breaking news
Mancherial District Latest News
-
ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి
ఉట్నూర్‌రూరల్: ప్రతీ సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఉట్నూర్ ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ అన్నారు. సోమవారం కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. బజార్హత్నూర్కు చెందిన సిడాం సుధాకర్ రుణం అందించాలని, కాసిపేట మండలం రెగులగూడకు చెందిన ప్రళయ బీఎస్సీ నర్సింగ్ చదువు కొరకు ఆర్థికసాయం అందించాలని కోరారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు పింఛన్, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, స్వయం ఉపాధి పథకాల మంజూరు, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని దరఖాస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
ఆస్పత్రి పనులు వేగవంతం చేయాలి
మంచిర్యాలటౌన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నిర్మాణ పనులను వేగవంతం చేసి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం ఆసుపత్రి పనులను ఆయన పరిశీలించారు. రూ.129.25 కోట్లతో ప్రభుత్వ ఆసుపత్రి, రూ.23.75 కోట్లతో క్రిటికల్ కేర్ విభాగం పనులను చేపడుతున్నట్లు తెలిపారు. వీలైనంత త్వరగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్నికల్లో బాల కార్మికులను వినియోగిస్తే చర్యలు మంచిర్యాలఅగ్రికల్చర్: మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో బాల కార్మికులను వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారంలో భాగంగా గోడప్రతుల అతికింపు, ఫ్లెక్సీల ఏర్పాటు, కరపత్రాల పంపిణీ, ప్రచార సమయంలో ప్ల కార్డుల ప్రదర్శన, సభలు, సమావేశాల్లో బాలబాలికలతో పనులు చేయించినా, బాల కార్మికుల ప్రమేయం కనిపించినా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
‘ఢిల్లీ’ వేడుకలకు వీగాం ఒగ్గు కళాకారులు
భీమిని: మంచిర్యాల జిల్లా భీమిని మండలంలోని వీగాం గ్రామానికి చెందిన ఒగ్గుడోలు కళాకారులు బొప్పనపల్లి రవి, అమరగొండ అజయ్ జనవరి 26న ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో ఒగ్గుడోలు ప్రదర్శనకు ఎంపికయ్యారు. జనగామ జిల్లాకు చెందన ప్రఖ్యాత ఒగ్గు కళాకారుడు ఉస్తాద్, బిస్మిల్లాఖాన్, జాతీయ అవార్డు గ్రహీత ఒగ్గు రవి ఆధ్వర్యంలో ఈ నెల 8న ఢిల్లీకి వెళ్లారు. ఈ నెల 25 వరకు రిహార్సల్స్ చేసి 26న కర్తవ్యపథ్ వేదికగా గణతంత్ర వేడుకల్లో ఒగ్గుడోలు ప్రదర్శన ఇవ్వనున్నారు. సౌత్ జోన్, సెంట్రల్ జోన్ కల్చరల్ నుంచి 30 మందిని ఎంపిక చేయగా జిల్లాకు చెందిన రవి, అజయ్‌కి అవకాశం దక్కింది. -
విద్యుత్ వినియోగదారులకు సందేశ లేఖలు
బెల్లంపల్లి/మంచిర్యాలఅగ్రికల్చర్: వినియోగదారులకు చేరువ కావడానికి విద్యుత్ శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గృహజ్యోతి, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ లబ్ధిదారులు, రైతులకు నూతన సంవత్సర, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్లతో ముద్రించిన లేఖలను సోమవారం జిల్లా విద్యుత్ శాఖ అధికారులు అందజేశారు. బెల్లంపల్లి ఏఎంసీ ఏరియాలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్‌కు లేఖతోపాటు పూల మొక్క అందించారు. మున్సిపల్ పరిధి పెద్దనపల్లి బస్తీకి చెందిన పలువురు విద్యుత్ వినియోగదారులకు లేఖలు అందజేసి రాయితీ కరెంటు సరఫరాపై అవగాహన కల్పించారు. వినియోగదారుడి పేరు, సర్వీసు కనెక్షన్ నంబరుతో వ్యక్తిగతంగా అడ్రస్ చేసిన లేఖలను టీజీఎన్పీడీసీఎల్ అధికారులు గృహాలను సందర్శించి అందజేస్తున్నారు. బెల్లంపల్లిలో ఎస్ఈ బి.రాజన్న, డీఈ రాజేశం, ఏడీఈ కాటం శ్రీనివాస్, ఏఏవో పెద్ది రమేష్, బెల్లంపల్లి పట్టణ ఏఈ మల్లేశం, బెల్లంపల్లి రూరల్ ఏఈ రామ్ మనోహర్ పాల్గొన్నారు. జిల్లాలో గృహజ్యోతి కనెక్షన్లు 2,30,705, వ్యవసాయ కనెక్షన్లు 50,311 ఉండగా ప్రతీ లబ్ధిదారులకు లేఖలు పంపిణీ చేస్తున్నట్లు జిల్లా విద్యుత్ శాఖ అధికారి బి.రాజన్న తెలిపారు. -
‘అంకితభావంతో పనిచేస్తే కాంగ్రెస్ విజయం’
బెల్లంపల్లి: మున్సిపల్ ఎన్నికల్లో ప్రతీ కార్యకర్త అంకితభావంతో పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ఏఎంసీ ఏరియాలోని క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికలను పురస్కరించుకుని బెల్లంపల్లి మున్సిపాలిటీ 34 వార్డులకు చెందిన ముఖ్య కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలు పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతగానో మేలు చేస్తున్నాయన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించడానికి కార్యకర్తలు ఇంటింటా ప్రచారం చే యాలని సూచించారు. డీసీసీ అధ్యక్షుడు పిన్ని ంటి రఘునాథ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజాదరణ పొందుతున్నాయన్నారు. మున్సి పల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగిస్తుందన్నారు. ఎం.సూరిబాబు, సీహెచ్.శంకర్, ఎం.మల్లయ్య, మునిమంద రమేశ్, కె.శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు విస్తరణపై అభిప్రాయ సేకరణ
చెన్నూర్: చెన్నూర్ అంబేడ్కర్ చౌక్ నుంచి పెద్ద చెరువు రావి చెట్టు వరకు చేపట్టనున్న రోడ్డు విస్తరణపై బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం పెద్ద చెరువు కట్ట వద్ద ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. జేఏసీ నాయకులు సిద్ది రమేశ్‌యాదవ్ మాట్లాడుతూ రోడ్డు విస్తరణపై ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. ఇరుకు రోడ్డుతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, 66 ఫీట్లు రోడ్డు వెడల్పు చేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారని తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ పత్రాలను మంత్రి వివేక్ వెంకటస్వామి, కలెక్టర్ కుమార్ దీపక్‌కు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు, చెన్నూర్, కోటపల్లి, వేమనపల్లి మండలాల సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకులను నిలదీసిన వ్యాపారులు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టేందుకు మీరేవరని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నాయకులను రోడ్డు విస్తరణ బాధిత వ్యాపారులు ప్రశ్నించారు. రోడ్డు విస్తరణకు తాము అడ్డుకాదని, 66 ఫీట్లు కాకుండా తక్కువ చేయాలని మంత్రిని కోరామని తెలిపారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంలో మీ ప్రమేయం ఏమిటని నిలదీశారు. -
జీపీలకు ఊరట!
మంచిర్యాలరూరల్(హాజీపూర్): రెండేళ్లుగా పంచాయతీలు ప్రత్యేక పాలనలో నిధుల లేమితో కొట్టుమిట్టాడుతూ సాగాయి. దీంతో పల్లెల్లో పాలన గాలికొదిలేసినట్లయ్యింది. ఇటీవలే పంచాయతీల్లో ఎన్నికల ప్రక్రియ ముగిసి నూతన పాలకవర్గాలు కొలువుదీరడంతో పల్లెపాలనకు శ్రీకారం చుట్టారు. ఇదే సమయంలో నూతన సంవత్సర కానుకగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జీపీలకు తీపి కబురు చెప్పారు. ప్రత్యేక అభివృద్ధి (స్పెషల్ డెవలప్మెంట్) నిధుల కింద పంచాయతీలకు రూ.5 నుంచి రూ.10 లక్షల వరకు నిధులు ఇస్తామని ఇటీవల సీఎం ప్రకటనతో సర్పంచులు ఊరట చెందారు. నిధులు లేక నీరసం పంచాయతీల ఖజానాల్లో చిల్లిగవ్వ లేకపోవడంతో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సర్పంచుల ఆనందం ఆవిరైంది. రోజూవారీ పారిశుద్ధ్య పనులకు, కార్మికుల జీతాలు, ట్రాక్టర్లలో డీజిల్‌కు కూడా కనీసం డబ్బులు లేకుండా పోవడంతో కొంతమంది సొంత డబ్బులతో పనులు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అవస్థల నేపథ్యంలో తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి చేసిన నిధుల ప్రకటనతో పల్లెల్లో హర్షం వ్యక్తమవుతోంది. పంచాయతీలు అభివృద్ధి బాటలో నడవాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసే నిధులే కీలకం. ఇవి కూడా జనాభా ప్రతిపాదికన విడుదలవుతాయి. పంచాయతీలకు రెండేళ్లుగా పాలకవర్గాలు లేకపోవడంతో ఎలాంటి నిధులు మంజూరు కాలేదు. గత పాలకులకు ఇంకా బిల్లులు రాక పెండింగ్‌లోనే ఉండటంతో వడ్డీలు కడుతూనే మంజూరు కోసం జీపీలతో పాటు కలెక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు. నిధులు రాక పల్లెల్లో అభివృద్ధి కుంటుపడింది. ప్రత్యేకాధికారుల పాలనలో పంచాయతీ కార్యదర్శులు సొంత డబ్బులతో అత్యవసర పనులు చేయించారు. హర్షం వ్యక్తం చేస్తున్న పల్లెలు.. జిల్లాలో 306 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో సగానికి పైగా చిన్న పంచాయతీలే. కేంద్ర ప్రభుత్వ నిధులతో సంబంధం లేకుండా జీపీలకు స్పెషల్ డెవలప్మెంట్ నిధులు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రెండేళ్లకు పంచాయతీల్లో కొలువుదీరిన వేళ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన మాత్రం గ్రామ ప్రజల్లో ఆనందాన్ని నింపుతోంది. ఇది సర్పంచులకు ఊరట కలిగించే విషయమే. పెద్ద పంచాయతీలకు రూ.10 లక్షలు, చిన్న పంచాయతీలకు రూ.5 లక్షల చొప్పున ఇవ్వనుండగా జిల్లాకు దాదాపు రూ.20 కోట్ల వరకు నిధులు వచ్చే అవకాశాలున్నాయి. వెక్కిరిస్తున్న ఖజానాలే ఎక్కువ పెద్ద పంచాయతీల్లో తప్ప మిగిలిన జీపీల్లో మాత్రం ఖాళీ ఖజానా వెక్కిరిస్తోంది. భాధ్యతలు చేపట్టే సమయంలో చాలా గ్రామాల్లో నిధులు లేకపోవడంతో పలువురు సర్పంచులు పంచాయతీ కార్యాలయాలకు రంగులు వేయడం, ఫర్నీచర్ కొనుగోలుకు సొంత డబ్బులను వెచ్చించారు. గ్రామాల్లో తాగునీటి సరఫరా, పైప్లైన్ల మరమ్మతు, మోటార్లు, ట్రాక్టర్ల నిర్వహణకు నిధులులేక జాప్యం అవుతోంది. ఎస్డీఎఫ్ నిధులు వస్తే చాలు కొన్ని పనులైనా చేసుకుంటామనే ఆలోచనలో ఉన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే రాష్ట్ర ఆర్థిక సంఘం(ఎస్ఎఫ్సీ) నిధులు పూర్తిగా నిలిచిపోయాయి. పాలకవర్గాలు లేకపోవడం వల్లనే ఈ నిధుల విడుదల నిలిచిపోగా గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు జరగని దుస్థితి. ఏదిఏమైనా సీఎం ప్రకటన మాత్రం తమకు ఊరట కలిగిస్తోందని పలువురు సర్పంచులు పేర్కొంటున్నారు. -
జాతీయస్థాయి పోటీల్లో గోల్డ్‌మెడల్
ఖానాపూర్: మండలంలోని సింగాపూర్‌కు చెందిన నాగలక్ష్మి అర్నిస్ (కర్ర యుద్దక్రీడ) జాతీయస్థాయి చాంపియన్ షిప్ పోటీల్లో గోల్డ్‌మెడల్ సాధించింది. గ్రామంలోని కార్కూరి గంగామణి, లక్ష్మణ్ దంపతుల కుమార్తె నాగలక్ష్మి ఆదిలాబాద్‌లోని మావల బాలికల ఎంజేపీలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. 2023లో హైదరాబాద్‌లో జరిగిన నేషనల్ కిక్ బాక్సింగ్ పోటీల్లో బంగారు పతకం, 2024లో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో బ్రౌంజ్మెడల్ సాధించింది. ఈ నెల 9 నుంచి 11 వరకు ఢిల్లీలోని కపాస్ హేర స్టేడియంలో ఆర్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జూనియర్ అండర్–17 పోటీల్లో బంగారు పతకం సాధించింది. త్వరలో జమ్ముకశ్మీర్‌లో జరుగనున్న ఇంటర్నేషనల్ అర్నిష్ పోటీల్లో పాల్గొననుంది. -
స్వామి వివేకానంద అడుగుజాడల్లో నడవాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: యువత స్వామి వివేకానంద అడగుజాడల్లో నడవాలని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ అన్నారు. సోమవారం స్వామి వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన జాతీయ యువజన దినోత్సవ కార్యక్రమంలో మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్‌రావు, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ మహమ్మద్ విలాయత్ అలీ, వివిధ శాఖ అధికారులతో కలిసి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ మనిషి విజ్ఞానంతోపాటు విలువలతో ఎదుగాలని బోధించిన మహనీయుడు వివేకానంద అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అధికారి హనుమంతరెడ్డి, వివిధ శాఖల అధికారులు దుర్గప్రసాద్, పురుషోత్తం నాయక్, జెడ్పీసీఈవో గణపతి, కలెక్టరేట్ ఏవో రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు. -
వ్యవసాయంలో నంబర్ వన్
చెన్నూర్: దేశంలోనే వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్‌గా నిలిచిందని రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి అన్నారు. సోమవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రైతులకు రూ.80 లక్షల విలువైన వ్యవసాయ పనిముట్లను అందజేశారు. మంత్రి మాట్లాడుతూ జిల్లాకు రూ.2.40 కోట్ల రాయితీ పనిముట్లు వచ్చాయని, ఒక్క చెన్నూర్ నియోజకవర్గానికి రూ.40 లక్షల రాయితీ రావడం సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం రైతులకు బీమా చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఏవో సురేఖ, ఏడీఏ ప్రసాద్ నాయక్, ఏవోలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. విద్యార్థినులు ఉన్నత చదువులు చదవాలి చెన్నూర్: విద్యార్థినులు ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చాలని మంత్రి వివేక్‌వెంకటస్వామి అన్నారు. సోమవారం చెన్నూర్‌లోని బీసీ బాలికల కళాశాల వసతిగృహాన్ని కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి ప్రారంభించారు. ఇసుక అక్రమాలకు పాల్పడితే చర్యలు కోటపల్లి: ఇసుక అక్రమాలకు పాల్పడితే కఠినచర్యలు తప్పవని మంత్రి వివేక్‌వెంకటస్వామి హెచ్చరించారు. సోమవారం కొల్లూర్ గ్రామంలోని ఇసుక రీచ్‌ను కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి ప్రారంభించారు. ఇసుక రీచ్‌ను ఆనుకుని ఉన్న రైతులు తమ భూములకు పైసలు ఇవ్వాలని, లేదంటే ఇసుక క్వారీలకు వెళ్లే దారులను మూసివేస్తామని తెలపడంతో మంత్రి వివేక్ వెంకటస్వామి అక్కడే ఉన్న మైనింగ్ ఏడీ జగన్మోహన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్య త్వరగా పరిష్కరించాలని, అక్రమాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటానని మైనింగ్ అధికారులను హెచ్చరించారు. పట్టణంలో మార్నింగ్‌వాక్ చెన్నూర్: చెన్నూర్ పట్టణంలో మంత్రి వివేక్‌వెంకటస్వామి సోమవారం మార్నింగ్ వాక్ నిర్వహించారు. వార్డుల్లో ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పారిశుద్ధ్య పనులు చేపట్టాలని కమిషనర్ మురళికృష్ణను ఆదేశించారు. ప్రతీ వార్డులో సిమెంట్ రోడ్లు నిర్మిస్తామని తెలిపారు. రెండో విడతలో అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. -
● కిష్టాపూర్ ధాన్యం కేసులో చిత్రాలు ● ‘కొనుగోళ్ల’ కేంద్రంగానే విచారణలు ● పారదర్శకంగా విచారిస్తే బాగోతం బయటకు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ధాన్యం కొనుగోళ్ల అక్రమాల వ్యవహారాల్లో అధికారుల తీరు వివాదాస్పదంగా మారుతోంది. జైపూర్ మండలం కిష్టాపూర్ డీసీఎంఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో జరిగిన అక్రమాల్లో మిల్లర్ల పాత్రను వదిలి వేయడం అనుమానాలకు తావిస్తోంది. గత ఏడాది యాసంగికి సంబంధించి 14వేల క్వింటాళ్ల ధాన్యం ఆ కేంద్రం నుంచే మిల్లులకు తరలించినట్లు ఆన్లైన్లో నమోదైంది. ఇందుకు 53మంది రైతుల పేర్లతో బ్యాంకు ఖాతాలను ఉపయోగించి రూ.లక్షల చొప్పున బదిలీ చేసుకున్నారు. మొత్తం రూ.2.28 కోట్ల వరకు అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారమంతటికీ నిర్వాహకుడితోపాటు వ్యవసాయ అధికారితోపాటు మిల్లర్లు సైతం సహకరించారు. ధాన్యం తరలించకుండానే మిల్లుల్లో దించుకున్నట్లు ‘ఓపీఎంఎస్’లో నమోదు చేశారు. ఈ ధాన్యాన్ని జైపూర్ మండలం మద్దులపల్లి, కుందారం, టేకుమట్లతోపాటు కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లోని మిల్లులకు ధాన్యం పంపినట్లుగా ట్రక్ షీట్స్‌లో నమోదు చేస్తూ ఆయాచిత లబ్ధి పొందిన మిల్లు యాజమాన్యాలను ఎలా తప్పించారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వీటిలో కేవలం కొనుగోలు కేంద్ర నిర్వాహకుడితోపాటు మరో ఆరుగురిపైనే ఫిర్యాదు చేశారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారుల విచారణలోనూ ప్రాథమికంగా రూ.37లక్షలకే పరిమితం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు అధికార పార్టీ నాయకులు ఈ అక్రమాలు చేసినట్లు ఆరోపణలు రావడంతో రాజకీయ వర్గాల్లోనూ ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. కొందరిపైనే కేసు బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకున్న డబ్బుల పరంగా చూస్తే భూమి లేని కొందరిని వదిలేసి కొంత భూమి ఉన్న వారిపైనా కేసులు నమోదు చేశారు. మొత్తం సుమారు మూడున్నర కోట్ల విలువైన ధాన్యం అక్రమాలు జరిగాయంటూ ఫిర్యాదుదారు ఆధారాలతో సహా విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు, జిల్లా అధికారులకు అందజేశారు. ఆ దిశగా విచారణ సాగలేదనే విమర్శలు వస్తున్నాయి. గత యాసంగి ధాన్యం కొనుగోళ్లలో చెన్నూరు మండలం దుగ్నేపల్లి, జైపూర్ మండలం నర్సింగాపూర్, కిష్టాపూర్ కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలు జరిగాయంటూ ఫిర్యాదులు వెళ్లాయి. వీటిలో నర్సింగాపూర్ కొనుగోలు కేంద్రం, రైస్‌మిల్లుపై క్రిమినల్ కేసు చేశారు. అదే సమయంలో కిష్టాపూర్ కేంద్రంపై విచారణ మొదలైనప్పటికీ మొదటి నుంచీ నీరుగార్చుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. చివరకు ఫిర్యాదుదారు హైకోర్టుకు వెళ్లి మరీ రిట్ పిటిషన్ వేయడంతో కదలిక వచ్చింది. రెండుసార్లు విచారించి, వివరాలు తీసుకున్న విజిలెన్స్ అధికారులు చివరకు ఏడుగురే బాధ్యులుగా పేర్కొంటూ ప్రాథమికంగా నిర్దారణకు వచ్చారు. ఈ నివేదిక ఆధారంగానే పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా, తాజాగా కేసు నమోదైంది. అయితే వీరిలో తమ పేర్లతోనే కేసులో నమోదు చేయడంపై గ్రామంలోనూ భిన్నంగా స్పందిస్తున్నారు. మరోవైపు నిందితులుగా చేర్చినవారితోపాటు కేసు నుంచి తప్పించుకున్నవారి మధ్య గొడవలకు దారి తీస్తున్నాయి. ఈ కేసు తీవ్రత తగ్గించేందుకు, అందరినీ సముదాయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంపై జిల్లాలో రైస్ మిల్లర్లలోనూ ఇటు పౌరసరఫరాల శాఖ అధికార వర్గాలతోపాటు రాష్ట్ర స్థాయిలో కమిషనర్ ఆఫీసుకు సైతం ఈ వ్యవహారం వెళ్లడంతో తదుపరి విచారణ ఎలా సాగుతుందోననే ఆసక్తి నెలకొంది. దీనిపై ఫిర్యాదు ఇచ్చిన మేరకు కేసు చేసిన పోలీసులు ఫిర్యాదుదారు నుంచి పూర్తిగా వివరాలు తీసుకుని, ఈ మేరకు ఆధారాలు తీసుకురావాలని సూచించినట్లు తెలిసింది. -
పత్తి కొను‘గోల్మాల్’
ఇచ్చోడ:సీసీఐ ద్వారా చేపడుతున్న పత్తి కొనుగోళ్లలో గోల్మాల్ జరిగిన సంఘటన వెలుగులోకి రావడంతో జిల్లా వ్యాప్తంగా చర్చనీయాశంగా మారింది. ఈ సంఘటనకు పాల్పడిన అసలు సూత్రదారులెవరు? అన్నదానిపై జోరుగా చర్చ సాగుతోంది. 82 క్వింటాళ్ల పత్తిని రెండుసార్లు విక్రయించి దాదాపుగా రూ.6 లక్షలు స్వాహా చేశారు. విచారణ జరిపి సుమోటో కేసుగా స్వీకరించిన పోలీసులు ఇందులో ప్రమేయం ఉన్న ఏడుగురిని రెండురోజుల క్రితం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పత్తి కొనుగోళ్లలో అవకతవకలపై సీసీఐ అధికారులుగానీ, మిల్లు యజమాని గానీ పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. అసలేం జరిగింది? డిసెంబర్ 15న ఇచ్చోడ మండలంలోని కోకస్మన్నూర్ గ్రామానికి చెందిన రైతు మండలంలోని విజయ జిన్నింగ్ మిల్లులో పత్తిని విక్రయించేందుకు ఏపీ01ఎక్స్ 5678 నంబరుగల ట్రాక్టర్లో తీసుకువచ్చాడు. ట్రాక్టర్‌తో పాటు తూకం వేయగా 43 క్వింటాళ్లు వచ్చింది. ట్రాక్టర్ బరువు 32 క్వింటాళ్ల 70 కిలోలు తీసివేయగా పత్తి బరువు కేవలం 11 క్వింటాళ్లు మాత్రమే ఉన్నట్లు తక్పట్టిలో నమోదైఉంది. డిసెంబర్ 16న అదే రైతు టీఎస్21టీ 5789 నంబర్ గల ట్రాక్టర్లో పత్తి లోడ్ చేసుకుని విక్రయించడానికి అదే జిన్నింగ్ మిల్లుకు వచ్చాడు. ట్రాక్టర్‌తో పాటుగా 49 క్వింటాళ్ల 6 కిలోలు కాగా వాహనం బరువు 19 క్వింటాళ్ల 20 కిలోలుగా నమోదు చేశారు. దీంతో పత్తి బరువు 29 క్వింటాళ్ల 86 కిలోలుగా నమోదైంది. దాదాపుగా ట్రాక్టర్లన్నీ పది, ఇరవై కిలోల బరువు తేడాతో ఉంటాయి. కానీ ఈ ట్రాక్టర్ బరువును దాదాపుగా 13 క్వింటాళ్లకు తగ్గించడంతోనే అసలు కథ బయటకు వచ్చినట్లు సమాచారం. పోలీసుల విచారణలో మాత్రం ఒకే వాహనం పత్తిని రెండు రోజుల పాటు విక్రయించి భారీ మోసానికి పాల్పడినట్లు తెలుస్తోంది. కానీ మోసానికి పాల్పడిన వ్యక్తులు మాత్రం తక్పట్టీలలో రెండు వేర్వేరు వాహనాల నంబర్లు, వేర్వేరు తేదీలలో పత్తిని విక్రయించినట్లు నమోదు చేయడం వెనుక ఉన్న అసలు సూత్రదారులెవరన్నది బయటకు రావాల్సి ఉంది. ఈ ఏడుగురు ఎవరు? పత్తి కొనుగోళ్లలో సీసీఐని మోసగించిన ఈ ఏడుగురు వ్యక్తుల్లో మూలే మారుతి ఒకరు. ఇతను కొంతకాలంగా మిల్లులో గుమాస్తాగా పని చేస్తున్నాడు. చెర్ల అరుణ్‌కుమార్ ఆర్నెళ్లుగా ఇచ్చోడ మార్కెట్ కార్యాలయంలో పర్మినెంట్ డాటా ఎంట్రీ ఆపరేటర్ కాగా నవీన్ తాత్కాలిక పద్ధతిలో ఆపరేటర్. ఐద శివరాజ్ మార్కెట్లో దాడ్వాయిగా కొనసాగుతున్నారు. గోతి సునీల్ స్థానిక వ్యాపారి. గోపుల సత్యనారాయణ పత్తి రైతు. ఈ ఏడుగురిలో అసలు సూత్రదారులు ఎవరన్నదానిపై లోతుగా దర్యాప్తు జరిపితే కానీ అసలు విషయం బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వివరాలు సేకరిస్తున్నాం పత్తి కొనుగోళ్లలో జరిగిన అవకతవకలపై జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వివరాలు సేకరిస్తున్నాం. ఇప్పటికే పత్తి విక్రయించిన రైతుకు సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్‌కార్డు, స్లాట్ బుకింగ్ తక్‌పట్టీలను సేకరించాం. – ఆస్మా, ఇచ్చోడ మార్కెట్ కార్యదర్శి -
గంజాయి విక్రేతల అరెస్ట్
వాంకిడి: గంజాయి సాగు చేసి విక్రయిస్తున్న ఇ ద్దరు వ్యక్తులపై సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేందర్ తెలిపారు. మండలంలోని సవాతి గ్రామానికి చెందిన మోహర్లే శంకర్ వద్ద 480 గ్రాముల ఎండు గంజాయి పట్టుబడగా దాని విలువ సుమారు రూ.12 వేలు ఉంటుందన్నారు. మండల కేంద్రంలోని పాత మసీదు ప్రాంతంలో నివాసం ఉంటున్న షేక్ హరుణ్ (జావిద్) వద్ద నుంచి 40 గ్రాముల ఎండు గంజాయి పట్టుబడగా దాని విలువ సుమారు రూ.1000 ఉంటుందన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
● మున్సిపాల్టీల్లో తుది జాబితా విడుదల చేసిన అధికారులు ● మంచిర్యాల కార్పొరేషన్లో 1,81,778 మంది ఓటర్లు
మహిళా ఓటర్లు అధికంమంచిర్యాలటౌన్: మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాల్టీల్లో ఓటరు తుది జాబితా సోమవారం విడుదల చేశారు. జిల్లాలోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్, బెల్లంపల్లి, లక్సెట్టిపేట, చెన్నూర్, క్యాతనపల్లి మున్సిపాల్టీల్లో కమిషనర్లు జాబితాను వెల్లడించారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో 60 డివిజన్లకు సంబంధించి తుది ఓటరు జాబితాను కమిషనర్ కే.సంపత్‌కుమార్ కార్యాలయ ఆవరణలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల ఒకటిన ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేశామని, 1,82,041 మంది ఓటర్లు ఉండగా.. 237 అభ్యంతరాలు వచ్చాయని అన్నారు. పరిశీలన అనంతరం ఓటర్లు ఇతర డివిజన్లలోకి రాకుండా మార్పులు చేసి తుది జాబితా విడుదల చేశామని తెలిపారు. తుది జాబితా ప్రకారం 1,81,778మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ రాజా మనోహర్, మేనేజర్ ఎస్.కరుణాకర్, రెవెన్యూ ఆఫీసర్ కే.శ్రీనివాస్‌రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ వైకుంఠం పాల్గొన్నారు. తగ్గిన ఓటర్లు కార్పొరేషన్ పరిధిలో ముసాయిదా ఓటరు జాబితాతో పోల్చి చూస్తే తుది జాబితాలో ఓటర్ల సంఖ్య తగ్గింది. ముసాయిదా జాబితా ప్రకారం 1,82,041 మంది ఉండగా, తుది జాబితాలో 263 మంది తగ్గారు. 1,81,778 మంది ఓటర్లు ఉన్నట్లుగా ప్రకటించారు. 10వ డివిజన్లో 2,091 మంది అత్యల్ప ఓటర్లు ఉండగా, 52వ డివిజన్లో 4,047 మంది ఓటర్లతో అత్యధిక ఓటర్లు ఉన్న డివిజన్‌గా గుర్తింపు పొందింది. క్యాతనపల్లిలో.. రామకృష్ణాపూర్: క్యాతనపల్లి మున్సిపాలిటీ ఓటర్ల తుది జాబితా సోమవారం విడుదల చేశారు. ముసాయిదా ఓటరు జాబితాపై 645 అభ్యంతరాలు అందాయని మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు. అన్నింటినీ పరిశీలించి సరిచేసిన అనంతరం వార్డు వారీగా ఓటర్ల తుది జాబితా ప్రచురించామని పేర్కొన్నారు. లక్సెట్టిపేటలో.. లక్సెట్టిపేట: మున్సిపల్ ఓటరు తుది జాబితాను కమిషనర్ విజయ్‌కుమార్ సోమవారం విడుదల చేశారు. గత కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన జాబితాలో ఓటర్లు దరఖాస్తు చేసుకున్న ప్రకారం సవరణలు చేశారు. మున్సిపల్ మేనేజర్ రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు. చెన్నూర్‌లో.. చెన్నూర్: చెన్నూర్ మున్సిపాలిటీ ఓటరు తుది జాబితాను మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, సిబ్బంది సోమవారం విడుదల చేశారు. కమిషనర్ మాట్లాడుతూ ముసాయిదా జాబితాలో పేర్లు మార్పుకు సంబంధించిన అభ్యంతరాలను సరి చేశామని పేర్కొన్నారు. వార్డుల వారీగా తుది జాబితాను మున్సిపల్ కార్యాలయంలో అతికించామని తెలిపారు. బెల్లంపల్లిలో.. బెల్లంపల్లి: బెల్లంపల్లి ద్వితీయ శ్రేణి మున్సిపాల్టీ తుది ఓటరు జాబితాను కమిషనర్ తన్నీరు రమేష్ మున్సిపల్ సోమవారం ప్రకటించారు. వార్డుల వారీగా ఓటర్ల వివరాల జాబితాను విడుదల చేశారు. జాబితా ప్రతులను మున్సిపల్ కార్యాలయం, తహసీల్దార్, సబ్ కలెక్టర్ కార్యాలయాల్లో నోటీసు బోర్డులపై అతికించారు.భార్య ఓ డివిజన్లో.. భర్త మరో డివిజన్లో.. మంచిర్యాల నగరంలో ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాలను పరిశీలించి సరిచేశామని అధికారులు చెబుతున్నారు. కానీ ఇప్పటికీ ఒక డివిజన్లోని ఓటరు మరో డివిజన్లో వచ్చారు. 52వ డివిజన్లోని హైటెక్‌సిటీ కాలనీలోని ఆసియన్ టవర్ సమీపంలోని భార్యాభర్తలకు చెందిన ఓట్లు ఒకరిది 52వ డివిజన్లో, మరొకరిది 21వ డివిజన్‌లోకి వచ్చింది. ముసాయిదా జాబితాలో తప్పును సరిచేయాలని కోరగా, భార్యాభర్తలకు చెందిన ఓట్లలో భర్త ఓటు 21వ డివిజన్‌లోకి వెళ్లిన దానిని 52 డివిజన్‌లోకి మార్చి, 52వ డివిజన్లో ఉన్న భార్య ఓటును 21వ డివిజన్‌కు మార్చారు. ఒకే ఇంట్లోని భార్యాభర్తల ఓట్లు వేర్వేరు డివిజన్లలో రాగా, తుది ఓటరు జాబితా లోనూ తప్పులు దొర్లినట్లు తెలుస్తోంది. జిల్లాలోని మున్సిపాల్టీల ఓటర్ల వివరాలు కార్పొరేషన్/ డివిజన్లు/ మున్సిపాల్టీ వార్డులు పురుషులు మహిళలు ఇతరులు మొత్తం మంచిర్యాల 60 90,646 91,111 21 1,81,778 బెల్లంపల్లి 34 21,560 23,012 3 44,575 లక్సెట్టిపేట 15 8,765 9,565 1 18,331 చెన్నూర్ 18 9,711 10,991 1 19,903 క్యాతనపల్లి 22 14,761 15,023 1 29,785 -
మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్య
ఆదిలాబాద్‌టౌన్: మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు వన్‌టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణంలోని పాత హౌజింగ్‌బోర్డులో నివాసం ఉంటున్న ఎల్చల సాయిరాం (30) డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో ఐదేళ్లుగా తెల్లకల్లుకు బానిసయ్యాడు. ఆదివారం రాత్రి తాగిన మైకంలో ఇంట్లో చీరతో ఉరేసుకున్నాడు. మృతుని భార్య ఎల్చల నికిత ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు. చికిత్స పొందుతూ బాలిక మృతితానూరు: మండలంలోని దాగం గ్రామానికి చెందిన డాకే సురేఖ (16) నిజామాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు ఎస్సై షేక్ జుబేర్ తెలిపారు. సదరు బాలిక ఈనెల 6న కడుపునొప్పి భరించలేక పురుగుల మందు తాగింది. వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి వచ్చిన తల్లి సావిత్రిబాయి గమనించి చికిత్స నిమిత్తం భైంసా ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచనల మేరకు నిజామాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మృతి చెందింది. మృతురాలి తండ్రి ఘన్శామ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై జుబేర్ వెల్లడించారు. ప్రాణం తీసిన చేపల వేటలక్ష్మణచాంద: చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు సోన్ మండలంలోని గాంధీనగర్‌కు చెందిన శంకర్ (35) ఆదివారం సాయంత్రం చేపల వేటకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వెళ్లాడు. ప్రమాదవశాత్తు వల కాలుకు చుట్టుకోవడంతో నీటిలో మునిగి ఊపిరాడక మృతి చెందాడు. సోమవారం ఉదయం అటుగా వెళ్లిన గ్రామస్తులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందజేశారు. మృతుని భార్య మాధవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్సై దేవన్న తెలిపారు. రోడ్డు ప్రమాద మృతుడు ఆస్నాద వాసిచెన్నూర్రూరల్: మండలంలోని అక్కెపల్లి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి ఆస్నాద గ్రామ వాసి పెద్ద పోలు సంపత్ గౌడ్ (40)గా సోమవారం పోలీసులు గుర్తించారు. చెన్నూర్ నుంచి సిరోంచ వైపునకు వెళ్తున్న కారును చెన్నూర్ వైపు వస్తున్న ఇసుక లారీ అక్కెపల్లి బస్‌స్టాప్ సమీపంలో ఢీ కొట్టడంతో సంపత్‌గౌడ్ కారులో ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. క్రీడలకు చెన్నూర్ పెట్టింది పేరుచెన్నూర్: జిల్లాలో క్రీడలకు చెన్నూర్ పెట్టింది పేరని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాఽథ్‌రావు అన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో నియోజకవర్గ స్థాయి వాలీబాల్ పోటీలను బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌తో కలిసి ప్రారంభించారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఏతం శివకృష్ణ వాలీబాల్ పోటీలు నిర్వహించడం హర్షనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కారెంగుల రామయ్య, కొండపాక చారి, జాడి తిరుపతి, గర్రెపల్లి వెంకటనర్సయ్య, కేవీఏం శ్రీనివాస్, పీఈటీలు పాల్గొన్నారు. ‘బూత్ నిర్మాణ అభియాన్’ విజయవంతం చేయాలి మంచిర్యాలటౌన్: మంచిర్యాల జిల్లా బూత్ నిర్మాణ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు చాడ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో బూత్ నిర్మాణ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి, కృష్ణమూర్తి, మాచర్ల సంతోష్, సంజీవరావు, తదితరులు పాల్గొన్నారు. -
వీధి కుక్కలకు అంతుచిక్కని రోగం
వీధి కుక్కలకు అంతుచిక్కని రోగం సోకింది. జిల్లా కేంద్రంలోని ఏ వీధికి వెళ్లినా కుక్కలకు చర్మ ఊడిపోయి, నల్లని, ఎర్రని మచ్చలతో దర్శనమిస్తున్నాయి. దద్దుర్లు లేచి దురదతో ఏర్పడిన పుండ్లు నీరు కారడంతో ఈగలు, దోమలు వాలుతున్నాయి. చికెన్ సెంటర్ల నుంచి వచ్చే వ్యర్థాలు తిన్న శునకాలకు ఎక్జామిన్ ధర్మటిసీస్ వ్యాధి సోకుతోందని పశు వైద్యులు పేర్కొంటున్నారు. ఈ వ్యాధి సోకిన కుక్కలు ఇళ్లలోకి రావడంతో మనుషులకు సైతం సోకే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వ్యాధి నివారణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్ -
ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
● రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మంచిర్యాలఅగ్రికల్చర్: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్రీదేవితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్, అదనపు కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లతో ఫొటో ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితా ప్రకటన, మున్సిపల్ ఎన్నికల నిర్వహణ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ 13న పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా ప్రకటన, అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ, పరిశీలన, పరిష్కారం, 16న పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రకటించాలని తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు మున్సిపాల్టీల్లో ఎన్నికల నిర్వహణకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. -
అనాథ శవానికి అంత్యక్రియలు
జన్నారం: అనారోగ్యంతో మృతి చెందిన అనాథ శవానికి అంత్యక్రియలు జరిపించి ఉదారత చాటుకున్నాడు. జన్నారం మండలం పోన్కల్ గ్రామ పంచాయతీలోని గాంధీనగర్‌లో నివాసం ఉంటున్న నారపాక శ్రీను కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం మృతి చెందాడు. అంత్యక్రియలకు ఎవరూ ముందుకు రాకపోవడంతో విషయం తెలుసుకున్న పీసీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, వార్డు సభ్యుడు ముడుగు ప్రవీణ్‌కుమార్ అంత్యక్రియలు నిర్వహించాడు. అనాధలు, నిరుపేదలను ఆదుకునేందుకు పీసీఆర్ ఫౌండేషన్ ముందుంటుందన్నారు. కాగా ప్రవీణ్‌కుమార్‌ను సోషల్ మీడియా వేధికగా పలువురు అభినందించారు. -
ఇసుక క్వారీలలో అక్రమాలకు తావులేదు
చెన్నూర్: కోటపల్లి మండలంలోని ఎర్రాయిపేటలో నడుస్తున్న ఇసుక క్వారీలలో అక్రమాలకు తావులేదని, ప్రభుత్వ నిబంధనల మేరకే నడుస్తున్నాయని టీజీఎండీసీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పీవో వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం ప్రెస్‌క్లబ్‌లో మైనింగ్ ఏడీ జగన్మోహన్రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. క్వారీలకు సెలవు దినాలు ఉండవన్నారు. బుకింగ్ ప్రకారం ఇసుకల లోడింగ్ జరుగుతుందన్నారు. ప్రతీ లారీని టీజీఎండీసీ అధికారులు, సిబ్బంది తనిఖీ చేసిన తర్వాతే రవాణా జరుగుతుందన్నారు. విజిలెన్స్ అధికారులు సైతం క్వారీలను తనిఖీ చేస్తారన్నారు. కలెక్టర్ పర్యవేక్షణలో నిబంధనలకు లోబడి ఇసుక తరలింపు జరుగుతోందన్నారు. -
కిరాణంలో అంగన్వాడీ కోడిగుడ్ల విక్రయం!
