్వామి గుడి నేపథ్యంలో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. స్వామిరారా సక్సెస్ తో మంచి జోష్ లో ఉన్న నిఖిల్ కు 'కార్తికేయ' సక్సెస్ స్టార్ ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. అందుకే కార్తికేయ రిలీజ్ తరువాత ఆ సినిమాకు సీక్వెల్ ను రూపొందించడానికి ప్రయత్నాలు ప్రారంభించారు చిత్రయూనిట్. ప్రస్తుతం కన్నడ రీమేక్ పనుల్లో బిజీగా ఉన్న నిఖిల్, మరోసారి కార్తీకేయ సీక్వల్ పై క్లారిటీ ఇచ్చాడు. తొలి భాగం రిలీజ్ అయి మూడేళ్లు అవుతున్న సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపిన వారికి వచ్చే ఏడాది సీక్వల్ మొదలవుతుందని తెలిపారు. తొలి భాగాన్ని ఒక గుడి నేపథ్యంలోనే తెరకెక్కించిన చందూ రెండో భాగాన్ని అమర్నాథ్ యాత్ర నేపథ్యంలో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నట్టుగా గతంలో వార్తలు వినిపించాయి. Karthikeya Part 2... Script Loading... ☺️ https://t.co/bo941J83fT — Nikhil Siddhartha (@actor_Nikhil) 24 October 2017 3 yrs went by quick.. It's my most favorite film... There will be a 2nd installement starting next year.. #Karthikeya #3yrs @chandoomondeti https://t.co/Aic6d7j7FW — Nikhil Siddhartha (@actor_Nikhil) 24 October 2017 -
వడివేలుతో బిల్లా–2 హీరోయిన్
తమిళసినిమా: హాస్యనటుడు వైగైపులి వడివేలు మళ్లీ హీరోగా రెడీ అయ్యారు. హింసై అరసన్ 23ఆమ్ పులికేసి చిత్రంతో కథానాయకుడిగా అవతారమెత్తిన ఈయన ఆ చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొందడంతో ఇకపై హీరోనే అం టూ హాస్య పాత్రలకు నో చెప్పారు. అయితే అలా కొన్ని చిత్రాల్లో నటించినా అవేవీ విజ యం సాధించలేదు. అదే సమయంలో నటు డు విజయకాంత్‌తో విభేదాలు, రాజకీయ రం గప్రవేశం వంటి అంశాలతో వడివేలు ఇబ్బం దులు పడ్డారు. చాలా కాలం నటనకు దూరంగా ఉన్న వడివేలు ఈ మధ్య కత్తిసండై చిత్రం ద్వారా మళ్లీ హాస్య పాత్రల బాట పట్టారు. ప్రస్తుతం విజయ్ హీరోగా నటిస్తున్న మెర్శల్ చిత్రంలోనూ కామెడీ రోల్ పోషిస్తున్నారు. కా గా హింసై అరసన్ 23ఆమ్ పులికేసి చిత్రంతో 2006లో హీరోగా పరిచయం అయిన వడివేలు 11 ఏళ్ల తరువాత ఆ చిత్ర సీక్వెల్లో హీరోగా నటిస్తున్నారు. ఆ చిత్రాన్ని తెరకెక్కించిన శింబుదేవన్నే ఇప్పుడు దాని సీక్వెల్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక హింసై అరసన్ 23ఆమ్ పులికేసి చిత్రాన్ని నిర్మించిన స్టార్ దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని లైకా సంస్థతో కలిసి నిర్మిస్తున్నారు. చాలా కాలం తరువాత ఆయన మళ్లీ చిత్ర నిర్మాణం చేపట్టారని చెప్పాలి. కాగా దీనికి హింసై అరసన్ 24ఆమ్ పలికేసి అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇకపోతే ఇందులో నాయకిగా ఇంతకు ముందు అజిత్‌కు జంటగా బిల్లా–2 చిత్రంతో రొమాన్స్ చేసిన పార్వతి ఓమనకుట్టాన్ నటించనున్నట్లు సమాచారం. ఈ బ్యూటీ మాజీ మిస్ ఇండియానే కాకుండా మిస్ వరల్డ్ పోటీలో ఫస్ట్ రన్నర్‌గా నిలిచిందన్నది గమన్హారం. హింసై అరసన్ 24 ఆమ్ పులికేసి చిత్రం బుధవారం షూటింగ్‌తో ప్రారంభమైంది. చెన్నై చివారు ప్రాంతంలోని స్టూడియోలో ఈ చిత్రం చిత్రీకరణ జరుపుకుంటోంది. దీనికి జిబ్రాన్ సంగీత భాణీలు కడుతున్నారు. -
సమ్మర్లోనే రెండో సామి?
