Mancherial
-
విపత్తు సాయం పెంపు
● కీలక నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ● విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు ● బాధిత కుటుంబాలకు ఊరటబెల్లంపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి విపత్తుల కారణంగా మృతిచెందినవారి కుటుంబాల కోసం సానుకూల నిర్ణయం తీసుకుంది. వడగాల్పులు లేదా ఎండ తీవ్రత వల్ల మరణిస్తే, బాధిత కుటుంబాలకు అందించే విపత్తు సాయాన్ని రూ.50 వేల నుంచి రూ.4 లక్షలకు పెంచింది. వడదెబ్బను ప్రత్యేక విపత్తుగా గుర్తించిన ప్రభుత్వం, ఈ సాయం అందించేందుకు విధివిధానాలను నిర్దేశించింది. విపత్తు నిర్వహణ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. నిరుపేదలే బాధితులు.. ఎండాకాలంలో వడదెబ్బ కారణంగా ఏటా పదుల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. గంటల తరబడి ఎండలో పనిచేసే గ్రామీణ ఉపాధి కూలీలు, భ వన నిర్మాణ కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, చిరు వ్యాపారులు, యాచకులు ఎక్కువగా బాధితులు అవుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏప్రిల్ నుంచి జూన్ 15 వరకు ఉష్ణోగ్రతలు 35 నుంచి 48 డిగ్రీల సెల్సియస్‌కు చేరుతాయి. మంచిర్యాల జిల్లాలోని సింగరేణి కోల్‌బెల్ట్ ప్రాంతం నిప్పుల కుంపటిగా మారుతుంది. కుమురంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోనూ వడగాల్పులు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. మరణ నిర్ధారణకు మండల కమిటీ వడదెబ్బతో మరణించినట్లు నిర్ధారించేందుకు మండలస్థాయిలో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఈ కమిటీలో తహసీల్దార్(రెవెన్యూ శాఖ), సబ్–ఇన్స్పెక్టర్ (పోలీసు శాఖ), మండల వైద్యాధికారి (వైద్య శాఖ) సభ్యులుగా ఉంటారు. కమిటీ మార్గదర్శకాల ప్రకారం మరణాన్ని ధ్రువీకరించి, ఎఫ్ఐఆర్ నమోదు చేసి, పోస్ట్‌మార్టం నిర్వహిస్తుంది. ఆ తర్వాత కలెక్టర్ ఆమోదంతో బాధిత కుటుంబానికి పరిహారం అందజేస్తారు. ఉపశమనం కోసం ప్రభుత్వం చర్యలు వడదెబ్బ మరణాలకు పరిహారాన్ని గణనీయంగా పెంచడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ఆర్థిక ఊరట కల్పించనుంది. సత్వర నిర్ధారణ, పారదర్శక పరిహార పంపిణీతో విపత్తు నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేయడం ఈ నిర్ణయం లక్ష్యం. -
దేశానికే దిక్సూచిలా పాలన
మంచిర్యాలటౌన్: తెలంగాణ ఉద్యమం 1969, 1972 లలో పెద్ద ఎత్తున సాగినా నాడు తెలంగాణను సాధించుకోలేక పోయాం. తెలంగాణ సాధన కోసం నాడు కేసీఆర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ను స్థాపించి అన్ని పార్టీలు, అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ముందుకుసాగారు. 2009లో కేసీఆర్ తెలంగాణ కోసం దీక్షా దివాస్‌తో కేంద్రం కదిలివచ్చి డిసెంబర్ 9న తెలంగా ణను ప్రకటించింది. అయినా ఎన్నో ఇబ్బందులకు గురిచేయడంతో రాష్ట్రం మొత్తాన్ని ఏకం చేసి పోరాడిన ఘనత కేసీఆర్‌ది. 2014లో రాష్ట్ర పగ్గాలు చేప ట్టి దేశానికే దిక్సూచిలా పదేళ్లు చేసిన పరిపాలన, పథకాలు, అభివృద్ధి ఎనలేనిది. రెండుసార్లు ఎమ్మెల్యేగా ప్రజలు అవకాశం ఇవ్వడంతో అభివృద్ధి చేసేందుకు అవకాశం వచ్చింది. ఈ నెల 27న చరిత్రలో నిలిచిపోయేలా రజతోత్సవ సభ నిర్వహిస్తాం. – మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, మంచిర్యాల -
గిరిజనుల సమస్యలు పరిష్కరించాలి
ఉట్నూర్‌రూరల్: గిరిజనుల సమస్యలు త్వరగా ప రిష్కరించాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అధి కారులను ఆదేశించారు. సోమవారం ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పీవోకు అ ర్జీలు అందించారు. సమస్యలు పరిష్కరించాలని కో రారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ.. ప్రజా వాణికి పింఛన్, డబుల్ బెడ్రూం, స్వయం ఉపాధి పథకాల కోసం, వ్యవసాయం, రెవెన్యూ శాఖలకు సంబంధించిన 65 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. వీ టిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికా రులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
‘ఐఎంఏ’లో కుల రాజకీయం!
● దళిత వైద్యుడిపై మరో వైద్యుడి వ్యాఖ్యలు సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) మంచిర్యాల చాప్టర్లో కుల రాజకీయం వివాదాస్పదమైంది. గత సెప్టెంబర్‌లో జిల్లా అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా పోటీలో ఉన్న ఓ సీనియర్ వైద్యుడు.. మరో వైద్యుడిపై తన సామాజిక వర్గాన్ని ఉద్దేశిస్తూ చేసిన అ భ్యంతకర వ్యాఖ్యలపై విచారణ మొదలైంది. జిల్లా ఎన్నికల్లో గెలిచేందుకు పోటీలో ఉన్న ఓ సీని యర్ వైద్యుడు.. పోటీదారుడైన ఓ దళిత సీనియర్ వైద్యుడిపై తీవ్ర ఆరోపణ చేశారు. ఆ సమయంలోనే పో లీసులకు ఫిర్యాదు చేశారు. గత సెప్టెంబర్‌లో ఫిర్యా దు చేసినా ఇప్పటికీ కేసు నమోదు కాలే దు. అంతేగాక జిల్లా ఐఎంఏలో కీలకంగా ఉన్న ఆ వైద్యుడు తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కాకుండా అనేక ర కాలుగా పలుకుబడి వాడి ఒత్తిడి తెస్తున్నట్లుగా తె లుస్తోంది. దీనిపై సదరు వైద్యుడు, సంధి చేసుకుని కేసు కాకుండా ఉండేందుకు మొదట క్షమాపణ చె ప్పి కూడా, మళ్లీ తన మాటలకు కట్టుబడి ఉన్నానంటూ ప్రకటించాడు. దీంతో తాజాగా మళ్లీ వివాదం రాజుకుంటోంది. ఈ క్రమంలో కుల ప్రస్తావన తెచ్చి తనను మానసికంగా ఇబ్బంది పెట్టి ఎన్నికల్లో గెలిచారని రారష్ట్‌ర ఐఎంఏ ప్రతినిధులకు ఫిర్యాదు వెళ్లింది. దీంతో రెండు రోజుల క్రితం నిజ నిర్ధారణ కమిటీ జిల్లా అసోసియేషన్ సభ్యుల నుంచి ఈ ఘటనపై వివరాలు సేకరించింది. త్వరలోనే రాష్ట్ర కమిటీకి పూర్తి నివేదిక ఇవ్వనున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో జిల్లా వైద్య అసోసియేషన్ ఎన్నికల్లో కుల ప్రస్తావన తెచ్చినట్లు రుజువైతే గెలిచిన ఆ ప్రతినిధిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కార్మిక సమస్యలపై ఆందోళనలు శ్రీరాంపూర్: సింగరేణిలో కార్మికుల ప్రధాన సమస్యల పరిష్కారానికి ఆందోళనలు చేపట్టనున్నట్లు టీబీజీకేఎస్ నాయకులు తెలిపారు. సోమవారం ఆ యూనియన్ కేంద్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, బ్రాంచ్ ఉపాధ్యక్షుడు పెట్టం లక్ష్మణ్ శ్రీరాంపూర్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సింగరేణిలో నూతన గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కొత్త గనులు లేకపోతే సంస్థ అభివృద్ధి కుంటుపడే ప్రమాదం ఉందన్నారు. సింగరేణిలో అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు. సమస్యలపై మంగళవారం సింగరేణి వ్యాప్తంగా అన్ని గనులు, డిపార్టుమెంట్ల వద్ద అధికారులకు వినతిపత్రాలు సమర్పిస్తామని, 25న జీఎం కార్యాలయం ముందు ధర్నా చేస్తామని తెలిపారు. ఈ నెల 27న ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభకు కార్మికవర్గం రావాలని పిలుపునిచ్చారు. వాల్‌పోస్టర్లు విడుదల చేశారు. యూనియన్ కేంద్ర కమిటీ నాయకులు పొగాకు రమేష్, పానుగంటి సత్తయ్య, అన్వేష్‌రెడ్డి, నాయకులు ఉత్తేజ్‌రెడ్డి, సాధుల భాస్కర్, రమేష్, లాల, జయపాల్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. -
పండంటి బిడ్డకు జన్మనిచ్చి..
లక్ష్మణచాంద: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చి అంతలోనే బాలింత ప్రాణాలు కో ల్పోయిన విషాదకర ఘటన మండలంలోని మల్లాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, చుట్టుపక్కల వారు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బాపట్ల ఆశన్న–లలిత దంపతుల చిన్న కుమారుడు అరుణ్‌కు మూడేళ్ల క్రితం ఖానాపూర్‌కు చెందిన హేమశ్రీతో వివాహమైంది. ఏడాదిన్నర క్రితం హేమశ్రీ మొదటి సంతానంగా మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆదివారం నిర్మల్‌లోని ఓ ఆస్పత్రిలో రెండో సంతానంగా మరో మగబిడ్డను ప్రసవించింది. అంతలోనే హేమశ్రీకి గుండెపోటు వచ్చి ఆరోగ్యం విషమించిందని వైద్యులు కుటుంబీకులకు పిడుగులాంటి వార్త చెప్పారు. దీంతో హేమశ్రీ కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. మెరుగైన చికిత్స కోసం ఆమెను నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి హేమశ్రీ మృతి చెందినట్లు తెలిపారు. దీంతో మల్లాపూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. పుట్టిన బిడ్డను కూడా చూడకుండానే ఆ తల్లి కన్నుమూయగా ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు రోధించిన తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. -
పోడు రైతులకు అండగా ఉంటాం
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ ● అటవీశాఖ కార్యాలయంలో వినతిపత్రం చెన్నూర్: పోడు భూములు సాగు చేసుకుని జీ వనం సాగిస్తున్న రైతులను ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదని, పోడు రైతులకు అండగా ఉంటామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ అన్నారు. పోడు రైతులను ఇబ్బందులకు గురి చేయడాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం చెన్నూర్ ఎఫ్‌డీవో కార్యాలయంలో అధి కారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటపల్లి మండలం పిన్నారం, ఎసాన్‌వాయి, బొప్పారం, ఎడగట్ట గ్రామాల్లో పోడు రైతులను కొందరు అధి కారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరో పించారు. రైతుల ఎద్దులు, నాగళ్లను తీసుకెళ్లడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గతంలో ఫా రెస్ట్ అధికారులు నాలుగు గ్రామాల్లో కందకాలు ఏ ర్పాటు చేశారని, వాటి అవతల వ్యవసాయం చేసుకుంటున్న రైతులను చిత్రహింసలకు గురిచేయడం బాధాకరమని అన్నారు. కోటపల్లి అటవీ అధికా రుల తీరుపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపా రు. ఈ కార్యక్రమంలో కోటపల్లి మండల బీ జేపీ అధ్యక్షుడు మంత్రి రామయ్య, సీనియర్ నాయకులు పెద్దపల్లి పురుషోత్తం, మాజీ కౌన్సి లర్ కమ్మల శ్రీనివాస్, వంశీగౌడ్ పాల్గొన్నారు. -
భూభారతి చట్టంపై అవగాహన ఉండాలి
నస్పూర్: భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టంపై రై తులందరూ పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. పట్టణ పరిధిలోని సీతారాంపల్లి రైతువైదిక వద్ద భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టంపై రైతులకు సోమవారం అవగాహన కల్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ నూ తన చట్టంపై ఈ నెల 30 వరకు జిల్లాలోని అన్ని మండలాల్లో సదస్సులు నిర్వహించి అవగాహన క ల్పిస్తామని తెలిపారు. హక్కులు, రికార్డుల్లో తప్పు ల సవరణకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. భూఆధార్ కార్డులు జారీ చేస్తామని, భూ సమస్యల పరిష్కారానికి అప్పీల్ వ్యవస్థను ఏర్పాటు చేశారని, జూన్ 2 నుంచి చట్టం పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుందని అన్నారు. అదనపు కలెక్టర్ మోతీలాల్, మంచిర్యాల ఆర్డీఓ శ్రీనివాస్‌రావు, తహసీల్దార్ శ్రీనివాస్, రైతులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి లక్సెట్టిపేట: వరి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం మండలంలోని కొత్తూరు, వెంకట్రావ్పేట, ఎల్లారం గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. నిర్వాహకులు రైతుల వివరాలు ట్యాబ్‌లో నమోదు చేయాలని సూచించారు. ధాన్యం రశీదులు రైతులకు అప్పగించాలని అన్నారు. కొనుగోలు కేంద్రం నిర్వహకులు, గ్రామ సమైఖ్య సభ్యులు పాల్గొన్నారు. వరిధాన్యం బకాయిలు చెల్లించాలి మంచిర్యాలఅగ్రికల్చర్: గత 2022–23 యాసంగి సీజన్ వరిధాన్యం బకాయి ఉన్న రైస్‌మిల్లరు వెంట నే పూర్తిగా చెల్లించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టర్ చాంబర్లో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్‌తో కలిసి జిల్లా పౌరసరఫరాల అధికారి బ్రహ్మారా వు, జిల్లా మేనేజర్ శ్రీకళ, రైస్‌మిల్లర్లతో బకాయి చెల్లింపులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ వరిధాన్యం బకాయి ఉన్న దాదాపు రూ.87 కోట్లు రైస్‌మిల్లర్లు వెంటనే చెల్లించాలని, రూ.కోటిలోపు ఉన్న వారు తక్షణమే చెల్లించాలని పేర్కొన్నారు. కలెక్టర్ కుమార్ దీపక్ -
సమస్యలు సత్వరమే పరిష్కరించాలి
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలు శ్రీనివాస్‌రావు, హరికృష్ణలతో కలిసి అర్జీ లు స్వీకరించారు. భూ సమస్యలు, పింఛన్, పరి హారం తదితర సమస్యలపై ప్రజలు ఫిర్యాదులు అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆయా శాఖ లకు సంబంధించిన అర్జీలు పెండింగ్‌లో ఉంచరాద ని అన్నారు. అధికారుల పరిధిలో సమస్య పరి ష్కారం కాకుంటే చెప్పాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖ అధికారులు పాల్గొన్నారు. ● భీమారం మండలం గొల్లవాగు ప్రాజెక్టులో చేపలు పట్టుకోనివ్వకుండా కొంతమంది భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, చేపలు పట్టుకునేలా ఆదేశాలు ఇవ్వాలని, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని భీమారం మత్స్యపారిశ్రామిక సహకార సంఘం సభ్యులు కోరారు. -
స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చింది..
బెల్లంపల్లి: ఇతర రాజకీయ పార్టీల మాదిరిగానే బీఆర్ఎస్ పార్టీకి ఎంతో ఘనచరిత్ర ఉంది. స్వ రాష్ట్ర సాధన కోసం ఆవిర్భవించిన టీఆర్ఎస్ ప్రజా సహకారంతో వీరోచితంగా పోరాడి అనుకున్న లక్ష్యాన్ని సాధించి నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాజకీయ పార్టీగా ఏర్పడి సాధించుకున్న తెలంగాణను బంగారుమయం చేయడానికి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ 10ఏళ్లపాటు కష్టపడ్డారు. ఎందరో అమరులు తెలంగాణ కోసం ప్రాణాలు వదిలారు. ఒక్కడితో ఏర్పడిన పార్టీ క్రమంగా బలోపేతమైంది. బీఆర్ఎస్ పార్టీ చరిత్రతో మరే రాజకీయ పార్టీని చూడలేం. బీఆర్ఎస్తోనే రాష్ట్ర ప్రజల జీవితం ముడి పడి ఉంది. – మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, బెల్లంపల్లి -
నేరం చేయాలంటే దడ పుట్టాల్సిందే..
● ప్రత్యేక కార్యాచరణ చేపట్టిన సీపీ ● నిందితులకు శిక్ష పడటమే లక్ష్యం ● పకడ్బందీగా సాక్ష్యాధారాల సేకరణ ● ఏడాదిలో 135 మందికి జైలు శిక్ష ● ఈ ఏడాది శిక్షలు పెంచేలా చర్యలు మంచిర్యాలక్రైం: ఒక్కసారి నేరం చేసినవారు మరో సారి నేరాలకు పాల్పడకుండా వారికి సరైన శిక్ష పడేలా రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝూ ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నారు. ఎఫ్ఐఆర్ న మోదు నుంచి నిందితుడికి శిక్ష పడేదాకా అన్ని జా గ్రత్తలు తీసుకుంటున్నారు. పక్కాగా సాక్ష్యాలు సేకరించి శిక్షల శాతాన్ని పెంచుతున్నారు. ఇప్పటికే ప లుసార్లు కమిషనరేట్ పోలీస్ అధికారులు, కోర్టు డ్యూటీ నిర్వహిస్తున్న కానిస్టేబుల్, లైసన్ ఆఫీసర్లతో సీపీ సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. 2024లో రామగుండం కమిషనరేట్ పరిధిలో 80 కే సుల్లో 135 మంది నిందితులకు శిక్ష పడేలా చేశారు. పెద్దపల్లి జిల్లాలో రెండు కేసుల్లో ముగ్గురికి యావజ్జీవ కారాగారం, మరో రెండు కేసుల్లో ఆరుగురికి పదేళ్ల జైలు, మంచిర్యాల జిల్లాలో మూడు కేసుల్లో ముగ్గురికి ఐదేళ్లు శిక్ష పడేందుకు కృషి చేశారు. శిక్షలు పడిన ఘటనలు కొన్ని.. ● 2016 సెప్టెంబర్ 17న మంచిర్యాల ఠాణా పరిధిలోని ఘడ్పూర్ పంచాయతీ పరిధి బాబానగర్‌కు చెందిన సండ్ర లక్ష్మణ్, అనిల్, అశోక్‌ను అదే గ్రామానికి చెందిన మనుబోతుల శ్రీనివాస్ గొడ్డలి, కత్తితో దాడి చేసి గాయపరిచాడు. అప్పటి ఎస్సై వేణుగోపాల్‌రావు శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. అప్పటి న్యాయమూర్తి అర్పిత మారంరెడ్డి ఎదుట పీపీ మదన్మోహన్రావు కోర్టులో సాక్ష్యాలు ప్రవేశపెట్టగా నేరం రుజువైంది. దీంతో శ్రీనివాస్‌కు ఐదేళ్ల జైలు, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ 2024 మే 8న తీర్పునిచ్చారు. ● 2022లో మంచిర్యాల జిల్లా కన్నెపెల్లి ఠాణా పరిధి సుర్జాపూర్‌కు చెందిన దాసరి శ్రీనివాస్, రాజన్న బైక్‌పై వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన పూదరి చంద్రశేఖర్ తన ట్రాక్టర్‌తో బైక్ ఎక్కించి గొడ్డలితో నరికి చంపుతానని బెదిరించాడు. ఫిర్యాదు అందుకున్న అప్పటి ఎస్సై గంగారాం కేసు నమోదు చేశారు. కోర్టులో నేరం రుజువు కాగా అప్పటి న్యాయమూర్తి అర్పిత మారంరెడ్డి చంద్రశేఖర్‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. ● 2017 అక్టోబర్ 21న జిల్లాలోని లక్సెట్టిపేట ఠాణా పరిధి ఇందిరానగర్‌లో ఇంటి ప్రహరీ విషయంలో మామిడి మల్లయ్య, దుంపల బంగారమ్మకు గొడవ జరిగింది. బంగారమ్మ, ఆమె కుమారులు సురేశ్, నరేశ్ మల్లయ్య కుమారులు చంద్రమౌళి, రాజగోపాల్, కృష్ణంరాజుపై తల్వార్లతో దాడి చేయగా చంద్రమౌళి మృతి చెందాడు. రాజగోపాల్, కృష్ణంరాజును గాయపరిచారు. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టగా నేరం రుజువైంది. బంగారమ్మ, నరేశ్, సురేశ్‌కు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ అప్పటి న్యాయమూర్తి డీ వెంకటేశ్ 2022 జనవరి 8న తీర్పునిచ్చారు. నేరస్తులు తప్పించుకోలేరు నేరం చేసిన వారు చట్టం చేతి నుంచి తప్పించుకోలేరు. సీసీ ఫుటేజీ, వేలిముద్రలు, సెల్‌ఫోన్ కాల్‌డేటా, ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు, ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాం. పంచనామా సమయంలో సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాన్ని వీడియో రికార్డ్ చేసి కోర్టుకు అందజేస్తున్నాం. నేర దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన అధికారులకు రివార్డులిస్తూ ప్రోత్సహిస్తున్నాం. – ఎగ్గడి భాస్కర్, డీసీపీ, మంచిర్యాల -
కాంట్రాక్ట్ లెక్చరర్ల నిరవధిక సమ్మె
బాసర: యుటాక్ స్టేట్ అసోసియేషన్ పిలుపుమేరకు నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ అధ్యాపకులు సోమవారం నిరవధిక సమ్మె ప్రారంభించారు. 17 ఏళ్లుగా పని చేస్తున్న తమ ను రెగ్యులరైజ్ చేయాలని అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీశైలం మా ట్లాడారు. బాసర ఆర్జీయూకేటీ కాంట్రాక్ట్ అధ్యాపకులతో ప్రారంభమైందని, విశ్వవిద్యాలయ పు రోగతికి తమవంతు కృషి చేస్తున్నామని తెలిపా రు. కాంట్రాక్ట్ వ్యవస్థకు ముగింపు పలికి విశ్వవి ద్యాలయాల అభివృద్ధికి పాటుపడాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ మధుసూదన్, డాక్టర్ విజ య్‌కుమార్, మందా సతీశ్‌కుమార్, డాక్టర్ రాములు, శ్రీధర్, తిలక్రెడ్డి, భానుప్రియ, రమాదేవి, ప్రశాంతి, రజితారెడ్డి, శ్రీకాంత్ పాల్గొన్నారు. 13వ రోజుకు అసిస్టెంట్ ప్రొఫెసర్ల దీక్ష ఆర్జీయూకేటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు చే పట్టిన నిరవధిక నిరసన దీక్ష సోమవారం 13వ రోజుకు చేరింది. తమకు అదనపు బాధ్యతలు వ ద్దని, రెగ్యులర్ చేయాలని, తమ సేవలు గుర్తించాలని ఆందోళన కొనసాగిస్తున్నారు. ఎర్రటి ఎండలో గొడుగులు పట్టుకుని విశ్వవిద్యాలయం ఆ వరణలో నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఉ పేంద్ర, కృష్ణప్రసాద్, ఖలీల్, డాక్టర్ కుమార్ రా గుల, డాక్టర్ విఠల్, ప్రకాశ్, డాక్టర్ రోషన్, డాక్టర్ సాయికృష్ణ, డాక్టర్ పావని, డాక్టర్ శ్వేత, డాక్టర్ స్వాతి తదితరులు పాల్గొన్నారు. -
దాడికి పాల్పడ్డ ముగ్గురి అరెస్ట్
భీమిని: కన్నెపల్లి మండలం టేకులపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఓ వ్యక్తిపై దాడి చేసిన ముగ్గురిని అరెస్ట్ చేసి బైండోవర్ చేసినట్లు ఎస్సై గంగారాం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. భీమిని మండలం మల్లీడి గ్రామానికి చెందిన పెద్దపల్లి ప్రశాంత్ సోమవారం కన్నెపల్లి మండలంలోని టేకులపల్లి గ్రామంలో చేపట్టిన తన ఇంటి నిర్మాణ పనుల్లో ఉన్నాడు. మల్లీడి గ్రామానికి తన బంధువులైన పెద్దపల్లి నగేశ్, పెద్దపల్లి గణేశ్, పెద్దపల్లి సురేశ్ పాతకక్షలతో ప్రశాంత్‌పై చేతులు, కర్రలతో దాడి చేశారు. ప్రశాంత్ ఫిర్యాదు మేరకు దర్యా ప్తు చేపట్టినట్లు ఎస్సై తెలి పారు. మరోసారి గొడవ పడకుండా తహసీల్దార్ శ్రవణ్‌కుమార్ ఎదుట బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు. -
చికిత్స పొందుతూ మృతి
బోథ్: మండలంలోని నక్కలవాడ గ్రామానికి చెంది న నైతం భూమన్న (35) ఈ నెల 17న పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎ స్సై ప్రవీణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. భూమన్న ఓ రైతు వద్ద పాలేరుగా పనిచేస్తున్నాడు. ఈ నెల 17న మద్యం తాగి ఇంట్లో భార్య లక్ష్మితో గొ డవ పడ్డాడు. దీంతో లక్ష్మి మందలించగా క్షణికావేశంలో ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగాడు. వెంటనే కుటుంబీకులు బోథ్‌లోని సీహెచ్‌సీకి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్‌లోని రి మ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. మృతుడికి భార్య లక్ష్మి, మూడేళ్ల కుమారుడున్నారు. లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. లక్సెట్టిపేట: మండలంలోని వెంకట్రావ్పేట గ్రామానికి చెందిన మునుగంటి చంద్రశేఖర్ (51) చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్సై సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రశేఖర్ ఈ నెల 20న పురోహితం ముగించుకుని ఎల్లారం గ్రామ స్టేజీ మీదుగా బైక్‌పై ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చంద్రశేఖర్‌కు బలమైన గాయాలు కాగా స్థానికులు లక్సెట్టిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించగా హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స అందిస్తుండగా సోమవారం మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కూతురు జాహ్నవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. రక్తహీనతతో చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి గుడిహత్నూర్: మండలంలోని తోషం గ్రామానికి చెందిన విద్యార్థిని బోరేకర్ సౌజన్య (15) రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సౌజన్య నేరడిగొండ మండలంలోని కేజీబీవీలో తొమ్మిదో తరగతి చదువుతోంది. కొద్ది నెలలుగా రక్త హీనతతో బాధపడుతోంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఆమె ఆరోగ్యం క్షీణించింది. వాంతులు, విరోచనాలు కావడంతో ప్రిన్సిపాల్ రజిత ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు రాకపోవడంతో రాత్రి 10.30 గంటలకు సిబ్బంది సౌజన్యను రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందింది. పాఠశాల సిబ్బంది మృతదేహాన్ని కుటుంబ సభ్యులు అప్పగించారు. ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంతోనే.. పాఠశాల ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంతోనే సౌజన్య మృతి చెందిందని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థి, యు వజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గవ్వల శ్రీకాంత్ ఆ రోపించారు. సౌజన్య కుటుంబీకులను ఆయన పరా మర్శించారు. సౌజన్యను సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లకపోవడంతోనే మృతి చెందిందని పేర్కొన్నారు. సౌజన్య తండ్రి గతంలోనే మరణించగా తల్లి అనిత కూలీ పనులకు వెళ్లి ముగ్గురు పిల్లలను పోషిస్తోందని తెలిపారు. బాధిత కుటుంబానికి రూ.5లక్షల ఆర్థికసాయం అందించాలని, కేజీబీవీ సిబ్బందిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. -
గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్
జైపూర్: మండలంలోని టేకుమట్ల రోడ్డు సమీపంలో ఇందారం ప్లాంటేషన్ వద్ద గంజాయి విక్రయించేందుకు వచ్చిన సుల్తానాబాద్ పట్టణానికి చెందిన రాటే నగేశ్, చౌతాకారి శ్రీకాంత్‌ను అరెస్ట్ చేసినట్లు ఎస్పై శ్రీధర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. సుల్తానాబాద్ పట్టణానికి చెందిన నగేశ్, శ్రీకాంత్ కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌కు బైక్‌పై వెళ్లి అక్కడి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి సుమారు 500 గ్రాముల గంజాయి కొనుగోలు చేస్తుంటారు. అందులో కొంత సేవించి మిగతా దా న్ని ప్యాకెట్లుగా చేసి రూ.500 చొప్పున విక్రయించేవారు. వచ్చిన డబ్బులతో మద్యం తాగుతూ జల్సా చేసేవారు. ఈ క్రమంలో అక్కడ గంజాయి కొనుగోలు చేసి స్థానికంగా విక్రయించేందుకు తెస్తుండగా సోమవారం వారిని పట్టుకున్నట్లు ఎస్సై తెలి పారు. వారి నుంచి 102 గ్రాముల గంజాయి, సెల్‌ఫోన్, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. -
‘పేదల ఆరోగ్యంపై వివక్ష ఎందుకు’
ఆదిలాబాద్‌టౌన్(జైనథ్): పేదల ఆరోగ్యంపై ఈ ప్ర భుత్వాలకు వివక్ష ఎందుకని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్, ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ ప్రశ్నించారు. లక్ష కిలో మీటర్ల మా భూమి రథయాత్రలో భాగంగా ఎనిమిదో రో జు సోమవారం జైనథ్ మండల కేంద్రంలోని ప్రభు త్వ ఉన్నత పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనమని చెబుతూనే దొడ్డు బియ్యం భోజనం పెడుతున్నారని ఆరోపించారు. కోడి గుడ్లు కూడా ఇవ్వడం లేదని తెలిపారు. ఇదేనా విద్యార్థులకు అందించే నాణ్యమైన భోజనమని ప్ర శ్నించారు. మరుగుదొడ్ల నిర్మాణం నాణ్యతగా లేద ని పేర్కొన్నారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని సందర్శించారు. మందులు ఉన్నాయా.. లేవా.. అనే విషయాలను రోగుల ద్వారా తెలుసుకున్నారు. మా భూమి రథయాత్ర ద్వారా విద్య, వై ద్యం, ఉపాధి రంగాలన్నింటినీ పరిశీలించి వాటి మెరుగుదల కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. పేదల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలతో పోరాడుతామని వివరించారు. ఆయన వెంట పార్టీ రాష్ట్ర నాయకుడు లక్ష్మణ్, జిల్లా అధ్యక్షుడు అగ్గిమల్ల గణేశ్, ఇతర నాయకులున్నారు. -
‘అంబేడ్కర్ విధానాలను కాలరాసిన కాంగ్రెస్’
ఆదిలాబాద్: అంబేడ్కర్ విధానాలను అధికారంలో ఉన్న 60 ఏళ్లపాటు కాంగ్రెస్ కాలరాసిందని ఎంపీ గోడం నగేశ్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు చేవెళ్ల మహేందర్ ఆరోపించారు. అంబేడ్కర్ జయంత్యుత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం జిల్లా సదస్సు నిర్వహించా రు. ముందుగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అట్టడుగు వర్గాలకూ అంబేడ్కర్ చే సిన సేవలను ప్రజలకు వివరించాలని పిలుపుని చ్చారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగానికి పెద్దపీట వేసింది బీజేపీ మాత్రమేనని చెప్పారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్, నాయకులు అస్తక్ సుభాష్, పాయల్ శరత్ తదితరులున్నారు. నివాళులర్పిస్తున్న ఎంపీ నగేశ్, మహేందర్ -
నస్పూర్‌లోని ఓ ఇంట్లో చోరీ
నస్పూర్: పట్టణ పరిధిలోని ఓ ఇంటిలో చోరీ జరి గినట్లు మంచిర్యాల రూరల్ సీఐ ఆకుల అశోక్ తెలి పారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. కాకతీయ హిల్స్‌లో నివాసముండే భూపెల్లి లావణ్య ఈ నెల 18వ తేదీన ఇంటికి తాళం వేసి కుటుంబ స భ్యులతో కలిసి గోదావరిఖనికి పెళ్లికి వెళ్లింది. ఈనె ల 21న తిరిగి రాగా ఇంటి తాళం పగులగొట్టి ఉంది. లోనికి వెళ్లి చూసి 14 తులాల బంగారు ఆభరణాలు, రూ.5వేల నగదు చోరీకి గురైనట్లు గుర్తించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనాస్థలికి చేరుకుని ఇల్లు, పరిసరాలు పరిశీలించి వివరాలు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మూడు ప్రత్యేక బృందా లతో గాలింపు చర్యలు చేపట్టినట్లు సీఐ తెలిపారు. -
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
● మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు దండేపల్లి/మంచిర్యాలరూరల్(హాజీపూర్): రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. దండేపల్లి, హాజీపూర్‌లో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొ క్కజొన్నల కొనుగోలు కేంద్రాలను ఆదివారం ప్రాంభించారు. అనంతరం మాట్లాడుతూ రైతులకు సాగునీటి నుంచి మొదలు, పండించిన పంటను కొనుగోలు చేసే వరకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. యాసంగిలో రైతులు వరితోపాటు, చాలాచోట్ల మొక్కజొన్న పంట సాగుచేశారన్నారు. దీంతో వరి కొ నుగోలు కేంద్రాలతోపాటు, మొక్క జొన్న కొ నుగోలు కేంద్రాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలి పారు. హాజీపూర్ మండలంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో 18 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు విజయవంతంగా నిర్వహిస్తున్నారని అభినందించారు. ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులను చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా వివి ధ పథకాలను మహిళల అభ్యున్నతికి తీసుకు వస్తుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సహకార చైర్మన్ కోట్నాక తిరుపతి, ఆర్జీపీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి, డీఆర్డీవో కిషన్, డీపీఎం వేణుగోపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రేంచంద్, ఏపీఎం బ్రహ్మయ్య, ఏవో అంజిత్, రైతులు పాల్గొన్నారు. -
సాగునీటికి ప్రభుత్వం ప్రాధాన్యం
● చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ భీమారం: రైతులకు సాగునీటిని అందించేందు కు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. భీమారం మండలం నర్సింగాపూర్ గ్రామంలో పాత చెరువుకు రూ.33 లక్షలతో చేపట్టనున్న మరమ్మతు పనులను ఆదివారం ప్రారంభించా రు. చెరువుల కింద పెద్ద ఎత్తున పంటలు సాగవుతాయని, అందుకే చెరువుల అభివృద్ధికి కూ డా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని వెల్లడించారు. తర్వాత పోలంపల్లిలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రేషన్ కార్డుపై సన్న బియ్యం ఇస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని అన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే పార్టీ కార్యాలయం.. రామకృష్ణాపూర్: ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే మందమర్రిలో క్యాంప్ ఆఫీస్ ఏర్పాటుచేసినట్లు చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. సింగరేణి బీ–1 క్వార్టర్లో నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ఆదివారం ప్రారంభించారు. సింగరేణి కార్మికుల పెన్షన్ రూ.10 వేలకు పెంచేలా కేంద్రంపై ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు. నాయకులు నోముల ఉపేందర్, సొత్కు సుదర్శన్, తిరుమల్ పాల్గొన్నారు. -
వక్ఫ్ సవరణ చట్టంపై తప్పుడు ప్రచారం
మంచిర్యాలటౌన్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వక్ఫ్ చట్ట సవరణ పై కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు తప్పుడు ప్రచా రం చేస్తున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మాజీ అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి, నాయకులతో కలిసి ఆది వారం మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్‌బో ర్డును ప్రక్షాళన చేయాలని, వక్ఫ్ ఆస్తులు పేద ముస్లింలకు దక్కాలని సవరణ బిల్లు తీసుకువచ్చిందన్నారు. దీనిపై కాంగ్రెస్ ఎంఐఎం, ఇతర ప్రతిపక్ష పార్టీలు తమ స్వలాభం కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ఇన్ని రోజులుగా వక్ఫ్ ఆస్తుల పేరుతో సంపన్న ముస్లిం పెద్దలు అవినీతికి పాల్పడి ఆస్తులను దోచుకున్నారని ఆరోపించారు. కొన్ని మతతత్వ పార్టీలు ముస్లిం మైనారీటీ ఓటు బ్యాంక్ కోసం ముస్లింలలో అపోహలు సృష్టించి తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో పట్టి వెంకటకృష్ణ, కొయ్యల ఏమాజీ, గాజుల ముఖేశ్‌గౌడ్, తాజ్‌ఖాన్, ఎనగందుల కృష్ణమూర్తి, అమిరిశెట్టి రాజు, వంగపల్లి వెంకటేశ్వర్రావు, మాసు రజిని, అక్కల రమేశ్, రాకేశ్ రెన్వా, చిరంజీవి పాల్గొన్నారు. -
ఈ ఏడాది సాగు విస్తీర్ణం ఎకరాల్లో, విత్తనాలు, ఎరువులు, రుణాలు
