Mancherial District News
-
ఏళ్ల నిరీక్షణ.. టీచరైన వేళ..
● 17ఏళ్లకు ఫలించిన న్యాయ పోరాటం ● 2008 డీఎస్సీ అభ్యర్థులకు కొలువులుమంచిర్యాలఅర్బన్: ఉద్యోగమనేది నిరుద్యోగుల కల. డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఎంపిక కావడంతో కల నెరవేరిందని అనుకున్నారు. తెల్లవారితే చాలు పోస్టింగ్ వచ్చేది. కోర్టులో కేసు పడడం.. దక్కినట్లే దక్కిన ఉద్యోగం చేజారడంతో కల చెదిరింది. ఒకటి రెండేళ్లు కాదు.. ఏకంగా 17ఏళ్లు వేచి చూశారు. ఎప్పటికై నా టీచర్ కల నెరవేరుతుందని ఆశించారు. న్యాయపోరాటం ఫలించడంతో కొలువులు దక్కించుకున్నారు. ఎట్టకేలకు హైకోర్టు ఉత్తర్వులతో డీఎస్సీ–2008 అభ్యర్థులు ఒప్పంద పద్ధతిన నియామక పత్రాలు అందుకున్నారు. ఇటీవల జిల్లాలో 12మందిని ఆయా పాఠశాలలకు కేటాయించారు. కాంట్రాక్టు పద్ధతిన నియామకంతోపాటు వేతనం అంతంతే కావడం వల్ల ఇబ్బందిగా మారిందని వాపోతున్నారు. జిల్లాలో ఆయా పాఠశాలల్లో డిప్యూటేషన్లపై టీచర్లను సర్దుబాటు చేసిన చోట కేటాయించాలని కోరుతున్నారు. ఒప్పంద నియామక పత్రాలు అందుకున్న కొందరిని ‘సాక్షి’ పలుకరించింది. వారి మాటల్లోనే.. -
విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి
పెంబి: విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతిచెందిన ఘటన మండలంలోని నాగాపూర్‌లో చోటుచేసుకుంది. ఎస్సై హన్మాండ్లు కథనం ప్రకారం.. నాగాపూర్‌కు చెందిన రాపెని మైసయ్య (47) గ్రామశివారులో మొక్కజొన్నను కౌలుకు తీసుకున్నాడు. శుక్రవారం ఉదయం పెద్ద కుమారుడు మహేశ్‌తో కలిసి మొక్కజొన్న చేను వద్దకు వెళ్లారు. అక్కడ విద్యుత్ బల్బు కోసం అమర్చిన జీ వైరుకు మైసయ్య చేతిలో ఉన్న కొడవలి తగిలి షాక్‌కు గురయ్యాడు. గమనించిన కుమారుడు తప్పించే ప్రయత్నం చేయగా తీవ్ర గాయాలయ్యాయి. మైసయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. గాయాలైన మహేశ్‌ను స్థానికులు ఖానాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య భీమక్క ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై తెలిపారు. -
No Headline
తల్లిదండ్రులు మందలించారని.. ఉట్నూర్‌రూరల్: తల్లిదండ్రులు మందలించారని కుమారుడు మద్యం మత్తులో పు రుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉట్నూర్ సీఐ మోగిలి కథనం ప్రకారం.. మండలంలోని హస్నాపూర్‌కు చెందిన జాదవ్ బాలుసింగ్, రాధాబాయి దంపతులు. వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరికి ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడు జాదవ్ వెంకటేశ్ (26) పారామెడికల్ పూర్తి చేశాడు. ఉద్యోగం రాక ఎలాంటి పనులు చేయకుండా జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిసయ్యాడు. గురువారం రాత్రి తల్లిదండ్రులు ఏం పనిచేయకుండా మద్యం తాగితే ఎలా అని మందలించారు. మద్యం మత్తులో వెంకటేశ్ ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి పడుకున్నాడు. శుక్రవారం ఉదయం తల్లి కుమారుడిని లేపగా ఎంతకీ లేవలేదు. కొడుకు మృతి చెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. తండ్రి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఉరేసుకుని వివాహిత..తానూరు: వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం..మండలంలోని బోల్సా గ్రామానికి చెందిన బెల్లెడ్ నవనీత (22)కు అదే గ్రామానికి చెందిన రాకేశ్‌తో గతేడాది వివాహమైంది. మూడు నెలల గర్భిణి అయిన నవనీతను ఇంటివద్ద ఉంచి ఈనెల 20న భర్త రాకేశ్‌తోపాటు కుటుంబ సభ్యులు సారంగపూర్ మండలం చించోలి (బి) గ్రామంలో సీమంతం కార్యక్రమానికి వెళ్లారు. తనను తీసుకెళ్లలేదని మనస్తాపంతో నవనీత గురువారం ఇంట్లో దూలానికి చీరతో ఉరేసుకుంది. సాయంత్రం ఇంటికి చేరుకున్న కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. భర్త ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. రైలు కిందపడి వ్యక్తి..సిర్పూర్(టి): సిర్పూర్(టి)–వేంపల్లి రైల్వేస్టేషన్ల మధ్యలో మండలంలోని ఆరెగూడ సమీపంలో శుక్రవారం రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్ సురేశ్ కథనం ప్రకారం.. మంచిర్యాల వైపు నుంచి బల్లార్షా వైపు వెళ్తున్న గుర్తుతెలియని రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి వయస్సు 30 నుంచి 35 ఏళ్లు ఉంటుందని, బ్లాక్ కలర్‌ఫుల్ టీషర్ట్, బ్లూ కలర్ లోయర్ ధరించాడు. నడుముకు టవల్ చుట్టుకుని ఉన్నాడు. మృతదేహాన్ని కాగజ్‌నగర్ ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించి భద్రపర్చినట్లు జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్ తెలిపారు. మృతుడి వివరాలు ఎవరికై నా తెలిస్తే కాగజ్‌నగర్ రైల్వేపోలీసుస్టేషన్‌లో సమాచారం అందించాలని సూచించారు. -
ఉద్యోగంతో ఊరట..
12ఏళ్లపాటు ప్రైవేట్ లెక్చరర్‌గా పనిచేశా. డీఎస్సీ 2008 నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగం వచ్చింది. కోర్టు కేసులో పడింది. అప్పటి నుంచి కోర్టు కేసులు, కలవని రాజకీయ నాయకులు లేరు. ఏదేమైనప్పటికీ ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత న్యాయం జరిగింది. ఉద్యోగం వచ్చిందనే సంతోషం ఉన్నా.. కాంట్రాక్టు బేసిక్‌లో టీచర్‌గా నియమించడం కొంత మేర నిరుత్సాహ పరిచింది. జీతం తక్కువ కావడం, మారుమూల ప్రాంత మండలాల్లో పోస్టింగ్‌లు ఇవ్వడంతో ట్రాన్స్‌పోర్టు ఇబ్బందిగా మారింది. – కమలాకర్, ఎంపీపీఎస్ ఎస్టీ కాలనీ ముల్కలపేట్, మం: వేమనపల్లి -
ఆటోలో నుంచి పడి వ్యక్తి మృతి
తానూరు: ఆటోలో నుంచి పడి వ్యక్తి మృతిచెందినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని సింగన్‌గాం గ్రామానికి చెందిన ఎల్మె దిలీప్ (37) మూర్చ వ్యాధితో బాధపడుతున్నాడు. గురువారం పని నిమిత్తం తానూరుకు వచ్చాడు. పని ముగించుకుని స్వగ్రామానికి వెళ్లేందుకు మండల కేంద్రంలోని బస్టాప్ వద్ద ఆటోస్టాండ్‌కు వెళ్లాడు. అక్కడ ఆగి ఉన్న ఆటోలో పడుకున్నాడు. రాత్రి 8 గంటల ప్రాంతంలో ప్రమాదవశాత్తు రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య మంగళబాయి ఫిర్యాదుతో శుక్రవారం కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. యువతి అదృశ్యం నెన్నెల: మండలకేంద్రానికి చెందిన యువతి(22) అదృశ్యమైనట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం..ఈనెల 18న బ్యాంక్‌కు వెళ్తానని చెప్పి యువతి ఇంటి నుంచి బయల్దేరింది. అదేరోజు సాయంత్రం తెలిసిన వా రి ఇంటికి ఫోన్ చేసి తాను బెల్లంపల్లి బుగ్గ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో పెళ్లి చేసుకున్నట్లు చెప్పింది. అప్పటి నుంచి ఫోన్ స్విచ్ఛాప్ వస్తుందని కుటుంబ సభ్యులు మూడురోజులు వెతికినా ఆచూకీ దొరకలేదు. తల్లి ఫిర్యాదు మేరకు శుక్రవారం మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
● 25శాతం తగ్గింపుతో ఎల్ఆర్ఎస్ అమలు ● అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణకు అవకాశం ● జిల్లాలో వేలాది ప్లాట్లు అనుమతి లేనివే.. ● పరిశీలన, ఫీజుల వసూళ్లకు ప్రణాళిక
జిల్లాలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు మున్సిపాలిటీ 39,512పంచాయతీ 15,729సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఎల్ఆర్ఎస్(లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకం) ప్రక్రియ వేగవంతానికి జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. గత నాలుగేళ్లుగా ఈ ప్రక్రియ సాగుతుండగా.. ఆశించిన మేర పూర్తి కాని పరిస్థితి నెలకొంది. జిల్లాలో డీటీసీపీ అనుమతి లేకుండానే అనధికారికంగా ప్లాట్ల రిజిస్ట్రేషన్లు యథేచ్ఛగా సాగుతున్నాయి. అక్రమంగా క్రయ, విక్రయాలు జరిగిన వేలాది ప్లాట్లను క్రమబద్ధీకరించాల్సి ఉంది. జిల్లాలో ఏడు మున్సిపాల్టీలు(ప్రస్తుత కార్పొరేషన్‌తో కలిపి) ఉండగా.. మందమర్రి పట్టణం ఏజెన్సీ పరిధిలో ఉంది. మున్సిపాల్టీల్లో 39వేల దరఖాస్తులు రాగా.. ఇందులో 9వేలకు పైగా నిషేధిత జాబితాలో ఉన్నాయి. ఇక 16మండలాల్లో 311 గ్రామ పంచాయతీల్లో 15వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. రెండు వేలకు పైగా నిషేధిత జాబితాలో ఉన్నాయి. మిగతా అర్జీలు పలు దశల్లో ఉన్నాయి. గ్రామాలు, మున్సిపాలిటీల్లో ప్లాట్ల యజమానుల నుంచి స్పందన, సరైన పత్రాలు లేకపోవడం, పట్టణ పరిధిలో సిబ్బంది కొరతతో నత్తనడకన సాగింది. తాజాగా ప్రభుత్వం మొత్తం ఫీజులో 25శాతం రాయితీ ప్రకటించడం, వచ్చే నెల31లోపు గడవు విధించడంతో అధికారులు వేగంగా పరిష్కరించాలని చూస్తున్నారు. ఎప్పటికప్పుడు ఈ పథకంపై పర్యవేక్షణ చేస్తుండడంతో ఫీజు చెల్లింపులతో సర్కారుకు ఆదాయం వస్తుందనే అంచనా వేస్తున్నారు. జిల్లాలో ఈ నెల 28లోపు పరిశీలనలు పూర్తి చేసేలా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశాలు జారీ చేశారు. అడ్డగోలుగా అనధికార వెంచర్లు మంచిర్యాల, లక్షెట్టిపేట సబ్‌రిజిస్ట్రార్ పరిధి మండలాల్లో ఇబ్బడిముబ్బడిగా వెంచర్లు వెలిశాయి. గ్రామాల్లోనూ అనధికారికంగా ప్లాట్లు అమ్ముతున్నారు. వీటిని క్రమబద్ధీకరణ చేసుకుంటేనే నిర్మాణ అనుమతులు వస్తాయి. ఈ క్రమంలో ప్లాట్లను రెగ్యులరైజ్ చేసి ఖజానా నింపాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2020లోనే జీవో విడుదల చేసింది. ఈ పథకం అమలుపై కోర్టుల్లో కేసులు దాఖలయ్యాయి. ఆ తర్వాత మళ్లీ పరిశీలనలు జరిగినా, చాలా తక్కువ మంది మాత్రమే ఫీజులు చెల్లించారు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గతేడాది నుంచే ఎల్ఆర్ఎస్ కదలిక వచ్చింది. కానీ చాలామంది ప్లాట్ల క్రమబద్ధీకరణకు ముందుకు రావడం లేదు. దీంతో సర్కారు తాజాగా వేగంగా క్రమబద్ధీకరించేందుకు మొత్తం ఫీజులో 25శాతం రాయితీ కల్పిస్తూ వచ్చే నెల 31వరకు గడువు విధించింది. పాత అర్జీలతోపాటు కొత్తగా దరఖాస్తులు తీసుకునే వెసులుబాటతో మరిన్ని అర్జీలు వచ్చే అవకాశం ఉంది. రియల్టర్లకు ఊరటే.. ఈసారి ప్లాట్ల యజమానులతోపాటు రియల్టర్లకు ఊరట కలుగుతోంది. తాజా జీవో ప్రకారం 2020 ఆగస్టు 26నాటికి ఏదైనా వెంచరులో కనీసం పదిశాతం ప్లాట్లు అమ్మకాలు జరిగి, మిగిలిన పోయిన ప్లాట్లకు కూడా ఎల్ఆర్ఎస్ వర్తింపజేస్తామని ప్రకటించింది. దీంతో జిల్లాలో రియల్టర్లకు ఊరట కలుగుతోంది. చాలాచోట్ల ప్లాట్లు అమ్మకుండా మిగిలి ఉన్నాయి. గతంలో దరఖాస్తు చేయకున్నా, మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఆ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు ఎల్ఆర్ఎస్తో చేసే అవకాశం ఏర్పడింది. అయితే ప్లాటు మార్కెట్ విలువ ప్రకారం లెక్కగట్టి ఆ మొత్తాన్ని భూ యజమాని నుంచి వసూలు చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో ఈ ఫీజు భారీగానే ఉండే అవకాశం ఉంది. నిషేధిత జాబితాల్లోనూ ప్లాట్లు కొన్ని చోట్ల సాగునీటి, ప్రభుత్వ, భూముల్లోనూ ప్లాట్లు వెలిశాయి. వాటిని దరఖాస్తుల నుంచి తొలగించారు. మున్సిపాలిటీల్లో 9500, పంచాయతీల్లో 2500అర్జీలు నిషేధిత భూముల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అధికారులు ప్రతీ ప్లాటును క్షేత్రస్థాయిలో పరిశీలించి, జియోట్యాగ్ చేసి, యజమాని ఫోటోతో సహా అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత పట్టణాల్లో కమిషనర్లు, గ్రామాల్లో పంచాయతీ అధికారులు ధ్రువీకరించాకే ఫీజు చెల్లించాలి. -
మెరుగైన వైద్య సేవలందించాలి
చెన్నూర్: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ప్రభుత్వాలు ఆస్పత్రులకు అన్ని వసతులు కల్పిస్తున్నాయని పాపులేషన్ ఆఫ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ కేంద్ర బృందం సభ్యులు వైజాగ్‌కు చెందిన డాక్డర్ రమణ, శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం చెన్నూర్ సామాజిక ఆరోగ్య కేంద్రంతోపాటు మండలంలోని అంగ్రాజుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అస్నాద్లోని ఆరోగ్య ఉప కేంద్రాలను సందర్శించారు. రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించి వారితో మాట్లాడారు. వైద్యుడు రమణ మాట్లాడుతూ గతంతో పోలిస్తే ఆస్పత్రుల్లో సౌకర్యాలు మెరుగయ్యాయని తెలిపారు. ఆస్పత్రుల నిర్వహణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల సీహెచ్‌వో వెంకటేశ్వర్, డీపీఎంవో ప్రశాంతి, ఎంసీహెచ్ పీవో కృపాభాయి, హెచ్‌సీవో జగదీశ్, వైద్యులు సత్యనారాయణ పాల్గొన్నారు. -
చాలా సంతోషంగా ఉంది
చిన్నప్పటి నుంచి టీచర్ ఉద్యోగం ఓ కల. డీఎస్సీ–2008లో టీచర్ ఉద్యోగం వచ్చినట్లే వచ్చి చేజారిపోవడంతో అప్పటి నుంచి ప్రైవేట్ టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. ప్రభుత్వ టీచర్ కంటే ప్రైవేట్‌లో పని ఒత్తిడి ఎక్కువ. ఆదివారం, సెలవుదినం పాటించడం అక్కడ తక్కువే. సరిపోని జీతాలతో ఇన్నాళ్లు ఎన్నో ఇక్కట్లు పడ్డాం. ఇన్నేళ్ల తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్(కాంట్రాక్టు పద్ధతిన) బాధ్యతలు నిర్వహించడం సంతోషంగా ఉంది. వేమనపల్లి మండలం ఎంపీపీఎస్ గోర్లపల్లి పాఠశాలలో నాకు పోస్టింగ్ ఇచ్చారు. – యుగంధర్, ఎంపీపీఎస్ గోర్లపల్లి, మం: వేమనపల్లి -
ఎమ్మెల్సీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి
● రాష్ట్ర ఎలక్ట్రోరల్ అధికారి సుదర్శన్రెడ్డిమంచిర్యాలఅగ్రికల్చర్: పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎలక్ట్రోరల్ అధికారి సుదర్శన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి ఇతర అదనపు ఎన్నికల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 27న ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ నిర్వహించాలని, పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. ఈ నెల 25లోగా ఓటరు సమాచార స్లిప్పులు పంపిణీ చేయాలని తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు 40 పోలింగ్ కేంద్రాలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ 18 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. డీసీపీ ఏ.భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్, మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలు శ్రీనివాస్‌రావు, హరికృష్ణ, ఎన్నికల పర్యవేక్షకులు ప్రసాద్ పాల్గొన్నారు. -
తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు
బెల్లంపల్లి: మున్సిపాలిటీలో వేసవి కాలంలో తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. రిజిష్టర్లు, ప్రజాపాలన సేవ కేంద్రాలను పరిశీలించి మున్సి పల్ కమిషనర్ కే.శ్రీనివాసరావు, అధికారులు, సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ ఇంటికి నిరంతరాయంగా నీటి సరఫరా చేయాలని, పంపు మోటార్లు, నీటి ట్యాంకులు మరమ్మతులు చేయించాలని, పైపులైన్ల లీకేజీలను అరికట్టాలని వివరించారు. చదువు గౌరవాన్ని పెంచుతుంది.. కాసిపేట: సమాజంలో చదువు గౌరవాన్ని పెంచుతుందని, ప్రతి ఒక్కరూ చదువు నేర్చుకోవాలని జి ల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ముత్యంపల్లి రైతువేదికలో వంద రోజుల్లో వందశాతం అక్షరాస్యత కార్యక్రమంలో భాగంగా అక్షరాస్యత కేంద్రాలు, కుట్టు శిక్షణ కేంద్రాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం మొత్తం మన వైపు చూసేలా వందరోజుల్లో వందశాతం అక్షరాస్యత విజయవంతం చేయాలన్నారు. గ్రామ పంచాయతీకి రెండు చొప్పున కుట్టుమిషన్లు, వయోజనులకు పలకలు పంపిణీ చేసి అక్షరాలు రాయించారు. ఈ కార్యక్రమంలో ఓరియంట్ హెచ్ఆర్ జీఏం ఆనంద్ కులకర్ణి, డీఆర్డీవో కిషన్, డీపీవో వేంకటేశ్వరరావు, మెప్మా పీడీ రవూఫ్‌ఖాన్, తహసీల్దార్ భోజన్న, ఎంపీడీవో సత్యనారాయణసింగ్, వయోజనవిద్య కోఆర్డినేటర్ బండ శాంకరీ, ఓరియంట్ అధికారులు బాల గిరిధర్, తిరుపతి పాల్గొన్నారు. పాఠశాలల తనిఖీ మండలంలోని తాటిగూడ దిశ మోడల్ స్కూల్, కో నూర్ ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ తనిఖీ చేశా రు. అమ్మ ఆదర్శ పాఠశాలల నిధులతో చేపట్టిన పనులు పూర్తికాక పోవడానికి కారణాలు తెలుసుకున్నారు. దిశ మోడల్ స్కూల్లో విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.● కలెక్టర్ కుమార్ దీపక్ -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. గుడిపేట శివారులో మంచిర్యాల వైపు వెళ్తున్న కారు లక్సెట్టిపేట వైపు వెళ్తున్న రెండు బైక్‌లను అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. బైక్ నడుపుతున్న మంచిర్యాలలోని హైటెక్‌సిటీ కాలనీకి చెందిన ఇందారపు శివప్రియ(49) అక్కడికక్కడే మృతి చెందింది. మరో బైక్ నడుపుతున్న చెన్నూర్ మండలం లింగంపల్లి పంచాయతీ కార్యదర్శి ఎండీ నయీమోద్దీన్కు తీవ్రగాయాలయ్యాయి. అతన్ని 108లో మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ యన పరిస్థితి విషమంగా ఉంది. కాగా, శివప్రియ లక్సెట్టిపేట బాలికల గురుకుల పాఠశాలలో సంగీత ఉపాధ్యాయురాలిగా పని చే స్తోంది. రాత్రి విద్యార్థుల స్టడీ అవర్స్ కోసం పాఠశాలకు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. భర్త శివప్రసాద్ రెండేళ్ల క్రితం మృతి చెందగా శివప్రియకు 9వ తరగతి చదువుతున్న ఒక కుమారుడు ఉన్నా డు. రోడ్డు ప్రమాదం ఘటనతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఏర్పడగా, ఎస్సై గోపతి సురేశ్ బందోబస్తు చర్యలు చేపట్టారు. ప్రమాద వివరాలపై ఆరా తీశారు. ఘటనకు కారణమైన కారుడ్రైవర్ సత్తయ్య పారిపోయే ప్రయత్నం చేయగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. -
