
నస్పూర్‌లో ఏసీబీ కార్యాలయం
● ప్రారంభానికి సిద్ధమైన భవనం ● ఇక్కడే ఆసిఫాబాద్, మంచిర్యాల కేసుల పర్యవేక్షణ ● సీసీసీ నస్పూర్ పాత సీఐ కార్యాలయంలో ఏర్పాట్లు ● ప్రస్తుతం ఆదిలాబాద్‌లో కొనసాగుతున్న వైనం
నస్పూర్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏసీబీ కార్యాలయానికి అనుబంధంగా త్వరలోనే మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్‌లో ఏసీబీ కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సీసీసీ నస్పూర్‌లోని సింగరేణి క్వార్టర్‌లో కొనసాగిన పాతపోలీస్‌స్టేషన్ పక్కన గల సీఐ కార్యాలయంలో ఏసీబీ కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు. క్వార్టర్‌లో మరమ్మతులు పూర్తి చేసి వారం, పది రోజుల్లో ప్రారంభిస్తామని అధికారులు పేర్కొంటున్నారు.
తగ్గనున్న దూరభారం..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఏసీబీ కార్యాలయం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉంది. ప్రస్తుతం ఒక డీఎస్పీ, ఇద్దరు సీఐలు, ఇతర సిబ్బందితో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. మంచి ర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల బాధితులు అవినీతి అ ధికారులపై ఏసీబీకి నేరుగా ఫిర్యాదు చేయాలంటే వ్యయప్రయాసలకోర్చి ఆదిలాబాద్‌కు వెళ్లాల్సిన ప రిస్థితి ఉంది. అధికారులు సైతం ఫిర్యాదులపై వి చారణ జరిపేందుకు ఆదిలాబాద్ నుంచి మంచి ర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు రావాలంటే చాలా క ష్టపడాల్సి వస్తోంది. కాగా నస్పూర్‌లో కార్యాల యం ఏర్పాటైతే అన్నింటికీ సులభతరంగా ఉండనుంది.
పెరుగనున్న ఫిర్యాదులు..
నస్పూర్ పట్టణంలో సమీకృత కార్యాలయం ఉండడం, అధికంగా ప్రభుత్వ, అసైన్డ్ భూములు ఉండడంతో సంబంధిత శాఖల అధికారులు భారీగానే అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నా యి. ఆసిఫాబాద్ జిల్లా వాసులకు సైతం నస్పూర్ రాకపోకలకు అనుకూలంగా ఉంటుంది. నస్పూర్ పట్టణంలో ఏసీబీ కార్యాలయం ఏర్పాటవుతున్న దృష్ట్యా అవినీతి అధికారులపై ఫిర్యాదులు పెరిగే అవకాశం ఉందని జిల్లావాసులు చర్చించుకుంటున్నారు. ఓ వైపు సీసీసీ నస్పూర్ పాత పోలీస్‌స్టేషన్ భవనంలో భరోసా కేంద్రం కొనసాగుతుండగా పక్కనే ఏసీబీ కార్యాలయం ఏర్పాటుపై జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రెండు జిల్లాల కేసులు పర్యవేక్షణ..
నస్పూర్‌లో ఏర్పాటయ్యే కార్యాలయంలో ఒక సీఐ, ఇతర సిబ్బంది ఉంటారు. వారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డీఎస్పీ పర్యవేక్షణలో మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు సంబంధించిన కేసులను పర్యవేక్షించనున్నారు. ఆదిలాబాద్ కార్యాలయం నుంచి నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించిన కేసులను పర్యవేక్షించనున్నట్లు అధికా రులు పేర్కొన్నారు.
ప్రారంభానికి చర్యలు
నస్పూర్ ఏసీబీ కార్యాలయం ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. సింగరేణి అధికారులు భవనాన్ని తమకు అప్పగించిన తర్వాత ఉన్నతాధికారుల సమయం తీసుకుని వారం, పది రోజులలో ప్రారంభిస్తాం.
– విజయ్‌కుమార్, ఏసీబీ డీఎస్పీ

నస్పూర్‌లో ఏసీబీ కార్యాలయం