పప్పు దినుసుల సాగుకు ప్రోత్సాహం..రానున్న ఖరీఫ్ సీజన్లో పప్పు దినుసుల సాగు విస్తీర్ణం పెరిగేలా రైతులకు అవగా హన సదస్సులు నిర్వహిస్తాం. సాగు విస్తీర్ణానికి అనుగుణంగా ఎరువులు, విత్తనాలు ప్రణాళిక రూపొందించడం జరిగింది. పత్తి విత్తనాలు గుర్తింపు పొందిన డీలర్ల వద్దనే కొనుగోలు చేయాలి. తప్పని సరిగా రశీదు తీసుకోవాలి. నాణ్యత లేని, హెచ్‌టీ పత్తి వి త్తనాలు కొనుగోలు చేసి నష్టపోవద్దు. కలు పు నివారణ కోసం గ్లైఫొసెట్ పిచికారీ చే యడం వలన భూసారం దెబ్బతింటుంది. రైతుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. – జి.కల్పన, జిల్లా వ్యవసాయ అధికారి నెన్నెలలో వేసవి దుక్కులు దున్నుతున్న రైతు ఇతర విత్తనాలు 32,324 క్వింటాళ్లుపత్తి విత్తనాలు 3,40,306 ప్యాకెట్లుసాగు విస్తీర్ణం 3,33,565 ఎకరాలుమంచిర్యాలఅగ్రిల్చర్: మరో నెలలో వానాకాలం పంటల సీజన్ ప్రారంభం కానుంది. యాసంగి పంటలు పూర్తయిన రైతులు ఇప్పటికే చేలను చదును చేస్తున్నారు. వేసవి దుక్కులు సిద్ధం చేసుకుంటున్నా రు. దీంతో వ్యవసాయ శాఖ వానాకాలం సాగు కోసం యాక్షన్ ప్లాన్ రూపొందించింది. సాగు విస్తీర్ణానికి అనుగుణంగా విత్తనాలు, ఎరువుల ప్రణాళిక సిద్ధం చేసింది. గతేడాది ఆలస్య వర్షాలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సకాలంలో వానలు.. గతేడాది ఖరీఫ్‌లో ఆలస్యంగా వర్షాలు కురవడంతో రైతులు ప్రారంభంలో ఇబ్బందులు పడ్డారు. ఆలస్యంగా కురిసిన భారీ వర్షాలతో జలాశయాలు సాధరణ స్థాయికి చేరాయి. దీంతో సాగు విస్తీర్ణం సాధరణ స్థాయికి చేరింది. ఈయేడాది సాధారణ వర్షపాతం నమోదు అవుతుందని వాతావరణ నిపుణులు తెలుపుతున్నారు. రైతులు వానకాలం పంటల సాగుకు సన్నద్ధమవుతున్నారు. సాగు విస్తీర్ణం, విత్తనాల ప్రణాళిక గతేడాది వానాకాలంలో జిల్లాలో 3.18 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఈ ఏడాది 3.33 లక్షల ఎకరాలకు సాగు పెరుగుతుందని అంచనా. ఇందులో పత్తి (1.58 లక్షల ఎకరాలు), వరి (1.58 లక్షల ఎకరాలు), కందులు, మొక్కజొన్న, పెసలు, మినుములతో సహా ఇతర పంటల సాగు ప్లాన్ రూపొందింది. పత్తి కోసం 3.40 లక్షల ప్యాకెట్లు, వరి కోసం 23,790 క్వింటాళ్ల విత్తనాలు అవసరం. సేంద్రియ ఎరువులైన జిలుగ, జనుము విత్తనాలపై ప్రభుత్వం రాయితీ అందిస్తోంది. యూరియా (43,952 మెట్రిక్ టన్నులు), డీఏపీ (13,306 మెట్రిక్ టన్నులు) ఎరువుల సరఫరాకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రుణ లక్ష్యం, రైతుల సమస్యలు ఈ ఏడాది రూ.2,242 కోట్ల రుణ లక్ష్యం నిర్దేశించారు. గతేడాది కంటే రూ.250 కోట్లు అధికం. అయితే, గతేడాది రూ.1,346 కోట్లు మాత్రమే అందిన నేపథ్యంలో, సకాలంలో రుణాలు అందకపోతే రైతులు వడ్డీ వ్యాపారులపై ఆధారపడే పరిస్థితి ఉంది. రబీ దిగుబడి ఆలస్యంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ‘రైతు భరోసా’ పథకం ద్వారా ఎకరానికి రూ.5 వేల సహాయం సకాలంలో అందితే సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది.ప్రభుత్వ రాయితీ విత్తనాలు 45,424 క్వింటాళ్లు (జీలుగ, జనుము)ఎరువులు : 1,10,205 మెట్రిక్ టన్నులురుణ లక్ష్యం : రూ.1951.25 కోట్లు ప్రణాళిక రూపొందించిన వ్యవసాయ శాఖ విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు పత్తి, వరి సాగే ప్రధానం -
భూ సమస్యల పరిష్కారానికి భూభారతి
● కలెక్టర్ కుమార్ దీపక్చెన్నూర్/జైపూర్: భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం భూభారతి 2025 ఆర్వోఆర్ చట్టం అందుబాటులోకి తెచ్చిందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. చెన్నూర్ పట్టణంలోని మైనార్టీ ఫంక్షన్ హాల్లో, జైపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఆదివారం వేర్వేరుగా ఏర్పాటు చేసిన అవగాహ న సదస్సుల్లో చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, అదనపు కలెక్టర్ మోతిలాల్, ఆర్డీవో శ్రీనివాస్‌తో కలిసి పాల్గొన్నారు. నూతన ఆర్వోఆర్ చట్టం ద్వారా పొరపాట్ల సవరణకు అవకాశం కల్పించడం జరిగిందన్నారు. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ చేసేందుకు భూముల వివరాలను పూర్తిస్థాయిలో సర్వే చేసి మ్యాప్ తయారు చేయడం జరుగుతుందని తెలిపారు. పెండింగ్ సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం, వారసత్వంగా వచ్చిన భూములను విరాసత్ చేసే ముందు సమగ్ర విచారణ చేస్తామని చెప్పారు. భూ సమస్యల పరిష్కారానికి రెండంచెల అప్పీల్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. జూన్ 2 నాటికి ఎంపిక చేసిన మండలాల్లో భూ సమస్యలు పరిష్కరించి మిగిలిన మండలాల్లో ఆగస్టు 15 వరకు పరిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని వివరించారు. అనంతరం షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. చెన్నూర్‌లోని 100 పడకల సామాజిక ఆరోగ్య కేంద్ర పరిధిలో ఇంది రా మహిళ శక్తి పథకంలో భాగంగా మండల సమాఖ్య అధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్యాంటీన్‌ను ప్రారంభించారు. -
ఆర్టీసీ సర్వర్ డౌన్.. నిలిచిన బస్సులు
మంచిర్యాలఅర్బన్: ఆర్టీసీ మంచిర్యాల డిపోలో ఆదివారం సాంకేతిక లోపం కారణంగా సర్వర్ డౌన్ అయింది. దీంతో బస్సుల రాకపోకలు మూడు గంటల పాటు నిలిచిపోయాయి. ఉదయం 3:45 నుంచి 8:30 గంటల వరకు పల్లెవెలుగు, ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సులతో సహా 74 బస్సులు డిపోలోనే నిలిచిపోయాయి. దీంతో బస్‌స్టేషన్‌లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాంకేతిక లోపం ఎందుకు? హైదరాబాద్‌కు వెళ్లే ఎక్స్‌ప్రెస్ బస్సులకు సంబంధించిన డ్రైవర్, కండక్టర్లు టిమ్ లోడింగ్‌కు డిపోకు వెళ్లారు. అక్కడకు వెళ్లిన తర్వాత సిస్టమ్‌లో (కంప్యూటర్)లో కండక్టర్, డ్రైవర్, టిమ్ నంబర్ నమోదు చేయాల్సిన చోట వివరాలు నమోదు కాలేదు. టిమ్ లోడింగ్ చేస్తేనే టిక్కెటు ఇష్యూ అవుతుంది. (సాంకేతిక లోపం)తో ఫైల్ కరెఫ్ట్ (ఎర్రర్) రావటంతో టిమ్ లోడింగ్ కాలేదు. అయితే, సర్వర్ లోపంతో ఫైల్ కరప్ట్ కావడంతో టిమ్ లోడింగ్ విఫలమైంది. సిస్టమ్ ఇన్చార్జి వీక్లీ ఆఫ్‌లో ఉన్నప్పటికీ సమస్య తీవ్రత దృష్ట్యా డిపోకు వచ్చారు. కానీ, సెక్యూరిటీ సిబ్బంది బ్రీత్ అనలైజర్ తప్పనిసరి అనడంతో వివాదం చెలరేగింది. తన డ్యూటీ కాకపోయినా సంస్థ కోసం విధులకు హాజరైతే బ్రీత్ ఎన్లైజర్ పేరుతో అవమానిస్తారా అని ఇన్చార్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్చార్జి బ్రీత్ అనలైజర్‌కు నిరాకరించడంతో సమస్య పరిష్కారం ఆలస్యమైంది. చివరకు ఉన్నతాధికారుల జోక్యంతో ఉదయం 9 గంటలకు సమస్య పరిష్కరించడంతో బస్సులు రాకపోకలు ప్రారంభమయ్యాయి. డిపోలో అనిశ్చితి మంచిర్యాల డిపోలో ఇటీవల విచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గత వారం డిపో కార్యాల య తాళాలు సెక్యూరిటీ కార్యాలయం నుంచి మా యమయ్యాయి. శనివారం ఉదయం తాళాలు లేని విషయం తెలిసి, తలుపులు కట్టర్‌తో కట్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటనపై విచారణ జరిపితే అసలు విషయాలు వెలుగులోకి రావచ్చు. ఈ సంఘటనలు ఆర్టీసీ డిపోలో సమన్వయ లోపాన్ని, ప్రయాణికులకు ఇబ్బందులను తెలియజేస్తున్నాయి. పరిష్కారం కోసం చర్యలు సాంకేతిక లోపాలను త్వరగా గుర్తించి పరిష్కరించేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవాలి. సిబ్బంది మధ్య సమన్వయం, సెక్యూరిటీ విధానాల సమీక్ష అవసరం. ప్రయాణికుల సౌకర్యం కోసం డిపో నిర్వహణలో సమర్థత పెంచాలి. మూడు గంటలకుపైగా ఆలస్యం.. ఇబ్బంది పడ్డ ప్రయాణికులు -
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
● బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్శ్రీరాంపూర్: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ విమర్శించారు. నస్పూర్‌లోని తెలంగాణ భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ లను నమ్మి ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారన్నారు. గెలిచిన తరువాత ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. ఎమ్మెల్యేలను మంత్రులు చేయడానికి గెలిపించలేదని, వారి హామీలు అమలు చేస్తారని నమ్మి గెలిపించారన్నారు. జిల్లాలో గంజాయి బ్యాచ్ పెట్రోగిపోతుందన్నారు. ఇసుక అక్రమ రవాణా అరికట్టాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల పై అక్రమ కేసులు పెట్టడాన్ని ఖండించారు. అధికా రులు కాంగ్రెస్ పార్టీ అడుగులకు మడుగులొత్తున్నారని, వారు తమ పద్ధతి మార్చుకుని నిస్పక్షపాతంగా పని చేయాలన్నారు. పదేళ్లలో జరిగిన అభివృద్ధిని ఇప్పటికి కాంగ్రెస్ జీర్ణించుకోవడం లేదన్నారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి ఆనవాళ్లు కనిపించుకుండా చేస్తున్నారన్నారు. పార్టీ రజతోత్సవ వేడుకల కోసం చెన్నూర్‌లో వాల్‌రైటింగ్, పోస్టర్లు వేస్తే చింపివేస్తున్నారన్నారు. ఈనెల 27 ఎల్కతుర్తిలో జరిగే బహిరంగ సభకు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలిరా వాలని కోరారు. సమావేశంలో పార్టీ జిల్లా నాయకులు నడిపెల్లి విజిత్‌రావు, డాక్టర్ రాజారమేశ్, పార్టీపట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, కార్యదర్శి మేరుగు పవన్‌కుమార్ పాల్గొన్నారు. -
క్రీడా సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యం తగదు
● రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి ఆదిలాబాద్: క్రీడా సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, తెలంగాణ క్రీడా పాఠశాలను ఆదివారం ఆయన పరిశీలించారు. స్టేడియంలోని సౌకర్యాలు, క్రీడ పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న సదుపాయాలను గురించి డీవైఎస్వోను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను గుర్తించి క్రీడల్లో వారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్పోర్ట్స్ పాఠశాలలో సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం చేయొద్దని డీఎస్ఏ అధికారులను ఆదేశించారు. క్రీడా పాఠశాలలోని విద్యార్థులకు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్య త అధికారులపై ఉందన్నారు. హాస్టల్, జిమ్‌ను పరిశీలించి, మరిన్ని సౌకర్యాల కల్పనకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవిస్తానని స్పష్టం చేశారు. త్వరలోనే శిక్షకుల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్ఏ అధికారులు, యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్‌రెడ్డి, జైనథ్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విలాస్ పటేల్, యువజన కాంగ్రెస్ బేల మండల అధ్యక్షుడు గోడే అవినాష్, కిసాన్ కాంగ్రెస్ బేల అధ్యక్షుడు ఘన్‌శ్యామ్, మాజీ సర్పంచ్ రూప్ రావు, రమేశ్ పటేల్, ఠాక్రే సాగర్ పాల్గొన్నారు. -
కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య
బెజ్జూర్: కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రానికి చెందిన సుంకరి లక్ష్మి (55) కుటుంబ కలహాలతో శనివారం రాత్రి పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం 108లో కాగజ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలి భర్త సుంకరి పురుషోత్తం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపారు. -
కారాదు విషాదం
ఈత సరదా.. ● నీట మునిగి ప్రాణాలు కోల్పోతున్న విద్యార్థులు, యువకులు ● తల్లిదండ్రులకు తీరని శోకం ● జాగ్రత్తలు తీసుకోవాలంటున్న నిపుణులు లక్ష్మణచాంద: ఈతకు వెళ్లడం అంటే ఎవరికై నా సరదాగానే అనిపిస్తుంది. వేసవికాలం వచ్చిదంటే చాలు ఎండ వేడిమి నుంచి ఉపశమనానికి గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల్లో చిన్నాపెద్ద తేడాలేకుండా చెరువులు, వాగులు, స్విమ్మింగ్ పూల్స్‌లో సరదాగా ఈత కొడుతుంటారు. అయితే ఈత సరదా కొన్నిసార్లు ప్రాణాలమీదకు తెస్తోంది. పలువురి ప్రాణాలు బలిగొంటోంది. నీటిలోకి దిగి ఈతరాక అందులో మునిగి ప్రాణాలు కోల్పోయి తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు సరదాగా ఈత కసం చెరువులు, కుంటలు, బావుల వద్దకు వెళ్తారు. ఈ నేపథ్యంలో పిల్లలను ఓ కంట కనిపెట్టాలని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో జరిగిన కొన్ని సంఘటనలు ● ఈ నెల 18న మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని పారుపల్లికి చెందిన పూరెళ్ల అశోక్ (20)శుక్రవారం తన పుట్టినరోజు కావడంతో సాయంత్రం గ్రామ సమీపంలోని గోదావరిలోకి స్నానా నికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటమునిగి మృతి చెందాడు. ● ఎనిమిదేళ్ల క్రితం నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలంలోని వడ్యాల్‌కు చెందిన ముగ్గురు పదేళ్లలోపు చిన్నారులు ఆడుకుంటూ గ్రామ సమీపంలోని చెరువువద్దకు వెళ్లి అందులో పడి మృతి చెందారు. ● ఈ ఏడాది మార్చి 4న మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటకు చెందిన గూడెం సత్యనారాయణ (41) స్నానం చేసేందుకు గోదావరినదికి వెళ్లి ఈతరాక నీటమునిగి మృతి చెందాడు. ● ఈఏడాది మార్చి30న ఆదిలాబాద్ జిల్లా నార్నూ ర్ మండలంలోని గంగాపూర్‌కు చెందిన శంకర్ (20) కెరమెరి మండలంలోని శంకర్ లొద్దికి దైవదర్శనానికి వెళ్లాడు. స్నానం చేసేందుకు చెరువులో దిగి నీటమునిగి మృతి చెందాడు. ● ఈ నెల 5న ఆదిలాబాద్ జిల్లా మావల శివారులోని చెరువులో ఈతకు వెళ్లిన పదేళ్లలోపున్న సంజీవ్, రాహుల్ ఈతరాక నీటమునిగి మృతి చెందారు. ● 2020లో మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని మాదారం టౌన్‌షిప్‌కు చెందిన వాసు (13), సతీశ్ (14) గ్రామ శివారులోని వ్యవసాయ కుంటలో ఈతకొట్టేందుకు వెళ్లి నీటమునిగి మృతి చెందారు. ● 2024 నవంబర్ 1న మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని దుగ్నేపల్లికి చెందిన కొండ అరుణ్ కుమార్ (18), దాసరి సాయి (16) సుందరశాల సమీపంలోని గోదావరిలో స్నానానికి వెళ్లి నీటిలో మునిగి మృతి చెందారు. ● 2024 మార్చి 26న కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని నదిమాబాద్‌కు చెందిన వనస కమలాకర్ (22), ఆలం సాయి (22), ఉప్పుల సంతోష్ (25), ఎల్ముల ప్రవీణ్ (23) హోలీరోజు మిత్రులతో కలిసి స్నానం చేసేందుకు తాటిపల్లి సమీపంలోని వార్ధానదికి వెళ్లారు. లోతుకు వెళ్లి ఈత రాకపోవడంతో నీట మునిగి మృత్యువాత పడ్డారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ● చిన్నారులకు నిపుణుల సమక్షంలో లేదా తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఈత నేర్పించాలి. ● ఈత రానివారు నేరుగా నీటిలో దిగకుండా సేఫ్టీ జాకెట్ తప్పనిసరిగా ధరించాలి. ● ఈత వచ్చినవారు సైతం నీళ్లు ఎంతలోతు ఉన్నాయి? అనేది ముందుగానే గమనించిన తర్వాతే నీటిలోకి దిగాలి. లేదంటే ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. ● చెరువులు, కుంటలు, ఇతర జలాశయాల్లో అడుగున బురద పేరుకుపోయి ఉంటుంది. కావున అందులోని పరిస్థితిని తెలుసుకోకుండా దూకితే ప్రమాదాల బారిన పడుతారు. ● చెరువులు, వాగులు, ఇతర జలాశయాల వద్ద అధికారులు తప్పనిసరిగా ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. ● రైతులు వ్యవసాయ బావుల చుట్టూ కంచెను ఏర్పాటు చేసి అందులోకి ఎవరూ దిగకుండా చర్యలు చేపట్టాలి. సేఫ్టీ జాకెట్ ధరించాలి ఈతకు వెళ్లే సమయంలో లైట్ సేఫ్టీ జాకెట్ ధరిస్తే ప్రమాదం సంభవించదు. ఎలాంటి సేఫ్టీ నిబంధనలు పాటించకనే ప్రమాదాలకు గురవుతున్నారు. ఈతకు వెళ్లినప్పుడు ఒకరిద్దరు కాకుండా గుంపుగా స్నానం చేయాలి. ప్రమాదవశాత్తు ఒకరు మునుగుతున్నా మిగిలిన వారు కాపాడవచ్చు. – జింక లక్ష్మీనారాయణ, గజ ఈతగాడు, నిర్మల్ అవగాహన లేక.. గ్రామాలలో చెరువులు, కాలువలు, కుంటలు, వాగుల్లోకి ఈతకు వెళ్లినవారు వాటిపై సరైన అవగాహన లేకపోవడంతోనే లోతులోకి వెళ్లి నీటమునిగి ఊపిరి ఆడకపోవడంతో మృత్యువాత పడుతున్నారు. నేను ఇప్పటి వరకు గోదావరిలో మునిగిన సుమారు వందమంది ప్రాణాలు కాపాడాను. – సాయిలు, గజ ఈతగాడు, గాంధీనగర్ ఓ కంట కనిపెట్టాలి ప్రస్తుతం పాఠశాలలకు వేసవి సెలవులు రానున్నాయి. పిల్లలు ఇంటిపట్టునే ఎక్కువగా ఉంటారు. ఇలాంటి సమయంలో వారిని వేసవి శిబిరాలకు పంపించాలి. లేదంటే ఇంటిపట్టున ఉండే పిల్లలను తల్లిందండ్రులు అనుక్షణం కనిపెడుతూ ఉండాలి. స్నేహితులతో కలిసి బయటకు వెళ్తే తరచూ వాకబు చేయాలి. – పి.సాయన్న, పోషకుడు -
కారును ఢీకొన్న లారీ..
జగిత్యాలక్రైం: దైవ దర్శనానికి వచ్చిన భక్తులు రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఘటన ఆదివారం జగిత్యాల రూరల్ మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నిర్మల్ జిల్లా దిలావర్పూర్కు చెందిన కడెం శ్రీరాం, ల్యాండ్రి ము న్నా, దన్నూరి ప్రణీత్, కారెపు రుషి, కడెం విశ్వంత్, భూమేశ్, రిషికరుణ్, నిమ్మల నర్సయ్య, కారే మధు ఆదివారం కొండగట్టు దైవదర్శనానికి వచ్చారు. అక్కడి నుంచి ధర్మపురి పుణ్యక్షేత్రానికి వెళ్లారు. తిరుగుప్రయాణంలో జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామ శివారులో ఎదురుగా వస్తున్న లారీ కారును ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న తొమ్మిది మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కొంతమంది పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తరలించారు. రూరల్ ఎస్సై సదాకర్ ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. -
గల్లంతైన విద్యార్థి మృతదేహం లభ్యం
లక్ష్మణచాంద: సరదాగా ఈతకు వెళ్లి న విద్యార్థి ప్రాణా లు కోల్పోయిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. వడ్యాల్‌కు చెందిన మద్దెల గంగన్న–లక్ష్మి దంపతుల కుమారుడు రాంచరణ్(14) స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. శనివారం పాఠశాల ముగిసిన తరువాత గ్రామ సమీపంలోని వాగుపై గల చెక్‌డ్యామ్ వద్దకు ఈతకు వెళ్లాడు. అదే సమయంలో సరస్వతి కాలువ ద్వారా సదర్మాట్ కోసం వాగులోకి ఎక్కువ మోతాదులో నీటిని వదలడంతో గల్లంతయ్యాడు. కుటుంబ సభ్యులు చెక్‌డ్యామ్ వద్ద వెతుకగా రాంచరణ్ ప్యాంటు, షర్ట్, పాదరక్షలు లభించాయి. ఆదివారం గ్రామస్తులు, పోలీస్ సిబ్బంది వెతుకగా మృతదేహం లభించింది. ‘పద్నాలుగేళ్లకే నూరేళ్లు నిండాయా లడ్డూ.. నీళ్లలో నీవు ఎలా నిదురపోయావురా..నీవు లేకుండా మేము ఎలా బతకాలిరా.. నన్నుకూడా నీతో తీసుకుపోరా.. అంటూ మృతుని తల్లి కుమారుడి మృతదేహంపై పడి రోదించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మాలిక్ రెహమాన్ తెలిపారు. -
పోలీసులమని చెప్పి చైన్ అపహరణ
లక్ష్మణచాంద: పోలీసులమనిచెప్పి వాహనాన్ని ఆపి మహిళ బంగారు గొలుసు అపహరించిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. వడ్యాల్ గ్రామానికి చెందిన ఇప్ప (కొత్తూర్)రామవ్వ ఆదివారం మధ్యాహ్నం తమ బంధువుల వివాహ వేడుకలకు హాజరయ్యేందుకు తమ ఇంటిపక్కనున్న భీమేష్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై నిర్మల్ బయలుదేరింది. కనకాపూర్ జాతీయ రహదారిపై ఇద్దరు వ్యక్తులు తాము పోలీసులమని చెప్పి బైకును ఆపారు. ముందు హత్య జరిగిందని, అటువైపు వెళ్లడం సరికాదని మెడలో ఉన్న బంగారు గొలుసు తీసి లోపల పెట్టుకోవాలని సూచించారు. దీంతో సదరు మహిళ మెడలోని 4 తులాల బంగారు గొలుసు తీసి తన పర్స్‌లో పెట్టుకునే క్రమంలో తాము పెట్టి ఇస్తామని చెప్పి తీసుకుని మళ్లీ పర్సు ఇచ్చారు. అనంతరం వారు అక్కడి నుండి జారుకున్నారు. మహిళ పర్సు తీసి చూడగా అందులో చైన్‌కు బదులు రాళ్లు కనిపించడంతో లబోదిబోమంది. రామవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మాలిక్ రెహమాన్ తెలిపారు. జాతీయ రహదారి పరిశీలన కనకాపూర్ జాతీయ రహదారిని నిర్మల్ ఏఎస్పీలు రాజేశ్‌మీనా, ఉపేందర్‌రెడ్డి ఆదివారం పరిశీలించారు. మండలంలోని వడ్యాల్ గ్రామానికి చెందిన కొత్తూరు రామవ్వ నిర్మల్‌లో తమ బంధువుల పెళ్లి ఉండగా తన ఇంటి పక్కనున్న వ్యక్తితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తోంది. ఈ క్రమంలో కనకాపూర్ జాతీయ రహదారిపై ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు పోలీసులమని చెప్పి ఆమె వద్ద ఉన్న బంగారం ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న ఏఎస్పీలు ఘటనా స్థలాన్ని పరిశీలించి రామవ్వ ద్వారా వివరాలు సేకరించారు. ఘటనపై వేగంగా విచారణ చేపట్టాలని ఎస్సై మాలిక్ రెహమాన్‌ను ఆదేశించారు. -
ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలి
● జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కఉట్నూర్రూరల్: నిరుద్యోగ యువతీ యువకులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క అన్నారు. ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్‌లోని వైటీసీలో గిరిజన నిరుద్యోగులకు ఆర్టీసీ ఆదిలాబాద్ రీజియన్ సహకారంతో హెవీ వెహికిల్ మోటార్ ట్రైనింగ్ ప్రోగ్రాంను ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 59 వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు తెలిపారు. త్వరలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 4 వేల అంగన్వాడీ పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఆర్టీసీని గత ప్రభుత్వం పట్టించుకోలేదని, ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంటనే పూర్వ వైభవం తీసుకొస్తున్నామన్నారు. యువత ఖాళీగా ఉండకుండా ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలన్నారు. అనంతరం దేవుగూడ గిరిజన ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు బెంచీలు అందజేశారు. ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేశారు. కార్యక్రమంలో ఎంపీ నగేశ్, ఎమ్మెల్సీ విఠల్, ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా, సబ్ కలెక్టర్ యువరాజ్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, తదితరులు పాల్గొన్నారు. -
తొడసం కట్టికి ఘన నివాళి
ఇంద్రవెల్లి: 1981 ఏప్రిల్ 20న ఇంద్రవెల్లిలో జరిగిన సభకు సారధ్యం వహించిన తుమ్మగూడకు చెందిన తొడసం కట్టి స్మారక జెండా వద్ద ఆదివారం ఉదయం గ్రామస్తులు ఘనంగా నివాళులర్పించారు. అంతకుముందు తుమ్మగూడ నుంచి సంప్రదాయ వాయిద్యాలతో రాంనగర్చౌక్ వద్ద ఉన్న స్మారక జెండావద్దకు వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. తొడసం కట్టి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తుమ్మగూడ గ్రామ పెద్దలు కనక హనుమంత్‌రావ్, సోయం వినోద్, ఆత్రం జల్పత్రావ్, మడావి శేకు, తదితరులు పాల్గొన్నారు. ఆటో బోల్తా.. పలువురికి గాయాలుభైంసాటౌన్: పట్టణంలోని సాత్పూల్ వంతెన వద్ద ఆటో బోల్తా పడిన ఘటనలో పలువురు గాయాలపాలయ్యారు. స్థానికుల కథనం ప్రకారం.. ఆదివారం సాయంత్రం ముధోల్ వైపు నుంచి ప్యాసింజర్లతో వస్తున్న ఆటో భైంసాలోని సాత్పూల్ వంతెన వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఘటనలో ఆటో బోల్తా పడగా, అందులోని ప్రయాణికులు నిజామాబాద్‌కు చెందిన సుశ్మిత, సతీష్‌కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కల్లూరుకు చెందిన మరో ఇద్దరు మహిళలు, చిన్నారులకు గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం అందించడంతోక్షతగాత్రులను ఏరియాస్పత్రికి తరలించారు. -
ఆర్కేపీలో రెండు చోరీలు
● 10 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులురామకృష్ణాపూర్: పట్టణంలోని హనుమాన్‌నగర్‌లో రెండు చోరీల ఘటనలను పోలీసులు ఛేదించారు. బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. హనుమాన్‌నగర్‌కు చెందిన ఇరుముల్ల శరణ్య ఆదివారం తెల్లవారుజామున తన ఇంట్లో కిటికీ పక్కన నిద్రిస్తుండగా ఆమె మెడలో ఉన్న మూడు తులాల పుస్తెలతాడును గుర్తు తెలియని వ్యక్తి తస్కరించాడు. అదే కాలనీలో బుర్ర రాజేంద్రప్రసాద్ ఫోన్‌ను కూడా కిటికీ నుండే దొంగిలించాడు. సమాచారం అందుకున్న పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో సీసీఎస్ పోలీసుల సహకారంతో పలు బృందాలుగా ఏర్పడి విచారణ ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు గోదావరిఖనిలోని కాకతీయకాలనీకి చెందిన గుంజ ఇమ్మానుయేల్గా గుర్తించారు. మధ్యాహ్నం నిందితుడిని స్థానిక సింగరేణి ఏరియా ఆసుపత్రి వద్ద ఎఫ్టీటీజెడ్ బైక్‌పై వెళ్తుండగా పట్టుకున్నారు. అతని జేబులో ఉన్న మూడు తులాల గొలుసు, ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. రెండు కేసులను ఛేదించడంలో ప్రముఖ పాత్ర వహించిన మందమర్రి సీఐ శశిధర్‌రెడ్డి, పట్టణ ఎస్సై రాజశేఖర్, కాసిపేట ఎస్సై ప్రవీణ్, క్రైంటీమ్ సిబ్బందిని ఏసీపీ అభినందించి రివార్డ్‌లను అందజేశారు. రాపల్లిలో నాలుగిళ్లలో చోరీ మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలం రాపల్లిలో నాలుగిళ్లలో చోరీ జరిగింది. ఎస్సై స్వరూప్‌రాజ్ కథనం మేరకు ఈనెల 18న గ్రామాని కి చెందిన కాల్ల రమ, ఊట్నూరి అంజయ్య, ఊట్నూ రి లక్ష్మి, ఊ ట్నూరి విశాల్ ఇళ్లలో చోరీ జరిగింది. కాల్ల రమ ఇంట్లో పావుతులం బంగారు పుస్తెలు, ఊట్నూరి లక్ష్మి ఇంట్లో 18 తులాల వెండి ప ట్ట గొలుసులు అపహరించారు. రమ ఫిర్యాదు మేరకు చోరీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
ఉట్నూర్‌రూరల్: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై మనోహర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సాలెవాడ(కె) గ్రామానికి చెందిన కోవ ప్రకాశ్ (47), కనక దత్తు ఆదివారం ద్విచక్ర వాహనంపై ఆదిలాబాద్‌కు వెళ్తుండగా ఇంద్రవెల్లి నుండి ఉట్నూర్ వైపు వెళ్తున్న బైక్ పులిమడుగు సమీపంలో మూల మలుపు వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కోవ ప్రకాశ్‌కు తీవ్రగాయాలు కావడంతో గమనించిన స్థానికులు 108 ద్వారా ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. బాధితుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గుర్తు తెలియని మహిళ..భైంసారూరల్: భైంసా–నిర్మల్ జాతీయ రహదారిపై తిమ్మాపూర్ గ్రామ సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు ఎస్సై శంకర్ తెలిపారు. జాతీయ రహదారిపై గుర్తు తెలియని మహిళను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందింది. మహిళకు 40 నుంచి 45 ఏళ్ల వయస్సు ఉంటుందని, చేతిపై నేతాజీ అని పచ్చబొట్టు రాసి ఉందని, ఎరుపురంగు చీర ధరించి ఉందన్నారు. మృతదేహాన్ని భైంసా ఏరియా ఆసుపత్రి పోస్టుమార్టం గదిలో భద్రపరిచినట్లు తెలిపారు. ఎవరైనా గుర్తిస్తే భైంసారూరల్ పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్యవాంకిడి: మద్యం తాగవద్దని కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపానికి గురై ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం రాత్రి మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఇందాని గ్రామానికి చెందిన చెంద్రి లచ్చుంబాయి చిన్న కుమారుడు చెంద్రి సంతోష్(35) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. శనివారం తల్లితో పాటు అతని భార్య కల్పన మందలించారు. దీంతో మనస్తాపానికి గురై రాత్రి అందరు పడుకున్న సమయంలో చీరతో ఫ్యానుకు ఉరేసుకున్నాడు. ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులు చూసేసరికి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. మృతుని తల్లి లచ్చుంబాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య ఆదిలాబాద్‌టౌన్(జైనథ్): భోరజ్ మండలం పెన్‌గంగ సమీపంలోని డొల్లార గ్రామ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురైనట్లు జైనథ్ ఎస్సై పురుషోత్తం తెలిపారు. మృతుని వయస్సు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంటుందని, ఛాతి భాగంలో కత్తితో పొడవడంతో శరీరంలోని పేగులు బయటకు వచ్చాయన్నారు. ముఖంపై కత్తితో పొడిచి గాయపర్చారన్నారు. ముఖం గుర్తుపట్టకుండా బండ రాయితో కొట్టినట్లు ఉందన్నారు. మృతుడు నలుపు రంగు టీషర్ట్, జీన్ ప్యాంట్ ధరించి ఉన్నాడని, మహారాష్ట్రవాసిగా అనుమానిస్తున్నామన్నారు. ఎక్కడో హత్య చేసి ఇక్కడ పడేసి ఉండవచ్చని ఎస్సై వివరించారు. మృతదేహాన్ని ఎవరైనా గుర్తిస్తే జైనథ్ పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. దరఖాస్తుల స్వీకరణ నిర్మల్‌రూరల్: రాబోయే విద్యాసంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర గురుకుల జూనియర్ కళాశాలల్లో ప్రవేశానికి ఈనెల 23 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కోఆర్డినేటర్ డేనియల్ తెలిపారు. ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ కోర్సుల్లో బెల్లంపల్లిలో 80 సీట్లు (బాలురు), నిర్మల్ పట్టణంలోని సోఫీనగర్ గురుకుల పాఠశాలలో (బాలికలు) 80 సీట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. మే 10న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. -
హిజ్రాకి వేధింపులు.. యువకుడి ఇంటి ముందు ధర్నా
మంచిర్యాల: ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నాడంటూ మందమర్రి మొదటి జోన్లో ఉండే అజయ్ అనే యువకుడి ఇంటి ఎదుట శనివారం హిజ్రాలు ఆందోళన చేపట్టారు. తనను గత కొంతకాలంగా ప్రేమ పేరిట వేధిస్తున్నాడని, ఫొటోలు, వీడియోలు తీసి వేధింపులకు పాల్పడుతున్నాడని చందన అనే హిజ్రా వాపోయింది. వీడియో కాల్ చేసి డబ్బులు కావాలని అడుగుతున్నాడని, ఇవ్వకపోతే రైలు కిందపడి చనిపోతానంటూ బెదిరిస్తున్నాడని పేర్కొంది. అజయ్‌ను తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. ఈతకు వెళ్లి విద్యార్థి గల్లంతులక్ష్మణచాంద: ఈతకు వెళ్లి విద్యార్థి గల్లంతైన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు వడ్యాల్ గ్రామానికి చెందిన మద్దెల గంగన్నృలక్ష్మి దంపతుల కుమారుడు రామ్‌చరణ్ (14) శనివారం ఉదయం పాఠశాలకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. ఒంటిగంట సమయంలో కాలనీ పిల్లలతో కలిసి గ్రామ సమీపంలోని చెక్ డ్యాంకు స్నానానికి వెళ్లారు. సాయంత్రమైనా తమ కుమారుడు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఆరా తీయగా ఈతకు వెళ్లినట్లు తెలిసింది. దీంతో చెక్‌డ్యామ్ వద్దకు వెళ్లి చూడగా రామ్‌చరణ్ బట్టలు, పాదరక్షలు కనిపించాయి. చీకటి కావడంతో తిరిగి ఇంటికి వచ్చినట్లు కాలనీవాసులు తెలిపారు. -
శ్రీచైతన్య విద్యాసంస్థల విజయకేతనం
కరీంనగర్: జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో శ్రీచైతన్య విద్యార్థులు జాతీయస్థాయిలో అద్భుత ర్యాంకులు సాధించారు. ఎం.రోహిత్ 17, టి.కుందన్ 814, పి.ఈశ్వర్ ముఖేశ్ 1,275, ఎం.అంజలి 2,575, బి.అక్షర 2,992, ఎం.తరుణ్ 5,949, నందిని7,464 ర్యాంకు, 20 వేల లోపు 15 మంది ర్యాంకులు సాధించారు. పరీక్షకు హాజరైన వారిలో 40 శాతం మంది విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌కు క్వాలీపై అయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ రమేశ్‌రెడ్డి మాట్లాడుతూ, సంస్థ స్థాపించిన నాటి నుంచి అన్ని పోటీ పరీక్షల్లో శ్రీచైతన్య విద్యార్థులు రాణిస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపక బృందానికి అభినందనలు తెలిపారు. కళాశాల డైరెక్టర్ కర్ర నరేందర్‌రెడ్డి, డీన్ జగన్మోహన్రెడ్డి, ప్రిన్సిపాల్స్ మల్లారెడ్డి, రాధాకృష్ట, మోహన్‌రావు, ఏజీఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
కన్యాకుమారి నుంచి కశ్మీర్‌కు సైకిల్‌యాత్ర
నేరడిగొండ: బెంగళూరుకు చెందిన కొట్రెస్ సోలార్ ద్వారా నడిచే సైకిల్‌పై కన్యాకుమారి నుంచి కశ్మీర్‌కు యాత్ర చేపట్టాడు. శనివారం నేరడిగొండ మండలంలోని రోల్మామడ టోల్‌ప్లాజ్ వద్ద అతను హైవే పెట్రోలింగ్ పోలీసులకు కనిపించగా పలు సూచనలు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో 100కు కాల్ చేయాలని, వెంట ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉంచుకోవాలని సూచించారు.ఇసుక డంప్ స్వాధీనం ఆదిలాబాద్‌టౌన్(జైనథ్): జిల్లా అధికారుల ఆదేశాలతో జైనథ్ మండలంలోని పెన్‌గంగా పరీవాహక గ్రామాలపై మండల స్థాయి అధికారులు అప్రమత్తమై ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగానే తమకు అందిన సమాచారం మేరకు శనివారం ఎస్సై పురుషోత్తం, తహసీల్దార్ నారాయణ, ఆర్ఐ ఉల్లాస్ సాంగ్వి, కౌట గ్రామాల మధ్య ఉన్న ఇసుక డంప్‌ను సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ సుమారు 10 ట్రాక్టర్ల ఇసుకను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇసుక విలువ రూ.20వేల వరకు ఉంటుందన్నారు. ఈ విషయాన్ని ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈతకు వెళ్లి విద్యార్థి గల్లంతు లక్ష్మణచాంద: ఈతకు వెళ్లి విద్యార్థి గల్లంతైన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు వడ్యాల్ గ్రామానికి చెందిన మద్దెల గంగన్న–లక్ష్మి దంపతుల కుమారుడు రామ్‌చరణ్ (14) శనివారం ఉదయం పాఠశాలకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. ఒంటిగంట సమయంలో కాలనీ పిల్లలతో కలిసి గ్రామ సమీపంలోని చెక్ డ్యాంకు స్నానానికి వెళ్లారు. సాయంత్రమైనా తమ కుమారుడు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఆరా తీయగా ఈతకు వెళ్లినట్లు తెలిసింది. దీంతో చెక్‌డ్యామ్ వద్దకు వెళ్లి చూడగా రామ్‌చరణ్ బట్టలు, పాదరక్షలు కనిపించాయి. చీకటి కావడంతో తిరిగి ఇంటికి వచ్చినట్లు కాలనీవాసులు తెలిపారు. -
జేఈఈలో మెరిసిన మనోళ్లు
బెల్లంపల్లి సీవోఈ విద్యార్థుల ప్రతిభదేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికి ఈ నెల 2 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించిన ప్రతిష్టాత్మకమైన జేఈఈ మెయిన్‌లో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. శుక్రవారం రాత్రి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) జేఈఈ మెయిన్ ఫలితాలను ప్రకటించింది.బెల్లంపల్లి: బెల్లంపల్లి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ (సీవోఈ) కళాశాల విద్యార్థులు విజయ దుందుభి మ్రోగించారు. కళాశాల నుండి మొత్తం 39 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 15 మంది జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు వీరే... ఎస్.కే. సుభాన్ 88.88 పర్సంటైల్ సాధించి కళాశాల టాపర్‌గా నిలవగా కె.రంజిత్ 86.57, సీహెచ్.సాయికుమార్ 85.15, కె.శ్రీనివాస్ 80.17, ఎం.సాయిరాం 78.99, ఆర్.అంజి 78.53, కె.శారూన్ 76.84, డి.రాజేందర్ 75.69, ఎస్.ఆదర్శ్ 75.04, ఎన్.రాజేశ్, 75.35, ఎస్.వెంకటేశ్వర్ 72.66, బి.ప్రవీణ్‌కుమార్ 73.67, బి.అంజిబాబు 72.30, జీ.చరణ్ 63.87, కె.రామ్ చరణ్‌తేజ 62.39 పర్సంటైల్ సాధించారు. సదరు విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ ఆకిడి విజయ్‌సాగర్, వైస్ ప్రిన్సిపాల్ దుర్గం రమాదేవి, లెక్చరర్లు అభినందించారు. సమష్టి కృషితో ఉత్తమ ఫలితాలు బెల్లంపల్లి సీవోఈ కళాశాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఏటా జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. ఈ సారి కూడా జేఈఈ మెయిన్స్‌లో 15 మంది విద్యార్థులు మెరుగైన పర్సంటైల్ సాధించారు. సమష్టి కృషితోనే విజయం సాధ్యమైంది. నిరుపేద విద్యార్థులైనా చదువులో తామేమీ తక్కువ కాదని నిరూపించారు. – ఆకిడి విజయ్‌సాగర్, సీవోఈ ప్రిన్సిపాల్, బెల్లంపల్లి షేక్ అమన్ -