‘ప్రభుత్వరంగ సంస్థలు నిర్వీర్యం’
నస్పూర్: సింగరేణి, విద్య, వైద్యం, ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని సింగరేణి గోదావరిలోయ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు అరుణోదయ విమలక్క విమర్శించా రు. నస్పూర్–శ్రీరాంపూర్ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవా రం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 23న గోదావరిఖనిలోని రాజ్యలక్ష్మి గార్డెన్లో ఏఐఎఫ్టీయూ రాష్ట్ర సాధారణ సమావేశం ని ర్వహించనున్నట్లు తెలిపారు. శ్రీరాంపూర్ ఏరి యా నుంచి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తూ కా ర్మికుల హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. సింగరేణిలో ప్రైవేటికరణను ప్రోత్సహిస్తూ యాంత్రీకరణను పెంపొందించి కార్మికుల సంఖ్యను కుదించారని, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామని తెలిపారు. ఈ స మావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు జి.రాములు, ప్ర ధాన కార్యదర్శి మాతంగా రాయమల్లు, కోశాధికారి మేకల పోషమల్లు, నాయకులు రాజేశ్వరి, రత్నకుమారి, రేగుంట రాజు, సదానందం, తదితరులు పాల్గొన్నారు. -
హమ్మయ్య..రైలొచ్చిందోచ్
● భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ పునఃప్రారంభం ● నేటి నుంచి యథావిధిగా రాకపోకలు బెల్లంపల్లి: సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్‌నగర్–సికింద్రాబాద్ మధ్య రాకపోకలు సాగించే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ (17233/74) రైలు ఎట్టకేలకు శుక్రవారం నుంచి పునఃప్రారంభమైంది. రైల్వే అధికారుల అనాలోచిత విధానాల వల్ల గడిచిన ఐదు రోజులు అర్ధాంతరంగా రద్దయిన సంగతి తెలిసిందే. ఖమ్మం రైల్వేస్టేషన్ వద్ద నాన్ ఇంటర్ లాకింగ్ పనులు చేపట్టడానికి వీలుగా ఈనెల 10 నుంచి 20వ తేదీ వరకు ఏకంగా 30 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసి, పలు సూపర్‌ఫాస్ట్ రైళ్లను దారి మళ్లించడంతోపాటు మరికొన్నింటిని ఆలస్యంగా నడిపించారు. అయితే ఆ పనులతో భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌కు ఏమాత్రం సంబంధం లేకపోయిన గోల్కోండ ఎక్స్‌ప్రెస్ రైలుతో ఉన్న అనుబంధాన్ని పరిగణలోకి తీసుకుని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయాన్ని ఉత్తర తెలంగాణ రైల్వే ఫోరం సభ్యులు, ప్రయాణికులు వ్యతిరేకించారు. ‘ఎక్స్ ’వేదికగా పోస్టులు పెట్టి హోరెత్తించారు. దీంతో ద. మ. రైల్వే అధికారులు ఓ మెట్టు దిగివచ్చి భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌కు కొంత సడలింపు ఇచ్చారు. ఈనెల 14వ తేదీ వరకు యధాతథంగా నడిపించి 15 నుంచి నిలిపివేశారు. అంతకుముందు ప్రకటించినట్లుగానే ఈనెల 16 నుంచి 20 తేదీ వరకు రైలు రాకపోకలను స్తంభింపజేశారు. నాన్ ఇంటర్ లాకింగ్ పనులు పూర్తికావడంతో తిరిగి ఈనెల 21 నుంచి రైలు పునఃరుద్ధరణకు నిర్ణయం తీసుకున్నారు. -
కాగితపు రహిత సేవలకు శ్రీకారం
శ్రీరాంపూర్: ఉద్యోగుల సమస్త సమాచారం కాగిత రహితంగా ఉండేలా సేవలకు శ్రీకారం చుట్టామని శ్రీరాంపూర్ జీఎం ఎం.శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం సీసీసీలోని సింగరేణి గెస్ట్‌హౌస్ కాన్ఫరెన్స్ హాల్లో ఏరియాలోని అధికారులకు సాప్, ఎఫ్‌ఎల్‌ఎం(ఫైల్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్) అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు సాప్ సేవలు వినియోగించుకున్నామని, మరింత సులభతరం, కచ్చితత్వం కోసం ఎఫ్ఎల్ఎంను సద్విని యోగం చేసుకోవాలని తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి ఈ పరిజ్ఞానం పూర్తిగా అందుబాటులోకి రానుంద ని తెలిపారు. సంస్థ, ఉద్యోగుల సమస్త సమాచారం కంప్యూటర్లో నిక్షిప్తం చేస్తామని పేర్కొన్నారు. డీజీఎం(ఐటీ) హరిప్రసాద్, మేనేజర్ ఎం.కిరణ్‌కుమార్, సీనియర్ ప్రోగ్రామర్ శంకర్ సాంకేతికతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జీఎం సివిల్ శ్రీనివాసరావు, బెల్లంపల్లి రీజియన్ క్వాలిటీ జీఎం సుశాంత్, ఏరియా ఎస్ఓటు జీఎం ఎన్.సత్యనారాయణ, శ్రీరాంపూర్ ఓసీపీ అధికారి టీ.శ్రీని వాస్, ఏజీఎం ఫైనాన్స్ మురళీధర్, ఏజీఎం సివిల్ బీ.నవీన్, డీజీఎంలు, తదితరులు పాల్గొన్నారు. -
చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని లక్సెట్టిపేట కోర్టు సీనియర్ సివిల్ జడ్జి అర్పిత మారంరెడ్డి అన్నారు. శుక్రవారం దొనబండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పదవ తరగతి పరీక్షలకు ఏ విధంగా సమాయత్తం కావాలో వివరిస్తూ విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదవాలని పేర్కొన్నారు. అనంతరం పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది తులా ఆంజనేయులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జి.హన్మాండ్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
పత్తి కొనుగోళ్లు సజావుగా సాగేందుకు చర్యలు
చెన్నూర్: పత్తి కోనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సజావుగా సాగేందుకు చర్యలు తీసుకుంటానని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. శుక్రవారం రాత్రి చెన్నూర్‌లోని సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి రైతులతో మాట్లాడారు. సీసీఐ కేంద్రాన్ని పునఃప్రారంభించినందుకు ఎంపీకి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని సీసీఐ కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పత్తి చివరి వరకు కొనుగోళ్లు చేపట్టే విధంగా చూస్తానని చెప్పారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు రఘునాథ్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు హిమవంతరెడ్డి, రైతులు పాల్గొన్నారు. -
టవరెక్కి భర్త హల్చల్
● భార్య కాపురానికి రావడం లేదని.. ● ఉట్నూర్‌లో ఘటన ఉట్నూర్‌రూరల్: భార్య కాపురానికి రా వడం లేదని భర్త టవరెక్కి హల్చల్ చేశా డు. సీఐ మోగిలి కథ నం ప్రకారం..మండ ల కేంద్రానికి చెందిన షకీల్ ఆయన భార్య కు గతకొన్నినెలలుగా గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో కుమురం భీం జిల్లా కెరమెరి మండల కేంద్రంలోని పుట్టింటికి వెళ్లి తిరిగిరాలేదు. భార్య కాపురానికి రావడం లేదని ఆవేదన చెందిన షకీల్ మండల కేంద్రంలోని అంగడిబజార్లోని టవరెక్కి ఆందోళన చేశాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు అక్కడికి చేరుకుని అతనికి సర్ది చెప్పినా వినలేదు. భార్యను పిలిపించడంతో టవర్ నుంచి దిగివచ్చాడు. -
ప్రతీ ఒక్కరికి ఆధార్ కార్డు ఉండాలి
● ఆధార్ డిప్యూటీ డైరెక్టర్ చైతన్యరెడ్డిమంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు కలిగి ఉండాలని యుఐడీఏఐ(ఆధార్) డిప్యూటీ డైరెక్టర్ చైతన్యరెడ్డి అన్నారు. శుక్రవారం వర్చువల్ విధానం ద్వారా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఏ.భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్, జిల్లా స్థాయి ఆధార్ మాని టరింగ్ కమిటీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ డైరెక్టర్ చైతన్యరెడ్డి మాట్లాడు తూ 2025 జనవరి నాటికి 15,953 మంది ఐదేళ్లలోపు పిల్లలు, 99,769 మంది 5నుంచి 18ఏళ్లలోపు బాలబాలికలు, 5,08,373 మంది 18 ఏళ్లు పైబడిన వారికి ఆధార్ కార్డు జారీ చేసిన ట్లు తెలిపారు. పిల్లలు జన్మించిన వెంటనే ఆసుపత్రి ద్వారా జనన ధ్రువీకరణ పత్రం తీసుకో వాలని, పిల్లలకు టీకాలు వేసే సందర్భంలో ఆ ధార్ కిట్ ద్వారా ఎన్‌రోల్‌మెంట్‌ను ప్రోత్సహించాలని అన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జనన ధ్రువీకరణ పత్రాల జారీలో శ్రద్ధ వహించాలని, ఆధార్ కార్డులో మార్పులో జనన ధ్రువీకరణ పత్రానికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. -
మంచుకొండల్లో మనోడు
● హిమాలయాలను అధిరోహించిన నిర్మల్ యువకుడు ● 12,500 అడుగుల ట్రెకింగ్ చేసిన ఆదిత్య నిర్మల్‌ఖిల్లా: జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువకుడు హిమాలయ పర్వతాల్లోని కేదరికంఠ్్, సమ్మిట్ క్యాంప్ తదితర శిఖరాలను అధిరోహించాడు. జిల్లా కేంద్రంలోని బేస్తవార్‌పేట కాలనీకి చెందిన న్యాయవాది లక్కాకుల తుకారం కుమారుడు ఆదిత్య ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రంలోని ఎల్పీయూ కళాశాలలో ఎంసీఏ అభ్యసిస్తున్నాడు. ఈనెల 8న ఇతను వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 300 మందితో కలిసి మంచు కొండల్లోని హిమాలయ పర్వత శిఖరాలను అధిరోహించే ప్రయత్నం మొదలుపెట్టాడు. 12న దాదాపు 12,500 అడుగుల ఎత్తున ఉన్న సమ్మిట్ క్యాంప్‌నకు చేరుకున్నాడు. విపరీతమైన మంచు, ఎముకలు కొరికే చలి మధ్యన ఐదు రాత్రులపాటు శ్రమించి లక్ష్యాన్ని చేరుకున్న ట్లు తెలిపాడు. తెలంగాణ నుంచి 8 మంది వరకు లక్ష్యాన్ని చేరుకోగా ఇందులో నిర్మల్ జిల్లా వాసి ఉండడం విశేషం. ఆదిత్య గతంలోనూ బద్రీనాథ్, కేదరీనాథ్, వైష్ణోదేవి ఆలయాలను కాలినడకన సందర్శించారు. పర్వతారోహణ పూర్తయిన అనంతరం యూనివర్సల్ అడ్వెంచర్స్ వారితో ప్రత్యేక ధ్రువీకరణపత్రాన్ని స్వీకరించారు. రాబోయే రోజుల్లో ఎవరెస్టు శిఖరం ఎక్కడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు. -
తండావాసి..శాస్త్రవేత్తగా
● మహాతండాకు చెందిన ఆకాశ్ ● అభినందించిన గ్రామస్తులు నార్నూర్: అతనికి కాన్వెంట్ చదువులంటే తెలియదు. కార్పొరేట్ కళాశాలలో చేరలేదు. లక్షల రూపాయలు వెచ్చించి శిక్షణ పొందలే దు. పట్టుదలతో చదివి తన కల సాకారం చేసుకుని శాస్త్రవేత్త అయ్యి యువతకు ఆదర్శంగా నిలిచాడు. ఆయనే నార్నూర్ మండలంలోని మహాగావ్ తండాకు చెందిన చౌహాన్ ఆకాశ్. ప్రతిష్టాత్మకమైన రీసెర్చ్ అసోసియేట్ సైంటిస్ట్ సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్ టెక్నాలజీ (సీ–మెట్), హైదరాబాద్‌కు ఎంపికయ్యాడు. 15 రోజుల క్రితం శాస్త్రవేత్తగా విధులు చేరాడు. ఈయన తల్లిదండ్రులు జీజాబా యి, ప్రహ్లాద్. వీరికి ఇద్దరు సంతానం. వ్యవసా యం చేస్తూ వారిని కష్టపడి చదివించారు. చిన్న కుమారుడైన ఆకాశ్ 1 నుంచి పదో తరగతి వర కు నార్నూర్ ప్రభుత్వ పాఠశాలలో చదివాడు. ఐటీడీఏ సహకారంతో హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తిచేశాడు. ఏఐఈఈఈ పరీక్ష రాసి ఆలిండియా స్థాయిలో 178వ ర్యాంకు సాధించి వరంగల్ నిట్‌లో బీటెక్ పూర్తిచేశాడు. అనంతరం హైదరాబాద్ సెంటర్ యూనివర్సిటీలో చేరి మెటీరియల్ ఇంజినీరింగ్‌లో ఐదేళ్లపాటు పరిశోధన చేశాడు. ప్రస్తుతం సీ–మెట్లో రీసెర్చ్ అసోసియేట్, సైంటిస్టుగా విధులు నిర్వహిస్తున్నాడు. తండా నుంచి శాస్త్రవేత్తగా ఎదిగిన ఆకాశ్‌ను గ్రామస్తులు అభినందించారు. -
‘ఇంటిగ్రేటెడ్’కు శ్రీకారం
● ఇక యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లు ● అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున.. ● ఉమ్మడి జిల్లాలో 10 చోట్ల స్థలాల గుర్తింపు ● 2,500 మందికి విద్యనందించేలా వసతులుకై లాస్‌నగర్: నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు శ్రీకారం చుట్టింది. ఒక్కో పాఠఽశాలలో 2500 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు అన్ని సౌకర్యాలతో నాణ్యమైన విద్య అందించాలని సంకల్పించింది. ఇందుకోసం అసెంబ్లీ నియోజకవర్గానికో పాఠశాలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఈ మేరకు అవసరమైన స్థలాలను గుర్తించాల్సిందిగా కలెక్టర్లను ఆదేశించింది. ఇందులో భాగంగా రాష్ట్ర ఇంటర్మీడియెట్ బోర్డు కమిషనర్, ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి కృష్ణ ఆదిత్య బుధవారం స్వయంగా ఆదిలాబాద్‌కు చేరుకున్నారు. ఉమ్మడి జిల్లా కలెక్టర్లతో స్థలాల ఎంపికపై సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. వారి ఆదేశాలకు అనుగుణంగా పది నియోజకవర్గాల్లో ఆయా జల్లాల అధికారులు అవసరమైన స్థలాలను గుర్తించారు. వివరాలతో కూడిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి నివేదించారు. రాష్ట్ర సర్కారు తదుపరి ఆదేశాలకు అనుగుణంగా పరిపాలన మంజూరు అనుమతులు లభించిన వెంటనే పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. రూ.200 కోట్లతో భవనాల నిర్మాణం పేద విద్యార్థులకు ఈ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు క్రీడలు, నైపుణ్యశిక్షణ అందించనున్నారు. ఉమ్మడి జిల్లాలో పది అ సెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేయనున్నారు. తరగతి గదులు, వసతిగృహాలు, ఆట స్థ లం వంటి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ఒక్కో పాఠశాలను 20 ఎకరాల విస్తీర్ణంలో ని ర్మించనున్నారు. అత్యాధునిక హంగులతో భవన నిర్మాణాలు చే పట్టనున్నారు. రూ.200 కోట్ల వ్య యంతో చేపట్టనున్న ఈ నిర్మాణా లను వచ్చే రెండేళ్లలో పూర్తి చేసేలా కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. అవసరమైన స్థలాలను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికారులు ఇప్పటికే ఎంపిక చేశా రు. ఆయా జిల్లాల కలెక్టర్ల పర్యవేక్షణలో స్థలాల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు టీజీఈడబ్ల్యూఐడీసీ ఈఈ అశోక్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గుర్తించిన స్థలాల వివరాలు నియోజకవర్గం గుర్తించిన ప్రాంతం మండలంఆదిలాబాద్ నిషాన్ఘాట్ ఆదిలాబాద్‌రూరల్ బోథ్ అడెగామ ఇచ్చోడ ఖానాపూర్ పులిమడుగు ఉట్నూర్ నిర్మల్ సిర్గాపూర్ దిలావర్పూర్ ముథోల్ భైంసా భైంసా మంచిర్యాల రెబ్బెనపల్లి దండేపల్లి బెల్లంపల్లి గురుజాల బెల్లంపల్లి చెన్నూర్ సోమన్‌పల్లి చెన్నూర్ ఆసిఫాబాద్ ఇందాని వాంకిడి సిర్పూర్ చెడ్వాయి పెంచికల్పేట్ -
ఏజెన్సీలో దొంగల హల్చల్
నార్నూర్: ఏజెన్సీ ప్రాంతంలో దొంగలు హల్చల్ చేస్తున్నారు. రాత్రి సమయంలో దొంగలు షాపుల షటర్ తాళాలు పగులగొట్టి నగదును ఎత్తుకెళ్తున్నారు. నార్నూర్ మండల కేంద్రంలో పది రోజుల వ్యవధిలో మూడు దొంగతనాలు జరిగాయి. వరుస ఘటనలు చోటుచేసుకుంటున్న పోలీసులు పెట్రోలింగ్ చేయడం లేదని విమర్శలు వస్తున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. ఉట్నూర్ మండలం ఎక్స్‌రోడ్ వద్ద రెండు వైన్స్‌షాపులు, గాదిగూడ మండలం లోకారి(కే) గ్రామంలో ఫర్టిలైజర్, రెండు కిరాణషాపుల్లో గురువారం రాత్రి చోరీ జరిగింది. దొంగలు షాపుల షటర్ తాళాలు పగులగొట్టారు. ఫర్టిలైజర్ షాపులో రూ.60 వేలు, కిరాణషాపుల్లో రూ.60 వేల నగదును ఎత్తుకెళ్లారని బాధితులు సంజీవ్‌గౌడ్, ప్రహ్లాద్ తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు గాదిగూడ్ ఎస్సై నాగ్నాథ్ తెలిపారు. ఇంద్రవెల్లి: మండలంలోని ఈశ్వర్‌నగర్ సమీపంలో జై దుర్గ వైన్స్షాపులో గురువారం రాత్రి చోరీ జరిగింది. నిర్వాహకుడు ముండే బాబు..షాపు బంద్ చేసి ఇంటికి వెళ్లాడు. దొంగలు గడ్డపారతో షెటర్ తాళం పగులగొట్టి సీసీ కెమెరాలు, మానిటర్‌ను ధ్వంసం చేశారు. మందు బాటిళ్లతోపాటు కౌంటర్లో నగదును ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న ఎస్సై సునీల్ శుక్రవారం ఉదయం వైన్స్ షాపును పరిశీలించారు. సీసీ ఫుటేజీని నిర్వాహకులు పరిశీలించి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
క్లుప్తంగా