భీమారం: మండలంలోని మద్దికల్‌లో ఓ కిరాణ షాపులో అంగన్వాడీ కేంద్రానికి చెందిన కోడిగుడ్లు విక్రయిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. లాల్బహుదూర్పేట అంగన్వాడీ టీచర్‌కు చెందిన దుకాణంలో ఐసీడీఎస్‌కు చెందిన కోడిగుడ్లు రూ.5 చొప్పున అమ్ముతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం మార్కెట్లో గుడ్డుకు రూ.8 ఉండగా కిరాణషాపులో మాత్రం తక్కువ ధరకు లభిస్తుండడంతో చాలామంది వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కోడిగుడ్లపై ప్రభుత్వం ముద్రించిన లోగో కూడా ఉండటం గమనార్హం. మద్దికల్లోని మరో రెండు కేంద్రాలకు చెందిన టీచర్లు ట్రేల చొప్పున బహిరంగంగా మార్కెట్లో విక్రయిస్తున్నట్లు తెలిపారు. చిన్నారులకు అందించాల్సిన కోడిగుడ్లని బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఈ విషయమై ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మను ‘సాక్షి’ ఫోన్లో వివరణ కోరగా కోడిగుడ్ల అమ్మకాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. -
మంచిర్యాలలో సింగరేణి కార్మికుడు..
మంచిర్యాలక్రైం: రోడ్డు ప్రమాదంలో సింగరేణి కార్మికుడు మృతి చెందినట్లు ఎస్సై మజా రొద్దీన్ తెలిపారు. ఆయన కథ నం ప్రకారం..నస్పూర్ న్యూ సిటీకాలనీలో ఉంటున్న బొడ్డు తిరుపతి(41) ఐకే–1(ఏ) మైన్‌పై ఎస్డీఎల్ ఆపరేటర్ పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి విధులు ముగించుకొని నస్పూర్ నుంచి మందమర్రిలో ఉంటున్న తన అత్తగారింటికి బైక్‌పై వెళ్తున్నాడు. జిల్లాకేంద్రంలోని రాజీవ్‌నగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య శైలజ, కుమారుడు శ్రీయన్, కూతురు మిథుల ఉన్నారు. కాగా, మృతుడు తిరుపతిది హాజీపూర్ మండలం కర్ణమామిడి గ్రామం. అంత్యక్రియల నిమిత్తం స్వగ్రామానికి తరలించారు. భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. బోరిగాంలో యువకుడు.. ముధోల్: మండలంలోని బోరిగాం గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో లోలం రాజు(18) మృతి చెందినట్లు ఎస్సై బిట్లా పెర్సీస్ తెలిపారు. వివరాల ప్రకారం... లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్కు చెందిన లోలం రాజు బోధన్‌లోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. సంక్రాంతి సెలవు ల నేపథ్యంలో స్నేహితులతో శనివారం కలిసి కారులో ఇంటికి వస్తున్నాడు. రాత్రి బోరిగాం శివారులో కారు అదుపుతప్పి బోల్తాపడి పల్టీలు కొట్టింది. ప్ర మాదంలో రాజు తీవ్రగాయాలు కాగా, స్థానికులు అతన్ని నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. అ క్కడ చికిత్సపొందుతూ మృతిచెందాడు. అతనితో పాటు తన స్నేహితులకు గాయాలయ్యాయి. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. లారీ కారు ఢీకొన్న ఘటనలో ఒకరు..చెన్నూర్‌రూరల్: మండలంలోని అక్కెపల్లి బస్టాప్ సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. చెన్నూర్ నుంచి సిరోంచ వైపు వెళ్తున్న కారును చెన్నూర్ వైపు వస్తున్న లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. కారు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి కారులో ఇరుక్కుని అక్కడిక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృత దేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్డం నిమిత్తం చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
జాతీయస్థాయిలోనూ సత్తాచాటాలి
పెర్కిట్(ఆర్మూర్): రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించిన బాల్‌బ్యాడ్మింటన్ క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీల్లోనూ సత్తా చాటాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి ఆకాంక్షించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో నిర్వహించి 70వ రాష్ట్రస్థాయి జూనియర్ బాల, బాలికల బాల్‌బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారం ముగిశాయి. బాలుర విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచిన ఆదిలాబాద్ జట్టుకు, బాలికల విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచిన మెదక్ జిల్లా జట్టుకు ఎమ్మెల్యే ట్రోఫీని అందజేశారు. కార్యక్రమంలో బాల్‌బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ విద్యాసాగర్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణ, జిల్లా అధ్యక్షుడు శ్రావణ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బోనగిరి శ్యామ్, పలు జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
నేరడిగొండ: మండలంలోని రోల్మామడ వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యాపలగూడ గ్రామానికి చెందిన సిడాం సీతారాం (47) మృతిచెందాడు. బైక్‌పై దత్తు, సిడాం సీతారాంలు కలిసి సొనాల మండలం పార్డి గ్రామంలో పూజ కార్యక్రమానికి వెళ్లి తిరిగివస్తున్నారు. దత్తు బైక్ నడుపుతుండగా, యాపల్‌గూడ వెళ్లే రోల్మామడ వద్ద యూటర్న్ తీసుకుంటున్న సమయంలో వేగంగా వచ్చిన బొలెరో వాహనం ఢీకొట్టింది. వెనక ఉన్న సీతారాం ఘటన స్థలంలోనే మృతిచెందాడు. దత్తు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. గ్రామస్తులు, స్థానికులు అక్కడికి చేరుకున్నారు. రోడ్డుపైనే మృతదేహంతో ఆందోళనకు దిగడంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. కాంగ్రెస్ బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్ ఘటన స్థలానికి చేరుకుని గ్రామస్తులను సముదాయించారు. ఈ ప్రాంతంలో అండర్ బ్రిడ్జి నిర్మించాలనే విషయాన్ని జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని వారికి హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. గ్రామ సర్పంచ్ మండాడి కృష్ణ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్‌తో ఫోన్లో మాట్లాడించగా, నెలలోగా సమస్యను పరిష్కరించేలా అధికారుల దృష్టికి తీసుకెళ్తానని తెలిపినట్లు సర్పంచ్ వివరించారు. మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఇదిలా ఉండగా సంఘటన స్థలానికి ఇచ్చోడ సీఐ రమేశ్, నేరడిగొండ ఎస్సై ఇమ్రాన్ చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోథ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. -
జంతుగణనకు సన్నద్ధం
జన్నారం: నాలుగేళ్లకోసారి ఎన్టీసీఏ గైడ్‌లైన్స్ ప్రకా రం నిర్వహించే మాంసాహార, శాఖహార జంతువు ల గణనకు అటవీశాఖ సన్నద్ధమైంది. కవ్వాల్ టైగర్‌జోన్‌లోని 576 అటవీ బీట్లలో ఈ గణన జరగనుంది. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఎఫ్డీపీటీ శాంతారాం, జిల్లా అటవీ సంరక్షణ అధికారి శివ్‌ఆశిష్‌సింగ్ ఆదేశాల ప్రకారం సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ప్రత్యక్షంగా అడవుల్లోకి తీసుకెళ్లి గణన చేసే విధానాన్ని తెలియజేశారు. మూడు రో జుల పాటు మాంసాహార, మరో మూడురోజులు శాఖ జంతువులను లెక్కిస్తారు. ఫేజ్–1, 2, 3లో వా టిని లెక్కించనున్నారు. ఫేజ్–4లో కెమెరాలు ఏర్పా టు చేసి వాటిలో చిక్కిన వాటిని లెక్కింపు చేస్తారు. 2 చదరపు కి.మీ దూరంలో ఒక్క కెమెరా ఏర్పాటు చేస్తారు. ఈ సర్వేలో సిబ్బందితోపాటు వలంటీర్లకు అవకాశం కల్పించారు. సర్కిల్లో సుమారు 1300 పైగా మంది గణనలో పాల్గొననున్నారు. మూడు రోజులుగా ట్రయల్స్ సర్వే మాంసహార జంతువులైన పులి, చిరుతపులి, ఎలు గుబంటు, అడవి కుక్కలు, నక్కలు, తోడేలు, ముంగిస, పురిటిబంటి(హమీబడ్జెర్) పైథాన్ లాంటివి లెక్కించడానికి ట్రయల్స్ సర్వే చేస్తారు. ఈనెల 19 నుంచి 21 తేదీ వరకు ఈ సర్వే చేస్తారు. ఇందుకోసం 5 కి.మీ దూరం ట్రయల్ లైన్ ఏర్పాటు చేసుకుంటారు. కాలినడక సర్వే చేసి శాఖహార జంతువులు నేరుగా కనిపించినవి, మలం, పాదముద్రలు, చెట్లపై గీరిన ఆనవాళ్లు గుర్తించి ఎంస్ట్రైబ్ ఎలకాజికల్ యాప్‌లో వివరాలు నమోదు చేస్తారు. 400 మీటర్ల దూరంలో 10 మీటర్ల వృత్తంలో కనిపించిన చెట్లు, మొక్కలు, గడ్డిజాతులు పొదలు, ఔషధమొక్కలు లెక్కిస్తారు. వీటితోపాటు పశువులు తిరిగిన ఆనవాళ్లు, చెట్లు నరికిన ఆనవాళ్లు, ఇతర అంశాలను కూడా గుర్తిస్తారు. ట్రాన్సెక్ట్ సర్వే ద్వారా.. ప్రతీ బీట్‌లో 2 కి.మీ దూరం ట్రాన్సెక్ట్ లైన్స్ వేస్తా రు. 2 కి.మీ దూరం పొడవున లైన్స్ వేస్తారు. శాఖ హార జంతువులైన జింకలు, కృష్ణజింకలు, కొండగొ ర్రెలు, గడ్డిజింక, నీలుగాయి, సంబారు, అడవిదున్నలు, అడవి పందులు, కుందేళ్లు తదితర వాటిని సర్వే ద్వారా లెక్కిస్తారు. నేరుగా కనిపించినవి, వా టి గుంపును బట్టి సంఖ్యను అంచనా వేస్తారు. లైన్ కు ఎడమ, కుడి వైపులతోపాటు లైన్ సూచిన ప్రకా రం ఎంత దూరంలో కనిపించిందో వివరాలను ఎంస్ట్రైబ్ ఎకలాజికల్ యాప్‌లో నమోదు చేస్తారు. ఇదే లైన్లో 400 మీటర్ల దూరంలో ఒకసారి 30 మీటర్ల వృత్తంలో మొక్కలు, చెట్లు, పొదలు, గడ్డి జాతులు, ఔషధ మొక్కలు తదితర రకాలు వివరాలు నమో దు చేస్తారు. వీటితోపాటు దారిలో కనిపించిన మ నుషులు, పశువుల అలజడి, చెట్లు నరికివేతకు గురవడం, పొదలు తొలగించడం తదితర అన్ని వివరాలు డెహ్రడూన్‌లోని వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చేరుతాయని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా పులుల, వన్యప్రాణుల గణన వివరాలను టైగర్ మానిటరింగ్ సెల్ తెలియజేస్తోంది. ఒక్కో బీట్‌లో ముగ్గురు చొప్పున.. ట్రయల్స్, ఇన్సెక్ట్ సర్వేల్లో ప్రతీ బీట్‌లో ఒక్క ప్రదేశం ఎన్నుకుని ఆ ప్రాంతంలో ముగ్గురు సర్వే చేస్తారు. ఇద్దరు అటవీ సిబ్బంది, ఒక్క వలంటీర్ లేదా బేస్‌క్యాంపు సిబ్బంది ఉండేలా ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే వారికి శిక్షణ ఇచ్చి అవసరమైన సామగ్రిని అందించారు. -
రాజన్న దర్శనానికి వెళ్లేదెట్లా?
మంచిర్యాలఅర్బన్: రెండేళ్ల కోసారి జరిగే సమ్మక్క, సారలమ్మ జాతర ఈ నెల 28 నుంచి ప్రారంభం కానుంది. ఈనేపథ్యంలో వనదేవతల జాతరకు వెళ్లేముందు వేములవాడ రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సన్నద్ధం అవుతుండగా వేములవాడకు వెళ్లే భక్తులకు కనీసం ఒక్కటంటే ఒక్క బస్సు కూడా ఏర్పాటు చేయకపోవటంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కోల్‌బెల్ట్ ప్రాంతమైన శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి, రామకృష్ణాపూర్ ప్రాంతం నుంచి మేడారం జాతరకు ముందు వెళ్లివస్తుంటారు. గతంలో ఆర్టీసీ సంస్థ బస్సు నడిపినప్పుడు ప్రయాణికుల రాకపోకలతో ఆదా యం కూడా తెచ్చిపెట్టింది. ఈఏడాది ఇంతవరకు నేరుగా వెళ్లేందుకు బస్సు ఏర్పాటుపై ఉలుకుపలు కు లేకుండా పోయింది. దీంతో భక్తులు రాజన్నను దర్శించుకునేందుకు గోదావరిఖని, కరీంనగర్ చేరుకుని అక్కడి నుంచి వేములవాడకు బస్సులు మార్చుకుంటూ వెళ్లడం కష్టతరంగా మారింది. చంకలో పిల్లలు, నెత్తిన సామగ్రితో ప్రయాణికులు పడరాని పాట్లు పడుతున్నారు. మంచిర్యాల నుంచి ధర్మపురి, కొండగట్టు మీదుగా వేములవాడ బస్సులు నడిపిస్తే ప్రయాణికులకు సౌకర్యంతో పాటు సంస్థకు ఆదాయం సమకూరనుంది. తల్లులకు బంగారం (బెల్లం) మొక్కులు మేడారం జాతర సమీపిస్తుండటంతో భక్తులు వనదేవతలకు నిలువెత్తు బంగారం (బెల్లం) మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బెల్లం దుకాణాల వద్ద భక్తుల సందడి నెలకొంది. మంచిర్యాలలోని హోల్‌సెల్ వ్యాపారులు ఇప్పటికే మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని లాథూర్, నాందేడ్ నుంచి బెల్లం దిగుమతి చేసుకున్నారు. మంచిర్యాల నుంచి మంఽథని, సిరోంచ, మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్, తదితర ప్రాంతాలకు బెల్లం సరఫరా చేస్తుంటారు. బెల్లం లెక్క పక్కాగా.. మేడారం జాతర నేపథ్యంలో బెల్లం అమ్మకాలపై ఎక్సెజ్ శాఖ నిఘా పెట్టింది. వనదేవతల జాతర పే రిట నాటుసారా తరలించేందుకు అవకాశం ఉండడంతో బెల్లం విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈనేపథ్యంలో వ్యాపారులు అందుకు తగినట్లు జాగ్రత్త పడుతున్నారు. బెల్లం పక్కదారి పట్టకుండా ఆధార్‌కార్డు ఉంటేనే ఎత్తు బంగారం ఇస్తుండడం గమన్హారం. -
ముగిసిన న్యాయవాదుల క్రికెట్ పోటీలు
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలో న్యాయవాదులకు రెండు రోజులుగా కొనసాగుతున్న క్రికెట్ పోటీలు ఆదివారంతో ముగిసాయి. మంచిర్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బండవరపు జగన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలను శనివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ.వీరయ్య, రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కే.నిరోష, ఎకై ్సజ్ కోర్టు న్యాయమూర్తి రవితేజ ప్రారంభించారు. పోటీల్లో ఐదు టీమ్‌లు పాల్గొనగా ఎల్లో టీమ్, వైట్ టీమ్ ఫైనల్‌కు చేరుకున్నాయి. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఎల్లో టీమ్ విజేతగా నిలిచింది. ఎల్లో టీమ్ కేప్టెన్‌గా ఆకుల రవీందర్, వైట్ టీమ్ కేప్టెన్‌గా దండనాయకుల మనోహర్‌రావు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు భుజంగరావ్, స్పోర్ట్స్ కన్వీనర్ వేణు, తుల ఆంజనేయులు, గడప ఉమేష్, రంజిత్పటేల్, న్యాయవాదులు పాల్గొన్నారు. -
‘ఆదివాసీల పండుగలు’ పుస్తకావిష్కరణ
ఉట్నూర్‌రూరల్: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో దుర్వ సంతోష్ ప్రచురించిన మావంగ్ సడ్క్ (ఆదివాసీల పండుగలు) పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలను అందరికీ తెలిసేలా దుర్వ సంతోష్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. హైమన్ డార్ఫ్, మార్క్ పెన్నీ రచించిన పుస్తకాన్ని పునఃప్రచురించి డార్ఫ్ బెట్టి ఎలిజెబెత్ స్మారక గ్రంథాలయం వ్యవస్థాపకుడు దుర్వ సంతోష్ సమాజానికి అంకితం చేయడం మంచి పరిణామమన్నారు. ఇంద్రవెల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముఖాడే ఉత్తం, రిటైర్డ్ బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ మెస్రం మనోహర్, సర్పంచ్ రమేశ్, దస్తురాబాద్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దుర్గం మల్లేశ్, కడెం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీను యాదవ్ పాల్గొన్నారు. అందిన రేషన్ బియ్యంకోటపల్లి: మండలంలోని కొండంపేట గ్రామంలో రేషన్ బియ్యం అందక లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. ‘కొండంపేటకు అందని రేషన్ బియ్యం’శీర్షికన ఆదివారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి సివిల్ సప్లై అధికారులు స్పందించారు. వెంటనే లబ్ధిదారులకు రేషన్ బియ్యం అందించాలని ఆధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజాప్రతినిధి ఇంటి నుంచి రేషన్ బియ్యాన్ని అంగన్వాడీ కేంద్రానికి తరలించారు. ఉదయం నుంచే లబ్ధిదారులకు అందించారు. సమస్య పరిష్కారానికి చొరవచూపిన ‘సాక్షి’కి పలువురు కృతజ్ఞతలు తెలిపారు. కలప పట్టివేతసిరికొండ: మండల కేంద్రంలో అక్రమంగా నిల్వ ఉంచిన కలపను పట్టుకున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. శనివారం వడ్రంగుల ఇళ్లల్లో ఎఫ్ఎస్ఓ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో తనిఖీ నిర్వహించారు. జహీర్ ఇంట్లో రూ.9 వేల విలువ గల అక్రమ కలపను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. తనిఖీల్లో ఎఫ్బీఓ సంతోష్, భీంజీ, అటవీ సిబ్బంది ఉన్నారు. -
గొర్రెల్లో మశూచి వ్యాధి నివారణ చర్యలు
చెన్నూర్‌రూరల్: గొర్రెల్లో మశూచి వైరస్ వ్యాప్తి చెందే అంటువ్యాధి. వాటి చర్మంపై వెంట్రుకలు లేని భాగాలు పొదుగు, పొట్ట, ఛాతీ, పెదవులు, తోక కింద పొక్కులు ఏర్పడి చితికి పుండ్లు అవుతాయి. ఊపిరితిత్తులు, జీర్ణాశయం, (డొబ్బ) కండకాలు, మూత్రపిండాల్లో పొక్కులు ఏర్పడి, ఆమారం, శ్వాస సరిగా తీసుకోలేక జీవాలు చనిపోతుంటాయి. మశూచి సోకకుండా జాగ్రత్తలు తీసుకుని నివారణ చర్యలు చేపట్టాలని కత్తెరసాల పశు వైద్యాధికారి సతీశ్ వివరించారు. వ్యాధి వ్యాప్తి చెందే విధానం: మశూచి వ్యాధిసోకిన గొర్రె, వేరొక గొర్రెను తాకడం ద్వారా సోకుతుంది. కలుషితమైన దాణా, నీటి తొట్టెలు, ఇతర వస్తువుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. గాలి ద్వారా వైరస్ ఊపిరితిత్తులోకి ప్రవేశిస్తుంది. వ్యాధిగ్రస్థ గొర్రె అన్నిస్రావాల్లో వైరస్ కణాలు ఉంటాయి. గొర్రె శరీరంలోకి ప్రవేశించి 2 నుంచి 14 రోజుల్లోపు వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు రెండు రకాలుగా ఉంటాయి. మాలిగ్నెంట్ రకం: ఇది మరణాల శాతం ఎక్కువగా ఉంటుంది. గొర్రె పిల్లల్లో ఎక్కువగా వస్తుంటుంది. అధిక జ్వరంతో చర్మం బాగా ఎర్రబడి ఉంటుంది. జీవాలు మందకొడిగా ఉంటాయి. ఆహారం తీసుకోవు. కంటి నుంచి ముక్కు నుంచి నీళ్లు కారుతుంటాయి. మశూచి పొక్కులు చర్మం మీద పూర్తిగా ఏర్పడకముందే కొన్నిసార్లు జీవాలు చనిపోతుంటాయి. మశూచి పొక్కులు నోటి భాగం ఏర్పడినప్పుడు న్యూమోనియా వ్యాధి సోకి ఊపిరి తీసుకోవడం కష్టమై విపరీతంగా దగ్గుతుంటాయి. బైనెన్ రకం: ఈ వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువగా పెద్ద గొర్రెల్లో వస్తుంది. మశూచి పొక్కులు చర్మంపై వెంట్రుకలు లేని భాగాల్లో స్పష్టంగా కనిపిస్తాయి. ఆడ గొర్రెల్లో పొదుగుపైన పొక్కులు వచ్చినప్పుడు చితికి పుండ్లుగా మారి బ్యాక్టీరియా చేరి పొదుగువాపు వ్యాధి వస్తుంది. దీంతో పిల్లలకు పాలు సరిగా రాక పిల్లలు చనిపోతుంటాయి. నివారణ చర్యలు: జీవాలకు సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. కొత్త జీవాలను మందలో చేర్చుకునే ముందు, కొన్నిరోజుల పాటు దూరంగా ఉంచాలి. గొర్రె పిల్లలకు తగినంత జున్ను పాలను తాగించడంతో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధి సోకిన తర్వాత: వ్యాధి సోకిన జీవాలను వెంటనే మందలోంచి వేరు చేసి ప్రత్యేకంగా ఉంచి పశు వైద్యుడిని సంప్రందించాలి. వ్యాధిబారినపడ్డ గొర్రెలను బయటకు వెళ్లనివ్వకూడదు. వ్యాధి సోకి చనిపోయిన జీవాల కళేబరాలను లోతుగా గొయ్యి తీసి సున్నం వేసి అందులో పూడ్చిపెట్టాలి. జీవాలు చనిపోయిన ప్రదేశాన్ని, మేత, నీటి తొట్టెలను క్రిమి సంహారక ద్రావణంతో శుభ్రపర్చాలి. అవి తినగా మిగిలిన పదార్థాలను కాల్చి వేయాలి. -
ఆలిండియా అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక
మంచిర్యాలఅర్బన్: కర్ణాటకలోని బెంగళూర్ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్సైన్స్లో నిర్వహించే 85వ ఆలిండియా యూనివర్సిటీ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ 2025–26 పోటీలకు మంచిర్యాల మిమ్స్ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థిని శృతి ఎంపికై ంది. ఈ నెల 12 నుంచి జరిగే పోటీల్లో 200 మీటర్ల పరుగుపందెంలో కాకతీయ యూనివర్సిటీ నుంచి పాల్గొననున్నారు. ఈ సందర్భంగా విద్యార్థి శృతిని కళాశాల కరస్పాండెంట్ శ్రీనివాసరాజు, ప్రిన్సిపాల్ ఉపేందర్, వైస్ ప్రిన్సిపాల్ శ్రీధర్‌రావు, పీడీ నూనె శ్రీనివాస్ అభినందించారు. -
నకిలీపత్రాలతో రెండో పాస్‌పోర్ట్.. కటకటాల్లోకి విలేకరి
నేరడిగొండ: విదేశాలకు వెళ్లేందుకు నిబంధనలకు విరుద్ధంగా నకిలీ పత్రాలు సృష్టించి, రెండు పాస్‌పోర్టులు పొందిన ఓ పత్రిక విలేకరిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన నేరడిగొండ మండలంలో చర్చనీయాంశంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరడిగొండ మండలం కుమారి గ్రామానికి చెందిన వేణుగౌడ్ కొంతకాలంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో ఓ పత్రికలో విలేకరిగా పనిచేస్తున్నారు. ఉపాధి నిమిత్తం ఇజ్రాయెల్ వెళ్లాలనే ఉద్దేశంతో 2012లో మొదటిసారి పాస్‌పోర్టు తీసుకున్నాడు. అప్పట్లో వీసా కోసం దరఖాస్తు చేసుకోగా, సాంకేతిక కారణాలతో పాస్‌పోర్టు చెల్లదని తిరస్కరణకు గురైంది. ఎలాగైనా విదేశాలకు వెళ్లాలనే అత్యాశతో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో 2016లో అడ్డదారి తొక్కాడు. తల్లిదండ్రుల పేర్లు మారుస్తూ నకిలీపత్రాలు సృష్టించి అధికారులను తప్పుదోవ పట్టించి రెండో పాస్‌పోర్టు పొందాడు. రెండు వేర్వేరు పాస్‌పోర్టులు ఉండటంతో సంబంధిత కంపెనీ అధికారులు వీసా ప్రక్రియను నిలిపివేశారు. ఈక్రమంలో గతేడాది వేణుగౌడ్ మరోసారి పాస్‌పోర్ట్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. అధికారుల పరిశీలనలో ఒకే వ్యక్తికి వేర్వేరు వివరాలతో రెండు పాస్‌పోర్టులు ఉన్న విషయం బయటపడింది. నకిలీ పత్రాలు సమర్పించి పాస్‌పోర్ట్ పొందినందుకు అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు వేణుగౌడ్‌పై కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా, జడ్జి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. -
దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు
● ముగ్గురు నిందితుల రిమాండ్ఆదిలాబాద్టౌన్: దోపిడీ కేసును టూటౌన్ పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను ఆదివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. శుక్రవారం మార్కెట్ యార్డు వద్ద బాధితుడు మునీశ్వర్ గౌరవ్ విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నాడు. ఆ సమయంలో ముగ్గురు నిందితులు అతని వద్ద నుంచి రూ.1050తోపాటు ఫోన్ లాక్కొని పరారీ అయ్యారు. బాధితుడు ఫిర్యాదు చేయగా, వెంటనే స్పందించిన పోలీసులు ఆదిలాబాద్ పట్టణంలోని నెహ్రూ చౌక్‌కు చెందిన నిందితులు గజ్బే కిరణ్, ఖుర్షీద్నగర్కు చెందిన అర్ఫాజ్ ఖాన్, డాల్డా కంపెనీకి చెందిన షేక్ మోయిన్లను పట్టుకున్నారు. వారి నుంచి రూ.వెయ్యి నగదుతోపాటు సెల్ఫోన్లు, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. జల్సాలకు అలవాటుపడి నేరాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. -
సమస్యల పరిష్కారంలో ముందుంటా
జన్నారం: నియోజకవర్గంలోని ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటానని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఆదివారం జన్నారం మండలం పొనకల్ ఈర్లగుట్టపై జరిగిన శ్రీ కేతేశ్వర కంకాలమ్మ జాతరకు హాజరై శివాలయంలో పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆలయ కమిటీ కోరిక మేరకు రోడ్డు, విద్యుత్ సౌకర్యం కల్పిస్తానన్నారు. ప్రధాన రహదారి నుంచి ఆలయం వరకు ఉన్న దారి అటవీశాఖ పరిధిలో ఉందని, వారితో చర్చించి సాధ్యమైతే రోడ్డు సౌకర్యానికి నిధులు మంజూరు చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ ఫసీఉల్లా, మాజీ జెడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్, ఆలయ కమిటీ చైర్మన్ నర్సింగరావు, వైస్ చైర్మన్ చిలువేరు నర్సయ్య, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముజఫర్ అలీఖాన్, ప్రధాన కార్యదర్శి మాణిక్యం, సీనియర్ నాయకులు గుర్రం మోహన్‌రెడ్డి, శంకర్, నందునాయక్, సతీశ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
జాతీయస్థాయికి చెన్నూర్ విద్యార్థిని ఎంపిక
చెన్నూర్: కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ వేదికగా గతేడాది అక్టోబర్ 31న దేశవ్యాప్తంగా నిర్వహించిన వీర్గాధ 5.0 పోటీలలో పట్టణంలో ని శార్వాణి పాఠశాలకు చెందిన ఐదో తరగతి విద్యార్థిని తాండ్ర స్వరమంజుప్రియ ప్రతిభ కనబర్చి జాతీయస్థాయికి ఎంపికై నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య తెలిపారు. దేశ భద్రతకు అనుక్షణం శ్రమిస్తూ ప్రాణాలు పణంగా పెట్టి శత్రుదుర్బేద్యంగా దేశాన్ని మార్చిన అమర జవానుల స్మారకార్థం పోటీలు నిర్వహించినట్లు తెలిపా రు. దేశవ్యాప్తంగా 50 మంది విద్యార్థులు పోటీలో పాల్గొన్నట్లు ఆయన పేర్కొన్నారు. సైని కుల త్యాగాలపై విద్యార్థిని రాసిన పద్యం జాతీ య స్థాయికి ఎంపికై ందన్నారు. సదరు విద్యార్థినిని పాఠశాల కరస్పాండెంట్ మేడ శ్రావణ్‌కుమార్‌రెడ్డి, ఉపాధ్యాయులు, పట్టణ ప్రముఖులు అభినందించారు. -
చెట్టును ఢీకొన్న కారు
జైపూర్: మండలంలోని షెట్పల్లి క్రాస్‌రోడ్డు వద్ద శనివారం రాత్రి అదుపుతప్పి కారు చెట్టు ను ఢీకొటింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. సీసీసీ సింగరేణి క్వార్టర్స్‌లో నివా సం ఉంటున్న గూడ కుషుడు సింగరేణి కార్మికుడిగా పనిచేస్తున్నాడు. కుటుంబసభ్యులతో కలి సి మేడారం వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. కారులో ప్ర యాణిస్తున్న కుషుడు, అతడి భార్య శ్రావ్య, కు మార్తె ఐయాన్షీ గాయపడగా మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. కుమార్తెను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ పంపించారు. -
ముగిసిన ‘నిపా’ శిక్షణ
మంచిర్యాలఅర్బన్: స్థానిక ప్రైవేట్ హోటల్లో కేజీబీవీ ప్రత్యేక అధికారులకు జాతీయ విద్యాప్రణాళిక, పరిపాలన సంస్థ (ఎన్ఐఈపీఏ) నిపా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ ఆదివారం ముగిసింది. మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు చెందిన కేజీబీవీ ఎస్వోలు, మోడల్ స్కూల్ హాస్టల్ వార్డెన్ల ఐదురోజుల శిక్షణ ఉత్తేజాన్ని నింపింది. సామర్థ్యాల పెంపు, ఉత్తమ ఫలితాలు సాధించడం..నాణ్యమైన విద్యపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తార్ఫీదు ఇచ్చారు. విద్యార్థుల భద్రత, పరిశుభ్రత, వసతిగృహాల నిర్వహణ తదితర అంశాల్లో శిక్షణ పొందారు. భావోద్వేగపరంగా సురక్షత హాస్టల్, వసతిగృహ వాతావరణాన్ని ఎలా సృష్టించడంపై డ్యాకుమెంటేషన్ చిత్రాలతో ప్రదర్శించారు. సమస్యల మూలాలు, మానసిక ఆరోగ్యం..నిశబ్ధ వర్గీకరణ తదితర అంశాలెన్నో చర్చకు వచ్చాయి. కేజీబీవీల బలోపేతంపై బృంద చర్చలు, నాటిక ప్రదర్శన తీరు ఆలోచింపజేశాయి. శిక్షణ పొందిన ఎస్వోలు, వార్డెన్లు ప్రాస్పెక్టివ్ సర్టిఫికెట్లు అందుకున్నారు. సెక్టోరల్ అధికారులు విజయలక్ష్మి, చౌదరి, సత్యనారాయణమూర్తి, నిర్మల్ జిల్లా కోఆర్డినేటర్ నవీనజ్యోతి, అసిస్టెంట్ జెండర్ కోఆర్డినేటర్ రమాదేవి, ట్రైనర్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేయాలి
● ఉమ్మడి జిల్లా నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం నేరడిగొండ: మున్సిపల్ ఎన్నికల్లో అన్ని బల్దియాల్లో బీఆర్ఎస్ జెండా ఎగరేయాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఉమ్మ డి ఆదిలాబాద్ జిల్లా నేతలతో ఆదివారం ఏ ర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ అవలంభిస్తున్న ప్రజా వ్యతి రేక విధానాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సి న వ్యూహాలు, స్థానిక సమస్యలు, పార్టీ బలోపేతంపై నాయకులతో చర్చించారు. సమావేశంలో ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవ లక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు జోగు రామన్న, కోనేరు కోనప్ప, దుర్గం చిన్నయ్య, బాల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు. -
ఆదివాసీల ఆత్మబంధువు హైమన్ డార్ఫ్
ఆసిఫాబాద్‌అర్బన్: ఆదివాసీల ఆత్మబంధువు ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ అని ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ అన్నారు. జైనూర్ మండలం మార్లవాయి గ్రామంలో ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్–జెట్టి ఎలిజెబెత్ దంపతుల వర్ధంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎస్పీ నితిక పంత్, ఐటీడీఏ పీవో యువరాజ్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, గిరిజన సంఘాల నాయకులతో కలిసి హైమన్ డార్ఫ్–జెట్టి ఎలిజెబెత్, కుమురం భీం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ డార్ఫ్ దంపతుల స్ఫూర్తితో ఆదివాసీ, గిరిజనుల అభివృద్ధికి కృషిచేస్తామన్నారు. ఆదివాసీలపై అధ్యయన కోసం వారు మార్లవాయి గ్రామానికి వచ్చి స్థిరపడ్డారన్నారు. వారు నివసించిన ఈ ప్రాంతం ఎంతో చారిత్రాత్మకమన్నారు. యువత, గిరిజనులు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం హైమన్ డార్ఫ్–జెట్టి ఎలిజెబెత్ దంపతుల పేరిట స్మృతివనం ఏర్పాటుకు నిధులు మంజూరు చేసిందన్నారు. వారు గిరిజనులతో మమేకమై ఆదివాసీల చైతన్యం కోసం కృషి చేశారన్నారు. డార్ఫ్..మానవ పరిణామ పర్యావరణ వేత్త, గొప్ప శాస్త్రవేత్త అని తెలిపారు. ఎస్పీ నితిక పంత్ మాట్లాడుతూ హైమన్ డార్ఫ్ దంపతులు మహానీయులని కొనియాడారు. మార్లవాయి అనేది ఒక ప్రాంతం కాదని, ఇది ఒక పవిత్ర స్థలమన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మాట్లాడుతూ రాయిసెంటర్ల ఏర్పాటు, గిరిజనుల్లో పటేళ్ల వ్యవస్థ బలోపేతం చేయడంలో డార్ఫ్ దంపతులు కృషి చేశారన్నారు. మార్లవాయి ప్రాంత అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జైనూర్, ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్లు విశ్వనాథ్, ఇరుకుల మంగ, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, ఆసిఫాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి శ్యాంనాయక్, డీటీడీవో రమాదేవి, మార్లవాయి సర్పంచ్ కనక ప్రభావతి, రాజ్‌గోండ్ సేవాసమితి ప్రతినిధి సిడాం అర్జు, రాయిసెంటర్ జిల్లా మేడి కుర్సింగ మోతీరాం, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
మామిడి పూత యాజమాన్య పద్ధతులు
చెన్నూర్‌రూరల్: ప్రస్తుతం మామిడి పూత ప్రారంభమైంది. వాతావరణ మార్పులతో ఆకాశంలో మబ్బులు పడుతున్నాయి. జిల్లాలో రైతులు ఎక్కువగా మామిడి సాగు చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన పూత కూడా రాలిపోయే అవకాశం ఉంది. దీంతో కాత కూడా తగ్గిపోతుంది. తద్వారా దిగుబడి తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. మామిడి దిగుబడి పెంచాలంటే పూత, పిందె సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్‌వో కళ్యాణి పేర్కొన్నారు. వాతావరణ ప్రభావాన్ని అధిగమించాలంటే రైతులు మేలైన యాజమాన్య పద్ధతులను అవలంబించాలని సూచించారు. యాజమాన్య పద్ధతులు..జూన్, జూలైలో మామిడి కొమ్మ కత్తిరింపులు చేపట్టాలి. ముఖ్యంగా ఎండు పుల్లలను మొత్తం తీసివేసి చెట్టును శుభ్రపర్చాలి. ఆగస్టులో చిలేటెడ్ జింక్ ఒక గ్రాము, ఒక లీటరు నీటికి లేదా, బోరాన్ (19 శాతం) 1.25 గ్రాములు, లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. అక్టోబర్ నెలాఖరు, నవంబర్ తొలివారం నుంచి మామిడి చెట్టుకు నీరు కట్టడం ఆపి చెట్లను నీటి ఎద్దడికి గురిచేయాలి. నవంబర్‌లో 10 గ్రాముల పోటాషియం నైట్రేట్ (13–0–45) లీటరు నీటికి కలిపి పిచికారి చేయడం ద్వారా పూత మొగ్గలు సకాలంలో పూస్తాయి. పూత మొగ్గ పెరుగుదల దశలో (జనవరి 15 నుంచి) తేలికపాటి నీటితడులు ఇవ్వడం ద్వారా త్వరగా పూత విచ్చుకుని ఫలదీకరణ చెందుతుంది. పదేళ్ల పైబడిన చెట్లకు నాలుగు డ్రిపర్లు చెట్టు కాండం నుంచి మీటరు దూరంలో ఉండేటట్లు చూడాలి. ఒక చెట్టుకు 60 నుంచి 80 లీటర్లు నీరు అందేటట్లు (రోజుకు 2 గంటలు) ఇవ్వాలి. సూక్ష్మధాతు లోపం ఉన్న తోటల్లో 1.25 గ్రాముల బోరాస్ (19 శాతం) లీటరు నీటికి (125 గ్రాములు, 100 లీ.నీటికి) కలిపి మొగ్గల పెరుగుదల దశలో పిచికారి చేయాలి. తద్వారా ఫలదీకరణ జరిగి పిందె బాగా కట్టి అధిక దిగుబడి వస్తుంది. మామిడి పిందె దశలో (జొన్నగింజ పరిమాణం) ఉన్నప్పుడు నాప్తిలిన్ అసిటిక్ అమ్లం (ఎన్ఎఎ) 20 పి.పిఎం (2 గ్రాములు 100 లీటరు నీటికి) గాఢతలో రెండుసార్లు 15 రోజుల వ్యవధిలో పిచికారి చేయాలి. తద్వారా పూత, పిందె బాగా నిలబడుతుంది. కాయలు నిమ్మకాయ పరిమాణంలో ఉన్నప్పుడు పోటాషియం నైట్రేట్‌ను 10 గ్రాముల చొప్పున ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. దీంతో కాయ అధిక ఉష్ణోగ్రతలను తట్టుకుని త్వరగా పెరుగుతుంది. ప్రస్తుతం మామిడిపూత దశలో ఉన్నందున రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. -
‘గిరి’ యాదిలో హైమన్ డార్ఫ్
ఆసిఫాబాద్: ఎక్కడో లండన్ నుంచి తరలివచ్చిన ఆ దంపతులు తమ సేవలతో ఆదివాసీల హృద యాల్లో చిరస్థాయిగా నిలిచారు. వారే హైమన్ డార్ఫ్–బెట్టి ఎలిజెబెత్ దంపతులు. ఆంత్రోపాలజీ ప్రొఫెసర్ క్రిస్టోఫర్ వోన్ ఫ్యూరర్ హైమన్ డార్ఫ్, ఆయన భార్య బెట్టి ఎలిజెబెత్ 1970లో కుమురం భీం జిల్లా మార్లవాయిలో ఆదివాసీలతో ఉంటూ వారి ఆచారాలు, సమస్యలపై పరిశోధన చేశారు. గిరిజన జీవనస్థితి, సమస్యలు, వారి హక్కుల కోసం పోరాడారు. భౌతికంగా దూరమైన వారు చేసిన సేవలకు గుర్తుగా ఆదివాసీలు ఏటా జనవరి 11న ఆ దంపతుల వర్ధంతిని ఏజెన్సీలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆదివారం జైనూర్ మండలం మార్లవాయిలో జరిగే వర్ధంతికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఆదివాసీలపై అధ్యయనంఆస్ట్రియా రాజధాని వియత్నాంలో 1909లో జన్మించిన హైమన్ డార్ఫ్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో విద్యనభ్యసించారు. ఆంత్రోపాలజీలో డాక్టరేట్ చేశారు. భారత్‌లోని నాగా, గోండు, కోయ, కొండరెడ్లు, చెంచు, తదితర ఆదివాసీల జీవన విధానంపై అధ్యయనం చేశారు. 1942 నుంచి 1945 మధ్య ఆదిలాబాద్ జిల్లా జైనూర్ మండలం మార్లవాయిలో తన సతీమణితో కలిసి నివసించారు. ఆదివాసీ లు, వారి ఆహారపు అలవాట్లు, జీవన విధానం, వ్య వసాయం, భాష, చావు, పుట్టుక, వివాహాలు, యా స, సాగు విధానాలపై డార్ఫ్ రాసిన పుస్తకాలు ప్రపంచంలో ఎంతో ప్రాముఖ్యత పొందాయి. 1979లో తొలిసారి భారత్‌కు వచ్చినప్పుడు లండన్ కు చెందిన మైఖేల్ యార్క్‌తో ఆదివాసీల జీవనంపై పలు డాక్యుమెంటరీలు చేశారు. ఆదివాసీలకు భూ పట్టాలు పంపిణీ..ఆదివాసీలు భూమిపై హక్కులు లేక ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో వారికి యాజమాన్య హక్కులు కల్పించేందుకు హైమన్ డార్ఫ్ నిజాం నవాబుతో చ ర్చలు జరిపారు. అప్పటికి అటవీ భూములను సాగు చేస్తున్న స్థానికులకు ఒక్కొక్కరికి సుమారు 15 ఎకరాలు ఇప్పించేందుకు కృషి చేశారు. నేడు ఏ జెన్సీలో 1.60 లక్షల ఎకరాలు ఆది వాసీ కుటుంబా లకు భూ పట్టాలు దక్కాయి. ఈక్రమంలో నిజాం ప్రభుత్వం డార్ఫ్‌ను కొంతకాలం పాటు గిరిజన అ భివృద్ధి సలహాదారుగా నియమించింది. ఆదివాసీ ల హక్కుల పరిరక్షణకు డార్ఫ్ సూచనలు, సలహా లు ఇచ్చారు. ఆయన నివసించిన మార్లవాయిలో ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పారు.డార్ఫ్ దంపతులు నివసించిన ఇల్లు నమూనాహైమన్ డార్ఫ్ దంపతుల విగ్రహాలు డార్ఫ్ రచనలుడార్ఫ్ కొడుకు పేరు లచ్చు పటేల్హైమన్ డార్ఫ్ దంపతులు మార్లవాయిలో నివసం ఉన్నప్పుడు ఆ గ్రామపెద్ద లచ్చుపటేల్ మృతి చెందాడు. ఆ మరునాడే డార్ఫ్ భార్య ఎలిజెబెత్ ఓ కుమారుడికి జన్మనిచ్చింది. ఆదివాసీ సంప్రదాయం ప్రకారం గ్రామంలో ఎవరైన చనిపోతే, మరుసటి రోజు ఎవరైనా పుడితే వారే మళ్లీ పుట్టారని నమ్ముతారు. ఈ క్రమంలో డార్ఫ్ దంపతులు తమ కొడుకు పేరు లచ్చుపటేల్ నామకరణం చేశారు. తమ మరణానంతరం తమ దంపతుల సమాధులు ఇక్కడే ఏర్పాటు చేయాలని డార్ఫ్ స్థానికులను కోరారు. ఎలిజెబెత్ 1987లో మరణించగా, కుమారుడు లచ్చుపటేల్(నికోలస్) ఆమె చితాభస్మాన్ని మార్లవాయికి తీసుకువచ్చి స మాధి కట్టించారు. 1995 జనవరి 11న హైమ న్ డార్ఫ్ మృతి చెందగా 2012లో చితాభస్మాన్ని భార్య సమాధి పక్కన డార్ఫ్ సమాధి కట్టించారు. అప్పటి నుంచి ఏటా జనవరి 11న డార్ఫ్ వర్ధంతిని ఆదివాసీలు జరుపుకొంటున్నారు. ఆదివారం రాష్ట్ర మంత్రులుతో పాటు జిల్లా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, అధికారులు హాజరుకానున్నారు. -
మైదానం ఉన్నా లేనట్లే!