విక్రమ్, త్రిష జంటగా హరి దర్శకత్వంలో 14 ఏళ్ల క్రితం విడుదలైన ‘సామి’ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్స్ పరంగా కేక పుట్టించింది. ఆ తర్వాత ఈ సినిమాను తెలుగు, బెంగాలీ, కన్నడ, హిందీ భాషల్లో రీమేక్ చేశారు. హిట్ ఫార్ములాతో తీసిన ‘సామి’కి స్పెషల్ క్రేజ్ ఉంది. ఈ సినిమాకి సీక్వెల్ చేయడానికి హరి–విక్రమ్ రెడీ అయ్యారట. మొదటి భాగంలో లీడ్ రోల్ చేసిన త్రిష ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేయనుండగా, కీర్తీ సురేశ్‌ను మెయిన్ హీరోయిన్గా తీసుకున్నారట. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ 15న స్టార్ట్ కానుందని∙టాక్. ‘సామి’ని సమ్మర్లో విడుదల చేశారు. సీక్వెల్‌ని కూడా వచ్చే సమ్మర్లో రిలీజ్‌కి టార్గెట్ చేశారట. -
దిల్ రాజు బ్యానర్లో హిట్ సినిమా సీక్వల్
ఈ శుక్రవారం కేశవ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నిఖిల్, తరువత చేయబోయే సినిమాలను కూడా వరుసగా లైన్లో పెట్టాడు. ఇప్పటికే రెండు రీమేక్‌లకు కమిట్ అయిన ఈ యంగ్ హీరో తన హిట్ సినిమాకు సీక్వల్‌ను కూడా లైన్లో పెట్టాడు. వరుసగా ప్రయోగాత్మక చిత్రాలతో విజయం సాధిస్తున్న నిఖిల్ తన సూపర్ హిట్ సినిమా కార్తికేయకు సీక్వల్‌ను రెడీ చేస్తున్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ కార్తికేయ. ఈ సినిమాకు సీక్వల్ చేసే ఆలోచన ఉందంటూ హీరో, డైరెక్టర్ చాలా కాలంగా చెపుతున్నారు. అయితే నిఖిల్ అప్పటికే కమిట్ అయిన సినిమాలతో బిజీగా ఉండటం, చందూ కూడా ప్రేమమ్‌తో మరో హిట్ సాధించటంతో కార్తికేయ సీక్వల్ డిలే అవుతూ వచ్చింది. ఈ గ్యాప్‌లో చందూ ఇతర హీరోలతో సినిమా చేయాలని భావించినా ఏదీ సెట్స్ మీదకు రాలేదు. దీంతో మరోసారి నిఖిల్‌తో కార్తికేయ సీక్వల్‌ను సెట్స్ మీదకు తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నాడు దర్శకుడు చందూ మొండేటి. హీరో నిఖిల్ కార్తికేయ సీక్వల్‌ను అఫీషియల్‌గా ఎనౌన్స్ చేశాడు. ప్రస్తుతం కేశవ ప్రమోషన్లో బిజీగా ఉన్న నిఖిల్, చందూ దర్శకత్వంలో కార్తికేయ సీక్వల్ ఈ ఏడాదిలోనే ప్రారంభమవుతుందని తెలిపాడు. దిల్ రాజు నిర్మించనున్న ఈ సినిమా కార్తికేయకు పర్ఫెక్ట్ సీక్వల్ అని, ఆ సినిమా ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచే రెండో భాగం మొదలవుతుందని తెలిపాడు. అయితే టాలీవుడ్లో సీక్వల్ సినిమాలు హిట్ అయిన దాఖలాలు చాలా తక్కువు మరి బాహుబలి తరుహాలో ఆ సెంటిమెంట్‌ను కార్తికేయ కూడా బ్రేక్ చేస్తుందేమో చూడాలి. -
బాబాయ్ సినిమా సీక్వల్లో అబ్బాయ్..!
సీనియర్ స్టార్ వెంకటేష్ హీరోగా తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా గురు. సుధ కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమాకు సీక్వల్‌ను తెరకెక్కించే ప్లాన్‌లో ఉంది దర్శకురాలు సుధ కొంగర. ఇప్పటికే సీక్వల్కు సంబంధించి ఓ స్టోరి లైన్ కూడా రెడీ చేసుకుందట. ప్రస్తుతం పూర్తి స్క్రీప్ట్ రెడీ చేసే పనిలో ఉంది. అయితే తొలి భాగాన్ని వెంకటేష్ హీరోగా తెరకెక్కించిన దర్శకురాలు, సీక్వల్లో హీరోను మార్చాలని నిర్ణయించింది. గురు సినిమా సీక్వల్కు యంగ్ హీరో రానాను లీడ్ రోల్‌కు తీసుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే లైన్ విన్న రానా ఫుల్ స్క్రీప్ట్ రెడీ చేయమన్నాడు. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నేనే రాజు నేనే మంత్రి సినిమా షూటింగ్లో పాల్గొంటున్న రానా, బాహుబలి పార్ట్ 2 రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత సుధ దర్శకత్వంలో సినిమా ఉండే ఛాన్స్ ఉంది. అయితే తొలి భాగంలో వెంకీ చేసిన పాత్రకు రానా పాత్రను ఎలా కనెక్ట్ చేస్తారో చూడాలి. బాబాయ్ ఆకట్టుకున్న కోచ్ పాత్రకు అబ్బాయి రానా ఎంత వరకు న్యాయం చేస్తాడో అని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
బన్నీ 'డిజె' అదుర్స్ సీక్వలా..?
సరైనోడు సినిమాతో కెరీర్లోనే బిగెస్ట్ హిట్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ షార్ట్ గ్యాప్ తరువాత హరీష్ శంకర్ దర్శకత్వంలో డిజె సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దువ్వాడ జగన్నాథమ్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన అదుర్స్ సినిమాకు సీక్వల్ అన్న టాక్ వినిపిస్తోంది. చాలా కాలంగా ఎన్టీఆర్‌తో అదుర్స్ సినిమాకు సీక్వల్ చేసే ఆలోచనలో ఉన్నాడు దర్శకుడు వివి వినాయక్. అయితే ఆ సినిమా కార్యరూపం దాల్చకముందే హరీష్ శంకర్ బన్నీతో ఈ సినిమా మొదలెట్టేశాడు. డిజెలో అల్లు అర్జున్ బ్రాహ్మణుడి పాత్రలో కనిపించనున్నాడట. డైలాగ్స్‌తో పాటు, బాడీలాంగ్వేజ్ కూడా అలాగే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు బన్నీ. ఈ సినిమా దర్శకుడు హరీష్ శంకర్ అదుర్స్ సినిమాకు రచనా సహకారం అందించాడు. ఆ సినిమాలో చారి, బ్రహ్మీల మధ్య కామెడీ సీన్స్‌ను రాసింది కూడా హరీషే. అందుకే ఇప్పుడు చారీ పాత్రను పూర్తి స్థాయి కథానాయకుడిగా మార్చి దువ్వాడ జగన్నాథమ్ సినిమాను తెరకెక్కిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను సమ్మర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
విశాల్ కల ఇప్పుడు నెరవేరబోతోంది!
-
మహేష్ మూవీ సీక్వలా..?