బాల్యవివాహాన్ని అడ్డుకున్న అధికారులు కుభీర్: మండలంలోని జుమ్డ గ్రామంలో బాల్యవివాహాన్ని పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్నారు. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. వివరాలు ఇలా ఉన్నా యి.. భైంసా మండలం మహగాం గ్రామానికి చెందిన మైనర్ బాలిక(15)కు కుభీర్ మండలం జుమ్డ గ్రామానికి చెందిన యువకుడితో శుక్రవారం పెళ్లి చేయాలని నిశ్చయించారు. సమాచారం అందుకున్న ఐసీడీఎస్ అధికారులు, పోలీసులతో కలిసి వెళ్లి బాల్యవివాహాన్ని అడ్డుకున్నారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ సుజాత, ఏఎస్సై యశ్వంత్, తదితరులు ఉన్నారు. చిట్‌ఫండ్‌లో మోసం ● బాధితురాలి ఫిర్యాదుతో నలుగురిపై కేసు మంచిర్యాలక్రైం: జిల్లాకేంద్రంలోని భవిత చిట్‌ఫండ్ యాజమాన్యం డిపాజిటర్లకు డబ్బులు తిరిగి చెల్లించడంలో మోసం చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో నలుగురిపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం..జిల్లా కేంద్రంలోని హైటెక్‌సిటీలో ఉంటున్న హానోగు హారిక.. భవిత చిట్‌ఫండ్‌లో రూ.5 లక్షల చిట్టీ వేసింది. నెలకు రూ.10 వేల చొప్పున 50 నెలలు కట్టాల్సి ఉండగా 41 నెలలు రూ.4.10 లక్షలు చెల్లించింది. చిట్టీ ఎత్తుకునేందుకు 2022 అక్టోబర్‌లో కార్యాలయానికి వెళ్లగా అప్పటికే మూసివేశారు. యజమానుల సెల్ నంబర్లు తెలుసుకుని సంప్రదిస్తే కట్టిన డబ్బులు చెల్లిస్తామని కాలాయాపన చేశారు. తర్వాత చెక్కులు ఇవ్వగా చెక్‌బౌన్స్ అయ్యాయి. వారికి ఫోన్ చేస్తే స్విచ్ఛాప్ రావడంతో బాధితురాలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. యజమానులు మంచిర్యాలకు చెందిన గుండ ప్రకాశ్‌రావ్, తాడిపల్లి శ్రీనివాస్‌రావు, మేనేజర్లు సుషాంత్, సతీశ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. చోరీకి యత్నించిన నిందితుడి రిమాండ్ కై లాస్‌నగర్: మహిళ మెడలో నుంచి పుస్తెలతాడు చోరీకి యత్నించిన నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు టూటౌన్ ఎస్సై విష్ణుప్రకాశ్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. పట్టణంలోని తిలక్‌నగర్‌కు చెందిన చిట్యాల విజయ ఈనెల 17న కాలనీలోని ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న తన మనుమడికి మధ్యాహ్న భోజనం చేయించి తిరిగివస్తుంది. తలమడుగు మండలం రుయ్యాడి గ్రామానికి చెందిన బేర వంశీ బైక్‌పై వచ్చి ఆమె మెడలో పుస్తెలతాడును లాక్కెళ్లేందుకు యత్నించాడు. మహిళ కేకలు వేయడంతో పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం స్థానిక నెహ్రుచౌక్లో వాహనాలు తనిఖీ చేస్తుండగా నిందితుడిని అరెస్ట్ చేసినట్లు టూటౌన్ ఎస్సై తెలిపారు. -
డబ్బుల కోసం వేధించిన వ్యక్తికి ఏడాది జైలు
నిర్మల్‌టౌన్: డబ్బుల కోసం వేధించిన వ్యక్తికి ఏడాది జైలుశిక్షతోపాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ నిర్మల్ న్యాయస్థానం శుక్రవారం తీర్పునిచ్చింది. కోర్టు సమన్వయల అధికారి డల్లుసింగ్ కథనం ప్రకారం..జిల్లాకేంద్రంలోని శాస్త్రినగర్ కాలనీకి చెందిన నర్సయ్య టైలర్‌గా పనిచేస్తున్నాడు. అవసరం నిమిత్తం లక్ష్మణచాంద మండలం కనకాపూర్‌కు చెందిన సతీశ్ వద్ద రూ.50 వేలు అప్పు తీసుకున్నాడు. తిరిగి రూ.39 వేలు చెల్లించాడు. మిగతా డబ్బుల కోసం సతీశ్ తరచూ టైలర్ షాపు వద్దకు వెళ్లి వేధించేవాడు. 2015 జూన్ 22న నర్సయ్య భార్య షాపులో ఉన్న సమయంలో అక్కడికి వచ్చి గొడవపడ్డాడు. ఆమెను గాయపర్చాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. అనంతరం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. పీపీ వినోద్‌రావు సాక్షులను విచారించి నేరం రుజువు చేయడంతో న్యాయస్థానం ఈ మేరకు తీర్పునిచ్చింది. -
మిగిలిన రోజులు ఉత్పత్తికి కీలకం
శ్రీరాంపూర్: వార్షిక సంవత్సరంలో మిగిలిన రోజులు బొగ్గు ఉత్పత్తికి ఎంతో కీలకమని సింగరేణి డైరెక్టర్(పీపీ) కొప్పుల వెంకటేశ్వర్లు తెలి పారు. శుక్రవారం ఆయన శ్రీరాంపూర్ ఏరి యాలో పర్యటించారు. జీఎం కార్యాలయంలో జీఎం ఎం.శ్రీనివాస్ ఇతర అధికారులతో బొ గ్గు ఉత్పత్తి లక్ష్యాలపై సమీక్షించారు. అనంత రం శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనిని సందర్శించారు. క్వారీలోకి దిగి కోల్ బెంచీలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 31నాటికి నిర్ధేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవాలని, ఇందుకోసం ప్రణాళికలు త యారు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జీఎం యన్.సత్యనారాయణ, ఓసీపీ అధికారి టీ.శ్రీనివాస్, ఇందారం ఓ సీపీ అధికారి ఏ.వెంకటేశ్వరరెడ్డి, ఇన్చార్జీ ఏరి యా ఇంజనీర్ సాంబశివరావు, గని మేనేజర్ బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు. -
మాలలను అణచివేస్తున్న సీఎం
● మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్నిర్మల్టౌన్: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ చేతిలో సీఎం రేవంత్ రెడ్డి పావుగా మారి మాలలను అణచివేస్తున్నాడని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని టీఎన్జీవోస్ భవనంలో శుక్రవారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తిగా మాదిగల పక్షంగా జరుగుతుందన్నారు. ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించకుండా ఆశాసీ్త్రయమైన 2011 జనాభా లెక్కలతో వర్గీకరణను అసెంబ్లీలో ఆమోదం చేశారని మండిపడ్డారు. వాస్తవానికి ఎస్సీల జనాభా 20% ఉందని, దానికి అనుగుణంగా రిజర్వేషన్లు 20% పెంచి వర్గీకరణ ప్రయత్నాలు చేయాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అవలంబిస్తున్న వైఖరిని ఎండగట్టి, పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమావేశలంలో జైభీమ్ సైనిక్ దళ్ రాష్ట్ర కన్వీనర్ కనకరాజు, రాజన్న, గజెల్లి లక్ష్మణ్, బొడ్డు లక్ష్మణ్, వెంకటస్వామి, పురుషోత్తం, మురళీధర్, రవి, ప్రేమ్‌సాగర్, సదానందం, సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు. -
వరి సాగు అధికం.. ఆలస్యం
● నీటితడులపై ఆందోళన ● ఆరుతడి ఆంతంతే... ● స్వల్పకాలిక పంటలపై సూచనలు కరువుమంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో యాసంగి మందకొడిగా ‘సాగు’తోంది. సీజన్ ఆరంభమై రెండు నెలలు గడుస్తున్నా ఇంకా వరినాట్లు వేయడం కనిపిస్తోంది. దీంతో కాలువల ద్వారా సాగుకు సరిపడా నీటితడులు అందుతాయో లేదోననే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. ఓ వైపు ఎండలు ముదురుతుండగా.. నాట్లు ఆలస్యంగా వేయడంతో పంట చేతికొచ్చే వరకు నీటితడులు అందుతాయా అనే సందేహాం నెలకొంది. ఇప్పటికే కొన్ని చోట్ల బోరుబావుల్లో నీటిమట్టం అడుగంటుతోంది. గతంలో నిండుకుండలా ఉన్న గోదావరి ఈ ఏడాది మేడిగడ్డ, అన్నారం బ్యారేజీ పగుళ్లతో నీటిని దిగువకు వదిలారు. దీంతో గోదావరి నదిలో నీరు లేకుండా పోయింది. కొన్ని చోట్ల గోదావరి తీర ప్రాంత రైతులు సాగుకు వెనుకడుగు వేశారు. యాసంగి సీజన్ అక్టోబర్ చివరి నుంచి ప్రారంభమై డిసెంబర్ నెలాఖరు వరకు పంటల సాగు పూర్తి కావాల్సి ఉంది. ఆశించిన స్థాయిలో ఆరుతడి పంటల సాగు కనిపించడం లేదు. వరిలో కలుపుతీత, ఎరువులు వేయడం వంటి పనులు చేస్తుండగా.. వానాకాలం పంట దిగుబడులు ఆలస్యమైన కొన్ని చోట్ల నాట్లు వేసుకుంటున్నారు. యాసంగిలో గతంలో 95శాతం దొడ్డు రకం, 5శాతం సన్నరకం వరి సాగుకు ప్రాధాన్యత ఇవ్వగా.. గత ఖరీఫ్ నుంచి సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం బోనస్ చెల్లిస్తుండడంతో ఈ యాసంగిలో సన్నరకం సాగు 40శాతానికి పెరిగింది. మొత్తంగా వరి 1,12,100 ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేయగా.. ఇప్పటివరకు 1,08,878 ఎకరాల్లో సాగైంది. మరో 60ఎకరాలు మొలక దశలోనే ఉండడంతో నెలాఖరు వరకు నాట్లు పడేలా ఉన్నాయి. కడెం ప్రాజెక్టు ఆయకట్టు, గూడెం ఎత్తిపోతల కింద సుమారు 55వేల ఎకరాల సాగు విస్తీర్ణం ఉంది. కడెం ఆయకట్టు పరిధిలో డిస్ట్రిబ్యూటరీ 30నుంచి 42వరకు 90రోజులపాటు వారాబందీ పద్ధతిలో నీరందిస్తున్నారు. సన్నరకం వరి దిగుబడికి ఎక్కువ సమయం, నీటితడులు ఎక్కువగా అవసరం ఉంటుంది. ఎండల తీవ్రత పెరిగిపోతుండడంతో జలాశయాలతోపాటు బోరుబావుల్లో నీరు అడుగుకు చేరుతోంది. ఆరుతడి అంతంతే.. డిసెంబర్లో కురిసిన అకాల వర్షాలతో రెండో పంటగా పొద్దుతిరుగుడు, పెసర, మినుము, ఉలువ పంటలు వేసుకునే అవకాశం ఉండేది. వరి సాగుకు బదులుగా తక్కువ నీటితడులతో స్వల్పకాలిక ఆరుతడి పంటలు వేసుకోవాలని, పంటమార్పిడిపై వ్యవసాయ శాఖ సూచనలు కరువయ్యాయి. వరి తర్వాత ఇతర పంటలు 10వేల ఎకరాల్లో ఉంటాయని అధికారులు అంచనా వేశారు. కానీ 3,385 ఎకరాల్లో మాత్రమే సాగయ్యాయి. ఫిబ్రవరి వరకు వరి నాట్లు వేసుకుంటే ఏప్రిల్, మేలో దిగుబడి రానుంది. ఏప్రిల్‌లో అకాల వర్షాలు ముంచేత్తే అవకాశం ఉండడంతో పంట నష్టపోయే ప్రమాదం ఉంటుందని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. పంట విస్తీర్ణం(ఎకరాల్లో)వరి 1,08,878 మొక్కజొన్న 2,884 వేరుశనగ 204 పెసలు 124 జొన్న 57 కందులు 02 నువ్వులు 21 మినుములు 09 శనగ 51 ఇతర పంటలు 33 మొత్తం 1,12,263 -
చేయి కలపని నేతలు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య గత కొంతకాలంగా సఖ్యత కొరవడింది. పాత, కొత్త నాయకుల మధ్య వర్గ పోరు నడుస్తోంది. ఇదే తీరు కొనసాగితే ఎంపీ ఎన్నికల తరహాలో పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉండడంతో అందరూ కలిసి పని చేసేలా జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క కృషి చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత లొల్లిలు ఎన్ని ఉన్నా ఎమ్మెల్సీ అభ్యర్థిని గట్టెక్కించేందుకు ఒకే వేదికపై నిలబడాల్సిన అనివార్యత ఏర్పడుతోంది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ నియోజకవర్గ పట్టభద్రుల స్థానం నుంచి పార్టీ అభ్యర్థిగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్‌రెడ్డి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంపీ ఎన్నికల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో మంత్రి సీతక్కకు ప్రతిష్టాత్మకంగా మారింది.వర్గభేదాలతో సతమతంఆసిఫాబాద్ జిల్లాలో డీసీసీ అ ధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్, ఆసిఫాబాద్ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి ఆజ్మీరా శ్యామ్‌నాయక్ మధ్య విభేదాలు బహిరంగంగానే బయటపడ్డాయి. బీఆర్ఎస్ నుంచి మా జీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చేరికతో మరింత ముదిరాయి. సిర్పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ దండే విఠల్, రావి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పార్టీ లో ఉన్నారు. ఇటీవల కోనప్ప తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంజూరు చేసిన నిధులను రద్దు చేయిస్తున్నారని ఆ వేదన వ్యక్తం చేశారు. అవసరమైతే స్వతంత్రంగానైనా పోటీ చేస్తానని బహిరంగంగానే ప్రకటించా రు. గురువా రం కాగజ్‌నగర్ పట్టణంలో జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, ఎమ్మెల్యే బొజ్జు, ఎమ్మెల్సీ అభ్యర్థి న రేందర్‌రెడ్డి తదితరులు హాజరైన ఆత్మీయ సమ్మేళనానికి మాజీ ఎమ్మె ల్యే కోనేరు కోనప్ప, నియోజకవర్గ నాయకుడు రావి శ్రీనివాస్ దూరంగా ఉండడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.మంచిర్యాలలో భిన్న పరిస్థితిమంచిర్యాల జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ ఉన్నారు. ఇక్కడ పరిస్థితి మరోలా ఉంది. డీసీసీ అధ్యక్షురాలుగా, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు సతీమణి సురేఖ ఉన్నారు. బెల్లంపల్లి, చెన్నూరు ఎమ్మెల్యేలు గడ్డం సోదరులైన వినోద్, వివేక్, పెద్దపల్లి ఎంపీగా వివేక్ తనయుడు వంశీక్రిష్ణ ఉన్నారు. జిల్లాలో పార్టీ రెండు వర్గాలుగా కొనసాగుతోంది. ముగ్గురు ఎమ్మెల్యేలు కలిసికట్టుగా ఒక్క కార్యక్రమం చేసిన దాఖలాలు లేవు. ఎవరైనా రాష్ట్ర మంత్రులు వచ్చినా ఆయా నియోజకవర్గానికే పరిమితం అవుతున్నారు. మరోవైపు ముగ్గురు ఎమ్మెల్యేలూ మంత్రి పదవి కోసం పోటీలో ఉన్నారు. దీంతో పార్టీ కేడర్ కూడా ఆయా నాయకుల అనుచర వర్గాలుగానే ఉంది.ఆదిలాబాద్ లోక్‌సభ పరిధిలో..ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో పాత, కొత్త నేతలు ఇంకా చేతులు కలపడం లేదు. బీఆర్ఎస్ నుంచి చేరిన మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ముథోల్ నుంచి మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, బోథ్ నుంచి మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పార్టీలో ఇన్నాళ్లు అంటీముట్టనట్లుగానే ఉన్నారు. ఖానాపూర్‌లో మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్, ప్రస్తుత ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మధ్య సఖ్యత లేదు. ఇక బీజేపీని వీడి మాజీ ఎంపీ సోయం బాపురావు కాంగ్రెస్‌లో చేరారు. ఆదిలాబాద్ డీసీసీ ఎంపిక ఇంకా పూర్తి కాలేదు. ఇక్కడ కంది శ్రీనివాస్, శ్రీకాంత్‌రెడ్డి, గణేశ్‌రెడ్డి పోటీ పడుతున్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజవకర్గ ఇన్‌చార్జీగా ఆత్రం సుగుణ ఉన్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరూ కలిసి కట్టుగా పని చేయాలంటూ ఆదేశాలు రావడంతో విభేదాలు పక్కనబెట్టి పని చేసేందుకు ముందుకు వస్తున్నారు. -
లోకో పైలెట్ల నిరసన దీక్ష
బెల్లంపల్లి: దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం బెల్లంపల్లిలో రైల్వే లోకో పైలెట్లు నిరసన దీక్ష చేపట్టారు. రైల్వేస్టేషన్ ఆవరణలో 36 గంటల నిరసన దీక్షను ఆల్ ఇండియా రైల్వే లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ జోనల్ వ ర్కింగ్ కమిటీ సభ్యుడు చింతల్కుమార్ ప్రా రంభించారు. ఆయన మాట్లాడుతూ రైల్వేలోని అన్ని విభాగాల్లో అమలు చేస్తున్న రన్నింగ్ అలవెన్స్ 25శాతాన్ని రన్నింగ్ స్టాఫ్‌కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బదిలీల ప్రక్రియ వేగవంతంగా నిర్వహించాలని, వారంతపు సెలవు రన్నింగ్ స్టాఫ్‌కు 46గంటలకు పెంచాలని, రెండు నైట్ డ్యూటీలు మాత్రమే ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి బ్రాంచ్ ప్రెసిండెంట్ ఏకే పటేల్, సెక్రెటరీ అజయ్‌కుమార్, నాయకులు ఏకే మౌర్య, రవీందర్ రాయ్, ఫియాన్స్ ధనవ్, రన్నింగ్ స్టాఫ్, సిబ్బంది పాల్గొన్నారు. -
పదోన్నతులు వచ్చేనా..?
సాక్షి, ఆదిలాబాద్: పార్లమెంట్ ఎన్నికలకు ముందే ఆబ్కారీ శాఖలో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ జరగాల్సి ఉండగా వివిధ కారణాలతో అప్పట్లో నిలిచిపోయింది. దీంతో పలువురు ఈ పదోన్నతుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఎక్సైజ్ అధికారి పోస్టు డిప్యూటీ కమిషనర్ (డీసీ) ఖాళీగా ఉంది. కరీంనగర్ డీసీ రవికాంత్ ఇక్కడ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో పలువురు అసిస్టెంట్ కమిషనర్లకు పదోన్నతి ఆస్కారం ఉండడంతో ఒకవేళ ప్రక్రియ జరిగితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి డీసీ పోస్టు భర్తీ అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి అసిస్టెంట్ కమిషనర్ పోస్టు కూడా ఖాళీగా ఉండగా ఆదిలాబాద్ డీపీఈవో హిమశ్రీ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఆదిలాబాద్ ఎకై ్సజ్ పరిధిలో ఎన్ఫోర్స్మెంట్, జిల్లా టాస్క్‌ఫోర్స్ విభాగాలకు సంబంధించి రెండు అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంతే కాకుండా ఉమ్మడి జిల్లాలో 2 సీఐ పోస్టులు, 9 హెడ్ కానిస్టేబుల్, 17 ఎకై ్సజ్ కానిస్టేబుళ్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతోపాటు మినిస్టీరియల్ ఉద్యోగులు కూడా పదోన్నతులు, బదిలీల కోసం ఎదురుచూస్తున్నారు.పలు ఎస్సై పోస్టులు ఖాళీ..ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలు ఎస్సై పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రధానంగా ఉమ్మడి జిల్లాకు మూడువైపులా మహారాష్ట్ర సరిహద్దుగా ఉంది. దీంతో దేశీదారు అక్రమ రవాణా జోరుగా జరుగుతోంది. దీన్ని అరికట్టడంలో కీలకంగా వ్యవహరించాల్సిన ఎస్సైతో పాటు పలు కానిస్టేబుళ్ల పోస్టులు ఖాళీగా ఉండడంతో పర్యవేక్షణ పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న అభిప్రాయం ఆ శాఖలో ఉంది. ఒకవైపు ప్రభుత్వం దేశీదారు, గుడుంబా నియంత్రణకు విస్తృతంగా చర్యలు చేపడుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆఫీసర్ల పోస్టులు ఖాళీగా ఉండడం ప్రతిబంధకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో పదోన్నతుల ప్రక్రియ ద్వారా ఖాళీ పోస్టులను భర్తీ చేయాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.ఉమ్మడి జిల్లాలో ఖాళీగా ఉన్న ఎస్సై పోస్టుల వివరాలుజిల్లా, మంజూరు, ఖాళీలుఆదిలాబాద్, 10, 07కుమురంభీం, 06, 01మంచిర్యాల, 10, 02నిర్మల్, 07, 02 -
పత్తి కొనుగోళ్లు ప్రారంభం
చెన్నూర్: చెన్నూర్ కాటన్ మిల్లులో పత్తి కొనుగోళ్లు గురువారం ప్రారంభమయ్యాయి. సీసీఐ ఆధ్వర్యంలో పది రోజులకు పైగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ‘రోడ్లపైనే తెల్ల బంగారం’ శీర్షికన ఈ నెల 18న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే గడ్డం వివేక్‌వెంకటస్వామి స్పందించారు. ఢిల్లీ లో బుధవారం కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, గిరి రాజ్‌లను కలిసి పత్తి కొనుగోళ్లు చేపట్టాలని కో రారు. మంత్రుల ఆదేశాలతో చెన్నూర్ ప్రాంతంలో పత్తి కొనుగోళ్లు చేపట్టారు. పత్తి కొనుగో ళ్లకు కృషి చేసిన ఎమ్మెల్యే, ఎంపీ చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు పత్తి మిల్లుల వద్ద పాలా భిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ చల్లా రాంరెడ్డి, కాంగ్రెస్ నాయకులు హిమవంతరెడ్డి, కుర్మ రాజమల్లగౌడ్, చింతల శ్రీనివాస్, గజ్జెల అంకగౌడ్, బుర్ర కృష్ణగౌడ్, అన్వర్, దాసరి కమలాకర్ పాల్గొన్నారు. -
బోనస్ వచ్చేదెన్నడో..?