లక్సెట్టిపేట: 1968లో లక్సెట్టిపేట తాలుకా హెడ్‌క్వార్టర్ ఉన్నప్పుడు ఇక్కడ పాఠశాలను ఏర్పాటు చేశారు. 1971లో కళాశాలగా అప్‌గ్రేడ్ చేశారు. జన్నారం, ధర్మపురి, ధర్మారం, హాజీపూర్ లాంటి సుదూర ప్రాంతాల విద్యార్థులు ఇక్కడ విద్యాభ్యాసం చేశారు. పట్టణానికి చెందిన దాత అప్పటి రోజుల్లో కళాశాలతోపాటు మైదానానికి మొత్తం సుమారు 9 ఎకరాల స్థలాన్ని విరాళంగా ఇచ్చినట్లు పూర్వీకులు తెలుపుతున్నారు. ఇక్కడే చదువుకున్న ప్రస్తుత, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు.. కళాశాలపై ఉన్న మమకారంతో ఇటీవల నూతన పక్కా భవానాన్ని నిర్మాణం చేపట్టారు. కళాశాల పక్కన ఉన్న మైదానాన్ని గత పాలకుల హయాంలో 2019లో మినీ స్టేడియం పనులు అర్థంతరంగా నిలిపివేశారు. గత ఆరేళ్లుగా అదే పరిస్థితి. అది కాక మైదానంలోనే ఓపెన్ జిమ్ ఏర్పాటుతో స్టేడియం విస్తీర్ణం తగ్గింది. స్టోర్ రూం నిర్మాణం నిరుపయోగంగా మారింది. మినీ స్టేడియానికి మంజూరైన నిధులు వృథా చేశారని పలువురు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకుని మైదానంపై దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు. మైదానం కొలిక్కి వచ్చేదెలా..గతంలో క్రీడాపోటీలు, టొర్నమెంట్లు జరిగేవి. వాలీబాల్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, కబడ్డీ కోర్టులు హైజంప్, లాంగ్‌జంప్ అన్ని సౌకర్యాలు మైదానంలో ఉండేవి. మినీ స్టేడియం నిర్మాణ సమయంలో వాటిని తొలగించారు. విశాలంగా ఉన్న మైదానం నిర్మాణంతో విస్తీర్ణం తగ్గిపోయింది. ఉదయం వాకింగ్, సాయంత్రం సరదాగా మైదానంలో కాలక్షేపం చేసే స్థానికులు రాలేకపోతున్నారు. భవిష్యత్ ప్రణాళిక లేక నిర్మాణం చేశారని సంబంధిత అధికారులు మినీ స్టేడియం నిర్మిస్తారా లేక ఉన్న వాటిని తొలగించి విశాలంగా చేస్తారా అని మండిపడుతున్నారు. -
జ్వరంతో కొలాం విద్యార్థి మృతి
ఆదిలాబాద్‌రూరల్: జ్వరంతో కొలాం విద్యార్థి మృతి చెంది న ఘటన ఉట్నూర్ మండలంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. ఉట్నూర్ మండలం కుమ్మరికుంట గ్రామానికి చెందిన మడావి భగవంత్‌రావ్–మరుబాయి దంపతుల కుమారుడు మెంగురావ్ (14) ఆసిఫాబాద్ జిల్లాలోని పీవీటీజీ గురుకుల పాఠశాలలో గత విద్యా సంవత్సరం 8వ తరగతి వరకు చదివారు. ఈ సంవత్సరం పాఠశాలకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటున్నాడు. నెలక్రితం అనారోగ్యానికి గురికాగా కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యులకు చూపించి చికిత్స చేయించారు. గత నాలుగురోజుల క్రితం జ్వరం రావడంతో ఉట్నూర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్ రిమ్స్‌కు రెఫర్ చేశారు. అక్కడికి నుంచి గురువారం హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో అడి్మ్ట్ చేశారు. పరిస్థితి విషమించడంతో చికిత్సపొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మృతుడి కుటుంబ సభ్యులు బాలుడి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు ఇబ్బంది పడ్డారు. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు సంబంధిత ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే మృతదేహాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. చికిత్సపొందుతూ వ్యక్తి.. లక్సెట్టిపేట: మున్సిపాలిటీ పరిధిలోని గంపలపల్లికి చెందిన అగ్గు రమేశ్ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై గోపతి సురేష్ తెలిపారు. ఆయన కథ నం ప్రకారం.. రమేశ్ (32) గత కొన్నిరోజులుగా మానసిక పరిస్థితి బాగా లేక ఆసుపత్రులకు వెళ్లినా నయం కాలేదు. తరచూ చనిపోతాను అంటూ తెలి పేవాడు. ఊత్కూరు శివారులోని తన పొలం వద్ద గురువారం పురుగుల మందు తాగి ఇంటికి వచ్చి కుటుంబీకులకు విషయం చెప్పాడు. వెంటనే ప్రభు త్వ ఆసుపత్రికి తీసుకెళ్లి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. భార్య లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాలుడి అదృశ్యం నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రంలో బాలుడు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. భాగ్యనగర్ కాలనీకి చెందిన పసుపులేటి అనిల్–చంద్రికలకు కుమారుడు, కుమార్తె సంతానం. కుమారుడు అశ్విన్ (3) ఉదయం ఇంటికి ఎదురుగా ఆడుకుంటుండగా శనివారం ఉదయం 11 గంటల నుంచి కనిపించడం లేదు. ఆచూకీ కోసం వెతికిన దొరకకపోవడంతో కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు సీఐ నైలు నాయక్ తెలిపారు. -
గుడుంబా స్థావరాలపై దాడులు
ఖానాపూర్/కడెం: ఖానాపూర్ మండలంలో ని సత్తన్‌పల్లి, రాంరెడ్డిపల్లె గ్రామాల్లో శనివా రం ఎకై ్సజ్, ఆదిలాబాద్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 5 లీటర్ల గుడుంబా స్వాధీనం, 400 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. రాంరెడ్డిపల్లెకు చెందిన బి.అరవింద్‌పై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. కడెం మండలంలోని పెద్దూర్‌తండా, చిన్నబెల్లాల్, పెద్దబెల్లాల్ గ్రామాల్లోని గుడుంబా స్థావరాలపై దాడి చేసి నాటుసారా, బెల్లం పట్టుకున్నట్లు వెల్లడించారు. ఈ దాడుల్లో ఎకై ్సజ్ సీఐ రంగస్వామి, ఆదిలా బాద్ ఎన్ఫోర్స్మెంట్ సీఐలు గంగారెడ్డి, అక్బర్‌హుస్సేన్, ఎస్సై అభిషేకర్, డీటీఎఫ్ ఎస్సై సింధు, సిబ్బంది ఉన్నారు. -
కొత్త ప్లాంటు పనులు వేగంగా చేపట్టాలి
జైపూర్: ఎస్టీపీపీ విస్తరణలో భాగంగా నూతనంగా నిర్మిస్తున్న మూడో యూనిట్(800) మెగావాట్ల ప్లాంటు పనులు వేగవంతంగా చేపట్టాలని సింగరే ణి డైరెక్టర్(ఈఅండ్ఎం) ఎం.తిరుమలరావు తెలిపా రు. జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటును శనివారం ఆయన సందర్శించారు. కొత్త ప్లాంటు నిర్మిస్తున్న ప్రాంతాన్ని, పనులు పరిశీలించి బీహెచ్ఈఎల్, పవర్మేక్ కంపెనీ అధికారులతో మాట్లాడారు. ప్లాంటు ప్రస్తుత స్థితిగతులను అధికారులు మ్యాప్ ద్వారా ఆయనకు వివరించారు. అక్కడ ని ర్మించిన సైట్ ఆఫీసు, ఫస్ట్ ఎయిడ్, రక్షణ విభాగంతోపాటు వివిధ ఏజెన్సీల ఆఫీసులను సందర్శించారు. ఎస్టీపీపీ ఆవరణలో తాత్కాలిక భవనంలో వచ్చే ఏడాది నుంచి స్కూల్ ప్రారంభోత్సవానికి చేపడుతున్న మరమ్మతు పనులు పరిశీలించారు. ఎస్టీపీపీ ఈడీ చిరంజీవి, జీఎంలు నర్సింహారావు, మదన్మోహన్ తదితరులు ఉన్నారు. -
అక్కా,తమ్ముడు అదుర్స్..
దండేపల్లి: ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాలలో నిర్వహించిన ప్రతిభా పోటీల్లో దండేపల్లికి చెందిన అక్కాతమ్ముడు ప్రథమస్థానంలో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. దండేపల్లి మండలంలోని గుడిరేవు జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని సంతపురి అహల్య, ఒలింపియాడ్‌లో ఇదే పాఠశాలలో చదివే ఆమె తమ్ముడు అలెగ్జాండర్(8వ తరగతి) ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న అక్కా, తమ్ముడిని హెచ్ఎం మల్లూరి శ్రీనివాస్, ఇంగ్లిష్ ఉపాధ్యాయుడు బండారి శ్రీనివాస్, ఉపాధ్యాయులు రాజశేఖర్, అనిత, సల్మా, లచ్చన్న, నరేందర్ అభినందించారు. -
భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు
ఇంద్రవెల్లి: ఈనెల 18న మెస్రం వంశీయుల మహాపూజతో ప్రారంభం కానున్న నాగోబా జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పటేల్ అన్నారు. మండలంలోని కేస్లాపూర్ నాగోబా ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాతర ఏర్పాట్లను పరిశీలించి మెస్రం వంశీయులు, అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈనెల 22న జరిగే నాగోబా దర్బార్‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు రానున్నట్లు తెలిపారు. పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఆలయంలో శాశ్వత అభివృద్ధి పనుల కోసం రూ.22 కోట్ల నిధులతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. సర్పంచ్ మెస్రం తుకారం, నాగోబా ఆలయ కమిటీ చైర్మన్ ఆనంద్‌రావ్, ఐటీడీఏ డీడీ జాదవ్ అంబాజీ, ఈఈ తానాజీ, పంచాయతీరాజ్ డీఈ పవార్ రమేశ్ తదితరులు ఉన్నారు. -
ఆటో దగ్ధం
భైంసాటౌన్: పట్టణంలోని నర్సింహానగర్‌లో వేదం హైస్కూల్ సమీపంలో నిలిపి ఉంచిన ఓ ప్యాసింజర్ ఆటో శనివారం దగ్ధమైంది. మ ధ్యాహ్న సమయంలో ఆటోలో నుంచి ఆకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో స్థానికులు అ గ్నిమాపక శాఖ అధికారులకు సమాచారమి చ్చారు. దీంతో వారు చేరుకుని మంటలార్పివేశారు. పట్టణానికి చెందిన అల్తాఫ్ ప్రైవేట్ స్కూల్ బస్సు నడుపుతుండగా, ఖాళీ సమయంలో ఆటో నడిపేవాడు. సీఎన్జీ ఆటో కా వడంతో మంటలు చెలరేగినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ విషయమై పట్టణ సీఐ సాయికుమార్‌ను వివరణ కోరగా, ఎలాంటి ఫిర్యాదు రాలేదని పేర్కొన్నారు. -
6వ ట్రైబల్ స్టేట్ స్పోర్ట్స్ మీట్లో ప్రతిభ
బజార్హత్నూర్: ములుగు జిల్లా ఏటూరునాగారంలో ఈనెల 7 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించిన 6వ ట్రైబల్ స్టేట్‌మీట్ అథ్లెటిక్స్ క్రీడాపోటీల్లో మండలం జాతర్ల గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. అండర్–17 అథ్లెటిక్స్ క్రీ డాపోటీల్లో మహేశ్ గోల్డ్‌మెడల్(800 మీటర్ల), ఇంద్రబాన్ 100 మీటర్లు, షార్ట్ఫూట్, జా వెలిన్త్రోలో మూడు గోల్డ్ మెడల్స్, కార్తీక్ లాంగ్‌జంప్‌లో గోల్డ్‌మెడల్, నగేశ్, ఇంద్రబాన్, జకేష్, మహేశ్ (400 మీటర్ల) గోల్డ్‌మెడల్ సాధించారు. పాఠశాల క్రీడాకారులు 10 గోల్డ్,7 సిల్వర్,6 బ్రోంజ్ మెడల్స్ సా ధించినట్లు ప్రిన్సిపాల్ కిషన్‌రెడ్డి తెలిపారు. పార్డి గిరిజన ఆశ్రమ పాఠశాల హెచ్ఎం చందన్, కృష్ణారావు, ఉపాధ్యాయులు వారిని అభినందించారు. -
ప్రాణహిత ప్రాజెక్టు కాలువల సర్వే
నెన్నెల: తుమ్మిడిహెట్టి నుంచి సుందిళ్ల బ్యారేజ్ వరకు గ్రావిటి కెనాల్ ద్వారా నీటిని తరలించేందుకు ఆర్వీ కన్సల్టెన్సీ ఏజెన్సీకి చెందిన పది మంది సర్వేయర్లు శనివారం మైలారం, జంగా ల్పేటలో సర్వే నిర్వహించారు. తక్కువ ఖర్చుతో నీటిని తరలించే అవకాశాలు పరిశీలించారు. పలు జిల్లాలకు సాగునీరు అందించేందుకు ఫిజబిల్టీ రిపోర్టు సిద్ధం చేసి నివేదిక ప్రభుత్వానికి అందజేయనున్నట్లు వారు పేర్కొన్నా రు. ఈ సర్వే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పునరుద్ధరించి రాష్ట్ర నీటి అవసరాలను తీర్చడంలో కీలకపాత్ర పోషిస్తుందన్నారు. నా డు నిర్మించిన ప్రాణహిత చేవెళ్ల ప్రధాన కాలువలను పునర్వినియోగంలోకి తీసుకురావడానికి సర్వే చేపడుతున్నట్లు వారు పేర్కొన్నారు. -
ఊరికి వెళ్లేవారు సమాచారం ఇవ్వాలి
● సీపీ అంబర్ కిషోర్ ఝా మంచిర్యాలక్రైం: సంక్రాంతి పండుగకు ఊళ్లకు వెళ్లేవారు పోలీ సులకు సమాచారం అందించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా శనివారం ఒక ప్రకటనలో సూచించారు. ఇంట్లో విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కిటికీలు, గేటు, తాళం భద్రంగా ఉన్నాయో లేదో మరోసారి సరిచూసుకోవాలన్నారు. ఇంటి ఆవరణలో సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలని, ఒకవేళ ఇప్పటికే ఉంటే పనిచేస్తుందో లేదో చెక్చేసుకోవాలన్నారు. సీసీ కెమెరా రికార్డింగ్ అంతా మొబైల్ ఫోన్లో చూసుకునే విధంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. -
‘ఉపాధి హామీ పేరు మారిస్తే ఊరుకోం’
మందమర్రిరూరల్: కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మారిస్తే చూస్తూ ఊరుకునేది లేదని డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్‌రెడ్డి అన్నారు. శనివారం స్థానిక సీఈఆర్ క్లబ్ సమీపంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2007లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఉపాధి లేక పట్టణాలకు తరలిపోతుంటే వలసలను నివారించడానికి సోనియాగాంధీ నేతృత్వంలో అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ ఉపాధి హామీ చట్టాన్ని అమలుచేసి నిరుద్యోగులకు వందరోజుల పని కల్పించారని గుర్తు చేశారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఉపేందర్, నాయకులు సొత్కు సుదర్శన్, సంతోష్, రమేశ్, తదితరులు పాల్గొన్నారు. -
ఇరుగు పొరుగు సాయంతో..
మంచిర్యాలఅర్బన్: సంక్రాంతి పండుగ సమీపిస్తుండడంతో ఇళ్లల్లో పిండివంటలు ఘుమ ఘుమలాడుతున్నాయి. సకినాలు, అరిసెలు, గారెలు, కారప్పూస, బూరెలు, కర్జాలు ఇలా రకరకాల పిండివంటలు నోరూరిస్తున్నాయి. పిండివంటలు చేయడంలో ఇంటిల్లిపాది మహిళలు నిమగ్నమయ్యారు. సంక్రాంతికి పేద, ధనిక అనే తేడా లేకుండా వారం రోజుల ముందు నుంచే పిండివంటలు చేయడం మొదలు పెడతారు. పిండి తయారు చేయడం, రకరకాల పిండివంటలు చేయడం, నూనెలో వేయించడం ఇవన్నీ చేయాలంటే ఒక్కరు ఇద్దరుతో సాధ్యమయ్యే పని కాదు.. అందుకే మహిళలు ఇరుగు పొరుగు మహిళలు, బంధువుల సాయం తీసుకుంటారు. జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్, లక్సెట్టిపేట, దండేపల్లి తదితర మండలాల్లో మహిళలు పిండివంటలు చేయడంలో ఒకరికొకరు సాయపడుతున్నారు. ఒకరోజు ఒకరి ఇంట్లో అందరూ కలిసి పిండివంటలు చేస్తే.. మరో రోజు మరొకరి ఇంట్లో చేస్తున్నారు. విద్యాసంస్థలకు సెలవులు రావడంతో ఇళ్లకు చేరిన యువతులు పిండివంటలు చేయడంలో కుటుంబ సభ్యులకు సాయం అందిస్తున్నారు. మరికొందరు విదేశాలు, ఇతర ప్రాంతాల్లో ఉన్న పిల్లలకు పంపించడానికి పిండివంటలు చేస్తున్నారు. మొత్తంగా రకరకాల పిండివంటలతో ఇళ్లల్లో సంక్రాంతి పండుగ సందడి నెలకొంది.ఏటా సంక్రాంతికి వస్తాందండేపల్లి: మేము ఉపాధి నిమిత్తం ముంబయిలో ఉంటున్నాం. అక్కడ పిండివంటలు చేసుకునే వీలుండదు. అందుకని ఏటా సంక్రాంతికి సొంతూరు దండేపల్లికి వస్తాం. మా ఇంటి చుట్టుపక్కల ఉన్నవారి సాయంతో పిండి వంటలు చేసుకుంటాం. నేను కూడా వారి ఇళ్లకు వెళ్లి పిండివంటల తయారీలో సాయపడతా. – ముడారపు లక్ష్మి, దండేపల్లి సంక్రాంతికి పిండివంటలు ఎక్కువ మొత్తంలో చేసుకుంటాం. సకినాలు, అరిసెలు తయారు చేసే టప్పుడు ఇరుగు పొరుగు సాయం తప్పనిసరి. మూడు, నాలుగు తీర్ల అప్పాలు ఒక్కరం (పిండి వంటలు) చేయడం కష్టం. అందుకే అలసట లేకుండా కబుర్లు చెప్పుకుంటూ పిండివంటలు చేసుకుంటాం. – నాంపల్లి మాధవి, మంచిర్యాల -
నూతన ప్రాజెక్టులతోనే ఏరియాకు భవిష్యత్
తాండూర్/శ్రీరాంపూర్/మందమర్రిరూరల్: నూతన ప్రాజెక్టులను ప్రారంభిస్తేనే బెల్లంపల్లి ఏరియాకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని సింగరేణి(ప్రాజెక్టు అండ్ ప్లానింగ్) డైరెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం ఆయన బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ విజయభాస్కర్‌రెడ్డితో కలిసి మహావీర్ ఖని(ఎంవీకే) ఓపెన్‌కాస్ట్ ప్రతిపాదిత ప్రాంతాలను పరిశీలించారు. గతంలో ఉత్పత్తి సాధించి మూసివేసిన ఎంవీకే–1, 2, 3, 5, 6, ఇంక్లైన్ గనులు, మాదారంటౌన్షిప్లను సందర్శించారు. శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని ఏరియాలో జీఎంలతో మాట్లాడారు. మందమర్రి ఏరియాలోని రైల్వే సైడింగ్ పనులను ఏరియా జీఎం రాధాకృష్ణతో కలిసి సందర్శించారు. ఆయా కార్యక్రమాల్లో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కై రిగూడ ఓపెన్‌కాస్ట్ త్వరలో మూసివేతకు గురయ్యే పరిస్థితుల దృష్ట్యా కొత్త ప్రాజెక్టుల ఏర్పాటు ఆవశ్యకమన్నారు. అన్ని ఏరియాల్లో మొక్కలు నాటడానికి నర్సరీలను సిద్ధం చేయాలని సూచించారు. మాదారంటౌన్షిప్లో డైరెక్టర్‌ను డీసీసీ ఉపాధ్యక్షుడు సూరం రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచ్ కుశ్నపల్లి లక్ష్మీనారాయణ, నాయకులు, ఏఐటీయూసీ ఉపాధ్యక్షులు బయ్య మొగిళి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో ప్రాజెక్టు మేనేజర్ మహేష్, సింగరేణి ఫారెస్ట్ అడ్వైజర్ పరిగెన్, శ్రీరాంపూర్ జీఎం ఎం.శ్రీనివాస్, ఏరియా ఎస్ఓటు జీఎం యన్.సత్యనారాయణ, ఎస్వో టు జీఎం లలితేంద్రప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. -
‘జీవో 229 రద్దు చేయాలి’
మంచిర్యాలటౌన్: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన వివాదాస్పద జీవో 229 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్, హెచ్ఆర్డీఏ, మెడికల్ టాస్క్‌ఫోర్స్ బృందం ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీజీఎంసీ) స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేలా ఉన్న చట్ట విరుద్ధమైన జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీజీఎంసీ సభ్యుడు డాక్టర్ యెగ్గన శ్రీనివాస్, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ రవిప్రసాద్ రావుల, సెక్రెటరీ, హెచ్ఆర్డీఏ అధ్యక్షుడు డాక్టర్ అనిల్‌కుమార్ ముత్తినేని, ఐఎంఏ కోశాధికారి డాక్టర్ చందూరి సంతోశ్, డాక్టర్ సుఖభోగి వెంకటేశ్వర్లు, డాక్టర్ కేవీఎల్ఎన్ మూర్తి, డాక్టర్ చంద్రదత్, డాక్టర్ కాటం లక్ష్మీనారాయణ, డాక్టర్ కేఎంఎన్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
‘పది’ంతల పక్కా ప్రణాళిక..!