శోక సంద్రంలో సోన్
సోన్: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో అష్టపు ప్రేమ్‌సాగర్ మృతదేహం శనివారం స్వగ్రామం చేరుకుంది. వారం రోజుల క్రితం దుబాయిలోని ఓ ప్రముఖ బేకరీలో పనిచేస్తున్న అష్టపు ప్రేమ్‌సాగర్‌ను పాకిస్తాన్‌కు చెందిన యువకుడు కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. అంతిమయాత్రలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు అల్లూరి కృష్ణవేణిరెడ్డి, బీజేపీ నాయకులు సత్యనారాయణగౌడ్, అయ్యన్నగారి భూమ య్య, ముత్కపల్లి నరేష్ పాల్గొన్నారు. -
ప్రజా ప్రభుత్వంలో పర్యాటక క్షేత్రాల అభివృద్ధి
● జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కనేరడిగొండ: ప్రజా ప్రభుత్వంలో పర్యాటక క్షేత్రాలను అభివృద్ధి పర్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క అన్నారు. శనివారం ఎమ్మెల్సీ దండే విఠల్, పర్యాటక శాఖ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డితో కలిసి కుంటాల జలపాతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జలపాతం అభివృద్ధికి కృషి చేస్తానని, త్వరలోనే రోప్‌వే నిర్మిస్తామన్నారు. పర్యాటకుల సౌకర్యార్థం రిసార్ట్ పనులను ప్రారంభించామని, జూన్ నాటికి రిసార్టు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పర్యావరణం దెబ్బతినకుండా కుంటాల జలపాతాన్ని అభివృద్ధి చేసి స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించేలా చూస్తామన్నారు. నిజాం కాలంలోనే కుంటాల జలపాతం వద్ద అప్పటి అధికారులు ఇక్కడ సేద తీరినట్లు ఆనవాళ్లు ఉన్నాయన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కుంటాల జలపాతానికి, పర్యాటక రంగానికి చేసిందేమి లేదన్నారు. మంత్రి వెంట కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి, కరీంనగర్ గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశ్, కాంగ్రెస్ బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్, నాయకులు తుల అరుణ్ కుమార్, ఆత్రం సుగుణ, తలమడుగు మాజీ జెడ్పీటీసీ గోక గణేశ్‌రెడ్డి, బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, ఉపాధ్యక్షుడు ఆడే వసంత్‌రావు, తిత్రే నారాయణసింగ్, జాదవ్ కపిల్, ఆడే సతీశ్, బద్దం పోతారెడ్డి, నాయిడి రవి, తదితరులు ఉన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం
● ఇద్దరికి తీవ్రగాయాలు తానూరు/భైంసాటౌన్: తానూరు మండలంలోని భోసి వద్ద జాతీయ రహదారిపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. స్థానికుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని నాంద గ్రామానికి చెందిన చందు (50), హన్మంతు, బాబన్న(సుదర్శన్) భైంసా వైపు నుంచి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా భోసి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. చందు తలపై నుంచి వాహనం వెళ్లడంతో తలభాగం నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతి చెందాడు. హన్మంతు, బాబన్నకు తీవ్రగాయాలు కావడంతో గమనించిన స్థానికులు అంబులెన్స్‌లో భైంసాలోని ప్రభుత్వ ఏరియాస్పత్రికి తరలించారు. హన్మంతు పరిస్థితి విషమంగా ఉండడంతో నాందేడ్‌కు తరలించగా, బాబన్న భైంసా ఏరియాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
‘గిరిజన’ విద్యార్థుల సత్తా
నిర్మల్: నర్సాపూర్ (జి) మండలంలోని అంజనీతండాకు చెందిన రాథోడ్ విజయ–సంతోష్ దంపతుల కుమారుడు రాథోడ్ సతీశ్, చవాన్ సేపాబాయి–అంబాజీ దంపతుల కుమారుడు చవాన్ సుధీర్ కుమార్ శుక్రవారం వెలువడిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో సత్తా చాటారు. రాథోడ్ సతీశ్ 89.018 పర్సంటైల్ సాధించి ఎస్టీ కేటగిరీలో ఆలిండియా 1,744 ర్యాంకు సాధించగా సుధీర్ కుమార్ 81.105 పర్సంటైల్ సాధించి ఆలిండియా ఎస్టీ కేటగిరీలో 4,086 ర్యాంకు కైవసం చేసుకున్నాడు. సదరు విద్యార్థులను గ్రామస్తులతో పాటు పలువురు అభినందించారు. -
21 నుంచి సమ్మెలోకి ఆర్జీయూకేటీ అధ్యాపకులు
బాసర: రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులను క్రమబద్ధీకరించిన తర్వాతే నోటిపికేషన్ వేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 21 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు ఆర్జీయూకేటీ టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీశైలం తెలిపారు. శనివారం సమ్మె నోటీస్‌ను ఏవో రణధీర్‌కు అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్జీయూకేటీ స్థాపించినప్పటి నుంచి దాదాపుగా 17 ఏళ్లుగా ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 21 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు డాక్టర్ ఎన్. విజయ్ కుమార్, మంద సతీశ్ కుమార్, శ్రీధర్, తిలక్రెడ్డి, డాక్టర్ బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
నిర్మల్ విద్యార్థుల ప్రతిభ
నిర్మల్‌రూరల్: జిల్లా కేంద్రంలోని విజయనగర్ కాలనీకి చెందిన ఉపాధ్యాయులు పోతుల్వార్ సురేష్–స్వప్న దంపతుల కుమారుడు సృజన్ కుమార్ జేఈఈ మెయిన్‌లో 99.96 శాతం పర్సంటైల్‌తో ఆలిండియాలో 683 కామన్ ర్యాంక్, ఓబీసీ విభాగంలో 105 ర్యాంక్ సాధించాడు. జిల్లా కేంద్రానికి చెందిన అటోలి సంజీవ్ కుమార్, చింతప్రభ దంపతుల కుమారుడైన రుతిక్ కుమార్ 99.89 శాతం పర్సంటైల్ సాధించి ఓబీసీ కోటాలో 301 ర్యాంకును కై వసం చేసుకున్నాడు. స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నహిద్ పాష కుమారుడు సయ్యద్ రియాజ్ 99.88 శాతం పర్సంటైల్ సాధించాడు. -
ఎస్ఆర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ
ఆదిలాబాద్‌రూరల్: దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన జేఈఈ మెయిన్‌లో మావల మండలంలోని ఎస్ఆర్ ప్రైమ్ కళాశాలకు చెందిన పలువురు విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారు. రాథోడ్ సచిన్ 3,333 ర్యాంకు, బి.శివసాయి 4,721, వాసు 6,876, ఎల్.శ్రీలేఖ 7,505, ఆక్షాద్ 8,071, జాదవ్ సాయిరామ్ 9,067, రాథోడ్ సంధ్య 9,156, రాథోడ్ పావని 11,113, రాథోడ్ హరీష్ 13,731 ర్యాంకుతో పాటు మరో 32 మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు కళాశాల జోనల్ ఇన్చార్జి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శనివారం కళాశాల చైర్మన్‌తో పాటు డైరెక్టర్లు సదరు విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాళ్లు జయపాల్‌రెడ్డి, అరవింద్, లలిత పాల్గొన్నారు. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ట్రినిటీ సత్తా
కరీంనగర్: జేఈఈ మెయిన్ ఫలితాల్లో ట్రినిటీ జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తాచాటారు. ఎ.రఘుపతి జాతీయస్థాయిలో 138వ ర్యాంకు, ఎ.హేమంత్ 162, డి.సాయిచరణ్కుమార్ 313, ఎస్.పరమేశ్వరరెడ్డి 344, ఎ.ఫనీందర్ 409, ఆర్.సాయికిశోర్ 587, వి.అదీప్ 751, డి.మహేశ్ 974, ఆర్.మనోజ్ 1,262, బి.సిద్ధిక 1,551 ర్యాంకు సాధించారు. కేవలం కరీంనగర్ బ్రాంచ్ నుంచి 1,000 లోపు 8 ర్యాంకులతో పాటు పరీక్షకు హాజరైన విద్యార్థుల్లో 83 శాతం మంది ఉత్తమ ర్యాంకులతో జేఈఈ–అడ్వాన్స్ పరీక్షలకు అర్హత సాధించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో కళాశాల చైర్మన్ దాసరి మనోహర్‌రెడ్డి మాట్లాడారు. నిర్దిష్ట ప్రణాళిక, ఉన్నతమైన బోధన, నిష్ణాతులైన అధ్యాపకుల పర్యవేక్షణలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. రాబోయే అడ్వాన్డ్స్ పరీక్షల్లో మరిన్ని ఉత్తమ ర్యాంకులు సాధించి పేరొందిన ఐఐటీ సంస్థల్లో తమ విద్యార్థులు సీట్లు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ దాసరి ప్రశాంత్‌రెడ్డి, విద్యార్థుల తల్లిదండ్రులు, వివిధ బ్రాంచ్‌ల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్‌గౌడ్ ● కొనుగోలు కేంద్రాల సందర్శనమంచిర్యాలరూరల్(హాజీపూర్)/లక్సెట్టిపేట/దండేపల్లి: ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని బీజేపీ నాయకులు విమర్శించారు. శనివారం బీజేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల సందర్శన నిర్వహించారు. హాజీపూర్ మండలం పడ్తనపల్లి, కర్ణమామిడి, లక్సెట్టిపేట మున్సిపాల్టీ పరిధి ఇటిక్యాల, దండేపల్లి మండలం ముత్యంపేట గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్‌గౌడ్, మాజీ అధ్యక్షుడు రఘునాథ్, కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్ సందర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని ధా న్యం కొనుగోలు విషయంలో అధికారులు, కేంద్రాల నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిలుకూరి రమేష్, శ్రీనివాస్, పురుషోత్తం, రమణారావు, కృష్ణమూర్తి, స్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం సేకరణ●
● రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంచిర్యాలఅగ్రికల్చర్: కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించి ధాన్యం సేకరించాలని రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్ డీఎస్ చౌహాన్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్, పౌరసఫరాల శాఖ అధికారులతో ధాన్యం సేకరణ, సన్నబియ్యం పంపిణీ, తాగునీటి సరఫరా అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ కుమార్‌దీపక్ నిర్మల్ కలెక్టరేట్ నుంచి కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 3,31,935 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా వేశామని, ఇప్పటి వరకు 209 కొనుగోలు కేంర్రాలు ప్రారంభించామన్నారు. ఈ నెల 17 వరకు 337 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. -
● వేసవి సెలవుల్లో అవకాశాలు ● జిల్లాలో అందుబాటులో శిక్షకులు ● సద్వినియోగం చేసుకుంటే మేలు
ఇలా శిక్షణ పొందితే.. మంచిర్యాల పట్టణానికి చెందిన విశ్వనాథ్ రాము, జయంతి దంపతుల ఇద్దరు కూతుళ్లు అస్మిత(17), ఝాన్సీ చిన్నతనంలో చదువు అంటే భయం పడేవారు. చాలా సున్నితంగా ఉండేవారు. అందరికన్నా వెనుకబడుతున్నామనే ఆత్మన్యూనతకు లోనయ్యేవారు. దీంతో అన్నింటా రాణించడానికి తైక్వాండో శిక్షణ ఇప్పిస్తున్నారు. గత మూడేళ్లలో శారీరక దృఢత్వంతోపాటు ఆత్మవిశ్వాసం పెరిగింది. అంతేగాక ఇద్దరు చదువులోనూ ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ.. తైక్వాండోలో రాష్ట్రస్థాయిలో పతకాలు గెలుచుకుంటున్నారు.సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/మంచిర్యాలటౌన్: వేసవి సెలవులు వచ్చేశాయి. స్కూళ్లు, కాలేజీల్లో పుస్తకాలతో కుస్తీపట్టిన విద్యార్థులకు కాస్త విరామం దొరికింది. ఈ సెలవులను సద్విని యోగం చేసుకునే అవకాశం కలిగింది. బాలబాలికలు తమ అభిరుచి మేరకు ప్రావీణ్యం సాధించవచ్చు. అందుబాటులో ఉన్న శిక్షకులతో శిక్షణ పొందవచ్చు. జిల్లాలో ఆయా అసోసియేషన్ల తరఫున క్రీడాంశాల్లో శిక్షణకు అవకాశాలు కల్పిస్తున్నారు. క్రికెట్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, బేస్‌బాల్, బాస్కెట్ బాల్, కబడ్డీ, ఖోఖో, చెస్, క్యారం, రన్నింగ్, ఫుట్‌బాల్, స్విమ్మింగ్, కరాటే, తైక్వాండోతోపాటు అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, బాక్సింగ్స్, మార్షల్ ఆర్ట్స్, ప్రాచీన కళలైన కర్ర, కత్తి సాము, ముద్గర్ తదితర వంటి క్రీడాంశాలు ఉన్నాయి. జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే శిక్షకుల ఏర్పాటు, తరగతుల నిర్వహణకు సిద్ధమవుతున్నారు. వీటితోపాటు యోగ, లలిత కళలు డాన్స్, సంప్రదాయ నృత్యాలు, సంగీత వాయిద్యాలు నేర్చుకునే అవకాశం ఉంది. వేసవి శిబిరాలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చా యి. ప్రభుత్వ, సింగరేణి, ప్రైవేటు అకాడమీలు ఫీజు తీసుకుని బాలబాలికలకు నేర్పిస్తున్నాయి. -
అభివృద్ధి పనుల్లో అలసత్వం ఉపేక్షించం
● నిర్లక్ష్యం వహించే కాంట్రాక్టర్లపై చర్యలు ● త్వరలో అంగన్వాడీలలో ఖాళీల భర్తీ ● రాష్ట్ర మంత్రి సీతక్క ● ఉమ్మడి జిల్లా పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, సీ్త్ర శిశు సంక్షేమ శాఖలపై సమీక్ష ● అభివృద్ధి పనుల తీరుపై ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేల అసంతృప్తి నిర్మల్‌చైన్‌గేట్: ‘అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యానికి తావులేదు.. పనులు చేయడంలో అలసత్వం వహించేవారిని ఉపేక్షించేది లేదు.. పనులను నిర్ణీత గడువులోపు నాణ్యతతో పూర్తి చేయించాలి’ అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణనీటి సరఫరా, మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క అధికారులను ఆదేశించారు. నిర్మల్ కలెక్టరేట్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి పనులపై శనివారం ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. టెండర్ దశ నుంచే పనులు వేగవంతం చేసి, వర్షాకాలానికి ముందు పనులు పూర్తిచేయాలన్నారు. ఆలస్యం చేస్తున్న గుత్తేదారులకు నోటీసులు జారీ చేసి, పనులు పూర్తి చేయించాలని సూచించారు. త్వరలో అంగన్వాడీల్లో టీచర్లు, ఆయాల ఖాళీలను భర్తీ చేస్తామని మంత్రి తెలిపారు. మినీ అంగన్వాడీలను అప్‌గ్రేడ్ చేస్తామని, సీనియర్ సిటిజన్ డే కేర్ సెంటర్లు, ట్రాన్స్‌జెండర్ క్లినిక్‌లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అభివృద్ధి పనుల తీరుపై ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. మహిళా సంఘాలకు చెక్కులు.. మహిళా సంఘాలకు, మెప్మాలకు మంజూరైన చెక్కులను కలెక్టర్ అభిలాష అభినవ్, ప్రజాప్రతినిధుల సమక్షంలో పంపిణీ చేశారు. బ్యాంకు లింకేజీ, రుణాల మంజూరు, వసూలులో నిర్మల్ జిల్లా ప్రగతిని మంత్రి ప్రశంసించారు. ఈ సమావేశంలో ఎంపీ గోడం నగేష్, నిర్మల్, ఆదిలాబాద్, ముధోల్, ఖానాపూర్, సిర్పూర్, ఆసిఫాబాద్, బోథ్ ఎమ్మెల్యేలు మహేశ్వర్‌రెడ్డి, పాయల్ శంకర్, పవార్ రామారావు పటేల్, వెడ్మా బొజ్జు పటేల్, పాల్వాయి హరీశ్‌బాబు, కోవ లక్ష్మి, అనిల్ జాదవ్, ఎమ్మెల్సీ దండే విఠల్, ఐసీడీఎస్ సెక్రెటరీ అనితా రామచంద్రన్, మంచిర్యాల, నిర్మల్ జిల్లా కలెక్టర్లు కుమార్ దీపక్, అభిలాష అభినవ్, ఐటీడీఏ పీవో కుష్బూగుప్తా, అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న మంత్రి సీతక్క, ఎంపీ, ఎమ్మెల్యేలు -
అమరం.. స్వేచ్ఛా స్మరణం
● నేడు ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినోత్సవం ● తొలిసారిగా అధికారికంగా నిర్వహణ ● ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాట్లు ● మంత్రి సీతక్క, ప్రజాప్రతినిధుల రాకఆ ఘటనలో నా భర్త చనిపోయిండు..ఇంద్రవెల్లి ఘటనలో నా భర్త కొద్దు చనిపోయిండు. ఆ తరువాత నేను కూలినాలి చేసి నా కొడుకును పెంచి పెద్ద చేసిన. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నా భర్త మరణాన్ని గుర్తించిండ్రు. ఇంటి స్థలం ఇచ్చిండ్రు. ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేసిండ్రు. ఐటీడీఏ ద్వారా రుణం ఇస్తే నా కొడుకుకు ఉపాధి దొరుకుతది. – సెడ్మాకి లచ్చుబాయి, తాటిగూడ నా కుటుంబాన్ని కూడా ఆదుకోవాలినాడు ఇంద్రవెల్లిలో సంతకు నా భర్త శంభుతో కలిసి వెళ్లిన. అక్కడి నుంచే ఇద్ద రం మీటింగ్‌కు వెళ్లి నం. ఆ సందర్భంగా పోలీసుల కాల్పుల్లో నా కుడి చేయికి గాయమైంది. నా భర్తకు కూడా తుపాకీ బుల్లెట్ల గాయంతో ఇంటికొచ్చి కొద్ది రోజుల తరువాత చనిపోయిండు. చేతికి గాయం కారణంగా ఇప్పటికీ నేను ఏ పని చేయలేకపోతున్న. ఉన్న ఒక్క కొడుకు కూడా అనారో గ్యంతో చనిపోయిండు. కోడలు వద్ద ఉంటూ కాలం వెల్లదీస్తున్న. ప్రభుత్వం ఇస్తున్న పింఛన్ కూడా రావట్లేదు. చాలా కష్టంగా ఉంది. ప్రభుత్వం గుర్తించి ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి నా కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్న. – మడావి జంగుబాయి, కన్నాపూర్ గ్రామస్తురాలు 1981 ఏప్రిల్ 20 జల్..జంగల్...జమీన్ కోసం ఉద్యమించిన అడవిబిడ్డలపై అప్పటి సర్కారు తుపాకీ ఎక్కుపెట్టింది. తూటాల వర్షం కురిపించింది. హక్కుల సాధనలో 15 మంది గిరిజనులు అమరులయ్యారు. వారి రక్తపుటేరులతో తడిసిన వనసీమ ఎర్రబారింది. అడవిబిడ్డల అమరత్వం నింగికెగిసింది. అగ్ని శిఖలా ఇంద్రవెల్లిలో అమరుల స్తూపమై నిలిచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాటి ప్రభుత్వాల పాలనలో స్వేచ్ఛగా నివాళులర్పించలేని దుస్థితి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం కొంతమేర సడలింపు ఇచ్చింది. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరవీరుల స్తూపం వద్ద స్మృతి వనం ఏర్పాటుకు నిర్ణయించింది. అలాగే సంస్మరణ దినోత్సవాన్ని ఈ ఏడాది అధికారికంగా నిర్వహించేందుకు సన్నద్ధమైంది. సాక్షి, ఆదిలాబాద్/ఇంద్రవెల్లి: ఇంద్రవెల్లి మురిసిపోతుంది. నేడు అమరవీరుల సంస్మరణ దినోత్సవా నికి సిద్ధమైంది. ఏటా మాదిరిగానే కాకుండా ఈ సా రి ఓప్రత్యేకత ఉంది. 43ఏళ్లుగా నిర్బంధాలు, ఆంక్ష ల మధ్య అమరవీరులకు నివాళులు అర్పించగా, ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా సంస్మరణ వేడుకలను నిర్వహిస్తోంది. ఈ మేరకు కొద్ది రో జులుగా జిల్లా అధికారులే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఫలితంగా ఈ సారి స్వేచ్ఛగా నివాళులు అర్పించవచ్చన్న మురిపెం ఆదివాసీల్లో కనిపిస్తోంది. స్మృతివనంలో కళకళలాడుతున్న స్తూపం .. ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం.. ఆదిలాబాద్ నుంచి ఉట్నూర్ వెళ్లే మార్గ మధ్యలో ఇంద్రవెల్లి గ్రామ శివారులో నిలువెత్తుగా దర్శనమిస్తోంది. అయితే ఇన్నాళ్లుగా ఆ స్తూపం ఆవరణలో అభివృద్ధి మచ్చుకు కనిపించేది కాదు. ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి ఇంద్రవెల్లి ప్రాంతం, ఆదివాసీల అభ్యున్నతిపై దృష్టి సారించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తొలుత ఇక్కడికే విచ్చేశారు. ఆ సమయంలోనే స్తూపం వద్ద అభివృద్ధి పనుల కోసం దాదాపు రూ.కోటి కేటాయించారు. ఆ నిధులతో అక్కడ ఎకరం స్థలంలో అమరవీరుల స్మృతివనం అభివృద్ధి చేశారు. అందులో భాగంగా చుట్టూ ప్రహరీ నిర్మించారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణం కూడా పూర్తి చేశారు. ఈ సారి సంస్మరణ దినోత్సవంను అధికారికంగా ఘనంగా నిర్వహించేందుకు కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా కొద్ది రోజులుగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం నిర్వహించనున్న కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఉమ్మడి జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. భూమి, భుక్తి, విముక్తి కోసం... ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో 1981 ఏప్రిల్ 20న జరిగిన సంఘటనకు నేటితో 44 ఏళ్లవుతుంది. భూమి, భుక్తి, విముక్తితో పాటు స్వయం పరిపాలన కోసం ఆదివాసీలు పోరాటం చేశారు. అటవీ అధికారులు, షావుకార్ల దౌర్జన్యం నశించాలనే డిమాండ్‌తో గిరిజన రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నాడు ఇంద్రవెల్లిలో సభ ఏర్పాటు చేశారు. దీనికి పీపుల్స్‌వార్ మద్దతునిచ్చింది. అప్పట్లో ప్రభుత్వం సభ నిర్వహణకు అనుమతినిచ్చినట్టే ఇచ్చి ఆ తర్వాత రద్దు చేసింది. విషయం తెలియక ఆదివాసీగూడేల నుంచి పెద్ద ఎత్తున సభకు తరలివచ్చారు. అయితే సభాస్థలాన్ని ఖాళీ చేయాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో ఆదివాసీలు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇలా ఘర్షణ వాతావరణంలో పోలీసులు కాల్పులు జరపడంతో పలువురు ఉద్యమకారులు (15 మంది అధికారికంగా) మృతి చెందారు. కాల్పుల ఘటనలో అమరులైన ఆదివాసీల స్మారకార్థం రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఇంద్రవెల్లి వద్ద 80 అడుగుల స్తూపం నిర్మించారు. ఆ తర్వాత ప్రభుత్వాలు స్తూపం వద్ద సంస్మరణ దినోత్సవం నిర్వహణపై నిషేధాజ్ఞలు విధించాయి. దీంతో ఏళ్ల పాటు ఏప్రిల్ 20 వచ్చిందంటే అక్కడ భారీ ఎత్తున పోలీసుల బందోబస్తు కనిపించేది. స్తూపాన్ని 1986 మార్చిలో గుర్తు తెలియని వ్యక్తులు డైనమెట్లతో పేల్చారు. గిరిజనులు ఆందోళనతో 1987లో ప్రభుత్వం ఐటీడీఏ నిధులతో రెండోసారి నిర్మించింది. 2015 నుంచి తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇవ్వకపోయినా ఆంక్షలు సడలించింది. అయితే పోలీసు బందోబస్తు మాత్రం అదే రీతిలో ఉండేది. ఈ ఏడాది మాత్రం అలాంటివేమి లేకుండా ఆదివాసీలు స్వేచ్ఛగా నివాళులు అర్పించేందుకు సిద్ధమయ్యారు. చివరి దశకు స్మృతి వనం పనులు నాటి అమరుల కుటుంబీకులతోపాటు గాయాలైన వారిని ఏ ప్రభుత్వం ఆదుకోలేదు. నాలుగేళ్ల క్రితం అప్పటి ఎంపీ సోయం బాపూరావ్ అమరుల కుటుంబీకులకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం రేవంత్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెంచారు. స్తూపం వద్ద స్మృతి వనం ఏర్పాటుకు రూ.97లక్షలు కేటాయించారు. చుట్టూ ప్రహరీ, కమ్యూనిటీ హాల్ నిర్మాణం, స్తూ పం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసి సుందరంగా తీర్చిదిద్దారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం 15 మంది అమరవీరుల కుటుంబీకులకు మండలంలోని ముత్నూ ర్ సమీపంలో గతేడాది ఇళ్ల స్థలాలు కేటా యించి హక్కు పత్రాలు అందించారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా ఇటీవల పనులు చేపట్టారు. ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం నేడు అధికారికంగా నివాళులు నేడు ఉదయం 11 గంటలకు అధికారికంగా నిర్వహించనున్న సంస్మరణ సభకు మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అలాగే స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు ఉమ్మడి జిల్లా నుంచి ఆదివాసీలు తరలివచ్చి నివాళులర్పించనున్నారు. మంత్రి చేతుల మీదుగా అమరుల కుటుంబీకులకు ట్రైకా ర్ ద్వారా రూ.10 లక్షల చొప్పున రుణ సౌకర్యం కల్పించనున్నారు. కాగా, నాటి ఘటనలో గాయపడిన వారిని కూడా ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. -
మాలగురిజాలలో నిమ్స్ వైద్య బృందం పర్యటన
బెల్లంపల్లిరూరల్: మండలంలోని మాలగురిజాల గ్రామంలో శనివారం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రి వైద్యుల బృందం పర్యటించింది. తాళ్లగురిజాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో గ్రామంలో నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని పరిశీలించారు. నిమ్స్ వైద్యుల బృందం నెఫ్రాలజీ విభాగం అసిస్టెంట్ సూపరింటెండెంట్ డాక్టర్ చరణ్‌రాజ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ విజయ్‌చందర్, వైద్యులు నిరంజన్, గణేష్, శంకర్ జిల్లా వైద్య, ఆర్యోగ శాఖ అధికారి హరీష్రాజ్తో కలిసి ఇంటింటికీ వెళ్లి కిడ్నీ బాధితుల మెడికల్ రిపోర్టులు పరిశీలించారు. వైద్యులు మాట్లాడుతూ గ్రామంలో 153 మంది రక్త నమూనాలను టీ హబ్‌కు పంపించామని తెలిపారు. గ్రామస్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రిపోర్టులు వచ్చిన తర్వాత కిడ్నీ సమస్య తీవ్రంగా ఉన్న వారికి నిమ్స్‌లో చికిత్స అందిస్తామని అన్నారు. డీఎంహెచ్‌వో హరీష్‌రాజ్, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ సుధాకర్‌నాయక్, జిల్లా మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్లు, పీహెచ్సీ వైద్యురాలు ఎవంజలీన్, తదితరులు పాల్గొన్నారు. -
● డబ్బుల కోసం ఎంతకై నా తెగిస్తున్న వైనం ● జిల్లాలో దారి తప్పుతున్న కొందరు ఖాకీలు ● నస్పూర్ ఎస్సై తీరుపై సర్వత్రా విమర్శలు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పోలీసు శాఖలో కొందరు అధికారుల తీరు వివాదాస్పదంగా మారుతోంది. నస్పూర్ పోలీసుస్టేషన్ ఎస్‌హెచ్‌వో సుగుణాకర్ క్షుద్రపూజల కేసులో జప్తు చేసిన రూ.2లక్షలు బాధితుడికి ఇచ్చేందుకు ఇబ్బందులకు గురి చేసిన వైనం ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది. డబ్బులు ఇవ్వకుండానే ఇచ్చినట్లుగా ఫొటో దిగి బాధితుడినే బెదిరిస్తూ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆ ఎస్సై ప్రవర్తించిన తీరు ఆ శాఖకే మచ్చ తెస్తోంది. చివరికి బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. జిల్లాలో నిక్కచ్చిగా, నిజాయతీగా పని చేస్తున్న అధికారులూ ఉన్నారు. ఆ నిజాయతీ అధికారులకు కీలక స్థానాల్లో పోస్టింగ్ దొరకడం లేదు. ఆదాయం వచ్చే స్టేషన్లుగా చెప్పుకునే చోట్ల కొందరు తిష్ట వేస్తూ రాజకీయ అండదండలతో చెలరేగుతున్నారు. ఆగని వసూళ్ల పర్వం ప్రతీ కేసులో ఎంతో కొంత స్టేషన్ ఖర్చుల పేరుతో వసూళ్లు చాలా చోట్ల పరిపాటిగా మారింది. ఇదంతా నిత్యం బహిరంగంగానే సాగుతున్నా ఎవరూ చెప్పక వెలుగులోకి రావడం లేదు. సివిల్ పంచాయితీలు, కుటుంబ తగాదాలు, రోడ్డు ప్రమాదాలు, గంజాయి, చీటింగ్, ఇతర క్రిమినల్ కేసుల్లో నిందితుల శిక్ష తగ్గింపు, సీజ్ చేసిన వాహనం, నగదు, ఆస్తుల విడుదలలోనూ చేతివాటం చూపిస్తున్నారు. ఇక దొంగతనాల కేసుల్లో కోల్పోయిన, రికవరీ సొమ్ములోనూ తేడా చూపిస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. గతంలో జిల్లా కేంద్రంలో పని చేసిన ఓ ఎస్‌హెచ్‌వో అవయవదానం కేసులో రూ.లక్షలు వసూలు చేసిన ఘటన నేటికీ అధికారుల్లో చర్చకు వస్తుంది. స్టేషన్ బెయిల్ కోసం గతంలో బెల్లంపల్లి టూటౌన్ పరిధిలో ఓ పోలీసు అధికారి ఏసీబీకి చిక్కారు. గతంలో జిల్లా కేంద్రంలో పని చేసిన ఓ ఎస్సై బార్ల వద్ద నెలనెలా మామూళ్లు వసూలు చేస్తూ, తిరిగి బార్ యజమాని వద్దకు వెళ్లి బెదిరించడం అప్పట్లో వివాదాస్పదమైంది. అండ ఉంటే చాలన్నట్లుగా.. చాలామంది పోలీసు అధికారులు స్థానిక రాజకీయ అండ ఉంటే చాలన్నట్లుగా వ్యవహరిస్తూ వివాదా స్పదం అవుతున్నారు. పోస్టింగ్ నుంచి రోజువారీ డ్యూటీ దాకా క్రమశిక్షణ గీత దాటినా, ఏం చేసినా తమను చూసుకుంటారనే ధీమాలో ఉంటున్నారు. కొన్ని చోట్ల వ్యాపారులు, బడా వ్యక్తులు, ఆర్థికంగా ‘అవసరమైన’ వారితో దోస్తీ చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. ప్రతీ కేసులో రాజకీయ కోణం ఎంత? ఫిర్యాదు, నిందితుల బ్యాక్‌గ్రౌండ్ పరిశీలిస్తూ ఒక్కో కేసులో ఒక్కో తీరుగా వ్యవహరిస్తున్నారు. అంతా మట్లాడాకే ఎఫ్ఐఆర్ చేస్తున్నారు. కొన్ని కేసులను నీరుగారుస్తూ పక్కదారి పట్టిస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. ఇందుకు నమ్మకస్తులైన సీని యర్, స్థానిక కింది స్థాయి సిబ్బందిని ఉన్నతాధికారులకు మధ్య వారధిగా వాడుకుంటున్నారు. గతంలో ఇక్కడ పని చేసిన ఇద్దరు పోలీసు అధికారులపై రాష్ట్రస్థాయిలో ఫిర్యాదులు వెళ్లాయి. ఎంతో కష్టపడి కొలువు సాధించి, సమాజంలో సేవ చేసే అవకాశం దొరికితే అత్యాశకు పోయి చివరకు ఉద్యోగానికే ఎసరు తెచ్చే పరిస్థితి ఏర్పడుతోంది. ఉన్నతాధికారులు తమ కింది అధికారులు పక్కదారి పట్టకుండా నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంది. -
గంజాయి రవాణా.. ముగ్గురు అరెస్ట్
జైపూర్: జల్సాలకు అలవాటుపడ్డ ముగ్గురు యువకులు ఆసిఫాబాద్ నుంచి వేలాలకు గంజాయి రవాణా చేస్తూ పట్టుబడినట్లు జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్ తెలిపారు. జైపూర్ అసిస్టెంట్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్, ఎస్సై శ్రీధర్‌తో కలిసి ఏసీపీ వెంకటేశ్వర్ శుక్రవారం వివరాలు వెల్లడించారు. వేలాల గ్రామానికి చెందిన దుర్గం సాయి కార్తీక్, సుందిళ్ల సంపత్, ప్యాగా శేఖర్లు బైక్‌పై ఆసిఫాబాద్‌కు వెళ్లి అక్కడ గుర్తు తెలియని వ్యక్తుల వద్ద సుమారు 500గ్రాముల గంజాయిని రూ.5వేలకు కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకొచ్చి చిన్న ప్యాకెట్లుగా తయారు చేస్తున్నారు. అనంతరం ఒక్కో ప్యాకెట్‌ను రూ.500ల చొప్పున విక్రయిస్తున్నారు. ఈక్రమంలో శుక్రవారం గంజాయి విక్రయించేందుకు వెళ్తుండగా వేలాల ఇసుక క్వారీ వద్ద ముగ్గురు యువకులను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 290గ్రాముల గంజాయి, రెండు బైక్‌లు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విక్రయించినా, రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని, పీడీయాక్టులు సైతం నమోదు చేస్తామని ఏసీపీ హెచ్చరించారు. సమావేశంలో జైపూర్ రెండో ఎస్సై రామలక్ష్మి ఉన్నారు. -
మాలగురిజాలలో వైద్య శిబిరం
● కిడ్నీ వ్యాధిగ్రస్తుల వ్యఽథను వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’ ● వ్యాధిగ్రస్తుల వివరాలు ఆరా తీసిన వైద్యులు ● ప్రజలకు పరీక్షలు, మాత్రలు పంపిణీ ● మూత్ర, రక్త నమూనాల సేకరణ బెల్లంపల్లి: మండలంలోని మాలగురిజాల గ్రామంలో పలువురు కిడ్నీ వ్యాధి బారిన పడి చికిత్స పొందుతుండగా.. శుక్రవారం ప్రభుత్వ వైద్యులు సందర్శించి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ‘మాలగురిజాలకు కిడ్నీ గండం’ శీర్షికన ఈ నెల 3న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడడం, కిడ్నీలు చెడిపోయి డయాలసిస్‌కు చేరి మృతిచెందడం, కొందరు మంచం పట్టిన వైనాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. స్పందించిన జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ హరీష్‌రాజ్ బెల్లంపల్లి డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో సుధాకర్‌నాయక్ ఆధ్వర్యంలో వైద్యులు, సిబ్బందిని గ్రామానికి పంపించారు. వైద్య శిబిరం నిర్వహించి 52మందికి పరీక్షలు చేయగా.. వీరిలో 10మంది కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. అనంతరం గ్రామస్తులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఆందోళనకు గురి కావద్దని డాక్టర్ సుధాకర్‌నాయక్ అన్నారు. గ్రామంలోని కిడ్నీ వ్యాధిగ్రస్తుల ఇళ్లకు వెళ్లి ఆరోగ్య పరిస్థితి, ఎంతకాలం నుంచి జబ్బుతో బాధపడుతున్నారని తెలుసుకున్నారు. గ్రామస్తులు రోజువారీగా నీటిని తాగుతున్న రెండు చేతిపంపుల వద్దకు వెళ్లి పరిశీలించారు. ఆయా చేతిపంపుల నీటిని పరీక్షల నిమిత్తం వరంగల్‌లోని లాబోరేటరీకి పంపిస్తామని ప్రకటించారు. వైద్య, ఆరోగ్య శాఖ తరఫున గ్రామంలో మూడు రోజులపాటు వైద్య శిబిరం నిర్వహిస్తామని పేర్కొన్నారు. నాలుగు బృందాలతో గ్రామంలోని 250 ఇళ్లు, 912 మంది జనాభాకు వైద్యపరీక్షలు చేయనున్నారు. ప్రతీ ఒక్కరి రక్త, మూత్ర నమూనాలను సేకరించి టీహబ్‌లో పరీక్షించనున్నారు. అనంతరం నివేదికను కలెక్టర్‌కు అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో తాళ్లగురిజాల పీహెచ్సీ వైద్యురాలు డాక్టర్ ఎవంజలెన, జిల్లా మాస్‌మీడియా అధికారి బి.వెంకటేశ్వర్, సీహెచ్ఓ వెంకటేశ్వర్, సూపర్వైజర్ మల్లిక, ఎంపీహెచ్ఏ శివగనేశ్వరరావు, ఏఎన్ఎం చంద్రకళ, ఆశ కార్యకర్త రాజేశ్వరి, సిబ్బంది పాల్గొన్నారు. -
వీడిన మల్లక్క హత్య కేసు మిస్టరీ
● నిందితుడి అరెస్ట్, రిమాండ్ ● వివరాలు వెల్లడించిన పోలీసులు కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ఆదివారంపేటలో ఈనెల 13న జరిగిన వృద్ధురాలి హత్య కేసు మిస్టరీ వీడింది. కాటారం పోలీసుస్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ నాగార్జునరావు వివరాలు వెల్లడించారు. ఆదివారంపేటకు చెందిన ఒడేటి మల్లక్క (67) భర్త రామయ్య, కుమారుడు రమేశ్ కొన్నేళ్ల క్రితం మృతిచెందారు. గ్రామంలో కిరాణం నడుపుకుంటూ ఆమె ఒంటరిగా జీవిస్తోంది. మల్లక్క కుమారుడు చనిపోగా కోడలు శ్రీలతకు నిందితుడు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా బారెగూడకు చెందిన మోరలే శివ అలియాస్ శివాజీతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరు మూడేళ్లపాటు కాగజ్‌నగర్‌లో సహజీవనం చేశారు. శివ వేధింపులు తట్టుకోలేక శ్రీలత అతడిని వదిలిపెట్టి ఆదివారంపేటకు వచ్చి ఉంటోంది. నిందితుడు శివ పలుమార్లు శ్రీలత వద్దకు వచ్చి కలుద్దామని అడగ్గా ఆమె నిరాకరించింది. దీంతో కక్ష పెంచుకున్న శివ ఆమె అత్తను అంతమొందిస్తే ఆస్తి కోసం శ్రీలత హత్య చేసిందని కేసు ఆమె పైకి వెళ్తుందని ప్రణాళిక రచించాడు. పథకం ప్రకారం ఈనెల 12న అర్ధరాత్రి మల్లక్క ఇంటికి వెళ్లిన శివ.. నిద్రిస్తున్న మల్లక్క తలపై గొడ్డలితో బాదాడు. దీంతో తీవ్రంగా గాయపడిన మల్లక్క మంచంలోనే మృతిచెందగా నిందితుడు గొడ్డలి అక్కడే పడేసి పరారయ్యాడు. మరుసటి రోజు డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి, మహదేవపూర్ సీఐ రాంచంద్రరావు, ఎస్సై –2 శ్రీనివాస్ ఘటనా స్థలిని పరిశీలించారు. మృతురాలి కూతురు శ్రీదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పలు ఆధారాల సాయంతో శివను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించడంతో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్సైలు మ్యాక అభినవ్, శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. -
మే 20న దేశవ్యాప్త సమ్మె