మంచిర్యాలఅగ్రికల్చర్: వానాకాలం సీజన్ వరి ధాన్యం కొనుగోళ్లు ముగిసి 40రోజులు గడుస్తోంది. అయినా సన్నరకం ధాన్యం విక్రయించిన రైతులకు బోనస్ అందకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం గత ఖరీఫ్ సీజన్ సన్నరకం ధాన్యానికి మద్దతు ధరతోపాటు క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ చెల్లిస్తోంది. ఇప్పటివరకు 10శాతం మంది రైతులకే బోనస్ జమ కాగా.. 90శాతం మందికి ఎదురు చూపులు తప్పడం లేదు. సన్న రకం వరి ధాన్యానికి మద్దతు ధరతోపాటు బోనస్ చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో గత ఖరీఫ్ సీజన్లో దొడ్డురకంతోపాటు 50శాతం సన్నరకం వరి సాగు చేశారు. దిగుబడి వచ్చిన సన్న, దొడ్డురకం ధాన్యం సేకరణకు వేర్వేరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో పీఏసీఎస్, డీసీఎమ్మెస్, డీఆర్డీఏ, మెప్మా ఆధ్వర్యంలో 319 కొనుగోలు కేంద్రాలు అక్టోబర్ 17న ప్రారంభించి జనవరి 12వరకు ధాన్యం సేకరించారు. 18,155మంది రైతుల నుంచి 1,02,707.800 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా.. ఇందులో సన్నరకం ధాన్యం 44,344.440 మెట్రిక్ టన్నులు ఉంటుంది. దొడ్డు రకానికి సంబంధించిన మద్దతు ధర దశలవారీగా రైతుల ఖాతాల్లో జమ అయింది. కానీ సన్నరకం ధాన్యం బోనస్ 7,517మంది రైతులకు రూ.22,17,22,200 అందాల్సి ఉంది. ఇప్పటివరకు 726మందికి రూ.2,64,55,400 జమ అయింది. ఇంకా 6,791మంది రైతులకు రూ.19,52,66,800 బోనస్ నగదు జమ కావాల్సి ఉంది. ధాన్యం విక్రయించి మూడు నెలలు కావస్తున్నా బోనస్ డబ్బులు అందకపోవడంతో కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఆలస్యం చేయకుండా చెల్లించాలని రైతులు కోరుతున్నారు. ఇబ్బందుల్లో రైతులు యాసంగి సీజన్ పనులు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో చేతిలో డబ్బులు లేక రైతులు ఎరువులు, క్రిమిసంహారక మందుల కొనుగోలుకు ఇబ్బందులు పడుతున్నారు. దళారులను ఆశ్రయించి నష్టపోవద్దని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధరతోపాటు బోనస్ పొందాలని అధికారులు, ప్రజాప్రతినిధులు సూచించారని, నెలలు గడుస్తున్నా బోనస్ నగదు అందడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రైవేటు వ్యాపారులు సన్న ధాన్యాన్ని పొలాల వద్దనే క్వింటాల్‌కు రూ.2,600 నుంచి రూ.2,700 చెల్లించి కొనుగోలు చేశారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే మద్దతు ధరతోపాటు బోనస్ రూ.500 కలిపి రూ.2815 వస్తుందని, వారం రోజుల్లో నగదు జమ అవుతుందని ఆశించారు. కానీ బోనస్ నగదు అందక ఎదురు చూడాల్సి వస్తోంది. రెండు నెలలైంది..వానాకాలంలో మూడెకరాల్లో సన్నరకం వరి సాగు చేసిన. దిగుబడి వచ్చిన 80క్వింటాళ్ల ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో అమ్ముకున్నాను. మద్దతు ధర పైసలు పడ్డయి. కానీ ప్రభుత్వం ఇస్తామన్న బోనస్ క్వింటాల్‌కు రూ.500 చొప్పున పడలేదు. రెండు నెలలు గడుస్తున్నా ఇంతవరకు అందలేదు. – బొలిశెట్టి సత్తయ్య, రైతు, దండేపల్లి మూడు నెలలుగా రైతుల ఎదురుచూపులు ఇప్పటివరకు 10శాతం మంది ఖాతాల్లోనే జమ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణరైతుల ఆందోళన దండేపల్లి: సన్నరకం వరి ధాన్యానికి బోనస్ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మండలంలోని చింతపల్లి, తానిమడుగు, రెబ్బనపల్లి గ్రామాల రైతులు గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ సంధ్యారాణికి వినతిపత్రం అందజేశారు. రైతులు మాట్లాడుతూ సన్నరకం ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన రైతులకు క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ చెల్లిస్తామని చెప్పడంతో చాలామంది విక్రయించారని తెలిపారు. రెండు నెలలు గడుస్తున్నా బోనస్ డబ్బులు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోనస్ చెల్లింపుల్లో జాప్యం చేయడం సరికాదని, వెంటనే రైతులందరికీ చెల్లించాలని కోరారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిష్కరించాలి
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పాతమంచిర్యాల: ఎల్ఆర్ఎస్–2020 దరఖాస్తులు పరిశీలించి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో పట్టణ ప్రణాళిక, నీటిపారుదల, రెవెన్యూ అధికారులతో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 28లోగా పరిశీలన పూర్తి చేయాలని చెప్పారు. జిల్లాలోని ఏడు మున్సిపాల్టీల్లో 39,512 దరఖాస్తులు రాగా 9,500 నిషేధిత భూముల జాబితాలో ఉన్నట్లు గుర్తించామని, రెవెన్యూ నీటి పాదరుదల శాఖ పరిధిలో 7444 ప్రాథమిక స్థాయిలో, పట్టణ ప్రణాళిక విభాగం పరిధిలో 3790 దరఖాస్తులు 2వ స్థాయిలో ఉన్నాయని తెలిపారు. 3745 దరఖాస్తులు ఆమోదించామని, 130 మంది లబ్ధిదారులు రుసుం చెల్లించారని, మిగతా 3615 మంది రుసుం చెల్లించాల్సి ఉందని తెలిపారు. గడువులోపు పనులు చేయాలి మంచిర్యాలటౌన్: జిల్లాలో అభివృద్ధి పనులన్నీ గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని చున్నంబట్టి వాడలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, ఐబీ చౌరస్తాలో మాతాశిశు ఆసుపత్రి, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవన నిర్మాణ పనులను గురువారం ఆయన పరిశీలించారు. మంచిర్యాల మన్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజాపాలన సేవా కేంద్రాల్లో ప్రజలకు అందిస్తున్న సేవలు, కార్యాలయంలోని రిజిష్టర్లు పరిశీలించారు. పత్తి కొనుగోలు కొనసాగుతుంది.. పాతమంచిర్యాల: జిల్లాలో పత్తి కొనుగోలు కొనసాగుతుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కలెక్టరేట్లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆధార్ వెరిఫికేషన్ ఓటీపీ ప్రక్రియలో సర్వర్ డౌన్ కారణంగా పత్తి కొనుగోళ్లు నిలిపి వేశామని, ప్రస్తుతం సర్వర్ రీస్టోర్ ప్లానింగ్ ప్రక్రియ కొనసాగుతుందని, తర్వాత యధావిధిగా కొనుగోళ్లు సాగుతాయని తెలిపారు. పత్తి సాగు విస్తీర్ణం ప్రకారం టోకెన్ పద్ధతిన కొనుగోలు చేస్తారని పేర్కొన్నారు. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారుల సమన్వయంతో సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
పని చేసే వారికే ఓటు వేయండి
ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్న అటవీ అధికారులు ● ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ జన్నారం: ఇతర పార్టీలకు కొమ్ము కాసే విధంగా పని చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం బద్నాం అయ్యేలా అటవీ శాఖ అధికారులు ప్రవర్తిస్తున్నారని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆరోపించారు. ఎన్నికల సన్నాహాక సమావేశానికి హాజరైన ఆయనకు అటవీ శాఖ అధికారులపై ఫిర్యాదులు రావడంతో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాత్రిపూట వాహనాల రాకపోకల నిషేధాన్ని ఎత్తివేసినట్లు ఉన్నతాధికారులు చెబుతున్నా చెక్‌పోస్టుల వద్ద అటవీ శాఖ అధికారులు వాహనాలు నిలిపివేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతూ అర్ధరాత్రి రెండు గంటల వరకు ఫోన్లు చేస్తున్నారని తెలిపారు. ఈ విషయాన్ని సీఎం, మంత్రుల దృష్టికి తీసుకెళ్లడంతో వారి నుంచి అధికారులకు ఆదేశాలు వచ్చినా ఇక్కడి అధికారుల్లో మార్పు రావడం లేదన్నారు. టైగర్‌జోన్‌లోని ఓ అధికారి ఏకపక్ష నిర్ణయాలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని మంత్రి సీతక్కను కోరారు.జన్నారం: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం చేసుకునే వారిని కాకుండా పని చేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్‌రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. గురువారం జన్నారం మండల కేంద్రంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అధ్యక్షతన నిర్వహించిన ఎన్నికల సన్నాహాక సమావేశంలో ఆమె మాట్లాడారు. ఏడాదిలోనే 54వేలు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ, కాంగ్రెస్ కార్యకర్తలు గడప గడపకు తిరిగి పట్టభద్రులకు ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి తెలియజేయాలని సూచించారు. ప్రజలను ఇబ్బంది పెట్టే అధికారులపై చర్యలు అటవీ శాఖ అధికారులు మనుషుల కన్నా జంతువులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, మానవత్వంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మంత్రి సీతక్క అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే విధంగా అటవీ అధికారులు ప్రవర్తిస్తే ఊరుకోబోమ ని హెచ్చరించారు. ఇతర పార్టీలకు నచ్చే విధంగా పని చేసే వారి ఇళ్లకు వెళ్లి ఊడిగం చేయాలని తీవ్రంగా విమర్శించారు. ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాసత్, ఆదిలాబాద్ పార్లమెంటరీ నాయకురాలు సుగుణ, జీసీసీ చైర్మన్ తిరుపతి, ఏఎంసీ చైర్మన్ లక్ష్మీనారాయణ, పీఏసీఎస్ చైర్మన్ రవి, ఏఎంసీ వైస్ చైర్మన్ ఫసీఉల్లా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముజాఫర్ అలీఖాన్, సీనియర్ కాంగ్రెస్ నా యకులు రాజశేఖర్, గుర్రం మోహర్‌రెడ్డి, శుభా ష్‌రెడ్డి, ఇసాక్, లక్ష్మీ, శంకరయ్య పాల్గొన్నారు. ఎమ్మెల్సీగా నరేందర్‌రెడ్డిని గెలిపించాలి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క -
విద్యుత్ ఏఈఈ వసూళ్లపై విచారణ
నెన్నెల: రైతుల నుంచి అక్రమ వసూళ్లు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొని సస్పెండైన నె న్నెల విద్యుత్ ఏఈఈ మిట్టపల్లి మల్లయ్య కేసులో ఆర్థికపరమైన లావాదేవీలపై ఏసీబీ అధికా రులు గురువారం విచారణ జరిపారు. ఏసీబీ ఎస్సై కిరణ్‌రెడ్డి గొల్లపల్లి గ్రామంలో బాధిత రై తులతో మాట్లాడి వివరాలు సేకరించారు. 2024 జూన్‌లో గొల్లపల్లి గ్రామానికి చెందిన ప లువురు రైతుల నుంచి పొలాల్లో ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు కోసం ఏఈఈ డబ్బులు వసూలు చే శారని, డీడీలు కట్టినా విద్యుత్ కనెక్షన్లు ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోయాయని ఎన్పీడీసీఎల్ సీఎండీకి ఫిర్యాదు చేశారు. సీఎండీ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు అప్పట్లో ప్రాథమిక విచారణ చేపట్టి ఏఈఈ మల్లయ్య ను సస్పెండ్ చేశారు. ఈ కేసును ఏసీబీకి అప్పగించగా విచారణ చేపట్టారు. ఎవరెవరు ఎంత డబ్బులు ఇచ్చారో తెలుసుకున్నారు. వివరాలన్నీ ఉన్నతాధికారులకు సమర్పిస్తామని ఎస్సై కిరణ్‌రెడ్డి పేర్కొన్నారు. -
బావను కత్తితో పొడిచి హత్యచేసిన నిందితుడు అరెస్టు
తలమడుగు: బావను కత్తితో పొడిచి హత్యచేసిన ఘటనలో నిందితుడిని గురువారం అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ రూరల్ సీఐ పణీందర్ తెలిపారు. స్థానిక పోలీసుస్టేషన్లో ఈమేరకు వివరాలు వెల్లడించారు. మండలంలోని రుయ్యాడి గ్రామంలో ఈనెల 18న కుటుంబ కలహాలతో కోకూరు మహేందర్‌ను బామ్మర్ది కుర్మా అశోక్ కత్తితో పొడి హత్య చేశాడు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసి పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలించారు. ఆదిలాబాద్ సమీపంలో రూరల్ సీఐ, తలమడుగు ఎస్సై అంజమ్మలు నిందితుడిని పట్టుకుని కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించారు. -
చికిత్స పొందుతూ వృద్ధుడి మృతి
ఆదిలాబాద్‌రూరల్: పురుగుల మందు తాగిన వృద్ధుడు చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్సై ముజాహిద్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం..మండలంలోని చించుఘాట్ గ్రామానికి చెందిన కుమ్ర శంభు (60) కొన్నినెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆసుపత్రిలో పలుమార్లు చికిత్స చేయించుకున్నా నయం కాలేదు. తీవ్ర మనస్తాపంతో ఈనెల 17న పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. చికిత్సపొందుతూ బుధవారం మృతిచెందాడు. భార్య కుమ్ర లక్ష్మీబాయి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. తిర్యాణిలో మహిళ.. తిర్యాణి: పురుగుల మందు తాగి మహిళ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని గోయెగం గ్రామానికి చెందిన అంకతి రాజక్క(53) గత కొన్నిరోజులుగా మతిస్థిమితం సరిగా లేదు. ఈనెల 14న రాత్రి ఇంట్లో గుర్తుతెలియని పురుగుల మందు తాగింది. కుటుంబసభ్యులు గమనించి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్‌లోని ఎంజీఎంకు తరలించి చికిత్స అందించారు. చికిత్సపొందుతూ బుధవారం రాత్రి మృతి చెందింది. మృతురాలి భర్త రాజయ్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు. గాయపడిన యువకుడు.. లక్ష్మణచాంద: రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని నర్సాపూర్‌కు చెందిన కస్తూరి రాజు (18) బైక్‌పై బుధవారం నిర్మల్ నుంచి స్వగ్రామానికి వస్తున్నాడు. ఖానాపూర్ నుంచి నిర్మల్ వైపు వేగంగా వస్తున్న కారు కనకాపూర్ సమీపంలో జాతీయ రహదారిపై బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలైన రాజును నిర్మల్ ఏరియాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం బుధవారం రాత్రి నిజామాబాద్‌కు పంపించారు. చికిత్సపొందుతూ గురువారం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కారును అజాగ్రత్తగా నడిపిన పాల్దె వినోద్ కుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుమలత తెలిపారు. రాజు మృతదేహం -
గంజాయి ముఠా గుట్టురట్టు
మంచిర్యాలక్రైం:జిల్లాకేంద్రంలో కొంతకాలంగా సీసీ కెమెరాల వ్యాపారం ముసుగులో గంజాయి దందా సాగిస్తున్న ముఠా గుట్టును టాస్క్‌ఫోర్స్ పో లీసులు రట్టు చేశారు. రూ.11.75లక్షల విలువైన 23.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వి వరాలను గురువారం రామగుండం పోలీసు కమిషనరేట్‌లో సీపీ శ్రీనివాస్ వెల్లడించారు. జిల్లా కేంద్రం ఐబీ చౌరస్తాలో కొంతకాలంగా స్థానిక ఎన్టీఆర్ నగర్‌కు చెందిన సోమ ప్రవీణ్‌కుమార్ తన సీసీ కెమెరాల దుకాణంలో రాజీవ్‌నగర్‌కు చెందిన ఇరుగురాళ్ల సతీష్‌కుమార్‌తో కలిసి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని గంజాయి దందా చేస్తున్నాడు. ఇద్దరికీ గంజాయి తాగే అలవాటు ఉండడంతో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం జిల్లా సీలేరు నుంచి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి ఇక్కడ కొంతమంది యువకులను ముఠాగా ఏర్పాటు చేసుకుని అధిక ధరకు విక్రయించేవారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు గోదాంపై దాడి చేసి గంజాయి ప్యాకెట్లు తీసుకెళ్లడానికి వచ్చిన 11మంది ఇరుగురాళ్ల సతీష్, సప్తగిరి కాలనీకి చెందిన ఎండీ సమీర్, భగవంతంవాడకు చెందిన బీమ అనుదీప్, తిలక్‌నగర్‌కు చెందిన ఎండీ.అబ్దుల్ ఊబేద్, ముంబయికి చెందిన(ప్రస్తుతం కరీంనగర్) అర్జున్బాబురావు చౌహన్, రాజీవ్‌నగర్‌కు చెందిన జాడి రాఘవేంద్రస్వామి, సీసీసీ నస్పూర్‌కు చెందిన గూడూరు రాము, మంచిర్యాలకు చెందిన ఎస్కే.ఇస్మాయిల్, ఎస్కే.సమీర్, మరొక మైనర్‌ను అరెస్టు చేశారు. వీరి నుంచి 23.5కిలోల గంజాయి, 11సెల్ఫోన్లు, 5మోటార్‌సైకిళ్లు, వేయింగ్ మిషన్ స్వాధీనం చేసుకున్నారు. ముఠా నాయకుడు సోమ ప్రవీణ్‌కుమార్, తగరపు రాజు, తగరపు శృతి(భార్యాభర్తలు), తగరపు వినయ్, రామాలయం రాకేష్, శ్రీధర్, మున్నీ, చింటు, ఆల్మేకర్ శ్యామ్, క్వార్టర్ సాయి, సొహెల్ పరారీలో ఉన్నారు. ముఠా గుట్టును రట్టు చేసిన ఏసీపీ ప్రకాశ్, సీఐ ప్రమోద్‌రావు, ఎస్సైలు, టాస్క్‌ఫోర్స్ బృందాన్ని సీపీ అభినందించారు. సీసీ కెమెరాల వ్యాపారం ముసుగులో దందా 23.5 కిలోల గంజాయి స్వాధీనం 11 మంది అరెస్ట్, పరారీలో మరో 11 మంది వివరాలు వెల్లడించిన రామగుండం సీపీ శ్రీనివాస్ -
● బకాయిల చెల్లింపునకు ఆదేశం ● వంట ఏజెన్సీలకు ఊరట
మంచిర్యాలఅర్బన్: పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం నిధులు మంజూరయ్యా యి. వంట ఏజెన్సీల నిర్వహణ, గౌరవ వేతనాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మంజూరు చేశాయి. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి సంబంధించిన బిల్లుల బకాయిల చెల్లింపునకు ఆదేశాలు జారీ అయ్యాయి. 1 నుంచి 8వ తరగతి వంట ఏజెన్సీలు (కుకింగ్ కాస్ట్), గౌరవ వేతనం బిల్లులు విడుదల చేసినట్లు డీఈవో యాదయ్య తెలిపారు. బిల్లుల మంజూరులో జాప్యం మధ్యాహ్న భోజన బిల్లుల మంజూరులో ప్రతీసారి జాప్యంతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఓ వైపు ఆకాశనంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, మరోవైపు ఉపాధ్యాయుల నుంచి వచ్చే ఒత్తిడి మేరకు అరువు తెచ్చి నెట్టుకొస్తున్నారు నిర్వాహకులు. నెలల తరబడి మధ్యాహ్న భోజన బిల్లులు రాకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులే చదవుతున్నారు. వారికి ఉచిత భోజనం.. పుస్తకాలు, తగిన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు నిధులు ఖర్చు చేస్తున్నాయి. అంతేకాదు మధ్యాహ్న భోజన కోసం సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. నిధులు సకాలంలో రాక నిర్వాహకులు చేతులెత్తేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. బిల్లుల విడుదలతో వంట ఏజెన్సీలకు ఊరట నిస్తోంది. జిల్లాలో.. జిల్లాలో 742 పాఠశాలల్లో 1247 మంది మధ్యాహ్న భోజన నిర్వాహకులు (కుక్ కమ్ హెల్పర్)గా పనిచేస్తున్నారు. 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు భోజనం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలుపుకొని నిధులు విడుదల చేస్తాయి. 9, 10వ తరగతి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది. నెలల తరబడి ఎదురు చూసే మధ్యాహ్న ఏజెన్సీలకు 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు సంబంధించి జనవరి, ఫిబ్రవరి సంబంధించిన నిధులు మంజూరు కావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వంట బిల్లులు, కుకు కమ్ హెల్పర్ గౌరవ వేతనం(రూ.1000) మంజూరయ్యాయి. డిసెంబర్, జనవరి పెండింగ్‌లో ఉన్న కోడిగుడ్డు బిల్లులు చెల్లించాలని కోరుతున్నారు. మధ్యాహ్న భోజనం చేస్తున్న విద్యార్థులుఉమ్మడి జిల్లాలో వంట బిల్లుల వివరాలు.. జిల్లా 1నుంచి సీసీహెచ్ 8వ తరగతివరకు ఆదిలాబాద్ రూ.1,09,10,738 రూ.36,00,000 ఆసిఫాబాద్ రూ.69,83,912 రూ.30,14,000 మంచిర్యాల రూ.60,60,712 రూ.25,34,000 నిర్మల్ రూ.81,62,282 రూ.28,28,000 -
అప్పుల బాధతో వలసకార్మికుడు ఆత్మహత్య
లక్సెట్టిపేట: అప్పుల బాధతో వలస కార్మికుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండలంలోని హన్మంతుపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై సతీశ్ కథనం ప్రకారం.. హన్మంతుపల్లికి చెందిన నస్పూరి గౌరయ్య(50)కు భార్య సత్తవ్వ, ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. ఉపాధి నిమిత్తం 20 ఏళ్ల క్రితం ముంబయి వెళ్లి కూలీ పనిచేస్తున్నాడు. అప్పుడుప్పుడు స్వగ్రామానికి వచ్చి వెళ్తుండేవాడు. సుమారు రూ.5 లక్షల అప్పుచేసి రెండేళ్ల క్రితం కూతురు పెళ్లితోపాటు ఇల్లు కట్టుకున్నాడు. అప్పులు తీర్చే మార్గం లేక మనస్తాపం చెందాడు. గురువారం తెల్లవారుజాము తన ఇంటిగదిలోని స్లాబ్‌కు తాడుతో ఉరేసుకున్నాడు. కుటుంబీకులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై అక్కడికి చేరుకుని పరిశీలించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
క్లుప్తంగా
బెల్టుషాపులపై దాడి ఆదిలాబాద్‌టౌన్: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అ మలులో ఉండడంతో టూటౌన్ పోలీసులు పట్టణంలోని ఇందిరానగర్‌లో గల బెల్టుషా పులపై గురువారం దాడులు నిర్వహించా రు. షేక్ అబ్దుల్ ఫరీద్ నుంచి 2.5 లీటర్ల మ ద్యం స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.2800 ఉంటుందని టూటౌన్ ఎస్సై వి ష్ణుప్రకాశ్ తెలిపారు. అదేవిధంగా అదే కాలనీలోని మరట్వార్ మధుకర్ నుంచి 2.6 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. వీటివిలువ రూ.2770 ఉంటుందన్నారు. వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారుమహిళ మెడలో చైన్ చోరీకి విఫలయత్నంఆదిలాబాద్టౌన్: పట్టణంలోని తిలక్‌నగర్‌కు చెందిన విజయ ఈనెల 17న మధ్యాహ్నం తన మనువడు చదివే పాఠశాలకు భోజనం అందించేందుకు వెళ్లింది. తిరిగివస్తుండగా బైక్‌పై గుర్తుతెలియని యువకుడు ఆమె మెడలో పుస్తెల తాడును లాగాడు. ఆమె అరవడంతో వదిలి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదుతో గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ ఎస్సై విష్ణుప్రకాశ్ తెలిపారు. ఆటోబోల్తా..నలుగురికి గాయాలుకడెం: మండలంలోని కన్నాపూర్ గ్రామంలోని ఊరచెరువు కట్ట వద్ద గురువారం ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. దస్తురాబాద్ మండలం గొడిసేర్యాల్ నుంచి ఆటో కడెం వైపు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురికి స్వల్ప గాయాలు కాగా, ఎల్లయ్యకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్‌లో ఖానాపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. తప్పుడుపత్రాలతో సర్టిఫికెట్‌కు యత్నించిన వ్యక్తి అరెస్టుకాసిపేట: తనపై ఎలాంటి కేసులు లేవని తప్పుడు పత్రాలతో సర్టిఫికెట్ కోసం య త్నించిన వ్యక్తిని గురువారం అరెస్టు చేసిన ట్లు కాసిపేట ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలి పారు. ఆయన కథనం ప్రకారం..మండలంలోని స్టేషన్ పెద్దనపల్లికి చెందిన కోవెల శ్రా వణ్ తనపై ఎలాంటి కేసులు లేవని పోలీసు వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. స్పెషల్ బ్రాంచి ఉన్నతాధికారులు దర్యాప్తు చేయగా శ్రావణ్‌పై చెక్‌బౌన్స్ కేసు ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులకు సూచించారు. ఈ మేరకు అతన్ని అరెస్టు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