మంచిర్యాలఅర్బన్: సర్కారు పాఠశాలల్లో చదువుతున్న పదోతరగతి విద్యార్థులు శతశాతం ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ పక్కా ప్రణాళిక సిద్ధం చేసింది. విద్యార్థుల భవితకు తొలిమెట్టు పదోతరగతి కావడంతో ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో సాధించే మార్కులు, సబ్జెక్టు నైపుణ్యాలు భవిష్యత్‌కు పునాదులుగా నిలుస్తాయి. పదోతరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈనెల 19 నుంచి ప్రతీరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. రోజుకు ఒక్కో సబ్జెక్టు ఉపాధ్యాయుడు స్టడీ అవర్ నిర్వహించి పాఠ్యాంశాల్లో సందేహాలు నివృత్తి చేస్తారు. జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య శుక్రవారం ప్రత్యేక తరగతులు, ప్రాక్టీస్ పరీక్షల షెడ్యూల్‌కు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. పక్కా ప్రణాళికతో.. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 9,866 మంది పదోతరగతి విద్యార్థులు ఉన్నారు. ఇందులో ఎయిడెడ్ పాఠశాలల్లో 75 మంది, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 254, కేజీబీవీల్లో 733, లోకల్ బాడీలో 3,040, మోడల్ స్కూల్లో 440 మంది ఉన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థుల విషయంలో ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఉదయం 8:15 నుంచి 9:15 గంటల వరకు, సాయంత్రం 4:15 నుంచి 5:15 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. ఫలితాలు మెరుగుపడేలా.. జిల్లాలో గతేడాది ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి 9,179 మంది విద్యార్థులు పది పరీక్షలు రాయగా 8,961 మంది ఉత్తీర్ణత సాదించారు. రాష్ట్రంలో జిల్లా 17వ స్థానంలో నిలిచింది. ప్రభుత్వ పాఠశాలల్లో 5,983 మంది విద్యార్థులకు గానూ 5,726 మంది విద్యార్థులు 95 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ, లోకల్‌బాడీ, కేజీబీవీ, మోడల్ స్కూల్లో 4,542 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానుండగా స్పెషల్ క్లాస్‌లతో శతశాతం ఫలితాలు సాధించేలా సన్నద్ధమవుతున్నారు. తరగతులు ఇలా..ప్రత్యేక తరగతులు ఉదయం, సాయంత్రం నిర్వహించనున్నారు. పాఠశాల స్థాయి ప్రణాళిక, తరగతి నిర్మాణం బహుళ విభాగాలు, బోధనా మాధ్యమాలు ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయులు ప్రతీ దానికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలి. కీలక సబ్జెక్టుల్లో విద్యార్థుల ప్రగతిని అంచనా వేస్తూ వెనకబడిన వారిపై ప్రత్యేక దృష్టి సారించాలి. రెగ్యులర్ పీరియడ్‌లో పాఠం, అంశం వివరణ, అంశానికి సంబంధించిన విద్యా ప్రమాణాల ఆధారంగా పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. స్థాయి ఆధారిత అభ్యాసం, గ్రాఫ్‌లు, రేఖాగణిత నిర్మాణాలతో పాటు వ్యక్తిగతీకరించిన విద్యా మార్గదర్శకత్వం, మద్దతు అందించేందుకు ఉపాధ్యాయులు విద్యార్థులను దత్తత తీసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థుల పురోగతి ట్రాక్ చేయటానికి సబ్జెక్టు ఉపాధ్యాయుడు వివరణాత్మక రికార్డులను నిర్వహించాలి. ప్రతీ విద్యార్థి పురోగతిపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. -
● పార్టీ జాతీయ కార్యవర్గసభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి
రామకృష్ణాపూర్: ప్రజల పక్షాన నిలుస్తూ నిరంతరం వారి హక్కుల కోసం పోరాడేది సీపీఐ మాత్రమేనని ఆ పార్టీ జాతీయ కార్యవర్గసభ్యులు, మాజీ ఎమ్మె ల్యే చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. ఎర్రజెండా పార్టీ పుట్టిందే శ్రమజీవుల హక్కుల కోసమని, అణచివేతలు ఉన్నంతకాలం కమ్యూనిస్టు పార్టీ ఉంటుందన్నా రు. సీపీఐ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని పట్టణంలోని సూపర్‌బజార్ సెంటర్లో శనివారం సాయంత్రం భారీ బహిరంగసభ నిర్వహించారు. అంతకుముందు స్థానిక రాజీవ్‌చౌక్ నుంచి సూపర్‌బజార్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. సభ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తుందన్నారు. హక్కుల సాధన కోసం ప్రయోగించే సమ్మె హక్కు ను కూడా తీసే ప్రయత్నం చేస్తుందని, దీనిని ఎట్టిపరిస్థితుల్లో సహించేది లేదన్నారు. దేశంలో మోదీ నిరంకుశ పాలనకు స్వస్తి పలకాలంటే ఎర్రజెండా పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరముందన్నారు. సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ ఒకప్పుడు లక్ష 20వేల మంది ఉన్న సింగరేణి సంస్థ నేడు 40 వేలకు పడిపోయిందని, సంస్థను క్రమక్రమంగా దివాలా తీయించి ప్రైవేటీకరించేందుకు కుట్ర జరుగుతోందన్నారు. సంస్థను కాపాడుకోవా ల్సిన బాధ్యత కమ్యూనిస్టులపై ఉందన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మ ణ్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్, మిట్టపెల్లి శ్రీనివాస్, మేకల దాసు, ఇప్పకాయల లింగయ్య, అక్బర్అలీ, పౌల్ పాల్గొన్నారు. ప్రజా పోరాటాల జెండా సీపీఐ శ్రీరాంపూర్: ప్రజా పోరాటాల జెండా సీపీఐ అని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడా వెంకట్‌రెడ్డి అన్నారు. శ్రీరాంపూర్ బస్టాండ్ వద్ద పైలాన్ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దున్నేవాడికే భూమి దక్కాలనే నినాదంతో కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించిందన్నారు. ఈ నెల 18న ఖమ్మంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దీనికి 40 దేశాల ప్రతినిధులు హాజరుకానున్నట్లు తెలి పారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి జో గుల మల్లయ్య, నాయకులు రేగుంట చంద్రశేఖర్, కారుకూరి నగేష్, కే.వీరభద్రయ్య, లింగం రవి, మిర్యాల రాజేశ్వరరావు, బాజీసైదా, కిషన్ రావు, రవీందర్, మహేష్, తదితరులు పాల్గొన్నారు. -
చైనా మాంజా విక్రయిస్తే చర్యలు
మంచిర్యాలక్రైం: చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ ప్రమోద్‌రావు హెచ్చరించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, డీసీపీ ఎగ్గడి భాస్కర్ ఆదేశాల మేరకు శనివారం రెండోరోజు పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి జిల్లా కేంద్రంలోని గాలిపటాల దుకాణా లపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ చైనా మాంజా మారణాయుధమని అన్నారు. చైనా మాంజా వినియోగించినా విక్రయించినా కేసులు నమోదు చేస్తామన్నారు. ఎవరైనా విక్రయించినట్లు తెలిస్తే డయల్ 100 లేదా స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలన్నారు. తనిఖీల్లో ఎస్సైలు తిరుపతి, మజారొద్దీన్, ఏఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
చైనా మాంజాపై పోలీసుల పంజా
మంచిర్యాలక్రైం: సంక్రాంతి పండుగ సంబరాల్లో భాగంగా గాలిపటాలు ఎగురవేస్తూ పిల్ల లు, పెద్దలు సంబరాలు చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. గాలిపటాలు ఎగురవేసేందుకు చాలామంది ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజా వినియోగిస్తుండడం వల్ల ప్రజలు, పక్షలు గాయపడిన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. జిల్లాలో చైనా మాంజా విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయని ‘సాక్షి’ దినపత్రికలో ఈ నెల 6న ‘వామ్మో.. చైనా మాంజా’, 8న ‘సరదా.. కారాదు విషాదం’ శీర్షికన వరుస కథనాలు రావడంతో రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా స్పందించారు. జిల్లా వ్యాప్తంగా గాలిపటాలు విక్రయించే దుకాణాలపై అన్ని పోలీసుస్టేషన్ల పరిధిలో పకడ్బందీగా తనిఖీల నిర్వహణకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో శుక్రవారం జిల్లా పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగి గాలిపటాలు, దారాలు విక్రయించే దుకాణాలు, గోదాముల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. చైనా మాంజాను ప్రభుత్వం నిషేధించిందని, ఎవరైన విక్రయించినా, వినియోగించినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. చైనా మాంజాతో పక్షులు, ద్విచక్ర వాహనదారులకు ప్రాణాపాయంగా మారుతుందని తెలిపారు. పిల్లలు ఏ దారంతో గాలిపటాలు ఎగురవేస్తున్నారని గమనించాలని తల్లిదండ్రులకు సూచించారు. చైనా మాంజా విక్రయాలపై పోలీసులకు గానీ, డయల్ 100కు గాని సమాచారం అందించాలని కోరారు. -
17ఏళ్ల తర్వాత కుటుంబం చెంతకు చేరిన రఫీక్
కై లాస్‌నగర్: ఫిట్స్.. అతడి మానసిక, ఆరోగ్య పరిస్థితి దెబ్బతీసింది. 25ఏళ్ల వయస్సుల్లో ఇంటికి దూరం చేసింది. అతడి ఆచూకీ కోసం కుటుంబ స భ్యులు చాలా చోట్ల వెతికినా ప్రయోజనం లేకపోయింది. ఎప్పటికై నా తిరిగి రాకపోతాడా అనే ఎదు రు చూస్తూనే ఉన్నారు. వారి ఎదురుచూపులు 17 ఏళ్ల తర్వాత ఫలించాయి. ఓ స్వచ్ఛంద సంస్థ చే యూత, చొరవ అతడిని కుటుంబ సభ్యుల చెంతకు చేర్చాయి. ఆ కుటుంబ సభ్యుల్లో ఆనందం వెల్లివిరిసింది. వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ పట్టణం ఖా నాపూర్లోని అబ్దుల్లాచౌక్కు చెందిన షేక్ మహబూబ్, జాహెదాబేగం దంపతులకు నలుగురు సంతానం. మూడో కుమారుడు షేక్ రఫీక్ తొమ్మిదో తరగతి చదువుతున్న సమయంలో ఫిట్స్‌కు గురయ్యాడు. అప్పటి నుంచి మానసిక, ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. 25ఏళ్ల వయస్సులో ఇంటికి వెళ్లిపోయాడు. అతడి ఆచూకీ కోసం ఎన్ని చోట్ల వెతికినా ప్రయోజనం లేకపోయింది. కాగా, గత ఏడాది జూౖ లె 4న ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణంలో మతిస్థిమితం లేకుండా తిరుగుతుండగా మహారాష్ట్రకు చెందిన శ్రద్ధ రీహ్యాబిటేషన్ ఫౌండేషన్ ప్రతినిధులు గ మనించారు. చలించినపోయి వారు అతడిని మ హారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఉన్న ఆ సంస్థ రీహ్యాబిటేషన్ సెంటర్‌కు తరలించారు. అప్పటి నుంచి అక్కడ వైద్యం అందిస్తుండడంతో మానసిక, ఆరోగ్య పరి స్థితి మెరుగైంది. తన వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలు చెప్పడంతో ఆ సంస్థ ప్రతినిధి రాకేష్ శుక్రవారం ఆదిలాబాద్‌కు తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించాడు. 17ఏళ్ల తర్వాత తిరిగొచ్చిన కుమారుడిని చూసి తల్లి, అన్నదమ్ముల్లో ఆనందం వెల్లివిరిసింది. కుటుంబీకులు, బంధువులు పూలమాలలు వేసి స్వాగతం పలికారు. ఎన్జీవో ప్రతినిధిని సైతం సత్కరించారు. తప్పిపోయి, ఎక్కడెక్కడ గడిపాడనే వివరాలపై ఆరా తీశారు. తిరిగి రాడనుకున్న వ్యక్తి ఏళ్ల తర్వాత ఇంటికి చేరడంపై ఆ కుటుంబీకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
బాలికల ఆరోగ్యం, విద్యతోనే అభివృద్ధి
కోటపల్లి: బాలికల ఆరోగ్యం, విద్యతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యపడుతుందని జిల్లా గర్ల్స్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ లావణ్య అన్నారు. శుక్రవారం మండలంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడారు. బాలికలు ఆరోగ్యవంతంగా ఉంటూ నాణ్యమైన విద్య అభ్యసించినప్పుడే జీవితంలో స్థిరత్వం, అత్మవిశ్వాసం పెరిగి కుటుంబం, సమాజ అభివృద్ధికి దోహదపడుతారని తెలిపారు. విద్యార్థులు సంక్రాంతి సెలవులను సద్వినియోగం చేసుకుని పాఠశాలలు పునఃప్రారంభమైన రోజునే వచ్చేలా చూడాలని కోరారు. నిరంతర విద్యాభ్యాసంతోనే ఉన్నత చదువులు, ఉపాధి అవకాశాలు సాధ్యమవుతాయని అన్నారు. అనంతరం భోజనం, ఆరోగ్య పరీక్షలు, వసతుల వివరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకరావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం మధునయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ ‘ప్రత్యేక’ బాదుడు
టికెట్ చార్జీల పెంపు సరికాదుసంక్రాంతి పండుగకు ఆర్టీసీ బస్సుల్లో టికెట్ చార్జీలు పెంచడం సరికాదు. ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించలేక.. రైళ్ల రాకపోకలు లేకపోవడంతో ఆర్టీసీ బస్సుల్లో తప్పనిసరి ప్రయాణం చేయాల్సి వస్తోంది. శుక్రవారం లగ్జరీ బస్సులో హైదరాబాద్ నుంచి మంచిర్యాలకు ఆన్లైన్ టికెట్ బుక్ చేశాను. ఇద్దరికి రూ.1520 చార్జీలయ్యాయి. ఈ లెక్కన సాధారణ రోజుల్లో టికెట్ ధర రూ.530 కాగా ఆన్లైన్ రూ.20 ఉండేది. మొత్తం కలిపినా రూ.1100 అయ్యేది. ఇలా ప్రయాణికులపై చార్జీల భారం పెంచకుండా తగ్గించాలి. ఆర్టీసీ పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారి అవసరాలను ఆసరాగా చేసుకుని చార్జీలు పెంచేస్తున్నట్లుంది. – రాజేశ్, మంచిర్యాలపండుగ పూట పెంపు ఎందుకు..!సాధారణ రోజుల్లో ఆర్టీసీ చార్జీలు పెంచకుండా పండుగ పూట ఎందుకు పెంచుతుందో అర్థం కావడం లేదు. బస్సుల సంఖ్య పెంచకుండా స్పెషల్ బస్సుల పేరిట టికెట్ ధరలు అమాంతం 50శాతం పెంచడం సామాన్యులపై భారం వేయడమే. ఆర్టీసీ ఆదాయంపై ఉన్న దృష్టి సౌకర్యాల కల్పనపై లేకుండా పోతోంది. మహిళలకు ఉచిత ప్రయాణం తర్వాత ఏ బస్సు చూసిన రద్దీగా ఉంటుంది. పండుగ వేళల్లో రద్దీకి అనుగుణంగా బస్సులు నడపడంతోపాటు చార్జీలు తగ్గించాలి. – ప్రవీణ్, మంచిర్యాలమంచిర్యాలఅర్బన్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) ప్రత్యేక బస్సుల్లో చార్జీల పెంపుతో సంక్రాంతి కానుకగా బాదుడు మొదలైంది. పండుగ, సెలవుల నేపథ్యంలో పట్టణాల నుంచి జనం పల్లె బాట పట్టింది. విద్యాసంస్థలకు ఈ నెల 10 నుంచి 16వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. దీంతో దూర ప్రాంతాల్లోని విద్యార్థులు, ఉద్యోగరీత్యా వెళ్లిన వారు శుక్రవారం స్వగ్రామాలకు బయల్దేరారు. ఆర్టీసీ బస్సులు, బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. మహిళల ఉచిత ప్రయాణంతో ప్రయాణికుల సంఖ్య రెట్టింపైంది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల్లో మంచిర్యాలకు చేరుకుని అక్కడి నుంచి పల్లె ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. మంచిర్యాల బస్టాండ్ ప్రయాణికులతో కోలాహలంగా మారింది. హైదరాబాద్ నుంచి మంచిర్యాలకు.. మంచిర్యాల ఆర్టీసీ డిపో పరిధిలో 138 బస్సులు ఉండగా.. 38 హైదరాబాద్‌కు రెగ్యులర్‌గా రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ నెల 7నుంచి 14వరకు ప్రత్యేక బస్సులు నడిపించనున్నారు. పండుగ వేళ రద్దీ రోజులుగా పరిగణిస్తూ శుక్రవారం హైదరాబాద్ నుంచి మంచిర్యాలకు 24 ప్రత్యేక బస్సులు నడిపించగా.. 15బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కల్పించారు. దీంతో బస్సులన్నీ నిండిపోయాయి. శనివారం 24 ప్రత్యేక బస్సులు నడిపించనున్నారు. ఏ బస్సులో చూసినా సీట్లు లేవనే సమాధానంతో ప్రయాణికులు ఒకింత నిరాశకు గురి కావాల్సి వస్తోంది. రైళ్లలో బెర్తులు దొరక్కపోవడం, ఆర్టీసీ బస్సులు నిండిపోవడం వల్ల ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో కిక్కిరిసి ప్రయాణం చేయక తప్పని పరిస్థితి నెలకొంది. చార్జీల వడ్డింపు.. సంక్రాంతి పండుగతో ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో ఒకటిన్నర చార్జీ వసూలు చేస్తోంది. సాధారణ సమయాల్లో నడిచే బస్సుల్లో మాత్రం చార్జీల పెంపునకు మినహాయింపు ఇచ్చారు. హైదరాబాద్ జేబీఎస్ నుంచి మంచిర్యాలకు బస్సులు ప్రారంభమవుతా యి. జేబీఎస్ నుంచి రెగ్యులర్ బస్సుల్లో టికెట్ ధర రూ.530 కాగా.. ప్రత్యేక బస్సుల్లో రూ.740(ఒకటిన్నర చార్జీ)తో ప్రయాణికుల నుంచి వసూలు చేశా రు. ఆన్లైన్లో టికెట్ కొనుగోలు చేస్తే రూ.50 అదనంగా వడ్డించారు. ప్రత్యేక బస్సుల్లో చార్జీల వడ్డింపుపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికులకు తప్పని పాట్లు.. మంచిర్యాల నుంచి ఆసిఫాబాద్, చెన్నూర్ వైపు వెళ్లే బస్ పాయింట్ల వద్ద ప్రయాణికులు గంటలకొద్దీ వేచిచూశారు. బస్సులు సమయానికి రాకపోవడంతో గంటల తరబడి నిల్చోవాల్సి వచ్చింది. బస్సు వచ్చిందంటే చాలు చుట్టుముట్టడం ప్రయాణికుల వంతైంది. హైదరాబాద్, కరీంనగర్ నుంచి వచ్చిన విద్యార్థులు పలు ప్రాంతాలకు వెళ్లే రద్దీకి అనుగుణంగా సరిపడా బస్సుల్లేక పడరానిపాట్లు పడాల్సి వచ్చింది. డిపోలో ఉన్న బస్సులనే రద్దీకి అనుగుణంగా సర్దుబాటు చేయాల్సి రావడంతో ఇబ్బందులు తప్పలేదు. -
వ్యాధులు ప్రబలకుండా చర్యలు
మంచిర్యాలటౌన్: జిల్లాలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, కీటకజనిత వ్యాధులను గుర్తించడం, పరీక్షలు చేసి మందులు అందించడం వల్ల వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అనిత అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో జిల్లాలోని వైద్యులు, సిబ్బందితో శుక్రవారం జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ జిల్లాలోని వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, ఆరోగ్య ఉపకేంద్రాల్లో అందుబాటులో ఉండాలని, మలేరియా, డెంగీ, చికున్ గున్యా వంటివి ప్రబలకుండా సర్పంచులు, మున్సిపల్ అధికారుల సహకారం తీసుకోవాలని అన్నారు. జిల్లాలో క్షయ నియంత్రణలో భాగంగా మొబైల్ ఎక్స్చేంజ్ ద్వారా మారుమూల ప్రాంతాల్లోని వ్యాధిగ్రస్తులను గుర్తిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీపీహెచ్ఎన్ ఆర్ఎస్ పద్మ, ఎస్వో కాంతారావు, డీడీఎం ప్రవళిక, డెమో బుక్క వెంకటేశ్వర్, వసుమతి పాల్గొన్నారు. -
మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యం
మంచిర్యాలఅగ్రికల్చర్: మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి కిషన్, అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి అంజయ్య, సీ్త్రనిధి రీజినల్ మేనేజర్ వెంకటరమణతో కలిసి సీ్త్రనిధి రుణాలు, బ్యాంకు లింకేజ్ల మంజూరు, రికవరీపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ 2025–26 ఆర్థిక సంవత్సరానికి సీ్త్రనిధి రుణాల లక్ష్యం రూ.42 కోట్లకు గాను 46శాతంతో 19.47 కోట్లు మంజూరు చేశామని, 49శాతం రికవరీ చేశామని అన్నారు. జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు, సహాయ ప్రాజెక్టు మేనేజర్లు, సీ్త్రనిధి సిబ్బంది పాల్గొన్నారు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి మంచిర్యాలఅగ్రికల్చర్: బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మహమ్మద్ విలాయత్ అలీ, బాలల సంక్షేమ కమిషన్ చైర్మన్ మహమ్మద్ వహీద్‌తో కలిసి సంక్షేమ శాఖల అధికారులు, పోలీసు, కార్మిక, విద్య, వైద్య–ఆరోగ్యశాఖల అధికారులతో ఆపరేషన్ స్మైల్ అమలుపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ బడీడు, బడి మానేసిన పిల్లలు, బాల కార్మికులను పాఠశాలల్లో చేర్పించాలని తెలిపారు. ఈ నెల 31వరకు జిల్లాలో ఆపరేషన్ స్మైల్ నిర్వహిస్తామని తెలిపారు. జిల్లా సంక్షేమశాఖ అధికారులు రౌఫ్‌ఖాన్, దుర్గప్రసాద్, భాగ్యవతి, నీరటి రాజేశ్వరి, విద్యాధికారి యాదయ్య, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి అనిత, బాలల పరిరక్షణ కమిటీ అధికారి ఆనంద్ పాల్గొన్నారు. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి మంచిర్యాలటౌన్: ప్రతి ఒక్కరూ శారీరక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం సీఎం కప్ క్రీడలు 2025లో భాగంగా జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో టార్చ్ ర్యాలీని ప్రారంభించారు. ప్రతీ గ్రామ, మండల, నియోజకవర్గం, జిల్లా స్థాయిల్లో పోటీలు నిర్వహించి విజేతలను రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామనొ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ ఏ.భాస్కర్, ఏసీపీ ప్రకాశ్, జిల్లా యువజన క్రీడా సేవల శాఖ అధికారి హనుమంతరెడ్డి పాల్గొన్నారు. -
ట్రెజరీ ద్వారా వేతనాలు అందించాలి
దండేపల్లి: దేవాదాయ శాఖ చట్టంలో సవరణలు చేసి అధికారుల మాదిరిగానే అర్చక ఉద్యోగులందరికీ ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలని అర్చక, ఉద్యోగ జేఏసీ రాష్ట్ర చైర్మన్ గోగు ఉపేంద్ర శర్మ, కన్వీనర్ డీవీఆర్ శర్మ డిమాండ్ చేశారు. దండేపల్లి మండలం గూడెం శ్రీసత్యనారాయణస్వామి ఆలయ కా ర్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ఉమ్మ డి ఆదిలాబాద్ జిల్లా అర్చక, ఉద్యోగ జేఏసీ సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హా జరై మాట్లాడారు. దేవాదాయ శాఖ అధికారులకు ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు, పెన్షన్సు అందుతున్నాయని, అర్చకులకు మాత్రం ఈ సౌకర్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్లు పూర్తిచేసుకున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, తాత్కాలిక, దినసరి వేతన ఉద్యోగులను సైతం రెగ్యులర్ చేయాలన్నారు. సమావేశంలో ఉమ్మడి జిల్లా దేవాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రమణరావు, గూడెం ఆలయ ప్రధాన అర్చకులు రఘస్వామి, ఆలయ సూపరింటెండెంట్ శ్రీనివాస్, అర్చకులు సంపత్‌స్వామి, నరహరిశర్మ పాల్గొన్నారు. భాషా నైపుణ్యం, ఆలోచనలు పెంపొందించుకోవాలిమంచిర్యాలఅర్బన్: విద్యార్థులు ఆంగ్ల భాషా నైపుణ్యాలతో పాటు ఆత్మవిశ్వాసం, విమర్శనాత్మక ఆలోచనలను పెంపొందించుకోవాలని డీఈవో యాదయ్య సూచించారు. శుక్రవారం ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్స్ ఆసోసియేషన్ (ఎల్టా) ఆధ్వర్యంలో ఒలింపియాడ్, ఎలోక్యూషన్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పోటీల్లో గెలుపొందిన విజేతలను ప్రకటించారు. ఒలింపియాడ్ విభాగంలో స్ట్రీం–1 జూనియర్లో గుడిరేవు ఉన్నత పాఠశాలకు చెందిన అలెగ్జాండర్ ప్రథమ స్థానం, సీనియర్ విభాగంలో కిష్టాపూర్ పాఠశాలకు చెందిన అనన్య, టెడ్ టాక్ జూనియర్ విభాగంలో హజీపూర్ పాఠశాల విద్యార్థి వికాసిని ప్రథమ స్థానం, సీనియర్ విభాగంలో గుడిరేవు పాఠశాల విద్యార్థిని అహల్య ప్రథమస్థానంలో నిలిచారు. స్రీమ్–2 జూనియర్ విభాగంలో టీజీఎంఎస్ మంచిర్యాల పాఠశాలకు చెందిన సమన్విత (ప్రథమ), సీనియర్ విభాగంలో మంచిర్యాల మోడల్ స్కూల్‌కు చెందిన సంజన (ప్రథమ), టెడ్‌టాక్‌లో మోడల్ స్కూల్ విద్యార్థులు జూనియర్ విభాగంలో భవిత, సీనియర్ విభాగంలో సాహిత్య ప్రథమ స్థానంలో నిలిచారు. న్యాయనిర్ణేతలుగా సత్యనారాయణ, కమలాకర్, ఉపేందర్ వ్యవహరించారు. కార్యక్రమంలో ఎల్టా రాష్ట్ర బాధ్యులు బాబ్జీ, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సత్యనారాయణమూర్తి, కల్యాణి, జిల్లా ప్రభు త్వ పరీక్షల విభాగం అధికారి మల్లేశం, సెక్టోరల్ అధికారి భరత్, తదితరులు పాల్గొన్నారు. -
మొక్కల పెంపకానికి కసరత్తు
దండేపల్లి: రాష్ట్ర ప్రభుత్వం మూడో వన మహోత్సవం 2025–26 సంవత్సరానికి గాను జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఉన్న నర్సరీల్లో మొక్కల పెంపకానికి లక్ష్యాన్ని నిర్దేశించింది. పల్లె ప్రకృతి వనాలతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పాఠశాలల ఆవరణలు, ఇంటింటా మొక్కలు నాటేందుకు సిద్ధం చేస్తోంది. లక్ష్యం చేరేలా అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలో డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఈ ఏడాది 20,50,200 మొక్కలు పెంచాలనే లక్ష్యం మేరకు జిల్లా వ్యాప్తంగా నర్సరీల్లో మొక్కల పెంపకం పనులు మొదలయ్యాయి. ఇందుకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేశారు. పూలమొక్కల్లో మల్లె, గులాబీ, పండ్లమొక్కల్లో నిమ్మ, దానిమ్మ, జామ, మామిడి, చింత, నీడనిచ్చే మొక్కల్లో కానుగ, వేపతోపాటు 15నుంచి 20 జాతుల మొక్కలు పెంచనున్నారు. ప్రస్తుతం కవర్లలో మట్టినింపే పనులు జరుగుతున్నాయి. -
సామాజిక కార్యకర్తలకు పార్టీలు టికెట్లు ఇవ్వాలి
పాతమంచిర్యాల: ప్రజాసమస్యల కోసం పోరా డుతున్న సామాజిక కార్యకర్తలకు రాజకీయ పార్టీలు టికెట్లు ఇవ్వాలని తెలంగాణ బలహీన వర్గాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మోతే రాజలింగు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు, బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడే సామాజిక కార్యకర్తలే నిజమైన నాయకులని తెలిపారు. డబ్బు, బల ప్రదర్శన, వంశపారంపర్య రాజకీయాలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ప్రజాస్వామ్యం బలహీన పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ వేదిక జిల్లా అధ్యక్షుడు గొడిశెల రాజారాం, టీబీఎస్ఎస్ సభ్యులు హుస్సెన్, సమ్మయ్య పాల్గొన్నారు. -
జాతరకు వెళ్లివస్తూ తిరిగిరాని లోకాలకు
ఆసిఫాబాద్‌రూరల్: జాతరకు వెళ్లివస్తుండగా జరి గిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మే రకు మండలంలోని ఆడదస్నాపూర్ గ్రామ పంచా యతీ పరిధిలోని దెబ్బడిగూడకు చెందిన ఆత్రం అ న్నిగా (25), టేకం పొచ్చిగా (21), ఆత్రం లచ్చు శు క్రవారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై తిర్యాణి మండలంలోని దంతన్‌పల్లిలో జరుగుతున్న భీమయ్యక్ జాతరకు వెళ్లారు. తిరుగుప్రయాణంలో రా త్రి బాబాపూర్ గ్రామ సమీపంలో ఎడ్లబండిని ఢీ కొట్టారు. పొచ్చిగా, అన్నిగాకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రగాయాలైన ఆత్రం లచ్చును ఆటోలో జిల్లా కేంద్రంలోని ప్ర భుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్య కోసం మంచిర్యాల్‌కు రెఫర్ చేశారు. క్షతగాత్రుడిని ప్రైవేట్ వాహనంలో మంచిర్యాలకు తీసుకెళ్లమని వైద్యసిబ్బంది చెప్పడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 108కు ఫోన్ చేసినా సరైన సమయంలో రా కపోవడంతో ఆటోలో తీసుకొచ్చామన్నారు. వైద్య సిబ్బందితో వాగ్వివాదానికి దిగి గదిలోకి చొరబడి మందులను కింద పడేశారు. ప్రభుత్వ అంబులెన్స్ రావడంతో క్షతగాత్రుడిని అందులో మంచిర్యాలకు తరలించడంతో ఆందోళనకారులు శాంతించారు. -
రాష్ట్రస్థాయి పోటీల్లో గోల్డ్ మెడల్
ఖానాపూర్: ములుగు జిల్లా ఏటూరు నాగారంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి చెస్ పోటీల్లో పట్టణంలోని ప్రభుత్వ బాలుర గిరిజన ఆశ్రమ పాఠశాలకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థి కుడ్మెత భీంరావు ప్రతిభ కనబర్చి గోల్డ్ మెడల్ సాధించినట్లు పాఠశాల హెచ్ఎం జీ.రాజేందర్ తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ 6వ రాష్ట్రస్థాయి చెస్ పోటీల్లో కడెం మండలంలోని గంగాపూర్‌కు చెందిన విద్యార్థి ఉత్తమ ప్రతిభ కనబర్చినట్లు పేర్కొన్నారు. సదరు విద్యార్థిని డీటీడీవో జాదవ్ అంబాజీ నాయక్, జిల్లా గిరిజన క్రీడా అధికారి భుక్య రమేశ్‌నాయక్, చెస్ కోచ్ రాంజీ, తదితరులు అభినందించారు. -
ఆ ఊరంతా సౌర వెలుగులే!
లక్సెట్టిపేట: ప్రభుత్వం కేంద్రీయ బండార్ పేరుతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకానికి సోలార్ పవర్ పైలట్ గ్రామంగా మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట ఎంపికై ంది. టీజీ రెడ్కో (తెలంగాణ రినోవెబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్) సంస్థకు పనులను అప్పజెప్పారు. ప్రభుత్వం మొదటి విడతగా రాష్ట్రంలోని కొన్ని గ్రామాలను ఎంపిక చేసింది. అందులో మంచిర్యాల జిల్లా నుంచి ఏకై క గ్రామంగా వెంకట్రావుపేట ఎంపికై ంది. రెడ్కో శాఖ అధికారులు గ్రామంలో సర్వే పనులు నిర్వహిస్తున్నారు. సోలార్ వాడకం వలన విద్యుత్ ఆదా కావడమే కాకుండా ప్రభుత్వం అందిస్తున్న 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ వలన డిస్కం శాఖ నుంచి ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా ప్రత్యేక పద్ధతి ద్వారా పనులు ప్రారంభించారు. విద్యుత్, సోలార్ శాఖ అనుసంధానంతో పనులు నిర్వహిస్తున్నారు. ఏకై క పైలట్ గ్రామం వెంకట్రావుపేట సోలార్ పైలట్ గ్రామంగా ఎంపిక కావడంతో రెడ్కో శాఖ అధికారులు ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తంగా 1,160 ఇళ్లను సర్వే చేశారు. ప్రస్తుతం 120 ఇళ్లకు సోలార్ ఇచ్చేందుకు ఇంటిస్లాబ్పై ప్యానెల్ ఏర్పాటు చేసేందుకు పనులు ప్రారంభిస్తున్నారు. ప్రతీ ఇంటిపై 180 స్క్వేర్ ఫీట్ల వైశాల్యం ఉండాలంటున్నారు. ప్రతీ ఇంటికి రోజుకు రెండు కిలో వాట్లు ఉచితంగా కేటాయించారు. ఒక్కో ఇంటికి సుమారు రూ.1,70,000 ఖర్చు వస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. మూడు నెలల లోపు గ్రిడ్ పనులు పూర్తి చేసి ఇళ్లల్లో సోలార్ విద్యుత్ వెలిగిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఉన్న మీటర్‌ను తొలగించి నెట్ మీటర్ ఏర్పాటు చేస్తామని అందులో విద్యుత్ ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ ఉంటుందన్నారు. రోజుకు ఐదు యూనిట్లు ఉచితంగా సరఫరా అందుతుందని, ఆపైన వాడితే చార్జి చెల్లించాల్సి ఉంటుందన్నారు. 25 సంవత్సరాల వరకు వీటి ఉపయోగం ఉంటుంది. నిర్మాణం పూర్తయిన తర్వాత ఐదేళ్ల వరకు సంస్థ ఆధ్వర్యంలో 24 గంటల అత్యవసర సేవలు అందిస్తారు. ఆ తర్వాత 20 సంవత్సరాల పాటు ఇంటి యజమానులు మెయింటనెన్స్ చేసుకోవాలి. మార్చిలోగా పనులు పూర్తి చేయాలని ఆదేశాలు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.సంతోషంగా ఉంది సోలార్ పవర్ పైలట్ గ్రామంగా వెంకట్రావుపేట ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. గ్రామస్తులకు అవగాహన కల్పిస్తూ అధికారులు సర్వే పనులు చేస్తున్నారు. ప్రస్తుతం 120 ఇళ్లకు త్వరలోనే సోలార్ ప్యానెల్‌ను అమర్చనున్నారు. – నలిమెల రాజు, సర్పంచ్ పనులు ప్రారంభించాం జిల్లాలో ఏకై క పైలట్ సోలార్ గ్రామంగా వెంకట్రావుపేట ఎంపికై ంది. ఇళ్ల సర్వే పనులు పూర్తి చేశాం. త్వరలోనే ఇళ్లపై సోలార్ ప్యానెల్ బిగిస్తాం. సోలార్ విద్యుత్ వలన డిస్కం వారి నుంచి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. భవిష్యత్ అంతా సోలార్‌పై ఆధార పడి ఉంటుంది. – శ్రీనివాస్, సోలార్ శాఖ జిల్లా మేనేజర్, మంచిర్యాల -
చికిత్స పొందుతూ యువకుడు మృతి
కాసిపేట: మండలంలోని కోమటిచేను గ్రామ పంచాయతీ పరిధిలోని సామగూడలో ఈనెల 5న గుర్తు తెలియని పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించిన పేంద్రం శంకర్ (32) శుక్రవారం మృతి చెందినట్లు దేవాపూర్ ఎస్సై గంగారాం తెలిపారు. ఒక యువతిని ప్రేమించిన యువకుడు ఆమె నిరాకరించడంతో విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పి బాధపడుతూ ఉండేవాడు. ఈక్రమంలోనే పురుగుల మందు తాగి కుటుంబ సభ్యులకు చెప్పడంతో వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. మృతుని తండ్రి జంగు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు. ఆదిలాబాద్‌లో దారి దోపిడీఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ పట్టణంలో దారి దోపిడీ జరిగి ఘటన వెలుగు చూసింది. టూటౌన్ సీఐ కే.నాగరాజు తెలిపిన వివరాల మేరకు పట్టణంలోని ఖుర్షీద్‌నగర్ కాలనీలో గల శ్రీరాం జిన్నింగ్‌లో పనిచేసే మునేశ్వర్ గౌరవ్ గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో వడ్డెర కాలనీ నుంచి కాలినడకన మిల్లు వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు భయపెట్టి అతని వద్ద ఉన్న సెల్‌ఫోన్‌తో పాటు రూ.1,050 నగదు తీసుకుని పరారయ్యారు. బాధితుడు శుక్రవారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. ఏడుగురిపై కేసుఇచ్చోడ: మండలంలోని విజయ జిన్నింగ్ ఫ్యాక్టరీలో పత్తి కొనుగోలులో గోల్మాల్ చేసిన ఏడుగురిని శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌హెచ్‌వో బండారి రాజు తెలిపారు. విజయ జిన్నింగ్ మిల్లులో డిసెంబర్ 15, 16 తేదీల్లో ఒకే ట్రాక్టర్ పత్తిని రెండు సార్లు తూకం వేసినట్లు తెలిసిందన్నారు. దీంతో పూర్తిస్థాయిలో విచారణ జరిపి సంఘటనకు పాల్పడిన మూలే మారుతి, చెర్ల అరుణ్‌కుమార్, ఐద శివరాజ్, గోతి సునీల్, నవీన్, నీలేష్, వారికి సహకరించిన గోకుల నారాయణను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. దాదాపుగా 82 క్వింటాళ్ల పత్తిని పథకం ప్రకారం సీసీఐని మోసగించి రూ.6,61,662 ఏడుగురు వ్యక్తులు పంచుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. మహిళ అదృశ్యంకాసిపేట: మండలంలోని దేవాపూర్ మహేంద్రబస్తీకి చెందిన కొల్లూరి మల్లక్క (60) అదృశ్యమైనట్లు దేవా పూర్ ఎస్సై గంగారాం తెలి పారు. ఈనెల 5న మల్లక్క గోలేటిలో ఉన్న కూతురు వద్దకు వెళ్లివస్తానని చెప్పి బయలుదేరింది. కూతురు వద్దకు వెళ్లలేదని తెలియడంతో కుటుంబ సభ్యులు బంధువులు, తెలిసిన వారి ఇళ్లల్లో వెతికినా ఆచూకి లభించలేదు. మల్లక్క భర్త భూమయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
నాగోబా జాతర ఏర్పాట్లు పూర్తిచేయాలి
ఇంద్రవెల్లి: ఈ నెల 18న మెస్రం వంశీయుల మహాపూజతో ప్రారంభం కానున్న నాగోబా జాతర ఏర్పాట్లను గడువులోగా పూర్తి చేయాలని ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ అన్నారు. శుక్రవారం కేస్లాపూర్‌ను సందర్శించి ఏర్పాట్లను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా తాగునీరు, మరుగుదొడ్లు, స్నానపుగదుల ఏర్పాటు పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. గతేడాది దర్బార్‌కు వచ్చిన దరఖాస్తులతో పాటు ఉప ముఖ్యమంత్రి పాదయాత్రలో ప్రజలు విన్నవించిన సమస్యలు, లబ్ధిదారుల వివరాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మెస్రం తుకారాం, ఐటీడీఏ డీడీ జాదవ్ అంబాజీ, ఈజీఎస్ ఏపీవో జాదవ్ శ్రీనివాస్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పాల్గొన్నారు. నాణ్యతలో ఎలాంటి రాజీ పడొద్దు ఉట్నూర్‌రూరల్: ఉమ్మడి జిల్లాలోని గిరిజన సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల విద్యార్థులకు సరఫరా చేసే ఆహారపదార్థాలు, సరుకుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీపడవద్దని ఐటీడీఏ ఇన్చార్జి పీవో యువరాజ్ మర్మట్ అన్నారు. ఐటీడీఏ పరిధిలో గిరిజన సంక్షేమ వసతి గృహాలకు ఆహార పదార్ధాలు సరఫరా చేసేందుకు గుత్తేదారులను ఖరారు చేయటానికి గిరిజన సహకార సంస్థ (జీసీసీ) డివిజనల్ మేనేజర్ గుడిమళ్ల సందీప్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ సమావేశంలో నిర్ణయించిన ధరలకే గుత్తేదారులు సరుకులను సప్లయ్ చేయాలన్నారు. నాణ్యత విషయంలో నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీడీ జాదవ్ అంబాజీ, జీసీసీ మేనేజర్లు సంతోష్ కుమార్, తారాచంద్, గులాబ్ సింగ్, లక్ష్మణ్, రమేశ్, ఇస్తారి, మనోహర్, ఆయా పాఠశాలల వార్డెన్లు పాల్గొన్నారు. -
సెలవులొచ్చాయ్..
