
● జిల్లాలో పాతాళంలోకి భూగర్భజలాలు ● అడుగంటుతున్న జలాశయా
జిల్లాలోని వివిధ మండలాల్లో
భూగర్భజలాల నీటిమట్టం (మీటర్లలో)
మండలం ఫిబ్రవరి మార్చి
బెల్లంపల్లి 15.03 15.22
భీమిని 2.22 2.42
చెన్నూర్ 6.89 7.09
దండేపల్లి 1.59 1.84
హాజీపూర్ 4.49 4.56
జైపూర్ 18.19 19.41
జన్నారం 5.84 6.27
కన్నెపెల్లి 6.56 7.16
కాసిపేట 3.61 3.76
కోటపల్లి 16.59 18.74
లక్షేట్టిపేట 1.54 2.11
మందమర్రి 12.73 13.27
నెన్నెల 5.49 5.93
తాండూర్ 15.12 15.40
వేమనపల్లి 4.50 4.50
భీమారం 8.44 8.63
మంచిర్యాల 7.02 8.0
నస్పూర్ 9.95 10.82
మంచిర్యాలఅగ్రికల్చర్: ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో భా రీ వర్షాలు కురియగా వరదలతో పంటలు దెబ్బ తిన్నాయి. కానీ యాసంగిలో మాత్రం నీరులేక పంటలు ఎండిపోయే దుిస్థితి నెలకొంది. ప్రస్తుతం పంటలు పొట్ల, గులకదశలో ఉన్నాయి. మరో రెండు త డులిస్తే పంట చేతికి అందుతుంది. కీలకమైన ఈ దశలో నీరందక పొలాలు బీటలు వారుతున్నాయి. దీంతో రైతులు రాత్రి, పగలు తేడాలేకుండా పొలా లవద్దే పడిగాపులు కాస్తున్నారు. చెరువులు, కుంటలు, కాల్వల తూముల నుంచి నీరు అందక ఆయి ల్ ఇంజిన్లు పెట్టి నీటిని తోడుకుంటున్నారు. మరో వైపు బోరుబావుల్లో నీరు అడుగంటడంతో అదనంగా పైపులు అమర్చి మోటర్లను కిందకు దించుతున్నారు. అయినా నీరందక కన్నీరు పెడుతున్నారు.
పడిపోతున్న నీటిమట్టం
జిల్లాలో ఈ ఏడాది యాసంగి సీజన్‌లో రైతులు 1,22,150 ఎకరాల్లో ప్రధానంగా వరి, మొక్కజొన్న పంటలు సాగు చేశారు. ఇందులో వరి సాగు విస్తీర్ణం 1,21,702 ఎకరాలు. ఎక్కువ శాతం కాల్వలు, బోరు బావుల కింద సాగు చేశారు. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో భూ గర్భజలాలు అడుగంటుతున్నాయి. దీంతో కొన్నిచోట్ల ఒకటికి రెండు మూడు బోర్లు వేస్తున్నారు. ఒక్కో రైతు వందల ఫీట్ల లోతుకు బోర్లు దించుతున్నా ఆశించిన నీరు రావడంలేదు. మరికొంతమంది రైతులు అదనంగా పైపులు అమర్చి బోరు మోటార్లను కిందకు దించుతున్నారు. మరోవైపు ప్రాజెక్టు కాల్వకింద కా ల్వ కింద సాగు చేసిన పొలాలకు వంతుల వారీగా నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో తమవంతు వచ్చేసరికి పొలాలు బీటలు వారుతున్నాయని రైతులు వాపోతున్నారు. మరో 20 రోజుల పాటు పంటలకు నీటితడులు అవసరం ఉన్నాయి. జిల్లాలో గతేడాది మార్చి వరకు సరాసరి నీటి మట్టం 6.96 మీటర్ల లోతులో ఉండగా.. ఈ ఏడాది మార్చి వరకు 7.07 మీటర్లకు పడిపోయింది. ఏప్రిల్‌లో మరింత వేగంగా నీటిమట్టాలు పడిపోతున్నాయి.
నాలుగు మండలాల్లో అత్యంత వేగంగా..
జిల్లా భూగర్భ జలవనరుల శాఖ అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో భూగర్భ జలాలు వేగంగా అడుగంటుతున్నాయి. ప్రతీనెల 25వ తేదీన భూగర్భజలాల నీటినిల్వలను గుర్తిస్తున్నారు. గతేడాది మార్చి కంటే ఈ ఏడాది ప్రధానంగా కోటపల్లి మండలంలో 3.94 మీటర్లు, తాండూర్‌లో 3.09, నస్పూర్‌లో 1.02, చెన్నూర్‌లో 0.96 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి.
కాపాడుకునేందుకు పాట్లు..
వరి, మొక్కజొన్న కొన్నిచోట్ల దిగుబడి వస్తుండగా ఆలస్యంగా నాట్లు వేసిన చోట పొట్ట, గులక దశలో ఉంది. ఈ క్రమంలో జలాశయాలు, బోరుబావుల్లో నీరు అడుగంటడంతో నీటికోసం రైతులు తిప్పలు పడుతున్నారు. పంటలు కాపాడుకునేందుకు వాగుల్లో గుంటలు చేసి ఊట నీటిని మోటర్ల ద్వారా అందిస్తున్నారు. మెట్ట ప్రాంతంలో ఉన్న మడులకు చేసేదేంలేక వదిలేస్తున్నారు.
ప్రాజెక్టు ఎండుతోంది
గొల్లవాగు ప్రాజెక్టు కింద రబీ సీజన్‌లో రెండెకరాల్లో వరి సాగు చేసిన. ప్రాజెక్టు మొత్తం అడుగంటి పోయింది. కాల్వల నుంచి నీరు రావడం లేదు. వరి పొలాలు ఎండుతున్నాయి.
– గాలిపెల్లి నాగభూషణ్,
అర్కేపల్లి, భీమారం

● జిల్లాలో పాతాళంలోకి భూగర్భజలాలు ● అడుగంటుతున్న జలాశయా

● జిల్లాలో పాతాళంలోకి భూగర్భజలాలు ● అడుగంటుతున్న జలాశయా