
పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్న నటుడు విజయ్ సేతుపతి. స్వతహాగా తమిళం అయినప్పటికీ.. తెలుగు, హిందీతో పాటు ఇతర భాషల్లోనూ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. కొన్నాళ్ల క్రితం తెలుగులో ఉప్పెన చిత్రంలో ప్రతినాయకుడిగా నటించి మనోళ్లకు బాగా దగ్గరయ్యాడు.
(ఇదీ చదవండి: 'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్)
షారూఖ్ ఖాన్ జవాన్‌లో విలన్‌గా తన నట విశ్వరూపాన్ని చూపించాడు. ఇలా ఎప్పటికప్పుడు వైవిధ్యమైన సినిమాలు తీస్తున్న సేతుపతి.. ప్రస్తుతం మిష్కిన్ దర్శకత్వంలో ట్రైన్, తెలుగు దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తూ బిజీగా ఉన్నాడు.
అలానే 'కాక్కా ముట్టై' ఫేమ్ మణికంఠన్ దర్శకత్వంలో ఓ వెబ్ సిరీస్ చేసేందుకు సేతుపతి రెడీ అవుతున్నాడు. గత కొన్నాళ్లుగా హీరోగా హిట్ లేక డీలా పడిపోయిన విజయ్ సేతుపతికి హిట్ ఇచ్చిన సినిమా మహారాజ. గతేడాది రిలీజైంది. తొలుత థియేటర్లలో ఆపై ఓటీటీలోనూ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకుంది.
(ఇదీ చదవండి: నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ సినిమా)
ఇది విజయ్ సేతుపతికి 50వ చిత్రం కావడం విశేషం. ఇదే సినిమా చైనీష్ లోనూ అనువాదం అయ్యి చైనాలో రిలీజై మంచి వసూళ్లు సాధించింది. కాగా మహారాజా చిత్రానికి సీక్వెల్ చేయాలని విజయ్ సేతుపతి ఆలోచిస్తున్నట్లు, దానికి తగ్గ కథను సిద్ధం చేయమని దర్శకుడు నితిలన్ స్వామినాథన్ కు చెప్పినట్లు తెలుస్తోంది.
కాగా విజయ్ సేతుపతి ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తి చేసిన తర్వాత మహారాజ 2 మొదలు పెడతారా లేదంటే వాటితో పాటే ప్రారంభించి పూర్తి చేస్తారా అనేది చూడాలి?
(ఇదీ చదవండి: ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. తొమ్మిదేళ్ల తర్వాత తెలుగులో)