ఎస్సీ బాలుర కళాశాల వసతిగృహం ఎదుట విద్యార్థులుఎస్సీ బాలికల కళాశాల వసతిగృహం నుంచి ఇళ్లకు వెళ్తున్న విద్యార్థినులు, బంధువులుబీసీ సమీకృత వసతిగృహం వద్ద..మంచిర్యాలఅర్బన్: జిల్లాలోని వసతిగృహాలు, రెసిడెన్షియల్, కేజీబీవీల్లో పుస్తకాలతో కుస్తీపట్టిన విద్యార్థులకు సక్రాంతి సెలవులు వచ్చాయి. ఈ నెల 10 నుంచి 16వరకు సెలవులు ప్రకటించగా.. శుక్రవారం ఇంటిబాట పట్టారు. ఇళ్లలో సంప్రదాయ పిండివంటలు, ముగ్గులు వేయడం, గాలిపటాలు ఎగురవేయడం వంటి పనులతో సంబరాలు చేసుకోవడం ఆనవాయితీ. శుక్రవారం తెల్లవారు జాము నుంచే కుటుంబ సభ్యులు ఎప్పుడు వస్తారా అని విద్యార్థులు ఎదురుచూశారు. వసతిగృహాల్లో పేరెంట్స్ సమావేశం నిర్వహించి సెలవుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని, చదువుపై సూచనలు చేశారు. వారం రోజులు సెలవులతో కావడంతో విద్యార్థులు పుస్తకాలు, సామగ్రితో కలిసి కుటుంబ సభ్యులతో కలిసి ఇళ్లకు వెళ్లారు. ఈ నెల 17న విద్యాసంస్థలు పునః ప్రారంభం కానున్నాయి. -
ఎంసీసీ కార్మికులకు నష్టపరిహారం చెల్లించాలి
పాతమంచిర్యాల: ఎంసీసీ కార్మికులకు యాజమాన్యం నష్ట పరిహారం చెల్లించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్, ఐఎఫ్టీయూ జనరల్ సెక్రెటరీ టి.శ్రీనివాస్ అన్నారు. ఎంసీసీ గేట్ ఎదుట నాలుగు రోజులుగా కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలను గురువారం వారు సందర్శించి మద్దతు తెలిపారు. ప్రతీ కార్మికునికి రూ.50 లక్షలు పరిహారం, ఇళ్ల నిర్మాణానికి రెండు గుంటల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రవీందర్రావు, సతీష్‌రావు, అరెందుల శ్రీనివాస్, శివకృష్ణ కార్మికులు ఎస్.రాజయ్య, తిరుపతి, సురేందర్సింగ్, బాపయ్య, టి.రమేష్, రవీందర్, సంపత్, సతీష్, శ్రీనివాస్, గోపాల్ పాల్గొన్నారు. అత్యధిక స్థానాలు కై వసం చేసుకోవాలి నస్పూర్: మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కై వసం చేసుకుని మేయర్ స్థానాన్ని దక్కించుకోవాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి అన్నారు. నస్పూర్ బీఆర్ఎస్ పట్టణ ఉపాధ్యక్షుడు బొంగోని శ్రీనివాస్ ఆయన సతీమణి శిరీష, పలువురు కార్యకర్తలు గురువారం రఘునాథ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పి.కమలాకర్‌రావు, నాయకులు సత్రం రమేశ్, కుర్రె చక్రవర్తి, పొన్నవేణ సదయ్య, సాంబశివరావు, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు. -
మద్ది చెట్లను పరిశీలించిన అధికారులు
ఎఫెక్ట్..కోటపల్లి: మండలంలోని కొత్తపల్లి అటవీ ప్రాంతంలోగల మద్దిచెట్లను గుర్తు తెలియని దుండగులు న రికి దసలి పట్టుపురుగులు సాగు చేసే ఆదివాసీలకు అన్యాయం చేస్తున్నారని గురువారం సాక్షిలో ‘యథేచ్ఛగా మద్దిచెట్ల నరికివేత’ శీర్షికన కథనం ప్రచురితం కాగా అటవీశాఖ అధికారులు స్పందించారు. ఎఫ్‌డీవో సర్వేశ్వర్ కొత్తపల్లి అటవీ ప్రాంతంలో నరికివేసిన మద్దిచెట్లను పరిశీలించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెట్లు నరికివేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మద్దిచెట్లపై దసలిపురుగులు సాగు చేసే చెట్లకు నంబర్‌తో గుర్తింపు చేసినట్లు అధికారులు తెలిపారు. అటవీప్రాంతంలో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా అధికారులు నిఘా ఏర్పాటు చేయాలని ఎఫ్‌డీవో అధికారులకు సూచించారు. ఫారెస్ట్ రేంజ్ అధికారి సదానందం, సిబ్బంది పాల్గొన్నారు. అధికారులతో మాట్లాడుతున్న ఎఫ్‌డీవో -
తక్షణ ఫిర్యాదే రక్షణ
మంచిర్యాలక్రైం: దొంగతనాలు.. మోసాలు.. వేధింపులపై వెంటనే స్పందించి పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. అంతే వేగంగా పోలీసులూ విచారణ చేపడతారు. సాధ్యమైనంత త్వరగా నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ తక్షణ ఫిర్యాదుపైనే ఆధారపడి ఉంటాయి. కానీ.. సైబర్ మోసగాళ్ల విషయంలో పరువు పోతుందనే భయంతో పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెనుకడుగు వేస్తుంటారు. దీంతో బాధితులు రూ.లక్షల్లో మోసపోతున్నారు. కొందరు ఎవరికీ చెప్పుకోలేక ఆత్మహత్యకూ పాల్పడుతున్నారు. సైబర్ మోసానికి గురైనప్పుడు తక్షణమే ఫిర్యాదు చేస్తే పోగొట్టుకున్న సొమ్మును తిరిగి పొందే అవకాశం ఉందని సైబర్ క్రైం పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. రామగుండం పోలీసు కమిషనరేట్ సైబర్ క్రైం అధికారులు ఇటీవల కీలకంగా వ్యహరించారు. కొందరు వ్యక్తులు జన్నారం కేంద్రంగా కాంబోడియా దేశం నుంచి సైబర్ మోసాలు ప్రారంభించిన నాలుగు నెలల వ్యవధిలోనే సుమారు రూ.5కోట్లు కొల్లగొట్టారు. రామగుండం సైబర్ క్రైం పోలీసులు సాంకేతికతతో గుర్తించి నలుగురు నిందితులను అరెస్టు చేసి సైబర్ నేరస్తులకు ఆదిలోనే సంకెళ్లు వేశారు. సొమ్ము రాబట్టారు..ఇటీవల కాలంలో సామాన్యుల నుంచి మొదలుకు ని ఉన్నత స్థాయి వ్యక్తుల వరకు సైబర్ నేరస్తుల చక్రబంధంలో చిక్కుకుని విలవిలలాడుతున్నారు. కొందరు సామాజిక మాధ్యమాల్లో పరిచయమై హా నీట్రాప్, డిజిటల్ అరెస్టు, ట్రెండింగ్ పార్ట్‌టైం జాబ్ పేరిట మోసాలకు పాల్పడుతున్నారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో గత ఏడాది 228 కేసులు నమోదు కాగా, ఈ కేసుల్లో 27మంది సైబర్ నేరస్తులను అరెస్టు చేశారు. బాధితులు రూ.3,13,00,908 పోగొట్టుకోగా.. మోసగాళ్ల ఖాతాల నుంచి రూ.1,30,25,920 బాధితులకు రిఫండ్ అయ్యేలా చూశారు. తక్షణ ఫిర్యాదు కారణంగానే పోగొట్టుకున్న డబ్బు తిరిగి రప్పించడం సాధ్యమవుతుంది. పరువు పోతుందనే భయంతో పోలీసులను ఆశ్రయించని బాధితులు మరింత మంది ఉండవచ్చని పోలీసు అధికారులు అంటున్నారు. సైబర్ వారియర్స్‌కు శిక్షణసైబర్ నేరాల దృష్ట్యా ‘సైబర్ వారియర్స్’ పేరిట రాష్ట్రంలోని ప్రతీ పోలీసు స్టేషన్లో ముగ్గురు కానిస్టేబుళ్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వారికి ప్రత్యేక ట్యా బ్లు అందజేశారు. ఎప్పటికప్పుడు పిటి కేసులు, డయల్ 100 ఫిర్యాదులు, సైబర్ క్రైం నేరాలపై 1930 నంబరుకు వచ్చే ఫోన్ కాల్స్‌కు ఐదు నుంచి పది నిమిషాల్లోనే స్పందించేలా చూస్తున్నారు. బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు డ్రా అయినట్లు తెలియగానే ఫిర్యాదు చేస్తే వెంటనే సదరు ఖాతాను ఫ్రీజ్ చేసి డబ్బులు ఎవరూ డ్రా చేసుకునే వీలు లే కుండా చూస్తారు. ఇలా తక్షణ ఫిర్యాదు వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆలస్యమైతే నేరస్తులు ఖాతాల్లో నుంచి డ్రా చేసుకుంటారు. ఆ తర్వాత రికవరీ చేయడం కష్టతరమని పోలీసులు చెబుతున్నారు. సైబర్ మోసాలపై ప్రత్యేక నిఘా సైబర్ మోసాలపై ప్రత్యేక నిఘా ఉంచాం. గుర్తు తెలి యని నంబరు నుంచి ఫోన్ వస్తే వ్యక్తిగత వివరాలు చె ప్పొద్దు. బ్యాంకు సిబ్బంది అంటూ ఫోన్ చేస్తారు. బ్యాంకు సిబ్బంది ఎప్పు డూ మన బ్యాంకు ఖాతా వివరాలు అడగరు. సైబర్ మోసానికి గురయ్యామని తెలిసిన వెంటనే ఫిర్యాదు చేయాలి. లక్కీ విన్నర్, ఆకర్షణీయమైన ఆఫర్ల పేరుతో వాట్సాప్ లింకులు పంపిస్తుంటా రు. వాటిని క్లిక్ చేయకూడదు. క్లిక్ చేయగానే మన వివరాలు సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోతాయి. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. – ఎగ్గడి భాస్కర్, డీసీపీ, మంచిర్యాలజిల్లాలో కొన్ని ఘటనలు.. -
సమాచార హక్కు చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: సమాచార హక్కు చట్టాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య అన్నారు. గురువా రం కలెక్టరేట్లో సమాచార హక్కు చట్టం–2005పై ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు నిర్వహించిన రెండ్రోజుల శిక్షణ కార్యక్రమానికి ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ విలాయత్ అలీతో కలిసి హాజరయ్యారు. జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సమచార హక్కు చట్టం ఆవిర్భావం, లక్ష్యాలు, పౌరుల హక్కులు, అభ్యర్థన దాఖలు విధానం, రుసుం, కా లపరిమితులు, సమాచార మినహాయింపులు తది తర వాటిపై వివరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో రాజేశ్వర్, రిసోర్స్ పర్సన్ కిషన్, ఎంసీఆర్హెచ్ఆర్డీ, ఉద్యోగులు, అధికారులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
ఉట్నూర్‌రూరల్: గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో అభివృద్ధి పనులు ప్రారంభించి త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సవ్యసాచిఘోష్ సూచించారు. గురువారం హైదరాబాద్ గిరిజన సంక్షేమ కమిషనర్ కార్యాలయం నుంచి అదనపు కార్యదర్శి సర్వేశ్వర్‌రెడ్డి, టీసీ ఆర్టీఎన్టీ సంచాలకులు సమజ్వాలతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఉట్నూర్ ఐటీడీఏలో పీవో యువరాజ్ మర్మాట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ముఖ్య కార్యదర్శి మాట్లాడుతూ.. గిరిజన విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలు, కాస్మొటిక్ చార్జీలు పెండింగ్ లేకుండా చూడాలని తెలిపారు. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఇనిస్టిట్యూట్లకు వివిధ రకాల మరమ్మతు పనుల కోసం రూ.79.61కోట్లు విడుదలయ్యాయని పేర్కొన్నారు. పెండింగ్ బిల్లులు సరి చేసుకోకుంటే ప్రధానోపాధ్యాయులు, సంక్షేమాధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నెల 16, 17లో న్యూఢిల్లీ నుంచి గిరిజన సంక్షేమ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ వర్క్‌షాప్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతీ ఐటీడీఏ నుంచి వివిధ వృత్తులు చేసుకునే 25మంది గిరిజనులను ఎంపిక చేసి పంపించాలని సూచించారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలున్న గిరిజన రైతుల ఆధార్ జనరేషన్ కాక రైతు భరోసా, ఇతర పంట రుణాలు రావడం లేదని, ఐటీడీఏల వారీగా త్వరగా ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ఐటీడీఏ పీవో మాట్లాడుతూ.. గిరిజన సంక్షేమశాఖ పాఠశాలల విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలు అందరికీ అందేలా చూస్తామని పేర్కొన్నారు. జీపీఎస్ పాఠశాల కోసం, ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు సౌకర్యాలు కల్పించడానికి ప్రతిపాదనలు తయారు చేసి పనులు ప్రారంభించి ఫిబ్రవరి 15వరకు పూర్తి చేస్తామని తెలిపారు. పోడు పట్టా కలిగిన రైతులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించి వారికి రైతు భరోసా, బ్యాంక్ ద్వారా ఇతర రుణాలు అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్
ఆదిలాబాద్‌టౌన్: అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసి ఐదు కిలోల గంజాయి, మూడు ద్విచక్ర వాహనాలు, ఆరు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్‌క్వార్టర్స్ సమావేశ మందిరంలో ఎస్పీ అఖిల్ మహాజన్ వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఇంద్రవెల్లిలోని శ్మశానవాటిక ప్రాంతంలో ఈ నెల 7న మధ్యాహ్నం అంతర్రాష్ట్ర ముఠా గంజాయి సరఫరా చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం రావడంతో పోలీసులు దాడి చేశారు. గోనె సంచుల్లో దాచిన 5.230 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.1.30లక్షలు ఉంటుంది. నిందితుల్లో ఇంద్రవెల్లిలోని గంగాపూర్‌కు చెందిన బస్సి సంతోష్, దస్నాపూర్‌కు చెందిన జవాడే శంకర్, భీంనగర్‌కు చెందిన షేక్ ఖాజా, ఆసిఫాబాద్‌లోని జైనూర్‌కు చెందిన సయ్యద్ సాబిర్, మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌కు చెందిన గిరీశ్ విఠల్ దొంట, షేక్ షరీఫ్ ఇర్షాద్‌ను అరెస్ట్ చేశారు. పుట్టలొద్ది గ్రామానికి చెందిన ఆత్రం బాదిరావు పరారీలో ఉన్నాడు. ఇంద్రవెల్లికి చెందిన బస్సి సంతోష్, జవాడే శంకర్ స్థానికంగా గంజాయి విక్రయిస్తుంటారు. వీరికి సయ్యద్ సాబిర్ అనే వ్యక్తి గంజాయి కొనుగోలుకు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నాడు. షేక్ ఖాజా గంజాయి నిల్వలు దాచడం, విక్రయాలకు పాల్పడుతున్నాడు. అంతర్రాష్ట్ర గంజాయి సరఫరా కోసం మహారాష్ట్రకు చెందిన గిరీశ్ విఠల్ నిందితులతో ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపాడు. తక్కువ ధరకు తీసుకువచ్చి విక్రయించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ గ్యాంగ్ ద్విచక్ర వాహనాలపై చిన్నచిన్న ప్యాకెట్లలో గంజాయి విక్రయిస్తున్నారు. కొద్దిరోజులుగా ఇంద్రవెల్లి పోలీసులు అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెంచి సమాచారం సేకరించారు. నిందితుల ఫోన్లు పరిశీలించగా, గంజాయి విక్రయాలకు సంబంధించిన రికార్డులు లభించాయి. ఏడాదిగా నిందితులు గంజాయి తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇంద్రవెల్లితో పాటు ఇతర మండలాల్లో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలినట్లు ఎస్పీ తెలిపారు. జిల్లాలో ఎవరైనా గంజాయి విక్రయించినా, సేవించినా, సాగు చేసినా కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడైనా గంజాయి విక్రయిస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం ఇచ్చినవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఎస్పీ వెంట ఉట్నూర్ అదనపు ఎస్పీ కాజల్‌సింగ్, ఎస్సై సాయన్న ఉన్నారు. -
గ్రంథాలయాల్లో సిబ్బంది కొరత
మంచిర్యాలఅర్బన్: అపార విజ్ఞానానికి నిలయాలైన గ్రంథాలయాలు సమస్యలతో సతమతమవుతున్నాయి. ఏళ్లతరబడి ఖాళీలను భర్తీ చేయకపోవటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గ్రంథాలయాలకు పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల తాకిడి ఎక్కువగా ఉంటోంది. ఉదయం 8నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు గ్రంథాలయాలు తెరిచే ఉంటున్నాయి. వందలాది మంది పాఠకులు వస్తుండటంతో పుస్తకాలపై పర్యవేక్షణ కష్టతరమవుతోంది. గ్రంథాలయాల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేయకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఇలా.. మంచిర్యాల జిల్లా కేంద్ర గ్రంథాలయం 1960లో ఏర్పాటైంది. దీనిని గ్రేడ్–2గా అప్‌గ్రేడ్ చేశారు. ఉద యం 8నుంచి రాత్రి 8గంటల వరకు నిర్వహించా ల్సిన దీనిని రాత్రి 9గంటల వరకు తెరిచి ఉంచాల్సి వస్తోంది. ప్రతీరోజు గ్రంథాలయానికి వచ్చే పాఠకులు 300 మందికి పైనే ఉంటున్నారు. పోటీ పరీక్షల కు సన్నద్ధమయ్యే అభ్యర్థులు 100 నుంచి 200మంది వరకు ఉంటారు. గ్రంథాలయంలో అన్ని పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. కార్యదర్శితోపాటు ఇద్దరు లైబ్రేరియన్లు, కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్, అంటెడర్, వాచ్‌మెన్‌ను నియమించాల్సి ఉంది. దీనిని గ్రేడ్–2గా అప్‌గ్రేడ్ చేసినా కార్యదర్శి పోస్టు రోజుల తరబడి ఖాళీగానే ఉంది. లైబ్రేరియన్‌ను జన్నారం నుంచి, ఇద్దరు ఔట్ సోర్సింగ్‌కు చెందిన అటెండర్లను బెల్లంపల్లి, మందమర్రి నుంచి సర్దుబాటు చేశారు. పాఠకులకు పుస్తకాలిచ్చేవారేరి? జిల్లాలో 15 గ్రంథాలయాలున్నాయి. ఇందులో బె ల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల గ్రేడ్–2 గ్రంథాలయాలున్నాయి. వీటిలో సుమారు 1,07,900 పుస్తకాలున్నాయి. దినపత్రికలతో పాటు వివిధ రకాల వార, పక్ష, మాసపత్రికలు, వివిధ రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. బాలసాహిత్యం, గణి తం, సైన్స్, కంప్యూటర్ పరిజ్ఞానం, ఇతిహాసాలు, జీవితచరిత్రలు, నవలా సాహిత్యం, ఆధ్యాత్మిక గ్రంథాలూ ఉన్నాయి. పాలిసెట్ నుంచి ఇతర పోటీ పరీ క్షలు రాసేందుకు ఉపయోగపడే పుస్తకాలున్నాయి. 3,842 మంది పాఠకులున్న లైబ్రరీల్లో సిబ్బంది కొరత కారణంగా పుస్తకాలు ఇంటికి ఇవ్వడంలేదని తెలుస్తోంది. దీంతో పాఠకుడు ఏ పుస్తకం చదవాలనుకున్నా గ్రంథాలయాల్లోనే చదవాల్సి వస్తోంది. ఇన్‌చార్జీలతో ఇబ్బందులు గ్రంథాలయాల్లో ఇన్‌చార్జీలతో ఇబ్బందులెదురవుతున్నాయి. జన్నారంలో విధులు నిర్వహించే లైబ్రేరియన్‌ను కీలకమైన కేంద్ర గ్రంథాలయం మంచిర్యాలతో పాటు, దాదాపు 120 కిలోమీటర్ల పైన దూరం ఉండే వేమనపల్లి, కోటపల్లికి డిప్యూటేషన్ ఇవ్వటంతో కోర్టుకు వెళ్లినట్లు తెలుస్తోంది. అంబేడ్కర్ స్టడీ సెంటర్, బ్రాంచ్‌లకు పుస్తకాల పంపిణీ లైబ్రరీయన్ వర్క్ భారంతో మినహాయింపు ఇవ్వాలని, మంచిర్యాల ఇన్చార్జి రద్దు చేసి ఒరిజనల్ పోస్టింగ్ జన్నారానికి మాత్రం బాధ్యతలు అప్పగించాలని కోర్టును ఆశ్రయించారు. ఐదేళ్లకు పైగా డిప్యూటేషన్లు కొనసాగుతుండటం గమన్హారం. జెపూర్కు చెందిన లైబ్రేరీయన్కు చెన్నూర్‌కు డిప్యూటేషన్, కాసిపేట్ నుంచి బెల్లంపల్లి డిప్యూటేషన్, మందమర్రి నుంచి నెన్నెలకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. దండేపల్లి లైబ్రేరియన్‌కు మినహాయింపు ఇచ్చారు. భీమిని అవుట్ సోర్సింగ్ లైబ్రేరియన్‌కు తాండూర్ ఇన్‌చార్జీగా, లక్సెట్టిపేటలో పార్ట్‌టైం వర్కర్‌తో వెల్లదీస్తున్నారు. భీమారం విలేజీ లైబ్రరీ పార్ట్‌టైం వర్కర్‌ను వయస్సు మిరిపోయిందని చెప్పాపెట్టకుండా పక్కన పెట్టారు. దీంతో స్వీపరే పెద్ద దిక్కుగా మారింది. ముగ్గురు అవుట్ సోర్సింగ్ అటెండర్లే.. జిల్లాలో రెగ్యులర్ అటెండర్లు ఐదుగురుండాల్సిన చోట ఒక్కరినీ నియమించలేదు. ప్రస్తుతం అవుట్ సోర్సింగ్ అటెండర్లు ముగ్గురు మాత్రమే విధులు ని ర్వహిస్తున్నారు. ఉన్న అటెండర్లు కూడా బెల్లంపల్లి అటెండర్‌ను మంచిర్యాలకు డిప్యూటేషన్, చెన్నూర్ అటెండర్‌ను మంచిర్యాలకు, మంచిర్యాల అటెండర్‌ను బెల్లంపల్లికి డిప్యూటేషన్ ఇవ్వటంతో మిగిలిన చోట్ల ఇబ్బందులు తలెత్తున్నాయి. మంచిర్యాలలో స్వీపర్ తాత్కాలిక ఉద్యోగిగా నెట్టుకొస్తున్నారు. ఒక్కరికే ఆరు బాధ్యతలు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శిగా సరిత ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. కరీంనగర్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న సరితకు మంచిర్యాల ఇన్చార్జితో పాటు పెద్దపల్లి, ఆసిఫాబాద్, జగిత్యాల, సిరిసిల్లకు ఇన్చార్జిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆదిలాబాద్ యూడీసీని మంచిర్యాల ఇన్చార్జిగా నియమించారు. ఇదివరకు గ్రంథాలయ సంస్థ పాలకవర్గం గడువు ముగియటంతో అప్పట్లో అదనపు పాలనాధికారి రాహుల్ పర్సన్ ఇన్చార్జిగా కొనసాగగా ఆయన ప్రమోషన్‌పై వెళ్లిపోయారు. ప్రస్తుత కలెక్టర్ కుమార్ దీపక్ పర్సన్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. రెండేళ్లకుపైగా పాలకవర్గం లేకుండాపోయింది. కొత్త పాలకవర్గం వచ్చేంత వరకు పదవిలో కొనసాగనున్నారు. అస్తవ్యస్తంగా ఉన్న గ్రంథాలయ ఉద్యోగుల డిప్యూటేషన్లతో పాటు ప్రస్తుత పోటీ పరీక్షల పుస్తకాల కొనుగోలుపై ప్రత్యేక చొరవ చూపాలని పాఠకులు కోరుతున్నారు. -
ఆటలాడేదెలా..!
లక్సెట్టిపేట: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మినీ స్టేడియం నిర్మాణ పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. ఆరేళ్లుగా ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోవడంతో క్రీడాకారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 2019 అక్టోబర్‌లో డీఎంఎఫ్టీ నిధులు రూ.75లక్షలు అప్పటి ప్రభుత్వం మంజూరు చేసింది. 2020లో పనులు ప్రారంభించి ఓ వైపు గ్యాలరీ పనులు.. మరోవైపు పిల్లర్ల దశ వరకు నిర్మాణం చేపట్టారు. రెండు వైపుల ఎల్ ఆకారంలో మినీస్టేడియం గ్యాలరీ ఏర్పాటుతో మినీ స్టేడియం నిర్మించాలని ప్రణాళిక రూపొందించారు. మినీ స్టేడియం అందుబాటులోకి వస్తుందని క్రీడాకారులు సంతోషించారు. కానీ.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా కాంట్రాక్టర్ పనుల్లో జాప్యం చేశారు. మంజూరైన నిధులు సరిపోలేదని సదరు కాంట్రాక్టర్ పనులను అర్ధంతరంగా వదిలేశారు. ఆరేళ్లుగా నిలిచిపోయిన పనులపై అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఉదయం వేళ వాకింగ్‌కు వెళ్లేవారు, క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారు. సగంలో నిలిచిపోయిన పనులు క్రీడాకారుల ఆటలకు అడ్డంకిగా మారాయి. ఆట స్థలం కరువు.. పట్టణం మధ్యలో కళాశాల పక్కన మైదానం ఉండడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో క్రీడాకారులు, వాకింగ్ కోసం వస్తుంటారు. దసరా, సంక్రాంతి, వేసవిలో క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహిస్తారు. మినీ స్టేడియం పనులతో మైదాన విస్తీర్ణం తగ్గి స్థలం కరువైంది. క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందించాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోవడంతో ఇబ్బందిగా మారింది. స్పందించి మినీ స్టేడియం పనులు పూర్తి చేయాలని పలువురు కోరుతున్నారు. -
గంజాయి పట్టివేత
భీమిని: కన్నెపల్లి మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్ వద్ద గురువారం వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇ ద్దరు యువకులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారి వాహనాన్ని తనిఖీ చేయగా గంజాయి లభించినట్లు తాండూర్ సీఐ దేవయ్య, కన్నెపల్లి ఎస్సై భాస్కర్‌రావు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. లింగాల గ్రామానికి చెందిన సుంది ల్ల ప్రభాకర్, రౌతు మారుతి బెల్లంపల్లి పట్టణంలో ని రడగంబాల బస్తీకి చెందిన పిడుగురాళ్ల చందర్ అలియాస్ చందు నుంచి 200 గ్రాముల గంజాయి కొనుగోలు చేసి తీసుకువస్తున్నారు. పోలీసులు వా రి నుంచి గంజాయి స్వాధీనం చేసుకుని కేసు న మో దు చేశారు. గంజాయి అమ్మడం, కొనుగోలు చే యడంతో పాటు వినియోగించడం చట్టరీత్యా నిషేధమని తెలిపారు. ఎవరైనా ఇలా చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో గంజాయి అమ్మకాలు, కొనుగోళ్లు జరిగితే వెంటనే ‘డయల్ 100’కు సమాచారం ఇవ్వాలని సూచించారు. -
చలికి గజ గజ
దండేపల్లి: జిల్లాలో గత రెండు మూడు రోజుల నుంచి చలి తీవ్రత మరింత పెరిగింది. రోజు రోజుకు కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో చలి వణికిస్తోంది. వృద్ధులు, పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జైపూర్ మండలంలో 9.3, కోటపల్లి, వేమనపల్లి మండలం నీల్వాయిలో 9.5, జన్నారంలో 9.6, కోటపల్లి మండలం దేవులవాడ, భీమారం మండల కేంద్రంలో 9.9, మందమర్రి మండలం అందుగులపేటలో 10.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆయా ప్రాంతాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్టు జారీ చేసింది. జిల్లా అంతటా 11.8 డిగ్రీల కంటే తక్కువగానే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చలికి వణికిపోతున్నారు. సాయంత్రం 5గంటలు దాటితే చాలు చలి తీవ్రత పెరుగుతోంది. ఉదయం 9గంటలు దాటినా చలి ప్రభావం తగ్గడం లేదు. దీంతో బయటకు రావాలంటే జనాలు జంకుతున్నారు. చలి నుంచి ఉపశమనానికి కొందరు రాత్రివేళ రోడ్ల పక్కన చలిమంటలు కాగుతున్నారు. మరికొందరు ఉన్ని దుస్తులు ధరించి బయటకు వస్తున్నారు. -
ఇంటర్ ప్రయోగాలకు నిధులు
మంచిర్యాలఅర్బన్: ఇంటర్మీడియెట్ ప్రయోగ పరీక్షలకు ఇంటర్ విద్యాశాఖ ప్రత్యేక నిధులు విడుదల చేసింది. గత ఏడాది ప్రయోగ పరికరాల కొనుగోలుకు రూ.25వేలు మంజూరు చేయగా.. ఈ ఏడాది రెట్టింపు చేసింది. ఇంటర్ ప్రయోగ పరీక్షలు ఫిబ్రవరి 2న ప్రారంభమై 21న ముగుస్తాయి. జిల్లాలో పది ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా.. రూ.5లక్షలు ఇంటర్ విద్యాశాఖ విడుదల చేసింది. ఆయా కళాశాలల బ్యాంకు ఖాతాల్లో రూ.50వేల చొప్పున జమ అయ్యాయి. కలెక్టర్ అనుమతితో ప్రయోగ పరికరాలు కొనుగోలు చేయనున్నారు. ఇక సులువు జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఫస్టియర్ విద్యార్థులు 1974మంది, సెకండియర్‌లో 1676 మంది ఉన్నారు. రెండో సంవత్సరం ఫిజిక్స్, కెమెస్ట్రి, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల్లో ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తారు. పాఠశాల స్థాయిలో పరిశోధనలు లేకపోవడం వల్ల ప్రతిభకు పదును లేకుండా పోతోంది. దీంతో విద్యార్థులకు ఇంటర్ మొదటి సంవత్సరంలోనే ప్రయోగాలు నేర్పించాల్సి ఉంటుంది. బోటనీ, జువాలజీ ల్యాబ్‌ల్లో జంతు కళేబరాలు, అవశేషాలు తదితరవి విద్యార్థులకు చూపించాలి. ఆకు, కాండం తదితర విషయాలు తెలుసుకునేందుకు మైక్రోస్కోప్‌లు వినియోగించాలి. రసాయనశాస్త్రంలో లవణ, మూలకాలు తదితర గురించి తెలియాలంటే రసాయనాలు అవసరం. ప్రయోగ పరికరాలు పిప్పెట్, బ్యూరెట్, స్క్రూగేజీ, వెర్మియట్, కాలిపస్తోపాటు హైడ్రో క్లోరి యాసిడ్, సల్పర్ యాసిడ్‌తో 24 రకాల సాల్ట్(లవణాలు) ప్రయోగాలకు అవసరం. ఈ నేపథ్యంలో ప్రయోగ పరికరాలు, రసాయనాలకు రూ. 50వేల చొప్పున మంజూరు కావడంతో విద్యార్థుల్లో రెట్టింపు ఉత్సాహం నింపనుంది. వృత్తి విద్య కోర్సులో..వృత్తి కోర్సుల్లో కంప్యూటర్ సైన్స్, ఎంపీహెచ్‌డబ్ల్యూ, ఎంఎల్టీ ఉంటాయి. మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్(ఎంపీహెచ్‌డబ్ల్యూ), మెడికల్ ల్యాబరెటీ టెక్నాలజీ(ఎంఎల్టీ) కోర్సుల్లో పరికరాలు అవసరం. క్షేత్రస్థాయిలో అందుకు భిన్నంగా చదువులు సాగుతున్నాయి. గతేడాది నిధులు స్టేతస్కోప్, బీపీ మిషన్, వెయింగ్ మిషన్ కొనుగోలుకే సరిపోయాయి. ఇంకా ప్రయోగాలు ఎలా చేస్తారో తెలియకుండా పోయింది. చాలా కళాశాలలు పా ఠ్యాంశాల బోధనకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నా రు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీలో ప్ర యోగాలు చేయించాల్సి ఉండగా చాలా మందికి పరికరాలు పరిచయం చేసేందుకే పరిమితం చేస్తున్నాయనే విమర్శలున్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో పరికరాలు, కెమికల్స్‌కు నిధులు మంజూరు అయ్యాయని డీఐఈవో అంజయ్య తెలిపారు. -
జీరో పెండెన్సీ లక్ష్యంతో పనిచేయాలి
శ్రీరాంపూర్: జీరో పెండెన్సీ లక్ష్యంతో పనిచేయాలని రామగుండం రీజియన్ సీఎంీపీఎఫ్ కమిషనర్ కే గోవర్ధన్ తెలిపారు. గురువారం శ్రీరాంపూర్ జీఎం కార్యాలయంలో సీఎంపీఎఫ్కు సంబంధించిన ప్రయాస్ కార్యక్రమంలో భాగంగా జీరో పెండెన్సీ లక్ష్యంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెన్షన్ లావాదేవీలను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. రిటైర్డ్ ఉద్యోగుల క్లైమ్లను సీ కోర్సు పోర్టల్ ద్వారా సత్వరమే పరిష్కరించాలని తెలిపారు. ఈ సందర్భంగా 266 రివైజ్డ్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ కాపీలు అందించారు. శ్రీరాంపూర్ డీజీఎం (పర్సనల్) ఎస్.అనిల్‌కుమార్, గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి ఎం.కొమురయ్య, సీనియర్ పీవో ఎస్.సురేందర్ పాల్గొన్నారు. -
తప్పులు సవరించకుంటే ఎన్నికలు బహిష్కరిస్తాం
భైంసాటౌన్: మున్సిపల్ ఓటరు ముసాయిదా జాబితా తప్పులతడకగా ఉందని ఆరోపిస్తూ ప్రజావేదిక, మహిష ఆధ్వర్యంలో గురువారం భైంసా పట్టణంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని మున్సిపల్ చౌరస్తా నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా చేరుకుని సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్‌కుమార్‌కు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం పలువురు మాట్లాడుతూ.. మున్సిపల్ ఓటరు ముసాయిదా జాబితాలో ఒక వార్డులోని ఓట్లు మరోవార్డులో, ఒక వార్డులో ఒకే ఇంటి నంబర్‌పై పదుల సంఖ్యలో మరోవర్గం ఓట్ల నమోదు.. లాంటి తీవ్రమైన లోపాలున్నాయని ఆరోపించారు. మున్సిపల్ ట్యాక్స్ రికార్డుల్లో లేని ఇంటి నంబర్లతో ఓట్లు నమోదయ్యాయని తెలిపారు. తప్పులు సవరించుంటే ఎన్నికలు బహిష్కరిస్తామని హెచ్చరించారు. స్పందించిన సబ్ కలెక్టర్ అభ్యంతరాలను రాతపూర్వకంగా ఇవ్వాలని సూచించారు. బోగస్ ఓట్ల తొలగింపు కోసం నిర్ణీత ఫాంలను భర్తీ చేసి అందించాలని తెలిపారు. -
భర్త బాటలో గంజాయి రవాణా
నిజామాబాద్‌అర్బన్: భర్త చేస్తున్న అక్రమ గంజాయి రవాణాను గమనించింది. కొన్నిసార్లు తోడుగా వెళ్లి గంజాయి రవాణాలో భాగమైంది. కొన్నేళ్లపాటు ఇద్దరూ అక్రమ దందాను కొనసాగించారు. అయితే, రెండు నెలల క్రితం భర్త అనారోగ్యంతో చనిపోగా, భార్య మాత్రం గంజాయి రవాణా కొనసాగిస్తోంది. తీరా నిజామాబాద్‌లో ఎకై ్సజ్ పోలీసులకు పట్టుబడటంతో ఆమె వ్యవహారం బట్టబయలైంది. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం దేవులతండా గ్రామానికి చెందిన పూజా పవార్ గురువారం జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో గంజాయితో పట్టుబడింది. ఆమె భర్త దేవ్‌రాజ్ కొన్నేళ్లుగా గంజాయి అక్రమ రవాణా కొనసాగించి రెండు నెలల కిందట మరణించాడు. ఇద్దరు పిల్లలున్న పూజా పవార్ కుటుంబ పోషణ కోసం భర్త కొనసాగించిన మార్గాన్ని అనుసరించింది. ఆమెకు ఆదిలాబాద్ జిల్లా కుప్టి(కే) గ్రామానికి చెందిన దుర్పాద బాయి జాదవ్ తోడైంది. మధ్యప్రదేశ్ టూ నిజామాబాద్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సిర్పూర్ పట్టణంలో కిలో గంజాయి ధర తక్కువగా ఉండడంతో పూజా పవార్, దుర్పాద బాయి జాదవ్ కొనుగోలు చేస్తుంటారు. అనంతరం ఆ గంజాయిని మహారాష్ట్రలోని కిన్వట్‌కు తరలించి, మధ్యవర్తులైన కిషన్ మోతీరాం దాలే, ఇంద్రజిత్ టాగ్రెల ద్వారా నిజామాబాద్‌కు సరఫరా చేస్తుంటారు. గత నెలలో నిజామాబాద్‌కు వచ్చిన వారు కామారెడ్డి జిల్లా గాంధారి మండలం చద్మల్‌కు చెందిన వెంకట్రామ్కు గంజాయి విక్రయించారు. ఆ గంజాయిని వెంకట్రామ్ జిల్లా కేంద్రంలో ప్యాకెట్ల రూపంలో విక్రయిస్తూ వస్తున్నాడు. గురువారం ఉదయం 7.30 కంఠేశ్వర్ బైపాస్ రోడ్డులో నలుగురు వ్యక్తులు గంజాయితో బస్సు దిగారు. అప్పటికే సమాచారం అందుకున్న ఎకై ్సజ్ శాఖ నిజామాబాద్ ఎస్‌హెచ్‌వో స్వప్న తన సిబ్బందితో మఫ్టీలో కాపుకాశారు. బస్సు దిగగానే అనుమానాస్పదంగా కనిపించడంతో వారి బ్యాగులను తనిఖీ చేశారు. అందులో 13కిలోల ఎండు గంజాయి లభించింది. దీని విలువ రూ.6 లక్షల వరకు ఉంటుందని ఎకై ్సజ్ శాఖ సూపరిండెంట్ మల్లారెడ్డి విలేకరులకు వెల్లడించారు. గంజాయి కొనుగోలు చేస్తున్న వెంకట్‌తోపాటు మహారాష్ట్రకు చెందిన కిషన్మోతీరాం దాలే, ఇంద్రజిత్ టాగ్రె, పూజా పవార్, దుర్పాదబాయి జాదవ్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితులకు చెందిన ఐదు సెల్ఫోన్లు సీజ్ చేశామని పేర్కొన్నారు. సమావేశంలో నిజామాబాద్ ఎకై ్సజ్ ఎస్‌హెచ్‌వో స్వప్న, ఎస్సై మల్లేశ్, సుష్మిత, సిబ్బంది సునీల్, ప్రభాకర్, రవి, సంగయ్య, సౌమ్య, సుచరిత, సంజయ్ తదితరులున్నారు. -
చదువుతోనే బాలికా సాధికారత
● జిల్లా కలెక్టర్ కుమార్‌దీపక్ మంచిర్యాలఅర్బన్: బాలికల విద్యను ప్రోత్సహించి సాధికారత దిశగా అడుగులు వేసేలా కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హోటల్లో నిర్మల్, మంచిర్యాల జిల్లాల కేజీబీవీ ప్రత్యేక అధికారులు, మోడల్ హాస్టళ్ల వార్డెన్లకు జాతీయ విద్యా ప్రణాళిక, పరిపాలన సంస్థ(ఎన్ఐఈపీఏ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు రోజు గురువారం శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. ఆయన మాట్లాడుతూ కేజీబీవీల బలోపేతానికి శిక్షణ కార్యక్రమమని తెలిపారు. సామర్థ్యాలను పెంపొందించుకుని ఉత్తమ ఫలితాలు సాధించేలా శ్రద్ధ వహించాలని అన్నారు. నాణ్యమైన విద్య అందించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశా రు. బాలిక విద్య ప్రాముఖ్యతపై ప్రదర్శించిన నాటికను ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కో–ఆర్డినేటర్లు విజయలక్ష్మి, భరత్, సత్యనారాయణమూర్తి, చౌదరి, నిర్మల్ జిల్లా కో–ఆర్డినేటర్లు నవీన జ్యోతి, అసిస్టెంట్ కో–ఆర్డినేటర్ రమాదేవి, మాస్టర్ ట్రైనర్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసిన మీ సేవ ఆపరేటర్ అరెస్ట్
గుడిహత్నూర్: కల్యాణలక్ష్మి పథకం కోసం నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి లబ్ధిపొందాలని చూసిన మండల కేంద్రానికి చెందిన మీ సేవ ఆపరేటర్ ములజ్కర్ శరత్, మండలంలోని మన్నూర్ గ్రామానికి చెందిన జాదవ్ గణేశ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏఎస్పీ కాజల్ తెలిపారు. ఏఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. మన్నూర్‌కు చెందిన ఇంగ్లే అంకుష్, కదం శ్యాంసుందర్ వీరిద్దరు తమ కూతుళ్లకు 18 ఏళ్లు నిండకముందే వివాహం చేశారు. అయినా కల్యాణలక్ష్మి కింద ఆర్థికసాయం పొందాలని చూశారు. ఇదే గ్రామానికి చెందిన జాదవ్ గణేశ్ కొంత నగదు ఇస్తే పథకం డబ్బులు వచ్చేలా చూస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ముందుగా రూ.20వేలు తీసుకుని వారి కూతుళ్ల ఆధార్ కార్డులు, నకిలీ బోనఫైడ్లు తయారు చేసి అందులో వారి వయస్సు మార్చి పోర్జరీ సర్టిఫికెట్లు తయారు చేశాడు. ఈ తతంగం తెలుసుకున్న ఎస్సై శ్రీకాంత్ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టగా వీరు మోసాలకు పాల్పడుతున్నట్లు బట్టబయలైంది. దీంతో వీరు తయారు చేసిన నకిలీ సర్టిఫికెట్లు, వారి వద్ద ఉన్న కంప్యూటర్ పరికరాలు, వారి సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మీ సేవ ఆపరేటర్ ములజ్కర్ శరత్, జాదవ్ గణేశ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నేరం చేయడానికి సహకరించిన ఇంగ్లే అంకుష్, కదం శ్యాంసుందర్‌ను కూడా మైనర్ బాలికలకు వివాహం చేసిన నేరానికి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, వీరిద్దరు ప్రస్తుతం పరారీ ఉన్నారు. ఇలా సామాన్యులను మభ్యపెట్టి మోసాలకు పాల్పడే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా బాధితులుంటే వెంటనే తమకు సమాచారం అందించాలని ఏఎస్పీ సూచించారు. సీఐ రమేశ్, ఎస్సై శ్రీకాంత్ ఉన్నారు. -
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
లక్సెట్టిపేట: ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని జూనియర్ సివిల్ జడ్జి కాసమల సాయికిరణ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల మైదానం వద్ద కోర్టు ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సద స్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమానాతోపాటు శిక్ష పడుతుందని తెలిపారు. అనంతరం అందరితో నిబంధనలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గాండ్ల సత్యనారాయణ, న్యాయవాది గణేష్, ఏఎస్సై సుధాకర్, కానిస్టేబుళ్లు సంజీవ్, రాజమౌళి పాల్గొన్నారు. -
యథేచ్ఛగా మద్దిచెట్ల నరికివేత