గిరిజనుడి ఆత్మహత్యాయత్నం
● అటవీ అధికారులు వేధిస్తున్నారని ఆరోపణ ● రేంజ్ కార్యాలయం ఎదుట గిరిజనుల ధర్నాజన్నారం: అటవీ భూమిలో గుడిసెలు వేసుకున్నారనే నెపంతో వాటిని కూల్చివేయడమే కాకుండా అధికారులు వేధిస్తున్నారని గిరిజనుడు విషగుళికలు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మండలంలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన వివరాలు.. మండలంలోని గడ్డంగూడ గ్రామానికి చెందిన భూమిలో ఏళ్లుగా గుడిసెలు వేసుకుని కొందరు గిరిజనులు ఉంటున్నారు. ఈనెల 18న ఉన్నతాధికారుల ఆదేశాలతో గుడిసెలను తొలగించారు. గురువారం ఉదయం అటవీ అధికారులు అక్కడికి వెళ్లి ఖాళీ చేయాలని సూచించారు. మరో వారం గడువు ఇవ్వాలని, లేదంటే ఇక్కడే చచ్చిపోతామని గిరిజనులు పేర్కొన్నారు. అధికారుల కుదరదని తెలపడంతో మనస్తాపం చెందిన రాథోడ్ తుకారాం విషగుళికలు తిన్నాడు. గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు అతన్ని జన్నారానికి తీసుకువచ్చారు. ఆగ్రహంతో రేంజ్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి భైఠాయించారు. అధికారులు వేధించడం, తిట్టడం వల్లే తుకారాం ఆత్యహత్యాయత్నం చేసినట్లు గ్రామపెద్ద బోడ శంకర్ ఆరోపించారు. పోలీసులు 108లో తుకారాంను లక్సెట్టిపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయమై జన్నారం రేంజ్ అధికారి సుష్మారావును సంప్రదించగా, ఉన్నతాధికారుల ఆదేశాలతో గుడిసెలను తొలగించామన్నారు. ఎలాంటి వేధింపులకు గురిచేయలేదని, వారి ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. -
కారును ఢీకొట్టిన లారీ
● ప్రమాదంలో మహిళ మృతి ● మంటలు చెలరేగి దగ్ధమైన కారు ● ఆగిన పెళ్లి.. ఇరు కుటుంబాల్లో విషాదం మంచిర్యాలరూరల్(హాజీపూర్)/భీమిని: మేనల్లుడి పెళ్లి కోసం కారులో పెళ్లికూతురును తీసుకువస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెందింది. మంటలు చెలరేగి కారు దగ్ధమైంది. హాజీపూర్ పోలీసుస్టేషన్ పరిధిలో జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజాము ఈ ఘటన చోటుచేసుకుంది. హాజీపూర్ ఎస్సై గోపతి సురేశ్ కథనం ప్రకారం.. భీమిని మండలం వీగాం గ్రామానికి చెందిన మహిళ కర్రె రాజు మేనల్లుడి పెళ్లి గురువారం జరగాల్సి ఉంది. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలంలోని అబ్బాపూర్ గ్రామానికి చెందిన పెళ్లి కూతురును తీసుకురావడానికి ఆమె కారులో వెళ్లింది. పెళ్లి కూతురుతో కలిసి కారులో వస్తుండగా హాజీపూర్ శివారులోని జాతీయ రహదారిపై మంచిర్యాల నుంచి లక్సెట్టిపేట వైపు వెళ్తున్న లారీ అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో కర్రె రాజు(49) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందింది. కారులో ఉన్న వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారు డీజిల్ ట్యాంకు లీకేజీ కారణంగా మంటలు చెలరేగి దగ్ధమైంది. మృతురాలికి భర్త మల్లయ్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు. కాగా, రాజు మృతితో పెళ్లి ఆగిపోయింది. ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. -
షార్ట్‌సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం
● ఐదు ఇళ్లు, రెండు కొట్టాలు దగ్ధం పెంబి: మండలంలోని రాయదారి గ్రామంలో గురువారం షార్ట్ సర్క్యూట్‌తో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మొత్తం ఐదు ఇళ్లు, రెండు కొట్టాలు దగ్ధమయ్యాయి. మధ్యాహ్న సమయంలో రాథోడ్ బిక్కు ఉంట్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగంతో పక్కనే ఉన్న జాదవ్ కిమ్యా, రాథోడ్ నరేశ్, జాదవ్ రవీందర్, రాథోడ్ రవీందర్‌ల ఇళ్లు, బనావత్ దేశాయి, జాదవ్ దినేశ్‌లకు చెందిన కొట్టాలు అగ్నికి అహుతయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది రెండు ఫైరింజన్లతో చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. రాథోడ్ బిక్కు ఇంట్లో రూ.6 లక్షలు, కిమ్యా జాదవ్ ఇంట్లో రెండు తులాల బంగారం కాలిబూడిదయ్యాయి. తహసీల్దార్ లక్ష్మణ్, సీఐ సైదారావు, ఎంపీడీవో రమాకాంత్, ఎస్సై హన్మండ్లు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. తమను ఆదుకోవాలని బాధితులు అఽధికారులను వేడుకున్నారు. బాధితులను ఆదుకుంటాం: కలెక్టర్ పెంబి/నిర్మల్‌చైన్‌గేట్: అగ్ని ప్రమాద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. బాధితులకు రాత్రి భోజనం, బస ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటన సంబంధించి ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. ఆర్థికసాయం, ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. బాధితులు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు. -
ఒలింపిక్స్ ఆడడమే లక్ష్యం
ఆదిలాబాద్: దేశంలో సంప్రదాయ క్రీడ అయిన ఖోఖో ప్రస్తుతం ఆదరణ చూరగొంటోంది. ఈ క్రీడ నేడు వరల్డ్ కప్ స్థాయికి ఎదిగింది. ఢిల్లీలో జరిగిన తొలి వరల్డ్‌కప్‌లో పురుషులు, మహిళల జట్లు జగజ్జేతలుగా నిలవడం విశేషం. పురుషుల జట్టుకు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహించిన ఏకై క క్రీడాకారుడు పోతిరెడ్డి శివారెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్ర కాశం జిల్లాకు చెందిన ఈయన ప్రస్తుతం ఆది లాబాద్ హెడ్ పోస్టాఫీసులో పోస్టల్ అసిస్టెంట్‌గా వి ధులు నిర్వహిస్తున్నాడు. ఓవైపు విఽధులు నిర్వహి స్తూనే, మరోవైపు నిత్యం సాధన చేసి జాతీయ జ ట్టుకు ఎంపికై ఖోఖోలో వరల్డ్ కప్ టీం సభ్యుడిగా ఫైనల్లో సత్తా చాటాడు. జట్టు ఛాంపియన్‌గా అవతరించడంలో కీలకంగా వ్యవహరించాడు. ఒలింపిక్స్ ఆడడమే తన లక్ష్యమని చెబుతున్న శివారెడ్డితో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ. సాక్షి: ఖోఖోపై ఇష్టం ఎలా ఏర్పడింది? శివారెడ్డి: మా ప్రాంతంలో ఖోఖో ఎక్కువగా ఆడేవా రు. మా ఈదర గ్రామంలోని పాఠశాలలో వ్యా యామ ఉపాధ్యాయుడు కాశీ విశ్వనాథరెడ్డి అంతర్జాతీయ ఖోఖో క్రీడాకారుడు. నాతోపాటు ఎంతో మంది క్రీడాకారులకు శిక్షణ అందించారు. పాఠశాలలో ఉన్నప్పుడే 2006 నుంచి ఖోఖోపై ఇష్టం పెరిగింది. అప్పటి నుంచి ఆట ఆడుతున్నాను. సాక్షి:ఎవరుప్రోత్సహించారు?శిక్షణ ఎలా సాగింది? శివారెడ్డి: తల్లిదండ్రులు కోటేశ్వరమ్మ–గురువారెడ్డి. తమ్ముడు పరమేశ్వర్‌రెడ్డి ప్రోత్సహించారు. నా ప్రతిభను గుర్తించి వ్యాయామ ఉపాధ్యాయుడు కాశీ విశ్వనాథరెడ్డి బాపట్ల జిల్లా పుంగలూరు ఎస్.ఆర్ అకాడమీలో చేర్పించారు. శిక్షకుడు సీతారామరెడ్డి మెలకువలు నేర్పారు. 2009లో చేరి 16 ఏళ్లపాటు శిక్షణ తీసుకుని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీలకు ప్రాతినిధ్యం వహించాను. సాక్షి: ఎన్ని పోటీల్లో పాల్గొన్నారు? శివారెడ్డి: 35 జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నాను. 2010లో ఎస్జీఎఫ్ అండర్–17 విభాగంలో ఢిల్లీలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో ఆడాను. 2022లో అల్టిమేట్ ఖోఖో లీగ్‌లో గుజరాత్ జట్టు, 2024లో ముంబై జట్టులో సభ్యుడిగా ఉన్నా. 2018లో లండన్ వేదికగా జరిగిన పోటీల్లో ఇంగ్లాండ్ జట్టుపై ఆడి గోల్డ్ మెడల్ సాధించాం. ఇందులో బెస్ట్ చేజర్‌గా నిలిచాను. ఇటీవల జనవరి 13 నుంచి 19వ తేదీ వరకు ఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగిన ఖోఖో వరల్డ్ కప్‌లో నేపాల్ జట్టుపైనే గెలిచి ఛాంపియనిషిప్ సాధించడం ఆనందంగా ఉంది. నేపాల్‌తో జరిగిన తొలిమ్యాచ్‌లో బెస్ట్ అటాకర్‌గా నిలిచాను. సాక్షి:పోస్టల్లో ఉద్యోగం ఎప్పుడు సాధించారు? శివారెడ్డి: 2022 సెప్టెంబర్‌లో స్పోర్ట్స్ కోటాలో పోస్టల్ అసిస్టెంట్ గా ఉద్యోగం సాధించి, ఆదిలాబాద్ హెడ్ పోస్టాఫీస్‌లో జాయిన్ అయ్యాను. రూమ్మేట్ అంతర్జాతీయ క్రీడాకారుడు అయిన రంజిత్ సమక్షంలో ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాల మైదానంలో ప్రతీరోజు సాధన కొనసాగిస్తున్నాను. సాక్షి: జాతీయ జట్టుకు ఎంపిక ఎలా జరిగింది? శివారెడ్డి: 2023 ఏప్రిల్ ఢిల్లీ వేదికగా సీనియర్ నేషనల్ పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారిని వివిధ రాష్ట్రాల నుంచి పురుషులు, మహిళల జట్లకు 60 మందిని ఎంపిక చేశారు. 2024 డిసెంబర్లో ప్రత్యేక శిక్షణ శిబిరంలో నైపుణ్యాలు ప్రదర్శించిన తనతోపాటు పలువురిని జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. 23 దేశాల నుంచి వచ్చిన క్రీడాకారులతో తలపడి విజేతలుగా నిలవడం సంతోషాన్నిచ్చింది. సాక్షి: దేశంలో క్రికెట్‌కు ఆదరణ ఉందంటారా? శివారెడ్డి: దేశంలో క్రికెట్‌కు ఆదరణ ఉంది. మిగతా క్రీడలనూ ఆదరించాలి. గతంతో కన్నా కబడ్డీ, ఖోఖో క్రీడల పట్ల ఆదరణ పెరుగుతోంది. క్రీడాకారులను ప్రోత్సహిస్తే పతకాలు సాధిస్తారు. సాక్షి: ఎలాంటి ప్రోత్సాహం కోరుకుంటున్నారు? శివారెడ్డి: మహారాష్ట్ర నుంచి వరల్డ్ కప్‌లో సుమారు 9 మంది జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఐదుగురు పురుషుల జట్టు, నలుగురు మహిళల జట్టులో ఆడారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.2.25 కోట్ల నజరానా ప్రకటించడంతోపాటు గ్రూప్–1 పోస్టింగ్ ఇచ్చేందుకు హామీ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల నుంచి నేను జాతీయ జట్టుకు ఆడాను. క్రీడా సంఘాలు, ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే ఎన్నో క్రీడారత్నాలు వెలుగులోకి వస్తాయి. సాక్షి: యువతకు మీరిచ్చే సందేశం? శివారెడ్డి: క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. ప్రత్యేక రిజర్వేషన్ కేటాయించారు. చిన్ననాటి నుంచే పిల్లలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. మైదానాల్లో శ్రమిస్తేనే వారిలో దాగి ఉన్న ప్రతిభ వెలుగులోకి వస్తుంది. యువత క్రీడా రంగాన్ని ఎంచుకుంటే గొప్పగా ఎదిగే అవకాశాలుంటాయి. క్రీడా కోటాలో తాను ఉద్యోగం సాధించాను. సాక్షి: మీ లక్ష్యం ఏమిటి? శివారెడ్డి: 2036 ఒలింపిక్స్‌లో ఖోఖోను చేర్చాలని అనుకుంటున్నారు. ఇందుకు ఖోఖో సంఘం కృషిచేస్తోంది. ఒలింపిక్స్‌లో జాతీయ జట్టు నుంచి ఆడాలనేదే తన లక్ష్యం. భవిష్యత్తులో ఖోఖో మంచి స్థాయిలో ఉంటుందని ఆశిస్తున్నాను. నిరంతర సాధనతోనే వరల్డ్ కప్‌లోకి క్రీడారంగంలోనూ ఉజ్వల భవిష్యత్తు ‘సాక్షి’తో అంతర్జాతీయ ఖోఖో క్రీడాకారుడు శివారెడ్డి -
ఆసుపత్రుల్లో వైద్య సేవల పరిశీలన
మంచిర్యాలటౌన్/జన్నారం: జిల్లాలోని ప్రభు త్వ ఆసుపత్రుల్లో అందిస్తున్న వైద్య సేవలను పాపులేషన్ రీసెర్చ్ సెంటర్(పీఆర్సీ) విశాఖపట్టణం బృందం రెండో రోజు బుధవారం పరిశీ లించింది. మంచిర్యాల మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో గర్భిణుల ప్రసవాలు, బాలింతలకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. చి న్నారుల కోసం ఏర్పాటు చేసిన ఎన్ఐసీయూ వార్డును సందర్శించి వైద్య సేవలతోపాటు అ న్ని రకాల వైద్య పరికరాలు, మౌలిక వసతులు పరిశీలించారు. చిన్నారులకు వేసే వ్యాక్సిన్ల ల భ్యత, సరైన సమయాల్లో వేస్తున్న వ్యాక్సిన్లను పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. అనంతరం జిల్లాలోని ఇందన్పల్లి సబ్ సెంట ర్, జన్నారం పీహెచ్సీ, హాజీపూర్ పీహెచ్సీ, లక్సెట్టిపేట పీహెచ్సీ, దొనబండ సబ్‌సెంటర్ల ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వై ద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హరీశ్‌రాజ్, మంచిర్యాల ఉప జిల్లా వైద్యాధికారి డాక్టర్ అని త, ఆర్ఎంవో డాక్టర్ భీష్మ, హెచ్‌వోడీ డాక్టర్ వేదవ్యాస్, డాక్టర్ పవన్, ఎంసీహెచ్ పీవో డాక్టర్ కృపాబాయి, పీఆర్సీ వైద్యులు, రీసెర్చ్ సైంటిస్టులు డాక్టర్ రమణ, డాక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
మంచిర్యాలలో..
మంచిర్యాలటౌన్: జిల్లా కేంద్రంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. లక్ష్మీ టాకీస్ చౌరస్తా వద్ద శివాజీ విగ్రహ స్థాపన కమిటీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి మాట్లాడుతూ మంచిర్యాలలో ఛత్రపతి శివాజీ విగ్రహం స్థాపనకు ఐదేళ్లుగా కలెక్టర్, అధికారులు అనుమతి ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని అన్నారు. విగ్రహ స్థాపనకు అనుమతి ఇచ్చి, లక్ష్మీ టాకీస్ చౌరస్తాకు శివాజీ చౌక్‌గా నామకరణం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కర్ణకంటి రవీందర్, బోయిని హరికృష్ణ, కిరణ్, మున్నారాజా సిసోడియా, పెద్దపల్లి పురుషోత్తం, ఆకుల అశోక్‌వర్దన్, మోటూరి కిరణ్, వంగపల్లి వెంకటేశ్వర్, అమిరిశెట్టి రాజ్‌కుమార్, చిరంజీవి, బెల్లంకొండ మురళి పాల్గొన్నారు. జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో కుమురంభీం సేవా సమితి, ఫిట్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. -
పెండింగ్ బిల్లులు ఇప్పించండి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): జిల్లాలోని పంచాయతీలకు పెండింగ్‌లో ఉన్న బిల్లులు వెంటనే ఇప్పించాలని జిల్లా పంచాయతీ కార్యదర్శులు కలెక్టర్ కుమార్‌దీపక్, డీపీఓ వెంకటేశ్వర్రావును కోరారు. ఈ మేరకు బుధవారం జిల్లా పంచాయతీ కార్యదర్శుల ఫోరం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. పెట్రోల్‌బంక్‌ల్లో పంచాయతీ ట్రాక్టర్లకు డీజీల్ పోయడం లేదని, ఆగస్టు నుంచి చెక్కులు పెండింగ్‌లోనే ఉండడం వల్ల ఆర్థిక భారాన్ని తాము మోయలేమని పేర్కొన్నారు. మార్చి నెల నుంచి ఖర్చులు భరించే స్థితిలో లేమని తేల్చిచెప్పినట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు శ్రావణ్‌కుమార్, సంయుక్త కార్యదర్శి చంద్రమౌళి, జిల్లా అధ్యక్షుడు పూదరి నరేందర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, అసోసియేట్ అధ్యక్షుడు నాగరాజు, తాజొద్దీన్, శ్రీనివాస్, కోశాధికారి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు సుమన్, వరప్రసాద్, క్రాంతి, సంయుక్త కార్యదర్శి దివాకర్, కార్యాలయ కార్యదర్శి రమణ, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయాలి
● కలెక్టర్ కుమార్ దీపక్ ● మండలంలో ఆకస్మిక తనిఖీలుజన్నారం: వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులను సిద్ధం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధన చేయాలని, వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. బుధవారం ఆయన మండలంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కిష్టాపూర్ కస్తూర్భా పాఠశాలను తనిఖీ చేశారు. తరగతిగదులు, వంటశాలలు, నిత్యావసర సరుకుల నిల్వలు, పారిశుద్ధ్యం, భోజనం నాణ్యత, రిజిష్టర్లు పరిశీలించారు. విద్యార్థులను స్వయంగా ప్రశ్నలు అడిగి సమాధానాలు రాయించారు. బోర్డుపై లెక్కలు ఇచ్చి పరిష్కారం చేయించారు. ఆస్పత్రిలోని వార్డులు, రిజిష్టర్లు పరిశీలించి రోగులకు మెరుగైన చికిత్స అందించాలని, అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. మందులు, సేవలపై వైద్యాధికారులు జి.ఉమాశ్రీ, జే.లక్ష్మిలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కిష్టాపూర్ గ్రామ సమీపాన ఉన్న కేజీబీవీని తనిఖీ చేశారు. ప్రత్యేక అధికారి ఎం.శ్రీవాణిని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడారు. -
జిల్లాలో పత్తి కొనుగోళ్లు చేపట్టాలి
చెన్నూర్: జిల్లాలో సర్వర్ సమస్యతో పది రోజులకు పైగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారని, సర్వర్‌తో పని లేకుండా మాన్యువల్‌గా కొనుగోళ్లు చేపట్టాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్‌వెంకటస్వామి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కోరారు. బుధవారం ఆయనను కలిసి వినతిపత్రం అందజేయడంతో రైతుల సమస్యలను వివరించారు. కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్‌ను సంప్రదించారని తెలిపారు. ఆయన సీసీఐ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ లలిత్‌కుమార్‌తో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారని పేర్కొన్నారు. జిల్లా రైతులు ఆందోళన చెందవద్దని, త్వరలోనే కొనుగోళ్లు ప్రారంభమవుతాయని ఎంపీ, ఎమ్మెల్యేలు తెలిపారు. -
ఆదర్శపాయుడు ఛత్రపతి శివాజీ
● బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి ● జిల్లాలో బైక్ ర్యాలీమంచిర్యాలరూరల్(హాజీపూర్): యువతకు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆదర్శప్రాయుడని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి అన్నారు. శివాజీ జయంతి సందర్భంగా బుధవారం హాజీపూర్ మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ సేవా సమితి ఆధ్వర్యంలో దొనబండ నుంచి హాజీపూర్ వరకు రాంపూర్ ఆవాస విద్యాలయం విద్యార్థుల ఘోష్ విన్యాసాలు, మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పోలీసుస్టేషన్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో శివాజీ చిత్రపటానికి పూలమాల వేస్తుండగా మంచిర్యాల రూరల్ సీఐ ఆకుల అశోక్, పోలీసు సిబ్బంది అడ్డుకున్నారు. ఈ క్రమంలో కొద్దిసేపు పోలీసులు, నాయకులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పోలీసుల తీరుపై రఘునాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శివాజీ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేస్తే 21మందిపై కేసులు పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఉగాది వరకు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో శివాజీ సేవా సమితి సభ్యులు స్వామిరెడ్డి, మోటపలుకుల తిరుపతి, బొలిశెట్టి అశ్విన్‌రెడ్డి, బేతు రవి, జూపాక ధర్మయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు. లక్సెట్టిపేటలో.. లక్సెట్టిపేట: స్థానిక బస్డాండ్ నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రఘునాథ్ ఆధ్వర్యంలో బుధవారం మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు. మండల నాయకులు ప్రభాకర్, దిలీప్, ఉమేష్, వెంకటేష్, హ రీష్, రాజయ్య, గురువయ్య, సంతోష్, సురందర్, హరిగోపాల్, హేమంత్‌రెడ్డి పాల్గొన్నారు. -
శిబిరాలను దివ్యాంగులు వినియోగించుకోవాలి
బెల్లంపల్లి: అవసరమైన సహాయ ఉపకరణాలు పొందడానికి నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరాలను దివ్యాంగులు స ద్వినియోగం చేసుకోవాలని జిల్లా అ డిషనల్ కలెక్టర్ మోతిలాల్ అన్నారు. బుధవారం బెల్లంపల్లి సింగరేణి కళా వేదికలో మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సంయు క్త ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శారీరక, మానసిక ది వ్యాంగులకు సహాయ ఉపకరణాలు అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం అలీమ్‌కో సంస్థ సిబ్బంది దివ్యాంగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీ క్షల ఆఽ దారంగా సహాయ ఉపకరణాలు అందిస్తామని ప్రకటించారు. బెల్లంపల్లి, తాండూర్, కాసిపేట, నెన్నెల, భీమిని మండలాల నుంచి దివ్యాంగులు తరలి వచ్చారు. జిల్లా సంక్షేమ అధికారి రవూఫ్‌ఖాన్, ఆర్డీవో హరికృష్ణ, సీడీపీవో స్వరూపరాణి, ఎంపీడీవోలు పాల్గొన్నారు. -
సరిహద్దుల్లో నిఘా
● ప్రత్యేక చెక్‌పోస్టులు..తనిఖీలు ● అమల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి ● రూ.50 వేలకు మించితే ఆధారాలు తప్పనిసరి నిర్మల్‌ఖిల్లా: గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సమీపిస్తోంది. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్–నిజామాబాద్–కరీంనగర్–మెదక్ జిల్లాల పరిధిలో ఎన్నికల నియమావళి అమల్లో ఉండడంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈనెల 27న జరిగే పోలింగ్‌కు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బరిలో నిలిచిన అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో నగదు వ్యవహారాలు, తాయిలాలపై ఎన్నికల అధికారులు దృష్టిసారించారు. నిర్మల్ జిల్లాకు ఆనుకుని మహారాష్ట్ర సరిహద్దు ఉండడంతో ఆయా ప్రాంతాల్లో నిఘాతోపాటు చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు కొనసాగిస్తున్నారు. వివిధ అవసరాల నిమిత్తం రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్తే తగిన ఆధారాలు, రశీదులు చూపాలని లేకపోతే సీజ్ చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. నగదుతోపాటు బంగారం వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తే రశీదులు వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం వివాహ వేడుకల సీజన్లో వధూవరుల కుటుంబీకులు వస్త్రాలు, బంగారం, తదితర వస్తువులు కొనేందుకు నగదుతో వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యేక చెక్‌పోస్టులు నిర్మల్ జిల్లాలోని మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు సారంగాపూర్, తానూరు, కుభీర్ తది తర మండలాలతో అనుసంధానంగా ఉన్నా యి. ఆయా ప్రాంతాల్లోని సరిహద్దుల్లో ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు ము మ్మరం చేశారు. రెండు రాష్ట్రాల ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ వాహనాలు, బైక్‌లు వివిధ అవసరాల రీత్యా రాకపోకలు సాగిస్తుంటాయి. బాసర మండలంలోని మహారాష్ట్ర సరిహద్దులో బాసర–ధర్మాబాద్ రహదారిపై ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద ఎస్సై గణేశ్ ఆధ్వర్యంలో వారం క్రితం వాహనాల తనిఖీ చేపట్టారు. ధర్మాబాద్ నుంచి బిద్రెల్లి వైపు వస్తున్న కుంటాల మండలానికి చెందిన వ్యక్తి కారులో రూ. 2.8 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించి రశీదులు, ఆధారాలు చూపకపోవడంతో కేసు నమోదు చేశారు. పది రోజుల క్రితం మహారాష్ట్రలోని బోకర్ నుంచి నిర్మల్‌కు వస్తున్న ఓ వాహనాన్ని తానూరు మండలం బెల్‌తరోడా చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీ చేశారు. అందులో రూ.3 లక్షలకు పైగా నగదును గుర్తించారు. సరైన పత్రాలు చూపకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు. -
