పెండింగ్ వేతనాలు చెల్లించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: అనంత సొల్యూషన్, విద్యాంజలి 2.0 ద్వారా గిరిజన ఆశ్రమ పాఠశాలలు, సంక్షేమ హాస్టల్‌లో పని చేస్తున్న ఆఫీస్ సబార్డినేటర్లు, వాచ్‌మెన్, అటెండర్, స్వీపర్, ఇంగ్లిష్ టీచర్, కంప్యూటర్ ఆపరేటర్, యోగ టీచర్లకు ఎనిమిది నెలలుగా పెండింగ్ ఉన్న వేతనాలు చెల్లించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ గత ఆగస్టు, సెప్టెంబర్‌లో 50 మందిని నియమించారని, ప్రతీ నెల రూ.15 వేల వేతనం, పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పిస్తామని చెప్పారని, కానీ వేతనాలు చెల్లించడం లేదని తెలిపారు. కలెక్టర్ జోక్యం చేసుకుని వేతనాలు చెల్లించేలా చూడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటియూ నాయకులు రంజిత్, గిరిజన ఆశ్రమ పాఠశాల, హాస్టల్ అనంత విద్యాంజలి ఉద్యోగులు, స్వాతి, సారిరాణి, ప్రశాంతి, దివ్యశ్రీ, స్వరూప, కల్పన, రజిత, ప్రశాంతి, దివ్యశ్రీ, వెంకటమ్మ, మమత, నరేష్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.