కోటపల్లి: మండలంలోని కొత్తపల్లి, రాజారం, పార్పల్లి గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో పట్టుపురుగుల పెంపకం కొరకు ఆదివాసీ రైతులకు కేటాయించిన మద్దిచెట్లు నరికివేతకు గురవుతున్నాయి. గుర్తుతెలియని దుండగులు విచ్చలవిడిగా చెట్లును నరికివేస్తుండగా అధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఫలితంగా పట్టుపురుగుల పెంపకం ప్రశ్నార్థకంగా మారడంతో ఉపాధి కోల్పోయి రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆదివాసీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు మిన్నకున్నారని ఆరోపిస్తున్నారు. ఇంటి అవసరాలకు చిన్నచిన్న కట్టెపుల్లలను తీసుకెళ్తేనే కేసులు నమోదు చేసే అటవీశాఖ అధికారులు మద్దిచెట్లను నరికేస్తున్నా కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడడంలేదని పేర్కొంటున్నారు. పట్టుపురుగుల పెంపకం చేపట్టవద్దని ఇటీవల అటవీశాఖ అధికారులు అడ్డుకోవడంతో తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు జేక శేఖర్ మంత్రి వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లారు. ఆదివాసీల జీవనోపాధికి ఇబ్బందులు కలిగించవద్దని మంత్రి ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ పట్టుపురుగుల పెంపకం నిలిచిపోయేలా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆదివాసీ రైతులు వాపోతున్నారు. ఇప్పటికై నా అటవీశాఖ ఉన్నతాధికారులు స్పందించి చెట్ల నరికివేతను అడ్డుకోవాలని కోరుతున్నారు. ఇదే విషయంపై ఎఫ్‌డీవో సర్వేశ్వర్ను వివరణ కోరగా అటవీ ప్రాంతంలో చెట్లను నరికేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. మద్దిచెట్లను నరికేస్తున్న విషయం మాదృష్టికి రాలేదన్నారు. -
కాంగ్రెస్ హయాంలో అన్ని వర్గాలకు మేలు
చెన్నూర్: గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అన్ని వర్గాల ప్రజలను వంచించిందని రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో అన్ని వర్గాలకు మేలు జరిగిందని అన్నారు. బుధవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చెన్నూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, బీజేపీ ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకుడు బత్తుల సమ్మయ్య తన అనుచరులు 200మందితో మంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 50వేల టీచర్ పోస్టులు భర్తీ చేసిందని తెలిపారు. సింగరేణి పవర్ ప్లాంటులో త్వరలో 850 మెగావాట్ల ప్లాంటుకు భూమి పూజ చేస్తామని అన్నారు. కొత్తగా గెలిచిన సర్పంచ్‌లకు రూ.20లక్షలు నిధులు అందజేస్తామని, త్వరలో ప్రొసీడింగ్‌లు పంపిణీ చేస్తామని చెప్పారు. బీఆర్ఎస్ అవినీతి, ఆరోపణలపై శాసనమండలి సాక్షిగా కవిత తన అన్న, బావ రాష్ట్రాన్ని దోచుకున్నారని చెప్పారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాఽథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్, మాజీ జెడ్పీటీసీ బెల్లంకొండ కరుణసాగర్‌రావు, మాజీ సర్పంచ్ గొడిసెల బాపురెడ్డి పాల్గొన్నారు. బస్సు ప్రారంభం మందమర్రిరూరల్: మందమర్రి పట్టణంలోని మార్కెట్ నుంచి బీ జోన్ మీదుగా మంచిర్యాలకు నూతన బస్సును మంత్రి వివేక్‌వెంకటస్వామి జిల్లా కలెక్టర్ కుమార్‌దీపక్, మంచిర్యాల డీసీపీ బాస్కర్, మంచిర్యాల ఆర్టీసీ డీఎం శ్రీనివాస్‌తో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ బస్సు రోజుకు కనీసం ఆరు ట్రిప్పులు ఉంటుందని, త్వరలోనే ప్రజల డిమాండ్ మేరకు పాత బస్టాండ్ వరకు పొడగించే ఆలోచన ఉన్నామని డీఎం తెలిపారు. ప్రహరీ పనులు.. భీమారం: మండల కేంద్రంలోని బీసీ కాలనీలో ప్రభుత్వ పాఠశాల ప్రహరీ పనులను మంత్రి వివేక్‌వెంకటస్వామి బుధవారం ప్రారంభించారు. బస్డాండ్ ప్రాంతంలో ప్రయాణికుల సౌకర్యార్థం మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. సర్పంచ్ విజయలక్ష్మి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
‘‘ఉపాధి’లో కమీషన్లు రావనే కాంగ్రెస్ వ్యతిరేకం’
మంచిర్యాలటౌన్: ఉపాధిహామీ పథకం పనుల్లో కమీషన్లు రావనే ఉద్దేశ్యంతోనే వీబీ జీ రామ్ జీ బిల్లును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ విమర్శించారు. జిల్లా కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధిహామీ పథకం కింద పేదలకు మరిన్ని పనిదినాలు కల్పించి, ఆదాయాన్ని పెంచాలనే ఉద్దేశ్యంతో మోదీ నేతృత్వంలో కేంద్రం ప్రవేశ పెట్టిన బిల్లుపై కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్, గోలి రాము, వెరబెల్లి రవీందర్రావు, ముత్తె సత్తన్న, జోగుల శ్రీదేవి, కమలాకర్‌రావు, బియ్యాల సతీశ్‌రావు, మోటపలుకుల తిరుపతి, మాధవరపు వెంకటరమణ, రాపర్తి వెంకటేశ్వర్లు, అమిరిశెట్టి రాజ్‌కుమార్, సత్రం రమేశ్, రంగ శ్రీశైలం, గడ్డం స్వామిరెడ్డి, బేతు రవి పాల్గొన్నారు. -
గోదావరి పుష్కర ఘాట్ల పరిశీలన
మంచిర్యాలరూరల్(హాజీపూర్)/లక్సెట్టిపేట/జైపూర్: గోదావరి నది పుష్కరాల నేపథ్యంలో జిల్లాలోని లక్సెట్టిపేట, ముల్కల్ల, మంచిర్యాల, జైపూర్ శివారులోని వేలాల గోదావరి పుష్కర ఘాట్లను హైదరాబాద్‌కు చెందిన ఈవై కన్సల్టెన్సీ సభ్యులు జయదీప్, తహరీమ్ బృందం బుధవారం పరిశీలించింది. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టే ఏర్పాట్లపై సమీక్షించింది. ఏయే ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు చేపట్టాలనే విషయమై సర్వే నిర్వహించారు. పుష్కరఘాట్లతోపాటు భక్తులు దుస్తులు మార్చుకునే గదులు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, పార్కింగ్, వసతులపై నివేదిక తయారు చేశారు. మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాసరావు, ఆయా మండలాల తహసీల్దార్లు రఫతుల్లా, దిలీప్‌కుమార్, వనజారెడ్డి, లక్సెట్టిపేట మున్సిపల్ కమిషనర్ విజయ్‌కుమార్, ఆర్డబ్ల్యూఎస్ డీఈ విద్యాసాగర్, సర్పంచ్ డేగ స్వప్ననగేశ్ తదితరులు పాల్గొన్నారు. -
చట్టం అందరికీ సమానమే...
చట్టం అందరికీ సమానమే. పోలీసు శాఖలో పని చేసే ఏ స్థాయి అధికారి అయినా సివిల్ తగాదాలు, కొట్లాటలు, పోలీసు అని బెదిరింపులు, అధికార దుర్వినియోగానికి పాల్పడితే సహించేది లేదు. శాఖ పరమైన చర్యలతోపాటు కేసులు నమోదు చేయడం జరుగుతుంది. సీసీఎస్ ఎస్సై జీవన్‌తోపాటు మరికొందరిపై కేసు నమోదైంది. అక్రమాలకు పాల్పడిన అధికారులపై పూర్తి స్థాయి విచారణ అనంతరం కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఫిర్యాదుదారులను ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే నేరుగా డీసీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చు. లేదా నేరుగా కలిసి ఫిర్యాదు చేసినా విచారణ అనంతరం చర్యలు తీసుకుంటాం. – ఎగ్గడి భాస్కర్, డీసీపీ మంచిర్యాల -
సరదా.. కారాదు విషాదం
మంచిర్యాలటౌన్: సంక్రాంతి అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది పతంగులు. పండుగకు గాలిపటాలు ఎగురవేసేందుకు చిన్నాపెద్దా ఆసక్తి కనబరుస్తారు. పతంగులను ఎగురవేసేందుకు గానూ వ్యాపారులు వివిధ ప్రాంతాల నుంచి మాంజాలను తెప్పించి విక్రయిస్తుంటారు. కొంతమంది ప్లాస్టిక్‌తో తయారు చేసిన చైనామంజాను విక్రయిస్తుండడంతో కొనుగోలు చేసేందుకు చిన్నారులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ మాంజాతో కూడిన దారం వల్ల పక్షులు, జంతువులతో పాటు, ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు. పలువురు మృత్యువాత పడిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చైనామాంజాను నిషేధిస్తూ 2016 జనవరి 13న జీవో విడుదల చేశాయి. ఈ జీవో అమలులో భాగంగా అటవీ, పోలీస్ శాఖ అధికారులు తరచూ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి చైనామాంజా విక్రయించే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటున్నారు. చైనామాంజా అమ్మితే ఐదేళ్ల జైలుశిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తామని హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ పలువురు వ్యాపారులు అధికారుల కళ్లుకప్పి విక్రయాలు సాగిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రాణాలతో చెలగాటం గాలి పటాలు ఎగురవేసేటప్పుడు ఒకరి పతంగి కంటే మరొకరి పతంగి ఎత్తులో ఎగరాలని, ఆకాశంలో ఉండగానే ఎదుటివారి పతంగిని కట్ చేయాలని చూస్తుంటారు. ఇందుకోసం కొంతమంది నిషేధిత చైనామాంజాను వాడుతున్నారు. ఈ దారం తయారీలో గాజుపొడి, నైలాన్, సింథటిక్, హానికరమైన రసాయనాలను వాడుతుంటారు. ఈ దారం పతంగులను కట్ చేయడమే కాకుండా మనుషులకు, పక్షులకు, జంతువులకు తగిలితే కత్తితో కోసినట్లుగా కట్ చేసేస్తుంది. ద్విచక్ర వాహనదారులు రోడ్డుపై రోడ్డుపై వెళ్తుండగా చైనామాంజా తాకి గాయాలై మృతి చెందిన సంఘటనలు ఏటా ఎక్కడో ఒకచోట చోటు చేసుకుంటున్నాయి. -
ఎఫెక్ట్..
సంక్రాంతికి ప్రత్యేక రైళ్లుమంచిర్యాలఅర్బన్/కాగజ్‌నగర్‌రూరల్: సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్ మార్గంలో మొదటిసారిగా సంక్రాంతి పండుగకు ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. డిసెంబర్ 26న ‘సాక్షి’లో పండుగకు రైలు కూతపెట్టేనా? శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. కాజీపేట్ నుంచి కాగజ్‌నగర్ వరకు రద్దీ ఎక్కువగా ఉంటుంది. బస్సులు, రైళ్లు సరిపోక కిక్కిరిసిన ప్రయాణంతో ఇబ్బందులు పడుతున్న విషయాలపై అధికారులు స్పందించారు. ఈనేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే జోన్ హైదరాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్ వరకు బై వీక్లీ ప్రత్యేక జనరల్ కోచ్ అన్ రిజర్వుడ్ రైళ్లు నడపనున్నట్లు సర్క్యూలర్ విడుదల చేసింది. హైదరాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్‌కు జనవరి 9, 10 తేదీల్లో రైలు నడపనున్నారు. సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక రైలు జనవరి 09, 18 తేదీల్లో నడుస్తుంది. 07469బై 70 నాంపల్లి హైదరాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి హైదరాబాద్ నాంపల్లికి సంక్రాంతి ప్రత్యేక రైలుకు సికింద్రాబాద్, చర్లపల్లి, భువనగరి, ఆలేరు, జనగాం, ఘనపూర్ కాజీపేట్ మీదుగా పలు రైల్వే స్టేషన్లతో పాటు మంచిర్యాల, రవీంద్రఖని, మందమర్రి, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ రోడ్డు రైల్వే స్టేషన్లలో హాల్టింగ్ సదుపాయం కల్పించారు. పండుగకు రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైలు నడపటంపై ఉత్తర తెలంగాణ రైల్వే ఫోరం అధ్యక్షుడు ఫణి హర్షం వ్యక్తం చేశారు. ప్రయాణికుల ఇబ్బందులపై స్పందించిన ఎమ్మెల్యేహరీష్బాబుకు ప్రత్యేక కృతజ్ఙతలు తెలిపారు. -
కొత్త మండలాల డిమాండ్లు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పరిపాలన సౌలభ్యం కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను నాలుగు జిల్లాలుగా విభజించినా పలు చోట్ల ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులకు ఇబ్బందులు తప్పడం లేదు. కొత్త జిల్లాల ఏర్పాటుతో జిల్లా కేంద్రానికి దూరభారం తగ్గింది. కానీ వేర్వేరు నియోజకవర్గాల్లో ఉండడంతో సమస్యలు వస్తున్నాయి. తాజాగా అసెంబ్లీ వేదికగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి శాస్త్రీయంగా జిల్లాల పునర్విభజన చేస్తామని ప్రకటన చేశారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో పలు మండలాలు, గ్రామాలను పరిపాలన సౌలభ్యం కోసం పునర్విభజన చేస్తే పాలన సులువు అవుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో పది శాసనసభ, రెండు లోక్‌సభ ఆదిలాబాద్(ఎస్టీ), పెద్దపల్లి(ఎస్సీ) నియోజకవర్గాలు ఉన్నాయి. అసెంబ్లీ స్థానాలు ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, బోథ్, నిర్మల్‌లో నిర్మల్, ముథోల్, ఖానాపూర్, మంచిర్యాలలో మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సిర్పూర్, ఆసిఫాబాద్ ఉన్నాయి. పలు మండలాలు వేర్వేరు నియోజకవర్గాల్లో కొనసాగుతున్నాయి. మూడు జిల్లాల్లో ఖానాపూర్ ఖానాపూర్ శాసనసభ నియోజకవర్గం ఉమ్మడి జిల్లా పరిధిలోని మూడు జిల్లాల్లో విస్తరించి ఉంది. నియోజకవర్గ కేంద్రం ఖానాపూర్‌తో సహా పెంబి, దస్తూరాబాద్ మండలాలు నిర్మల్ జి ల్లాలో ఉన్నాయి. ఇక ఉట్నూర్, ఇంద్రవెల్లి, సిరికొండ మండలాలు ఆదిలాబాద్ జిల్లాలో, జన్నారం మండలం మంచిర్యా ల జిల్లాలో ఉన్నాయి. ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని నార్నూర్, గాది గూడ మండలాల్లో ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి. ఒకే మండలం.. ఇద్దరు ఎమ్మెల్యేలు మరోవైపు ఒకే మండలంలోని గ్రామాలు రెండు నియోజకవర్గాల్లో ఉన్నాయి. దీంతో ఆయా గ్రామాల్లో పాలనలో ఇబ్బందులు వస్తున్నాయి. నిర్మల్ జిల్లా నర్సాపూర్(జీ) రెండు నియోజకవర్గాల్లో ఉంది. ము థోల్ నియోజకవర్గంలో నర్సాపూర్(జీ), గొల్లమాడ, చా క్పల్లి, నందన్, బామ్ని బీ, బూర్గుపల్లి(జీ), తిమ్మాపూర్(జీ), అర్లి(కే), తూరాటి గ్రామాలు ఉన్నాయి. నిర్మల్ పరిధిలో తెంబరేని, రాంపూర్, నర్సాపూర్(జీ), కుస్లీ, అంజనీతండా గ్రామాలు ఉన్నాయి. అంతేగాక, ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గ పరిధిలోనూ మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం శాలిగాం, మాడవెల్లి, భీమిని మండలం కేస్లాపూర్, చిన్నగుడిపేట, చిన్నతిమ్మాపూర్ గ్రామాలు ఉన్నాయి. ఈ రెండు మండలాల్లోని మిగతా గ్రామాలు బెల్లంపల్లి నియోజకవర్గ పరిధిలో ఉంటాయి. అలాగే ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం బోథ్ నియోజకవర్గ పరిధిలో సిరికొండ, సుగిండి, పొన్న, సొంపల్లి, రాయిగూడ, నేరడిగొండ(జి), నారాయణపూర్, జెండాగూడ, కుంటగూడ గ్రామాలున్నాయి. ఇదే మండలం ఖానాపూర్‌లో వాయిపేట, ఫకీర్‌నాయక్‌తండా, ధర్మసాగర్, రిమ్మా, లక్ష్మీపూర్, లక్ష్మీపూర్(కే), కొండాపూర్, రాంపూర్, కన్నాపూర్, పోచంపల్లి గ్రామాలు ఉన్నాయి. దీంతో ఒకే మండలంలో ఇద్దరు ఎమ్మెల్యేలు తమ అభివృద్ధి, సంక్షేమ పథకాలను పర్యవేక్షించాల్సి వస్తోంది. డీలిమిటేషన్‌తో తీరేనా? 2026లో నూతన జనగణన తర్వాత కేంద్రం డీలిమిటేషన్ ఏర్పాటు చేస్తే ఉమ్మడి జిల్లాలో కొత్తగా నియోజకవర్గాలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఒకే జిల్లాలో, పూర్తి నియోజకవర్గంగా ఏ ర్పాటు చేస్తే ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులకు ఇబ్బందులు తీరే అవకాశం ఉంది. ఈలోపు రా ష్ట్ర ప్రభుత్వం సైతం జిల్లాల పునర్విభజన కోసం ఓ కమిటీ వేసి శాసీ్త్రయంగా సరిహద్దులు ఏర్పాటు చేస్తామంటున్న తరుణంలో భౌగోళిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలను దృష్టిలో పెట్టుకుని విభజన చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.పాలనలో ఇబ్బందులే.. అభివృద్ధి పనులు, నిధుల ఖర్చు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగానే జరుగుతుంటాయి. అయితే ఆయా మండలాలు వేర్వేరు జిల్లాల్లో ఉండడంతో ఎమ్మెల్యేలకు ఆ గ్రామాల్లో నిధుల ఖర్చు, ఎంపికలో ఇబ్బందులు వస్తున్నాయి. మరోవైపు ఒకే మండలం వేర్వేరు గ్రామాలు ఉండడంతోనూ ఇద్దరు ప్రజాప్రతినిధులు సమన్వయం చేసుకోవాల్సి వస్తోంది. నియోజకవర్గాలు ఓ వైపు, జిల్లా మరోవైపు ఉండడంతోనూ పర్యవేక్షణ పట్టుతప్పుతోంది. ఎమ్మెల్యేలు జెడ్పీ సమావేశాలు, ఆయా జిల్లాల సమీక్షలు, సమావేశాలకు దూరంగానే ఉంటున్నారు. ఒక మండలం ఒకే నియోజకవర్గంలో లేకపోవడంతో నిధుల ఖర్చు, అర్హుల ఎంపికలోనూ పలు గ్రామాలపై ప్రభావం చూపుతోంది. ఉమ్మడి జిల్లాలో కొత్త మండలాల డిమాండ్లు ఉన్నాయి. బోథ్, చెన్నూరు, డివిజన్లు ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. చెన్నూరు నియోజవర్గంలో కొత్తగా పారుపల్లి, ఆస్నాద మండలాలు ఏర్పాటు చేయాలని, ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలాన్ని అర్బన్, రూరల్, నిర్మల్ జిల్లా కుభీరు, తానూరులో బేల్‌తరోడా, మాలేగం, మామడ మండలం పొనకల్, సారంగాపూర్ మండలం బీరవెల్లి మండలాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. -
ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు ఎంపిక
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని సరస్వతినగర్ కాలనీకి చెందిన ఆర్.శ్రీచరణ్ సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ క్రికెట్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈనెల చివరి వారంలో మైసూర్ వేదికగా పోటీలకు కాకతీయ యూనివర్సిటీ జోన్ నుంచి ప్రాతినిధ్యం వహించనున్నట్లు కోచ్ జయేంద్ర పటాస్కర్ తెలిపారు. యూనివర్సిటీ స్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారుడితో పాటు తల్లిదండ్రులు వెంకటరమణ–సంధ్యను పలువురు ప్రత్యేకంగా అభినందించారు. వన్యప్రాణిని హతమార్చిన ఏడుగురు రిమాండ్లక్సెట్టిపేట: వన్యప్రాణిని హతమార్చిన కేసులో ఏడుగురు నిందితులను బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు స్థానిక ఎఫ్ ఆర్వో అనిత తెలిపారు. లక్సెట్టిపేట ఫారెస్టు రేంజి పరిధిలోని చెల్లంపేట శివారులో ఈనెల 6న సాంబార్ జింకను హతమార్చిన చెల్లంపేట గ్రామానికి చెందిన జైనేని మల్లేశ్, సొల్లు శ్రీనివాస్, జైనేని అశోక్, మారాపు రంజిత్, మారపు ప్రశాంత్, జైనేని మధుకర్, లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన రామ్మూర్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆమె పేర్కొన్నారు. -
కేజీబీవీల్లో బాలికలకు మెరుగైన విద్య
మంచిర్యాలఅర్బన్: కేజీబీవీలు బాలికల విద్యకు నిలయాలని, భద్రతతోపాటు మెరుగైన విద్య అందిస్తున్నాయని డీఈవో యాద య్య అన్నారు. బుధవారం స్థానిక ప్రైవేటు హోటల్లో మంచిర్యాల, నిర్మల్ జిల్లాల కేజీబీవీ ప్రత్యేక అధికారులు, మోడల్‌స్కూల్ గర్ల్స్ హాస్టల్స్ వార్డెన్లకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి ఫలితా లు, ఆత్మవిశ్వాసాన్ని కల్పించడంలో కేజీబీవీలు ముందు వరుసలో ఉన్నాయని తెలిపారు. కేజీబీవీల నిర్వహణ మరింత సమర్థవంతంగా చేయడం కోసమే రెసిడెన్షియల్ తరహా శిక్షణ అన్నారు. ఈ కార్యక్రమంలో సమగ్రశిక్ష కో–ఆర్డినేటర్లు విజయలక్ష్మి, చౌదరి, సత్యనారాయణమూర్తి, నిర్మల్ జిల్లా కో–ఆర్డినేటర్ నవీన జ్యోతి, అసిస్టెంట్ జెండర్ కో–ఆర్డినేటర్ రమాదేవి, మా స్టర్ ట్రైనర్ జ్యోతి, మంచిర్యాల, నిర్మల్ కేజీ బీవీల ప్రత్యేక అధికారులు, మోడల్ స్కూల్ గర్ల్స్ హాస్టల్ కేర్ వార్డెన్లు పాల్గొన్నారు. -
డెంజిల్ నార్జరీని ఆదర్శంగా తీసుకోవాలి
ఆదిలాబాద్: కామన్వెల్త్, ఏషియన్ గేమ్స్ జూడో ప్రాబబుల్స్‌లో చోటు దక్కించుకున్న డెంజిల్ నార్జరీని క్రీడాకారులు ఆదర్శంగా తీసుకోవాలని ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. ఆదిలాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో బుధవారం జూడో కోచ్ రాజును సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జూడో రాజు వద్ద శిక్షణ పొందిన డెంజిల్ నార్జరీ రాష్ట్రస్థాయి జూడో చాంపియన్‌షిప్ పోటీల్లో 17 బంగారు, 2 రజతాలు, ఒక కాంస్య పతకం సాధించాడని గుర్తు చేశారు. 14 సార్లు జాతీయ జూడో చాంపియన్‌షిప్ టోర్నీల్లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించి కాంస్య పతకం సాధించాడన్నారు. కరీంనగర్లో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్న అతడు ఏడాదిగా భారత క్రీడా సంస్థ ఆధ్వర్యంలో కేరళలోని స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్లో ఎలైట్ స్థాయి శిక్షణ పొందుతున్నాడని గుర్తు చేశారు. అలాంటి క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. -
నాణ్యమైన ఆహార పదార్థాలు అందించాలి
జన్నారం: ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించాలని, కల్తీ చేసినా, నాణ్యత తగ్గించినా చట్టపరమైన చర్యలు తప్పవని మంచిర్యాల ఫుడ్ ఇన్స్పెక్టర్ వాసురామ్ హెచ్చరించారు. బుధవారం ఆయన మండల కేంద్రంలోని ఫాస్ట్‌ఫుడ్, బేకరీలు, హోటళ్లలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆహారంలో కల్తీ వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందన్నారు. కొన్ని హోటళ్లు నాణ్యత లేని తినుబండారాలు విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్, బేకరీల్లో ఆహార నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించామని, నాణ్యత తగ్గినట్లు తెలిస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
చట్టంపై అవగాహన కలిగి ఉండాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరాస్మెంటు యాక్టు(పోష్)–2013పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ విలాయత్ అలీతో కలిసి మహిళా ఉద్యోగులకు చట్టంపై అవగాహన కల్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపుల నిరోధం, నివారణ, పరిష్కారంపై తెలుసుకోవాలని అన్నారు. వేధింపులపై జిల్లా స్థానిక ఫిర్యాదుల కమిటీలో ఫిర్యాదు చేయవచ్చని, వివరాలు గోప్యంగా ఉంచుతారని తెలిపారు. జిల్లాలో 47 అంతర్గత ఫిర్యాదు కమిటీలు కొనసాగుతున్నాయని అన్నారు. మహిళల సంక్షేమం కోసం హెల్ప్‌లైన్ టోల్‌ఫ్రీ నంబరు 181 ఏర్పాటు చేశామని తెలిపారు. అనంతరం చట్టం వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో సంక్షేమ శాఖ అధికారి రౌఫ్‌ఖాన్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అనిత, పశువైద్యధికారి శంకర్, కవిత పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి మంచిర్యాలఅగ్రికల్చర్: మున్సిపల్ ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఇతర ఎన్నికల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్, అదనపు కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లతో ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితా ప్రకటన, నామినేషన్ కేంద్రాలు, పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలోకి వచ్చే విధంగా చూడాలని తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్‌దీపక్, జిల్లా అదనపు కలెక్టర్, పి.చంద్రయ్య, మున్సిపల్ కమిషనర్లు, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. -
క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీయడమే లక్ష్యం
రామకృష్ణాపూర్: గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ టీ–20 లీగ్ మ్యాచ్‌లలో భాగంగా పట్టణంలోని ఠాగూర్ స్టేడియంలో బుధవారం హైదరాబాద్–ఖమ్మం మధ్య జరిగిన క్రికెట్ పోటీలను కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి ప్రారంభించారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఆర్‌ఆర్‌నగర్‌లో రూ.50 లక్షలతో హిందూ శ్మశానవాటిక, ఆర్కే1 ప్రాంతంలో రూ.15 లక్షలతో క్రైస్తవ స్మశానవాటిక పనులు ప్రారంభించారు. రూ.40లక్షలతో లైటింగ్ వ్యవస్థ కోసం కొనుగోలు చేసిన టవర్ వగన్ వెహికల్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్, డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్‌రెడ్డి, తహసీల్దార్ సతీష్, మున్సిపల్ కమిషనర్ రాజు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
కలమడుగు గోదావరికి మెస్రం వంశీయులు
జన్నారం: నాగోబా మహాపూజకు అవసరమైన గోదావరి జలాల కోసం ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నుంచి పాదయాత్రగా బయలుదేరిన మెస్రం వంశీయులు మంగళవారం రాత్రి జన్నారం మండలంలోని నర్సింగపూర్‌లో బస చేశారు. బుధవారం ఉదయం 7 గంటలకు కలమడుగు గోదావరికి చేరుకుని పుణ్యస్నానం ఆచరించారు. అక్కడే దంపుడు బియ్యం, పప్పుతో భోజనం చేశారు. అనంతరం గోదావరిలోని హస్తినమడుగులో కలశాన్ని శుభ్రం చేసి అందులో నీటిని నింపారు. జాడీలను కర్రలకు కట్టి పూజలు చేసి కేస్లాపూర్‌కు తిరుగుపయనం అయ్యారు. ఈ నెల 9న జైనూర్ మండలంలోని గౌరి గ్రామంలో చెట్టుపై కలశాన్ని భద్రపరుస్తారు. 13న తిరిగి కలశాన్ని తీసుకుని కేస్లాపూర్ బయలుదేరనున్నట్లు కటోడ హన్మంతరావు తెలిపారు. కార్యక్రమంలో మెస్రం వంశీయులు మారుతి, తిరుపతి, కలమడుగు, వెంకటపూర్ గ్రామాల సర్పంచులు బొంతల నాగమణి మల్లేశ్, మెస్రం రాజుకుమార్ పాల్గొన్నారు. -
ఎయిర్ రైఫిల్ షూటింగ్లో బ్రాంజ్‌మెడల్
ఖానాపూర్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని బావాపూర్(కే) గ్రామానికి చెందిన పుప్పాల స్వాతి క్రీడారంగంలో రాణిస్తూ అందరి మన్ననలు పొందుతోంది. గ్రామానికి చెందిన రైతు పుప్పాల రాజేశ్వర్, హేమలత దంపతుల కుమార్తె అయిన స్వాతి కరీంనగర్‌లోని నిగమా కళాశాలలో బీపీఈడీ పూర్తి చేసింది. గత నెల 27, 28 తేదీల్లో తమిళనాడులోని ఈరోల్‌లో జరిగిన 25 మీటర్ల ఎయిర్ రైఫిల్ బెంచ్ రెస్ట్ షూటింగ్ జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని బ్రాంజ్ మెడల్ సాధించింది. చిన్ననాటి నుంచి చదువుతో పాటు క్రీడారంగంలో ఆసక్తి ఉన్న స్వాతి జాతీయస్థాయి పోటీల్లో రాణిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపరేషన్ అవుతూనే కరీంనగర్‌లోని ఢిల్లీ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమిలో శిక్షణ సైతం అందిస్తోంది. క్రమశిక్షణ, పట్టుదలతో రాణిస్తే మనం అనుకున్న రంగంలో విజయాలు సాధించవచ్చని స్వాతి ‘సాక్షి’తో తెలిపింది. -
గిరిజన విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
ఏటూరునాగారం: కుమురం భీంను స్ఫూర్తిగా తీసుకుని గిరిజన విద్యార్థులు క్రీడల్లో రాణించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారంలో బుధవారం ఐటీడీఏ ఆధ్వర్యంలో అండర్ –14, 17 విభాగాల్లో 6వ రాష్ట్రస్థాయి (భద్రాద్రి కొత్తగూడెం, ఉట్నూర్, మన్ననూరు, ఏటూరునాగారం ఐటీడీఏలు, 10 ప్లేన్ ఏరియాలు) గిరిజన క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్రీడాకారులు స్నేహపూర్వకంగా ఆడాలన్నారు. కాగా అండర్– 14 విభాగంలో 600 మీటర్ల పరుగు పందెంలో జోన్–2 (ఏటూరునాగారం)కు చెందిన చరణ్ ప్రథమస్థానం, జోన్ –1(భద్రాచలం)కు చెందిన సోను ద్వితీయస్థానం, ధీరజ్ తృతీయస్థానం సాధించారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌తో పాటు ఇతర క్రీడలూ ప్రారంభమయ్యాయి. -
రాష్ట్రస్థాయి పోటీలకు ఆర్జీయూకేటీ విద్యార్థులు
బాసర: మెదక్ జిల్లా నర్సాపూర్‌లో బీవీ రాజు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఈ నెల 6 నుంచి 8 వరకు నిర్వహించనున్న రాష్ట్రస్థాయి ‘విష్ణు నేషనల్ కాంక్రీట్ కానో కాంపిటీషన్’లో బాసర ఆర్జీయూకేటీ సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు పాల్గొంటున్నారు. ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ శ్రీ వాహిద్ పర్యవేక్షణలో విద్యార్థులు పోటీకి సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ఆర్జీయూకేటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ ఈ మురళీదర్శన్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఖలీల్, సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన అధ్యాపకులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. -
చేపల వలలో చిక్కుకుని మత్స్యకారుడు మృతి
లోకేశ్వరం: గోదావరినదిలో చేపలుపట్టి కు టుంబాన్ని పోషించుకుంటున్న మత్స్యకా రుడు వలలో చిక్కుకు ని మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎ స్సై అశోక్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని ధర్మోర గ్రామానికి చెందిన మాడబోయి చిన్న సాయన్న (50)మంగళవారం ఉదయం చేపలు పట్టేందుకు పంచగుడి గ్రామ సమీపంలోని గోదావరి నదికి వెళ్లి నీటిలో వల విసిరాడు. మధ్యాహ్నం సమయంలో వల తీసే క్రమంలో దానికి చిక్కుకుని నీట మునిగి మృతి చెందాడు. మృతుని భార్య ఆనంద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
బెటాలియన్‌లో అట్టహాసంగా క్రీడా పోటీలు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): గుడిపేట 13 వ ప్రత్యేక పోలీస్ బెటాలియన్‌లో మూడు రో జులపాటు నిర్వహించే బెటాలియన్ వార్షిక క్రీడా పోటీలు మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కమాండెంట్ పి.వెంకటరాములు క్రీడాజ్యోతి వెలిగించి పోటీలను ప్రారంభించారు. అన్ని కంపెనీల పోలీస్ సి బ్బంది, అధికారులు, క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని మైదానంలో కవాతు చేస్తూ కమాండెంట్ వెంకటరాములుకు గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వం, మా నసిక ఉత్సాహంతోపాటు జట్టులో అంతా సమష్టి అనే భావన పెంపొందించడంలో కీల క పాత్ర పోషిస్తాయని అన్నారు. క్రీడల ద్వా రా క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు మెరుగుపడుతాయని తెలిపారు. అసిస్టెంట్ కమాండెంట్లు నాగేశ్వర్రావు, కాళిదాసు, బాల య్య, యూనిట్ మెడికల్ అధికారి డాక్టర్ సంతోశ్సింగ్, ఆర్ఐలు, ఆర్ఎస్సైలు, బెటాలియ న్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
బెల్లం వ్యాపారి బైండోవర్
ఇచ్చోడ: నేరడిగొండ మండల కేంద్రానికి చెందిన బెల్లం వ్యాపారి ముక్క శ్రీనివాస్‌ను మంగళవారం తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు ఎకై ్సజ్ సీఐ జుల్పీకర్ అహ్మద్ తెలిపారు. ఇచ్చోడ ఎకై ్సజ్ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. సదరు వ్యాపారి కొంత కాలంగా గుడుంబా తయారీకి ఉపయోగించే బెల్లం, పటిక విక్రయిస్తూ పలుమార్లు పట్టుపడ్డాడన్నారు. దీంతో తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసి రూ.50 వేల నగదు చలానా రూపంలో ప్రభుత్వ ఖాతలో జమచేయించినట్లు తెలిపా రు. బోరిగామకు చెందిన రాథోడ్ ఉత్తం గుడుంబా విక్రయిస్తూ పట్టుబడగా బైండోవర్ చేసి రూ.15 వేల జరిమానా విధించినట్లు తెలిపా రు. ఇద్దరు వ్యక్తులు ఆరు నెలల కాలంలో మ రోసారి పట్టుబడితే రూ.లక్ష జరిమానా లేదా జైలుకు పంపించనున్నట్లు సీఐ తెలిపారు. ఉప ముఖ్యమంత్రి, మంత్రులకు నాగోబా మహాపూజకు ఆహ్వానంఇంద్రవెల్లి: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబాకు పుష్యమాస అమావాస్యను పురస్కరించుకుని ఈ నెల 18న నిర్వహించే మహా పూజ, 22న దర్బార్‌కు హాజరు కావాలని మె స్రం వంశీయులు మంగళవారం ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క, ప్రభుత్వ సలహా దారుడు వేం నరేందర్‌రెడ్డిలకు ఆహ్వాన పత్రాలు అందజేశారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌తో కలిసి హైదరాబాద్‌లో వారిని కలిశారు. నాగోబా ఆలయ పిఠాధిపతి మెస్రం వెంకట్రావ్, సర్పంచ్ మెస్రం తుకారం, నాగో బా ఆలయ కమిటీ చైర్మన్ ఆనంద్‌రావ్, మెస్రం వంశీయులు బాదిరావ్‌పటేల్, నాగోరావ్, శేఖు తదితరులు పాల్గొన్నారు. ట్రాక్టర్ ఢీకొని 28 గొర్రెలు మృతిలక్సెట్టిపేట: మండలంలోని సూరారం గ్రామ స్టేజీ వద్ద జాతీయ రహదారిపై ట్రాక్టర్ ఢీకొని సుమారు 28 గొర్రెలు మృతి చెందినట్లు ఎస్సై సురేశ్ తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట అశోక్‌నగర్‌కు చెందిన కర్రెపోలా గజలప్ప తమ గ్రామంలో గొర్రెలకు మేత లేకపోవడంతో దండేపల్లి మండలంలో మేపుతున్నాడు. మంగళవారం వాటిని మంచిర్యాల వైపు తోలుకెళ్తుండగా లక్సెట్టిపేట వైపు నుంచి మంచిర్యాల వైపు సిమెంట్ ఇటుకల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో 28 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. గొర్రెల యజమాని గజలప్ప ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. లాటరీ పేరిట ప్లాటు విక్రయించేందుకు యత్నంబోథ్: సొనాల మండల కేంద్రానికి చెందిన తుమ్మ మహిపాల్ తన ప్లాటును లాటరీ వచ్చిన వారికి బహుమతిగా ఇస్తానని ఒక్కో టికెట్ రూ.2వేల చొప్పున విక్రయిస్తుండగా మంగళవారం బోథ్ పోలీసులు పట్టుకున్నట్లు డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని 13 లాటరీ టికెట్ బుక్కులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఇలా లాటరీ పేరుతో ప్లాట్ల అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
పథకం ప్రకారమే హత్య చేశారు
చెన్నూర్‌రూరల్: ఒడిస్సా నుంచి పనికోసం వచ్చిన జితేన్ దర్వ (19)ను పథకం ప్రకారమే హత్య చేశారని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. చెన్నూర్ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. చెన్నూర్ మండలంలోని సుబ్బరాంపల్లి ఇటుక బట్టీల్లో పని చేసేందుకు ఒడిస్సా నుంచి 20 మంది కూలీలు వచ్చి ఇక్కడే ఉంటున్నారు. జితేన్ ధర్వ, రాజేందర్ భీమల్, శుభ్రత్ కుమార్‌తో పాటు మరో మైనర్ బాలుడు కలిసి ఉంటున్నారు. ఆదివారం రాజేందర్ భీమల్ సెల్‌ఫోన్ తీసుకొని జితేన్ ధర్వ తన భార్యకు ఫోన్‌చేసి మాట్లాడుతూ గొడవపడ్డాడు. గమనించిన బాలుడు అతని వద్ద నుంచి ఫోన్ తీసుకుని ఎందుకు గొడవపడుతున్నారని అడిగాడు. దీంతో జితేన్ ధర్వ బాలుడిని కొట్టడంతో రాజేందర్ భీమల్, శుభ్రత్ కుమార్‌కు విషయం చెప్పాడు. దీంతో ముగ్గురూ కలిసి జితేన్ ధర్వను చంపుదామని పథకం వేసుకున్నారు. సాయంత్రం ముగ్గురూ కలిసి గదిలో జితేన్ ధర్వ మెడకు ఉరి బిగించి హత్య చేశారు. మృతదేహాన్ని చెట్టుకింద పడేసి మేమే చంపామని మిగతా కూలీలకు చెప్పి పారిపోయారు. మంగళవారం చెన్నూర్‌లోని ఆస్నా ద్ ఎక్స్‌రోడ్డు వద్ద పోలీసులు వారిని పట్టుకుని హత్యకు ఉపయోగించిన టవల్‌తో పాటు రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన పట్టణ సీఐ దేవేందర్‌రావు, ఎస్సైలను ఏసీపీ అభినందించారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు గిరిజన విద్యార్థులు
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని బాలుర ఆశ్రమ పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి ఖోఖో, కబడ్డీ, టెన్నికాయిట్ పోటీలకు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయులు కర్ను తెలిపారు. మంగళవారం పాఠశాల ఆవరణలో పీడీ హీరాబాయితో కలిసి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీడీఏ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో పాఠశాలకు చెందిన 18 మంది విద్యార్థులు పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చినట్లు తెలిపారు. ఈ నెల 7 నుంచి 9 వరకు ఏటూరు నాగారంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు. -
అంత్యక్రియలకు వచ్చి అనంతలోకాలకు..