మంచిర్యాలటౌన్: కేంద్ర ప్రభుత్వం అవలంబి స్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మే 20న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో ని మార్క్స్ భవన్లో శుక్రవారం కార్మిక సంఘా ల జేఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 27న కార్మిక సంఘాల సదస్సును మార్క్స్ భవ న్లో నిర్వహిస్తామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి దుంపల రంజిత్, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు టి.శ్రీని వాస్, టీయూసీఐ జాడి దేవరాజు, టీఎన్టీయూసీ మణిరామ్‌సింగ్, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు మిట్టపల్లి పౌలు, ఖలీందర్ అలీఖాన్, సీఐటీయూ రాజేశ్వరి, ఐఎఫ్టీయూ నాయకులు మేకల రాములు, చిన్నయ్య, రాజేశం, సు రేందర్, గణేశ్, తదితరులు పాల్గొన్నారు. -
‘మావోయిస్టుల సిద్ధాంతాలకు కాలం చెల్లింది’
చెన్నూర్: మావోయిస్టుల సిద్ధాంతాలకు కాలం చెల్లిందని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం స్థానిక పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చెన్నూర్, కోటపల్లి, నీల్వాయి, భీమా రం నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా కరపత్రాలు, పోస్టర్లు వెలిశాయని, దీనిపై విచారణ చేస్తున్నామని తెలిపారు. మావోయిస్టుల సంచారం ఉన్న సమయంలో మారుమూల గ్రామాలు వెనుకబాటుకు గురయ్యాయని తెలిపారు. గత పదేళ్లుగా జిల్లాలో మావోయిస్టులు ఉనికి లేకపోవడంతో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాయనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. మావోయిస్టుల దుశ్చర్యలను గమనించిన కొందరు చైతన్యవంతులైన ఆదివాసీ యువకులు మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు, కరపత్రాలు వేశారని తెలుస్తోందని అన్నారు. సమావేశంలో చెన్నూర్, చెన్నూర్ రూరల్ సీఐలు దేవేందర్‌రావు, సుధాకర్ పాల్గొన్నారు. -
సర్కార్ బడిలో ప్రీ ప్రైమరీ
● పాఠశాల బలోపేతంపై ప్రభుత్వం దృష్టి ● ఇప్పటికే 26 పాఠశాలల్లో అమలు ● మరో 30 పాఠశాలల్లో నిర్వహణకు కసరత్తునిధుల కేటాయింపు..ప్రీ–ప్రైమరీ తరగతుల నిర్వహణ కోసం సమగ్ర శిక్ష తెలంగాణ నుంచి రూ. 11,95,500 మంజూరయ్యాయి. జిల్లాలోని ఏడు పాఠశాలలకు ఈ బడ్జెట్ కేటాయించారు, ఇందులో.. బోధకుల గౌరవ వేతనం: నెలకు రూ.8 వేల చొప్పున రూ.5.44 లక్షలు ఆయాల గౌరవ వేతనం: నెలకు రూ.6,000 చొప్పున రూ.4,08 లక్షలు ఇండోర్ మెటీరియల్: రూ.1.40లక్షలు హెల్త్ అండ్ సానిటేషన్: రూ.70వేలు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్(టీఎల్ఎం): రూ.33,500 పీఎంశ్రీ పాఠశాలలకు బోధకులు, ఆయాలతోపాటు ప్లే మెటీరియల్, ఇతర సామగ్రి అందుతుండగా, నాన్–పీఎంశ్రీ పాఠశాలల్లో ఈ సౌకర్యాలు పరిమితంగా ఉన్నాయి. మిగిలిన 16 పాఠశాలలకు బడ్జెట్ కేటాయింపు కోసం ప్రతిపాదనలు పంపించారు.మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో పూర్వ ప్రాథమిక విద్య(ప్రీ ప్రైమరీ) విధానాన్ని ప్రవేశపెట్టి, ఐదేళ్లలోపు చిన్నారులకు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. తద్వారా మూడేళ్లు నిండిన పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చుకుని నాణ్యమైన విద్య అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విధానం ఇప్పటికే జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో విజయవంతంగా అమలవుతోంది. మరిన్ని పాఠశాలలకు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. కొత్త ఒరవడి ఇప్పటివరకు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఐ దేళ్లు నిండిన విద్యార్థులకు మాత్రమే ప్రవేశాలు క ల్పించేవారు. కొత్త విధానం ప్రకారం మూడేళ్లు నిండిన చిన్నారులను నర్సరీ తరగతుల్లో చేర్చుకోనున్నారు. గతేడాది నుంచి జిల్లాలో 26 పాఠశాలల్లో ప్రీ–ప్రైమరీ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ కార్యక్రమం విజయానికి నిదర్శనం. అదనంగా జిల్లాలో మరో 30 పాఠశాలల్లో ఈ విధానం అ మలుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో సర్కారు బడుల్లో నూతన శకం ప్రారంభం కానుంది. ఆర్థిక భారం తగ్గింపు ప్రస్తుతం జిల్లాలో 511 ప్రాథమిక పాఠశాలల్లో 13,678 మంది, 97 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 4,234 మంది, 108 ఉన్నత పాఠశాలల్లో 23,442 మంది చదువుతున్నారు. ప్రీ–ప్రైమరీ విధానం అమలుతో మూడేళ్ల చిన్నారులూ చేరితే సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రైవేట్ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్యకు వేలాది రూపాయల ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. సర్కారు బడుల్లో ఉచితంగా విద్య అందడంతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గనుంది. అంగన్వాడీ కేంద్రాలతో సమన్వ యం చేస్తూ ఈ కేంద్రాలు ఉన్న పాఠశాలలను ప్రీ– ప్రైమరీ కోసం ఎంపిక చేయనున్నట్లు సమాచారం. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఈ పాఠశాలలను గుర్తించి విద్యాశాఖకు నివేదిక సమర్పించనుంది. జిల్లాలో అమలు విధానం గతేడాది నుంచి జిల్లాలోని బెల్లంపల్లి, భీమారం, చెన్నూర్, దండేపల్లి, జన్నారం, కన్నెపల్లి, కాసిపేట, కోటపల్లి, లక్సెట్టిపేట, మందమర్రి, నెన్నెల, వేమనపల్లి మండలాల్లో ఉన్న 26 ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ–ప్రైమరీ తరగతులు(పీపీ–1: నర్సరీ, పీపీ–2: యూకేజీ, పీపీ–3: ఎల్కేజీ) నిర్వహిస్తున్నారు. ఆయా పాఠశాలల్లో 241మంది చిన్నారులు ఉన్నారు. ఈ పాఠశాలలు ప్రైవేట్ స్కూళ్లతో పోటీపడి విద్యార్థుల సంఖ్యను పెంచుకుంటున్నాయి. జనకాపూర్, జెండా వెంకటపూర్, సుద్దాలలోని పీఎంశ్రీ పాఠశాలలు ఈ కార్యక్రమంలో ముందంజలో ఉన్నాయి. కొన్ని నాన్–పీఎంశ్రీ పాఠశాలల్లో బోధకులకు రూ.8 వేలు, ఆయాలకు రూ.6 వేల చొప్పున 10 నెలలపాటు గౌరవ వేతనం చెల్లిస్తున్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో డీఈడీ, టెట్ అర్హత ఉన్న స్థానిక అభ్యర్థులను బోధకులుగా నియమిస్తున్నారు. కిష్టాపూర్, చంద్రవెళ్లి, ఎంపీపీఎస్ బీసీ హజిం కాలనీ, ధర్మారం, తుర్కపల్లి, పోన్కల్, నంబాల వంటి పాఠశాలలు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నాయి. భవిష్యత్ ప్రణాళికలు.. ప్రభుత్వం మరో 30 పాఠశాలల్లో ప్రీ–ప్రైమరీ విధానాన్ని అమలు చేయడానికి ఆమోదం తెలిపింది. దీంతో నిరుద్యోగ యువతలో ఉపాధి అవకాశాలపై ఆశలు చిగురిస్తున్నాయి. ప్రీ–ప్రైమరీలో చేరే చిన్నారులకు ముఖ్యమంత్రి పేరిట ప్రత్యేక కిట్లు అందించే ఆలోచన ఉన్నట్లు సమాచారం. అయితే, కొత్తగా ఏర్పాటయ్యే పాఠశాలలకు సంబంధించి విధివిధానాలపై స్పష్టత రావాల్సి ఉందని జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య తెలిపారు. -
పోలీస్ విధులకు ఆటంకం.. ముగ్గురు అరెస్ట్
మంచిర్యాలక్రైం: బ్లూకోట్ పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ముగ్గురిని శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. ఈనెల 13న రాత్రి 12.30 గంటలకు జిల్లాకేంద్రంలోని హరికృష్ణ లాడ్జి ఎదుట ముగ్గురు వ్యక్తులు ఇతరులకు ఇబ్బంది కలుగజేస్తున్నారని డయల్ 100కు కాల్ రాగా బ్లూకోట్ విధుల్లో ఉన్న హోంగార్డ్లు సత్యనారాయణ, రవిలు అక్కడికి వెళ్లారు. ఇతరులను ఇబ్బంది పెట్టకుండా అక్కడి నుంచి వెళ్లిపోవాలని సదరు వ్యక్తులకు సూచించారు. విధుల్లో ఉన్న పోలీసులను సైతం లెక్క చేయకుండా వారితో దురుసుగా ప్రవర్తించడంతో పాటు నానా దుర్భాషలాడుతూ విధులకు ఆటంకం కలిగించారు. దీంతో శ్రీరాంపూర్ ఆరునక్కనగర్కు చెందిన ఓ మైనర్ బాలుడితో పాటు బానోత్ సాయివికాస్, సీలారపు వినయ్‌లపై సత్యానారాయణ ఫిర్యాదు చేశారు. దీంతో వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. చరిత్ర ఆనవాళ్లు లభ్యంబోథ్: మండలంలోని దన్నూరు(బి) గ్రామ స మీపంలోని తూర్పు దిక్కున గల కొంకన్న గుట్ట ప్రాంతంలో లక్షల సంవత్సరాలు క్రితం ఆది మానవులు ఉపయోగించిన రాళ్లు లభ్యమైనట్లు బోథ్ ఎఫ్ఆర్వో ప్రణయ్ కుమార్ శుక్రవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ తన బృందంతో కలిసి అడవిని పరిశీలించే క్రమంలో చరిత్రకు సంబంధించిన పలు ఆనవాళ్లు ల భ్యమైనట్లుగా పేర్కొన్నారు. కొంకన్నగుట్ట మ ధ్యలో సూక్ష్మరాతి మొనదేలిన అత్యంత చురుకై న చాకు లాంటి రాళ్లు అనేకం ఉన్నాయన్నారు. పొచ్చర జలపాతం చుట్టుపక్కల సైతం లక్షల ఏళ్ల నాటి ఆదిమ సమాజం ఆనవాళ్లు నేటికీ భద్రంగా కనిపిస్తున్నాయని తెలిపారు. ‘కన్నయ్య కుటుంబానికి న్యాయం చేస్తాం’ వేమనపల్లి: మంగెనపల్లిలో ఆత్మహత్యకు పాల్పడిన నాయిని కన్నయ్య కుటుంబానికి చెందిన భూ సమస్య పరిష్కారమయ్యేలా చూస్తానని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు అన్నారు. నీల్వాయి పోలీస్‌స్టేషన్‌లో కన్నయ్య కుటుంబ సభ్యులు, తెలంగాణ ఆదివాసీ గిరి జన సంఘం, సీపీఎం నాయకులతో శుక్రవా రం సమావేశమయ్యారు. వేమనపల్లి శివారు 464 సర్వే నంబర్లో కన్నయ్య తల్లి ఎల్లక్క పేరు మీద ఉన్న భూమి ఎనగంటి చిన్నన్న కొడుకు హరీశ్ పేరు మీదకు ఎలా పట్టా మార్చారన్న విషయమై విచారణ జరిపారు. రెవెన్యూ అధికారులతో మాట్లాడి రికార్డు పరంగా వివరాలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఏసీపీ వెంట చెన్నూర్ రూరల్‌సీఐ సుధాకర్, ఎస్సై శ్యాంపటేల్, సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు రాజన్న, మల్లేశ్వరి ఉన్నారు. -
కారు బోల్తా.. ఇద్దరికి తీవ్ర గాయాలు
కడెం: మితిమీరిన వేగం.. నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చిన్నబెల్లాల్కు చెందిన బక్కతట్ల వెంకటేశ్ తన కారులో నేతుల వెంకటేశ్‌తో కలిసి గురువారం రాత్రి పాండ్వపూర్ వైపు నుంచి బెల్లాల్ వెళ్తుండగా పాండ్వపూర్ హనుమాన్ ఆలయ సమీపంలోని మూలమలుపు వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ప్రమాద సూచికను, విద్యుత్ స్తంభాన్ని, ఆలయం ఇనుప కంచెను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా వారు అక్కడికి చేరుకుని ఇద్దరిని నిర్మల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
గ్రామాల్లో మావోయిస్టు వ్యతిరేక వాల్‌పోస్టర్లు
వేమనపల్లి/కోటపల్లి: ఆదివాసీ యువజన సంఘం పేరిట వేమనపల్లి మండలం ముక్కిడిగూడెం, కళ్లంపల్లి, సుంపుటం, జాజులపేట, కో టపల్లి మండలం వెంచపల్లి, ఆలుగామ, రొ య్యలపల్లి, సిర్సా, లింగన్నపేట, పంగిడిసో మారం, నక్కలపల్లి గ్రామాల్లో మావోయిస్టుల కు వ్యతిరేకంగా శుక్రవారం వాల్‌పోస్టర్లు, కరపత్రాలు వెలిశాయి. బాంబులు పెట్టామంటూ మావోయిస్టులు ఆదివాసీలను బెదిరించడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. కాలం చెల్లించిన సిద్ధాంతాలకు స్వస్తి పలకాలని కోరారు. కర్రెగూడ పేలుడు ఘటనను ప్రస్తావిస్తూ వాల్‌పోస్టర్లను ముద్రించారు. వాల్‌పోస్టర్లు ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి. పోలీసు శాఖ అ ప్రమత్తమై వాల్పోస్టర్లపై ఆరా తీయడంతోపా టు ఆయా ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేశారు. -
‘పచ్చడి’ మెతుకులు కరువేనా!
● నిరాశజనకంగా మామిడి పంట ● పెరుగనున్న ధరలు ● మంచిర్యాల జిల్లాలో 16,680 ఎకరాల్లో తోటలు చెన్నూర్: మంచిర్యాల జిల్లాలో మామిడి కాయల కాపు నిరాశజనకంగా ఉంది. వాతావరణ మార్పుల కారణంగా పూతకు తెగుళ్లు సోకడంతో పూత రాలిపోయి కాత నిలువలేదు. దీంతో దిగుబడి అమాంతం తగ్గింది. లక్షలాది రూపాయలతో తోటలను కౌలుకు తీసుకున్న రైతులు పెట్టిన పెట్టుబడి వచ్చేదెలా అని తలలు పట్టుకుంటున్నారు. మామిడి దిగుబడి తగ్గడంతో ధరలు రెండింతలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. దీంతో పేద, మధ్య తరగతి వర్గాల వారు ‘పచ్చడి’ మెతుకులకు సైతం దూరమయ్యే పరిస్థితులు ఉన్నాయి. 15,680 ఎకరాల విస్తీర్ణంలో.. మంచిర్యాల జిల్లా మామిడి సాగుకు పెట్టింది పేరు. జిల్లా మామిడికి హైదరాబాద్‌తో పాటు వివిధ రాష్ట్రాలలో మంచి డిమాండ్ ఉంది. జిల్లాలో 6554 మంది రైతులు ఉండగా 15,680 ఎకరాల విస్తీర్ణంలో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. జిల్లాలోని బెల్లంపల్లి, నెన్నల, భీమారం, చెన్నూర్, కోటపల్లి, వేమనపల్లి, జైపూర్, లక్షెట్టిపేట, తాండూర్, దండెపల్లి మండలాలలో మామిడి తోటలు ఉన్నాయి. పది మండలాలలో మామిడి తోటలు ఉన్నప్పటికీ అత్యధికంగా తోటల విస్తీర్ణం బెల్లంపల్లి నియోజకవర్గంలోని నెన్నల, తాండూర్, చెన్నూర్ నియోజవర్గంలోని భీమారం, జైపూర్, చెన్నూర్ మండలాలలో ఉన్నాయి. జిల్లాకు చెందిన రైతులు దసరి, బంగెనపల్లి, పెద్ద రసాలు, హిమన్పసందు వంటి మేలైన మామిడి రకాలను మహారాష్ట్రలోని నాగాపూర్, కర్నాటక, ఒరిస్సా రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది దిగుబడి అంతంత మాత్రంగా ఉండడంతో పక్క రాష్ట్రాలకు ఎగుమతి అయ్యే అవకాశాలు లేవని మామిడి వ్యాపారులు పేర్కొంటున్నారు. ధరలు పెరిగే అవకాశం..! జిల్లా వ్యాప్తంగా మామిడి కాయల దిగుబడులు తగ్గాయి. ఇందులో తినే మామిడి 20శాతం దిగుబడి మాత్రమే వచ్చే అవకాశం ఉండగా, పచ్చడి మామిడి 10శాతం దిగుబడి కూడా లేదు. దీంతో పచ్చడి మామిడి కాయలు కరువయ్యే అవకాశం ఉందని రైతులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో పచ్చడి మామిడి ధరలు ఆకాశాన్నంటుతున్నాయని కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది పచ్చడి మామిడి వంద కాయలకు రూ.150 నుంచి రూ.200 పలికింది. ఈ ఏడాది వంద పచ్చడి మామిడి కాయలకు రూ. 250 నుంచి రూ.300 పలుకుతుందని పచ్చడి ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిగుబడి తగ్గింది.. ఈ ఏడాది మామిడి కాయ నిలువలేదు. చెట్టుకు రెండు నుంచి మూడు క్వింటాళ్ల కాయ దిగుబడి వచ్చేది. ఈ ఏడాది చెట్టుకు 10 నుంచి 20 కిలోల దిగుబడి కూడా వచ్చే అవకాశం లేదు. కాయ దిగుబడి తక్కువగా ఉండడంతో మామిడి కాయల ధరలు పెరిగే అవకాశం ఉంది. – నాయిని తిరుపతి, వ్యాపారి పేదలకు కష్టమే.. మామిడి ధరలు పెరిగితే పేదలు మామిడి పండ్లు తినలన్నా, పచ్చడి పెట్టాలన్నా కష్టమే. ఈ ఏడాది మామిడి తక్కువ కాచింది. ఇప్పుడే ధరలు మండుతున్నాయి. రానున్న రోజులలో మరింత ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు. – బొగె సారయ్య, చెన్నూర్ -
గడువులోగా ప్లాంటు పనులు పూర్తి చేయాలి
జైపూర్: సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటు(ఎస్టీపీపీ) విస్తరణలో భాగంగా నూతనంగా నిర్మించనున్న 800 మెగావాట్ల ప్లాంటు పనులు నిర్ణీత గడువులోగా 40 నెలల్లో పూర్తి చేయాలని సింగరేణి డైరెక్టర్(ఈఅండ్ఎం) డి.సత్యనారాయణరావు తెలిపారు. జైపూర్ పవర్ ప్లాంటులోని ప్రాణహిత అతిథి గృహంలో శుక్రవారం కొత్త ప్లాంటు నిర్మాణ పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మూడో యూనిట్ నిర్మాణానికి సంబంధించి ముందస్తు పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం ఎస్టీపీపీలో 54వ జాతీయ భద్రత వారోత్సవాల ముగింపు వేడుకల్లో డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ గోపాల్‌రావు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీస్ గంగాధర్‌రెడ్డితో కలిసి డైరెక్టర్ సత్యనారాయణవు పాల్గొని మాట్లాడారు. భద్రతకు సంబంధించి అన్ని నియమాలు పాటించాలని, జాగ్రత్త నియమాలు పాటించకపోవడం మూలంగా ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. అనంతరం కార్మికులు భద్రతపై నాటికల ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీపీపీ ఈడీ చిరంజీవి, జీఎం శ్రీనివాసులు, ఏజీఎంలు మురళీధర్, మదన్మోహన్, డీజీఎంలు అజాజులఖాన్, కొత్త ప్లాంటు కోఆర్డినేటర్ వేణుగోపాలరావు, డీజీఎం లక్ష్మణ్, రాజేశ్, శివప్రసాద్, అజ్మీరా తుకారం, ఏఐటీయూసీ ఫిట్ సెక్రెటరీ సత్యనారాయణ, సీఎంవోఏఐ బ్రాంచ్ అధ్యక్షుడు సముద్రాల శ్రీనివాస్, పవర్మేక్ హెడ్ అఖిల్‌కపూర్, తదితరులు పాల్గొన్నారు. సింగరేణి డైరెక్టర్ సత్యనారాయణరావు ఎస్టీపీపీలో ఘనంగా భద్రత ముగింపు వేడుకలు -
ఏసీబీ వలలో నస్పూర్ ఎస్సై
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/నస్పూర్: క్షుద్ర పూజల కేసులో జప్తు చేసిన నగదును బాధితుడికి ఇవ్వక సొంతానికి వాడుకున్న ఎస్సై అవినీతి నిరోధక శాఖకు చిక్కి జైలు పాలయ్యాడు. ఆదిలాబాద్ రేంజీ డీఎస్పీ పి.విజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా నస్పూర్ ఎస్సై నెల్కి సుగుణాకర్ గత జనవరి 26న క్షుద్రపూజలతో రెట్టింపు డబ్బులు చేస్తానని మహారాష్ట్రకు చెందిన ఓ పూజరి మోసం కేసులో రూ.2లక్షలు జప్తు చేశాడు. కేసు ఫిర్యాదుదారుడు ప్రభంజన్ కోర్టు నుంచి నగదు విడుదల కోసం ఈ నెల 4న ఉత్తర్వులు తీసుకు రాగా, ఇచ్చేందుకు ఎస్సై దాట వేశాడు. రూ.1.50లక్షలు బాధితుడి చేతిలో పెడుతూ ఫొటో దిగి, వెంటనే డ్రాలో వేసుకున్నాడు. రూ.2లక్షలు తీసుకున్నట్లు సంతకం చేయమని ఒత్తిడి చేయగా బాధితుడు ఒప్పుకోలేదు. ఈ నెల 8న మళ్లీ స్టేషన్‌కు వెళ్లి ఎస్సైని అడిగితే, డబ్బులు ఖర్చయ్యాయని, రూ.50వేలు ఉన్నాయని, నీ మీద కూడా కేసు అయ్యేది ఇచ్చింది తీసుకో అంటూ బెదిరించి పంపేశాడు. ఈ నెల 10న రూ.70వేలు ఇచ్చేందుకు ఒప్పుకున్నాక ఇవ్వలేదు. చివరకు రూ.50వేలకు మరో పది వేలు కలిపి ఓ వైన్స్ వద్ద తీసుకోవాలని చెప్పాడు. ఇదే కేసులో బాధితుడి పేరు లేకుండా ఉండేందుకు ఎస్సై బినామీ డి.దీపక్‌కు ఫోన్ పేలో రూ.30వేలు చెల్లించాడు. విసిగెత్తిన బాధితుడు ఏసీబీ టోల్ ఫ్రీ 1064ను సంప్రదించగా, ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి ఎస్సై ఫోన్లో మాట్లాడిన ఆడియో రికార్డులు, ఫోన్ పే చెల్లింపు, జప్తు చేసిన నగదు లేకపోవడం ఆధారాలు సేకరించారు. ఎఫ్ఐఆర్ చేసి ఎస్సైని కరీంనగర్ ఏసీబీ కోర్టు ముందు ప్రవేశపెట్టగా రిమాండ్ విధించారు. 2020బ్యాచ్‌కు చెందిన ఎస్సై గతేడు జూలై నుంచి నస్పూర్ ఎస్సైగా పని చేస్తున్నారు. క్షుద్రపూజల కేసులో నగదు జప్తు బాధితుడికి ఇవ్వకుండా ఇబ్బందులు -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
దండేపల్లి: మండలంలోని ముత్యంపేట సమీపంలో గురువారం రాత్రి బొలెరో –ఆటో ఢీకొన్న ఘటనలో కొర్విచెల్మ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ కొట్టె చంద్రయ్య(49) అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై తహసీనొద్దీన్ కథనం ప్రకారం.. చంద్రయ్య తన ఆటోతో లక్సెట్టిపేట నుంచి ప్రయాణికుడిని ఎక్కించుకుని కొర్విచెల్మకు వస్తుండగా, మార్గమధ్యలో ముత్యంపేట సమీపంలో జన్నారంవైపు నుంచి లక్సెట్టిపేట వైపు ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో డ్రైవర్ చంద్రయ్యకు తీవ్ర గాయాలై అక్కడిక్కడే మృతి చెందాడు. ఆటోలో ప్రయాణిస్తున్న రాజుకు కాలు విరిగింది. అజాగ్రత్తగా అతివేగంతో బొలెరోను నడిపి ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని చంద్రయ్య తల్లి కొట్టె బుచ్చవ్వ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. బిల్డింగ్‌పై నుంచి పడి మహిళ మృతిపెంచికల్పేట్: మండలంలోని ఎల్కపల్లి గ్రామానికి చెందిన సముద్రాల రుక్మిణీ (75) ప్రమాదవశాత్తు బిల్డింగ్‌పై నుంచి పడి మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం ఉదయం బానేశ్ అనే యువకుడి సహాయంతో ఇంటిపైన ఉన్న పిల్లర్‌కు జెండా కడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు జారి పడింది. తలకు తీవ్ర గాయం కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే కాగజ్‌నగర్ ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలోనే మృతి చెందింది. కాగా మృతురాలి కుటుంబసభ్యులు మాజీ జెడ్పీటీసీ సముద్రాల సరిత రాజన్నను పలువురు పరామర్శించి మృతదేహానికి నివాళులర్పించారు. మంచంపై నుంచి పడి వ్యక్తి..లక్సెట్టిపేట: మున్సిపల్ పరిధి అంగడిబజార్‌కు చెందిన నౌసర్ అలీ (42) అనే వ్యక్తి మంచంపై నుంచి కింద పడి మృతి చెందినట్లు ఎస్సై సురేశ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం నౌసర్ అలీ గురువారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి పడుకున్నాడు. శుక్రవారం ఉదయం లేచి చూసే సరికి మంచంపై నుంచి కింద పడి ఉన్నాడు. నుదిటిపై రక్తపు గాయాలు ఉండగా కుటుంబ సభ్యులు గమనించి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. నుదిటికి బలమైన గాయం కావడంతోనే నౌసర్ అలీ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయన భార్య నూర్జన్ బేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
స్తంభంపై నుంచి పడి తీవ్ర గాయాలు
నెన్నెల: కరెంట్ స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తుండగా పట్టుతప్పి కింద పడడంతో కాంట్రాక్టు ఉద్యోగి రెండు కాళ్లు విరిగిన ఘటన నెన్నెల మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన సోదారి చంద్రయ్య విద్యుత్‌శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పదేళ్లుగా పని చేస్తున్నాడు. ఈక్రమంలో శుక్రవారం గంగారాం శివారులోని మైసమ్మ ఆలయం వద్ద కరెంట్ స్తంభంపైన మరమ్మతుల కోసం స్తంభం ఎక్కాడు. కరెంట్ వైర్ సరి చేస్తుండగా పట్టు తప్పి కింద పడిపోయాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను సహచర సిబ్బంది మంచిర్యాల ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు చంద్రయ్యకు రెండు కాళ్లు విరిగినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం ఆయనకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. -
జొన్న చేనులో పుస్తకావిష్కరణ
తాంసి: ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ కవి, రచయిత డా.ఉదారి నారాయణ రచించిన ‘యాప చెట్టు కాడ ఊరుమీద ముచట్లు’ పుస్తకాన్ని శుక్రవారం జొన్న చేనులో రైతు చేతుల మీదుగా ఆవిష్కరించారు. మండలంలోని సావర్గాం గ్రామానికి చెందిన ఆదర్శ రైతు సట్వాజీ తన జొన్నపంట చేనులో పనులు చేస్తుండగా పుస్తక రచయిత ఉదారి నారాయణ మిత్రులతో కలిసి వెళ్లి చేనులోనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో దక్కన్ గ్రామీణ బ్యాంక్ రిటైర్డ్ మేనేజర్ సామల వీరన్న, తెలుగు భాష ఉపాధ్యాయులు గంగన్న, గ్రామ పెద్దలు జీవన్, రాములు, గంగయ్య తదితరులు ఉన్నారు. -
ప్రమాదవశాత్తు మొక్కజొన్న దగ్ధం
సారంగపూర్: మండలంలోని ధని గ్రామంలో ప్రమాదవశాత్తు ఆరబెట్టిన మొక్కజొన్న పంట దగ్ధమైంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన శనిగారపు చిన్నరాజేశ్వర్ ఎకరంలో మొక్కజొన్న సాగు చేశాడు. పంట కోతకోసి ఆరేందుకు పంటపొలంలో ఉంచాడు. శుక్రవారం రైతు పంటను పరిశీలించి ఇంటికి వెళ్లిన తర్వాత ప్రమాదవశాత్తు పంటకు నిప్పంటుకుంది. ఇతర రైతులు గమనించి రాజేశ్వర్‌కు సమాచారం అందించారు. బోరుబావుల మోటార్లు ఆన్ చేసి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే 90శాతం పంట అగ్నికి ఆహుతైంది. సుమారు రూ.80వేల పంట నష్టం జరిగిందని రైతు వాపోయాడు. ఎంఆర్ఐ నర్సయ్యకు ఫోన్లో సమాచారం అందించగా ఆయన సంఘటన స్థలానికి చేరుకుని పంటనష్టం అంచనా వేశారు. -
కనీస పింఛన్ రూ.5 వేలు చెల్లించాలి
శ్రీరాంపూర్: బొగ్గు గని రిటైర్డ్ కార్మికులకు కనీస పింఛన్ రూ.5వేలు చెల్లించాలని బీఎంఎస్ బొగ్గు గనుల ఇన్చార్జి, సీఎంపీఎఫ్ ట్రస్టీ బోర్డు సభ్యుడు కొత్తకాపు లక్ష్మారెడ్డి ట్రస్టీ బోర్డును డిమాండ్ చేశారు. గురువారం ఢిల్లీలో సీఎంపీఎఫ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ట్రస్టీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ట్రస్టీ చైర్మన్ విక్రమ్ దేవాదత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఎఫ్‌పీఎస్ 1971 పింఛన్‌దారులకు ప్రస్తుతం ఉన్న పింఛన్ చాలా తక్కువగా ఉందన్నారు. ఎక్సెంజ్ట్రేడెడ్ ఫండ్‌లో పెట్టుబడుల శాతాన్ని 7 నుంచి 10వరకు పెంచేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. సీఎంపీఎఫ్ ప్రధాన కార్యాలయంలో కూడా పెట్టుబడులను అజమాయిషీ చేసే యంత్రాంగం ఉండాలన్నారు. సీఎంపీఎఫ్ సేవలన్నీ ఆన్లైన్ చేయాలని తమ నాయకుడు లక్ష్మారెడ్డి కోరారని బీఎంఎస్ సింగరేణి విభాగం అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య తెలిపారు. పింఛన్ ఫండ్‌కు ప్రతీ టన్ను బొగ్గు అమ్మకంపై రూ.20 జమ చేయాలని సూచించగా బోర్డు సభ్యులతోపాటు సింగరేణి సీఎండీ కూడా అంగీకారం తెలిపారని అన్నారు. -
నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత
కాగజ్‌నగర్‌రూరల్: కాగజ్‌నగర్ మండలం అందవెల్లి, బోడపల్లి గ్రామాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన నకిలీ పత్తి విత్తనాలను శుక్రవారం టాస్క్‌ఫోర్స్ అధికారులు పట్టుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ సీఐ రాణాప్రతాప్ తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అందవెల్లి, బోడపల్లి గ్రామాలను అడ్డాలుగా చేసుకొని నకిలీ బీటీ –3 పత్తి విత్తనాలు కాగజ్‌నగర్ మీదుగా సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నాయనే పక్కా సమాచారంతో గ్రామంలో దాడులు చేసినట్లు తెలిపారు. దాడుల్లో అందవెల్లి గ్రామానికి చెందిన ఎన్.మహేందర్ ఇంట్లో వంద కిలోల నకిలీ విత్తనాలు పట్టుకున్నామన్నారు. అతనిపై కేసు నమోదు చేసి విచారించినట్లు తెలిపారు. మహేందర్ మంచిర్యాల జిల్లాలోని పెద్దపేట్ గ్రామానికి చెందిన ఎస్కే సల్మాన్ వద్ద నుంచి నకిలీ పత్తి విత్తనాలు తీసుకొని అందవెల్లి, బోడపల్లి, ఇట్యాల, రెబ్బెన మండలంలోని పలు గ్రామాల్లో విక్రయించేందుకు తీసుకొచ్చినట్లు తెలిపారు. మహేందర్ వద్ద నుంచి రూ. 3.50 లక్షల విలువైన క్వింటాల్ నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అమాయక రైతులను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్సై వెంకటేశ్, కానిస్టేబుల్స్ మధు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య
తానూరు: మండలంలోని ఉమ్రి(కే) గ్రామానికి చెందిన కదం బాలాజీ (45) అనే రైతు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్సై భానుప్రసాద్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. రైతు బాలాజీ కొంతకాలంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. ఈసారి తనకున్న రెండెకరాల్లో వ్యయప్రయాసలకోర్చి పత్తి పంట సాగు చేశాడు. పత్తి పంట దిగుబడి సరిగా రాకపోవడంతో తీవ్రంగా మనస్తాపం చెందాడు. ఈక్రమంలో గురువారం సాయంత్రం గ్రామ సమీపంలోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు గమనించి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. ట్రెయినీ ఎస్సై నవనీత్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. శుక్రవారం బాలాజీ భార్య మోనాబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై వెల్లడించారు. మృతుడికి కుమారుడు, కూమార్తె ఉన్నారు. కాగా గత ఆరు నెలల క్రితం కూడా బాలాజీ ఆత్మహత్యాయత్నం చేసినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. -
యువతిని వేధించిన యువకుడి అరెస్ట్
బోథ్: మండల కేంద్రానికి చెందిన ఓ యువతిని సోషల్ మీడియాలో వేధించిన నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలంలోని కందుకుర్తి గ్రామానికి చెందిన అలీమ్ బేగ్ అనే యువకుడిని శుక్రవారం అరెస్ట్ చేసినట్లు బోథ్ ఎస్సై ఎల్. ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. బోథ్ మండల కేంద్రానికి చెందిన ఓ యువతిని గత కొంతకాలంగా సోషల్ మీడియాలో అలీమ్‌బేగ్ వేధిస్తున్నాడు. బాధిత యువతి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసి అలీమ్బేగ్ను అరెస్ట్ చేసినట్లు ఎస్సై తెలిపారు. కాగా అలీమ్బేగ్పై రౌడీషీట్ ఉన్నట్లు వారు పేర్కొన్నారు. రెంజల్ పోలీస్‌స్టేషన్‌లో నాలుగు కేసులు, డిచ్‌పెల్లి పోలీస్‌స్టేషన్‌లో 2023లో అలీమ్‌బేగ్ వద్ద నుంచి 17 బైక్‌లు రికవరీ చేసినట్లు తెలిపారు. -
బాసర ఆలయంలో భక్తుల కిటకిట
బాసర: చదువుల తల్లి సరస్వతి అమ్మవారు కొలువైన బాసర పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలైన్లో వేచి ఉన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. శ్రీ సరస్వతి, మహాలక్ష్మి, మహంకాళి అమ్మవార్లకు అభిషేకం, అర్చన పూజలను ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. గోదావరి నదీ తీరం భక్తుల పుణ్యస్నానాలతో రద్దీగా మారింది. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు, పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనానికి 2గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు. -
ఏసీబీ వలలో నస్పూర్ ఎస్సై
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/నస్పూర్: క్షుద్ర పూజల కేసులో జప్తు చేసిన నగదును బాధితుడికి ఇవ్వక సొంతానికి వాడుకున్న ఎస్సై అవినీతి నిరోధక శాఖకు చిక్కి జైలు పాలయ్యాడు. ఆదిలాబాద్ రేంజీ డీఎస్పీ పి.విజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా నస్పూర్ ఎస్సై నెల్కి సుగుణాకర్ గత జనవరి 26న క్షుద్రపూజలతో రెట్టింపు డబ్బులు చేస్తానని మహారాష్ట్రకు చెందిన ఓ పూజరి మోసం కేసులో రూ.2లక్షలు జప్తు చేశాడు. కేసు ఫిర్యాదుదారుడు ప్రభంజన్ కోర్టు నుంచి నగదు విడుదల కోసం ఈ నెల 4న ఉత్తర్వులు తీసుకు రాగా, ఇచ్చేందుకు ఎస్సై దాట వేశాడు. రూ.1.50లక్షలు బాధితుడి చేతిలో పెడుతూ ఫొటో దిగి, వెంటనే డ్రాలో వేసుకున్నాడు. రూ.2లక్షలు తీసుకున్నట్లు సంతకం చేయమని ఒత్తిడి చేయగా బాధితుడు ఒప్పుకోలేదు. ఈ నెల 8న మళ్లీ స్టేషన్‌కు వెళ్లి ఎస్సైని అడిగితే, డబ్బులు ఖర్చయ్యాయని, రూ.50వేలు ఉన్నాయని, నీ మీద కూడా కేసు అయ్యేది ఇచ్చింది తీసుకో అంటూ బెదిరించి పంపేశాడు. ఈ నెల 10న రూ.70వేలు ఇచ్చేందుకు ఒప్పుకున్నాక ఇవ్వలేదు. చివరకు రూ.50వేలకు మరో పది వేలు కలిపి ఓ వైన్స్ వద్ద తీసుకోవాలని చెప్పాడు. ఇదే కేసులో బాధితుడి పేరు లేకుండా ఉండేందుకు ఎస్సై బినామీ డి.దీపక్‌కు ఫోన్ పేలో రూ.30వేలు చెల్లించాడు. విసిగెత్తిన బాధితుడు ఏసీబీ టోల్ ఫ్రీ 1064ను సంప్రదించగా, ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి ఎస్సై ఫోన్లో మాట్లాడిన ఆడియో రికార్డులు, ఫోన్ పే చెల్లింపు, జప్తు చేసిన నగదు లేకపోవడం ఆధారాలు సేకరించారు. ఎఫ్ఐఆర్ చేసి ఎస్సైని కరీంనగర్ ఏసీబీ కోర్టు ముందు ప్రవేశపెట్టగా రిమాండ్ విధించారు. 2020బ్యాచ్‌కు చెందిన ఎస్సై గతేడు జూలై నుంచి నస్పూర్ ఎస్సైగా పని చేస్తున్నారు. -
ఓపెన్ ‘పది’, ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు
మంచిర్యాలఅర్బన్: ఈ నెల 20నుంచి ప్రారంభమయ్యే ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈవో యాదయ్య తెలిపారు. ఉదయం 9నుంచి 12గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. మంచిర్యాలలో పదో తరగతికి రెండు పరీక్ష కేంద్రాలు, ఇంటర్ పరీక్షలకు మూడు, బెల్లంపల్లిలో పదో తరగతికి ఒకటి, ఇంటర్‌కు రెండు కేంద్రాలు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పదో తరగతి విద్యార్థులు 666, ఇంటర్ విద్యార్థులు 1192 మంది పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. విద్యార్థులకు హాల్‌టికెట్లు స్టడీ సెంటర్ల ద్వారా పంపిణీ చేస్తామని, విద్యార్థులతోపాటు సిబ్బంది పరీక్ష కేంద్రాల్లోకి ఎలాంటి పరికరాలు, సెల్ఫోన్లు తీసుకు రావద్దని సూచించారు. న్యాయవాదిపై దాడి దుర్మార్గపు చర్యమంచిర్యాలక్రైం: న్యాయవాదులపై దాడులు దుర్మార్గపు చర్య అని మంచిర్యాల జిల్లా బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు అన్నారు. ఈ నెల 16న సూర్యపేట జిల్లా న్యాయవాది మాంతపురం కిషోర్‌పై దాడిని ఖండిస్తూ గురువారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. జిల్లా బార్ ఆసోసియేషన్ ఉపాధ్యక్షుడు భుజంగ్‌రావు, న్యాయవాదులు మాట్లాడుతూ దాడులపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తుల అంజనేయులు, ధత్తు, గోపతిరవి, శ్రీరాములు, జాడీ తిరుపతి, శ్రీకాంత్ తదిరులు పాల్గొన్నారు. విధుల బహిష్కరణ లక్సెట్టిపేట: న్యాయవాది కిషోర్‌పై దాడిని నిరసిస్తూ గురువారం మండల కేంద్రంలోని మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయవాదులు విధులు బహిస్కరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమిరెడ్డి సత్తన్న, ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌కుమార్, ఉపాధ్యక్షులు నళినికాంత్, కోషాధికారి సుమన్ చక్రవర్తి, న్యాయవాదులు భూమరెడ్డి, సురేందర్, అక్కల శ్రీధర్, కిరణ్‌కుమార్, పద్మ, తదితరులు పాల్గొన్నారు. -
ఒంటరితనం భరించలేక వృద్ధుడి ఆత్మహత్య
సారంగపూర్: ఒంటరితనం భరించలేక వృద్ధుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. కుటుంబీకులు, ఎస్సై తెలిపిన వివరాలు.. మండలంలోని వంజర్ గ్రామానికి చెందిన తోకల పోశెట్టి(65)కి ఇద్దరు భార్యలు ఉన్నారు. పెద్ద భార్యకు ఇద్దరు కుమార్తెలు, చిన్న భార్యకు ఒక కుమార్తె ఉన్నారు. అయితే గత 20 ఏళ్లుగా కుటుంబానికి దూరంగా ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. స్థానిక హనుమాన్ ఆలయంలో వంట, బస చేస్తూ కాలం వెళ్లదీశాడు. ఇటీవల ఆయన అనారోగ్యానికి గురికావడంతో తిరిగి ఇంటికి వెళ్లాడు. కుటుంబ సభ్యులకు ముఖం చూపించలేక, ఒంటరిగా బతకలేక తనలో తానే కుమిలిపోయాడు. ఈక్రమంలో రెండు రోజులుగా పోశెట్టి కనిపించడం లేదని గ్రామస్తులు అనుకుంటున్నారు. గ్రామశివారు ప్రాంతంలోని దడే గుట్ట వద్ద ఒర్రె వైపు పశువులు మేపేందుకు వెళ్లిన వారికి గురువారం పోశెట్టి ఉరేసుకుని కనిపించాడు. ఈ విషయాన్ని గ్రామస్తులు, ఆయన కుటుంబీకులకు చేరవేశారు. గ్రామస్తులు అందించిన సమాచారంతో ఎస్సై ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ ఏరియాస్పత్రికి తరలించారు. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
దేశీదారు విక్రయిస్తున్న ఇద్దరు..