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో యాక్షన్ డ్రామాలో నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తుండగా తమిళ నటుడు దర్శకుడు ఎస్ జె సూర్య ప్రతినాయక పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబందించి మరో ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. మహేష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా.. గతంలో విజయ్ హీరోగా నటించిన తుపాకి సినిమాకు సీక్వల్ అన్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా తమిళనాట ఈ ప్రచారం జోరుగా జరుగుతోంది. మరి ఈ ప్రచారం నిజమో కాదో తెలియాలంటే మాత్రం యూనిట్ సభ్యుల నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. -
మళ్లీ...జింతాత జిత జిత?
‘‘పోలీసోడికి ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్‌కే వెళ్తాడు.. పోస్టాఫీసుకి కాదు’’ అంటూ పదేళ్ల కిందట వచ్చిన ‘విక్రమార్కుడు’ చిత్రంలో రవితేజ చెప్పిన డైలాగ్ ఇది. అదే సినిమాలో ‘జింతాత జిత జిత జింతాత తా...’ డైలాగ్ కూడా చాలా పాపులర్ అయింది. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం ఎంత హిట్ అయిందో తెలిసిందే. రవితేజ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రాల్లో ఇదొకటి. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకు? అనేగా మీ డౌట్. ‘విక్రమార్కుడు’ చిత్రానికి సీక్వెల్ తీయనున్నారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్లో వినిపిస్తోంది. రచయిత విజయేంద్రప్రసాద్ కథ సిద్ధం చేసే పనిలో ఉన్నారని సమాచారం. గత ఏడాది వచ్చిన ‘బెంగాల్ టైగర్’ చిత్రం తర్వాత రవితేజ ఇప్పటి వరకూ ఏ చిత్రం కమిట్ కాలేదు. మధ్యలో పలువురి దర్శకుల పేర్లు వినిపించినా ఏదీ పట్టాలెక్కలేదు. రవితేజతో పూరీ జగన్నాథ్ ‘ఇడియట్’కు సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నారనే వార్తలు వినిపించినా అదీ ఫైనల్ కాలేదు. లేట్ అయినా లేటెస్ట్గా ఓ మంచి పవర్ఫుల్ కథతో రావాలనే ఆలోచనలో రవితేజ ఉన్నట్లు సమాచారం. అది ‘విక్రమార్కుడు’ సీక్వెల్ అవుతుందనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ సీక్వెల్‌కి రాజమౌళి దగ్గర చేస్తున్న సహాయ దర్శకుల్లో ఎవరో ఒకరు దర్శకత్వం వహిస్తారట. -
బ్రేకప్ కే బాద్!
దర్శకుడు విజయ్‌ని ప్రేమించి, పెళ్లి చేసుకున్న హీరోయిన్ అమలా పాల్ ఆ తర్వాత కూడా సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. కెరీర్ పరంగా ఇద్దరూ సక్సెస్ చూసినా, వ్యక్తిగత జీవితం పరంగా ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. ‘ఇదీ కారణం’ అని చెప్పలేదు కానీ, ఇద్దరూ విడాకులు తీసుకోవడానికి డిసైడ్ అయిపోయారు. భర్త నుంచి బ్రేకప్ కే బాద్... కథానాయిక అమలా పాల్ ఎడాపెడా సినిమాలు సంతకాలు చేసేస్తున్నారు. తమిళ చిత్రం ‘తిరుట్టు పయలే’కి సీక్వెల్‌గా రూపొంద నున్న చిత్రంలో నటించడానికి అంగీకరించానని సోమవారం ట్విట్టర్ ద్వారా అమలా పాల్ ప్రకటించారు. మరోవైపు ‘వడ చెన్నై’ చేస్తున్నారు. అలాగే కన్నడంలో ‘హెబ్బులి’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఓ మలయాళ చిత్రం కూడా అంగీకరించారు. ఇవన్నీ ఇలా ఉండగా తాజా ఖబర్ ఏమిటంటే, ఓ తెలుగు చిత్రంలో నటించడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అమలాపాల్ సమాచారం. ‘అల్లరి’ నరేశ్ హీరోగా అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుందని కృష్ణానగర్ కబురు. మలయాళ చిత్రం ‘ఒరు వడక్కన్ సెల్ఫీ’కి ఈ తాజా తెలుగు ప్రయత్నం రీమేక్ అని భోగట్టా. దాంతో, తెలుగు సినీ పరిశ్రమలో ఈ వార్త సంచలనం అవుతోంది. ఇదే కనక నిజమైతే కొంత గ్యాప్ తర్వాత హీరోయిన్ అమలా పాల్ తెలుగులో అంగీకరించిన చిత్రం ఇదే అవుతుంది.. భర్త విజయ్ నుంచి బ్రేక్ కే బాద్ కమిట్ అయిన తొలి తెలుగు చిత్రమూ ఇదే అవుతుంది. -
తిరుట్టుపయలే సీక్వెల్లో అమలాపాల్ ?
తిరుట్టుపయలే చిత్రానికి సీక్వెల్ తెరకెక్కనుంది. పదేళ్ల క్రితం తెరపైకి వచ్చిన చిత్రం తిరుట్టుపయలే. అక్రమ సంబంధాలు, చిల్లర దొంగతనాలు అంటూ చర్చనీయాంశ సన్నివేశాలతో కూడిన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. సుశీగణేశన్ దర్శకత్వం వహించిన ఇందులో జీవన్, అబ్బాస్, సోనియా అగర్వాల్, మాళవిక ప్రధాన పాత్రలు పోషించారు. ఏజీఎస్ ఎంటర్టెరుున్మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, కన్నడం, హింది భాషలలోనూ రీమేక్ అరయిందన్నది గమనార్హం. కాగా అలాంటి చిత్రానికి సీక్వెల్ రూపకల్పనకు సన్నాహాలు జరుగుతున్నాయన్నది తాజా సమాచారం. తిరుట్టుపయలే చిత్ర దర్శక నిర్మాతలే ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఇందులో జీవన్ పాత్రను నటుడు బాబీసింహా, అబ్బాస్ పాత్రను నటుడు ప్రసన్న పోషించనున్నారు. ఇక నటి సోనియా అగర్వాల్ పాత్రకు అమలాపాల్‌ను ఎంపిక చేశారన్నది తాజా సమాచారం. ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుందని తెలిసింది. చర్చనీయాంశ కథా చిత్రంలో నటి అమలాపాల్ ఎలా నటించడానికి అంగీకరించారన్న సందేహం అవసరం లేదు. ఎందుకంటే ప్రారంభ దశలోనే ఈ భామ సింధూసమవెళి అనే చిత్రంలో భర్తతో కాపురం చేస్తూ మేనమామతో అక్రమ సంబంధం పెట్టుకునే యువతి పాత్రలో నటించి సంచలనం కలిగించారన్నది గుర్తుంచుకోవాలి. భర్త విజయ్ నుంచి విడిపోరుు ప్రస్తుతం నటనపైనే దృష్ట సారిస్తున్న అమలాపాల్ ప్రస్తుతం ధనుష్‌కు జంటగా వడైయచెన్నై చిత్రంలో నటిస్తున్నారన్నది గమనార్హం. -
సూపర్‌స్టార్ కబాలి-2 చేస్తారా?
