
రాజ్‌కుమార్ రావ్
హర్రర్ కామెడీ చిత్రాలకు బాక్సాఫీస్ వద్ద మంచి గిరాకీ ఉందని ‘స్త్రీ’ సినిమా రూపంలో మరోసారి ప్రూవ్ అయ్యింది. అమర్ కౌశిక్ దర్శకత్వంలో రాజ్‌కుమార్ రావ్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం ‘స్త్రీ’. దినేష్ విజన్‌తో పాటు రాజ్ అండ్ డీకే నిర్మించారు. ఆగస్టు 31న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.
అలాగే మంచి బాక్సాఫీస్ నంబర్స్‌తో టీమ్ కూడా బహుత్ ఖుషీ అవుతున్నారు. అందుకే ‘స్త్ర్రీ’ సినిమాకు సీక్వెల్‌ను ప్లాన్ చేస్తున్నారట చిత్రబృందం. ‘‘ఈ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు థ్యాంక్స్. సీక్వెల్ గురించి మా సినిమా రైటర్స్ రాజ్ అండ్ డీకేకు ఐడియాస్ ఉన్నట్లు ఉన్నాయి. అన్నీ కుదిరితే సీక్వెల్ గురించి త్వరలోనే అనౌన్స్‌మెంట్ ఉండొచ్చు’’ అని పేర్కొన్నారు హీరో రాజ్‌కుమార్ రావ్.
Comments
Please login to add a commentAdd a comment