
గల్లంతైన విద్యార్థి మృతదేహం లభ్యం
లక్ష్మణచాంద: సరదాగా ఈతకు వెళ్లి న విద్యార్థి ప్రాణా లు కోల్పోయిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. వడ్యాల్‌కు చెందిన మద్దెల గంగన్న–లక్ష్మి దంపతుల కుమారుడు రాంచరణ్(14) స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. శనివారం పాఠశాల ముగిసిన తరువాత గ్రామ సమీపంలోని వాగుపై గల చెక్‌డ్యామ్ వద్దకు ఈతకు వెళ్లాడు. అదే సమయంలో సరస్వతి కాలువ ద్వారా సదర్‌మాట్ కోసం వాగులోకి ఎక్కువ మోతాదులో నీటిని వదలడంతో గల్లంతయ్యాడు. కుటుంబ సభ్యులు చెక్‌డ్యామ్ వద్ద వెతుకగా రాంచరణ్ ప్యాంటు, షర్ట్, పాదరక్షలు లభించాయి. ఆదివారం గ్రామస్తులు, పోలీస్ సిబ్బంది వెతుకగా మృతదేహం లభించింది. ‘పద్నాలుగేళ్లకే నూరేళ్లు నిండాయా లడ్డూ.. నీళ్లలో నీవు ఎలా నిదురపోయావురా..నీవు లేకుండా మేము ఎలా బతకాలిరా.. నన్నుకూడా నీతో తీసుకుపోరా.. అంటూ మృతుని తల్లి కుమారుడి మృతదేహంపై పడి రోదించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మాలిక్ రెహమాన్ తెలిపారు.

గల్లంతైన విద్యార్థి మృతదేహం లభ్యం