తమిళసినిమా; కబాలి ఫీవర్ ఇంకా తగ్గలేదు. వసూళ్ల జోరు తగ్గలేదు. దటీజ్ సూపర్‌స్టార్ స్టామినా అనక తప్పదు. రజనీకాంత్ నటించిన తాజా చిత్రం కబాలి. ఈ చిత్రం విడుదలకు ముందు ఆ తరువాత కూడా ఒక సంచలనం. ఈ నెల 22న ప్రపంచవ్యాప్తంగా తెరపైకి వచ్చిన కబాలి సూపర్‌స్టార్ గత చిత్రాలకు పూర్తిగా భిన్నం అని చెప్పక తప్పదు. ఎందుకం టే ఇందులో రజనీకాంత్ తరహా స్టైల్ కనిపిం చదు. పంచ్‌డైలాగ్స్ ఉండవు. ఇంకా చెప్పాలంటే రజనీ తరహా నటనను చూడలేం. ఆయన హావభావాల నుంచి అన్నీ చాలా కొత్తగా ఉంటాయి. ఆ క్రెడిట్ మాత్రం దర్శకు డు రంజిత్‌దే అని చెప్పక తప్పదు. అయితే కబాలి చిత్రం అందర్నీ అలరిస్తోందని చెప్పలేం. కొందరు ఆహా ఓహో అంటున్నారు. మరి కొందరు ఓకే అంటున్నారు. ఇంకొందరు పెదవి విరుస్తున్నారు. నటి లక్ష్మీరామకృష్ణన్ వంటి వారు రజనీకాంత్ చిత్రాన్ని ఇంకా ఎక్కువ ఊహించామని అంటున్నారు. ఇలా కబాలి చిత్రంపై ఎవరి అభిప్రాయాలు వారికున్నాయి. కబాలి-2లో రజనీ? కాగా కబాలి చిత్రం చూసిన వారు దీనికి పార్టు-2 వస్తుందా?అంటూ చర్చించుకుంటున్నా రు. క్లైమాక్స్‌ను దర్శకుడు ఆ విధంగా ముగింపు పలికారు. కబాలి తన పాఠశాల పిల్లల ప్రశ్నలకు సమాధానం ఇస్తుండగా ఆ పాఠశాలకు చెందిన ఇక విద్యార్థికి మలేషియా పోలీస్అధికారి ఒక తుపాకీ ఇచ్చి కబాలి వద్దకు పంపడం, అతను రాగానే స్క్రీన్ బ్లాక్ అవడం, ఈ తరువాత తుపాకీ పేలిన శబ్ధం రావడం చాలా సస్పెన్స్‌ను క్రియేట్ చేసింది. కాగా కబాలి చిత్రానికి సీక్వెల్ ఉంటుందా? అన్న ప్రశ్నకు ఆ చిత్ర నిర్మాత కలైపులి ఎస్.ధాను తాను రెడీ అన్నట్టు కోలీవుడ్ మీడియాలో జరుగుతున్న ప్రచారం. అయితే కబాలి-2లో నటించడానికి సూపర్‌స్టార్ అంగీకరిస్తారా?అసలు ఈ చిత్రంపై ఆయన వ్యక్తిగత అభిప్రాయం ఏమిటి? అన్న విషయాలు రజనీకాంత్ నోరు విప్పితేనే తెలుస్తుంది. అమెరికా నుంచి ఆదివారమే చెన్నైకి తిరిగొచ్చిన ఆయన కబాలి చిత్రంపై స్పందన కోసం యావత్ సినీప్రేక్షకుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. మరి మన సూపర్‌స్టార్ అసలు కబాలి గురించి స్పందిస్తారో?లేదో? వేచి చూడాల్సిందే. కాగా ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వంలో రోబో-2 చిత్రాన్ని పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కలెక్షన్లు కొల్లగొడుతున్న కబాలి అయితే రజనీకాంత్ అభిమానుల్ని మాత్రం కబాలి విపరీతంగా అలరిస్తోంది. వారు చాలా ఖుషీ అవుతున్నారు. ఇలా మిశ్రమ స్పందన వస్తున్నా దానితో నిమిత్తం లేకుండా కబాలి కలెక్షన్లలో మాత్రం బాక్సాపీస్ బద్ధలైపోతోంది. ఈ విషయంలో మాత్రం మరో మాట లేదు. ఇప్పట వరకూ భారతీయ సినీ చరిత్రలో ఏ చిత్రం సాధించని కలెక్షన్లను కబాలి సొంతం చేసుకుంటోంది. తమిళం, తెలుగు, మలయా ళం, కన్నడం, హిందీ అంటూ తారతమ్యం లేకుండా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. బాలీవుడ్ బెంబేల్ ముఖ్యంగా బాలీవుడ్ చిత్రపరిశ్రమను కబాలి బెంబేలెత్తిస్తోంది. కబాలి కలెక్షన్లు అక్కడి దర్శక నిర్మాతలను కలవరపెడుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. 22,23,24 ఈ మూడు రోజు ల్లోనే ప్రీమియర్ షోలతో కలిపి కబాలి 300 కోట్లు కొల్లగొట్టిందని బాలీవుడ్ బాక్సాపీస్ వర్గాలు లెక్కలు కడుతున్నారు. కాగా ధూమ్-3 దే ఇప్పటి వరకూ బాలీవుడ్లో రికార్డట. ఆ చిత్రం తొలి వారంలో 70 కోట్లు వసూల్ చేసిందట. అయితే కబాలి ఇప్పటికే 87 కోట్లు వసూల్ చేసి ఆ రికార్డును బద్ధలు కొట్టడంతో పాటు ఆల్‌టైమ్ రికార్డుగా నిలిచిందనే టాక్ వి నిపిస్తోంది. ఈ రికార్డును భవిష్యత్‌లో మన చి త్రాలు బ్రేక్ చేస్తాయా అన్న కలత బాలీవుడ్ చిత్ర పరిశ్రమ వర్గాలకు పట్టుకుందట. -
వన్ వార్.. హండ్రెడ్ డేస్!