దిలావర్పూర్: బంధువు అంత్యక్రియలకు వచ్చి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని నర్సాపూర్(జి) గ్రామానికి చెందిన గడ్డం నిఖిల్ (21) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల స్వగ్రామంలో సమీప బంధువు చనిపోవడంతో అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వచ్చాడు. తిరుగు ప్రయాణంలో సోమవారం రాత్రి అదే గ్రామానికి చెందిన అతని స్నేహితుడు నీరటి హర్షరాజ్తో కలిసి ద్విచక్ర వాహనంపై నిర్మల్‌కు బయలుదేరాడు. నిర్మల్–భైంసా రహదారిపై న్యూలోలం గ్రామ సమీపంలో రోడ్డుకు అడ్డుగా వచ్చిన అటవీ జంతువును తప్పించే క్రమంలో బైక్ అదుపుతప్పి కిందపడిపోయింది. ఘటనలో బైక్ నడుపుతున్న నిఖిల్‌కు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెనక కూర్చున్న హర్షిత్రాజ్కు గాయాలు కావడంతో నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. -
రాష్టస్థాయి పోటీల్లో విజేతలుగా తిరిగిరావాలి
ఉట్నూర్‌రూరల్: రాష్ట్రస్థాయి గిరిజన క్రీడోత్సవాల్లో ఉట్నూర్ క్రీడాకారులు సత్తాచాటి విజేతలుగా తిరిగి రావాలని ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ అన్నారు. ఏటూరు నాగారంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు వెళ్తున్న క్రీడాకారుల బస్సులను మంగళవారం ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్‌లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ ఇటీవల కాలంలో గిరిజన క్రీడా పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయిలోనూ పతకాలు సాధించడం అభినందనీయమన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని క్రీడల్లో రాణించాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు క్రీడా దుస్తులు, పీడీలు, కోచ్‌లకు టీషర్టులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీడీ అంబాజీ, జిల్లా క్రీడల అధికారి పార్థసారథి, ఏటీడీవో సదానందం, ఆత్రం భాస్కర్, చందన్, ప్రకాశ్, కృష్ణారావు, ప్రేందాస్, ఉత్తం, గంగారాం, హేమంత్, మధుసూదన్, జైవంత్‌రావు, రవీందర్, జలపతి, తదితరులు పాల్గొన్నారు. -
అర్హత లేని వైద్య కేంద్రాలపై ఫిర్యాదు
మంచిర్యాలటౌన్: మంచిర్యాలలో అర్హత లేకుండా వైద్యం చేస్తున్న కేంద్రాలను గుర్తించామని, తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేస్తామని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ యెగ్గన శ్రీనివాస్ తెలిపారు. జిల్లా కేంద్రంలో మంగళవారం టీజీఎంసీ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు. గతంలో కంపౌండర్‌గా పనిచేసిన అనుభవాన్ని ఆసరాగా చేసుకుని పలువురు కనీస వైద్య, విద్యార్హతలు, లైసెన్స్ లేకుండా తమకు తామే వైద్యులమని చెప్పుకుని అల్లోపతి మందులు, స్టెరాయిడ్లు, యాంటీ బయోటిక్స్, పెయిన్ కిల్లర్ వంటివి ఇస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. హమాలీవాడలో షాకీర్ రెండు పడకలతో దవాఖాన నిర్వహిస్తూ పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్లు, ఐవీ ఫ్లూయిడ్స్, మల్టీవిటమిన్ ఇంజక్షన్లు ఇస్తూ పట్టుబడ్డ్డాడని తెలిపారు. హరి మెడికల్ షాపులో ఒక పడకతో ప్రకాష్ అనే నకిలీ వైద్యుడు రోగులకు యాంటీ బయాటిక్ ఇంజెక్షన్లు, నెబ్యులైజేషన్ ఇస్తూ వైద్యం చేస్తున్నాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ సెక్రెటరీ డాక్టర్ అనిల్ కుమార్, హెచ్ఆర్డీఏ సభ్యుడు డాక్టర్ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. -
యూరియా కొరత లేకుండా నిల్వలు
చెన్నూర్/చెన్నూర్‌రూరల్: యూరియా కొరత లే కుండా నిల్వలు ఉన్నాయని, రైతులు ఇబ్బంది పడకుండా స్థానిక అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా వ్యవసాయాధికారి సురేఖ, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు అన్నారు. మంగళవారం వారు చెన్నూర్ వ్యవసాయ సహకార పరపతి సంఘం, చేనేత ట్రెడర్స్, మండలంలోని అంగ్రాజ్‌పల్లి, ఆస్నాద గ్రామాల్లో ఉన్న ఫెర్టిలైజర్ దుకాణాల్లో యూరియా నిల్వలను పరిశీలించారు. రికార్డులు తనిఖీ చేశారు. యూరియా పక్కదారి పట్టకుండా అవసరమున్న రైతులకు అందించాలని సూచించారు. అనంతరం పట్టణంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో డైనింగ్ హాల్, వాష్‌రూమ్‌ల నిర్మాణాలు పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏవో యామిని, ఎంపీవో అజ్మత్‌అలీ, ఏఈవోలు పాల్గొన్నారు. -
జిల్లా కార్మిక శాఖలో కాసుల కక్కుర్తి
జన్నారం మండలం కిష్టాపూర్‌కు చెందిన ఓ కార్మికుడు గత ఏడాది మరణించగా కార్మిక శాఖ నుంచి పరిహారం కోసం దరఖాస్తు చేసుకున్నారు. మధ్యవర్తులు రంగ ప్రవేశం చేసి రూ.30వేలు ఇస్తే పని చేస్తామని చెప్పారు. అంత ఇచ్చుకోలేమని చెబితే పరిహారం రూ.2లక్షల్లో తమకు రూ.30వేలు ఇస్తామని ఓ ప్రమాణ పత్రం రాసి ఇవ్వమని అడిగారు. దీనిపై బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే కొన్ని రోజులు పెండింగ్‌లో పెట్టారు. చివరకు తమకు తెలిసిన వారితో వెళ్తే రూ.10వేలు తీసుకుని పరిహారం అందేలా పని చేసి పెట్టారు.ఆర్కేపీకి చెందిన ఒకరు చనిపోతే.. కార్మిక శాఖ నుంచి పరిహారం పొందాలని గోదావరిఖనికి చెందిన ఓ వ్యక్తికి ఫోన్ చేస్తే రూ.30నుంచి రూ.40వేల వరకు ఖర్చవుతుందని, మృతుని అన్ని పత్రాలు ఉంటే ఒకలా, లేకపోతే మరోలా ఉంటుందని చెప్పారు. పరిహారం పెంచినప్పటి నుంచి థర్డ్ పార్టీ వెరిఫికేషన్ జరుగుతుందని, ఇదంతా పైసలిస్తేనే పని అవుతుందని వివరించాడు. సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కార్మిక శాఖలో కాసుల కక్కుర్తి ఆగడం లేదు. కొత్తగా కార్మిక కార్డు నుంచి రెన్యూవల్, పరిహారం వరకు పైసలు ఇస్తేనే పని జరుగుతోంది. గత జూలైలో ఒకేసారి జిల్లాలో ఇద్దరు కార్మిక శాఖ అధికారులు లంచాలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. అయినా ఆ శాఖ సిబ్బంది అదే తీరుగా వసూళ్లు చేస్తుండడం గమనార్హం. జిల్లాలో మంచిర్యాల–1, 2, బెల్లంపల్లి సర్కిళ్లలో సుమారు 65వేల మంది రిజిష్టర్డ్ కార్మికులు ఉన్నారు. ఐదేళ్లకోసారి గుర్తింపు కార్డులు రెన్యూవల్ చేసుకోవాల్సి ఉన్నా చేసుకోవడం లేదు. ప్రస్తుతం 45వేలకు పైగా కార్మికులే ఉన్నారు. అధికంగా భవన నిర్మాణ రంగం వారితోపాటు మిగతా వివిధ రంగాల్లో పని చేస్తున్న కార్మికులు కూడా ఉన్నారు. గుర్తింపు పొందిన కార్మికులకు వారి పిల్లలు చదువుకునేందుకు స్కాలర్షిప్పులు, ఆడపిల్లల పెళ్లి, మెటర్నిటీ కోసం రూ.30వేల నగదుతోపాటు కార్మికులు ప్రమాదాలతో వైకల్యం, సహజ మరణం చెందినా, వారికి ఆస్పత్రి, దహన సంస్కారాలకు ఆర్థిక సాయం వంటి పలు ప్రయోజనాలు ఉంటాయి. కార్మికులు తమ వాటా కొంత చెల్లిస్తే కార్మిక సంక్షేమ బోర్డు ఈ మేరకు ప్రయోజనాలు అందిస్తుంది. పరిహారం పెంచడంతో..గతంలో గుర్తింపు కార్డు ఉన్న కార్మికుడు చనిపోతే రూ.1.30లక్షల పరిహారం అందేది. ప్రస్తుతం రూ.2లక్షలు చెల్లిస్తున్నారు. దీంతో అనధికారికంగా రూ.30వేల వరకు వసూళ్లు సాగుతున్నాయి. పనిలో ప్రమాదవశాత్తు చనిపోతే రూ.6లక్షల వరకు ఇస్తారు. మీ సేవలో కార్మికులు దరఖాస్తు చేసుకోగానే ఆఫీసు నుంచి కొందరు, మీ సేవ నుంచి మరికొందరు రంగ ప్రవేశం చేస్తూ వసూళ్లు చేసుకుంటున్నారు. బీమా పరిహారం చెల్లింపులో థర్డ్ పార్టీతో విచారణ చేయాలి. దీంతో ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులే కొందరు ఈ వసూళ్లలో ప్రధానంగా మారారు. మృతుని మరణం, వివరాలు అన్ని ఉన్నా డబ్బులు ఇవ్వకపోతే ఏదో ఒక కారణం చూపి పరిహారం రాకుండా చేస్తారనే భయంతో పైసలు ఇచ్చేందుకు ఒప్పుకుంటున్నారు. డబ్బులిస్తే ఎవరికై నా కార్డు..జిల్లాలో కార్మిక గుర్తింపు కార్డులు సైతం దుర్వి నియోగం అవుతున్నాయి. కార్డు పొందేందుకు 18ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయస్సు వరకు ఉన్న భవ న నిర్మాణ కార్మికులు అర్హులు. రెండు ఫొటోలు, ఏదేని గుర్తింపు కార్డు, బ్యాంకు పాస్‌బుక్, రేషన్‌కార్డు వివరాలు ఇస్తే మీ సేవ కేంద్రాల్లో కార్డు పొందుతున్నారు. రూ.110 బదులు రూ.వెయ్యి తీసుకుని అనుర్హులకు సైతం కార్డులు ఇచ్చేస్తున్నారు. రెన్యూవల్ కోసం రూ.60కి బదులు రూ. 200వరకు తీసుకుంటున్నారు. నిజమైన కార్మికులు కాకుండా సాగు భూములున్న యజమానులు, వారి కుటుంబాలు, ఎల్ఐసీ ఏజెంట్లు, ప్రైవేటు, అవుట్ సోర్సింగ్, వ్యాపారులు, విద్యావంతులు సైతం పొందారు. దీంతో నిజమైన అర్హులకు అన్యాయం జరుగుతోంది. అనర్హులు అధికంగా ఉండడంతో పరిహారం చెల్లింపులకు సైతం పైసలు చెల్లించి ప్రభుత్వ ప్రయోజనాలు పొందుతున్నారు. జిల్లా కార్మిక శాఖలో జరుగుతున్న తెరవెనుక అవినీతిని నిర్మూలించాలని కార్మిక సంఘ నాయకులు కోరుతున్నారు. -
పండుగ వేళ ‘శిక్ష’ణ..!
మంచిర్యాలఅర్బన్: కేజీబీవీ ప్రత్యేక అధికారులు, మోడల్ స్కూల్ అనుబంధ వసతిగృహాల కేర్టేకర్ల కు ‘సాధికారపర్చటం’ అనే అంశంపై శిక్షణ ఇవ్వనున్నారు. మంచిర్యాల జిల్లాలో 18 కేజీబీవీలు, నాలు గు మోడల్ హాస్టళ్లు, నిర్మల్ జిల్లాలో 18 కేజీబీవీలు, ఒక మోడల్ హాస్టల్‌కు చెందిన ప్రత్యేక అధికారులు, కేర్టేకర్లు కం వార్డెన్లకు ఈ నెల 7నుంచి 11వరకు స్పెల్–1 రెసిడెన్షియల్ తరహా శిక్షణ ప్రారంభం కానుంది. రెండు జిల్లాలకు చెందిన వారందరికీ జిల్లా కేంద్రం మంచిర్యాలలోని ప్రైవేటు హోటల్లో ఐదు రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఏ ఒక్కరికీ ఇంటికి వెళ్లడానికి అనుమతి లేదని ఆదేశాలు జారీ అయ్యాయి. లాడ్జింగ్, బోర్డింగ్తోపాటు అన్ని వసతులు కల్పించే శిక్షణకు సంసిద్ధులు కావాలని సూ చించారు. మాస్టర్ ట్రైనర్లతో సహా పాల్గొనే వారందరికీ వసతి, ఆహార సౌకర్యాలు కల్పిస్తారు. పీపీటీ ప్రజెంటేషన్ల కోసం డిజిటల్ స్క్రీన్, ఇంటర్నెట్ సౌకర్యంతో కూడిన 50మంది పాల్గొనే సీటింగ్ సామర్థ్యంతో కూడిన శిక్షణ వేదికను గుర్తించాలని ఆదేశాలు వచ్చాయి. ఒకరోజు ఆచరణాత్మక సెషన్, కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడానికి 25 కంప్యూటర్లతో కూడిన ఐసీటీ ల్యాబ్ సౌకర్యాలు, అవసరమైన స్టేషనరీతో సహా శిక్షణ పరికరాలు ఏర్పాటు చేసుకోనున్నారు. ఈ నెల 7న మాస్టర్ ట్రైనర్లు, మోడల్ స్కూల్‌కు అనుబంధ హాస్టళ్ల కేర్టేకర్లు కం వార్డెన్లు శిక్షణ కార్యక్రమానికి ఉదయం 9గంటలకు ముందే చేరుకోవాలని సూచించారు. అభ్యంతరాలుఈ నెల 10 నుంచి 16వరకు విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. కేజీబీవీ, మోడల్ అనుబంధ హాస్టల్లో ఉన్న విద్యార్థులు ఇళ్లకు వెళ్లే ముందు వివరాల నమోదు, కుటుంబ సభ్యులకు అప్పగించడం తదితర విషయాలెన్నో పర్యవేక్షించడం ఎస్వోలు, కేర్టేకర్లదే బాధ్యత. మరోవైపు ఇతర ప్రాంతాల్లో ఉన్నత చదువులకు వెళ్లిన తమ పిల్లలు కూడా స్వగ్రామాలకు రావడం, పిండివంటలు చేసుకోకుండా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల విధులు, ఇతరత్రా బోధనేతర పనులతో సతమతం అవుతుండగా ఐదు రోజులపాటు రెసిడెన్షియల్ తరహా శిక్షణపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కనీసం మంచిర్యాల జిల్లా వారైనా ఇంటికి వెళ్లి శిక్షణకు హాజరయ్యేలా నిబంధనలు విధిస్తే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.వాయిదా వేయాలి కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లు, మోడల్ హాస్టల్ కేర్టేకర్ల శిక్షణ తాత్కాలికంగా వాయిదా వేయాలి. పండుగ వేళ శిక్షణ సరికాదు. మొదటి ఫేజ్ శిక్షణను సంక్రాంతి పండుగ తర్వాత చేపట్టాలి. పీఆర్టీయూ తెలంగాణ పక్షాన ఈ విషయంలో ఉన్నతాధికారులతో చర్చించనున్నాం. – గంగాధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి, పీఆర్టీయూ తెలంగాణసంక్రాంతి తర్వాత ఏర్పాటు చేయాలి ప్రతీ ఇంట్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటారు. కేజీబీవీ ఎస్వోలు, కేర్టేకర్లు అందరూ మహిళా టీచర్లే. ఇంట్లో సెలవులకు పిల్ల లు, బంధువులు వచ్చే వేళ పిండివంటలు చేసుకోవడం ఆనవాయితీ. పండుగ తర్వాత శిక్షణ ఇస్తే సక్రమంగా జరగడంతోపాటు పండుగ కూడా సంతోషంగా జరుపుకునే వీలుంటుంది. – రాజావేణు, జిల్లా ప్రధాన కార్యదర్శి టీఎస్‌యూటీఎఫ్ -
విద్యుత్ ప్రమాదాల నివారణకు చర్యలు
మంచిర్యాలఅగ్రికల్చర్: జీరో విద్యుత్ ప్రమాదాలే లక్ష్యంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యుత్ శాఖ అధికారి(ఎస్ఈ) బి.రాజన్న అన్నా రు. మంగళవారం జిల్లా కేంద్రంలోని టౌన్–3 గాంధీనగర్‌లో ఏర్పాటు చేసిన ‘ప్రజాబాట’ కార్యక్రమంలో విద్యుత్ సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ ఇప్పటివరకు అందిన ఫిర్యాదుల మేరకు వంగిన పోల్స్, వేలాడుతున్న విద్యుత్ తీగలు, నేలపై తక్కువ ఎత్తు, కంచె లేని ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్లు సవరించామని, కొన్ని చోట్ల కొత్తవాటిని బిగించామని తెలి పారు. వినియోగదారులు విద్యుత్ సమస్యలను ఏఈ దృష్టికి తీసుకురావాలని, తక్షణమే పరిష్కారా నికి చర్యలు తీసుకుంటారని అన్నారు. టోల్‌ఫ్రీ నంబరు 1912లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. తమ ప్రాంతంలో చాలా ఏళ్ల క్రితం వేసిన 33 కేవీ విద్యుత్ లైన్ కింద ఇళ్లు నిర్మించుకున్నామని, ఈ లైన్ ఇతర చోట నుంచి వెళ్లేలా చూడాలని వినియోగదారులు కోరారు. ఈ కార్యక్రమంలో డీఈ రాజేశం, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, వినియోగదారులు పాల్గొన్నారు. జాగ్రత్తలు తీసుకోవాలి నస్పూర్: రైతులు, వినియోగదారులు విద్యుత్ ప్ర మాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవా లని మంచిర్యాల విద్యుత్ శాఖ డీఈ మల్లేశం అన్నా రు. మంగళవారం ఆయన నస్పూర్‌లోని సీతారాంపల్లి గ్రామంలో ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా రైతులు, వినియోగదారులకు విద్యుత్ భద్రతా సూత్రాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ సురమి ల్ల వేణు, విద్యుత్ శాఖ ఏడీఈ ఎన్.రాజశేఖర్, ఏఈ కే.రాంచందర్ పాల్గొన్నారు. -
పీహెచ్సీలో డీఎంహెచ్‌వో తనిఖీ
చెన్నూర్‌రూరల్: మండలంలోని అంగ్రాజ్‌పల్లి గ్రామ పీహెచ్‌సీని జిల్లా వైద్యాధికారి అని త మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ రిజిష్టర్లు, మందుల నిల్వలు పరిశీలించా రు. పాము, కుక్కకాటుకు మందులు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. సమ్మక్క, సారలమ్మ జాతర ఉన్నందున వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాల ని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవా లు ఎక్కువ జరిగేలా చూడాలని అన్నారు. అనంతరం ఆరోగ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించి పలు సూచనలు, సలహాలు అందజేశారు. వైద్యుడు కృష్ణతేజ, సూపర్వైజర్లు కళావతి, మంగ బాలు, జిల్లా మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్లు ఉన్నారు. -
తప్పుల తడకగా ముసాయిదా ఓటరు జాబితా
మంచిర్యాలటౌన్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు జిల్లాలోని మున్సిపాలిటీల ముసాయిదా ఓటరు జాబితా తప్పుల తడకగా తయారు చేశారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ మంగళవారం మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్‌రావుకు వినతిపత్రం అందజేశారు. కార్పొరేషన్‌లోని డివిజన్లలో రూట్ మ్యాప్ ఇవ్వలేదని, ఒక్కో డివిజన్లో ఇష్టారీతిన ఓటరు జాబితాను ప్రచురించారని పేర్కొన్నారు. ఒక డివిజన్లోని ఓటర్లు మరో డివిజన్‌లోకి వేశారని, బీఎల్వోలు సరైన రీతిలో విధులు నిర్వర్తించకపోవడం, అధికార పార్టీ నాయకులతో కుమ్మకై ్క వారికి అనుకూలంగా తయారు చేశారని తెలిపారు. రాజకీయ పార్టీలకు ముసాయిదా ఓటరు జాబితాను ఇవ్వాలని కోరినా ఇవ్వడం లేదని, సమయం పెంచి ఓటరు జాబితాలో అవకతవకలు సరిచేయాలని కోరారు. బీజేపీ జిల్లా కార్యదర్శి దుర్గం అశోక్, సీనియర్ నాయకులు బెల్లంకొండ మురళి, కాశెట్టి నాగేశ్వర్రావు, మంత్రి రామయ్య పాల్గొన్నారు. -
గురుకుల ప్రవేశ పరీక్షకు ‘సాధన’
మంచిర్యాలఅర్బన్: వసతితో కూడిన విద్య అంది స్తూ పేద విద్యార్థులకు గురుకులాలు అండగా నిలుస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ జనరల్ గురుకులాల్లో వచ్చే విద్యా సంవత్సరానికి 2026–27 సంబంధించి ప్రవేశాలకు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యాలయాల సంస్థ నోటిఫికేషన్ జారీచేసింది. సర్కారు బడిలో చదివే నాలుగో తరగతి విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఎక్కువగా ఉంటున్నా ఐదో తరగతిలో ప్రవేశాలు పొందలేకపోతున్నారు. ప్రశ్నల సరళిపై అవగాహన లేకపోవడంతో వారు వెనకబడిపోతున్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు సాధన గురుకుల ఐటెం బ్యాంకు పేరిట రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ మండలి పుస్తకాలు పంపిణీ చేయనుంది. ఒక్కోరోజు ఒక్కో అంశాన్ని పిల్లలకు ప్రత్యేకంగా నేర్పిస్తారు. రెండు నమూనా పరీక్షలు నిర్వహించి పోటీ తట్టుకునేలా సమాయత్తం చేయనున్నారు. పుస్తకాలు ఇలా.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నాలుగవ తరగతి విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు తెలుగు, ఇంగ్లిష్‌లో సాధన గురుకుల ఐటమ్ బ్యాంకు పుస్తకాలు ముద్రించారు. ఆదిలాబాద్ జిల్లాలో 1690, కుమరంభీం ఆసిఫాబాద్‌కు 1814, నిర్మల్‌కు 1582, మంచిర్యాలకు 1662 పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. ఒక్కో మంచిర్యాల జిల్లాలోనే నాలుగవ తరగతి చదివే విద్యార్థులు 3525 మంది ఉండగా 1662 పుస్తకాలు మాత్రమే జిల్లాకు సరఫరా చేశారు. బోధనకు ఉపాధ్యాయులు పుస్తకాలు ఉపయోగిస్తారా? లేదా విద్యార్థులకు అందిస్తారా అనేది తెలియాల్సి ఉంది. సర్కారు బడిలో చదివే విద్యార్థులు సాధనతో ఎంతో ఉపయోగకరంగా మారనుంది. రెండు, మూడు రోజుల్లో పుస్తకాల సరఫరా చేయనున్నట్లు అధికారులు తెలిపారు. -
తాతకు తలకొరివి పెట్టిన మనుమరాలు
నెన్నెల: సాధారణంగా ఎవరైనా మృతి చెందితే దహన సంస్కారాలు పురుషులు చేస్తారు. మృతి చెందిన వ్యక్తి తండ్రి అయితే ఇంటి పెద్ద కుమారుడు, తల్లి అయితే చిన్న కుమారుడు తలకొరివి పెట్టడం సంప్రదాయం. కానీ నెన్నెల మండలం ఆవుడంలో గంగిరెడ్డి లచ్చిరెడ్డి (55) అనారోగ్యంతో మంగళవారం మృతి చెందాడు. అతని ఏకై క కుమార్తె బండం స్రవంతి సైతం గతంలోనే చనిపోయింది. స్రవంతి కూతురైన బండం హర్షిత ఆవుడంలో అమ్మమ్మ, తాతయ్య వద్ద ఉండి చదువుకుంటోంది. మనుమరాలే కొడుకై తలకొరివి పెట్టి తాత రుణం తీర్చుకుంది. ఈ తీరు అక్కడ ఉన్న వారిని కంటతడి పెట్టించింది. -
సీపీఐ బహిరంగ సభను జయప్రదం చేయాలి
జన్నారం: ఈ నెల 18న ఖమ్మంలో జరిగే బహిరంగసభ, శతజయంతి ఉత్సవాల సందర్భంగా రామకృష్ణాపూర్లో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేని శంకర్ అన్నారు. సీపీఐ ఆవిర్భవించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 3న తాండూర్‌లో ప్రారంభమైన కళాజాత మంగళవారం జన్నారానికి చేరింది. పాటలతో ర్యాలీ నిర్వహించా రు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో 4,500 మంది కమ్యూనిస్టులు ప్రాణత్యాగాలు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, రాష్ట్ర సమితి సభ్యులు మేకల దాసు, జోగుల మల్లయ్య, మండల కార్యదర్శి దాసరి తిరుపతి, నాయకులు ఖలీందర్ ఆలీఖాన్ , కొట్టే కిషన్‌రావు, లింగం రవి, కామెర దుర్గారాజ్, దేవి పోచన్న, చాడ మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గొర్రెల మందపై కుక్కల దాడి
భీమారం: మండల కేంద్రంలోని బస్డాండ్ సమీపంలోని బర్ల చంద్రయ్య ఇంటి ఆవరణలో గొర్రెల మందపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో మూడు గొర్రె పిల్లలు మృత్యువాతపడ్డాయి. మరో రెండింటిని ఎత్తుకెళ్లాయి. చంద్రయ్య తన గొర్రెలను పగలు మేత కోసం అడవి ప్రాంతానికి తీసుకెళ్లి రాత్రి ఇంటి పరిసరాల్లో చుట్టూ రక్షణ చర్యలు చేపట్టి ఉంచుతారు. సోమవారం అర్ధరాత్రి సమయంలో వీధికుక్కల గుంపు దాడిలో పలు గొర్రెలకు గాయాలయ్యాయి. మండల వెటర్నరీ అధికారి రాకేశ్‌శర్మ, వార్డు సభ్యుడు కోట రవి సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన గొర్రెలకు వైద్యులు చికిత్స అందజేశారు. సుమారు రూ.50 వేల వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపారు. -
జోనల్‌స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం
ముధోల్: తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలో అండర్–23 బాసర జోనల్‌స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాజీరావు, ఎస్సై బిట్ల పెర్సీస్ పోటీలను ప్రారంభించారు. మొదటి రోజు ఆదిలాబాద్, మంచిర్యాల టీంలు తలబడ్డాయి. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, ఉప సర్పంచ్ లావణ్య, క్రికెటర్ నయీముద్దీన్, కార్యదర్శి తుమ్మల దత్తు, బీజేపీ మండల అధ్యక్షుడు పోతన్న, మాజీ ఎంపీటీసీ మగ్ధూమ్, మేరోజ్ఖాన్, టీసీఏ అభయ్, రోళ్ల రమేశ్, మదన్ పాల్గొన్నారు. -
సిద్ధం చేయాలి
స్పష్టమైన ఓటరు జాబితా మంచిర్యాలఅగ్రికల్చర్: మున్సిపల్ ఎన్నికల్లో భా గంగా ముసాయిదా ఓటరు జాబితాలో పొరపాట్ల సవరణకు చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్ర య్య, డిప్యూటీ ట్రైనీ కలెక్టర్ మహ్మమద్ విలాయత్ అలీ, మంచిర్యాల ఆర్డీవోతో కలిసి మున్సిపల్ కమిషనర్లు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ముసాయిదా ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలు, పొరపాట్లపై మున్సిపల్ కమిషనర్‌కు రాత పూర్వకంగా అందిస్తే సవరణకు చర్యలు తీసుకుంటామని అన్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో 149 వార్డులకు గాను 2,94,641 మంది ఓటర్లు ఉన్నారని, మంచిర్యాల కార్పొరేషన్లో 264 పోలింగ్ కేంద్రాలు, లక్షెట్టిపేట బల్దియాలో 30, బెల్లంపల్లిలో 68, చెన్నూర్‌లో 36, క్యాతనపల్లిలో 45 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ నెల 10న తుది ఓటరు జాబితా ప్రచురిస్తామని తెలిపారు. రోడ్డు భద్రత నియమాలు పాటించాలి మందమర్రిరూరల్: రోడ్డు భద్రత నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నారు. మంగళవారం పట్టణంలోని 37వ జాతీయ రహదారిపై టోల్‌ప్లాజా వద్ద రోడ్డు భద్రత మాసోత్సవాలు–2026ను పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమానికి బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, జాతీయ రహదారుల సంస్థ జీఎం(టీ) అండ్ పీడీ కేఎస్ అజయ్ మణికుమార్లతో కలసి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రోడ్డు భద్రతా చర్యల్లో భాగంగా తనిఖీలు ముమ్మరంగా చేపడుతున్నామని, సీటు బెల్టు ధరించాలని, వాహనదారులు ధ్రువపత్రాలు తమ వద్ద ఉంచుకోవాలని బెల్లపల్లి ఏసీపీ సూచించారు. -
బ్యాడ్మింటన్ పోటీల్లో పతకాలు సాధించాలి
రెబ్బెన: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో జరుగనున్న రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు పతకాలు సాధించాలని గోలేటి సర్పంచ్ అజ్మీర బాబురావు అన్నారు. మంగళవారం గోలేటి టౌన్‌షిప్‌లోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో అండర్ 19 బాల్ బ్యాడ్మింటన్ ఉమ్మడి జిల్లా జట్ల క్రీడాకారుల ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈనెల 10 నుంచి రెండు రోజుల పాటు జరగబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా క్రీడాకారులు తమ ప్రతిభ చాటాలన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ తిరుపతి, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నారాయణరెడ్డి, షార్ప్స్టార్ బాల్ బ్యాడ్మింటన్ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, అధ్యక్షుడు మహేందర్, పీఈటీ భాస్కర్ పాల్గొన్నారు. జిల్లా జట్లకు ఎంపికై న క్రీడాకారులు బాలుర జట్టుకు పి.సాయిచరణ్, డి.ప్రేందీప్, సీహె చ్ గోపాలక్రిష్ణ, సీహెచ్ నిఖిల్, సీహెచ్ వరుణ్, ఏ.నిఖిల్, ఎం.మారుతి, ఎం.కృష్ణ లోకానంద్, జి. కృత్విక్, ఆర్. అశిష్‌కుమార్, ఏ.సాత్విక్, వి.రాఘవ, డి.సిద్ధు, బాలికల జట్టుకు టి.ప్రజ్వల శ్రీ, పి.శ్రావ్య, ఎస్.సాయి శ్రీ వర్షిని, పి.సిరి, ఎస్.రిషిత, సీహెచ్ శ్రీ లక్ష్మిదేవి, డి. నందిని, జి హన్నా, పి.స్వాద్వి, జే శివాని, కే.సంకీర్తన, జే.దమ్మదీప ఎంపికై నట్లు అసోషియేషన్ జిల్లా అధ్యక్షుడు కొత్లపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఎస్ తిరుపతి తెలిపారు. -
మంచిర్యాల
7లైట్లు ఎల్గుతలేవ్.. బెల్లంపల్లి మున్సిపాల్టీలోని పలువీధుల్లో రాత్రి వేళ వీధి దీపాలు వెలగడం లేదు. బలి యా అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 9లోu ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. చలిగాలులు వీస్తాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతుంది. గురుకుల ప్రవేశ పరీక్షకు ‘సాధన’ ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో వచ్చే విద్యాసంవత్సరం ప్రవేశాలకు విద్యార్థులను సన్నద్ధం చేసేలా ప్రభుత్వ పాఠశాలల్లో సాధ న పుస్తకాలు అందజేస్తున్నారు. 8లోu -
రోగులకు మెరుగైన సేవలు అందించాలి
మంచిర్యాలటౌన్: మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. జిల్లా కేంద్రంలోని జీజీహెచ్‌ను మంగళవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రోగులకు పూర్తి స్థాయి వైద్య సేవలు అందించడంతోపాటు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూపరింటెండెంట్ డాక్టర్ వేదవ్యాస్‌ను ఆదేశించారు. ఆసుపత్రి లో సరిపడా మందులు అందుబాటులో లేవని ఎంపీ దృష్టికి రాగా, వెంటనే సరిపడా మందులు తె ప్పించి, రోగులకు ఇబ్బందులు లేకుండా చూడాల ని సూచించారు. వార్డుల పరిశీలన అనంతరం ఆసుపత్రి ప్రాంగణంలో శంకర్ అనే వ్యక్తి తల్లి మృతిచెందిన విషయం తెలుసుకుని పరామర్శించారు. నగరంలో పర్యటనమంచిర్యాలటౌన్: ఎంపీ గడ్డం వంశీకృష్ణ మంగళవారం మంచిర్యాల నగరంలో పర్యటించారు. ప్రజ లతో మాట్లాడుతూ సమస్యలు తెలుసుకున్నారు. కూరగాయల మార్కెట్లో విక్రయదారులు, కొనుగోలుదారులతో ముచ్చటించారు. అనంతరం రతన్‌లాల్ హోటల్లో స్థానికులతో కలిసి టీ తాగి కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. -
నెట్‌బాల్ పోటీలకు ఎంపిక
ఆసిఫాబాద్‌రూరల్: రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలకు 24 మంది ఎంపికై నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అలీబిన్ అహ్మద్, తిరుపతి తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో జోనల్ అండర్ 14 నెట్‌బాల్ బాలబాలికల ఉమ్మడిజిల్లా జోనల్‌స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మహేశ్వర్ మాట్లాడుతూ పోటీల్లో 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారని, ప్రథమస్థానం ఆసిఫాబాద్, ద్వితీయస్థానం ఆదిలాబాద్, తృతీయస్థానంలో మంచిర్యాల జట్లు నిలిచాయన్నారు. మూడు జట్ల నుంచి ఉత్తమ ప్రతిభ కనబర్చిన 12 మంది బాలురు 12 మంది బాలికలను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఈ నెల 17 నుంచి 19 వరకు ఖమ్మంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో పీడీలు అఖిల్, అజయ్, యోగి, అంకిలా, కవిత, ప్రణీత్, తదితరులు పాల్గొన్నారు. -