తాంసి: అక్రమంగా మహారాష్ట్ర నుంచి దేశీదారు తీసుకువచ్చి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఆదిలాబాద్ ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ రేండ్ల విజేందర్ తెలిపారు. మండలంలోని లీంగూడ గ్రామానికి చెందిన ఆత్రం దేవ్‌రావు, టేకం బర్కత్రావులు మహా రాష్ట్ర నుంచి దేశీదారు తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. పక్కాసమాచారం మేరకు సిబ్బందితో కలిసి బుధవారం రాత్రి దాడి చేశారు. మద్యం విక్రయిస్తుండగా ఇద్దరిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.10వేల విలువ గల 90 ఎమ్ఎల్ కలిగిన 280 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి జైలుకు తరలించినట్లు పేర్కొన్నారు. ఎవరైనా దేశీదారు, నాటుసారా విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ దాడుల్లో ఎకై ్సజ్ సిబ్బంది శ్రీధర్, హనుమంత్ పాల్గొన్నారు. -
రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
నెన్నెల: మండలంలోని మైలారం మత్తడి వాగు నుంచి అనుమతి లేకుండా బెల్లంపల్లికి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను జోగాపూర్ వద్ద పట్టుకున్నామని ఎస్సై ప్రసాద్ తెలిపారు. బుధవారం రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఈ ట్రాక్టర్లను పట్టుకుని సీజ్ చేశామన్నారు. యజమానులు గడ్డం సాయికుమార్, కొమ్ము రాజన్న, డ్రైవర్లు పసుల రవీందర్, అత్తి సాయిలపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మండలంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
చోరీ కేసులో నిందితుడి అరెస్టు
బెల్లంపల్లి: చోరీ కేసులో కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. టూటౌన్ ఎస్సై కె.మహేందర్ కథనం ప్రకారం.. 2022లో టూటౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో దొంగతనం జరిగింది. చోరీ కేసులో నిందితుడిగా ఉన్న పంజాబ్ రాష్ట్రానికి చెందిన హరదీప్‌సింగ్ కొంతకాలం నుంచి కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. నిందితుడి ఆచూకీని కనుగొని పోలీసులు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో చాకచక్యంగా పట్టుకుని గురువారం బెల్లంపల్లి జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చారు. అనంతరం ఆసిఫాబాద్ జైలుకు తరలించినట్లు ఎస్సై తెలిపారు. -
● చింతలమానెపల్లి మండలం దిందా గ్రామంలో చిత్రీకరణ ● దర్శకుడు, నటులూ స్థానికులు.. ● నేడు విడుదల
సినిమా చిత్రీకరణలో నటీనటులుగర్వంగా భావిస్తున్నాం దిందా గ్రామం పేరు వెండితెరపై వినిపించడం పట్ల మేము గర్వంగా భావిస్తున్నాం. స్థానికంగా చిత్రీకరణ జరగడంతో కొంతమందికి ఉపాధి లభించింది. అటవీ ప్రాంతంలో ఉండే మా గ్రామం అభివృద్ధిలో వెనుకబడి ఉంది. సినిమాతో గ్రామానికి ప్రచారం లభించడం మేము సంతోషంగా ఉన్నాం. – డోకె రామన్న, దిందా సహకారం అందించాం సినిమా చిత్రీకరణకు అనువైన ప్రదేశాల కోసం సోదరుడు అయిన డైరెక్టర్ నన్ను సంప్రదించారు. ఎన్నో ప్రాంతాలను పరిశీలించి దిందా గ్రామాన్ని ఎంపిక చేసుకున్నాం. సినిమా చిత్రీకరణ పూర్తయ్యే వరకు సినిమా బృందానికి నాతో కలిసి గ్రామస్తులు, స్థానిక ప్రజలు సహకారాలు అందించాం. సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నాం. – దేవాడి రాజన్న, గంగాపూర్ బాలనటుడిగా మరిచిపోలేనిది సినిమాలో నటించే అవకాశం రావడం ఒక వరం లాంటిది. నేను 8వ తరగతి చదువుకునే సమయంలో దగ్గరి బంధువు అయిన సినిమా దర్శకుడు అవకాశం కల్పించారు. నటనలో అనుభవం లేకున్నా దర్శకుడు, నటుల సహకారంతో బాలనటుడిగా నటించాను. ఈ అనుభవం మరిచిపోలేనిది. – దంద్రె మణికంఠ(బబ్లూ), గంగాపూర్ చింతలమానెపల్లి: మండలంలోని దిందా.. ఒక మారుమూల గ్రామం.. త్వరలో రంగస్థలానికి పరిచయమవుతోంది. దట్టమైన అటవీ ప్రాంతంలో రవాణా సౌకర్యాలకు, గ్రామం అభివృద్ధికి నోచుకోకుండా ఉంది. జగమెరిగిన సత్యం టైటిల్‌తో విడుదల అవుతున్న చిత్రం 80 శాతం గ్రామంలోనే చిత్రీకరించారు. గ్రామ సమీపంలోని వాగు, చింతలమానెపల్లి మండలం రవీంద్రనగర్ వారసంత, గూడెం ప్రాణహిత నది వంతెన, పెంచికల్పేట్ పెద్దవాగు, కౌటాల మండల కేంద్రం, పక్కనే మహారాష్ట్రలోని అహేరి వద్ద కొన్ని సన్నివేశాలను తెరకెక్కించారు. కౌటాల ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో మొదటి సన్నివేశం చిత్రీకరణతో సినిమా ప్రారంభించారు. 1994లో గ్రామీణ పరిస్థితుల నేపథ్యం.. 1994లోని గ్రామీణ నేపథ్యం, అప్పటి మనుషుల కట్టుబాట్లు, దర్శకుడి చిన్నతనంలోని అనుభవాలను ఆధారంగా చిత్రం రూపొందింది. ప్రేమ సన్నివేశాలు, భావోద్వేగాలు, సంస్కృతి, సంగీతం ప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు దర్శకుడు పాలె తిరుపతి తెలిపారు. ఇందులో పలు సన్నివేశాల్లో దిందా గ్రామస్తులను బ్యాక్‌గ్రౌండ్‌లో నటించేందుకు అవకాశం కల్పించారు. సినిమాలో ఐదు పాటలు ఉండగా బతుకమ్మ పాటను గాయకురాలు మంగ్లీ ఆలపించారు. రాణా దగ్గుబాటి, సాయిపల్లవి నటించిన విరాట పర్వం చిత్రానికి పనిచేసిన సురేష్ బొబ్బిలి ఈచిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. హీరో రవితేజ మేనల్లుడు అవినాష్‌వర్మ, ఆద్యారెడ్డిలను హీరో, హీరోయిన్లుగా తొలిపరిచయం చేశామని, మరో హీరోయిన్గా నీలిమ పతకంశెట్టి నటించినట్లు దర్శకుడు తెలిపారు. జిల్లాలో ఆలస్యంగా విడుదల జగమెరిగిన సత్యం సినిమా కుమురం భీం జిల్లాలో కాస్త ఆలస్యంగా విడుదల కానుంది. ఈనెల 18 (శుక్రవారం)న మంచిర్యాలలో, తెలంగాణలో 33 థియేటర్లలో విడుదల చేస్తున్నారు. కాగజ్‌నగర్‌లో ఇతర సినిమాలకు ముందుగానే షెడ్యూల్ ఖరారు అయి ఉండడంతో కొన్నిరోజుల అనంతరం విడుదల అవుతుందని సినిమా బృందం తెలిపింది. దర్శకుడు స్థానికుడే..సినిమా అంటే ఒక క్రేజ్.. రంగులతో కనిపించే సినిమా చాలామందికి కల.. ఇలాంటి ఓ సినిమా మన ప్రాంతంలో రూపుదిద్దుకుంటే ఆ ఆనందం వేరు. ఎలాంటి ప్రాచుర్యానికి నోచుకోని ఆ గ్రామంలోని వెనుకబడిన పరిస్థితులు, గ్రామస్తుల సహజ అమాయకత్వం ఈనేపథ్యంలో చింతలమానెపల్లి మండలంలోని దిందా గ్రామ కేంద్రంగా రూపుదిద్దుకున్న చిత్రం.. జగమెరిగిన సత్యం..ఈనెల 18న సినిమా విడుదల కానుంది. దర్శకుడు పాలె తిరుపతి స్వగ్రామం పెంచికల్పేట్ మండలం చెడ్వాయి. ఆయనకు చింతలమానెపల్లి మండలంలో బంధువులు ఉండగా వారి ఇంటికి వచ్చేక్రమంలో స్థానిక గ్రామాలపై పరిచయం ఉండగా సినిమా చిత్రీకరణకు కారణమైంది. గ్రామంలో ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన ఆయన మంచిర్యాలలో డిగ్రీ పూర్తిచేశారు. సినిమాలపై ఆసక్తితో చిత్రరంగానికి వెళ్లి దర్శకత్వ శాఖలో 8 ఏళ్లు పనిచేశారు. ఈక్రమంలో ‘కొరియన్ శీర్షిక అహేరి’పేరుతో లఘుచిత్రం రూపొందించారు. అది సాధించిన విజయం ఇచ్చిన స్ఫూర్తితో మరో నాలుగు లఘు చిత్రాలను రూపొందించగా, ఈ అనుభవంతో జగమెరిగిన సత్యం చిత్రాన్ని తెరకెక్కించారు. కథానాయకుడికి చిన్నతనంలో సోదరుడిగా చింతలమానెపల్లి మండలం గంగాపూర్‌కు చెందిన దంద్రె మణికంఠ(బబ్లూ) బాలనటుడిగా నటించాడు. -
ఆర్థిక ఇబ్బందులతో వివాహిత..
నెన్నెల: ఆర్థిక ఇబ్బందులతో వివాహిత బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన గడ్డం లావణ్య (47), భర్త శంకర్‌గౌడ్‌తో కలిసి తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఎదుట హోటల్ నిర్వహిస్తోంది. హోం లోన్ తీసుకుని ఇల్లు నిర్మించుకున్నారు. హోటల్ పెట్టుబడి కోసం మరికొంత అప్పు చేశారు. వ్యాపారం సరిగ్గా సాగకపోవడంతో అప్పు తీర్చడం కష్టమైంది. కిస్తీలు చెల్లించకపోవడంతో వడ్డీ పెరిగిపోయింది. అప్పులు ఎలా తీర్చాలో అని ప్రతిరోజు బాధపడేదని కుటుంబీకులు చెప్పారు. ఈక్రమంలో గురువారం తెల్లవారుజామున లావణ్య ఇంట్లో కనిపించలేదు. ఆమె ఆచూకీ కోసం కుటుంబసభ్యులు చుటూపక్కల వెతకగా భీరన్నమర్రి సమీపంలోని వ్యవసాయ బావి వద్ద ఆమె చెప్పులు లోట కనిపించాయి. అనుమానంతో బావిలో నీటిని మోటార్ల ద్వారా తోడగా అందులో శవమై కనిపించింది. కుమారుడు వెంకటేశ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు. -
ఇళ్లపట్టాలు ఇప్పించాలి
బెల్లంపల్లి: బెల్లంపల్లి నివాసం ఉంటున్న పుర ప్రజలకు జీవో నెంబర్ 76 ప్రకారం ఇళ్ల పట్టాలు ఇప్పించాలని సీపీఐ నాయకులు కోరారు. గురువారం ఏఎంసీ ఏరియాలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్రసమితి సభ్యులు ఎ. వెంకటస్వామి, బి.పూర్ణిమ, సీపీఐ పట్టణ, మండల కార్యదర్శులు ఆడేపు రాజమౌళి, బి.లక్ష్మీనారాయణ, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేకల రాజేశం, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాదవశాత్తు బావిలో పడి రైతు మృతి
దండేపల్లి: మండలంలోని నర్సాపూర్ గ్రామానికి చెందిన రైతు గాండ్ల అశోక్ ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందాడు. ఎస్సై తహాసీనొద్దీన్ కథనం ప్రకారం.. అశోక్ (45) గురువారం ఉదయం పొలం వద్దకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. చాలాసేపటి వరకు రాకపోవడంతో ఫోన్ చేస్తే ఇంట్లో ఉంది. దీంతో బంధువు అయిన కార్తీక్‌ను పొలం వద్దకు పంపించారు. పొలం ఒడ్డున ఒక చెప్పు, బావిలో మరో చెప్పు కనిపించింది. దీంతో వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని ఈతగాళ్లతో బావిలో వెతకగా మృతదేహం లభించింది. ప్రమాదవశాత్తు బావిలో జారిపడటంతో ఈత రాక అందులో మునిగి చనిపోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య శైలజ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. బ్లేడ్‌తో గొంతుకోసి హత్యాయత్నంఆదిలాబాద్రూరల్: బ్లేడ్‌తో ఒకరి గొంతు కోసి హత్యాయత్నం చేసిన ఘటన మండలంలోని బంగారుగూడలో చోటుచేసుకుంది. ఎస్సై ముజాహిద్ కథనం ప్రకారం..బంగారుగూడకు చెందిన ముద్దంగుల విఠల్, అదేకాలనీలో జాబిర్షా ఉంటున్నాడు. గురువారం విఠల్ ఫోన్లో ఓ నంబర్ డయల్ చేయాలని జాబిర్ షా అడిగాడు. ఇందుకు విఠల్ ని రాకరించడంతో బ్లేడ్‌తో ఆయన గొంతుకోసి హత్యాయత్నం చేశాడు. తీవ్ర గాయాలైన విఠల్‌ను రిమ్స్ కు తరలించారు. బాధితుడి భార్య పోచవ్వ ఫిర్యాదుతో హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. ఆరుగురి బైండోవర్మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ పోలీసుస్టేషన్ పరిధిలో ఆరుగురు పాత నేరస్తులను గురువారం తహసీల్దార్ శ్రీనివాసరావుదేశ్‌పాండే ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్సై స్వరూప్‌రాజ్ తెలిపారు. వేంపల్లిలో దోపిడీ కేసులో నిందితులైన రమేశ్, అవినాశ్, చందు, సంతోశ్, అశోక్, కృష్ణలను ఏడాదిపాటు షరతులతో కూడిన బైండోవర్ చేశారు. -
అగ్నిప్రమాదంలో ఇల్లు దగ్ధం
తాంసి: మండలంలోని జామిడికి చెందిన పర్ధాన్ దేవుబాయి ఇల్లు అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది. ఒంటరిగా ఉంటున్న ఆమె గురువారం ఉదయం ఇంట్లో దేవుని చిత్రపటం వద్ద దీపం పెట్టి ఉపాధి పనికి కూలీలతో వెళ్లింది. వెలిగించిన దీపం వస్తువులకు అంటుకొని మంటలు వ్యాపించింది. గమనించిన గ్రామస్తులు వెంటనే మోటార్ల ద్వారా నీటిని చల్లి మంటలార్పివేశారు. అప్పటికే ఇంట్లో ఉన్న నిత్యావసర సరుకులు, దుస్తులు, రూ.20వేల నగదు కాలిపోయాయి. ఇంటి పైకప్పు దెబ్బతింది. దాదాపు రూ.లక్షకు పైగా ఆస్తినష్టం వాటిల్లింది. విషయం తెలుసుకున్న సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్‌రెడ్డి ఘటనస్థలానికి చేరుకుని బాధిత మహిళను పరామర్శించారు. నెలకు సరిపడా సరుకులతోపాటు నగదు అందజేశారు. యూత్ కాంగ్రెస్ నాయకుడు అశోక్ ఆర్థికసాయం అందజేశాడు. -
ఆందోళన మధ్య ఇళ్ల పట్టాల పంపిణీ
● ఎమ్మెల్యే వినోద్‌ను నిలదీసిన బాధితులు ● అందరికీ న్యాయం చేయాలని ఎమ్మెల్యే ఆదేశంకాసిపేట: మండలంలోని కేకే ఓపెన్‌కాస్టు నిర్వాసిత గ్రామం దుబ్బగూడెం ప్రజలకు పునరావాస కాలనీలో చేపట్టిన పట్టాల పంపిణీ కార్యక్రమం గురువారం ఆందోళన మధ్య కొనసాగింది. గ్రామంలో పుట్టి పెరిగిన వారికి రాకుండా అధికారులు కుట్ర చే స్తున్నారని బాధితులు ఎమ్మెల్యేను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కార్యక్రమంలో నిరసన తెలుపగా.. వే దిక వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. మొత్తం 299మందికి పట్టాలు మంజూరు కాగా, 239మందికి పంపిణీ చేశారు. కొందరు మరణించ డం, మరికొందరిపై ఫిర్యాదులు రావడంతో 60 మందికి పంపిణీ నిలిపివేశారు. విచారణ అనంత రం వారికి పంపిణీ చేస్తామని ఆర్డీవో హరికృష్ణ తెలిపారు. అర్హులందరికీ న్యాయం చేయాలి సమావేశంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ గ్రామంలోని అర్హులందరికీ ఇంటిస్థలం, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందించి న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. ఏడాదిలోపు పునరావాస కాలనీలో అన్ని ఏర్పాట్లతోపాటు నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని తెలిపారు. ప్రోటోకాల్ రగడ.. గిరిజన మహిళ అని చిన్న చూపా అంటూ పీఏసీ ఎస్ చైర్పర్సన్ నీలరాంచందర్ ఎమ్మెల్యేను నిలదీశారు. సొంత పార్టీకి చెందిన తమను పట్టించుకోకుండా, ప్రోటోకాల్ లేకుండా నాయకులను వేది కపైకి పిలవడం, తమను అవమానించడం ఏమిట ని ప్రశ్నించారు. ఎమ్మెల్యే అనుచరులకు వేదికపై స్థానం కల్పించడం పట్ల పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అసంతృప్తి పట్టాల పంపిణీతో పేరు రావాలని ఈ నెల 11, 16న నిర్వహించాల్సిన కార్యక్రమాన్ని అధికారులపై ఒత్తిడి తెచ్చి ఎమ్మెల్యే హాజరవుతారని గురువారం నాటికి వాయిదా వేయించారు. స్థలాలు దక్కని బాధితుల నిరసన, ప్రోటోకాల్ రగడతో సహాయకులతోపాటు నాయకులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా పరిస్థితి ఏమిటి, ఏం కావాలి, ఏం చేయగలం అనేది తెలుసుకోకుండా తనను ర ప్పిస్తారా అంటూ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలి సింది. ఈ కార్యక్రమంలో ఆర్డీవో హరికృష్ణ, జీఏం దేవేందర్, కాంగ్రెస్ నాయకులు రత్నం ప్రదీప్, రౌ తు సత్తయ్య, మైదం రమేష్, గోలేటి స్వామి, దు బ్బగూడెం గ్రామస్తులు పాల్గొన్నారు. -
రైతులు చట్టం వివరాలు తెలుసుకోవాలి
● పెండింగ్ సమస్యల పరిష్కారానికి అవకాశం ● జిల్లా కలెక్టర్ కుమార్దీపక్మంచిర్యాలరూరల్(హాజీపూర్): ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టం ద్వా రా భూ సమస్యల పరిష్కారానికి అవకాశం లభి స్తుండగా చట్టంలో పొందుపరచిన అంశాలను రైతులు వివరంగా తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం హాజీపూర్ మండల కేంద్రంలోని శ్రీనివాస గార్డెన్స్‌లో భూభారతి చట్టంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మాట్లాడారు. భూభారతి నూతన చట్టం ద్వారా హక్కులు, రికార్డుల్లో తప్పుల సవరణకు అవకాశం కల్పించిందని అన్నారు. పెండింగ్, సాదాబైనామా దరఖాస్తులు పరిష్కరించడం, వారసత్వంగా వచ్చిన భూములను విరాసత్ చేసే ముందు నిర్ణీత కాలంలో సమగ్ర విచారణ చేయడం, భూమి హక్కులు ఏ విధంగా సంక్రమించినా మ్యుటేషన్ చేసి రికార్డులో నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. భూభారతి ద్వారా ఆగస్టు 15లోగా జిల్లాలోని అన్ని మండలాల్లోనూ అన్ని రకాల భూ సమస్యలు పరిష్కరించేలా కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్, ఆర్డీఓ శ్రీనివాసరావు, డీఆర్డీఓ కిషన్, తహసీల్దార్ శ్రీనివాసరావుదేశ్‌పాండే, ఎంపీడీఓ ప్రసాద్, ఏఓ కృష్ణ, ఈజీఎస్ ఏపీఓ మల్లయ్య, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. నవోదయ పాఠశాల ఏర్పాటు స్థలం పరిశీలన హాజీపూర్ మండలం గఢ్‌పూర్‌లో నవోదయ పాఠశాల ఏర్పాటు ప్రతిపాదిత స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీనివాసరావుదేశ్‌పాండే ఉన్నారు. -
బ్యాంక్ గ్యారంటీలు ఇవ్వాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో 2024–25 యాసంగి వరిధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభించామని, రైస్‌మిల్లర్లు పాత బకాయిలు పూర్తి చేసి బ్యాంక్ గ్యారంటీలు ఇవ్వాలని జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్ అన్నారు. గురువారం జిల్లా అదనపు కలెక్టర్ చాంబర్లో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి బ్రహ్మారావు, జిల్లా మేనేజర్ శ్రీకళతో కలిసి బాయిల్డ్ రైస్‌మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ కనీస మద్దతు ధరతో వరిధాన్యం కొనుగోలు చేస్తామని, సన్న రకం ధాన్యానికి మద్దతు ధరతోపాటు బోనస్ అందిస్తామని తెలిపారు. ధాన్యం దిగుమతి ఎలాంటి కోతలు లేకుండా చేయాలన్నారు. అ ధికారులు, బాయిల్డ్ రైస్‌మిల్లర్లు పాల్గొన్నారు. -
గాలి వీచినా కరెంట్ కట్
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో ఈదురుగాలులు వీచినా.. చిన్నపాటి వర్షం కురిసినా కరెంటు సరఫరా నిలిచిపోతోంది. మళ్లీ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంటోంది. గత నెల 22న జిల్లాలో ఈదురుగాలులు, వర్షంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ నెల 3న ఈదురుగాలులు, వర్షానికి గంటల తరబడి సరఫరా నిలిచిపోయింది. 10న ఈదురుగాలులు, చిన్నపాటి వర్షానికి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వినియోగదారులు రాత్రంతా జాగారం చేయాల్సి వచ్చింది. జిల్లా కేంద్రంతోపాటు మండలాల్లోనూ ఇదే పరిస్థితి ఎదురవుతోంది. పునరుద్ధరణకు గంటల తరబడి సమయం పడుతోంది. నెలకు రెండు మూడు రోజులు విద్యుత్ మరమ్మతులు, ఆధునీకరణకు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిలిపి వేస్తున్నారు. అధిక లోడ్‌కు అనుగుణంగా ట్రాన్స్ఫార్మర్ల మార్పు, శిథిలావస్థకు చేరిన విద్యుత్ తీగలు, స్తంభాలు, కాసారం, ఫీడర్లు, అధునాతన, సాంకేతిక తదితర పరికరాలు కొత్తవాటిని ఏర్పాటు చేసి మెరుగైన నిరంతర విద్యుత్ సరఫరాకు తరచూ మరమ్మతులు చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయినా గాలివానకు సరఫరా నిలిచిపోయి గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. మారుమూల గ్రామాల్లోనే కాదు జిల్లా కేంద్రంలోనూ అదే పరిస్థితి ఎదురవుతోంది. రైతులకూ ఇబ్బందులే.. జిల్లాలో 3,60,214 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. బిల్లుల వసూలు కచ్చితంగా వ్యవహరిస్తున్న విద్యుత్ శాఖ అధికారులు సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తున్నారని వినియోగదారులు మండిపడుతున్నారు. యాసంగి వరి పంటల సాగుకు బోరు మోటార్ల వినియోగం పెరిగింది. దిగుబడి దశలో ఉన్న పంటలకు నీరందిస్తుండగా సరఫరా నిలిచిపోతుండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. మరమ్మతుల పేరిట సరఫరా నిలిపి వేస్తుండడంతో ఉక్కపోతతో ఇళ్లలో ఉండలేకపోతున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా అప్రకటిత కోతలు విధిస్తున్నారని కాలనీల వాసులు వాపోతున్నారు. ప్రతీ నెల రెండో శనివారం విద్యుత్ మరమ్మతుల డే కారణంగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిలిపి వేస్తున్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరతతో సేవల్లో ప్రభావం కనిపిస్తోంది. జిల్లాలో రోజు రోజుకు విద్యుత్ వినియోగదారులు పెరుగుతుండడం, రూ.కోట్లలో బిల్లులు వసూలవుతున్నా అందుకు అనుగుణంగా సేవలు అందడం లేదనే విమర్శలు వస్తున్నాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయంపై ఫోన్ చేస్తే కొందరు ఏడీ, ఏఈ, సిబ్బంది స్పందించడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. గంటలకొద్దీ ఎదురు చూపులు తరచూ మరమ్మతులు.. ఆగని అవాంతరాలు -
కొందరికే కుట్టు పని..!
● స్కూల్ యూనిఫాం కుట్టు పని నిబంధనలు గల్లంతు ● అర్బన్ ప్రాంతంలో గంపగుత్తగా అప్పగింత ● ఒక్కో మహిళా గ్రూపునకు ఆరు నుంచి పదికి పైగా పాఠశాలలు ● అస్పష్ట కొలతలతో ఇబ్బందులుమంచిర్యాలఅర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పంపిణీ చేయనున్న యూనిఫాంలు కొలతల ఆధారంగా కుట్టాల్సి ఉన్నా అలాంటిదేమీ కనిపించడం లేదు. గత ఏడాది జిల్లా కేంద్రంలోని ఓ పాఠశాల విద్యార్థులకు పంపిణీ చేసిన యూనిఫాంలు పొట్టిగా, పొడుగ్గా, జేబులు ఊడిపోయి, దారం పోగులు లేచి అసౌకర్యంగా ఉన్నాయి. కొన్ని బడుల్లో కొలతలు తారుమారైన విషయాన్ని గ్రహించి అధికారులు దుస్తులను వెనక్కి పంపించారు. కొందరికి ఒక జత దుస్తులు అందగా.. మరో జత మూడు నెలలు దాటిన తర్వాత అందజేశారు. ఈసారి బడులు తెరిచే నాటికే యూనిఫాం అందజేయాలనే లక్ష్యంతో విద్యాశాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. అధికారుల మధ్య సమన్వయ లోపమో.. ఏమో గానీ ఆరు నుంచి పదికి పైగా పాఠశాలలను గంపగుత్తగా ఒకే ఏజెన్సీ(ఎస్‌హెచ్‌జీ) మహిళలకు కుట్టుపని అప్పగించడం అనుమానాలకు తావిస్తోంది. జిల్లాలో.. జిల్లాలో అర్బన్ ప్రాంతంలో 138 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 13,866 మంది విద్యార్థులు ఉండగా.. బాలురు 6,247మంది, బాలికలు 7,619 మంది ఉన్నారు. గ్రామీణ ప్రాంతంలోని 630 పాఠశాలలల్లో 28,845మంది విద్యార్థులు ఉండగా.. బాలురు 13,774మంది, బాలికలు 15,071 మంది ఉన్నారు. జిల్లాలోని 10,417 సెల్ఫ్‌హెల్ప్ గ్రూపుల్లో 1,15,018మంది మహిళా సభ్యులు ఉన్నారు. కుట్టు పని నైపుణ్యం కలిగిన గ్రూపులను గుర్తించి ఆయా పాఠశాలల విద్యార్థులకు సంబంధించి యూనిఫాం వస్త్రం అప్పగించారు. ఒక్కో ఏజెన్సీ(మహిళా గ్రూపు)కి ఒక్కో పాఠశాల మాత్రమే అప్పగించాలి. కానీ అర్బన్ ప్రాంతంలో కొందరికే గంపగుత్తగా ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఒక్కో ఎస్హెచ్జీకి ఒకటి కంటే ఎక్కువ స్కూళ్ల విద్యార్థుల దుస్తులు కుట్టడానికి ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది. మంచిర్యాల అర్బన్ ప్రాంతంలో 31 పాఠశాలల్లో మూడు మినహా 22 పాఠశాలలు ఒకే సెల్ఫ్‌హెల్ప్ గ్రూపునకు అప్పగించారు. మరో ఏజెన్సీకి 6, ఇంకో ఏజెన్సీ 2, ఒక ఏజెన్సీకి ఒక బడి విద్యార్థుల యూనిఫాం కుట్టు బాధ్యతలు అప్పగించారు. చెన్నూర్‌లో 17పాఠశాలలు ఉండగా.. ఒకే గ్రూపునకు 11 పాఠశాలలు అప్పగించారు. నస్పూర్‌లో 17 పాఠశాలలను ఒకే గ్రూపునకు అప్పగించా రు. ఇందులో ఏడు పాఠశాలలు ఒక మహిళకు, ఐదే సి పాఠశాలలు మరో ఇద్దరికి బాధ్యతలు ఇచ్చారు. బెల్లంపల్లిలో 20 పాఠశాలలు ఉండగా 13 ఒక గ్రూపునకు, ఐదు మరో గ్రూపునకు ఇచ్చినా మహిళా సభ్యులు ముగ్గురు ఉన్నారు. క్యాతన్‌పల్లిలో 12 పాఠశాలల్లో 11 ఒకే గ్రూపునకు, లక్సెట్టిపేటలో 21 పాఠశాలలు ఉండగా.. 11 ఒక ఎస్‌హెచ్‌జీ మహిళకు ఆరు, మరో మూడు గ్రూపునకు కట్టబెట్టారు. మందమర్రిలో 19పాఠశాలల్లో ఎనిమిదింటిని ఒక గ్రూపునకు అప్పగించారు. ఒక్కో తరగతిలో ఒకే ఎత్తు కలిగిన ఐదుగురు విద్యార్థులకు ఒకే కొలతలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా దర్జీలకు గంపగుత్తగా అప్పగించడం వల్లనే యూని ఫాం కొలతల్లో తేడా, నాణ్యమైన కుట్టు లేక దుస్తులు వేసుకోవడంలో విద్యార్థులు ఇబ్బందులు పడ్డా రు. మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలనే ప్ర భుత్వ ఆశయాన్ని నీరుగార్చి కొందరికే అప్పగించిన అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.ఎస్హెచ్జీకి ఒకే పాఠశాల బాధ్యతలుసెల్ఫ్హెల్ప్ గ్రూపునకు ఒక్క పాఠశాల విద్యార్థుల యూనిఫామ్ కుట్టు బాధ్యతలు అప్పగించాలి. ముందస్తుగా సెల్ఫ్‌హెల్ప్ గ్రూపు మ్యాపింగ్ చేశాం. నైపుణ్యం కలిగిన మహిళలకు శిక్షణ ఇచ్చాం. ఒకటి కంటే ఎక్కువగా గ్రూపునకు అప్పగించినట్లు మా దృష్టికి రాలేదు. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే చర్యలు చేపట్టి మార్పులు చేస్తాం. – డీఆర్డీవో కిషన్ -
కన్నయ్య మృతిపై కలెక్టరేట్ ముట్టడిస్తాం
● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ● మృతుడి కుటుంబానికి పరామర్శవేమనపల్లి: నాయిని కన్నయ్య కుటుంబానికి న్యాయం చేయకపోతే జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ హెచ్చరించారు. తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం, సీపీఎం రాష్ట్ర నాయకులతో కలిసి గురువారం మండలంలోని మంగెనపల్లి గ్రామానికి వెళ్లి యజమాని వేధింపులకు ఆత్మహత్య చేసుకున్న కన్నయ్య కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సంతాప సభలో మాట్లాడారు. కన్నయ్య కుటుంబానికి చెందిన సీలింగ్ పట్టా భూమిని అక్రమంగా పట్టా చేయించుకున్న యజమాని చిన్నన్న కుమారుడు హరీష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. తహసీల్దార్, ఎస్సైలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఆత్మహత్యకు కారకులైన యజమాని ఎనగంటి చిన్నన్నతోపాటు భార్య లక్ష్మీ, కొడుకు హరీష్‌లపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం, భార్యకు ప్రభుత్వ ఉద్యోగం, ఐదు ఎకరాల భూమి, ఇందిరమ్మ ఇల్లు ఇప్పించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో 21, 22వ తేదీల్లో మండల కేంద్రాల్లో నిరసనలు తెలపాలని, అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం గిరిజన సంఘం నాయకులతో భారీ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ రమేష్, ఎస్సై శ్యాంపటేల్లకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఏజీఎస్ రాష్ట్ర కార్యదర్శి, ఉపాధ్యక్షుడు పూనం సచిన్, బండారు రవికుమార్, సీపీఎం రాష్ట్ర నాయకులు ఆశయ్య, టీఏజీఎస్ రాష్ట్ర నాయకులు కోట శ్రీనివాస్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాగాల రాజన్న, ఎర్మ పున్నం, సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి, ఐద్వా జిల్లా కార్యదర్శి ఉమారాణి, నాయకులు మల్లేశ్వరి, అబ్దుల్లా, ప్రసాద్, చందు తదితరులు పాల్గొన్నారు. -
● క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్న అధికారులు ● భూ సమస్యలు పరిష్కారమైతే బాధలు తీరినట్లే..