రాజులు చేసిన యుద్ధాలు గురించి పుస్తకాలు చదివి తెలుసుకున్నాం. ఆ యుద్ధాలు ‘ఇలా ఉంటాయి’ అని చూపించింది మాత్రం సినిమానే. వెండితెరపై యుద్ధ సన్నివేశాలు చూస్తున్నప్పుడు రోమాలు నిక్కబొడుచుకుంటాయ్. కళ్లార్పడం మర్చిపోతుంటాం కూడా. ‘బాహుబలి’లో వచ్చిన భారీ యుద్ధ సన్నివేశం అలాంటిదే. ఇప్పుడు దీన్ని తలదన్నే యుద్ధాన్ని ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’లో చూడనున్నాం. మొదటి భాగంకన్నా రెండో భాగం అన్ని విధాలుగా భారీగా ఉండేలా దర్శకుడు రాజమౌళి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా వార్ సీక్వెన్స్‌ని భారీగా ప్లాన్ చేశారట. చిత్రంలోని ప్రధాన తారాగణంతో పాటు ఐదు వేల మంది పాల్గొనగా ఈ వార్ చిత్రీకరణ జరుపుతున్నారని సమాచారం. ‘బాహుబలి’లోని యుద్ధ సన్నివేశంలో దాదాపు వెయ్యి మంది పాల్గొన్నారట. సీక్వెల్లో అందుకు ఐదింతలు పాల్గొంటున్నారంటే ఎంత భారీగా ఉంటుందో ఊహించుకోవచ్చు. దాదాపు వంద రోజులు ఈ చిత్రీకరణ జరుగుతుందని టాక్. మధ్యలో బ్రేక్ లేకుండా నాన్‌స్టాప్‌గా షూటింగ్ జరుపుతారట. ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, అనుష్క, తమన్నా, సత్యరాజ్ తదితర భారీ తారాగణంతో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
ఖల్నాయక్ రిటర్న్స్
‘నాయక్ నహీ.. ఖల్నాయక్ హు మే’... 1993లో విడుదలైన సూపర్‌హిట్ సినిమా సంజయ్ దత్ ‘ఖల్నాయక్’లోని సూపర్‌హిట్ సాంగ్ ఇది. అప్పట్లో సంజయ్ పరిస్థితికి ఈ లిరిక్స్ అద్దం పట్టాయని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. అక్రమ ఆయుధాలు ఉన్నాయనే ఆరోపణలతో ఏప్రిల్ 19, 1993న అరెస్ట్ అయ్యారు. ఒక్కసారిగా సంజయ్ జీవితంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. రీల్ లైఫ్‌లో ‘నాయక్’ అన్పించుకున్న ఈ హీరో, రియల్ లైఫ్‌లో ‘ఖల్నాయక్’ అంటూ విమర్శలపాలయ్యారు. అదే ఏడాది మే 26న ‘ఖల్నాయక్’ విడుదలై, భారీ విజయం సాధించింది. ఆ సంగతలా ఉంచితే.. అక్రమాయుధాల కేసులో సంజయ్ జైలు జీవితం గడపడం, ఆ మధ్య బయటకు రావడం తదితర విషయాలన్నీ తెలిసిందే. ఇప్పుడు సంజయ్ నాన్‌స్టాప్‌గా సినిమాలు చేయాలనుకుంటున్నారు. విశేషం ఏంటంటే... ‘ఖల్నాయక్’ సినిమా సీక్వెల్‌తోనే హీరోగా రీ-ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో షూటింగ్ మొదలు కానుంది. ఈ సందర్భంగా ‘ఖల్నాయక్’, ఈ చిత్రం సీక్వెల్ గురించి కొన్ని విశేషాలు... సంజయ్ దత్ జైలు జీవితం పూర్తవ్వక ముందే ‘ఖల్నాయక్ రిటర్న్స్’లో తనను తాను కథానాయకునిగా ఊహించుకున్నారు. జైలు జీవితం గడిపిన సమయంలో పెరోల్ మీద బయటకొచ్చిన ఓ సందర్భంలో ఆయన్ను కలసిన దర్శక-నిర్మాత సుభాశ్ ఘై సీక్వెల్ స్టోరీ ఐడియా చెప్పగా.. సంజయ్ వాయిస్ ఓవర్‌తో కూడిన ఓ సౌండ్ ట్రాక్ రెడీ చేయించారట. ‘‘అది విన్న తర్వాత సంజయ్ ఈ చిత్రంపై ఎంత ప్యాషన్‌తో ఉన్నాడో అర్థమైంది. మరో ఆలోచన లేకుండా సీక్వెల్ తీయాలనే నిర్ణయం తీసుకున్నా’’ అని సుభాశ్ తెలిపారు. ‘ది గాడ్ ఫాదర్’ పార్ట్ 3 తరహాలో ఈతరం ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా ఈ సీక్వెల్ తీస్తామంటున్నారాయన. ‘ఖల్నాయక్’లో సంజయ్ దత్ హీరోగా నటించగా, పోలీసాఫీసర్‌గా కీలక పాత్రలో జాకీ ష్రాఫ్ పోషించారు. ఈ సీక్వెల్లో జాకీ తనయుడు టైగర్ ష్రాఫ్ నటించనున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై సుభాశ్ ఘైను ప్రశ్నించగా.. ‘‘నటీనటులు ఎవర్నీ ఎంపిక చేయలేదు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. సీక్వెల్‌కి నేను దర్శకత్వం వహించను. త్వరలో దర్శకుణ్ణి ఎంపిక చేసి, మిగతా వివరాలు ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ సీక్వెల్ కథ టూకీగా చెప్పారు సుభాశ్. ‘‘గ్యాంగ్‌స్టర్ బాలు ఇరవై ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదలై సరికొత్త ప్రపంచంలోకి అడుగుపెడతాడు. పరిస్థితుల ప్రభావం వలన మళ్లీ క్రైమ్ వరల్డ్‌లోకి వెళతాడు. అక్కడ మరో ‘ఖల్నాయక్’ ఎదురయ్యాడా? ఏం జరిగింది?’’ అనేది కథ. మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కనుందట. ఈ కథలో కొత్త పాత్రలు ఎంటరవుతాయని సమాచారం. అప్పట్లో మార్మోగిన ‘చోళీ కే పీచే క్యా హై...’ పాట ‘ఖల్నాయక్’ చిత్రంలోనిదే. ఆ సాహిత్యం మీద తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. సంజయ్ జైలుకి వెళ్లడం, ఈ పాట సృష్టించిన అలజడి చిత్రానికి విపరీతమైన ప్రచారం తీసుకొచ్చాయి. అసలు చిత్రంలో ఏముందో? తెలుసుకోవాలని ప్రేక్షకులు ఆసక్తి చూపించారు. మరి.. ఇప్పుడు కూడా ‘చోళీ కే పీచే క్యా హై..’లాంటి పాట పెడతారా? లేక క్రేజ్ కోసం ఆ పాటనే రీమిక్స్ చేస్తారా? అనేది చూడాలి. టైటిల్ ట్రాక్ ‘నాయక్ నహీ ఖల్నాయక్ హు మే..’ని మాత్రం వాడాలనుకుంటున్నారు. వాస్తవానికి ‘ఖల్నాయక్’లో ముందు అనుకున్నది వేరే హీరోని. ప్రముఖ హిందీ నటుడు నానా పటేకర్‌ను దృష్టిలో పెట్టుకుని సుభాశ్ ఘై ‘ఖల్నాయక్’ కథ రాశారు. కానీ, అనుకోని కారణాల వలన చిత్రం పట్టాలు ఎక్కలేదు. అప్పుడు సంజయ్‌దత్ కోసం కథలో మార్పులు చేసి తీశారు. ఈ చిత్రం తెలుగులో ‘ఖైదీ నంబర్ 1’గా రీమేక్ అయ్యింది. వినోద్‌కుమార్ హీరోగా, మాధురీ దీక్షిత్ పాత్రలో సుకన్య నటించారు. ‘ఖల్నాయక్ రిటర్న్స్’తో పాటు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో మరో సినిమాలో నటించడానికి సంజయ్ దత్ అంగీకరించారు. స్క్రిప్ట్ రెడీ కావడానికి కొంత సమయం కావాలని దర్శకుడు కోరడంతో సినిమా ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని ముంబయ్ సమాచారం.సంజయ్‌తోనే ‘ఢమాల్’ ఫ్రాంచైజీలో మూడో సినిమా తీయాలనుకుంటున్నట్లు దర్శకుడు ఇంద్ర కుమార్ ప్రకటించారు. సంజయ్ ఓకే అంటే.. వచ్చే ఏడాది ఆరంభించాలనుకుంటున్నారట. ఓ కమర్షియల్ సినిమాకి అవసరమైన కథ, మలుపులు, భావోద్వేగాలు.. అన్నీ సంజయ్ దత్ జీవితంలో ఉన్నాయని దర్శకుడు రాజ్‌కుమార్ హిరాని అభిప్రాయం. సంజయ్‌ను ‘మున్నాభాయ్’గా, ‘పీకే’ సినిమాలో భైరాన్ సింగ్‌గా చూపించిన ఈ దర్శకుడు, సంజయ్ జీవితకథతో సినిమా తీస్తున్నట్టు ప్రకటించారు. సంజయ్ జీవితంలో చీకటి కోణాలతో పాటు 18 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వరకూ వివిధ దశలను చూపించనున్నారు. రణ్‌బీర్ కపూర్ ఈ సినిమాలో హీరోగా నటించనున్నారు. -
ఇండిపెండెన్స్‌డే సీక్వెల్‌కు సిద్ధం
ఇండిపెండెన్స్‌డే రెండు దశాబ్దాల క్రితం తెరపైకి వచ్చిన హాలీవుడ్ చిత్రం ఇది. అయినా ఆంగ్ల చిత్రాల అభిమానులతో పాటు సాధారణ సినీ ప్రేక్షకుడిలో కూడా గుర్తుండి పోయిన చిత్రం ఇండిపెండెన్స్‌డే. 1996లో 75 మిలియన్ల అమెరికన్ డాలర్స్ వ్యయంతో రూపొంది 817 మిలియన్ల అమెరికన్ డాలర్లు వసూలు చేసి అప్పటి వరకూ విడుదలైన చిత్రాల్లో రెండో స్థానంలో నిలిచిన దర్శకుడు రోలండ్ ఎమిరిచ్ అద్భుత సృష్టి ఇండిపెండెన్స్‌డే చిత్రం. విశేషం ఏమిటంటే ఈ చిత్రం అమెరికా స్వాతంత్య్రదినోత్సవం రోజైన ఏప్రిల్ నాలుగో తేదీన విడుదలవడం అన్నది యాదృచ్చికంగా జరిగిందే. అప్పట్లో గ్రామీ అవార్డును అందుకున్న ఈ చిత్రానికి రెండు దశాబ్దాల తరువాత ఇండిపెండెన్స్‌డే రీసర్జెన్స్ పేరుతో సీక్వెల్ నిర్మాణం జరిగింది. అప్పట్లో 75 మిలియన్స్ అమెరికా డాలర్లు వ్యయంతో రూపొందిన ఇండిపెండెన్స్‌డే చిత్రానికి పార్టు-2ను ఇప్పుడు 200 మిలియన్ల అమెరికన్ డాలర్లు వ్యయంతో ప్రముఖ హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మించడం విశేషం. ఇండిపెండెన్స్‌డే చిత్రంలో నటించిన బిల్పుల్మాన్, జెఫ్ గోల్డ్బమ్ సీక్వెల్లోనూ నటించడం విశేషం. ఇండిపెండెన్స్‌డే చిత్ర కథను కూడా ఎవరూ మరచిపోలేరు. ఇతర గ్రహాల నుంచి ఎలియన్స్ మానవ జాతిపై దాడి చేయడం, వాటి నుంచి మానవులు ఎలా రక్షింపబడతారన్న పలు ఆసక్తికరమైన అంశాలను గ్రాఫిక్స్‌ను జోడించి బ్రహ్మాండంగా తెరకెక్కించిన చిత్రం ఇండిపెండెన్స్‌డే. అయితే దానికి సీక్వెల్ అయిన ఇండిపెండెన్స్‌డే రీసర్జెన్స్ను నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కించినట్లు చిత్ర వర్గాలు వెల్లడించారు. ఈ చిత్రాన్ని ఆంగ్లం, తమిళ భాషల్లో ఈ నెల 24న భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్వాహకులు వెల్లడించారు. -
అందుకే రజనీకి విలన్‌గా నటించలేదు!
