
యంగ్ డైరెక్టర్ అబిశన్ జీవింత్ తెరకెక్కించిన చిత్రం టూరిస్ట్ ఫ్యామిలీ (Tourist Family). శశికుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రలు పోషించగా యోగి బాబు, ఎమ్మెస్ భాస్కర్, మిథున్ జే, రమేశ్ తిలక్ తదితరులు నటించారు. ఈ మూవీ మే 1న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో అబిశన్ (Abishan Jeevinth) తన స్నేహితురాలికి ప్రపోజ్ చేశాడు.

నీ వల్లే..
ముందుగా స్టేజీ ఎక్కిన అబిశన్.. తన సినిమా గురించి చెప్తూ, అందులో నటించిన యాక్టర్స్‌కు, సంగీతాన్ని అందించిన షాన్ రోల్డన్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. ఆ వెంటనే తన స్నేహితురాలు అఖిల ఎలంగోవన్‌కు సైతం థాంక్స్ చెప్పాడు. అబిశన్ మాట్లాడుతూ.. అఖిల.. నీకు నేను చిన్నప్పటి నుంచి తెలుసు. పదో తరగతి నుంచి మనం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం. మా అమ్మతో పాటు నీవల్లే జీవితంలో మంచి వ్యక్తిగా ఎదిగాను. ఐ లవ్యూ సోమచ్ అని ప్రశ్నించాడు.
దర్శకుడి మాటలతో కంటతడి
ఇప్పుడు నిన్నో విషయం అడగాలనుకుంటున్నాను. అక్టోబర్ 31న నన్ను పెళ్లి చేసుకుంటావా? అని ప్రశ్నించాడు. అక్కడే ఉన్న అఖిల అతడి మాటలు విని భావోద్వేగానికి లోనైంది. సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన జనాలు.. అఖిల అతడి ప్రపోజల్‌కు ఒప్పుకోవమ్మా.. సినిమా ప్రపోజల్ కన్నా ఇదే బాగుంది అని కామెంట్లు చేస్తున్నారు.
Beautiful Proposal by The Director of #TouristFamily on Stage ❤️
pic.twitter.com/cG3qvN3fF1— Christopher Kanagaraj (@Chrissuccess) April 27, 2025
చదవండి: కీరవాణికి చిన్నపిల్లలే కావాలి.. అతడిపై పోక్సో కేసు పెట్టాలి