జిల్లాలో భూ స్వరూపంమొత్తం విస్తీర్ణం 4016.46చ.కి.మీ. అటవీ భూమి 1761.17చ.కి.మీ. రెవెన్యూ గ్రామాలు 382మొత్తం సాగు భూమి 3,30,891.403 ఎకరాలు. సగటు భూ కమతం 2.29ఎకరాలు ప్రస్తుతం భూభారతి పెండింగ్ అర్జీలు 1620సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ధరణి స్థానంలో భూభారతి పోర్టల్ రాకతో జిల్లాలో భూ సమస్యలు తీరుతాయనే ఆశలు నెలకొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆర్వోఆర్ చట్టానికి సవరణ చేసి నూతనంగా 2024 చట్టం తీసుకొచ్చింది. ఈ క్రమంలో జిల్లాలో భూభారతి పోర్టల్‌పై క్షేత్రస్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. రెవెన్యూ సదస్సులు నిర్వహించాక పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు. జిల్లాలో అనేక చోట్ల భూ సమస్యలు పరిష్కారం కాక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో అనేకమంది భూములు నిషేధిత జాబితా, ఆర్ఆర్వోఎఫ్ఆర్ సంబంధించి అవరోధాలు తలెత్తాయి. ఇప్పటికీ ప్రతీ సోమవారం ప్రజా ఫిర్యాదుల విభాగంలో భూ సమస్యలపైనే అనేక మంది అర్జీలు ఇస్తున్నారు. భూ తగదాలు, కోర్టు కేసులతోపాటు వారసత్వ బదిలీలు సైతం ఇబ్బందిగా మారాయి. జిల్లాలో భూ యజమానుల మధ్య సరిహద్దు సమస్యగా 20వేల ఎకరాలు ఉన్నాయి. అంతేకాక భూ ప్రక్షాళన సందర్భంగా పలు బోగస్ పట్టాలు సైతం ఉన్నట్లు వెల్లడయ్యాయి. కొందరు ఎలాంటి మోకపై లేకున్నా పట్టాలు పొందిన ఘటనలు ఉన్నాయి. ఇక సీలింగ్, అసైన్డ్‌దారులు పట్టాలో ఒకరి పేరు కాస్తులో మరొకరి పేరుతో ఉన్నారు. ఏళ్లుగా అనుభవదారులుగా ఉంటున్నా హక్కులు రావడం లేదు. పరిష్కారం కోసం.. జిల్లాలో ఇప్పటికీ అనేక మంది తమ భూమి హక్కు ల కోసం ఇబ్బందులు పడుతున్నారు. భూ ప్రక్షాళన సందర్భంగా దొర్లిన తప్పులతో తర్వాత సరిదిద్దే అ వకాశం లేకుండా పోయింది. అనేక సార్లు రెవెన్యూ అధికారులకు మొర పెట్టుకున్నా ఆ మేరకు పరి ష్కారం కావడం లేదు. ఇప్పటికీ జిల్లాలో సాదాబైనామాల అర్జీలు పెండింగ్‌లోనే ఉన్నాయి. తెల్లకాగితాలపై జరిగిన లావాదేవీలకు మోక్షం కలుగడం లే దు. అసైన్డ్, అటవీ, సింగరేణి భూముల మధ్య వివాదాలు ఉన్నాయి. పార్ట్–బీగా పేర్కొన్న నిషేధిత జాబితాలో పెండింగ్‌లోనే ఉన్నాయి. పూర్తి స్థాయిలో సర్వే జరగకపోవడంతో వివాదాలు కొనసాగుతున్నాయి. కొత్త చట్టంపైనే ఆశలు కొత్త చట్టంతో భూ చిక్కులు తీరుతాయనే ఆశలు నె లకొన్నాయి. భూభారతిలో ఇక నుంచి ప్రతీ కమతా నికి భూధార్ పేరుతో ప్రత్యేక గుర్తింపు సంఖ్య, నంబర్లు ఇస్తున్నారు. అంతేకాక రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు సులభంగా చేసేలా కొత్త చట్టాన్ని రూపొందించారు. డేటా ఎంట్రీ, స్టాంపు రిజిస్ట్రేషన ఫీ చెల్లింపు, ఈ చలాన్, స్లాట్ బుకింగ్, వంటి సేవలు మెరుగుపర్చారు. ఇక కొత్త పోర్టల్‌లో భూమిత్రతో ఏఐ(కృత్రిమ మేధ)తో అన్నివిధాల సహాయ సహకారాలు అందేలా ఏర్పాట్లు చేయనుంది. తహసీల్దార్లు, ఆ ర్డీవోలకు సైతం మ్యుటేషన్ అధికారం కల్పించడం వంటివి కొత్త చట్టంలో ఉన్నాయి. తహసీల్దార్, ఆర్డీ వోల స్థాయిల్లోనే సాదాబైనామాలు, రిజిస్ట్రేషన్, త ర్వాత మ్యుటేషన్లు జరగనున్నాయి. ఆన్లైన్లో న మోదు, వారసత్వ భూముల మార్పిడి సరళతరం చేశారు. వేగంగా సులభంగా భూ హక్కులు పొంది తే భూ యజమానులకు తిప్పలు తప్పే అవకాశం ఉంది. -
ఎల్ఆర్ఎస్ రుసుం వసూలు వేగవంతం చేయాలి
● రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ మంచిర్యాలఅగ్రికల్చర్: ఎల్ఆర్ఎస్లో భాగంగా భూముల క్రమబద్ధీకరణ కోసం అందిన దరఖాస్తులకు సంబంధించి అర్హులైన లబ్ధిదా రుల నుంచి రుసుం వసూలు ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి ఇతర ఉన్నత అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ అధికారులతో ఎల్ఆర్ఎస్ రుసుం వసూలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులు ఈ నెల 30 లోగా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, రు సుం చెల్లించిన వారికి ప్రొసీడింగ్స్ అందజేయాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు, మున్సిపల్ కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు. -
ముందస్తు ప్రణాళిక.. పంటకు మేలు
భూసార పరీక్షలు.. పంటకు ముందస్తుగా భూసార పరీక్షలు చేయించాలి. భూసార పరీక్షకు మట్టి నమూనాలు సరైన పద్దతిలో తీసుకోవాలి. ఈ పరీక్షలతో భూమిలో ఎంత సారం ఉంది.. ఎలాంటి విత్తనాలు, ఎంత మోతాదులో ఎరువులు వేయాలి వంటి విషయాలు తెలుస్తాయి. ఇష్టారీతిగా ఎరువులు వినియోగించి నష్టపోవడం కంటే భూసార పరీక్షలతో పంటల సాగుతీరు మార్చుకోవాలి. భూసార పరీక్షలతో సూక్ష్మ, స్థూల పోషకాల లోపాలు, మోతాదు పద్ధతిలో ఎరువుల వాడకం, అదనపు ఖర్చులు తగ్గించుకునే వీలుంది. నూతన ఆధునిక యంత్రాల వినియోగం, సాంకేతిక పరిజ్ఞానం పాటించడం వల్ల అధిక దిగుబడులు సాధించవచ్చు. నేలలో కలియదున్నితే మేలు.. జిల్లాలో ఏటా పత్తి పంట దిగుబడి అనంతరం పత్తి చెట్ల మొదళ్లను కోసి కుప్పగా చేసి కాల్చివేస్తుంటారు. కొంత వంట చెరుకుగా వినియోగిస్తున్నారు. అలా కాకుండా పత్తి మొదళ్లను వృథా పోకుండా రో టవేటర్ సహాయంతో భూమిలో తేమ ఉన్నప్పుడు భూమిలో కలియదున్నాలి. రోటవేటర్ తర్వాత మల్డ్చెల్డ్ నాగలితో దున్నాలి. తర్వాత మరోసారి రోటవేటర్‌తో కలియదున్నాలి. ఈ విధంగా చేయడం వలన భూమి సారవంతమై పత్తి పంటకు బయట నుంచి అందాల్సిన ఎరువులు తగ్గుతాయి. వేసవి దుక్కులు కీలకం.. ఖరీఫ్ సాగుకు ముందు నుంచే చేలు చదును చేసుకుని నెల రోజుల ముందే వేసవి దుక్కులు దున్నుకోవాలి. తొలకరికి ముందే పంట విత్తుకోవడానికి సిద్ధం చేసుకోవాలి. పంటల కోతల తర్వాత భూమిని వదిలివేయకుండా వేసవిలో దుక్కి దున్నుకుంటే చీడపీడలను కొంత వరకు నివారించవచ్చు. నేలను లోతుగా దున్నడంతో కొంత తేమలో ఉన్న కీటకాలు నశిస్తాయి. అడపాదడపా కురుస్తున్న వర్షాలను సద్వినియోగం చేసుకోవడానికి భూమిని దున్నుకోవాలి. ఈ వర్షాలతో లోతుగా దున్నడం వల్ల వరుసకు వరుస మధ్యలో వర్షపు నీరు నిలుస్తుంది. మొదటిసారి దుక్కులు దున్నిన తర్వాత రెండోసారి దున్నే ముందు పశువుల ఎరువు, వర్మీ కంపోస్టు, శాస్త్రవేత్తలు సూచించిన చెరువు మట్టిని పొలంలో వేసుకుంటే పంట దిగుబడి సామర్థ్యం పెరుగుతుంది. సేంద్రియ ఎరువులు అందించడం ద్వారా సూక్ష్మ పోషక లోపాలు నివారించవచ్చు. లోతు తక్కువ ఎర్రచల్క నేలల్లోనూ అడుగున గట్టిగా ఉన్న నేలల్లోనూ లోతుగా దుక్కి చేయడం చాలా ఉపయోగంకరంగా ఉంటుంది. నేలను 35 సెం.మీ నుంచి 40 సెం.మీ వరకు లోతుగా దున్నుకుంటే భూమిలో గట్టిపొర పగిలి నేల బాగా గుల్ల బారుతుంది. వర్షపు నీరు భూమిలోకి ఇంకుతుంది. లోతు దుక్కి ప్రభావం 2 నుంచి 3 సంవత్సరాల వరకు ఉంటుంది. వేసవి దుక్కులు ఉపయోగకరం భూసార పరీక్షలు కీలకం వ్యవసాయ పరిశోధన కేంద్ర శాస్త్రవేత్త శ్రీధర్ చౌహాన్వేసవికాలం ప్రారంభమైంది. రైతులు ఎండాకాలంలోనే దుక్కి దున్నడం, చేలు చదును చేయడం, గతేడాది పంట మొదళ్లు, ఇతర అవశేషాలు, చెత్త ఏరికాల్చడం వంటి పనులు చేస్తుంటారు. జూన్ నెలలో తొలకరి వర్షాలు కురవగానే విత్తనాలు సమకూర్చుకుంటారు. రైతులు ఇప్పటినుంచే ప్రణాళికా బద్ధంగా సాగుకు సిద్ధమైతే అధిక దిగుబడులు పొందవచ్చని వ్యవసాయ పరిశోధన కేంద్ర శాస్త్రవేత్త శ్రీధర్ చౌహాన్ వివరిస్తున్నారు. వేసవిలో రైతులు చేపట్టాల్సిన పనులపై సలహాలు, సూచనలు ఆయన మాటల్లోనే.. – మంచిర్యాలఅగ్రికల్చర్ -
గుండెపోటుతో పూజారి మృతి
లక్ష్మణచాంద: గుండెపోటుతో పూజారి ప్రాణాలు కోల్పోయిన ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రానికి చెందిన పూజారి పెరుమాండ్ల రమేశ్(75) గత 30 సంవత్సరాలుగా శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో పురోహితుడిగా సేవలు అందిస్తున్నారు. గత ఏ డాది నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. బుధవారం తన వద్దకు వచ్చిన ఒకరికి పంచాంగం చూశారు. ఆయన వెళ్లిపోయిన కొద్దిసేపటికే గుండెపోటుతో కుప్పకూలిపోయి మృతిచెందారు. పూజారి మృతితో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సంతాపం.. పూజారి పెరుమాండ్ల రమేశ్ అకాల మృతి విషయం తెలుసుకున్న నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలియజేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. -
గంజాయి కేసులో ఇద్దరి రిమాండ్
నేరడిగొండ: గంజాయి కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇచ్చోడ సీఐ భీమేశ్, ఎస్సై శ్రీకాంత్‌లు తెలిపారు. వారి కథనం ప్రకారం.. మంగళవారం సాయంత్రం పక్కా సమాచారం మేరకు కుంటాల ఎక్స్‌రోడ్‌లో నేరడిగొండకు చెందిన బత్తుల కిరణ్ అనే వ్యక్తిని తనిఖీ చేయగా 160 గ్రాముల గంజాయి లభించినట్లు పేర్కొన్నారు. ఆయనను విచారించగా దంసతండా గ్రామానికి చెందిన పెందూర్ లచ్చు అనే వ్యక్తి వద్ద నుంచి గంజాయి తీసుకొచ్చినట్లు తెలిపాడు. కాగా లచ్చును విచారించగా తన వ్యవసాయ భూమిలో అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్నట్లు తెలిపాడు. అతని వద్ద నుంచి 290 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వివరించారు. స్వాధీనం చేసుకున్న మొత్తం 450 గ్రాముల గంజాయి విలువ రూ.11,250 ఉంటుందన్నారు. మావల పరిధిలో.. ఆదిలాబాద్‌రూరల్: గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు మావల ఎస్సై విష్ణువర్ధన్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణంలోని కేఆర్కే కాలనీకి చెందిన అంబదాస్, గాదిగూడ మండలానికి చెందిన రాజు అనే ఇద్దరు వ్యక్తులు గంజాయిని తరలిస్తుండగా బుధవారం మావల పోలీసుస్టేషన్ పరిధిలో పట్టుకున్నట్లు పేర్కొన్నారు. వీరి వద్ద నుంచి 12 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు వివరించారు. -
పాఠశాలలో విషప్రయోగం కలకలం
● తప్పిన పెను ప్రమాదం ● పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు, నిందితుడు అరెస్ట్ ఇచ్చోడ: మండలంలోని ధర్మంపూరి ప్రాథమిక పాఠశాలలో ఓ వ్యక్తి విషప్రయోగం చేసిన ఘటన కలకలం సృష్టించింది. ప్రధానోపాధ్యాయురాలు ప్రతిభ, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం పాఠశాలకు వెళ్లిన సిబ్బంది పాఠశాల తాళం పగిలిపోయి ఉండటాన్ని గమనించారు. పాఠశాల గదిలో ఉన్న వంటపాత్రలో తె ల్లనినీరు నింపి ఉండటం, వాసన రావడంతో అప్రమత్తమైన ప్రధానోపాధ్యాయురాలు గ్రామస్తులకు సమాచారం అందించారు. వెంటనే పాఠశాలకు చేరుకున్న గ్రామస్తులు వంటపాత్రలు, వాటర్‌ట్యాంక్‌లో విషం కలిపినట్లు గుర్తించారు. పాఠశాల ఆవరణలో ఉన్న పురుగుల మందు డబ్బాను గుర్తించి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సోమవారం రాత్రి ఘటన జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. పాఠశాల సిబ్బంది ముందుగా గుర్తించడంతో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. ఉట్నూర్ ఏఎస్పీ కాజల్‌సింగ్ బుధవారం పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టారు. నిందితుడు అరెస్ట్ పాఠశాలలో వంటపాత్రలలో విషం కలిపిన దర్మంపూరి గోండుగూడకు చెందిన సోయం కిష్టును బుధవారం అరెస్ట్ చేశారు. కొంత కాలంగా కుటుంబ కలహాల కారణంగా మతిస్థిమితం కోల్పోయిన సోయం కిష్టు ఘటనకు పాల్పడినట్లు ఏఎస్పీ కాజల్‌సింగ్ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. పాఠశాలను సందర్శించిన డీఈవో ధర్మంపూరి ప్రాథమిక పాఠశాలను బుధవారం డీఈవో శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. పాఠశాలలో విష ప్రయోగం జరగడంతో పాఠశాలను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంఈవో బిక్కు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రతిభ ఉన్నారు. -
బైక్ దొంగ అరెస్ట్
ఆదిలాబాద్‌టౌన్: పట్టణంలోని కేఆర్కే కాలనీకి చెందిన బైక్ దొంగ షేక్ నదీమ్‌ను టూటౌన్ పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇటీవల బస్టాండ్‌లో పార్కింగ్ చేసిన మూడు ద్విచక్ర వాహనాలను పదిరో జుల కాల వ్యవధిలో దొంగిలించాడు. ఇందిరా నగర్ సమీపంలో వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానం వచ్చి విచారించగా, మూడు వాహనాలు చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో ఆయనపై కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్ రావు తెలిపారు. జైనథ్‌లో.. ఆదిలాబాద్‌టౌన్: జైనథ్ మండలంలోని మాకో డకు చెందిన బైక్ దొంగ రామెల్లి కిరణ్‌ను వన్‌టౌన్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. మావలకు చెందిన రగ్దివార్ ప్రశాంత్ ముథూట్ ఫైనాన్స్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఈనెల 9న కార్యాలయం ఎదుట బైక్ పార్కింగ్ చేయగా, సాయంత్రం వచ్చి చూసే సరికి వాహనం కనిపించలేదు. దీంతో ఆయన వన్‌టౌన్‌లో ఫి ర్యాదు చేశాడు. శివాజీచౌక్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానం వచ్చి నిందితుడిని విచారించగా బైక్ చోరీకి పాల్పడినట్లు ఒ ప్పుకున్నాడు. దీంతో ఆయనపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వివరించారు. మట్కా నిర్వాహకుడికి రూ.లక్ష జరిమానాఆదిలాబాద్టౌన్: మట్కా నిర్వాహకుడికి రూ.లక్ష జరిమానా విధించినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్ రావు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణంలోని సుందరయ్యనగర్‌కు చెందిన మట్కా నిర్వాహకుడు లతీఫ్, రెహాన్ తండ్రి, కొడుకులు ఆన్లైన్లో మట్కా ఆడుతున్నారు. ఇదివరకు బైండోవర్ చేయగా బుధవారం ఆన్లైన్లో మట్కా నిర్వహిస్తుండగా పట్టుబడ్డారు. తహసీల్దార్ ఎదుట వారిని హాజరుపర్చగా పది రోజుల్లో రూ.లక్ష జరిమానా చెల్లించాలని ఆదేశించారు. నిందితుల నుంచి రూ.500, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వివరించారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలుఇంద్రవెల్లి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలైన ఘటన బుధవారం రాత్రి మండలంలోని వడగామ్ సమీపంలో చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉట్నూర్ మండలంలోని లక్కుగూడ గ్రామానికి చెందిన కొరెంగా రాము, కొరెంగా హేమంత్ కు మార్, ఇంద్రవెల్లి మండలంలోని పొల్లుగూడ గ్రామానికి చెందిన బాలుడు జుగ్నాక గౌతంలు ముగ్గురు కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తున్న స మయంలో మోడిగూడ సమీపంలో ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిపోయింది. దీంతో కొరెంగా రాము, కొరెంగా హే మంత్లకు తీవ్ర గాయాలయ్యాయి. జుగ్నాక్ గౌ తంకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో క్షతగాత్రులను రిమ్స్‌కు తరలించారు. రాము, హే మంత్కుమార్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
అధికారికంగా అమరుల సంస్మరణ దినోత్సవం
ఇంద్రవెల్లి: అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని మొదటిసారిగా అధికారికంగా నిర్వహిస్తున్నామని, ఆ దిశగా ఏర్పాట్లు చేయాలని ఆదిలా బాద్ కలెక్టర్ రాజర్షిషా, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అన్నారు. బుధవారం ఉట్నూర్ సబ్‌కలెక్టర్ యువరాజ్ మర్మాట్, ఏఎస్పీ కాజల్సింగ్లతో కలిసి మండలంలోని అమరవీరుల స్తూపాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. సంస్మరణ దినోత్సవం నిర్వహణపై రాయిసెంటర్ సార్మెడీలు, అమరుల ఆశయ సాధన కమిటీ, ఆది వాసీ పెద్దలతో సమావేశమయ్యారు. వారు మా ట్లాడుతూ అమరవీరుల స్తూపాన్ని వివిధ రకాల పూలతో అలంకరించాలని తెలిపారు. 1981లో జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించిన ఫొటోలతో పాటు ఆదివాసీ సంస్కృతికి చెందిన ఫొటోలను సేకరించి మ్యూజియం ఏర్పాటు చేయాలన్నారు. ఏప్రిల్ 20 సంస్మరణ దినోత్సవం రోజు రాష్ట్ర మంత్రి సీతక్క అమరుల కుటుంబాలకు ట్రైకర్ ద్వారా మంజూరైన వాహనాలు, యూనిట్లను పంపిణీ చేస్తారని పేర్కొన్నారు. వానాకా లంలో స్మృతివనంలో మొక్కలు నాటి వందశాతం పనులు పూర్తయిన తరువాత స్మృతివనా న్ని ప్రారంభిస్తామని తెలిపారు. అమరవీరుల ఆశయ సాధన కమిటీ చైర్మన్ తోడసం నాగో బారావ్ అమరవీరుల స్తూపం ప్రాంగణంలో వీధిదీపాలు ఏర్పాటు చేయాలని, తాగునీటి కోసం బోరు మంజూరు చేయాలని, ప్లాస్టిక్ కుర్చీ లు, గ్రీన్‌మ్యాట్ మంజూరు చేయడంతో పాటు వాచ్‌మెన్‌ను నియమించాలని కోరుతూ వినతిపత్రం అందించారు. ఐటీడీఏ ఏపీవో జనరల్ వ సంత్రావ్, డీడీ అంబాజీ, ఈఈ తానాజీ, సార్మెడిలు మెస్రం దుర్గు, మెస్రం చిన్ను, ఏఎంసీ చై ర్మన్ ముఖడే ఉత్తం, తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్, ఎంపీడీవో జీవన్‌రెడ్డి, ఆదివాసీ సంఘాల నాయకులు గోడం గణేశ్, మెస్రం నాగ్నాథ్, పుర్క చిత్రు, ఆనంద్‌రావ్, నాగోరావ్ ఉన్నారు. ● ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా, ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా -
భార్యపై గొడ్డలితో దాడి
కోటపల్లి: వివాహేతర సంబంధంపై ప్రశ్నించిన భార్యపై భర్త గొడ్డలితో దాడి చేసిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై రాజేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. బొప్పారం గ్రామానికి చెందిన బానోత్ పున్నం అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. అతడి భార్య లక్ష్మికి విషయం తెలియడంతో ఇంట్లో తరచూ గొడవపడేవారు. ఈ క్రమంలో బుధవారం సదరు మహిళతో పున్నం సన్నిహితంగా ఉన్నాడని తెలుసుకున్న లక్ష్మి భర్తను తీవ్రంగా మందలించింది. దీంతో కోపోద్రిక్తుడైన పున్నం పక్కనే ఉన్న గొడ్డలితో లక్ష్మిపై దాడి చేయడంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుమారుడు రాజేశ్ అక్కడికి చేరుకుని 108లో చెన్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాజేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజేందర్ తెలిపారు. -
పురుగుల మందు తాగి ఆత్మహత్య
బోథ్: సొనాల మండలం సంపత్‌నాయక్ తండా గ్రామానికి చెందిన జాదవ్ దేవిదాస్(45) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై ఎల్.ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. జాదవ్ దేవిదాస్ మద్యానికి బానిసయ్యాడు. ఈ నెల 15న మద్యం సేవించి ఇంటికి వెళ్లగా భార్య సుమన్ బాయి మందలించింది. దీంతో దేవిదాస్ తన వ్యవసాయ భూమిలో పురుగుల మందు తాగి రాత్రి 9 గంటలకు భార్యకు విషయం తెలిపాడు. వెంటనే మండల కేంద్రంలోని సీహెచ్‌సీకి, మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దేవిదాస్ మృతిచెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
స్పౌజ్ బదిలీలకు గ్రీన్ సిగ్నల్
● ఉమ్మడి జిల్లాలో ఆరుగురికి అవకాశం ● ఆసిఫాబాద్ నుంచి ఆదిలాబాద్‌కు నలుగురు, మంచిర్యాలకు ఇద్దరు రాక ● ఈ నెల 23న విధుల్లో చేరనున్న ఉపాధ్యాయులుఆదిలాబాద్టౌన్: స్పౌజ్ బదిలీలకు ప్రభుత్వం మరోసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల 38 మంది స్పౌజ్ ఉపాధ్యాయులు (భార్య, భర్త) ఇతర జిల్లాల నుంచి జిల్లాకు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ స్పౌజ్ బదిలీలకు సంబంధించి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆరుగురు సొంత జిల్లాలకు బదిలీపై వెళ్లనున్నారు. కుమురంభీం ఆసిఫాబాద్ నుంచి ఆదిలాబాద్‌కు నలుగురు స్కూల్ అసిస్టెంట్లు (తెలుగు) బదిలీపై రానుండగా, ఆసిఫాబాద్ నుంచి మంచిర్యాలకు ఇద్దరు సాంఘిక శాస్త్రం ఎస్ఏలు బదిలీపై వెళ్లనున్నారు. 317 ద్వారా నష్టపోయిన ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఊరట కల్పించింది. 23న రిలీవ్.. సంబంధిత జిల్లాలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఈనెల 22న రిలీవ్ అయి వారికి కేటాయించిన జిల్లాలో 23న విధుల్లో చేరాలని విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే ఇటీవల మ్యూచువల్ బదిలీలకు సంబంధించి ఉత్తర్వులు జారీ అయిన విషయం తెలిసిందే. ఆదిలాబాద్ జిల్లాకు 24 మంది మ్యూచువల్ బదిలీపై రానుండగా, అదే సంఖ్యలో ఇతర జిల్లాలకు ఇక్కడి నుంచి వెళ్లనున్నారు. మంచిర్యాల నుంచి ఓ సీనియర్ అసిస్టెంట్ డీఈవో కార్యాలయానికి రానుండగా, ఇక్కడినుంచి ఒకరు మంచిర్యాలకు వెళ్లనున్నారు. -
మోటర్ తెచ్చిన తంటాలు
రెబ్బెన/బెల్లంపల్లి: బెల్లంపల్లి సింగరేణి ఏరియాలో ని మాదారం టౌన్షిప్లో కార్మికులు, కార్మికేతర కు టుంబాలను జనవరి నుంచి నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. తరచూ మోటర్లు కాలిపోతుండగా, మ రమ్మతులకు గరిష్టంగా రెండు వారాలపైనే సమ యం పడుతోంది. వేసవి కావడంతో నీటి కోసం కాలనీ ప్రజలు అల్లాడుతున్నారు. తాజాగా మంగళవారం రాత్రి మరోసారి మోటార్ చెడిపోవడంతో నీటిసరఫరా నిలిచిపోయింది. మాదారం కాలనీవా సులకు మహావీర్‌ఖని(ఎంవీకే) –1 ఇంకై ్లన్ సమీపంలో వేసిన బోర్లో మోటర్ బిగించి అంతర్గత పైపులైన్ ద్వారా తాగునీటిని అందిస్తున్నారు. అయితే అంతుచిక్కని కారణాలతో ఇక్కడ ఏర్పాటు చేసిన పంపు మోటరు తరచూ చెడిపోతోంది. నాలుగు నెలల్లో నాలుగుసార్లు మరమ్మతులకు గురైంది. గడిచిన నెలన్నర వ్యవధిలో రెండుసార్లు చెడిపోయిందని స్థానికులు తెలిపారు. సమస్య పరిష్కారం కో సం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదేశాల మే రకు సింగరేణి జీఎం రెండు కొత్త పంపు మోటర్లను తెప్పించారు. 75 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన మోట ర్లు తీసుకురాగా, అవి బోర్‌హోల్‌లో పట్టలేదు. కొత్తగా బోరులో పట్టే మోటర్లను తీసుకువచ్చి బిగించడం లేదా 75 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన మోట ర్లకు సరిపడేలా కొత్త బోరు హోల్ వేయడమో చేస్తేగానీ నీటిసమస్య తీరే అవకాశం కనిపించడం లేదు. రోడ్డుపై కాలనీవాసుల ఆందోళన తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో మాదారం కార్మిక కుటుంబాల మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. కై రిగూడ ఆర్చీ వద్ద సింగరేణి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఐఎన్టీయూసీ ఏరియా ఉపాధ్యక్షుడు పేరం శ్రీనివాస్ మాట్లాడుతూ మాదారం టౌన్షిప్లో నెలలో పది నుంచి పద్నాలుగు రోజులపాటు నీటి సరాఫరా లేకపోతే కార్మిక కుటుంబాలు ఎలా బతకాలని ప్రశ్నించారు. నీటి సరాఫరా నిలిచిపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తూ చేతులు దులుపుకొంటున్నారన్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకపోతే జీఎం కార్యాలయం ఎదుట బైఠాయిస్తామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న ఎస్వోటూజీఎం రాజమల్లు సంఘటన స్థలానికి వెళ్లి ఐఎన్టీయూసీ, కార్మిక కుటుంబాలతో మాట్లాడారు. రెండు రోజుల్లో పంపులకు మరమ్మతులు చేయించి నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని, అప్పటివరకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్మిక కుటుంబాలకు మద్దతుగా ఏఐటీయూసీ నాయకులు ధర్నాలో పాల్గొన్నారు. కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ నాయకులు ప్రకాశ్‌రావు, రామారావు, ఏరియా కార్యదర్శి చంద్రకుమార్, ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి, ఉపాధ్యక్షుడు బయ్య మొగిళి, కార్మికులు అనిల్, పోశం, శంకర్, రఘునాథరెడ్డి, రమేశ్, సత్యనారాయణ, మధు, తదితరులు పాల్గొన్నారు. నాలుగు నెలలుగా తరచూ కాలిపోతున్న వైనం మాదారం కాలనీవాసులకు తప్పని నీటి కష్టాలు సమస్య పరిష్కరించాలని రోడ్డుపై బైఠాయింపు -
● జిల్లాలో పాతాళంలోకి భూగర్భజలాలు ● అడుగంటుతున్న జలాశయాలు ● గుక్కపట్టి పోస్తున్న బోరుబావులు ● పంటకు నీరు అందించేందుకు తిప్పలు ● దిగుబడి దశలో దిక్కుతోచని స్థితిలో రైతాంగం
జిల్లాలోని వివిధ మండలాల్లో భూగర్భజలాల నీటిమట్టం (మీటర్లలో) మండలం ఫిబ్రవరి మార్చి బెల్లంపల్లి 15.03 15.22 భీమిని 2.22 2.42 చెన్నూర్ 6.89 7.09 దండేపల్లి 1.59 1.84 హాజీపూర్ 4.49 4.56 జైపూర్ 18.19 19.41 జన్నారం 5.84 6.27 కన్నెపెల్లి 6.56 7.16 కాసిపేట 3.61 3.76 కోటపల్లి 16.59 18.74 లక్షేట్టిపేట 1.54 2.11 మందమర్రి 12.73 13.27 నెన్నెల 5.49 5.93 తాండూర్ 15.12 15.40 వేమనపల్లి 4.50 4.50 భీమారం 8.44 8.63 మంచిర్యాల 7.02 8.0 నస్పూర్ 9.95 10.82 మంచిర్యాలఅగ్రికల్చర్: ఖరీఫ్ సీజన్లో జిల్లాలో భా రీ వర్షాలు కురియగా వరదలతో పంటలు దెబ్బ తిన్నాయి. కానీ యాసంగిలో మాత్రం నీరులేక పంటలు ఎండిపోయే దుిస్థితి నెలకొంది. ప్రస్తుతం పంటలు పొట్ల, గులకదశలో ఉన్నాయి. మరో రెండు త డులిస్తే పంట చేతికి అందుతుంది. కీలకమైన ఈ దశలో నీరందక పొలాలు బీటలు వారుతున్నాయి. దీంతో రైతులు రాత్రి, పగలు తేడాలేకుండా పొలా లవద్దే పడిగాపులు కాస్తున్నారు. చెరువులు, కుంటలు, కాల్వల తూముల నుంచి నీరు అందక ఆయి ల్ ఇంజిన్లు పెట్టి నీటిని తోడుకుంటున్నారు. మరో వైపు బోరుబావుల్లో నీరు అడుగంటడంతో అదనంగా పైపులు అమర్చి మోటర్లను కిందకు దించుతున్నారు. అయినా నీరందక కన్నీరు పెడుతున్నారు. పడిపోతున్న నీటిమట్టం జిల్లాలో ఈ ఏడాది యాసంగి సీజన్లో రైతులు 1,22,150 ఎకరాల్లో ప్రధానంగా వరి, మొక్కజొన్న పంటలు సాగు చేశారు. ఇందులో వరి సాగు విస్తీర్ణం 1,21,702 ఎకరాలు. ఎక్కువ శాతం కాల్వలు, బోరు బావుల కింద సాగు చేశారు. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో భూ గర్భజలాలు అడుగంటుతున్నాయి. దీంతో కొన్నిచోట్ల ఒకటికి రెండు మూడు బోర్లు వేస్తున్నారు. ఒక్కో రైతు వందల ఫీట్ల లోతుకు బోర్లు దించుతున్నా ఆశించిన నీరు రావడంలేదు. మరికొంతమంది రైతులు అదనంగా పైపులు అమర్చి బోరు మోటార్లను కిందకు దించుతున్నారు. మరోవైపు ప్రాజెక్టు కాల్వకింద కా ల్వ కింద సాగు చేసిన పొలాలకు వంతుల వారీగా నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో తమవంతు వచ్చేసరికి పొలాలు బీటలు వారుతున్నాయని రైతులు వాపోతున్నారు. మరో 20 రోజుల పాటు పంటలకు నీటితడులు అవసరం ఉన్నాయి. జిల్లాలో గతేడాది మార్చి వరకు సరాసరి నీటి మట్టం 6.96 మీటర్ల లోతులో ఉండగా.. ఈ ఏడాది మార్చి వరకు 7.07 మీటర్లకు పడిపోయింది. ఏప్రిల్‌లో మరింత వేగంగా నీటిమట్టాలు పడిపోతున్నాయి. నాలుగు మండలాల్లో అత్యంత వేగంగా.. జిల్లా భూగర్భ జలవనరుల శాఖ అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో భూగర్భ జలాలు వేగంగా అడుగంటుతున్నాయి. ప్రతీనెల 25వ తేదీన భూగర్భజలాల నీటినిల్వలను గుర్తిస్తున్నారు. గతేడాది మార్చి కంటే ఈ ఏడాది ప్రధానంగా కోటపల్లి మండలంలో 3.94 మీటర్లు, తాండూర్‌లో 3.09, నస్పూర్‌లో 1.02, చెన్నూర్‌లో 0.96 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. కాపాడుకునేందుకు పాట్లు.. వరి, మొక్కజొన్న కొన్నిచోట్ల దిగుబడి వస్తుండగా ఆలస్యంగా నాట్లు వేసిన చోట పొట్ట, గులక దశలో ఉంది. ఈ క్రమంలో జలాశయాలు, బోరుబావుల్లో నీరు అడుగంటడంతో నీటికోసం రైతులు తిప్పలు పడుతున్నారు. పంటలు కాపాడుకునేందుకు వాగుల్లో గుంటలు చేసి ఊట నీటిని మోటర్ల ద్వారా అందిస్తున్నారు. మెట్ట ప్రాంతంలో ఉన్న మడులకు చేసేదేంలేక వదిలేస్తున్నారు.ప్రాజెక్టు ఎండుతోందిగొల్లవాగు ప్రాజెక్టు కింద రబీ సీజన్లో రెండెకరాల్లో వరి సాగు చేసిన. ప్రాజెక్టు మొత్తం అడుగంటి పోయింది. కాల్వల నుంచి నీరు రావడం లేదు. వరి పొలాలు ఎండుతున్నాయి. – గాలిపెల్లి నాగభూషణ్, అర్కేపల్లి, భీమారం -
హెల్ప్‌డెస్క్‌లో సిబ్బంది అందుబాటులో ఉండాలి
మంచిర్యాలటౌన్: పట్టణంలోని మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌లో సిబ్బంది అందుబాటులో ఉండాలని డీఎంహెచ్‌వో హరీశ్‌రాజ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎంసీహెచ్‌ను బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వైద్య సిబ్బందితో మాట్లాడుతూ గర్భిణులు వచ్చినప్పుడు పూర్తి వివరాలు నమోదు చేసుకుని, వైద్యులకు చూపించాలని ఆదేశించారు. ఎంసీహెచ్‌కు వచ్చే జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులకు అవసరమైన వివరాలను తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి వైద్యులు డాక్టర్ ప్రియదర్శిని, డాక్టర్ ప్రసాద్, డాక్టర్ అనిల్ కుమార్, డెమో బుక్క వెంకటేశ్వర్, వెంకటసాయి, తదితరులు పాల్గొన్నారు. -
భూ భారతితో భూసమస్యలు పరిష్కారం
● కలెక్టర్ కుమార్దీపక్దండేపల్లి: ధరణి పోర్టల్ స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ‘భూ భారతి’తో భూ సమస్యలు పరిష్కారం అవుతాయని కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నారు. భూభారతిపై తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో బుధవారం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధరణితో గతంలో కొన్ని సమస్యలకు పరి ష్కారం లభించక రైతులు ఇబ్బందులు పడ్డారని, భూ భారతితో మాత్రం చాలా సమస్యలకు పరి ష్కారం లభిస్తుందన్నారు. దీనిని వచ్చే జూన్ నుంచి పూర్తిస్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం మండలంలోని గీత కార్మికులకు ఎకై ్సజ్‌శాఖ ద్వారా ఉచితంగా అందించిన కాటమయ్య రక్షణ కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసరావు, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ దుర్గాప్రసాద్, బీసీవెల్ఫేర్ ఆఫీసర్ పురుషోత్తం, ఏడీఏ అనిత, తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీవో ప్రసాద్, డీటీ విజయ, ఆర్ఐ భూమన్న, ఇన్చార్జి ఏవో శ్రీకాంత్, బ్యాంక్ మేనేజర్ భూంరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.అవగాహన ఉంటే సమస్యలకు పరిష్కారం జన్నారం: భూభారతి చట్టంపై అవగాహన ఉంటే అనేక భూ సమస్యలకు పరిష్కారం ఏర్పడుతుంద ని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో భూభారతిపై అవగాహన క ల్పించారు. ఈ సందర్భంగా జన్నారంలోని డీలర్లు ఇచ్చిన కల్తీ అన్నపూర్ణ వరి విత్తనాలతో నష్టపోయామని, ధాన్యాన్ని ఎవరూకొనడం లేదని బాదంపల్లికి చెందిన రైతు మల్లంపెల్లి శ్రీనివాస్ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చాడు. స్పందించిన కలెక్టర్ జిల్లా వ్యవసాయ అధికారిని పిలిచి సంబందిత డీలర్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మోతీలాల్, ఆర్డీవో శ్రీనివాసరావు, ఏడీ శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి జీ.కల్పన, త హసీల్దార్ రాజమనోహర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ లక్ష్మీనారాయణ, పీఏసీఎస్ చైర్మన్ రవి, రాజన్న, డీటీ రామ్మోహన్, ఏవో సంగీత, తదితరులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి రైతులకు ఇబ్బంది కలుగకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ కుమార్ దీపక్ నిర్వాహకులను ఆదేశించారు. బుధవారం మండల కేంద్రంలోని మార్కెట్‌యార్డులో ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించారు. కేంద్రీయ విద్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలం గుడిపేటలోని నూతన భవనంలోకి మారిన కేంద్రీయ విద్యాలయాన్ని కలెక్టర్ కుమార్‌దీపక్ సందర్శించారు. తరగతి గదులు, ఫర్నీచర్, కంప్యూటర్, బోధనా పరికరాలను పరిశీలించారు. విద్యార్థులను ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. కలెక్టర్ వెంట ప్రిన్సిపాల్ జె.ప్రసాద్, అధ్యాపక బృందం ఉన్నారు. -
పోలీసులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
● రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా మంచిర్యాలక్రైం: పోలీసులు ఆరోగ్యంపై ప్రత్యే క శ్రద్ధ కనబర్చాలని రామగుండం పోలీస్ క మిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. కమిషనరేట్ ఆవరణలో బుధవారం ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీసులు విధి నిర్వహనలో ఒత్తిళ్లకు లోనవుతారన్నారు. పోలీసులు ఆరో గ్యంగా ఉంటేనే ప్రజలకు భద్రత, రక్షణ కల్పించగలుగుతారన్నారు. ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో సహా వైద్యశిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అత్యవసర సమయంలో సీపీఆర్ చేసే విధానంపై అవగాహన కల్పించా రు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రాజు, కమిషనరేట్ పోలీస్ అఽధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఐటీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ ధర్నా
మంచిర్యాలటౌన్: ఏఐసీసీ అగ్రనేతలు సోనియా, రాహుల్‌గాంధీపై ఈడీ చార్జిషీట్ నమోదు చేయడాన్ని నిరసిస్తూ బుధవారం జిల్లా కేంద్రంలోని ఐటీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురా లు కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ కేంద్రంలో అధి కారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలను మానుకుని ప్రజాక్షేత్రంలో పోరాడాలని హితవు పలికారు. ధర్నాను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా అధికసంఖ్యలో కాంగ్రెస్ నా యకులు పాల్గొని ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. -
నవ సమాజ నిర్మాణానికి అంబేడ్కర్ కృషి
జన్నారం: నవ సమాజ నిర్మాణానికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కృషి చేశారని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని సోమవారం రాత్రి ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆనందమేళా కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు నృత్య, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేడ్కర్ ఒక వర్గానికో మతానికో సంబంధించిన వారు కాదని, అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేసిన గొప్ప నేత అంటూ కొనియాడారు. ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాడి రాజన్న, సీపీఎస్ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కమలాకర్, ఏఎంసీచైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, ఎంఈవో ఎన్.విజయ్‌కుమార్, ఫెడరేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు బాదావత్ ప్రకాష్‌నాయక్, జిల్లా అధ్యక్షుడు రామటెంకి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బు క్య రాజన్న, మండల అధ్యక్షుడు తుంగూరి గోపాల్, ముజఫర్ అలీఖాన్, తదితరులు పాల్గొన్నారు. -
‘గొల్లవాగు’ అడుగంటుతోంది..
● డెడ్‌స్టోరేజీకి చేరువలో ప్రాజెక్టు నీటిమట్టం ● ఆందోళన చెందుతున్న రైతులు ● రబీలో 6వేల ఎకరాల్లో సాగు భీమారం: చెన్నూర్ నియోజకవర్గంలోని భీమారం, చెన్నూర్ మండలాలకు సాగునీరు అందించే గొల్ల వాగు ప్రాజెక్ట్ అడుగంటుతోంది. వేసవిలో ఎండల తీవ్రతకు రోజురోజుకు నీటిమట్టం పడిపోతోంది. దీంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 155.500 మీటర్లు కాగా ప్రస్తుతం 150.000 మీటర్లు మాత్రమే నీరు నిల్వ ఉంది. నీటిమట్టం 148.00 మీటర్లకు పడిపోతే డెడ్‌స్టోరేజీకి చేరినట్లే. దీంతో మరో నెల రోజులపాటు పంట పొలాలకు నీరందుతుందో లేదోనని రైతుల్లో ఆందోళన నెలకొంది. ప్రాజెక్ట్ కింద 9,500 ఎకరాల ఆయకట్టు ఉండగా రబీ సీజన్లో 6వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. అవగాహన కల్పించని అధికారులుపంటల సాగుకు ముందే వ్యవసాయ, ఇరిగేషన్ శాఖల అధికారులు గ్రామాలకు వెళ్లి రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాల్సి ఉంది. కానీ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో ప్రాజెక్ట్ కింద మే నెల చివరి వరకు సాగు కొనసాగుతోంది. ఖరీఫ్, రబీ పంటలను ఎప్పుడు ప్రారంభించాలో రైతులకు తెలియడం లేదు. దీంతో సమయపాలన పాటించకుండా ఇష్టారాజ్యంగా వరినాట్లు వేస్తున్నారు. దీనితో సాగునీటి సమస్య ఎదురవుతోంది. రెండు నెలలపాటు నీటి విడుదలఅవసరం లేకున్నా వర్షాకాలం పంటలో రెండు నెలలపాటు కాలువ నిండా నీటిని వదలడంతో వృథా అయ్యాయని రైతులు ఆరోపిస్తున్నారు. సమృద్ధిగా వర్షాలు కురిసినా ఇరిగేషన్ శాఖ అధికారులు కాలువ ద్వారా నీటి విడుదల కొనసాగించారని, నిలిపివేసి ఉంటే ఇప్పుడు ప్రాజెక్ట్‌లో భారీగా నీరు ఉండేదని పేర్కొంటున్నారు. అధికారుల వైఖరి కారణంగానే ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజీకి చేరుకుందని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. -
పెండింగ్ వేతనాలు చెల్లించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: అనంత సొల్యూషన్, విద్యాంజలి 2.0 ద్వారా గిరిజన ఆశ్రమ పాఠశాలలు, సంక్షేమ హాస్టల్లో పని చేస్తున్న ఆఫీస్ సబార్డినేటర్లు, వాచ్మెన్, అటెండర్, స్వీపర్, ఇంగ్లిష్ టీచర్, కంప్యూటర్ ఆపరేటర్, యోగ టీచర్లకు ఎనిమిది నెలలుగా పెండింగ్ ఉన్న వేతనాలు చెల్లించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ గత ఆగస్టు, సెప్టెంబర్‌లో 50 మందిని నియమించారని, ప్రతీ నెల రూ.15 వేల వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పిస్తామని చెప్పారని, కానీ వేతనాలు చెల్లించడం లేదని తెలిపారు. కలెక్టర్ జోక్యం చేసుకుని వేతనాలు చెల్లించేలా చూడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటియూ నాయకులు రంజిత్, గిరిజన ఆశ్రమ పాఠశాల, హాస్టల్ అనంత విద్యాంజలి ఉద్యోగులు, స్వాతి, సారిరాణి, ప్రశాంతి, దివ్యశ్రీ, స్వరూప, కల్పన, రజిత, ప్రశాంతి, దివ్యశ్రీ, వెంకటమ్మ, మమత, నరేష్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
ఆ రైలు 20గంటలు ఖాళీ..!
● నందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్ రైలు కాజీపేట జంక్షన్ వరకు పొడగిస్తే మేలు ● ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రయాణికులకు రవాణా సౌకర్యం ● ఎంపీలు స్పందించాలని రైల్వే ప్రయాణికుల విజ్ఞప్తి బెల్లంపల్లి: ముంబయి ఛత్రపతి శివాజీ టెర్మినల్ నుంచి బల్లార్షా వరకు నందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్ రైలు(నం.11001/2) వయా నాందేడ్, ఆదిలాబాద్ మీదుగా నిత్యం రాకపోకలు సాగిస్తోంది. ప్రస్తుతం ఈ రైలును వరంగల్ జిల్లా కాజీపేట జంక్షన్ వరకు పొడగించాలనే డిమాండ్ కొంతకాలంగా వినిపిస్తోంది. ఉత్తర తెలంగాణ ప్రజలు మహారాష్ట్ర రాజ ధాని ముంబయి వెళ్లడానికి సరైన రైలు ప్రయాణ సౌకర్యం లేకుండా పోయింది. కాజీపేట, హైదరా బాద్ వెళ్తే గానీ ముంబయికి వెళ్లే పరిస్థితులు లేవు. ప్రస్తుతం ముంబయి నుంచి బల్లార్షా జంక్షన్ వరకు నందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్ నడుస్తోంది. ఆ రైలును కాజీపేట జంక్షన్ వరకు పొడగించడం వల్ల రైల్వేపై ఏ మాత్రం భారం పడకపోగా ఉత్తర తెలంగాణ జిల్లాల పరిధిలోని ప్రయాణికులకు ఎంతగానో మేలు జరిగి రవాణా సౌకర్యం మెరుగవుతుంది. సమయం సద్వినియోగం చేసుకుంటే.. ముంబయి ఛత్రపతి శివాజీ టెర్మినల్ నుంచి బయల్దేరిన నందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్ రైలు వయా నాందేడ్, ఆదిలాబాద్ మీదుగా బల్లార్షా జంక్షన్‌కు చేరుకుంటుంది. ఆ తర్వాత అక్కడే దాదాపు 20గంటలపాటు ఖాళీగా ఉంటుంది. ఆ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కాజీపేట జంక్షన్ వరకు పొడగిస్తే కాజీపేట–బల్లార్షా సెక్షన్ పరిధిలో ఉన్న సిర్పూర్ కాగజ్‌నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, జమ్మికుంట తదితర ప్రాంతాల ప్రయాణికులకు ఉపయుక్తంగా ఉండడంతోపాటు రైల్వేకు ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయా ప్రాంతాల ప్రజలకు ముంబయి వెళ్లడానికి ఒక్క రైలు సౌకర్యం కూడా లేదు. దీంతో ముంబయి వెళ్లాల్సిన ప్రయాణికులు కాజీపేట జంక్షన్‌కు వెళ్లి కోణార్క్ ఎక్స్‌ప్రెస్ లేదా విశాఖ నుంచి ఎల్టీటీ ద్వారా వెళ్లాల్సి వస్తోంది. అదీ సాధ్యం కాకపోతే నిజామాబాద్ జంక్షన్‌కు వెళ్లి దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లో ముంబయి వెళ్లాల్సిన ప్రతికూల పరిస్థితులు ఉంటున్నాయి. నదిగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌ను కాజీపేట జంక్షన్ వరకు పొడగించిన తర్వాత కూడా మరో 11గంటలపాటు రైలు ఖాళీగా ఉండే అవకాశాలు ఉండనున్నాయి. అక్కడ ప్రాథమిక నిర్వహణకు అవకాశం ఉంటుంది. ప్రసుత్తం కాజీపేటలో రెండు ఫిట్లైన్లు అందుబాటులో ఉండడం కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు. కాగా, ఆదిలాబాద్ జిల్లా ప్రయాణికులకు వరంగల్ జిల్లా మరింత చేరువవుతుంది. ఎంపీలు స్పందిస్తే ఎంతోమేలు నందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్ రైలు పొడగింపు కోసం ఉత్తర తెలంగాణ ప్రాంతం నుంచి ఎన్నికై న ఎంపీలు స్పందించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. బల్లార్షా జంక్షన్ నుంచి కాజీపేట జంక్షన్ వరకు పొడగించే ప్రయత్నాలు చేయాలి. దీంతోపాటు పెద్దపల్లి నుంచి నిజామాబాద్ రైల్వే మార్గంలో వారానికి మూడు రోజులు ముంబయికి రైలు నడపడంతోపాటు బల్లార్షా–వార్ధా మార్గంలో నూతన వీక్లీ సర్వీసు ప్రవేశ పెడితే ఉత్తర తెలంగాణ ప్రయాణికులకు ముంబయి వెళ్లడానికి సౌకర్యంగా ఉంటుంది. ఈ ప్రాంత ఎంపీలు చిత్తశుద్ధితో కృషి చేయాలని రైలు ప్రయాణికులు కోరుతున్నారు. రద్దు చేసిన రైళ్లను పునరుద్ధరించాలి కరోనా కంటే ముందు నడిపించిన ఆనంద్ వన్(రైలు నెం.22127/28) సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలును అర్ధంతరంగా రద్దు చేశా రు. ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు పునః ప్రా రంభించలేదు. ఈ రైలు కాజీపేట జంక్షన్ నుంచి బయల్దేరి లోక్మాన్య తిలక్ టెర్మినల్ వయా బల్లార్షా, వార్ధా, అమరావతి, అకో లా భూసావల్, మన్మాడ్ మీదుగా ముంబ యి వెళ్లేది. ఈ రైలు వల్ల ప్రయాణ సమ యం తక్కువగా ఉండి ప్రయాణికులకు సౌ కర్యవంతంగా ఉండేది. కానీ ఈ రైలు నిలిపివేయడం వల్ల ముంబయి వెళ్లే ఉత్తర తెలంగాణ ప్రయాణికులకు కష్టాలు పెరిగాయి. -
ప్రజల కలను సాకారం చేశాం
రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ ప్రజల దశాబ్దాల కల అయిన ఫ్లై ఓవర్ బ్రిడ్జిని తమ హయాంలో పూర్తి చేసి ప్రారంభించడం సంతోషంగా ఉందని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి అన్నారు. మంగళవారం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ కుమార్‌దీపక్‌తో కలిసి క్యాతనపల్లి వద్ద నిర్మించిన ఆర్వోబీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ తాను ఎంపీగా ఉన్నప్పుడు పలుమార్లు ఆర్కేపీకి వస్తే ఇక్కడి రైల్వే గేటు ద్వారా ఇబ్బందులు పడ్డానని, ప్రజల కోరిక మేరకు 2011లోనే బ్రిడ్జిని మంజూరు చేయించానని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భూసేకరణ పనులు, నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లింపు జరగక పనులు పూర్తికాకపోతే చెన్నూర్ ఎమ్మెల్యేగా ఎన్నికై న తాను భూసేకరణ పనులు, పరిహారం చెల్లింపు అంశాలను వేగవంతం చేసి ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఏడాదిలోనే పనులు పూర్తి చేశానని చెప్పారు. నియోజకవర్గ సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని, ప్రజలు కొంత ఓపిక పట్టాలని సూచించారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల గురించి ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిటీ నిర్ణయం మేరకు అర్హులకు ఇళ్ల స్థలాలిస్తామని చెప్పారు. పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రచారానికి వస్తే రైల్వే గేటు వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు చనిపోవడం తనను ఎంతగానో బాధించిందని, బ్రిడ్జిని పూర్తి చేసేందుకు తనతోపాటు తన తండ్రి ఎంతగానో కృషి చేశామని చెప్పారు. ఈ ప్రాంతంలో ఎక్స్‌ప్రెస్ రైళ్ల హాల్టింగ్ కోసం కృషి చేస్తున్నానని, సింగరేణి రిటైర్డ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి పాటుపడుతానని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్అండ్బీ ఎస్ఈ రాము, క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ రాజు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు, రఘునాథ్‌రెడ్డి, వొడ్నాల శ్రీనివాస్, నీలం శ్రీనివాస్‌గౌడ్, గాండ్ల సమ్మయ్య, అజీజ్ తదితరులు పాల్గొన్నారు. ఆర్వోబీతో కష్టాలు దూరం చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ క్యాతనపల్లి ఫ్లై ఓవర్ బ్రిడ్జి ప్రారంభం -
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
రామకృష్ణాపూర్: క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. మున్సిపల్ కార్యాలయాన్ని కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల ప్రక్రియ, మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల పురోగతిపై మున్సిపల్ కమిషనర్ రాజును అడిగి తెలుసుకున్నారు. వేసవి దృష్ట్యా ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం పని చేయాలని సూచించారు. ప్రతీ ఇంటికి నిరాటంకంగా తాగునీటి సరఫరా జరగాలని అన్నారు. రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా ఉండాలని తెలిపారు. -
అమ్మా.. క్షమించు
● అన్నయ్యా.. సారీ.. ● నా ఆరోగ్యం మెరుగుపడడం లేదు ● బాధ భరించలేక‘పోతున్నా’ ● సూసైడ్ నోట్ రాసి యువకుడి బలవన్మరణం నెన్నెల(బెల్లంపల్లి): కొంతకాలంగా అనారో గ్యంతో బాధపడుతున్న ఓ యువకుడు చికిత్స చేయించుకున్నా మెరుగు పడకపోవడంతో మనస్తాపం చెందాడు. అనారోగ్యం బాధను భరించలేకపోయాడు. ఇక చావే శరణ్యమనుకున్నాడు. ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్ప డ్డాడు ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం జెండా వెంకటాపూర్‌లో జరిగింది. ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాశాడు. ఎస్సై ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన చెల్మాటికారి సత్తయ్య, అమృత దంపతుల కుమారుడు అనిల్ (24) పీజీ పూర్తిచేసి ఇంటివద్దే ఉంటున్నాడు. కొంతకాలంగా పచ్చకామెర్లు, దవడ బిల్లలు, వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నాడు. చికిత్స చేయించినా నయం కాకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. మంగళవారం ఇంట్లోనే దూలానికి చీరతో ఉరేసుకుని బలవన్మరణం చెందాడు. ఉరేసుకునే ముందు బెడ్రూమ్లో అతని మంచంపై సుసైడ్ నోట్ రాసిపెట్టాడు. ‘అమ్మా.. నన్ను క్షమించండి.. నాకు ఆరోగ్యం బాగుండడంలేదు. బాధ భరించలేక చనిపోతున్నా. నా చావుకు ఎవరూ కారణం కాదు. నా సొంత నిర్ణయంతో చనిపోతున్నా. అన్నయ్య సారీ రా... నీవు ఈ లెటర్ చదివే సమయానికి నేను నీతో ఉండను.. అమ్మా నాన్నను కష్టపెట్టకు.. నన్ను మీరంతా క్షమిస్తారని ఆశిస్తూ.. సెలవు తీసుకుంటున్నా.. అని నోట్ రాసి ఉంచాడు. మృతుని తండ్రి సత్తయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. నేత్రదానం అనిల్ కళ్లు దానం చేయడానికి తల్లిదండ్రులు ముందుకు వచ్చి సోపతి వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు భీం పుత్ర శ్రీనివాస్, బ్లడ్ డోనర్ అసోసియేషన్ అధ్యక్షుడు రహీమ్‌కు సమాచారం అందించారు. దీంతో వారు హైదరాబాద్‌లోని ఎల్వీప్రసాద్ ఐ బ్యాంకు టెక్నీషియన్ ప్రదీప్‌కుమార్‌కు తెలియజేయడంతో గ్రామానికి వచ్చి నేత్రాలు సేకరించారు. -
వృద్ధురాలి ఇంట్లో చోరీ
కడెం(ఖానాపూర్): మండలంలోని లింగాపూర్‌లో పడాల గంగవ్వ అనే వృద్ధురాలి ఇంట్లో చోరీ జరిగింది. గంగవ్వ ఇటీవల మండలంలోని పాత మద్దిపడగలో ఉన్న తన కూతురు ఇంటికి వెళ్లింది. ఈనెల 14న రాత్రి దొంగలు ఇంటి తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. మంగళవారం తెల్లవారుజామున గమనించిన స్థానికులు వృద్ధురాలికి, పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై కృష్ణసాగర్రెడ్డి, క్లూస్‌టీం సిబ్బంది ఇంటిని పరిశీలించారు. ఇంట్లో ఉన్న రెండు బీరువాలను పగులగొట్టి మూడు తులాల బంగారం, పది తులాల వెండి కడియాలు, రూ.15 వేల నగదు అపహరించినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
● 40 నిమిషాల్లోనే దొంగను పట్టుకున్న వైనం
పోలీసుల పనితీరు భేష్ ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలో ఒకరి వద్ద నుంచి రూ.36వేల నగదు అపహరించిన దొంగను కేవలం 40 నిమిషాల్లోనే గుర్తించిన ఆసిఫాబాద్ పోలీసులు భేష్ అనిపించుకున్నారు. సీఐ బుద్దె రవీందర్ తెలిపిన వివరాల మేరకు జిల్లా కేంద్రానికి చెందిన మీర్ అలీ మంగళవారం పట్టణంలోని గాంధీచౌక్ వద్ద తన స్కూటీని పార్కింగ్‌లో చేశాడు. డిక్కీలో ఉన్న రూ.36వేల నగదును గుర్తుతెలియని వ్యక్తి అపహరించాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ రవీందర్ ఆధ్వర్యంలో బ్లూకోల్ట్స్ కానిస్టేబుళ్లు తిరుపతి, సాగర్ చోరీ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి సీసీ కెమెరాల ఆధారంగా దొంగను గుర్తించారు. అతని వద్ద నుంచి రూ.36 వేల నగదు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ రవీందర్, ఎస్సై అంజయ్య, బ్లూకోర్ట్ కానిస్టేబుల్ సాగర్, తిరుపతిని ఎస్పీ డీవీ. శ్రీనివాస్‌రావు, సబ్ డివిజన్ ఏఎస్పీ చిత్తరంజన్ అభినందించారు. -
పెళ్లి ఘడియలు
● మూడు నెలలపాటు శుభ ముహూర్తాలు దండేపల్లి(మంచిర్యాల): ముహూర్తాల కోసం వేచి చూస్తున్న వారికి తీపి కబురు అందింది. మండు వేసవిలో శుభఘడియలు వచ్చాయి. ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో శుభ ముహూర్తాలు ఎక్కువగా ఉండటంతో తెలుగింట ‘రారండోయ్..వేడుక చేద్దాం’ అంటున్నారు. వరుసగా మంచిరోజులు రావడంతో పెళ్లి మండపాలు, బ్యాండ్ మేళాలకు డిమాండ్ ఏర్పడింది. పురోహితులు, వంట మనుషులు, వీడియో గ్రాఫర్లకు, ఆర్డర్లు తలుపు తడుతున్నాయి. ముహూర్తాలు ఇవే.. ఏప్రిల్‌లో 16, 18, 20, 23, 30 తేదీల్లో, మే నెలలో 1, 4, 8, 9, 10, 11, 14, 16, 18, 21, 23, 28, 30, 31 తేదీల్లో, జూన్ నెలలో 2, 4, 5, 6, 7, 8 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయని వేదపండితులు చెబుతున్నారు. జూన్ 11 నుంచి జూలై 12 వరకు మూఢం రావడంతో ముహూర్తాలకు కొంత విరామం వచ్చింది. తిరిగి మళ్లీ శ్రావణ మాసంలో మంచి ముహూర్తాలు మొదలు కానున్నాయి. ఏది ఏమైనా ఈ ఏడాది విశ్వావసు నామ సంవత్సరంలో శుభముహూర్తాలు ఎక్కువగా ఉండడంతో పెళ్లిళ్లు కూడా ఎక్కువగానే జరుగనున్నాయి. మూణ్నెళ్లు శుభఘడియలు మూడు నెలలపాటు ముహూర్తాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు జరుపుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా ఈ నెల 30న అక్షయ తృతీయ రావడంతో ఆరోజు దివ్యమైన ముహూర్తం ఉంది. నిశ్ఛయ తాంబూలాలు పుచ్చుకున్నవారు వేడుకలకు సిద్ధమవుతున్నారు. – గొల్లపెల్లి రామానందాచార్య స్వామి, వేదపండితులు -
జీవాల పెంపకానికి చేయూత
● ఎన్ఎల్ఎం ద్వారా రుణాలు ● యూనిట్‌కు 50 శాతం సబ్సిడీ ● గరిష్టంగా రూ.50 లక్షల వరకు మంజూరు యూనిట్ సబ్సిడీ లక్ష్మణచాంద(నిర్మల్): దేశంలో పెరుగుతున్న జనా భాకు అనుగుణంగా మాంసం ఉత్పత్తులు పెంచా లని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. మాంసానికి ఉ న్న డిమాండ్ దృష్ట్యా జీవాల పెంపకాన్ని ప్రోత్సహి ంచాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా గొర్రెలు, మేకల పెంపకానికి నేషనల్ లైవ్‌స్టాక్ మిష న్ స్కీం(ఎన్ఎల్ఎం) ద్వారా ఔత్సాహికులకు సబ్సి డీ రుణాలు అందిస్తోంది. 2021–22లో ప్రారంభించిన ఈ పథకాన్ని రాష్ట్ర పశుసంవర్థక శాఖ అమలు చేస్తోంది. ఈ పథకం కింద పెంపకందారులకు ఒక్కో యూనిట్‌కు 50 శాతం సబ్సిడీ ఇస్తున్నట్లు జిల్లా పశు వైద్యాధికారులు పేర్కొంటున్నారు. యూనిట్ మంజూరైనప్పటి నుంచి పూర్తిస్థాయిలో సబ్సిడీ నిధులు విడుదలయ్యే వరకు రాష్ట్ర పశుసంవర్థక శాఖ పర్యవేక్షిస్తుందని అధికారులు తెలిపారు. గరిష్టంగా యూనిట్‌కు రూ.50 లక్షల వరకు రుణం అందించనున్నారు. ఈ రుణం డబ్బులను రెండు విడతలుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. దరఖాస్తు ఇలా.. గొర్రెలు,మేకల యూనిట్ల పెంపకం రుణం మంజూరు కోసం www. nim. udyamimitra. in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి. ఈ రుణాలు పొందడానికి దరఖాస్తు చేయడానికి ఎలాంటి ఫీజులు చెల్లించనవసరం లేదని అధికారులు అంటున్నారు. రుణం మంజూరుకు దరఖాస్తు చేస్తున్న ఉత్సాహవంతులు తమ పాన్, ఆధార్ కార్డు, అడ్రస్ ఫ్రూఫ్, పాస్‌ఫొటో, రుణం తీసుకునే బ్యాంకు స్టేట్మెంట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. అర్హతలు 1. కనీసం ఐదెకరాల వ్యవసాయ భూమిని కలిగి ఉండాలి. ఇతరులదైనా లీజుకు తీసుకోవాలి. 2. పశు పోషణలో తగిన అనుభవం ఉండాలి. 3. యూనిట్ మంజూరు కోసం బ్యాంక్ కాన్సెంట్ తీసుకోవాలి.(గొర్రెలు,పొట్టేళ్లు) (రూ.లక్షల్లో) 500–25 50 400–40 40 300–15 30 200–10 20 100–05 10 పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ పథకాన్ని గొర్రెలు, మేకల పెంపకంపై ఆసక్తి ఉన్న యువత సద్వినియోగం చేసుకోవాలి. ఈ దరఖాస్తు చేసుకుని యూనిట్ పొంది ఉపాధితో ఆర్థికంగా ఎదగాలని పేర్కొన్నారు. వివరాల కోసం జిల్లా కార్యాలయంలో సంప్రదించాలి. – ఎండీ బాలిగ్ అహ్మద్, జిల్లా పశువైద్యాధికారి, నిర్మల్ -
గుండెపోటుతో సింగరేణి అధికారి మృతి
శ్రీరాంపూర్: శ్రీరాంపూర్ ఏరియా జీఎం కార్యాలయంలోని ఐఈడీ విభాగం డీజీఎం కే.చిరంజీవులు గుండెపోటుతో మృతిచెందారు. సోమవారం సాయంత్రం ఇల్లందు క్లబ్లో షటిల్ ఆడి ఇంటికి వెళ్లి భోజనం చేసిన తర్వాత ఒక్కసారిగా సోఫాలో కుప్పకూలిపోయారు. తీవ్ర చెమటలు వచ్చిన ఆయనను భార్య జ్యోతి రామకృష్ణాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి కుటుంబ సభ్యులను ఏరియా జీఎం ఎం.శ్రీనివాస్, ఎస్ఓటు జీఎం సత్యనారాయణ, డీజీఎం(పర్సనల్) అరవిందరావు పరామర్శించారు. మంగళవారం ఉదయం మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం ఆయన స్వస్థలం శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండల ప్రాంతానికి తీసుకెళ్లారు. చిరంజీవికి భార్య జ్యోతి, కుమారుడు వినీత్, రోహిత్ ఉన్నారు. వినీత్ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండగా, రోహిత్ జార్జీయ దేశంలో వైద్య విద్య అభ్యసిస్తున్నారు. నిత్యం షటిల్ ఆటతోపాటు ఎంతో ఫిట్‌గా ఉండే చిరంజీవులు గుండెపోటుతో మృతిచెందడం అధికారులు, కార్మికుల్లో తీవ్ర విషాదం నింపింది. -
500 దేశీదారు సీసాలు స్వాధీనం
ఆదిలాబాద్‌టౌన్: ఆదిలాబాద్‌రూరల్ మండలంలోని భీంసరిలో 90 ఎంఎల్ పరిమాణంలో ఉన్న 500 దేశీదారు సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ రేండ్ల విజేందర్ తెలిపా రు. మంగళవారం ఎకై ్సజ్ సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భీంసరి గ్రామానికి చెందిన అలిశెట్టి అభిలాష్ మహారాష్ట్రలోని చనాక నుంచి ద్విచక్ర వాహనంపై దేశీదారు తీసుకువస్తుండగా పట్టుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. మద్యం విలువ రూ.18వేలు ఉంటుందన్నారు. ఎవరైనా దేశీదారు, నాటుసారా విక్రయిస్తే రూ.లక్ష జరిమానాతో పాటు పీడీయాక్ట్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని ఆదర్శ బాలికల క్రీడా పాఠశాలలో మంగళవారం నిర్వహించిన 54వ సీనియర్ మహిళా హ్యాండ్‌బాల్ పోటీల్లో 20 మంది క్రీడాకారులు రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రమేశ్ తెలిపారు. ఉమ్మడి జిల్లా నుంచి మొత్తం 80 మంది మహిళా క్రీడాకారులు పోటీల్లో పాల్గొనగా 20 మంది ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారన్నారు. ఈ నెల 18 నుంచి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ నెల 28 నుంచి 30 వరకు మంచిర్యాల జిల్లాలోని మందమర్రిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో డీఎస్వో మీనారెడ్డి, ఏసీఎంవో ఉద్దవ్, హ్యాండ్‌బాల్ కోచ్ అరవింద్, పీడీ, పీఈటీలు రవి, రాకేష్, తదితరులు పాల్గొన్నారు. వండర్ బుక్ ఆఫ్ రికార్డులో చోటుమంచిర్యాలటౌన్: పట్టణంలోని హైటెక్ సిటీ కాలనీకి చెందిన నామని రమేశ్ కుమార్, మౌనిక దంపతుల కుమారుడు రామ్ అక్షరేష్ 8 నిమిషాల్లో 300ల పదాలను పఠించడం ద్వారా వండర్ బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు దక్కించుకున్నాడు. ఎల్కేజీ చదువుతున్న రామ్ అక్షరేష్ తెలుగు సంవత్సరాలు, నెలలు, తిథులు, రాష్ట్ర రాజధానులు, జాతీయ చిహ్నాలు, గ్రహాలు, ఆవిష్కరణలు, చారిత్రాత్మక కట్టడాలతో సహా 300ల వరకు 8 నిమిషాల్లోనే పఠించడం ద్వారా రికార్డు సృష్టించారు. వండర్ బుక్ ఆఫ్ రికార్డు భారత దేశ ప్రతినిధి బింగి నరేంద్ర గౌడ్, తెలంగాణ కోఆర్డినేటర్లు డాక్టర్ వేణుకుమార్, కే.రవికుమార్ చిన్నారికి మెమొంటో అందజేశారు. -
దైవదర్శనానికి వెళ్లివస్తూ తిరిగిరాని లోకాలకు..
● రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి, కుమారుడికి గాయాలు దిలావర్పూర్(నిర్మల్): దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి చెందగా కుమారుడికి తీవ్రగాయాలయ్యాయి. ఎస్సై ఎల్.సందీప్ తెలిపిన వివరాల మేరకు మహారాష్ట్రలోని హిమాయత్‌నగర్‌కు చెందిన దిద్దోలి రాజు (45) కుటుంబం నర్సాపూర్(జి) మండలంలోని అర్లి వద్ద ఇటుకబట్టీల్లో పనిచేస్తున్నారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం అడెల్లి మహా పోచమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు మంగళవారం తెల్లవారు జామున రాజు భార్య, ఇద్దరు పిల్లలు ఆటోలో పంపించారు. రాజు, అతని కుమారుడు కేదార్‌నాథ్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. తిరుగుప్రయాణంలో దిలావర్పూర్ మండలంలోని సిర్గాపూర్ సమీపంలో ఎదురుగా అతి వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం బైక్‌ను బలంగా ఢీకొట్టడంతో రాజు అక్కడికక్కడే మృతి చెందగా కేదార్‌నాథ్‌కు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై సందీప్ ఘటనా స్థలానికి చేరుకుని కేదార్‌నాథ్‌ను ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వాహనంలో తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు. -
ప్రజాపాలన తీసుకొచ్చాం
మంచిర్యాలటౌన్: అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు ప్రజాపాలన తీసుకొచ్చామని, ఎన్నికలకు ముందు, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయనకు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఘన స్వాగతం పలికారు. అనంతరం మంచిర్యాలలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఐబీ ఆవరణలో మాతాశిశు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణ పనులను పరిశీలించారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా కేక్ కట్ చేశారు. ఐబీ నుంచి ఆర్పీ రోడ్డు మీదుగా ముఖరం చౌరస్తా, అర్చన టెక్స్ చౌరస్తాల మీదుగా జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానం వరకు పాదయాత్రగా వచ్చి బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ తాను మార్చి 16, 2023లో పీపుల్స్ మార్చ్‌లో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో పాదయాత్ర ప్రారంభించానని, అదే ఏడాది ఏప్రిల్ 14న మంచిర్యాలలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేను పిలిపించామని తెలిపారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఏంటో తెలిసిందని, మొదటి నుంచి పార్టీకి అండగా ప్రేమ్‌సాగర్‌రావు నిలిచారని, ఆయనకు కార్యకర్తలు తోడుగా నిలుస్తున్నారని అన్నారు. పాదయాత్ర సమయంలో మంచిర్యాలలోని మాతాశిశు ఆసుపత్రిని గోదావరి ఒడ్డున కట్టవద్దని చెప్పినా వినకపోవడంతో అక్కడే నిర్మించడం వల్ల వరదల్లో మునిగి పోయిందని తెలిపారు. నాడే ప్రజలకు అందుబాటులో ఉండేలా ఎంసీహెచ్ నిర్మిస్తామని ఇచ్చిన హామీ ప్రకారం ఐబీ ఆవరణలో నిర్మిస్తున్నట్లు చెప్పారు. గోదావరి నది వరదతో రాళ్లవాగు ఉప్పొంగి ఈ ప్రాంతం మునిగిపోతుందని, కరకట్ట నిర్మించాలని నాడు ప్రజలు కోరారని, వారి కోరిక మేరకు కరకట్టను నిర్మిస్తున్నామని అన్నారు. తన నియోజకవర్గం మధిర అంటే తనకెంత ఇష్టమో మంచిర్యాల నియోజకవర్గమన్నా అంతే ఇష్టమని, ఇక్కడి కార్యకర్తలు పార్టీ కోసం కష్టపడి పని చేస్తారని ప్రశంసించారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించి సాగు, తాగునీరు అందిస్తామని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అర్ధంతరంగా నిలిపి వేసిన ప్రాజెక్టును ప్రారంభించి పూర్తి చేస్తామన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో రూ.765 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం అభినందనీయమని అన్నారు. ఎన్నికల హామీలు నెరవేరుస్తున్నాం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంచిర్యాల నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి
ప్రతీయేటా 3,500 మందికి ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. వేలాది మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో అర్హులు చాలామంది ఉన్నారు. నాలుగేళ్లకు సరిపడా అర్హులను గుర్తించి, వారిలో అత్యంత పేద వారికి ఏడాది చొప్పున ఇళ్లను మంజూరు చేస్తుండాలి. రాజీవ్ యువ వికాస్ కోసం నిరుద్యోగులు వేలాదిగా దరఖాస్తు చేస్తున్నారు. నియోజకవర్గంలోని 10 వేల మందికి వెంటనే మంజూరు చేయాలి. అధికారంలో లేకపోయినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అండగా నిలిచారు. ప్రజలు సహకరించడంతోనే నేను ఎమ్మెల్యేగా గెలుపొందాను. కన్నతల్లి రుణం తీర్చుకోలేనిది.. ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకునేందుకు ఎంత దూరమైనా వెళ్లి అభివృద్ధి పనులు చేస్తాను. 76 ఏళ్లుగా ఉమ్మడి జల్లాకు అన్యాయం జరగింది. ఆదివాసీల గొంతుకగా మారిన నన్ను పార్టీ విస్మరించదని భావిస్తున్నాను. – కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, మంచిర్యాల ఎమ్మెల్యే -
కాంగ్రెస్‌కు పట్టేదారులం
● ప్రేమ్‌సాగర్‌రావు విమర్శలు తగదు ● వివేక్ మంత్రి పదవి ఆశించడంలో తప్పులేదు ● బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ బెల్లంపల్లి: ‘మాది కాక కుటుంబం.. కాంగ్రెస్‌కు పట్టేదారులం.. మా కుటుంబం నిన్నామొన్న రాజకీయాల్లోకి రాలేదు.. డైబ్బె ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్నాం.. ఇందిరాగాంధీని జైలు నుంచి మా నాన్న వెంకటస్వామి బయటకు తెచ్చారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి భవనాన్ని ఇచ్చింది మా కుటుంబమే. రాజకీయాల్లో అంతటి చరిత్ర కలిగిన మా కుటుంబంపై ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు విమర్శలు చేయడం తగదు..’ అని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వ్యాఖ్యానించారు. సోమవారం రాత్రి ఏఎంసీ ఏరియాలోని క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుపై తామెప్పుడు ఎలాంటి ఆరోపణలు చేయలేదని, ఆయనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నది కూడా ఏమీ లేదని స్పష్టం చేశారు. అధిష్టానాన్ని ఒప్పించి 2006–07లో ప్రేమ్‌సాగర్‌రావుకు ఎమ్మెల్సీ ఇప్పించిన ఘనత తమదని అన్నారు. మంత్రి పదవి ఇచ్చేది కాంగ్రెస్ అధిష్టానమని, తమ చేతుల్లో ఏముంటుందని ప్రశ్నించారు. తెలంగాణ కోసం కొట్లాడిన ఘనత తమ కుటుంబానికి దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తమ కుటుంబం గురించి కాంగ్రెస్ పార్టీకి పట్టెదారులుగా ప్రకటించిన సంగతి తెలిసిందేనన్నారు. సీనియర్ ఎమ్మెల్యేగా మంత్రి పదవి కావాలని తాము కోరుకోవడంలో తప్పు లేదన్నారు. తమ తమ్ముడు కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారని, అందులో తప్పేముందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మత్తమారి సూరిబాబు, ముచ్చర్ల మల్లయ్య, కంకటి శ్రీనివాస్, సింగతి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
రూ.765 కోట్ల అభివృద్ధి పనులు
మంచిర్యాలటౌన్: మంచిర్యాల నియోజకవర్గంలో చేపట్టిన, చేపట్టబోయే రూ.765 కోట్ల అభివృద్ధి పనులకు సంబంధించిన 22 శిలాఫలకాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి మంచిర్యాలలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో సోమవారం ఆవిష్కరించారు. రూ.256 కోట్లతో కార్మెల్ పాఠశాల నుంచి గోదావరి వరకు రాళ్లవాగుకు కరకట్ట నిర్మాణానికి శంకుస్థాపన, రూ.195 కోట్లతో రోడ్లు భవనాల శాఖ పరిధిలో 4 పనులు, మున్సిపల్ శాఖలో రూ.30 కోట్లతో పనులు, ఎన్పీడీసీఎల్ శాఖ పరిధిలో రూ.32 కోట్లతో 4 పనులు, పంచాయతీరాజ్ పరిధిలో దాదాపుగా రూ.17 కోట్లతో 2 పనులు, టీజీఈడబ్ల్యూఐడీసీ పరిధిలోని 31 పాఠశాలల్లో రూ.12.50 కోట్లతో పనులు, గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో రూ.13 కోట్లతో, సింగరేణి పరిధిలో రూ.12 కోట్లతో 2 పనుల శిలాఫలకాలను డిప్యూటీ సీఎం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, సింగరేణి సీఎండీ బలరాంనాయక్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అటవీశాఖ, రోడ్లు భవనాల శాఖ అధికారులు, పంచాయతీరాజ్, విద్యుత్ శాఖ, మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
‘అంబేడ్కర్ రాజ్యాంగంతోనే సంక్షేమ ఫలాలు’
మంచిర్యాలటౌన్: డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ ర చించిన రాజ్యాంగం వల్లనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, బడుగు బలహీ న వర్గాల కోసం ఆయన చేసిన సేవలు మరువలేనివని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ అన్నారు. సోమవారం పట్ట ణంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి వేడుకలను పార్టీ జిల్లా మాజీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లితో కలిసి ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించా రు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు అమిరిశెట్టి రాజ్‌కుమార్, నాయకులు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గాజుల ముఖేశ్‌గౌడ్, పెద్దపల్లి పురుషోత్తం, బోయిని హరికృష్ణ, పురుషోత్తం జాజు, బియ్యాల సతీశ్‌రావు, ఎనగందుల కృష్ణమూర్తి, రాపర్తి వెంకటేశ్వర్లు, నాగుల రాజన్న, జోగుల శ్రీదేవి పాల్గొన్నారు. -
నేటి నుంచి యుడైస్ ప్లస్‌పై సర్వే
మంచిర్యాలఅర్బన్: యుడైస్ ప్లస్‌లో నమోదు చేసిన మేరకు పాఠశాలల్లో విద్యార్థులున్నారా..? ఎక్కువ మందిని అంకెల్లో చూపుతున్నారా..? అనే అంశాలపై మంగళవారం నుంచి సర్వే కొనసాగనుంది. ఈ నెల 21 వరకు 708 పాఠశాలల్లో డీఈడీ, బీఈడీ విద్యార్థులు 70 మంది క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. ఒక్కో విద్యార్థి రోజుకు రెండు చొప్పున 10 పాఠశాలలను క్షేత్రస్థాయి తనిఖీ చేస్తారు. పాఠశాలల్లోని వాస్తవ పరిస్థితుల వివరాలన్ని యుడైఎస్లో ప్రధానోపాధ్యాయులు నమో దు చేశారా..? విద్యార్థుల సంఖ్య, సౌకర్యాలు ఏ మేరకు ఉన్నాయనేది రిపోర్టులో నమోదు చేసిన వివరాల ద్వారా క్షేత్రస్థాయి పరిశీలన చేసి ధ్రువీకరిస్తారు. తప్పులుంటే సరిచేయాలని హెచ్ఎంలకు రిమార్క్ రాసి ఇవ్వనున్నారు. యుడైఎస్లో నమోదు చేసే వివరాల ఆధారంగా పాఠశాలలకు బడ్జెట్ కేటాయిస్తుంటారు. స్థానిక ఎస్‌ఆర్‌కేఎం డైట్ కళాశాలలో సోమవారం యుడైఎస్ ప్లస్ సర్వే నిర్వహణపై మంచిర్యాల ఎస్‌ఆర్‌కేఎం డైట్ కళాశాల నుంచి 40 మంది విద్యార్థులు, కుమురంభీం ఆసిఫాబాద్ డైట్ కళాశాల నుంచి 30 విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. పలు అంశాలపై నిర్వహించే సర్వేపై సెక్టోరల్ అధికారి శ్రీనివాస్, ఏఎస్సీ రాజ్‌కుమార్ శిక్షణ ఇచ్చారు. -
అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన ఉండాలి
మంచిర్యాలక్రైం: అగ్ని ప్రమాదాల నివారణపై అందరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఈ నెల 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకుని సోమవారం కలెక్టర్ తన చాంబర్లో జిల్లా అగ్నిమాపక అధికారి భగవాన్‌రెడ్డితో కలిసి వాల్‌పోస్టర్లు, కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించి సురక్షిత భారతాన్ని నిర్మాద్దామని అన్నారు. రోజువారీగా వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. -
ఆలయాల్లో చోరీ నిందితుల అరెస్ట్
ఖానాపూర్: పట్టణంలోని కుమురంభీం చౌరస్తాలో గల శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంతో పాటు తర్లపాడ్లోని అగ్గి మల్లన్న ఆలయాల్లో ఇటీవల చోరీకి పాల్పడిన నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ సీహెచ్ అజయ్ కుమార్, ఎస్సై రాహుల్ గైక్వాడ్ తెలిపారు. సోమవారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. పెద్దపల్లి పట్టణంలోని సుభాష్‌నగర్‌కు చెందిన మనుపటి రాజుతో పాటు చందపెల్లికి చెందిన బొజ్జ రాజశేఖర్ ఈ నెల 9న రాత్రి ఆలయాల్లో చోరీకి పాల్పడ్డారన్నారు. నిందితులను అరెస్ట్ చేసి వారివద్ద నుంచి 500 గ్రాముల వెండితో పాటు 4 గ్రాముల బంగారం, రూ.9వేల నగదు, టీవీఎస్ ఎక్సెల్ ద్విచక్ర వాహనం, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులకు గాయాలు
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని ఏసీసీ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు మందమర్రి మండలం బీజోన్‌కు చెందిన లగిషెట్టి తిరుపతి, స్వప్న దంపతులు, కూతురు ఆధ్య, కుమారుడు యశ్వంత్ సోమవారం బైక్‌పై బీజోన్ నుండి మంచిర్యాలకు బయలుదేరారు. ఏసీసీ సమీపంలో ఆర్టీసీ బస్సును ఓవర్ టేక్ చేస్తుండగా ప్రమాదవశాత్తు బైక్ కిందపడడంతో ఆద్య కాలు విరగగా యశ్వంత్‌కు స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించడంతో చిన్నారులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. ఈ విషయమై స్థానిక పోలీసులను వివరణ కోరగా ఘటనపై ఫిర్యాదు రాలేదన్నారు. -
బీసీ, ఎస్సీ, ఎస్టీలు రాజ్యాధికారం సాధించాలి
ఆదిలాబాద్‌రూరల్: తెలంగాణ గడ్డమీద బీసీ, ఎస్సీ, ఎస్టీలు రాజ్యాధికారం సాధించి రెడ్డి, వెల్మలను అధికారంలోంచి దింపడమే అంబేడ్కర్‌కు ఇచ్చే జన్మదిన కానుక అని బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహరాజ్ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ మైదానంలో లక్ష కిలోమీటర్ల మాభూమి రథయాత్ర ప్రారంభ సభలో మాట్లాడారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్పెషల్ స్టేటస్ ఫర్ తెలంగాణ ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ లక్ష్యమని పేర్కొన్నారు. తెలంగాణలో రా జ్యాధికారం సాధించేందుకు మహాశక్తిగా అవతరి స్తామన్నారు. రాజ్యాంగ హక్కులన్నీ సాధిస్తామన్నా రు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీని బలోపేతం చేద్దామన్నారు. లక్ష కిలో మీటర్ల మా భూమి రథయాత్ర తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాలు 670కి పైగా మండలాలు 12వేల గ్రామాల్లో మూడు సంవత్సరాల మూడు నెలలపా టు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ రామయ్య యాదవ్, కుమారస్వామి, డీఎస్పీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు గణేశ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిక్కా ల దత్తు, కలాల శ్రీనివాస్ పాల్గొన్నారు.● బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహరాజ్ -
నలుగురు దేశీదారు విక్రేతల అరెస్ట్
తాంసి: భీంపూర్ మండలం అర్లి(టి) పంచాయతీ పరిధిలోని మందపల్లిలో నలుగురు దేశీదారు విక్రేతలను అరెస్టు చేసినట్లు జైనథ్ సీఐ సాయినాథ్ తెలిపారు. సోమవారం మహారాష్ట్రలోని మాండ్వి నుంచి దేశీదారు తీసుకువస్తుండగా తమకు అందిన సమాచారం మేరకు గ్రామశివారులో పట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. గ్రామానికి చెందిన ఆత్రం లక్ష్మణ్, ఆశీష్ జైస్వాల్, కుంభేకర్ ప్రభాకర్, ఆత్రం కృష్ణను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 90 ఎమ్ఎల్ బాటిళ్లు 196 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మద్యం బాటిళ్లను సీజ్ చేసి నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ తెలి పారు. సమావేశంలో ఏఎస్సై ముంతాజ్, సిరాజ్, సిబ్బంది దినేశ్, మధుకర్, రవీందర్ పాల్గొన్నారు. -
పిప్రిలో ఉద్రిక్తత
బజార్హత్నూర్(బోథ్): మండలంలోని పిప్రిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అంబేడ్కర్ అభిమాన సంఘం నాయకులు గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా కట్టిన పంచశీల జెండాలను రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తొలగించి డ్రెయినేజీలో పడివేశారు. విషయం తెలుసుకున్న అంబేడ్కర్ వాదులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న బోథ్ సీఐ వెంకటేశ్వర్రావు సంఘటన స్థలానికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, నేరం రుజువైతే నిందితులు ఎంతటివారైనా కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు. ఏఎస్సై లింబాజీ ఆధ్వర్యంలో గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం సీఐ వెంకటేశ్వర్రావు గ్రామస్తులతో కలిసి అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. -
రెక్కల కష్టం అగ్గిపాలు..
