
సమస్యలు సత్వరమే పరిష్కరించాలి
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలు శ్రీనివాస్‌రావు, హరికృష్ణలతో కలిసి అర్జీ లు స్వీకరించారు. భూ సమస్యలు, పింఛన్, పరి హారం తదితర సమస్యలపై ప్రజలు ఫిర్యాదులు అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆయా శాఖ లకు సంబంధించిన అర్జీలు పెండింగ్‌లో ఉంచరాద ని అన్నారు. అధికారుల పరిధిలో సమస్య పరి ష్కారం కాకుంటే చెప్పాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖ అధికారులు పాల్గొన్నారు.
● భీమారం మండలం గొల్లవాగు ప్రాజెక్టులో చేపలు పట్టుకోనివ్వకుండా కొంతమంది భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, చేపలు పట్టుకునేలా ఆదేశాలు ఇవ్వాలని, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని భీమారం మత్స్యపారిశ్రామిక సహకార సంఘం సభ్యులు కోరారు.