ఓసీపీల్లో పచ్చదనం పెంచాలి
● సింగరేణి అడ్వైజరీ మోహన్‌చంద్ర పర్లైన్ శ్రీరాంపూర్: ిసంగరేణి ఓపెన్‌కాస్ట్ గనులపై పచ్చదనాన్ని పెంచాలని సింగరేణి అడ్వైజరీ (ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్) మోహన్ చంద్ర పర్లైన్ (ఐఎఫ్ఎస్) తెలిపారు. బుధవారం సీసీసీలోని సింగరేణి గెస్ట్‌హౌస్‌లో శ్రీరాంపూర్, బెల్లంపల్లి, మందమర్రి ఏరియాల జీఎంలు, ఫారెస్ట్, ఎన్విరాన్మెంట్ అధికారులతో ఆయన చర్చించారు. ఏరియాల పరిధిలో ఫారెస్ట్ భూములు, చేపడుతున్న పర్యావరణ పరిరక్షణపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణిలోని ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యతనివ్వాలన్నారు. అనంతరం కంపెనీ పరిధిలోని భూములు అందులో చేసిన ప్లాంటేషన్ వివరాలను తెలుసుకున్నారు. సమావేశంలో శ్రీరాంపూర్,మందమర్రి, బెల్లంపల్లి జీఎంలు ఎం.శ్రీనివాస్, దేవేందర్, నరేందర్, శ్రీరాంపూర్ ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్ట్ అధికారి టి.శ్రీనివాస్, కార్పొరేట్ ఎస్టేట్ అధికారులు, సునీల్ వెంకటాచార్యులు, ఆయా డిపార్టుమెంట్ల అధికారులు పాల్గొన్నారు. -
అదృశ్యమైన మహిళ హత్య
మోర్తాడ్: నెల రోజుల క్రితం అదృశ్యమైన మహిళ హత్యకు గురైంది. ఈ ఘటనకు సంబంధించి భీమ్‌గల్ సీఐ సత్యనారాయణ, ఎస్సై రాము బుధవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం నాగేంద్రనగర్‌కు చెందిన కొండ లక్ష్మి(45) గ్రామంలో ఆశావర్కర్‌గా పనిచేస్తోంది. ఈ ఏడాది జనవరి 21న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆమె కుమార్తె అనూష ఏర్గట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్‌కు చెందిన కొంచపు వెంకటేశ్ లక్ష్మిని నమ్మించి తనవద్దకు పిలిపించుకొని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా నెల రోజుల క్రితమే ఆమెను పొన్కల్ అటవీ ప్రాంతంలో హత్య చేసినట్లు అంగీకరించాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. నిందితుడిని అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ, ఎస్సై పేర్కొన్నారు. పోలీసుల అదుపులో గంజాయి నిందితులు? మంచిర్యాలక్రైం: జిల్లాకేంద్రంలోని తిలక్‌నగర్‌లో మూడురోజుల క్రితం 25 కిలోల గంజాయితోపాటు సుమారు 9 మంది నిందితులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకుని స్థానిక పోలీసులకు అప్పగించి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. ఇందులో కొందరిని తప్పించేందుకు రాజకీయ నాయకుల ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. నిందితులను కేసు నుంచి తప్పించేందుకు తల్లిదండ్రులు స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. ఓ నాయకుడితో బేరసారాలు ఆడుతున్నట్లు సమాచారం. ఈ విషయమై సీఐ ప్రమోద్‌రావును వివరణ కోరగా గంజాయి నిందితులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పటుకున్నది వాస్తవమేనని, విచారణ చేస్తున్నామని తెలిపారు. -
గల్ఫ్‌లో జిల్లావాసి బలవన్మరణం
● మృతదేహం తెప్పించాలని కుటుంబీకుల వినతి ● ప్రవాసీమిత్ర సంఘం అధ్యక్షుడిని కలిసి వేడుకోలునిర్మల్ఖిల్లా: బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన కార్మికుడు అక్కడే బలవన్మరణానికి పాల్పడ్డాడు. జిల్లాలోని సారంగాపూర్ మండలం బోరిగాం గ్రామానికి చెందిన షేక్ ఆన్సర్ (34) ఉపాధి నిమిత్తం ఆరేళ్ల క్రితం సౌదీ ఆ తర్వాత దుబాయ్ వెళ్లాడు. ప్రస్తుతం దుబాయ్‌లోని పూజైరాదిబ్బ మున్సిపాలిటీలో కార్మికుడిగా పనిచేసేవాడు. గతేడాది సెలవుపై స్వగ్రామానికి వచ్చి వెళ్లాడు. ఈనెల 16న దుబాయ్‌లో నివాసముంటున్న ప్రాంతంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అక్కడి కంపెనీ ఈ విషయాన్ని తాజాగా కుటుంబీకులకు సమాచారం అందించింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. బుధవారం మృతుడి కుటుంబ సభ్యులతోపాటు కాంగ్రెస్ నాయకులు ఏనుగు ముత్యంరెడ్డి, కొర్వ నవీన్, సతీశ్ తదితరులు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రవా సీమిత్ర కార్మిక సంఘం కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్లను కలిశారు. మృతదేహాన్ని స్వస్థలానికి తెప్పించాలని విన్నవించారు. గల్ఫ్‌కార్మిక సంఘానికి చెందిన అక్కడి ప్రతినిధులతో మాట్లాడి దుబాయ్‌లోని ఇండియన్ ఎంబసీ కార్యాలయానికి ఈ–మెయిల్ ద్వారా ఆన్సర్ వివరాలను పంపించారు. మృతుడికి భార్య, ఒక కూతురు, కుమారుడుతోపాటు తల్లిదండ్రులు ఉన్నారు. -
‘ఇంటిగ్రేటెడ్’ స్కూళ్లకు స్థలాలు గుర్తించండి
● ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి కృష్ణ ఆదిత్య ● నాలుగు జిల్లాల కలెక్టర్లతో సమావేశంకైలాస్నగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు గురువారంలోపు స్థలాల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేకాధికారి, ఇంటర్మీడియెట్ విద్యాశాఖ కార్యదర్శి కృష్ణ ఆదిత్య అన్నారు. ఆదిలాబాద్ కలెక్టరేట్లో నాలుగు జిల్లాల కలెక్టర్లతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యావ్యవస్థలో ప్రతిష్టాత్మకమైన మార్పులు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా రానున్న రెండేళ్లలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మించి నాణ్యమైన విద్య అందించాలని నిర్ణయించిందన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల్లో వాటి ఏర్పాటుకు స్థలాలను ఎంపిక చేయాలన్నారు. అనంతరం ఆదిలాబాద్ పట్టణ శివారు నిషాన్‌ఘాట్‌లో గల సర్వేనంబర్ 38లో 20 ఎకరాల స్థలాన్ని కలెక్టర్‌తో కలిసి పరిశీలించారు. అన్ని హంగులతో పాఠశాల, వసతి గృహ సముదాయం నిర్మించనున్నట్లు తెలిపారు. గడువులోపు పనులు ప్రారంభించేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. అంతకు ముందు కలెక్టరేట్‌కు చేరుకున్న ఆయనకు ఆదిలాబాద్, నిర్మల్ కలెక్టర్లు రాజర్షి షా, అభిలాష అభినవ్, కు మురంభీం అదనపు కలెక్టర్ దీపక్ తివారీ పూలమొక్కలు అందించి స్వాగతం పలికారు. కార్యక్రమంలో మంచిర్యాల కలెక్టర్ కుమార్‌దీపక్, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో వినోద్‌కుమార్, టీజీఈడబ్ల్యూఐడీసీ ఈఈ అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్మీడియెట్ పరీక్షలపై సమీక్ష ముందుగా ఇంటర్మీడియెట్ విద్యాశాఖపై సంబంధిత అధికారులతో కలెక్టర్ చాంబర్లో కృష్ణ ఆదిత్య సమీక్ష నిర్వహించారు. ప్రాక్టికల్, వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని డీఐఈవో రవీందర్‌కుమార్‌ను ఆదేశించారు. అలాగే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. కళాశాలలో హాజరు శాతం, స్లిప్ టెస్టులు, విద్యార్థుల ప్రవేశాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాగునీరు సమస్య తలెత్తకుండా చూడాలి వేసవిలో మారుమూల ప్రాంతాలు, మున్సిపాలిటీలో తాగునీరు, విద్యుత్ సమస్య తలెత్తకుండా చూడాలని కృష్ణఆదిత్య అన్నారు. ఉమ్మడి జిల్లా కలెక్టర్లతో సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఇందుకోసం అధికారులు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. బోరుబావుల ఫ్లషింగ్, నీటి వనరుల మరమ్మతు ఎప్పటికప్పుడు చేపట్టాలని సూచించారు. -
వుషూ క్రీడాభివృద్ధికి కృషి
ఆదిలాబాద్: రాష్ట్రంలో వుషూ క్రీడాభివృద్ధికి కృషి చేస్తున్నామని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రేమ్‌సాగర్ అన్నారు. జిల్లాకేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో బుధవారం ఖేలో ఇండియా రాష్ట్రస్థాయి వుషూ మహిళల క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వుషూ క్రీడకు రోజురోజుకు ఆదరణ పెరుగుతుందన్నారు. ప్రతీ జిల్లాలో క్రీడాకారులను ప్రోత్సహిస్తామన్నారు. క్రీడలతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, ప్రభుత్వాలు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలను కేటాయించాయన్నారు. క్రీడాకారులు నిరంతరం సాధన చేస్తూ జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. అనంతరం వుషూ విభాగంలో స్పోర్ట్స్‌కోటా కింద పోస్టల్ శాఖలో ఉద్యోగం రాగా, ప్రస్తుతం ఎస్ఎస్బీలో ప్రస్తుతం శిక్షణ తీసుకుంటున్న జిల్లాకు చెందిన రాథోడ్ స్వాతిని సత్కరించారు. కార్యక్రమంలో ఉషూ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్ ఉమర్, పెటా సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పార్థసారథి, సాయి, వుషూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి గణేశ్, వేముల సతీశ్, ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ అన్నారపు వీరేశ్, జిల్లాల క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రేమ్‌సాగర్ ఉత్సాహంగా రాష్ట్రస్థాయి వుషూ క్రీడాపోటీలు -
పేకాటరాయుళ్లపై కేసు
వాంకిడి: మండలంలోని ఖమానలోని నర్సరీ సమీపంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పక్కాసమాచారంతో సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో బుధవారం దాడి నిర్వహించారు. ఈ దాడుల్లో ఏడుగురిని అదుపులో తీసుకుని కేసు నమోదు చేసి, వారి వద్ద నుంచి మూడు బైక్‌లు, ఆరు సెల్ఫోన్లు, రూ.8280 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ దాడుల్లో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హెడ్‌కానిస్టేబుల్‌కు గుండెపోటు ● సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన పోలీసులుకడెం: మండలంలోని పాండ్వపూర్ వద్ద అటవీశాఖ చెక్‌పోస్టు వద్ద విధులు నిర్వర్తిస్తున్న దస్తురాబాద్ పోలీసుస్టేషన్ హెడ్‌కానిస్టేబుల్ గోకుల్దాస్ బుధవారం గుండెపోటుతో కుప్పకూలాడు. సిబ్బంది అందించిన సమాచారంతో ఎస్సై కృష్ణసాగర్రెడ్డితోపాటు ధన్‌రాజ్, భీంరావు, దేవన్నలు అక్కడికి చేరుకున్నారు. గోకుల్దాసును అంబులెన్స్‌లో ఎక్కించి సీపీఆర్ చేస్తూ ఖానాపూర్ ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి నిర్మల్‌కు తీసుకెళ్లి ప్రాణాలు కాపాడారు. పట్టపగలే చోరీఉట్నూర్రూరల్: మండలంలోని లింగోజీతండాకు చెందిన ఆర్టీసీ కండక్టర్ రాథోడ్ దశరథ్ ఇంట్లో పట్టపగలే చోరీ జరిగింది. ఎస్సై మనోహర్ కథనం ప్రకారం.. దశరథ్ బుధవారం ఇంటికి తాళం వేసి ఉదయం 9గంటలకు డ్యూటీకి వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన దొంగలు తాళం పగులగొట్టి ఇంట్లో తులంన్నర బంగారం, 10 తులాల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. దశరథ్ సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా తాళం పగులగొట్టి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై అక్కడికి చేరుకుని..క్లూస్‌టీం ద్వారా పరిశీలించారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
అనుమానాస్పదంగా ఒకరు ..
భైంసాటౌన్: పట్టణంలోని కిసాన్‌గల్లీకి చెందిన జంగమోల్ల రాజేశ్వర్(46) అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు సీఐ జి.గోపినాథ్ తెలిపారు. స్థానికుల కథనం ప్రకారం..మృతుడు రాజేశ్వర్ రాహుల్నగర్లోని ఓ గురుకుల పాఠశాలలో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన వాచ్‌మెన్‌గా పనిచేసేవాడు. కొన్నిరోజులుగా ఖాళీగా ఉంటుండగా, ఈ క్రమంలో బుధవారం ఇంట్లో అనుమానాస్పద స్థితి లో మృతి చెంది కనిపించాడు. గమనించిన కుటుంబీకులు ఏరియాస్పత్రికి తరలించారు. సీఐ ఆస్పత్రికి చేరుకుని మృతదేహం పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు దర్యాప్తు చేస్తామన్నారు. -
చికిత్స పొందుతూ ముగ్గురి మృతి
సోన్: విద్యుత్‌షాక్ గురైన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్సై కె.గోపి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన మోరే చంద్రకాంత్ లారీడ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మండలంలోని మాదాపూర్ గ్రామానికి పసుపు కోసం మంగళవారం వచ్చాడు. గ్రామంలో 11 కేవీ విద్యుత్ తీగలు తగిలి ఆయనకు గాయాలయ్యాయి. వెంటనే నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బుధవారం చికిత్సపొందుతూ మృతి చెందాడు. మృతుడి తండ్రి నాగోరావు ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు. రిమ్స్‌లో యువకుడు.. కై లాస్‌నగర్: మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా మాహూర్ తాలుకాలోని కోడ్కుప్టి గ్రామానికి చెందిన యువకుడు సెలార్ అంకుష్ (20) రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. టూటౌన్ ఎస్సై ముకుంద్‌రావు కథనం ప్రకారం.. అంకుష్ ఈనెల 3న శుభకార్యానికి బైక్‌పై వెళ్తుండగా అదుపుతప్పి చెట్టును ఢీకొట్టాడు. గమనించిన స్థానికులు మహారాష్ట్రలోని కోర్టలోని ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందాడు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ ఎస్సై తెలిపారు. లక్ష్మణచాందలో ఒకరు.. లక్ష్మణచాంద: పురుగుల మందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందాడు. మండల కేంద్రానికి చెందిన పవర్ రమేశ్ (35) గత మూడురోజుల క్రితం గుర్తుతెలియని పురుగుల మందు తాగాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
ఆకాశవాణి కేంద్రాన్ని పరిశీలించిన డిప్యూటీ డైరెక్టర్
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని ఆదిలాబాద్ ఆకాశవాణి కేంద్రాన్ని ఆకాశవాణి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (ఇంజనీరింగ్) బానోత్ హరిసింగ్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రోతలకు నాణ్యమైన ప్రసారాలను అందించేందుకు డిజిటలైజేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశామన్నారు. ఈ విషయంలో ఆదిలాబాద్ ఆకాశవాణి ఉద్యోగుల కృషి అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో పనిచేసి రాబోయే రోజుల్లో ఆదిలాబాద్ ఆకాశవాణి కేంద్రం పేరును గొప్పగా నిలపాలని ఆకాంక్షించారు. ఆదిలాబాద్ కేంద్రానికి ఉన్న ప్రత్యేక గుర్తింపును కొనసాగించాలని సూచించారు. ఈ కేంద్రం అభివృద్ధికి తనవంతుగా తోడ్పాటును అందిస్తానన్నారు. అనంతరం జైనథ్ మండల కేంద్రంలోని పురాతన శ్రీ లక్ష్మీనారాయణస్వామిని దర్శించుకున్నారు. ఆయ న వెంట ఆకాశవాణి అసిస్టెంట్ డైరెక్టర్ ఇంజనీరింగ్ శ్రీనివాస్, కేంద్రం ముఖ్య కార్యక్రమ అధికారి రామేశ్వర్ కేంద్రే, వెంకటేశులు, పోతురాజు, శశికాంత్, గిరీశ్‌కుమార్, వెంకటయ్య, విజయ కుమారి తదితరులు ఉన్నారు. -
గొర్రెలు ఎత్తుకెళ్లిన నలుగురి అరెస్టు
భీమిని: కన్నెపల్లి మండలం జన్కాపూర్ శివా రులో గొర్రెలను ఎత్తుకెళ్లిన నలుగురిని బుధవారం అరెస్టు చేసినట్లు ఎస్సై గంగారాం తెలిపారు. పోలీసుస్టేషన్లో ఈ మేరకు వివరాలు వెల్లడించారు. నారాయణపేట జిల్లా దన్వాడ మండలం గొటూరుకు చెందిన పొర్ల నరేశ్..160 గొర్రెలను మేపడానికి ఇటీవల జన్కాపూర్‌కు వచ్చాడు. గుర్తుతెలియని వ్యక్తులు 33 గొర్రెలను ఎత్తుకెళ్లారని ఈనెల 17న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మంగళవారం కన్నెపల్లి సబ్‌స్టేషన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానస్పదంగా బొలెరోలో గొర్రెలను తరలిస్తుండగా డ్రైవర్‌ను అదుపులో తీసుకుని విచారించారు. జన్కాపూర్‌కు చెందిన ప్రశాంత్, సంతోష్, అభిలాష్, సత్తన్న కలిసి గొర్రెలు విక్రయించారని తెలిపాడు. వాహనాన్ని సీజ్ చేసి, నలుగురిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. -
‘గురువుల’ప్రాధాన్యత ఎవరో!
● బరిలో మొత్తం 15మంది అభ్యర్థులు ● ఉపాధ్యాయ సమస్యలే ప్రచార అస్త్రాలు ● ఆసక్తికరంగా టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలుసాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఆసక్తికరంగా సాగుతోంది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ నియోజకవర్గ స్థానానికి 15మంది బరిలో ఉన్నారు. 27,088మంది ఓటర్లు ఉన్నారు. ముగ్గురు రాజకీయ పార్టీల నుంచి పోటీలో ఉండగా, మరో 12మంది ఆయా సంఘాల మద్దతుతో బరిలోకి దిగారు. ఎగువ సభకు ఎన్నికల్లో మేధావి వర్గంగా చెప్పుకునే విద్యావంతులైన టీచర్ల ఆలోచన సరళి చాలా భిన్నంగా ఉంటుందంటారు. అభ్యర్థి, పార్టీ, సంఘం ఏదైనా తమ విచక్షణతోనే ఓటు వేస్తూ వైవిధ్యతను చూపిస్తుంటారు. గతంలో పలుమార్లు అంచనాలకు అందకుండా తీర్పు ఇచ్చారు. ఈ క్రమంలో టీచర్లు వేసే మొదటి, రెండో ప్రాధాన్యత ఓట్ల క్రమంలో ఎటువైపు మొగ్గు ఉన్నా ఫలితాలు తలకిందులయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఎవరి గెలుపు ఉంటుందనేది సర్వత్రా చర్చ సాగుతోంది. సమస్యలే ప్రచారాస్త్రాలు ఉపాధ్యాయులను ఎన్నో ఏళ్లుగా పట్టి పీడిస్తున్న సమస్యలు అనేకంగా ఉన్నాయి. ప్రతీసారి ఆయా సమస్యలే ఎన్నికల్లో ఎజెండాగా మారుతున్నాయి. తాజా ఎన్నికల్లోనూ అవే ప్రచారాస్త్రాలుగా మారాయి. ప్రధానంగా సీపీఎస్(కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం), ఏకీకృత సర్వీస్ రూల్, 317జీవో, 2002 ఉపాధ్యాయుల సమస్యలు, డీఏల పెండింగ్, టీచర్ల పదోన్నతులు తదితరవన్నీ పేరుకుపోయాయి. ఎమ్మెల్సీగా గెలిచాక సమస్యలు మర్చిపోతున్నారనే అపవాదు మూటగట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రధాన పార్టీల నుంచి పరిశీలిస్తే ఈసారి బీజేపీ నుంచి వ్యాపారవేత్త మల్క కొమురయ్య పోటీలో ఉన్నారు. ఆయన గెలుపు కోసం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆ బాధ్యతను తమ భుజాలకెత్తుకున్నారు. బీజేపీ ప్రభుత్వం టీచర్లను ఇబ్బంది పెడుతున్న సీపీఎస్‌ను తీసుకొచ్చిందనే కారణంతో పార్టీ అభ్యర్థికి ఏ మేరకు ఓట్లు పడుతాయనేది తేలాల్సి ఉంది. ఆయన యజమానిగా ఉన్న మంచిర్యాలలోని శాలివాహన ప్లాంటు మూసివేత, కార్మికుల సమ్మె ప్రభావం ఉండనుంది. టీఎస్సీపీఎస్ఈయూ నుంచి ఇన్నారెడ్డి సీపీఎస్ రద్దు ఏకై క లక్ష్యంగా సాగుతున్న టీఎస్‌సీపీఎస్‌ఈ యూనియన్ బలపర్చిన అభ్యర్థిగా తిరుమల్‌రెడ్డి ఇన్నారెడ్డి బరిలో ఉన్నారు. గతంలో పీఆర్టీయూ రాష్ట్ర స్థాయి నాయకుడిగా, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా పని చేసిన తిరుమల్‌రెడ్డి ఇన్నారెడ్డికి ఉపాధ్యాయ సమస్యలపై పోరాటమే తన బలంగా చెబుతుంటారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి టీచర్ల స్థానానికి అధికారికంగా ఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వలేదు. తెరవెనక మాత్రం ఓ అభ్యర్థికి మద్దతు ఉందని ఉపాధ్యాయ వర్గాల్లో ప్రచారం ఉంది. ఇక తాజా మాజీ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి మరోసారి పోటీలో నిలిచారు. పీఆర్టీయూ నుంచి వంగ మహేందర్‌రెడ్డి, బీఎస్పీ నుంచి యాటకారి సాయన్న, దళిత బహుజన పార్టీ నుంచి గవ్వల లక్ష్మీతోపాటు అశోక్‌కుమార్, వై.కంటె సాయన్న, చలిక చంద్రశేఖర్, జగ్గు మల్లారెడ్డి, మామిడి సుధాకర్‌రెడ్డి, ముత్తరాం నర్సింహాస్వామి, విక్రమ్‌రెడ్డి, శ్రీకాంత్, సుహాసిని మొత్తం 15మంది ఉన్నారు. ఇంటింటికి అభ్యర్థి ప్రచారం ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రభుత్వ స్కూళ్లలో ప్రచారం చేసే అవకాశం లేకపోవడంతో నేరుగా టీచర్ల ఇంటికే వెళ్తున్నారు. మార్నింగ్ వాకింగ్, సంఘ కార్యాలయాలు, సెలవు దినాలు, నిర్ణీత వేళల్లోనే టీచర్లను కలుస్తూ ప్రచారం చేస్తున్నారు. సోషల్‌మీడియా, ఫోన్ కాల్స్‌తోనూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. -
నీ భార్యతో ఉన్నా.. ఏం చేస్తావో చేయ్!
ఇంద్రవెల్లి (మంచిర్యాల): ఓ వివాహిత ఓ యువకుడితో సంబంధం పెట్టుకుంది. ఆ ప్రియుడు ఆ భర్తను రెచ్చగొట్టాడు. రగిలిపోయిన ఆ భర్త.. భార్యతోపాటు అత్త, వాళ్ల తరఫు బంధువులపై కూడా కత్తులతో దాడికి పాల్పడ్డాడు. మండలకేంద్రంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై సునీల్ కథనం ప్రకారం.. మండలకేంద్రానికి చెందిన సంజీవాణికి దనోరా(బి) గ్రామానికి చెందిన గుట్టె అంకుష్‌తో వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు సంతానం. భర్త అంకుష్ గత కొంత కాలంగా భార్యపై అనుమానం పెంచుకున్నాడు. తరచూ ఆమెతో గొడవ పడేవాడు. దీంతో.. వారం క్రితం సంజీవాణి పుట్టింటికి వెళ్లిపోయింది.అయితే.. మంగళవారం మధ్యాహ్నం సంజీవాణి ప్రియుడు రాహుల్ అంకుష్‌కు ఫోన్ చేశాడు. ‘‘నీ భార్యతో ఆమె ఇంట్లోనే ఉన్నా.. ఏం చేస్తావో చేయ్..అంటూ సవాల్ విసిరాడు. అంకుష్ కోపంతో అత్తగారింటికి వచ్చాడు. భార్యపై కత్తితో దాడి చేశాడు. ప్రతిఘటించిన తల్లి అనిత, అమ్మమ్మ రాధాబాయిలపై దాడి చేయగా వారికి స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రగాయాలైన సంజీవాణితోపాటు ఇద్దరిని స్థానికులు మండలకేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న ఎస్సై సునీల్ ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రులను 108లో ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.భర్త స్నేహితునితో భార్య అనైతిక సంబంధం.. భర్త ప్రాణత్యాగం -
ముస్లింలను బీసీల్లో చేరిస్తే స్పందించరా?
● కేంద్రం నిధులపై చర్చకు సిద్ధమా? ● కేంద్ర మంత్రి బండి సంజయ్ ● మంచిర్యాలలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం సాక్షిప్రతినిధి, మంచిర్యాల/మంచిర్యాలటౌన్: ‘బీసీ లకు 42శాతం రిజర్వేషన్లు అని చెప్పి.. 10 శాతం ముస్లింలను కలిపితే బీసీలకు అన్యాయం జరిగిన ట్లు కాదా.. కాంగ్రెస్ నేతలు స్పందించరా..? బీసీల్లో ముస్లింలను కలిపితే కేంద్రం ఆమోదించే ప్రసక్తే లేదు. ..’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. ‘రంజాన్‌కు ముస్లిం ఉద్యోగులందరికీ సాయంత్రం 4గంటలలోపే విధులు ముగించుకుని వెళ్లిపోవచ్చని మినహాయింపు ఇచ్చారు. అయ్యప్ప, హనుమాన్, భవానీ భక్తులు ఏం పాపం చేశారని.. కాంగ్రెస్‌లోని హిందువులారా.. మీలో నిజంగా హిందూ రక్తమే ప్రవహిస్తే సమాధానం చెప్పాలి..’అంటూ డిమాండ్ చేశారు. మంగళవారం మంచిర్యాల పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడారు. అంతకు ముందు పట్టణంలో కార్యకర్తలు, నాయకులతో బైక్ ర్యాలీ నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షు డు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలు కే.వెంకటరమణారెడ్డి, పాల్వాయి హరీశ్‌బాబు, ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సంజ య్ మాట్లాడుతూ.. మూడుస్థానాల్లో బీజేపీ గెలుపు ఖాయమని ఏ సర్వే చూసినా స్పష్టం చేస్తున్నాయని అన్నారు. కేంద్రం రూ.12.75లక్షల ట్యాక్స్ మినహా యింపు, పదేళ్లలో రూ.12 లక్షల కోట్లకుపైగా నిధులను తెలంగాణకు ఇచ్చిందన్నారు. కేంద్రం నిధులివ్వడం లేదని ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ బహిరంగ చర్చకు సిద్ధమా..? ఈ అంశాన్ని రెఫరెండంగా తీసుకుని ఎమ్మెల్సీ ఎన్నికల్లోకి రావాలని కాంగ్రెస్‌కు సవాల్ విసిరారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలనే ఆలోచనే ఆ పార్టీ ఎమ్మెల్యేలకు లేదన్నారు. సొంత కాలేజీ స్టాఫ్‌ను పట్టుకుని తిరుగుతున్నారని విమర్శించారు. మంచిర్యాలలో దాదాగిరిమంచిర్యాలలో కొందరు దాదాగిరి చేస్తున్నారని, ఆరు నెలల కంటే ఎక్కువ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే పరిస్థితి లేదని కేంద్రమంత్రి సంజయ్ అన్నారు. ప్రభుత్వంలో టాప్ 5లో ఉన్న వాళ్ల దోపిడీ, అవి నీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోందని, కమీషన్లకు కక్కుర్తిపడుతున్నారని విమర్శించారు. అవినీ తి జరుగుతుందడానికి సీఎం వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. 15శాతం కమీషన్లు ఇస్తే మాత్రం కాంట్రాక్టర్లకు అప్పటికప్పుడు బిల్లులు క్లియర్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ బీసీ కాదని ఆయన కులం గురించి అవాకులు పేలుతున్నారని, రాహు ల్ ఖాన్ గాంధీ తండ్రి పేరు ఏమిటి? ఫిరోజ్‌ఖాన్ గాంధీ...అసలు గాంధీ అని పేరు యాడ్ చేసుకుని గాంధీ పరువు తీస్తున్నారని విమర్శించారు. మహా త్మాగాంధీ ఆత్మ బాధపడుతోందని, ఫిరోజ్‌ఖాన్ గాంధీ కొడుకు, మనవడు ఏమైతరు? హిందువులై తే కానే కాదన్నారు. మీరు హిందువులేనా? మీలో హిందువు రక్తం ప్రవహిస్తుందా? అని ప్రశ్నించారు. నిరుద్యోగులు, ఉద్యోగుల పక్షాన పోరాడింది తామే అని, నిరుద్యోగులకు మోచేతికి బెల్లం రాసి నాకిచ్చి నంత పనిచేశారని అన్నారు. 2లక్షలకుపైగా ఖాళీలు ఉన్నాయని, ఓట్లకోసం వచ్చే కాంగ్రెస్ నేతలను గల్లా పట్టి నిలదీయాలని అన్నారు. కోడ్ లేని జిల్లాల్లో వెంటనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని సీఎం ఆదేశించారు.. అబద్ధాలు చెప్పి మోసం చేసి ఓట్లు దండుకోవడంలో కాంగ్రెసోళ్లు కేసీఆర్‌ను మించి పో యిర్రని తెలిపారు. ఇవన్నీ ప్రశ్నిస్తే హిందూ ముద్రవేస్తున్నారన్నారు. కాళేశ్వరం, డ్రగ్స్ కేసు, ఫార్ములా ఈ రేస్ స్కాం కేసులో ఇదిగో అరెస్ట్...అదిగో అరెస్ట్ అంటూ మీడియాలో వార్తలు రాయించుకుంటూ కాలయాపన చేయడం తప్ప కాంగ్రెస్ సాధించిందేమిటి అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ స్కాంలు ఢిల్లీలో ని కాంగ్రెస్ నేతలకు ఏటీఎంలాగా మారాయని, ఒక్కో స్కాం ఢిల్లీ పెద్దలకు రూ.వెయ్యి కోట్లకుపైగా పైసలు దండుకుంటున్నారని అన్నారు. -
పర్యవేక్షణ.. క్రమశిక్షణ లోపం
● గురుకులాల్లో ఘటనలతో ఆందోళన ● విద్యార్థుల వద్ద సెల్ఫోన్లు.. ● రెండేళ్లలో పది మంది సస్పెండ్, ఒకరి మృతిచెన్నూర్: అధికారుల పర్యవేక్షణ లోపిస్తోంది. ఫలితంగా విద్యార్థుల్లో క్రమశిక్షణ కొరవడుతోంది. కుమారులు గురుకులాల్లో చదువుకుని ప్రయోజకులు అవుతారని ఆశిస్తున్న తల్లిదండ్రులకు నిరాశే ఎదురవుతోంది. ఉన్నత చదువులు చదివి పాఠశాల, తల్లిదండ్రులకు పేరు తేవాల్సిన విద్యార్థులు గాడి తప్పుతున్నారు. కలిసి మెలిసి చదువుకోవాల్సిన చోట ఒకరిపైనొకరు దాడులు చేసుకుంటూ బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. ఇప్పటివరకు జరిగిన ఘటనల్లో పది మంది విద్యార్థులను సస్పెండ్ చేశారు. గతంలో చెన్నూర్ మైనార్టీ గురుకుల పాఠశాలలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ముగ్గురు విద్యార్థులు ఇంతియాజ్, అమీర్, రెహనుద్దీన్లను అధికారులు సస్పెండ్ చేశారు. ఈ విషయంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కావాలనే తమ పిల్లలను సస్పెండ్ చేశారని ఆరోపిస్తూ పాఠశాల ఎదుట ధర్నా చేశారు. పాఠశాలలో జరిగిన ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరిపి ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడంతోపాటు ప్రిన్సిపాల్‌ను బదిలీ చేశారు. ఈ నెల 6న మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో విద్యార్థి మనోజ్గౌడ్పై దాడి చేసి వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసిన ఘటనలో ఏడుగురిని సస్పెండ్ చేశారు. ప్రిన్సిపాల్ కేవీఎం ప్రకాశ్‌రావు నిర్లక్ష్యం కారణంగా దాడి జరిగిందనే ఉద్దేశంతో ఉన్నతాధికారులు ఆయనను విధుల నుంచి తొలగించారు. ఇటీవల విద్యార్థి మృతిచెన్నూర్ మైనార్టీ గురుకుల పాఠశాలలో చెన్నూర్ మండలం బీరెల్లి గ్రామానికి చెందిన ఆదర్శ్ పదో తరగతి విద్యార్థి చదువుతుండేవాడు. సంక్రాంతి సెలవులు ముగిసిన తర్వాత గత నెల 23న పాఠశాలకు వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి చెన్నూర్‌కు వచ్చాడు. పాఠశాలకు వెళ్లకుండా చెన్నూర్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనంలో పురుగుల మందు తాగి మృత్యువాత పడ్డాడు. నేటికీ విద్యార్థి మృతికి కారణాలు తెలియరాలేదు. అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలిగురుకుల పాఠశాలలో విద్యార్థులు పక్కదారి పట్టకుండా ఏడాదిలో రెండు సార్లు మానసిక నిపుణులతో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయించాలని పలువురు సీనియర్ ఉపాధ్యాయులు తెలిపారు. ప్రధానంగా పాఠశాలలో విద్యార్థులకు సె ల్ఫోన్లు అందుబాటులో ఉండకుండా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు, సిబ్బందిపై ఉంది. ప్రత్యేక శ్రద్ధ వహిస్తాం బీసీ గురుకుల పాఠశాలలో ఏడుగురు విద్యార్థులు మరో విద్యార్థిపై దాడి చేయడం మంచి పద్ధతి కాదు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడుతాం. పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. పాఠశాలకు సెల్‌ఫోన్ ఎలా వచ్చిందనే విషయమై విచారణ చేపడుతున్నాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. – శ్రీధర్, ఆర్సీవో మంచిర్యాల వసతిగృహాల్లో సెల్ఫోన్లుగురుకుల పాఠశాలల్లో పదో తరగతి వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. చక్కటి ఫలితాలు తీసుకు రావా లనే ఉద్దేశంతో ఉపాధ్యాయులు విద్యార్థులకు స్వేచ్ఛనిస్తున్నట్లు తెలిసింది. ఓ వైపు స్వేచ్ఛనివ్వడం, మరోవైపు ప్రిన్సిపాల్, వార్డెన్ల పర్యవేక్షణ లోపించడం కారణంగా విద్యార్థులు రాత్రివేళల్లో సెల్ఫోన్లు వినియోగిస్తున్నట్లు సమాచారం. వసతిగృహాల్లోని విద్యార్థులకు సెల్ఫోన్లు ఎక్కడివనేది తేలాల్సి ఉంది. సెల్ఫోన్లో రీల్స్ చూస్తూ హింసా ప్రవృత్తిని అలవర్చుకుంటున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వసతిగృహాల్లో విద్యార్థులకు సెల్ఫోన్లపై పూర్తిగా నిషేధం ఉన్నప్పటికీ ఏ విధంగా లోనికి తీసుకెళ్తున్నారు.. ఏ విధంగా వాడుతున్నారో ఉపాధ్యాయులు, సిబ్బంది గమనించకపోవడం గమనార్హం. -
పకడ్బందీగా వార్షిక పరీక్షలు
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వరకు 10వ తరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీ పక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్, మంచిర్యాల ఏసీపీ ప్రకా ష్, డీఈవో ఎస్.యాదయ్యలతో కలిసి 10వ తరగ తి పరీక్షల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 49 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, 9,189మంది రెగ్యులర్, 221మంది ఒక్కసారి అనుత్తీర్ణులైన విద్యార్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు. ఈ సమావేశంలో డీపీవో వెంకటేశ్వర్రావు, జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ.. లక్సెట్టిపేట: మండల కేంద్రంలో నిర్మిస్తున్న ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిని కలెక్టర్ కుమార్ దీపక్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనులు చివరి దశకు చేరాయని, త్వరలో ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. అనంతరం కేజీబీవీ, గోదావరి రోడ్డులో ఉన్న చెత్త డంపింగ్ యార్డ్‌ను పరిశీలించారు. తహసీల్దార్ దిలీప్‌కుమార్, కమిషనర్ మారుతిప్రసాద్ పాల్గొన్నారు. పనుల పరిశీలనమంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలం గుడిపేట పునరావాస కాలనీ శివారులో కేంద్రియ విద్యాలయం భవన పనులను కలెక్టర్ కుమార్‌దీపక్ మంగళవారం పరిశీలించారు. నాణ్యత, వివరాలను ఆరా తీశారు. వచ్చే విద్యాసంవత్సరాని కి నూతన భవనం సిద్ధంగా ఉంటుందని తెలిపారు. -
వైద్య సేవలపై ఆరా
మంచిర్యాలటౌన్: జిల్లాలోని మంచిర్యాల ప్ర భుత్వ జనరల్ ఆసుపత్రి, మాతాశిశు ఆరోగ్య కేంద్రం, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉపకేంద్రాలు, ఆ యుష్మాన్ భవ ఆరోగ్య కేంద్రం, బస్తీ దవా ఖానాల పరిశీలనకు పీఆర్సీ పాపులేషన్ రీసె ర్చ్ సెంటర్ విశాఖపట్నం బృందం మంగళవారం జిల్లాకు చేరుకుంది. జిల్లా వైద్య, ఆరో గ్య శాఖ కార్యాలయంలో డీఎంహెచ్‌వో డాక్ట ర్ హరీశ్‌రాజ్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని హమాలీవాడ బస్తీదవాఖాన, దీపక్నగ ర్ అర్బన్ హెల్త్ సెంటర్, మంచిర్యాల మాతా శిశు ఆరోగ్య కేంద్రాలను పీఆర్సీ వైద్యులు రమణ, శ్రీనివాస్ పరిశీలించి వైద్య సేవలపై తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రాల బడ్జెట్, ఖర్చులు, హాజరు నమోదు, జాతీయ ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా కుటుంబ సంక్షేమ కార్యక్రమాలు, వ్యాధులు ప్రబలకుండా తీసుకుంటున్న చర్యలు, మందుల లభ్యతలను పరిశీలించారు. చిన్నారులకు అందిస్తున్న టీకాలు, టీహబ్ పరీక్షలపై తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీపీఎం ప్రశాంతి, మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హరీశ్చంద్రారెడ్డి, ఏవో విశ్వేశ్వర్‌రెడ్డి, వెంకటసాయి, వెంకటేశ్వర్లు, కాంతారావు, సుమన్, ప్రవళిక, పద్మ, బుక్క వెంకటేశ్వర్ పాల్గొన్నారు. -
ఐటీ పార్కు మంజూరుకు కృషి
బెల్లంపల్లి: బొగ్గు గనుల క్షేత్రం బెల్లంపల్లికి ఐటీ పార్కు మంజూరు చేయించడానికి కృషి చేస్తానని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. మంగళవారం రాత్రి బెల్లంపల్లి శివారు కన్నాలలోని ఆర్పీ గార్డెన్స్‌లో పట్టభద్రులు, కాంగ్రెస్ శ్రేణులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మంత్రితోపాటు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ ఠాకూర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఏడాదికాలంలో 57వేల ఉద్యోగాలు ఇచ్చిందని తెలిపారు. ఉద్యోగాల నోటిఫికేషన్లో గందరగోళ పరిస్థితులకు తావులేకుండా జాబ్ క్యాలెండర్ అమలు పరుస్తున్నామని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేస్తున్నాయని, వీటిని ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. బెల్లంపల్లిలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేయిస్తామని, ఆయా అంశాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి మంజూరుకు పాటుపడతామని అన్నారు. ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయని, ఎమ్మెల్సీ అభ్యర్థి వి.నరేందర్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇందుకోసం కాంగ్రెస్ శ్రేణులు పట్టుదలతో కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు కారుకూరి రాంచందర్, మురళీధర్‌రావు, కాంగ్రెస్ నాయకులు సీహెచ్.శంకర్, ఎం.మల్లయ్య, ఎం.నర్సింగరావు, మునిమంద రమేష్, ఆర్.సంతోష్‌కుమార్, నాతరి స్వామి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్‌రెడ్డిని గెలిపించుకోవాలి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు -
సాగు, తాగునీటి సమస్య రానివ్వద్దు
● రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మంచిర్యాలఅగ్రికల్చర్: రానున్న వేసవికాలంలో సాగు, తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులతో సాగు, తాగునీరు, విద్యుత్ సరఫరా, రైతుభరోసా, యూరియా కొరత, రేషన్ కార్డుల జారీ, రెసిడెన్షియల్ పాఠశాలల సందర్శన అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యూరియా కొరత లేకుండా చూడాలని, వేసవిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రజాపాలనలో రేషన్‌కార్డులకు అందిన దరఖాస్తులను పరిశీలించి అర్హులందరికీ మంజూరు చేయాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ వేసవిలో తాగునీటి సమస్యల లేకుండా కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. అర్హులందరికీ రైతు భరోసా అందేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్, మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలు శ్రీనివాస్‌రావు, హరికృష్ణ పాల్గొన్నారు. -
న్యూస్‌రీల్
ఐదు మండలాల రాకపోకలకు అనుమతి జన్నారం: టైగర్‌జోన్ కోర్ ఏరియా నుంచి 24గంటలు ఐదు మండలాల ప్రజల రాకపోకలకు అనుమతి ఇస్తూ ఎఫ్డీపీటీ శాంతారాం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా అటవీశాఖ అధికారి శివ్ ఆశిష్ సింగ్ తెలిపారు. కడెం, దస్తురాబాద్, ఉట్నూర్, జ న్నారం, దండేపల్లి మండలాల ప్రజలకు ఎ లాంటి పర్యావరణ శిస్తు వసూలు చేయడం ఉండదని, ఆయా మండలాల ప్రజలు ధ్రు వీకరణ పత్రం చూపించి ఏ సమయంలోనైనా ఈ ప్రాంతం గుండా వెళ్లవచ్చని పేర్కొన్నారు. ఈ విషయమై చెక్‌పోస్టు సిబ్బందికి తెలియజేయాలని సూచించినట్లు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి జైపూర్: వేలాలలో ఈ నెల 26న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మూడు రోజులపాటు నిర్వహించే మల్లన్నస్వామి జాతరలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్‌రావు, జైపూర్ ఏసీపీ ఏ.వెంకటేశ్వర్ తెలిపారు. జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటులో మంగళవారం జాతర నిర్వహణ, ఏర్పాట్లు, భక్తుల సౌకర్యాలపై అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించారు. సౌకర్యాలు, నీటి వసతి, విశ్రాంతి కోసం టెంట్లు, వైద్య సౌకర్యం, విద్యుత్‌దీపాల ఏర్పాట్లపై చర్చించారు. ఈ సమావేశంలో డీపీవో వెంకటేశ్వర్రావు, శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్, స్థానిక ఎస్సై శ్రీధర్, ఎంపీడీవో సత్యనారా యణ, ఎస్టీపీపీ పర్సనల్ మేనేజర్ అజ్మీరాతుకారం, ఎస్వోటు ఈడీ ప్రభాకర్‌రావు, ఎంపీవో శ్రీపతిబాపురావు పాల్గొన్నారు. -
క్లుప్తంగా
ఇద్దరు ఆటోడ్రైవర్లకు ఆరునెలల జైలులక్ష్మణచాంద: రోడ్డు ప్రమాదానికి కారణమైన ఇద్దరు ఆటోడ్రైవర్లకు ఆరునెలల జైలుశిక్షతోపాటు ఒక్కొక్కరికి రూ.500 జరిమానా విధిస్తూ నిర్మల్ ఫస్ట్‌క్లాస్ మె జిస్ట్రేట్ ఆర్.అజయ్‌కుమార్ మంగళవారం తీర్పునిచ్చారు. ఎస్సై సుమలత కథనం ప్రకారం.. 2016 నవంబర్ 23న మండలంలోని వడ్యాల్ శివారులోని సరస్వతి కెనాల్ బ్రిడ్జి వద్ద ఎదురెదురుగా రెండు ఆటోలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వడ్యాల్‌కు చెందిన బొచ్చు రాజవ్వ, లక్ష్మణచాంద గ్రా మానికి చెందిన నిమ్మల గోదావరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై లక్ష్మ ణచాంద పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. అడిషనల్ పీపీ దేవేందర్ సాక్షులను ప్రవేశపెట్టి కేసు రుజువు చేశారు. ప్రమాదానికి కా రణమైన ఇద్దరు ఆటోడ్రైవర్లు షేక్ ఇమ్రాన్, షేక్ సోఫీలకు జైలుశిక్షతోపాటు జరిమానా విధిస్తూ మెజిస్ట్రేట్ తీర్పుచెప్పారు. తాళం వేసిన ఇంట్లో చోరీలక్సెట్టిపేట: మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల గ్రామంలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. ఎస్సై సతీశ్ కథనం ప్రకారం.. ఈనెల 13న కాందపు ప్రసాద్ ఇంటికి తాళం వేసి కుటుంబంతో కలిసి హైదరాబాద్ వెళ్లారు. మంగళవారం తిరిగి వచ్చేసరికి తాళం పగులగొట్టి ఉంది. ఇంట్లోకి వెళ్లి బీరువా చూడగా గుర్తుతెలియని వ్యక్తులు బంగారు చెవికమ్మలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. సోమవారం రాత్రి గ్రామానికి చెందిన వేముల రామయ్య ఇంట్లో తాళాన్ని పగులగొట్టిన దొంగలు బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. బైక్ చోరీఆదిలాబాద్టౌన్: పట్టణంలోని తాటిగూడకు చెందిన షేక్ ఆయుబ్ బైక్ చోరీకి గురైంది. ఈనెల 12న ఇందిరా ప్రియదర్శని స్టేడియంలో సాయంత్రం వాకింగ్ కోసం వెళ్లా డు. స్టేడియంలో పార్కింగ్ చేసి గంట తర్వా త తిరిగి వచ్చేసరికి బైక్ కనిపించలేదు. చు ట్టూపక్కల గాలించినా దొరకలేదు. మంగళవారం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్సై సయ్యద్ ఇసాక్ ఆలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నిధుల్లేవ్.. విధులకు రారు!
● పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలనకు ఏడాది ● ఒక్కొక్కరికి మూడు నుంచి నాలుగు గ్రామాలు ● పెరిగిన పనిభారం..పర్యవేక్షణపై ప్రభావం కోటపల్లి/మంచిర్యాలరూరల్(హాజీపూర్): గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన మొదలై ఏడాది ముగిసింది. ఒక్కో పంచాయతీకి ఒక్కో అధికారిని నియమించాల్సి ఉండగా..అధికారుల కొరత కారణంగా రెండు నుంచి మూడు గ్రామాలకో ప్రత్యేకాధికారిని నియమించారు. దీంతో పనిభారం పెరిగి క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లోపించింది. పంచాయతీలతోపాటు మండల పరిషత్‌లకు జిల్లాస్థాయి అధికారులను ప్రత్యేకాధికారులు గా నియమించినా వారు పట్టించుకున్నా దాఖలాలు లేవు. సొంతశాఖల్లో పనిభారంతో పల్లెల వైపు కన్నెత్తి చూడకపోవడంతో క్షేత్రస్థాయిలో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. సమావేశాలు, సంతకాలకే పరిమితమవుతుండటంతో పాలన పడకేసింది. నిధులు లేమి, పర్యవేక్షణ లోపం, పాలన వ్యవహారాలు చూసేవారు కరవై ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. జీపీలకు ఎన్నికలు జరగకపోవడంతో ఎస్ఎఫ్సీ, 15వ ఆర్థిక సంఘం నిధుల మంజూరు గతేడాది నిలిచిపోయాయి. నిధుల రాక పల్లెల్లో ఆర్థిక సంక్షోభం నెలకొంటోంది. భారమంతా కార్యదర్శిపైనే.. పాలకవర్గాలు లేకపోవడంతో ప్రత్యేకాధికారులు పట్టించుకోకపోవడం, నిధుల లేమితో పంచాయతీల నిర్వహణ భారం కార్యదర్శులపై పడుతోంది. పారిశుద్ధ్య నిర్వహణ నీటి సరఫరా ప్రభుత్వ పథకాల సర్వే, ట్రాక్టర్, ట్యాంకర్ల నిర్వహణ, తాగునీటి పథకాల మరమ్మతు, పైపులైన్లు లీకేజీలు, వీధి దీపాలు ఇలా పలు రకాల పనుల కోసం పలువురు కార్యదర్శులు సొంత డబ్బులను వెచ్చించాల్సి వస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు సరిపడా విడుదల కాకపోవడంతో కష్టంగా మారింది. నిధుల కొరతతో పారిశుద్ధ్య కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించకలేక వారితో పనిచేయించడం కష్టతరంగా మారింది. పార్‌పల్లిలో నిధుల కొరతతో వాటర్ ట్యాంకర్ నెలల తరబడి తీయకపోవడంతో మొక్కలు ఎండిపోతున్నాయి. ఇలా ఒక్క జీపీల్లో కాదు జిల్లాలోని పంచాయతీల్లో ట్రాక్టర్లు, ట్యాంకర్లపై భారం పెరిగి తీయడం లేదని కార్యదర్శులే చెబుతున్నారు. వేసవి గట్టెక్కేనా.. పల్లెల్లో ముఖ్యంగా వేసవిలో తాగునీటి అవసరాలతోపాటు పారిశుద్ధ్య నిర్వహణ ముఖ్యం. భగీరథ నీరు పల్లెలకు సక్రమంగా చేరకపోవడంతో స్థానిక వనరులపై ఆధారపడతారు. తాగునీటి పథకాల్లో నీటివనరులు లేని గ్రామాల్లో మంచినీటి కటకట త ప్పదు. ట్యాంకర్లు, అద్దె బోర్లు, ఇతర ప్రత్యామ్నా య చర్యలు తీసుకోవాలన్నా పంచాయతీల్లో నిధులు ఉంటేనే సాధ్యపడుతుంది. ప్రత్యేకాధికారుల పాలనలో వేసవి ఎలా గట్టెక్కుతుందోనని ప్రజలు అందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఎండాకాలంలో వివిధ రకాల వ్యాధులు విజృంభిస్తాయి. రాష్ట్రప్రభుత్వం ప్రత్యేకాధికారులు గ్రామాలను పట్టించుకుని తగిన చర్యలు చేపట్టాలని గ్రామీణ ప్రజలు కోరుతున్నారు. జిల్లా మండలాలు పంచాయతీలు ఆదిలాబాద్ 17 468 కుమురంభీం 15 335 నిర్మల్ 18 396 మంచిర్యాల 16 311 సమస్యలు ఇవీ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రాక చిన్న పంచాయతీల్లో గతంలో కొనుగోలు చేసిన ట్రాక్టర్లు రుణ వాయిదాలు చెల్లించడం కష్టంగా మారింది. పల్లె ప్రకృతివనాలు, క్రీడా ప్రాంగణాలు నిర్వహణ కొరవడ్డాయి. గతంలో పల్లెలకు పంపిణీ చేసిన చెత్తడబ్బాలు చెడిపోయి కొత్తవి కొనలేక పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతోంది. కొన్ని పంచాయతీల్లో ట్రాక్టర్లకు డిజీల్‌కు డబ్బులు వెచ్చించలేక రోడ్లపై చెత్త దర్శనమిస్తోంది. పలుచోట్ల కార్యదర్శులు డిజీల్ కోసం అప్పులు చేస్తున్నారు. వీధి దీపాలు మరమ్మతుకు గురైన వాటిస్థానంలో కొత్తవి బిగించలేని పరిస్థితి. గ్రామాలకు భగీరథ నీరు చేరక పాత తాగునీటి పథకాల నిర్వహణ, విద్యుత్ బిల్లుల చెల్లింపు కష్టతరంగా మారింది. క్రీడాప్రాంగణాల్లో అమర్చిన పరికరాలు తుప్పు పడుతున్నా సరిదిద్దలేని పరిస్థితి నెలకొంది. -
బ్యాంకులో రైతుల నిరసన
● హోల్డ్‌లో పెట్టిన డబ్బులు విడుదల చేయాలని డిమాండ్ ఆదిలాబాద్‌టౌన్: తమ అకౌంట్లో ఉన్న డబ్బులను బ్యాంక్ అధికారులు హోల్డ్‌లో పెట్టారని ముగ్గురు రైతులు నిరసన చేపట్టారు. పట్టణంలోని ధనలక్ష్మి లాడ్జి వద్ద గల ఎస్బీఐలో మంగళవారం ఆందోళన కు దిగారు. భీంపూర్ మండలంలోని వడూర్‌కు చెందిన మోహన్, తంతోలికి చెందిన నక్కల జగదీశ్, యాపల్గూడకు చెందిన మరో రైతుకు సంబంధించి ఎస్బీఐ మెయిన్ బ్రాంచి, మహారాష్ట్ర బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయి. గతేడాది సీసీఐ ద్వారా పత్తి వి క్రయించిన డబ్బులు పోస్టాఫీసులో జమ కాగా, పో స్టల్ పేమెంట్ అధికారి వారికి తెలియకుండా డబ్బులు కాజేసిన విషయం తెలిసిందే. సైబర్‌క్రైమ్ కింద కేసు నమోదైంది. కొన్నిరోజుల తర్వా త రైతుల ఖా తాల్లో డబ్బులు జమ చేశారు. ఢిల్లీకి సంబంధించిన అధికారులు బ్యాంక్‌లో ఉన్న వీరి డబ్బులను హోల్డ్‌లో పెట్టారు. పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోకపోవడంతో బ్యాంక్‌లో నిరసన చే పట్టడంతో అధికారులు ఉన్నతాధికారులకు సమాచా రం అందించారు. సాయంత్రం వరకు హోల్డ్‌లో ఉన్న వారి డబ్బులను తీయించే విధంగా చూస్తామ ని హామీ ఇచ్చారు. పోలీసులు క్లియరెన్స్ ఇచ్చినప్పటికీ అధికారులు హోల్డ్ తీయకపోవడం పట్ల వారు మండిపడ్డారు. సమస్యను పరిష్కరించేలా చూస్తామని ఎస్బీఐ చీఫ్ మేనేజర్ సత్యనారాయణ హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. -
సగమే..!
రైతుభరోసా ● పెట్టుబడి సాయానికి రైతుల ఎదురుచూపు ● ఇప్పటివరకు కొందరి ఖాతాల్లోనే జమ ● మూడెకరాల్లోపు ఉన్నా కొందరికి అందని వైనం మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద రైతులకు అందిస్తున్న పెట్టుబడి సాయం కొందరికే అందింది. ఇప్పటివరకు మూడెకరాల్లోపు రైతులకు మాత్రమే నగదు జమ అయింది. జిల్లాలో 55శాతం మందికి భరోసా అందింది. ఇంకా 77,190మంది ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. గత నెల 27న మండలానికి ఒక గ్రామం చొప్పున ఎంపిక చేసి రైతులకు ప్రభుత్వం రైతు భరోసా కింద 41,300 మందికి ఆర్థికసాయం అందజేసింది. ఎంపిక చేసిన గ్రామంలో ఎన్ని ఎకరాలు ఉన్నా నగదు అందింది. తర్వాత ఎకరా, రెండు, మూడు ఎకరాల్లోపు రైతులకు విడతల వారీగా నగదు జమ చేస్తోంది. కానీ ఇంకా ఎకరం, రెండు, మూడెకరాల్లోపు ఉన్న కొందరికి నగదు జమ కాకపోవడంతో బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఎందుకు డబ్బులు పడలేదని వ్యవసాయ అధికారులను ప్రశ్నిస్తున్నారు. వివిధ కారణాలతో నగదు జమ కాలేదని వారు చెబుతున్నారు. కొందరు రైతులు సేవింగ్ ఖాతాలకు బదులు పంట రుణం ఖాతా నంబరు ఇచ్చారని, ఆధార్, బ్యాంకు పాస్‌బుక్ పేర్లలో తప్పిదాలు, ఇటీవల భూములు కొనుగోలు చేసిన కొత్త రైతులు, తదితర కారణాలతో నగదు జమ కాలేదని వివరాలు పరిశీలించి రైతులకు తెలియజేస్తున్నారు. మూడెకరాలకు పైబడి భూమి ఉన్న రైతులు వేల సంఖ్యలో ఉన్నారు. నాలుగో విడత ఎప్పుడు ఉంటుందోనని సాయం కోసం ఎదురు చూస్తున్నారు. అందని రైతులు చాలామందిగత ప్రభుత్వ హయాంలో రైతుబంధు పథకం పెట్టుబడి సాయం కింద ఎకరానికి రూ.5వేలు ఇవ్వగా.. ప్రస్తుత ప్రభుత్వం రైతు భరోసా కింద రూ.6వేల చొప్పున అందిస్తోంది. గత నెల 26నుంచి రైతు భరోసా పథకాన్ని ప్రారంభించినా ఆ రోజు బ్యాంకులకు సెలవు కావడంతో 27నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ అవుతోంది. అర్హులందరికీ ఒకేసారి కాకుండా మండలానికి ఒక గ్రామం చొప్పున ఎంపిక చేసిన రైతుల ఖాతాల్లో మాత్రమే పెట్టుబడి సాయం జమ చేసింది. జిల్లాలో ఎకరంలోపు ఉన్న 41,300 మందికి రూ.20,16,33,640 జమ అయ్యాయి. ఈ నెల 10 నుంచి రెండు ఎకరాల ఉన్న 7,127 మంది ఖాతా ల్లో రూ.8,70,55,624 జమ చేశారు. ఈ నెల 15నుంచి మూడెకరాల్లోపు ఉన్న 69,792 మందికి రూ.43,07,04,517 జమ కావాల్సి ఉంది. ఇప్ప టివరకు మూడో విడతలో 43,604 మందికి మాత్ర మే నగదు అయ్యింది. ఇంకా మూడెకరాల్లోపు ఉన్న 26,188 మందికి సాయం అందాల్సి ఉంది. మూడు విడతల్లోనూ నగదు జమకాని రైతులు చాలామంది వ్యవసాయ అధికారుల వద్దకు పట్టాపాసుపుస్తకంతో వెళ్లి పరిశీలించుకుంటున్నారు. ఎకరా, రెండు, మూడు ఎకరాల మధ్య వారం రోజుల సమయం తీసుకుంటున్నారు. ఈ లెక్కన పది ఎకరాలు ఉన్న రైతులకు సాగు సాయం అందాలంటే మరో రెండు నెలల సమయం పడుతుందేమోనని రైతులు చర్చించుకుంటున్నారు. మొత్తం రైతులు 1,69,226అందాల్సిన నగదు రూ.191,65,88,874ఇప్పటివరకు అందిన రైతులు 92,036ఇప్పటివరకు అందిన నగదు రూ.69,57,35,424జిల్లాలో వివరాలుఎకరన్నర ఉన్నా పడలేదు.. నాకు దండేపల్లి మండలం మామిడిపల్లి గ్రామ శివారులో ఎకరం 21గుంటల వ్యవసాయ భూమి ఉంది. రెండో విడత, మూడో విడతలో కూడా రైతుభరోసా రాలేదు. వ్యవసాయ అధికారులను అడిగితే బ్యాంకు ఖాతా తప్పుగా ఉన్నట్లు ఉందని చెబుతున్నారు. బ్యాంకు వాళ్లను అడుగుతే వ్యవసాయ అధికారులనే అడుగు అంటున్నారు. అసలు రైతుభరోసా అందుతుందో లేదో. – అరిగెల ప్రవీణ్‌కుమార్, దండేపల్లిఆలస్యం చేయొద్దు ఇప్పటికే పోయిన వానాకాలం రైతుబంధు రాలేదు. యాసంగి నుంచి రైతుభరోసా అన్నారు. నాకు మూడు ఎకరాల భూమి ఉంది. ఇప్పటివరకు రాలేదు. ఎప్పుడు పడుతుందని అధికారులను అడుగుతే రేపు మాపు అంటున్నారు. ఆలస్యం చేయకుండా వేయాలి. – జే.నర్సయ్య, కన్నెపల్లి -
అనాథ మహిళ మృతి
మందమర్రిరూరల్: పట్టణంలోని పాతబస్టాండ్ ప్రా ంతంలో మతిస్థిమితం లేని అనాథ వృద్ధురాలిని గతేడాది డిసెంబర్ 9న అమ్మ స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఏఎస్సై శ్రీనివాస్ మంచిర్యాల కల్వరీ యు వశక్తి అనాథ వృద్ధుల, మానసిక వికలాంగుల ఆశ్రమంలో చేర్పించారు. జనవరి 23న ఆమె అనారోగ్యంతో ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందు తూ మంగళవారం మృతి చెందిందని మందమర్రి ఎస్సై రాజశేఖర్ తెలిపారు. వృద్ధురాలి మృతదేహం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీలో భద్రపర్చినట్లు పేర్కొన్నారు. ఎవరికైనా వివరాలు తెలిస్తే పోలీసులను సంప్రదించాలని సూచించారు. కారు, బైక్ ఢీ: ఒకరు మృతి నిర్మల్‌రూరల్: ఆగి ఉన్న బైక్‌ను అతివేగంగా వచ్చి న కారు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందినట్లు రూరల్ ఎస్సై లింబాద్రి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మామడ మండలం కిషన్‌రావుపేటకు చెందిన ఆత్మారం(55), కుమారుడు శ్రీకాంత్ బైక్‌పై మంగళవారం నిర్మల్ మండలం భాగ్యనగర్ సమీ పంలో గల యూటర్న్ వద్ద ఆగారు. అక్కడే తండ్రి కుమారుడు మాట్లాడుతుండగా ఆర్మూర్ వైపు నుంచి అతివేగంగా వచ్చిన కారు వెనుక నుంచి వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి కుమారుడికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వారిని అంబులెన్స్‌లో జిల్లా కేంద్రంలోని ఏరియాస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించగా ఆత్మారాం అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ప్రమాదంలో బైకు, కారు దెబ్బతిన్నాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఒకరికి మూడేళ్ల జైలుకాసిపేట: చీటింగ్ కేసులో ఒకరికి మూడేళ్ల జైలుశిక్ష విధిస్తూ బెల్లంపల్లి జ్యూడీషియల్ ఫ్లస్ట్‌క్లాస్ మే జిస్ట్రెట్ ముకేష్ మంగళవారం తీర్పునిచ్చారు. దేవా పూర్ ఎస్సై అంజనేయులు కథనం ప్రకారం..2023 లో కుమురం భీం జిల్లా దహెగాం మండలం కల్వడ ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో కాంట్రాక్టు టీచర్‌గా నాయిని బాపు పనిచేసేవాడు. కాసిపేటమండలం పల్లంగూడ, గోండుగూడ గ్రామాల్లో ప్రజలకు ఆ యుష్మాన్ భారత్ పేరిట కార్డులు ఇప్పిస్తానని నమ్మబలికాడు. మిషన్ ద్వారా వేలుముద్రలు తీసుకుని వారి ఖాతాల్లో నగదును ఆయన ఖాతాలోకి మళ్లించుకున్నాడు. ఈ విషయమై పోలీసుస్టేషన్ పరిధిలో మూడు కేసులు నమోదైంది. మంగళవారం బెల్లంపల్లి కోర్టులో ఏపీపీ అజయ్‌కుమార్ సాక్షులను విచారించి నేరం రుజువు చేశారు. నిందితుడికి మూడేళ్ల జైలుశిక్షతోపాటు కేసుకు రూ.వెయ్యి చొప్పున రూ.3 వేలు జరిమానా విధిస్తూ మేజిస్ట్రెట్ తీర్పుచెప్పారు. రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్ఆదిలాబాద్టౌన్(జైనథ్): అక్రమంగా ఇసుక రవా ణా చేస్తుండగా రెండు ట్రాక్టర్లను పట్టుకుని సీజ్ చేసినట్లు జైనథ్ సీఐ సాయినాథ్ తెలిపారు. పక్కా సమాచారంతో జైనథ్ మండలంలోని పెన్‌గంగా నది గ్రామ శివారులో ఎస్సై వి.పురుషోత్తం, ఏఎస్సై ఆత్మారాం, సిబ్బందితో కలిసి మంగళవారం తనిఖీ లు చేపట్టినట్లు పేర్కొన్నారు. రెండు ట్రాక్టర్లలో ఇ సుక తరలిస్తుండగా సీజ్‌చేసి స్టేషన్‌కు తరలించిన ట్లు తెలిపారు. డీఎస్పీ జీవన్‌రెడ్డి ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. -
గ్రామాల శివారులో పులి సంచారం
నెన్నెల: మండలంలోని జోగాపూర్, ఆవుడం, చిత్తాపూర్, పొట్యాల గ్రామాల శివారు అడవుల్లో పులి సంచరిస్తోంది. దీంతో పశువుల కాపరులు, రైతుల్లో భయాందోళన వ్యక్తమవుతోంది. పది రోజులుగా బెల్లంపల్లి డివిజన్లోని కన్నాల, తాండూర్, కాసిపేట అడవుల్లో సంచరించిన పులి చర్లపల్లి ఎల్లారం మీదుగా కుశ్నపల్లి రేంజ్ పరిధిలోని రంగపేట, జోగాపూర్ అడవి గుండా ఆవుడం, చిత్తాపూర్, పొట్యాల అడవుల్లోకి ప్రవేశించిందని నీల్వాయి రేంజ్ అధికారి అప్పలకొండ తెలిపారు. మంగళవారం చెన్నూర్ ఎఫ్డీఓ సర్వేశ్వర్రావు, మంచిర్యాల రేంజ్ అధికారి రత్నాకర్ అటవీ సిబ్బందితో కలిసి చిత్తాపూర్ చెరువు వద్ద పులి పాదముద్రలు గుర్తించినట్లు చెప్పారు. గంగారాం అటవీ గుండా కొత్తూర్ మీదుగా జైపూర్, భీమారం అడవుల్లోకి వెళ్లినట్లు పులి జాడలను గుర్తించామని పేర్కొన్నారు. అటవీ సమీప గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
ఏడుగురు విద్యార్థులపై కేసు
చెన్నూర్: చెన్నూర్ మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల విద్యార్థి మనోజ్‌పై దాడి చేసిన ఏడుగురు విద్యార్థులపై కేసు నమోదు చేసినట్లు సీఐ రవీందర్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఈనెల 6న బీసీ గురుకుల పాఠశాలలో చదువుతున్న నస్పూర్ గ్రామంలోని ఇందారం కాలనీకి చెందిన విద్యార్థి పులి మనోజ్‌పై తోటి విద్యార్థులు దాడి చేసి వీడియో చిత్రీకరించి ఇన్‌స్ర్ట్రాగాంలో పోస్ట్ చేశారని బాధిత విద్యార్థి తండ్రి రాజేందర్‌గౌడ్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రఘునాఽథ్, విజయ్, యువరాజ్, రజనీకాంత్, మణికంఠ, సన్నీ, సిద్దూపై కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. ఈ ఘటనలో ప్రిన్సిపాల్‌ను విధుల నుంచి తొలగించడంపై విద్యార్థులు ఆందోళనకు దిగేందుకు ప్రేరేపించిన వారిపై చ ర్యలు తీసుకుంటామని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం పాఠశాల ను సందర్శించారు. విద్యార్థులు రోడ్డు పైకి వచ్చి ఆందోళన చేపట్టవద్దన్నారు. సమగ్ర విచారణ జరిపి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపిస్తామన్నారు. సీఐ రవీందర్, ఆర్సీవో శ్రీధర్, ఎంఈవో రాధాకృష్ణమూర్తి, ప్రిన్సిపాల్ రాజ్‌కుమార్ ఉన్నారు. -
ఎస్కార్ట్ నుంచి తప్పించుకున్న నిందితుడికి ఏడాది జైలు
బెల్లంపల్లి: పోలీసు ఎస్కార్ట్ నుంచి చాకచక్యంగా తప్పించుకున్న నిందితుడికి ఏడాది సాధారణ జైలుశిక్ష విధిస్తూ జ్యూడీషియల్ ఫ్లస్ట్‌క్లాస్ మేజిస్ట్రెట్ జె.ముకేష్ మంగళవారం తీర్పుచెప్పారు. బెల్లంపల్లి వన్‌టౌన్ ఎస్హెచ్ఓ ఎన్.దేవయ్య కథనం ప్రకారం.. నెన్నెల మండలం కోనంపేటకు చెందిన నాయిని బాపు.. పది నేరాల్లో నిందితుడిగా ఉన్నాడు. 2024 అక్టోబర్ 16న కుమురంభీం జిల్లా కేంద్రంలోని సబ్ జైలు నుంచి ఇద్దరు పోలీసుల ఎస్కార్ట్‌తో బెల్లంపల్లి జూనియర్ సివిల్ కోర్టుకు తీసుకువచ్చారు. కోర్టులో సాక్షుల బయానా అనంతరం తిరిగి జైలుకు తీసుకెళ్తుండగా కాంటా చౌరస్తా వద్ద బస్సు ఎక్కేక్రమంలో బాపు పోలీసులను బలవంతంగా నెట్టివేసి పారిపోయాడు. ఈఘటనపై ఏఆర్ పోలీసు హెడ్‌కానిస్టేబుల్ నాగరాజు ఫిర్యాదుతో ఎస్హెచ్ఓ దేవయ్య కేసు దర్యాప్తు చేపట్టారు. నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టి మరుసటి రోజు పట్టుకుని తిరిగి ఆసిఫాబాద్ సబ్ జైలుకు తరలించారు. ఎస్హెచ్ఓ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఏపీపీ కె.అజయ్‌కుమార్ ఎనిమిది మంది సాక్షులను ప్రవేశపెట్టి నేరం రుజువుచేశారు. ఈ మేరకు మేజిస్ట్రెట్ తీర్పునిచ్చారు. ఇనుపసామగ్రి చోరీకి యత్నించిన వ్యక్తి పట్టివేతజైపూర్: మండలంలోని టేకుమట్ల శివారులో గల శ్రీరాంపూర్ నుంచి ఎస్టీపీపీకి బొగ్గు రవా ణా చేసే రైల్వేట్రాక్లైన్కు సంబంధించిన ఇను ప సామగ్రి చోరీకి యత్నించిన వ్యక్తిని మంగళవారం స్థానికులు పట్టుకున్నారు. శ్రీరాంపూర్ కు చెందిన ప్రవీణ్‌తోపాటు మరో వ్యక్తి టేకుమట్ల శివారులో రైల్వేపట్టాలను కట్ చేసి, ట్రాక్‌పక్కన పడేసిన ఇనుప సామగ్రిని ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. గమనించిన పవర్ ప్లాంటు కార్మి కులు, స్థానికులు ప్రవీణ్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మరొకరు పరారీలో ఉన్నా డు. ఈమేరకు పోలీసులు విచారణ చేపట్టారు అటవీభూమిలో గుడిసెల తొలగింపు జన్నారం: అటవీ భూమిలో అక్రమంగా వేసుకున్న గుడిసెలను ఫారెస్టు సిబ్బంది తొలగించారు. వివరాలు ఇలా ఉన్నాయి..జన్నారం రేంజ్‌లోని కిష్టాపూర్ శివారులోని గడ్డంగూడ, గొండుగూడ గ్రామాల సమీపంలో కంపార్టుమెంట్ నంబర్ 308లో కొన్నినెలల క్రితం కొందరు గిరిజనులు, గిరిజనేతరులు గుడిసెలు వేసుకున్నారు. పక్కనే కొంత భూమిని సాగు చేసుకున్నారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. వారి ఆదేశాల మేరకు మంగళవారం తెల్లవారు జామున 3 గంటలకు జన్నారం, ఇందన్పల్లి అటవీరేంజ్ అధికారులు సుష్మారావు, కారం శ్రీనివాస్, సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. జేసీబీతో గుడిసెలను తొలగించి నేలమట్టం చేశారు. గుడిసెలకు వేసుకున్న కర్రను డివిజన్‌కు తరలించారు. పలుమార్లు చెప్పిన వినకపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో గుడిసెలను తొలగించినట్లు రేంజ్ అధికారులు తెలిపారు. ఏళ్లుగా ఉంటున్న మా గుడిసెలను అన్యాయంగా తొలగించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.