
పోలీసులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
● రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా
మంచిర్యాలక్రైం: పోలీసులు ఆరోగ్యంపై ప్రత్యే క శ్రద్ధ కనబర్చాలని రామగుండం పోలీస్ క మిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. కమిషనరేట్ ఆవరణలో బుధవారం ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీసులు విధి నిర్వహనలో ఒత్తిళ్లకు లోనవుతారన్నారు. పోలీసులు ఆరో గ్యంగా ఉంటేనే ప్రజలకు భద్రత, రక్షణ కల్పించగలుగుతారన్నారు. ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో సహా వైద్యశిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అత్యవసర సమయంలో సీపీఆర్ చేసే విధానంపై అవగాహన కల్పించా రు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రాజు, కమిషనరేట్ పోలీస్ అఽధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.