చెట్టును ఢీకొట్టిన కారు | - | Sakshi
Sakshi News home page

చెట్టును ఢీకొట్టిన కారు

Apr 24 2025 12:31 AM | Updated on Apr 24 2025 12:31 AM

చెట్టును ఢీకొట్టిన కారు

చెట్టును ఢీకొట్టిన కారు

కడెం: మండలంలోని దోస్త్‌నగర్‌ సమీపంలో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హాజీపూర్‌కు చెందిన దముఖ శివకృష్ణ తన కుమారుడు శ్రీశాంత్‌తో కలిసి తన కారులో జన్నారం నుంచి కడెం మండలంలోని నచ్చన్‌ఎల్లాపూర్‌ వెళ్తుండగా మార్గమధ్యలో దోస్త్‌నగర్‌ సమీపంలోని ఐ లవ్‌ కవ్వాల్‌ లోగో వద్ద కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శివకృష్ణకు తీవ్ర గాయాలు కాగా, శ్రీశాంత్‌కు స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ప్రైవేటు వాహనంలో జన్నారంలోని ఓ ఆసుపత్రికి తరలించారు.

పేకాటస్థావరంపై దాడి

లక్సెట్టిపేట: మున్సిపాలిటీ పరిధిలోని ఊత్కూ రు చౌరస్తా సమీపంలో నిర్మానుష్య ప్రదేశంలో పేకాట ఆడుతున్న తొమ్మిది మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై సురేశ్‌ తెలి పారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. బు ధవారం పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు దాడి నిర్వహించి ఊత్కూరు గ్రామానికి చెందిన తుమ్మల సునీల్‌, ఏనుగుల తిరుపతి, గౌరువంతుల ప్రశాంత్‌, కడమండ్ల శేఖర్‌, ముప్పు శ్రీధర్‌, సత్యసాయి నగర్‌కు చెందిన ఎస్‌కె సనీర్‌, బుఖ్య రాజు, రాచర్ల రాకేశ్‌, పేరం పోచం అనే వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.3470ల నగదు, ఐదు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

స్క్రాప్‌ పట్టివేత

శ్రీరాంపూర్‌: శ్రీరాంపూర్‌ ఓసీపీ నుంచి అక్రమంగా తరలిస్తున్న ఐరన్‌ స్క్రాప్‌ను సింగరేణి ఎస్‌అండ్‌పీసీ సెక్యూరిటీ సిబ్బంది చాకచక్యంగా పట్టుకున్నారు. బుధవారం ఓసీపీ ఎంట్రన్స్‌ సమీపంలో ఆటోలో తరలిస్తున్న బెల్ట్‌ రోలర్‌, ఇతర సామగ్రిని పట్టుకున్నారు. ఓసీపీ రోడ్లపై దుమ్ము లేవకుండా నీటి ట్యాంకర్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ ట్యాంకర్‌ను ప్రైవేటు కాంట్రాక్టర్‌ నిర్వహిస్తున్నారు. ట్యాంకర్‌ డ్రైవర్‌ క్వారీ లోపల నీటిని నింపుకునే క్రమంలో అక్కడ ఉన్న ఈ స్క్రాప్‌ను ట్యాంకర్‌లో వేసుకొని పైకి తీసుకొచ్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్యాంకర్‌ నుంచి తీసి స్క్రాప్‌ను చెట్ల పొదల్లో ఆటోలోకి మార్చుతున్న సమయంలో ఎంటీఎఫ్‌ సెక్యూరిటీ సిబ్బంది అనుమానం వచ్చి చూసే సరిగా దొంగతనం బయటపడింది. సిబ్బందిని చూసి దొంగలు పోరిపోగా ఆటోను, స్క్రాప్‌ను స్వాధీనం చేసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోదాలు జరిగినట్లు తెలుస్తోంది.

రిమ్స్‌లో చికిత్స పొందుతూ ఒకరి మృతి

ఆదిలాబాద్‌టౌన్‌: రిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఒకరు మృతిచెందినట్లు టూటౌన్‌ ఎస్సై విష్ణుప్రకాశ్‌ తెలిపారు. జైనథ్‌ మండలంలోని మేడిగూడకు చెందిన గొర్ల గణేశ్‌ (35) ఆదిలాబాద్‌ పట్టణంలోని శాంతినగర్‌లో నివాసం ఉంటున్నాడు. పెట్రోల్‌ బంక్‌లో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఫిట్స్‌తో బాధపడుతుండగా ఉద్యోగం మానేశాడు. మానసికంగా కుంగిపోయిన ఆయన ఈనెల 19న తన ఇంటి వద్ద పురుగుల మందు సేవించగా, గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం రిమ్స్‌ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement