
మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ గుర్తుందా? అప్పట్లో కన్నుగీటిన వీడియోతో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈమె.. తర్వాత పలు సినిమాల్లో నటించింది. కాకపోతే పెద్దగా గుర్తింపు రాలేదు. తాజాగా ఓ సినిమాలో నటించి హిట్ కొట్టింది. దీంతో ఈమె ఎక్కడ లేని గుర్తింపు వస్తోంది.
(ఇదీ చదవండి: 'పుష్ప 2'కి నా మ్యూజిక్ పెట్టుకోలేదు.. అయినా బాధ లేదు)
2018లో నటిగా ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రియా వారియర్.. 2019లో రిలీజైన 'ఒరు అడార్ లవ్' హీరోయిన్ అయింది. కన్నుగీటి ఫేమస్ అయింది ఈ మూవీతోనే. కాకపోతే పెద్దగా ఆకట్టుకోలేదు. తర్వాత తెలుగులో చెక్, ఇష్క్ నాట్ ఏలవ్ స్టోరీ లాంటి చిత్రాల్లో హీరోయిన్ గా చేసింది. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు.
దాదాపు ఏడెనిమిది ఏళ్లనుంచి ఇండస్ట్రీలో ఉండటమైతే ఉంది గానీ పేరు రాలేదు. కానీ రీసెంట్ గా రిలీజైన 'గుడ్ బ్యాడ్ అగ్లీ'లో ఈమె విలన్ గా చేసిన అర్జున్ దాస్ ప్రియురాలిగా నటించింది. ఇతడితో కలిసి సుల్తానా పాటకు డాన్స్ చేసింది. ఇది గతంలో సిమ్రాన్ చేసిన పాటకు మళ్లీ అలానే స్టెప్పులేసి ప్రియా వారియర్ ఫేమస్ అయింది. ఒకరకంగా చెప్పాలంటే మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చింది. మరి దీన్ని ఎంతవరకు నిలబెట్టుకుంటుందో చూడాలి?
(ఇదీ చదవండి: 57 ఏళ్ల వయసులో మళ్లీ తండ్రి కాబోతున్న నటుడు?)