పింఛన్‌దారుల నిరసన
కాసిపేట: పింఛన్లో కోత విధించి చెల్లిస్తున్నారని మండలంలోని రొట్టపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట పింఛన్‌దారులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. బ్రాంచ్ పోస్టుమాస్టర్ రూ. 2016 పింఛన్‌కు బదులు రూ.2వేలు, రూ.3016కు బదులు రూ.3వేలు ఇస్తున్నారని పేర్కొన్నారు. చిల్ల ర డబ్బుల విషయమై అడిగితే ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ దురుసుగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. న్యాయం చేయాలని ఆందోళనకు దిగగా రొట్టపల్లి గ్రామ పంచాయతీలో పింఛన్లు ఇవ్వనని, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ బీపీఎం వెళ్లిపోయారని తెలిపారు. ఉన్నతాధికారులు విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. -
ఎంసీసీ కార్మికుల రిలేనిరాహార దీక్ష
పాతమంచిర్యాల: జిల్లా కేంద్రంలోని మంచిర్యాల సిమెంటు కంపెనీ(ఎంసీసీ) తొలగింపు కార్మికులు తమకు రావాల్సిన బెనిఫిట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం కంపెనీ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ నెల 12వరకు దీక్షలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. కార్మికులు మాట్లాడుతూ కంపెనీ యాజమాన్యం నష్టాల సాకు చూపి ఉత్పత్తి యూనిట్లు మూసి వేసిందని, మొండిగా వ్యవహరిస్తూ జీతభత్యాలు చెల్లించడం లేదని తెలిపారు. ఇటీవల ఎంసీసీని బ్యాంకు అధికారులు వేలం వేస్తారనే సమాచారంతో కార్మికుల్లో ఆందోళన మొదలైందని అన్నారు. కార్మికులకు చెల్లించాల్సిన సొమ్ము చెల్లించిన తర్వాతే ఏదైనా జరగాలని, లేనిపక్షంలో కంపెనీ భూముల్లో గుడిసెలు వేసుకుంటామని స్పష్టం చేశారు. ఒక్కొక్కరికి రూ.50లక్షలు నష్టపరిహారంతోపాటు కంపెనీ ఆవరణలోని ప్రభు త్వ భూమిలో ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నష్టపరిహారం చెల్లించాలని, రాజకీయ పా ర్టీలు సహకరించాలని కార్మికులు సలిగంటి మహేందర్, అల్కారీ రాజన్న కోరారు. -
దరఖాస్తులు పరిష్కరించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రజావాణిలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, డిప్యూటీ ట్రెయినీ కలెక్టర్ మహమ్మద్ విలాయత్ అలీతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. లైబ్రరీ ఏర్పాటు చేయాలి నస్పూర్: నస్పూర్ మండల పరిధిలో లైబ్రరీ ఏర్పాటు చేయాలని నిరుద్యోగులు దుర్గం రఘు, మేడ వంశీకృష్ణ, కట్ల శ్రీనివాస్, శ్రీరాంపూర్, నస్పూర్ మండలాల యువకులు కలెక్టర్‌ను కోరారు. కోల్‌బెల్ట్ ప్రాంతంలో నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పడుతుంటారని, లైబ్రరీ లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. -
ముసాయిదా జాబితా సవరించండి
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జిల్లాలోని మంచిర్యాల నగరం, పట్టణాల్లో విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. మంచిర్యాల కార్పొరేషన్‌తో సహా మున్సిపాల్టీలు బెల్లంపల్లి, చెన్నూరు, క్యాతనపల్లి, లక్షెట్టిపేటలో అనేక అర్జీలు వస్తున్నాయి. స్థానిక తాజా, మాజీ ప్రజాప్రతినిధులు, పలు రాజకీయ పార్టీ నాయకులు వార్డులు, డివిజన్లలో ఉన్న తప్పులపై దరఖాస్తులు అందజేస్తున్నారు. వీటిలో ముఖ్యంగా ఒక వార్డులో ఇళ్లు ఉంటే మరో వార్డులోని ఓటరు జాబితాలో ఓట్లు ఉండడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలింగ్ సమయంలో ఇబ్బంది పడాల్సి వస్తుందని, ఇళ్లు ఉన్న వార్డులోనే కొనసాగించాలని కోరుతున్నారు. ఇక వార్డుల సరిహద్దుల్లోనూ తప్పిదాలు ఉన్నట్లు గుర్తిస్తున్నారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తరహాలోనే మృతుల ఓట్లను జాబితా నుంచి తొలగించలేదు. దీంతో తమ వార్డులో ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నాయని, మరోవైపు ఓటింగ్ సమయంలోనూ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని, దీంతో ఆ ఓట్లను ధ్రువీకరించి తొలగించాలని కోరుతున్నారు. అంతేకాక వలస వెళ్లిన వారు, వేరే చోటుకు ఓట్లు మార్పిడి చేసుకున్న వారి వివరాలను తొలగించాలని వినతి ఇస్తున్నారు. ఆయా వార్డుల్లో పోటీలో నిలవాలని ఆరాటపడుతున్న నాయకులు ఓటరు జాబితా, తప్పులు దొర్లడంపై అధికారులకు వినతులు ఇస్తున్నారు. సోమవారం మున్సిపల్ అధికారులు రాజకీయ పార్టీల నాయకులతో నిర్వహించిన సమావేశంలోనూ ముసాయిదా ఓటరు జాబితాను సవరించాలంటూ చర్చకు వచ్చింది.సోమవారం వరకు వచ్చినవి..మున్సిపాలిటీ/నగరం అభ్యంతరాలుమంచిర్యాల 239 క్యాతనపల్లి 205 చెన్నూరు 71 లక్షెట్టిపేట 57 బెల్లంపల్లి 36 -
‘మీ సేవా’ నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: మీ సేవా కేంద్రాల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య నిర్వాహకులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన వ్యవసాయ అధికారి సురేఖ, ఈ–డిస్ట్రిక్ట్ మేనేజర్ సునీల్‌తో కలిసి మీ సేవా కేంద్రాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ చంద్రయ్య మాట్లాడుతూ జిల్లాలో మీ సేవా కేంద్రాలు ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలకు దరఖాస్తు చేసుకునేలా చూడాలని తెలిపారు. పని వేళలు పాటించాలని, వివిధ సేవలకు నిర్దేశించిన ధరల పట్టిక ప్రదర్శించాలని, నిర్దేశిత రుసుంకు మించి వసూలు చేయకూడదని పే ర్కొన్నారు. ప్రతీ మీ సేవ కేంద్రంలో హెల్ప్‌లైన్ సెంటర్, తహసీల్దార్ పేరు, మొబైల్ నంబరు ప్రదర్శించాలని, మార్చిలోగా అనుమతులు పునరుద్ధరించుకోవాలని సూచించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రతీ రైతుకు గుర్తింపు సంఖ్య కేటా యించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, మీ సేవా కేంద్రాలకు అవకాశం కల్పిస్తామని, ఇబ్బందులు తలెత్తకుండా ప్రక్రియ నిర్వహించాలని పేర్కొన్నారు. -
దివ్యాంగుల చట్టం అమలు చేయాలి
పాతమంచిర్యాల: దివ్యాంగుల చట్టం–2016 పకడ్బందీగా అమలు చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి(వీహెచ్పీఎస్) జాతీ య నాయకులు పెద్దపల్లి సత్యనారాయణ అన్నారు. సోమవారం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝూకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులను దూషించినా, వారిపై దాడి చేసినా కేసులు నమోదు చేయాలని కోరారు. దివ్యాంగుల కోసం అన్ని పోలీస్స్టేషన్లలో వీల్చైర్లు అందుబాటులో ఉంచాలని, ర్యాంపులు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. జిల్లాలో వికలాంగుల చట్టాలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీహెచ్పీఎస్ జాతీయ కన్వీనర్ బీవీ.అప్పారావు, నాయకులు ఇందూరి రమేష్, కంచర్ల సదానందం, దుర్శెట్టి లక్ష్మణ్, మడావి షేక్రావు పాల్గొన్నారు. -
మౌలిక సదుపాయాలతో విద్య
మంచిర్యాలఅగ్రికల్చర్: సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థులకు మౌలిక వసతులతోపాటు నాణ్యమైన విద్య అందించే దిశగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో వసతిగృహాల్లోని ప్రీమెట్రిక్, పోస్ట్‌మెట్రిక్ విద్యార్థులు తయారు చేసిన నూతన సంవత్సర గ్రీటింగ్‌కార్డులను కలెక్టర్, అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపకార వేతనాల నమోదులో నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, సంక్షేమ అధికారులు చాతరాజుల దుర్గప్రసాద్, అధికారులు పాల్గొన్నారు. -
వామ్మో చైనా మాంజా!
మంచిర్యాలక్రైం: సంక్రాంతి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో గాలిపటాలు ఎగురవేసేందుకు ఉపయోగించేందుకు చైనా మాంజా విక్రయాలు జిల్లాలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నాయి. నిషేధిత చైనా మాంజా వల్ల కొందరు ప్రాణాలు కోల్పోవడం, మరికొందరు తీవ్రంగా గాయపడడం వంటి ఘటనలు గతంలో చోటు చేసుకున్నాయి. తాజాగా జిల్లా కేంద్రం మంచిర్యాలలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలో మూడు రోజుల క్రితం చెన్నూర్ మండలం గంగారం గ్రామానికి చెందిన మధుకర్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా చైనా మాంజా పెదాలపై తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. అప్రమత్తమై ద్విచక్ర వాహనాన్ని నిలిపి వేయడం వల్ల ప్రమాదం తప్పింది. ఈ ఘటన జరిగిన మూడు రోజులు కావస్తున్నా జిల్లా పోలీసు యంత్రాంగం, అటవీశాఖ అధికారుల్లో కదలిక లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. చైనా మాంజాపై నిషేధం ఉన్నప్పటికీ కొందరు వ్యాపారులు ధనార్జనే ధ్యేయంగా విక్రయిస్తున్నారు. పక్షులు, ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారికి ప్రమాదాలకు కారణం అవుతున్నారు. 2022 జనవరి 16న పాతమంచిర్యాల రాళ్లవాగు బ్రిడ్జిపై చైనా మాంజా తగిలి వలస కూలీ పస్తం భీమయ్య మృతిచెందాడు. ప్రతీ ఏడాది పండుగకు కొద్ది రోజుల ముందు పోలీసు శాఖ అడపాదడపా దాడులు నిర్వహించి మమ అనిపిస్తున్నారు. అటవీ శాఖ అధికారులు దాడులు నిర్వహించిన దాఖలా లు లేవు. యథేచ్ఛగా విక్రయాలు సాగుతున్నా అధికారుల దాడుల్లో లభించకపోవడం గమనార్హం. పండుగకు నెల రోజుల ముందే వ్యాపారులు అక్రమంగా దిగుమతి చేసుకుంటున్నట్లు సమాచారం. ‘మామూలు’గా వ్యవహరిస్తున్న అధికారులు సంక్రాంతి పండుగకు ముందు నుంచే వరుస దాడులు నిర్వహించాల్సి ఉండగా పోలీసు, అటవీ శాఖ అధికారులు సమన్వయ లోపంతో దాడులు చేయ డం లేదనే విమర్శలున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు విక్రయదారులపై కేసులు నమోదు చేసిన దాఖలా లు లేవు. ముందుగానే వ్యాపారులు అధికారులతో ములాఖత్ అయి ఎంతో కొంత ముట్టజెప్తున్నారనే ఆరోపణలున్నాయి. ‘‘ఏమవుతుంది.. కేసులు అయితే చిన్న చిన్న కేసులే కదా..’’ అంటూ జిల్లా కేంద్రంలోని ఓ వ్యాపారి వ్యాఖ్యానించారంటే అధికారులపై ఎంత భరోసా ఉందో అర్థమవుతోంది. వినియోగిస్తే ఏడేళ్ల జైలుగాజు పూత పూసిన చైనా మాంజాను వినియోగిస్తే పక్షులు, జంతువులు, ద్విచక్ర వాహనదారులు, పతంగులు ఎగురవేసే వారికి సైతం ప్రాణహాని కలిగే అవకాశం ఉంటుందని వన్యప్రాణి ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థల అభ్యర్థన మేరకు తెలంగాణ ప్రభుత్వం 2017 జూలై 17న నిషేధం విధించింది. వినియోగించిన వారికి ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానా అమలు చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పర్యావరణ రక్షణ యాక్ట్ 1986, ప్రివెన్షన్ క్రూయాల్టీ టు ఎనిమల్స్ యాక్ట్ 1960 ప్రకారం చట్టపరమైన చర్యలు అమలులో ఉండగా చైనా మాంజా జిల్లాకు ఎలా వస్తుందనేది మిస్టరీగా మారింది. -
సహజ వ్యవసాయంతో అధిక లాభాలు
బెల్లంపల్లిరూరల్: సహజ వ్యవసాయంతో అధిక దిగుబడులు, లాభాలు ఆర్జించవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి ఏ.సురేఖ అన్నారు. సోమవారం మండలంలోని చంద్రవెల్లి గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సహజ వ్యవసాయంపై అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధిక మోతాదులో రసాయనిక ఎరువుల వినియోగం వల్ల భూమి సారం కోల్పోవడంతోపాటు మానవాళి ఆరోగ్యం క్షీణిస్తుందని తెలిపారు. సేంద్రియ ఎరువులు జీవామృతం, బీజామృతం వినియోగిస్తూ పంట సాగు చేస్తే అధిక లాభాలు పొందవచ్చని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సహజ వ్యవసాయం పథకంలో చంద్రవెల్లి గ్రామం ఎంపికై ందని, 125మంది రైతులకు ఒక్కో ఎకరంలో సహజ వ్యవసాయ సాగుపై మెళకువలు, సూచనలు చేస్తామని తెలిపారు. కృషి విజ్ఞాన కేంద్రంలో రైతులకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏడీఏ రాజానరేందర్, మండల వ్యవసాయాధికారి ప్రేమ్‌కుమార్, చంద్రవెల్లి సర్పంచ్ చిలుముల శ్రీనివాస్, ఉప సర్పంచ్ గజ్జెల్లి రాజ్‌కుమార్, కేవీకే శాస్త్రవేత్త ప్రియసుగంధి, ఏఈవోలు తిరుపతి, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
మాతాశిశు ఆరోగ్య కేంద్రం తనిఖీ
పాతమంచిర్యాల: జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్.అనిత సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. హెల్ప్‌డెస్క్, నియోనేటల్ కేర్, పాలిటివ్కేర్, కీమోథెరపి సెంటర్లను పరిశీలించారు. జిల్లాలో కీమోథెరపి కోసం ఎంతమంది రోగులు ఎదురు చూస్తున్నారు, క్యాన్సర్ రోగుల వివరాలు అందించాలని సిబ్బందికి సూచనలు చేశారు. సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండి వైద్యసేవలు అందించాలని, సమయపాలన పాటించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్లు, వైద్యాధికారి శ్రీనివాస్, డీపీహెచ్ఎన్ పద్మ పాల్గొన్నారు. -
‘జీవో 229ని వ్యతిరేకిస్తున్నాం’
మంచిర్యాలటౌన్: తెలంగాణ మెడికల్ కౌన్సిల్ స్వయంప్రతిపత్తిని దెబ్బతీసేలా తీసుకువచ్చిన జీవో 229ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ), హెల్త్‌కేర్ రిఫార్మ్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్డీఏ) మంచిర్యాల విభాగ సభ్యులు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మెడికల్ కౌన్సిల్ అనేది ఒక స్వంతంత్ర చట్టబద్ధమైన సంస్థ అని, ప్రభుత్వ అధి కారుల జోక్యం పెరగడంతో కౌన్సిల్ వృత్తిపరమైన స్వేచ్ఛ, నిర్ణయాధికారం పూర్తిగా దెబ్బతింటాయన్నారు. కౌన్సిల్లో సభ్యుల సంఖ్య 25 నుంచి 29కి పెంచడం ద్వారా ఇబ్బందులుంటాయని, వైద్య, విద్య, నైతిక విలువలు, క్రమశిక్షణ లాంటి అంశాలపై వైద్యార్హత లేని ఐఏఎస్ అధికారులు నిర్ణయం తీసుకోవడం సమంజసం కాదని పేర్కొన్నారు. ప్రస్తుతం టీజీఎంసీ నకిలీ వైద్యులపై కఠినచర్యలను తీసుకుంటున్న తరుణంలో జీవో 229ని తేవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే చట్టపరమైన, ప్రజా స్వామ్య మార్గాల్లో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. టీజీఎంసీ సభ్యులు డాక్టర్ ఎగ్గన శ్రీనివాస్, డాక్టర్ సంతోష్ చందూరి, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ రవిప్రసాద్, హెచ్ఆర్డీఏ అధ్యక్షుడు డాక్టర్ అనిల్ ముత్తినేని, వైద్యులు పాల్గొన్నారు. -
ఓసీ కమిషన్ ఏర్పాటు చేయాలి
మంచిర్యాలటౌన్: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు ప్రత్యేక ఓసీ కమిషన్ ఏర్పాటు చేయాలని ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఓసీ నాయకుల సన్నాహక సమావేశంలో మాట్లాడారు. ఓసీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ జారీకి షరతులు లేని ఐదేళ్ల కాలపరిమితిని కలిగి ఉండేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఓసీ ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు విద్య, ఉద్యోగ పోటీ పరీక్షల్లో వయోపరిమితిని పెంచాలని, ఈడబ్ల్యూఎస్ బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ జారీకి రూ.10లక్షల ఆదాయ పరిమితి పెంచాలని, టెట్ అర్హత పరీక్ష మార్కులను 90 నుంచి 70కి తగ్గించాలని కోరారు. తమ డిమాండ్లు ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లేందుకు ఈ నెల 11న సాయంత్రం 3గంటలకు హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించనున్న ఓసీల సింహగర్జన సభకు రాజకీయాలకు అతీతంగా ఓసీలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. అనంతరం సభ పోస్టర్ ఆవిష్కరించారు. వివిధ సంఘాల నాయకులు మెట్టుపల్లి కిషన్‌రావు, రాకేశ్‌రెడ్డి, వెంకటరమణారావు, రాజిరెడ్డి, ప్రకాశ్, శ్రీనివాస్, హరీశ్, శ్రీకాంత్, కమల్ కిశోర్, సురేశ్, రామారావు, మురళీధర్‌రావు పాల్గొన్నారు.మున్నూరుకాపు కార్పొరేషన్.. మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ మంత్రి శ్రీధర్‌బాబును కోరారు. ఆదివారం హైదరాబాద్‌లో మంత్రిని కలిసి మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటుపై అసెంబ్లీ వేదికగా గళమెత్తాలని విజ్ఞప్తి చేశారు. కార్పొరేషన్ ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. -
గెలిచిన సంఘాలు విఫలం
శ్రీరాంపూర్: ఎన్నికల్లో గెలిచిన సంఘాలు కార్మికుల సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలం అయ్యాయని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి విమర్శించారు. ఆదివారం ఆర్కే న్యూటెక్ గనిపై ఏర్పాటు చేసిన ముఖ్యకార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గుర్తింపు సంఘం ఏఐటీయూసీ, ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీయూసీ కార్మికులకు రెండేళ్లలో సాధించింది ఏమీలేదన్నారు. ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చిన గెలిచిన తరువాత మోసం చేశారన్నారు. సింగరేణి కార్మికులకు హక్కులు సాధించి పెట్టిన చరిత్ర టీబీజీకేఎస్‌కే దక్కుతుందన్నారు. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణిపై ఉన్న మమకారంతో కారుణ్య ఉద్యోగాలు, క్వార్టర్లలో ఉచిత విద్యుత్తు, లాభాల్లో అధిక శాతం వాటా వంటి అనేక హక్కులు కల్పించారన్నారు. ఈ సందర్భంగా పలువురు కార్మికులు టీబీజీకేఎస్‌లో చేరగా వారికి నేతలు కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆ యూనియన్ కేంద్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, బ్రాంచ్ ఉపాధ్యక్షుడు బండి రమేశ్, నాయకులు నూనె కొమురయ్య, సతీష్, సత్తయ్య, పొగాకు రమేశ్, అన్వేష్ రెడ్డి, లాల, వెంగళ కుమార్ స్వామి, దేవేందర్ శ్రీకాంత్, జైపాల్‌రెడ్డి, రాజేంద్రప్రసాద్, భగవాన్, తదితరులు పాల్గొన్నారు. -
మద్యానికి బానిసై ఒకరు మృతి
లక్సెట్టిపేట: మున్సిపాలిటీ పరిధిలోని ముల్కల్లగూడలో మద్యానికి బానిసై ఒకరు మృతి చెందినట్లు ఎస్సై గోపతి సురేష్ తెలిపారు. ముల్కల్లగూడకు చెందిన చంద్రశేఖర్ (35) చిన్ననాటి నుంచి అమ్మమ్మ భీమక్క వద్ద ఉంటున్నాడు. కొన్నేళ్ల క్రితం భీమక్క మృతి చెందింది. గతేడాది అతను ఉంటున్న ఇల్లు కూలిపోవడంతో సమీపంలో ఉన్న జీవన్‌రెడ్డి ఇంట్లో పడుకుంటున్నాడు. ఈ నెల 2 నుంచి అదృశ్యమయ్యాడు. ఇంటి సమీపంలో దుర్వాసన రావడంతో స్థానికులు వెళ్లిచూడగా మృతిచెంది కనిపించాడు. తిండి, నీరు లేక చనిపోయాడని ఎస్సై తెలిపారు. ఈ మేరకు కేసు నమెదు చేసి దర్యాప్తు జరుపుతున్నామన్నారు. -
ఒంటరిగా బతకలేక..
రామకృష్ణాపూర్:అతను సింగరేణిలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు. ఉద్యోగం చేస్తున్న సమయంలోనే ముగ్గురు కొడుకులు, కూతురును చదివించాడు. ఈ క్రమంలో 20 ఏళ్ల క్రితం భార్య అనారోగ్యంతో మృతిచెందింది. దీంతో కుంగిపోయాడు. అయినా కూతురుకు, పెద్ద కుమారుడికి పెళ్లి చేశాడు. ప్రస్తుతం పిల్లలు ఉద్యోగ రిత్యా దూరంగా ఉంటున్నారు. కొన్నేళ్లుగా ఒంటరిగా ఉంటున్న అతనికి అందరూ ఉన్నాడు. ఇటీవల అనారోగ్య సమస్యలు కూడా మొదలయ్యాయి. ఒంటరిగా జీవించడంతో జీవితంపై విరక్తి కలిగింది. దీంతో ఉరేసుకుని ఉసురు తీసుకున్నాడు. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్లో ఆదివారం జరిగింది. ఎస్సై భూమేశ్ కథనం ప్రకారం.. పట్టణంలోని భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి బచ్చు సుదర్శన్(75) భార్య 20 ఏళ్ల క్రితం మరణించింది. 2007లో గోల్డెన్‌షేక్ హ్యాండ్ ద్వారా రిటైర్ అయ్యాడు. వృత్తి రీత్యా కుమారులు హైదరాబాద్‌లో ఉంటుండగా, కుమార్తె అత్తింట్లో ఉంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం పెద్ద కుమారుడికి ఫోన్ చేశాడు. హైదరాబాద్‌కు వస్తానని తెలిపాడు. దీంతో కొడుక రెండు రోజల తర్వాత రావాలని సూచించాడు. ఇంతలోనే సుదర్శన్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో తండ్రి వద్దకు వచ్చిన పిల్లలు బోరున విలపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
గోదావరిలో మునిగి ఒకరు..
జన్నారం: బంధువుల కర్మకాండకు వెళ్లివస్తూ గో దావరిలో మునిగి ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం జన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కుందారపు లక్ష్మీనారాయణచారి (55) ఆదివారం జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం జైనా గ్రామంలోని బంధువుల ఇంట్లో కర్మకాండకు తన బాబయ్ చంద్రయ్యతో కలిసి తిమ్మాపూర్ గోదావరి నది దాటి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో లక్ష్మీనారాయణచారి మడుగులో నీటమునిగాడు. గమనించిన చంద్రయ్య రక్షించేందుకు చేసిన ప్రయత్నం ఫలితం లేదు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించి యువకుల సాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. విషయం తెలుసుకున్న ఎస్సై గొల్లపెల్లి అనూష సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతునికి భార్య పుష్పలత, కుమారులు వెంకటచారి, రాజుకుమార్ ఉన్నారు. బాసర గోదావరిలో .. బాసర: బాసర గోదావరినది లో ఆదివారం గుర్తుతెలియని వ్యక్తిమృతదేహం లభ్యమైనట్లు ఎస్సై నవనీత్‌రెడ్డి తెలిపారు. మృతుడు నలుపు రంగు ప్యాంటు పింక్ కలర్ టీ షర్టు ధరించి ఉన్నాడు. మృతదేహం వద్ద ఎలాంటి గుర్తింపుకార్డు, చిరునామా కలిగిన ఆనవాళ్లు లభించకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. చుక్కలదుప్పి మాంసం పట్టివేత!చెన్నూర్‌రూరల్: ఆదివార్పేట శివారులోని పత్తి చేనులో చుక్కలదుప్పిని హతమార్చి మాంసాన్ని తరలిస్తున్న వ్యక్తులను ఆదివారం రాత్రి చెన్నూర్ అటవీశాఖ అధికారులు పట్టుకున్నట్లు సమాచారం. దుప్పి మాంసంతో పాటు మండలంలోని పలు గ్రామాలకు చెందిన పలువురిని అదుపులోకి తీసుకోగా, మరికొందరు పరారీలో ఉన్నట్లు తెలిసింది. -
సింగరేణికి బకాయిలు చెల్లించాలి
శ్రీరాంపూర్: రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంస్థల నుంచి సింగరేణికి రావాల్సిన రూ.45 వేలకోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ చేశారు. ఆదివారం నస్పూర్‌లోని నరసయ్య భవన్లో నిర్వహించిన యూనియన్ డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణికి రావాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో కంపెనీ తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుందన్నారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ మాట్లాడుతూ సీపీఐ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఖమ్మంలో ఈ నెల 18న జరిగే బహిరంగసభకు సింగరేణి కార్మికులు అధికసంఖ్యలో తరలిరావాలని కోరారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్, యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కే.వీరభద్రయ్య, ముస్కే సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శి బాజీసైదా, ఉపాధ్యక్షుడు కొట్టే కిషన్‌రావు, నాయకులు కొమురయ్య, రాచర్ల చంద్రమోహన్, అఫ్రోజ్ ఖాన్, ప్రసాద్ రెడ్డి బుచ్చయ్య, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతున్న సింగరేణి మందమర్రిరూరల్: సింగరేణి యాజమాన్యం రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి కార్మిక సమస్యలు పట్టించుకోవడం లేదని ఏఐటీయూసీ కేంద్ర కమిటీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య ఆరోపించారు. ఆదివారం ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ కంటే ఈ ప్రభుత్వంలో రాజకీయ జోక్యం అధికమైందన్నారు. యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్, బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి మల్లేశ్, రామకృష్ణాపూర్ కార్యదర్శి అక్బర్అలీ, నాయకులు చిప్ప నర్సయ్య, లింగయ్య, శ్రీనివాస్, మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు. -
‘సీపీఐది త్యాగాల చరిత్ర’
బెల్లంపల్లి: సీపీఐది త్యాగాల చరిత్ర అని పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేణ శంకర్ పేర్కొన్నారు. బెల్లంపల్లిలో సీపీఐ చేపట్టిన జీపు జాతాను ఆదివారం ప్రారంభించారు. బజారు ఏరియాలోని దివంగత గుండా మల్లేశ్, సర్దార్ భగత్‌సింగ్ విగ్రహాలకు జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, సీపీఐ కంట్రోల్ కమిషన్ సభ్యుడు మిట్టపల్లి వెంకటస్వామితో కలిసి పూలమాలలు వేసి విప్లవ జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖమ్మంలో ఈనెల 18న నిర్వహించనున్న సీపీఐ శత జయంత్యుత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. అన్ని వర్గాల హక్కులు, సమస్యల పరిష్కారానికి సీపీఐ అలుపెరుగని పోరాట చేస్తోందని తెలిపారు. సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు మేకల దాసు, బీ పూర్ణిమ, అసెంబ్లీ నియోజకవర్గ సీపీఐ కార్యదర్శి దాగం మల్లేశ్, బెల్లంపల్లి పట్టణ కార్యదర్శి ఆడేపు రాజమౌళి, సీనియర్ నాయకులు చిప్ప నర్సయ్య, అక్కెపల్లి బాపు, కొండు బానేశ్, బీ తిలక్ అంబేడ్కర్, మాణిక్యం, జీసీ మాణిక్యం, డీఆర్ శ్రీధర్, కే రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. -
అడ్వకేట్ ప్రీమియర్ లీగ్ విజేతలకు బహుమతులు
బెల్లంపల్లి: బెల్లంపల్లి ఏఎంసీ క్రీడా మైదానంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అడ్వకేట్స్ ప్రీమియర్ లీగ్ మంచిర్యాల క్రికెట్ టోర్నమెంట్ శనివారం రాత్రి ముగిసింది. హోరాహోరీగా జరిగిన ఈ పోటీల్లో బెల్లంపల్లి బార్ అసోసియేషన్ జట్టు విన్నర్స్‌గా, మంచిర్యాల బార్ అసోసియేషన్ జట్టు రన్నర్స్‌గా నిలిచాయి. ఇరుజట్లకు ముఖ్య అ తిథిగా హాజరైన జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీరయ్య బహుమతులు అందజేశారు. మంచిర్యాల సబ్ జడ్జి రామమోహన్‌రెడ్డి, బె ల్లంపల్లి జూనియర్ సివిల్ జడ్జి ముఖేశ్, బెల్లంపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అంకెం శివకుమార్, కార్యదర్శి చేను రవికుమార్, సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
వాకింగ్‌కు వెళ్లి తిరిగిరాని లోకాలకు..
మంచిర్యాల(క్రైం): వాకింగ్ వెళ్లిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై మజారొద్దీన్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని ఆర్ఆర్ఆర్ నగర్లో నివాసం ఉంటూ కుమురంభీం జిల్లా సిర్పూర్(టి)లో పోస్ట్‌మెన్‌గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీరాంబట్ల నాగేందర్ శర్మ (58) ఈ నెల 3న సాయంత్రం ఏసీసీ రోడ్ వైపు వాకింగ్‌కు వెళ్లాడు. ఇంటికి తిరిగివస్తుండగా గడ్పూర్ వైపు నుంచి అతివేగంగా వచ్చిన ఆటో డీమార్ట్ సమీపంలో ఢీకొట్టింది. తీవ్రగాయాలు కావడంతో ముందుగా ప్రభుత్వ ఆసుపత్రికి, మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌కు తరలించగా పరిస్థితి విషమించి ఆదివారం మృతి చెందాడు. మృతునికి భార్య శీలా, కుమారుడు అక్షయ్, కుమార్తె నికిత ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.