● అమ్ముకుందామనుకునేలోపే అగ్నిప్రమాదం ● బోరిగాంలో మూడు, మహాగాంలో రెండెకరాల్లో పంట దగ్ధం భైంసారూరల్(ముధోల్): చేతికి అందివచ్చిన మొక్కజొన్న పంటను అమ్ముకుందామనుకున్న ఆ రైతుల ఆశలు ఆవిరయ్యాయి. ప్రమాదవశాత్తు నిప్పంటుకోవడంతో అంతా చూస్తుండగానే మండలంలోని బోరిగాంలో మూడెకరాలు, మహాగాంలో రెండెకరాల్లో పంట కాలి బూడిదయ్యింది. ట్రాన్స్ఫార్మర్ వద్ద మంటలు రావడంతో... బోరిగాంకు చెందిన లఖన్పటేల్ మూడెకరాల్లో మొక్కజొన్న పంట వేశాడు. ఇటీవల పంటను కోసి కుప్పగా వేశాడు. రెండు రోజులు వర్షాలు ఉండడంతో ఆగిపోయాడు. సోమవారం మధ్యాహ్నం హార్వెస్టార్తో పంటను నూర్పిడి చేయిద్దామని బయటకు వెళ్లాడు. పంట చేనులో ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్ద సాంకేతిక లోపంతో మంటలు చెలరేగి మొక్కజొన్న చేనుకు అంటుకుంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో అరగంటలోనే మంటలు వ్యాపించాయి. అంతా చూస్తుండగానే పంట కాలిబూడిదైంది. 120 క్వింటాళ్ల మొక్కజొన్న కళ్లముందే కాలుతుంటే రైతు కుటుంబ సభ్యులు కన్నీటి పర్యాంతమయ్యారు. సుమారు రూ.2.50 లక్షల నష్టం జరిగిందని బాధిత రైతు వాపోయాడు. పక్క చేనులో మంటలు వచ్చి... మహాగాంకు చెందిన కారగిరి సాయినాథ్ రెండెకరాలు కౌలుకు తీసుకుని మొక్కజొన్న వేశాడు. సోమవారం హార్వెస్టార్తో పంట నూర్పిడి చేయించేందుకు సిద్ధమయ్యాడు. పక్క చేనులో పంట వ్యర్థాలకు నిప్పుపెట్టడంతో మంటలు వ్యాపించి చూస్తుండగానే రెండెకరాల మొక్కజొన్న పంట కాలిబూడిదైంది. సుమారు రూ.1.70 లక్షల నష్టం జరిగిందని రైతు వాపోయాడు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి. -
శుభకార్యానికి వచ్చి మృత్యుఒడికి..
● కారు బోల్తాపడి ఒకరు మృతిభైంసాటౌన్(ముధోల్): శుభకార్యం నిమిత్తం భైంసాకు వచ్చి తిరిగి వెళ్తుండగా కారు అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో నిర్మల్ మండలం లంగ్డాపూర్కు చెందిన సుమన్ (34) అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు, మృతుని బంధువుల కథనం ప్రకారం.. నిర్మల్‌లో ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న సుమన్ ఆదివారం భైంసాలోని నేతాజీనగర్‌లో ఓ శుభకార్యం నిమిత్తం తన అల్లుడు సాయిచరణ్‌తో కలిసి కారులో వచ్చారు. సోమవారం పార్డి(బి) బైపాస్ మీదుగా నిర్మల్‌వైపు తిరిగి వెళ్తున్న క్రమంలో మూలమలుపు వద్ద కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో సుమన్ అక్కడికక్కడే మృతి చెందగా గాయాలపాలైన సాయిచరణ్‌ను అంబులెన్స్‌లో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో నిర్మల్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనాస్థలిని సీఐ గోపినాథ్, ఎస్సై ఎండీ గౌసుద్దీన్ పరిశీలించారు. -
అటకెక్కిన అమరుల సంక్షేమం
ఇంద్రవెల్లి(ఖానాపూర్): ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని అమరవీరుల స్తూపం వద్ద 2021 ఆగస్టు 9న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దళిత..గిరిజ న దండోర సభ ఏర్పాటు చేశారు. అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్‌రెడ్డి హాజరుకాగా సభ సక్సెస్ కావడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి మరింతా ఉత్సాహం తీసుకొచ్చింది. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఆదివాసీలపై కాల్పులు జరిగాయని, తెలంగాణలో అధికారంలోకి రాగానే ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపాన్ని స్మృతి వనంగా తీర్చిదిద్ది పర్యాటక కేంద్రంగా గుర్తింపు తీసుకురావడంతో పాటు అమరుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 2024లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలతో అధికారులు ముత్నూర్ గ్రామ సమీపంలో గల ప్రభుత్వ భూమిలో ఇళ్ల స్థలాలు కేటాయించి లేఅవుట్ వేశారు. 2024 ఫిబ్రవరి 2న తొలిసారిగా ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్దకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్మృతివనం పనులకు భూమిపూజ చేసి పనులు ప్రారంభించడంతో పాటు ఇళ్లస్థలాలకు హక్కుపత్రాలు పంపిణీ చేశారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ప్రభుత్వం ఏర్పాటై 16 నెలలు పూర్తికావచ్చినా ఇప్పటికీ పనులు ముందుకు సాగడంలేదు. కేవలం లేఅవుట్ వేసి విద్యుత్ స్తంభాలు వేసిన అధికారులు ఇళ్ల నిర్మాణం మర్చిపోయారని అమరుల కుటుంబాలు, ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరుతున్నారు. హక్కు పత్రాలు ఇచ్చారు.. ఇళ్ల నిర్మాణం మరిచారు ఇళ్ల స్థలాలు స్వయంగా అందించిన సీఎం ఏడాదైనా ఇళ్ల నిర్మాణం మొదలు పెట్టని వైనం.. లబ్ధిదారులకు తప్పని నిరీక్షణ భూమి కోసం...భుక్తి కోసం...హక్కుల సాధనకోసం చేసిన పోరాటంలో 1981 ఏప్రిల్ 20న ఇంద్రవెల్లిలో జరిగిన పోలీసు కాల్పుల్లో అమరులైన 15 మంది ఆదివాసీల కుటుంబ సభ్యులకు న్యాయం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత కల్పించింది. గతేడాది ముఖ్యమంత్రి హోదాలో ఇంద్రవెల్లికి వచ్చిన రేవంత్‌రెడ్డి అమరుల కుటుంబ సభ్యులకు ఇళ్లస్థలాలకు సంబంధించిన హక్కుపత్రాలు పంపిణీ చేసి ఇళ్ల నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. కానీ పాలకులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికీ పనులు ముందుకు సాగడంలేదు. -
ట్రాక్టర్ ఢీకొని ఒకరికి గాయాలు
ఉట్నూర్‌రూరల్: మండలంలోని పులిమడుగు వద్ద ఆటో, ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. ఇంద్రవెల్లి మండలంలోని నందునాయక్ తండాకు చెందిన ఆటో డ్రైవర్ గోతి గణేశ్ సోమవారం ఉట్నూర్ వైపు నుంచి ఇంద్రవెల్లికి వెళ్తుండగా పులిమడుగు గ్రామం వద్ద ట్రాక్టర్ ఢీ కొట్టింది. గణేశ్‌కు తీవ్రగాయాలు కావడంతో గమనించిన స్థానికులు ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్పై రాములు తెలిపారు. -
ఆర్జీయూకేటీలో అంబేడ్కర్ జయంతి వేడుకలు
బాసర(ముధోల్): బాసర ఆర్జీయూకేటీలో బాబాసాహెబ్ అంబేడ్కర్ 134వ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీదర్షన్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వీసీ గోవర్ధన్ మాట్లాడుతూ విద్య, సమానత్వం, న్యాయ పరిరక్షణ రంగాల్లో అంబేడ్కర్ మార్గదర్శకతను గుర్తు చేశారు. విద్యే మార్పుకు మూలం అనే ఆయన అభిప్రాయం నేడు అందరినీ ప్రేరేపిస్తోందన్నారు. అంబేడ్కర్ స్ఫూర్తితో విశ్వవిద్యాలయంలో మహనీయుల పుస్తకాలను లైబ్రరీగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో విద్యార్థుల్లో పుస్తక పఠనంతో పాటు జ్ఞానాన్ని సముపార్జించడానికి వేదిక అవుతుందన్నారు. పుస్తకం జీవితాన్ని మార్చే ఆయుధమని చెప్పిన అంబేడ్కర్ ఆలోచన విధానాన్ని ఆచరణలో పెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ, పాటలు, స్కిట్, డాన్స్, కవిత్వం, పోస్టర్ ప్రజెంటేషన్, తదితర పోటీల్లో విజేతలకు సర్టిఫికెట్తో పాటు నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అసోసియేట్ డీన్లు డా.మహేష్, డా.విట్టల్, తదితరులు పాల్గొన్నారు. -
అధిష్టానానికి మళ్లీ తలనొప్పిగా మారిన పదవుల పంచాయితీ!
మంచిర్యాల: మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో తనకు మంత్రి పదవి రాకపోతే సహించేదే లేదని తేల్చిచెప్పారు. పదేళ్ల పాటు పార్టీని కాపాడుకుంటే ఇదేనా తమకిచ్చే గౌరవం అంటూ అధిష్టానాన్ని ప్రశ్నించారు. వేరే పార్టీలు తిరిగొచ్చిన వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చి, పార్టీలో ఉండి పార్టీని కాపాడుకున్న తమలాంటి వాళ్లకు పదవులు ఇవ్వకపోతే మాత్రం సహించే ప్రసక్తే లేదన్నారు. ఇంద్రవెల్లి సభతో పార్టీకి ఊపిరిపోశానని ఆయన చెప్పుకొచ్చారు.వేరే పార్టీలు తిరిగొచ్చిన వాళ్లంటే..!వేరే పార్టీలు తిరిగొచ్చిన వాళ్లకి మంత్రి పదవులు ఇస్తారా అని ప్రేమ్ సాగర్ రావు ప్రశ్నించడం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యాఖ్యలు రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించే చేసినవే అంటూ విశ్లేషఖులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఒకానిక సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్లి అక్కడ చుక్కెదురు కావడంతో తిరికి సొంత గూటికే చేరిన రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి ప్రేమ్ సాగర్ వ్యాఖ్యానించినట్లు విశ్లేషిస్తున్నారు. ఇది కాంగ్రెస్ లో మరింత అలజడి రేపుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ లో సీనియర్ నేతలు ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు చేసుకోవడం ప్రతిపక్షాల పార్టీలు కౌంటర్లు వేయడానికి ఆస్కారం ఇచ్చినట్లయ్యింది. మంత్రి పదవుల పంచాయితీ మొదటికొచ్చిందా?తెలంగాణ క్యాబినెట్ విస్తరణపై ఇప్పటికే కసరత్తు పూర్తయినప్పటికీ తమకు పదవి కావాలంటే తమకు కావాలంటూ నేతలు నిరసన గళం వినిపిస్తున్నారు. తెలంగాణ క్యాబినెట్ రేసులో సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, వాకాటి శ్రీహరి, కోమటిరెడ్డి రాజగోపాల్, మల్ రెడ్డి రంగారెడ్డి, బాలు నాయక్ లు ఉన్నట్లు సమాచారం. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిపై కాస్త సస్సెన్స్ నెలకింది. కొన్ని రోజులుగా రాజగోపాల్ రెడ్డి తన స్వరాన్ని పెంచారు.తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. ప్రత్యేకంగా కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తనకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఒకే ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవులు ఎందుకని జానారెడ్డి అన్నట్లు వార్తలు రావడంతో రాజగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒకే ఇంట్లో ఇద్దరికి ఎందుకు పదవులు ఉండకూడదని ప్రశ్నించారు. తమ శక్తి సామర్థ్యాలను బట్టే మంత్రి పదవులు ఇవ్వడానికి అధిష్టానం మొగ్గిచూపుతోందని, ఇక్కడ కొంతమంది తమ పలుకుబడితో ఆ పదవిని రాకుండా అడ్డుకునేందుకు చూస్తున్నారని మండిపడ్డారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ కూడా పదవి ఇవ్వకపోతే అమీతుమీ తేల్చుకుంటాననే సంకేతాలు పంపడంతో అధిష్టానానికి మళ్లీ పదవుల పంచాయితీ తలనొప్పి షురూ అయ్యింది. తెలంగాణ క్యాబినెట్ విస్తరణ పంచాయితీ మళ్లీ మొదటికి రావడంతో అధిష్టానం మరోసారి చర్చలు జరిపే అవకాశాలు కూడా లేకపోలేదు. -
డిప్యూటీ సీఎం పర్యటనకు ఏర్పాట్లు
● పరిశీలించిన కలెక్టర్, ఎమ్మెల్యే మంచిర్యాలటౌన్: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సోమవారం జిల్లా పర్యటనకు రానున్నారు. ఈమేరకు ఏర్పాట్లు చేశామని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావుతో కలిసి జెడ్పీ బాలుర మైదానంలోని సభ ఏ ర్పాట్లను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఐబీ చౌరస్తాలో డాక్టర్ బీఆర్.అంబేద్కర్ విగ్రహావిష్కరణ, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనుల పరిశీలనతోపాటు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. డిప్యూటీ సీఎం వెంట రా ష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి, రాష్ట్ర సమాచార సాంకేతి క, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, ఇండస్ట్రీస్, కామ ర్స్, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు, రాష్ట్ర రవాణా, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర పంచా యతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫ రా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వ స్తారని వివరించారు. అనంతరం కాలేజీరోడ్డులో ని ర్మించిన మహాప్రస్థానం పనులను పరిశీలించి, ప్రా రంభానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్‌రావు, ము న్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శివాజీ, తహసీల్దార్ రఫతుల్లా పాల్గొన్నారు. -
కేంద్ర మంత్రికి రిటైర్డ్ కార్మికుల వినతి
శ్రీరాంపూర్: కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డికి సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నా యకులు వినతిపత్రం సమర్పించారు. హైదరాబాద్‌లో ఆదివారం మంత్రిని కలిశారు. సీఎంపీఎఫ్ శాఖ లో జరుగుతున్న లోపాలను వివరించారు. రిటైర్డ్ కార్మికులకు పెన్షన్ పెంపుదల చేయాలని కోరారు. రిటైర్డ్ కార్మికులు చాలీచాలని పెన్షన్‌తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్యక్రమంలో సింగరే ణి రిటైర్డ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.వా సుదేవరావు, ప్రధాన కార్యదర్శి జేవీ.దత్తాత్రేయులు, కోల్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కేఆర్సీ బాపురెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం.బాబురావు, ఉ ప ప్రధాన కార్యదర్శి ఆళవేందార్ వేణుమాదవ్, నా యకులు శ్రీధర్‌రావు, పులి రాజిరెడ్డి పాల్గొన్నారు. -
నేడు డిప్యూటీ సీఎం, మంత్రుల రాక
మంచిర్యాలటౌన్: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్ సోమవా రం జిల్లాలో పర్యటించనున్నారని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖతో కలిసి ఆదివారం మాట్లాడారు. ఉదయం 11 గంటలకు డిప్యూటీ సీఎం హెలికాప్టర్లో మంచిర్యాల చేరుకుంటారని తెలిపారు. 11:15 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జిల్లా కేంద్రంలో పర్యటిస్తారన్నారు. ఐబీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ, రాళ్లవాగు వద్ద కరకట్ట నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని వివరించారు. అనంతరం మాతా శిశు, సూపర్ స్పెషాలి టీ ఆసుపత్రి నిర్మాణ పనులు పరిశీలిస్తారన్నారు. తర్వాత ఓపెన్ టాప్ జీప్‌లో ఐబీ చౌరస్తా నుంచి జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానం వరకు ర్యాలీ ఉంటుందని తెలిపారు. బహిరంగ సభ.. జెడ్పీ మైదానంలో జరిగే బహిరంగ సభలో మంత్రులు కొత్త పథకాలు ప్రకటిస్తారని తెలిపారు. మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేసే అవకాశం ఉందని ఎమ్మెల్యే వెల్ల డించారు. సభకు 40 వేల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేశామన్నారు. డంప్‌యార్డు సమస్యకు త్వరలో పరిష్కారం లభిస్తుందన్నారు. వేంపల్లిలో ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటు ఖాయమన్నారు. మంగళవారం నుంచి మహాప్రస్థానం అందుబా టులోకి వస్తాయని పేర్కొన్నారు. నిరుపేదలకు ఉచితంగా అంత్యక్రియలు, డెత్ సర్టిఫికె ఇస్తామని తెలిపా రు. మంచిర్యాల అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలు కోసం తాను నిరంతరం కృషి చే స్తున్నానని, కాంగ్రెస్ కార్యకర్తలు క్రమశిక్షణతో సభను విజయవంతం చేయాలని కోరారు. -
ఉత్తమ రచనలకు ప్రశంస
లక్సెట్టిపేట: న్యాయవ్యవస్థలో న్యాయమూర్తుల జస్టిస్ ఎట్ గ్రాస్ రూట్స్, రోల్ ఆఫ్ డిస్టి క్ జ్యూడీషియరీ అనే అంశంపై స్థానిక మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి మహ్మద్ అసదుల్లా షరీఫ్ రాసిన వ్యాసాలకు మొదటి స్థానం లభించింది. తెలంగాణ న్యా యమూర్తుల అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో శనివారం రాత్రి నిర్వహించిన స మావేశంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి పీ ఎస్.నరసింహ ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో హైకోర్టు ఆక్టింగ్ చీఫ్ జస్టిస్ సుజెపాల్, జస్టిస్ లక్ష్మణ్, తెలంగాణ న్యాయమూర్తుల అసోసియేషన్ అధ్యక్షుడు కె.ప్రభాకర్‌రావు పాల్గొన్నారు. -
● ‘రాజీవ్ యువ వికాసం’కు నేడే ఆఖరు ● మూడు రోజులుగా పనిచేయని సైట్ ● వరుసగా సెలవులున్నా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ● జిల్లాలో ఇప్పటికే 47,431 మంది దరఖాస్తులు
మంచిర్యాలటౌన్: రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగ యువతకు ఉపాధి క ల్పించేందుకు రాజీవ్ యువ వికాసం పథకాన్ని ఘనంగా ప్రారంభించింది. ఈ పథకం కింద ఆన్లైన్, ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణకు అవకాశం కల్పించినప్పటికీ, సాంకేతిక సమస్యలతో దరఖాస్తు ప్రక్రియలో అడ్డంకులు ఎదురయ్యాయి. దీంతో ప్రభుత్వం దరఖాస్తు గడువును ఈ నెల 14 వరకు పొడిగించింది. అయినా మూడు రోజులుగా సైట్ పని చేయడం లేదు. దీంతో గడువు పెంచాలని పలువురు కోరుతున్నారు. దరఖాస్తు ప్రక్రియ.. రాజీవ్ యువ వికాసం పథకానికి ఈ నెల 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించారు. అయితే, వె బ్‌సైట్‌లో సాంకేతిక సమస్యలు, సర్వర్ లోడ్ కారణంగా చాలా మంది దరఖాస్తు చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో ఈ నెల 2 నుంచి ఆఫ్‌లైన్ ద్వారా మున్సిపల్, ఎంపీడీవో కార్యాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. గడువు సమీపిస్తున్నా సమస్యలు కొనసాగడంతో, ప్రభుత్వం గడువును ఈ నెల 14 వరకు పొడిగించింది. ఆఫ్‌లైన్‌తో ఊరట ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియలో వెబ్సైట్ తెరవకపోవడం, దరఖాస్తుల సబ్మిషన్లో ఆటంకాలు వంటి సమస్యలతో యువత ఇబ్బందులు ఎదుర్కొంది. మూడు రోజులుగా వెబ్సైట్ సరిగా పనిచేయకపోవడంపై నిరుద్యోగులు ఫిర్యాదు చేశారు. రెండో శని వారం, ఆదివారం, అంబేద్కర్ జయంతి సెలవులతో మూడు రోజులు కార్యాలయాలు మూ తపడినప్పటికీ, సెలవు రోజుల్లోనూ దరఖాస్తుల స్వీకరణ కు సిబ్బందిని నియమించడంతో వేలాది మంది సద్వినియోగం చేసుకున్నారు. ఆఫ్‌లైన్ విధానంతో మున్సిపల్, ఎంపీడీవో కార్యాలయాల్లో దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంచగా, సిబ్బంది వివరాలను నమోదు చేసేందుకు సహకరిస్తున్నారు. గడువు పెంచాలని వినతి..ఆన్లైన్ సమస్యలు కొనసాగుతుండడం, వరుస సెలవుల నేపథ్యంలో గడువును మరోసారి పొడిగించాలని నిరుద్యోగులు కోరుతున్నారు. ఆఫ్‌లైన్ విధానం లేకపోతే దరఖాస్తు ప్రక్రియలో మరింత గందరగోళం నెలకొనేదని, ఈ విధానం యువతకు ఊరటనిచ్చిందని అభిప్రాయపడుతున్నారు. చివరి రోజుల్లో దరఖాస్తుల సంఖ్య భారీగా పెరుగుతుండడంతో, అధికారులు కూడా గడువు పొడిగింపు అవసరాన్ని అంగీకరిస్తున్నారు. -
పక్కా ప్రణాళికతో లక్ష్యసాధన
శ్రీరాంపూర్/భీమారం: పక్కా ప్రణాళికలతో ఉత్పత్తి లక్ష్యాలు సాధించవచ్చని సింగరేణి డైరెక్టర్(పీపీ) వెంకటేశ్వర్లు తెలిపారు. శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్సార్పీ ఓసీపీ, ఇందారం ఓసీపీని ఆదివారం సందర్శించారు. క్వారీలోని వ్యూపాయింట్ నుంచి పని ప్రదేశాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఇందారం ఓసీపీని సంప్ ఏరియాలో బొగ్గు నిల్వలను ఉత్పత్తికి భంగం కలుగకుండా వీలైనంత త్వరగా ఉత్పత్తి చేసి రవాణా చేయాలని ఆదేశించారు. ఈమేరకు ఇప్పటినుంచే ప్రణాళికలకు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. అంతకు ముందు జీఎం కార్యాలయంలో ఏరియా అధికారులతో బొగ్గు ఉత్పత్తి, రవాణా, రక్షణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఓసీపీలో మాట్లాడుతూ ఓసీపీలో ఓబీ సంస్థలు తమకు నిర్దేశించిన మట్టి వెలికితీత పనులు చేయాలన్నారు. నెలవారీగా లక్ష్యాలను సాధిస్తేనే వార్షిక లక్ష్యాలను చేరకుంటామన్నారు. సీఆర్ఆర్, జీవీఆర్, వారాహి సంస్థలు తమ పని సామర్థ్యాన్ని పెంచుకోవాలన్నారు. దీనికి కావాల్సిన యంత్రాలను సమకూర్చుకోవాలన్నారు. 2025–26లో నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల సాధన కోసం గని అధికారులు కృషి చేయాలన్నారు. ప్రతి ఉద్యోగి కంపెనీ లక్ష్యాల సాధన కోసం పాటుపడాలన్నారు. రక్షణ పాటిస్తూ బొగ్గు ఉత్పత్తి చేయాలన్నారు. ఉత్పత్తి అయిన బొగ్గును సకాలంలో రవాణా చేయాలన్నారు. కార్యక్రమాల్లో ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శ్రీనివాస్, ఇంజినీర్ చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీరాంపూర్ ఓసీపీ ప్రా జెక్టు అధికారి నాగరాజు, ఎస్సార్పీ ఓసీపీ పీవోటీ శ్రీనివాస్, సర్వే అధికారి సంపత్, ఇందారం ఓసీపీ మేనేజర్ రవికుమార్, రక్షణ అధికారి సతీశ్, వారా హి కంట్రాక్ట్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
సేంద్రియ సాగు.. భేష్!
● స్వయంగా గోశాల ఏర్పాటు ● సేంద్రియ ఎరువులతో కూరగాయల సాగు ● పలు అవార్డులు, పురస్కారాలు అందుకున్న యువరైతు సతీశ్చెన్నూర్రూరల్: రసాయనిక ఎరువులకు స్వస్తిచెప్పి సహజ సిద్ధమైన ఎరువులను తయారుచేస్తున్నాడు మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని శివలింగాపూర్‌కు చెందిన యువరైతు గోనె సతీశ్. ఇంటి వద్దే ఘన జీవామృతం, వర్మికంపోస్టు తయారు చేస్తున్నాడు. ఇందుకు ఆవుపేడ, ఆవు మూత్రం వాడుతున్నాడు. తనకున్న 20 గుంటల భూమిలో సేంద్రియ ఎరువులతో 18 ఏళ్లుగా కూరగాయలు సాగు చేస్తున్నాడు. గోశాల ఏర్పాటు... మూడేళ్ల క్రితం ఇంటివద్ద షెడ్డు నిర్మించి ఒక్క ఆవుతో గోశాల ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం గోశాలలో 120కి పైగా ఆవులు ఉన్నాయి. ఆవుల పేడతో ఘన జీవామృతం, వర్మికంపోస్టు తయారు చేసి పంటలకు ఉపయోగిస్తున్నాడు. అంతేకాకుండా సేంద్రియ ఎరువుల వాడకంపై ఇతర రైతులకు అవగాహన కల్పిస్తున్నాడు. వారికి అతితక్కువ ధరకు ఎరువులు అందజేస్తున్నాడు. అంతేకాకుండా ఆవు పేడతో పిడకలు తయారుచేసి హోమాలకు, యజ్ఞాలకు అందజేస్తున్నాడు. కూరగాయల సాగు... ఇంటి వద్ద 20 గుంటల భూమిలో బీర, పూదీన, గ్రామ సమీపంలో ఐదెకరాల చేను కౌలుకు తీసుకుని మూడు రకాల వంకాయలు, సోరకాయలు సాగు చేస్తున్నాడు. వంకాయలు రోజుకు ఏడు నుండి ఎనిమిది క్వింటాళ్ల వరకు, సోరకాయలు, బీర కాయలు కలిపి రోజుకు రెండు క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తున్నాయి. వాటిని హోల్‌సేల్‌గా విక్రయించి ఆదాయం పొందుతున్నాడు. భార్య రజిత, తమ్ముడు భాస్కర్ సహకారం అందిస్తున్నారు. పలు అవార్డులు, ప్రశంసా పత్రాలు సేంద్రియ ఎరువులతో కూరగాయలు సాగు చేస్తున్న సతీశ్‌ను పలు సంస్థలు ఉత్తమ రైతుగా ఎంపిక చేసి పలు అవార్డులు, ప్రశంసాపత్రాలు అందజేశాయి. 2021లో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో అప్పటి కలెక్టర్ భారతి హోలీకేరి చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నాడు. 2022లో సుస్థిర వ్యవసాయ రాష్ట్రస్థాయి రైతు చైతన్య సదస్సులో హైదరాబాద్‌లో పుడమి పుత్ర అవార్డు, నేషనల్ ప్రీమియర్ అవార్డుకు ఎంపికయ్యి ఉత్తమ రైతు అవార్డు అందుకున్నాడు. 2024లో హైదరాబాద్‌లో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా సహస్ర కంపెనీ ఉత్తమ రైతు పురస్కారం అందుకున్నాడు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా వనపర్తి జిల్లాలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ హైదరాబాద్ వారి చేతుల మీదుగా పుడమి పుత్ర పురస్కారం అందుకున్నాడు. సతీశ్ తయారు చేస్తున్న సేంద్రియ ఎరువులు, గోశాల, కూరగాయల సాగును బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలతో పాటు పలువురు ప్రముఖులు సందర్శించారు.పుడమితల్లిని కాపాడేందుకు.. నేను 18 ఏళ్లుగా సేంద్రియ ఎరువు తయారుచేస్తూ కూరగాయలు సాగు చేస్తున్నా. 120 ఆవులతో గోశాల ఏర్పాటు చేశా. పశువుల పేడతో పిడకలు కూడా తయారు చేస్తున్నాం. సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నా. రైతులు రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి పుడమి తల్లిని కాపాడేందుకు సేంద్రియ ఎరువులు వాడాలి. – గోనె సతీశ్, రైతు, శివలింగాపూర్, చెన్నూర్ -
తండ్రి వచ్చేలోపే.. తనువు చాలించింది
● అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య ● అదనపు కట్నం కోసం టార్చర్.. ● పలుమార్లు పెద్దల పంచాయితీ ● అయినా తీరు మారకపోవడంతో బలవన్మరణం ● దండేపల్లిలో ఘటన.. కేసు నమోదు దండేపల్లి: అత్తింటి వారి అదనపు కట్నం వేధింపులు ఓ వివాహితను బలి తీసుకున్నాయి. పెళ్లి జరిగి ఎనిమిదేళ్లయినా.. అత్తింటి వారి అదనపు కట్నం దాహం తీరలేదు. నాలుగేళ్లుగా భర్తతోపాటు అత్త, మామ, బావ, మరిది వేధింపులను తట్టుకుంది. ఆరు నెలల క్రితం ఆడపిల్ల పుట్టడంతో వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ జరిగింది. అయినా అత్తింటివారి తీరు మారలేదు. చివరకు సున్నిత మనస్కు రాలైన ఆ వివాహిత చావే శరణ్యనుకుంది. ఉరేసుకుని తనువు చాలించింది. దీంతో ఆరేళ్ల బాబు, ఆరు నెలల పాప తల్లిలేనివారయ్యారు. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లిలో ఆదివారం జరిగింది. ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నా... ఎస్సై తహాసీనొద్దీన్ కథనం ప్రకారం.. దండేపల్లికి చెందిన గంగధరి మల్లేశ్‌కు, జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం యశ్వంత్‌రావుపేటకు చెందిన వరలక్ష్మి అలియాస్ మేఘన(38)తో 2017లో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ.4 లక్షల కట్నం, 4 తులాల బంగారం, ఇతర సామగ్రి ఇచ్చారు. పెళ్లయిన నాలుగేళ్ల వరకు వీరి కాపురం బాగానేసాగింది. కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న భక్త మల్లేశ్‌కు అదనపు కట్నం కావాలన్న ఆశ పుట్టింది. అప్పటి నుంచి భార్యను వేధిస్తున్నాడు. అతనికి తల్లి, తండ్రి లక్ష్మి, నర్సయ్యతోపాటు అన్న, తమ్ముడు తోడయ్యారు. కుటుంబమంతా వేధించడంతో వరలక్ష్మి భరించలేకపోయింది. ఈ విషయం పుట్టింటివారికి చెప్పడంతో ఏడాది క్రితం పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. నచ్చజెప్పి మళ్లీ కాపురానికి పంపించారు. ఆరు నెలల క్రితం పాపకు జననం.. ఈ క్రమంలో వరలక్ష్మి రెండోసారి గర్భందాల్చింది. ఆరు నెలల క్రితం పాపకు జన్మనిచ్చింది. దీంతో అదనపు కట్నం వేధింపులు మళ్లీ మొదలయ్యాయి. రోజు రోజుకూ వేధింపులు పెరుగుతుండడంతో భరించలేకపోయింది. పది రోజుల క్రితం భీవండిలో ఉండే తన తండ్రి రాజమల్లుకు ఫోన్ చేసి చెప్పింది. తాను యశ్వంత్‌రావ్‌పేటకు వచ్చిన తర్వాత.. దండేపల్లికి వస్తానని, పుట్టింటికి తీసుకువస్తానని నచ్చజెప్పాడు. శనివారం స్వగ్రామానికి వచ్చిన రాజమల్లు ఆదివారం భార్య అమ్మాయితో కలిసి దండేపల్లిలోని కూతురు ఇంటికి వెళ్లాడు. కూతురు కనిపించకపోవడంతో లోపలికి వెళ్లి చూడగా చీరతో ఉరేసుకుని కనిపించింది. కన్నబిడ్డను విగతజీవిగా చూసిన తల్లిదండ్రులో బోరున విలపించారు. పుట్టింటికి తీసుకుపోతానంటిని కద బిడ్డా.. అంటూ తండ్రి విలపించిన తీరు అందరినీ కన్నీరు పెట్టించింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తన కూతురు చావుకు కారకులైన అల్లుడు, అతని తల్లిదండ్రులు, అన్న, తమ్ముడిపై చర్యలు తీసుకోవాలని మృతురాలి తండ్రి రాజమల్లు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు. తల్లి ప్రేమకు దూరమైన చిన్నారులు.. వరలక్ష్మి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె కుమారుడు శ్రీనాథ్, కూతురు శరణ్య తల్లిప్రేమకు దూరమయ్యారు. తల్లి ఏమైందో కూడా ఆ చిన్నారులకు తెలియడం లేదు. కనీసం ఆ తల్లికి ఆత్మహత్య చేసుకునే ముందు తన పిల్లలైన గుర్తుకు రాలేదా అని పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు
ఖానాపూర్: పట్టణ శివారులోని అర్బన్ పార్క్ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. ఎస్సై రాహుల్ గైక్వాడ్ కథనం ప్రకారం..పట్టణంలోని నిర్మల్–ఖానాపూర్ ప్రధాన రహదారి మీదుగా కుమురం భీం చౌరస్తా నుంచి ఖానాపూర్ వైపు కారు వస్తుంది. నేరడిగొండ మండలం తరణమ్ గ్రామానికి చెందిన హన్మాండ్లు, ముత్యం బైక్‌పై ఖానాపూర్ నుంచి నిర్మల్ వైపు వెళ్తూ రాంగ్రూట్లో ఢీకొంది. వెనుక నుంచి వస్తున్న ప్యాసింజర్ ఆటోపై బైక్ పడడంతో ఆటో పల్టీకొట్టింది. ప్రమాదంలో హన్మాండ్లు, ముత్యం, ఆటోలో ఉన్న ఖానాపూర్లోని డబుల్ బెడ్రూం కాలనీకి చెందిన చిన్నయ్య, రమేశ్, చిన్నక్కలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో మూడు వాహనాలు దెబ్బతిన్నపట్పికి కారులో ఉన్న వారు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
విద్యుత్ కంచె తగిలి యువకుడి మృతి
సిర్పూర్(టి): విద్యుత్ కంచె తగలడంతోనే టోంకిని గ్రామానికి చెందిన యువకుడు మృతి చెందినట్లు కౌటాల సీఐ ముత్యం రమేశ్, సిర్పూర్(టి) ఎస్సై కమలాకర్ స్పష్టం చేశారు. యువకుడి మృతిపై అనేక అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో సిర్పూర్(టి) పోలీసుస్టేషన్లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. సిర్పూర్(టి) మండలం టోంకిని గ్రామానికి చెందిన చౌదరి జయేందర్(19) ఈ నెల 9న ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. గ్రామ సమీపంలోని తమ సొంత పొలం చుట్టూ రక్షణగా ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెకు ప్రమాదవశాత్తు తగిలి మృతి చెందాడు. జయేందర్ తండ్రి చౌదరి చిరంజీవి, పక్క పొలం యజమాని జయరాం పొలం వద్ద మృతదేహాన్ని గుర్తించారు. విద్యుత్తు లైన్ తగిలి మృతి చెందడంతో తమపై కేసు నమోదవుతుందనే భయంతో ఇద్దరు కలిసి మృతదేహాన్ని పక్కనే ఉన్న పెన్‌గంగ నదిలో పడేశారు. ఆ తర్వాత చిరంజీవి సిర్పూర్(టి) పోలీసుస్టేషన్లో తన కుమారుడు చౌదరి జయేందర్ ఇంటి నుంచి బయటి వెళ్లి తిరిగి రాలేదని అదృశ్యం కేసు నమోదు చేశారు. ఈ నెల 12న పెన్‌గంగ నదిలో మృతదేహాన్ని కొందరు భక్తులు గుర్తించారు. పోలీసులు గ్రామంలో విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. జయేందర్ మృతదేహాన్ని అతడి తండ్రితోపాటు జయరాం నదిలో పడేసినట్లు నిర్ధారించారు. ఈ మేరకు చౌదరి చిరంజీవి, జయరాంపై అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు.