
దాదాపు 40 ఏళ్ల చరిత్ర గల మరో థియేటర్ నేలమట్టమైంది. సూపర్‌స్టార్ రజనీ కాంత్ చేతులమీదుగా 1985లో చెన్నైలో ప్రారంభమైన బృందా థియేటర్.. దశాబ్దాల పాటూ అభిమానులను ఎంతో అలరించింది. కొత్త కొత్త సినిమాలను ప్రదర్శిస్తూ అభిమానుల గుండెల్లో చెరగని ముద్రవేసుకున్న ఈ థియేటర్ ఇక కనుమరుగు కానుంది. ఇప్పటికే సినిమాలను ప్రదర్శించడం ఆగిపోయింది.
గత కొన్నేళ్లుగా సినిమాలు చూడటానికి థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య క్రమంగా తగ్గింది. దీనికి ప్రతిగా తమిళనాడు వ్యాప్తంగా ఐకానిక్ థియేటర్లను కూల్చివేస్తున్నారు. ఇప్పటికే చైన్నెలో పాపులర్ అయిన అగస్త్య, కామథేను, కృష్ణ వేణితదితర ఎన్నో థియేటర్లు నేలమట్టమయ్యాయి. ఈ స్థితిలో ఉత్తర చైన్నెకి ల్యాండ్‌మార్క్‌గా నిలిచిన పెరంబూర్ బృందా థియేటర్ చరిత్ర సోమవారంతో ముగిసింది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'ముఫాసా'.. అధికారికంగా ప్రకటన)

1985 ఏప్రిల్ 14న సూపర్ స్టార్ రజనీకాంత్ చేతులమీదుగా బృందా థియేటర్‌ని ప్రారంభించారు. అప్పుడు లోగనాథన్ చెట్టియార్ దాని యజమాని. అతని మరణానంతరం, అతని వారసులు విశ్వనాథన్, చంద్రశేఖర్ దీనిని కొనసాగించారు. ఈ మంగళవారం నుంచి ప్రదర్శనలు నిలిపివేశారు. ఈ థియేటర్‌ను కూల్చివేయనున్నారు. ఓ ప్రైవేట్ నిర్మాణ సంస్థ స్థలాన్ని కొనుగోలు చేసిందని, త్వరలోనే భవనాన్ని కూల్చివేసి అపార్ట్‌మెంట్లు నిర్మించనున్నట్లు చెబుతున్నారు.
40 ఏళ్లుగా పనిచేస్తున్న మేనేజర్ పన్నీర్ సెల్వం మాట్లాడుతూ.. మా థియేటర్‌కి బృందా థియేటర్ అని పేరు పెట్టినా రజనీ థియేటర్ అని పిలుస్తారని, రజనీ ఈ థియేటర్‌ని ప్రారంభించారు.. రజనీ సినిమాలన్నీ ఇక్కడ ప్రదర్శితమయ్యాయని చెప్పుకొచ్చారు.
(ఇదీ చదవండి: 6 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)
Comments
Please login to add a commentAdd a comment