‘రోబో’ సీక్వెల్ ‘2.0’లో రజనీకాంత్ హీరో... కమల్‌హాసన్ విలన్. స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు దర్శకుడు శంకర్ ఈ విధంగానే అనుకున్నారు. ఈ కాంబినేషన్ అయితే ఈ సీక్వెల్‌కు భారీతనం వస్తుందనీ, భారీ అంచనాలు ఏర్పడతాయనీ, నిర్మాణ వ్యయం ఎక్కువైనా ఫర్వాలేదని శంకర్ అనుకున్నారు. సీక్వెల్లో హీరోగా నటించడానికి రజనీ ఓకే చెప్పారు కానీ, కమల్ మాత్రం ‘నో’ అనేశారు. ఆ తర్వాత శంకర్ ఈ చిత్రంలో విలన్‌గా అక్షయ్‌కుమార్‌ని ఎంపిక చేసుకున్న విషయం తెలిసిందే. కమల్ ఈ సీక్వెల్‌కు నో చెప్పడానికి బలమైన కారణమే ఉందట. దర్శక దిగ్గజం బాలచందర్ దర్శకత్వంలో ‘అపూర్వ రాగంగళ్’ చేసిన తర్వాత కమల్, రజనీలు పలు చిత్రాల్లో కలిసి నటించారు. కానీ, స్టార్డమ్ వచ్చాక మాత్రం కలిసి నటించకూడదని నిర్ణయించుకున్నారట. దీనికి ఓ రహస్య ఒప్పందం చేసుకున్నామని కమల్‌హాసన్ చెప్పారు. ‘‘ ‘2.0’లో విలన్ రోల్ కాబట్టి నేను కాదనలేదు. అలాంటి పాత్రలు నేనెన్నో చేశాను. కాకపోతే రజనీ, నేను కలిస్తే మా మార్కెట్‌కి తగ్గ పారితోషికం ఇవ్వాలి. మాకంత ఇస్తే.. ఇక సినిమా నిర్మించడానికి డబ్బులెక్కడుంటాయ్? అందుకే నో చెప్పా’’ అని అసలు కారణం బయటపెట్టారు కమల్. ఫ్యాన్స్ మళ్లీ తమ కాంబినేషన్‌ని కోరుకుంటే.. ఫుల్ మూవీయే చేయనవసరంలేదనీ, అతిథి పాత్రలైనా చేయొచ్చనీ, అందుకు తాను రెడీ అని కమల్ పేర్కొన్నారు. ఫ్యాన్స్ కోసం ఇద్దరూ కలిసి ఫుల్ సినిమా చేస్తే, అప్పుడు పారితోషికం తగ్గించుకోవాల్సి వస్తుందనీ, అలా ఎందుకు చేయాలని కమల్ ప్రశ్నించారు. పాయింటే కదా...! -
ఇండియన్‌కు సీక్వెల్ తెరకెక్కనుందా?
అవినీతికి అంకుశం లాంటి చిత్రం ఇండియన్. ముఖ్యంగా లంచంపై అవిశ్రాంతి పోరాటం చేసి గెలిచిన ఒక స్వాతంత్య్ర యోధుడి వీరగాథే ఇండియన్.తెలుగు భారతీయుడుగా విడుదలై సంచలన విజయానికి కారుకుల్లో ముగ్గురు పేర్లను ముఖ్యంగా ప్రస్తావించాలి. ఒకరు విశ్వనటుడు కమలహాసన్. ఇందులో ఆయన ద్విపాత్రాభియనం అద్భుతం అనే చెప్పాలి. ఇండియన్‌గా ఆయన గెటప్ నుంచి ప్రతి అంశాన్ని ప్రత్యేకంగా వర్ణించాల్సి ఉంటుంది. ఇక ఈ చిత్రానికి సృష్టికర్త స్టార్ డెరైక్టర్ శంకర్. ఆయన దర్శక ప్రతిభకు ఇండియన్ చిత్రం ఇక తార్కాణం. లంచగొండితనం ఆయన సంధించిన పాశుపతాస్త్రం ఇండియన్ . కమలహాసన్, శంకర్ల కాంబినేషన్లో బ్రహ్మాండ చిత్రాన్ని నిర్మించిన ఘనత ఎస్ నిర్మాత ఏఎం.రత్నానికే దక్కుతుంది. దీనికి ఏఆర్.రెహ్మాన్ సంగీతం పక్కబలంగా నిలిచిందని చెప్పక తప్పదు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే కాలాన్ని గెలిచిన ఈ చిత్రం తెరపై కొచ్చి రెండు దశాబ్దాలు అవుతోంది. విజయవంతమైన చిత్రాలకు సీక్వెల్స్ తెరకెక్కుతున్న ట్రెండ్ ఇది. అయితే ఘన విజయాలను సాధించిన కమలహాసన్ ఇండియన్,రజనీకాంత్ బాషా చిత్రాలకు కొనసాగింపు చిత్రాలు రూపొందితే బాగుండని ఆశించే అభిమానుల శాతం ఎక్కువగానే ఉంటుంది. భాషా-2 తెరకెక్కనుందనే ప్రచారం కొంత కాలం క్రితం మీడియాలో హల్ చల్ చేసింది.అయితే బాషా చిత్రానికి సీక్వెల్ సాధ్యం కాదని ఆ చిత్ర కథానాయకుడు సూపర్‌స్టార్ తేల్చి చెప్పారు. ఆయన అభిమానులు కూడా బాషా ఒకే ఒక్కడు అని స్పష్టం చేశారు. కమలహాసన్ కెరీర్లో మైలురాయిగా పేర్కొనే చిత్రాల్లో ఒకటైన ఇండియన్ చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కించడానికి చర్చలు జరుగుతున్నాయనే వార్తలు తాజాగా కోలీవుడ్ వర్గాలలో వినిపిస్తుండడం విశేషం. దర్శకుడు శంకర్ తాజాగా రజనీకాంత్‌తో 2.ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక కమలహాసన్ రెండు మూడు చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వీరిద్దర్నీ కలిపి ఇండియన్-2 చేయడానికి ప్రముఖ నిర్మాత ఏఎం.రత్నం ప్రయత్నిస్తున్నట్లు ఆ దిశగా ఇప్పటికే అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే కనుక నిజం అయితే మరో మంచి చిత్రాన్ని సినీ ప్రియులు చూసే అవకాశం ఉంటుంది. -
జంగిల్ బుక్ కు సీక్వెల్
లాస్ ఏంజిల్స్: ఇటీవల విడుదలై రికార్డుస్థాయిలో కలెక్షన్లు రాబడుతున్న సాహన ఫాంటసీ చిత్రం జంగిల్ బుక్ సినిమాకు సీక్వెల్ తీయబోతున్నట్టు డిస్నీ సంస్థ ప్రకటించింది. ఈ సినిమాను క్రుయెల్లా, 101 డాల్మేషన్స్ స్టూడియోల్లో తీయాలని నిర్ధారించుకున్నారు. ఏంజలీనా జోలీతో మేల్ ఫిసెంట్ సినిమా తీసిన లిండా వూల్వెర్టాన్ కి ఈ సీక్వెల్ స్రిప్ట్ పని అప్పగించినట్టు సమాచారం. సీక్వెల్ కోసం జంగిల్ బుక్ డైరెక్టర్, కథా రచయిత ప్రపంచ టూర్ కు వెళ్లనున్నారు. సీక్వెల్ ను 2019 లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా ఎప్పుడో 1894లో ఒక నవలగా విడుదలైన జంగిల్ బుక్ కథ సారాంశం ఆధారంగా కొత్త సాంకేతిక పరిజ్ఞానం జోడించి జంగిల్ బుక్ ను కన్నులకు కట్టినట్లుగా తీర్చిదిద్దారు. అడవిలో ఓ నల్లపిల్లికి దొరికిన పిల్లాడిని తిరిగి మనుషులతో జత చేసే క్రమంలో భాగంగా చోటుచేసుకున్న పరిణామాలే ఈ జంగిల్ బుక్. ఇందులో మోగ్లీ అనే పిల్లాడి పాత్రలో భారతీయ సంతతికి చెందిన పిల్లాడు నీల్ సేథి నటించాడు. -
నాలుగో అవతారం
ఇలాంటి సినిమాలు కూడా వస్తాయా? ఇలా కూడా తీస్తారా? అని ప్రపంచవ్యాప్తంగా అందరూ చర్చించుకునేలా చేసిన చిత్రం ‘అవతార్’. ‘టెర్మినేటర్, ఏలియన్స్, టైటానిక్’లను అద్భుతంగా తెరపై సృష్టించిన దర్శకుడు జేమ్స్ కామెరూన్ తీసిన ఈ ‘అవతార్’ అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. ప్రసుతం కామెరూన్ ఈ చిత్రం సీక్వెల్స్‌ని వర్కవుట్ చేస్తున్నారు. ముందుగా మూడు భాగాలు తీస్తామని చెప్పిన కామెరూన్ ఇప్పుడు నాలుగో భాగాన్ని కూడా ప్రకటించారు. ఈ నాలుగు భాగాల్లో మొదటిదాన్ని 2018లో, రెండో చిత్రాన్ని 2020లో, మూడో సీక్వెల్‌ని 2022లో, నాలుగో భాగాన్ని 2023లో విడుదల చేయాలనుకుంటున్నారు. ‘అవతార్’ 2009లో విడుదలైన విషయం తెలిసిందే. గత ఏడేళ్లుగా సీక్వెల్స్ పని మీదే ఉన్నారు జేమ్స్ కామెరూన్. హాలీవుడ్‌కి చెందిన నలుగురు ప్రముఖ రచయితలతో ‘అవతార్’ ప్రపంచం ఎలా ఉండాలనే విషయంపై చర్చలు జరుపుతున్నానని ఆయన వెల్లడించారు. ఈ సీక్వెల్స్ అసలు సిసలైన వెండితెర అద్భుతాలుగా నిలుస్తాయని కూడా ఆయన అన్నారు. ముందు మూడు భాగాలే అనుకున్నప్పటికీ ఈ కథ పరిధి ఎక్కువ కావడం వల్ల నాలుగో భాగం కూడా చేయాలనుకున్నామని కామెరూన్ చెప్పారు. అసలు ‘అవతార్’ లాంటి సాంకేతిక అద్భుతాలను ఒకసారి తీయడమే పెద్ద విషయం. అలాంటిది నాలుగు భాగాలు తీస్తున్నారంటే సినిమా పట్ల ఎంతో ప్యాషన్, టెక్నాలజీ మీద బాగా అవగాహన... అన్నింటికీ మించి ఓర్పు కావాలి. ఇవన్నీ ఉన్నవాళ్లని ‘కామెరూన్’ అంటారేమో.